jac Chairman Professor kodandaram
-
జిల్లాల విభజన ఏ ప్రాతిపదికన?
హైదరాబాద్: ఏ ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తున్నారో అర్థం కావడం లేదని, ఇది ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాల విభజన ప్రాతి పదికను ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయాలను చెప్పేందుకు నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే విభజన నిర్ణయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల ప్రాంతాల విషయంలో షెడ్యూల్ 5, భూరియా కమిటీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఆదివాసీలు అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నారని, 1/70 చట్టం అమలు కావడం లేదని అన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, కేసీఆర్‌కు నిజమైన ప్రేమ ఉంటే గిరిజనులకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డియాండ్ చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ.. రాష్ర్టంలో 12 శాతం ఉన్న ఆదివాసీలు స్వయంపాలిత జిల్లాలు కావాలని ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్నా, విస్మరించడం బాధాకరమన్నారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. ముందు తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడుతున్న ఆదివాసీల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ర్ట సాధన కంటే ఇది ప్రజాస్వామికమైన డిమాండ్ అన్నారు. కెచ్చల రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, టీడీపీ రాష్ర్ట నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్, కరుణం రామకృష్ణ, ఆర్ఎస్పీ నాయకుడు జానకి రాములు, న్యూ డెమోక్రసీ నాయకుడు పోటు రంగారావ్, ఆదివాసీ నాయకులు వట్టం నారాయణ, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు ఝాన్సీ, సూర్యం, ఎం. హన్మేష్, గౌతం ప్రసాద్, ఎస్ఎల్ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
వర్షంలో ట్యాంక్‌బండ్ అందాలు మధుర జ్ఞాపకం..
పచ్చని చెట్లు.. అందమైన సాయంత్రం.. సాగర్ గట్టున దోస్తులతో ముచ్చట్లు.. మేధో చర్చలు.. ఇరానీ హోటళ్లు అడ్డాలు.. డబుల్ డెక్కర్ బస్సులపై గెంతులేస్తూ ప్రయాణం.. నగరం అంటే హైదరాబాదే అన్నట్టు. ఇప్పుడు ఆ అందాల నగరం కనిపించడం లేదంటున్నారు తెలంగాణ ఉద్యమ ఉద్దండుడు, రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ముద్దసాని కోదండరాం. నగరంతో ఆయన అనుబంధం విడదీయరానిది. ఆనాటి ‘జ్ఞాపకాల’ను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో అనుబంధం ‘1972లో అనుకుంటా మెదటిసారి హైదరాబాద్ వచ్చాను. నాంపల్లి స్టేషన్ దగ్గర నాన్నతో కలిసి ఓ హోటల్లో దిగాను. హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ గురించి వినడమే గానీ అంతవరకు చూడలేదు. మొదటిసారి ఎగ్జిబిషన్ చూశాను. ఎంత ఆనందమేసిందో. తర్వాత మళ్లీ 1975లో ఓయూలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేరాను. రెండు సంవత్సరాలు ఇక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత ఢిల్లీకి ఎంఫిల్ చేరేందుకు వెళ్లాను. 1980లో తిరిగి వెనక్కి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ చుట్టూనే నా జీవితం. హైదరాబాద్ నగరాన్ని పరిచయం చేసింది తరగతుల్లోని సీనియర్లే. నగరమంతా తిప్పేవారు. ఒక్కొక్కరు ఒక్కో అంశంలో నిష్ణాతులు. ఇది తెలియదు అనే బాధ ఉండేది కాదు. హైదరాబాద్ నగరం విజ్ఞాన గనిగా ఉండేది. ప్రాణమిచ్చే స్నేహితులు ఉండేవారు. చాలా మంచి విషయాలు చెప్పేవారు. ఒక్కో గ్రూప్‌కు ఒక్కో అడ్డా.. అప్పట్లో మిత్రుల్లో భావజాలం ఆధారంగా గ్రూపులుండేవి. ఒక్కో గ్రూప్‌కు ఒక్కో సెంటర్ అడ్డా. పాత సోషలిస్టులకు అబిడ్స్, రచయితలకు బృందావన్ హోటల్, కమ్యూనిస్టులకు మరో సెంటర్, ఇరానీ హోటల్స్ మరొకరికి అడ్డాగా ఉండేవి. అక్కడ చాయ్ తాగుతూ, బిస్కెట్లు తింటూ, బన్ రుచి చూస్తూ, సమోసాలు నమిలేస్తూ గంటలు గంటలు చర్చలు నడిచేవి. ఎంఎఫ్ హుస్సేన్ ఎవరని అడిగా.. వయసులో పెద్దవాళ్లు అంతా సిటీలైట్, ఆల్ఫా హోటల్ తదితర చోట్ల కలిసేవారు. అలాంటి సమయంలో సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో పెయింటర్ ఒకరు కలిశారు. మా దోస్తులతో బాతాఖానీ వేస్తూనే ‘ఎవరతను’ అని అడిగా. మా స్నేహితులు ఒక్కసారిగా అవాక్కయి ‘ఆయన గొప్ప పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్. తెలియకపోవడం ఏంటి’ అని ప్రశ్నించారు. అబిడ్స్‌లోని ఓ హోటల్లో కూడా ఎక్కువగా కలిసేవారం. రాత్రి అంతా హోటల్స్ నడిచేవి. ఇక్కడ ప్రత్యేకమైన రాత్రి జీవితం ఉండేది. ఇది అందరూ మెచ్చే, ఆనందమైననగరం. ఆదివారం అంటే మాకు అందమైన రోజు. స్పెషల్ వంటకాలు, సినిమాలు, పబ్లిక్ గార్డెన్‌కు పిక్నిక్లు.. అంతా సరదా ప్రపంచం. డబుల్ డెక్కర్ బస్సులో సిటీ చుట్టేవారం. వర్షం వచ్చినపుడు ట్యాంక్‌బండ్ కట్టపై నిలబడితే ఆ అందం.. ఆనందం వేరుగా ఉండేది. 1980లో అనుకుంటా మత ఘర్షణలు జరిగాయి. దాంతో సిటీ స్వరూపమే మారిపోయింది. రాత్రి ఇరానీ చాయ్, దోస్తుల బాతాఖానీ పోయాయి. ఆ దశకం చివరి నుంచి కాలుష్యం, విపరీత రద్దీ పెరిగిపోయింది. నగరం బాగా విస్తరించింది. ఒకరినొకరు కలుసుకోవడం పోయింది. మళ్లీ ఆరోజులు చూడాలని ఉంది. కలిసి కూర్చోవడం, బేధాలు లేని సమైక్య జీవనం.. ప్రేమ పూర్వక పలకరింపులు రావాలి’. -
ఉద్యమం తెలిస్తే సగం మార్కులు వచ్చినట్లే
-
ఉద్యమం తెలిస్తే సగం మార్కులు వచ్చినట్లే
* విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి * ఈ పరీక్షలు ఆఖరు మజిలీగా భావించొద్దు * జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం * మహబూబ్‌నగర్‌లో ‘సాక్షి’ భవిత గ్రూప్ అవగాహన సదస్సు విజయవంతం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ ఉద్యమం గురించి తెలిస్తే సగం మార్కులు వచ్చినట్లేనని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉజ్వల భవిష్యత్ ఆశిస్తున్న నిరుద్యోగ యువకులు అందుకు తగినట్లుగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి తమ కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమం-చరిత్రపై పూర్తిస్థాయి పట్టుసాధిస్తేనే ఇది సాధ్యమన్నారు. మహబూబ్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన ‘సాక్షి’ భవిత గ్రూప్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉద్యమం గురించి అవగాహన ఉన్నవారికి వచ్చే టీఎస్పీఎస్సీ పరీక్షల్లో తిరుగులేదని, గ్రూప్స్‌లో 150 మార్కులు వచ్చినట్లేనని చెప్పారు. గతంలో గ్రూప్స్ పరీక్షల్లో తప్పినవారు ఒత్తిడికి లోనై ఎంతో ఆవేదన చెందేవారని, ప్రయత్నలోపం లేకుండా కష్టపడాలే తప్ప ఈ పరీక్షలను ఆఖరి మజిలీగా భావించొద్దని హితవు పలికారు. దివంగత ప్రొఫెసర్ జయశంకర్ కూడా ఏ విషయమైనా చదవిన తర్వాతే దాని గురించి క్లుప్తంగా వివరించేవారని గుర్తుచేశారు. ఉద్యమాన్ని విభాగాలుగా విభజించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. తొలి, మలిదశ ఉద్యమ పరిణామాలను లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. పునర్వ్యవస్థీకరణ చట్టం, శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టు, ప్రముఖ కవులు, రచయిత లు రాసిన తెలంగాణ చరిత్ర పుస్తకాలను చదవాలన్నారు. సంస్కృతిలోనే పౌరుషం ఉంది.. తెలంగాణ సంస్కృతిలోనే పౌరుషం దాగి ఉంది. ఆ పౌరుషమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. సిలబస్‌లో మన సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు. మీ సొంత ప్రణాళికలతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. ప్రతిదానికీ ఇతరులను అనుకరిం చడం ఉద్యోగార్థులకు సరికాదు. తెలంగాణ స్ఫూర్తితో యువత కష్టపడి గ్రూప్స్ ఉద్యోగాలు సాధిం చాలి. తెలంగాణ చరిత్రను పూర్తిగా ఆకళింపు చేసుకొని చదివితే విజయం మీదే. - నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి కారుచీకటిలో కాంతిరేఖ గ్రూప్స్ అభ్యర్థులకు కారుచీకటిలో కాంతిరేఖగా ‘సాక్షి’ భవిత అవగాహన సదస్సులు నిలుస్తున్నాయి. దేశ, రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై పట్టు సాధించాలి. గ్రూప్స్‌లో ర్యాంక్‌ను ఎకనామిక్స్ సబ్జెక్టు నిర్ధారిస్తుంది. ఆర్థికవ్యవస్థను విభాగాలుగా విభజించి చదవాలి. ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయం, జీడీపీ, పేదరికం తదితర అంశాలను క్షుణ్ణంగా చదవాలి. అభ్యర్థులు లక్ష్యం నిర్ధేశిం చుకొని చదివితే విజయం సాధించవచ్చు. - డాక్టర్ ఎస్. భూమన్నయాదవ్, ఆర్థిక శాస్త్ర నిపుణులు సమాజంపై అవగాహనే.. సమాజంపై పరిపూర్ణంగా అవగాహన ఉన్న వారే గ్రూప్స్‌లో ఉద్యో గం సంపాదించుకోవడంతోపా టు చేసే ఉద్యోగంలో కూడా సేవాదృక్పథంతో రాణిస్తారు. ఇక్కడ షార్ట్‌కట్స్ ఏమీ ఉండవు. పద్ధతి ప్రకారం చదివితేనే విజయం సాధించవచ్చు. నేను గ్రూప్-1కు శ్రద్ధపెట్టి చదివితే గ్రూప్-2లో 1986లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వచ్చింది. చాలా కాలం తర్వాత నోటిఫికేషన్ వచ్చినందున లక్ష్యం నిర్దేశించుకొని చదవాలి. - రాంకిషన్, జాయింట్ కలెక్టర్ ప్రణాళికాబద్ధంగా చదవాలి గ్రూప్స్‌లో ప్రణాళికబద్ధంగా చదివితే విజయం సాధించవచ్చు. నోటిఫికేషన్లో ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు లేకుండా ఉద్యోగాల భర్తీ జరుగుతాయి. హోం, గ్రౌండ్‌వర్క్‌ను ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోవాలి. నోటిఫికేషన్ వెలువడ్డాక ప్రతిక్షణం విలువైనదే అన్న విషయాన్ని వారు ఎప్పటికప్పుడు గుర్తుంచుకొని పరీక్షలకు సిద్ధం కావాలి. అప్పుడే విజయం వరిస్తుంది. - పి.విశ్వప్రసాద్, మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ -
ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పాలి
- ‘గ్రూప్స్’పై అవగాహన సదస్సులో ప్రభుత్వానికి కోదండరాం ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. యువతకు బతుకుదెరువు చూపించాల్సిన బాధ్యత కూడా ఉద్యమకారులందరిపైనా ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్న సర్కారు, ఇక్కడి నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో ‘గ్రూప్స్ సిలబస్- ప్రిపరేషన్ విధానం’పై తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అవగాహన సదస్సు నిర్వహించింది. సదస్సుకు కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఖాళీ అయ్యే ఉద్యోగాలను ఏటా భర్తీచేసే విధంగా రెగ్యులర్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. గ్రూప్స్ పరీక్షల్లో విజయం కోసం యువత ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధంకావాలన్నారు. అయితే జీవితంలో ఇదే అంతిమంగా భావించకూడదని, పోటీ పరీక్షల కోసం చేసిన కృషి భవిష్యత్‌లోనూ తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పారు. సామాజిక ఉద్యమాలు, మానవహక్కులు తదితర అంశాలపై ఓపెన్ యూనివర్సిటీ తయారుచేసిన పుస్తకాలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. 1968 నుంచి 2014 వరకు వివిధ దశల్లో జరిగిన తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అనుభవాలనే విజ్ఞానంగా..: హరగోపాల్ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొన్న యువత ఈ పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు తమ అనుభవాలనే విజ్ఞానంగా మార్చుకోవాలని టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు. ప్రత్యేక రాష్ట్ర సాకారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సోనియాగాంధీ, కేసీఆర్.. ఇలా ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. ప్రొఫెసర్ జయశంక ర్ గురించిన అంశాలను సిలబస్‌లో ఎందుకు చేర్చలేదని కొంతమంది అడుగుతున్నారని, ‘తెలంగాణ ఉద్యమంలో విద్యావ ంతుల పాత్ర’ అనే అంశంలోనే అందరి పాత్ర ఉంటుందని చెప్పారు. ‘వన్‌టైమ్’ కోరాం: ప్రొ. నాగేశ్వర్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉద్యోగులందరికీ ఒక ఇంక్రిమెంట్ ఇచ్చిన ప్రభుత్వం... నిరుద్యోగుల కోసం వన్‌టైమ్ రిక్రూట్మెంట్(అన్ని ఖాళీల భర్తీ) చేపట్టాలని శాసన మండలిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశానని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చెప్పారు. పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణను ప్రభుత్వమే ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. అభ్యర్థులు నిరంతరం కొత్త విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. బ్రోకర్ల మాయలో పడొద్దు: విఠల్ టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీలో అత్యంత పారదర్శకంగా వ్యహరిస్తుందని... కమిషన్ చైర్మన్, సభ్యులు తెలుసంటూ మోసానికి పాల్పడే బ్రోకర్ల మాయలో పడవద్దని కమిషన్ సభ్యుడు విఠల్ చెప్పారు. అటువంటి బ్రోకర్ల సమాచారాన్ని తమకందిస్తే వారిని జైలుకు పంపుతామన్నారు. పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణకు సంబంధించి యూపీఎస్సీలో ఎటువంటి విధానం ఉందో అటువంటి విధానాన్నే టీఎస్పీఎస్సీ అమలు చేస్తోందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నిజాయితీపరులైన అధికారులను అందించడమే కమిషన్ లక్ష్యమన్నారు. తపన ఉంటే సాధించొచ్చు: కిషన్‌రావు సాధించాలనే తపన ఉంటే ఎటువంటి లక్ష్యాన్నైనా తప్పకుండా సాధిస్తారని, ఉద్యోగ పరీక్షలకు శ్రద్ధతో సిద్ధం కావాలని ఆర్థిక విషయ నిపుణుడు ప్రొఫెసర్ కిషన్‌రావు చెప్పారు. గ్రూప్స్‌లో నెగ్గాలంటే మూడు నుంచి ఎనిమిది నెలల ప్రిపరేషన్ అవసరమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు తెలంగాణ ఎకానమీ గురించి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. అండగా ఉంటాం: చంద్రశేఖర్‌గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని తె లంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన నియామకాల్లో తెలంగాణ అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఐదేళ్లుగా లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్స్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో... కనీసం ఐదు వేల ఉద్యోగాలకైనా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుంటే నిరుద్యోగ యువతకు న్యాయం జరగదన్నారు. ఈ విషయమై త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. అవగాహన ముఖ్యం: అడపా అభ్యర్థులకు తెలంగాణ అస్తిత్వం, సామాజిక వారసత్వం, చరిత్ర, సంస్కృతిపై అవగాహనను పరీక్షించేలా ఆయా అంశాలను సిలబస్‌లో పొందుపర్చినట్లు టీఎస్పీఎస్సీ సలహా కమిటీ చైర్మన్ అడపా సత్యనారాయణ చెప్పారు. శాతవాహనులు, కాకతీయుల నాటి తెలంగాణ నుంచి ఆధునిక కాలం వరకు చరిత్రపై ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. మోటివేట్ చేసుకోవాలి: చంద్రావతి యువత ఉద్యోగాల సాధన కోసం తమను తామే మోటివేట్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సభ్యురాలు బానోతు చంద్రావతి సూచించారు. ఉద్యోగాలిప్పిస్తామని మోసపు మాటలు చెప్పే వారిని నమ్మవద్దని చెప్పారు. ఉద్యోగాలు కావాలంటే ఎవరైనా పోటీ పరీక్షలు ఎదుర్కోవాల్సిందేనన్నారు. రాజ్యాంగాన్ని చదవండి: ప్రొ. జీపీరెడ్డి గ్రూప్ పరీక్షల్లో ఎంపిక కావాలంటే రాజ్యాంగంలోని అధికరణలన్నింటినీ చదవాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ జీపీరెడ్డి సూచించారు. ప్రాథమిక హ క్కులు, న్యాయస్థానాల ద్వారా లభించిన హక్కులు, చాలెంజెస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్.. తదితర అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. -
ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పాలి
- ‘గ్రూప్స్’పై అవగాహన సదస్సులో ప్రభుత్వానికి కోదండరాం ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. యువతకు బతుకుదెరువు చూపించాల్సిన బాధ్యత కూడా ఉద్యమకారులందరిపైనా ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్న సర్కారు, ఇక్కడి నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో ‘గ్రూప్స్ సిలబస్- ప్రిపరేషన్ విధానం’పై తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అవగాహన సదస్సు నిర్వహించింది. సదస్సుకు కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఖాళీ అయ్యే ఉద్యోగాలను ఏటా భర్తీచేసే విధంగా రెగ్యులర్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. గ్రూప్స్ పరీక్షల్లో విజయం కోసం యువత ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధంకావాలన్నారు. అయితే జీవితంలో ఇదే అంతిమంగా భావించకూడదని, పోటీ పరీక్షల కోసం చేసిన కృషి భవిష్యత్‌లోనూ తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పారు. సామాజిక ఉద్యమాలు, మానవహక్కులు తదితర అంశాలపై ఓపెన్ యూనివర్సిటీ తయారుచేసిన పుస్తకాలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. 1968 నుంచి 2014 వరకు వివిధ దశల్లో జరిగిన తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అనుభవాలనే విజ్ఞానంగా..: హరగోపాల్ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొన్న యువత ఈ పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు తమ అనుభవాలనే విజ్ఞానంగా మార్చుకోవాలని టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు. ప్రత్యేక రాష్ట్ర సాకారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సోనియాగాంధీ, కేసీఆర్.. ఇలా ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. ప్రొఫెసర్ జయశంక ర్ గురించిన అంశాలను సిలబస్‌లో ఎందుకు చేర్చలేదని కొంతమంది అడుగుతున్నారని, ‘తెలంగాణ ఉద్యమంలో విద్యావ ంతుల పాత్ర’ అనే అంశంలోనే అందరి పాత్ర ఉంటుందని చెప్పారు. ‘వన్‌టైమ్’ కోరాం: ప్రొ. నాగేశ్వర్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉద్యోగులందరికీ ఒక ఇంక్రిమెంట్ ఇచ్చిన ప్రభుత్వం... నిరుద్యోగుల కోసం వన్‌టైమ్ రిక్రూట్మెంట్(అన్ని ఖాళీల భర్తీ) చేపట్టాలని శాసన మండలిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశానని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చెప్పారు. పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణను ప్రభుత్వమే ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. అభ్యర్థులు నిరంతరం కొత్త విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. బ్రోకర్ల మాయలో పడొద్దు: విఠల్ టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీలో అత్యంత పారదర్శకంగా వ్యహరిస్తుందని... కమిషన్ చైర్మన్, సభ్యులు తెలుసంటూ మోసానికి పాల్పడే బ్రోకర్ల మాయలో పడవద్దని కమిషన్ సభ్యుడు విఠల్ చెప్పారు. అటువంటి బ్రోకర్ల సమాచారాన్ని తమకందిస్తే వారిని జైలుకు పంపుతామన్నారు. పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణకు సంబంధించి యూపీఎస్సీలో ఎటువంటి విధానం ఉందో అటువంటి విధానాన్నే టీఎస్పీఎస్సీ అమలు చేస్తోందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నిజాయితీపరులైన అధికారులను అందించడమే కమిషన్ లక్ష్యమన్నారు. తపన ఉంటే సాధించొచ్చు: కిషన్‌రావు సాధించాలనే తపన ఉంటే ఎటువంటి లక్ష్యాన్నైనా తప్పకుండా సాధిస్తారని, ఉద్యోగ పరీక్షలకు శ్రద్ధతో సిద్ధం కావాలని ఆర్థిక విషయ నిపుణుడు ప్రొఫెసర్ కిషన్‌రావు చెప్పారు. గ్రూప్స్‌లో నెగ్గాలంటే మూడు నుంచి ఎనిమిది నెలల ప్రిపరేషన్ అవసరమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు తెలంగాణ ఎకానమీ గురించి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. అండగా ఉంటాం: చంద్రశేఖర్‌గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని తె లంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన నియామకాల్లో తెలంగాణ అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఐదేళ్లుగా లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్స్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో... కనీసం ఐదు వేల ఉద్యోగాలకైనా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుంటే నిరుద్యోగ యువతకు న్యాయం జరగదన్నారు. ఈ విషయమై త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. అవగాహన ముఖ్యం: అడపా అభ్యర్థులకు తెలంగాణ అస్తిత్వం, సామాజిక వారసత్వం, చరిత్ర, సంస్కృతిపై అవగాహనను పరీక్షించేలా ఆయా అంశాలను సిలబస్‌లో పొందుపర్చినట్లు టీఎస్పీఎస్సీ సలహా కమిటీ చైర్మన్ అడపా సత్యనారాయణ చెప్పారు. శాతవాహనులు, కాకతీయుల నాటి తెలంగాణ నుంచి ఆధునిక కాలం వరకు చరిత్రపై ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. మోటివేట్ చేసుకోవాలి: చంద్రావతి యువత ఉద్యోగాల సాధన కోసం తమను తామే మోటివేట్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సభ్యురాలు బానోతు చంద్రావతి సూచించారు. ఉద్యోగాలిప్పిస్తామని మోసపు మాటలు చెప్పే వారిని నమ్మవద్దని చెప్పారు. ఉద్యోగాలు కావాలంటే ఎవరైనా పోటీ పరీక్షలు ఎదుర్కోవాల్సిందేనన్నారు. రాజ్యాంగాన్ని చదవండి: ప్రొ. జీపీరెడ్డి గ్రూప్ పరీక్షల్లో ఎంపిక కావాలంటే రాజ్యాంగంలోని అధికరణలన్నింటినీ చదవాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ జీపీరెడ్డి సూచించారు. ప్రాథమిక హ క్కులు, న్యాయస్థానాల ద్వారా లభించిన హక్కులు, చాలెంజెస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్.. తదితర అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. -
‘కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలి’
హైదరాబాద్: ప్రజలందరికీ ఉచితవిద్యను అందించాలనే సదాశయంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘కార్పొరేట్ విద్య-తల్లిదండ్రులు, ప్రభుత్వ కర్తవ్యం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కోదండరాం మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ వ్యవస్థను నియంత్రించాలని కోరారు. అధిక ఫీజుల నియంత్రణతోపాటుగా పర్మిషన్లను నియంత్రించాలని కోరా రు. ట్రస్మా అధ్యక్షుడు ఎస్.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్టం చేయాలని కోరారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్రావు, ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు సొగర బేగం, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. -
చెరువులతోనే బతుకుదెరువు
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అవి పట్టుగొమ్మలు - వాటి పునరుద్ధరణ సక్రమంగా జరగాలి - జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ - గిర్మాపూర్ దాతర చెరువులో ‘మిషన్ కాకతీయ’ ప్రారంభం - జేఏసీ నాయకుల శ్రమదానం మేడ్చల్ రూరల్: చెరువులు.. పల్లెసీమలకు పట్టుగొమ్మలు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులు.. వాటి పునరుద్ధరణలో ప్రతి వ్యక్తీ పాలుపంచుకోవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆకాంక్షించారు. ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో మేడ్చల్ మండలం గిర్మాపూర్ దాతర చెరువులో శ్రమదానం చేశారు. రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాద, పారిశ్రామిక జేఏసీ నాయకులు మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ర్యాలీగా బయలుదేరి గిర్మాపూర్ దాతర చెరువుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరామ్ మాట్లాడుతూ.. కాకతీయులు చేపట్టిన చెరువుల తవ్వకాలను స్ఫూర్తిగా తీసుకుని మిషన్ కాకతీయ పనుల్లో తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు జేఏసీ శ్రమదానం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందన్నారు. చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటుందని.. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంటే అన్ని వర్గాల ప్రజలకు, జంతు, జీవరాశులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఆంధ్రా పాలకులు ఇక్కడి చెరువులను విస్మరించారని, ఎన్నడూ పూడిక తీసిన పాపాన పోలేదన్నారు. ఈ కారణంగానే ఎన్నో చెరువులు ఉనికిని కోల్పోయాయని తెలిపారు. పునరుద్ధరణలో భాగంగా చెరువుల్లోకి మొదటగా నీరు చేరుకునే కాల్వలను సరిచేయాలని అధికారులకు కోదండరామ్ సూచించారు. మిషన్ కాకతీయ పనులు సక్రమంగా అమలు కావాలని, ప్రజలు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల పరిస్థితి అస్తవ్యస్తం.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని చెరువుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. మిషన్‌కాకతీయ పనులు తెలంగాణకే వన్నె తెచ్చే పథకమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 74 చెరువులను తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన జేఏసీ నాయకులు శ్రమదానం చేయడం అభినందనీయమన్నారు. జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. చెరువుల ఉనికితోనే అన్ని వర్గాలకు జీవనం ఏర్పడుతుందని తెలిపారు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ఉద్యోగులు చెరువుల పునరుద్ధరణకు తమవంతు కర్తవ్యం నెరవేరుస్తామని తెలిపారు. చెరువులు బాగుపడి పంటలు పుష్కలంగా పండితే ప్రజల వలసలు తగ్గుతాయని గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు మధుసూదన్ పేర్కొన్నారు. మిషన్‌కాకతీయ పథకానికి తమవంతు సహాయంగా మే నెల ఒక రోజు జీతం రూ. 10 కోట్ల 50 లక్షలను విరాళంగా అందజేస్తున్నామని ప్రకటించారు. న్యాయవాదుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాజేందర్‌రెడ్డి, పారిశ్రామికవేత్తల సంఘం రాష్ట్ర చైర్మన్ సుధీర్‌రెడ్డి, ఇంటర్ విద్య జేఏసీ రాష్ట్ర చైర్మన్ మధుసూధన్‌రెడ్డి, గెజిడెట్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, ఇరిగేషన్ శాఖ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, జేఏసీ సభ్యుడు హమీద్ మహ్మద్ఖాన్లు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో మేడ్చల్ జెడ్పీటీసీ సభ్యురాలు జేకే శైలజ, సర్పంచ్ నవనీత, ఎంపీటీసీ సభ్యురాలు రజిత, మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ అంతిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఈశ్వర్, నారాయణగౌడ్, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓ శోభ, ఈఓఆర్డీ జ్యోతి, ఇరిగేషన్ శాఖ సీఈ రామకృష్ణ, ఎస్ఈ వెంకటేశ్వర్, డీఈ భీంరావు, ఈఈ నర్సింహులు, ఏఈ నర్సయ్య, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాంమోహన్, టీజీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు డీపీ రెడ్డి, జేఏసీ తూర్పు డివిజన్ చైర్మన్ చెల్మారెడ్డి, కన్వీనర్ సంజీవరావు, నియోజకవర్గ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, మండల ైచైర్మన్ మల్లారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మల్లారెడ్డి, మధుసూదన్, వేణుగోపాల్‌స్వామి, వెంకటేశ్వర్లు, కైలాసం, టీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్ స్వామి, సత్యనారాయణరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, నర్సింహ, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పదవిపై మమకారం లేదు: కోదండరాం
వనపర్తి: ‘తెలంగాణ ఉద్యమంలో మనం కీలక పాత్ర పోషించాం.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. మనకు ఓ పదవి ఉంటే బాగుంటుంది అని కొందరు సలహా ఇస్తున్నారు. అయితే, నాకు ఏ పదవీ అవసరం లేదు’ అని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. ప్రజల అవసరం తీర్చాలంటే పదవులే అవసరం లేదని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి జేఏసీ ప్రజలను చైతన్యం చేస్తుందన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక మహాసభలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత ప్రతి ఉద్యమకారుడిపై ఉందన్నారు. చదువుకున్న వాడి మౌనం సమాజానికి కీడు చేస్తోందని. . అందుకే ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలన్నారు. దీనివల్ల నీతివంతమైన పాలన అందుతుందన్నారు. తెలంగాణలో విద్యుత్ కొరతకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ప్రముఖ కవి, గాయకుడు గోరేటి వెంకన్న మాట్లాడుతూ మనను మనం ప్రశ్నించుకుని సన్మార్గంలో నడుస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిననాడే తెలంగాణ గోడు తీరుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం సంస్కృతి పోవాలన్నారు. టీఆర్ఎస్లోకి కొత్తగా వస్తున్న ఆయా పార్టీల నేతలు ప్రజలను దోచుకోకుండా ఓ కంట వారిని కనిపెట్టాలని కేసీఆర్‌కు సూచించారు. సమావేశంలో విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు. -
దేశానికే కేంద్ర బిందువులా తెలంగాణ
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం దేశ పటంలో కేంద్ర బిందువులా ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో భారతదేశ మ్యాప్‌లో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపర్చిన నమూనా మ్యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మన రాష్ర్టం మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కూడలిగా ఉందన్నారు. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు వ్యాపార కేంద్రంగా ఉంటుందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని రవాణ వ్యవస్థను పెంపొందించుకుంటే వ్యాపారాన్ని విస్తరించవచ్చన్నారు. గోదావరి, ప్రాణహితకు వంతెనలు నిర్మిస్తే అశేష అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుందని, రామగుండం నుంచి కాగజ్‌నగర్ వరకు పారిశ్రామికవాడలుగా మార్చుకునేందుకు అనువైన ప్రదేశంగా ఉందన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను మిగతా రాష్ట్రాల కన్నా అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమించాలని కోరారు. సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 29వ రాష్ట్రంగా దేశ చిత్రపటంలో నమోదు చేయడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. -
‘పోలవరం’ రద్దు చేయాలి
కోదండరాం డిమాండ్ తెలంగాణ వచ్చిన సంతోషం లేదని ఆవేదన ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం కాంట్రాక్టర్ల మేలుకే పోలవరం గ్రామ సభలను పరిగణనలోకి తీసుకోవాలి ఆర్డినెన్స్‌పై చంద్రబాబు సమాధానం చెప్పాలి హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చడం కాదు ఆదివాసీల ఉనికినే కనుమరుగు చేయనున్న పోలవరం ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలనే అంశాన్ని ఆది వాసీలు ముందుకు తేవాలని తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. కేంద్రప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఆర్డినెన్స్ పార్లమెంట్లో చట్టం కాకముందే ఉద్యమాన్ని ఉదృతం చేస్తే న్యాయం జరుగుతుందని కోదండరాం అన్నారు. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చడానికే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం లో రైతుల, ప్రజల ప్రయోజనాలు ఏమీలేవని ఆయన పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలోని ముంపు ప్రాంతాలను మరో రాష్ట్రానికి తరలించడం దేశంలో ఇప్పటి వరకు జరుగలేదన్నారు. సరిహద్దులను ప్రజల నిర్ణయాల మేరకు ఏర్పాటు చేయాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.పెసా చట్టం ప్రకారం ముంపు గ్రామాల గ్రామసభలు, మండల పరిషత్‌ల తీర్మానాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్డినెన్స్‌పై తన వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని, ఈ అంశాన్ని తాను శాసనమండలిలో లేవనెత్తనున్నట్టు చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు శ్రీరాంనాయక్, సిపిఎం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, నాయకులు వెంకటరమణ, ధర్మానాయక్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీల మునకతో తీరని వ్యథ సుందరయ్య కళానిలయంలో ఆదివారం తెలంగాణ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విజయోత్సవ సభలో కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ వచ్చినా మనలో పూర్తి సంతోషం లేదన్నా రు. ఆదివాసీ సమాజం మన కళ్ల ముందే మునిగిపోతుందనే బాధ ఉందన్నారు. అనేక రూపాల్లో పోరాటాలు చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. ఇది ఆంధ్రా వాళ్ల ఆధిపత్యం నుంచి బయటపడటానికి జరిగిన పోరాటమన్నారు. ఐతే పోలరం ప్రాజెక్ట్‌వల్ల ఆదివాసీలు మునిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు కాకుండా బలమైన సామాజిక వర్గం అక్కడ ఉంటే ఆ ప్రాజెక్టును నిర్మించేవారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నిజమైన మానవతావాది అయితే ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆలోచించాలన్నారు. కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని అన్నారు. ముంపునకు గురయ్యే ఆదివాసీలకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజల కలలను సాకారం చేయాలన్నారు. తెలంగాణ వచ్చిం దని సంబరాలు చేసుకోవడం కాదు వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగులు అవినీతిలో మునిగిపోవద్దని కోరారు. జాయింట్ యాక్షన్ కమిటి చైర్మన్ జగన్మోన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, ప్రొఫెసర్ హరగోపాల్, రాజకీయ విశ్లేషకులు వి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల విభజనలో అశాస్త్రీయ విధానాలు
ఇంటర్ విద్యా డెరైక్టరేట్ ఎదుట తెలంగాణ ఉద్యోగుల ధర్నా హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో ప్రభుత్వం అశాస్త్రీయ విధానాలు అమలు చేస్తోందని విమర్శిస్తూ ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యం లో సోమవారం ఇంటర్మీడియెట్ విద్యా డెరైక్టరేట్ ఎదుట తెలంగాణ ఉద్యోగులు మహా ధర్నా నిర్వహించారు. స్థానికత ఆధారంగా కాకుండా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా విభజన చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌ను ఆంధ్రా ప్రాంతానికి కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మహాధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల విభజన విషయం లో ఆంధ్రా ఉన్నతాధికారులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే కేటాయించాలని, స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలని డిమాండ్ చేశారు. తక్షణమే మార్గదర్శకాలను మార్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఒక ప్రాంతం ఉద్యోగులు మరో ప్రాంతంలో పనిచేసేందుకు సిద్ధంగా లేరన్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేపట్టాలన్నారు. ధర్నాలో ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. -
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే.. ఎత్తిపోతల సాధ్యం
పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే పాలమూరు ఎత్తిపోతల పథకం సాధ్యమవుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం పరిగిలోని కొప్పుల శారదా గార్డెన్స్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్రం - వర్తమాన సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు భారీగా హాజరయ్యారు. సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదని.. ఇది పాలకుల నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై ఆధిపత్యం కోసమే ఆంధ్రా ప్రాంత ప్రజలను పాలకులు రెచ్చగొడుతున్నారన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని ఏ సందర్భంలోనూ అనలేదని స్పష్టం చేశారు. 57 ఏళ్ల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటే.. అది ఏకాఏకి నిర్ణయం ఎలా అవుతుందని ప్రశ్నించా రు. రాష్ట్ర అసెంబ్లీ, రాజ్యసభ, లోక్‌సభల్లో నెలల తరబడి తెలంగాణ వెనుకబాటుపై చర్చలు జరిగాయన్నారు. హైదరాబాద్‌పై కొర్రీలు పెడితే ఊరుకోం: ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి సదస్సులో ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా పాలకులు హైదరాబాద్‌పై కొర్రీలు పెడితే ఊరుకునేది లేదని, సమైక్య రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాకే ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. ఉద్యోగాలు, భూములు అన్ని కోల్పోయామని, ఇప్పుడు తెలుగు జాతి కలిసుండాలంటున్న ఆంధ్రా పాలకులకు అభివృద్ధి విషయంలో తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ‘ఇది నిజాం కట్టిన చారిత్రక హైదరాబాద్.. హైదరాబాద్‌లేని తెలంగాణ వద్దు, కాంగ్రెస్ మరోమారు మోసం చేయబోతున్నది.. మనం ఇప్పుడే అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. కొన్ని పార్టీలు ఇక్కడ తెలంగాణ అంటూనే అక్కడ సమైక్యాంధ్ర అంటున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరోమారు మోసం చేసేందుకుయత్నిస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. తెలంగాణ పునర్నిర్మానంలోనూ తాము భాగస్వాములుగా ఉంటామన్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు ఏ మాత్రం తెలివిలేదని, హైదరాబాద్ శాంతి భద్రతలు ఢిల్లీ చేతిలో పెట్టమనటం సిగ్గుచేటన్నారు. నిన్నటి వరకు జై తెలంగాణ అన్న బీజేపీ నేడు వెనకడుగు వేస్తున్నదన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్, జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్, వికారాబాద్ డిప్యూటీ డీఈఓ హరి శ్చందర్, టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కే.హన్మంతు, టీజీవీవీ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి బస్వరాజ్, ఉపాధ్యక్షులు వెంకట్రాం, నియోజకవర్గ చైర్మన్ బసిరెడ్డి, టీజీవీపీ రాష్ట్ర నాయకులు జగన్, రమేష్, జేఏసీ జిల్లా కన్వీనర్ సదానందం, పరిగి సర్పంచ్ విజయమాల తదితరులు ప్రసంగించారు. కార్యక్రమానికి ముందు సాయిచంద్ కళా బృందం పాటలతో ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కల్కొడ నర్సింహులు, ఆంజనేయులు, లక్ష్మి, విజయలక్ష్మి, మునీర్, చెర్క సత్తయ్య, గోపాల్, మదన్‌రెడ్డి, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు. -
విచ్ఛిన్నానికే రెచ్చగొట్టుడు: ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర నాయకులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలన్నీ తెలంగాణ ఏర్పాటును విచ్ఛిన్నం చేసే కుట్రలేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జేఏసీ ‘సద్భావనాదీక్షలు’ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన రాజకీయపార్టీలన్నీ ఇప్పుడు మాటమారుస్తున్నాయని విమర్శించారు. విభజనపై నిర్ణయం వెలువడిన తరువాత సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. విభజనకు సహకరించి, శాంతిని కాపాడాలని కోరుతూ సద్భావనా దీక్షలు చేపడుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ వదిలి పోవాల్సి వస్తుం దని, ఆంధ్రాకు నీళ్లు రావని తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ ఇరుప్రాంతాల మధ్య స్వచ్ఛతను చెడగొడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు మరింత సంయమనం పాటించి శాంతిని కాపాడాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోదండరాం ప్రవేశపెట్టిన పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే ఇవ్వాలని, ప్రత్యేక రాష్ట్రానికి హైదరాబాద్‌నే రాజధానిగా ఉంచాలని, పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును వెంటనే ఆమోదించాలనే మూడు తీర్మానాలను దీక్షకు హాజరైన వారు ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. వీటిని కేంద్రప్రభుత్వానికి పంపుతామని కోదండరాం తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ హైదరాబాద్ లేని తెలంగాణ తలలేని మొండెం లాంటిదేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ భౌగోళికంగా ఏర్పాటయ్యేదాకా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే, తారకరామారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాకముందే కిరణ్‌కుమార్‌రెడ్డికి హోటళ్ల వ్యాపారం ఉందని, ఆయన తెలంగాణలో కర్రీస్ పాయింట్ పెట్టుకుంటే అభ్యంతరం లేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమిటని ప్రశ్నించారు. చంద్రశేఖరరావు తనకు తెలిసిన వ్యవసాయం చేసుకుంటున్నారని, చంద్రబాబు పాలు, పెరుగు అమ్ముకుంటున్నాడని చెప్పారు. ఎవరికి ఎందులో అనుభవం ఉంటే ఆ పని చేసుకోవడంలో తప్పులేదని చెప్పారు. ప్రజల ఆమోదం లేకుండా సీల్డ్కవర్లో సీఎం అయిన కిరణ్ వారి నెత్తిపై కూర్చుని సవారీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బహిరంగ చర్చకు రావాలంటూ కేసీఆర్ సవాల్ చేస్తే పారిపోయిన అసమర్థుడు, దద్దమ్మ కిరణ్‌కుమార్‌రెడ్డి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆంధ్రాను ఫిక్స్డ్ డిపాజిట్లో దాచుకుని హైదరాబాద్‌ను మాత్రం జాయింట్ అకౌంట్లో వేయాలంటున్నారు ఇదెక్కడి న్యాయమంటూ బీజేపీ సీనియర్ నాయకుడు సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌పై కన్నేసిన సీమాంధ్ర పెట్టుబడిదారులు, నాయకులే ఈ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం పోలీస్ వ్యవస్థ రాష్ట్రానికి సంబంధించిన అంశమని, హైదరాబాద్‌లో భద్రంగా ఉన్న సీమాంధ్రులు అభద్రత గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులతో చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. న్యూడెమోక్రసీ నేతలు పి.సూర్యం, కె.గోవర్దన్, జేఏసీ నేతలు దేవీప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, జైఆంధ్రా జేఏసీ ఛైర్మన్ ఎల్. జయబాబు ప్రసంగించారు. -
బొటానికల్ గార్డెన్ ప్రైవేట్ కంపెనీలకా?
సాక్షి, హైదరాబాద్: జంటనగరాల్లో బొటానికల్ గార్డెన్ స్థలాన్ని ఎకో టూరిజం పేరిట ప్రైవేట్ సంస్థలకు కేటాయించటంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమానికి వెనకాడబోమని హెచ్చరించారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆదివారమిక్కడ కొత్తగూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బొటానికల్ గార్డెన్లో మీడియా టూర్ నిర్వహించింది. డెలారా టూరిజం, ట్రాక్ ఇండియా సంస్థలకు కేటాయించిన స్థలాలను పరిశీలించింది. మల్టిప్లెక్స్‌లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్మాణం కోసం చెట్లను నరికి ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారని కోదండరామ్ దుయ్యబట్టారు. వీటికి సంబంధించిన ఫైల్ కాలుష్య నియంత్రణ మండలి పరిధిలో ఉందని, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్క్‌ల నిర్మాణాన్ని విదేశాల్లో ప్రభుత్వాలు విధిగా భావిస్తాయని మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య చెప్పారు. బొటానికల్ గార్డెన్లో నిర్మాణాలు ప్రకృతి విధ్వంసానికి దారి తీస్తాయని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ నాయకుడు అద్దంకి దయాకర్, గాయకుడు దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.