
సినిమా థియేటర్ల ఓనర్లకు కేంద్రం తీపికబురు అందించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకోవచ్చని పచ్చజెండా ఊపింది. అయితే కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నొక్కి చెప్పింది. ఈ మేరకు ఆదివారం నాడు మార్గదర్శకాలను విడుదల చేసింది. థియేటర్లలో భౌతిక దూరం, మాస్కులు ధరించడం, థర్మల్ స్క్రీనింగ్ వంటివి తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. షో ముగిసిన ప్రతిసారి శానిటైజ్ చేయాలని తెలిపింది. (చదవండి: సినీ లవర్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్)
కాంట్రాక్ట్ ట్రేసింగ్ కోసం ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వారి ఫోన్ నెంబర్లను కూడా తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. రేపటి(ఫిబ్రవరి 1) నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కేంద్రం తాజా నిర్ణయంతో సుమారు ఏడు నెలలుగా మూతపడిన సినిమాహాళ్ల ఓనర్లకు ఉపశమనం లభించినట్లైంది. కాగా గతేడాది అక్టోబర్‌లో 50 శాతం ప్రేక్షకులతో థియేటర్లు నడిపించుకోవచ్చన్న కేంద్రం తాజాగా దాన్ని 100 శాతానికి పెంచడంతో సినీరంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి త్వరలోనే థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డు కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. (చదవండి: 30 రోజుల్లో..ఫస్ట్‌డే కలెక్షన్లు.. ప్రదీప్ ఎమోషనల్ ట్వీట్)
Good news for Cinema lovers:
— Prakash Javadekar (@PrakashJavdekar) January 31, 2021
Today, Issued the revised SOP for the film exhibition, 100% occupancy will be allowed in theatres from 1st February, but all @MoHFW_INDIA #COVID19 guidelines will have to be followed.https://t.co/5vfZtAoHXW@MIB_India pic.twitter.com/89qZpSiMhq
Comments
Please login to add a commentAdd a comment