‘కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలి’
హైదరాబాద్: ప్రజలందరికీ ఉచితవిద్యను అందించాలనే సదాశయంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘కార్పొరేట్ విద్య-తల్లిదండ్రులు, ప్రభుత్వ కర్తవ్యం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కోదండరాం మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ వ్యవస్థను నియంత్రించాలని కోరారు. అధిక ఫీజుల నియంత్రణతోపాటుగా పర్మిషన్లను నియంత్రించాలని కోరా రు. ట్రస్మా అధ్యక్షుడు ఎస్.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్టం చేయాలని కోరారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్‌రావు, ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు సొగర బేగం, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.