
సాక్షి, చెన్నై : తనను పోలీసులు వేధిస్తున్నారంటూ ప్రముఖ నటుడు కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం హైకోర్టులో అత్యవసర పటిషన్ దాఖలు చేశారు. కమల్ హాసన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్-2 చిత్ర షూటింగ్ సందర్భంగా చెన్నైలో ఇటీవల ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు టెక్నీషియన్ మృతి చెందారు. దీనికి సంబంధించి పోలీసుల విచారణ తీరుపై అభ్యంతకరంగా ఉందని, ప్రమాదాన్ని నటించి చూపించమంటూ పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. కమల్ పిటిషన్‌ను అత్యవసర విచారణకు మద్రాస్ హైకోర్టు స్వీకరించింది. (దర్శకుడు శంకర్‌కు తీవ్ర గాయాలు)