కోర్టు ప్రాంగణాల్లో మతపరమైన కార్యకలాపాలొద్దు: హైకోర్టు  | High Court comments about religious activities in court premises | Sakshi
Sakshi News home page

కోర్టు ప్రాంగణాల్లో మతపరమైన కార్యకలాపాలొద్దు: హైకోర్టు 

Published Thu, May 17 2018 2:14 AM | Last Updated on Wed, May 29 2019 3:25 PM

High Court comments about religious activities in court premises - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యాయస్థానాల ప్రాంగణాల్లో న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు ఎలాంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించకుండా చూడాలని ఇరు రాష్ట్రాల జిల్లా జడ్జీలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు రిజిష్ట్రార్‌ జనరల్‌ ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. కొందరు న్యాయవాదులు అనుమతులు తీసుకోకుండానే కోర్టు ప్రాంగణాల్లో మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ సర్క్యులర్‌ జారీ చేశామని హైకోర్టు పేర్కొంది. సర్క్యులర్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement