సూరి కథానాయకుడిగా నటించిన చిత్రం గరుడన్. శశికుమార్, ఉన్ని ముకుందన్, వడివుక్కరసి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం గరుడన్. దర్శకుడు వెట్రిమారన్ కథను అందించి తన గ్రాస్‌రూట్ స్డూడియో కంపెనీ సంస్థ కె.కుమార్‌కు చెందిన లార్క్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి దురై సెంథిల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ విడుదల కాగా.. స్థానిక నక్కలజాతి ప్రజలను థియేటర్‌లోకి అనుమతించని ఘటన మరోసారి వివాదంగా మారింది. ఇంతకు ముందు ఇలాంటి ఘటనే చెన్నైలోని ఒక థియేటర్‌లో జరిగింది. తాజాగా గరుడన్ చిత్రాన్ని చూడడానికి వచ్చిన నక్కలజాతి ప్రజలను థియేటర్‌లోకి అనుమతించక పోవడంతో వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు
ఈ చిత్రం శుక్రవారం విడుదలై మంచి ఆదరణతో ప్రదర్శింపబడుతోంది. కాగా ఈ చిత్రాన్ని చూడటానికి నక్కలజాతికి చెందిన 20 మందికి పైగా ప్రజలు కడలూర్ సమీపంలోని అన్నాపాలంలోని థియేటర్‌కు వెళ్లారు. అయితే వారిని థియేటర్ నిర్వాహకుల థియేటర్‌లోకి అనుమతించలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కలగచేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నక్కలజాతి ప్రజలకు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో వారు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఆ థియేటర్ వద్ద కలకలం చెలరేగింది. దీంతో 20కి పైగా పోలీసులతో ఆ థియేటర్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment