Collusion
-
వాళ్లంతా కుమ్మక్కయ్యారు..
న్యూఢిల్లీ: దేశ, విదేశాల్లో రుణదాతలతో న్యాయవివాదం ఎదుర్కొంటున్న ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూస్ రవీంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ ట్రస్ట్, ఈవై ఇండియా, తాత్కాలిక పరిష్కార నిపుణుడు (ఐఆర్పీ) పంకజ్ శ్రీవాస్తవ కుమ్మక్కయారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి తనతో పాటు పలువురు ఉద్యోగులకు స్పష్టమైన ఆధారాలున్న డాక్యుమెంట్ అందిందని ఆయన చెప్పారు. దీనిపై అధికారులు తక్షణం దృష్టి పెట్టాలని, లోతుగా విచారణ చేస్తే వాస్తవాలు బైటికొస్తాయని రవీంద్రన్ పేర్కొన్నారు. ఇకపై తానే స్వయంగా వివరాలను తెలియజేస్తానని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. సంస్థను పునరి్నరి్మంచేందుకు ప్రణాలికలను వివరించారు. కంపెనీ దివాలా చర్యల బారిన పడకుండా అన్ని ప్రయత్నాలు చేసినట్లు రవీంద్రన్ చెప్పారు. కాగా, అమెరికన్ అనుబంధ సంస్థ బైజూస్ ఆల్ఫా నుంచి 533 మిలియన్ డాలర్లను మళ్లించడానికి థింక్ అండ్ లెర్న్ (మాతృసంస్థ), దాని డైరెక్టర్ రిజు రవీంద్రన్, క్యామ్‌షాఫ్ట్ క్యాపిటల్ మోసపూరిత స్కీముకు తెరతీసినట్లు అమెరికన్ దివాలా కోర్టు తేలి్చంది. -
మితిమీరిన వేగం, ఎగిసిపడిన మంటలు: తృటిలో తప్పిన ఘోరం
బెంగుళూరులో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది.నాగరభావి-నాయండహళ్లి మధ్య రింగ్‌రోడ్డుపై కారు వెనుక నుంచి బీఎంటీసీ(బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్) బస్సును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా భయాందోళనకు లోనయ్యారు. అయితే అదృష్టవశాత్తూ వారంతా సురక్షితంగా బయట పడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బైత్రయాణపుర ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగరభావి ప్రధాన రహదారిలోని చంద్రా లేఅవుట్ బస్టాండ్ వద్ద బస్‌స్టాప్‌లో ప్రయాణికులు వేచి ఉండగా, వేగంగా వచ్చిన కారు బస్సు వెనుక వైపు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. బస్సు పాక్షికంగా దగ్ధమైంది. అయితే ప్రయాణికులందరూ వెంటనే బస్సు నుండి క్రిందికి దిగి పోయారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి స్వల్ప గాయం కాగా, మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. -
కాంగ్రెస్-టీడీపీ చెట్టాపట్టాల్!
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేయి - సైకిల్ జోడీ హైదరాబాద్ సుదీర్ఘకాలంగా రాజకీయ శత్రువులుగా కొనసాగిన కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యాయి. స్థానిక సంస్థల కోటాలో ఆదివారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకోవాలని ఒప్పందాలు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరుగుతున్న రెండు సీట్ల కోసం మొదటి, రెండో ప్రాధాన్యతా ఓట్లను పరస్పరం వేసుకోవాలన్న అంగీకారానికి వచ్చాయి. ఈ జిల్లాలోని రెండు స్థానాల్లో టీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను నిలపగా, కాంగ్రెస్, టీడీపీ ఒక్కో అభ్యర్థిని మాత్రమే పోటీ పెట్టాయి. టీఆర్ఎస్ను ఓడించడానికి ఈ రెండు పార్టీలు పరస్పర అవగాహనకు వచ్చాయి. కాంగ్రెస్ మద్దతుదారులంతా ఆ పార్టీ అభ్యర్థికి తొలి ప్రాధాన్యతా ఓట్లు వేస్తారు. రెండో ప్రాధాన్యతా ఓట్లను టీడీపీకి వేస్తారు. అలాగే టీడీపీ ఓటర్లంతా తొలి ప్రాధాన్యతా ఓట్లను టీడీపీ అభ్యర్థికి, రెండో ప్రాధాన్యతా ఓట్లను కాంగ్రెస్‌కు వేసేలా రెండు పార్టీలు ఒప్పందానికి వచ్చాయి. మహబూబ్‌నగర్‌లోనూ రెండు స్థానాలుండగా, ఒక్కో స్థానం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు ఇదే తరహాలో ప్రాధాన్యతా ఓట్లను పరస్పరం వేసుకోవాలన్న అంతర్గ ఒప్పందానికి వచ్చినట్టు సమాచారం. ఖమ్మంలో మరో మహాకూటమి ఇకపోతే, ఖమ్మం జిల్లాలో ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను పోటీ పెట్టకుండా అక్కడి నుంచి పోటీచేస్తున్న సీపీఐ (పువ్వాడ నాగేశ్వరరావు) కి మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, టీడీపీలు కలిసి తమ ఓటర్లతో సీపీఐ అభ్యర్థికి వేయించడానికి క్యాంపులు కూడా నిర్వహించాయి. అక్కడ సీపీఎం కూడా సీపీఐ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. నల్గొండలో తలోదారి.. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా మారిన నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మిగిలిన పార్టీల ఓటర్లు ఎవరికి తోచిన దారిలో వారు నడుస్తున్నారు. ఇక్కడి నుంచి టీడీపీ పోటీ చేయకపోగా ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు దాదాపు 90లో సగం మంది కాంగ్రెస్ వైపు మరో సగం మంది టీఆర్ఎస్వైపు మళ్లినట్టు తెలుస్తోంది. ఖమ్మంలో మద్దతు ఇస్తున్న కారణంగా సీపీఐ ఈ జిల్లాలో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. సీపీఎం మాత్రం తటస్థ వైఖరితో ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించింది. ఆ ఒక్క ఓటు కీలకమవుతుందా? నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్), తేరా చిన్నపరెడ్డి (టీఆర్ఎస్) మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఫలితంపైనే ఉంది. ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల తేడానే ఉంటుందని అంటున్నారు. నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ప్రతినిధులు 1262 (ఓటర్లు) ఉండగా వీరిలో కాంగ్రెస్‌కు చెందిన మేళ్లచెరువు మండలం వెల్లటూరు ఎంపీటీసీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. పోలింగ్‌లో పాల్గొనే అవకాశాలు లేవు. పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆ ఒక్క ఓటు విషయంలో అంతా చర్చించుకుంటున్నారు. -
లారీ, బైక్ ఢీ : ఇద్దరి మృతి
తల్లాడ, న్యూస్‌లైన్ : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తల్లాడ మండలం రెడ్డిగూడెం క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాల వద్ద గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన హరికట్ల ప్రశాంత్ (25), కొణిజర్లకు చెందిన ఆర్ఎంపీ కట్ల రంజిత్‌కుమార్(35), కాశిమళ్ల రాంబాబులు గురువారం తల్లాడ సమీపంలోని దళిత కాలనీలో ఉన్న బంధువుల ఇంట్లో కర్మకాండలకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. వారు తల్లాడ నుంచి కొణిజర్లకు తిరిగి వస్తుండగా రెడ్డిగూడెం సమీపంలో ఖమ్మం నుంచి తల్లాడ వైపు వస్తున్న కర్రలోడు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్, రంజిత్‌కుమార్‌లు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాశిమళ్ల రాంబాబు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని 108 వాహనంలో ఖమ్మం తరలించారు. తల్లాడ ట్రైనీ ఎస్సై రవీందర్, ఏఎస్సైలు కేశవరావు, పుల్లారావులు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బయలు దేరిన పదినిమిషాల్లోనే... తల్లాడలో సమీప బంధువు కర్మకాండలకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న పది నిమిషాల్లో ఇద్దరు యువకులు మృతి చెందడంతో తల్లాడలోనూ, కొణిజర్లలోనూ విషాదచాయలు అలముకున్నాయి. తల్లాడ నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడం, ఇద్దరు మృతి చెందడంతో సంఘటన స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి.