Movie Theatres
-
సినిమా ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సినిమా ప్రదర్శనలకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాలకు బెనిఫిట్ షో, ప్రిమియర్ షో, స్పెషల్ షోలకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు జనవరి 21వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సవరించింది. ఇదే సమయంలో 16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్నీ షోలకు అనుమతించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం, తదుపరి విచారణ మార్చి 17వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ నటించిన పుష్ఫ-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన పరిణామాలతో ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. కానీ, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ మూవీ టికెట్ రేట్ల పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు.ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్, ప్రత్యేక షోలకు అనుమతించొద్దని హైకోర్టు సూచించింది. నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. ఈ విషయంపై తదుపరి విచారణను వాయిదా వేసింది. -
థియేటర్లలో పాప్‌కార్న్‌పై జీఎస్టీ 5 శాతమే
న్యూఢిల్లీ: థియేటర్లలో లూజుగా విక్రయించే పాప్‌కార్న్‌పై జీఎస్టీ అనేది రెస్టారెంట్ల తరహాలో 5 శాతంగానే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, సినిమా టికెట్‌తో పాటు కలిపి విక్రయిస్తే మాత్రం నిబంధనల ప్రకారం ఆ కాంబో ప్యాకేజీకి వర్తించే రేటు అమలవుతుందని పేర్కొన్నాయి. జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు వివరణనిచ్చాయి.మరోవైపు, సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయానికి సంబంధించిన జీఎస్టీపైనా స్పష్టతనిచ్చాయి. విక్రయ విలువ కన్నా తరుగుదల విలువ ఎక్కువ ఉంటే మార్జిన్లపై 18 శాతం జీఎస్టీ వర్తించదని, అదే తక్కువగా ఉంటే వర్తిస్తుందని పేర్కొన్నాయి. మధ్యవర్తిత్వ సంస్థలు విక్రయించే పాత వాహనాల విషయంలో మార్జిన్లపై సింగిల్ జీఎస్టీ రేటు 18 శాతం వర్తింపచేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడంపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
సినిమా టికెట్లు ఎందుకంత ఖరీదు..?
సినిమాకు వెళితే పిల్లలు, తల్లిదండ్రులు, ప్రేమికులు, స్నేహితులు, తెలిసినవారు, బంధువులు.. ఇలా చాలామందిని గమనించవచ్చు. నిత్యం ఏదో పనుల్లో బిజీగా ఉండేవారికి సినిమాలు ఆటవిడుపుగా మారి వినోదాన్ని అందిస్తుంటాయి. కొన్నేళ్ల కొందట సినిమా నిర్మించడానికి రూ.లక్షల్లో ఖర్చయ్యేది. డిస్ట్రిబ్యూటర్లకు కూడా అదే తరహాలో రాబడి ఉండేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. చిత్ర నిర్మాణానికి రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారు. వాటిని రాబట్టేందుకు ప్రమోషన్లు, టికెట్ రేట్లు పెంచడం వంటి విభిన్న మార్గాలను అనుసరిస్తున్నారు. ఫక్తు వినోదాన్ని అందించాల్సిన సినీ పరిశ్రమలో క్రమంగా వ్యాపార ధోరణి పేరుకుపోతుంది. క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించిన రోజు నుంచి ఇంటర్వెల్లో ప్రేక్షకులు పాప్‌కార్న్ కొనుగోలు చేసేంత వరకు వివిధ స్థాయుల్లో వ్యాపారం ఏ విధంగా సాగుతుందో తెలుసుకుందాం.ప్రీ ప్రొడక్షన్ ఖర్చులు: సినిమా ప్రారంభానికి ముందు ప్రీ ప్రొడక్షన్ ఖర్చులుంటాయి. ఇందులో స్క్రిప్ట్ డెవలప్ మెంట్, లొకేషన్ సెలక్షన్.. వంటి వాటికోసం కొంత డబ్బు అవసరం అవుతుంది.ప్రొడక్షన్ ఖర్చులు: ఈ ఖర్చు చాలా కీలకం. నటీనటులు, సిబ్బంది జీతాలు, పరికరాల అద్దె, సెట్ నిర్మాణం, దుస్తులు, ప్రత్యేక ఖర్చులు దీని కిందకు వస్తాయి.పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు: ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, మ్యూజిక్ లైసెన్సింగ్ వంటి వాటి కోసం కొంతక ఖర్చు చేయాల్సి ఉంటుంది.మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్: సినిమాను ప్రమోట్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కుదుర్చుకోవడం దీని కిందకు వస్తాయి.సౌకర్యాలకు పెద్దపీటగతంలో వీటన్నింటికి తక్కువగానే ఖర్చు అయ్యేది. ఇటీవల కాలంలో వీటి వ్యయం రూ.కోట్లల్లోనే ఉంది. కొన్నేళ్ల కిందట టౌన్‌లోని చిన్న థియేటర్లో ఫ్యాన్ సౌండ్‌ను భరిస్తూ సినిమా చూసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏసీ థియేటర్, ప్రీమియం సీటింగ్, లగ్జరీ సౌకర్యాలతో సినిమాను ఆస్వాదిస్తున్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా సినిమా థియేటర్ యాజమాన్యాలు కూడా మౌలిక సదుపాయాలను అప్డేట్ చేస్తున్నాయి. ఆ ఆర్థిక భారాన్ని తుదకు ప్రేక్షకులే భరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.పాన్ ఇండియా మార్కుఒకప్పుడు స్థానిక భాషలో సినిమా నిర్మించి అదే రాష్ట్రంలో విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం ఏ భాషలో సినిమా తీసినా ‘పాన్ ఇండియా’ మార్కుతో విభిన్న భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దాంతో అక్కడి భాషల్లో విడుదల చేయాలంటే అదనంగా ఖర్చు చేయాల్సిందే. ఫలితంగా సినిమా కాస్ట్ పెరిగిపోతుంది. దాంతో టికెట్ రేట్లు పెంచుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో చేయాల్సినవి.. చేయకూడనివి!లిస్టెడ్ కంపెనీల జోరుపీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ వంటి లిస్టెడ్ కంపెనీలు దేశవ్యాప్తంగా చాలా మల్టిప్లెక్స్ థియేటర్లను నిర్వహిస్తున్నాయి. సినిమా టికెట్ కాస్ట్ కంటే యాడ్ఆన్ సర్వీసులుగా ఉండే స్నాక్స్, ఐస్‌క్రీమ్స్, వాటర్ బాటిల్.. వంటివి విక్రయించడంతోనే అధిక మార్జిన్లు సంపాదిస్తాయి. ఒకవేళ టికెట్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటిస్తే అదనంగా ఆదాయం సమకూరినట్లే. థియేటర్లలో విభిన్న కంపెనీలు యాడ్లు ఇస్తుంటాయి. దానివల్ల ఆదాయం సమకూరుతుంది. మల్టిప్లెక్స్‌లు ప్రైవేట్ ఈవెంట్లకు స్కీన్లను రెంట్‌కు ఇస్తూంటాయి. అది కూడా ఒక ఆదాయ వనరుగా ఉంది. -
ప్రేక్షకులను అనుమతించని థియేటర్ యాజమాన్యం.. రంగంలోకి పోలీసులు!
సూరి కథానాయకుడిగా నటించిన చిత్రం గరుడన్. శశికుమార్, ఉన్ని ముకుందన్, వడివుక్కరసి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం గరుడన్. దర్శకుడు వెట్రిమారన్ కథను అందించి తన గ్రాస్‌రూట్ స్డూడియో కంపెనీ సంస్థ కె.కుమార్‌కు చెందిన లార్క్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి దురై సెంథిల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ విడుదల కాగా.. స్థానిక నక్కలజాతి ప్రజలను థియేటర్లోకి అనుమతించని ఘటన మరోసారి వివాదంగా మారింది. ఇంతకు ముందు ఇలాంటి ఘటనే చెన్నైలోని ఒక థియేటర్లో జరిగింది. తాజాగా గరుడన్ చిత్రాన్ని చూడడానికి వచ్చిన నక్కలజాతి ప్రజలను థియేటర్లోకి అనుమతించక పోవడంతో వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారుఈ చిత్రం శుక్రవారం విడుదలై మంచి ఆదరణతో ప్రదర్శింపబడుతోంది. కాగా ఈ చిత్రాన్ని చూడటానికి నక్కలజాతికి చెందిన 20 మందికి పైగా ప్రజలు కడలూర్ సమీపంలోని అన్నాపాలంలోని థియేటర్‌కు వెళ్లారు. అయితే వారిని థియేటర్ నిర్వాహకుల థియేటర్లోకి అనుమతించలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కలగచేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నక్కలజాతి ప్రజలకు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో వారు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఆ థియేటర్ వద్ద కలకలం చెలరేగింది. దీంతో 20కి పైగా పోలీసులతో ఆ థియేటర్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
దిగాలు పడుతున్న థియేటర్లు
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా అంతర్జాతీయ స్థాయి సినిమా నిర్మాణాలకు, రూపకర్తలకు పుట్టినిల్లుగా నగరం ఓ వైపు దూసుకుపోతుంటే.. ఒకనాడు సినిమా వైభవానికి మేము సైతం అన్నట్టు బోయీలైన సింగిల్ స్క్రీన్ థియేటర్లు నేడు నానాటికీ తీసికట్టు.. అన్నట్టు మారుతున్నాయి. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తాత్కాలికంగా థియేటర్లను మూసివేస్తున్నట్టు ప్రకటించడం వీటి యజమానుల్లో పేరుకుపోయిన నిరాశకు అద్దం పడుతోంది. ఓటీటీలూ, మల్టీప్లెక్సుల దెబ్బలు ఓర్చుకుంటుంటే.. పులి మీద పుట్రలా అన్నట్టు ఐపీఎల్ మ్యాచ్‌లూ, ఠారెత్తించిన ఎండలు, హోరెత్తించిన ఎన్నికలు పెరిగిపోయిన ప్రత్యామ్నాయ వినోదాలు.. అన్నీ కలిసి.. సింగిల్ స్క్రీన్ సందడికి తాత్కాలికంగానైనా తెరపడేలా చేసింది. ఒకప్పుడు అంటే.. 1980లలో నగరంలో 113 సినిమా హాళ్లు ఉండేవి. ఆ సమయంలో నగరవాసులకు కాలక్షేపానికి కొదవ కూడా ఉండడంతో అవి రద్దీతో వరి్ధల్లేవి. కాలక్రమంలో నగర వాసులకు ప్రత్యామ్నాయ వినోదాలు పెరిగిపోతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లోనే పలు సింగిల్ స్క్రీన్స్ అంతర్థానమైతే మరికొన్ని మాల్స్‌గా, మల్టీప్లెక్స్‌లుగా కూడా రూపాంతరం చెందాయి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య దాదాపు 70కి పడిపోయింది. టికెట్ రేట్లు అమాంతం పెరగడం, మాల్స్, మల్టీప్లెక్సులు పుంజుకోవడం వంటి వరుస దెబ్బలతో ఒకటొకటిగా మూతపడుతూ వచ్చిన థియేటర్లను కరోనా, లాక్డౌన్ కోలుకోలేని దెబ్బ తీసింది. నగరంలోని అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లాక్ డౌన్ దెబ్బకి షటప్ అయిపోయాయి. సింగిల్ స్క్రీన్స్ టు.. గోడౌన్స్.. లాక్డౌన్ ధాటికి క్రాస్ రోడ్స్‌లోని శ్రీ మయూరి, నారాయణగూడలోని శాంతి, టోలిచౌకిలోని గెలాక్సీ, మెహిదీపట్నంలోని అంబా, బహదూర్‌పురాలోని శ్రీరామ. థియేటర్లలో కొన్ని గోడౌన్స్‌గా మరికొన్ని ఇతర వ్యాపార వ్యవహారాల కోసం వినియోగంలోకి వెళ్లాయి. సుదర్శన్ 35ఎంఎం, దేవి 70 ఎంఎం థియేటర్ల యజమాని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద్ రాజు మాటల్లో చెప్పాలంటే.. ‘అమెజాన్ వంటి కంపెనీలకు గోడౌన్లుగా ఉపయోగించడానికి నగరంలో విశాలమైన స్థలం అవసరం. అలాగే కొత్తగా వచ్చే సూపర్ మార్కెట్ బ్రాండ్లు కూడా థియేటర్లను సంప్రదిస్తున్నారు’ అని అభిప్రాయపడ్డారు. థియేటర్లకు అయ్యే ఖర్చుల గురించి మరో యజమాని మాట్లాడుతూ.. ‘విద్యుత్, సిబ్బంది, నిర్వహణ మొదలైన ఖర్చుల కోసం నెలకు రూ. 1.2 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రేక్షకులు కరువైన సినిమాలను ప్రదర్శిస్తే నెలకు రూ.3 లక్షలకు ఆ నష్టం పెరుగుతుంది. దీనికన్నా కంపెనీలకు ఇవ్వడం బెటర్ కదా’ అన్నారు ఆదుకోని రీ రిలీజ్‌లూ...పార్కింగ్ ఫీజులూ... ప్రేక్షకుల నుంచి పార్కింగ్ ఫీజు వసూళ్లపై నిషేధం ఎత్తివేత వంటి ప్రభుత్వ చర్యలు కొంత ఊరటనిచి్చనా.. సింగిల్ స్క్రీన్స్‌కి అవి పూర్తిగా తెరిపినివ్వలేదు. భారీ వ్యయంతో సినిమాల రాకతో సింగిల్ స్క్రీన్స్‌కి పుట్టగతులు లేకుండా పోయిన పరిస్థితుల్లో.. రీ రిలీజ్ ల రూపంలో స్టార్స్ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆ కొత్త ట్రెండ్ కొంత కాలం సింగిల్ స్క్రీన్స్‌కి పూర్వవైభవంపై ఆశలు చిగురించేలా చేసింది. ఇటీవల ఆ ట్రెండ్‌కు కూడా గండి పడింది. ఈ నేపథ్యంలో నగరంలో సింగిల్ స్క్రీన్స్ మనుగడ సాగించాలంటే.. దండిగా సినిమాలు రావడం మాత్రమే కాదు మరిన్ని అనుకూల మార్పులు కూడా రావాల్సిన అవసరం ఉందనేది సినీ థియేటర్ నిర్వహణలో అనుభవజు్ఞలు చెబుతున్న మాట. -
థియేటర్ మొత్తం మంటలు, సినిమా చూస్తూ నిమగ్నమైన ప్రేక్షకులు
టెక్నాలజీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. రకరకాల వింతలు, అద్భుతాలతో మనిషి చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసికొట్టేలా చేస్తున్నాయి. తాజాగా 5డీ ఎఫెక్ట్‌తో థియేటర్లో ఫైర్ సీన్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో టెక్నాలజీ ఓవర్ డోస్‌పై మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు మనకు 2డీ, 3డీ,4డీ సినిమాల గురించి తెలుసు. ఇది భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరపై వండర్స్ క్రియేట్ చేసేలా చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్స్‌తో సినిమాలోని పాత్రలూ, దృశ్యాలు మనల్నీ మమేకం చేసేలా చేస్తాయి. అక్కడ జరుగుతున్న సీన్స్ నిజంగా మనచుట్టూ జరుగుతున్నాయేమో అనుకునేలా విజువల్స్‌లో కనిపిస్తాయి. స్క్రీన్‌పై సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేసేలా చేస్తుంది. సినిమాలో వర్షం పడినా, మంచు కురిసినా..చూసే ప్రేక్షకులకు కూడా కొన్ని సాంకేతిక పద్ధతులతో ఆ ఫీలింగ్ కలిగించేలా చేస్తుంది. ఇప్పుడు 5డీ థియేటర్లు ఒక అడుగు ముందుకేసి ఆడియెన్స్‌కు ఆ ఫీల్‌ను మరింత దగ్గర చేసింది. కానీ మితిమీరిన టెక్నాలజీ వాడకంతో కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు అనేలా గుర్తుచేస్తుంది ఈ వైరల్ వీడియో. 5డీ ఎక్స్ స్క్రీన్‌తో సినిమా థియేటర్లో ప్రేక్షకులు మూవీని ఎంజాయ్ చేస్తుండగా సడెన్‌గా ఓ ఫైర్ యాక్సిడెంట్‌కి సంబంధించిన సీన్ పడింది. అంతే క్షణాల్లో థియేటర్ మొత్తం అంటుకున్నట్లు కనిపించింది. ఇది చూసిన ప్రేక్షకులు కూడా భలే థ్రిల్‌గా ఫీల్ అయ్యారు. అయితే ఇది రియల్ ఫైర్ యాక్సిడెంట్ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 5డీ ఎఫెక్ట్ బాగానే ఉంది కానీ, నిజంగానే ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? ప్రేక్షకుల ప్రాణాలతో ఇలా చెలగాటం ఆడొద్దంటూ థియేటర్ ఓనర్స్‌పై గుర్రమంటున్నారు. మరోవైపు టెక్నాలజీని మితిమీరి వాడితే అనర్థాలే తప్పా మరొకటి ఉండదు. స్పేస్, వాటర్ వరకు ఓకే కానీ ఇలా నిప్పుతో చెలగాటం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. This is how people die. If a theater does somehow manage to go up in flames, people will think it's the 5D cinema effects. — JDM is the Shiz! (Scarface) (@FloatyRedHead23) October 13, 2023 My issue is what if a real fire broke out? This kind of stuff is awesome but desensitizes the mind and creates a loss of reaction time. — Cosmic-books 🇨🇦 (@foerster_bryan) October 13, 2023 -
తంతిరం సినిమా విడుదల తేదీ ఫిక్స్
తంతిరం సినిమా అక్టోబర్ 6న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది... శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ,అవినాష్ వెలందరు, శ్రీనివాసమూర్తి తదితరులు సినిమాలో నటించారు. ఈ చిత్రానికి ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించగా శ్రీకాంత్ కంద్రగుల (SK ) నిర్మాతగా ఉన్నారు. ఈ మధ్య చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేకుండా కంటెంట్ ఉంటే చాలు సూపర్ హిట్ స్థానాన్ని దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రూపొందించిన సినిమానే తంతిరం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. (ఇదీ చదవండి: Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్ల సినీ ప్రస్థానం.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్) ఈ సినిమా హర్రర్ అంశాలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా, భార్యాభర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా అనేది ఒక అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టిస్తుంది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో నవతరం నటీనటులతో తీసిన సినిమా కంటెంట్ మాత్రమే నమ్మిన ప్రొడ్యూసర్ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా బండి బ్యానర్ పైన దీనిని తెరకెక్కించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా U/A సర్టిఫికెట్‌ను అందుకుంది. ఆడియో రైట్స్ దక్కించుకున్న సరిగమ సంస్థ ఈరోజు జ్యూక్ బాక్స్ ద్వారా ఆడియో రిలీజ్ చేసింది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు కూడా ఇప్పటికే పోటీ పడుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌కు నార్త్ ఇండియాలో కూడా మంచి స్పందన లభిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా రిలయన్స్ సంస్థ గ్రాండ్‌గా అక్టోబర్ 6న రిలీజ్ చేయడానికి సిద్ధమయింది. -
థియేటర్లో సీటు కోసం గొడవ.. వృద్ధునిపై యువకుని పిడిగుద్దులు..
అమెరికాలో దారుణం జరిగింది. సినిమా హాల్లో సీటు కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడ్ని చితకబాదాడో యువకుడు. 63 ఏళ్ల వృద్ధినిపై పిడిగుద్దులు కురిపించాడు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఫ్లోరిడాలోని పొంపానో బీజ్ ఏఎంసీ సినిమా థియేటర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బీచ్ పక్కనే ఉన్న ఫస్ట్ క్లాస్ థియేటర్లో సినిమా ఆరంభమైంది. అందరూ తమ తమ సీట్లలో కూర్చుంటున్నారు. ఇంతలో వీఐపీ టికెట్టు కొనుగోలు చేసిన ఓ వృద్ధ జంట తమ సీట్ల వద్దకు వచ్చారు. కానీ అప్పటికే అందులో ఇద్దరు యువ జంట కూర్చున్నారు. దీంతో మరో సీటులో కూర్చోవలసిందిగా అభ్యర్థించాడు ఆ వృద్ధుడు. Cops in Florida looking for a man who beat up a 63-year-old man because he asked to switch seats in a Pompano Beach AMC movie theater.#TrueCrime pic.twitter.com/jBvs5IDCat — Joseph Morris (@JosephMorrisYT) July 20, 2023 ఈ చిన్న విషయానికి తీవ్ర కోపోద్రిక్తుడైన యువకుడు వృద్ధునిపై దాడికి పాల్పడ్డాడు. కిందపడిన వృద్ధునిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. పక్కనే ఉన్న కొందరు అతన్ని అడ్డగించారు. దీంతో వివాదం అప్పటికి సద్ధుమణిగింది. కానీ ఈ ఘటనలో వృద్ధుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: పొగలుకక్కే ఫుడ్ పెట్టినందుకు..మెక్‌డొనాల్డ్స్ రూ. 6 కోట్లు చెల్లించింది! -
సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన థియేటర్స్..!
-
AAA Cinemas Photos: అల్లు అర్జున్ AAA థియేటర్ ఓపెనింగ్..కిక్కిరిసిన జనం (ఫొటోలు)
-
చిరంజీవి కొత్త సినిమా థియేటర్ తో పాటు ఫైబర్ నెట్ లో రిలీజ్ అయితే
-
రోహిణి థియేటర్ నిర్వాహం.. కమల్ హాసన్ తీవ్ర ఖండన
చైన్నెలోని రోహిణి థియేటర్ నిర్వాహకం చర్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నటుడు శింబు కథనాయకుడిగా నటించిన చిత్రం పతు తల. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. దీంతో శింబు అభిమానులు వేకువజాము నుంచే థియేటర్ ముందు గుమికూడారు. అలాంటి వారిలో సంచార జాతి ప్రేక్షకులు ఉన్నారు. వీరు స్థానిక కోయంబేడులోని రోహిణి థియేటర్లో పత్తుతల చిత్రాన్ని చూడడానికి వచ్చారు. టికెట్లు కూడా కొనుగోలు చేసి థియేటర్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ థియేటర్ కార్మికుడు వారిని అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కొంత సమయం తర్వాత వారిని లోపలికి అనుమతించారు. டிக்கெட் இருந்தும் நரிக்குறவ மக்களை படம் பார்க்க அனுமதிக்காத @RohiniSilverScr திரையரங்கம் ... இவுங்களுக்கு நீ தனி ஷோ போட்டுக்காட்டத்தான் போற அத நான் பாக்கத்தான் போறேன் ...#RohiniTheatre #PathuThala @SilambarasanTR_ @CMOTamilnadu @IamSellvah pic.twitter.com/1Pd3rE8CsV — Viji Nambai (@vijinambai) March 30, 2023 అయితే ఈ వ్యవహారంపై థియేటర్ నిర్వాహకం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని కమలహాసన్, విజయ్‌సేతుపతి, సూరి, దర్శకుడు వెట్రిమారన్, నటి ప్రియా భవానిశంకర్ తీవ్రంగా ఖండించారు. తాజాగా కమలహాసన్ ట్విటర్లో పేర్కొంటూ టికెట్ తీసుకున్న తర్వాత కూడా సంచార జాతి ప్రజలను థియేటర్లోకి అనుమతించకపోయిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాత వారిని అనుమతించడం ఖండించదగ్గ విషయం అని పేర్కొన్నారు. దర్శకుడు వెట్రిమారన్ శ్రమజీవులను థియేటర్లోకి రానీయకుండా అడ్డుకోవడం ప్రమాదకరం అని పేర్కొన్నారు. సూరి స్పందిస్తూ జరిగిన సంఘటనకు తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియా భవాని శంకర్ స్పందిస్తూ సంచార జాతి ప్రజలకు మద్దతు తెలిపారు. అందరూ ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నప్పుడు టికెట్ ఉన్నా కూడా మమ్మల్ని ఎందుకు థియేటర్లోకి అనుమతించడం లేదు అని సంచార జాతి మహిళా ప్రశ్నే ఇలాంటి వ్యతిరేక చర్యలకు తొలి గొంతు అని భవాని శంకర పేర్కొన్నారు. ఈ సంఘటనపై స్థానిక కోయంబేడు పోలీసులు రోహిణి థియేటర్ నిర్వాకంపై అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. டிக்கெட் இருந்தும் நாடோடிப் பழங்குடியினருக்குத் திரையரங்கத்திற்குள் அனுமதி மறுக்கப்பட்டுள்ளது. சமூகவலைதளங்களில் எதிர்ப்பு கிளம்பிய பிறகே அவர்கள் அனுமதிக்கப்பட்டுள்ளனர். இது கண்டிக்கத்தக்கது. https://t.co/k9gZaDH0IM — Kamal Haasan (@ikamalhaasan) March 31, 2023 -
ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..!
జనవరిలో సంక్రాంతి సినిమాల సందడి ముగిసిపోయింది. పెద్ద హీరోల చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఫిబ్రవరిలోనూ సినీ ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధమైపోయాయి. ఈ వారంలో కల్యాణ్ రామ్ అమిగోస్ విడుదలవుతోంది. అలాగే ఈ వారంలో థియేటర్లతో పాటు ఓటీటీకి వచ్చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. కల్యాణ్‌రామ్ అమిగోస్ నందమూరి కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'అమిగోస్'. బింబిసార తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని ఈనెల 10న రిలీజ్ చేయనున్నారు. కన్నడ మూవీ వేద కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ 125వ చిత్రం వేద. అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్లో ఇది మొదటి వెంచర్‌గా నిర్మితమైంది. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న తెలుగులో రిలీజ్ కానుంది. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. పాప్‌కార్న్ ఆవికా గోర్, సాయి రోనక్ జంటగా నటించిన చిత్రం పాప్ కార్న్. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించగా.. భోగేంద్రగుప్త నిర్మించారు. మురళీగంధం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఐపీఎల్: ఇట్స్ ప్యూర్ లవ్ విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఐపీఎల్. సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. బీరం శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతోంది. దేశం కోసం భగత్ సింగ్ రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్, జీవా, సుధ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం దేశం కోసం భగత్ సింగ్. ఈ సినిమాకు రవీంద్ర గోపాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 10న థియేటరల్లో సందడి చేయనుంది. చెడ్డి గ్యాంగ్ తమాషా సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మించారు. ఈ వారం ఓటీటీ చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ తునివు/తెగింపు- ఫిబ్రవరి 8, 2023 డిస్నీ+హాట్‌స్టార్ రాజయోగం- ఫిబ్రవరి 09, 2023 అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్‌సిరీస్: ఫర్జీ- ఫిబ్రవరి 10, 2023 ఆహా కళ్యాణం కమనీయం- ఫిబ్రవరి 10, 2023 ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు నెట్‌ఫ్లిక్స్ బిల్ రస్సెల్: లెజెండ్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 8 ద ఎక్స్ఛేంజ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 8 యు (వెబ్‌సిరీస్-4) ఫిబ్రవరి 9 డియర్ డేవిడ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 9 యువర్ ప్లేస్ ఆర్ మైన్ (హాలీవుడ్) ఫిబ్రవరి 10 టెన్ డేస్ ఆఫ్ ఎ గుడ్మాన్ (హాలీవుడ్) ఫిబ్రవరి 10 డిస్నీ+హాట్‌స్టార్ నాట్ డెడ్ ఎట్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 09 హన్నికాస్ లవ్ షాదీ డ్రామా (రియాల్టీ షో) ఫిబ్రవరి 10 సోనీలివ్ నిజం విత్ స్మిత (టాక్ షో) ఫిబ్రవరి 10 -
సినిమా హాళ్లకు బయటి ఫుడ్ తీసుకెళ్లడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సినిమా హాళ్లకు ప్రేక్షకులు బయటి నుంచి ఆహారం, పానీయాలు తీసుకెళ్లవచ్చా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసిహతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. థియేటర్లు యజమానుల ప్రవేటు ఆస్తులు కాబట్టి ప్రేక్షకులు బయటి నుంచి తెచ్చుకున్న ఆహారం, పానీయాలు లోపలికి తీసుకెళ్లకుండా నియంత్రించే హక్కు సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్‌లకు ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా 2018 జూలై 18న సినిమా హాళ్లలోకి బయట ఆహారాన్ని తీసుకురాకుండా విధించిన నిషేధాన్ని జమ్మూ కశ్మీర్ హైకోర్టు తొలగించింది. నిషేధం కారణంగా థియేటర్లలో ఏది విక్రయిస్తే అది తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే కారణంతో హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సినిమా హాళ్లలో బయటి నుంచి తీసుకొచ్చే ఆహారాన్ని నిషేధించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి సినిమా హాళ్లు ఏం జిమ్‌లు కాదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రేక్షకులు వినోదం కోసం థియేటర్లకు వస్తారని తెలిపింది. ఇది ప్రైవేట్ యాజమాన్యంలో ఉంటుంది. కాబట్టి బయటి ఆహారాన్ని అనుమతించాలా.. వద్దా అనే దానిపై హక్కు వారికి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే పిల్లలకు ఉచిత ఆహారం, మంచి నీరు అందించాలని ఇప్పటికే సినిమా హాళ్లను ఆదేశించామని ధర్మాసనం ఈ సందర్బంగా గుర్తు చేసింది. సినిమా చూసేందుకు ఏ థియేటర్‌ను ఎంపిక చేసుకోవాలనేది ప్రేక్షకుడి హక్కు.. అలాగే నిబంధనలను విధించే హక్కు సినిమా హాల్ యాజమాన్యానికి కూడా ఉంది. అక్కడ ఉన్నవాటిని వినియోగించాలా వద్దా అనేది పూర్తిగా సినిమా ప్రేక్షకుడి ఎంపికపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ షరతులు ప్రజా ప్రయోజనాలకు, భద్రతకు విరుద్ధం కానంత వరకు యజమాని నిబంధనలను పెట్టడానికి పూర్తి అర్హత ఉంది’ అని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ఈ సందర్భంగా పలు ఉదాహరణలు చెబుతూ న్యాయమూర్తులు సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. ‘సినిమా హాల్లోకి ఎవరైనా జిలేబీలు తీసుకెళితే అప్పుడు పరిస్థితి ఏంటి?. ఒకవేళ జిలేబీలు తిని ప్రేక్షకుడు తన చేతి వేళ్లను సీట్‌పై తుడిస్తే క్లీనింగ్‌కు ఎవరు డబ్బు ఇస్తారు. ఇక ప్రజలు సినిమా హాల్లోకి తందూరీ చికెన్ కూడా తీసుకెళ్తారు. మరి అప్పుడు హాల్లో తినేసిన ఎముకలు పడేశారని కంప్లైట్ రావొచ్చు. ఇది కూడా ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. చదవండి: కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. యువతి కుటుంబానికి రూ.10 లక్షలు.. -
ఇంట్లోనే వెండితెర.. విస్తరించిన కొత్త కల్చర్
వినోదం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. 50 ఏళ్ల క్రితం కొత్త సినిమా కోసం జిల్లా కేంద్రానికి వెళ్లి మరీ చూసేవారు. ఎందుకంటే అప్పట్లో మండలాల్లో కూడా సినిమాలు విడుదలయ్యేవి కావు. ఆ తర్వాత మండల కేంద్రాలకూ చేరాయి. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయిన 30 రోజులకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇంట్లోనే కూర్చొని సినిమా చూస్తున్నారు. కొందరు థియేటర్ అనుభూతి పొందేందుకు హోమ్ థియేటర్ల(హోమ్ సినిమా సెగ్మెంట్)ను ఏర్పాటు చేసుకుంటున్నారు. పెద్ద, పెద్ద నగరాలకే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు జిల్లాకు విస్తరించింది. కర్నూలు: సగటు ప్రేక్షకుడికి సినిమా ఒక ప్రధాన వినోద సాధనం. తెలుగు చిత్రసీమలో 80 ఏళ్లకు పైగా ఇది రాజ్యమేలుతోంది. పండుగలు, పర్వదినాల్లో నిర్మాతలు స్టార్‌హీరోల సినిమాలు విడుదల చేసి భారీగా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించుకుని కలెక్షన్లు కొల్లగొడుతారు. సినిమా ఏదైనా బాగుందంటే ప్రతి రోజు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం. ఈ సందడి 100, 175, 365 రోజుల పాటు ఉండేది. ఇదంతా ఒకప్పటి కథ. కోవిడ్–19 వైరస్ సినిమా కథనూ మార్చేసింది. కోవిడ్‌కు ముందు కోవిడ్ తర్వాత అనే విధంగా మార్చేసింది. కోవిడ్ సమయంలో థియేటర్లు బంద్ చేసిన నేపథ్యంలో చాలా సినిమాలు థియేటర్లో గాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అంతకుముందు కూడా ఓటీటీ సంస్కృతి ఉన్నా కోవిడ్ సమయంలో దీనికి ఆదరణ బాగా పెరిగింది. ఇంట్లోనే టీవీలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా సినిమాలు వీక్షించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. ప్రస్తుతం సినిమా ఎంత బాగున్నా ఒకేసారి ఎక్కువ థియేటర్లలో ఎక్కువ షోలు వేస్తుండటంతో 30 రోజులకు మించి ఆడటం లేదు. ఈ క్రమంలో 30 రోజుల తర్వాత ఓటీటీలోనూ ఆ సినిమాను విడుదల చేస్తున్నారు. దీంతో ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందేందుకు ఔత్సాహికులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంట్లోనే హోమ్ థియేటర్‌తో మజా ! ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చాక మనం కోరుకున్న సినిమాను ఇంట్లోనూ కూర్చున్న చోట ఆన్లైన్లో నొక్కి చూడవచ్చనే అభిప్రాయం సగటు ప్రేక్షకులకు వచ్చింది. దీంతో పైస్థాయి మధ్యతరగతి, ఉన్నతస్థాయి ప్రజలందరూ వారి ఇంట్లో హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో మాత్రమే ఈ కల్చర్ కనిపించేది. ఇప్పుడు క్రమంగా జిల్లాకు పాకింది. కాస్త పెద్ద ఇళ్లు ఉన్న వారు హోమ్ థియేటర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక హోమ్ థియేటర్ ఏర్పాటు కావాలంటే రూ.5 లక్షలు ఉంటే చాలు. ఆ పై థియేటర్ గదిని, సౌండ్ సిస్టమ్, స్క్రీన్, కుర్చీల సంఖ్యను బట్టి రూ.35 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇందు కోసం వీటిని ఏర్పాటు చేసే నిర్వాహకులు ఒకప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేవారు. డెమో కూడా అక్కడే చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడే డెమో థియేటర్లు ఏర్పాటు చేశారు. దీనికితోడు ఎవ్వరైనా స్నేహితులు, బంధువులు హోమ్ థియేటర్ చేయించుకుని ఉంటే వారిని చూసి మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుందని వాకబు చేసి మరీ ఏర్పాటు చేసుకుంటున్నారు. డోన్ సమీపంలోని గ్రామంలో ఓ భూస్వామి తనకూ హోమ్‌థియేటర్ కావాలని పట్టుబట్టి అక్కడ సెల్‌ఫోన్ టవర్ లేకపోయినా ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. అది ఏర్పాటయ్యేలోగా నిర్వాహకులతో మాట్లాడి సెల్‌టవర్‌ను ఇంటి వద్ద ఏర్పాటు చేయించుకున్నాడంటే హోమ్థియేటర్పై ఉన్న మక్కువ అర్థం అవుతుంది. మంచి టీవీ ధరలోనే హోమ్ థియేటర్ అన్ని రకాల ఫీచర్లు, సౌండ్ సిస్టమ్‌తో ఉన్న బ్రాండెడ్ టీవీని కొనుగోలు చేయాలంటే రూ.2.5 లక్షలకు పైగానే వెచ్చించాలి. ఇలాంటి పెద్దతెర ఉన్న టీవీని తెచ్చుకుని చూడాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ దీనికి రెండింతలు మొత్తం ఖర్చు పెడితే ఏకంగా ఇంట్లోనే సినిమా థియేటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చన్న అభిప్రాయానికి చాలా మంది వస్తున్నారు. సొంత ఇల్లు ఉండి థియేటర్ ఏర్పాటు చేసుకునే స్థలం ఉన్న చాలా మంది ఇప్పుడు హోమ్ థియేటర్‌వైపు మక్కువ చూపుతున్నారు. ఇందుకోసం రూ.5లక్షల నుంచి రూ.35 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. హోమ్‌థియేటర్ ఏర్పాటు కావాలంటే కనీసం 11/22 నుంచి 22/44 వరకు విస్తీర్ణంలో ఉన్న హాలులో 7.1 నుంచి 17.4 ఛానల్స్ వరకు స్పీకర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో ఆరుగురు నుంచి 20 మంది దాకా కూర్చుని సినిమా చూసే సామర్థ్యం ఉంటోంది. అన్ని భాషల్లో రూపొందిన సినిమాలు, వెబ్‌సిరీస్ ఓటీటీలో చూసే అవకాశం ఉండటంతో హోమ్ థియేటర్‌కు ఆదరణ పెరుగుతోంది. కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్ లాంటి ప్రాంతాల్లో దాదాపు 250 ఇళ్లలో హోమ్థియేటర్లు ఏర్పాటు చేసుకున్నారు. -
రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 2024 చివరి నాటికి 10,000 సినిమా హాళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ నిర్ణయించింది. ఇందుకోసం అక్టోబర్ సినిమాస్‌తో చేతులు కలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష చిన్న థియేటర్లను నెల కొల్పాలన్నది లక్ష్యం. ఒక్కో కేంద్రం 100-200 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానుంది. సీఎస్‌సీని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ప్రమోట్ చేస్తోంది. 2024 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 సినిమా హాళ్లను ప్రారంభించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 100-200 సీటింగ్ కెపాసిటీ ఉన్న 1 లక్ష చిన్న సినిమా థియేటర్లను తెరవాలనే లక్ష్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సీఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ రాకేష్ వెల్లడించారు. (ప్రావిడెంట్ ఫండ్:నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే కోటి రూపాయలు) 2024 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 10,000 సినిమా హాళ్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నామని అక్టోబర్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ దేశాయ్ తెలిపారు. వీడియో పార్లర్ సినిమా లైసెన్సు ఉన్న ఈ సినిమా హాళ్లను నడపాలంటే దాదాపు రూ.15 లక్షల పెట్టుబడి అవసరమన్నారు. గ్రామీణ స్థాయి వ్యాపారులకు కొత్త అవకాశాలను ఈ థియేటర్లు కల్పిస్తాయని సీఎస్సీ భావిస్తోంది. సీఎస్సీ కార్యకలాపాలకు ఇవి కేంద్రాలుగా మారతాయని ఆశిస్తోంది. (కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి: ఆరు నెలల్లో తొలిసారి!) -
ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఏకంగా 17 సినిమాలు రిలీజ్
ఈ ఏడాది చివరి మాసంలో సినీ ప్రియులకు కావాల్సినంత వినోదం పంచనుంది. ఈ వారంలోనే ఏకంగా 15కు పైగా చిత్రాలు డిసెంబరు 9న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందాలు ప్రకటించాయి. మరి విడుదలకు సిద్ధమైన ఆ సినిమాల జాబితాపై ఓ లుక్కేద్దాం పదండి. పంచతంత్రం: బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: వీఆర్ఎల్ వ్యవస్థాపకుడు విజయ్ శంకేశ్వర్ బయోపిక్‌గా ‘ ‘విజయానంద్’) గుర్తుందా శీతాకాలం: యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహసిని తదితరులు నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం'. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముఖచిత్రం: విశ్వక్సేన్, ఆయేష్‌ఖాన్, ప్రియ వడ్లమాని, చైతన్యరావు, వికాస్ వశిష్ట, రవిశంకర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ముఖచిత్రం'. ఈ చిత్రానికి గంగాధర్ దర్శకత్వం వహించగా.. కాలభైరవ సంగీతమందించారు. ఈనెల 9న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ప్రేమదేశం: త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమదేశం’. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. శిరీష సిద్ధమ్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 9న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు. ఈనెల 9న థియేటర్లలో సందడి చేయనుంది ఈ చిత్రం. చెప్పాలని ఉంది: సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్బీ చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉపశీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా అరుణ్ భారతి దర్శకత్వంలో తెరకెక్కింది. వాకాడ అంజన్ కుమార్, యాగేష్ కువర్ నిర్మింన ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలవుతోంది. (ఇది చదవండి: అభిమాని కాళ్లు పట్టుకున్న స్టార్ హీరో.. ఫోటో వైరల్) లెహరాయి: రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధర్మపురి ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. రామకృష్ణ పరమహంస ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఈనెల 9న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ‘నమస్తే సేట్ జీ’: తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తూ,హీరోగా నటించిన చిత్రం ‘నమస్తే సేట్ జీ’. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్వప్న చౌదరి, మోన, రేఖ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ "యూ" సర్టిఫికెట్‌ని అందుకున్న ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకులను పలకరించనుంది. రాజయోగం: సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రాజయోగం'. నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. రామ్ గణపతి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. డేంజరస్: అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో కంపెనీ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డేంజరస్’. ‘మా ఇష్టం’ అనేది క్యాప్షన్. ఈ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది. విజయానంద్: దేశంలోనే అతి పెద్ద లాజిస్టిక్ కంపెనీల్లో ఒకటైన వీఆర్ఎల్ వ్యవస్థాపకుడు విజయ్ శంకేశ్వర్ బయోపిక్ చిత్రం ‘విజయానంద్’. విజయ్ శంకేశ్వర్ పాత్రలో నిహాల్ నటించిన ఈ చిత్రానికి రిషికా శర్మ దర్శకత్వం వహించారు. ఆనంద్ శంకేశ్వర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీని డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు అమెజాన్ ప్రైమ్ బ్లాక్ ఆడమ్ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు 10 జీ5 మాచర్ల నియోజకవర్గం (తెలుగు) డిసెంబరు 9 బ్లర్ (హిందీ) డిసెంబరు 9 మాన్సూన్ రాగా (కన్నడ) డిసెంబరు 9 సోనీలివ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ (తెలుగు) డిసెంబరు 9 రాయ్ (మలయాళం) డిసెంబరు 9 ఫాదూ (హిందీ సిరీస్) డిసెంబరు 9 విట్నెస్ (తమిళ్ చిత్రం) డిసెంబరు 09 నెట్‌ఫ్లిక్స్ నజర్ అందాజ్ (హిందీ) డిసెంబరు 4 సెబాస్టియన్ మానిస్కాల్కో: ఈజ్ ఇట్‌మి (హాలీవుడ్) డిసెంబరు 06 ది ఎలిఫెంట్ విస్పరర్స్ (తమిళ్) డిసెంబరు 08 క్యాట్ (హిందీ సిరీస్)డిసెంబరు 09 మనీ హైస్ట్: కొరియా జాయింట్ ఎకనామిక్ ఏరియా (వెబ్‌సిరీస్2)డిసెంబరు 09 ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 09 ఆహా ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 09 డిస్నీ+హాట్‌స్టార్ మూవింగ్ విత్ మలైకా (వెబ్‌సిరీస్) డిసెంబరు 05 కనెక్ట్(కొరియన్ సిరీస్) డిసెంబరు 07 ఫాల్ (తమిళ్) డిసెంబరు 09 -
చిన్న సినిమాలతో పోటీ పడుతున్న సమంత
-
జమ్మూకాశ్మీర్ లో మళ్ళీ సినీ వినోదం
-
ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..!
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా అభిమానులకు వినోదం పంచేందుకు పలు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. కాగా దసరాకు పెద్ద సినిమాల తాకిడి, థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీంతో కాస్త ముందుగానే పలువురు యంగ్ హీరోలు ఆడియన్స్‌లో పలకరించబోతున్నారు. మరి ఆ చిత్రాలేవి, ఈ వారం థియేటర్లు, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దామా! కృష్ణ వ్రింద విహారి: గశౌర్య, షెర్లీ జంటగా నటించిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనీశ్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించగా.. మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో ఎంట్రీ ఇవ్వనుంది. అల్లూరి: శ్రీ విష్ణు, కయాదు లోహర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'అల్లూరి'. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. ఇటీవల నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ హీరో అల్లు అర్జున్ హాజరై చిత్రబృందాన్ని అభినందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. దొంగలున్నారు జాగ్రత్త: సింహా కోడూరి, సముద్రఖని, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. ఈ చిత్రానికి సతీశ్ త్రిపుర దర్శకత్వం వహించగా.. కాలభైరవి సంగీత స్వరాలు అందించారు. ఈ వారంలోనే 23వ తేదీన ప్రేక్షకులకు థియేటర్లలో కనువిందు చేయనుంది. మాతృదేవోభవ: పంచానికి అమ్మ విలువను చాటిచెప్పేలా రూపొందించిన చిత్రం మాతృదేవోభవ. ఈ సినిమాలో సుధ, చమ్మక్ చంద్ర, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కె.హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహించగా.. జయసూర్య సంగీత బాణీలు సమకూర్చారు. అయితే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 థియేటర్లలో ఈనెల 24 విడుదల చేయనున్నారు. పగ పగ పగ: ప్రముఖ దర్శకుడు కోటి మొదటిసారి ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తున్న చిత్రం పగ పగ పగ. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాశ్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో, హీరోయిన్లుగా ఈ చిత్రం రాబోతోంది. వినోదాత్మకంగా సాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ శ్రీ రవి దుర్గా ప్రసాద్. అయితే ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేయనుండగా ఫస్ట్ డే ఫస్ట్ షోను ప్రేక్షకులకు ఉచితంగా చూపించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే! నెట్‌ఫ్లిక్స్ * ద పెర్ఫ్యూమర్ (హాలీవుడ్) సెప్టెంబరు 21 * జంతరా (హిందీ సిరీస్) సెప్టెంబరు 23 * ఎల్వోయూ (హాలీవుడ్) సెప్టెంబరు 23 డిస్నీ+హాట్‌స్టార్ * అందోర్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 21 * ద కర్దాషియన్స్ (వెబ్‌సిరీస్2) సెప్టెంబరు 22 * బబ్లీ బౌన్సర్ (తెలుగు) సెప్టెంబరు 23 ఆహా * ఫస్ట్ డే ఫస్ట్ షో (తెలుగు) సెప్టెంబరు 23 * డైరీ (తమిళ చిత్రం) సెప్టెంబరు 23 అమెజాన్ ప్రైమ్ * డ్యూడ్ (హిందీ సిరీస్) సెప్టెంబరు 20 * హుష్ హుష్ (హిందీ సిరీస్) సెప్టెంబరు 22 జీ5 * అతిథి భూతో భవ (హిందీ) సెప్టెంబరు 22 -
మల్టీప్లెక్స్‌లలో ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తున్న పాప్ కార్న్ ధరలు!
చారాణా కోడి పిల్లకు బారాన మసాలా అంటే ఇదేనేమో. వీకెండ్ ఎంజాయ్ చేద్దామని సినిమాకెళ్తే అక్కడ రెండు సినిమాలు చూపిస్తున్నారు. ఒకటి థియేటర్లో..ఇంకోటి ఇంటర్వెల్లో. థియేటర్లలో అన్ని తరగతుల వారికి వారి స్థాయిని బట్టి టికెట్ల ధరలుంటాయి. సినిమా హాళ్ల క్యాంటీన్లలో విక్రయించే తినుబండారాలకు మాత్రం అలాంటి భేదం లేదు. సినిమాకి వెళ్తే చాలు తమకు నచ్చిన రేట్లేసి చుక్కలు చూపిస్తున్నారు. వారమంతా కష్టపడ్డ సామాన్యుడు.. కాస్తంత రిలాక్స్ అయ్యే మంత్రం సినిమా. ఇప్పుడు అదే సినిమా థియేటర్లో స్నాక్స్ రేట్లు చూసి భయపడుతున్నారు. రేట్లు తగ్గించాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో సినిమా థియేటర్లో ముఖ్యంగా పాప్కాన్ కాస్ట్లీపై పీవీఆర్ ఛైర్మన్ అండ్ మేనేజిండ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ స్పందించారు. థియేటర్లలో పెరిగిపోతున్న శ్నాక్స్ ధరల్ని వ్యతిరేకిస్తున్న వినియోగదారుల్ని నిందించలేం. అయితే, మనదేశంలో సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీఫ్లెక్స్‌ల వరకు ఫుడ్ అండ్ బేవరేజెస్(ఆహారం,కూల్ డ్రింక్స్)ధరలలో ఎటువంటి మార్పు ఉండదని బిజిలీ చెప్పారు. నిర్వహణ ఖర్చుల కోసం మల్టీప్లెక్స్‌లోని స్నాక్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. మనదేశంలో ఫుడ్ & అండ్ బేవరేజెస్ మార్కెట్ రూ.1500కోట్లుగా ఉంది. మల్టీప్లెక్స్‌లలో ఎక్కువ స్క్రీన్ల కారణంగా ప్రొజెక్షన్ రూమ్‌లు,సౌండ్ సిస్టమ్‌ల అవసరం ఎక్కువే. కాబట్టే ఖర్చులు "4 నుండి 6 రెట్లు" పెరుగుతాయని అన్నారు. ఫోయర్లు కూడా ఫుల్ ఏసీతో ఉండడంతో ఎయిర్ కండిషనింగ్ అవసరం కూడా పెరిగిందన్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో పీవీఆర్- ఐనాక్స్ మెర్జ్ అయిన విషయం తెలిసిందే. చదవండి👉ఓటీటీ దెబ్బకు ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్ల విలీనం..! -
సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం..
పళ్లిపట్టు: షోళింగర్ బస్టాండ్ సమీపంలోని సుమతి మినీ సినిమా థియేటర్లో సోమవారం (జులై 4) అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో సిబ్బంది లేకపోవడంతో మంటలు వేగంగా చుట్టుముట్టాయి. షోళింగర్, అరక్కోణం, రాణిపేట పరిసర ప్రాంతాల నుంచి పదికి పైగా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో థియేటర్లోని కుర్చీలు, స్క్రీన్, ఇతర వస్తువులు కాలిపోయాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ? కోమాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మృతి.. 72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు -
విశాఖలో ఇగ్లూ థియేటర్ ఎక్కడ ఉందో తెలుసా?.. ప్రత్యేకతలివే
దొండపర్తి (విశాఖ దక్షిణ): సినిమాకు వెళ్లాలంటే.. సాధారణ థియేటర్‌కా.. మల్టీప్లెక్సుకా.. అంటూ అనేక ఆలోచనలు చేస్తుంటాం. కానీ కొద్ది రోజుల తరువాత ఈ చాయిస్ లిస్టులో ఇగ్లూ థియేటర్ కూడా చేరనుంది. పుర్రెకో బుద్ధి అన్న నానుడికి తగ్గట్టుగా ఆనంద్‌కు వచ్చిన సరికొత్త ఆలోచనతో సినిమా థియేటర్ రూపుదిద్దుకుంటోంది. ఈ థియేటర్ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాడని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చదవండి: ‘నర్సీపట్నం పిల్లి బయటకు రావాలి’ విశాఖ జిల్లాలో ఆనందపురం జంక్షన్ ఫ్లై ఓవర్ తరువాత జాతీయ రహదారికి ఆనుకొని ఏ స్క్వేర్ గోకార్టింగ్ వద్ద ఈ ఇగ్లూ థియేటర్ రూపుదిద్దుకుంటోంది. నెలన్నర క్రితం ప్రారంభమైన ఈ థియేటర్ నిర్మాణం ఇంకో నెల రోజుల్లో పూర్తి కానుంది. ఆగస్టు నెలలో థియేటర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. థియేటర్ ప్రత్యేకతలు.. కేవలం 500 గజాల్లో ఇగ్లూ తరహాలో ఎఫ్ఆర్పీ మెటీరియల్‌తో ఈ థియేటర్‌ను నిర్మిస్తున్నారు. ఈ మినీ థియేటర్లో వంద మంది కూర్చొనే విధంగా సీట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఫుల్ ఏసీ, హైక్వాలిటీ సరౌండ్ సిస్టమ్, ఇలా మల్టీప్లెక్సులకు సమానంగా థియేటర్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయిన వెంటనే పక్కనే 500 గజాల్లో మరో ఇగ్లూ థియేటర్‌ను నిర్మించనున్నారు. ఈ ఇగ్లూ థియేటర్.. మల్టీప్లెక్స్ ట్రెండ్‌కు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
ఓటీటీతో మారిపోయిన సినిమా ముఖ చిత్రం
-
ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై గైడ్‌లైన్స్ జారీ.. ఇకపై..
సాక్షి, అమరావతి: ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏఫీఎఫ్‌డీసీకి (ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది. ఇకపై రాష్టంలోని థియేటర్లు ఏపీఎఫ్‌డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలి. అన్ని థియేటర్లు,ప్రయివేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలి. విక్రయించే ప్రతి టికెట్ పై 2 శాతం మాత్రం సర్వీస్ చార్జీ వసూలు చేయాలి. థియేటర్లలో ఎటువంటి అవకతవకలు లేకుండా పక్కాగా ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు చేయాలి. కొత్త సినిమా విడుదల నేపథ్యంలో వారం ముందు నుంచి మాత్రమే టిక్కెట్లు అమ్మకాలు జరపాలి. చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి -
సినిమా థియేటర్‌కు యువతులు.. ఓ వ్యక్తి ఫోటోలు తీసి అసభ్యకరంగా..
శంషాబాద్(హైదరాబాద్): మహిళలు, యువతులతో అసభ్యంగా వ్యవహరిస్తున్న మరో వ్యక్తిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఓ సినిమా థియోటర్లో సినిమా చూసేందుకు వచ్చిన యువతులు, మహిళలను గత కొంత కాలంగా ఓ వ్యక్తి (35) ఫొటోలు తీయడంతో పాటు అసభ్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం ఉదయం నిఘా వేసి అతడిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అత్యాచారయత్నం కేసు.. గాయత్రి భర్త చెప్పిన షాకింగ్ విషయాలు.. -
ప్రేక్షకులకు ఏమైంది?
సాక్షి, బెంగళూరు: ప్రతి శుక్రవారం థియేటర్లలో అభిమానుల సందడి మిన్నంటేది. టికెట్ల దొరకాలంటే నానా పాట్లు పడేవారు. కొత్త సినిమా వస్తోందంటే ఉద్వేగం మిన్నంటేది. కానీ ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు థియేటర్ల వైపు అంతగా చూడడం లేదనే చెప్పాలి. కేజీఎఫ్–2 సినిమా విడుదల తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలో నూతనోత్సాహం కనిపించింది. కరోనా మహమ్మారి వల్ల చాలా సినిమాల షూటింగ్‌లు అటకెక్కాయి. కేజీఎఫ్ విజయంతో ఆ సినిమాల దర్శక నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడానికి నాంది పలికారు. గత మూడు వారాలుగా పదుల సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి. గత వారం సుమారు 11 సినిమాలు తెరమీదకు వచ్చాయి. తొలిరోజే ముఖం చాటేశారు అయితే ఆ సినిమాల ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి. గత వారం విడుదల అయిన దాదాపు అన్ని సినిమాలు ఒక్క రోజు ప్రదర్శనకే పరిమితమయ్యాయి. ప్రేక్షకులు కరువై రెండో రోజు కొన్ని థియేటర్లలో ప్రదర్శన రద్దు చేశారు. ఈ వారం విడుదలయిన కొన్ని సినిమాలు మొదటి షోనే రద్దు అయ్యాయి. దీంతో నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. కారణాలు అనేకం కరోనా వల్ల ఓటీటీకి ప్రజలు అలవాటు పడిపోవడం, టికెట్లు రేట్లు అధికంగా ఉండడం, పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం వంటివి కారణాలుగా భావిస్తున్నారు. ప్రతి సినిమా కూడా కేజీఎఫ్ అంతటి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్న ప్రేక్షకులూ పెరిగిపోయారు. మరోవైపు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో ప్రముఖులు చాలా మంది బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో థియేటర్లలో సినిమాను బతికించడం కోసం కన్నడ సినీ రంగ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. -
ఏలూరులో నకిలీ సినిమా టిక్కెట్లు! కళ్లు కాయలు కాచేలా వేచి చూసి మూవీకెళ్తే..
