చెన్నై : బీజేపీ నియంతృత్వం వైపు అడుగులు వేస్తుందని మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ విమర్శించారు. దేశవ్యాప్తంగా చిచ్చు రగిలిస్తున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మద్రాస్ యునివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీబావం తెలిపేందుకు బుధవారం కమల్ అక్కడికి వెళ్లారు. కానీ కమల్‌ను లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్లకు తాళాలు వేయడంతో బయటినుంచే విద్యార్థులతో మాట్లాడారు.
'ఈ బిల్లు దేశానికి సంబంధించినది. ఏ బిల్లు వెనక్కి తీసుకోలేనంత గొప్పది కాదు. ఇది ప్రజలకు మంచి చేయదనుకుంటే ప్రభుత్వం దానిని వెనుకకు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఇవేవి పట్టించుకోకుండా నియంతృత్వ పాలనవైపు అడుగులు వేయడం దురదృష్టకరం' అని కమల్‌హాసన్ పేర్కొన్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో కమల్‌హాసన్ కూడా ఉన్నారు.
(చదవండి : పౌర బిల్లుపై దీదీ కీలక వ్యాఖ్యలు..)
Kamal Haasan: I am not allowed to go inside. Till I die, I will call myself a student, I have come here in that capacity to be their defender. I will keep voicing whether or not I have started a party and now that I have started a party it becomes my duty to be here. https://t.co/pkdsv1MFxP pic.twitter.com/56Kpn9AFHu
— ANI (@ANI) 18 December 2019
Comments
Please login to add a commentAdd a comment