advocate
-
Formula E Car Race: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట
-
Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం
ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి తరపు న్యాయవాది రమణ్ రాయ్‌పై దాడి జరిగిందని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్(ఇస్కాన్) తెలిపింది.ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ ట్విట్టర్లో ఒక పోస్ట్‌లో ‘దయచేసి అడ్వకేట్ రమణ్ రాయ్ కోసం ప్రార్థించండి. అతను చేసిన ఒకేఒక తప్పు చిన్మయ్ కృష్ణ ప్రభు కోసం కోర్టులో వాదించడం. ఇస్లాంవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారు, ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు’ అని రాశారు.Please pray for Advocate Ramen Roy. His only 'fault' was defending Chinmoy Krishna Prabhu in court.Islamists ransacked his home and brutally attacked him, leaving him in the ICU, fighting for his life.#SaveBangladeshiHindus #FreeChinmoyKrishnaPrabhu pic.twitter.com/uudpC10bpN— Radharamn Das राधारमण दास (@RadharamnDas) December 2, 2024బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు న్యాయవాదులు ఈ ఘటనలను ఖండించారు. కాగా చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాది హత్యకు గురయ్యాడంటూ గత నెలలో సోషల్ మీడియాతోపాటు కొన్ని వార్తా కథనాలలో కనిపించింది. అయితే ఈ ప్రస్తావనలో వచ్చిన లాయర్ పేరు సైఫుల్ ఇస్లాం అని విచారణలో తేలింది. ఆయన ప్రభుత్వం తరపు న్యాయవాది అని, అతను చిన్మోయ్ దాస్ కేసులో పోరాడలేదని సమాచారం.బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి ఇటీవల రంగ్‌పూర్‌లో హిందువులకు మద్దతుగా జరిగిన నిరసనలకు నాయకత్వం వహించారు. ఆ తరువాత గత నెలలో ఢాకాలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతనిపై దేశద్రోహం అభియోగం మోపారు. ఈ నేపధ్యంలో ఢాకా కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుండి, మైనారిటీలపై హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. అలాగే వీటిని నిరసిస్తూ పలు ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లో చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు ఇద్దరు అదృశ్యమయ్యారని రాధారమణ్ దాస్ గతంలో ఒక పోస్టులో తెలిపారు. కాగా బంగ్లాదేశ్‌లో హిందువుల అరెస్టులను భారత్ ఖండించింది. హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.ఇది కూడా చదవండి: దూసుకొచ్చిన మృత్యువు -
HYD: ఐమాక్స్ వద్ద న్యాయవాదిపై దాడి.. ఇద్దరు మైనర్ల అరెస్టు
సాక్షి,హైదరాబాద్: ఐమాక్స్ వద్ద అడ్వకేట్ కల్యాణ్‌పై ఇద్దరు దాడి చేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులిద్దరూ మైనర్లని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో బుధవారం(నవంబర్ 13) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబిడ్స్,సైఫాబాద్ ఏసీపీలు చంద్రశేఖర్, సంజయ్ కేసు వివరాలు వెల్లడించారు.మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని గన్‌ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌ను కత్తితో బెదిరించిన ఇద్దరు మైనర్లు మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి ఐమాక్స్ వద్దకు వెళ్లారు. 5 గంటల సమయంలో అక్కడ వాకింగ్ చేస్తున్న న్యాయవాది కల్యాణ్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్‌ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. కల్యాణ్ వారిని అడ్డుకోవడంతో కత్తితో బెదిరించారు.ఈ క్రమంలో మైనర్ల చేతిలో కల్యాణ్ గాయపడ్డారు.సెంట్రల్ జోన్ పరిధిలో ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు ఇదే తరహా కేసులు నమోదు కావడంతో డీసీపీ యాదవ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాంనగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.అతని వద్ద ఉన్న వాచ్మెన్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు తొలుత స్వాధీనం చేసుకున్నాం.నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా చాంద్రాయణగుట్ట బండ్లగూడ వద్ద మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నాం. అతని వద్ద న్యాయవాది కల్యాణ్ స్మార్ట్ ఫోన్, దాడికి ఉపయోగించిన కత్తి, వారు వాడిన హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. వారి ఆధార్ కార్డుల ప్రకారం మైనర్లుగా తేలిందని..అయితే, వారి వయసును నిర్ధరించేందుకు ఉస్మానియా ఆస్పత్రిలో టెస్టుల కోసం పంపించాం. గతంలో వారిపై ఇదే తరహాలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ స్నాచింగ్ కేసు నమోదైంది’ అని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు షాక్ -
పోలిసులపై పవన్ ఒత్తిడి.. అందుకే అక్రమ అరెస్టులు
-
న్యాయ సలహా : మిమ్మల్ని వెళ్లగొట్టే హక్కు వారికి లేదు!
నా వయసు 45 సంవత్సరాలు. మా పెళ్లి జరిగి పాతికేళ్లకు పైగా అయింది. పెళ్లయిన నాటినుంచి నాకు భర్త నుంచి ఆదరణ లేదు సరికదా, చీటికిమాటికీ నాపై చెయ్యి చేసుకోవడం, అత్తమామలు, ఆడబిడ్డల నుంచి ఆరళ్లు... పిల్లలు పుట్టి, పెద్దవాళ్లయినా నాకీ మానసిక, శారీరక బాధలు తప్పడం లేదు. అదేమంటే నన్ను ఇంటిలోనుంచి వెళ్లగొడతానని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. – కె. సుజాత, శంషాబాద్పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళ్ళి, గృహిణిగా వుండే స్త్రీలే మన సమాజంలో ఎక్కువ. అలా గృహిణిగా వుంటున్న స్త్రీలని ఏదో వారికి సేవ చేయటానికి మాత్రమే కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేశారు అనే పురుషాహంకార భావజాలాలు కల్గిన భర్తలు, అత్త–మామలూ కూడా ఎక్కువే! ఉద్యోగం వదిలేసి, తనకంటూ స్వంత ఆదాయం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశాక ‘‘నేను వదిలేస్తే నీకు జీవితం లేదు.. వుండటానికి నీడ కూడా దొరకదు.. నీకు విడాకులు ఇస్తాను, రోడ్డున పడతావ్’’ అంటూ బెదిరిస్తూ మహిళలపై అజమాయిషి చలాయించేవారిని తరచు చూస్తుంటాం. ముందూ వెనుకా ఎవరి సహాయం లేకుండా, పెద్దగా చదువుకోకుండా, ఉద్యోగంలో చాలా గ్యాప్ వచ్చి లేదా పుట్టినింటినుంచి పెద్దగా ఆదరణ లేదు అని అనుకున్న స్త్రీలైతే భర్త వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటి అని భయపడుతూ, వారికి ఎదురయ్యే గృహహింసను కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు.నిజానికి అలా భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మహిళలకు ఎంతో బాగా ఉపయోగపడే, రక్షణ కల్గించే చట్టమే ‘గృహ హింస చట్టం, 2005’. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం, భర్త (లేదా అత్త–మామలు) నివసిస్తున్న ఇంట్లోనే, విడాకుల కేసు లేదా మరేయితర కేసులు నడుస్తున్నప్పటికీ గృహహింసకు గురైన మహిళకు కూడా సమానంగా నివసించే హక్కు వుంటుంది. కొన్ని సందర్భాలలో ఐతే భార్య/ గృహ హింసకి గురవుతున్న స్త్రీ రక్షణ కొరకు భర్తను ఇంట్లోనుంచి వెళ్లిపోవాలి అని కూడా కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. భర్త పేరిట ఇల్లు ఉన్నా గాని, అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ చట్టం. అలా కుదరని పక్షంలో భర్త నివసించే ఇంటికి సమానమైన ప్రత్యామ్నాయ వసతిని కల్పించవలసి ఉంటుంది. అంతేకాక, మరలా గృహహింసకు పాల్పడే వీలు లేకుండా భర్త – తన కుటుంబ సభ్యులపై కూడా ఇంజక్షన్ ఇస్తూ కోర్టు ‘ ప్రొటెక్షన్ ఆర్డరు / రక్షణ ఉత్తర్వులు ’’ ఇవ్వవచ్చు. కాబట్టి, భర్త వదిలేస్తే ఇక తనకి జీవితం వుండదు అనుకునే ధోరణి అవసరం లేదు. గృహ హింసని భరించాల్సి అవసరం అంతకంటే లేదు. గృహహింస చట్టం, 2005 అనేది ఒక ప్రత్యేక చట్టం. ఇందుకుగాను మీరు నేరుగా మెజిస్ట్రేట్ ను గానీ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖను గానీ సంప్రదించ వచ్చు. ఐపీసీ 498అ (కొత్త చట్టం – సెక్షన్ 85 బీ.ఎన్.ఎస్) కు, గృహ హింస చట్టానికి సంబంధం లేదు. ఆరోపణలు, గృహహింస ఒకటే అయినప్పటికీ రెండు కేసులు వేర్వేరుగా పిర్యాదు చేయాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
Video: కోర్టులో జడ్జితో గొడవ.. లాయర్లను తరిమిన పోలీసులు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కేసు విచారణ సమయంలో జడ్జికి, ఓ న్యాయవాదికి మధ్య వివాదం తలతెత్తడంతో కోర్టు రణరంగంగా మారింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. కోర్టులో గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఘజియాబాద్ జిల్లా కోర్టులో ఓ బెయిల్ పిటీషన్ విషయంలో.. జడ్జితో, లాయర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది చివరకు గొడవకు దారితీసింది. వెంటనే భారీ సంఖ్యలో లాయర్లు జడ్జీ ఛాంబర్ వద్ద గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన చేపట్టిన అడ్వకేట్లను తరిమేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కూర్చీలు పట్టుకొని మరీ లాయర్లను బయటకు తరిమేశారు. ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారామిలిటరీ దళాలు కూడా కోర్టు ఆవరణకు చేరుకున్నాయి.ఈ ఘటనలో పలువురు న్యాయవాదులకు గాయాలైనట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ వివాదంపై చర్చించేందుకు బార్ అసోసియేషన్ సమావేశానికి పిలపునిచ్చింది. తమను జడ్జి ఛాంబర్ నుంచి బయటకు గెంటేసిన తరువాత న్యాయవాదులంతా కోర్టు బయట ధర్నా చేపట్టారు. జడ్జికి, సెక్యూరిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.In #UttarPradesh's #Ghaziabad, a major disturbance erupted in the District Court following an argument between a district judge and a lawyer during a bail hearing. The altercation soon escalated, leading to a chaotic scene as large numbers of lawyers gathered and tensions… pic.twitter.com/0RsozCFHag— Hate Detector 🔍 (@HateDetectors) October 29, 2024 -
హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయవాదులు
సాక్షి, అమరావతి /సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల కొలీజియం మంగళవారం తీర్మానం చేసింది. హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్న మహేశ్వరరావు కుంచం, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన తరువాత ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం వారి పేర్లను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. మహేశ్వరరావు కుంచంకుంచం కోటేశ్వరరావు, సుశీలమ్మ దంపతులకు 1973 ఆగస్టు 12న తిరుపతిలో జన్మించారు. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి ఉద్యోగ రీత్యా మహేశ్వరరావు అనంతపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1998లో తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1998 నుంచి 2001 వరకు అనంతపురం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద ఆరు నెలల పాటు జూనియర్‌గా ప్రాక్టీస్ చేశారు. అటు తరువాత నుంచి సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరాం గ్రూప్ ఆఫ్ కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.తూట చంద్ర ధనశేఖర్తూట శైలజ, చంద్రశేఖరన్ దంపతులకు 1975 జూన్ 10న జన్మించారు. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం, తండ్రి చంద్రశేఖరన్ గతంలో చిత్తూరు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. సత్యవేడు జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో చదివారు. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయవాద విద్య పూర్తి చేశారు. ధనశేఖర్ 1999లో హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జీపీగా కొనసాగుతున్నారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.చల్లా గుణ రంజన్చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు 1976 జూలై 12న జన్మించారు. తాడిపత్రి స్వస్థలం. తండ్రి నారాయణ కూడా న్యాయవాదే. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సోదరుడి వరుస అవుతారు. గుణ రంజన్ 2001లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సోదరుడు కోదండరామ్ వద్దే జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. సుప్రీంకోర్టుతోపాటు ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో, పలు ట్రిబ్యునళ్ల ముందు అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. పర్యావరణ, విద్యుత్, ఆర్బిట్రేషన్, కంపెనీ లా, దివాళా, పన్నుల చట్టాలతో పాటు సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. సీజే నేతృత్వంలో కొలీజియం సమావేశం..ఈ ఏడాది మే 15వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని కొలీజియం మొత్తం ఆరుగురు న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. మహేశ్వరరావు, ధనశేఖర్, చల్లా గుణరంజన్, ఇడంకంటి కోటిరెడ్డి, గోడ రాజాబాబు, గేదెల తుహిన్ కుమార్ పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా వారి వివరాలు సేకరించింది. కేంద్ర న్యాయశాఖ ఇటీవల వారి పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. దీనిపై చర్చించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన కొలీజియం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. గతంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొనసాగుతున్న నలుగురి అభిప్రాయాలు కూడా అంతకు ముందే తీసుకుంది. వారందరూ కూడా న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు తగిన వారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కొలీజియం సమావేశంలో మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్ పేర్లకు ఆమోదం తెలిపింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఆ ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులుగా అన్ని రకాలుగా అర్హులని స్పష్టం చేసింది.ప్రస్తుతం ఏపీ హైకోర్టులో సీజేతో సహా 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు సిఫారసు చేసిన ముగ్గురి పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుకుంటుంది. వాస్తవానికి హైకోర్టు కొలీజియం ఆరుగురు న్యాయవాదుల పేర్లతోపాటు ముగ్గురు న్యాయాధికారుల పేర్లను కూడా హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు, శ్రీకాకుళం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా పేర్లను సిఫారసు చేసింది. అయితే ఈ ముగ్గురి విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం ఏం నిర్ణయం తీసుకున్నదీ తెలియరాలేదు. -
Supreme Court: మా విశ్వాసం చెదిరిపోతోంది
న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో జైలు శిక్ష పడిన దోషులను శిక్షాకాలం ముగియకముందే కారాగారం నుంచి బయటకు రప్పించడానికి న్యాయవాదులు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కోర్టు ముందు పదేపదే తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆక్షేపించింది. దోషులకు శిక్షాకాలం తగ్గించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్లలోనూ అసత్య సమాచారం చేరుస్తున్నారని విమర్శించింది. ఇలాంటి కేసులు ఎదురైనప్పుడు తమ విశ్వాసం చెదిరిపోతోందని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీతో కూడిన ధర్మాసనం ఈ నెల 10వ తేదీన ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును తాజాగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. ఖైదీల రెమిషన్ విషయంలో లాయర్ల తప్పుడు స్టేట్మెంట్లపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మూడు వారాలుగా ఇలాంటి కేసులను పెండింగ్‌లో పెట్టాం. పరి్మనెంట్ రెమిషన్ మంజూరు చేయడం లేదు. అయినా ఇందుకోసం భారీగా తప్పుడు పిటిషన్లు దాఖలవుతున్నాయి’’ అని ధర్మాసనం ఆగ్రహించింది. -
ఇటు న్యాయం! అటు సాయం!!
సాక్షి, సిటీబ్యూరో: నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు.. ఆయనకు చదువు విలువ తెలుసు.. చదువుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో.. ఎంత గౌరవం ఉంటుందో తెలియజేసే నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కష్టాలు స్వయంగా అనుభవించారు. అందుకే తనకు చేతనైనంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏటా విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అందిస్తూ సమాజ సేవకు నడుం బిగించారు. చేతనైనంత సాయం చేస్తే ప్రకృతి కూడా మనకు సాయపడుతుందని చెబుతారు న్యాయవాది సంగిశెట్టి బాబు. ఆయన గురించిన మరిన్ని విషయాలు..ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయ్‌పూర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో యాదమ్మ, శంకరయ్య దంపతులకు జన్మించారు సంగిశెట్టి బాబు. చిన్నప్పటి నుంచి కడుపేదరికం అనుభవించారు. అయితే తమ జీవితాలను చదువు మాత్రమే మారుస్తుందన్న మాటను తు.చ. తప్పకుండా పాటించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ సాధించారు. లా ప్రాక్టీస్ చేసుకుంటూనే పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు పడొద్దనే తలంపుతో తన వంతు సాయంగా ముందడుగు వేస్తున్నారు.ఒక్క రూపాయి లేనిస్థితి నుంచి..తన తల్లిదండ్రుల పేరుతో 2016లో యాదశంకర మెమోరియల్ ఫౌండేషన్ పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేదట. కానీ సంకల్ప బలం తోడైతే ఏదైనా సాధించవచ్చని నమ్మే బాబుకు.. విద్యా సామగ్రి పిల్లలకు అందజేసే ముందురోజు కేసులకు సంబంధించిన డబ్బులు వచ్చాయట. అందుకే తాను నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్తున్నాన్నంటారు బాబు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో..హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు చదువుకోవడమే కష్టం అవుతుందన్న విషయం గుర్తు చేసుకున్నారు. అంతే ఏటా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లోని పిల్లలకు సామగ్రి అందజేస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక ఎవరూ చదువు మధ్యలో ఆపేయొద్దనేదే తన ఉద్దేశమని బాబు అంటున్నారు. భవిష్యత్తులో పిల్లల కోసం ఎంత కష్టమైనా తాను ముందుంటానని చెబుతున్నారు. బాబు నేపథ్యం స్ఫూర్తిదాయకం అయితే.. ఆయన సేవాగుణం ఆదర్శప్రాయం అనడంలో అతిశయోక్తి లేదు.ఇవి చదవండి: సాయపు చేతులు..! -
రెండవ భార్యకు, పిల్లలకు ఆస్తి వస్తుందా?
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో, (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చనిపోయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతుంది.ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్‌కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కాని పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్ లో ఎటువంటి హక్కు ఉండదు. కానీ అన్నివేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్‌లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలి అంటూ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం.అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికి, మెయింటెనెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికి తేడా ఏమీ లేదు అని అంటూ, మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తన తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం, పెన్షన్ రూల్స్ లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్‌లో సమాన హక్కు ఉంటుంది అని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి. కొన్ని హక్కులు రెండవ భార్యకి వర్తిస్తాయా లేదా అన్నది కేసు పూర్వాపరాలను బట్టి, ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపైనా ఆధారపడి ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
దంపతులలో ఎవరి తప్పూ లేకపోయినా విడాకులు తీసుకోవచ్చా?
పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో దంపతులలో ఏ తప్పూ లేకపోయినా ‘నో ఫాల్ట్ డివోర్స్’ (అపరాధరహిత విడాకులు) పేరుతో విడాకులు ఇచ్చే చట్టం అమలులో ఉంది. అలాగే ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం)లో కూడా విడాకులు తీసుకునేందుకు చాలా దేశాలలోని చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే భారతదేశంలోని పెళ్లిళ్లను నియంత్రించే రెండు ప్రాథమిక చట్టాలైన హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954 అపరాధ రహిత విడాకులను, పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధంలో విడాకులను మంజూరు చేసేందుకు ఆ ప్రాతిపదికలను అంగీకరించవు.భార్య–భర్తల కొన్ని సంవత్సరాల పాటు విడిపోయి ఉండి, వారి వివాహ బంధం తిరిగి అతుక్కునే వీలులేనంతలా తెగిపోయి, ఇరువురు కలిసి బతికే ఆస్కారం లేకుండా పోయివున్న సందర్భాలను ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం) అంటారు. ఇలాంటి వివాహ బంధాలు కేవలం చట్టం దృష్టిలో మాత్రమే వివాహంగా మిగిలి ఉంటాయి. అలాగే ‘నాకు నా భార్యపై (లేదా భర్తపై) ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారు వ్యక్తిగతంగా మంచివారే, మా ఇద్దరి మధ్య లేనిది సఖ్యత మాత్రమే.నాకు నా భార్య (లేదా భర్త) విడాకులు ఇవ్వను అంటున్నారు. అందుకే నాకు నో ఫాల్ట్ డివోర్స్ ఇవ్వండి’ అని అడిగితే భారతదేశం లోని ఏ చట్టం ప్రకారమూ విడాకులు ఇవ్వడం కుదరదు. భాగస్వామిపై హింసకు పాల్పడడం, అకారణంగా వదిలేసి వెళ్లడం, వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నయం కాలేని అంటు వ్యాధులు కలిగి వుండటం, హేయమైన నేరారోపణ రుజువు కావటం, సంసార జీవనానికి పనికిరాకుండా ఉండడం, మతమార్పిడి చేసుకోవడం, కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ తిరిగి సంసార జీవితం ఆరంభించకపోవడం వంటివి మాత్రమే విడాకులు తీసుకోవడానికి ప్రాతిపదికగా పరిగణించబడతాయి (గ్రౌండ్స్ ఫర్ డివోర్స్). కాని 1978 లోనే, 71వ లా కమిషన్ తన సిఫార్సులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ను విడాకులు తీసుకోవడానికి ఒక ప్రాతిపదికగా/కారణంగా గుర్తించేలా చట్టంలో మార్పులు చేయాలి అని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పరిగణిస్తూ, ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చాలా కేసులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ కింద విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకవేళ ఈ ప్రాతిపదికన విడాకులు తీసుకొని ఉంటే, భారతదేశంలోని ఏ చట్టంలోనూ ఆ ప్రాతిపదిక లేదు కాబట్టి విడాకులు చెల్లవు అనడం సమంజసం కాదు – అలా విదేశాలలో పొందిన విడాకులు చట్టబద్ధమే అని కొన్ని కేసులలో తీర్పునిచ్చింది.‘‘నో ఫాల్ట్ డివోర్స్’’ – ‘‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’’ వంటి చట్టాలకు భారత దేశం పూర్తిగా సిద్ధంగా లేకపోయినప్పటికీ, వీలైనంత మేర సఖ్యత కుదిర్చేలా ప్రయత్నించి, వీలుకాని పక్షంలో సత్వరమే విడాకులు మంజూరు చేసే లాగా చట్టం మారాలి. పరస్పర ఒప్పందం/అంగీకారం ఉంటే భార్యా భర్తలు ఇద్దరూ కలిసి వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత మ్యూచువల్ డివోర్స్ పొందవచ్చు. ఇదివరకు లాగా విడాకుల దరఖాస్తు చేసిన తరువాత ఆరు నెలలు ఆగవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా?
ప్రదీప్, శాంత భార్యాభర్తలు. ఇద్దరూ 60 ఏళ్లకు పైబడిన వారే! ఇద్దరికీ బీపీ, సుగర్లున్నాయి. వాళ్లకిద్దరు పిల్లలు. మంచి జీతాలు గల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ అమ్మానాన్నలను పూర్తిగాగాలికి వదిలేయడంతో దయనీయమైన స్థితిలో రోజులను గడుపుతున్నారు ఆ దంపతులు. పిల్లల నుంచి పోషణ కోసం వీరు కోర్టును ఆశ్రయించవచ్చా?తల్లిదండ్రుల, వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 కింద తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు చాలా హక్కులే ఉన్నాయి. ముఖ్యంగా తమను తాము పోషించుకోలేని, తమ సంక్షేమాన్ని, తమ ఆరోగ్యాన్ని తాము పర్యవేక్షించుకోలేని తల్లిదండ్రులు, వయోవృద్ధులకు... తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు లేదా బంధువుల (వయోవృద్ధుల ఆస్తికి వారసులు లేదా ఆర్థికంగా గానీ, మరేరకంగా గానీ లబ్ధి పొందిన వారు)ను మెయింటెనెన్స్ అడిగే హక్కును కలిపిస్తోందీ చట్టం.ఈ చట్టం కింద వయోవృద్ధులు, తల్లిదండ్రులు నేరుగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు (స్థానిక ఆర్డీఓ). అలా ఆశ్రయించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ల పక్షాన ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటి ఏ సంస్థ అయినా పిటిషన్ దాఖలు చేయవచ్చు. నోటీసులు అందిన 90 రోజులలోగా పిటిషన్‌పై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇంటెరిమ్ మెయింటెనెన్స్‌కు కూడా ఆదేశించవచ్చు. వారసులు, పిల్లలు లేదా బంధువులు ట్రిబ్యునల్ ముందుకు రానట్లయితే... ట్రిబ్యునల్ క్రిమినల్ కోర్ట్లా కూడా వ్యవహరించవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి ఏ ఇతర చట్టాల్లో లేని వెసులుబాటు, హక్కు కేవలం ఈ చట్టంలోనే పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ కలిగి ఉన్నారు.ఏ ఇతర ప్రాపర్టీ చట్టాలకిందైనా ఒకసారి అమ్మేసిన లేదా గిఫ్ట్ గా ఇచ్చిన స్థిరాస్తిని తిరిగి తీసుకోవడం కానీ రద్దు చేయడం కానీ కుదరదు. కానీ ఈ 2007 చట్టం కింద మాత్రం ఆస్తిని తమ సంతానానికి లేదా తన బంధువులకు లేదా మరే ఇతర వ్యక్తికైనా రాసిచ్చేటప్పుడు ‘మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి.. లాంటి నిబంధనతోనే ఈ ఆస్తిని రాసిస్తున్నాను’ అంటూ ఆస్తిపత్రాలలో పొందుపరచి.. దాన్ని సదరు వారసులు ఉల్లంఘిస్తే.. తమ ఆస్తిని తాము తిరిగి తీసేసుకోవచ్చు.చాలా సందర్భాలలో ఆస్తి రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులను లేదా వృద్ధులను ఓల్డేజ్ హోమ్స్‌లో వదిలేయడం లేక సరిగ్గా పట్టించుకోకపోవడం చూస్తుంటాం. అలాంటి సందర్భాలకు ఈ చట్టం చక్కటి ఆయుధం. పైన తెలిపిన నిబంధన కలిగి ఉన్న ఆస్తి పత్రాలను మరెవరైనా కొనుగోలు చేస్తే, అలా కొనుక్కున్న వారిపైనా మెయింటెనెన్స్ విధించవచ్చు. అంతేకాదు వయోవృద్ధులను లేదా తల్లిదండ్రులను వదిలించుకుందామని వారిని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేయడం లాంటివి చేస్తే అది నేరం. వారికి జరిమానాతో ΄ాటు జైలు శిక్ష కూడా ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
న్యాయవాదులకు ఓర్పు, నేర్పు అవసరం
తాడేపల్లిరూరల్: ఆధారాలను సేకరించడంలో న్యాయవాదులు ఓర్పు, నేర్పు కలిగి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా సూచించారు. వడ్డేశ్వరంలోని కేఎల్ వర్సిటీలో ఏపీ బార్ కౌన్సిల్ ఆధ్వర్యాన మూడు రోజులుగా నిర్వహిస్తున్న న్యాయవాదుల అవగాహన సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు సదస్సుకు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత.. ఐపీసీని పోలి ఉందన్నారు. సైబర్ క్రైమ్, లింగ వివక్ష చట్టం, ఉగ్రవాద వ్యతిరేక చట్టాలలోని పలు సెక్షన్ల గురించి న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఆస్తి బదిలీ చట్టం, ఆస్తి హక్కు, నిర్దిష్ట ఉపశమన చట్టం, రిజిస్ట్రేషన్ చట్టం, మే«ధో సంపత్తి హక్కులు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, రాజ్యాంగ లక్ష్యాలను సాధించడంలో న్యాయవాది పాత్ర, డాక్యుమెంటేషన్ వంటి పలు అంశాల గురించి న్యాయవాదులకు వివరించారు. ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథ్‌రెడ్డి, కేఎల్‌యూ వీసీ డాక్టర్ జి.పార్థసారథివర్మ, ప్రో వైస్ చాన్సలర్లు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకటరామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ కె.సుబ్బారావు, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీనా? సమాజ్‌వాదీనా? రూ. 2 లక్షలకు లాయర్ల బెట్టింగ్!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ముగిసింది. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపధ్యంలో రకరకాల వార్తలు, ప్రకటనలు, ముఖ్యాంశాలు కంటబడుతుంటాయి.లోక్‌సభ ఎన్నికల వేళ బెట్టింగ్ మార్కెట్ నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై కూడా చాలామంది పందాలు కాస్తున్నారట. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో అలాంటి ఉదంతమే వెలుగుచూసింది. ఇక్కడ ఇద్దరు న్యాయవాదులు పందెంకాశారు. వీరిద్దరూ తమ అభ్యర్థుల గెలుపు, ఓటములపై రూ.2 లక్షల చొప్పున పందెం కాశారు. వీరిద్దరూ బదౌన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం.భారతీయ జనతా పార్టీ బదౌన్ లోక్‌సభ స్థానం నుండి దుర్విజయ్ సింగ్ శాక్యాను బరిలో నిలిపింది. సమాజ్‌వాదీ పార్టీ ఇక్కడి నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. వీరి జయాపజయాలపై ఈ లాయర్లు బెట్టింగ్ కట్టారు. ఉఝని పట్టణంలోని గౌతంపూర్‌కు చెందిన దివాకర్ వర్మ న్యాయవాది. అలాగే బీజేపీ మద్దతుదారు. బరమల్దేవ్ గ్రామానికి చెందిన సత్యేంద్ర పాల్ కూడా న్యాయవాదే. ఈయన సమాజ్ వాదీ పార్టీకి మద్దతుదారు. ఈ ఇద్దరు న్యాయవాదులు తమ అభ్యర్థుల గెలుపుపై రూ.రెండు లక్షల చొప్పున పందెం కాశారు.ఇందుకోసం వీరిద్దరూ స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకుని సంతకం కూడా చేశారు. ఓడిన పార్టీ మద్దతుదారు గెలిచిన పార్టీ మద్దతుదారునికి రూ.రెండు లక్షలు ఇవ్వాలని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. ఎన్నికలు ముగిసి, జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఈ లాయర్లిద్దరూ ఎదురుచూస్తున్నారు. -
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్ 10) ఆయన ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్‌గా పనిచేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇదీ చదవండి.. ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు రిమాండ్ పొడిగింపు -
హెచ్‌సీఏఏ అధ్యక్షుడిగా రవీందర్‌రెడ్డి విజయం
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ఎన్నికలను తలపించేలా సాగిన హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా అయ్యాడపు రవీందర్‌రెడ్డి విజయం సాధించారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం అయ్యాడపు రవీందర్‌రెడ్డి, మణికొండ విజయ్‌కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఏ.జగన్ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దఎత్తున న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో జగన్‌పై రవీందర్‌రెడ్డి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపాధ్యక్షురాలిగా ఏ.దీప్తి, జనరల్ సెక్రటరీలుగా ఉప్పల శాంతిభూషణ్ రావు, జిల్లెల సంజీవ్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీగా వాసిరెడ్డి నవీన్‌కుమార్, ట్రెజరర్‌గా కట్టా శ్రావ్య, స్పోర్ట్స్ అండ్ కల్చ రల్ సెక్రటరీగా ఎస్.అభిలాష్ విజయం సాధించారు. హైకోర్టుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల బార్ అసోసియేషన్లకు ఒకేసారి ఎన్నికలు జరగడం, ఫలితాలు ప్రకటించడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రవీందర్‌రెడ్డి 1987లో నాటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. గతంలో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. 2021లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా: రవీందర్‌రెడ్డి బార్ అండ్ బెంచ్ సంబంధాలు మరింత బలోపేతం చేస్తా. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా. జూనియర్ న్యాయవాదులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.. వాటి పరిష్కారానికి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. -
Aarzoo Khurana: ఆమె ఉన్న చోట పులి ఉంటుంది
మన దేశంలో దాదాపు 55 టైగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. వాటన్నింటినీ తన కెమెరాలో నిక్షిప్తం చేసింది ఆర్జూ ఖురానా. సరిగా చెప్పాలంటే పులి ఉన్న చోటల్లా ఆమె ఉంటుంది. వృత్తి రీత్యా అడ్వకేట్ అయినా ఆ పని మానేసి కెమెరాను నేస్తంగా అడవిని నివాసంగా చేసుకుని తిరుగుతూ ఆమె తీస్తున్న ఫొటోలు పెద్ద గుర్తింపునిచ్చాయి. ఆర్జూ పరిచయం. అక్టోబర్ 1, 2023 నుంచి నేటి వరకూ 29 ఏళ్ల ఆర్జూ ఖురానా అడవుల్లోనే ఉంటూ వందల మైళ్లు తిరుగుతూ ఉందంటే నమ్ముతారా? నిజం. ‘ఆల్ టైగర్ రిజర్వ్స్ ప్రాజెక్ట్’ (ఏటిఆర్) కోసం ప్రభుత్వం అప్పజెప్పిన పనిలో ఆమె తలమునకలుగా నిమగ్నమైంది. మన దేశంలో 55 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. అయితే వాటిలో కొన్నింటికే టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. మిగిలిన వాటిని కూడా అందంగా ఫొటోలలో బంధించి, ప్రచారానికి ఉపయోగించి, టూరిస్ట్‌లను ఆకర్షించేందుకు నిర్దేశించిన ప్రాజెక్టే ఏ.టి.ఆర్. దానిలో భాగంగా అక్టోబర్ 1న రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వ్‌తో మొదలెట్టి మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 43 టైగర్ రిజర్వ్‌లను కవర్ చేసి మరో రెండు నెలల్లో మిగిలినవి చేసి ఆఖరున నైనిటాల్లో ఉన్నా జిమ్ కార్బెట్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఫొటోలు తీయడం ద్వారా ఆమె పని ముగిస్తుంది. ‘రోజుకు 14 గంటలు పని చేస్తున్నాను. మానసికంగా శారీరకంగా చాలా కష్టమైనది ఈ పని. కాని ఇందులో నాకు ఆనందం ఉంది’ అంటుంది ఆర్జూ ఖురానా. లా చదివి ‘మాది ఢిల్లీ. మా నాన్నకు నేను అడ్వకేట్ కావాలని కోరిక. నాకేమో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ కావాలని చిన్నప్పటి నుంచి కల. ఒక్కతే కూతురుని. అడవుల్లో కెమెరా పట్టుకుని తిరగడానికి అమ్మా నాన్నలు ఒప్పుకోలేదు. నాన్న కోసం లా చేశాను కాని చివరకు ఒప్పించి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ని అయ్యాను. ఇందుకోసం నేను ఢిల్లీలో బేసిక్ ఫొటోగ్రఫీ కోర్సును చేశాను. కాని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ వేరు. దానికి వేరే శిక్షణ కావాలి. నెట్లో వెతికితే సుధీర్ శివరామ్ అనే ప్రసిద్ధ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ మాలాంటి వారి కోసం క్యాంప్స్ నిర్వహిస్తారని తెలిసింది. ఆయన రాజస్థాన్‌లోని భరత్పూర్ రిజర్వ్‌ఫారెస్ట్‌లో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ క్యాంప్ నిర్వహించినప్పుడు హాజరయ్యి పని కొంత తెలుసుకున్నాను. రెండు సారస్ కొంగల సరదా సంప్రదింపులను నేను మొదటిసారి ఫొటో తీశాను. అది అందరికీ నచ్చింది. ఆ క్షణమే అనుకున్నాను... అరణ్యానికి జనారణ్యానికి మధ్య వారధిగా నేను ఉండగలను అని. అడవుల్లో ఉండే పక్షులు జంతువుల తరఫున వకాల్తా పుచ్చుకోగలను అని’ అంటుంది ఆర్జూ ఖురానా. కలిసి బతకాలి ‘మనుషులు కలిసి బతకడానికి కష్టపడుతుంటారు. అడవుల్లో తిరిగితే వందల వేల జీవులు ఎలా ఒకదానితో ఒకటి కలిసి బతుకుతాయో తెలుస్తుంది. అవి మనతో కూడా కలిసి బతకాలనే అనుకుంటాయి. కాని మన స్వార్థం కోసం అడవులు ధ్వంసం చేస్తూ వాటిని నాశనం చేస్తున్నాం. గత 50 ఏళ్లలో భూమి మీద ఉన్న జంతువులలో 50 శాతం నశించిపోయాయంటే నమ్ముతారా? ఇది నిజం. మనలో ప్రతి ఒక్కరం అడవుల పరిరక్షణకు, తద్వారా వన్యప్రాణి పరిరక్షణకు పూనుకోవాలి. లేకపోతే మిగిలేదేమీ ఉండదు. ఒక పులి ఉండదు. ఒక నక్కా కనిపించదు’ అంటోంది ఆర్జూ ఖురానా. -
హైకోర్టు ఆగ్రహం.. న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే
సాక్షి, అమరావతి: ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు మండిపడింది. సమ్మె విరమించి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. సమ్మె విరమించని పక్షంలో ఆ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో న్యాయవాదుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ తాము మధ్యంతర ఉత్తర్వులిచ్చినా.. జిల్లాల్లో న్యాయవాదులు ఇప్పటికీ సమ్మె చేస్తూ ఆందోళనలు కొనసాగించడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఇకపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంగా తెలియచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని బీసీఐ, రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారిలో అనేక మంది పేదలున్నారని, ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుని బతుకుతున్నారని, సమ్మె వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. యువ న్యాయవాదులు కూడా నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వ చట్టంపై అభ్యంతరాలుంటే న్యాయ పోరాటం చేయాలే తప్ప సమ్మె పరిష్కారం కాదంది. ఇప్పటివరకు చేసింది చాలని, ఇక సమ్మె ఆపి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. అవసరమైతే ఈ దిశగా ఆదేశాలిస్తామంది. ఈ విషయంలో తమకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. సమస్యకు సమ్మె ఎంత మాత్రం పరిష్కారం కాదంది. వ్యవస్థ నడవడమే తమకు ముఖ్యమంది. సమ్మె చేస్తున్న న్యాయవాద సంఘాలతో చర్చలు జరిపి, సమ్మె విరమించేలా చూడాలని బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. కోర్టు విధుల బహిష్కరణతో కక్షిదారుల ఇక్కట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా న్యాయవాద సంఘాలు సమ్మెకు పిలుపునిస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నాయని, దీనివల్ల కక్షిదారులు ఇబ్బందిపడుతున్నారంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా యోగేష్ వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టుల్లో న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 8.64 లక్షల సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో మీ పాత్ర ఏమిటని రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ప్రశ్నించింది. దీనికి బార్ కౌన్సిల్ తరఫు న్యాయవాది జి.వెంకటరెడ్డి స్పందిస్తూ.. సమ్మె చేస్తున్న అన్ని న్యాయవాద సంఘాలకు బార్ కౌన్సిల్ కార్యదర్శి సర్క్యులర్లు పంపి, సమ్మె విరమించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మరి మీ సమ్మె విషయంలో మీ ఆదేశాలను పాటించకుంటే ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాదులపై చర్యలు తీసుకున్నారా? తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు? చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. చర్చలు ఫలించకుంటే చర్యలు తీసుకుంటాం అన్ని న్యాయవాద సంఘాలను చర్చలకు ఆహ్వానించామని వెంకటరెడ్డి చెప్పారు. చర్చలు ఫలించకుంటే అప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ధర్మాసనం.. సర్క్యులర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారా అని ప్రశ్నించింది. ఎప్పుడు సర్క్యులర్లు ఇచ్చారు? ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంత గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని వెంకటరెడ్డి చెప్పారు. మరి మీ సంగతేంటని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదిని ప్రశ్నించింది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని బీసీఐ న్యాయవాది కుంచెం మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే మీరు చర్యలు తీసుకోరా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అలా కాదని, ముందు స్పందించాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని, ఒకవేళ రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే అప్పుడు తాము రంగంలోకి దిగుతామని మహేశ్వరరావు తెలిపారు. ఒరిస్సాలో కూడా సమ్మె చేస్తున్న 42 మంది న్యాయవాదులను సస్పెండ్ చేశామని వివరించారు. న్యాయవాదులు న్యాయబద్ధమైన వాటి కోసం ఆందోళనలు చేస్తున్నారా? లేదా? చూస్తామని మహేశ్వరరావు తెలిపారు. రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో బార్ కౌన్సిల్ నిర్ణయంపై, భూ యాజమాన్య హక్కుల చట్టంపై న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు ముందు పెండింగ్‌లో ఉందన్నారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వచ్చిన నేపథ్యంలో ఆస్తి వివాదాల దావాలను తిరస్కరించవద్దని కింది కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. అలాగే రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో ప్రభుత్వ చట్ట సవరణ చేసి, జీవో జారీ చేసిందన్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదని వివరించారు. మరలాంటప్పుడు సమ్మె ఎందుకు కొనసాగిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగింది చాలని, వెంటనే సమ్మె విరమించాలని న్యాయవాదులను ఆదేశించింది. -
Supreme Court: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
న్యూఢిల్లీ: కోర్టు హాల్లో ఎలా ప్రవర్తించాలన్నదానిపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ సోమవారం సుప్రీంకోర్టులో ఓ న్యాయవాదికి క్లాస్ పీకారు. ఏ రైలు పడితే అది ఎక్కేయడానికి ఇది రైల్వేస్టేషన్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు రూమ్‌లో ఎలా మెలగాలన్నదానిపై ముందు మీరు వెళ్లి ఎవరైనా సీనియర్ న్యాయవాది వద్ద శిక్షణ తీసుకోండని సూచించారు. జ్యుడిషీయల్ సంస్కరణలపై తాను వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సోమవారం సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది ఒక్కసారిగా లేచి సీజేఐ బెంచ్‌ను అడగడం ప్రారంభించాడు. కేసు లిస్ట్ కాకుండా మీ వంతు రాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇలా మెన్షన్ చేయడమేంటని ఆ న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించారు. అయినా వినిపించుకోని ఆ న్యాయవాది న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యంత త్వరగా తీసుకురావాల్సి ఉందని చెప్పసాగాడు. న్యాయవాది ప్రవర్తన పట్ల ఆగ్రహించిన సీజేఐ అసలు మీరెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారని అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ హైకోర్టు, దిగువ కోర్టుల్లో చేస్తా అని చెప్పాడు. దీనికి స్పందించిన సీజేఐ మీరు త్వరగా ఒక సీనియర్ వద్ద జాయిన్ అయి కోర్టు రూమ్‌లో ఎలా మెలగాలో నేర్చుకోండని చురకంటించారు. ఈ నెల ప్రారంభంలోనూ ఓ అడ్వకేట్ సుప్రీం కోర్టులో గొంతు పెంచి మాట్లాడుతుండగా సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించి వాదించాలని సూచించారు. ఇదీచదవండి.. ఈడీ ఎదుటకు లాలూ -
Rennie Joyy: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది
రెనీ జాయ్ ఢిల్లోలో కార్పోరేట్ అడ్వకేట్. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు వైస్‌ప్రెసిడెంట్. జీవితం నేర్పిన పాఠాలతో అలేఖ్ ఫౌండేషన్ పేరుతో పేద మహిళలు, పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యాకోర్సులు నేర్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా సహాయం చేస్తోంది. అవసరమైనప్పుడు వారి కోసం న్యాయపోరాటాలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. ఈ ప్రయాణంలో ఏదీ సవ్యంగా లేదని, ఒడిదొడుకులతో నడిచిన తన జీవితాన్ని, తిరిగి దిద్దుకున్న విధానాన్ని పరిచయం చేస్తోంది. ‘‘మా తాతగారు ఆర్మీ ఉద్యోగి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి, చివరకు ఢిల్లీలో స్థిరపడ్డారు. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. నా చిన్నతనంలో మా అమ్మనాన్నలు విడివిడిగా ఉండేవారు. దీంతో నాన్న నుంచి ఎలాంటి సపోర్ట్, సాయం లభించలేదు. మా అమ్మనాన్నలు అంటే అమ్మమ్మ తాతయ్యలే. దీంతో కుటుంబం అసంపూర్తిగా ఉందని ఎప్పుడూ భావించలేదు. మా అమ్మనాన్నలు విడి విడిగా ఉన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఆ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది సమాజం దృష్ట్యా మంచిది కాదు అనే అభిప్రాయం ఉండేది. అందుకే వాళ్లు చాలా ఏళ్లు విడాకులు తీసుకోలేదు. నేను కాలేజీకి వెళ్లిన తర్వాత వారు చట్టబద్ధంగా విడిపోయారు. సమాజం ఇలా ఆలోచించడం వల్ల ఆ సమయంలో నా తల్లిదండ్రులు విడిపోయారని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వెంటనే నా పట్ల వారి దృక్పథం మారిపోతుందనే భయం ఉండేది. చిన్న వయసులోనే.. నా తల్లిదండ్రులు విడిపోవడానికి గల కారణాలన్నీ చూసిన తర్వాత, ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలని నాకు చాలా చిన్న వయసులోనే అర్ధమైంది. మా అమ్మమ్మ ఎప్పుడూ ‘ఎంత సంపాదించినా, ఏ పని చేసినా ఫర్వాలేదు. కానీ, నీ కాళ్ల మీద నువ్వు నిలబడటమే ముఖ్యం’ అనేది. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దానిని నివారించే ఉపాయాలను కనుక్కోమనేది. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల పెద్దయ్యాక మహిళల హక్కుల కోసం పోరాడాలని అనుకునేదాన్ని. చదువు తర్వాత బ్యాంకింగ్ రంగంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో చేరి, నా కెరీర్‌ను ప్రారంభించాను. నష్టం తెచ్చిన కష్టాలు.. మా అమ్మ జాతీయ బ్యాంకులో పనిచేసేది. ఆ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ కాబట్టి బ్యాంకులో చేరవద్దని ఎప్పుడూ చెబుతుండేది. కానీ, మార్కెటింగ్ రంగంలో ఏదైనా చేయాలనుకున్నాను కాబట్టి బ్యాంకులో అవకాశం రాగానే వదలలేదు. ప్రతి పనినీ నేర్చుకున్నాను. పదకొండేళ్లపాటు బ్యాంకులో పనిచేశాను. అక్కడ పనితీరుతో అతి పిన్నవయసులో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందాను. ఒకానొక సమయంలో ఉద్యోగంపై విసుగు అనిపించి స్టాక్ మార్కెట్లో కన్సల్టింగ్ పనిని ప్రారంభించాను. స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి, తీవ్ర నష్టం చవిచూశాను. వ్యాపార భాగస్వాములు మోసం చేశారు. ఉద్యోగం మానేసిన ఏడాదిన్నర కాలం చాలా దారుణంగా గడిచింది. తిరిగి తక్కువ జీతం, ఎక్కువ పనిగంటలు చేసేలా బ్యాంక్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయితే, బ్యాంకింగ్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సీనియర్ల సలహాతో ‘లా’ చదివాను. అప్పటికి నా కూతురికి నాలుగేళ్లు. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు చదువు, ఇంటి పని.. అంత తేలికయ్యేది కాదు. స్త్రీల పనికి సమాజంలో అంత త్వరగా అంగీకారం లభించదు. ఎందుకంటే స్త్రీ సామర్థ్యాల పట్ల ప్రజల వైపు ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో క్లయింట్స్‌ను ఒప్పించడానికి, వారిలో విశ్వాసం కలిగించడానికి నేను రెండు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. నా దృక్పథాన్ని, పని విధానాన్ని మార్చుకున్నాను. నన్ను నేను ఉత్సాహపరచుకుంటూనే ఉన్నాను. మెల్లగా నా గమ్యం వైపు కదిలి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నాను. అభిప్రాయ భేదాలు తలెత్తినా.. నా భర్తకు నాకు మధ్య అనేక విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా మారడం ద్వారా మా సంబంధాన్ని మరింత మెరుగ్గా కొనసాగించవచ్చని భావించాను. నా కూతురికి మంచి పెంపకాన్ని అందించడానికి అన్ని ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటాం. కానీ, మేం విడిగానే ఉంటాం. మా కుటుంబంలో ‘లా’ చదివినవారు ఎవరూ లేరు. నేను చాలా కేసుల్లో మహిళల తరపున నిలబడి న్యాయం చేశాను. ఈ రంగంలో లీగల్ అడ్వైజర్‌గా నాదైన ముద్ర వేయగలిగాను. 2015లో అలేఖ్ ఫౌండేషన్‌ను ప్రారంభించి మహిళల జీవితాలను మెరుగుపరిచే పనిని చేపట్టాను. లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాను. ఫౌండేషన్ ద్వారా బాలికా విద్య, వృత్తి విద్యలలో నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులు ఇవ్వడంలో కృషి చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, పీరియడ్స్, శానిటేషన్ వంటి ఆరోగ్య సమస్యలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ.. నిరుపేద బాలికల చదువుకు బాధ్యత తీసుకున్నాను. ఇటీవల నాగాలాండ్‌లో సౌండ్ ఇంజనీరింగ్ లో శిక్షణ ఇవ్వడానికి ఒక కాలేజీతో టై అప్ అయ్యాం. దీనికి అయ్యే ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుంది. పర్యావరణానికి మేలు కలిగేలా అవగాహన, ప్రచారం నిర్వహిస్తున్నాను. వాతావరణ మార్పుల నుండి చెట్లను ర క్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం, పేపర్‌లెస్ జీవనశైలిని ప్రోత్సహించడం చేస్తుంటాను’’ అని తన ప్రస్థానాన్ని వివరించింది రెనీ. -
పేదల పక్షాన నిలవండి
సాక్షి, అమరావతి: పేదల పక్షాన అడ్వొకేట్ సోదరులు, చెల్లెమ్మలు ఔదార్యం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా ప్రతి అడ్వొకేట్‌ను ఇదే కోరుతున్నానని, దీనిని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ విడుదల చేశారు. నెలకు రూ.5,000 చొప్పున 2023 జూలై–డిసెంబర్ వరకు 6 నెలలకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.30,000 మేరకు మొత్తం రూ.7,98,95,000 కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతోందో, అదే రీతిన మీరంతా పేద వాడి పక్షాన నిలవాలన్నారు. వారి పట్ల మానవతా దృక్పథం చూపించాలని కోరారు. లా డిగ్రీ పూర్తి చేసుకుని, న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకునే సమయంలో వారికి ప్రోత్సాహకంగా నిలుస్తూ వరుసగా గత నాలుగేళ్లుగా వైఎస్సార్ లా నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నెలకు రూ.5 వేలు స్టైఫండ్ చొప్పున, సంవత్సరానికి రూ.60 వేలు, మూడేళ్లకు రూ.1.80 లక్షలు ఇస్తున్నామన్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ఈ కార్యక్రమం ద్వారా తోడుగా నిలిచామని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్లకు మంచి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నాలుగేళ్లలో రూ.49.51 కోట్లు ► ‘ఈ నాలుగేళ్లలో వైఎస్సార్ లా నేస్తం ద్వారా మొత్తంగా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు మంచి చేస్తూ.. మనందరి ప్రభుత్వం రూ.49.51 కోట్లు సాయం చేసింది. ఈ మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి ఈ కార్యక్రమం ముందడుగు అవుతుంది. అడ్వొకేట్లందరూ బాగుండాలని, వారి కోసం మనసారా ఆలోచనలు చేసి మంచి జరగాలని తపిస్తూ వైఎస్సార్ లా నేస్తమే కాకుండా రూ.100 కోట్లతో అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును స్థాపించాం. అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరినీ సభ్యులుగా ఆ ట్రస్టులో ఉంచాం. ► ఈ కేటాయింపు వల్ల కోవిడ్ సమయంలో వీళ్లందరికీ చాలా మంచి జరిగింది. వీళ్లలో 643 కుటుంబాలకు రూ.52 లక్షలు ఇచ్చాం. ఆ సమయంలో ఇబ్బందుల్లో ఉన్న అడ్వొకేట్స్‌ను ఆదుకుంటూ మరో 7,733 మందికి రూ.11.56 కోట్ల రుణాలు ఇచ్చారు. మరో 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ కింద మరో రూ.11.41 కోట్లు చెల్లించాం. అదే టైంలో దాదాపు రూ.25 కోట్లు ఈ ఫండ్ నుంచి అడ్వొకేట్ కమ్యూనిటీకి ఇచ్చి, వారికి తోడుగా నిలబడగలిగాం. ► నా పాదయాత్రలో నా దగ్గరకొచ్చి వీళ్లంతా వినపతిపత్రం ఇచ్చినప్పుడు మాట ఇచ్చాను. ఆ మేరకు వాళ్లందరికీ తోడుగా ఉంటూ ఈ నాలుగు సంవత్సరాలుగా అడుగులు ముందుకు వేశాం. దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశాలు, పరిస్థితులు రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం అన్నారు. ► ఈ కార్య‘క్రమంలో సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, లా సెక్రటరీ జి సత్యప్రభాకర రావు, ఇతర అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. విజనరీ స్కీమ్స్ మీకే సాధ్యం గుంటూరు జిల్లా కోర్టులో నేను జూనియర్ అడ్వకేట్‌గా కెరీర్ ప్రారంభించాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ప్రైవేట్ ఉద్యోగి. మీరు ప్రవేశపెట్టిన విజనరీ స్కీమ్స్ గురించి సచివాలయంలో తెలుసుకున్నాను. హ్యాట్సాఫ్ సార్. నేను ఇటీవల ఆరోగ్య సురక్ష క్యాంప్‌కు వెళ్లాను. చాలా బాగుంది. దేశమంతా ఏపీ వైపు చూస్తోంది. విదేశీ విద్య చాలా బాగుంది. తుపాను సమయంలో మీరు ఇచ్చిన సపోర్ట్, భరోసా చాలా నచ్చింది. మిమ్మల్ని మార్గదర్శకంగా తీసుకుని మేం కూడా పేదలకు సాయం చేయాలనుకుంటున్నాం. మీరు ఒక విజనరీ. మీరు ఇచ్చే స్టైఫండ్ చాలా ఉపయోగపడుతుంది. మా కాళ్లపై మేం నిలబడుతున్నాం. – శశిధర్, జూనియర్ అడ్వొకేట్, గుంటూరు లా నేస్తం మాకు ధైర్యాన్నిచ్చింది నేను వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాను. నాకు చాలా ఉపయోగపడుతోంది. మేం ఈ డబ్బును కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌కు, బుక్స్, రవాణా ఖర్చుల కోసం ఉపయోగించుకుంటున్నాం. ఈ వృత్తిలో తొలుత ఎలా నిలదొక్కుకోవాలి.. ఎలా రాణించాలి.. ఖర్చుల మాటేంటి.. అని భయపడ్డాం. కానీ ఈ స్కీమ్ మాకు ధైర్యాన్నిచ్చింది. మా జూనియర్స్‌కు కూడా ధైర్యం చెబుతున్నాం. గుప్తుల స్వర్ణయుగాన్ని నేను చూడలేదు కానీ మీ పాలనలో చూడగలిగాను. చాలా సంతోషం. మీరు ఇచ్చే అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. మా నాన్న ఆర్టీసీ ఉద్యోగి. ఆరీ్టసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడంతో చాలా సంతోషపడ్డాం. – కోట ఆశ్రిత, జూనియర్ అడ్వొకేట్, నందిగామ -
యువ న్యాయవాదులకు అండగా లా నేస్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరునెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేయనున్నారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్లపాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60 వేల చొప్పున.. మూడేళ్లకు మొత్తం రూ.1.80 లక్షలు ఇస్తోంది. ఏడాదికి రెండుసార్లు నిధులు వారి ఖాతాల్లో జమచేస్తోంది. నేడు ఇస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.49.51 కోట్ల ఆర్థికసాయం అందించింది. న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ.25 కోట్ల ఆర్థికసాయం అందించింది. ఈ ట్రస్ట్ నుంచి ఆర్థికసాయం కోరే అడ్వకేట్స్ ఆన్లైన్లో ట్ఛఛిచి ్చఠీః్చp.జౌఠి.జీnలోగానీ, నేరుగా లా సెక్రటరీకిగానీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం ద్వారా 1902 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. ఈ పథకాన్ని మరింత సమర్థంగా మానిటర్ చేస్తూ యువ న్యాయవాదులు ఏకకాలంలో పెద్దమొత్తం సొమ్ము అందుకుని వారి అవసరాలు తీర్చుకునే విధంగా ఆరు నెలలకోసారి ప్రభుత్వం వారి ఖాతాల్లో నిధులు జమచేస్తోంది. దరఖాస్తు చేసుకోదలిచినవారు https://ysrlawnestham.ap.gov.in వెబ్సైట్లో తమ పేరు, బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబరు, సర్టిఫికెట్లు జతచేయాలి. -
నేపథ్యం ఆధారంగా జడ్జీలపై ఆ ముద్రలు వేయొద్దు
న్యూఢిల్లీ: అడ్వొకేట్ లక్ష్మణచంద్ర విక్టోరియా గౌరీని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సమరి్థంచారు. విక్టోరియా గౌరీ గతంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించారు. ఆమె బీజేపీ అభిమాని అనే పేరుంది. ఆమెను మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆమె మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం వివాదానికి దారితీసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు బార్ సభ్యులు కొందరు జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కొలీజియం సిఫార్సును రద్దు చేయాలని కోరారు. విక్టోరియా గౌరీ గతంలో పలు సందర్భాల్లో క్రైస్తవులకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇటీవల హార్వర్డ్ లా కాలేజీ సెంటర్ కార్యక్రమంలో మాట్లాడారు. మద్రాస్ హైకోర్టు బార్ సభ్యుల లేఖపై స్పందించారు. కొలీజియం అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తుందని గుర్తుచేశారు. లాయర్లుగా ఉన్నప్పుడు వారి నేపథ్యాన్ని, వెలిబుచి్చన సొంత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని జడ్జిలపై ఒక వర్గం వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరైంది కాదని అన్నారు. గొప్ప తీర్పులు వెలువరించిన జస్టిస్ కృష్ణ అయ్యర్‌కు కూడా రాజకీయ నేపథ్యం ఉండేదని అన్నారు. -
ఆపన్నులకు అండ.. పేదలకు లీగల్ సర్వీసెస్ అథారిటీ భరోసా
హక్కులకు భంగం కలిగితే కోర్టును ఎలా ఆశ్రయించాలో తెలియదు.. పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు నమోదైతే ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు..న్యాయవాదిని పెట్టుకొనేంత ఆర్థిక స్తోమత లేదు.. ఇదీ సగటు పేదవాడి దుస్థితి. ఈ పరిస్థితుల్లో పేద ప్రజలు న్యాయం కోసం ఏం చేయాలి.. ఎవరిని ఆశ్రయించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా దాదాపు 25 ఏళ్ల క్రితం ఏర్పాటైందే ‘లీగల్ సర్విసెస్ అథారిటీ (ఎల్ఎస్ఏ)’. ఈ నెల 9న జాతీయ లీగల్ సర్విసెస్ అథారిటీ డే, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఆ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్: పేదలకు న్యాయ సా యం అందించడం, కోర్టు కేసులను మ ధ్య వర్తిత్వంతో పరిష్కరించడం, లోక్ అదాలత్‌లు నిర్వహించడమే కాదు.. వృద్ధులకు ఆసరాగా నిలవడం, పేద విద్యార్థులకు సాయం చేయడం సహా అనేక సామాజిక కార్యక్రమాలను లీగల్ సర్విసె స్ అథారిటీ నిర్వహిస్తోంది. పత్రికల్లో వచ్చిన కథనా ల ఆధారంగా లేదా సుమోటోగా పలువురి బాధల ను తీరుస్తోంది. కోవిడ్ సమయంలో ఆస్పత్రుల్లో పడకలు అందేలా చర్యలు తీసుకోవడం, విడిపోయి న భార్యాభర్తలను కలపడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం వసతు లు, వేతనం అందేలా చేయడం, మతిస్థిమితం కో ల్పోయిన వారికి ఆశ్రయం కల్పించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. 1995లో ఏర్పాటు లీగల్ సర్విసెస్ అథారిటీ చట్టం–1987 ప్రకారం 1995 నవంబర్ 9న జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటైంది. దీనికి జాతీయ స్థాయిలో ప్యాట్రన్ ఇన్ చీఫ్‌గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలు పని చేస్తాయి. వృద్ధ దంపతులకు ఆసరా.. ఖమ్మం జిల్లాకు చెందిన రామన్న, కృష్టమ్మ దంపతులు. ఉన్న ఆస్తినంతా పిల్లలకు పంచిపెట్టారు. మలి వయసులో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పిల్లలు వారిని నడిరోడ్డుపై వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా లీగల్ సెల్ అథారిటీ వారిని సంప్రదించింది. చట్టప్రకారం 3 ఎకరాల 20 గుంటల భూమిని తిరిగి వృద్ధ దంపతుల పేర రిజిస్ట్రేషన్ చేయించి ఆసరా కల్పించింది. అమరచింతలోని కియోస్‌్కలో వారికి ఆశ్రయం అందించింది. నిరుద్యోగులకు చేయూత.. మహబూబ్‌నగర్ జిల్లా సెంట్రల్ లైబ్రరీకి రోజూ సుమారు 200 మంది విద్యార్థులు, నిరుద్యోగులు వస్తుంటారు. ఉదయం 8 గంటలకు వచ్చిన కొందరు సాయంత్రం 6 గంటల వరకు అక్కడే చదువుకుంటా రు. వారిలో ఎక్కువ మంది పేదలే కావడం, మధ్యాహా్నలు భోజనం కూడా చేయడం లేదని గుర్తించిన జిల్లా లీగల్ సర్విసెస్ అథారిటీ.. మున్సిపల్ చైర్మన్‌తో సంప్రదింపులు జరిపింది. రూ. 5కే మంచి భోజనం అందేలా చర్యలు తీసుకొని చేయూతనిచ్చింది. 33 జిల్లాల్లో ప్రత్యేక న్యాయవాదులు పేదల కేసులను వాదించేందుకు, న్యాయ సలహా అందించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించాలన్న జాతీయ లీగల్ సర్విసెస్ అథారిటీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (జిల్లా స్థాయి), డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (సబ్–కోర్టు), అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (మేజిస్ట్రేట్ కోర్టు)ను పూర్తిస్థాయిలో నియమించారు. రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో 33 జిల్లాల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఏం న్యాయ సేవలు అందిస్తారు? 1). ఉచితంగా న్యాయ సలహాలు అందించడం 2). కేసులు పరిశీలించి బాధితుని తరఫున న్యాయవాదిని నియమించడం 3). కోర్టు ఫీజులను భరించడం 4). తీర్పు వచ్చిన తర్వాత కాపీలను ఉచితంగా అందజేయడం ఆశ్రయించడం ఎలా? ఉచిత న్యాయ సాయం కోసం మండల న్యాయసేవాధికార సంఘం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 040–23446723 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించవచ్చు. న్యాయ సాయం ఎవరికి.. 1). షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు 2). మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు 3). మహిళలు, బాలబాలికలు 4). అంగవైకల్యం కలిగిన వ్యక్తులు 5). ప్రకృతి విపత్తులు, కుల, మత కల్లోలాల బాధితులు 6). పారిశ్రామిక కార్మికులు 7). రక్షణ గృహం, అనాథ గృహం, బాలల గృహం, మానసిక చికిత్సాలయంలో ఆశ్రయం పొందుతున్న వారికి.. 8). సంవత్సర ఆదాయం రూ.3 లక్షలు మించని వారికి... అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సాయం చేయడం కోసం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను రాష్ట్రంలో ప్రారంభించాం. దుక్కి దున్నే నాటి నుంచి పంటను మార్కెట్లో అమ్మేదాకా సాగు చట్టాలు, నియమాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తాం. కోర్టులపై భారం తగ్గించేందుకు లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నాం. – గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి -
కాంగ్రెస్‌లోకి ప్రముఖ న్యాయవాది దామోదర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ దామోదర్‌రెడ్డి సేవలను వినియోగించుకుంటామని, పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కొడంగల్, చేవెళ్ల, పాలకుర్తి, భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.