Madras University
-
Sankari Sudhar: మాతృత్వం వరం! కెరీర్ రీ లాంచ్... అవసరం!
తైవాన్ మహిళల అక్షరాస్యత శాతం 99.99. ప్రపంచంలో ఆ దేశానిదే తొలి స్థానం. మనదేశంలో మహిళల అక్షరాస్యత శాతం 70 దగ్గరే ఉంది. కానీ ఆశ్చర్యంగా ఉన్నత చదువులు చదువుకుని కూడా గృహిణులుగానే ఉండిపోతున్న మహిళలు మన దేశంలోనే ఎక్కువ. కారణం మాతృత్వం. వీరిలో ఎక్కువ మంది కొంతకాలం ఉద్యోగం చేసి బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ సంరక్షణ కోసం ఉద్యోగాన్ని వదిలేస్తున్న వాళ్లే. వీరంతా ఉద్యోగం అవసరం లేని వాళ్లు కాదు.ఉద్యోగం అవసరం ఉండి కూడా తప్పని స్థితిలో ఉద్యోగం మానేస్తున్న వాళ్లే ఎక్కువ. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఉన్న అవకాశాలు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉండడం లేదు. దాంతో ఉన్నత చదువులు చదివినప్పటికీ గృహిణులుగా మిగిలిపోతున్న మహిళలు ఏడాదికేడాదికీ పెరుగుతున్నారు.చెన్నైకి చెందిన శంకరి సుధార్‌కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. ‘‘మా కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చి ఉంటే పాప నిద్ర పోయే సమయంలో ఆఫీస్ పని చేసుకునేదాన్ని. ఆ సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. నాలాంటి మహిళలను తిరిగి పని లోకి తీసుకురావడానికి నేనే ఒక వేదికను ఏర్పాటు చేశాను’’ అంటున్నారు శంకరి. ప్రపంచం ముందుకెళుతోంది!కంపెనీల ప్రతినిధుల సమావేశంలో శంకరి‘‘నేను మద్రాస్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశాను. ఎనిమిదేళ్లపాటు ఉద్యోగం చేసిన తర్వాత 2020లో మాతృత్వం కారణంగా ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. నాతోపాటు ఉద్యోగంలో చేరిన వాళ్లు ప్రమోషన్లతో పెద్ద పొజిషన్లకు వెళ్లారు. కొంతమంది విదేశాలకు వెళ్లారు.ప్రపంచం అంతా ముందుకెళ్తుంటే నేను మాత్రం నాలుగ్గోడల మధ్య చిక్కుకుపోయాననే భావన కలిగింది. నేను మాత్రమే కాదు ఇలా నాలాగ ఎందరో. మనదేశంలో 180 రోజులు ప్రసూతి సెలవులు, బిడ్డ సంరక్షణ కోసం మరో రెండేళ్ల సెలవులు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటి ఆచరణ మాత్రం కష్టసాధ్యమే. చాలా కంపెనీలు రాజీనామా ఇచ్చి మళ్లీ చేరమని సూచిస్తుంటాయి. ఒకసారి రాజీనామా ఇచ్చిన తర్వాత మళ్లీ చేరడం అనేది ఎందుకో కానీ చాలామంది విషయంలో సాధ్యం కావడం లేదు.ఆయా కంపెనీల్లో సదరు పని నైపుణ్యానికి సంబంధించిన ఖాళీలు లేకపోవడం వంటి అనేకం ఇందుకు కారణాలు కావచ్చు. ఇలాంటి స్థితిలో చాలా మంది మహిళలు నిస్పృహలోకి జారిపోతున్నట్లు నా పరిశీలనలో అవగతమైంది. 73 శాతం మంది ప్రసవం సమయంలో, యాభై శాతం మంది బిడ్డ సంరక్షణ కోసం ఉద్యోగంలో విరామం తీసుకుంటున్నారు. వారిలో కొంతమంది బిడ్డ పెద్దయిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరినప్పటికీ చేరిన ఆరు నెలల్లోనే మళ్లీ మానేస్తున్నారు. మరికొంతమంది అదే సంస్థలో ఉద్యోగంలో చేరినప్పటికీ తక్కువ వేతనానికి చేరాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు.కొత్త సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాలంటే వయసు అడ్డంకి అవుతోంది. మనదేశంలో మహిళల ఎదుగుదలకు కుటుంబం, పిల్లల బాధ్యతలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇలాంటి మహిళల్లో తమకంటూ ఉనికి కోల్పోయామనే ఆవేదన ఉంటోంది. మొత్తంగా నాకు తెలిసిందేమిటంటే... ఆర్థిక అవసరాల రీత్యా కావచ్చు, చదువుకుని ఖాళీగా ఉండడం ఇష్టం లేక కావచ్చు అనేక మంది మహిళలు కెరీర్‌ని పునరుద్ధరించుకోవాలని ఆశిస్తున్నారు. స్టార్టప్‌ల వైపు వెళ్తున్న వాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకు సరైన మద్దతు అందడం లేదు. మాతృత్వం అనేది నిజంగా వరమే. అది మహిళ పురోభివృద్ధికి నిరోధకంగా మారకూడదనిపించింది.ఆ ఖాళీని నేనే ఎందుకు భర్తీ చేయకూడదు అని కూడా అనుకున్నాను. సమాజంలోని ఈ పరిస్థితికి అద్దం పట్టే విధంగా ‘ఓవర్ క్వాలిఫైడ్ హవుస్ వైఫ్’ అని నా స్టార్టప్‌కి పేరు పెట్టాను. పిక్ మై యాడ్, నౌ ఇన్ టెక్నాలజీస్ వంటి ఏడు వందల కంపెనీలతో మా కంపెనీని అనుసంధానం చేశాను. ఆ కంపెనీల్లో కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, వీడియో ఎడిటింగ్, డెవలపింగ్, టెస్టింగ్ వంటి ఉద్యోగాల అవసరం ఉంటుంది.ఆయా కంపెనీలకు అవసరమైన స్కిల్స్ ఉన్న మహిళల రెజ్యూమ్‌ను వారి దృష్టికి తీసుకురావడం మా కర్తవ్యం. మా దగ్గర ఎన్రోల్ అయిన మూడు వేల ఐదు వందల మందిలో ఇప్పటికి ఆరువందలకు పైగా మహిళలు ఉద్యోగంలో చేరారు. నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారింది 2022లో. ఈ సర్వీస్‌లో నేను కూడా గౌరవప్రదమైన రాబడిని అందుకోగలుగుతున్నాను’’ అని తన రీ లాంచ్ జర్నీని వివరిస్తూ మహిళలు పని చేయడం తమ కోసం మాత్రమే కాదు దేశాభివృద్ధికి కూడా చాలా అవసరం అన్నారు శంకరి సుధార్. -
మెరీనా క్యాంపస్ మూగబోయింది
మద్రాసులో మరో తెలుగు దివ్వె కనుమరుగైంది. మూల ద్రావిడ భాషల్లో బహువచన ప్రత్యయమే లేదని పరిశోధనాత్మకంగా తేల్చిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య జీవీయస్సార్ కృష్ణమూర్తి మరణంతో ప్రతిష్ఠాత్మక మద్రాసు విశ్వవిద్యాలయం మెరీనా క్యాంపస్ తెలుగు శాఖ చిన్నబోయింది. తొంభై నాలుగేళ్ళ ఆ శాఖతో దాదాపు సగం కాలం అనుబంధం, అధ్యాపకత్వం మాస్టారివి. ఇన్నేళ్ళుగా మద్రాసులో తెలుగు భాషా పరిశోధనకూ, విద్యార్థులకూ పెద్దదిక్కుగా నిలి చిన మంచి మనిషిగా... మూల ద్రావిడ పదాలను ఎలా గుర్తించాలి, ఆ పదాల అర్థాలు, అర్థవిపరిణామానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన అరుదైన భాషావేత్తగా... జీవీయస్సార్ ఓ కొండగుర్తు. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ముప్పాళ్ళలో బతికిచెడ్డ కుటుంబంలో పుట్టిన జీవీయస్సార్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తూమాటి దొణప్ప వద్ద భాషాశాస్త్ర అధ్యయనం చేశారు. ‘ద్రావిడ భాషల్లో సమాన పదజాలం’పై పరిశోధించారు. అది ఆయనను పాండిత్యంలో సానబెట్టింది. చెన్నపురికి చేర్చింది. 1978 నుంచి ఇప్పటి దాకా మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖకు ఊపిరిగా నిలి పింది. ఆ శాఖలో దశాబ్దాల క్రితమే తెలుగు సాహితీ అధ్యయనాన్ని ప్రాయోగికంగా మారుస్తూ, జర్నలిజమ్ పేపర్‌ను ప్రవేశపెట్టడంలో కీలక భాగస్వామి ఆయన. భాషావికాసం - జర్నలిజాల బోధన, ద్రావిడభాషా పరిశోధన–రెండూ చివరి దాకా ఆయనకు రెండు కళ్ళు. జీవనపోరాటంలో కష్టనష్టాలెన్నో చూసిన అనుభవం ఆయనది. అందుకే, సుదూరం నుంచి వచ్చిన విద్యార్థుల ఈతిబాధలు మాస్టారికి తెలుసు. అలా 4 దశాబ్దాల్లో కొన్ని వందల మంది తెలుగు పిల్లలకు ఆయన గురువే కాదు, తల్లి- తండ్రి- ఆత్మబంధువయ్యారు. అవస రానికి సలహాల నుంచి అడిగిందే తడవుగా ఆర్థికసాయాల దాకా అన్నీ చూసే స్నేహితుడయ్యారు. ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనంలో కొన్ని పదుల మంది పరిశోధకులకు మార్గదర్శకులయ్యారు. కోరాడ రామకృష్ణయ్య, పింగళి లక్ష్మీకాంతం, నిడదవోలు వెంకటరావుల పరంపరలో ఆచార్య గంధం అప్పారావు, రామచంద్ర చౌదరి, అక్కిరెడ్డి తర్వాత తెలుగుశాఖకు అధ్యక్షులయ్యారు. ఏ హోదాలో ఉన్నా సరే చదువుకోవడానికొచ్చే పిల్లలతో అదే ఆత్మీయత. అదే వాత్సల్యం. రిటైరైన తరువాత కూడా రెండు దశాబ్దాలు రోజూ తెలుగు శాఖకు వచ్చి, విద్యార్థులను తీర్చిదిద్దిన నిష్కామకర్మ, నిబద్ధత జీవీ యస్సార్వి. ఎనిమిది పదులకు దగ్గరవుతున్నా... రోజూ ఉదయాన్నే వచ్చేదీ, పొద్దుపోయాకెప్పుడో రాత్రి ఆఖరున వెళ్ళేదీ ఆయనే. అనేక సార్లు ఆగుతూ వచ్చిన చదువును కొనసాగిస్తూ, సైన్స్ చదివి, ఎమ్మేలో లెక్కలు వేసి, జీవనోపాధికి అనేకానేక చిరు ఉద్యోగాలు చేసి, ఆనక తెలుగులో పరిశోధన రాసి ఆచార్యుడైన జీవీయస్సార్కు జీవితంలోని డబ్బు లెక్కలు తెలియవు. అడిగినవారికి లేదనకుండా, కష్టంలో ఉన్న విద్యార్థికి కన్నీరు విడవకుండా ఆయన చేసిన సాయాలు, దానాలు, చెప్పిన సలహాలు కొల్లలు. కానీ, తనకంటూ అవసరమున్నా ఎవరినీ అర్థించని ఆత్మాభిమాని. అనర్గళంగా ఆయన భాషాశాస్త్ర పాఠం చెబుతుంటే అది వినముచ్చట. పాఠంలో, పరిశోధనలో సీరియస్‌గా అనిపించే మనిషి... కిందకు దిగి, క్యాంటీన్లో కుర్రకారుతో కలసి సర దాగా కబుర్లాడుతుంటే అదో చూడముచ్చట. ఆచార్యుడైనా, శాఖాధ్య క్షుడైనా, ఆఖరుకు ‘తెలుగు విశ్వవిద్యాలయం’ ఉపకులపతి పదవి ఆఖరి క్షణంలో అందకుండా పోయినా– ఆయన మాత్రం అంతే సాదా సీదాగా గడిపేయడం ఓ అరుదైన ముచ్చట. నిన్నటి దాకా స్లెట్, యూజీసీ నెట్ నుంచి ఐఏఎస్ దాకా ఏ తెలుగు పరీక్షాపత్రం సిద్ధం చేయాలన్నా మాస్టారి చేయి పడాల్సిందే! భద్రిరాజు కృష్ణమూర్తి, పీఎస్ సుబ్రహ్మణ్యం, దొణప్పల తరువాతి తరంలో భాషాశాస్త్రంలో అవిరళ కృషి చేసిన జీవీయస్సార్ ఎక్కు వగా ఇంగ్లీషులోనే పరిశోధనలన్నీ రాశారు. వాటిని కనీసం పుస్తకంగా నైనా వేయలేదు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే వెళ్ళిపోవడంతో తెలుగు సమాజానికి ఆయన కృషి పూర్తిగా తెలియలేదు. సంపదనూ, సమ యాన్నీ, పరిశోధనా మేధనూ స్వీయప్రతిష్ఠ కోసం కాకుండా విద్యా ర్థుల కోసం వెచ్చించడం గురువుగా ఆయనలోని అరుదైన లక్షణం. ఆయన దగ్గర చదువుకొని కొందరు సినీ రచయితలయ్యారు. ఇంకొం దరు సాహితీవేత్తలయ్యారు. మరికొందరు విశాఖ, విజయవాడ, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ఆచార్యులయ్యారు. శాఖలో ఆయన ప్రత్యక్ష శిష్యులు మాడభూషి సంపత్ కుమార్ కూడా అదే శాఖకు అధ్యక్షులవడం సాక్షాత్ గురుకృప. చెన్నపట్నంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం చేసిన మైలాపూర్ భవనంతో, ఆ సొసైటీతో, అభ్యుదయ రచయితల సంఘంతో, ప్రపంచ తెలుగు సమాఖ్య - బీఎస్సార్కృష్ణ ‘రచన’ లాంటి సంస్థలతో జీవీయస్సార్ సాన్నిహిత్యం, వాటిల్లో ఆయన క్రియాశీలక కృషి చిరకాల జ్ఞాపకాలు. మల్లిక్, ఆచార్య కాసల నాగభూషణంతో కలసి ‘అరసం’ మద్రాసు శాఖ అధ్యక్షుడిగా ఆయన జరిపిన కార్యక్రమాలు వందలు. ‘నిండు మనంబు నవ్య నవనీత సమంబు... పల్కు దారుణ శస్త్ర ఖండనా తుల్యంబు...’ అన్న నన్నయ భారత చిత్రణ... సాహితీ పరిశో ధకుల మౌఖిక పరీక్షా సందర్భంలో మాస్టారికి సరిగ్గా సరిపోలుతుంది. సెమినార్లలో ఎవరు మాట్లాడినా, పరిశోధకులు ఏ తప్పు రాసినా ఆయన ఆత్మీయతను వదిలేసి, సత్యవాదిగా వాదనకు దిగేవారు. కొందరు సన్నిహితులకు సైతం రుచించకపోయినా, అది జీవీయస్సార్ జీవలక్షణం. భాషాశాస్త్రంలో çపట్టుసడలని పరిశోధనా దృష్టి, తెలుగు శాఖాభివృద్ధిలో పట్టువదలని కార్యదీక్ష, ఏదైనా సరే పట్టుకున్నది నెరవేరేలా చూసే వ్యవహార దక్షత, ఏటికి ఎదురీదే సాహసం, ఆప దలో పడితే తార్కికంగా చక్రం అడ్డువేసే శిష్యవాత్సల్యం, అవసరంలో ఉన్నవారికి సాయపడే సద్గుణం - ఇదీ ఆయన వ్యక్తిత్వం. అవన్నీ ఇకపై ప్రతి సందర్భంలోనూ చెన్నై తెలుగు వేదికపై ఆయన లేని లోటును పదే పదే గుర్తుచేస్తాయి. పదిమందీ గుర్తించేలా చేస్తాయి. అభ్యుదయ పరంపరాగత ఆత్మీయ గురువులకు అశ్రునివాళి. - డాక్టర్ రెంటాల జయదేవ -
పౌర ప్రకపంనలు : కమల్ హాసన్‌ను అడ్డుకున్న పోలీసులు
-
కమల్ హాసన్‌ను అడ్డుకున్న పోలీసులు
చెన్నై : బీజేపీ నియంతృత్వం వైపు అడుగులు వేస్తుందని మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ విమర్శించారు. దేశవ్యాప్తంగా చిచ్చు రగిలిస్తున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మద్రాస్ యునివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీబావం తెలిపేందుకు బుధవారం కమల్ అక్కడికి వెళ్లారు. కానీ కమల్‌ను లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్లకు తాళాలు వేయడంతో బయటినుంచే విద్యార్థులతో మాట్లాడారు. 'ఈ బిల్లు దేశానికి సంబంధించినది. ఏ బిల్లు వెనక్కి తీసుకోలేనంత గొప్పది కాదు. ఇది ప్రజలకు మంచి చేయదనుకుంటే ప్రభుత్వం దానిని వెనుకకు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఇవేవి పట్టించుకోకుండా నియంతృత్వ పాలనవైపు అడుగులు వేయడం దురదృష్టకరం' అని కమల్‌హాసన్ పేర్కొన్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో కమల్‌హాసన్ కూడా ఉన్నారు. (చదవండి : పౌర బిల్లుపై దీదీ కీలక వ్యాఖ్యలు..) Kamal Haasan: I am not allowed to go inside. Till I die, I will call myself a student, I have come here in that capacity to be their defender. I will keep voicing whether or not I have started a party and now that I have started a party it becomes my duty to be here. https://t.co/pkdsv1MFxP pic.twitter.com/56Kpn9AFHu — ANI (@ANI) 18 December 2019 -
విద్యార్థినులూ తస్మాత్ జాగ్రత్త
సాక్షి ప్రతినిధి, చెన్నై: వర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లు విద్యార్థినులను తమ ఇళ్లకు పిలిపించుకోవడం, ఒంటరిగా కలుసుకోవడంపై మద్రాసు యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీనివాసన్ నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని అతిక్రమించిన వారు కఠిన చర్యలకు గురికాక తప్పదని హెచ్చరించారు. కాలేజీ విద్యార్థినులు వర్సిటీ తరఫున పర్యాటకానికి, పరిశోధనల పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రొఫెసర్లు, తోటి విద్యార్థుల వల్ల లైంగిక దాడులు లేదా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లుగా ఇటీవల అనేక ఫిర్యాదులు అందాయి. ఉన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థినులపై లైంగిక వేధింపులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. ఇటీవల అరుంబుకోటై ప్రయివేటు కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థినులతో సెల్ఫోన్లో అసభ్య సంభాషణ చేయడం కలకలం రేపింది. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యాసంస్థల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలతో ఆగ్రహించిన తల్లిదండ్రులు అధ్యాపకులపై దాడులకు దిగడం, పోలీసులకు ఫిర్యాదులు చేయడం జరుగుతోంది. విద్యాలయాల్లో పెచ్చుమీరిపోతున్న ఇలాంటి దుర్భర పరిస్థితులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మద్రాసు యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీనివాసన్ అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు శనివారం స్పష్టమైన సర్క్యులర్‌ను జారీచేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. కళాశాల ప్రొఫెసర్లతో కాలేజీ విద్యార్థినులు కళాశాల పర్యాటకం పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లరాదు. పరిశోధనల కోసం ప్రొఫెసర్లతో కలిసి పీహెచ్డీ విద్యార్థినులు బయటకు వెళ్లాలన్నా, ఇతర ప్రదేశాల్లో బసచేయాలన్నా వర్సిటీ అనుమతి తీసుకోవాలి. వర్సిటీ, కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వర్సిటీ బా«ధ్యత. వర్సిటీ, కళాశాల ప్రాంగణంలో లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినులు, మహిళా ప్రొఫెసర్లు నేరుగా వైస్ చాన్స్‌లర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు స్వీకరించేందుకు ఇళ్లకు రావాల్సిందిగా ప్రొఫెసర్లు పిలిచినా విద్యార్థినులు వెళ్లరాదు. లైంగిక వేధింపుల ఫిర్యాదులను స్వీకరించేందుకు యూజీసీ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ రీటా జాన్ నాయకత్వంలో ఒక బృందాన్ని నియమించాం. విద్యార్థులు లేదా ప్రొఫెసర్లు లైంగిక చర్యలకు పాల్పడినట్లు రుజువైతే ఈ బృందం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆ సర్క్యులర్‌లో రిజిస్ట్రార్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ప్రొఫెసర్లను విద్యార్థినులు ఒంటరిగా కలవరాదు, వారి ఇళ్లకు వెళ్లరాదు అంటూ లైంగిక వేధింపులను అరికట్టేందుకు మద్రాసు యూనివర్సిటీ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా ఇలాంటి నిషేధాజ్ఞలు జారీచేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి చర్యలు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అమలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఆరుగురు రాష్ట్రపతులు ఇక్కడి విద్యార్థులే
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆరుగురు రాష్ట్రపతులను అందించిన ఘనత మద్రాసు యూనివర్సిటీకే సొంతమని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. మద్రాసు వర్సిటీ 160వ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించగా రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థుల్లో మూడింట ఒకవంతు అమ్మాయిలుండటంపై కోవింద్ మాట్లాడుతూ ఒక అమ్మాయిని చదివిస్తే రెండు కుటుంబాలను చదివించినట్లేనన్నారు. ‘ మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, ఆర్ వెంకట్రామన్, కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం.. వీరంతా ఇక్కడ చదువుకున్న వారే. తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి ఈ వర్సిటీ విద్యార్థే. నోబెల్ బహుమతులు అందుకున్న సీవీ రామన్, సుబ్రమణియన్ చంద్రశేఖర్‌లు సైతం ఇక్కడే చదువుకున్నారు. ఈ వర్సిటీలో విద్యనభ్యసించిన సుబ్బారావు, పతంజలి శాస్త్రిలు ప్రధాన న్యాయమూర్తులుగా ఎదిగారు. ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, సరోజినీనాయుడు, సీ సుబ్రమణియన్‌లు కూడా వర్సిటీకి పేరు తెచ్చినవారే. ఇంతటి పేరు ప్రఖ్యాతులు, ఘనత వహించిన విశ్వవిద్యాలయమిది’ అని కోవింద్ అన్నారు. స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్ పురోహిత్ పాల్గొన్నారు. -
కూతురు సర్టిఫికెట్ల కోసం వెళ్లాడు... శవమై తేలాడు
చెన్నై: ముంచెత్తిన వరద మిగిల్చిన విషాదగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆకలిదప్పులతో ఇబ్బందులు పడ్డ వారి పట్లనే సానుభూతి వ్యక్తం అవుతుండగా.. ఈ విపత్తులో కొంతమంది అత్యంత దయనీమైన పరిస్థితుల్లో ప్రాణాలే కోల్పోయారు. ఇలాంటి వారిలో ఒకరు గ్రీమ్స్ రోడ్డు ప్రాంతానికి చెందిన రవీంద్రన్(39). వీరుండే ప్రాంతానికి గురువారం వరదనీరు పోటెత్తింది. ఇతడి ఇంట్లోకి కూడా నీళ్లు వచ్చేయడంతో కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చేశారు. బయటకు వచ్చేశాకా.. వారికి ఇంట్లో ఉన్న సర్టిఫికెట్లు, రేషన్‌కార్డు గుర్తుకొచ్చాయి. విలువైన వస్తులు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. అయితే కూతురి సర్టిఫికెట్లను, ఇంటికి కావాల్సిన రేషన్ కార్డును పోగొట్టుకొంటే వాటిని తెచ్చుకోవడం కష్టమన్న భావనతో రవీంద్రన్ మళ్లీ ఇంట్లోకి వెళ్లారు. అంతే.. తీవ్రస్థాయికి చేరిన వరదనీటిలో ఆయన గల్లంతయ్యారు. దీంతో కుటుంబ సభ్యులకు ఆందోళన మొదలైంది. అప్పటి నుంచి గాలిస్తుండగా ఆదివారం స్థానికులు రవీంద్రన్ మృతదేహాన్ని గుర్తించారు. తమ సర్టిఫికెట్ల కోసమని వెళ్లి ప్రాణాలను కోల్పోయిన తండ్రి మృతదేహాన్ని చూసి రోదిస్తున్న రవీంద్రన్ పిల్లలను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. కాగా, వరదల్లో ముంచెత్తడంతో సర్వం కోల్పోయిన చెన్నై ప్రజలకు మద్రాస్ యూనివర్సిటీ చిన్న భరోసా ఇచ్చింది. ఈ వరదల్లో విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను పోగొట్టుకున్న వారికి వాటిని తిరిగి జారీ చేస్తామని ప్రకటించింది. -
అందమైన నఖ చిత్రాలు