Indian 2 Movie: Kajal Aggarwal took three and half hours for make up - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: ఇండియన్‌ 2కు కాజల్‌ మేకోవర్‌.. మేకప్‌కు మూడున్నర గంటలు!

Published Fri, Mar 3 2023 8:49 AM | Last Updated on Fri, Mar 3 2023 11:51 AM

Kajal Aggarwal Took Three and Half Hours For Make Up in Indian 2 Movie - Sakshi

మేకప్‌ గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది లోక నాయకుడు కమలహాసన్‌ పేరే. ఆయన పాత్రలకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో, గెటప్పులకూ అంతే ప్రాధాన్యం ఇస్తారు.  దశావతారం చిత్రంలో ఏకంగా 10 పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ పాత్రల కోసం ఆయన కేవలం మేకప్‌ కోసమే నాలుగైదు గంటలు వెచ్చించేవారు. ఇక ఇండియన్‌ చిత్రంలోని కమలహాసన్‌ 90 ఏళ్ల వృద్ధుడిగా మారిపోయి గుర్తు పట్టలేనంతగా అబ్బురపరిచారు.

ఇక అదే చిత్రంలో నటి సుకన్య కూడా ఆయనకు సరి సమాన మేకప్‌తో మేకోవర్‌ అయ్యి నటించి నప్పించారు. 1996లో విడుదలైన ఆ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్‌ –2 చిత్రం  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనేక ఒడుదుడుకుల మధ్య నాలుగేళ్లు గడిచిన ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటోంది. శంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటి కాజల్‌ అగర్వాల్, రకుల్‌ ప్రీతిసింగ్, ప్రియాస్‌నీ శంకర్, నటుడు సిద్ధార్థ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ చెన్నైలో జరుగుతోంది. 90 ఏళ్ల వృద్ధుడు స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమలహాసన్‌ నటిస్తుండగా, ఆయనకు జంటగా నటి కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం కాజల్‌ కూడా బామ్మ పాత్ర కోసం మేకోవర్‌ అవుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం తనూ మేకప్‌ కోసం రోజూ మూడున్నర గంటల సమయాన్ని ప్రత్యేకంగా వెచ్చిస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నారు. ఇది ఇండియన్‌ చిత్రంలో నటి సుకన్య నటించిన పాత్రకు సీక్వెల్‌ అని సినీ వర్గాలు  భావిస్తున్నారు.   

చదవండి: 
హీరోయిన్‌ రితికా సింగ్‌కు చేదు అనుభవం
తొలిసారి జిమ్‌లో అలా.. మహేశ్‌ బీస్ట్‌ లుక్‌ చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement