ప్రతి నియోజకవర్గంలో పది రెసిడెన్షియల్ స్కూళ్లు
హైదరాబాద్: ప్రతి నియోజకవర్గంలో పది రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ కాలేజీలను ఒకే గొడుగుకిందకు తీసుకొస్తామని చెప్పారు. బుధవారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,190 రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా ఇంటర్ వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. కుల, మతాలతో సంబంధం లేకుండా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని ఆయన చెప్పారు. సాంకేతిక విద్యా విధానంలో కూడా అవసరమైన మార్పులు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.