కూతురు సర్టిఫికెట్ల కోసం వెళ్లాడు... శవమై తేలాడు | Father died because of certificates | Sakshi
Sakshi News home page

కూతురు సర్టిఫికెట్ల కోసం వెళ్లాడు... శవమై తేలాడు

Published Mon, Dec 7 2015 2:39 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

రోదిస్తున్న రవీంద్రన్ కుటుంబసభ్యులు - Sakshi

రోదిస్తున్న రవీంద్రన్ కుటుంబసభ్యులు

చెన్నై: ముంచెత్తిన వరద మిగిల్చిన విషాదగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆకలిదప్పులతో ఇబ్బందులు పడ్డ వారి పట్లనే సానుభూతి వ్యక్తం అవుతుండగా.. ఈ విపత్తులో కొంతమంది అత్యంత దయనీమైన పరిస్థితుల్లో ప్రాణాలే కోల్పోయారు. ఇలాంటి వారిలో ఒకరు గ్రీమ్స్ రోడ్డు ప్రాంతానికి చెందిన రవీంద్రన్(39). వీరుండే ప్రాంతానికి గురువారం వరదనీరు పోటెత్తింది. ఇతడి ఇంట్లోకి కూడా నీళ్లు వచ్చేయడంతో కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చేశారు. బయటకు వచ్చేశాకా.. వారికి ఇంట్లో ఉన్న సర్టిఫికెట్లు, రేషన్‌కార్డు గుర్తుకొచ్చాయి. విలువైన వస్తులు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు.

అయితే కూతురి సర్టిఫికెట్లను, ఇంటికి కావాల్సిన రేషన్ కార్డును పోగొట్టుకొంటే వాటిని తెచ్చుకోవడం కష్టమన్న భావనతో రవీంద్రన్ మళ్లీ ఇంట్లోకి వెళ్లారు. అంతే.. తీవ్రస్థాయికి చేరిన వరదనీటిలో ఆయన గల్లంతయ్యారు. దీంతో కుటుంబ సభ్యులకు ఆందోళన మొదలైంది. అప్పటి నుంచి గాలిస్తుండగా ఆదివారం స్థానికులు రవీంద్రన్ మృతదేహాన్ని గుర్తించారు. తమ సర్టిఫికెట్ల కోసమని వెళ్లి ప్రాణాలను కోల్పోయిన తండ్రి మృతదేహాన్ని చూసి రోదిస్తున్న రవీంద్రన్ పిల్లలను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. కాగా, వరదల్లో ముంచెత్తడంతో సర్వం కోల్పోయిన చెన్నై ప్రజలకు మద్రాస్ యూనివర్సిటీ చిన్న భరోసా ఇచ్చింది. ఈ వరదల్లో విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను పోగొట్టుకున్న వారికి వాటిని తిరిగి జారీ చేస్తామని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement