ఉచిత విద్యకు దరఖాస్తు గడువు పెంపు | Extension of application deadline for free education | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యకు దరఖాస్తు గడువు పెంపు

Published Mon, Mar 25 2024 2:13 AM | Last Updated on Mon, Mar 25 2024 2:13 AM

Extension of application deadline for free education - Sakshi

ఈ నెల 31 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం 

ఇప్పటివరకు 49,208 దరఖాస్తులు.. 38,150 మంది పాఠశాలల ఎంపిక 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు, అన్‌­ఎయిడెడ్‌ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్స­రా­నికి (2024–25) విద్యాహక్కు చట్టం కింద దర­ఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నిజానికి ఈ గడువు సోమవారంతో ముగుస్తుండగా, విద్యాశాఖాధికారులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించా­రు. ప్రతికూల పరిస్థితుల్లోని పిల్లలైన అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించాలి.

వీరికి విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు, అన్‌­ఎయిడెడ్‌ స్కూళ్లల్లో 25 శాతం సీట్లు కేటాయించాలి. దీనిప్రకారం ఇప్పటివరకు 49,208 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 38,150 మంది పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. విద్యా­ర్థుల నివాసాలకు సమీపంలో ఉన్న ఐబీ, ఐసీ­ఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌ను బోధిస్తున్న స్కూళ్లలోను పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలని సమగ్రశిక్ష ఎస్సీడీ బి. శ్రీనివాసరావు తెలిపారు.

ఆసక్తిగల విద్యార్థుల తల్లిదండ్రులు తమ నివాసాలకు సమీపంలోని సచివాలయం లేదా ఇంటర్నెట్, ఎంఈవో కార్యాలయం, మీ–సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పనివేళల్లో సమగ్రశిక్షా పాఠశాల విద్యాశాఖ (టోల్‌ ఫ్రీ) 18004258599 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు. అర్హతగల పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని  శ్రీనివాసరావు సూచించారు. 

ఆధార్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్‌..
ఇక ఆసక్తిగల పిల్లల తల్లిదండ్రులు పాఠశాల విద్యా­శాఖ వెబ్‌సైట్‌లో విద్యార్థి పేరు, ఇతర వివ­రాలు నమోదుచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పిల్లల ఆధార్‌ నంబర్, లేదా తల్లిదండ్రుల ఆధార్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అనంతరం ఆన్‌లైన్‌లో కనిపించే స్కూళ్లలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తు­లకు ఆన్‌లైన్‌ లాటరీ ద్వారా స్కూళ్లను కేటాయి­స్తారు.  http://cse.ap.gov.in/RTE  వెబ్‌సైట్‌­లో లాగిన్‌ అయ్యి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement