
‘విక్రమ్’ సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు కమల్‌హాసన్. ఆ చిత్రం హిట్ కావడంతో మరింత ఉత్సాహంగా తర్వాతి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నారాయన. అందులో భాగంగానే శంకర్ దర్శకత్వంలో చేయనున్న ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) సినిమా కోసం మేకోవర్ అయ్యేందుకు అమెరికా వెళ్లారు కమల్‌హాసన్.
మూడు వారాల పాటు యూఎస్‌లోనే ఉండి, ఈ సినిమాకి తగ్గట్టు తన ఫిజిక్‌ని మార్చుకోనున్నారని టాక్. కమల్-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇండియన్’ (1996)కి ‘ఇండియన్ 2’ సీక్వెల్‌గా రూపొందుతోంది. 2020లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభించారు. అయితే కరోనా, సెట్స్‌లో నెలకొన్న ప్రమాదం వంటి కారణాలతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. కమల్‌హాసన్ అమెరికా నుంచి రాగానే సెప్టెంబరులో ‘ఇండియన్ 2’ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment