Theatre and OTT Movie Releases in this Week - Here's the List - Sakshi
Sakshi News home page

ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!

Published Mon, Dec 5 2022 3:39 PM | Last Updated on Mon, Dec 5 2022 4:27 PM

Theatres and Ott Movie Releases In This Week  - Sakshi

ఈ ఏడాది చివరి మాసంలో సినీ ప్రియులకు కావాల్సినంత వినోదం పంచనుంది. ఈ వారంలోనే ఏకంగా 15కు పైగా చిత్రాలు డిసెంబరు 9న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందాలు ప్రకటించాయి. మరి విడుదలకు సిద్ధమైన ఆ సినిమాల జాబితాపై ఓ లుక్కేద్దాం పదండి. 

పంచతంత్రం:  బ్ర‌హ్మానందం, కలర్స్ స్వాతి, స‌ముద్ర‌ఖ‌ని, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ విజ‌య్, నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్‌పై అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. 

(ఇది చదవండి: వీఆర్‌ఎల్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ శంకేశ్వర్‌ బయోపిక్‌గా ‘ ‘విజయానంద్‌’)

గుర్తుందా శీతాకాలం: యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా,  కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియద‌ర్శి, సుహ‌సిని త‌దిత‌రులు న‌టించిన  సినిమా 'గుర్తుందా శీతాకాలం'.  క‌న్నడలో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకు నాగశేఖర్‌ దర్శకత్వం వహించారు. వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్,  మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా  నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ముఖచిత్రం: విశ్వక్‌సేన్‌, ఆయేష్‌ఖాన్‌, ప్రియ వడ్లమాని, చైతన్యరావు, వికాస్‌ వశిష్ట, రవిశంకర్‌ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ముఖచిత్రం'. ఈ చిత్రానికి గంగాధర్‌ దర్శకత్వం వహించగా.. కాలభైరవ సంగీతమందించారు. ఈనెల 9న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. 

ప్రేమదేశం:  త్రిగుణ్, మేఘా ఆకాష్‌ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమదేశం’. శ్రీకాంత్‌ సిద్ధమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. శిరీష సిద్ధమ్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 9న రిలీజ్‌ కానుంది. ఈ   చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు. ఈనెల 9న థియేటర్లలో సందడి  చేయనుంది ఈ చిత్రం. 
 
చెప్పాలని ఉంది: సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఆర్‌బీ చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉపశీర్షిక. యష్‌ పూరి, స్టెఫీ పటేల్‌ జంటగా అరుణ్‌ భారతి దర్శకత్వంలో తెరకెక్కింది. వాకాడ అంజన్‌ కుమార్, యాగేష్‌ కువర్‌ నిర్మింన ఈ సినిమా డిసెంబర్‌ 9న విడుదలవుతోంది.

(ఇది చదవండి: అభిమాని కాళ్లు పట్టుకున్న స్టార్‌ హీరో.. ఫోటో వైరల్‌)

లెహరాయి: రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్‌ఎల్‌ఎస్‌ మూవీస్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధర్మపురి ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. రామకృష్ణ పరమహంస ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి  విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఈనెల 9న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 

నమస్తే సేట్‌ జీ’:  తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తూ,హీరోగా నటించిన చిత్రం ‘నమస్తే సేట్‌ జీ’. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్వప్న చౌదరి, మోన, రేఖ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ "యూ" సర్టిఫికెట్‌ని అందుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 9న ప్రేక్షకులను పలకరించనుంది.

రాజయోగం: సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రాజయోగం'. నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. రామ్ గణపతి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. 

డేంజరస్‌: అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో కంపెనీ పతాకంపై రామ్‌గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డేంజరస్‌’. ‘మా ఇష్టం’ అనేది క్యాప్షన్‌. ఈ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది. 

విజయానంద్‌: దేశంలోనే అతి పెద్ద లాజిస్టిక్‌ కంపెనీల్లో ఒకటైన వీఆర్‌ఎల్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ శంకేశ్వర్‌ బయోపిక్‌ చిత్రం ‘విజయానంద్‌’. విజయ్‌ శంకేశ్వర్‌ పాత్రలో నిహాల్‌ నటించిన ఈ చిత్రానికి రిషికా శర్మ దర్శకత్వం వహించారు. ఆనంద్‌ శంకేశ్వర్‌ నిర్మించిన ఈ పాన్‌ ఇండియా మూవీని డిసెంబర్‌ 9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

అమెజాన్‌ ప్రైమ్‌

  •  బ్లాక్‌ ఆడమ్‌ (హాలీవుడ్‌ మూవీ) డిసెంబరు 10

జీ5

  •  మాచర్ల నియోజకవర్గం (తెలుగు) డిసెంబరు 9
  •  బ్లర్‌ (హిందీ) డిసెంబరు 9
  •  మాన్‌సూన్‌ రాగా (కన్నడ) డిసెంబరు 9

సోనీలివ్‌

  • లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ (తెలుగు) డిసెంబరు 9
  •  రాయ్‌ (మలయాళం) డిసెంబరు 9
  • ఫాదూ (హిందీ సిరీస్‌) డిసెంబరు 9
  • విట్నెస్‌ (తమిళ్‌ చిత్రం) డిసెంబరు 09

నెట్‌ఫ్లిక్స్‌

  •  నజర్‌ అందాజ్‌ (హిందీ) డిసెంబరు 4
  • సెబాస్టియన్‌ మానిస్కాల్కో: ఈజ్‌ ఇట్‌మి (హాలీవుడ్‌) డిసెంబరు 06
  •  ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ (తమిళ్‌) డిసెంబరు 08
  • క్యాట్‌ (హిందీ సిరీస్‌)డిసెంబరు 09
  •  మనీ హైస్ట్‌: కొరియా జాయింట్‌ ఎకనామిక్‌ ఏరియా (వెబ్‌సిరీస్‌2)డిసెంబరు 09
  •  ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 09

ఆహా

  • ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 09

డిస్నీ+హాట్‌స్టార్‌

  •  మూవింగ్‌ విత్‌ మలైకా (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 05
  • కనెక్ట్‌(కొరియన్‌ సిరీస్‌) డిసెంబరు 07
  •  ఫాల్‌ (తమిళ్‌) డిసెంబరు 09

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement