
చెన్నై: ఇప్పటికే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్‌ఈపీ)పై ఫైరవుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా అడ్వకేట్ బిల్లుపై కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం తీసుకువస్తున్న అడ్వకేట్ బిల్లు న్యాయవాద వృత్తిపై దాడి అని అన్నారు. ఈ మేరకు స్టాలిన్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు,పుదుచ్చేరిని బార్ కౌన్సిల్ ఆఫ్ మద్రాస్‌గా కేంద్రం మార్చాలనుకుంటోంది.
తమిళనాడు అనేది కేవలం పేరు కాదు. మా గుర్తింపు. తమిళులపై బీజేపీ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఎన్‌జేఏసీని తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమైంది.
ఇప్పుడు మళ్లీ అడ్వకేట్ బిల్లు ద్వారా బార్ కౌన్సిళ్లపై పెత్తనం చెలాయించాలనుకుంటోంది. అడ్వకేట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి’అని స్టాలిన్ డిమాండ్ చేశారు. కాగా, బిల్లుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసకుంది. ముసాయిదాలో సవరణలు చేయనున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment