
విచారణ జరిపిస్తే నిజాలు బైటికొస్తాయి
రుణదాతలు, ఐఆర్‌పీపై బైజూస్ రవీంద్రన్ ఆరోపణలు
న్యూఢిల్లీ: దేశ, విదేశాల్లో రుణదాతలతో న్యాయవివాదం ఎదుర్కొంటున్న ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూస్ రవీంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ ట్రస్ట్, ఈవై ఇండియా, తాత్కాలిక పరిష్కార నిపుణుడు (ఐఆర్‌పీ) పంకజ్ శ్రీవాస్తవ కుమ్మక్కయారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి తనతో పాటు పలువురు ఉద్యోగులకు స్పష్టమైన ఆధారాలున్న డాక్యుమెంట్ అందిందని ఆయన చెప్పారు.
దీనిపై అధికారులు తక్షణం దృష్టి పెట్టాలని, లోతుగా విచారణ చేస్తే వాస్తవాలు బైటికొస్తాయని రవీంద్రన్ పేర్కొన్నారు. ఇకపై తానే స్వయంగా వివరాలను తెలియజేస్తానని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. సంస్థను పునరి్నరి్మంచేందుకు ప్రణాలికలను వివరించారు. కంపెనీ దివాలా చర్యల బారిన పడకుండా అన్ని ప్రయత్నాలు చేసినట్లు రవీంద్రన్ చెప్పారు. కాగా, అమెరికన్ అనుబంధ సంస్థ బైజూస్ ఆల్ఫా నుంచి 533 మిలియన్ డాలర్లను మళ్లించడానికి థింక్ అండ్ లెర్న్ (మాతృసంస్థ), దాని డైరెక్టర్ రిజు రవీంద్రన్, క్యామ్‌షాఫ్ట్ క్యాపిటల్ మోసపూరిత స్కీముకు తెరతీసినట్లు అమెరికన్ దివాలా కోర్టు తేలి్చంది.