
ఏఎఫ్‌ఎస్ ఆన్‌లైన్ టెస్ట్‌లో సూర్యతేజశ్రీ ప్రతిభ
అమెరికాలో ఏడాది పాటు ఉచిత విద్యనభ్యసించే అరుదైన అవకాశం
నేడు బయలుదేరనున్న జంగారెడ్డిగూడెం విద్యారి్థని
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన బందిల సూర్యతేజశ్రీ విద్యలో చూపిన ప్రతిభ కారణంగా అమెరికాలో ఉచిత విద్యను అభ్యసించే అరుదైన అవకాశాన్ని సాధించింది. నిరు పేద కుటుంబానికి చెందిన సూర్యతేజశ్రీ తల్లి నాగమణి.. ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. విజయవాడ ఈడ్పుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ అండ్ నీట్ గురుకులంలో సూర్యతేజశ్రీ ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసింది. గతేడాది అమెరికా ఫీల్డ్ సరీ్వసెస్ సంస్థ(ఏఎఫ్‌ఎస్) కెన్నెడి లూగర్ యూత్ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించింది.
12 విభాగాల్లో నిర్వహించిన ఈ టెస్ట్‌లో 17 ఏళ్ల సూర్యతేజశ్రీ పాల్గొని ప్రతిభ చూపింది. దీంతో అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని హోప్కిన్‌లో ఏడాది పాటు ఉచితంగా డిప్లమో కోర్సును అభ్యసించేందుకు అర్హత సాధించింది. ఉచిత శిక్షణతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా ఏఎఫ్‌ఎస్ సంస్థ భరించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సూర్యతేజశ్రీ అమెరికా వెళ్లనుంది. ఏపీ ప్రతినిధిగా ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలను అక్కడ తెలియజేయడం, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఆమెకు అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నుంచి రూ.లక్ష నగదు, ల్యాప్‌టాప్‌ను సూర్యతేజశ్రీ అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment