
న్యూఢిల్లీ: విద్యా సంబంధిత టెక్నాలజీ కంపెనీ బైజూస్ ఉచిత విద్యా కార్యక్రమాన్ని విస్తరించనున్నట్టు ప్రకటించింది. 2025 నాటికి గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని కోటి మంది విద్యార్థులకు ఉచితవిద్య అందించనున్నట్టు తెలిపింది. 2025 నాటికి 50 లక్షల మందికి ఉచిత విద్య అందించాలన్న లక్ష్యాన్ని రెట్టింపు చేసింది. ఇందులో ఇప్పటికే 34 లక్షల మందిని ఉచిత విద్యా కార్యక్రమం ద్వారా చేరుకున్నట్టు బైజూస్ సహ వ్యవస్థాపకుడు దివ్య గోకులనాథ్ తెలిపారు. ఉచిత విద్య అందించేందుకు బైజూస్ 128 స్వచ్చంద సంస్థలతో (ఎన్‌జీవోలు) భాగస్వామ్యం కుదుర్చుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment