ఇండియన్‌ 2 కోసం కష్టపడ్డానన్న కాజల్‌.. సినిమాలో ఆమె పాత్ర లేదన్న డైరెక్టర్‌ | Is Kajal Aggarwal A Part Of Indian 3 And Not Indian 2? Director S Shankar Confirms | Sakshi
Sakshi News home page

డెలివరీ అయిన వెంటనే ఇండియన్‌ 2 కోసం కష్టపడ్డ కాజల్‌.. కట్‌ చేస్తే..

Published Sun, Jun 2 2024 1:04 PM | Last Updated on Sun, Jun 2 2024 4:37 PM

Kajal Aggarwal Not In Part of Indian 2 Movie, Shankar Confirms

తల్లయ్యాక హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అంతకుముందున్న క్రేజ్‌ను కంటిన్యూ చేయడం కత్తిమీద సామే అవుతుంది. కానీ బాలీవుడ్‌లో మాత్రం అలియా భట్‌, కరీనా కపూర్‌, కాజోల్‌.. ఇలా పలువురూ తల్లయ్యాక కూడా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. సౌత్‌లో నయనతారను మినహాయిస్తే మరెవరికీ తల్లిగా ప్రమోషన్‌ పొందాక గొప్ప క్యారెక్టర్లు రావడం లేదు. బహుశా అందుకేనేమో చాలామంది బ్యూటీలు పెళ్లంటేనే వెనకడుగు వేస్తున్నారు.

మా కోసం కథలు రాసుకుంటేనే..
తాజాగా ఈ ధోరణిపై కాజల్‌ అగర్వాల్‌ స్పందిస్తూ.. దక్షిణాదిన ఇంకా కొన్ని పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారు. అది త్వరలోనే మారుతుందని ఆశిస్తున్నాను. పెళ్లయి పిల్లలున్నప్పటికీ మేము ఏ పాత్రనైనా పోషించగలం. మమ్మల్ని శక్తివంతంగా చూపించే పాత్రలు మేకర్స్‌ డిజైన్‌ చేయాలి. వీళ్లు అలాంటి కథలు రాసుకుంటేనే కదా ప్రేక్షకులు చూసేది. కొంతవరకు పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఉదాహరణకు నయనతారనే తీసుకుంటే తను సెలక్ట్‌ చేసుకునే సినిమాలు చాలా బాగుంటాయి. యాక్షన్‌ రోల్స్‌, రొమాంటిక్‌ రోల్స్‌ ఇలా తనకు నచ్చినవి చేస్తోంది.

డెలివరీ అవగానే సినిమాలో..
నా విషయానికి వస్తే.. నేను కరోనాకు ముందే కొన్ని సినిమాలకు సంతకం చేశాను. వాటిని దాదాపు పూర్తి చేశాక ప్రెగ్నెన్సీ వచ్చింది. డెలివరీ అవగానే ఇండియన్‌ 2 సినిమాలో పని చేయాల్సి వచ్చింది. ఇందులో నా జీవితంలోనే కష్టమైన పాత్రను పోషించాను. డైరెక్టర్‌ శంకర్‌ సర్‌ నాకోసం ఎదురుచూసి లాస్ట్‌ షెడ్యూల్‌కు రమ్మన్నాడు. ఎంతో కష్టంగా ఉన్న నా పాత్రను పూర్తి చేసేశాను అని చెప్పుకొచ్చింది.

ఇండియన్‌ 2లో కాజల్‌ లేదు
శనివారం (జూన్‌ 1న) జరిగిన ఇండియన్‌ 2 ఆడియో లాంచ్‌లో డైరెక్టర్‌ శంకర్‌ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు. ఈ కార్యక్రమం వేదికగా భారతీయుడు 2లో కాజల్ లేదని వెల్లడించాడు. తను మూడో భాగంలో ఉంటుందని తెలిపాడు. అసలు తనను తీసేసిన విషయం కాజల్‌కైనా తెలుసా? అని ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఇండియన్‌ 2లో ఆమె లేదని తేల్చేయడంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రం జూలై 12న గ్రాండ్‌గా విడుదల కానుంది.

చదవండి: వావ్‌ అనిపించినప్పుడల్లా రూ.500 చేతిలో పెడ్తాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement