Ravindran (30)
-
వాళ్లంతా కుమ్మక్కయ్యారు..
న్యూఢిల్లీ: దేశ, విదేశాల్లో రుణదాతలతో న్యాయవివాదం ఎదుర్కొంటున్న ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూస్ రవీంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ ట్రస్ట్, ఈవై ఇండియా, తాత్కాలిక పరిష్కార నిపుణుడు (ఐఆర్పీ) పంకజ్ శ్రీవాస్తవ కుమ్మక్కయారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి తనతో పాటు పలువురు ఉద్యోగులకు స్పష్టమైన ఆధారాలున్న డాక్యుమెంట్ అందిందని ఆయన చెప్పారు. దీనిపై అధికారులు తక్షణం దృష్టి పెట్టాలని, లోతుగా విచారణ చేస్తే వాస్తవాలు బైటికొస్తాయని రవీంద్రన్ పేర్కొన్నారు. ఇకపై తానే స్వయంగా వివరాలను తెలియజేస్తానని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. సంస్థను పునరి్నరి్మంచేందుకు ప్రణాలికలను వివరించారు. కంపెనీ దివాలా చర్యల బారిన పడకుండా అన్ని ప్రయత్నాలు చేసినట్లు రవీంద్రన్ చెప్పారు. కాగా, అమెరికన్ అనుబంధ సంస్థ బైజూస్ ఆల్ఫా నుంచి 533 మిలియన్ డాలర్లను మళ్లించడానికి థింక్ అండ్ లెర్న్ (మాతృసంస్థ), దాని డైరెక్టర్ రిజు రవీంద్రన్, క్యామ్‌షాఫ్ట్ క్యాపిటల్ మోసపూరిత స్కీముకు తెరతీసినట్లు అమెరికన్ దివాలా కోర్టు తేలి్చంది. -
కూతురు సర్టిఫికెట్ల కోసం వెళ్లాడు... శవమై తేలాడు
చెన్నై: ముంచెత్తిన వరద మిగిల్చిన విషాదగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆకలిదప్పులతో ఇబ్బందులు పడ్డ వారి పట్లనే సానుభూతి వ్యక్తం అవుతుండగా.. ఈ విపత్తులో కొంతమంది అత్యంత దయనీమైన పరిస్థితుల్లో ప్రాణాలే కోల్పోయారు. ఇలాంటి వారిలో ఒకరు గ్రీమ్స్ రోడ్డు ప్రాంతానికి చెందిన రవీంద్రన్(39). వీరుండే ప్రాంతానికి గురువారం వరదనీరు పోటెత్తింది. ఇతడి ఇంట్లోకి కూడా నీళ్లు వచ్చేయడంతో కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చేశారు. బయటకు వచ్చేశాకా.. వారికి ఇంట్లో ఉన్న సర్టిఫికెట్లు, రేషన్‌కార్డు గుర్తుకొచ్చాయి. విలువైన వస్తులు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. అయితే కూతురి సర్టిఫికెట్లను, ఇంటికి కావాల్సిన రేషన్ కార్డును పోగొట్టుకొంటే వాటిని తెచ్చుకోవడం కష్టమన్న భావనతో రవీంద్రన్ మళ్లీ ఇంట్లోకి వెళ్లారు. అంతే.. తీవ్రస్థాయికి చేరిన వరదనీటిలో ఆయన గల్లంతయ్యారు. దీంతో కుటుంబ సభ్యులకు ఆందోళన మొదలైంది. అప్పటి నుంచి గాలిస్తుండగా ఆదివారం స్థానికులు రవీంద్రన్ మృతదేహాన్ని గుర్తించారు. తమ సర్టిఫికెట్ల కోసమని వెళ్లి ప్రాణాలను కోల్పోయిన తండ్రి మృతదేహాన్ని చూసి రోదిస్తున్న రవీంద్రన్ పిల్లలను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. కాగా, వరదల్లో ముంచెత్తడంతో సర్వం కోల్పోయిన చెన్నై ప్రజలకు మద్రాస్ యూనివర్సిటీ చిన్న భరోసా ఇచ్చింది. ఈ వరదల్లో విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను పోగొట్టుకున్న వారికి వాటిని తిరిగి జారీ చేస్తామని ప్రకటించింది.