ఏలూరు టౌన్ (పశ్చిమ గోదావరి): ఏదైనా పెద్ద హీరో సినిమా వచ్చిందంటే చాలు.. అభిమానుల ఉత్సాహం, సినిమా చూడాలనే ఆతృత అంతా ఇంతా కాదు. దీనిని ఆసరాగా చేసుకొని వారికి నకిలీ టిక్కెట్లు విక్రయించి మోసం చేస్తూ డబ్బు దోచేస్తున్నారు ఓ థియేటర్ సిబ్బంది. తీరా సినిమా చూద్దామని థియేటర్‌కి వెళితే.. నకిలీదంటూ బయటికి గెంటేస్తున్నారు. దీంతో డబ్బూ పోయి, సినిమా చూడలేకపోయామనే ఆవేదనతో పాటు అవమానానికి గురవుతున్నారు అభిమానులు. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈ ఘటనలు జరుగుతుండటం గమనార్హం. ఇటీవల రిలీజ్ అయిన ఓ పెద్ద హీరో సినిమాకు వెంకటకుమార్ అనే ఒక ప్రేక్షకుడు వెళ్లాడు. ముందురోజే థియేటర్ వద్ద రూ.300 పెట్టి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. కళ్లు కాయలు కాచేలా వేచి చూసి ఉదయం ఐదు గంటలకు బెనిఫిట్ షోకు వెళ్లాడు. టిక్కెట్‌పై ఉన్న తన సీట్ నంబర్ చూసుకుని కూర్చున్నాడు. ఈలోగా మరో వ్యక్తి వచ్చి తన సీట్ నంబర్ కూడా అదేనంటూ టిక్కెట్ చూపించాడు. ఈలోగా థియేటర్ సిబ్బంది వచ్చి అతన్ని కూర్చోబెట్టి.. రాత్రంతా వేచిచూసి అధిక ధరకు టిక్కెట్ కొన్న వెంకట కుమార్‌ను బయటకు నెట్టేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. నీది నకిలీ టిక్కెట్.. మాకు సంబంధం లేదని చెప్పారు. తీరా అభిమాని తనకు ఈ టిక్కెట్ ఎలా వచ్చిందో చెప్పాలంటూ పట్టుబట్టడంతో థియేటర్ యాజమాన్యం, సిబ్బంది కంగుతిన్నారు. అతను వెళ్లి ఏలూరు వన్‌టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి👉 తిరుపతి, అరకుకు స్పెషల్ టూర్స్ భారీగా దోపిడీ సినిమా థియేటర్లోని సిబ్బంది చాకచక్యంగా టిక్కెట్లను నకిలీవి తయారు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీతో కలిసి వెళితే నకిలీ టిక్కెట్ కొన్నారు మాకు సంబంధం లేదంటూ బయటకు పంపేస్తున్నారు. వారంతా అవమానంగా ఫీలవుతూ ఎవరికీ చెప్పుకోలేక ఆవేదనకు గురవుతున్నారు. రోజూ ఒక్కో షోకు ఈ విధంగా పది టిక్కెట్ల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఒక్కో టిక్కెట్ ధర రూ.300 అనుకుంటే షోకు రూ.3 వేలు సంపాదిస్తున్నారు. నాలుగు షోలకు రూ.12 వేల వరకు జేబుల్లో వేసుకుంటున్నారు. వీరిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సినిమా అభిమానులు కోరుతున్నారు. చదవండి👉🏻 నా కారునే ఆపుతావా అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి -
ప్రారంభమైన మొబైల్ థియేటర్
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలకు సమీపాన హెబిటేట్ రెస్టారెంట్ పక్కన ఏర్పాటు చేసిన మొబైల్ థియేటర్ ప్రారంభమైంది. జీఎస్ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు సోమవారం దీనిని ప్రారంభించారు. ‘పిక్చర్ టైమ్’ సంస్థ ఏర్పాటు చేసిన ఈ థియేటర్ గ్రామీణ ప్రాంతాల వారికి ఐమాక్స్‌లో సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులలో ఒకరైన చైతన్య తెలిపారు. ఇన్‌ఫ్లాటబుల్ అకోస్టిక్ మెటీరియల్ (గాలి నింపిన టెంట్)తో తయారైన ఈ థియేటర్ అన్ని వాతావరణ పరిస్థితులను, అగ్ని ప్రమాదాలను తట్టుకుంటుందన్నారు. 35 ఎంఎం స్క్రీన్‌తో, 120 సిటింగ్ సదుపాయంతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌కి ఏడాది పాటు అనుమతులున్నాయని, ఈనెల 29న విడుదలయ్యే ఆచార్య సినిమాతో రెగ్యులర్ షోలు వేస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌తోపాటు బుకింగ్ కౌంటర్‌లోను లభించే టికెట్లు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే లభిస్తాయన్నారు. ప్రారంభ కార్యక్రమంలో జీఎస్ఎల్ ప్రతినిధులు డాక్టర్ గన్ని సందీప్, డాక్టర్ జి. తరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
కుంభస్థలాన్ని బద్దలు కొట్టనున్న ఆర్ఆర్ఆర్, ఎన్ని స్క్రీన్లలో రిలీజంటే?
‘‘ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం... రా’’ అంటూ రామ్, భీమ్ చేసిన యుద్ధాన్ని తెరపై చూసే సమయం ఆసన్నమైంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఈ యుద్ధాన్ని చూడటానికి దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది వేల స్క్రీన్లకు పైగా ‘ఆర్ఆర్ఆర్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం.. రణం.. రుధిరం). రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. కాగా ‘ఆర్ఆర్ఆర్’ భారీ సినిమా కాబట్టి ఈ సినిమాతో పోటీ పడకుండా తెలుగుతో కలుపుకుని ఇతర భాషల్లో కూడా తమ చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నాయి పలు నిర్మాణ సంస్థలు. అంతెందుకు? దేశవ్యాప్తంగా చాలావరకూ ఎక్కువ స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ కనిపిస్తుంది. ఇక జంట నగరాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్) అయితే శుక్రవారం ‘ఆర్ఆర్ఆర్’ తప్ప వేరే సినిమా కనిపించదు. ఆ విశేషాల్లోకి వస్తే... సింగిల్ 100... మల్టీప్లెక్స్ 40 హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్న థియేటర్లు ఎన్ని? అనే లెక్కలోకి వస్తే... సింగిల్ థియేటర్లు దాదాపు 100. మల్టీప్లెక్స్ దాదాపు 40 ప్రాపర్టీస్ (మల్టీప్లెక్స్‌లో పలు స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి వీటిని ప్రాపర్టీస్ అంటారు). మామూలుగా ఏ మల్టీప్లెక్స్ థియేటర్లో అయినా మినిమమ్ మూడు స్క్రీన్ల నుంచి మ్యాగ్జిమమ్ తొమ్మిది స్క్రీన్ల వరకూ ఉంటాయి. సో... టూకీగా ఒక్కో ప్రాపర్టీలో ఐదు స్క్రీన్లు ఉన్నాయనుకుందాం... అప్పుడు 40 ప్రాపర్టీస్‌లో 200 స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ విడుదలవుతుందనుకోవచ్చు. సో.. సింగిల్, మల్టీప్లెక్స్ కలుపుకుని దాదాపు 300 స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ ఆడుతుంది. మరి.. ఇప్పటివరకూ థియేటర్లలో ఉన్న సినిమాల సంగతేంటి? రెండు మూడు స్క్రీన్లు మినహా... గురువారం వరకూ ‘ద కశ్మీర్ ఫైల్స్’, ‘రాధే శ్యామ్’, ‘బచ్చన్ పాండే’, ‘జేమ్స్’తో పాటు హాలీవుడ్ ‘బ్యాట్ మేన్’ తదితర చిత్రాలు కొన్ని థియేటర్లలో ప్రదర్శితమయ్యాయి. అయితే శుక్రవారం రెండు మూడు స్క్రీన్లు మినహా మిగతా అన్నింటిలోనూ ‘ఆర్ఆర్ఆర్’ దర్శనమిస్తుంది. ఎన్ని రోజుల పాటు ఇలా అన్ని స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ మాత్రమే ఉంటుంది అంటే..? ‘ద కశ్మీర్..’కి చాన్స్ జంట నగరాల్లో ఆడుతున్న ఆలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’, ‘రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ చిత్రాల ప్రదర్శన గురువారంతో ముగిసింది. అయితే ‘ద కశ్మీర్ ఫైల్స్’ శుక్రవారం ఒకట్రెండు స్క్రీన్లలో మాత్రమే కనిపించి, మళ్లీ సోమవారం నుంచి కాస్త ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శితమవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ వంటి రెండు మూడు చిత్రాలకూ స్కోప్ ఉంది. అయితే ఈ రెండు మూడు సినిమాలూ జస్ట్ పదీ పదిహేను శాతం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శితమవుతాయని, మిగతా అన్ని స్క్రీన్లలోనూ ఓ వారం.. పది రోజులు ‘ఆర్ఆర్ఆర్’ ఉంటుందని జంట నగరాలకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ పేర్కొన్నారు. ఆ పదిహేను శాతంలో కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్లే ఎక్కువని, అది కూడా ‘ద కశ్మీర్...’ సినిమా స్క్రీన్లే ఎక్కువ అని కూడా తెలిపారు. ‘‘ఆదివారం వరకూ ఎలానూ ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీన్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత వేరే సినిమాలకు ఎన్ని స్క్రీన్లు కేటాయించాలనేది ‘ఆర్ఆర్ఆర్’కి వచ్చే స్పందన నిర్ణయిస్తుంది’’ అని ఓ డిస్ట్రిబ్యూటర్ అన్నారు. 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు.. ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, సముద్ర ఖని, శ్రియ, రే స్టీవెన్సన్... ఇలా భారీ తారాగణంతో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ‘ఆర్ఆర్ఆర్’ రూపొందింది. కోవిడ్ బ్రేక్స్ నడుమ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రూపొందించిన ఈ సినిమా నిడివి ఎంత అంటే.. 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు. నిజానికి ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు అట. అయితే ముందు 1 నిమిషం 35 సెకన్ల నిడివిని తగ్గించారట. ఆ తర్వాత క్రెడిట్స్‌లో 3 నిమిషాల 26 సెకన్ల నిడివిని తగ్గించారని భోగట్టా. ఫైనల్‌గా ప్రేక్షకులు చూడనున్నది 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు ‘ఆర్ఆర్ఆర్’ అని తెలిసింది. చదవండి: RRR Movie: అందరిముందే అబద్ధాలు ఆడతాను: రాజమౌళి -
ఎల్లలు దాటిన అభిమానం, ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఏకంగా థియేటర్‌నే కొనేశారు!
Jr NTR Fans Buy Entire Theatre For RRR Movie: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ల మానియే కనిపిస్తుంది. మార్చి 11న రాధేశ్యామ్, మార్చి 25న ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ల బుకింగ్ ప్రారంభమై రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈమూవీ కోసం ఇటూ మెగా ఫ్యాన్స్ అటూ నందమూరి ఫ్యాన్స్ ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా బజ్ నెలకొంది. చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు ఇంకా ఆర్ఆర్ఆర్ విడుదలకు రెండు వారాలపైనే సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే ఈ మూవీ టికెట్స్ ఓ రేంజ్లో సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఏకంగా థియేటర్ మొత్తాన్నే కొన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది అమెరికాలో చోటుచేసుకోవడంతో మరింత ఆసక్తిని సంతరించుకుంది. ఫ్లోరిడాలోని ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీమియర్ చూసేందుకు ఏకంగా ఓ థియేటర్ అంతా బుక్ చేసుకున్నారట. చదవండి: జ్యోతిష్యాన్ని నమ్మను కానీ.. బాహుబలి విజయం తర్వాత ఫ్లోరిడాలోని సినిమార్క్ టిన్సెల్టౌన్లో సాయంత్రం 6 గంటల షో కోసం అన్ని ప్రీమియర్ టికెట్స్ బుక్ చేసుకొని ఎన్టీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. అసలే భారీ సినిమా, పైగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒకే థియేటర్లో కూర్చొని ప్రీమియర్ చూస్తుంటే ఇక ఆ హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కాగా దర్శక ధీరుడు రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీలో తారక్ కొమురంభీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా కాగా.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, శ్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
కారులో కూర్చుని వెండితెరపై సినిమా చూడొచ్చు.. త్వరలో హైదరాబాద్‌లో..
Hyderabad: డ్రైవ్ ఇన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ నగర వాసులకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఈ ఆలోచన ఆచరణ రూపం దాల్చితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇక్కడ ఉండనుంది. డ్రైవ్ ఇన్ థియేటర్ సాధారణ సినిమా థియేటర్/మల్టీప్లెక్స్‌కి వెళితే ముందుగా వాహనం పార్కింగ్ చేయాలి. ఆ తర్వాత టిక్కెట్ తీసుకుని క్లోజ్డ్ హాల్లో అక్కడున్న సీట్లో కూర్చుని సినిమా చూడాలి. కానీ డ్రైవ్ ఇన్ థియేటర్లో మనం కారులో కూర్చుని.. ఎదురుగా కనిపించే అతి భారీ స్క్రీన్‌పై సినిమా చూడొచ్చు. ఈ ఓపెన్ థియేటర్‌కి తగ్గట్టుగా సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అక్కడ కామన్ యూరప్, అమెరికా దేశాల్లో డ్రైవ్ ఇన్ థియేటర్ కాన్సెప్టు ఎప్పటి నుంచో ఉంది. కార్లలో థియేటర్‌కి వచ్చే వినియోగదారుడు అందులో ఉంటూనే తన కంఫర్ట్‌కి అనుగుణంగా సినిమాను అక్కడ చూస్తుంటారు. మనదగ్గర ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నైలలో కూడా ఈ డ్రెవ్ ఇన్ థియేటర్లు ఉన్నాయి. రజనీకాంత్ శివాజీ మూవీలో ఓ ఫైట్ సీన్లో ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ కనిపిస్తుంది. లోకేషన్ ఎక్కడ కనీసం 150 కార్ల సామార్థ్యంతో డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటు చేయాలంటే రూ. 5 నుంచి 8 కోట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా వేస్తున్నారు. 150 కార్లు సుళువుగా వచ్చి పోయేలా, నిలిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీనికి సువిశాలమైన స్థలం కావాలి. నగరం మధ్యలో లోకేషన్ కోసం అన్వేషిస్తున్నారు. ఓఆర్ఆర్ మరోవైపు నగరం నలువైపులా విస్తరిస్తూ ఓఆర్ఆర్ని తనలో కలిపేసుకుంటోంది. దీంతో నగర పరిధిలో ఉన్న 19 ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ పాయింట్ల సమీపంలో ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను అందుబాటులోకి తెస్తే ఎలా ఉంటుందనే అంశంపై హెచ్ఎండీఏ పరిశీలిస్తోంది. అనువైన స్థలాలను గుర్తిస్తోంది. వెనువెంటనే పర్మిషన్లు హెచ్ఎండీఏ డ్రైవ్ ఇన్ థియేటర్‌కి సంబంధించిన స్థలాలను గుర్తించిన తర్వాత నిర్మాణ కంపెనీల నుంచి దరఖాస్తులు అహ్వానించనుంది. ఎవరైనా డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటుకు ముందుకు వస్తే త్వరితగిన అనుమతులు జారీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కోవిడ్‌తో కోవిడ్ ఎఫెక్ట్‌తో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేందుకు వెనుకాడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అదే డ్రైవ్ ఇన్ థియేటర్ అందుబాటులోకి వస్తే ఎవరి కారులో వారు ఉంటూనే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే బిగ్స్క్రీన్పై థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు డ్రైవ్ ఇన్ థియేటర్ ఫెసిలిటీ ఉన్న అతి కొద్ది నగరాల జాబితాలో హైదరాబాద్‌కి చోటు దక్కుతుంది.] చదవండి: 47 అంతస్తులతో ‘హైదరాబాద్ వన్’.. దేశంలోనే ఫస్ట్! -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే..
కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇటీవల మరోసారి మహమ్మారి విజృంభించడంతో సంక్రాంతికి చిన్న సినిమాలు మాత్రమే సందడి చేశాయి. అయినప్పటికీ కొన్ని సినిమాలు విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో వరసగా సినిమాల విడుదలను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ వారం పలు సినిమాలు ఇటూ థియేటర్లో అటూ ఓటీటీలో అలరించబోతున్నాయి. మరి అవేంటో చూడాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. రవితేజ ‘ఖిలాడి’ ఈ వీకెండ్‌కు మంచి కిక్ ఇచ్చేందుకు మాస్మాహారాజా రవితేజ సిద్దమవుతున్నాడు. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలో కథానాయికలు. కోనేరు సత్యనారాయన నిర్మించిన ఈ సినిమాలో యాంకర్ అనసూయ, అర్జున్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు విశాల్ ‘ఎఫ్ఐఆర్’ విష్ణు విశాల్ హీరోగా, నటించి నిర్మించిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో హీరో రవితేజ, అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల కానుంది. సెహరి మూవీ హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం సెహరి. ఈ సినిమాకు జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రవితేజ గిరిజాలా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’.అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్త్నున్నారు యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఆహాలో ‘భామ కలాపం’ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భామ కలాపం’. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. గృహిణిగా పక్కింట్లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపే మహిళగా ప్రియమణి కనిపించనుంది. అలాగే యూట్యూబ్ ఛానల్లో వంటచేసే మనిషిగా కనిపిస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. విక్రమ్ ‘మహాన్’ మూవీ విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో అలరించబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 10న మహాన్ విడుదలకు చేస్తున్నారు. మళ్లీ ముదలైంది చిత్రం సుమంత్ హీరోగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్‌రాజన్, న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ నటించారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథతో రూపొందిన సినిమా ఇది. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అశోక్ గల్లా హీరో మూవీ యంగ్ హీరో గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావులు ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొనె ‘గెహ్రాయా’ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, సిద్దాంత్ చతుర్వేది జంటగా నటించిన చిత్రం గెహ్రాయా.. ఇందులో అనన్యా పాండే, ధైర్వా కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది. -
సినిమా థియేటర్‌ను జప్తు చేసే అధికారం వారికే: హైకోర్టు
సాక్షి, అమరావతి: లైసెన్స్ లేదన్న కారణంతో సినిమా థియేటర్‌ను జప్తు చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఏపీ సినిమా (నియంత్రణ) రూల్స్ 1970 ప్రకారం.. లైసెన్స్ జారీ చేసే అధికారి మాత్రమే సినిమా థియేటర్‌ను జప్తు చేయగలరని స్పష్టం చేసింది. ఈ రూల్స్ ప్రకారం లైసెన్స్ జారీ అధికారి జాయింట్ కలెక్టర్ (జేసీ) అవుతారని తెలిపింది. అందువల్ల జేసీకి మాత్రమే సినిమా థియేటర్‌ను మూసివేసే అధికారం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో శ్రీనివాస మహల్ లైసెన్స్ పునరుద్ధరణ కాలేదని తహసీల్దార్ దాన్ని జప్తు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు థియేటర్‌ను జప్తు చేస్తున్నట్లు తహసీల్దార్ చెప్పడాన్ని కూడా ఖండించింది. జప్తు చేసిన థియేటర్‌ను తెరవాలని తహసీల్దార్‌ను ఆదేశించింది. లైసెన్స్ పునరుద్ధరణ అంశం లైసెన్స్ జారీ అధికారి ముందు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ థియేటర్లో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని థియేటర్ యాజమాన్యానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్స్ లేదన్న కారణంతో తమ థియేటర్‌ను తహసీల్దార్ జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస మహల్ మేనేజింగ్ పార్టనర్ సనపాల శంకరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఇలా జరగడం బాధగా ఉంది: నాని భావోద్వేగం
Hero Nani Gets Emotional On Social Media Over Movie Theater Fire Accident: హైదరాబాద్ బిగ్‌స్క్రీన్ థియేటర్లో కేపీహెచ్‌బీ కాలనీలోని శివపార్వతి థియేటర్ ఒకటి. మంచి సౌండ్ సిస్టం ఉన్న థియేటర్ శివ పార్వతి. అంత్యంత ప్రాముఖ్యత ఉన్న ఈ థియేటర్ సోమవారం ఉదయం అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ వల్ల థియేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి థియేటర్ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో సినిమా హాల్లోని ఫర్నీచర్, సినిమా స్క్రీన్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. చదవండి: నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్ బాబు, స్పందించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు ఈ థియేటర్ ప్రమాదంపై నేచురల్ స్టార్ నాని స్పందిస్తూ భావోద్యేగానికి లోనయ్యాడు. శివ పార్వతి థియేటర్‌తో తనకున్న జ్ఞాపకాలని సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేసుకున్నాడు. ‘శివ పార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం జరగడం చాలా బాధాకరం. ఇక్కడ ‘టక్కరి దొంగ’ మొదటి షో చూడటం నాకింగా గుర్తుంది. ఆ సినిమాకి ఫ్రెండ్స్ వేళ్లి రచ్చ రచ్చ చేశాం. ఇలా ఎన్నో సినిమాలు ఆ థియేటర్లో చూశాం. ఆ థియేటర్‌తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలా కాలిపోవడం చాలా బాధగా ఉంది. ఎవరికీ ఎటువంటి గాయాలు అవకపోవడం అదృష్టం’ అంటూ నాని ట్వీట్ చేశాడు. చదవండి: Radhe Shyam: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్ గారూ.. Sad to hear about the fire accident at Shiva Parvathi theatre. I remember watching Takkari Donga there on the first day in mad euphoria. Glad to know that no one is hurt. — Nani (@NameisNani) January 3, 2022 -
అద్దెకు ఫ్యామిలీ థియేటర్ ! హైదరాబాద్‌లో న్యూ బిజినెస్ !
కోవిడ్ మహమ్మారి ఎటాక్ చేసినప్పటి నుంచి ఇంటి బయట కాలు పెట్టాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. వైరస్ భయంతో కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్తామంటే మనసు రావడం లేదు. చిన్న చిన్న సరదాలకు కూడా దూరం కావాల్సి వస్తోంది. ఇంటిల్లిపాది సినిమాకి వెళ్లి ఏళ్లు నెలలు దాటిన కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి వారి కోసమే ప్రైవేటుగా సినిమా చూసేందుకు వీలుగా ఫ్యామిలీ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో ఈ కొత్త రకం ఫ్యామిలీ థియేటర్ బిజినెస్ ఊపందుకుంటోంది. అద్దెకు థియేటర్ కరోనా తెర మీదకు వచ్చిన తర్వాత వెండి తెర మీద సినిమాలు చూడటం చాలా అరుదైన విషయంగా మారింది. వందల మందితో కలిసి సినిమా చూడాలంటే భయపడే కుటుంబాల సంఖ్య పెరిగింది. వినోదం కోసం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అందుబాటులో ఉన్నా థియేటర్లో చూసిన ఫీల్ అయితే మిస్ అవుతున్నారు. ఇలాంటి వారి కోసం కేవలం ఒక ఫ్యామిలీ మాత్రమే సినిమా చూసేలా అత్యాధునిక సౌకర్యాలతో థియేటర్‌ను స్టార్ ట్రాక్ గ్రూప్ హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చింది. థియేటర్‌ను అద్దెకు తీసుకుని నచ్చిన సినిమాను చూసేయోచ్చు. మల్టీప్లెక్స్ స్థాయిలో స్టార్ట్రాక్ గ్రూపు థియేటర్లో ఏడుగురు కుటుంబ సభ్యుల వరకు సినిమా చూసే వీలుంది. ఈ థియేటర్లో 142 ఇంచెస్ ఆధునిక స్క్రీన్, మెయిన్ స్ట్రీమ్ థియేటర్‌కి ఏ మాత్రం తీసిపోని ఆడియో సిస్టమ్‌తో పాటు రిక్లెయినర్ చైయిర్లు అందుబాటులో ఉన్నాయి. థియేటర్ ఇంటీరియర్ సైతం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. థియేటర్ అనుభూతిని అందివ్వడంలో ఈ ఫ్యామిలీ థియేటర్ మల్టీప్లెక్స్‌కి ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందించారు. కంటెంట్ మనదే ఈ రెంటెండ్ థియేటర్లో ఫ్యామిలీ ఫంక్షన్ వీడియోలతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఆహా, హాట్‌స్టార్ తదితర ఓటీటీ కంటెంట్లపై వచ్చే సినిమాలను సైతం ఇక్కడ చూసే వీలుంది. ఈ రోజుల్లో చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. థియేటర్ ఫీల్ కావాలనుకునే వారు ఈ రెంటెండ్ థియేటర్లో కరోనా భయాలు లేకుండా సినిమాలను ఆస్వాదించవచ్చు. రోజుకి మూడు షోలు ఈ ఫ్యామిలీ థియేటర్‌ను రోజుకు మూడు షోలకు అద్దెకు ఇస్తున్నారు. మార్నింగ్ , ఆఫ్టర్నూన్, ఈవెనింగ్ సమయాల్లో ఇందులో ఫ్యామిలీతో సినిమాను చూసేయోచ్చు. షో టైమింగ్, వారాన్ని బట్టి ఒక్కో షోకి కనిష్టంగా రూ. 1500ల నుంచి గరిష్టంగా రూ.1900ల వరకు రెంట్ తీసుకుంటారు. ప్రతీ షో తర్వాత థియేటర్ మొత్తాన్ని ఆధునిక పద్దతిలో శానిటైజ్ చేస్తున్నారు. ఈ గ్రూప్‌కి చెందిన వెబ్‌సైట్‌కి వెళ్లి ముందుగా షోని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రెండ్‌కి తగ్గట్టుగా హైదరాబాద్ నగరంలో ఒకప్పటి సంగీత్ థియేటర్ మొదలు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సంధ్య థియేటర్స్ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లను డిజైన్ చేయడంలో స్టార్ ట్రాక్ గ్రూపుకి మంచి రికార్డు ఉంది. ఈ గ్రూపు ఓనర్లు మూడు తరాలు నగరంలో దాదాపు 300ల వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. బ్రిటీష్ జమానాలో ఇంజీనింగ్లో గోల్డ్ మెడల్ పొంది బీకే మూర్తితో ఈ పరంపర మొదలైంది. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా రూపొందిన ఫ్యామిలీ థియేటర్ సికింద్రాబాద్, సర్థార్‌పటేల్ రోడ్‌లోని పైగా హౌసింగ్ కాలనీలో ఉంది. చదవండి: కింగ్డమ్ ఆఫ్ కిడ్స్.. హైదరాబాద్‌లో కొత్త స్టూడియో -
ఢిల్లీ సీఎంకు కరణ్ జోహార్ ట్వీట్, నిర్మాతపై నెటిజన్ల మండిపాటు
Karan Johar Trolled By Netizens For His Tweet to Delhi CM Over Theatres Re-Open: సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ట్రోల్స్ సెగ తగలడం కొత్తేమి కాదు. పలువురు సినీ సెలబ్రెటీలు వారి తీరుతో సోషల్ మీడియాలో చేదు అనుభవాన్ని చవిచూస్తుంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు ట్రోల్స్ సెగ తగిలింది. అయితే సోషల్ మీడియాలో నెగిటివిటి తెచ్చుకోవడం కరణ్‌కు ఇదేం కొత్త కాదు. తరచూ ఆయన సోషల్ మీడియాల్లో ట్రోల్స్ బారిన పడుతుంటాడు. తాజా కరోనా నేపథ్యంలో మూసి వేసిన థియేటర్లను తెరవాలంటూ ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. దీంతో కరణ్‌పై నెటిజన్లు ధ్వజమెతున్నారు. చదవండి: దుబాయ్‌లో హీరోయిన్‌తో హీరో విక్రమ్ తనయుడు డేటింగ్, ఫొటోలు వైరల్ అయితే ప్రస్తుతం దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలు వరసగా కరోనా బారిన పడుతున్నారు. దీనికి కరణ్ ఇచ్చిన ఓ విందు పార్టీయే వేదిక అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో దేశ రాజధానిలో మరోసారి థియేటర్లు మూత పడ్డాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్కడి థియేటర్లు మూసీవేయాలంటూ ఆదేశం ఇచ్చారు. దీంతో సీఎం నిర్ణయంపై స్పందిస్తూ కరణ్ జోహార్ ఇలా ట్వీట్ చేశాడు. ‘మిగతా చాల చోట్లతో పోలిస్తే సినిమా థియేటర్లో కరోనా వ్యాపించే అవకాశాలు తక్కువ. చదవండి: విషాదం: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సొషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ బాక్సాఫీస్ నడపవచ్చు. అందుచేత తిరిగి థియేటర్లు ఒపెన్ చేయడానికి అనుమతి అవ్వండి’ అని కోరుతూ ఆయన ట్వీట్ చేశాడు. అది చూసిన నెటిజన్లు కరణ్‌పై విరుచుపడుతున్నారు. మీ ట్వీట్ ఉద్దేశం ఏంటి.. మమ్మల్ని డబ్బులు సంపాదించుకోనివ్వండి. సామాన్యులు యాతన పడనివ్వండి అనేగా అంటూ కరణ్‌కు నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. కరణ్ చెబుతోన్న లాజిక్ ‘బాలీవుడ్ వర్సెస్ సైన్స్’ అంటూ వెక్కిరించారు. మరికొందరు ‘సినిమాల్ని ఓటీటీలో చూసుకోవచ్చు. థియేటర్స్ తెరిచి జనం ప్రాణాలతో ఆటలాడకండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. We urge the Delhi Government to allow cinemas to operate. Cinemas are equipped with better ability to ensure a hygienic environment while maintaining social distancing norms as compared to other out-of-home settings. @LtGovDelhi @ArvindKejriwal @OfficeOfDyCM #cinemasaresafe — Karan Johar (@karanjohar) December 30, 2021 -
సినిమా టికెట్ ధరల హేతుబద్ధీకరణపై చర్చ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను హేతుబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి శుక్రవారం వర్చువల్‌గా సమావేశమైంది. టికెట్ రేట్లు నిర్ణయించే క్రమంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, సినీగోయర్స్ అసోసియేషన్ సభ్యులతో కమిటీ ప్రాథమికంగా చర్చించింది. ఈ క్రమంలో సభ్యుల సూచనలు, సలహాలను సైతం కమిటీ స్వీకరించింది. వీటిపై సమగ్రంగా చర్చించేందుకు జనవరి 11వ తేదీన మరోసారి సమావేశమవ్వాలని కమిటీ నిర్ణయించింది. ప్రేక్షకులపై భారం పడకుండా తక్కువ ధరకు వినోదాన్ని అందించేందుకు హైకోర్టు సూచనల మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. -
సినిమా థియేటర్లకు గడ్డుకాలం
-
అడ్డగోలు దోపిడీ.. ప్రేక్షకులపై తిను‘బండ’రాలు
సాక్షి, అమరావతి బ్యూరో: వినోదం కోసం సినిమా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు అక్కడ విక్రయించే తినుబండారాల ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ థియేటర్, ఈ థియేటర్ అనే తేడా లేదు. థియేటర్ స్థాయి బట్టి ధరలు మోతమోగుతున్నాయి. సినిమా టికెట్టుకంటే స్నాక్స్, పాప్‌కార్న్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ధరలే అధికం. విజయవాడలో ఏసీ, నాన్ ఏసీ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్‌లు వెరసి 46 వరకు ఉన్నాయి. థియేటర్లలో అన్ని తరగతుల వారికి వారి స్థాయిని బట్టి టికెట్ల ధరలుంటాయి. సినిమా హాళ్ల క్యాంటీన్లలో విక్రయించే తినుబండారాలకు మాత్రం అలాంటి భేదం లేదు. చదవండి: Andhra Pradesh: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.134.95 కోట్లు ఏ క్లాస్‌కు వెళ్లిన వారి కైనా ఒకటే బాదుడు. ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులకు పది నిమిషాల పాటు విరామం ఉంటుంది. ఆ సమయంలో క్యాంటీన్లకు వచ్చి తినుబండారాలు, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ కొనుగోలు చేయడం రివాజు. కుటుంబ సమేతంగా వెళ్లిన వారు పిల్లలకు తినుబండారాలు కొనివ్వక తప్పదు. లేదంటే వారు మారం చేస్తారు. క్యాంటీన్లలో విక్రయించే ధరలు బయట దొరికే రేట్లకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఉదాహరణకు 200 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ ధర మార్కెట్లో రూ.14 (గాజు బాటిల్), రూ.20 (ప్లాస్టిక్ బాటిల్) ఉండగా థియేటర్లలో రూ.60 నుంచి 79 వరకు వసూలు చేస్తున్నారు. బయట రూ.30కి దొరికే 150 గ్రాముల పాప్‌కార్న్ రూ.180, రూ.20 విలువచేసే స్వీట్‌కార్న్ రూ.60, రూ.20కే దొరికే ఐస్క్రీంను రూ.50కి, రూ.20ల కేక్, పఫ్ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. బయట రూ.10లకే దొరికే టీ సినిమా హాళ్ల క్యాంటీన్లలో కొన్నిచోట్ల రూ.25, మల్టీప్లెక్స్‌ల్లో టీ, కాఫీ, లెమన్ టీలు ఏదైనా రూ.50 చొప్పున పిండుతున్నారు. సినిమా హాళ్ల క్యాంటీన్లలో నాలుగైదు రెట్ల అధికంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మరో విచిత్రమేమిటంటే.. థియేటర్లలో విక్రయించే కొన్ని తినుబండారాలపై ప్రత్యేక ఎమ్మార్పీలుంటాయి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ‘ఎమ్మార్పీకే విక్రయిస్తున్నాం’ అని క్యాంటీన్ల నిర్వాహకులు దబా యిస్తుంటారు. థియేటర్లలో ధరలు భరించలేని వారెవరైనా బయట నుంచి తినుబండారాలను తీసుకెళ్లడానికి అనుమతించరు. కనీసం మంచి నీళ్ల బాటిల్‌ను కూడా తీసుకెళ్లనీయరు. గేటు బయటే అలాంటి వాటిని తిరస్కరిస్తారు. విధి లేని పరిస్థితుల్లో ప్రేక్షకులు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. కుటుంబానికి రూ.వెయ్యి ఖర్చు నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం సినిమాకు వెళ్తే కనీసం రూ.వెయ్యి ఖర్చవుతోంది. మామూలు థియేటర్ టికెట్టు ధర రూ.100 ఉంటే నలుగురికి రూ.400 అవుతుంది. థియేటర్లో తినుబండారాలకు పొదుపుగా ఖర్చు చేస్తే మరో రూ.600 అయినా వెచ్చించక తప్పదు. ఇలా ఒక మధ్య తరగతి కుటుంబం సినిమాకి వెళ్లాలంటే రాను, పోను ఖర్చులు కాకుండా రూ.వెయ్యి భారం పడుతోంది. -
తెలంగాణ ప్రభుత్వంపై చిరంజీవి ప్రశంసలు
థియేటర్లలో సినిమా టికెట్ ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’అని చిరంజీవి ట్వీట్ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు.🙏🏻🙏🏻 సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. pic.twitter.com/w6VbRMtrG5 — Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021 -
ఏపీలో సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు
-
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లపై దాడులు
-
క్రిస్మస్కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!
కరోనా తగ్గుముఖం పట్టాక ఇండస్ట్రీ సినిమా రిలీజ్‌ల మీద దృష్టిపెట్టింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ వరకు కదిలి వస్తారని అఖండ, పుష్ప సినిమాలు నిరూపించడంతో చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దూకుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం పెద్దపెద్ద సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో కూడా పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. అవేంటో చూద్దాం.. క్రిస్మస్కు థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే! నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా గతంలో నాని నటించిన టక్ జగదీశ్ ఓటీటీలో విడుదల కావడంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ థియేటర్లోనే విడుదలవుతుండటంతో అతడి ఫ్యాన్స్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. టిమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్ర రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ పోషిస్తుండగా దీపికా ఆయన భార్య రోమి భాటియాగా నటిస్తోంది. కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, దీపిక పదుకొనె, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూడు పుఠాణి’. పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, కటారి రమేష్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ థ్రిల్లర్ డిసెంబరు 25న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రఘు కుంచె ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుందని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాక్‌డోర్’. బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మాత. ప్రణవ్ స్వరాలందించారు. ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో.. చక్కటి సందేశమిస్తూ సినిమాని రూపొందించాం. పూర్ణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని నిర్మాత తెలియజేశారు. యాక్షన్ ప్రియులను విశేషంగా అలరించిన చిత్రం ‘ది మ్యాట్రిక్’. 1999లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ది మ్యాట్రిక్స్ రీలోడెడ్’, ‘ది మ్యాట్రిక్స్ రెవెల్యూషన్స్’ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత ఈ సిరీస్‌లో వస్తున్న చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రీసర్కషన్స్’ లానా వచౌస్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీనూ రీవ్స్, క్యారీ అన్నె మోస్‌లతో పాటు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తుస్తోంది. ఈ చిత్రంలో ఆమె సతి అనే సాహసోపేతమైన పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఆనంద్ చంద్ర తెరకెక్కించిన చిత్రం ‘ఆశ ఎన్కౌంటర్’. 2010లో యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. హైదరాబాద్ నగరశివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను అతి క్రూరంగా హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్ చంద్ర ‘ఆశ ఎన్కౌంటర్’ తెరకెక్కించాడు. డిసెంబరు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్చే చిత్రాలు ఇవే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)'. తొలిసారిగా కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్', డిసెంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘వరుడు కావలెను’ నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అతరంగీ రే బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్, కోలీవుడ్ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘అతరంగీ రే’. సారా అలీఖాన్ కథానాయిక. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్కానుంది. ఇంద్రజాలికుడిగా అక్షయ్‌కుమార్, ప్రేమికులుగా ధనుష్, సారా అలీఖాన్ కనిపించనున్నారు. సత్యమేవ జయతే జాన్ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘సత్యమేవ జయతే’. దానికి కొనసాగింపుగా ‘సత్యమేవ జయతే 2’ వచ్చిన సంగతి తెలిసిందే. మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కుమార్ ఓ కీలక పాత్రలో నటించింది. యాక్షన్ సన్నివేశాలకు ఇందులో పెద్ద పీట వేశారు. కాగా, డిసెంబరు 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. పరంపర మూవీ సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా?లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? వంటి విషయాలకు సమాధానం కావాలంటే ‘పరంపర’ చూడాల్సిందే అంటున్నారు ‘బాహుబలి’ నిర్మాతలు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. హరి యెల్లేటి కథను అందించారు. డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘పరంపర’ స్ట్రీమింగ్ కానుంది. మానాడు తమిళ నటుడు శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ‘లూప్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం లూప్ అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో పాత్రతోపాటు పోలీసు ఆఫీసర్ ‘డీసీపీ ధనుష్కోటి’ పాత్ర కూడా ఎంతో కీలకం. ఈ పాత్రను నటుడు, దర్శకుడు ఎస్.జె సూర్య పోషించారు. కాగా, ఇప్పుడు ఈ చిత్రం డిసెంబరు 24న ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
15 నిమిషాలు ఆలస్యంగా షో వేసిన థియేటర్‌కు రూ. లక్ష జరిమానా
Hyderabad Theatre Fined Rs 1 Lakh For Wasting Time On Advertisements: హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు కంజ్యూమర్స్ ఫోరమ్ లక్ష రూపాయల జరిమాన విధించి షాకిచ్చింది. షో సమయానికి కంటే 15 నిమిషాలు ఆలస్యంగా సినిమా వేసి తన సమయాన్ని వృథా చేశారంటూ రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన వినియోగదారుల కోర్టు తాజాగా సదరు థియేటర్‌కు లక్ష రూపాయల జరిమాన విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి టికెట్‌పై ముద్రించిన సమయానికి సినిమా ప్రారంభించకుండా ప్రకటనలు వేసి 15 నిమిషాలు ఆలస్యంగా షో వేశారని ఆరోపిస్తూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. చదవండి: షాకిస్తున్న అనసూయ లేటెస్ట్ లుక్, ఈ రేంజ్లో గ్లామర్ ఇచ్చిందా! ఈ క్రమంలో 15 నిమిషాలు తన సమయాన్ని వృథా చేసిన సదరు థియేటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేసు నమోదు చేశాడు. అంతేగాక తనకు న్యాయం చేయాలంటూ అతడు విజ్ఞప్తి చేశాడు. విజయ్ తన ఫిర్యాదులో ‘2019 జాన్ 22న వచ్చిన గేమ్ ఓవర్ సినిమాను చూసేందుకు కాచిగూడ క్రాస్ రోడ్స్‌లోని ఓ థియేటర్లు వెళ్లినట్లు చెబుతూ ఆధారాలన్నిటీని సమర్పించాడు. టికెట్‌పై ముంద్రించిన సమయం ప్రకారం సినిమా సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కావాలి, కానీ సాయంత్రం 4:45 గంటలకు ప్రారంభించారని ఆరోపించాడు. చదవండి: ‘పుష్ప’ టీమ్‌కి భారీ షాక్, ఆందోళనలో దర్శక-నిర్మాతలు 15 నిమిషాలు ప్రకటనలు వేసి తన సమయం వృథా చేశారంటూ థియేటర్ మేనేజర్‌కు కూడా ఫిర్యాదు చేశానని, అయితే, ఆయన స్పందించలేదని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌కు చెప్పాడు. దీంతో ఈ కేసులో రెండో ప్రతివాదిగా లైసెన్సింగ్ అథారిటీ 'హైదరాబాద్ పోలీస్ కమిషనర్'ను చేర్చారు. అయితే, తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ చట్టం-1955 ప్రకారం పాత విధానం ప్రక్రారమే ప్రకటనలు వేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తమకు ఆర్టికల్ 19(1)(జీ), (ఏ) ప్రకారం ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీలోకి పుష్ప మూవీ అయితే, ఐనాక్స్ సంస్థ వాదనలను వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. చట్టం ప్రకారం కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉచిత ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. అంతేగాక, వాణిజ్య ప్రకటనలు వేయడం నిబంధనలకు విరుద్ధమని తీర్పు వెలువరించి, ఫిర్యాదుదారుడికి పరిహారంగా రూ. 5 వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ. 5 వేలు చెల్లించాలని తాజాగా తీర్పు ఇచ్చింది. అంతేగాక, లైసెన్సింగ్ అథారిటీ అయిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి పెనాల్టీ కింద లక్ష రూపాయలు జరిమాన చెల్లించాలని ఆదేశించింది. ఆ థియేటర్ నుంచి వచ్చే ఈ డబ్బును థియేటర్లలో భద్రతకు, విపత్తు నిధిగా వినియోగించాలని పోలీసులకు సూచించింది. -
ఫ్యాన్స్ ముసుగులో యథేచ్చగా బ్లాక్ మార్కెట్!!
నరసరావుపేట టౌన్: సగటు మానవుడి వినోదం సినిమా. అభిమాన హిరో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంటాడు. కుటుంబ సమేతంగా వెళ్లి చూద్దామనుకుంటాడు. కాని బెనిఫిట్ షో, అదనపు షోల పేరుతో ధరల దోపిడీ చేస్తుంటారు. సినిమా చూసే పరిస్థితి ఉండేది కాదు. ఇదీ ఒకప్పటి మాట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ ధరలకు కళ్లేం వేశారు. అయితే థియేటర్ నిర్వాహకులు శుక్రవారం అక్రమాలకు తెరదీశారు. థియేటర్ల వద్ద యథేచ్ఛగా బహిరంగా టికెట్లు అమ్మిస్తూ సొమ్ము చోటుచేసుకున్నారు. మూడు బ్లాక్ టికెట్లు.. ఆరు షోలు శుక్రవారం విడుదలైన యువ హిరో సినిమా నాలుగు షోలకు బదులు ఐదు షోలు వేశారు. టికెట్లన్ని ఆన్లైన్లో విక్రయించాల్సి ఉండగా టికెట్ రూ.300 నుంచి రూ.500 వరకు బ్లాక్‌లో విక్రయించారు. నిబంధలనకు విరుద్ధంగా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. అధిక ధరకు విక్రయిస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమాలు ప్రదర్శించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. థియేటర్లలో తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు టికెట్లు, తినుబండారాలు విక్రయించినట్టు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. –రమణానాయక్, తహసీల్దార్ ఫ్యాన్స్ ముసుగులో బ్లాక్ మార్కెట్ థియేటర్ల వద్ద యథేచ్ఛగా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. నిర్వాహకులను ప్రశ్నిస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లకు టికెట్లు విక్రయించినట్టుగా చెబుతున్నారు. అధిక ధరలపై అధికారులు దృష్టి సారించి బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలి. –షేక్ ఫారూక్, ప్రేక్షకుడు జేబుకు చిల్లు ఫ్యామిలీతో సినిమాకు వెళితే రూ.2వేలు ఖర్చు అవుతోంది. అధిక ధరలకు టికెట్ కొనాల్సి వస్తుంది. దీంతో పాటు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్‌లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలు సినిమాకు వెళ్లాలి అంటేనే భయం వేస్తోంది. –షేక్‌గౌస్, ప్రేక్షకుడు చదవండి: గుజరాత్ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: వీళ్ల అరాచకాలు ఒక్కొక్కటిగా.. -
జేసీలను సంప్రదించాకే టికెట్ ధరల ఖరారు..
సాక్షి, అమరావతి: సినిమా థియేటర్ల యాజమాన్యాలకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. లైసెన్స్ జారీచేసే అధికారులైన జాయింట్ కలెక్టర్లకు ముందుగా తెలియజేసి, వారిని సంప్రదించాకే టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలని ఆదేశించింది. ఈ ధరల ఖరారు విషయంలో సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పాటు ప్రభుత్వాధికారులతో ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్నీ ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధుల్లో సినిమా టికెట్ ధరలను ఖరారుచేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీఓ–35తో సంబంధంలేకుండా, ఈ జీఓ జారీకి ముందున్న విధంగానే టికెట్ ధరలను ఖరారు చేసుకోవచ్చునంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై సీజే ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. చట్టప్రకారమే ధరలను నిర్ణయించాం ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఏపీ సినిమాటోగ్రఫీ చట్ట నిబంధనల ప్రకారమే టికెట్ ధరలను భౌగోళిక ప్రాంతాల వారీగా నిర్ణయించామన్నారు. థియేటర్ల యాజమాన్యాలు సౌకర్యాలతో నిమిత్తం లేకుండా నిర్ణయిస్తున్న ధరలకు కళ్లెంవేసి ప్రేక్షకులకు లబ్ధిచేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సినిమా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య కోర్టును లాగుతున్నారంటూ నవ్వుతూ వ్యాఖ్యానించింది. టికెట్ ధరలను పెంచి థియేటర్లు, పన్నులు వసూలుచేసుకుంటూ ప్రభుత్వం రెండూ సంతోషంగా ఉంటాయని.. కానీ, అంతిమంగా నష్టపోయేది మాత్రం ప్రేక్షకులేనని తెలిపింది. టికెట్ ధరలను పెంచడంవల్ల నష్టపోతామన్న విషయాన్ని యాజమాన్యాలు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పింది. తాము చేస్తున్నది కూడా ప్రేక్షకుల కోసమేనని.. వారు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఆన్లైన్ టికెట్ వ్యవస్థను కూడా తీసుకొచ్చామని ఏజీ వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. టికెట్ ధరలను అందరితో మాట్లాడి చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందులో సినిమా పరిశ్రమకు చెందిన వారిని కూడా భాగస్వాములను చేయాలని చెప్పింది. తాము ఏకపక్షంగా చేయబోమని.. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతుల ఆధారంగానే టికెట్ ధరల విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, అందుకే చట్ట ప్రకారం ధరలను నియంత్రిస్తున్నామని ఏజీ శ్రీరామ్ వివరించారు. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ధరలు థియేటర్ల యాజమాన్యాల తరఫు సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం టికెట్ ధరలను తాము నిర్ణయించుకునే వెసులుబాటు ఉందన్నారు. థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వాటిని నిర్ణయిస్తున్నామన్నారు. పంచాయతీల్లో టికెట్ ధరను రూ.5గా నిర్ణయించారని, ఈ రేటుకి కప్పు కాఫీ కూడా రావడంలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. టిక్కెట్ ధరల విషయంలో కొత్త కమిటీని ఏర్పాటుచేయాలని, అందులో సినిమా పరిశ్రమకు చెందిన వారు, ప్రభుత్వాధికారులు ఉండాలని సూచించింది. కొత్త కమిటీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటో చెప్పాలని ఏజీని కోరింది. విచారణను శుక్రవారానికే వాయిదా వేస్తామంది. అప్పటివరకు సింగిల్ జడ్జి ఉత్తర్వుల జోలికి వెళ్లబోమంది. భారీ రేట్లకు టికెట్ల విక్రయం ఏజీ స్పందిస్తూ.. కొత్త కమిటీ ఏర్పాటునకు అభ్యంతరంలేదని.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం టికెట్ ధరల ఖరారు విషయంలో థియేటర్ల యాజమాన్యాలు జాయింట్ కలెక్టర్లను సంప్రదించాలని, కానీ ఇప్పటివరకు ఏ థియేటర్ కూడా జాయింట్ కలెక్టర్లకు ధరలను తెలియజేయలేదన్నారు. ఈ వారంలో విడుదలవుతున్న ఓ పెద్ద సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.80 టికెట్‌ను రూ.140 నుంచి రూ.400 వరకు అమ్ముతున్నారని ఏజీ ధర్మాసనానికి వివరించారు. అలాగే, నాలుగు షోలకు బదులు 6 షోలు వేస్తున్నారని తెలిపారు. దీనిని ఖండిస్తూ.. నాలుగు షోలు మాత్రమే వేస్తున్నామని ఆదినారాయణరావు చెప్పారు. ఈ విషయాన్ని రికార్డ్ చేయాలని ఏజీ పట్టుబట్టారు. కమిటీ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని, అప్పటివరకు సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం నడుచుకునేలా థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించాలని ధర్మాసనాన్ని ఏజీ అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, జాయింట్ కలెక్టర్లకు తెలియజేసి, వారిని సంప్రదించాకే ధరలను ఖరారుచేసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించింది. -
సినిమా టికెట్ రేట్లపై కోర్టు ఉత్తర్వులను నిలిపేయండి
సాక్షి, అమరావతి: సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను ఖరారు చేస్తూ జారీ అయిన జీవోకు ముందు అమలులో ఉన్న రేట్ల ప్రకారమే సినిమా థియేటర్లను నిర్వహించుకోవచ్చంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ఎదుట బుధవారం అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయా లని కోరుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ విషయాన్ని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అప్పీల్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీ అందుబాటులోకి రాలేదని, ఆ కాపీ దాఖలుకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. అత్యవసర విచారణకు అనుమతించిన ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
అఖండ సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్లో చెలరేగిన మంటలు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మునిసిపాలిటీలోని రవిశంకర్ థియేటర్లో అఖండ సినిమా ప్రదర్శన సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. సినిమా కొనసాగుతుండగా తెర వెనుక ఉన్న సౌండ్ సిస్టమ్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. -
తెలంగాణలో థియేటర్స్ మూసివేతపై మంత్రి తలసాని క్లారిటీ
కరోనా థర్డ్‌వేవ్ వచ్చిందని, ఇక సినిమా థియేటర్స్ మూసివేస్తారనే అసత్యాలను నమ్మొద్దని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ప్రజలు ధైర్యంగా థియేటర్స్‌కి వెళ్లి సినిమాలు చూడొచ్చని చెప్పారు. శుక్రవారం ఆయన టాలీవుడ్‌కి చెందిన నిర్మాతలు, దర్శకులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా దృష్ట్యా థియేటర్లపై ఆంక్షలు విధిస్తారనే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ‘కరోనా కారణంగా రెండేళ్లుగా సిని పరిశ్రమ ఇబ్బంది పడింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ వస్తుందనే భయాలు మొదలయ్యాయి. ప్రజలు భయాన్ని వదిలి ధైర్యంగా థియేటర్లకి వెళ్లి సినిమాలు చూడండి. అన్ని ఎదర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు వస్తున్నాయి. నిర్మాతతు ఇబ్బందులు పడొద్దు. కొన్ని సమస్యలతో పాటు టిక్కెట్ ధరల పెంపు అంశం పెండింగ్‌లో ఉంది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృష్టి చేస్తా’అని మంత్రి హామీ ఇచ్చారు. ఈ భేటీలో దిల్‌రాజు, డీవీవీ దానయ్య, చినబాబు, యేర్నేని నవీన్, రాజమౌళి, త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాలంలో ఓటీటీ మంత్రజాలం
సాక్షి, అమరావతి: అంతర్జాలంలో ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్ వినోదాన్ని పంచుతోంది. కోవిడ్ దెబ్బకు సినిమా థియేటర్లు మూతపడటం, టీవీ సీరియల్స్, షోలు నిలిచిపోవడంతో ఓటీటీ ఆన్లైన్ ట్రెండ్‌కు తెరలేచిన సంగతి తెలిసిందే. వెండి తెర, బుల్లి తెరను తలదన్నేలా పట్టునిలుపుకుంటున్న ఓటీటీ ఇప్పుడు సినిమా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ హవా కొనసాగిస్తోంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తోపాటు తెలుగులో ప్రధానమైన ‘ఆహా’, జీ5 వంటి ఆన్లైన్ సైట్ల ద్వారా మొదలైన సినిమాల రిలీజ్ ఇప్పుడు వెబ్ సిరీస్, టాక్ షోల ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. క్రైౖమ్, థ్రిల్లర్, సస్పెన్స్, సెంటిమెంట్, దేశభక్తి, సందేశం వంటి అంశాలే ప్రధానంగా వెబ్ సిరీస్, ప్రత్యేక కార్యక్రమాలకు ఆదరణ లభిస్తోంది. ఆన్లైన్ వీక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటంతో సినీ దర్శకులు, నటులదృష్టి ఇప్పుడు వెబ్ సిరీస్, టాక్ షోల వైపు మళ్లింది. సమయం.. నిడివి పరిమితి లేకుండా.. తక్కువ నిడివితో ఎక్కువ ఎపిసోడ్ల ద్వారా ఆకట్టుకునే సన్నివేశాలతో రూపొందిస్తున్న వెబ్ సిరీస్‌కు క్రేజ్ పెరిగింది. సినిమాలైతే తాము చెప్పదల్చుకున్న విషయాన్ని కేవలం 2.15 గంటల నుంచి 2.45 గంటల్లో కథను చిత్రీకరించాలి. అదే వెబ్ సిరీస్‌లో అయితే సమయం, నిడివి పరిమితి లేకపోవడంతో కథ, విషయాలను బట్టి ఎన్ని ఎపిసోడ్లు అయినా, ఎంత సమయమైన ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉంది. ఒక్కో సిరీస్‌ను ఐదు నుంచి 20 ఎపిసోడ్లుగా రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఒక్కో ఎపిసోడ్ 28 నిమిషాల నుంచి 42 నిమిషాలపాటు ఉండేలా చిత్రీకరిస్తున్నారు. ఈ మొత్తం సిరీస్ 7.30 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటాయి. దీనివల్ల టీవీ సీరియల్స్ మాదిరిగానే వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ చూడాలంటే అన్ని చూడొచ్చు. వెబ్ సిరీస్ వైపు.. సినీ దర్శకుల చూపు సినీ నిర్మాతలు, నటులు సైతం వెబ్ సిరీస్ వైపు మక్కువ చూపుతున్నారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో ప్రియమణి నటించడం గమనార్హం. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు చెందిన ఒక అధికారి అటు కుటుంబ బాధ్యతలు, ఇటు దేశ రక్షణలో సతమతమైన తీరును పది ఎపిసోడ్లలో అద్భుతంగా చిత్రీకరించారు. మరో పది ఎపిసోడ్లతో చిత్రీకరించిన ‘ది ప్యామిలీ మ్యాన్–2’లో ప్రియమణితోపాటు సమంత కూడా నటించింది. తాజాగా రిలీజ్ చేసిన ‘బ్రీత్ ఇంటూ ది షాడోస్’లో నిత్యామీనన్, ‘ది లస్ట్ స్టోరీస్’లో ఈషా రెబ్బ, ‘ముద్దపప్పు ఆవకాయ’లో నిహారిక కొణిదెల నటించారు. ‘నవరస’ టైటిల్‌తో తొమ్మిది మంది డైరెక్టర్లతో తొమ్మిది రసాలు ప్రతిబింబించేలా వెబ్ సిరీస్ తీస్తున్నట్టు సినీ దర్శకుడు మణిరత్నం ప్రకటించారు. శృతిహాసన్ ప్రధాన పాత్రగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన వెబ్ సిరీస్ విడుదల కావాల్సి ఉంది. ‘శతమానం భవతి’ సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న వెబ్ సిరీస్ తీయనున్నట్టు ప్రకటించారు. మణిరత్నం దర్శకత్వంలో శరత్‌కుమార్, వరలక్ష్మి(సర్కార్ ఫేం) నటించిన ‘అద్దం’ సిరీస్ ఓటీటీ ద్వారా విడుదలకు సిద్ధమైంది. ‘ఆహా’లో బాలయ్య ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన ‘ఆహా’ ఓటీటీ మీడియా సర్వీసెస్‌లో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ‘ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ పేరుతో వెబ్ సిరీస్‌గా ప్రముఖుల ఇంటర్వ్యూలను నవంబర్ 4 నుంచి ప్రసారం చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. వెండితెర, బుల్లితెరకు దీటుగా ఆదరణ చూరగొంటున్న ఓటీటీ ప్లాట్ఫామ్లోకి మరింత మంది సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు క్యూ కట్టేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. ఓటీటీ అంటే.. ఓటీటీ (ఓవర్ ది టాప్) మీడియా సర్వీస్ అంతర్జాలం (ఇంటర్నెట్)పై ఆధారపడి పనిచేస్తుంది. దీనినే డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సర్వీస్ అని కూడా పిలుస్తారు. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ కార్యక్రమాలు, సెలబ్రిటీ షోలు ప్రసారం చేస్తారు. ఓటీటీలో వినియోగదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ కార్యక్రమం కావాలంటే అది చూడొచ్చు. కేబుల్ టీవీ, డీటీహెచ్ కనెక్షన్ అవసరం లేకుండా ఇంటర్నెట్ ఉపయోగించుకుని సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్, టీవీల్లోనూ ఈ కార్యక్రమాలు చూడొచ్చు. ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో సగటున 39 నుంచి 45 శాతం మంది ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోలు వీక్షిస్తున్నట్టు అంచనా. వెబ్ సిరీస్‌లో వెగటు సన్నివేశాలు సినిమాలపై ఉన్న సెన్సార్ కత్తెర వెబ్ సిరీస్‌కు లేకపోవడంతో వెగటు పుట్టించే సన్నివేశాలు కూడా రూపొందించడం గమనార్హం. సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు, కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులను కించపరిచే సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగిస్తుంది. వెబ్ సిరీస్‌పై అటువంటి ఆంక్షలు లేకపోవడంతో క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ పేరుతో అశ్లీల సన్నివేశాలు, అసభ్య పదజాలం యథాతథంగా చూపిస్తుండటం శోచనీయం. -
థియేటర్స్ Vs హోమ్ థియేటర్స్
Theatre Vs Home Theater : ఓ వైపు మల్టీప్లెక్సీల్లో టికెట్లు అధిక ధరలు..పార్కింగ్ ఫీజుల నుంచి పాప్‌కార్న్, కేక్‌లు, పఫ్, కూల్‌డ్రింక్ ధరలతో సామాన్య ప్రేక్షకుడు థియేటర్స్‌కు వెళ్ళేందుకు ధైర్యం చేయడం లేదు. ఓ చిన్న కుటుంబం తమ పిల్లలతో కలిసి సరదాగా సినిమా చూద్దామంటే రూ.1500 నుంచి రూ.2,000 ఖర్చు అయ్యే పరిస్దితి ఏర్పడింది. ఇదే క్రమంలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లెక్స్, హాట్‌స్టార్, వూట్ తదితర ఓవర్ ది టాప్ వీడియో కంటెంట్ ప్రొవైడర్లు కొత్త సినిమాలను నట్టింట్లోకి తెచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్స్ వర్సస్ హోమ్ థియేటర్స్ అనే పరిస్థితి ఏర్పడింది. యావరేజ్ అంటే కుదరదు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 60 మూవీ థియేటర్లు ఉన్నాయి. నగరంలో మొత్తం పెద్ద థియేటర్లు 14 ఉండగా మల్టీప్లెక్స్‌లకు సంబంధించి ఎస్2లో మూడు స్క్రీన్లు, ది సినిమాలో ఐదు స్క్రీన్లు, రెయిన్ థియేటర్స్‌లో మూడు స్క్రీన్ లీలామహల్, సిరి థియేటర్లో రెండు స్క్రీన్లు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు, కంటెంట్ బాగున్న చిత్రాలు, కాంబినేషన్ వర్కవుట్ అయ్యే సినిమాలు రిలీజైనప్పుడు థియేటర్లు కళకళాడుతున్నాయి. గతంలోలా యావరేజ్, బిలో యావరేజ్ చిత్రాలు వస్తే ప్రేక్షకుడు థియేటర్ వైపు కన్నెత్తి చూడటం లేదు. వాళ్లు సేఫ్.. వీళ్లు డౌట్ సినిమా విడుదల కాకముందే నిర్మాతలు చిత్రాన్ని పంపిణీ దారులకు అమ్మేస్తున్నారు. అంతేకాదు ఓటీటీ రైట్స్ కింద అమెజాన్, హాట్‌స్టార్, జీమూవీస్, సన్‌నెట్‌వర్క్ స్క్రీమింగ్లకు విక్రయిస్తున్నారు. చిత్రం విడుదలయ్యాక 20 రోజుల నుంచి 30 రోజుల్లో ఆ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపైకి వచ్చేలా అగ్రిమెంట్ చేసుకుంటారు. అయితే నిర్మాతల నుంచి కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్ పరిస్దితి మాత్రం దయనీయంగా ఉంటుంది. సినిమా విడుదలైన మూడు నుంచి నాలుగు వారాల్లోపే థియేటర్స్ నుంచి రెవిన్యూ వస్తోంది. గతంలో 100రోజులు 150రోజులు ధియేటర్స్‌లో సినిమా ప్రదర్శనలు జగరడం లేదు. సినిమా టాక్ బాగుంటేనే పెట్టిన పెట్టుబడి వచ్చేది. లేదంటే అంతే సంగతులు, దీనికి తోడు పైరసీ బెడద ఉండనే ఉంది. 30 రోజుల్లోనే కొత్త సినిమా విడుదలైన 20 నుంచి 30 రోజుల్లోనే కొత్త సినిమాలను చూసే అవకాశం నెట్‌ఫ్లెక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీమూవీస్, సన్‌నెక్ట్స్, వూట్ తదితర ఓటీటీ స్ట్రీమింగ్ వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా అవకాశం లభిస్తోంది. ఈ ఓటీటీ కంపెనీలు నెలరోజులు, ఏడాది ప్యాకేజీల వంతున ప్రేక్షకులకు చందాదారులగా చేర్చుకుంటున్నాయి. ఒక సినిమాని థియేటర్‌కి వెళ్లి కుటుంబ సమేతంగా చూసే ఖర్చుతో అత్యంత ఖరీదైన పాపులర్ ఓటీటీకి సంవత్సర చందా కట్టేయ్యోచ్చు. కొత్త సినిమాలతో పాటు వందలాది ఇతర భాషా చిత్రాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఓటీటీకి తోడు ఇంటర్నెట్ కనెక్షన్ తప్ప మరో భారం ఉండనే ఉండదు. అమెజాన్ స్టిక్‌తో... ఇటీవల ప్రతీ ఇంటిలో ఎల్సీడీ, ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు ఉంటున్నాయి. కొన్ని టీవీ కంపెనీలు నెట్‌ఫ్లెక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీమూవీస్, సన్‌నెక్ట్స్, వూట్ తదితర యాప్‌లను ప్రీ ఇన్‌స్టాల్‌గా అందిస్తున్నాయి. ప్రీ ఇన్స్టాల్ లేని వాళ్లకు ఫైర్‌స్టిక్ పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌ని అందిస్తోంది. ప్లగ్ అండ్ ప్లే తరహాలో ఫైర్ స్టిక్‌తో సినిమాలు చూసేయొచ్చు. టీవీతో కూడా పోటీ అమేజాన్ ప్రైమ్. నెట్‌ఫ్లెక్స్, హాట్‌స్టార్ తదితర ఓటీటీలలో సినిమా కంటెంట్ తో పాటు ఒరిజనల్ కంటెంట్ కూడా లభిస్తుంది. వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, సినిమాలను ఈ ఓటీటీలే నిర్మించి నేరుగా ప్రేక్షకులకు అందిస్తున్నాయి. మరోవైపు జీ , సోనీ, స్టార్ చానల్స్, సన్‌నెట్‌వర్క్ వంటి టీవీ ఛానల్స్‌కి అనుబంధంగా ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో టీవీలో కంటే ముందే సీరియల్స్‌ని ఓటీటీలో అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో ఓటీటీటీ ఛానల్స్ సినిమా థియేటర్లకే కాదు టీవీ ఛానల్స్‌కి సైతం పోటీగా మారాయి. చదవండి : నెట్‌ఫ్లిక్స్‌పై ప్రశంసలను కురిపించిన అమెజాన్ అధినేత..! యూజర్లు షాక్..! -
సినీ నిర్మాత వినతిపై నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జారీ చేసిన జీవో–35 అమలు కోరుతూ సినీ నిర్మాత నట్టి కుమార్ ఇచ్చిన వినతి పత్రంపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీ సినిమాస్ రెగ్యులేషన్స్ చట్టం 1995లోని సెక్షన్ 9, 10, 11లను అనుసరించి ఆయన వినతిపై నిర్ణయం తీసుకోవాలంది. న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. మునిసిపాలిటీలు, నగరాలు, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ పరిధుల్లోని థియేటర్లలో టికెట్ల రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జీవో 35 జారీ చేసింది. అయితే, జీవోకు విరుద్ధంగా సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తున్నారని, ఇదే రీతిలో విశాఖపట్నంలోని శ్రీలక్ష్మి థియేటర్ యాజమాన్యం అధిక ధరకు టికెట్లు అమ్ముతోందంటూ నట్టి కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 35 అమలు కోసం తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. -
తెరుచుకోనున్న సినిమా హాళ్లు.. ‘తెరవడం అవసరమా?’
మహారాష్ట్రలో సినిమా థియేటర్లను మళ్లీ తెరిచేందుకు రాష్ట్ర సర్కారు ఎట్టకేలకు ఒప్పుకుంది. దీంతో అక్టోబర్ 22 నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. అయితే ప్రతిపక్ష బీజేపీ.. ప్రజలకు వినోదం అందిస్తోందని, థియేటర్లు తెరవాల్సిన అవసరం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సెటైర్లు పేల్చారు. ముంబై: మహారాష్ట్రలోని సినిమా హాళ్లు, థియేటర్లను అక్టోబర్ 22వ తేదీ నుంచి తెరిచేందుకు ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా థియేటర్లు, సినిమా హాళ్ల యాజమాన్యాలు అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే జారీచేస్తుందని ఆయన పేర్కొన్నారు. శనివారం కోవిడ్–19 టాస్క్‌ఫోర్స్‌తో సమావేశమైన సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సీతారాం కుంటే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, సినీ నిర్మాతలు రోహిత్ శెట్టి, కునాల్ కపూర్, మకరంద్ దేశ్‌పాండే, మరాఠీ నటులు సుభోద్ భావే, ఆదేశ్ బండేకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలోని ఆలయాలను అక్టోబర్ 7వ తేదీ నుంచి తెరుస్తామని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా జారీచేసింది. అలాగే, అక్టోబర్ 4వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రకటించింది. (ముంబై - హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్ రైల్.. సిద్ధమైన ప్రతిపాదనలు) బీజేపీ ఉండగా.. థియేటర్లు తెరవడం అవసరమా? రాష్ట్ర ప్రజలను రంజింపజేయడానికి బీజేపీ ఉండగా, సినిమా థియేటర్లను తెరవడం అవసరమా అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శివసేనకు చెందిన సామ్నా పత్రికలో సంపాదకీయం రాసిన ఆయన, బీజేపీకి చురకలంటించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ అన్ని పరిమితులను దాటి వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కరోనా, ఆంక్షలు ఉన్నప్పటికీ రాజకీయ డ్రామాలు సాగుతూనే ఉన్నాయన్నారు. ప్రతిపక్ష బీజేపీ ఆడుతున్న డ్రామాలో మిస్టరీతో పాటు కామెడీ కూడా ఉందన్నారు. ప్రస్తుత ప్రతిపక్షం కామెడీ చేస్తోందని, ప్రజా ఉపయోగ పనులు చేయకుండా, ఇతరులను ఈడీ విచారణల పేరుతో భయపెట్టడం, వ్యక్తిత్వాలను మంటగలపడం చేస్తోందని సంజయ్ రౌత్ మండిపడ్డారు. (చదవండి: ప్యాన్‌కేక్ .. ఆ రుచి వెనుక కష్టాల కథ) -
సరసమైన ధరలకు వినోదం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
-
పవన్‌కు ఎందుకంత భయం: మంత్రి అనిల్
-
సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన ఉద్ధవ్ ఠాక్రే సర్కార్
సినీ ప్రియులకు తీపి కబురు అందించింది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో అక్టోబర్ 22 నుంచి థియేటర్స్ తెరచుకోనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా నియమ, నిబంధనలను పాటిస్తూ సినిమా హాళ్లను తెరుస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. థియేటర్లు తెరచినా వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తారా? లేదంటే 50శాతంతోనే థియేటర్లు తెరవాలంటారో అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు థియేటర్స్ ఓపెన్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే.. ఓ భారీ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకుంది. థియేటర్లు పూర్తిస్థాయిలో అక్టోబరు 22 తర్వాత తెరుచుకుంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినే కొన్ని గంటల్లోనే ఓ భారీ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అక్షయ్‌కుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన చిత్రం ‘సూర్యవంశీ’. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు దర్శకుడు వెల్లడించాడు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, అజయ్ దేవ్‌గణ్ అతిథి పాత్రల్లో నటించారు. -
ఆన్లైన్ టికెట్ విధానం మేమే అడిగాం: నిర్మాత కళ్యాణ్
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చలు చాలా ఆనందకరమని టాలీవుడ్ నిర్మాత సి.కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలన్నింటిని ఓపిగ్గా విని పరిష్కారం చూపుతామని మంత్రి పేర్ని నాని వెల్లడించినట్లు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద సహకారం ఇచ్చారని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా అని తెలిపారు. దివంగత వైఎస్సార్ సినీ ఇండస్ట్రీకి ఎంతో చేశారని నేడు సీఎం జగన్ కూడా అలాగే చేస్తున్నారని ప్రశంసించారు. కాగా ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. చదవండి: ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ ఆన్లైన్ టికెట్ విధానం తామే అడిగామని నిర్మాత కళ్యాణ్ పేర్కొన్నారు. దానితో పాటు 4 షోలు 12 గంటలలోపు పూర్తి చేయడంపై చర్చించినట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల అంశం, 100 శాతం ఆక్యుపెన్సీపై కూడా చర్చించామన్నారు. అన్ని వర్గాలు ఈ రోజు చర్చల పట్ల ఆనందంగా ఉన్నాయని, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని ప్రభుత్వం చెప్పిందని త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ అవుతామని వెల్లడించారు. అన్ని సమస్యలపై చర్చించాం ఆన్లైన్ విధానం వలన సినీ పరిశ్రమకి మేలు జరుగుతుందని నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు తెలిపారు. ఆన్లైన్ విధానంతో పాటు రేట్లు సవరించని కోరినట్లు తెలిపారు. అన్ని సమస్యలపై మంత్రి తో చర్చించామని, ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పిందని వెల్లడించారు. మరో సమావేశం ఉంటుంది సినిమా సమస్యలపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నిర్మాత డీఎన్వీ ప్రసాద్ పేర్కొన్నారు. సినిమా పరిశ్రమకు ఉన్న సమస్యలపై మంత్రి పేర్ని నాని, అధికారులతో చర్చ జరిగిందని దీనివల్ల తెలుగు సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుందన్నారు. తప్పనిసరిగా మరొక సమావేశం ఉంటుందని తెలిపారు. చిన్నా, పెద్ద సినిమా కాకుండా ప్రభుత్వం దగ్గర ఉన్న డౌట్స్ క్లారిఫై చేశామని పేర్కొన్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ అనేది పెద్ద సమస్య కాదని అన్నారు. -
ఏపీ: ఆన్లైన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల బుకింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టికెట్ల ఆన్లైన్ బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వే టికెట్ల బుకింగ్ తరహాలో ఈ పోర్టల్‌ను రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సినిమా టికెట్ల విక్రయాల విధానాన్ని అధ్యయనం చేసిన తరువాత ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ అభివృద్ధి కార్పొరేషన్ నిర్వహిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌విశ్వజిత్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆన్లైన్ పోర్టల్ రూపొందించడం, అమలును పర్యవేక్షించడానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించారు. కమిటీలో ఐటీ శాఖ కార్యదర్శి, సమాచార శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ప్రతినిధి, ఏపీటీఎస్ ఎండీ, కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఇవీ చదవండి: అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ ఉప్పొంగుతున్న వరద.. టీచర్ల సాహసం -
ఆగస్ట్ చివరి వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలు ఇవే
కరోనా వల్ల థియేటర్లు పూర్తిక తెరచుకోని కారణంగా పలు చిత్రాలు ఇప్పటికీ ఓటీటీ బాటలోనే ముందుకెళ్తున్నాయి. కొన్ని సినిమాలు దైర్యం చేసి థియేటర్లలోకి వచ్చినప్పటికీ ఓటీటీల హవా తగ్గడంలేదు. వారానికి అరడజనుకు పైగా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. మరి ఈ ఆగస్ట్ చివరివారంలో ఓటీటీ, ధియేటర్లలో విడుదల కానున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం. శ్రీదేవి సోడా సెంటర్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్దాయి. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్ ఆ అంచనాలు మరింత పెంచాయి.ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు. ఇచట వాహనములు నిలుపరాదు యంగ్ హీరో సుశాంత్ నటించిన తాజా సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.ఎస్.దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు . కమర్షియల్ అంశాలతో అలరించే పూర్తి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. హౌజ్ అరెస్ట్ శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిబాబు, రఘు, తాగుబోతు రమేశ్ కలిసి నటించిన చిత్రం ‘హౌజ్ అరెస్ట్’. శేఖర్ రెడ్డి యర్నా దర్శకుడు. పూర్తిస్థాయి కామెడీ నేపథ్యంలో రూపొందింది ఈ చిత్రం ఇది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.ఈ మూవీ కూడా ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వివాహ భోజనంబు హాస్య నటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’ కూడా ఆగస్ట్ 27న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఒటిటి సోనీలైవ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ ఆహా ఎస్.ఆర్ కల్యాణమండపం (ఆగస్టు 27) అమెజాన్ ప్రైమ్ స్టాండప్ షార్ట్స్ (ఆగస్టు 26) ద కొరియర్ (ఆగస్టు 27) సోనీ లైవ్ వివాహ భోజనంబు (ఆగస్టు 27) కసడా తపరా (ఆగస్టు 27) నెట్‌ఫ్లిక్స్ అన్‌టోల్డ్ (ఆగస్టు 24) పోస్ట్ మార్టమ్ (ఆగస్టు 25) భూమిక (ఆగస్టు 26) హీజ్ ఆల్ దట్ (ఆగస్టు 27) జీ 5 ఇంజినీరింగ్ గర్ల్స్ (ఆగస్టు 27) -
‘నాని సినిమాల్లోనే హీరో.. నిజ జీవితంలో పిరికివాడు’
సాక్షి, హైదరాబాద్: నాని నటించిన టక్ జగదీష్ ప్రాజెక్ట్‌ను ఓటీటీల్లో విడుదల చేయడంపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ చిత్రం ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై చర్చించేందుకు థియేటర్ల యజమానులు శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా థియేటర్ల యజమానులు మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల లవ్‌స్టోరీ సినిమా విడుదల అవుతున్న రోజే నాని టక్ జగదీష్ ఓటీటీలో రావడం వల్ల అందరం నష్టపోతామని అన్నారు. రేపు కూడా ఇలానే చేస్తే భవిషత్తులో నిర్మాతలకు తాము డబ్బులు కట్టమని అన్నారు. చదవండి: టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై నాని కామెంట్స్ పండుగల సమయంలో కొత్త సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని, థియేటర్లో లవ్ స్టోరీ విడుదలకు తెలంగాణ ఎగ్జిబిటర్లుమద్దతు పలికారు. టక్ జగదీశ్ నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు, హీరో నానికి భవిషత్తు మేము ఏంటో చూపిస్తామన్నారు, తిమ్మరుసు ఆడియో వేడుకలో హీరో మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఓటీటీ వాళ్ళు రూ. 4 కోట్లు ఎక్కువ ఇచ్చి తీసుకున్నట్లు తెలుస్తుందన్నారు, ‘సినిమా లేకుండా మనం లేమని, సినిమా మన సంస్కృతిలో భాగం నాని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఓటీటీ లో సినిమా చేస్తున్నాడు. హీరో నాని సినిమాల్లోనే హీరో.. నిజ జీవితం లో పిరికివాడు’ అని పేర్కొన్నారు. చదవండి: ఆ సీన్ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్, వీడియో వైరల్ ఇదిలా ఉండగా నాని టక్ జగదీష్, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాలతో టాలీవుడ్లో ఓటీటీ, థియేటర్ల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటిలో నాని టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ కానుండగా.. లవ్ స్టోరీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. -
ఈ వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలు ఇవే
కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని మూతపడిన థియేటర్లు మళ్లీ తెరుచుకోవడంతో సినిమాల సందడి మొదలైంది. మొన్నటిదాకా ఓటీటీలలో సినిమాలు చూసి విసిగిపోయిన సినీ ప్రేక్షకులు.. థియేటర్ల బాట పట్టారు. దీంతో నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు క్యూ కడుతున్నారు. ప్రతి వారం అర డజనుకు పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. గత వారం పాగల్, ఓరేయ్ బామ్మర్థి, బ్రాందీ డైరీస్తో పాటు మరో ఆరు సినిమాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ వారం ఓటీటీ, ధియేటర్లలో విడుదల కానున్న సినిమాలు ఎంటో ఓ లుక్కేద్దాం. రాజ రాజ చోర యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లు. హితేశ్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగగా హిలేరియస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 19న థియేటర్స్‌లో విడుదల కానుంది. కనబడుటలేదు హీరో సునీల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కనబడుటలేదు’.ఇందులో సునీల్ డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌కు ప్రేమకథను జోడించి దర్శకుడు బాలరాజు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. క్రేజీ అంకుల్స్ యాంకర్ శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. బజార్ రౌడీ సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బజార్ రౌడీ’. డి. వసంత నాగేశ్వర రావు దర్శకుడు. మహేశ్వరి వద్ది కథానాయిక. బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. చిత్రం ఆగస్ట్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద స్కెలిటన్ ట్విన్స్ (ఆగస్టు 17) నైన్ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ (ఆగస్టు 18) అన్నెట్టే (ఆగస్టు 20) కిల్లర్ ఎమాంగ్ అజ్ (ఆగస్టు 20) హోమ్ (ఆగస్టు 19) నెట్‌ఫ్లిక్స్ కామెడీ ప్రీమియం లీగ్ కామెడీ షో (ఆగస్టు 20) స్వీట్‌గర్ల్ (ఆగస్టు 21) ఆహా తరగతి గది దాటి ( ఆగస్టు 20) జీ 5 200 హల్లా హో (ఆగస్టు 20) ఆల్ట్ బాలాజీకార్టెల్ (ఆగస్టు 20) -
ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన, ఇతర సమస్యలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి సినీ ప్రముఖులకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని హీరో చిరంజీవికి ఫోన్ చేశారు. సినీ రంగంలో నెలకొన్న ప్రస్తుత సమస్యల గురించి సినీ పెద్దలతో కలిసి వచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నెలాఖరులో ఈ సమావేశం జరగనుంది. థియేటర్స్‌లో వందశాతం సీటింగ్, టిక్కెట్ ధరలు, ఎగ్జిబిటర్స్ సమస్యలు, సినీ రంగంపై ఉపాధి పొందుతున్న వారి సమస్యలు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చలు జరిగే అవకాశం ఉంది. -
‘బ్రాందీ డైరీస్’ ఆగష్టు 13న విడుదల
కలెక్టివ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు రచన, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాందీ డైరీస్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. వ్యక్తిలోని వ్యసన స్వభావం, దానివల్ల వచ్చే సంఘర్షణతో, సహజమైన సంఘటనలు, సంభాషణలు, పరిణతి ఉన్న పాత్రలతో కొత్త నటీనటులతో నాచురల్ లోకేషన్స్‌లో, సహజత్వానికి పట్టంకడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించింది. ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ ‘నా సొంత ఊరు గుంటూరు జిల్లా చిలకలూరిపేట దగ్గర తిమ్మాపురం. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. బాగా చదువుకున్నాను. సివిల్స్‌కి కూడా ప్రిపేర్ అయ్యాను. కానీ సినిమా పరిశ్రమలోకి రావాలి అనే తపన బలంగా ఉంది. ప్రతిరోజూ ఏదొక సినిమా చూసేవాడిని. అసిస్టెంట్ కమీషనర్ అఫ్ టాక్స్ ఆఫీసర్‌గా పని చేశాను. సినిమా కథలు రాసుకోవటానికి సమయం సరిపోవటం లేదు అని ఆ ఉద్యోగం మానేసి జూనియర్ లెక్చరర్‌గా హిస్టరీ పాఠాలు చెబుతూ... నా సినిమాలోకంలో ఉండే వాడిని. ఈరోజుల్లో సినిమా తీసి మెప్పిచడం చాలా కష్టం. ప్రపంచంలో అన్ని భాషల సినిమాలు ఇప్పుడు ఓ టి టి ద్వారా చూడొచ్చు. నేను కూడా కొత్తగా సినిమా చేయాలని... అది ప్రతి ప్రేక్షకుడికి టచ్ అవ్వాలని.. అని ఈ ‘బ్రాందీ డైరీస్’ సినిమా కథ రాసుకున్నా. ప్రస్తుతం ప్రపంచం అంత ఆల్కహాల్ చుట్టు తిరుగుతుంది. ఇలాంటి కథ ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది అని ఈ సినిమా చేశాను. ‘బ్రాందీ డైరీస్’ టైటిల్... కథకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. ఇది పూర్తిగా వినోద భరితమైన సినిమా. ఎటువంటి సందేశం కానీ లెక్చర్ కానీ లేదు. రెండు గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా. ఈ చిత్రంలో ఆల్కహాలే హీరో. మిగతా వాళ్లంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మాత్రమే. కానీ ఆల్కహాల్ మంచి హీరోనా? చెడ్డ హీరోనా? అని తెలుసుకోవాలని ఉంటే ‘బ్రాందీ డైరీస్’ చిత్రం చూడాల్సిందే. నా సినిమాలో అందరూ కొత్తవాళ్లే, కొత్త నటులు, సీనియర్ రంగస్థల నటులు ఉన్నారు. గుంటూరు, పాలకొల్లు, రాజమండ్రి, శ్రీకాకుళం లాంటి ఊళ్లల్లో మంచి ప్రతిభ ఉన్న రంగస్థల నటులున్నారు. వాళ్లకి ఈ చిత్రం మంచి అవకాశం కల్పించింది. సెన్సార్ వాళ్లు క్లీన్ ఫిల్మ్ అన్నారు. ఆల్కహాల్ ఉంది కాబట్టి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆగష్టు 13న రిలీజ్ అవుతుంది. మొత్తం 130 థియేటర్లలో విడుదల అవుతుంది. కర్ణాటకలో 30 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. -
ఐదో ఆటకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: సినిమా థియేటర్లలో ఐదోఆటను ప్రదర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పారదర్శకత కోసం త్వరలో ఆన్లైన్లో టికెట్ల విక్రయ విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ ఎగ్జిబిటర్ల సమస్యలపై మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రైవేటు వెబ్సైట్లు ఒక్కో టికెట్ విక్రయానికి రూ.20 నుంచి రూ.40 వరకు సర్వీసుచార్జి వసూలు చేస్తుండగా, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఆన్లైన్ టికెట్ల విక్రయానికి కేవలం రూ.6 మాత్రమే సర్వీసుచార్జి ఉంటుందని పేర్కొన్నారు. సినీ థియేటర్లు మూసేసిన లాక్డౌన్ కాలానికి సంబం ధించిన విద్యుత్‌చార్జీలు, ఆస్తిపన్ను రద్దు వంటి పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేసేందుకు అనుమతించాలని ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేయగా, ఇప్పటికే అనుమతిచ్చామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకోవడానికి కూడా అనుమతించినట్లు తెలిపారు. సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల(24 క్రాఫ్ట్స్) కార్మికులకోసం చట్టాలను కఠినంగా అమలు చేస్తోందన్నా రు. సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్, సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మురళీమోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, సెక్రెటరీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ సినిమాల సందడి మళ్లీ మొదలైంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో సీనీ ప్రియులు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గత వారం పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద సందడి చేశాయి. ఇక ఈ వారం కూడా అలరించేందుకు మరిన్ని సినిమాలు రెడీ అయ్యాయి. అయితే ఇందులో కొన్ని ఓటీటీ బాట పట్టాయి. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని అటూ థియేటర్లలో, ఇటూ ఓటీటీ సందడి చేయబోయే చిత్రాలేవో ఇక్కడ చూడండి. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాగల్’. నివేదా పేతురాజ్ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక థియేటర్లు తెరుచుకోవడంతో ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అగష్టు 14న పాగల్ విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ ‘కనబడుటలేదు’. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని విడుదల సిద్దమైంది. ఆగస్టు 13న ఈ మూవీ థియేటర్లోకి రానుంది. ఇందులో సునీల్ డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌కు ప్రేమకథను జోడించి దర్శకుడు బాలరాజు ఈ చిత్రాన్ని రూపొందించాడు. గరుడ శేఖర్‌నవీన్ వర్మ, కేవీ శ్రీనివాస్, రవీంద్రబాబు, దినేశ్, సునీత సద్గురు నటించిన చిత్రం ‘బ్రాందీ డైరీస్’. శివుడు దర్శకత్వం వహించారు. కలెక్టివ్ డ్రీమర్స్ పతాకంపై లీలా శ్రీకాంత్ నిర్మించారు. యువతను ఆకట్టుకునేలా కథ, కథానాలను తీర్చిదిద్దిన ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల కానుంది. సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ ఫేం శశి తెరకెక్కించిన ఈ మూవీలో జీవీ ప్రకాశ్ కీలకపాత్ర పోషించాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సిద్దార్థ్ ఇందులో ట్రాఫిక్ పోలీస్ ఆఫిసర్‌గా కనిపించనున్నాడు. బైక్ రేసులంటే ఆసక్తి చూపించే ఆవేశపరుడైన యువకుడి పాత్రను జీవీ ప్రకాశ్ పోషించాడు. పూర్ణ, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరి’. కల్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 13న విడుదలకు సిద్దమవుతుంది. ఓ అందమైన యువతి జీవితంలో పురుషుల నుంచి ఎదుర్కొన్న ఇబ్బుందులను ఈ మూవీలో చూపించనున్నారు. ప్యాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా తదితరులు కీలక పాత్రల్లో నటించిన అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ ఫిల్మ్ ‘ది కంజురింగ్: దెయ్యం నా చేత చేయించింది’. మైఖేల్ ఛవెస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత జూన్‌లో అమెరికాలో విడుదలైంది. ఇప్పుడు ఇండియాలోని ఇండియాలో పలు భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆగస్టు 13న ఈ చిత్రం థియేటర్లలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఇవే: కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహరాష్ట్రలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికి ఇంకా థియేటర్లు పూర్తిగా తెరుచుకోలేదు. దీంతో గతేడాది నుంచి థియేటర్లలోనే విడుదల చేయాలని ఎదురు చూస్తున్న సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు చిత్రాలు, ముఖ్యంగా దేశభక్తి చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. సిద్దార్థ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘షేర్షా’. విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, క్యాష్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కార్గిల్ యుద్ధ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పరమ్ వీర్ చక్ర అవార్డు పొందిన కెప్టెన్ విక్రమ్ భాత్రా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోన్న మరో వార్ డ్రామా ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవ్‌గణ్, సంజయ్‌దత్, శరద్ ఖేల్కర్, సోనాక్షి సిన్హా, ప్రణీత, నోరా ఫతేహి, అమ్మీ వ్రిక్ ఇలా భారీ తారాగణంతో అభిషేక్ దుదియా భూజ్‌ను తెరకెక్కించాడు. థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఓటీటీ బాట పట్టింది. 1971 ఇండో-పాక్ వార్ సందర్భంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్టు 15న ఈ వార్ డ్రామా ఓటీటీలో విడుదల కానుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధానపాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘నెట్రికన్’. మిలింద్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న డిస్నీఫ్లస్ హాట్‌స్టార్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పోలీసులకు చిక్కకుండా తిరిగే సైకోను ఓ అంధురాలు పోలీసులకు ఎలా పట్టించిందనేదే ఈ మూవీ కథాంశం. హాస్య నటుడు సత్య కీలక పాత్రలో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వివాహ భోజనంబు’. యంగ్ హీరో సందీప్‌కిషన్, కె.ఎస్.శినిష్‌తో కలిసి నిర్మించిన ఈ మూవీ పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులు లాక్డౌన్ కారణంగా పెళ్లి వాళ్ల ఇంట్లోనే ఉండిపోతే, వారి పరిస్థితి ఏంటి? పెళ్లి కొడుకు, అతని కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేదే ఈ మూవీ కథ. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే
తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖంపట్టడంతో సినిమా సందడి మళ్లీ మొదలైంది. థియేటర్లు ఓపెన్ కావడంతో సీనీ ప్రియులు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే గత వారం దాదాపు ఆరు సినిమాలూ విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో మరికొన్ని సినిమాలు ఓటీటీల్లో సందడి చేశాయి. తిమ్మరుసు, ఇష్క్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దాం. ఎస్.ఆర్.కళ్యాణమండపం ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’డిఫరెంట్ టైటిల్‌తో వస్తున్నాడు. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఆగస్ట్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముగ్గురు మొనగాళ్లు శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ముగ్గురు వ్యక్తులకు సంబంధించనే ఈ సినిమా కథ. వీరిలో ఒకరికి కనిపించదు. మరొకరికి వినిపించదు. ఇంకొకరు మూగ. ఈ ముగ్గురు దివ్యాంగుల జీవితంలో ఊహించని విధంగా క్రైమ్ చోటు చేసుకుంటుంది. అదేమిటీ? దాని నుండి వీరు ఎలా బయటపడ్డారు? అసలు నగరంలో జరిగే హత్యలకు వీళ్ళకు ఏమిటీ సంబంధం? అనేదే ఈ చిత్ర కథ. ఈ సినిమాలో రాజా రవీంద్ర, దివంగత నటుడు టీఎన్ఆర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెరిసే మెరిసే 'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా 'మెరిసే మెరిసే'. కొత్తూరి ఎంటర్ టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందిన 'మెరిసే మెరిసే' చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు కాక ఇంకెప్పుడు హస్వంత్ వంగ, నమ్రత దరేకర్, కల్యాణ్ గౌడ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ల భరణి, తులసి, రాజా రవీంద్ర, పూజా రామచంద్రన్, ఐడ్రీమ్ అంజలి తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమా కూడా ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సాహిత్య సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. క్షీరసాగర మథనం మానస్ నాగులపల్లి, సంజయ్ రావు, అక్షంత్ సోనేశ్వర్, గౌతమ్ ఎస్ శెట్టి, ఛరిష్మా, మహేశ్ కొమ్ముల తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం క్షీరసాగర మథనం. అనిల్ పంగులూరి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఆగస్ట్ 04, 2021 మనోజ్ బాజ్‌పాయ్ ‘డయల్ 100’(జీ5) మాన్స్టర్స్ ఎట్ వర్క్ (డిస్నీ+ హాట్‌స్టార్) టర్నర్ అండ్ హూచ్ (డిస్నీ+ హాట్‌స్టార్) ఐ మే డెస్ట్రాయ్ యు(సీజన్-1) హెచ్‌బీవో షార్ట్‌సర్క్యూట్ సీజన్-1 (డిస్నీ+ హాట్‌స్టార్) ఆగస్టు 6, 2021 బ్రేకింగ్ బాబీ బోన్స్(సీజన్-1) (నేషన్ జియోగ్రాఫిక్) స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్(డిస్నీ+ హాట్‌స్టార్) ది మిస్టీరియస్ బెనిడిక్ట్ సొసైటీ((డిస్నీ+ హాట్‌స్టార్) స్టార్ వార్స్: గార్డెన్ రామ్సే: అన్ ఛార్టెడ్(డిస్నీ+ హాట్‌స్టార్) -
తెలుగు రాష్ట్రాల్లో నేటినుంచి సినిమా థియేటర్లు రీఓపెన్
-
థియేటర్లలో టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: కరోనా ఎఫెక్ట్ చిత్రపరిశ్రమ మీద గట్టిగానే పడింది. మొదటి లాక్డౌన్ తర్వాత 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకున్న థియేటర్లపై కోవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడింది. దీంతో థియేటర్ల పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారింది. కోవిడ్ దెబ్బకు థియేటర్లు మరోసారి మూతపడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా టికెట్ల ధరలు పెంచాలన్న ఆలోచన కూడా చేస్తోంది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా నేడు (జూలై 27న) న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు.. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి నిబంధనలు రూపొందించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే టికెట్ల ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించాడు. ఆ కమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించినట్లు కోర్టుకు తెలిపాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ఈమేరకు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ, హోం శాఖ సెక్రెటరీలకు ఆదేశాలు జారీ చేసింది. -
రేపటి నుంచి తెరచుకోనున్న సినిమా హాళ్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి కోవిడ్ ఆంక్షలను కొద్ది మేర ఆంక్షలను సడలించనున్నామని ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) శనివారం ప్రకటించింది. బస్సులు, మెట్రో రైళ్లను 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిపేందుకు అనుమతి ఉంటుంది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడుపుకోవచ్చు. బిజినెస్–టు–బిజినెస్ (బీ2బీ) ఎగ్జిబిషన్లు సైతం ఆంక్షలకు లోబడి తెరచుకోవచ్చని చెప్పింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 100 మంది వరకూ అనుమతిచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న వారు, ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకున్న వారితో స్పాలు నడుపుకోవచ్చని స్పష్టంచేసింది -
Unlock 4: థియేటర్లు, డిగ్రీ కాలేజీలకు ఓకే
సాక్షి, బెంగళూరు: అన్‌లాక్–4 వెసులుబాట్లు అందుబాట్లోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నేపథ్యంలో గత మూడునెలల నుంచి మూతబడిన సినిమా థియేటర్లను సగం సీట్లతో తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే డిగ్రీ, ఆపై ఉన్నత విద్యాసంస్థలకూ సై అంది. ఆదివారం కావేరి నివాసంలో ముఖ్యమంత్రి యడియూరప్ప అధ్యక్షతన జరిగిన సీనియర్ మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. నేటి నుంచే థియేటర్లు ఏప్రిల్‌లో కోవిడ్ సెకెండ్ వేవ్ విరుచుకుపడడంతో రాష్ట్రమంతటా సినిమా థియేటర్లకు తాళాలు వేశారు. స్కూళ్లు, కళాశాలలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం కోవిడ్ కేసులు అదుపులోకి రావడంతో అన్‌లాక్– 4కు గేట్లు తీశారు. సోమవారం నుంచి సగం మంది ప్రేక్షకులతో సినిమా టాకీస్‌లను నడుపుకోవచ్చు. ఈ నెల 26 నుంచి డిగ్రీ, పీజీ తదితర కాలేజీలను ప్రారంభించవచ్చు. అయితే కాలేజీకి హాజరయ్యే విద్యార్థులు కనీసం ఒక డోస్ కోవిడ్ టీకా అయినా తీసుకుని ఉండాలి. పబ్, క్లబ్, ఈతకొలనుల మూసివేత కొనసాగుతుంది. లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. పర్యాటకంపై సడలింపు యోచన పర్యాటక ప్రాంతాల్లో కరోనా నియమాలను సడలించాలని సర్కారు నిశ్చయంతో ఉంది. లాక్డౌన్లో ఇళ్లకే పరిమితమైన ప్రజలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఉవ్విళ్లూరుతుంటారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉండడంతో పర్యాటక కేంద్రాల్లో విశ్రాంతి తీసుకుంటూ పని చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కొడగు, చిక్కమగళూరు, మైసూరు ప్రాంతాల్లో అడవులు, రిసార్టు టూర్లకు గిరాకీ పెరుగుతోంది. చారిత్రక ప్రాంతాలైన హంపీ, హళేబీడు, బాదామి తదితర ప్రాంతాల్లోనూ పర్యాటకుల సంఖ్య పెరిగింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పర్యాటక రంగాన్ని ఆదుకునేలా ఆంక్షలను సడలించి ప్యాకేజీలను ప్రకటించాలని సర్కారు భావిస్తోంది. మెడికల్ కాలేజీలకూ అనుమతి యశవంతపుర: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రారంభానికి అనుమతిస్తున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి కే.సుధాకర్ ట్విట్టరలో తెలిపారు. ఆయుష్, దంతవైద్య, పారా మెడికల్ కాలేజీలను తెరుచుకోవచ్చని చెప్పారు. కరోనా టీకా వేయించుకున్న విద్యార్థులు, బోధన సిబ్బంది మాత్రమే హాజరు కావాలన్నారు. మూడో వేవ్‌కు ముందుజాగ్రత్తగా ప్రతి జిల్లా కేంద్రంలో పిల్లల చికిత్సలకు అన్నీ సిద్ధం చేసినట్లు తెలిపారు. -
ఎగ్జిబిటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : మంత్రి తలసాని
సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మాసాబ్ ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారుగా ఏడాది నుంచి సినిమా దియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయని మంత్రికి వివరించారు. సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా దియేటర్ల నిర్వహకులు ఆర్ధికంగా ఎంతో నష్టపోయామని, ప్రభుత్వం ఈ కష్టకాలంలో అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. ప్రధానంగా సినిమా దియేటర్లు మూసి ఉంచిన సమయానికి ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ ధియేటర్ లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని, ఎస్జీఎస్టీ ట్యాక్స్ రద్దు చేయాలని కోరారు. జీఓ 75ను పునరుద్దరించాలని, షూటింగ్ అనుమతులకు వసూలు చేసే చార్జీలను తగ్గించేలా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, అభిషేక్ నామా, సదానంద్ గౌడ్, బాల గోవింద్ రాజ్ తాడ్ల, టీఎస్ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబు తదితరులు ఉన్నారు. -
థియేటర్లకు అనుమతివ్వండి .. సీఎంకు భారతీరాజా విజ్ఞప్తి
సాక్షి, చెన్నై: థియేటర్లకు అనుమతివ్వాలని సీనియర్ దర్శకుడు, తమిళనాడు యాక్టివ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు రాజా ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు. అన్‌లాక్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి సినీ, బుల్లితెర సీరియళ్ల షూటింగ్‌లకు అనుమతించింది. తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళీ, భారతీరాజా సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ‘మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. తమిళ భాషాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు షూటింగులకు అనుమతించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. తదుపరి సడలింపులో సినిమా థియేటర్లకు అనుమతిస్తారని ఆశిస్తున్నా’మని భారతీరాజా పేర్కొన్నారు. చదవండి: విజయ్ పోస్టర్లతో మరోసారి కలకలం నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు -
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. థియేటర్స్ ఓపెన్.. ఇక జాతరే!
సినీ ప్రియులకు శుభవార్త. తెలంగాణలో ఆదివారం నుంచి థియేటర్లు ఓపెన్ కానున్నాయి. ఇకపై థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని అనుమతులిస్తూ ఇటు సినీ ప్రియులకు, అటు థియేటర్ యాజమాన్యాలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో లాక్‌డౌన్‌ని ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ని పూర్తి ఎత్తివేస్తున్నారు. దీంతో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు కూడా ఓపెన్ కానున్నాయి. లాక్ డౌన్ వల్ల సినిమా హాళ్లు దాదాపు మూసివేసి ఉంటున్న సంగతి తెలిసిందే. కేసులు తగ్గడంతో ఓపెన్ చేసేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో సినీ పరిశ్రమకు ప్లస్ కానుంది. కరోనా వల్ల.. చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా.. ఓటీటీలో రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇకపోతే థియేటర్స్ ఓపెన్ అయితే థియేటర్స్ వద్ద సినిమాల జాతరే ఉండబోతుంది. ఎందుకంటే గత ఏప్రిల్ నెల నుంచి రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరిగా థియేటర్స్‌లో వకీల్ సాబ్ విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లు మూతపడడంతో సినిమాలన్ని వాయిదా పడ్డాయి. ఆ లిస్ట్‌లో నాగచైతన్య-సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’. నాని ‘టక్ జగదీష్’, రానా ‘విరాటపర్వం’, చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్ ‘నారప్ప’. రవితేజ ‘ఖిలాడి’, విష్వక్ సేన్ ‘పాగల్’లతో పాటు చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి. -
Pawan Kalyan: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మళ్లీ వస్తున్న ‘వకీల్ సాబ్’
Vakeel Saab: దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’మూవీలో రీ ఎంట్రీ ఇచ్చి న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 9న విడుదలై పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే దాదాపు రూ.80 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పవన్ సత్తా ఏంటో నిరూపించింది. అయితే సినిమా వచ్చిన రెండు వారాల గ్యాప్ లోనే కరోనా వైరస్ తీవ్రత పెరిగి పోవడంతో కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ని ప్రకటించింది. దీంతో థియేటర్లు అన్ని మూతపడటంతో మూడు వారాల్లోనే ప్రముఖ ఓటీటీ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అయింది. ఓటీటీలో కూడా ఎక్కువ వ్యూస్‌ని సాధించి రికార్డుని క్రియేట్ చేసింది. ఈ విషయం పక్కన పెడితే.. తమ అభిమాన హీరో సినిమాని థియేటర్లలో చూడాలని ఆశ పడిన చాలామంది అభిమానుల కరోనా వైరస్ మాత్రం బ్రేకులు వేసింది. ఈ సమయంలో వకీల్ సాబ్ దర్శక నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్‌ని మరోసారి థియేటర్లకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రభుత్వాలు కూడా ఒక్కొక్కటిగా అన్‌లాక్‌ని ప్రకటిస్తున్నాయి. 50 శాతం అక్యుపెన్షీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరలో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వనున్నాయి.దీంతో నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్‌ని మరోసారి థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీని దాదాపు 300 థియేటర్స్‌లో రీ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇదే ఇదే కనుగా నిజమైతే పవన్ ఫ్యాన్స్‌కి పండగనే చెప్పొచ్చు. చదవండి: ‘శాకుంతలం’ అప్డేట్స్ : సెట్స్‌పైకి ఎప్పుడంటే.. ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? -
కరోనా బీభత్సం: రేపటి నుంచి సినిమాహాళ్లు బంద్
సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం కోవిడ్ ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు, మాల్స్, బార్స్, సెలూన్లను మూసేయనుంది. ఈ నెల 26 నుంచి ఇది అమల్లోకి వస్తుందని శనివారం ప్రభుత్వం ప్రకటించింది. ఇక రెస్టారెంట్లు, ఇతర కాఫీ షాపుల నుంచి టేక్ అవేలకి మాత్రమే అనుమతి ఉంది. పెళ్లిళ్లకి 50 మంది, అంత్యక్రియలకి 25 మంది మాత్రమే హాజరవాలి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా తమిళనాడుకు రావాలనుకుంటే ఇ–రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూ 10 నుంచి ఉదయం 4 వరకు, ఆదివారం లాక్డౌన్ కొనసాగుతుంది. -
నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పెతకంశెట్టి గణవెంకటరెడ్డి నాయుడు ... అంటే అర్థం కాలేదు కదా... అదేనండి గణబాబు... విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే.. టీడీపీ సీనియర్ నాయకుడు. ఏమిటీ ఇంకా గుర్తుకు రాలేదా.. అవును మరీ.. 2019 ఎన్నికల తర్వాత ఒకటిరెండు సార్లు తప్పించి.. పెద్దగా ఇంటి గడప దాటి బయటకు రాని ఎమ్మెల్యే ఈయన. ఇప్పుడీయన సంగతేమిటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. పైకి సుతిమెత్తగా మాట్లాడే ఈయన అక్రమార్జన మాత్రం గణగణ మోగాల్సిందే. సర్కారీ స్థలంలో ఏకంగా సినిమా థియేటర్లు కట్టేసుకుని ఆనక కోర్టుకు వెళ్ళి.. ఎంచగ్గా ఆక్రమణ ‘చిత్రం’ నడిపించేస్తున్నారు ఈయనగారు.. పూర్తి ‘సినిమా’ చూడాలంటే ఈ కథనంలోకి రావాల్సిందే. వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులను కాపాడుకోవడం, చేతనైతే పెంచుకోవాలనుకోవడం ఇవన్నీ సహజం.. ఎవరైనా అదే చేస్తుంటారు. కానీ ఎమ్మెల్యే గణబాబు రూటే సెపరేట్.. వారసత్వంగా వచ్చిన ఆక్రమిత స్థలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి గత టీడీపీ హయాంలో అప్పటి అధికారులపై ఒత్తిడి తెచ్చి.. 22ఏ(ప్రభుత్వ స్థలం) నుంచి బయటకు తీసుకువచ్చేలా జీవో(నెం 361) తెప్పించుకున్నారు. ఇటీవల రెవిన్యూ యంత్రాంగం పూర్తి స్థాయి పరిశీలిస్తే గణబాబు వారి ఆ ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు విశాఖ రూరల్ మండలం.. ఇప్పుడు గోపాలపట్నం మండలం.. గోపాలపట్నం రెవెన్యూ గ్రామం సింహాచలం రైల్వే స్టేషన్ సమీపంలో సర్వే నెంబర్ 27బై1లో 35.5సెంట్ల(సుమారు1726.67 చదరపు గజాల) ప్రభుత్వ స్థలంలో గణబాబు తాత అప్పలనాయుడు ఐదు దశాబ్దాల క్రితం ఓ సినిమా థియేటర్ నిర్మించారు. అప్పట్లో ఆ స్థలం గ్రామ కంఠంగా రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. తర్వాత కాలంలో ప్రభుత్వ డ్రై స్థలం (పోరంబోకు)గా రికార్డుల్లో చూపించారు. 1962లో సింహాచలం దేవస్థానం అధికారులు ఈ భూమికి సంబంధించి రైతు వారీ పట్టా ఇవ్వాల్సిందిగా అనకాపల్లి అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే.. ఈ భూమి మాదేనంటూ 2009లో జిల్లా పరిషత్ సీఈవో అప్పటి రూరల్ తహశీల్దార్‌కు లేఖ రాశారు. ఈ స్థలాన్ని ఆక్రమణ చెర నుంచి తప్పించాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇలా ఆ భూమిపై వివాదాలు నడుస్తుండగానే గణబాబు కుటుంబం సదరు సినిమా థియేటర్ రూపు మార్చేసింది. నరసింహా, శ్రీ నరసింహా పేర్లతో రెండు థియేటర్లు నిర్మించేసింది. మరోవైపు 2014లో ఆ ప్రాంత ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గణబాబు ఎన్నికయ్యారు. అప్పటికే రియల్ బూమ్ ఆకాశాన్నంటిన విశాఖలో 35.5సెంట్ల స్థలం విలువ కోట్లకు ఎగబాకింది. గోపాలపట్నంలోని నరసింహా, శ్రీ నరసింహా సినిమా థియేటర్లు.. దీంతో సదరు భూమిని ఎలాగైనా పూర్తిగా హస్తగతం చేసుకోవాలని గణబాబు పక్కా స్కెచ్ వేశారు. టీడీపీ ప్రభుత్వమే కావడంతో 2015లో ఎమ్మెల్యే గిరీ ఉపయోగించి గ్రామ కంఠం నుంచి ఆ స్థలానికి మినహాయింపు పొందారు. ఈ మేరకు 2015 సెప్టెంబర్ 29న రెవిన్యూ శాఖ నుంచి జీవో కూడా విడుదలైంది. ఇక ఆ తర్వాత స్థలాన్ని 22ఏ నుంచి తొలగించాలని ఓ వైపు కోర్టులో దాఖలు చేస్తూనే మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే 2016 జనవరి 22న అప్పటి జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఆర్సి నంబర్ 3153బై2015ఈ.1 ప్రకారం ఆ స్థలం 22ఏలో నుంచి బయట పడింది. స్థలాన్ని మింగేందుకు సబ్ డివిజన్లు సదరు విలువైన పోరంబోకు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు గణబాబు ఎన్నో మాయోపాయాలు ప్రయోగించారు. ఆ క్రమంలో ఆ భూమిని లెక్కకు మించిన సబ్ డివిజన్లుగా విభజించారు. మొదట్లో ఒకే ఒక (27బై1) సర్వే నెంబర్ పేరిట ఉన్న స్థలాన్ని ఆ తర్వాత 27బై4, 27బై5, 27బై5పి, 27బై16పి, 27బై18 సర్వే నెంబర్లుగా రూపాంతం చేశారు. దీంతో భూమి స్థితి మారి.. 22ఏ నుంచి బయటపడేందుకు మార్గం సులువైంది. ఈ మేరకు అప్పట్లో అధికారులు ఆయనకు పూర్తిస్థాయిలో సహకరించారని స్పష్టమవుతోంది. అధికారుల గ్రౌండ్ రిపోర్ట్‌తో బయటపడిన వాస్తవాలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దరిమిలా ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. టీడీపీ హయాంలో అక్రమార్కుల పరమైన సర్కారీ స్థలాలను ఆక్రమణల చెర నుంచి విడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోట్లు విలువైన గణబాబు సినిమా థియేటర్ల స్థలంపై కూడా దృష్టిసారించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలికితీసి జిల్లా అధికార యంత్రాంగానికి నివేదికనిచ్చారు. చదవండి: గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ భూ అక్రమాలు ప్చ్.. ముహూర్తం బాగాలేదు.. ఈసారి ఇలా! -
సినిమా థియేటర్లు: మారిన టైమింగ్స్ ఇవే!
సాక్షి, హైదరాబాద్: రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లను కూడా రాత్రి 8 గంటలకే మూసివేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని మల్టీప్లెక్సులు, థియేటర్లు, సినిమా హాళ్లను 8 గంటలకే మూసేయాలి. వాటి సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రవేశద్వారాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. సామాజిక దూరం పాటించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. థియేటర్లలో 24 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత, 40–70 శాతం తేమ, లోపలికి, బయటికి గాలి ప్రసరించేలా ఏర్పాట్లు చేయాలి. ఇంటర్వెల్, ముగింపు సమయంలో ప్రేక్షకులు భారీగా గుమిగూడకుండా చూడాలి. షోల సమయాల్లో మార్పులు రాత్రి కర్ఫ్యూ విధిస్తూ మంగళవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. సినిమా థియేటర్ల యజమానులు సెకండ్ షోను రద్దు చేసుకున్నారు. మిగతా మూడు షోల సమయాన్ని సవరించారు. మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు మొదలై మధ్యాహ్నం 1.30గంటల వరకు.. మ్యాట్నీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు.. ఫస్ట్ షోను 5 గంటలకు మొదలై రాత్రి 8 గంటలలోపు ముగించేలా మార్చారు. అయితే తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ మాత్రం కొవిడ్ ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా నేటి (బుధవారం) నుంచి రాష్ట్రంలో సినిమా ప్రదర్శనలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. చదవండి: కరోనా కష్టాలు మామ.. సినిమా చూపలేము మామా! రష్మికకు ప్రపోజ్ చేసిన రౌడీ హీరో.. వీడియో వైరల్ -
టాలీవుడ్‌కి కరోనా షాక్.. సినిమా థియేటర్లు బంద్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మరి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి తెలంగాణలో సినిమా ప్రదర్శనలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మంగళవారం సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది. కాగా, తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రాత్రి 9గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. -
ప్రభుత్వ ధరలకే సినిమా టికెట్లు అమ్మాలి
-
ప్రభుత్వ ధరలకే సినిమా టికెట్లు అమ్మాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జీవోలోని ధరల ప్రకారమే ఆదివారం నుంచి సినిమా టికెట్లు అమ్మాలని థియేటర్ల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అధిక ధరలు వసూలు చేస్తే ఆయా థియేటర్ల యాజమాన్యాలపై అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. శనివారం(10వ తేదీ) వరకు అడ్వాన్స్ బుకింగ్‌లో ఇచ్చిన టికెట్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు సూచించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులిచ్చింది. వకీల్‌సాబ్ సినిమాకు మొదటి మూడు రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. సినీ ప్రేక్షకుల నుంచి అధిక రేట్లు వసూలు చేయకుండా ఉండేందుకే కొత్త మార్గదర్శకాలతో జీవో ఇచ్చినట్లు తెలిపారు. మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా.. సింగిల్ జడ్జి మాత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్‌లో ఇచ్చిన టికెట్లు మాత్రమే కాకుండా మూడు రోజుల పాటు అన్ని రకాల టికెట్లను అధిక ధరలకు అమ్ముకునేందుకు అనుమతిచ్చారని వివరించారు. థియేటర్ల యాజమాన్యాల తరఫు న్యాయవాది కె. దుర్గా ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. దీనివల్ల థియేటర్ల యజమానులు నష్టపోతున్నారని వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ఆదివారం నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని స్పష్టం చేసింది. -
సినిమా: ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయాలు తగవు
‘సినిమా టిక్కెట్ల ధరలు, తినుబండారాల ధరల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే.. పేదవారికి వినోదం భారం కాకూడదనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిగారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాజకీయాలు తగవు’ అని ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ‘‘సినిమా టిక్కెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచడం, తినుబండారాలను అధిక ధరలకు విక్రయించడం వల్ల పేదలకు వినోదం భారమవుతోంది. ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగానే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. రోజు మొత్తం సినిమాలను ప్రదర్శించే విధానానికి అడ్డుకట్ట వేయడం మంచి నిర్ణయం. ప్రభుత్వ నిబంధనలు ఏ ఒక్క సినిమాకో కాకుండా అన్నిటికీ వర్తిస్తాయని స్పష్టంగా పేర్కొన్నారు. దాన్ని రాజకీయ నిర్ణయంగా పరిగణించడం ఆ యా పార్టీ నాయకుల అజ్ఞానానికి నిదర్శనం’’ అని కేతిరెడ్డి పేర్కొన్నారు. -
సినిమా థియేటర్ల బంద్‌పై మంత్రి తలసాని స్పష్టత
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా థియేటర్లు మూతబడతాయనే వదంతులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. థియేటర్ల బంద్ ప్రచారంలో నిజంలేదన్నారు. కోవిడ్ నిబంధనలతో థియేటర్లు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. అయితే, థియేటర్ల యజమానులు సినిమా హాళ్లలో కొవిడ్ నిబంధనలు పాటించేలా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. థియేటర్లను మూసివేస్తారంటూ వస్తోన్న ప్రచారాన్ని నమ్మకూడదని ఆయన ప్రజలకు సూచించారు. థియేటర్లు మూసివేస్తే సినీ పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళ్తుందని, వేలాది మంది కార్మికులు రోడ్డునపడే పరిస్థితి ఉంటుందన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించే థియేటర్లను యథావిధిగా కొనసాగించే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.అందరూ కరోనా నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సినిమా దియేటర్లు యధావిధిగా నడుస్తాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దియేటర్లు మూతపడనున్నాయని జరుగుతున్న ప్రచారం అబద్దం. సినిమా దియేటర్ల మూసివేత పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. @KTRTRS @KChiruTweets @iamnagarjuna @baraju_SuperHit @vamsikaka pic.twitter.com/yDRU8dydcj — Talasani Srinivas Yadav (@YadavTalasani) March 24, 2021 -
సినిమా థియేటర్లు మూసివేసే ఆలోచన లేదు అన్నారు: మంత్రి తలసాని
-
థియేటర్లు మళ్లీ బంద్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా హాళ్లను తిరిగి మూసివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఒకవేళ అది సాధ్యం కాకుంటే కనీసం సగం సీట్లు (50%) మాత్రమే నింపుకొనేందుకు మాత్రమే అనుమతి ఇవ్వాలని కోరింది. తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త సినిమా విడుదలైతే థియేటర్లు 90 శాతంపైగా నిండిపోతున్నాయని, పైగా ప్రేక్షకులు మాస్కులు పెట్టుకోకుండా పక్కపక్క సీట్లలో కూర్చుంటున్నారని పేర్కొంది. తలుపులు మూసేసి ఏసీలు వేస్తుండటంతో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని తెలిపింది. కాబట్టి సినిమా హాళ్లు, జిమ్‌లు, ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న సముదాయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేసింది. విద్యాసంస్థలను మూసివేయాలని పది రోజుల క్రితమే తాము ప్రతిపాదించామని, ఇప్పటికే ఆలస్యమైందని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. అందువల్ల సినిమా హాళ్ల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. మూడు నెలలపాటు వ్యాక్సిన్ల స్టాక్... రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి, రెండో డోసులతో కలుపుకొని 9.68 లక్షల వ్యాక్సి న్లు వేశారు. ప్రస్తుతం ఇంకా 12 లక్షల డోసులు రాష్ట్రంలో నిల్వ ఉన్నాయి. అయి తే వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా లు వేయాలంటే ఇప్పుడున్న డోస్‌లు సరి పోవు. కరోనా కేసులు పెరిగితే వ్యాక్సిన్లు వేసుకొనే వారి సంఖ్య కూడా అదేస్థాయి లో అధికమవుతుంది. ప్రస్తుతం నెలకు సరిపడా వ్యాక్సిన్లనే నిల్వ పెట్టుకుంటున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటం తో 3 నెలల వరకు సరిపడే వ్యాక్సిన్లను తెప్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు కరోనా బాధితులకు అవసరమైన మందులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కంపెనీలకు ఇండెంట్లు పెట్టారు. అన్ని ముఖ్యమైన ఆ సుపత్రుల్లోనూ కరోనా వార్డులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా సెకండ్ వేవ్! దేశవ్యాప్తంగా ఐదారు నెలల క్రితం తగ్గినట్లే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ వేగంగా వ్యాపిస్తోందని, వైరస్ వ్యాప్తి రెండో దశలోకి చేరుకుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మున్ముందు రోజురోజుకూ కేసులు మరింతగా పెరుగుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా జాగ్రత్తలు పాటించడమే అందుకు పరిష్కారమని పేర్కొన్నారు. అందువల్ల ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, అర్హులైన వారంతా వ్యాక్సిన్లు వేసుకోవాలని సూచించారు. మరోవైపు మాస్కులు పెట్టుకోకుంటే జరిమానా విధించాలని, పోలీసులు రోడ్లపైనా, మాల్స్ వద్ద, గుమిగూడే అన్ని ప్రాంతాల్లో దాడులు చేసి జరిమానాలు విధిస్తే నిర్లక్ష్యం వహించే వారిలో కదలిక వస్తుందని, భయంతోనైనా మాస్కులు పెట్టుకుంటారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఈ మేరకు పోలీసు శాఖకు ప్రతిపాదన చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 90 శాతం వరకు మాస్కులు ధరించకపోవడం వల్లేనని, మిగిలిన 10 శాతం కేసులు భౌతికదూరం పాటించకపోవడం, చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్లేనని ఒక అధికారి వ్యాఖ్యానించారు. అందువల్ల ఉన్నతస్థాయి వర్గాల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ మాస్కులు పెట్టుకోవాలని, ఆ మేరకు ప్రభుత్వం అవగాహనతోపాటు ధరించని వారికి జరిమానా విధించాలని కోరుతున్నారు. -
పూర్తి సామర్థ్యంతో సినిమా హాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంద శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లలో ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర హోంశాఖ ఇటీవల జారీ చేసిన నూతన కోవిడ్–19 మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం ప్రామాణిక నియమావళిని విడుదల చేశారు. కోవిడ్–10 ప్రోటోకాల్స్ పాటిస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వంద శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిబంధనలు పాటించాలని చెప్పారు. శానిటైజేషన్ మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలన్నారు. పూర్తి సామర్థ్యంలో సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఏఐ) స్వాగతించాయి. డిజిటల్‌కి గైడ్‌లైన్స్ ఏర్పాటు చేస్తాం.. ఓటీటీల్లో విడుదలవుతున్న పలు వెబ్ సిరీస్‌లు, షోలు వివాదాలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. డిజిటల్ వేదికలపై విడుదలయ్యే వెబ్‌సిరీస్‌లు, షోల నియంత్రణకు గైడ్‌లైన్స్ ఏర్పాటు చేస్తామని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ‘‘ఓటీటీల్లో విడుదలవుతున్న కంటెంట్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి. త్వరలోనే గైడ్‌లైన్స్ తీసుకొస్తాం’’ అని వెల్లడించారు. నియమావళిలోని ముఖ్యాంశాలు ► కంటైన్మెంట్ జోన్లలోని థియేటర్లలో చలనచిత్రాల ప్రదర్శనకు అనుమతి లేదు. ► క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు చర్యలకు సిఫార్సు చేయొచ్చు. ► థియేటర్లలో సీట్ల సామర్థ్యం వందశాతానికి పెంచుకోవచ్చు. ► సినిమా హాళ్లు, థియేటర్లలో కోవిడ్–19 సంబంధిత భద్రతా చర్యలను అమలు చేయాలి. ► ఫేస్ మాస్కుల వినియోగం తప్పనిసరి. ► థియేటర్ల బయట, కామన్ ప్రాంతాలు, వేచిఉండే ప్రాంతాల్లో కనీసం ఆరు అడుగుల సామాజిక దూరం పాటించేలా చూడాలి. ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ► ఆరోగ్యసేతు యాప్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. ► ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో రద్దీ లేకుండా ప్రేక్షకులకు థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ► సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ స్క్రీన్‌లో సినిమాల ప్రదర్శనల మధ్య తగినంత విరామం ఇవ్వాలి. ► టికెట్లు, ఆహారం, పానీయాల కొనుగోలులో చెల్లింపుల నిమిత్తం కాంటాక్ట్‌లెస్ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలి. ► టికెట్ల కొనుగోలు నిమిత్తం రోజంతా తెరచి ఉండేలా తగిన సంఖ్యలో బాక్సాఫీస్ కౌంటర్లు ఏర్పాటు చేయాలి. కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా ముందస్తు బుకింగ్‌ను అనుమతించాలి. ► థియేటర్ల ప్రాంగణంలో శానిటైజేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ► మానవ సంచారం ఉండే అన్ని చోట్లా హ్యాండిల్స్, రెయిలింగ్స్ తరచుగా శానిటైజ్ చేయాలి. ► థియేటర్లలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులపై ప్రకటనలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. -
థియేటర్లలో పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అనుమతి
సినిమా థియేటర్ల ఓనర్లకు కేంద్రం తీపికబురు అందించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకోవచ్చని పచ్చజెండా ఊపింది. అయితే కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నొక్కి చెప్పింది. ఈ మేరకు ఆదివారం నాడు మార్గదర్శకాలను విడుదల చేసింది. థియేటర్లలో భౌతిక దూరం, మాస్కులు ధరించడం, థర్మల్ స్క్రీనింగ్ వంటివి తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. షో ముగిసిన ప్రతిసారి శానిటైజ్ చేయాలని తెలిపింది. (చదవండి: సినీ లవర్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్) కాంట్రాక్ట్ ట్రేసింగ్ కోసం ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వారి ఫోన్ నెంబర్లను కూడా తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. రేపటి(ఫిబ్రవరి 1) నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కేంద్రం తాజా నిర్ణయంతో సుమారు ఏడు నెలలుగా మూతపడిన సినిమాహాళ్ల ఓనర్లకు ఉపశమనం లభించినట్లైంది. కాగా గతేడాది అక్టోబర్‌లో 50 శాతం ప్రేక్షకులతో థియేటర్లు నడిపించుకోవచ్చన్న కేంద్రం తాజాగా దాన్ని 100 శాతానికి పెంచడంతో సినీరంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి త్వరలోనే థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డు కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. (చదవండి: 30 రోజుల్లో..ఫస్ట్‌డే కలెక్షన్లు.. ప్రదీప్ ఎమోషనల్ ట్వీట్) Good news for Cinema lovers: Today, Issued the revised SOP for the film exhibition, 100% occupancy will be allowed in theatres from 1st February, but all @MoHFW_INDIA #COVID19 guidelines will have to be followed.https://t.co/5vfZtAoHXW@MIB_India pic.twitter.com/89qZpSiMhq — Prakash Javadekar (@PrakashJavdekar) January 31, 2021 -
సినీ లవర్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: సినీ ప్రేమికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సినిమా థియేటర్లలో 50 శాతానికే పరిమితమైన సీటింగ్ సామర్థ్యాన్ని పెంచింది. థియేటర్లలో అధిక శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వవచ్చని తాజా నిబంధనల్లో పేర్కొంది. ఇది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మాధ్యమాల మంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. అయితే ఎంత మేరకు సీట్లను బుక్ చేసుకోవచ్చన్న వివరాలను కేంద్రం త్వరలోనే వెల్లడించనుంది. (చదవండి: ఆర్ఆర్ఆర్: రాజమౌళి కాపీ కొట్టారట!) కాగా 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడపడం వల్ల థియేటర్ల నిర్వహణకు ఎక్కువ ఖర్చు అవుతుందని థియేటర్ల యాజమాన్యాలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాయి. అన్నింటికీ పూర్తి స్థాయిలో అనుమతులిచ్చినప్పుడు కేవలం థియేటర్ల బిజినెస్‌కు మాత్రమే నిబంధనలు విధించడం సబబు కాదని ప్రభుత్వాలకు విన్నవించాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కేంద్రం నిబంధనలను పక్కన పెట్టి థియేటర్లలో 100 శాతం కెపాసిటీకి పచ్చజెండా ఊపింది. కానీ కేంద్రం మాత్రం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. (చదవండి: పళని సర్కార్‌కు కేంద్రం షాక్!) -
పళని సర్కార్‌కు కేంద్రం షాక్!
సాక్షి,న్యూఢిల్లీ: థియేటర్స్ లో సీటింగ్ సామర్ధ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుకోవచ్చంటూ జీవో జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వానికి షాక్ తగిలింది. దేశంలో కరోనా మహమ్మారికి ఇంకా కళ్లెం పడకపోవడం, కొత్త కరోనా వైరస్ ఆందోళన రేపుతున్న తరుణంలో కేంద్రం తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో 100 శాతం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనకు అనుమతినిస్తున్న జీవోను రద్దు చేయాలని కేంద్రం ఒక లేఖ రాసింది. తమిళ సర్కారు తాజా నిర్ణయం కేంద్రం డిసెంబరు 28న జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉందని కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు. 100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనల ఆదేశాలను ఉపసంహరించుకోవాలని , తమ ఆదేశాన్ని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం అన్ లాక్ ప్రక్రియలో భాగంగా 50 శాతం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలకు మాత్రమే అనుమతిచ్చిందని, ఈ ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించారన్నారు. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం కేంద్ర మార్గదర్శకాలను తమకు అనుగుణంగా మార్చుకోరాదని ఆయన స్పష్టం చేశారు.అలాగే సుప్రీంకోర్టు కూడా ఇప్పటికీ మాస్కులు, భౌతికదూరం నిబంధనలు తప్పనిసరి చేసిందని కూడా గుర్తు చేసింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని తమిళనాడు ప్రభుత్వం తన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. కాగా వంద శాతానికి సీటింగ్ సామర్ధ్యాన్ని పెంచడాన్ని అరవింద్ స్వామి వంటి వారు వ్యతిరేకించగా, నటి, ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన ఖుష్బూ మద్దతు పలికారు.అటు పుదిచ్చేరికి చెందిన ఒక డాక్టర్ 100 శాతం ఆకుపెన్సీ అవకాశాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్టును ట్యాగ్ చేస్తూ కొందరు తమిళ సినీ ప్రముఖుల తమిళ నాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పు పట్టారు. అలాగే టాలీవుడ్లో కూడా 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించాలని కోరుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల నిర్మాతల మండలి విజ్ఞప్తి చేయడం విశేషం. మరోవైపు ఈ నెల 13న హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’, శింబు నటించిన ఈశ్వరన్ చిత్రాలు విడుదల కానున్నాయి. (మాస్టర్ హిందీ వెర్షన్ ఈనెల 14న విడుదల కానుంది.) ఈ నేపథ్యంలో కేంద్రం తాజా ఆదేశాలు చర్చకు తెర తీశాయి. #MASTER HINDI RELEASE DATE... The #Hindi version of #Master - titled #VijayTheMaster - to release on 14 Jan 2021 [Thursday]... Stars #Vijay and #VijaySethupathi... #MasterFilm #MasterPongal OFFICIAL POSTER... pic.twitter.com/hx162fI20l — taran adarsh (@taran_adarsh) January 6, 2021 -
‘థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలి’
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుకోడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలనకు తెలుగు సినిమా నిర్మాతల మండలి లేఖ రాసింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు గత కొద్దిరోజుల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడపడం వల్ల థియేటర్ల నిర్వహణకు ఎక్కవ ఖర్చు అవుతుందని, దీని వల్ల థియేటర్ల యాజమాన్యాలు నష్టాలను భరించాల్సి వస్తుందని నిర్మాతల మండలి పేర్కొంది. సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతంకు పెంచుతూ, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లు నడుపుకునేందుకు అనుమతిస్తున్నట్లు జనవరి 4న తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: థియేటర్లలో ఎంజాయ్ చేద్దాం: ప్రభాస్ కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్న క్రమంలో థియేటర్ల యాజమాన్యాలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకుని తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, తమిళనాడు తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం సీటింగ్ కెపాసిటీతో చిత్ర ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలంటూ నిర్మాతల మండలి కోరింది. ఇందుకు లేఖల ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ విభాగాధిపతులను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సినిమా థియేటర్ల నిర్వహణకు, సినీ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది. -
థియేటర్లలో ఎంజాయ్ చేద్దాం: ప్రభాస్
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో సినిమా థియేటర్లన్ని మూతపడిన విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిది నెలలపాటు బిగ్ స్ర్కీన్‌పై సినిమా సందడి లేక థియేటర్లన్ని వెలవెలబోయాయి. అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇటీవల థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ థియేటర్లలోకి వెళ్లి సినిమా చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. దీంతో షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీనే నమ్ముకొని అనేక సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కొన్ని ప్రేక్షకుల మెప్పు పొందగా మరికొన్ని చతికిలపడిపోయాయి. చదవండి: మెగా ఫ్యామిలిలో మళ్లీ పెళ్లి బాజాలు.. అయితే డిసెంబర్లో నెలలో ఒకటి రెండు సినిమాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ థియేటర్ల రీఓపెనింగ్‌పై కామెంట్ చేశారు. పప్రేక్షకులందరూ థియేటర్లకు వెళ్లి సినిమాను చూడాలని కోరారు. జనాలు సురక్షితంగా సినిమా చేసే అనుభవాన్ని అందించేందుకు సినిమాలు తిరిగి వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. ‘మన సినిమాను బిగ్ స్ర్కీన్‌లో ఎక్స్పీరియన్స్ చేద్దాం’ అని అభిమానులకు పిలుపునిచ్చారు. కాగా లాక్డౌన్ అనంతరం థియేటర్లలో విడుదలవున్న పెద్ద సినిమా సోలో బ్రతుకే సో బెటర్. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించాడు. చదవండి: నాలుగు నెలల్లో సలార్ పూర్తి The cinemas are back to give you a wholesome and safe movie watching experience. #CelebrateCinema #Prabhas 🤩 pic.twitter.com/Df5h63BMAe — Prabhas (@PrabhasRaju) December 23, 2020 ఈ సినిమా రేపు (డిసెంబర్ 25) క్రిస్మస్ రోజున థియేటర్లలలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించారు. లాక్డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలిచిత్రంగా ఈ సినిమా ఫిల్మ్ ఇండసస్టట్రీకే ఒక ముఖ్య సందర్భమని అన్నారు. ఈ చితత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్పూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదన్నారు. ప్రేక్షకులందరూ బాధ్యతగా ముఖానికి మాస్కు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ చిత్రాన్ని థియేటర్లలో ఎంజాయ్ చేయాని కోరుతున్నట్లు తెలిపారు. #StaySafe#SBSBOnDec25th#CelebratingCinema#ReturnOfTeluguCinema #BigScreenEntertainment @IamSaiDharamTej @SVCCofficial pic.twitter.com/NrKwy4u3r0 — Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2020 -
సినిమా హాల్స్‌పై లాక్డౌన్ వాత
కార్పొరేట్ ‘వల’పుతో గిలగిల.. పరిస్థితి ఆశాజనకంగా లేని థియేటర్లు మూసి ఉండటంతో పలు వ్యాపార సంస్థలు వాటిని సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లకు అద్దె రూపేణా వస్తున్న ఆదాయానికి రెట్టింపు ఆదాయాన్ని హామీ ఇవ్వడానికి కూడా ఇవి సిద్ధపడుతున్నాయని తెలుస్తోంది. ఈ రకమైన ఆఫర్లతో ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ తమ రిటైల్ వ్యాపార కార్యకలాపాల కోసం సిటీలోని పలు థియేటర్లను లీజుకు తీసుకున్నట్లు సమాచారం. నగరవాసులకు ప్రధాన వినోద కేంద్రం సినిమా థియేటర్.. వీకెండ్ వచ్చిందంటే చాలు కుటుంబ సభ్యులతో కలిసి సినిమా హాల్లో వాలిపోవాల్సిందే.. ఏ నలుగురు ఫ్రెండ్స్ కలిసినా ముందుగా గుర్తొచ్చేది సినిమానే.. ఇదంతా లాక్‌డౌన్‌కు ముందు ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి జీవన్మరణ సమస్యగా మారింది. అందరికీ వినోదాల కేంద్రంగా మారిన సినిమా హాల్స్ ప్రస్తుతం మూసివేత దిశగా ప్రయాణిస్తున్నాయి. జంట నగరాల్లోని థియేటర్లను కరోనా కాటేసింది. ఇదే అదనుగా వ్యాపార విస్తరణలో ఉన్న కార్పొరేట్ సంస్థలు సినిమా హాల్స్‌పై ఆఫర్లతో ‘వల’పు వేస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో, బంజారాహిల్స్ అన్‌లాక్ కాని థియేటర్లు.. ఇప్పటికీ కొన్ని థియేటర్లు తెరుచుకోకపోవడానికి లాక్‌డౌన్‌తో ఏర్పడిన ఆర్థిక నష్టాలు కారణంగా చెబుతున్నారు. ఇప్పటిదాకా రూ.లక్షల్లో పేరుకుపోయిన కరెంటు బకాయిలు చెల్లించాల్సి రావడం కూడా ‘తెర’చుకోకపోవడానికి కారణాల్లో ఒకటి. నగదు రొటేషన్ ఉన్నప్పుడు బయటపడని భాగస్వాముల వివాదాలు రచ్చకెక్కడం, థియేటర్లు మూసి ఉన్నా సిబ్బందికి 50శాతం చొప్పున జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూతపడిన థియేటర్లు బడా వ్యాపార సంస్థల వ్యాపార విస్తరణ యత్నాలకు స్ఫూర్తినిస్తున్నాయి. కోవిడ్ నిబంధనలతో ఈ నెల 4న థియేటర్లు తెరుచుకునేందుకు నిబంధనలతో కూడిన అనుమతిచ్చారు.. అయినా నగరంలో చాలా థియేటర్లు ఇంకా మూసే ఉన్నాయి. కొన్ని మల్టీఫ్లెక్స్‌లు, మాల్స్ల్లో భాగంగా ఉన్న సినిమా హాల్స్ మాత్రమే ఇతర భాషా చిత్రాలతో నడుస్తున్నాయి. వీటిలో సగం సీట్లలో మాత్రమే ప్రేక్షకులకు అనుమతి ఉన్నా నడుస్తున్న థియేటర్లలోనూ 5 శాతం సీట్లు మించి భర్తీ కావడం లేదు. ఇప్పటి వరకు కొత్త తెలుగు సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఊపందుకోవడం వంటివి కారణమవుతున్నాయి. ఓటీటీ.. వేటేస్తుందా? ►లాక్డౌన్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఊపందుకున్నాయి. ఇంట్లో ఉండే సినిమాను ఆస్వాదించే అలవాటు ప్రజల్లో స్థిరపడింది. ఈ పరిస్థితుల్లో థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు ఎంత వరకూ వస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది కూడా థియేటర్ల నిర్వహణ పట్ల యజమానుల నిరాసక్తతకు కారణంగా మారుతోంది. ►థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకంతో కొంతమంది మాత్రం ఎదురు చూస్తున్నారు. కొంత మంది థియేటర్లను నడిపించలేక, అమ్ముకోలేక ఇబ్బందులు పడుతుండగా రెట్టింపు ఆదాయం ఆఫర్ చేస్తున్న అమేజాన్ చాలా థియేటర్లను లీజుకు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ►పాతవి మూతపడుతుంటే.. కొత్తవి వస్తాయిలే అనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటి నిబంధనల ప్రకారం సినిమా హాల్ నిర్మించాలంటే కనీసం 2,300గజాలు ఉండాలి. మల్టీఫ్లెక్స్ అయితే 3,700 గజాలు కావాలి. నిబంధనలతో నిర్వహణ కుదేలు.. నగరంలో 80కిపైగా ఉన్న థియేటర్ల అద్దెలు ప్రాంతాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.3 నుంచి రూ.4 లక్షల వరకూ ఉన్నాయి. అలాగే క్యాంటీన్లు అద్దెలు, పార్కింగ్ ఆదాయం అదనం. వచ్చే ఆదాయంలోంచి చెల్లించాల్సిన వాటిలో మినిమం కరెంటు బిల్లు రూ.లక్ష పైచిలుకు ఉంది. అలాగే పెద్ద సంఖ్యలో సిబ్బంది జీతభత్యాలు, ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం ఉన్నా లేకపోయినా ఇవి తప్పవు. లాక్డౌన్ ముందు పునర్నిర్మాణం చేయాలంటే రూ.కోట్లు పెట్టుబడి కావాలనే ఆలోచనతో.. వెనకంజ వేస్తూ అత్తెసరు లాభాలతో, కొద్దోగొప్పో నష్టాలొచ్చినా భరిస్తూ నడిపిస్తున్నవారే ఎక్కువ.. లాక్డౌన్ టూ గోడాన్.. నారాయణగూడ చౌరస్తాలో 1969 నుంచి.. 50 ఏళ్లుగా ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచిన శాంతి థియేటర్ 8 నెలలుగా మూతపడింది. తద్వారా ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు యాజమాన్యం గోడాన్‌గా మార్చి లీజుకు ఇవ్వాలని సిద్ధమైంది. ఒక్క శాంతి టాకీస్ మాత్రమే కాదు.. గెలాక్సీ, సుష్మ, మెఘా, శ్రీమయూరి, శ్రీరామ, వెంకటాద్రి, సాయిరాజా, అంబ ఇవి కాకుండా మియాపూర్ పరిసర ప్రాంతాల్లో మరో 2 థియేటర్లు వెరసి సుమారుగా 25 వరకూ థియేటర్లు నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు గోడాన్ల అవతారమెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంకొన్ని థియేటర్లను కూల్చేసి మాల్స్ నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త సినిమాలతో పూర్వవైభవం.. వచ్చే ఏడాదిలో వకీల్‌సాబ్, ఆర్ఆర్ఆర్, క్రాక్, రెడ్, సోలో బ్రతుకే సో బెటర్లాంటి సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలు థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. కాబట్టి త్వరలోనే థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని నమ్ముతున్నాం. 8 నెలలుగా నెలకు రూ.8 లక్షల వరకు నష్టపోయాం. ఇప్పుడు థియేటర్లలో సీట్ల మధ్య గ్యాప్ నిబంధన పెట్టారు. దేవి 70 ఎంఎం, సుదర్శన్ 35 ఎంఎంలో 1,380 చొప్పున సీట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 690 సీట్లకు టిక్కెట్లు ఇవ్వాలి. అయితే ప్రస్తుతం రోజుకు 100 నుంచి 180 మంది మాత్రమే ప్రేక్షకులు వస్తున్నారు. – బాల గోవిందరాజ్, జాయింట్ సెక్రటరీ, తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్. యజమాని, దేవి 70 ఎంఎం. శాంతి టాకీస్‌ను 1969లో ప్రారంభించాం. ఇప్పుడైతే థియేటర్ మూసి ఉంది. ఒక వేళ తెరిచినా నెలకు రూ.2 లక్షల వరకు నష్టం భరించే స్థితిలో మేములేం. గోడాన్‌గా లీజుకు ఇచ్చేందుకు ప్రపోజల్ పెట్టుకున్నాం. – పిచ్చేశ్వర్రావు, శాంతి టాకీస్ యజమాని గోడాన్‌గా మారుస్తున్నాం.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శ్రీమయూరి థియేటర్‌ను 1969లో ప్రారంభించాం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్, థియేటర్లకు వరాలు కురిపిస్తూ కరెంటు మినిమం చార్జీలుండవని చెప్పారు. అయితే 3 రోజుల క్రితం మా థియేటర్లో కరెంటు బిల్లు కట్టలేదని కరెంట్ కట్ చేశారు. ఈ కష్ట నష్టాలను భరించే ఓపిక లేకే గోడాన్కు లీజుకు ఇవ్వాలని నిర్ణయించాం. – వెంకటకృష్ణ, శ్రీమయూరి థియేటర్ యజమాని (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెరుచుకున్న సినిమా థియేటర్లు
-
హైదరాబాద్: ఆ ఐదు సినిమా థియేటర్లు క్లోజ్!
కరోనా కారణంగా తెలంగాణలో దాదాపు 10 నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రేక్షకులు వినోదానికి దూరమయ్యారు. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమా థియేటర్లను ఓపెన్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో మూతపడిన సినిమా థియేటర్లు పునఃప్రారంభానికి 50 శాతం సీటింగ్‌తో సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. ఇక థీయేటర్లకు వెళ్లి హ్యాపీగా సినిమా చూద్దామనుకున్న తరుణంలో సినీ ప్రియులకు సంబంధించిన ఒక చేదు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్లగా మంచి గుర్తింపు పొందిన ఐదు సినిమా థియేటర్లు మూతపడ్డాయి. (చదవండి : టాలీవుడ్‌కు వరాల జల్లు; కేసీఆర్‌కు చిరు కృతజ్ఞతలు) మల్టీప్లెక్స్‌ల హవా నడుస్తున్న కాలంలోనూ పెద్ద పెద్ద సినిమాలు రీలీజ్ చేస్తూ సామాన్యులను వెండితెరకు దగ్గర చేసిన గెలాక్సీ థియేటర్(టోలిచౌకి), శ్రీ రామ థియేటర్(బహదూర్‌పుర), అంబ థియేటర్(మెహదీపట్నం), శ్రీమయూరి థియేటర్(ఆర్టీసీ క్రాస్ రోడ్), శాంతి థియేటర్(నారాయణగూడ) మూతపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్‌ల నుంచి పోటీ ఉన్నప్పటికీ ఈ ఐదు థియేటర్ల యజమానులు పెద్ద సినిమాలను విడుదల చేస్తూ సామాన్య సినీ అభిమానులకు తోడుగా నిలిచారు. ముఖ్యంగా శాంతి, గెలాక్సీ థియేటర్లలో కొన్ని దశాబ్దాలుగా ఎన్నొన్నో సూపర్ హిట్ చిత్రాలను విడుదల చేశారు. మల్టీపెక్స్‌ల హవాలోనూ ఎక్కడా రాజీ పడకుండా పెద్ద పెద్ద చిత్రాలను నడిపించారు. కానీ దురదృష్టవశాత్తు కరోనా కారణంగా గత 10 నెలలుగా థీయేటర్లు మూతపడటం, సింగిల్ స్క్రీన్లకు ఈ మధ్యకాలంలో సరైన ఆదాయం లేకపోవడంతో మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థలాన్ని ఫంక్షన్ హాల్ లేదా ఇత వాణిజ్య సముదాయాలుగా మార్చే అవకాశం ఉంది. -
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, విజయవాడ: విజయవాడ సమీపంలోని చిట్టినగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్క్ ప్రాజెక్ట్ సమీపాన ఉన్న పాత ప్రసాద్ థియేటర్లో అర్ధరాత్రి సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. థియేటర్ మూతపడటంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాద తీవ్రతకు చుట్టుపక్కల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
‘సినీ వరల్డ్’ మూత ఉద్యోగుల కోత
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌లో దేశవ్యాప్తంగా చెయిన్ 127 సినిమా థియేటర్ల నెట్వర్క్ కలిగిన ‘సినీ వరల్డ్’ తన కార్యకలాపాలను కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. జేమ్స్ బాండ్, స్టార్‌వార్స్ సిరీస్‌కు చెందిన తాజా చిత్రాల విడుదలపై ఆశలు పెట్టుకొని ఇంతకాలం నెట్టుకొచ్చిన ‘సినీ వరల్డ్’ ఆ సినిమాల విడుదల కూడా మరోసారి వాయిదా పడడంతో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 350 కోట్ల పౌండ్ల అప్పుకలిగిన ‘సినీ వరల్డ్’కు స్కై, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్, బ్రిట్ బాక్స్ సంస్థల నుంచి ఆన్లైన్ చిత్రాల ద్వారా గట్టి పోటీ ఏర్పడడంతో తన కార్యకలాపాలకు తెర దించాల్సి వచ్చింది. హారీ పాటర్ సిరీస్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, ఆ చిత్రాలను సినిమా థియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నప్పటికీ ఆ ఒక్క బ్రాండ్ చిత్రాలపై ఆధారపడి పరిశ్రమను నడిపించలేమని ‘సినీ వరల్డ్’ భావించింది. సినీ వరల్డ్ నిర్ణయం దేశవ్యాప్తంగా వారి నెట్ వర్క్‌లో పని చేస్తోన్న 4,500 ఉద్యోగులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడనున్నారు. -
15 నుంచి థియేటర్లను ప్రారంభిస్తాం
చిక్కడపల్లి (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈనెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నా మని తెలంగాణ థియేటర్ల యజమానుల సంఘం పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి అనుమతులు లభించాల్సి ఉందని, ఇదే అంశంపై సోమవారం ఎఫ్డీసీ చైర్మన్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎం కేసీఆర్‌లను కలసి వినతిపత్రాలను అందజేయనున్నట్లు తెలిపింది. ఆర్టీసీక్రాస్‌రోడ్డు లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో తెలంగాణ థియేటర్ల యజమానుల సంఘం శని వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ సంఘం కార్యదర్శి విజయేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజ్‌గోపాల్ తాండ్ల మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న తమకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. థియేటర్లు మూసివేసి ఉన్న నెలలకు ఫిక్స్ కరెంట్ ఛార్జీలను, ప్రాపర్టీ ట్యాక్స్‌లను తొలగించాలని కోరారు. భౌతిక దూరం పాటించడంలో భాగంగా థియేటర్లలో ఆల్టర్నేట్ సీట్లను ఏర్పాటు చేశామన్నారు. టికెట్ కౌంటర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నామని, పాత టికెట్ ధరలనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్కింగ్ చార్జీలను మళ్లీ కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు కె.సురేశ్, బాదం వెంకటకృష్ణ, గోపాల్‌రెడ్డి, సంధ్యా థియేటర్ మేనేజర్ మధుసూదన్, సుదర్శన్ థియేటర్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, దేవి థియేటర్ మేనేజర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అక్టోబర్ 1 నుంచి థియేటర్లు ఓపెన్?
న్యూఢిల్లీ: అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్రం.. కరోనా వల్ల మూతపడ్డ ఒక్కో రంగానికి విముక్తి కల్పిస్తూ వస్తోంది. కానీ థియేటర్లు తెరవడానికి మాత్రం వెనకడుగు వేస్తోంది. థియేటర్లను తెరిపించి తమ బతుకులను చీకటి నుంచి విముక్తి కల్పించండి అని కోరుతూ వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోవైపు దీన్ని మాత్రమే నమ్ముకున్న చాలామంది బతుకులు రోడ్డున పడ్డాయి. అటు సినిమాలు షూట్ చేయడం పూర్తైన వాళ్లు మాత్రం వచ్చిన రేటుకు ఓటీటీలో రిలీజ్ చేసుకుంటున్నారు. రేపు పొద్దున కూడా ఇదే అలవాటైతే తమ పరిస్థితేంటని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఉపాధి లేకుండా ప్రభుత్వ అంగీకారం కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలని అసహనానికి లోనవుతున్నారు. (చదవండి: తాళాలు తెరవాలి.. ఉద్యోగాలు కాపాడాలి) ఈ క్రమంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా థియేటర్లను తెరిచేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం నాడు 'అన్‌లాక్ సినిమాస్ – సేవ్ జాబ్స్’ అంటూ వినతిపత్రాన్ని అందించింది. దీనిపై ఇప్పటివరకు కేంద్రం స్పందించనేలేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం దేశవ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి థియేటర్లు తెరుచుకోనున్నాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిబంధనలను కూడా సిద్ధం చేసిందని పుకార్లు లేపుతున్నారు అయితే ఈ వార్త అవాస్తవమని ప్రభుత్వ రంగ సంస్థ పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇంతవరకు అలాంటి ప్రకటన చేయనేలేదని తేల్చి చెప్పింది. (చదవండి: సుధా మూర్తి కూరగాయలు అమ్మారా?) వాస్తవం: అక్టోబర్ 1 నుంచి థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతివ్వలేదు. (ఈ వార్త రాసే సమయానికి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు) -
8న సినీ ప్రముఖులతో కేంద్రం భేటీ
న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసి ఆన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని రంగాలు మెల్లమెల్లగా పునఃప్రారంభం అవుతున్నాయి. జిమ్ములు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు ఇప్పటికే తెరుచుకోగా మెట్రో సర్వీసులు మరి కొన్నిరోజుల్లో మొదలు కానున్నాయి. అయితే కేవలం విద్యా సంస్థలు, పార్కులు, సినిమా థియేటర్లు మాత్రమే ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం అన్‌లాక్ 4.0లో భాగంగా దేశంలో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. (సినిమాను కాపాడండి) ఈ క్రమంలో సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్‌ల ప్రారంభంపై ఈ నెల 8న సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులతో కేంద్ర హోం శాఖ అధికారులు భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో థియేటర్లు తెరుచుకునే తేదీ, పాటించాల్సిన నిబంధనలపై చర్చించనుంది. ఈ సమావేశం అనంతరం థియేటర్లు తెరుచుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టనుందనేది ఆసక్తిగా మారింది. (రాజ్‌నాథ్‌తో భేటీకి చైనా తీవ్ర ప్రయత్నం) కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా సుమారు ఐదు నెలలకు పైగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. దీని వల్ల విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్నో తెలుగు సినిమాలు వాయిద పడ్డాయి. చిన్న చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలైపోతున్నాయి. అయితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన స్టార్ హీరోల సినిమాలను ఓటీటీ విడుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. -
సినిమాను కాపాడండి
‘‘సినిమాను కాపాడండి’’ అంటున్నారు థియేటర్స్ యాజమాన్యాలు. ‘సేవ్ సినిమా’ (సినిమాను కాపాడండి), సపోర్ట్ మూవీ థియేటర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీటర్లో ట్రెండ్ ఆరంభించారు. ఈ విషయం గురించి ‘మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ పలు ట్వీట్స్‌లో ఇలా పేర్కొంది. ‘‘మన దేశ సంప్రదాయాల్లో సినిమా థియేటర్స్‌లో సినిమాకు వెళ్లడం ఓ పద్ధతి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సినిమా థియేటర్స్ చాలా కీలకం. ఎన్నో వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. చాలా దేశాల్లో సినిమా థియేటర్స్ తెరవడానికి ఆయా ప్రభుత్వాలు అనుమతించాయి. భారత ప్రభుత్వం కూడా మా విన్నపాన్ని మన్నించాలని, సినిమా హాళ్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సినిమా చూడటానికి ప్రేక్షకులు వచ్చేలా చేసే బాధ్యత మాది. పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉంటాం. విమానయానాలు, మెట్రో ట్రైన్స్, రెస్టారెంట్స్ ఓపెన్ చేసేందుకు అనుమతించినట్లుగానే సినిమా హాళ్లకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం’’ అని పేర్కొంది. ఈ విషయంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మరికొంతమంది సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. -
అన్‌లాక్ 3.0 : సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతి?
సాక్షి, న్యూఢిల్లీ : అన్‌లాక్ 2.0లో భాగంగా అమలవుతున్న కోవిడ్-19 నియంత్రణలు జులై 31న ముగియనుండటంతో అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. ఆగస్ట్ నుంచి అమలవనున్న అన్‌లాక్ 3.0లో లాక్‌డౌన్‌కు మరిన్ని సడలింపులు ప్రకటిస్తారని భావిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీలు సహా విద్యాసంస్ధలు, మెట్రో సర్వీసులను తెరిచేందుకు ఇప్పట్లో అనుమతి లభించకున్నా ఆగస్ట్ 1 నుంచి సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతించే అవకాశం ఉందని భావిస్తున్నారు. భౌతిక దూరం వంటి కఠిన నిబంధనలతో కూడిన నిర్ధిష్ట మార్గదర్శకాలతో సినిమా హాళ్లను తిరిగి తెరిచేందుకు వెసులుబాటు కల్పిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సినిమా థియేటర్లను అనుమతించే ప్రతిపాదనను సమాచార, ప్రసార శాఖ హోంమంత్రిత్వ శాఖ ముందుంచింది. ఈ ప్రతిపాదనకు ముందు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ థియేటర్ యజమానులను సంప్రదించగా 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లను అనుమతించాలని కోరారు. అయితే ముందుగా 25 శాతం సీటింగ్ సామర్థ్యంతో, భౌతిక దూరం వంటి నిబంధనలను పాటిస్తూ థియేటర్లను తెరవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. కోవిడ్-19 కేసుల తీవ్రతకు అనుగుణంగా రాష్ట్రాలు సొంతంగా మార్గదర్శకాలను జారీచేయవచ్చని కేంద్రం తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా స్కూళ్లు, మెట్రో రైలు సర్వీసుల మూసివేత వంటి కొన్ని నియంత్రణలు అన్‌లాక్ 3లోనూ కొనసాగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పాఠశాలల పునఃప్రారంభంపై పాఠశాల విద్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రాలతో మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ) ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించింది. ఈ అంశంపై తల్లితండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించామని పాఠశాలలను తెరవడంపై వారు సానుకూలంగా లేరని హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. చదవండి : నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు -
సినిమాను థియేటర్లో చూడటం..
‘‘లాక్డౌన్ సమయంలో దాదాపు అన్ని వ్యాపారాలు మూతబడ్డాయి. ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియ మొదలయింది. ఆగస్ట్ చివరి వారంలో థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన ప్రారంభం అవుతుందనుకుంటున్నాం’’ అని ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ల (పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ వంటి సంస్థలు) సీఈవోలు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే థియేటర్స్ ప్రారంభం అయితే ఎలా నడిపించాలనుకుంటున్నారో వంటì అంశాలను పొందుపరిచి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు, ప్రధానమంత్రి ఆఫీస్‌కి లేఖ రాశారు. అందులోని సారాంశం ఈ విధంగా. ► థియేటర్స్‌కి వచ్చేవాళ్లకు మాస్క్ తప్పనిసరి చేస్తాం. లోపలికి వచ్చే ముందు తప్పకుండా ఉష్ణోగ్రత చూసే లోపలికి అనుమతించడం జరుగుతుంది. ► ఇక నుంచి మొత్తం డిజిటల్ విధానంలో పనులు జరిగేలా చూస్తాం. పేపర్ టికెటింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాం. ఎస్ఎంఎస్, బార్కోడ్ స్కానింగ్ పద్ధతిని పాటిస్తాం. ► ఒక సీట్‌కి మరో సీట్‌కి మధ్య గ్యాప్ ఉండేలా జాగ్రత్తపడతాం. ► మల్టీప్లెక్స్‌లో ఏ రెండు షోలు ఒకేసారి ప్రారంభం కాకుండా చూసుకుంటాం. దానివల్ల అన్ని స్క్రీన్స్‌లో ఇంటర్వెల్ ఒకేసారి కాకుండా వేరే వేరే టైమ్‌లో ఉంటుంది. ఇలా అయితే రద్దీ ఏర్పడే అవకాశం తక్కువ. ► ప్రతీ షోకి మధ్యలో కనీసం 15 నిమిషాల నుంచి అర్ధగంట విరామం ఉంటుంది. ఈ సమయంలో మొత్తం సీటింగ్ శానిటైజ్ చేయడానికి వీలవుతుంది. ► మల్టీప్లెక్స్‌లో వీలైనన్ని శానిటైజర్లు ఏర్పాటు చేస్తాం. ఇటువంటి విషయాలను ఇందులో ప్రస్తావించారు. ‘‘సినిమా చూడటానికి వచ్చే ప్రతీ ప్రేక్షకుడి భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ప్రేక్షకులకు నమ్మకం కలిగించే వాతావరణం సృష్టించాలనుకుంటున్నాం. అలాగే ఒక్క పెద్ద సినిమా వస్తే మళ్లీ ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని సినిమాలు థియేటర్స్‌కి రాకుండానే ఓటీటీలకు వెళ్లిపోయాయి. అదో కొత్త పరిణామం. ప్రస్తుతం అందరం కష్ట సమయంలో ఉన్నాం. సినిమా థియేటర్ల వ్యాపారం ఏడాదికి పన్నెండు వేల కోట్లు ఉంటుంది. ప్రస్తుతం థియేటర్స్ మూతబడటంతో నెలకు సుమారు వెయ్యి కోట్ల నష్టం ఏర్పడుతోంది. కానీ మళ్లీ అంతా సాధారణ స్థితికి వస్తుంది. ఎందుకంటే సినిమాను థియేటర్లో చూడటం అనేది మన డీఎన్ఏలోనే ఉంది. అదో సామూహిక అనుభవం’’ అని పేర్కొన్నారు ఆయా సంస్థల ప్రతినిధులు. -
కదలని చిత్రం- బతుకు ఛిద్రం
సినిమా..! ఇది ఒక కలల ప్రపంచం. రంగుల చిత్రం. చిన్నా పెద్దా, పేద ధనిక... సినిమా అంటే సంతోషం. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం ఓ ఆనందం. కానీ, దేశంలో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి చాలా రోజులైంది కదా! కరోనా మహమ్మారి వల్ల థియేటర్ల మాటే లేదు. సినిమాకు వెళ్లాలన్న ఊసే రావడం లేదు. దేశ చరిత్రలోనే ఇలాంటి సందర్భం ఎప్పుడూ లేదు. కరోనా మహమ్మారి దెబ్బకు గడిచిన వంద రోజులుగా థియేటర్లు బోసిపోయాయి. టాకీసు జీవితాలు అతలాకుతలమయ్యాయి. సినిమా రంగంపై ఆధారపడిన అన్ని బతుకులు చిధ్రమయ్యాయి (సాక్షి, వెబ్ ప్రత్యేకం) : సినిమాలు, టీవీ సీరియళ్లతో పాటు వినోద కార్యక్రమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా నిలిచిపోయిన షూటింగుల కారణంగా మొత్తం సినీ రంగ పరిశ్రమ అతలాకుతలమైంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు వంటి అగ్రశ్రేణిలో ఉన్న వారికి మినహా ఈ పరిశ్రమపైన ఆధారపడిన లక్షలాది మంది భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. పరిశ్రమలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి మరీ ముఖ్యంగా కింది స్థాయిలో పనిచేసే వారు, వారి కుటుంబాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ మహమ్మారి గండం ఎప్పుడు గట్టెక్కుతుందా? బతుకులు మళ్లీ ఎప్పుడు దారిన పడుతాయో అర్థంకానీ అంతుచిక్కని అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. (లాక్డౌన్ విధిస్తే ఏం చేయాలి?) శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ అభిమానులు థియేటర్ల ముందు వాలిపోయేవారు. అభిమానుల సందడితో అన్ని థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొనేది. కొత్త సినిమాలతో మల్టీప్లెక్స్‌లు, థియేటర్లు కళకళలాడేవి. కరోనా లాక్‌డౌన్‌తో సీన్ రివర్సయింది. సినిమాల ప్రదర్శనలు నిలిపివేయడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. గత మార్చి నెల 22 వ తేదీన దేశవ్యాప్తంగా జనతా కర్ప్యూ, ఆ మరుసటి రోజు నుంచి లాక్డౌన్ విధించడంతో థియేటర్లు మూతపడ్డాయి. అలా దేశవ్యాప్తంగా వేలాది సినిమా హాళ్లు మూతపడి నేటికి సరిగ్గా వంద రోజులైంది. ఆ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో గందరగోళ పరిస్థితి. ఒక్కో థియేటర్ ఎన్నో కుటుంబాల ఉపాధి ఒక్కో థియేటర్లో టెక్నికల్ స్టాఫ్, లైట్‌మెన్, వాచ్మెన్లు, టికెట్ బుకింగ్ సిబ్బంది, రిప్రజెంటేటివ్స్ అంటూ 20 మందికి పైగా జీవనోపాధి పొందుతుంటారు. మల్టిప్లెక్స్‌ల్లో ఈ సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. ఇక థియేటర్లకు అనుబంధంగా నడిచే టీ స్టాళ్లు, కూల్‌డ్రింక్స్ సమోసాలు, ఐస్ క్రీం పార్లర్లు, రెస్టారెంట్లు, షాపింగ్ సెంటర్ల వంటి అనేక స్టాల్స్ తదితర వాటిల్లో పనిచేసే వారు కూడా థియేటర్లు మూతపడటంతో పరోక్షంగా ఉపాధి కోల్పోతున్నారు. ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిశ్రమపైన ఆధారపడిన లక్షలాది మంది ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. (గ్రేటర్లో కరోనా.. హైరానా) తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉండగా, మిగతా రాష్ట్రాలతో పోల్చితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిశ్రమపైన ఆధారపడుతున్న వారి సంఖ్య ఎక్కువే. దేశంలోనే అత్యధికంగా థియేటర్లు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఆ తర్వాత క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ సినిమా హాళ్లు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో 1750కి పైగా థియేటర్లు, 20కిపైగా మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. కరోనా లాక్డౌన్ కారణంగా ఇవన్నీ మూతపడటంతో వీటిలో పనిచేసే దాదాపు 40 వేల మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయారు. థియేటర్లు పనిచేస్తే వాటికి అనుబంధ వ్యాపారాలపై ఆధారపడిన వారు ఇంతకు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా థియేటర్లు ఆంధ్రప్రదేశ్‌లో 1200కు పైగా థియేటర్లు ఉన్నాయి. తూర్పుగోదావరి (144), కృష్ణా (141), గుంటూరు (129), పశ్చిమ గోదావరి (115) జిల్లాల్లో అత్యధిక థియేటర్లు ఉన్నాయి. విశాఖపట్నంలో 86, విజయనగరంలో 47, శ్రీకాకుళంలో 57, ప్రకాశంలో 73, నెల్లూరులో 62, చిత్తూరులో 106, కర్నూలు 103లో, వైఎస్సార్ కడపలో 80, అనంతపురంలో 77 థియేటర్లు ఉన్నాయి. ఇక తెలంగాణలో మొత్తం 520కు పైగా థియేటర్లు ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 122 థియేటర్లు ఉన్నాయి. జిల్లాల వారీగా థియేటర్లు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 68, వరంగల్‌లో 62, నల్గొండలో 54, కరీంనగర్లో 48, మెదక్‌లో 41, మెదక్‌లో 41, ఆదిలాబాద్‌లో 25, రంగారెడ్డిలో 20 థియేటర్లు ఉన్నాయి. ఇక రెండు రాష్ట్రాల్లోనూ 20కి పైగా మల్టిప్లెక్స్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా థియేటర్ల కష్టాలు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రికార్డుల ప్రకారం దేశవ్యాప్తంగా పది వేలకు పైగా సినిమా థియేటర్లు ఉన్నాయి. మల్టిప్లెక్స్‌లు అదనం. వీటిపై ఆధారపడి దాదాపు రెండు లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. అయితే వంద రోజులుగా థియేటర్లు మూతపడిన కారణంగా వారందరికి ఉపాధి కరువైంది. పేద సినీ కార్మికులకు బాలీవుడ్ సెలబ్రెటీల సాయం చేసే జాబితాలో వీరికి స్థానం ఉండదు. థియేటర్ యాజమాన్యాలు, పంపిణీదారులు ఆదుకునే పరిస్థితి నెలకొంది. అయితే సినిమాలు లేక వారి పరిస్థితే దయనీయంగా మారడంతో ఇంకొకరికి సాయం చేసే పరిస్థితిలో లేరు. (శ్యామ్ కే నాయుడు కేసులో కొత్త ట్విస్ట్) థియేటర్లు బంద్ - ప్రభుత్వాలకు భారీ నష్టం థియేటర్లు మూతపడటంతో వాటిలో పనిచేస్తున్న వారే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీగా నష్టపోతున్నాయి. వినోదపు పన్నును రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలోనే ఉన్నాయి. టికెట్ల అమ్మకాలపైనే పన్ను విధిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని సినిమా హాళ్లలో కలిపి 40 లక్షల సీట్లు ఉన్నాయి. ఇందులో సగానికి సగం మేరకే ఆక్యుపెన్సీ ఉంటుందని అంచనాతో గణాంకాలను పరిగణలోకి తీసుకున్నా ప్రతి షోకి దేశంలో 20 లక్షల మంది సినిమాలు చూస్తారు. ఆ లెక్కన ప్రతిరోజూ నాలుగు షోలు (మార్నింగ్, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో) నడుస్తాయి. ఈ రకంగా చూస్తే రోజూ 80 లక్షల మంది సినిమాలు వీక్షిస్తున్నట్టు లెక్క. అయితే, ఇవి ఉజ్జాయింపు లెక్కలే. ఈ లెక్కలను చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు భారీగానే ఆదాయం కోల్పోయాయి. తక్కువ బడ్జెట్ మూవీకి ఒక స్లాబు మిగతా సినిమాలకు మరో స్లాబులో వినోదపు పన్ను ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో 8 నుంచి 30 శాతం వరకు వినోదపు పన్ను ఉంది. (నేటి నుంచి కరోనా పరీక్షలు)