
సాక్షి, హైదరాబాద్: గుండెపోటుతో ఇటీవల మృతిచెందిన సీనియర్ న్యాయవాది వీఎల్‌ఎన్‌జీకే మూర్తికి హైకోర్టు ఘనంగా నివాళులర్పించింది. మూర్తికి నివాళులు అర్పించేందుకు బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూర్తితో తనకున్న అనుబంధాన్ని ఏసీజే గుర్తుచేసుకున్నారు.
అంతకుముందు తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు, ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు మూర్తి అందించిన సేవలను కొనియాడారు. మూర్తి మృతికి సంతాపంగా అందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. మూర్తి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment