free education
-
ప్రతిభ చూపి అమెరికాకు!
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన బందిల సూర్యతేజశ్రీ విద్యలో చూపిన ప్రతిభ కారణంగా అమెరికాలో ఉచిత విద్యను అభ్యసించే అరుదైన అవకాశాన్ని సాధించింది. నిరు పేద కుటుంబానికి చెందిన సూర్యతేజశ్రీ తల్లి నాగమణి.. ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. విజయవాడ ఈడ్పుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ అండ్ నీట్ గురుకులంలో సూర్యతేజశ్రీ ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసింది. గతేడాది అమెరికా ఫీల్డ్ సరీ్వసెస్ సంస్థ(ఏఎఫ్ఎస్) కెన్నెడి లూగర్ యూత్ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఆన్లైన్ టెస్ట్ నిర్వహించింది.12 విభాగాల్లో నిర్వహించిన ఈ టెస్ట్‌లో 17 ఏళ్ల సూర్యతేజశ్రీ పాల్గొని ప్రతిభ చూపింది. దీంతో అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని హోప్కిన్లో ఏడాది పాటు ఉచితంగా డిప్లమో కోర్సును అభ్యసించేందుకు అర్హత సాధించింది. ఉచిత శిక్షణతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా ఏఎఫ్ఎస్ సంస్థ భరించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సూర్యతేజశ్రీ అమెరికా వెళ్లనుంది. ఏపీ ప్రతినిధిగా ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలను అక్కడ తెలియజేయడం, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఆమెకు అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నుంచి రూ.లక్ష నగదు, ల్యాప్‌టాప్‌ను సూర్యతేజశ్రీ అందుకుంది. -
Zambia: నిరుపేద దేశం...సమున్నత లక్ష్యం!
జాంబియా. ఆఫ్రికా ఖండ దక్షిణ భాగంలో ఉండే అత్యంత నిరుపేద దేశం. మూడేళ్ల క్రితం ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదే... బాల బాలికలందరికీ ఉచిత విద్య. అందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి దాకా విద్యా వ్యయమంతటినీ ప్రభుత్వమే భరిస్తుంది. జాంబియా వంటి దేశానికి ఇది ఒకరకంగా తలకు మించిన భారమే. మిగతా రంగాల మాదిరిగానే జాంబియాలో విద్యా రంగాన్ని కూడా మౌలిక సదుపాయాల తీవ్ర లేమి పట్టి పీడిస్తోంది. మరోవైపు కాసులకు కటకట. అయినా ఉచిత విద్యా పథకం అమలు విషయంలో అక్కడి ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. పదో తరగతి స్థాయిని దాటినా సజావుగా చదువను, రాయను రాని దుస్థితి నుంచి తమ కాబోయే పౌరులను బయట పడేసి తీరాలని కృతనిశ్చయంతో ఉంది. ఆ లక్ష్యసాధన కోసం గత మూడేళ్లలో విద్యా రంగంపై ఏకంగా 100 కోట్ల డాలర్లకు పైగా వెచి్చంచింది!సమయం ఇంకా ఉదయం ఏడు గంటలే. పైగా చలికాలపు ఈదురుగాలులు ఈడ్చి కొడుతున్నాయి. అయినా సరే, ఆ విద్యార్థులంతా అప్పటికే స్కూలుకు చేరుకున్నారు. తమ క్లాసురూముల వైపు పరుగులు తీస్తున్నారు. అవును మరి. ఏమాత్రం ఆలస్యమైనా బెంచీలపై కూర్చోవడానికి చోటు దొరకదు. రోజంతా చల్లటి చలిలో కింద కూర్చోవాల్సిందే! జాంబియా రాజధాని లుసాకాకు 60 కి.మీ దూరంలోని చన్యన్యా ప్రభుత్వ ప్రైమరీ, సెకండరీ స్కూల్లో మూడేళ్లుగా రోజూ ఇదే దృశ్యం. ఉచిత విద్యా పథకం మొదలై నాటినుంచీ దేశంలో స్కూళ్లన్నీ విద్యార్థులతో కిటకిటలాడిపోతున్నాయి. గరిష్టంగా 40 మంది ఉండాల్సిన క్లాసురూముల్లో కనీసం 90 నుంచి 100 మందికి పైగా కని్పస్తున్నారు. 30 మంది మాత్రమే పట్టే ఒక క్లాస్‌రూములోనైతే ఏకంగా 75 మంది బాలలు, 85 మంది బాలికలు కిక్కిరిసిపోయారు! ఈ మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఏకంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు కొత్తగా బడిబాట పట్టారు మరి! మంచి సమస్యే! ఇంతమందికి విద్యార్థులకు తగిన స్థాయిలో దేవుడెరుగు, కనీస స్థాయిలో కూడా మౌలిక వసతులు లేకపోవడం జాంబియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. 2019లో ఒక్కో క్లాసులో 40 మంది పిల్లల కంటే ఉండేవారు కాదని, ఇప్పుడు మాత్రం కనీసం 100కు పైగానే ఉంటున్నారని క్లియోపాత్రా జులు అనే టీచర్ వాపోయారు. వీళ్లు చాలరన్నట్టు దాదాపు రోజూ కొత్త విద్యార్థులు జాయినవుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వమిచ్చే ఒక్కో పుస్తకాల సెట్టు కోసం కనీసం ఆరేడు మంది పిల్లలు కొట్టుకునే పరిస్థితి! అయితే ఇవన్నీ ‘మంచి సమస్య’లేనంటారు దేశ విద్యా మంత్రి డగ్లస్ స్యకలిమా. ‘‘క్లాసురూముల్లో ఇరుక్కుని కూర్చునైనా సరే, ఈ బాలలంతా మూడేళ్లుగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. వారంతా మరో దిక్కు లేక నిస్సహాయంగా వీధులపాలైన రోజులతో పోలిస్తే ఇదెంతో మెరుగు కదా’’ అన్నది ఆయన పాయింటు. ‘‘మౌలిక సదుపాయాలు కూడా త్వరలో మెరుగవుతాయి. ఎందుకంటే విద్యా రంగంపై చేసే పెట్టుబడి నిజానికి అత్యుత్తమ పెట్టుబడి’’ అని వివరించారు. ఆయన వాదన నిజమేనని 18 ఏళ్ల మరియానా చిర్వా వంటి ఎందరో విద్యార్థుల అనుభవం చెబుతోంది. ‘‘2016లో నాలుగో తరగతిలో ఉండగా స్కూలు మానేశాను. ఉచిత విద్యా పథకం పుణ్యాన మూడేళ్లుగా మళ్లీ చదువుకోగలుగుతున్నా. మా అమ్మానాన్నా ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటారు. ఉచిత పథకం లేకుంటే స్కూలు ఫీజు కట్టడం అసాధ్యం మాకు’’ అని చెప్పుకొచి్చందామె. 2026 నాటికి కనీసం 55 వేల మంది కొత్త టీచర్ల నియామకం చేపట్టాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 37 వేల మంది నియామకం జరిగిపోయింది. తమకిచ్చిన ప్రభుత్వ నివాసాల్లో అత్యంత దుర్భరమైన పరిస్థితులున్నాయని టీచర్లు వాపోతున్న నేపథ్యంలో ఆ సమస్యపైనా దృష్టి సారించారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన కనీసం మరో 170 స్కూళ్లు నిర్మించనున్నారు. 2020లో రుణ ఊబిలో చిక్కి దివాళా తీసిన దేశానికి ఇది నిజంగా గొప్ప ఘనతేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్ కూడా ప్రశంసిస్తోంది. చదువు అందని ద్రాక్షే ఆఫ్రికాలో జాంబియా వంటి సబ్ సహారా ప్రాంత దేశాల్లో అందరికీ విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే. అక్కడి దేశాల్లో సగటున ప్రతి 10 మంది విద్యార్థుల్లో ఏకంగా 9 మందికి నాలుగు ముక్కలు తప్పుల్లేకుండా చదవడం, అర్థం చేసుకోవడం ఇప్పటికీ తలకు మించిన వ్యవహారమేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్ అధ్యయనం చెబుతోంది. అయితే కొంతకాలంగా ఆ దేశాలన్నీ జాంబియా బాటలోనే నాణ్యమైన విద్యపై దృష్టి సారిస్తుండటం హర్షణీయమంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉచిత విద్యకు దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి (2024–25) విద్యాహక్కు చట్టం కింద దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నిజానికి ఈ గడువు సోమవారంతో ముగుస్తుండగా, విద్యాశాఖాధికారులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతికూల పరిస్థితుల్లోని పిల్లలైన అనాథలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించాలి. వీరికి విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు, అన్ఎయిడెడ్ స్కూళ్లల్లో 25 శాతం సీట్లు కేటాయించాలి. దీనిప్రకారం ఇప్పటివరకు 49,208 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 38,150 మంది పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. విద్యార్థుల నివాసాలకు సమీపంలో ఉన్న ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్‌ను బోధిస్తున్న స్కూళ్లలోను పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలని సమగ్రశిక్ష ఎస్సీడీ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థుల తల్లిదండ్రులు తమ నివాసాలకు సమీపంలోని సచివాలయం లేదా ఇంటర్నెట్, ఎంఈవో కార్యాలయం, మీ–సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పనివేళల్లో సమగ్రశిక్షా పాఠశాల విద్యాశాఖ (టోల్ ఫ్రీ) 18004258599 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. అర్హతగల పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్.. ఇక ఆసక్తిగల పిల్లల తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో విద్యార్థి పేరు, ఇతర వివరాలు నమోదుచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పిల్లల ఆధార్ నంబర్, లేదా తల్లిదండ్రుల ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్లో కనిపించే స్కూళ్లలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులకు ఆన్లైన్ లాటరీ ద్వారా స్కూళ్లను కేటాయిస్తారు. http://cse.ap.gov.in/RTE వెబ్సైట్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. -
Loganathan: క్లీన్ హెల్ప్
మనకు దండిగా డబ్బులుంటే ఇతరులకు దానం గానీ, సాయం గానీ చేయగలుగుతాం కానీ మనకే లేనప్పుడు ఇతరులకు ఏం సాయం చేయగలుగుతాం అని నిష్ఠూరాలు పోతుంటాము. లోగనాథన్ మాత్రం అలాంటి వ్యక్తికాదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సాయం చేయాలనుకున్నాడు. ఇందుకు కావలసిన డబ్బు కోసం టాయిలెట్స్‌ను శుభ్రం చేయడానికి కూడా వెనకాడటం లేదు లోగనాథన్. అలా వచ్చిన కొద్దిమొత్తాన్ని కూడా నిరుపేద పిల్లల చదువుకోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయం తెలిసి ప్రధాని మోదీ సైతం మన్‌కీ బాత్‌లో లోగనాథన్ని ప్రశంసించారు. కోయంబత్తూరులోని కన్నంపాళయంకు చెందిన 55 ఏళ్ల లోగనాథన్ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆరోతరగతితోనే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు కొబ్బరి బోండాలు అమ్మేవాడు. అలా కొబ్బరిబోండాల దగ్గర ఉన్నప్పుడు లోగనాథన్‌కు.. చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చదువుకునే స్థోమత లేక రోడ్ల మీద తిరుగుతున్న పిల్లలు కనిపించేవారు. వారిని చూసి జాలిపడేవాడు. ఇలా చూసి చూసి.. ‘‘పేదరికంతో నాలా మరెవరూ చదువుని మధ్యలో ఆపేయకూడదు. నిరుపేద పిల్లలు చదువు కొనసాగేందుకు చేతనైన సాయం చేయాలి’’ అని నిర్ణయించుకున్నాడు. పార్ట్‌టైమ్ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను పేద పిల్లలకు ఖర్చుచేయడం మొదలుపెట్టాడు. టాయిలెట్స్ కడుగుతూ... కొన్నాళ్లకు లోగనాథన్ తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడింది. దాంతో కొబ్బరి బోండాలు అమ్మడంతోపాటు పేపర్‌మిల్‌లో పనికి చేరాడు. అప్పుడు కూడా డబ్బులు సరిపోయేవి కావు. అయినా పేదపిల్లలకు సాయం చేయడం మానలేదు. తనకొచ్చే జీతంలో కొంతమొత్తాన్ని సాయంగా ఇస్తూ్తనే ఉన్నాడు. డబ్బులు చాలనప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసి వచ్చిన డబ్బులను పేదపిల్లలకు ఇస్తున్నాడు. పాతికేళ్లుగా సాయంచేస్తూ పదిహేను వందలమందికిపైగా నిరుపేద పిల్లలకి ప్రాథమిక విద్యను అందించాడు. సిగ్గుపడకుండా... వృత్తిపరంగా వెల్డర్ అయిన లోగనాథన్‌కు.. తన ఎనిమిది గంటల డ్యూటీ అయిపోయిన తరువాత ఖాళీ సమయం దొరికేది. వెల్డింగ్ షాపు పక్కనే కొంతమంది శానిటరీ వర్కర్స్‌తో పరిచయం ఏర్పడింది. వాళ్లు టాయిలెట్స్ క్లీన్ చేసి సంపాదిస్తున్నారని తెలుసుకుని, తను కూడా గత పదిహేడేళ్లుగా టాయిలెట్స్ శుభ్రం చేస్తూ నెలకు రెండువేల రూపాయల పైన సంపాదిస్తూ అనాథ ఆశ్రమాలకు విరాళంగా ఇస్తున్నాడు. సంపన్న కుటుంబాల దగ్గర నుంచి పుస్తకాలు, బట్టలు సేకరించి అనాథపిల్లలకు ఇవ్వడం, ఏటా ప్రభుత్వం నిర్వహించే అనాథ ఆశ్రమాలకు పదివేల రూపాయల విరాళంగా ఇవ్వడం వంటి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు లోగనాథన్. ‘‘నాకు సాయం చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు చిన్నప్పటి నుంచి ప్రతికూలంగానే ఉన్నాయి. ఎలాగైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో నాకు తోచిన విధంగా చేస్తున్నాను. టాయిలెట్స్ కడగడం మొదలు పెట్టిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విముఖత వ్యక్తంచేశారు. చాలాసార్లు హేళనకు కూడా గురయ్యాను. అయినా నాకు ఏమాత్రం బాధలేదు. ఏదోఒక విధంగా పేద పిల్లలకు సాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే చారిటబుల్ ట్రస్టు పెడతాను’’. – లోగనాథన్ -
మళ్లీ అధికారమిస్తే ఉచిత విద్య
రాయ్‌పూర్: కాంగ్రెస్‌కు మరోసారి అధికారమిస్తే పాఠశాల, కళాశాల విద్యను ఉచితంగా అందజేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. తునికాకు సేకరించే వారికి ఏడాదికి రూ.4 వేలు అందజేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. గిరిజన ప్రాబల్య బస్తర్ ప్రాంతంలోని కాంకేర్ జిల్లా భానుప్రతాప్‌పూర్ నియోజకవర్గంలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపిస్తే మీ కోసం మేం పెద్ద నిర్ణయం తీసుకుంటాం. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందిస్తాం. ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేకుండా చదివిస్తాం’ అని రాహుల్ చెప్పారు. తునికాకులు సేకరించే వారికి ఏడాదికి రూ.4 వేలు అందజేస్తామన్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడుతుందని స్పష్టం చేశారు. ఎప్పుడూ ఓబీసీల (ఇతర వెనుకబడిన కులాలు) గురించి మాట్లాడే ప్రధాని మోదీ, కులగణన అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇద్దరు, ముగ్గురు పారిశ్రామిక వేత్తల లబ్ధి కోసమే పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులు, దళితులు, కారి్మకులు, ఆదివాసీల కోసం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఆదివాసీలను బీజేపీ వనవాసీలుగా పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఆదివాసీల చరిత్ర, భాష, సంస్కృతిపై జరుగుతున్న దాడిగా పేర్కొన్నారు. -
మానవీయ కోణంలో సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అన్నివర్గాలను పేదరికం నుంచి బయటపడేసేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగిస్తూ ముస్లిం, క్రైస్తవ మైనారిటీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో మైనారిటీల సంక్షేమం కోసం సుమారు రూ.15 వేల కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. మైనారిటీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి వంద శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధి దారుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఈ పథకం కింద రాష్ట్రం మొత్తం మీద 27 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేల మందికి రూ.లక్ష చొప్పున అందిస్తున్నామని తెలిపారు. మైనారిటీలకు కార్పొరేట్ స్థాయి విద్య.. మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సుమారు 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ విద్య అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం లక్షకు పైగా విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నామని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు అబ్దుల్ అహ్మద్ బిన్ బలాలా, జాఫర్ హుస్సేన్, కాలేరు వెంకటేశ్, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మంచి మనసు చాటుకున్న అదానీ ... వారందరికీ ఉచిత విద్య
-
మనసున్న మారాజు వీరేంద్ర సెహ్వాగ్.. ఒడిశా రైలు ప్రమాద బాధిత పిల్లలకు..!
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. మైదానంలో బౌలర్ల పాలిట సింహస్వప్నమైన వీరూ.. దయాగుణం చాటే విషయంలో తోటి క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచాడు. గతంలో చాలా సందర్భాల్లో ఆపదలో ఉన్నవారికి తానున్నానంటూ భరోసా ఇచ్చిన ఈ నజఫ్ఘడ్ నవాబ్.. తాజాగా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉచిత విద్యతో పాటు ఫ్రీ బోర్డింగ్ సదుపాయాలు కల్పిస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సెహ్వాగ్ తీసుకున్న ఈ నిర్ణయంపై యావత్ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరూపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వందలు, వేల కోట్లు సంపాదిస్తే రాజు కాలేడు.. కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకున్నప్పుడే నిజమైన రాజు అవుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మైదానంలో బౌలర్ల పట్ల కఠినంగా ఉండే సెహ్వాగ్.. నిజ జీవితంలో ఇంతా దయాగుణం కలిగి ఉండటాన్ని చూసి జనాలు ఇతన్ని మనసున్న మహారాజు అంటూ కీర్తిస్తున్నారు. సెహ్వాగ్‌ను చూసైనా తోటి క్రీడాకారులు రైలు ప్రమాద బాధితులకు తోచిన సాయం చేయాలని సూచిస్తున్నారు. కాగా, సెహ్వాగ్ కరోనా సమయంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న చాలా మందికి సాయం చేశాడు. ప్రతి శీతాకాలంలో ఈ మనసున్న క్రికెటర్ ఢిల్లీ వీధుల్లో చలికి వణికిపోయే వారికి దుప్పట్లు, స్వెటర్లు అందిస్తుంటాడు. ఓ వింటర్ అతను తన స్వెటర్‌ను సైతం వేలం వేసి, దాంతో వచ్చిన డబ్బును పేదల కోసం వినియోగించాడు. అంతే కాదు, ప్రమాదాలు, విపత్తుల సమయంలో కూడా సెహ్వాగ్ తక్షణమే స్పందిస్తుంటాడు. వీరూ భాయ్.. బయటి ప్రపంచానికి తెలియకుండా చాలా గుప్త దానాలు చేశాడని అతనికి తెలిసిన వారంటుంటారు. కేవలం సంపాదన మాత్రమే తెలిసిన నేటి తరం క్రీడాకారుల్లో సెహ్వాగ్ ఓ ఆణిముత్యమని వేనోళ్లు కీర్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే, 44 ఏళ్ల సెహ్వాగ్ 1999లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి 2013లో రిటైరయ్యాడు. ఈ మధ్యలో అతను 104 టెస్ట్‌లు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 17253 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 23 సెంచరీలు, వన్డేల్లో 15 సెంచరీలు సెహ్వాగ్ ఖాతాలో ఉన్నాయి. సెహ్వాగ్ పేరిట టెస్ట్‌ల్లో 3 డబుల్ సెంచరీలు, 2 ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. తన టైమ్‌లో వీరూ అరివీర భయంకరులైన బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. -మిడుతూరి జాన్ పాల్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిపై వేటు..? -
కర్ణాటకలో ఒక్క ఛాన్సివ్వండి: కేజ్రీవాల్
దావణగెరె: అవినీతి రహిత పాలన అందించే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క అవకాశమివ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కర్ణాటక ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య, విద్యుత్తు, ప్రభుత్వ పాఠశాలలు, మంచి ఆరోగ్య వసతులు ప్రజలకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని మార్చేందుకు అవకాశమివ్వాలని కోరారు. శనివారం దావణగెరెలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని, పంజాబ్‌లోని తమ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేను, ఒక మంత్రిని అవినీతి ఆరోపణలపై జైలుకు పంపించిందని చెప్పారు. రాష్ట్రంలో 40% కమీషన్ ప్రభుత్వం పనిచేస్తోందంటూ బీజేపీ పాలనపై విరుచుకుపడ్డారు. మళ్లీ అధికారమిస్తే అవినీతి లేకుండా చేస్తామంటున్న హోం మంత్రి అమిత్ షా.. తన నాలుగేళ్లలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. లోకాయుక్త అధికారులు రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకోవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ ఎమ్మెల్యేను, అతడి కుమారుడిని అరెస్ట్ చేయలేదు. కానీ, ఢిల్లీలో మా నేత సిసోడియాను అరెస్ట్ చేశారు’అంటూ బీజేపీ తీరుపై మండిపడ్డారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కారుతో అవినీతి కూడా రెట్టింపయ్యిందని ఎద్దేవా చేశారు. -
ఉచిత విద్యను 'రేవడీ' అనడం బాధాకరం.. ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలి
సాక్షి,న్యూఢిల్లీ: ఉచిత విద్యపై మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. డెన్మార్క్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఓ పాత నివేదికను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. విద్యార్థులందరికీ ఉచిత విద్య అందించినందువల్లే ఆ దేశం సుసంపన్నమైందని పేర్కొన్నారు. అలాంటిది మనదేశంలో మాత్రం ఉచిత విద్యను 'రేవడీ' సంస్కృతి అనడం తను బాధిస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. భారత్‌ను సంపన్న దేశంగా అభివృద్ధి చేయాలంటే దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను పైసా ఖర్చు లేకుండా అందించాలని సూచించారు. డెన్మార్క్ ప్రభుత్వం యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు నెలకు 1000 డాలర్ల వరకు సాయంగా అందిస్తున్నట్లు కేజ్రీవాల్ వీడియో రూపంలో షేర్ చేసిన నివేదికలో ఉంది. వాళ్లకు చదువుకుంటూనే పని చేసుకుని సంపాదించుకునే వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం. పలు ఇతర దేశాల్లో మాత్రం విద్య కోసమే రూ.లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. ये वीडियो देखिए… अमीर देशों में शिक्षा फ्री है। मुझे बहुत दुःख होता है कि हमारे देश में फ्री शिक्षा को ये नेता फ्री की रेवड़ी कहते हैं ये देश अमीर इसलिए बने क्योंकि ये फ्री शिक्षा देते हैं। अगर हर भारतीय को अमीर बनाना है तो भारत के हर बच्चे को अच्छी शिक्षा फ्री देनी ही होगी। pic.twitter.com/iAincN3phy — Arvind Kejriwal (@ArvindKejriwal) October 25, 2022 ఇటీవల మధ్యప్రదేశ్‌లో గృహప్రవేశ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన ప్రధాని మోదీ.. దేశానికి రేవడీ సంస్కృతి(ఉచితాలు) నుంచి విముక్తి కల్పించాలని వ్యాఖ్యానించారు. ఎంతో మంది పన్నుచెల్లింపుదారులు తనకు లేఖలు రాసి బాధపడ్డారని పేర్కొన్నారు. ఈ విషయంపై కేజ్రీవాల్ ఇప్పిటికే ప్రధానిపై విమర్శలు గుప్పించగా.. మంగళవారం మరోసారి డెన్మార్క్ ఉచిత విద్యా విధానాన్ని చూపి మోదీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. చదవండి: షిండేకు పదవీ గండం.. ఏ క్షణమైనా మహారాష్ట్రకు కొత్త సీఎం? -
ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి
నిరుపేద కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యనందిస్తున్నప్పటికీ, బడిలో నేర్చున్న పాఠాలను ఇంట్లో వల్లెవేయించడానికి గానీ, హోంవర్క్ చేయించడానికి కానీ ఎవరూ ఉండరు. పిల్లలకు సొంతంగా హోమ్‌వర్క్ ఎలా చేయాలో తెలియదు. దీంతో వాళ్లు మరుసటి రోజు టీచర్ హోంవర్క్ అడుగుతుందని స్కూలుకు వెళ్లడానికి భయపడి మధ్యలోనే స్కూలు మానేసి అరకొర చదువులతో భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి 70 ఏళ్ల శివస్వామి, మహాలక్ష్మి దంపతులు ఏర్పాటు చేసిన ఉచిత సెంటరే ‘కల్వితునై’. ‘ఉచితంగా నేర్చుకుని ఉన్నతంగా ఎదగండి’ అని చెబుతున్నారు ఈ దంపతులు. కోయంబత్తూరుకు చెందిన మహాలక్ష్మి దంపతులు 2010 లో రిటైర్ అయ్యారు. ‘సమాజం ఇచ్చినదాన్ని తిరిగి ఇవ్వాలి’ అన్న ఆలోచనా దృక్పథం కలిగిన వారు కావడంతో.. నిరుపేద పిల్లలు పడుతోన్న ఇబ్బందులను గమనించి వారికోసం ఏకంగా నలభై లక్షల రూపాయలను పెట్టి 2014లో ‘కల్వితునై’ పేరిట విద్యాసంస్థను ఏర్పాటుచేశారు. నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒక బ్యాచ్‌గా, తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు రెండోబ్యాచ్గా పిల్లలకు ట్యూషన్ చెబుతున్నారు. అలా ఈ సెంటర్లో నిత్యం 130 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీరికోసం టీచర్లకు జీతాలు చెల్లించి చదువు చెప్పిస్తున్నారు ఈ దంపతులు. ఇప్పటిదాకా వెయ్యిమందికిపైగా విద్యార్థులు ఇక్కడ చదువుకోగా, 350 మందికిపైగా మంచి ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. చదువుతోపాటు... పాఠాలేగాక కథలు చెప్పించడం, మొక్కలు నాటించడం, కల్చరల్ ఈవెంట్స్, జాతీయ పర్వదినాలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇంకా సమ్మర్ క్యాంప్‌లు, టూర్లకు తీసుకెళ్లడం, సేంద్రియ వ్యవసాయం గురించి వివరించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలికలకు మెనుస్ట్రేషన్ సెషన్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ తయారీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లోనూ జారిపోకుండా ఉండేందుకు వొకేషనల్ ట్రైనింగ్ కోర్సులు, సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణను మొదలు పెట్టారు. బేసిక్ కంప్యూటర్ కోర్సులు, బయట యాభైవేల రూపాయలు ఖరీదు చేసే సీఏ ఫౌండేషన్ కోర్సును 4,500కే అందించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్‌ను బంగారు మయం చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి నెలకు లక్షరూపాయలు ఖర్చు అవుతుంది. సీఎస్ఆర్, బాష్, విప్రో, ఇంకా ఇతరులు ఇచ్చే విరాళాల ద్వారా సెంటర్‌ను నడిపిస్తున్నారు. వీరి వద్ద చదువుకున్న వాళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇదంతా చూస్తుంటే ఇలాంటి వారు మన రాష్ట్రాల్లోనూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. చదువునుంచి దృష్టి మరల్చకుండా... నిరుపేదలకు కనీస అవసరాలు తీరాలన్నా కష్టమే. అందుకే వాళ్లు డబ్బు సంపాదన మీదే దృష్టిపెడతారు. పిల్లల చదువుల గురించి శ్రద్ధ తీసుకునే అవగాహన, సమయం వారికి ఉండదు. దానివల్ల వారి భవిష్యత్ తరాలు కూడా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. ఇటువంటివారికి ఉచితంగా ట్యూషన్ చెప్పడం ద్వారా వారి భవిష్యత్ మారుతుందని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. దీనిద్వారా కొంతమంది టీచర్లకు ఉపాధి దొరకడంతోపాటు విద్యార్థులకు చక్కని బోధన అందుతుంది. ఎప్పుడూ చదువే కాకుండా వివిధ రకాల విజ్ఞాన, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, సంక్రాంతి సమయంలో కొత్తబట్టలు ఇవ్వడం, రోజూ ఆరోగ్యకరమైన స్నాక్స్ అందిస్తూ చదువునుంచి పిల్లల దృష్టి మరలకుండా చూస్తున్నాం’’ – శివస్వామి, మహాలక్ష్మి -
Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉచితాల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను తాము అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని.. ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో వెచ్చించడమే ఇక్కడ ప్రధాన అంశమని పేర్కొంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచిత హామీలు చేయకుండా నిరోధించాలని కోరుతూ లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఉచితం అనే పదాన్నే నిర్వచించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఉచిత తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలను ఉచితాలుగా వర్ణించలేమనిపేర్కొన్నారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని చెప్పలేమన్నారు. ఉచిత వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఉచిత వాగ్దానాల సమస్య జఠిలమవుతోందన్న జస్టిస్ ఎన్వీ రమణ అసలు ఉచిత హామీ, సంక్షేమ పథకం అని తేల్చేది ఎలా అంటూ ప్రశ్నించారు. ఉచిత తాయిలం అంటే ఏంటో అర్థాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, దీనిపై మరింత చర్చ జరగాలని పేర్కొన్నారు. శనివారం (ఆగస్టు 20)లోగా తమ సూచనలు దాఖలు చేయాలని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది. చదవండి: బిహార్‌లో న్యాయశాఖ మంత్రి అరెస్టు కలకలం... తనకేం తెలియదన్న సీఎం -
ఉచితాలపై సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న వేళ సంక్షేమ పథకాల్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి.. వాటి పట్ల వ్యతిరేక వాతావరణాన్ని దేశంలో సృష్టిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఉచితాలపై మాజీ బీజేపీ నేత పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంలో ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. సంక్షేమ కార్యక్రమాలను ఉచితాలుగా చూడొద్దని, సమాజంలో సమానత్వం కోసమే ఉచితాలని పేర్కొంది. ఉచిత విద్యను, కొన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వాలకు నష్టమని పేర్కొంటూ, వీటికి వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తమకు సన్నిహితులైన కొంతమందికి మాత్రం లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటువంటి ద్రోహులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కొన్ని పార్టీలు ప్రజలకు తాయిలాలు ప్రకటించడం దేశాభివృద్ధికి ప్రమాదకరమంటూ ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. విద్యుత్ సవరణ బిల్లు ప్రమాదకరం విద్యుత్ చట్టానికి కేంద్రం తలపెట్టిన సవరణలు ప్రమాదకరమైనవని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందులు, కొన్ని కంపెనీలకు లాభం చేకూర్చే ఈ సవరణలను విరమించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ సవరణ బిల్లు–2022తో విద్యుత్ సరఫరా, పంపిణీకి సంబంధించి ప్రజల ఇబ్బందులు తీరకపోగా, మరింత పెరుగుతాయని ట్విట్టర్లో ఆయన సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. తొందరపడి ఈ బిల్లును తీసుకురావద్దని కేంద్రాన్ని కోరారు. -
అందులో ఏం తప్పుంది!... కేంద్రం పై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని పార్టీలు ఉచిత రెవిడిలు(ఉచిత పథకాలను) అందిస్తున్నారంటూ నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉచితాలను ప్రజలకు ఎరగా వేసి అధికారంలోకి రాకూడదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తులకు సంబంధించి సుమారు రూ. 10 లక్షల కోట్ల రుణాలను సాక్షాత్తు కేంద్రమే మాఫీ చేసిందంటూ ఆరోపణలు చేశారు. ఈ ప్రక్రియలో పాల్గొన్నవారిని సైతం కటకటాల వెనక్కి పంపాలంటూ మండిపడ్డారు. మంత్రులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చినప్పుడూ మరీ సామాన్యులకు ఎందుకు ఉచిత పథకాలు ఉండకూడదంటూ ప్రశ్నించారు. సామాన్యులకు ఉచిత విద్య, ఉచిత నీరు కల్పించడంలో తప్పు ఏముందన్నారు. బడా కార్పోరేట్లకు పెద్ద మొత్తాల్లో ఉచితంగా రుణ మాఫీ చేయడంలో లేని తప్పు ఇందులో ఎందుకు ఉంది అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. (చదవండి: హఠాత్తుగా పెరిగిన నది ఉధృతి... ఏకంగా 14 కార్టు గల్లంతు) -
స్వతంత్ర భారతి: బాలలకు ఉచిత, నిర్బంధ విద్య
2010 ఏప్రిల్ 1న ‘ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం –2009’ అమల్లోకి వచ్చింది. దేశంలో 6 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం ఈ చట్టం లక్ష్యం. భారత రాజ్యాంగంలోని 86 వ సవరణను అనుసరించి, ఆర్టికల్ 21–ఎ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని చెబుతోంది. స్వాతంత్య్రానికి ముందు మొదటిసారిగా 1882లో హంటర్ కమిషన్ ఉచిత విద్య ప్రాధాన్యం గురించి ప్రస్తావించింది. తర్వాత గోపాలకృష్ణ గోఖలే 1911లో దీని ప్రాముఖ్యాన్ని గుర్తించి, నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫలితం లభించలేదు. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్ 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత విద్యను అందించాలని పేర్కొంది. 2009 చట్టం కింద.. జనన ధ్రువీకరణ పత్రం లేదనే కారణంతో పాఠశాల ప్రవేశాన్ని నిరాకరించకూడదు. ఏ విద్యార్థిని కూడా ఒక విద్యా సంవత్సరంలో ఏ తరగతిలోనూ ఒక సంవత్సరం కంటే ఎక్కువగా నిలిపి ఉంచకూడదు. ప్రాథమిక తరగతులకు ఎంపిక పరీక్ష నిర్వహించకూడదు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు జ్యోతి బసు, జానకీ వెంకట్రామన్, కె.కరుణాకరన్.. కన్నుమూత. 2008 ముంబై పేలుళ్ల కేసులో అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష విధింపు. జాతీయ గుర్తింపు పథకం ‘ఆధార్’ను ప్రవేశపెట్టిన భారత ప్రభుత్వం. తొలి ఆధార్ కార్డు జారీ. (చదవండి: లక్ష్యం 2047) -
మనసున్న పోలీసు.. సెలవుల్లో టీచర్.. పేద పిల్లలకు ఉచితంగా పాఠాలు
లక్నో: పోలీసు ఉద్యోగం అంటేనే 24 గంటలు డ్యూటీ. క్షణం తీరిక లేని పని. ఎప్పుడైనా సెలవు దొరికితే కుటుంబంతో గడపాలనుకుంటారు. కానీ, ఓ పోలీసు అధికారి తన బాధ్యతలను నిర్వరిస్తూనే.. సెలవు రోజుల్లో టీచర్ అవతారమెత్తి పేద విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. సొంతంగా పాఠశాల ఏర్పాటు చేసి ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. వారికి కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ తానే అందిస్తున్నారు. ఆయనే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన ఎస్సై రంజిత్ యాదవ్. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా పాఠాలు చెబుతున్నారు ఎస్సై రంజిత్ యాదవ్. ఉన్నత చదువులు చదవుకోవాలనే కోరికను వారిలో కలిగిస్తున్నారు. ఆయన చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటున్న చిన్నారులు.. తదుపరి తరగతులకు వెళ్తామని చెబుతున్నారు.' మేము ఇంకా చదువుకోవాలి. స్కూల్‌కు వెళ్లాలి. ఇక్కడ చదువుకోవడం వల్ల మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక్కడికి రోజూ వస్తాము.' అని ఓ చిన్నారి పేర్కొంది. బహిరంగ ప్రదేశంలో, ఓ చెట్టు నీడలో తరగతులు నిర్వహిస్తున్నారు. తాను నివాసముండే ప్రాంతంలో కొన్ని కుటుంబాలకు చెంది వారు, పిల్లలు బిచ్చమెత్తుకుంటూ కనిపించగా వారికి చదువు చెప్పించి మార్పు తీసుకురావాలనే ఆలోచన వచ్చినట్లు రంజిత్ యాదవ్ తెలిపారు. కొద్ది నెలల క్రితమే తరగతులు ప్రారంభించినట్లు చెప్పారు. ‘నా సొంత పాఠశాలను ప్రారంభించాను. నాకు సెలవు దొరికినప్పుడల్లా ఈ పిల్లలకు పాఠాలు బోధిస్తాను. వారి తల్లిదండ్రులు బిచ్చమెత్తుకుంటూ కనిపించటాన్ని చూసిన తర్వాత వారితో మాట్లాడాను. వారు పిల్లలను చదివించేందుకు ముందుకు వచ్చారు.’ అని తెలిపారు. ఆ పాఠశాలకు 50 మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వారికి అవసరమైన సామగ్రి, పుస్తకాలను పోలీసు అధికారే ఉచితంగా అందిస్తున్నారు. #Heartily #thanks 🙏✍️🙏@ANINewsUP @ayodhya_police @UpPolicemitra @igrangeayodhya @dubey_ips @navsekera @renukamishra67 @adgzonelucknow @dgpup @Uppolice शिक्षा है अनमोल रतन! https://t.co/lUphOUAjZn — Ranjeet Yadav 🇮🇳 (@RSupercop) July 21, 2022 ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు -
మోహన్ లాల్ ఉదారత.. ఆ విద్యార్థులకు 15 ఏళ్లపాటు ఉచిత విద్య
Mohan Lal Vintage Project Provide 20 Students 15 Years Free Education: ప్రముఖ నటుడు మోహన్ లాల్ తన విలక్షణ నటనతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ ఉంటారు. సినిమాలతో అలరిస్తున్న ఈ కంప్లీట్ యాక్టర్ తన పెద్ద మనసుతో ఉదారత చాటుకున్నారు. ఏకంగా 20 మంది విద్యార్థులకు 15 ఏళ్ల పాటు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చారు. గిరిజన తెగకు చెందిన 20 మంది స్టూడెంట్స్‌ను సెలెక్ట్ చేసుకుని 15 ఏళ్ల పాటు వారి చదువుకయ్యే ఖర్చులను భరించనున్నారు. ఈ విద్యకు అయ్యే ఖర్చును 'విశ్వశాంతి ఫౌండేషన్'కు చెందిన వింటేజ్ పతకం ద్వారా చెల్లించనున్నారు. అలాగే వారికి నచ్చిన కోర్సుల్లో చదివిస్తామని విశ్వశాంతి ఫౌండేషన్ ప్రకటించింది. మొదటి దశగా ఈ ఏడాది 20 మందిని ఎంపిక చేశామని మోహన్ లాల్ తెలిపారు. 'విశ్వశాంతి ఫౌండేషన్ చొరవతో 'వింటేజ్' ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రయత్నంలో మేము అట్టప్పాడికి చెందిన గిరిజన గ్రామాల్లో ఆరో తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులను స్పెషల్ క్యాంప్స్ ద్వారా సెలెక్ట్ చేశాం. వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచేందుకు వచ్చే 15 ఏళ్లు ఉత్తమ విద్య, వనరులు అందిస్తాం. ఈ ప్రాజెక్టులో మద్దతు ఇచ్చిన ఈవై గ్లోబల్ డెలివరీ సర్వీసెస్ కెరీర్స్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పిల్లలకు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సవినయంగా కోరుకుంటున్నాం.' అంటూ ఫేస్బుక్ పేజీలో మోహన్ లాల్ పేర్కొన్నారు. చదవండి: ఒకే ఫ్రేమ్‌లో మోహన్‌లాల్, మల్లిక.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ -
అడవిని చేరిన అక్షరం
ఎస్ఎస్ తాడ్వాయి: ఆ యువకులిద్దరూ అడవిలోనే పుట్టారు. ఆ ప్రాంత పిల్లలకు చదువు ఎంత దూరమో, చదువుకోవాలంటే ఎన్ని కష్టాలు పడాలో వారికి తెలుసు. విద్యతోనే తమవారి జీవితాల్లో గణనీయమైన మార్పు వస్తుందని గట్టిగా నమ్మారు. గిరిజన గూడేల్లోనే పెరిగి ఇప్పుడు ఉన్నత చదువుల్లో ఉన్న ఆ ఇద్దరు.. తామే చదువును ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. గిరిజన గూడేలను దత్తత తీసుకుని సొంతంగా పాఠశాలలను నడిపిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి పదేళ్ల క్రితం వలస వచ్చి అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ పిల్లలకు ఉచితంగా అక్షరాలు నేర్పిస్తున్నారు. వీరికి కొందరు దాతలు చేయూతనిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన ఇస్రం సంతోష్ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదువుతున్నాడు. అదే యూనివర్సిటీలో జర్నలిజం పూర్తిచేసిన రేగొండ మండలం చల్లగరిగే గ్రామానికి చెందిన దూడపాక నరేష్‌లు కలిసి గొత్తికోయగూడేల్లోని పిల్లల్లో అక్షరజ్ఞానం పెంపొందించేందుకు ముందడుగు వేశారు. చదువుతో పాటు ఆట పాటలు అటవీ ప్రాంతంలోని నీలంతోగు, ముసులమ్మపేట, సారలమ్మ గుంపు, కాల్వపల్లి గొత్తికోయ గూడేల్లో ‘భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్’ పేరుతో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెంకటాపురం మండలం బడ్లపాడు గొత్తికోయగూడెంలో మరో పాఠశాల నడుపుతున్నారు. పిల్లలకు చదువు చెప్పేందుకు ప్రైవేటు టీచర్లతో పాటు వారి బాగోగులు చూసేందుకు ఆయాలను నియమించారు. ఒక్కో టీచర్‌కు నెలకు రూ.7 వేల వేతనంగా చెల్లిస్తుండగా, ఆయాలకు రూ.1,000 ఇస్తున్నారు. ఆరు పాఠశాలల్లో మొత్తం 170 మంది పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలకు చదువుతోపాటు ఆరోగ్య సూత్రాలను నేర్పిస్తున్నారు. పాఠశాలకు రాని ఆదివాసీ గొత్తికోయ పిల్లలను చదువు వైపు మళ్లించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు ఆటపాటలను కూడా నేర్పిస్తున్నారు. అండగా నిలుస్తున్న దాతలు ఆదివాసీ గూడేల్లో శుభ్రత ఉండదు. తరచూ రోగాలపాలవుతుంటారు. దీనికితోడు పోషకాహార లోపం. దీనిని దృష్టిలో పెట్టుకుని పిల్లల పరిశుభ్రత, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. పిల్లలకు చేతులు ఎలా కడుక్కోవాలో కూడా నేర్పిస్తున్నారు. పోషకాహార లోపం ఉండకూడదని ప్రతిరోజూ కోడిగుడ్డు, గ్లాస్ పాలు అందిస్తున్నారు. రెండు రోజులకోసారి పల్లీ పట్టీలను స్నాక్‌గా ఇస్తున్నారు. ఇవన్నీ వీరు ఉచితంగానే చేస్తుండటం గమనార్హం. ఇస్రం సంతోష్, నరేష్‌లు గొత్తికోయగూడేల్లో పాఠశాలలను నడుతుపుతున్న విషయం తెలుసుకుని ఇద్దరు దాతలు ముందుకు వచ్చి చేయూతనిస్తున్నారు. ఎస్సీఈ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గోపాలకృష్ణ, అస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తరుణ్‌లు ప్రతినెలా సాయం అందజేస్తున్నారు. విద్యతోనే జీవితాల్లో మార్పు విద్యతోనే జీవితాలు మారతాయి. ఎక్కడో అడవిలో ఉండే గూడేల్లో చదువు ఇప్పటికీ అందని ద్రాక్షే. మాలా ఇబ్బందులు పడకూడదని, ఆదివాసీ గొత్తికోయ పిల్లలకు గూడేల్లో విద్య నేర్పించాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాం. తొలుత ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోని గొత్తికోయగూడేల్ని సందర్శించి అధ్యయనం చేశాం. మొదట్లో ఒకటి, రెండు పాఠశాలలను నడిపించాం. ప్రస్తుతం ఆరు గూడేల్లో నడుపుతున్నాం. మారుతున్న సమాజంలో పోటీ ఇవ్వాలంటే చదువుతోనే సా«ధ్యమతుంది. టీచర్ల బృందం సమన్వయంతో పాఠశాలలను నడిపిస్తున్నాం. దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తే మరిన్ని పాఠశాలలతో మరింత మంది గొత్తికోయ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం. – ఇస్రం సంతోష్ -
పేదింట్లో వైద్య కాంతులు.. ఆ కల వాళ్లని ఇంత వరకు నడిపించింది!
సాక్షి,మల్యాల(చొప్పదండి): నిరుపేద కుటుంబాల విద్యార్థులు చదువులో సత్తాచాటి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా సీటు సాధించి తమ కలలను సాకారం చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా లక్ష్యసాధనకు నిరంతరం తపించారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన వైద్య విద్య వారి దరికి చేరింది. కష్టసుఖాలు.. తాము అనుభవించిన పేదరికాన్ని పిల్లలు అనుభవించకూడదనే తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా.. సమాజానికి సేవ చేసే ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనే తమ కలలను నెరవేర్చుకున్నారు. పేదరికాన్ని రుచి చూస్తూ పెరిగిన పిల్లలు వైద్య వృత్తి బాటలో పయనిస్తూ నిరుపేదలకు చేయూతనందిస్తామంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బింగి నర్సయ్య– మంజుల కూతురు మనీషా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వైద్య విద్యవైపు అడుగులు వేసింది. తండ్రి బట్టల వ్యాపారి, తల్లి బీడీ కార్మికురాలు. నూకపల్లి మోడల్స్కూల్లో పదో తరగతిలో 9.8 జీపీఏ, ఇంటర్లో 985 మార్కులు సాధించింది. తండ్రి గ్రామాల్లో తిరుగుతూ బట్టల వ్యాపారం, మరోవైపు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కూతురు మనీషా ఈ ఏడాది నీట్లో 543 మార్కులు సాధించి వైద్యురాలిగా తన కల నెరవేర్చుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది. చిన్న కూతురు అనూషను సైతం నీట్ కోసం సిద్ధం చేస్తున్నారు. విరిసిన దళిత కుసుమం.. మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబం పద్మ–గంగయ్యల ఒక్కగానొక్క కూతురు నిఖిత. తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌బాట పట్టాడు. ఆది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివింది. పదో తరగతిలో 9.3 జీపీఏ, ఇంటర్లో 953 మార్కులు సాధించింది. గతేడాది వైద్య విద్యలో సీటు సాధించి డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకుంది. వైద్య విద్య అడ్మిషన్‌కు కూడా డబ్బులు కట్టలేని స్థితిలో నిఖితకు “సాక్షి’ తోడుగా నిలవగా.. డాక్టర్ కావాలనే కల సాకారం చేసుకుంది. తనలాంటి పేద విద్యార్థులకు చేయూతనందిస్తానని, నిరుపేదలకు ఉచితంగా సేవలందిస్తానని నిఖిత చెబుతోంది. తండ్రి కల నెరవేర్చిన తనయ మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన పన్నాటి మల్లేశం కూతురు అలేఖ్య. గ్రామంలో రెండు దశాబ్దాలుగా మల్లేశం ఆర్ఎంపీగా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య గీత బీడీ కార్మికురాలు. తన కూతురును డాక్టర్ చేయాలనే తండ్రి ఆశయానికి తోడు తనయ కష్టపడి చదివి ఉస్మానియాలో ఉచితంగా సీటు సాధించింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్లో 988 సాధించింది. మూడేళ్లక్రితం ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు సాధించి, తండ్రి ఆశయాన్ని, తన కలను నెరవేర్చుకుంది. ఆది నుంచి ముందువరుసలో.. మల్యాల మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్ రెండు దశాబ్దాలుగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. డాక్టర్ కావాలంటూ చిన్నప్పటి నుంచి తన కుమారుడు గాయత్రినందన్కు బీజాలు నాటాడు. తండ్రి మాటలకు అనుగుణంగా గాయత్రినందన్ డాక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆదినుంచి ప్రణాళికతో చదివి పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్లో 988 మార్కులు సాధించాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే నీట్లో 583 మార్కులు సాధించి ఇటీవలే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉచితంగా సీటు సాధించాడు. మట్టి పరిమళం కల్పన మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన మిర్యాల మల్లారెడ్డి– వనిత దంపతులది వ్యవసాయ కుటుంబం. డాక్టర్ కావాలనే కూతురు కల్పన కలకు బాసటగా నిలిచారు. చదువుకోసం వ్యవసాయ భూమి అమ్మేందుకుసైతం వెనకాడబోమని భరోసానిచ్చారు. తల్లిదండ్రుల భరోసాతో కల్పన మరింత కష్టపడి చదివింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్ మొదటి సంవత్సరంలో 436/440 మార్కులతో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకులో నిలిచింది. అదే ఉత్సాహంతో ఇంటర్లో 986 మార్కులు సాధించింది. కష్టపడి చదివి ఉచితంగా వైద్య కళాశాలో సీటు సాధించి ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతోంది. గ్రామంలో నెట్వర్క్ లేకపోతే చదువుకు ఆటంకం కలుగవద్దని నేరుగా శ్మశానంలో కూర్చుండి కూడా ఆన్లైన్ తరగతులు వింటూ చదువును కొనసాగించి, డాక్టర్ కావాలనే తనలోని దృఢ సంకల్పాన్ని చాటి చెప్పింది. -
2025 నాటికి కోటి మంది విద్యార్థులకు ఉచిత విద్య: బైజూస్
న్యూఢిల్లీ: విద్యా సంబంధిత టెక్నాలజీ కంపెనీ బైజూస్ ఉచిత విద్యా కార్యక్రమాన్ని విస్తరించనున్నట్టు ప్రకటించింది. 2025 నాటికి గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని కోటి మంది విద్యార్థులకు ఉచితవిద్య అందించనున్నట్టు తెలిపింది. 2025 నాటికి 50 లక్షల మందికి ఉచిత విద్య అందించాలన్న లక్ష్యాన్ని రెట్టింపు చేసింది. ఇందులో ఇప్పటికే 34 లక్షల మందిని ఉచిత విద్యా కార్యక్రమం ద్వారా చేరుకున్నట్టు బైజూస్ సహ వ్యవస్థాపకుడు దివ్య గోకులనాథ్ తెలిపారు. ఉచిత విద్య అందించేందుకు బైజూస్ 128 స్వచ్చంద సంస్థలతో (ఎన్జీవోలు) భాగస్వామ్యం కుదుర్చుకోవడం గమనార్హం. -
అక్షరానికి దూరమైన బాల్యం కోసం ‘ఆమె’ తాపత్రయం..!
Sabiha Hashmi Story In Telugu: ఒక మంచి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటే మార్గం కూడా ఉంటుంది. సమయం కూడా వస్తుంది. అందుకు ఉదాహరణ సబిహా హష్మి. స్కూల్ డ్రాప్ అవుట్లుగా మిగులుతున్న బాలికల కోసం ఆమె ఏడు పదుల వయసులో మళ్లీ ఉద్యోగం చేస్తున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన సబిహా హష్మి నేషనల్ మ్యూజయమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ఆర్ట్, కన్జర్వేషన్ అండ్ మ్యూజయాలజీలో పీహెచ్డీ చేశారు. ఢిల్లీ, గుర్గావ్లోని హెరిటేజ్ స్కూల్లో పిల్లలకు స్కెచింగ్, పెయింటింగ్, కళల చరిత్ర బోధించేవారు. పిల్లలకు బోధనేతర విజ్ఞానం కోసం విహారయాత్రలకు తీసుకువెళ్లేవారు. ఓసారి ఉత్తర హిమాలయ పర్వత శ్రేణుల దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడి కుగ్రామాల్లో నివసించే అమ్మాయిలను చూసి బాధపడేవారామె. స్కూలు వయసులోనే చదువు మానేసి పెళ్లి చేసుకుని చంకలో బిడ్డతో, ఇంటి బాధ్యతలు మోస్తున్న ఆడపిల్లలు కనిపించేవారు. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. అక్షరానికి దూరమైన బాల్యం ఆమె గుండెను కదిలించేది. అయితే వాళ్ల కోసం తాను చేయగలిగిందేమీ ఆమెకు కనిపించలేదు. అప్పటికామె చేయగలిగింది బాధపడి ఊరుకోవడమే. ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత కొన్నాళ్లకు ఆమె పిల్లల దగ్గరకు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఆమె 2010 లో కర్నాటక, రామనగర జిల్లా, జ్యోతిపాళయ గ్రామానికి వచ్చారు. ‘‘ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక్కసారిగా హిమాలయ పర్వత గ్రామాల్లో చూసినటువంటి దృశ్యాలు కనిపించాయి. నేను అక్కడ చూసినప్పుడు అక్కడి అమ్మాయిల కోసం ఏదైనా చేయాలంటే తగిన ఆర్థిక వెసులుబాటు లేదు. ఇప్పుడైతే నాకు చేతనైనదేదో చేయగలను... అనిపించింది. గ్రామం శివారులో మా పొలానికి సమీపంలో చిన్న కాటేజ్ కట్టించి బాలికలకు ఉచితంగా చదువు చెప్పడం మొదలు పెట్టాను. నా దగ్గరకు చదువుకోవడానికి వచ్చే బాలికల్లో ఓ ఎనిమిది మందికి పుస్తకాలు కొనుక్కోవడం కూడా కష్టమేనని కొన్నాళ్ల తర్వాత తెలిసింది. వాళ్ల చదువు కొనసాగాలంటే పుస్తకాల వంటి కనీస అవసరాలు తీరాలి. నాకు కొంత స్థిరమైన సంపాదన ఉంటే తప్ప సాధ్యం కాదనిపించింది. దాంతో స్థానికంగా ఓ స్కూల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాను. అలాగే నాకు ఆర్ట్, క్రాఫ్ట్ కూడా తెలిసి ఉండడంతో పిల్లలకు పాఠాల తర్వాత బొమ్మలు వేయడం, కార్డ్‌బోర్డుతో బుక్ రాక్, పెన్సిల్ హోల్డర్, రిమోట్ బాక్సులు, ఆభరణాలు దాచుకునే పెట్టెలు వంటి ఇంటి వాడుకలో అవసరమైన వస్తువులు, గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేయడం కూడా నేర్పిస్తున్నాను. వీటిని నెలకోసారి నేను పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న స్కూల్లో స్టాల్ పెడతాం. చదవండి: Baldness Cure: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు పరిష్కారం..! ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మా ఉత్పత్తులను తీసుకుంటుంది. అలా వచ్చిన డబ్బుతో జ్యోతిపాళయంలో చదువుకు దూరమైన ఆడపిల్లల చదువు కొనసాగుతోంది. నలుగురు విద్యార్థినులు టెన్త్ క్లాస్ పూర్తి చేశారు. ఈ మధ్యనే ఒకమ్మాయి బీఈడీ పూర్తి చేసింది. ఒకమ్మాయి బీకామ్ 74 శాతంతో పూర్తి చేసి మల్టీ నేషనల్ కంపెనీలో అకౌంటెంట్‌గా చేస్తోంది. నా దగ్గర చదువుకుంటున్న వాళ్లలో బాలికలతోపాటు పెళ్లయిన యువతులు, బిడ్డ తల్లులు ఉన్నారు. పరీక్షలు రాసి పై చదువులకు వెళ్లలేకపోయినప్పటికీ నేర్చుకోగలిగినంత నేర్చుకుంటామని వచ్చే వాళ్లు, చదువుకోవడం ద్వారా తమకంటూ ఒక గుర్తింపు కోరుకునే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లను చూసినప్పుడు వాళ్ల చేత స్కూల్ డ్రాప్ అవుట్ చేయించి పెళ్లి చేసినన తల్లిదండ్రుల మీద ఆగ్రహం కలుగుతుంటుంది కూడా’’ అంటారు సబిహా హష్మి. అజ్జి లైబ్రరీ! సబిహ తన డెబ్బై రెండేళ్ల వయసులో తన అక్షరసేవను పాఠ్యపుస్తకాల నుంచి కథల పుస్తకాలకు విస్తరింపచేశారు. పిల్లల పుస్తకాలతో ఒక మోస్తరు లైబ్రరీని ఏర్పాటు చేశారామె. ఆ లైబ్రరీ పేరు ‘అజ్జిస్ లెర్నింగ్ సెంటర్’. అజ్జి లైబ్రరీకి జ్యోతిపాళయం నుంచి మాత్రమే కాదు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు కూడా వారానికోసారి వచ్చి పుస్తకాలు తీసుకెళ్లి చదువుకుంటున్నారు. ఆమె సర్వీస్‌ను చూసిన వాళ్లు ప్రశంసలతో సరిపుచ్చకుండా లైబ్రరీ విస్తరణ కోసం విరాళాలిస్తున్నారు. దాంతో ఆమె కంప్యూటర్ ట్రైనింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. అజ్జి లెర్నింగ్ సెంటర్‌ను పిల్లల సమగ్ర వికాసానికి దోహదం చేసే వేదికగా మలచాలనేదే తన కోరిక అంటారామె. ఇలాంటి వాళ్లు ఊరికొక్కరు ఉన్నా చాలు. బడికి దూరమైన అమ్మాయిల జీవితాలు అక్షరాలా బాగుపడతాయి. చదవండి: Health Tips: చిగుళ్లనుంచి తరచూ రక్తం వస్తుందా? ఇవి తిన్నారంటే.. -
శభాష్ సంర్పంచ్.. ప్రథమ పౌరుడి ‘పాఠ’వం
అశ్వారావుపేట రూరల్: తన చదువుకు సార్థకత చేకూరుస్తూ ఆ ఊరి ప్రథమ పౌరుడైన సర్పంచ్ విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వేదాంతపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోని శివశంకర ప్రసాద్ బీఈడీ పూర్తిచేశాడు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీకి ముందు మండలంలోని పాత నారంవారిగూడెం గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యా వలంటీర్‌గా పనిచేశాడు. రాజకీయాల మీద ఆసక్తితో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాడు. గెలిచాక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ విద్యకు దూరమవుతున్నట్లు ప్రసాద్ గుర్తించాడు. గ్రామసభ ఏర్పాటుచేసి విద్యార్థులందరికీ రాత్రి పూట ఉచితంగా ట్యూషన్ చెబుతానని, పిల్లలను క్రమం తప్పకుండా పంపించాలని తల్లిదండ్రులకు సూచించాడు. సర్పంచే ఉచితంగా ట్యూషన్ చెప్తాననడంతో తల్లిదండ్రులు పిల్లలను పంపించడం ఆరంభించారు. కరోనా కాలంలో ప్రారంభించినా... పాఠశాలలు తెరిచాక కూడా ట్యూషన్ కొనసాగుతున్నది. గ్రామ చిన్నారులకు నేటి పోటీ ప్రపంచానికి తగినట్లు తీర్చిదిద్దాలని డిజిటల్ తరగతులు అందుబాటులోకి తెచ్చాడు. ట్యూషన్‌కు వస్తున్న పిల్లల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులే అధికంగా ఉన్నారు. వీరికోసం రూ.25వేల సొంత ఖర్చుతో ఎల్ఈడీ టీవీని కొనుగోలు చేశాడు. దీని ద్వారా విద్యార్థులకు డిజిటల్ బోధన సైతం అందిస్తున్నాడు. ‘శ్రీ గంగానమ్మ తల్లి పాఠశాల’గా... మొదట్లో సర్పంచ్ ఒక్కరే పిల్లలకు ట్యూషన్ చెప్పగా, ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన బీఈడీ, టీటీసీ పూర్తిచేసిన నాగలక్ష్మి కూడా ట్యూషన్ చెప్పేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. అదే గ్రామంలోని వనంలో కొలువుదీరిన శ్రీ గంగానమ్మ తల్లి అమ్మవారి పేరుతో ‘శ్రీ గంగానమ్మ తల్లి పాఠశాల’గా నామకరణం కూడా చేశారు. -
వేదనల చీకటిలో విద్యా కాంతులు
సాక్షి,కాకినాడ: కోవిడ్ భయానక వేళ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏనాడూ బయటికైనా రాని ఇంటి మహాలక్ష్మి.. భవిత కోసం, బిడ్డల బాగు కోసం వేదన నిండిన హృదయంతో తల్లడిల్లుతోంది. అటువంటి ఎందరో తల్లుల ఆక్రందనలు ‘శ్రీయువసేన’ గుండెను తాకాయి. బిడ్డ భవిత కోసం వేదన పడే ప్రతి తల్లి గుండె చప్పుడుకూ శ్రీ యువసేన సేవా సంఘం అండగా నిలిచింది. వారి పిల్లల చదువులకు సంఘం చైర్మన్ బొల్లం సతీష్ భరోసా కల్పించారు. దాతల తలుపు తట్టారు. వారి సహాయంతో జిల్లా వ్యాప్తంగా 20 మంది పిల్లల భవితకు భద్రత కల్పించారు. వారి చదువుకు భరోసా దక్కింది. బాధితులతో సమావేశం తండ్రిని కోల్పోయిన బాలలు, వారి తల్లులతో శనివారం కాకినాడ భానుగుడి కూడలిలోని లా వెంటో ఫంక్షన్ హాలులో శ్రీ యువసేన సేవా సంఘం ఛైర్మన్ బొల్లం సతీష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో సతీష్ మాట్లాడుతూ బాధిత బిడ్డల విద్యకు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తులు హేమంత్ కుమార్, శశాంక్ అగర్వాల్, ఆయుష్ అగర్వాల్, ఖుషి అగర్వాల్, కొమ్మిశెట్టి హర్ష ముందుకొచ్చారని తెలిపారు. దాతల తరఫున హేమంత్ కుమార్ మాట్లాడారు. శ్రీయువసేన సేవా కార్యక్రమాల్లో మమేకమై పేద పిల్లల భవిత నిర్మాణానికి భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను వారి తల్లుల అభీష్టం మేరకు ఎక్కడ కావాలంటే అక్కడే చదివిస్తామని హామీ ఇచ్చారు. జీవితంలో స్థిరపడే వరకూ ఏం చదవాలన్నా చదివిస్తామని తెలిపారు. -
కరోనా వేళ ఉచితంగా పాఠాలు.. ఇంటినే బడిగా మార్చి..
సాక్షి, చింతలమానెపల్లి(కరీంనగర్): అన్నిదానాల్లోకెళ్లా విద్యాదానం గొప్పది అంటారు.. జ్ఞానం సంపాదించడమే కాదు.. జ్ఞానం పంచాలి అనేది పెద్దల మాట. ఈ మాటలు నిజం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు చింతలమానెపల్లి మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన తూమోజు వెంకటేశ్. కరోనా కారణంగా విద్యార్థులు చదువులో వెనకబడకుండా ఉచితంగా విద్యనేర్పుతూ అందరి చేత ప్రశంసలు పొందుతున్నాడు. ఇంజినీరింగ్ చదువుకుని.. ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన వెంకటేష్‌కు ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. దీనికి తోడు అనారోగ్యానికి గురికావడంతో 2019లో స్వగ్రామానికి తిరిగి వచ్చి పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. ఇంటినే బడిగా మార్చి.. 2020లో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో పాఠశాలలు మూతబడ్డాయి. ఈ క్రమంలో విద్యార్థులు చదువుకోవడం మానేసి వీధుల్లో తిరుగుతుండడం గమనించాడు. గ్రామానికి చెందిన పలువురు యువకుల సహకారంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాడు. గ్రామంలో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో విద్యార్థులకు స్థానిక పాఠశాలలో చదువు చెప్పేందుకు సిద్ధమయ్యాడు. సుమారు 80మంది విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధించాడు. సొంతఖర్చులతో పరీక్ష పత్రాలు, బోధనా సామగ్రిని కొనుగోలు చేశాడు. పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ.. ఈ ఏడాదిసైతం కరోనా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వం తిరిగి లాక్డౌన్ విధించింది. వేసవి సెలవుల కారణంగా పాఠశాలలు మూసివేశారు. 5, ఆపై తరగతుల విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చేరేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష వివరాలు తెలియజేసి తాను ఉచితంగా బోధిస్తానన్నాడు. నెల రోజులుగా విద్యార్థులకు గురుకుల సిలబస్‌ను బోధించడంతో పాటు మోడల్ పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం 13 మంది విద్యార్థులను గురుకుల ప్రవేశ పరీక్షకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు. వీరితో పాటు గ్రామంలోని 25 మంది ఇతర విద్యార్థులకు అవసరమైన మెలకువలు, ప్రావీణ్యాన్ని మెరుగుపర్చుకునే పాఠాలు బోధిస్తున్నాడు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో తండ్రి జనార్దన్ ఇచ్చిన స్ఫూర్తితోనే విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తున్నట్లు వెంకటేశ్ పేర్కొంటున్నాడు. జనార్దన్ గత ప్రభుత్వాలు నిర్వహించిన అనియత విద్య, యువజన విద్య లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని, తండ్రి బోధించిన పాఠాలతోనే తాను గురుకుల ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇందారం గురుకుల పాఠశాలలో చదువుకున్నట్లు చెబుతున్నాడు. రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేస్తానని ఆయన వెల్లడిస్తున్నాడు. వెంకటేశ్ వద్ద విద్యాబుద్దులు నేర్చుకుంటున్న విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. రానున్న ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు విద్యార్థులు తెలుపుతున్నారు. చదవండి: లాక్డౌన్ ఉల్లంఘనులకు ‘తెలంగాణ’ గుడ్‌న్యూస్ -
Reliance: కోవిడ్‌తో మరణించిన ఉద్యోగి కుటుంబానికి 5 ఏళ్ల జీతం.. ఇంకా
కరోనా కష్టకాలంలో తమ ఉద్యోగులను ఆదుకునేందుకు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మంచి నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఐదేళ్లపాటు ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చింది. అంతేకాదు వాళ్ల పిల్లల చదువుల బాధ్యతలను కూడా తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ముంబై: ఉద్యోగుల సామాజిక భద్రత కోసం రిలయన్స్ ఒక అడుగు ముందుకేసింది. COVID-19 తో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబానికి 5 సంవత్సరాలు పూర్తి వేతనం ఇవ్వడంతో పాటు వారి పిల్లలకు విద్య అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. అలాగే ఆఫ్ రోల్స్ ఎంప్లాయిల కుటుంబాలకు పదిలక్షల సాయం అందించాలని నిర్ణయించినట్లు చెబుతోంది. అలాగే సాయం అందించే విషయంలో బాధిత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని, సాయం త్వరగతిన అందుతుందని హామీ ఇచ్చింది. ఈ మేరకు కొన్ని జాతీయ వెబ్‌సైట్స్ ఈ సాయం గురించి ప్రముఖంగా కథనాలు ప్రచురించాయి. కాగా, తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో #WeappreciateReliance, #thanxReliance హ్యాష్ ట్యాగులతో రిలయన్స్ నిర్ణయాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. కోవిడ్ లీవులు.. సాయం ఇక కోవిడ్ బారిన పడ్డ ఎంప్లాయిస్, వాళ్ల కుటుంబాలు పూర్తిగా కోలుకునేంతవరకు జీతాలతో కూడిన సెలవుల్ని రిలయన్స్ మంజూరు చేసింది. అలాగే కరోనాతో చనిపోయిన ఉద్యోగి భార్య, పేరెంట్స్, పిల్లల ఆస్పత్రి ఖర్చుల కోసం 100 శాతం ప్రీమియం చెల్లింపును రిలయన్సే భరించాలని నిర్ణయించుకుంది. ఇక చనిపోయిన ఉద్యోగి పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ వరకు దేశంలో ఏ ఇనిస్టిట్యూట్‌లోనైనా 100 శాతం ట్యూషన్ ఫీజు, హాస్టల్ సౌకర్యానికి అవసరమయ్యే ఖర్చులనూ రిలయన్స్ ఫౌండేషన్ అందించబోతోంది. ‘‘మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. పోరాట పటిమను ఆపొద్దు. అందరం కలిసి కట్టుగా పోరాడదాం. మంచి రోజులు వచ్చేవరకు మన తోటి ఉద్యోగుల కుటుంబాలకు అవసరమైన ధైర్యం అందాలని ఆ దేవుడ్ని ప్రార్థిద్దాం. చేయూత నిద్దాం. జాగ్రత్తగా ఉండడండి’ అంటూ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తన ప్రకటన రిలీజ్ చేశారు. -
స్కాట్లాండ్ ఓకే చెప్పింది
ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక చట్టం తెచ్చిన ఘనతను స్కాట్లాండ్ దక్కించుకుంది. బిల్లు చట్టం కాగానే దేశవ్యాప్తంగా మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా లభిస్తాయి. ఉచిత విద్యకు, ఉచిత ఆరోగ్య భద్రతకు బిల్లు తెచ్చినంత సులభంగా ఉండదు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేసే బిల్లుకు ఆమోదం లభించడం. ‘అవసరమా?’ అనే ప్రశ్న మొదటే పురుషుల నుంచి వస్తుంది. ఆ తర్వాత ప్రతిపక్షం నుంచి వస్తుంది. తిండికి లేదా? పెడదాం. చదువుకోవాలని ఉందా? చదివిద్దాం. అనారోగ్యం వస్తే వైద్య ఖర్చులకు డబ్బుల్లేవా? ఉచితంగా వైద్యం చేయిద్దాం. కానీ ఇదేంటి! శానిటరీ న్యాప్కిన్లను, టాంపన్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం.. అని రెండేళ్లుగా ‘పీరియడ్ ప్రాడక్ట్స్ (ఫ్రీ ప్రొవిజన్) చట్టం’ బిల్లుకు స్కాట్లాండ్ పార్లమెంటులో విపక్ష సభ్యులు అభ్యంతరం చెబుతూ వస్తున్నారు. అనుకూలంగా ఓటేయకుండా బిల్లును ఆపుతున్నారు. ఎట్టకేలకు.. ఏడాదికి కనీసం 86 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రభుత్వంపై మోపే ‘పీరియడ్ పావర్టీ బిల్లు’కు మంగళవారం నాడు ఏకగ్రీవ ఆమోదం లభించింది. దాంతో ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక చట్టం తెచ్చిన ఘనతను స్కాట్లాండ్ దక్కించుకుంది. అన్ని పేదరికాల మాదిరిగానే ప్యాడ్స్‌ని కొనలేని పేదరికం కూడా ఉంటుందని అంటూ ఈ బిల్లుకు ఊపిరిపోసి, బిల్లు సాధనకు ఉద్యమరూపం తెచ్చి, సభ ఆమోదం పొందగలిగేవరకు ఆవిశ్రాంతంగా పోరాటం జరిపిన మోనికా లెనన్ (39) ఇప్పుడు ఆ దేశంలోని మహిళల మన్ననలను పొందుతున్నారు. బిల్లు ముసాయిదాలో పలుమార్లు కనిపించే ‘పీరియడ్ పావర్టీ’ అనే మాటను కూడా తనే సృష్టించిన మోనికా 2016 నుంచీ స్కాటిష్ లేబర్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆమె స్త్రీవాది, శాకాహారి. బిల్లు చట్టం రూపం ధరించగానే దేశవ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు, విద్యాసంస్థలు, యూత్ క్లబ్బులు, ఫార్మసీ దుకాణాలన్నింటిలోనూ మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్, టాంపన్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. ‘‘ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను’’ అని స్కాట్లాండ్ మహిళా ప్రధాని (ఫస్ట్ మినిస్టర్ అంటారు) నికోలా స్టురియన్ ట్వీట్ చేస్తూ, ‘మహిళలకు, బాలికలకు అవసరమైన ఒక ముఖ్యమైన ప్రభుత్వ విధానంగా’ ఈ చట్టాన్ని అభివర్ణించారు. అరకోటికి పైగా జనాభా వున్న స్కాట్లాండ్ యు.కె. కిందికి వస్తుంది. ‘ప్లాన్ ఇంటర్నేషనల్ యుకె’ అనే సంస్థ 2017 లో జరిపిన ఒక సర్వేలో యు.కె.లోని ప్రతి 10 మంది బాలికల్లో ఒకరు ప్యాడ్స్ కొనే స్థితిలో లేనివారే. అంతేకాదు, యు.కె.లో 14–21 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికల్లో సగం మంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్యాడ్స్ కొనలేకపోతున్నవారే. -
ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% సీట్లు
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రత్యేక కేటగిరీ పాఠశాలల్లో 25 శాతం సీట్లను బలహీన వర్గాల వారి పిల్లలకు కేటాయించాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. బాలలకు ఉచిత, నిర్బంధ విద్య చట్టం–2010 ప్రకారం..ప్రాథమికోన్నత స్థాయి విద్య 6–14 ఏళ్ల మధ్య పిల్లలందరి ప్రాథమిక హక్కని తెలిపింది. అదేవిధంగా బౌన్సర్ల నియమించుకుని బలవంతంగా రుణ వసూళ్లు చేపట్టే అధికారం ఏ బ్యాంకుకూ లేదని తెలిపింది. మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ సోమవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. అన్ని ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, స్పెషల్ కేటగిరీ పాఠశాలల్లో ఒకటి, అంతకంటే తక్కువ తరగతులకు చేపట్టే ప్రవేశాల్లో ఆ తరగతిలోని కనీసం 25 శాతం సీట్లను బలహీన, వెనుకబడిన వర్గాల వారి పిల్లలకు ఇవ్వాలి. ఆ తరగతి పూర్తయ్యే వరకు వారికి ఉచితంగా విద్య అందించాలి’ అని ఆయన కోరారు. ‘ఆ చిన్నారుల కయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రం నిర్ణయించిన ఫీజు ప్రకారం, లేదా వాస్తవంగా ఒక్కో చిన్నారి నుంచి వసూలు చేసే ఫీజు.. ఏది తక్కువైతే అందుకు సరిసమానమైన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది’ అని తెలిపారు. ప్రభుత్వం నుంచి భూమి, వసతి, పరికరాలను ఉచితంగా గానీ లేదా తక్కువ ధరకుగానీ పొంది 25 శాతం మంది చిన్నారులకు రిజర్వేషన్ ప్రకారం ఉచిత విద్య అందిస్తున్న పాఠశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదని తెలిపారు. బౌన్సర్లతో వసూళ్లు వద్దు: బలవంతంగా రుణాలను వసూలు చేసుకునేందుకు గాను ఏ బ్యాంక్‌కు కూడా బౌన్సర్లను నియమించుకునే అధికారం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు. ‘ఆమోదించిన మార్గదర్శకాల మేరకే రుణ వసూళ్లు చేపట్టాలి. రుణ గ్రహీతపై దౌర్జన్యం చేయడం, ఇబ్బందులు పెట్టడాన్ని ఆర్బీఐ నిషేధించింది. పోలీసుల ధ్రువీకరణ, అవసరమైన ఇతర అర్హతలు పొందిన తర్వాత మాత్రమే బ్యాంకులు రికవరీ ఏజెంట్లను నియమించుకునేందుకు ఆర్బీఐ వీలు కల్పించింది’ అని తెలిపారు. టీచర్స్ కోటా బిల్లుకు ఆమోదం కేంద్ర విద్యాసంస్థలు (టీచర్స్ కేడర్ బిల్లు–2019) బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. దేశవ్యాప్తంగా 41 సెంట్రల్ యూనివర్సిటీల్లో 8వేల పోస్టుల భర్తీకి అమలయ్యే రిజర్వేషన్ల విషయంలో డిపార్టుమెంట్‌ను యూనిట్‌ను కాకుండా యూనివర్సిటీని యూనిట్‌గా పరిగణించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం తెచ్చిన చట్టం కూడా అమలవుతుంది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ఆర్డినెన్స్ స్థానంలో అమలవుతుంది. -
కార్పొరేట్ దోపిడీకి కళ్లెం
పేద, మధ్య తరగతి పిల్ల లకు ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి బృహత్తర ప్రణాళిక రూపొందించారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్య కాస్ట్లీగా మారింది. పిల్లల చదువుల కోసం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల్లో ఫీజులు చెల్లించలేక ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఉద్యోగం వస్తే పిల్ల లు సంతోషంగా బతుకుతారన్న తల్లిదండ్రుల ఆశను చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు. మరో వైపు క్రమేణ ప్రభుత్వ విద్యా సంస్థలను మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే రేషన్లైజేషన్ పేరుతో జిల్లాలో 160కు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కార్పొరేట్ విద్య వ్యవస్థ దోపిడీకి కళ్లెం పడేలా చట్టం తేనున్నారు. నెల్లూరు (టౌన్): కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఎల్కేజీకి రూ.25 వేల నుంచి ఇంటర్‌కు రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, రవీంద్రభారతి తదితర విద్యా సంస్థల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్‌కు కళాశాలను బట్టి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు దండుకుంటున్నారు. ఫీజులను నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు కొమ్ము కాస్తుంది. ఎక్కువ సంస్థలు మంత్రి నారాయణ, శ్రీచైతన్యకు చెందినవే కావడంతో ప్రభుత్వం వారికి బహిరంగంగానే మద్దతు తెలుపుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులను రెగ్యులేట్ చేసేలా కమిషన్ తీసుకవస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆ కమిషన్ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేసే విధంగా బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. దీనిపై పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ విద్య వ్యవస్థపై మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తున్నారు. కార్పొరేట్ దోపిడీ ఇలా.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,057 కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటితో పాటు 160కు పైగా ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో కార్పొరేట్ పాఠశాలల్లో 1,64,482 మంది విద్యార్థులు చదువుతుండగా, కళాశాలల్లో 18 వేల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 8 వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎల్కేజీకి రూ.25 వేల నుంచి రూ. 75 వేల వరకు వసూలు చేస్తున్నారు. అదే 10వ తరగతికి రూ.1.50 లక్షల వరకు తీసుకుంటున్నారు. ఇంటర్మీడియట్‌కు ఐఐటీ, నీట్ల పేరుతో రూ.4 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారు. ఇంజినీరింగ్‌లో కళాశాల స్ధాయిని బట్టి రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు తీసుకుంటున్నారు. ఎవరైనా ఫీజులపై ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. మరో వైపు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తుంది. గత ఏడాది రేషన్లైజేషన్ పేరుతో జిల్లా వ్యాప్తంగా 160కు పైగా స్కూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న టీచరు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో చదువుకు కుంటుపడుతుంది. సమయానికి పుస్తకాలు ఇవ్వకపోవడం, మధ్యాహ్న భోజన పథకానికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్ధితి ఆధ్వానంగా మారింది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో వైపు పిల్లలను బడికి పంపిస్తే ఒక్కో పిల్లాడికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కార్పొరేట్ తరహాలో సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు టీచర్ పోస్టుల భర్తీ, పుస్తకాలు బడితెరిచే సమయానికి సిద్ధం చేసి ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. -
అధికారంలోకి వస్తే ‘చదువుల సావిత్రి’
రఘునాథపల్లి వరంగల్ : బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే చదువుల సావిత్రి పథకం ద్వారా అన్ని వర్గాల పిల్లలకు, విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో బీఎల్ఎఫ్ మండల చైర్మన్ ముక్క ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగం వ్యాపారమయమవడంతో పేద, మద్య తరగతి వర్గాలకు ఉన్నత, నాణ్యమైన విద్య దూరమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు ఉపయుక్తంగా ఉండాలే తప్పా వారి ముసుగులో ఆర్థిక స్థితిమంతులకు ప్రయోజనం చేకూర్చడం భావ్యం కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా పేదల బతుకులు మారలేదన్నారు. రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తీరని అన్యాయం జరిగిందన్నారు. రైతుబందుతో రైతులకు ఒరిగిందేమి లేదని మార్కెట్లో దళారీ దోపిడితో వందల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ప్రదానిమోదీ దేశ ప్రజలను మోసం చేశారన్నారు. తాము అధికారంలోకి వస్తే పది ఎకరాలకంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు, రూ.5లకే భోజనం, ప్రతి పంటకు గిట్టుబాటు ధర, దళారీ వ్యవస్థ నిర్మూలన, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. ప్రజలందరికి సమన్యాయం చేసే బహుజన తెలంగాణ సాదించేందుకు రానున్న ఎన్నికల్లో బీఎల్ఎఫ్ను గెలిపించాలని ఆయన పిలుపు నిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ నాగయ్య, నాయకులు కనకారెడ్డి, ఉడుత రవి, గోపి, కావటి యాదగిరి, పొదల నాగరాజు, బీమగోని చంద్రయ్య, ఎడ్ల బాలమ్మ, కాసాని పుల్లయ్య, పోరెడ్డి రాఘవరెడ్డి, దావీదు, మంచాల మల్లేష్, గంగపురం మహేందర్, నర్సింహం, మారపాక నవ్య, రాజు, రమేష్, సుదాకర్, శాగ యాదగిరి, వెంకటేశ్వర్లు, వారాల రాజు, గోన య్య, యాదగిరి, పరుశరాములు పాల్గొన్నారు. -
బధిర విద్యార్థులకు ఉచిత విద్య
ఖమ్మం మామిళ్లగూడెం : మూగ, చెవిటి విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు హాస్టల్ వసతి కల్పించనున్నట్లు ఐడీఎల్ స్కూల్ ఫర్ డిజబుల్డ్(ఐఐసీడీ) కార్యదర్శి తబ్రేజ్ తెలిపారు. మంగళవారం బధిరులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లోని అజంపురాలో గల పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు మూగ, చెవిటి, మానసిక వికలాంగులకు ఉచిత విద్య, హస్టల్ వసతితో పాటు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం అందిస్తామన్నారు. కుల మతాలకు అతీతంగా ఈ పాఠశాల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. భాషలో ప్రావీణ్యులైన అధ్యాపకుల పర్యవేక్షణలో మూగభాషతో పాటు కంప్యూటర్ పాఠాలు కూడా బోధిస్తారని అన్నారు. ఇతర వివరాలకు సెల్ నెం.9059619641కు ఫోన్ చేయాలని కోరారు. -
మరుపురాని మహానేత
-
ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్: కార్పొరేట్ కళాశాలల విద్యా పథకంలో భాగంగా 2018–19 విద్యా సంవత్సరానికి కార్పొరేట్ జూనియర్ కళాశాలల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు లక్ష్మానాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో జీపీఏ 7, ఆపైన పాయింట్లు వచ్చిన విద్యార్థులు దీనికి అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఎస్సీ బాలికలకు 62, బాలురకు 41, ఎస్టీ బాలికలకు 18, బాలురకు 11, బీసీ బాలికలకు 34, బాలురకు 22, బీసీ–సీ బాలికలకు 11, బాలురకు 7, ఈబీసీ బాలికలకు 7, బాలురకు 4. మైనార్టీ బాలికలకు 9, బాలురకు 6, దివ్యాంగ విద్యార్థులకు 7 సీట్లు ఉన్నాయన్నారు. వెబ్సైట్ ద్వారా ఈనెల 6లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. -
వైఎస్ జగన్‌ను కదిలించిన చిన్నారి ప్రశ్న
-
అడవిబిడ్డలకు వేగుచుక్క
ఏటా రూ.వేల కోట్ల బడ్జెట్ వెచ్చించి, ప్రణాళికలు రచించే కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని పనిని ఓ వ్యక్తి తన పాతికేళ్ల కషితో సాధిస్తున్నారు. సమాజపు అట్టడుగున నిరాదరణకు గురవుతున్న గిరిజన జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘విద్య’గొప్ప పనిముట్టని భావించి, వారికా అవకాశం కల్పించడం ద్వారా హుందాగా, సమానత్వంతో, సాధికారతతో ఇతరులతో సమానంగా జీవించేలా వారి మానవ హక్కుల్ని పరిరక్షిస్తున్నారు. జీవించే కనీస మానవ హక్కును అనుభవించడానికి విద్య పొందే అవకాశం లభించడం, లభించకపోవడం మధ్య వ్యత్యాసాన్ని ఎత్తిచూపిస్తున్న విజయగాథ ఇది. అంతర్జాతీయ మానవహక్కుల దినం సందర్భంగా.. ♦ ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా దెనువా గ్రామానికి చెందిన రజనీకాంత్ నాయక్‌కు తండ్రి లేడు.. తల్లి దినకూలీ.. సోదరి అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది.. ఇంట్లో తిండికీ కష్టమైంది.. కానీ ఐఐటీలో సీటు సాధించడానికి ఇవేవీ అవరోధాలు కాలేదు.. కారణం.. కేఐఎస్సెస్ (కిస్). ♦ కడు పేదరికం రోజూ కన్నీళ్లు పెట్టిస్తోంది. బతికే ఆశను గృహహింస సన్నగిల్లింపజేస్తోంది. కానీ కిస్ ద్వారా తండా బడి డ్రాపవుట్, సుమిత్రా నాయక్ బతుకు దిశ మారింది. 2008లో కిస్‌లో చేరిన సుమిత్రా.. రగ్బీపై అనురక్తి పెంచుకుని, అక్కడి క్రీడాసౌకర్యాల్ని వినియోగించుకుని 2014లో 13 ఏళ్ల లోపు పిల్లల భారత రగ్బీ జట్టుకు నాయకత్వం వహించింది. లండన్ అంతర్జాతీయ పోటీల్లో దేశాన్ని విజయతీరాలకు చేర్చింది. గతేడాది ప్యారిస్‌లో జరిగిన ప్రపంచ 19 ఏళ్లలోపు పిల్లల రగ్బీ పోటీల్లో భారత జట్టుకు నేతృత్వం వహించింది. ప్రస్తుతం భారత రగ్బీ జట్టుకు ఆమే కెప్టెన్. 2017 అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికీ సుమిత్రా నామినేటయింది. ♦ పీటీ ఉష తర్వాత 36 ఏళ్లకు గానీ దేశానికి చెందిన మరో అథ్లెట్ ఒలింపిక్ (స్వల్ప దూరపు పరుగు) పోటీలకు ఎంపికవలేదు. గతేడాది ‘రియో ఒలింపిక్’కు ఎంపికవడం ద్వారా ‘కిస్’కు చెందిన 20 ఏళ్ల యువతి దుతీ చంద్ ఆ ఘనత సాధించింది. పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చి, పట్టుదలతో అవకాశాలను అందిపుచ్చుకున్న ఆమె అంకితభావాన్ని దేశం ఎంతగానో ప్రశంసించింది. ♦ ఈ ఏడాది 20 మంది కేఐఎస్సెస్(కిస్) విద్యార్థులు చైనాలోని షాంఘై విశ్వవిద్యాలయంలో మూడేళ్ల ఉచిత ఉన్నత విద్య, తదనంతరం బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగావకాశాల కోసం ఎంపికయ్యారు. ఐఐటీలు, ఐఐఎంలు, స్వదేశీ–విదేశీ వర్సిటీలు, ఇతర కీలక సంస్థల్లో ఇంకెందరో ప్రవేశాలు పొందుతున్నారు. ♦ ఓ చిన్న ఆలోచనతో మొదలైన ఒక ఔత్సాహికుని కృషి–తపన సంస్థగా, కడకొక సామాజిక విప్లవంగా మారింది’అని ఆమెరికా ఆంథ్రపాలజీ పుస్తకాల్లో కేఐఎస్సెస్ కథను సిలబస్‌గా రాశారు. ఆకాశమే హద్దుగా.. ఆకాశమే హద్దుగా పైపైకి ఎదుగుతున్న 27,000 మంది కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కేఐఎస్సెస్ (కిస్) విద్యార్థులంతా అత్యంత పేదరికం నుంచి వచ్చిన గిరిజనులే! కేజీ నుంచి పీజీ వరకు రూపాయి చెల్లించకుండా నాణ్యత గల విద్యను వీరు పొందుతున్నారు. ఒకసారి చేరితే.. ఉన్నత విద్యాకోర్సుల్లోకో, ఉపాధితోనో బయటకు వస్తారేగాని డ్రాపవుట్స్ ఉండరు. విద్య మాత్రమే కాదు.. బట్టలు, భోజనం, వసతి, వైద్యం వీరికి ఉచితంగా లభిస్తోంది. కేఐఎస్సెస్లో 60 శాతం మంది అమ్మాయిలే! అన్నిటికీ మించి.. ఆ 27,000 మందిని ఏ వేళ చూసినా వయసుతో నిమిత్తం లేకుండా ఓ ఉత్సాహం, ఓ దర్పం కలగలిసిన వెలుగు వారి ముఖాల్లో తారాడుతుంది. కేఐఎస్సెస్ నిర్మాణపు మూలాల్లోనే అటువంటి శక్తి ఏదో దాగుందనిపిస్తుంది. క్రమంగా ఎదిగిన ఈ సంస్థ.. ఐక్యరాజ్య సమితి (యూఎన్) ప్రత్యేక సంప్రదింపుల హోదా పొందడమే కాకుండా కేంద్రం నుంచి ఈ ఏడాదే డీమ్డ్ యూనివర్సిటీ హోదా సంపాదించింది. సదాచరణతోనే.. ‘సామాజిక పరివర్తనకు, సామాన్యుల సాధికారతకు విద్య ఓ ఉపకరణం’అనే నినాదంతో ప్రారంభించి, ఆ సత్యాన్ని అక్షరాలా నిరూపిస్తున్నాడు అచ్యుత్ సామంత. యూఎన్ నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) దిశలో ఎన్నో పర్యావరణ అనుకూల విధానాల్ని కిస్ ప్రాంగణంలో పాటిస్తున్నారు. బయోగ్యాస్, స్టీమ్ కిచెన్, సౌర విద్యుత్, హరిత వృద్ధి, చేతి వృత్తులు, ఉపాధి శిక్షణ, వస్తోత్పత్తి.. ఇలా ఎన్నెన్నో! ప్రాథమిక స్థాయి విద్యా బోధనలో మాతృ భాషకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. గిరిజన భాషల్లో ఉన్న 32 రకాలు/మాండలికాలు బోధించే సిబ్బంది ఈ సంస్థలో ఉన్నారు. పిల్లల్ని బెదరగొట్టరు. ప్రాథమిక స్థాయి నుంచి ఎదిగే క్రమంలోనే వారికి తల్లి భాష నుంచి ఉమ్మడి గిరిజన భాష, తదనంతర దశలో ఒడియా, హిందీ, ఇంగ్లి్లష్ వంటి ఇతర భాషల వైపు మళ్లించేలా సిలబస్ రూపొందించారు. కిస్, కిట్.. రెండింటికీ డీమ్డ్ హోదా.. దాదాపు 25 శాతం గిరిజన జనాభా ఉన్న ఒడిశాలో అత్యధిక గిరిజన కుటుంబాల్లో పేదరికం తాండవిస్తోంది. కనీస జీవన పరిస్థితులుండవు. ఆకలి, అనారోగ్యం, నిరక్షరాస్యత అతి సాధారణ విషయాలిక్కడ. ‘స్వయంగా వాటిని అనుభవించిన నేను, వాటి నిర్మూలనకు ‘విద్య’మాత్రమే గొప్ప ఉపకరణం అని మనసారా నమ్మాను, అది అందించే కృషి చేస్తున్నాను, ఇదంతా ఈశ్వరేచ్ఛ’అంటాడు అచ్యుత్ సామంత. ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) ప్రొఫెసర్ అయిన సామంత.. 1992లో 125 మందితో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, కేఐఐటీ (కిట్)ను ప్రారంభించారు. ఇందులో ఎవరైనా ఫీజు చెల్లించి చేరొచ్చు. మరుసటి సంవత్సరం 1993లో గిరిజనులకు మాత్రమే ఉచిత ప్రవేశమున్న ‘కిస్’ను ప్రారంభించారు. ‘కిట్’, ‘కిస్’రెండింటికీ ఇప్పుడు డీమ్డ్ వర్సిటీ హోదా లభించింది. రెండు చోట్లా దాదాపు సమాన సంఖ్యలో (27,000) విద్యార్థులున్నారు. కిట్ నిధులు కిస్కు.. ఇంజనీరింగ్, మెడికల్‌తోపాటు పలు వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్న ‘కిట్’లో ఉన్నత ప్రమాణాల దృష్ట్యా ప్రవేశాలకు ఎంతో డిమాండ్ ఉంది. ఫీజులూ అదే స్థాయిలో ఉంటాయి. ‘కిట్’ లాభాలను ‘కిస్’నిర్వహణకు మళ్లిస్తూ, బోధన–బోధనేతర సిబ్బంది (3–7 శాతం వరకు స్వచ్ఛంగా) ఇచ్చే విరాళాలను, ఇతర వనరుల నుంచి లభించే నిధులతో ‘కిస్’ను నిర్వహిస్తున్నారు. ఏటా రూ.85 నుంచి రూ.95 కోట్ల నిర్వహణ వ్యయం ఉంటుందంటారు. ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన రూ.500 కోట్ల రుణంలో సగానికిపైగా మొత్తాన్ని మౌలికవసతుల కల్పనకు వెచ్చించారు. యూఎన్తో పాటు వివిధ ప్రపంచ, జాతీయ స్థాయి కంపెనీలు సహకారం అందిస్తున్నాయి. ఉదాహరణకు.. టాటాస్టీల్ సహకారంతో రూ.4.4 కోట్లు వెచ్చించి 150 సీట్ల లైబ్రరీ ఏర్పాటు చేశారు. తన జీవితమే పాఠమంటాడు నాలుగేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాక తల్లి, తనతో పాటు మరో నలుగురు పిల్లలతో బతుకు పోరు ప్రారంభించిన సామంత.. చిన్నతనంలోనే కష్టాల కడలి ఈదాడు. వెక్కిరించే పేదరికాన్ని చేతుల కష్టంతో ఎదురించాడు. బాగా చదువుకున్నాడు. ప్రొఫెసరయ్యాడు. తన కర్తవ్యాన్ని విభిన్నంగా ఆలోచించాడు. ‘కిట్’‘కిస్’లను అభివృద్ధి పరచిన పాతికేళ్ల ప్రస్తానంలో ఎన్నెన్నో ఎత్తుపల్లాలు చూశానంటారు సామంత. ఈ క్రమంలో ‘బ్యూరోక్రసీతో నా ప్రయోగాలు’ఓ పుస్తకమవుతుందంటారు. పేదరికం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలి, అందుకు విద్య ఒక గొప్ప ఉపకరణం అంటారాయన. 2 లక్షల మంది గిరిజనుల్ని ‘కిస్’పరిధిలోకి తెచ్చే లక్ష్య సాధనకు ఒడిశాలోని 30 జిల్లాల్లో, కనీసం 10 రాష్ట్రాల్లో ‘కిస్’బ్రాంచీలు ఏర్పాటు చేస్తానంటారు. ప్రభుత్వాలు సహకరిస్తే గిరిజన జీవన స్థితిగతులు మార్చే సామాజిక పరివర్తన సుసాధ్యమంటారు. ఎంతో వినయంగా, నిబ్బరంగా ఉండే సామంత.. విజయ రహస్యం పూర్తిగా అర్థం కాలే దు. కానీ, ఇప్పటికీ సొంత బ్యాంక్ అకౌంట్ లేకుం డా, సొంత ఇల్లు లేకుండా, 2 గదుల అద్దె ఇంట్లో ఉంటూ అలవర్చుకున్న నిరాడంబర జీవన శైలి, నిస్వార్థ సేవ కూడా ప్రధాన కారణమే అనిపించింది. 10 వేల మంది దిగ్విజయంగా.. దేశ–విదేశాల అత్యున్నత హోదాల్లోని రాజ్యాంగాధినేతలు, నాయకులు, రాజనీతిజ్ఞులు, న్యాయమూర్తులు, సామాజిక వేత్తలతో పాటు 15 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు సందర్శించి, ప్రశంసించిన ఈ ప్రపంచ స్థాయి విద్యా సంస్థ మన పొరుగు రాష్ట్రమైన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉంది. ఒడిశాలోని అన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఈ యజ్ఞం పాతికేళ్లుగా సాగుతోంది. 62 గిరిజన ఉప (13 అతి ఆదిమ) జాతుల విద్యార్థులు ఇక్కడున్నారు. ఇప్పటివరకు 10,000 మంది ఈ విద్యాసంస్థ నుంచి దిగ్విజయంగా బయటకొచ్చారు. ఈ కృషికి కర్త, కర్మ, క్రియ అంతా.. 51 ఏళ్ల అవివాహితుడైన డాక్టర్ అచ్యుత్ సామంత. సంస్థ నిర్వహణ బాధ్యతలు ముఖ్యులకు అప్పగించి, ప్రస్తుతం ఫౌండర్ చైర్మన్ హోదాకే సామంత పరిమితమైనా అన్ని వ్యవహారాలూ ఆయన కనుసన్నల్లోనే సాగుతాయి. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఉచిత విద్య ప్రభుత్వ బాధ్యత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వాల బాధ్యత అని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు, ఉపాధ్యాయులు లేక ఎందరో విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ఇలా దేశంలో వందకు 52 మంది.. రాష్ట్రంలో 48 మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారని తెలి పారు. పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎప్పుడు మారుతుం దని ప్రశ్నించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన పీడీఎస్‌యూ 21వ రాష్ట్ర మహాసభలో ఆయన ప్రసంగించారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అక్షరాస్యతలో దేశంలోనే వెనుకబడి ఉందని, ఇది భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు మారాలంటే పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన విద్య అందుతుందని పిల్లల్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తే అక్కడ ర్యాంకుల వేటలో ఒత్తిడి తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లను గురుకులాలుగా తీర్చిదిద్ది పేదలందరికీ నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు. భవనాలపై ఉన్న మోజు విద్యారంగంపై ఏదీ? రాష్ట్ర ప్రభుత్వం భవనాల నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యం విద్యారంగానికి ఇవ్వ డం లేదని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయకుండా నిరుపేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ మాట్లాడుతూ.. కళాశాల, పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు బస్సు సౌకర్యాల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మహాసభల సందర్భంగా ఆర్అండ్బి అతిథి గృహం నుంచి జెడ్పీ మైదానం వరకు విద్యా ర్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల ఆటాపాట ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్, న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.రంగారావు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా 48 కేంద్రాల్లో ‘గ్యాట్’
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): గీతం విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెలలో ప్రవేశ ప్రకటన జారీ చేయనున్నట్లు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎం.ఎస్.ప్రసాదరావు వెల్లడించారు. గీతం వర్సిటీలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన అఖిల భారత స్థాయి గీతం అడ్మిషన్ టెస్ట్ (గ్యాట్)–2018 వివరాలను తెలియజేశారు. వర్సిటీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌లో 10 బీటెక్ కోర్సులకు, ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఆరు సంవత్సరాల డ్యూయల్ డిగ్రీ కోర్సులు (బీ.టెక్+ఎం.టెక్), 17ఎం.టెక్ కోర్సులకు, బీ.ఫార్మశీ, ఎం.ఫార్మశీ కోర్సులకు, ఐదేళ్ల బి.ఆర్క్ కోర్సుకు, రెండేళ్ల ఎం.ఆర్క్ కోర్సుకు గ్యాట్–2018 ప్రవేశ పరీక్షను అఖిల భారతస్థాయిలో దేశంలోని 48 పట్టణాలలో ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తోందన్నారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తులు దేశవ్యాప్తంగా అన్ని యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యాబ్యాంక్ శాఖలలో లభిస్తాయని వివరించారు. గీతం ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ www.gitam.edu ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులు వచ్చే ఏడాది మార్చి 26వ తేదీలోగా అందజేయాలన్నారు. ఏప్రిల్ 5 నుంచి గీతం వెబ్సైట్లో హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఏప్రిల్ 11 నుంచి 26 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రవేశ పరీక్ష పూర్తయిన వారం రోజుల తర్వాత ఫలితాలు వెల్లడిస్తామన్నారు. గీతం ప్రవేశ పరీక్షలో ఒకటి నుంచి 10 ర్యాంకర్లకు ఉచిత విద్య అందిస్తామని వీసీ చెప్పారు. 11 నుంచి 100 ర్యాంకు వరకు ఫీజులో 50శాతం రాయితీ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గ్యాట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను వీసీ ఆవిష్కరించారు. విలేకర్ల సమావేశంలో ప్రో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు, అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ కె.నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
-
కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
సాక్షి,బెంగళూరు:కర్ణాటక ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బాలికలకు ఉచిత విద్యను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు భారీ నిధులతో ఒక ప్రణాళికను కూడా సిద్దం చేసింది. దీని ప్రకారం ఒకటవ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంతవరకు బాలికలు ఉచితంగా విద్యాభ్యాసం చేసే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. 2018-2019 విద్యాసంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీని ద్వారా సుమారు 18 లక్షలమందికి లబ్ధి చేకూరనుందని అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో గ్రాడ్యుయేషన్ స్థాయికి రాష్ట్రంలోని మొత్తం బాలికలకు ఉచిత విద్యను అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి రూ.110 కోట్లు కేటాయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోకి రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాల్లోని దాదాపు 18లక్షల మంది విద్యార్థినులకు ఇది ఉపయోగపడనుందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి బసవరాజ్ రాయరెడ్డి ప్రకటించారు. అయితే పట్టణ, గ్రామీణ, ధనిక, పేద అనే విచక్షణ లేకుండా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఈ పథకం ప్రకారం ముందుగా ఫీజు చెల్లించి , అనంతరం ప్రభుత్వం నుంచి రీఎంబర్స్ చేసుకోవచ్చు. అయితే పరీక్ష ఫీజును ఈ పథకంనుంచి మినహాయించారు. ఈ పథకం అమలులో గందరగోళం లేదా దుర్వినియోగాన్ని నివారించడానికి, లబ్ధిదారులకు తిరిగి చెల్లించడం మంచిదని తాము భావించామని మంత్రి చెప్పారు. కాగా వచ్చే ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
ఏపీ, తెలంగాణకు నోటీసులు
ఉచిత విద్య అమలుకావడంలేదన్న పిల్‌పై స్పందించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఉచిత విద్య అందించాలని విద్యా హక్కు చట్టం చెబుతున్నా అమలు చేయడం లేదన్న కేసులో ఉభయ రాష్ట్రాలకూ హై కోర్టు నోటీసులు ఇచ్చింది. ఉచిత విద్యను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అమలు చేయక పోవడంపై విశాఖపట్నం న్యాయ విద్యార్థి తాండ యోగేశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగ నాథన్, జస్టిస్ టి.రజనీల ధర్మాసనం ప్రతివాదులైన ఏపీ, తెలంగాణ పాఠశాలల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశా లకు చెందిన మరో రెండు కేసులతో ఈ కేసును జత చేసి, అన్నింటినీ కలిపి విచారి స్తామని ధర్మాసనం తెలిపింది. -
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య
అనంతపురం రూరల్ : అనంతపురం రూరల్ మండల పరిధిలోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా డిగ్రీ విద్యతోపాటు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఆర్ఐటీ కళాశాల డైరెక్టర్ అరుణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈమేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మూడేళ్ల డిగ్రీతోపాటు ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కూడా ఇవ్వనున్నామన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు సెల్ : 9133308557లో సంప్రదించాలన్నారు. -
పేద రెడ్డి విద్యార్థులకు ఉచిత విద్య
– ‘పది’ టాపర్ల అభినందన సభలో విద్యాసంస్థల అధినేతలు కర్నూలు (అర్బన్): జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేందుకు తమ సహకారం అందజేస్తామని నగరంలోని పలు విద్యా సంస్థల అధినేతలు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం స్థానిక హర్ష రిజెన్సీలోని సమావేశ భవనంలో రెడ్ల యువజన సంక్షేమ సంఘం, రెడ్ల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షల్లో 9.5 నుంచి 10కి 10 పాయింట్లు సాధించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల అభినందన సభ జరిగింది. కార్యక్రమానికి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు కశిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కేవీఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత డా.కేవీ సుబ్బారెడ్డి, నారాయణ విద్యాసంస్థల సీఈఓ లింగేశ్వరరెడ్డి, ప్రతిభ స్కూల్ అధినేత అరుణాచలరెడ్డి, ఎన్ఎంఆర్ కళాశాల అధినేత మల్లికార్జునరెడ్డి, సాయియుక్త కళాశాల అధినేత భోగేంద్రనాథ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఆర్థికస్థోమత లేక పది తరువాత చదువును ఆపేస్తున్నారని, అలాంటి వారికి చేయూతనిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. జీ పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం 122 మంది విద్యార్థులను సన్మానించారు. రెడ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులకుర్తి నరసింహారెడ్డి, యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొనపాటి యల్లారెడ్డి, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు బిర్రు ప్రతాపరెడ్డి, శివసేన జిల్లా అధ్యక్షుడు తూముకుంట ప్రతాపరెడ్డి, నాయకులు మనోహర్‌రెడ్డి, హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'జీవిత పయనంలో కష్టమైనదే సరైన దారి'
-
ఎవరూ అధైర్యపడొద్దు
సిరిసిల్లలో చేనేత కార్మికుడి ఆత్మహత్యపై కేటీఆర్ ఆవేదన - మృతుడి కుటుంబానికి రూ.1.50 లక్షల సాయం.. డబుల్ బెడ్రూం ఇల్లు - కార్మికుల ఉపాధికి చర్యలు తీసుకుంటున్నాం సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలో చేనేత కార్మికుడు దోమల రమేశ్ అత్మహత్య పట్ల మంత్రి కె.తారక రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శిం చేందుకు చేనేత, టెక్స్టైల్స్ శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్‌ను సిరిసిల్లకు పంపించారు. మృతుడి కుటుంబానికి వీవర్స్ సొసైటీ నుంచి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం, డబుల్ బెడ్రూం ఇల్లు, పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కోసం ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి వస్త్రం కార్మికుల నుంచే... రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి వస్త్రాన్ని చేనేత, పవర్లూమ్ కార్మికుల నుంచే సమీకరించాలని సూత్రప్రా యంగా నిర్ణయించినట్లు కేటీఆర్ వెల్లడించారు. సిరిసిల్ల లో కార్మికుడి ఆత్మహత్య నేపథ్యంలో చేనేత, పవర్ లూం కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఆయన మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. పవర్లూమ్ కార్మికులు అత్యధి కంగా ఉన్న సిరిసిల్లలో కార్మికులకు ఈ ఏడాది రూ.70 కోట్ల విలువ గల స్కూల్ యూనిఫాంల కాంట్రాక్టు అప్పగించామని తెలిపారు. సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులెవరూ అధైర్యపడవద్దన్నారు. చేనేత, మరమగ్గాల కార్మికులను సంక్షోభం నుంచి బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మరమగ్గాల కార్మికులకు రూ.5.65 కోట్ల రుణాలు మాఫీ చేశామని, రూ.7.19 కోట్లతో 50 శాతం విద్యుత్ సబ్సిడీ ఇచ్చామని పేర్కొన్నారు. టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఫండ్ (టీయూఎఫ్) కింద రూ.4 కోట్ల బకాయిలను విడుదల చేశామన్నారు. కేంద్రం నుంచి రూ.15 వేలు, రాష్ట్రం నుంచి రూ.10 వేలు వెచ్చించి రాష్ట్రంలో 5వేల మగ్గాలను నవీకరించామన్నారు. రూ.80 నామమాత్రపు రుసుంతో మహాత్మాగాంధీ బుంకర్ బీమా యోజన కింద 6 వేల మంది కార్మికులకు జీవిత బీమా సదుపాయం కల్పించామన్నారు. ఈ పథకం కింద కార్మికుల ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.1,200 చొప్పున ఉపకారవేతనాలు ఇస్తున్నామన్నారు. ముద్రా బ్యాంకు నుంచి 600 మంది కార్మికులకు రుణాలు ఇప్పిం చామన్నారు. ప్రభుత్వ విధానాలు, కార్మికు లకు లభించే రాయితీలు, సదుపాయాలతో త్వరలో చేనేత, టెక్స్టైల్ రంగాల కోసం ప్రత్యేక పాలసీ ప్రకటిస్తామన్నారు. -
ఉచిత విద్యపై తల్లిదండ్రుల సదస్సు
హైదరాబాద్ : ఉచిత విద్య అందరి హక్కు అని హైదరాబాద్ డిస్ట్రిక్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి దశరథ లక్ష్మీ అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో మంగళవారం జరగబోయే ‘హైదరాబాద్ జిల్లా తల్లిదండ్రుల సదస్సు’ పోస్టర్లు, కరపత్రాలను ఆమె కుర్మగూడ డివిజన్ చంద్రయ్యహట్స్ బస్తీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్య హక్కు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఉచిత విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. తల్లిదండ్రుల సదస్సు మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. -
ఇంగ్లిష్, లెక్కలు లేని విద్య వృధా ప్రయాసే..!
ఎక్కువ మంది విద్యార్థులను ఫెయిల్ చేస్తున్న ఇంగ్లిష్, గణితాన్ని సబ్జెక్టులుగా తొలగించి ఐచ్చికాంశాలుగా మాత్రమే కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధికి సంబంధించి అత్యంత కింది స్థాయి ఉద్యోగాలకు మాత్రమే ప్రజారాసులను సిద్ధం చేసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాఠశాల విద్యను ప్రోత్స హించే లక్ష్యం కోసం భారత్‌లో విచిత్రమైన పరిణా మాలు జరుగుతున్నాయి. దీని కోసం త్రిభాషా సూత్రాన్ని తీసుకొచ్చారు. కొద్ది సంవత్స రాలు పాస్ కాకున్నా పై తర గతిలో చేరేందుకు అనుమతించారు. బాలికలకు ఉచిత విద్యను అందించారు. బాలికలు బడి మానకుండా చేయ డానికి టాయ్లెట్లను నిర్మించే ప్రయత్నం చేశారు. విద్యా హక్కును కూడా తీసుకొచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ ఫలి తాలను ఇవ్వలేదు. విద్యావ్యాపారంలో ప్రైవేట్ రంగా నికి ప్రభుత్వమే తలుపులు బార్లా తెరుస్తున్నందున, పాఠశాలకు బాలికలను తీసుకురావడం ఖరీదైన వ్యవ హారంగా మారిపోయింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్, గణితాన్ని స్కూల్ సబ్జెక్టులుగా తొలగించి వాటిని ఐచ్ఛికాంశాలుగా కొనసాగించాలని భావిస్తోంది. ఎందుకంటే ఈ రెండు సబ్జెక్టుల వల్లే పాఠశాలల్లో అనేకమంది ఫెయిల్ అవు తున్నారు. రాష్ట్ర విద్యామంత్రి వినోద్ తావ్డే సైతం విద్యాబోధన స్థాయి, పాఠశాలల పర్యవేక్షణను పక్కన బెట్టి, ఈ రెండు సబ్జెక్టులే విద్యా ప్రమాణాల వినాశ కారులని చూపిస్తున్న సమాచార పత్రాల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ నియంత్రణ పరిధికి వెలు పల పాఠశాలలు ‘అంతర్జాతీయం’ అయిపోతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిపుణత గురించి కేంద్రంతో చర్చిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ చర్య సీరియస్ వ్యవహా రంగా కనిపిస్తోంది. పరీక్షల్లో తక్కువ మార్కులు సాధిం చిన లేదా తమ పరీక్షల్లో నెగ్గని విద్యార్థులకు పాస్ అయ్యారు అని, నిపుణతలకు తగినవారుఅని సర్టిఫికెట్ రూపొందించడం ద్వారా పదవ తరగతిలో ఏ విద్యార్థినీ ఫెయిల్ చేయని తరహా వ్యవస్థ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రశ్నించదగిన ప్రమాణాలు కలిగిన వ్యవస్థలో కనీస కొలబద్దను కూడా ఇప్పుడు ఇంకాస్త తక్కువ స్థాయికి దించుతున్నారన్నమాట. దేశవ్యాప్తంగా పంచాయతీల నుంచి పురపాలక సంస్థలకు సంబంధించి, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులలో సగంమంది మూడో తరగతిలో నేర్చుకున్న పాఠాలను కూడా చదవలేకపోతున్నారని మనందరికీ తెలుసు. అంటే అన్ని రాష్ట్రాలూ తమకు గర్వ కారణంగా భావిస్తున్న మాతృభాషలో కూడా వీరు పదా లను, వాక్యాలను రాయలేకపోతున్నారు. అదే క్రమంలో వీరు లెక్కలు కూడా చేయలేరు. అంటే భావ వ్యక్తీకరణ లోనూ, మార్పులను గణించడంలోనూ వీరంతా పేలవ మైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని అర్థం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,. ఆధునిక ప్రపంచానికి తలుపులు తెరుస్తున్నట్లు తాము భావిస్తున్న ఇంగ్లిష్ మీడియం విద్యవైపు తల్లిదండ్రులు పరుగులు పెడుతున్న దశలో ఇది వెలుగు చూస్తోంది. ప్రభుత్వం లేక వ్యవస్థను నడిపిస్తున్న రాజకీయ నేతల్లా కాకుండా, ప్రపంచంతో తమ పిల్లలను అనుసంధానించడంలో ఉన్న ప్రాధాన్యతను తల్లిదండ్రులు గ్రహిస్తున్నారు. అదే సమ యంలో ప్రభుత్వం.. మాతృభాషను ఇంగ్లిష్‌పై ఉన్న భ్రమలకు సహజ నివారణగా భావిస్తూ దాని పట్ల అనురక్తిని ప్రదర్శిస్తున్నట్లు కనబడుతోంది. విద్య విషయంలో దేశంలోనే తీవ్ర నేరస్తురాలిగా పక్కన పెట్టనప్పటికీ, మహారాష్ట్ర ఈ కొత్త పరిణామానికి ఉదాహరణగా నిలుస్తోంది. వార్షిక స్థిర విద్యా నివేదికలు విద్యలో అల్ప ప్రమాణాల గురించి ఒకేరకమైన వివరణ లను పదే పదే వెలువరిస్తున్న నేపథ్యంలో... తగిన మానవ వనరుల పునాదిని అభివృద్ధి చేయడంలో తోడ్పాటు నందించే కొన్ని విలువైన సవరణలను కొన్ని రాష్ట్రాలు తీసుకొచ్చాయి. అయితే ఉపాధికి సంబంధించి అత్యంత కింది స్థాయి ఉద్యోగాలకు మాత్రమే ప్రజా రాసులు సిద్ధమవుతున్నారా అనిపించేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశం విద్యారంగంలో ఎంత చక్కగా పనిచేస్తోంది అనే అంశాన్ని నిర్ధారించడానికి, పాఠశాలల్లో ప్రవేశం అనేది కొలబద్ద కాదు. చక్కటి విద్యా బోధనా స్థాయి, నేర్చుకోవ డానికి సంబంధించి విద్యార్థులకు తోడ్పాడు నందించడంలో దాని సానుకూల ప్రభావం అనేవి పాఠశాల ప్రవేశంతోటే సిద్ధించవు. మీకు విద్యా హక్కు ఉండవచ్చు కానీ, ఏక గది పాఠశాలలు, విజ్ఞానాన్ని అందించడంలో సందేహాస్పదమైన సామర్థ్యం కలిగిన ఉపాధ్యాయుల గైర్హాజర్ అనేవి విద్యాబోధనను మొత్తంగా అపహాస్యం చేస్తున్నాయి. విద్యకోసం కేటా యించే బడ్జెట్ల కంటే అది తీసుకువస్తున్న ఫలితమే నిజమైన కొలబద్ద. అయితే ప్రమాణాలను తగ్గించడం ద్వారా గోల్ పోస్టును మార్చడానికి దేశంలో కనీసం ఒక రాష్ట్రమైనా ఇప్పుడు సంసిద్ధతను ప్రదర్శిస్తున్నట్లు కన బడుతోంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేష్ విజాపుర్కార్ ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యనందించాలి
అనంతపురం అర్బన్: కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు అక్రిడేషన్ కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో డీఈఓ అంజయ్య, ఆర్ఐఓ వెంకటేశ్వర్లుతో కలిసి విద్యా సంస్థల యాజమాన్య ప్రతి నిధులతో సమావేశం నిర్వహించారు. జర్నలిస్టులకు ఉచిత విద్యను అమలు చేయడం లేదని ఏ ఒక్క విద్యాసంస్థపై ఫిర్యాదు రాకూడదన్నారు. కలెక్టర్ ఆదేశాలను గౌరవించి వంద శాతం అమలు చేయాలని చెప్పారు. అభ్యంతరాలు తలెత్తకుండా పర్యవేక్షించాలని డీఈఓని ఆదేశించారు పరిశ్రమలకు చేయూతనివ్వాలి : జిల్లాలో పరిశ్రమలకు చేయూతనివ్వాలని అధికారులను జా యింట్ కలెక్టర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీఐపీసీ స మావేశం నిర్వమించారు. ఈ సందర్భంగా పె ట్టుబడి సబ్సిడీ, పవర్ కాస్ట్, అమ్మకపు పన్ను, పావలా వడ్డీ తదితర రాయితీలపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మా ట్లడుతూ జిల్లాలో పరిశ్రమలను ప్రొత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 31లోగా సర్వే పూర్తి చేయాలి :మునిసిపాలిటీల్లో ఈ నెల 31వ తేదీలోగా ప్రజా సాధికార సర్వే వంద శాతం పూర్తి చేయాలని మునిసిపల్ కమిషనర్లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తాడిపత్రి మునిసిపిలిటీలో 70.88 శాతం జరిగిందన్నారు. మిగతా చోట్ల కూడా వేగవంతం చేసి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. -
పేద ఆడపిల్లల చదువు కోసం సైకిల్ యాత్ర
-
పేదలకు ఉచిత విద్యను దూరం చేస్తున్న టీడీపీ
18న విజయవాడలో ధర్నా గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు భూషణ్‌రావు డుంబ్రిగుడ: రేషనలైజేషన్ ముసుగులో దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ఉచిత విద్యను దూరం చేస్తోందని గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె.భూషణ్‌రావు అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రేషనలైజేషన్ ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా 3,500 పాఠశాలలు మూసివేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాదిలో 5,475 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఎత్తివేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను ఎత్తివేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషష్ల కల్పనకు చట్టం చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేవారు. డిమాండ్లు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 18న విజయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకుడు వెంకటస్వామి ఉన్నారు. -
నాసా..శ్రావ్య
♦ పేదింటి బిడ్డకు అరుదైన అవకాశం ♦ ‘నాసా’ కేంద్రం నుంచి ఆహ్వానం ♦ బాల మేథావికి పలువురి ప్రశంసలు ♦ ఉచిత విద్య అందించేందుకు ముందుకొచ్చిన ‘శ్రీచైతన్య’ ‘ఆకాశంలో మెరిసేది ఏమిటి.. ఎందుకు మెరుపులొస్తాయి.. పైన ఏముంటుంది.. ఎందుకలా జరుగుతుంది’ ఇవన్నీ తల్లిదండ్రులు, తాతయ్యకు నిత్యం ఆమె వేసే ప్రశ్నలు. చిన్నతనంలోనే ప్రతి విషయంపై తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న ఆమె అదే పట్టుదలతో ఖగోళంపై ఉన్న మరిన్ని విషయాలు తెలుసుకోగలిగింది. జాతీయ స్థాయి పరీక్షలో అత్యంత ప్రతిభ కనబరిచి నాసా(నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నుంచి ఆహ్వానం అందుకుంది ఈ పేదింటి బిడ్డ. - ఖమ్మం ఖమ్మం బస్టాండ్ సమీపంలో చిన్న బడ్డీకొట్టు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వేముల శ్యాం, కల్యాణి దంపతులకు సాత్విక, శ్రావ్య ఇద్దకు కూతుళ్లు. కొడుకులు లేరనే బెంగతో కూతుళ్లను చిన్నచూపు చూసే వారున్న ఈ రోజుల్లో పురుషులకు తమ కుమార్తెలు ఎక్కడ తీసిపోరనే విధంగా పెంచారు ఆ దంపతులు. ఆకాశం వైపు చూసి.. అక్కడి విషయాలు తెలుసుకోవాలనే తపనతో ఉన్న చిన్న కుమార్తె శ్రావ్యకు వచ్చిన ఆలోచనలకు పదును పెట్టాడు తండ్రి. నగరంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతిలో చేర్పించి.. కూతురు ఆలోచనలను అక్కడి ఉపాధ్యాయులకు వివరించాడు. పాఠశాల డెరైక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య శ్రావ్య ఆలోచనలకు పదును పెట్టారు. ఫిజిక్స్ ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులతో చర్చించి.. శ్రావ్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బోధించాలని సూచించారు. ఆమెలోని పట్టుదల ఒక వైపు.. మరో వైపు పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం నుంచి ప్రోత్సాహం రావడంతో శ్రావ్య నాసా కేంద్రం గురించి అన్ని విషయాలు అధ్యయనం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ఆరంజ్ ప్లానెట్ ఎడ్యుకేషన్, నాసా కెనడీ స్పేస్ వారు సంయుక్తంగా నిర్వహించిన నేషనల్ ఆస్ట్రానమీ ఒలంపియాడ్ పరీక్ష రాసి ప్రతిభ కనబరిచింది. జాతీయ స్థాయిలో రెండు దశలుగా జరిగిన పరీక్షలో అసమాన ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ద్వితీయ స్థాయిలో నిలిచింది. నాసా ఆహ్వానం అందుకున్న వారిలో దక్షిణ భారతదేశంలోనే ఏకైక విద్యార్థిగా శ్రావ్య ఉండటం జిల్లాకే గర్వకారణం. అవార్డులు.. అభినందనలు ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా కేంద్రం పరిశీలన, అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి మాట్లాడే అరుదైన అవకాశం అందుకున్న శ్రావ్యకు ప్రముఖుల ప్రశంసలు, అభినందనలు, అవార్డులు దక్కించుకుంది. నేషనల్ ఆస్ట్రానమీ ఒలంపియాడ్ నిర్వాహకులు అవార్డుతో ఆమెను సత్కరించారు. నెహ్రూ ప్లానెటోరియం డెరైక్టర్ రత్నశ్రీ నుంచి అవార్డు అందుకుంది. ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు అభినందించారు. శ్రీచైతన్య కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డెరైక్టర్ శ్రీవిద్యతోపాటు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు అభినందనలు తెలిపారు. నాసా వెళ్తున్న శ్రావ్యకు శుభాకాంక్షలు తెలిపారు. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తామని శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యం ప్రకటించింది. పది రోజులు నాసాలోనే.. నాసా పరిశీలనలో భాగంగా అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి పది రోజులు ఉండే అవకాశం శ్రావ్యకు దక్కింది. గురువారం ఢిల్లీలో విమానం ఎక్కనున్న శ్రావ్యను ఈనెల 17న నాసా పరిశోధనా కేంద్రంలోకి తీసుకెళ్తారు అక్కడ ఈనెల 25వ తేదీ వరకు శాస్త్రవేత్తలతో నిర్వహించే సెమినార్లలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా అంతరిక్ష పరిశోధనలపై పలు ప్రశ్నలను నివృత్తి చేయడం వంటి అరుదైన అవకాశం ఆమెకు కలుగుతుంది. ఎనీ హౌ.. నాసా వెళ్లిన శ్రావ్య ఆల్ ది బెస్ట్. -
పింఛన్ ఇప్పిస్తాం
దివ్యాంగునికి కలెక్టర్ భరోసా అనంతపురం అర్బన్: ఫించను ఇప్పిస్తాను... నీవేమి బాధపడవద్దు అంటూ దివ్యాంగుడు షేక్ ఖాజాపీరాకు కలెక్టర్ కోన శశిధర్ భరోసా ఇచ్చారు. డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లుని పిలిచి తక్షణం పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం, జేసీ-2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తాడిపత్రి పట్టణానికి చెందిన దివ్యాంగుడు షేక్ ఖాజాపీరాని గ్రీవెన్స్‌కి తీసుకొచి టేబుల్‌పై ఉంచారు. అక్కడికే కలెక్టర్ వచ్చి సమస్యను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని పీడీని ఆదేశించారు. ఇక.. తప్పుడు పట్టాదారు పుస్తకంతో వేరొకరికి భూమిని విక్రయించే యత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, బాధితుడు ప్రసాద్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దళితుల సమస్యలు పరిష్కరించాలని కేవీపీఎస్ నాయకులు, ఎస్టీలకు ఉచిత విద్య అందేలా చూడాలని వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి సాకే చిరంజీవి, నగర అధ్యక్షుడు సుబ్బరాయుడులు కలెక్టర్‌ను కోరారు. -
'ఆ సంస్థలకు మేం వ్యతిరేకం కాదు'
హైదరాబాద్: మానవ వనరుల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అందరికి ఉచిత విద్య అందాలంటే ప్రైవేట్ విద్యాసంస్థలు సహకరించాలని అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యుత్ రాయితీ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు. -
ప్రైవేటు స్కూళ్లలో 25% ఉచిత సీట్లు!
♦ లక్ష మంది పేద విద్యార్థులకు వర్తింపు ♦ విద్యా హక్కు చట్టానికి ‘టీఎస్ఆర్టీఈ రూల్స్’ పేరుతో కొత్త నిబంధనలు ♦ ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపిన విద్యా శాఖ.. ఒక ట్రెండు రోజుల్లో ఉత్తర్వులు ♦ తొలి ఏడాదే రూ.218 కోట్లు అవసరమని అంచనా..{పాథమిక స్థాయిలో సీసీఈ తప్పనిసరి ♦ ‘పిల్లలు’ నిర్వచనం 6 నుంచి 3 ఏళ్లకు కుదింపు..3 ఏళ్ల వారికి ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ సెంటర్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) అమలుకు విద్యా శాఖ కొత్త నిబంధనలను రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఉమ్మడి రాష్ట్ర నిబంధనలనే కొనసాగించారు. తాజాగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, గతంలో పూర్తి వివరణలతో లేని నిబంధనలను సమగ్రపరుస్తూ పలు మార్పుచేర్పులతో తెలంగాణ రాష్ట్ర విద్యా హక్కు చట్టం(టీఎస్ఆర్టీఈ రూల్స్) పేరుతో రాష్ట్రంలో విద్యా హక్కు చట్టానికి కొత్త నిబంధనలను జారీ చేసేందుకు విద్యా శాఖ సర్వం సిద్ధం చేసింది. సంబంధిత ప్రతిపాదనలను గతంలోనే ఆమోదానికి పంపగా ప్రభుత్వం కొన్ని సవరణలు సూచించింది. వాటిని పొందుపరుస్తూ ప్రభుత్వ ఆమోదానికి మళ్లీ ఫైలును పంపించింది. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఒకట్రెండు రోజుల్లో నిబంధనలు వెలువడనున్నాయి. అయితే విద్యాశాఖ పంపిన నిబంధనల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ప్రారంభ తరగతిలో చేరే విద్యార్థుల్లో 25 శాతం మందికి ఉచిత విద్యను అందించాలన్న ప్రతిపాదనలతో ఈ నిబంధనలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ఇటీవల హైకోర్టు ప్రైవేటు స్కూళ్లలోని ప్రారంభ తరగతిలో(1వ తరగతిలో) చేరే విద్యార్థుల్లో 25 శాతం మందికి విద్యా హక్కు ప్రకారం ఉచిత విద్యను అందించాల్సిందేనని స్పష్టం చేయడంతో ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కొత్త నిబంధనల జారీకి సిద్ధమైంది. ఆవాస ప్రాంతంలో కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలల్లోని 25 శాతం సీట్లలో ఉచిత విద్యను అందించేందుకు నోటిఫికేషన్ ద్వారా విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. రిజర్వేషన్ల ఆధారంగా పేద పిల్లలను గుర్తించి నిర్ణీత రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. అందుకయ్యే మొత్తాన్ని విద్యాశాఖ పాఠశాల యాజమాన్యానికి రీయింబర్స్ చేస్తుంది. ప్రైవేటు స్కూళ్లలో విద్యా హక్కు చట్టాన్ని లక్ష మంది విద్యార్థులకు విద్యాశాఖ వర్తింప చేయనుంది. ఇందులో ఒక్కో విద్యార్థికి ఏటా రూ. 21 వేల చొప్పున ఖర్చవుతుంది. ఇలా మొత్తంగా తొలి ఏడాదే రూ. 218 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని లెక్కలు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రూల్స్‌లో ఉండనున్న మరిన్ని ప్రధాన అంశాలు.. ► గత నిబంధనల్లో లేని నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని(సీసీఈ) ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా అమలు చేయాలి. ► ఇప్పటివరకు పిల్లలు అంటే 6 నుంచి 14 ఏళ్ల వయసు వారు. ఏటా సెప్టెంబర్ 1 నాటికి 5 ఏళ్ల వయసు పూర్తయిన వారినే స్కూళ్లలో చేర్చుకుంటున్నారు. కానీ ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విధానం ఉంది. మూడేళ్ల వయసులోనే స్కూల్ కు వెళ్తున్నారు. కాబట్టి పిల్లలు అంటే 3 నుంచి 14 ఏళ్ల వయస్సు వారిగా పేర్కొనాలి. ► చట్టంలోని సెక్షన్-12(1)(సి) ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో ప్రారంభ తరగతిలో(1వ తరగతిలో) చేరే వారిలో 25 శాతం మందికి ఉచిత విద్యను అందించాలి. ► 25 శాతం సీట్లను సామాజికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించాలి. ఇందులో గతం లో లేని వర్గాలను చేర్చింది. గతంలో వికలాంగులు, హెచ్ఐవీ బాధిత పిల్లలు, ఎస్సీ, ఎస్టీ వంటి కేటగిరీలు ఉండగా తెల్ల రేషన్ కార్డు కలిగిన బీసీల పిల్లలను(తండ్రి/గార్డియన్) ప్రతిపాదనల్లో చేర్చినట్లు తెలిసింది. ► ఎకనామిక్ వీకర్ సెక్షన్ కేటగిరీలో మైనారిటీలు, ఓసీల్లో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారిని చేర్చింది. ► 3-5 ఏళ్ల వయస్సు వారికి ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్న నిబంధనను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ► మండల రీసోర్స్ పర్సన్ వ్యవస్థను తొలగించింది. ► పాత నిబంధనల్లో మండల పరిషత్తు అనే పదాన్ని ఎక్కడా చేర్చలేదు. తాజాగా నిబంధనల్లో మండల పరిషత్తులను చేర్చింది. దీంతో స్థానిక సంస్థలకు ప్రాధాన్యం కల్పిస్తోంది. అలాగే జిల్లా పరిషత్తు పదాన్ని చేర్చింది. ► నర్సరీ, ఎల్కేజీ, మాంటిస్సోరీ, అంగన్వాడీ, బాల్వాడి, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్(ఈసీఈ) కేంద్రాలు అన్నింటిని ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్‌గా పరిగణిస్తారు. ► టీచర్ కావాలనుకునే వారు కచ్చితంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో అర్హత సాధించి ఉండాల్సిందే. ► ప్రైవేటు స్కూళ్ల అనుమతుల్లో ఎలిమెంటరీ స్కూల్ అంటే ఎల్కేజీ, యూకేజీ వంటివి కలిపే ఉండాలి. 8వ తరగతి వరకు డీఈవో అనుమతి ఇవ్వాలి. ► ఒక సెక్షన్లో కనీసంగా 20 మంది విద్యార్థులుండాలి. గిరిజన ప్రాంతాల్లో 15 మంది ఉంటే చాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 60 మంది దాటితే మరొక సెక్షన్ ఏర్పాటు చేయాలి. అదే ప్రైవేటు పాఠశాలల్లో 40 మందికి మించకూడదు. ► బడి బయటి పిల్లలను గుర్తించి ముందుగా సమీపంలోని స్కూళ్లలో చేర్చాలి. ఆ తరువాత ప్రత్యేక శిక్షణకు పంపించాలి. ► విద్యార్థులను శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం. వాటికి పాల్పడిన వారిపై సర్వీసు రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయి. దీనిని తాజాగా నిబంధనల్లో చేర్చుతున్నారు. ► పాఠశాలల వారీగా ఉండాల్సిన స్టాఫ్ ప్యాటర్న్‌ను కూడా నిబంధనల్లో చేర్చుతున్నారు. -
ఖాన్ అకాడమీ
ఓ మంచి ట్యుటోరియల్! నాణ్యమైన చదువుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ విద్యార్థులకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ నిజంగా వరమే! కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్‌కు ఇంటర్నెట్ తోడుంటే చాలు.. కూర్చున్న చోటు నుంచే అంతర్జాతీయ స్థాయి విద్య, విజ్ఞానం విద్యార్థి సొంతమవుతుంది. ఎవరైనా.. ఎప్పుడైనా.. ఎక్కడినుంచైనా.. ప్రపంచస్థాయి నిపుణులు అందించే సబ్జెక్టు పరిజ్ఞానం పొందొచ్చు. అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండానే! ఇదంతా ఇప్పుడు టెక్నాలజీ సాయంతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా సాధ్యమవుతున్న అద్భుతం. కేజీ నుంచి పీజీ దాకా.. ఏ కోర్సు అయినా.. ఏ సబ్జెక్ట్ అయినా.. ఏ కాన్సెప్ట్ అయినా.. ఇట్టే నేర్చుకోవచ్చు. ఎలాంటి సందేహాలున్నా.. క్షణాల్లో నివృత్తి చేసుకోవచ్చు. ఖాన్ అకాడమీ, ఎన్పీటీఈఎల్, ఎడెక్స్, కోర్స్ఎరా, మూక్స్, మిట్ ఓపెన్ కోర్స్‌వేర్, ఎంఆర్ యూనివర్సిటీ వంటివి ఆన్లైన్ ఎడ్యుకేషన్‌ను అందించే దిశగా వినూత్న, విప్లవాత్మక విధానాలతో ముందుకొస్తున్నాయి. - సాక్షి, ఎడ్యుకేషన్ డెస్క్ ఖాన్ అకాడమీ.. ఆన్లైన్ ఎడ్యుకేషన్‌లో సంచలనం. 2006లో చిన్నగా మొదలై.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇటీవల భారత్‌లో టాటా ట్రస్ట్‌తో ఖాన్ అకాడమీ ఒప్పందం చేసుకుంది. తద్వారా టీచర్లకు ఉద్యోగ అవకాశాలతోపాటు భారతీయ భాషల్లో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల ఆధారంగా నాణ్యమైన కంటెంట్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హిందీ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. ఎంతో మంది కృషి ఫలితం అరటిపండు వొలిచి నోట్లో పెట్టినట్లు.. క్లిష్టమైన మ్యాథ్స్ ఈక్వేషన్స్‌ను అత్యంత సులువుగా బ్లాక్ బోర్డుపై రంగురంగుల స్కెచ్‌లతో వివరించడం విద్యార్థులను ఆకట్టుకుంటోంది. నిపుణులైన 80 మందికిపైగా టీమ్‌తో ప్రపంచంలో ఎక్కడున్నా, ఎవరికైనా.. ఉచితంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా ఖాన్ అకాడమీ విస్తరిస్తోంది. ఈ క్రతువులో ఎంతోమంది పాలుపంచుకుంటున్నారు. ఇందులో.. టీచర్లు, డెవలపర్లు, సాఫ్ట్వేర్ డిజైనర్లు, సైంటిస్ట్‌లు, స్ట్రాటజిస్టులు, కంటెంట్ స్పెషలిస్టులు ఉన్నారు. వీరంతా తమ ఏకైక లక్ష్యమైన ప్రతి ఒక్కరూ అత్యున్నత విజ్ఞానాన్ని అందుకోవాలనే దిశగా ఉద్యుక్తులవుతున్నారు. అంటే.. కొంత మంది గొప్ప వ్యక్తులు గొప్పగా ఆలోచిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నది వీరి నమ్మకం. అందరికీ ఉచిత విద్య ఎలాంటి ప్రకటనలూ.. సబ్‌స్క్రిప్షన్లూ లేవు. లాభాపేక్ష అస్సలు లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడమే ఆశయం. దాతలు, వలంటీర్లు ఖాన్ అకాడమీ బలం. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది అందరికీ ఉచితం. మీకు కనీసం మెయిల్ ఐడీ/అకౌంట్ కూడా అవసరం లేదు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి చోటా ఖాన్ అకాడమీ అందుబాటులో ఉంటుంది. అకౌంట్ ఉంటే.. మీకు ఇష్టమైన భాషను డిఫాల్ట్ లాంగ్వేజ్‌గా పెట్టుకోవచ్చు. నేర్చుకుని మీ పురోగతిని అంచనా వేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లోనూ అందుబాటులో ఉంది. వీడియోలు, ఇతర కంటెంట్, లెర్నింగ్ మెటీరియల్ ఇంగ్లిష్‌తోపాటు స్పానిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్, బ్రెజిలియన్ వంటి 36 భాషల్లోకి అనువాదం అవుతుండటం విశేషం. తెలుగులోనూ మ్యాథ్స, ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠ్యాంశాలు లభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ మిలియన్ల మంది విద్యార్థులు తమకు ఇష్టమైన అంశాలను ఖాన్ అకాడమీ ద్వారా నేర్చుకుంటూ విజ్ఞానాన్ని సొంతం చేసుకుంటున్నారు. అంటే... అమెరికా నుంచి కొరియా వరకూ ప్రపంచంలో ఏ మూలనున్నా, ఎక్కడున్నా... ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఖాన్ అకాడమీ ద్వారా ఆయా సబ్జెక్టులను నేర్చుకోవచ్చు. ఏమేమి నేర్చుకోవచ్చు? ఖాన్ అకాడమీ.. మ్యాథ్స్, సైన్స్, ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్, హ్యుమానిటీస్, కంప్యూటింగ్, టెస్ట్ ప్రిపరేషన్, పార్టనర్ కంటెంట్, కాలేజ్ అడ్మిషన్స్, ట్యాక్స్, ఇంటర్వ్యూస్, కోచ్ రిసోర్సెస్.. ఇలా అనేకం అందుబాటులోకి తెచ్చింది. మ్యాథ్స్‌కు సంబంధించి కేజీ ఎర్లీ మ్యాథ్స్ నుంచి ప్రారంభించి.. జామెట్రీ, ఆల్జీబ్రా, క్యాలిక్యులస్.. వంటివాటితో పాటు ఆర్ట్స, హ్యుమానిటీస్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచింది. అదేవిధంగా అకాడమీ అందించే కోడింగ్ పాఠాలు అద్భుతమని చెప్పొచ్చు. ఆయా ప్రోగ్రామింగ్ వీడియోల ద్వారా పైసా ఖర్చు లేకుండా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, వెబ్సైట్ డిజైనింగ్, గేమ్స్ డిజైనింగ్ కోసం ఉపయోగపడే జావా స్క్రిప్ట్ వంటి జాబ్ మార్కెట్ డిమాండింగ్ కోర్సులను నేర్చుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ సైన్స్ క్లాసుల్లో డేటా ఎన్‌క్రిప్షిన్, ఇన్ఫర్మేషన్ థియరీ వంటి ముఖ్యమైన టాపిక్స్‌ను తెలుసుకోవచ్చు. కంప్యూటర్స్, ప్రోగ్రామింగ్‌పై ఎలాంటి అవగాహన లేని వారికి ఈ వీడియోలు నిజంగా అద్భుతమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్స్ట్రక్టర్ ఒకవైపు కోడ్‌ను వివరిస్తూ.. కోడ్‌ను టైప్ చేయగానే వెంటనే మరోవైపు దాని ఫలితం కనిపిస్తుంటుంది. పొరపాట్లను కూడా వెంటనే వివరించి సరిదిద్దే ఏర్పాటు సైతం ఉంది. అంతేకాకుండా జావా స్క్రిప్ట్‌పై ప్రాక్టికల్ కోర్సులు ఉన్నాయి. ఇష్టంగా ఆడుతూ పాడుతూ ‘‘ఎవరైనా.. ఎక్కడున్నా.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉచితంగా ‘విద్య’ను అందించడమే తమ లక్ష్యమని ఖాన్ అకాడమీ ప్రకటించింది. 4000 ఆన్లైన్ వీడియోలు.. ఒక్కోటి 10 నిమిషాల నిడివికలవి.. ఎర్లీ మ్యాథ్స్, సైన్స్ నుంచి ప్రారంభించి హిస్టరీ, ఎకనామిక్స్, మ్యూజిక్, కంప్యూటర్స్ వరకూ అనేక సబ్జెక్టులు.. టాపిక్‌ను వివరించే వీడియోలతోపాటు ఆయా టాపిక్‌పై పట్టు చిక్కిందో లేదో స్వయంగా పరీక్షించుకునేందుకు ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లు, వ్యక్తిగతంగా నేర్చుకోవడానికి డాష్‌బోర్డు సౌలభ్యం సైతం ఉంది. భారతీయ విద్యార్థుల కోసం 6వ గ్రేడ్ నుంచి 8 గ్రేడ్ వరకు ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో కూడిన పాఠాలు అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స ఎగ్జామినేషన్‌కు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలకు వీడియో సమాధానాలు లభ్యమవుతున్నాయి. ఇవన్నీ తరగతి గది బోధన మాదిరిగా నిర్దిష్ట సమయంలో నిర్బంధంగా కాకుండా.. సదరు విద్యార్థి తనకు వీలున్న సమయంలో ఇష్టమైనప్పుడు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఆడుతూపాడుతూ హాయిగా నేర్చుకోవచ్చు. ఖాన్ అకాడమీ వినియోగిస్తున్న అత్యాధునిక అడాప్టివ్ టెక్నాలజీ నేర్చుకోవడంలో విద్యార్థి బలాలు, బలహీనతలను గుర్తిస్తుంది. తద్వారా విద్యార్థి నేర్చుకోవడంలో తన లోపాలను స్వయంగా సరిదిద్దుకోవచ్చు. నాసా, మిట్, కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సెన్సైస్, ద మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతోనూ ఖాన్ అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థి.. టీచర్.. పేరెంట్ విద్యార్థిగానే కాకుండా టీచర్‌గా, పేరెంట్‌గా, కోచ్‌గా కూడా అకాడమీలో చేరొచ్చు. పేరెంట్, టీచర్, ట్యూటర్.. విద్యార్థి (ఇతర యూజర్) పురోగతిని పర్యవేక్షిస్తూ.. అతనికి సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. నేర్చుకోవాల్సిన నైపుణ్యాలేంటో చెప్పొచ్చు. పేరెంట్ అయితే తన కుమారుడు/కుమార్తె కోసం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా తన బిడ్డ ప్రస్తుతం ఉపయోగిస్తున్న అకౌంట్‌తో పేరెంట్ అకౌంట్ కనెక్ట్ కావొచ్చు. తద్వారా తమ పిల్లల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సౌలభ్యం ఉంది. మూక్స్, ఎడెక్స్ వంటివి తమ కంటెంట్‌ను మాత్రమే అందిస్తే.. ఖాన్ అకాడమీ తన సొంత కంటెంట్‌తోపాటు మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ తదితర తన భాగస్వాముల మెటీరియల్‌ను కూడా అందుబాటులో ఉంచుతోంది. విద్యార్థి ఆయా కాన్సెప్ట్‌లను నేర్చుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడా? లేదా తన తరగతి స్థాయి కంటే ముందంజలో ఉన్నాడా అనేది తెలుసుకునే సౌలభ్యం కల్పించడం ద్వారా విద్యార్థి ప్రతిభను టీచర్లు చక్కగా అంచనా వేయొచ్చు. కోచ్ డాష్ బోర్డ్ మొత్తం క్లాస్ రూం పనితీరుతోపాటు ఒక్కో విద్యార్థి వివరాలను అందిస్తోంది. టెక్నాలజీ నాసా, మిట్ వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా అందించే కంటెంట్; ట్యాబ్లెట్ ఆధారిత మార్కప్; మొబైల్ యాప్స్; ప్రాక్టీస్ టెస్ట్స్; మిషన్ అసెస్మెంట్; కోచెస్ మిషన్స్; శాట్; జీమ్యాట్ వంటి పరీక్షలకు ప్రామాణిక టెస్ట్ ప్రిపరేషన్ వంటివి టెక్నాలజీని ఇష్టపడే నేటి తరం విద్యార్థులకు ముఖ్యంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాల వారికి అయాచిత వరమే అంటున్నారు నిపుణులు. ప్రపంచంలో నాణ్యమైన చదువుల కొరత, స్కూల్స్, కాలేజీల్లో బోధన ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉండటం, ఫీజుల భారం తదితర కారణాలతో తల్లిదండ్రులు ఖాన్ అకాడమీ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. విమర్శకులేమంటున్నారు ఖాన్ అకాడమీ ట్యుటోరియల్ వంటిదని.. దీన్ని ఆన్లైన్ ఎడ్యుకేషన్‌గా పేర్కొనడం సరికాదంటున్నారు నిపుణులు. ఆన్లైన్ కోర్సులను సంప్రదాయ ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తూ.. కోర్సు పూర్తయ్యాక క్రెడిట్స్, సర్టిఫికెట్స్ ఇస్తుంది. ఖాన్ అకాడమీకి.. మాసివ్ ఆన్లైన్ కోర్సుల(మూక్స్)కూ తేడా ఉంది. ఖాన్ అకాడమీ అందించే కంటెంట్ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు సరితూగేలా ఉందా? అంటే ఇప్పుడే కచ్చితమైన సమాధానం చెప్పలేమన్నది నిపుణుల అభిప్రాయం. కొంత మీడియా ప్రచారం కూడా తోడవడంతో దీనికి దాతల మద్దతు లభిస్తోంది. అయితే అకాడమీ తన లక్ష్యంగా ప్రకటించుకున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉచిత విద్య దిశగా ఇంకా చాలా కృషి చేయాల్సి ఉందని విమర్శకుల వాదన. భారతీయ మూలాలు ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సల్ఖాన్. భారతీయ మూలాలున్న ఆయన అమెరికాలో జన్మించి.. ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్), హార్వర్డ్‌లో చదువుకున్నారు. తన బంధువు చిన్నారి నదియకు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పే క్రమంలో అంకురించిన ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో సంచలనాత్మకమైంది. మొదట ఖాన్.. బంధువుల పిల్లల కోసం రూపొందించిన ట్యూషన్ వీడియోలు యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. వాటిని చూసిన వాళ్లు ఆ వీడియోలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయంటూ.. అమెరికా నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలతో ముంచెత్తారు. అలా ఖాన్ అకాడమీకి అంకురార్పణ జరిగింది. సల్ఖాన్ అప్పటి వరకూ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి 2009లో పూర్తిగా వీడియోల రూపకల్పన మొదలుపెట్టారు. దాతల మద్దతుతో అకాడమీపైనే దృష్టిపెట్టారు. బిల్‌గేట్స్ లాంటి కంప్యూటర్ మేధావులు సైతం ఖాన్ అకాడమీ వీడియోల ద్వారా తమ పిల్లలకు బోధిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. అంతేకాకుండా 2010లో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్.. ఖాన్ అకాడమీకి ఆర్థికంగా దన్నుగా నిలిచింది. ఇది లాభాపేక్షలేని సంస్థ. దాతలు ఇచ్చే నిధులతో నడుస్తోంది. -
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ‘భోజనం’
సర్కార్ యోచన: చక్రపాణి విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు: హరగోపాల్ షాద్‌నగర్ రూరల్: ప్రభుత్వ జూనియర్ కళాశాల ల్లో మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడించారు. గ్రామీణ పేద విద్యార్థులు ఉన్నతవిద్య చదివేందుకు ఈ నిర్ణ యం తీసుకుంటుందని చెప్పారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాతలు సాయంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆచార్య హరగోపాల్‌తో కలసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టడం హర్షణీయమని చక్రపాణి అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య కోసం ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చాలామంది పేద బాలికలు పదో తరగతితోనే విద్యను ఆపివేయ డం బాధాకరమన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉన్నత విద్య చదవాలని కోరారు. హరగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యను డబ్బుతో ముడిపెడితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నాణ్యమైనవిద్యను అందిస్తూ ప్రభుత్వమే విద్యారంగాన్ని నిర్వహించాలన్నారు. -
ప్రతి నియోజకవర్గంలో పది రెసిడెన్షియల్ స్కూళ్లు
హైదరాబాద్: ప్రతి నియోజకవర్గంలో పది రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ కాలేజీలను ఒకే గొడుగుకిందకు తీసుకొస్తామని చెప్పారు. బుధవారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,190 రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా ఇంటర్ వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. కుల, మతాలతో సంబంధం లేకుండా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని ఆయన చెప్పారు. సాంకేతిక విద్యా విధానంలో కూడా అవసరమైన మార్పులు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. -
‘కేజీ టు పీజీ’ ఉచితవిద్య అందించాలని ఆందోళన
మంత్రుల నివాసాల ముట్టడికి ఏబీవీపీ యత్నం హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య అమలు చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ మంత్రుల నివాసాల ముట్టడికి యత్నించారు. మంత్రుల క్వార్టర్లలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా 44 మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కేజీ టు పీజీ ఉచితవిద్య అమలును టీఆర్ఎస్ విస్మరించిందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్, నగర కార్యదర్శి వెంకట్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్ తదితరలు పాల్గొన్నారు. -
‘కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలి’
హైదరాబాద్: ప్రజలందరికీ ఉచితవిద్యను అందించాలనే సదాశయంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘కార్పొరేట్ విద్య-తల్లిదండ్రులు, ప్రభుత్వ కర్తవ్యం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కోదండరాం మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ వ్యవస్థను నియంత్రించాలని కోరారు. అధిక ఫీజుల నియంత్రణతోపాటుగా పర్మిషన్లను నియంత్రించాలని కోరా రు. ట్రస్మా అధ్యక్షుడు ఎస్.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్టం చేయాలని కోరారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్రావు, ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు సొగర బేగం, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. -
పేదలకు అందని ద్రాక్షగా ప్రభుత్వ విద్య
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల బిడ్డలకు ప్రభుత్వ విద్యను అందకుండా చేస్తోందని ప్రొఫెసర్ రామకృష్ణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని చైతన్య ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ చేస్తున్నారని విమర్శించారు. పేదోడికి ఒక విద్య, ధనికుడికి మరో విద్య అందుతుందన్నారు. శాస్త్రీయమైన విద్య, దేశవ్యాప్తంగా కామన్ విద్యా విధానం అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎన్నికల ముందు కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి ఏ ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. బంగారు తెలంగాణ అని చెప్తున్న కేసీఆర్ బాధల తెలంగాణగా మారుస్తున్నారన్నారు. విద్యను వ్యాపారం చేస్తూ అంగడి సరుకుగా మారుస్తున్న విద్యాలయాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్, సైదులు, నాయకులు ఆది, కృష్ణ, నర్సింహా, మహేష్, కురుమూర్తి, ఎల్లయ్య, అంజి, కవిత, సుజాత పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడికి రారండి..
ప్రభుత్వ బడులకు పిల్లలను పంపించడంటూ ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నభోజనం వంటి ఎన్నో సదుపాయాలు సర్కారీ స్కూళ్లలో కల్పిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. బడిఈడు ఉన్న పిల్లలందరినీ తప్పనిసరిగా గ్రామాల్లోని ప్రాథమిక, జెడ్పీ స్కూల్స్‌లో చేర్పించాలని సూచిస్తున్నారు. గవర్నమెంటు బడుల్లో అర్హులైన ఉపాధ్యాయులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంగ్లీషు మీడియం వంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలు ప్రభుత్వ స్కూల్స్‌లోని విద్యార్థులు సాధిస్తున్నారని పేర్కొంటున్నారు. గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం గూడూరు టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని ఎంఈవో దిలీప్‌కుమార్ తెలిపారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను సొంత భవనాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారని పేర్కొన్నారు. కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, విశాలమైన మైదానం, క్రీడ సామగ్రి ఉన్నాయన్నారు. ప్రతి నెలా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయిస్తామని పేర్కొన్నారు. ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ ఉందన్నారు. టెన్త్‌లో 9.8, 9.2 జీఏపీతో మంచి మార్కులు సాధించారని తెలిపారు. హెచ్ఎం ఇస్మాయిల్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, వీవీ కుమార్, వెంకటరమణయ్య, భాస్కర్‌రెడ్డి, ఎమ్మార్పీ భాను సిబ్బంది పాల్గొన్నారు. తల్లిదండ్రులకు అవగాహన వాకాడు: వాకాడు ఎస్సీ కాలనీలో యూపీ స్కూల్‌కు చెందిన ప్రధానోపాధ్యాయుడు కోట సుబ్రహ్మణ్యం తమ పాఠశాలకు చెందిన విద్యార్థులతో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. కొందరు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్ళి వివిధ పాఠ్యాంశాలు, ప్రపంచ చిత్ర పటాలపై అవగాహనకల్పించారు. తోటపల్లిగూడూరు : ప్రభుత్వం నుంచి తీసుకునే జీతాలకు తగిన విధంగా కష్టం చేయాలని భావించే ఉద్యోగుల్లో ఇంగిలాల బాలకృష్ణ ఒకరు. పేడూరు పంచాయతీ కృష్ణారెడ్డిపాళెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఇదే పాఠశాలలో తొమ్మిదేళ్ల నుంచి పనిచేస్తున్న బాలకృష్ణ చిన్నారుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా బడి ఈడు పిల్లలను తమ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటూ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతున్నారు. బడిఈడు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాలల మోజులో పడకుండా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్చాలని సూచిస్తున్నారు. ఆయన నిర్వహిస్తున్న ప్రచారానికి తల్లిదండ్రుల నుంచి స్పందన లభిస్తోంది. తప్పనిసరిగా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పిస్తామని చెబుతున్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, సీఆర్పీ కాయల రమణమ్మ, అంగన్వాడీ కార్యకర్త సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
‘ఉచితం’ కల
పేదలకందని ‘కార్పొరేట్’ చదువు అమలు కాని విద్యాహక్కు చట్టం ప్రయివేటు పాఠశాలలో 25 శాతం సీట్ల కేటాయింపు వట్టిమాటే! మూడేళ్లుగా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు బాన్సువాడ : ప్రయివేటు పాఠశాలలలో 25 శాతం సీ ట్లు పేదలకు కేటాయించాలని, ఉచితంగా విద్యను అందించాలని ఏటా విద్యాశాఖ ప్రకటనలు గుప్పిస్తున్నా, అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. విద్యా హక్కు చట్టం వచ్చి ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ, ఈ నిబంధన గురించి పట్టించుకున్న నాథుడు లేడు. అన్ని ప్రయివేటు పాఠశాలలలో 25 శాతం సీట్లు పేద కుటుంబాల పిల్లలకు కేటాయించాలని, ఈ వ్యయాన్ని ప్రభుత్వం,ప్రరుువేటు పాఠశాలల యాజమాన్యం సంయుక్తంగా భరించాలని గత ఏడాది సుప్రీంకోర్టు సూచించి నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటికే పాఠశాలలు ప్రవేశాలను ప్రారంభించారుు.ఈసారి అరుునా పేద పిల్లలకు న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నారుు. సుప్రీం కోర్టు ఆదేశించినా! ప్రరుువేటు, కార్పొరేట్ బడులలో పేద విద్యార్థులకు ఉచిత చదువు కలగా మారింది. జిల్లాలో సుమారు ప్రరుువేటు 695 పాఠశాలలు ఉన్నా యి. వీటిలో కొన్ని తప్ప, చాలా వరకు పాఠశాలలు పేదలకు సీట్లు కేటాయించడం లేదు. విద్యాహక్కు చట్టం సూచించినా, అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా యూజమాన్యాలు పెడ చెవిన పెడుతున్నారుు. విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాల్సిందేనని సుప్రీం కోర్టు గతంలో చెప్పింది. దీని ప్రకారం జిల్లాలో దాదాపు పది వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరాలి. మూడేళ్లుగా ఈ నిబంధన అమలు కాకపోవడంతో దాదాపు 30 వేల మంది పేద విద్యార్థులు ఈ అవకాశానికి దూరమయ్యారు. ఈసారి ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేస్తామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. దీనితో ప్రభుత్వ బడుల మనుగడకు కొంత విఘాతం ఏర్పడుతుందనే అభిప్రాయం కూడా అక్కడక్క డా వ్యక్తమవుతోంది. ఫీజులు ఎవరు భరించాలి! ఏటా ఒక్కో పాఠశాలో ఒకటో తరగతిలో సుమా రు 60 మంది పిల్లలు చేరుతున్నారు. వారిలో 15 సీట్లు పేదలకు కేటాయించాలి. పేద విద్యార్థికి ఏడాదికి రూ. పది వేల వరకు ఫీజు ఉంటుం దని అంచనా. దీన్ని ప్రరుువేటు భాగస్వామ్యం లో ప్రభుత్వం చెల్లిస్తుందా? మొత్తం ప్రభుత్వమే భరిస్తుందా అనేది తేలాల్సి ఉంది. చట్టం అమలైతే ఏదేమైనా విద్యాహక్కు చట్టం పటిష్టంగా అమలైతే పేద విద్యార్థులకు కార్పొరేట్, ప్రరుువేటు బడులలో చదువుకొనే అవకాశం లభిస్తుంది. నా ణ్యమైన విద్య అందుతుంది. పిల్లలను చదివించాలన్న తపనతో అప్పులు చేస్తున్న తల్లిదండ్రులకు ఊరట లభిస్తుంది. సామాజికంగా పేద, ధ నికవర్గాలు అనే భావనతోపాటు బడుగు, బల హీనవర్గాలు అనే భావన తొలగిపోతుంది. భవి ష్యత్తులో ఉన్నత విద్యకు అవకాశాలు మెరుగుపడతాయి. మరోవైపు, దీనితో పాఠశాలల మనుగడ ప్రమాదంలో పడవచ్చని ఉపాధ్యాయ సం ఘాలు ఆరోపిస్తున్నాయి. ఉచిత నిర్బంధ విద్య ను అందించాలన్న బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఇదొక సాకు అని వారు భావిస్తున్నారు. -
బడికి ‘ప్రైవేటు’ గండం!
* విద్యా హక్కు చట్టమే సర్కారీ స్కూళ్లకు గొడ్డలిపెట్టు * ‘ప్రైవేటు’లో ఉచిత విద్య నిబంధనతో శరాఘాతం * పేద పిల్లలకు 25% సీట్లు కేటాయించాలంటున్న చట్టం * వారికి రాష్ట్ర సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ * అమలుకు కేంద్రం ఒత్తిడి.. కొత్త విధానంపై కసరత్తు * ఒకే ప్రాంతంలోని సర్కారీ స్కూళ్లను కలిపేసే యోచన * ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో పడిపోతున్న విద్యార్థుల సంఖ్య * ‘ప్రైవేటు’ గండంపై ఉపాధ్యాయ సంఘాల్లో ఆందోళన సర్కారీ స్కూళ్లకు మరో మప్పు ముంచుకొచ్చింది! పాలకుల నిర్లక్ష్యానికి తోడు పడిపోతున్న విద్యార్థుల శాతంతో సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రభుత్వ పాఠశాలలకు విద్యాహక్కు చట్టమే శాపంగా మారింది. ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం విద్యార్థులకు ఉచిత విద్య అందించాలన్న నిబంధనే శరాఘాతం కానుంది. ఈ ‘ప్రైవేటు’ గండంతో ప్రభుత్వ పాఠశాలల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించి, వారికి ఉచిత విద్యను(రీయింబర్స్మెంట్ ద్వారా) అందించాలన్న విద్యాహక్కు చట్టం నిబంధన అమలైతే ఉపద్రవం తప్పదు. ప్రైవేటును ప్రోత్సహించేలా ఉన్న ఈ విధానంతో సర్కారీ స్కూళ్లు మూతపడే ప్రమాదముంది. విద్యా హక్కు చట్టంలోని ఆ నిబంధనను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేంద్రం నుంచి ఒత్తిడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు రీయింబర్స్‌మెంట్‌తో ఉచిత విద్యను అందించే విధానంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు కొత్త నిబంధనల రూపకల్పనపై రాష్ర్ట ప్రభుత్వం దృష్టిసారించింది. - సాక్షి, హైదరాబాద్ ప్రైవేటులో 25% ఉచిత సీట్లు విద్యా హక్కు చట్టం-2010లోని సెక్షన్ 12(సి) ప్రకారం ప్రైవేటు స్కూళ్లలోని 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయించాలి. వికలాంగులు, అనాథలు, హెచ్ఐవీ బాధిత విద్యార్థులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, రూ. 60 వేల లోపు వార్షికాదాయం కలిగిన అన్ని వర్గాల వారికి 6 శాతం చొప్పున సీట్లు కేటాయించాలన్న నిబంధన ఉంది. దీని అమలుపై గతంలోనే రాష్ర్ట ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే దీనివల్ల సర్కారీ బడులు దెబ్బతింటాయని ప్రభుత్వ వర్గాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు ప్రైవేటు స్కూళ్లకు రీయింబర్స్మెంట్ రూపంలో చెల్లించాల్సిన ఫీజులను రాష్ట్రాలే పూర్తిగా భరించాలని కేంద్రం స్పష్టం చేయడంతో ఆర్థిక భారం దృష్ట్యా కొత్త నిబంధన అమలును అప్పట్లో పక్కనపెట్టారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో మళ్లీ దానిపై కసరత్తు మొదలైంది. దీంతో సర్కారీ స్కూళ్ల మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమలుపై లోతుగా అధ్యయనం విద్యా హక్కు చట్టం కొన్నేళ్ల కిందటే అమల్లోకి వచ్చినా అందులోని కొన్ని నిబంధనలను అప్పటి ప్రభుత్వాలు అమలు చేయలేదు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు కిలోమీటర్ పరిధిలో, ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు 3 కి.మీ. పరిధిలో పాఠశాలలను అందుబాటులో ఉంచాలన్న నిబంధనను పెద్దగా పట్టించుకోలేదు. ప్రతి స్కూల్లో ఒక టీచర్ కచ్చితంగా ఉండాలని, ప్రతి 30 మంది విద్యార్థులకు ఓ టీచర్ ఉండాలన్న నిబంధననూ పాటించలేదు. ఒకరకంగా ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను పాలకులే దెబ్బతీశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో పాత నిబంధనలు కాక కొత్తగా నిబంధనలు రూపొందించుకొని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇందులో భాగంగానే ప్రైవేటు స్కూళ్లలోని 25 శాతం సీట్లలో పేద పిల్లలకు ప్రవేశాలు కల్పించడంపై కసరత్తు చేస్తోంది. ఒకే ప్రాంతంలోని వివిధ కాలనీల్లో ఉండే సర్కారీ బడులను కలిపి ఒకేచోట పాఠశాలను కొనసాగించే విధానంపై అధ్యయనం చేస్తోంది. దీనివల్ల రాష్ర్టవ్యాప్తంగా ఐదా రు వందల స్కూళ్లకు మూసివేత ప్రమా దం ముంచుకురానుంది. విద్యా హ క్కు చట్టం నిబంధనల ప్రకారం ఆవాస ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల లేకపోతే ప్రభుత్వమే ఆ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించి మరో ప్రాంతంలోని స్కూళ్లకు తరలించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఉపయోగించుకొని ఒక ప్రాంతంలోని వివిధ కాలనీల్లో ఉన్న స్కూళ్లను తొలగించి (వాటిలోని విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించడం ద్వారా) ఒకే స్కూల్‌ను కొనసాగించే ఆలోచనలు జరుగుతున్నాయి. అమలైతే ఇదీ పరిస్థితి రాష్ట్రంలో దాదాపు 15 వేల ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. వాటిల్లో ప్రారంభ తరగతిలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య దాదాపు 3 లక్షలు ఉంటుంది. 25 శాతం మందికి రీయింబర్స్మెంట్ ఇవ్వాలంటే.. దాదాపు 75 వేల మంది విద్యార్థుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో చేరే వారితో దీన్ని అమలు చేస్తే.. ఆ విద్యార్థులు 8వ తరగతి పూర్తి చేసే వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏటా ఒకటో తరగతిలో చేరే వారిలో 25 శాతం పిల్లలకూ ఫీజులు కట్టాలి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ. 6 వేల వరకు వెచ్చిస్తోంది. దీని ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం విద్యార్థులకు తొలి ఏడాది రూ. 45 కోట్లు చెల్లించాలి. ఇది ఏటా పెరుగుతూ 8 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం రూ. 360 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్ల మనుగడ కష్టం ప్రభుత్వ పాఠశాలల మనుగడ మరింత ప్రమాదంలో పడుతుంది. సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ స్కూళ్లలోనే విద్యార్థులు చేరేలా వారిని ప్రోత్సహించాలి. ఎలాంటి శిక్షణ లేకుండానే బోధన నిర్విహ ంచే ఉపాధ్యాయులు ఉండే ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు చేరేలా ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహించడం సరికాదు. - వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్షుడు చాలా స్కూళ్లు మూతే ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్లకు ముప్పు పొంచి ఉంది. చట్టంలో నిబంధన ఉండటం నిజమే అయినప్పటికీ దాన్ని అమలు చేయడం సరికాదు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు క్రమంగా కనుమరుగవుతాయి. ముందుగా అదే చట్టంలో పేర్కొన్నట్టు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్య తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. - రాజిరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు బడిని బలోపేతం చేయాలి ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధానాలు సరికాదు. అలాంటి వాటిని అమలు చేయకుండా సర్కారీ విద్యను బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే విధానాలు తీసుకురావాలి. రీయింబర్స్మెంట్ కింద ప్రైవేటు స్కూళ్లలోని 25 శాతం సీట్లలో ప్రవేశాలు కల్పిస్తే ఇది మరో ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థలా తయారవుతుంది. - రవి, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి -
ఉచిత విద్య అందించాలి
కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందించడం కష్టసాధ్యమైనా అమలు చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ వికాస సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రంలోని జాఫర్ నిజాం సెమినార్ హాల్లో ‘తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య సాధ్యాసాధ్యాలు’ అంశంపై శనివారం చర్చా వేదిక నిర్వహించారు. చర్చావేదికలో వికాస సమితి నేతలతోపాటు, పలువురు ప్రొఫెసర్లు, ఉపాధ్యాయసంఘాల బాధ్యులు, అధ్యాపకులు, వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వికాస సమితి గౌరవ సలహాదారుడు, కేయూ ప్రొఫెసర్ సీతారామరావు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని చెబుతున్న కే సీఆర్‌ను అభినందించాల్సిందేనని, అయితే ఎలా అమ లు చేస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో భాగంగా కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంగ్లిష్ మీడియానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐదో తరగతి నుంచే అమలు చేయాలన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవాలి విద్యావ్యవస్థపై ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోవాలని డీటీఎఫ్ అధ్యాపక జ్వాల సంపాదకుడు గంగాధర్ సూచించారు. విద్యారంగంలో మార్పుల కోసం పలు కమిషన్లు చేసిన సిఫార్సులను ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉచిత విద్యను కేజీటూ పీజీ వరకు అందిస్తామని చెబుతూనే రేషనలైజేషన్ వంటి నిర్ణయాలు తీసుకోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. విద్యారంగానికి జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నా 3 నుంచి 4 శాతం నిధులే కేటాయిస్తున్నారని విమర్శించా రు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణా లు క్షీణిస్తున్నాయని పాలిటెక్నిక్ రిటైర్డ్ ప్రొఫెసర్ రామాచంద్రమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంటెక్ చేసిన అభ్యర్థుల్లోను ఉద్యోగానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం లేదన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా 3 లక్షల మంది బయటకు వస్తుండగా, వారిలో 13 శాతం మందికే ఉపా ధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. తెలంగాణ వికాస సమితి నల్లగొండ జిల్లా బాధ్యుడు బద్దం అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెంపొందిస్తేనే పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రభుత్వమే ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యత పెంపొందించాలి ఎస్సీఈఆర్టీ ఏఎంఓ సురేష్‌బాబు మాట్లాడుతూ ఉచిత విద్య అమలుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. బీఈడీ, డీఈడీ కళాశాలల్లో విద్యార్థులకు సరైన విధంగా శిక్షణ ఇవ్వాలని సూచిం చారు. కేయూ విద్యావిభాగం ప్రొఫెసర్ రాం నాథ్కిషన్ మాట్లాడుతూ విద్యలో నాణ్యత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సరైన ప్రాతిపదికన కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని సూచించారు. కేయూ మాజీ రిజిస్ట్రార్సదానందం, ప్రొఫెసర్ విజయ్‌బాబు, ప్రొఫెసర్ వీరన్ననాయక్, ఉపాధ్యాయుడు నర్సింహాస్వామి, తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్, సాదు రాజేష్, సైదిరెడ్డి, బిక్షపతినాయక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, రామ్మూర్తి, ఎం.శ్రీనివాస్, ఆదిలక్ష్మి, పద్మారావు, శంకర్‌నారాయణ, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆస్నాల శ్రీనివాస్, విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థలో పెనుమార్పులు
సూర్యాపేట : రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నోట వెలువడిన ఉచిత విద్య, కామన్ స్కూల్ విధానం అనే పదాలు విద్యా వ్యవస్థలోనే పెనుమార్పులకు శ్రీకారం చుట్టనున్నాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ వికాస సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేటలో ‘కేజీ నుంచి పీజీ వరకు ఉ చిత విద్య’ అనే అంశంపై నిర్వహించిన వర్కషాప్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభు త్వ విద్య ప్రస్తుతం శరవేగంగా ప్రైవేట్ వైపు వెళ్తుందాన్నరు. అన్ని వర్గాల ప్రజలు ప్రైవేట్ విద్యవైపు మొగ్గు చూపడంతో పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థికభారం పడుతుందన్నారు. కామన్‌స్కూల్ విధానం ద్వారా అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష నెరవేరడానికి కావాల్సిన ప్రణాళికను అందజేయాలని ఆయన కోరా రు. తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్రావు, అశోక్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో ప్రతి జిల్లాలో సదస్సులు ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారి సల హాలు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు లక్ష్మీ నారాయణ, సీతారాం, ఉపేందర్‌రెడ్డి, సురేష్‌బాబు, లెక్చరర్లు నారాయణరెడ్డి, వివేకన్‌రెడ్డి, రా మాంజనేయులు, మధుసూదన్‌రెడ్డి, గోనారెడ్డి, ఎంవీఎఫ్ వెంకట్‌రెడ్డి, స్టేట్ రీసోర్స్ పర్సన్ వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయ సం ఘాల నేతలు, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
పాత్రికేయులకు సర్కారు బిస్కట్!!
పాత్రికేయులను బెదిరిస్తున్నారని, రెండు తెలుగు వార్తా ఛానళ్లపై ఉన్న అనధికార నిషేధాన్ని ఎత్తేయడానికి సహకరించడంలేదని ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. పాత్రికేయులను వ్యక్తిగతంగా సంతృప్తి పరిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేటు గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి. పాత్రికేయుల పిల్లలకు ఉచితంగా విద్య అందించాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. తాము దారిద్ర్య రేఖకు దిగువన ఉంటున్నామని, అందువల్ల ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు భరించగలిగే స్థాయిలో లేమని కొన్ని పాత్రికేయ సంఘాల ప్రతినిధులు విద్యాశాఖకు ఇటీవల ఓ లేఖ రాశారు. అందువల్ల విద్యాహక్కు చట్టం కింద తమ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించాలని కోరారు. ఆ మేరకే ఇప్పుడు ఉచిత విద్యను అందించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైందని సమాచారం. -
3వ తరగతి నుంచే హాస్టల్
* త్వరలో కేజీ నుంచి పీజీపై నివేదిక సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘కేజీ టు పీజీ’లో భాగంగా హాస్టల్ సదుపాయంతో కూడిన ఇంగ్లిషు మీడియం ఉచిత నిర్బంధ విద్యను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ముసాయిదా నివేదికను విద్యాశాఖ రూపొందించింది. వచ్చే విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించే ఈ స్కూల్‌ను 15 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్ మంగళవారం ఈ పథకంపై అధికారులతో చర్చించారు. 3వ తరగతి నుంచి హాస్టల్ సదుపాయం కల్పించడం మంచిదనే భావన ఇందులో వ్యక్తమైంది. -
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు
కరీంనగర్ : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే ముఖ్య భూమిక అని, ప్రభుత్వ విద్య పరిరక్షణకు ఉపాధ్యాయులు నడుం బిగించాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 45 మందికి జ్ఞాపికలు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారని స్పష్టం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు ఉపాధ్యాయులు సహకరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయండి - ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి ఉపాధ్యాయులను కోరారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సర్వీసు రూల్స్ విషయం త్వరలో తేలిపోతుందన్నారు. దీపావళిలోగా పీఆర్సీ వస్తుందని స్పష్టం చేశారు. నవ తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయండి - జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ విద్యార్థులకు ఉత్తములుగా తీర్చిదిద్దుతూ నవ తెలంగాణ నిర్మాణం కోసం ఉపాధ్యాయులు బాటలు వేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ సూచించారు. పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పిస్తామని, బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది - రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే తెలంగాణ సాధనలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని, విద్యాబోధనలోనూ అదే స్ఫూర్తి ప్రదర్శించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని సమస్యలు తెలుసున్నారు. ఉపాధ్యాయుడిగా తాను పనిచేశానని, వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గడం విచారకరం - కలెక్టర్ వీరబ్రహ్మయ్య ప్రభుత్వ పాఠశాలల్లో భోజనవసతి, యూనిఫామ్, స్కాలర్షిప్స్, పుస్తకాలు మెరుగైన వసతులు కల్పిస్తున్నా విద్యార్థుల సంఖ్య తగ్గడం విచారకరమని కలెక్టర్ వీరబ్రహ్మయ్య అన్నారు. గత సంవత్సరం కన్న ఈ విద్యా సంవత్సరం 20 వేల మంది విద్యార్థుల సంఖ్య తగ్గడం బోధపడటం లేదని అన్నారు. గురువును మించిన దైవం లేదు - సర్దార్ రవీందర్‌సింగ్, కరీంనగర్ మేయర్ ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ అన్నారు. డీఈవో లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్, డీఎస్పీ రవీందర్, ఎస్ఏ పీవో రాజమౌళి, డెప్యూటీ ఈవోలు బి.భిక్షపతి, బి.జయవీర్రావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, నూలి మురళీధర్‌రావు, కొమ్ము రమేశ్, పోరెడ్డి దామోదర్‌రెడ్డి, కిషన్‌నాయక్ ఉన్నారు. -
కంప్యూటర్ విద్య... అంతా మిథ్య
నారాయణఖేడ్: కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. సర్కార్ స్కూళ్లలోని విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యనందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కంప్యూటర్ విద్య మూన్నాళ్ల ముచ్చటగా మారింది. లక్షల రూపాయలు వెచ్చించి కంప్యూటర్లు కొన్నప్పటికీ వాటిని ఎలా ఉపయోగించాలో చెప్పేవారు లేక అవన్నీ మూలనపడ్డాయి. సక్సెస్ చేద్దామని... 2008 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశ పెట్టింది. దీంతో అధికారులు లక్షల రూపాయలు వెచ్చించారు. కరెంటు సరఫరా లేని పాఠశాలలకు జనరేటర్ సౌకర్యం కూడా కల్పించారు. అయితే కంప్యూటర్ విద్యను నేర్పే బాధ్యతను మాత్రం ప్రైవేటు సంస్థకు అప్పగించారు. జిల్లాలో కంప్యూటర్ విద్య బోధన బాధ్యతలను ఎన్ఐఐటీ సంస్థకు ఐదేళ్ల పాటు కాంట్రాక్టు ఇచ్చారు. 2008లో ప్రాంభమైన కాంట్రాక్టు 2013 సెప్టెంబర్‌లో ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం కాంట్రాక్టు పొడిగించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో సంస్థ సిబ్బంది కంప్యూటర్ విద్యను షట్ డౌన్ చేశారు. కంప్యూటర్ విద్యను నేర్పేందుకు నియమించిన టీచర్లను తొలగించారు. అప్పటి నుంచి జిల్లాలోని 198 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఆగిపోయింది. కంప్యూటర్లు మూలన పడ్డాయి. దీంతో ఆయా పాఠశాలల్లో పనిచేసే 396 మంది కంప్యూటర్ టీచర్లు నిరుద్యోగులుగా మారారు. ప్రతి పాఠశాలకూ 11 కంప్యూటర్లు కంప్యూటర్ విద్య కోసం సక్సెస్ పాఠశాలలుగా ఉన్న ఉన్నత పాఠశాలలకు 11 కంప్యూటర్లను అందించారు. దీంతో పాటు కంప్యూటర్లు విద్యుత్ సరఫరా లేకున్నా నడిచేందుకు పాఠశాలకు ఒక్కో జనరేటర్‌ను అందించారు. విద్యార్థులు కంప్యూటర్ విద్యను అందించేందుకు పాఠశాలకు ఇద్దరు టీచర్లను ఎన్ఐఐటీ సంస్థ నియమించింది. వారికి నెలకు రూ.2300 వేతనంగా అందించేది. 2013 సెప్టెంబర్‌లో ఎన్ఐఐటీ సంస్థ కాంట్రాక్ట్ ముగియడంతో అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడంలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేజీ నుండి పీజీ వరకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ 2014 -15 విద్యా సంవత్సరం ప్రారంభమై ముడు నెలలు గడుస్తున్నా కంప్యూటర్ విద్యపై స్పందించడం లేదు. ఇప్పటికైన ఉన్నత లక్ష్యాలతో ప్రారంభించిన కంప్యూటర్ విద్యను ప్రభుత్వం కొనసాగించేలా సత్వర చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై జోగిపేట ఉప విద్యాధికారి పోమ్యానాయక్‌ను వివరణ కోరగా సక్సెస్ పాఠశాలల్లో ప్రస్తుత ఏడాది కంప్యూటర్ విద్య పూర్తి స్థాయిలో కొనసాగడం లేదని తెలిపారు. -
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
బాల్కొండ : తెలంగాణ రాష్ర్టంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ముప్కాల్ ఉన్నత పాఠశాలలో *21.20 లక్షల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులందరికీ ఆంగ్ల విద్య అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాలను 15 ఎకరాల్లో నిర్మిస్తామన్నారు. విద్యా విలువ వెల కట్ట లేనిదాన్నరు. విద్యా అందరికి బ్రహ్మస్త్రం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకనే... ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం లేకనే కూలి పనిచేసైనా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారన్నారు. ప్రభుత్వ పా ఠశాలల్లో మంచి విద్యనందిస్తే ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు పంపుతారన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించని వారు కూ డా ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. వారందరు అంకిత భావంతో పని చేయాలని సూచించారు. కరెంట్ కొరతను అధిగమిస్తాం.. రాష్ట్రంలోప్రస్తుతం విద్యుత్తు కొరత ఉన్న మాట వాస్తవమే అన్నారు. తెలంగాణకు 8 వేల మెగావాట్ల విద్యుత్తు అవసరం ఉంటే ప్రస్తుతం సగం నాల్గు వేల మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు. వచ్చే మూడేళ్లలో 24 గంటల విద్యుత్తును అందిస్తామన్నారు. సా గుకు ఏడు గంటల విద్యుత్తు సరఫరా అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వా ల హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి భ రతం పడుతామన్నారు. అడ్డగోలుగా ఇళ్లు కేటాయించుకుని బిల్లులు కాజేసిన పెద్దల భరతం పట్టి కేసులు పెడుతామన్నారు. అవసరమైతే జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు. బోగస్ బిల్లులను రికవరీ చేస్తామన్నారు. ఈనెల 19 నిర్వహించే కుటుంబ సర్వేకు అందరు సహకరించాలని కోరారు. తెలంగాణకు అన్యాయం సీమాంధ్ర పాలకుల పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని పోచారం అన్నా రు. మండలంలోని పోచంపాడ్ కూడలీ వద్ద గల బాలికల గురుకుల పాఠ శాలలో నూతనంగా *1.5 కోట్ల నిధులతో నిర్మించిన వసతి గృహన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాఫేధర్ రాజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతు.. సొమ్ము మనదైతే.. సోకు ఆంధ్రోళ్లు చేశారన్నారు. తెలంగాణ నిధులు, ఉద్యోగులను కొల్లగొట్టారన్నారు. సన్మానాలు వద్దు... మీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి వచ్చే ప్రజాప్రతినిధులకు పూల మాలలతో స న్మానాలు చేయడం వద్దని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాటలతోనైన సన్మానించ వచ్చన్నారు. సన్మానాల పేరిట గంటల సమయాన్ని వృథా చేసుకోవడం సరికాదన్నారు. -
'కేజీ టు పీజీ' ఉచిత విద్యకు సహకారం: టాటా
-
'కేజీ టు పీజీ' ఉచిత విద్యకు సహకారం: టాటా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణంలో టాటా గ్రూప్ సంస్థలు భాగస్వామ్యం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం కేసీఆర్‌తో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామిక, ఐటీ, విద్యా, మౌళిక సదుపాయాల కల్పనలో టాటా గ్రూప్ సహకారం తీసుకుంటాం అని అన్నారు. తమ సంస్థల అనుభవం, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని కేసీఆర్‌కు టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ హామీ ఇచ్చారు. కేజీ టు పీజీ ఉచిత విద్యా పథకానికి సహకారమందిస్తామన్నారు. మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను మార్చేందుకు సహకారం అందిస్తామని మిస్త్రీ తెలిపారు. -
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి
కలెక్టర్‌కు టీయూడబ్ల్యూజే వినతి సుబేదారి : జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని ఇండియన్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ) అనుబంధ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నాయకులు బుధవారం కలెక్టర్ జి.కిషన్‌ను కోరారు. బుధవారం కలెక్టర్ కిషన్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు పిన్నా శివకుమార్ మాట్లాడారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేశారని అన్నారు. అలాగే వరంగల్ జిల్లాలో కూడా జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లో యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారన్నారు. జిల్లా కేంద్రంలో పాటు వివిధ మండలాల్లో సుమారుగా 800 మంది జర్నలిస్టుల పిల్లలు ఇందుకు అర్హులని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వీరికి ఉచిత విద్యను అందజేయాలని వారు కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ జి. కిషన్ స్పందిస్తూ రంగారెడ్డి జిల్లాలో జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను పరిశీలించి చర్యలు తీసుకుంటానని, జిల్లా విద్యాశాఖాధికారికి ఈ విషయమై ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఐజేయూ నాయకుడు దాసరి కృష్ణారెడ్డి, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి విఠల్, తోట సుధాకర్, జిల్లా నాయకులు కంకణాల సంతోష్, సదాశివుడు, ఎండీ.వాజిద్, గోకారపు శ్యాం, బి.సునిల్‌రెడ్డి, నవీన్, ప్రదీప్ పాల్గొన్నారు. -
అక్షరం.. ఆమడదూరం
సాక్షి, మహబూబ్‌నగర్: కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్యను అందిస్తామని చెబుతున్న ప్రభుత్వాలు ఆచరణంలో మాత్రం విఫలమవుతున్నాయి. విద్యాభివృద్ధికి జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఆశించిన అక్షరాస్యత మాత్రం పెరగడం లేదు. గత రెండేళ్లలో జిల్లాలో బడిమానేసిన పిల్లల సంఖ్యను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. డ్రాపౌట్స్లో మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉండగా, జిల్లాలో గట్టు మండలం మొదటిస్థానం దక్కించుకున్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉంది. కారణం ఏదైనా ఏటా జిల్లాలో దాదాపు 53.21శాతం మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానేస్తున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల రాష్ట్రవిద్యాశాఖ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాలమూరు గణాంకాలు వెలుగుచూశాయి. జిల్లాలో డ్రాపౌట్స్ సంఖ్యచూసి రాష్ట్రప్రభుత్వం చూసి నివ్వెరపోయింది. 2011-12 విద్యాసంవత్సరంలో 12,126 మంది బడి మానేసిన వారుంటే అందులో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే ఉన్నారు. ఎస్సీలు 2,455 మంది విద్యార్థులు ఉండగా ఎస్టీలు 2,068 మంది ఉన్నారు. ఇక 2012-13 విద్యాసంవత్సరంలో కూడా ఇవే ఫలితాలు ఎదురయ్యాయి. బడిమానేసిన వారిలో 2,059మంది ఎస్సీ విద్యార్థులు ఉండగా, ఎస్టీలు 1,605 మంది ఉన్నారు. కదిలిన యంత్రాంగం బడుగు, బలహీనవర్గాల పిల్లలే చదువుకు దూరం కావడం పట్ల ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, విద్యాశాఖ దిద్దుబాటుకు ఉపక్రమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ‘బడిపండుగ’ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పిల్లలను స్కూళ్లకు పంపితే మధ్యాహ్న భోజనంతో పాటు దుస్తులు కూడా ఉచితంగా అందజేస్తామని ప్రచారం చేపట్టింది. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే ఫలితం ఉంటుదనే ఆలోచనతో జిల్లా విద్యాశాఖ ఆదిశగా కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం గ్రామాల్లోని యువత, డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీల ద్వారా ప్రచారాన్ని చేపట్టింది. తద్వారా ఈ ఏడాది ఇప్పటి దాకా 4,372 మంది బడిమానేసిన పిల్లలను తిరిగి చేర్పించగలిగారు. అయితే బడిలో చేరిన వారి కంటే ఇంకా బడిబయట ఉన్న వారి సంఖ్య 5,019 మంది ఉండటం గమనార్హం. గట్టు.. ఫస్ట్ గట్టు మండలంలో రాష్ట్రంలోనే అతితక్కువ అక్షరాస్యత శాతం 30 మాత్రమే నమోదైంది. ఇప్పటికీ 800 విద్యార్థులు బడిబయటే ఉన్నారు. వలసలు ప్రధానంగా ఉండే ఈ మండలంలో ఎక్కువమంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడం లేదు. రాయిపురం, పెంచికలపాడు తదితర గ్రామాల్లో బాలికల అక్షరాస్యత శాతం జీరోగా ఉంది. 15 ఏళ్లలోపే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. అలాగే కర్ణాటక సరిహద్దులో ఉన్న నందిన్నె, చింతలకుంట గ్రామాల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారు. వయోజనుల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు అమలుచేసిన గట్టు విద్యాజ్యోతి కార్యక్రమం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. బడిబాట కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇవ్వలేకపోతోంది. -
టాపర్ల భవిత ఉజ్వలం
* సీఎం జయలలిత ఆకాంక్ష * ర్యాంకర్లకు సత్కారం * నగదు ప్రోత్సాహం సాక్షి, చెన్నై: రాష్ట్రంలో విద్యాభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విద్యార్థులను ప్రోత్సహించే విధంగా పథకాలు అమల్లో ఉన్నాయి. ఉచిత విద్యా, ఉచిత బస్సు పాసులు, ఉచిత పుస్తకాలు, యూని ఫాం, షూ, పాదరక్షలు, సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా విద్యార్థులను బడి బాట పట్టించే విధంగా సంక్షేమ పథకాలను అందజేస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకుని తమిళ మాధ్యమంతో పదో తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో ర్యాంకులు సాధించే విద్యార్థులను స్వయంగా సీఎం సత్కరించడం ఆనవాయితీ.ఇందులో భాగంగా 2013-14కు గాను పదో తరగతి, ప్లస్ టూ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు శుక్రవారం ఉదయం సచివాలయంలో నిరాడంబరంగా సత్కారం చేశారు. ప్రోత్సాహం: ఇది వరకు మొదటి మూడు ర్యాంకులు సాధించే విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించే వారు. అయితే, ఈ ఏడాది తొలి ర్యాంకులోనే 19 మంది విద్యార్థులు ఉండడంతో, టాపర్లను మాత్రమే సత్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. పదో తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన 19 మంది విద్యార్థులకు తలా రూ.25 వేలు చొప్పున సీఎం జయలలిత అందజేశారు. ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకుంటూ మొద టి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు తలా రూ.10 వేలు చొప్పున నగదు ప్రోత్సాహం అందించారు. ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలల్లో తొలి ర్యాంకు సాధించిన ఒక అంధ విద్యార్థికి, ఒక బధిర విద్యార్థికి రూ.25 వేలు చొప్పున, సాంఘిక సంక్షేమ, పౌష్టికాహార పథకం, ప్రభుత్వ సేవా ఇల్లంలో చదువుకుంటూ తొలి ర్యాంకు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తలా రూ.5 వేలు చొప్పున, అటవీ శాఖ పరిధిలోని పాఠశాలల్లో చదువుకుంటూ మొదటి ర్యాంకులో నిలిచిన ఒక విద్యార్థికి రూ.25 వేలు అందజేశారు. మొత్తంగా పదో తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన 28 మంది విద్యార్థులకు ఆరు లక్షల పదిహేను వేలు నగదు ప్రోత్సహం అందజేశారు. ప్రశంసా పత్రాల్ని అందజేశారు. ఈ విద్యార్థుల ఉన్నత చదువుల బాధ్యతలను ప్రభుత్వం భరించనున్నది. ప్లస్ టూ: పదో తరగతి విద్యార్థుల సత్కారం అనంతరం ప్లస్‌టూలో మొదటి ర్యాంకులో నిలిచిన విద్యార్థులను సీఎం జయలలిత సన్మానించారు. మొదటి ర్యాంకు విద్యార్థికి రూ. 50 వేలు, మైనారిటీ, వెనుకబడిన సంక్షేమ పాఠశాలల్లో చదువుకుని మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి రూ.50వేలు, ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకున్న మొదటి ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు రూ.10వేలు చొప్పున, ప్రత్యేక ప్రతిభావంతుల స్కూళ్లలో మొదటి ర్యాంకు సాధించిన ఒక అంధ విద్యార్థికి, ఒక బధిర విద్యార్థికి తలా రూ. 50 వేలు సీఎం జయలలిత అందజేశారు. అలాగే, సాంఘిక సంక్షేమ, పౌష్టికాహార పథకం, ప్రభుత్వ సేవా ఇల్లంలో చదువుకుని మొదటి ర్యాంకు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తలా రూ. 6 వేలు చొప్పున, అటవీ శాఖ పాఠశాలల్లో మొదటి ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తలా రూ. 50 వేలు అందజేశారు. మొత్తంగా 14 మంది మొదటి ర్యాంకర్లకు నాలుగు లక్షల 92 వేలు నగదు ప్రోత్సాహం పంపిణీ చేశారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులందరితో సీఎం జయలలిత ముచ్చటించారు. అందరికీ మంచి భవిష్యత్తు ఉందని, ఉన్నత చదువుల్లో మరింతగా రాణించాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి వలర్మతి, సుబ్రమణియన్, కేసీ వీరమని, ఎంఎస్ఎం ఆనందన్, అబ్దుల్ రహీం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్, సలహాదారు షీలా బాలకృష్ణన్, పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి సబిత తదితరులు పాల్గొన్నారు. -
కేజీ నుంచి పీజీపై టీ-సర్కారు కసరత్తు షురూ!
-
ప్రతి ఊరూ బాసరే
* కేజీ నుంచి పీజీపై టీ-సర్కారు కసరత్తు షురూ! * తొలిదశలో 100 స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక * వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభం * బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ సదుపాయం * ముందుగా గ్రామీణ నియోజకవర్గాల్లో అమలు * తర్వాత ఐదారు గ్రామాలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు * సీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు కసరత్తు ప్రారంభించింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించే దిశగా సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్నికల సందర్భంగా పదే పదే చెప్పిన ఈ మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీనికి శ్రీకారం చుట్టాలని రాష్ర్ట ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తొలిదశలో గ్రామీణ నియోజకవర్గాల్లో కనీసం ఒక్కొక్కటి చొప్పున సమగ్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, తదుపరి దశల్లో వాటిని విస్తరించాలని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన మంగ ళవారం ఈ కార్యాచరణకు సంబంధించిన తొలి సమావేశం జరిగింది. విద్యార్థినీవిద్యార్థులకు వేర్వేరు హాస్టల్ సదుపాయాలతో ఇంగ్లిష్ మీడియంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందించాలన్నది ఈ కార్యాచరణ లక్ష్యం. దీని ప్రకారం వచ్చే ఏడాది జూన్ నాటికి గ్రామీణ నియోజకవర్గాల్లో ఒక్కో దానికి రూ. 10 కోట్ల చొప్పున వ్యయంతో 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని, తర్వాతి ఏడాది రెండు స్కూళ్లు, ఆపై నాలుగేళ్ల పాటు ఏటా రెండు స్కూళ్ల చొప్పున ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో అధికారులు చర్చించారు. క్రమంగా వీటిని మండల కేంద్రాలకు విస్తరించడం, ఆ తర్వాత ఐదారు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, వాటి పరిధిలో విద్యా సంస్థలను ప్రారంభించే అంశాలను పరిశీలించారు. గ్రామస్థాయిలో నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలనిఅధికారులు నిర్ణయించారు. దశలవారీగా విద్యాలయాల విస్తరణ... మొదట ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు, తర్వాత 6, 7 తరగతులు, ఆపైన క్రమంగా 10వ, 12వ తరగతుల వరకు విద్యా సంస్థలను విస్తరిస్తూ వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యనూ అందించే స్థాయికి వీటిని సమగ్ర విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. అయితే కేజీ నుంచి పీజీ వరకు ఒకే ప్రాంగణంలో వివిధ కోర్సులను అందించేలా విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తుండగా.. విద్యావేత్తలు మాత్రం మరో రకంగా సూచిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక స్థాయిలో పిల్లలను హాస్టల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు సిద్ధపడరని, ప్రత్యామ్నాయంగా గ్రామ స్థాయిలో నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. విద్యా సంస్థల స్వరూపం * ఒకే ప్రాంగణంలో ఇంగ్లీష్ మీడియంలో కేజీ నుంచి పీజీ కోర్సులు * స్కూళ్లలో ఆటస్థలం, లైబ్రరీ, హాస్టల్ సదుపాయాలు * గురుకుల విద్యాలయాలను ఆదర్శంగా తీసుకుని వసతుల కల్పన * ఒక్కో విద్యార్థిపై ఏటా రూ. 34 వేల ఖర్చు. మొత్తం విద్యార్థుల కోసం ఏటా రూ. 2.50 కోట్ల వరకు వ్యయం * 3 లక్షల మంది విద్యార్థులున్న 882 గురుకులాలకు ఇబ్బంది లేకుండా కొత్త విద్యా సంస్థల ఏర్పాటు -
పేదలకందని ‘ప్రయివేటు’ విద్య
ఉచిత విద్యకు యాజమాన్యాలు ససేమిరా అమలు కాని విద్యాహక్కు చట్టం స్పందించని ప్రభుత్వాలు నష్టపోతున్న పేద విద్యార్థులు నర్సీపట్నం : పేద విద్యార్థుల్లో విద్యా సుగంధాలు పరిమళించేందుకు ప్రభుత్వాలు ప్రత్యే క చట్టాలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో దానికి అనువైన పరిస్థితులు కల్పించకపోవడం వల్ల అమలు కావడం లేదు. ప్రభుత్వ విద్యను మెరుగుపరచడం, పేద విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు అయిదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ప్రయివేటు విద్యాసంస్థల్లోనూ పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించాలి. కానీ దీనిపై ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో ఒప్పందం కుదరలేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రయివేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను బట్టి 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. దీనికయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. ఒకటి నుం చి 8 తరగతుల వరకు వీటిని అమలు చేయా లి. దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తే జిల్లాలోని ప్రస్తుతమున్న సుమా రు 700 పాఠశాలల్లో 25 వేలకు మించి విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ప్రయివేటు పాఠశాలల్లో అందించే విద్యకు ఎంత ఖర్చవుతుందో లెక్కించి ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఇందుకు అంగీకరించలేదు. తమ సంస్థల్లో మంచి వసతులతో నాణ్యమైన విద్యా బోధన ఉంటుంది కాబట్టి ఫీజుల్ని మరింత పెంచాలని డిమాండ్ చేశాయి. ఆ విధంగా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలంటూ ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై అయిదేళ్లుగా ఏమీ తేలకపోవడంతో ఒక వ్యక్తి ప్రయివేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అమలు చేయడం లేదని ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటిస్తే పేదలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. -
కలగానే కార్పొరేట్ విద్య..!
ఇందూరు: పేద విద్యార్థులు సైతం కా ర్పొరేట్ కళాశాలల్లో చదవా లి.. ఉన్నతంగా ఎదగాలన్న ఉద్దేశంతో దివంగత ము ఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన కా ర్పొరేట్ కళాశాలల్లో ఉ చిత విద్య పథకం మ సకబారుతోంది. బ డుగు, బలహీనవర్గా ల విద్యార్థులకు వసతితో కూడిన ఉచిత విద్య అందని ద్రాక్షలా మారుతోంది. పదోతరగతిలో ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్లో నాణ్యమైన విద్యను అం దించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. వైఎస్ హయాంలో సకాలంలో విద్యార్థుల ను ఎంపిక చేసి కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించేవారు. అనంతరం ఈ పథకం అమలులో జాప్యం పెరుగుతూ వస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై.. తరగతులు నడుస్తున్నా.. విద్యార్థుల ఎంపికను మాత్రం చేపట్టడం లేదు. ఓ వైపు తరగతులు కొనసాగుతుండటం.. కళాశాలల్లో సీట్లు నిండిపోతుండటంతో పేద విద్యార్థులు ఈ పథకానికి దూరమవుతున్నారు. చేసేది లేక ఏదో కళాశాలలో చేరుతున్నారు. సమయానికి నోచుకోక 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లా లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలలో ఈపాటికే ప్రవేశాలు 80శాతం పూర్తయ్యాయి. తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. పేద విద్యార్థుల కోసం కా ర్పొరేట్ కళాశాలలల్లో కేటాయించిన సీట్లపై మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు నోటిఫికేషన్ జారీ చేసి, విద్యార్థుల దరఖాస్తులు ఆహ్వానించాలి. ఈవిషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో నెలరోజులు ఆలస్యంగా పేద విద్యార్థులు తరగతి గదిలో కాలు పెట్టాల్సి పరిస్థితి. మిగిలిపోతున్న సీట్లు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ కలిపి జిల్లాకు మొత్తం 183 సీట్లు ఉన్నాయి. ఇందులో బాలికలకు 110, బాలురకు 73 సీట్లుగా విభజించారు. ప్రతిఏటా సకాలంలో నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో చాలామంది విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ఫీజులు వెచ్చించి ప్రైవేటు కళాశాలలో ప్రవేశాలు పొందుతున్నారు. దీంతో ఈ పథకానికి సంబంధించి పదుల సంఖ్యలో సీట్లు ఖాళీగానే మిగిలిపోతున్నాయి. ఈ పథకంపైనే ఆశలు పెట్టుకుని ఉన్న విద్యార్థులు తరగతులు ప్రారంభమైన నెలరోజులకు కళాశాలల్లో ప్రవేశిస్తున్నారు. దీంతో చాలా సబ్జెక్టుల్లో వారు వెనుకబడుతున్నారు. విద్యార్థులు ఆలస్యంగా ప్రవేశాలు పొందుతున్నా వసతికి అయ్యే ఖర్చును లెక్కకడుతూ సంబంధిత కళాశాలలు లబ్ధి పొందుతున్నాయి. సాంకేతిక లోపంతోనే విద్యార్థుల నుంచి ఆన్లైన్లో ఈ-పాస్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఈ సైట్లో సాంకేతిక లో పం తలెత్తడంతోనే కార్పొరేట్ ఉచిత విద్య పథకానికి బ్రేక్ పడిందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు స్పందిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. నో టిఫికేషన్ జారీ చేసిన పక్షం రోజుల్లో సీట్లు భర్తీ చే యాల్సి ఉంటుంది. జిల్లాలో పేదవిద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు శ్రీ కాకతీయ, న్యూ కా కతీయ, శాంకరీ, నిర్మల హృదయ, క్షత్రియ జూని యర్ కళాశాలలను ఎంపిక చేసినట్లు అధికారులు తె లిపారు. ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని లేదంటే తరగతులు కోల్పోవాల్సి వస్తుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా
- అభివృద్ధే ఉద్యమంగా ముందుకు సాగుతాం - రాజకీయాలకతీతంగా అందరూ కలిసి రండి - విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి - నకిరేకల్‌లో భారీ స్వాగత సభ - పలువురు టీఆర్ఎస్లో చేరిక నకిరేకల్: అభివృద్ధిలో జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతానని విద్యాశాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రిగా బాధ్యత లు చేపట్టిన తరువాత నకిరేకల్‌కు వచ్చిన జగదీష్‌రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ సెంటర్లో ఆది వారం రాత్రి సన్మాన సభ ఏర్పాటు చేశారు. తొ లుత పట్టణ శివారు నుంచి మంత్రికి ఎదురేగి ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీప్‌పై మంత్రితో పాటు ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు వేముల వీరే శం, గాదరి కిషోర్‌లు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అధికారం వచ్చిందని నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధేలక్ష్యంగా పనిచేస్తానని చె ప్పారు. సీమాంధ్రపాలకులు చేసిన ద్రోహానికి తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు. దీనిని ప్రగతిపథంలో తీసుకురావాలంటే పార్టీలకతీతంగా అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అభివృద్ధి ఉద్యమం కొనసాగాలంటే ఆంధ్రాపార్టీల్లో ఉన్న వారంతా టీఆర్ఎస్లో చేరాలని కో రారు. ప్రజలు ఎన్నో నిర్బం ధాలు, కేసులు ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్నారని వారి ముఖాల్లో చిరునవ్వులు చిందేవిధంగా సమస్యలను పరిష్కరిస్తానన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చేస్తా ‘నేను చిన్నప్పుడు మా గ్రామంలోని పాఠశాలలో చెట్టుకింద కూర్చొని చదువు కున్నా.. మంత్రిగా పర్యటనలో భాగంగా ఆదివారం మా పాఠశాలకు వెళ్లినప్పుడు విద్యార్థులు చెట్ల కిందనే కూర్చొని విద్యనభ్యసిస్తున్నారు’ అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా గదులు, మూత్రశాలలు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్య ంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలన్నది కేసీఆర్ కలలు కన్న ప్రాజెక్టు అని తెలిపారు. ముమ్మాటికీ ఈ ప్రాజెక్టును అ మలు చేసి తీరుతామన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మంత్రి జగదీష్‌రెడ్డి మార్గదర్శకుడిగా ఉంటూ తనను ముందుకు నడిపించారన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నాడు అసెంబ్లీ గేట్ ముందు ఆందోళన చేసినప్పుడు పోలీ సులు తనను చిత్ర హింసలకు గురి చేశారన్నా రు. అయితే నేడు తెలంగాణ ఉద్యమం పుణ్యమాని ఎమ్మెల్యేగా గెలిచాక ఆ పోలీసులే సెల్యూట్ కొట్టి గౌరవిస్తున్నార న్నారు. ఈ సభలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండ నరేం దర్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య,హైకోర్టు న్యాయవాది భరత్‌కుమార్, డాక్టర్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ రాపోలు రఘునందన్, కట్టంగూర్, శాలిగౌరారం జెడ్పీటీసీలు మాద యాదగిరి, ఐయితగోని సునిత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమయాదగిరి, మారం భిక్షంరెడ్డి, సిలివేరు ప్రభాకర్, సుదర్శన్‌రెడ్డి, యానాల పాపిరెడ్డి, అశోక్‌రావు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి నర్సింహారెడ్డి, అయితగోని వెంకన్న, రహీం ఖాన్, శ్రీనివాస్, బందెల రాములు, మాదగొని సైదులు నాయకులు పూజర్ల శంభయ్య, వీర్లపా టి రమేష్, పెండెం సంతోష్, గద్దపాటి దాన య్య, కొడెదల చంద్రయ్య, బొజ్జ సుందర్, రవీందర్‌రెడ్డి, సైదులు, నకిరేకంటి నరేందర్ ఉన్నారు. టీఆర్ఎస్లో భారీగా చేరికలు నకిరేకల్‌లో మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే వీరేశం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరా రు. టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి రేగ ట్టే మల్లికార్జున్‌రెడ్డి, తక్కళపల్లి ప్రభాకర్రావులతో పాటు మరికొదరు టీఆర్ఎస్లో చేరారు. -
ఇది ఆరంభం మాత్రమే..
హుడాకాంప్లెక్స్: అధికారంలోకి వచ్చాక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలను మర్చిపోయారని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యపై ఇప్పటి వరకు చర్చ లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ఫీజులూం చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కామన్ మ్యాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు జంగయ్యయాదవ్ కొత్తపేట చౌరస్తాలో నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను గురువారం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డీఈఓ సోమిరెడ్డిలు పండ్ల రసాలు ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యాసంస్థలు ప్రారంభమైనా ఉచిత విద్యపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఎంతోమంది తమ చదువులు మధ్యలోనే ఆపే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు భారీ ఎత్తున ఫీజులు డిమాండ్ చేస్తుండటంతో ఎంతోమంది విద్యార్థుల చదువులు అగమ్యగోచరంగా మారుతున్నాయన్నారు. ఉచిత విద్యపై ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, అసెంబ్లీలో కూడా దీనిపై చర్చిస్తానని తెలిపారు. జంగయ్య యాదవ్ చేస్తున్న దీక్ష ప్రారంభమేనని ఉచిత విద్య అందజేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కామన్ మ్యాన్ ఫౌండేషన్ సభ్యులు రమావత్ లక్ష్మి, సతీష్, కిషోర్, గుజ్జ కృష్ణ, సి.రాజేందర్, బ్రహ్మంచౌదరి, ఐలేష్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీలు మారాల్సిన అవసరంలేదు తాను టీడీపీ పార్టీకి, ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని వచ్చిన కథనాలు అవాస్తవమని, కొందరు గిట్టనివారు ఇలాంటి దుష్ర్పచారం చేస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. రాజీనామా పట్ల వస్తున్న కథనాలపై విలేకరులు ఆయనను ప్రశ్నించడంతో ఈ విధంగా తెలిపారు. 40 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉండి ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యేగా గెలుపొందానని, పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: డీఈఓ సోమిరెడ్డి జంగయ్య యాదవ్ ఆమరణ నిరాహారదీక్ష ను విరమింపజేసిన రంగారెడ్డి జిల్లా డీఈఓ సోమిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే జంగయ్య యాదవ్ చేస్తున్న దీక్షపై అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
విద్యాహక్కుకు ‘ప్రైవేటు’ తూట్లు
- ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు అంతంతమాత్రంగా ప్రవేశాలు - గత ఏడాది యథేచ్ఛగా ఫీజులు వసూలు కానరాని టాస్క్ఫోర్స విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: విద్యాహక్కు చట్టం అమలుకు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు తూట్లు పొడుస్తున్నాయి. చట్ట ప్రకారం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సి ఉన్నా మూడేళ్లుగా అమలు చేయడంలేదు. చట్టం అమలయ్యేలా చూడాల్సిన అధికారు లు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేర డం లేదు. రానున్న విద్యా సంవత్సరంలోనూ ఈ విధా నం అమలయ్యే పరిస్థితి కానరావడం లేదు. దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అధికారులు పట్టించుకోవ డం లేదు. ఈ విధానం పకడ్బందీగా అమలు కావడానికి టాస్క్ఫోర్సు బృందం ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఇంతవరకు పట్టించుకోలేదు. దీంతో ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యాహక్కుకు వ్యతిరేకంగా ప్రవేశాలు చేపడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలలు సైతం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రవేశం కల్పించి ఉచితంగా విద్యనందించాలని నిర్దేశించింది. గత విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను వీరికి కేటాయించి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవే శం కల్పించాలని పేర్కొంది. గతంలో ప్రవేశం పొందిన బడుగు, బలహీ న వర్గాల విద్యార్థుల నుంచి కూడా ఫీజులు తీసుకోకూడదని స్పష్టం చేసింది. జిల్లాలో ప్రైవేటు యాజమాన్యా ల కింద ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాల లు 1300 ఉండగా వీటిలో ప్రస్తుతం 1.6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం వీరిలో నాలుగో వంతు మందికి ఉచితంగా విద్య అందించాలి. అయితే యాజమాన్యాలు ఇందుకు విరుద్ధంగా బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల నుంచి కూడా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీట్ల భర్తీకి రిజర్వేషన్.. ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను రిజర్వేషన్ ప్రకా రం భర్తీ చేయాలని చట్టం నిర్దేశించింది. అనాథలు, ఎయిడ్స్ బాధితులకు ఐదు శాతం, ఎస్సీలకు పది శాతం, గిరిజనులకు నాలుగు శాతం, బీసీలకు ఆరు శాతం సీట్లను కేటాయించింది. అయితే కేవలం వ్యాపార దృక్పథంతో పనిచేస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దీన్ని పట్టించుకోవడం లేదు. కానరాని టాస్క్‌ఫోర్స్ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రతి ఏడాదీ ప్రకటిస్తుంది. రెండో ఏడాది గడిచినా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కాకపోవడంతో ఈ విద్య సంవత్సరంలోనూ అదే తీరుగా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు అవకాశం లేకుండా పోయింది. ఫీజుల నియంత్రణపై పర్యవేక్షణ.. ఈ విషయాన్ని డీఈఓ జి.కృష్ణారావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అన్ని విద్యాసంస్థలపై ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలల్లో చట్టం అమలు, ఫీజుల నియంత్రణ వ్యవహారాలను జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు.