
ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు
లక్డీకాపూల్ (హైదరాబాద్): ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల్లో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ , అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేజర్ పీ.సీ.రాయ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు 10వ తరగతి, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు 8వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు.
అభ్యర్థులు తమ అర్హత ఆధారంగా ఏవైనా రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అలాగే ఐటీఐ, డిప్లొమా, ఎన్‌సీసీ అర్హత పొందిన అభ్యర్థులకు బోనస్ మార్కులుంటాయని, 13 భాషలలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆన్‌లైన్‌లో జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు www.joinindianarmy. nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అభ్యర్థులు జూన్‌లో సంబంధిత సైట్ నుంచి అడ్మిట్ కార్డు పొందవచ్చని, అప్‌డేట్స్, ఈ–మెయిల్ ఐడీని వెబ్‌సైట్ ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. సలహాలు, సూచనలకు రిక్రూటింగ్ కార్యాలయం సికింద్రాబాద్ 040–27740205 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చని రాయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment