వావ్‌ అనిపించినప్పుడల్లా రూ.500 చేతిలో పెడ్తాడు! | Sanjay Leela Bhansali Gives Rs 500 When Actors Deliver Great Shot: Jayati Bhatia | Sakshi
Sakshi News home page

అద్భుతంగా యాక్ట్‌ చేస్తే రూ.500, నన్నైతే ప్రేమగా ముద్దాడి, హత్తుకుంటాడు!

Published Sun, Jun 2 2024 11:25 AM | Last Updated on Sun, Jun 2 2024 12:16 PM

Sanjay Leela Bhansali Gives Rs 500 When Actors Deliver Great Shot: Jayati Bhatia

సంజయ్‌ లీలా భన్సాలీ.. బాలీవుడ్‌లోనే కాదు యావత్‌ దేశంలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు. ఈయన సినిమాల్లో ఒక్కసారైనా నటించాలని కోరుకునే నటీనటులు ఎందరో! తను తెరకెక్కించే సినిమాలన్నీ అద్భుత కళాఖండాలుగా దర్శనమిస్తాయి. ఈ మధ్యే ఈయన హీరామండి అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించాడు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

ఆత్మీయంగా హత్తుకుని..
ఈ సిరీస్‌లో నటించిన జయంతి భాటియా తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. 'సంజయ్‌ లీలా భన్సాలీ నటీనటులపై ఎంతో ప్రేమ చూపిస్తాడు. నేను ఉదయం సెట్‌లోకి వెళ్లగానే ఆత్మీయంగా హత్తుకుని బుగ్గన ముద్దుపెట్టుకునేవాడు. మమ్మల్ని ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. అలాగే ఏదైనా సన్నివేశంలో ఎవరైనా అద్భుతంగా నటించారంటే వారిని అభినందిస్తూ రూ.500 ఇచ్చేవాడు.

మూడుసార్లు..
అలా నాకు మూడుసార్లు ఇచ్చాడు. ఆ రూ.1500 భద్రంగా దాచుకున్నాను' అని చెప్పింది. నటుడు ఇంద్రేశ్‌ మాలిక్‌ కూడా ఈ సిరీస్‌లో నటించినప్పుడు ఓ సన్నివేశం అద్భుతంగా రావడంతో తనకు రూ.500 ఇచ్చాడు. అప్పటికే ఆ సీన్‌లో నుంచి ఇంద్రేశ్‌ బయటకు రాలేక ఏడుస్తూ ఉండటంతో భన్సాలీ అతడిని హత్తుకుని మరీ ఓదార్చాడు. కాగా హీరామండి సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హ, అదితిరావు హైదరి, రిచా చద్దా, సంజీదా షైఖ్‌, షర్మిన్‌ సెగల్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

చదవండి: ప్రేక్షకులను అనుమతించని థియేటర్ యాజమాన్యం.. రంగంలోకి పోలీసులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement