tribute
-
వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థివ దేహానికి వైఎస్ జగన్, విజయమ్మ నివాళులు
-
LIVE: YV సుబ్బారెడ్డి తల్లికి YS జగన్ నివాళి
-
మహత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళి
-
బోస్ పోరాటం నేటి యువతకు ఆదర్శనీయం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.భారతదేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శనీయం. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన యోధుడు ఆయన నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులు అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.భారతదేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శనీయం. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన యోధుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2025 -
మందా కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: అనారోగ్యంతో కన్నుమూసిన మందా జగన్నాథంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. చంపాపేటలోని మందా ఇంటికి వెళ్లిన కేటీఆర్.. మంధా పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ‘‘మందా జగన్నాథం తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి. మహాబూబ్ నగర్ అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తి ఆయన. రాజకీయాల్లో వివాదరహితుడు ,సౌమ్యుడు. ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయింది. పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారాయన. నాలుగు సార్లు ఎంపీ గా అయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని కేటీఆర్ మీడియాతో అన్నారు. అధికారిక లాంఛనాలతో.. మందా జగన్నాథం అంత్యక్రియల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.ప్రముఖుల సంతాపంమందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారునిగా రాష్ట్రంలో మందా జగన్నాథం పోషించిన పాత్ర మరువరానిదని అన్నారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. మందా జగన్నాథం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మందా ప్రస్థానంనాగర్కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం.. నాలుగు పర్యాయాలు ఎంపీగా నెగ్గారు. 1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014 తరువాత బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో నిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించి కన్నుమూశారు. -
పులివెందులలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
YS Jagan: సావిత్రీబాయి ఫూలేకి వైఎస్ జగన్ ఘన నివాళి
-
స్త్రీ పాత్రల రూపశిల్పి శ్యామ్ బెనగళ్.. అల్విదా!
భారతీయ సినిమా పరిశ్రమలో తీరని విషాదం నెలకొంది. భారతీయ పార్లల్ సినిమాకు దశదిశలా ఖ్యాతిని తెచ్చి పెట్టిన తొలి తరం దర్శకులు శ్యామ్ బెనగళ్ (90) ఇకలేరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ముంబైలో స్థిరపడిన బెనగళ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలోని ఓ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శ్యామ్ బెనగళ్ కుమార్తె పియా బెనగళ్ వెల్లడించారు. బెనగళ్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2023 అక్టోబరు 13న విడుదలైంది. శ్యామ్ బెనగళ్‌కు భార్య నీరా బెనగళ్, కుమార్తె పియా బెనెగళ్ ఉన్నారు. లెజెండరీ దర్శకుడిగా పేరొందిన శ్యామ్ బెనగళ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జన్మతః కన్నడిగ అయినప్పటికీ తెలంగాణలో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ చైతన్యం ఆయనలో చివరికంటా ఉంది.శ్యామ్ బెనగళ్( ShyamBenegal) తన సినిమాల్లో శక్తిమంతమైన స్త్రీపాత్రలకు రూపకల్పన చేశాడు. ‘అంకుర్’ (1974)తో మొదలెట్టి ‘జుబేదా’ (2001) వరకు దాదాపుగా ప్రతి సినిమాలో స్త్రీ పాత్రలకు చైతన్యాన్ని, శక్తిని ఇచ్చిన దర్శకుడు శ్యామ్ బెనగళ్. సత్యజిత్ రే వాస్తవిక సినిమాను ప్రవేశపెట్టి ఆ పరంపరను మృణాళ్ సేన్ అందుకున్నాక శ్యామ్ బెనగళ్ ఆ ఛత్రాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టాడు. 1973లో విడుదలైన రెండు సినిమాలు ‘అంకుర్’, ‘గరమ్ హవా’ నవ సినిమాల పతాకాన్ని పట్టుకున్నాయి. అయితే ‘గరమ్ హవా’ తీసిన ఎం.ఎస్.సత్యు ఎక్కువ సినిమాలు చేయలేదు. శ్యామ్ బెనగళ్ నిరంతరం పని చేశాడు. ‘సినిమా కచ్చితంగా సామాజిక మాధ్యమం. అది సమాజాన్ని పట్టించుకోవాల్సిందే. నేను సికింద్రాబాద్‌లో పుట్టి పెరగడం వల్ల రైతాంగ పోరాటం, విప్లవ పోరాటాల ప్రభావం నా మీద ఉంది. ప్రజల పక్షం నిలబడాలి సినిమా అనుకున్నాను’ అంటారాయన. కంటోన్మెంట్ ఏరియాలోని టెంట్ హాలులో వారానికి మూడు ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ తన అన్నయ్యతో కలిసి సినిమాలు తీసేందుకు ప్రయోగాలు చేసిన శ్యామ్ బెనగళ్ యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీల తర్వాత ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే పార్లల్ సినిమా అంటే చిత్రోత్సవాల్లో ప్రదర్శించేది కాదు నేరుగా హాల్లో రిలీజ్ చేసి హిట్ చేయదగ్గది అని నిరూపించిన తొలి భారతీయ దర్శకుడు శ్యామ్ బెనగళ్. ‘అంకుర్’ హైదరాబాద్‌లో 100 రోజులు ఆడటమే ఉదాహరణ. భూస్వాముల దోపిడిని ఆ సినిమాలో చూపి కొనసాగింపుగా ‘నిషాంత్’ తీశాడు బెనగళ్. ఇక ‘మంథన్’ చిన్న మనుషులు ఒక్కటైతే సహకార వ్యవస్థ ద్వారా ఎలా స్వయం సమృద్ధి సాధించ వచ్చో ఆ రోజుల్లోనే తీశాడు బెనగళ్. దీని నిర్మాణానికి పాడిరైతులు తలా రెండురూపాయల వాటా వేయడం నభూతో నభవిష్యతి.ఎన్నో ప్రయోగాలు:శ్యామ్ బెనగళ్ తన సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేశాడు. కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చాడు. బెనగళ్ సినిమాలతో షబానా, స్మితా పాటిల్ గొప్ప పాత్రలు పోషించదగ్గ నటీమణులుగా గుర్తింపు పొందారు. షబానాకు మొదటి సినిమాతోటే జాతీయ పురస్కారం వచ్చింది. ఔట్డోర్కు తన యూనిట్‌తో వెళ్లి అక్కడే ఉండిపోయి సినిమా తీసే పరంపరను బెనగళ్ ప్రవేశపెట్టాడు. అందరూ కలిసి ఆలోచనలు పంచుకోవడానికి ఇది మంచి మార్గం అంటాడాయన. ఆయన దర్శకత్వ ప్రతిభ తెలిసి కేవలం ఆయన దర్శకత్వంలో నటించాలనే అభిలాషతో ‘అనుగ్రహం’లో వాణిశ్రీ నటించింది. వ్యభిచార వ్యవస్థ మీద ‘మండి’, వ్యాపార సామ్రాజ్యాల ఎత్తుగడల మీద ‘కల్యుగ్’, గోవాలో పోర్చుగీసు పాలన సమాప్త సమయంలో చెలరేగిన భావోద్వేగాలను ‘త్రికాల్’ లో, నాలుగు కాలాల అంతరంలో ఒక సినీ నాయిక జీవితం, సినిమా జీవితం ఎలా మారిందో చూపిన ‘భూమిక’... ఇవన్నీ ప్రయోగాత్మక కథలు. ‘త్రికాల్’లో రాత్రి సన్నివేశాలు క్యాండిళ్ల వెలుతురులో తీసి ఒక గాంభీర్యం తెచ్చాడు బెనగళ్.దేశం కోసం:దేశం కోసం దేశ వాసుల కోసం బెనగళ్ పని చేస్తూనే వెళ్లాడు. ఎన్నో డాక్యుమెంటరీలు తీశాడు. వాటిలో సత్యజిత్ రే మీద తీసిన డాక్యుమెంటరీ ముఖ్యమైనది. ఇక నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను ‘భారత్ ఏక్ ఖోజ్’ పేరుతో ఇచ్చిన దృశ్యరూపం కష్టతరమైనది. దూరదర్శన్‌లో దీనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ మీద పరిశోధన చేసి ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’ తీశాడు. ‘మేకింగ్ ఆఫ్ మహాత్మా’కు దర్శకత్వం వహించాడు. జీలాని బానో రాసిన ‘నర్సయ్య కీ బావ్డీ’ (నర్సయ్య బావి)ని చాలా కాలం తర్వాత ‘వెల్డన్ అబ్బా’గా తీశాడాయన.ఆయన నిష్క్రమణంతో గొప్ప వెలుగు వీడ్కోలు తీసుకున్నట్టయ్యింది. అవార్డులు... శ్యామ్ బెనగళ్ భారత ప్రభుత్వం నుంచి 8 జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు. అవి ‘అంకుర్’(1975), ‘నిశాంత్’(1976), ‘మంథన్ ’(1977), ‘భూమిక: ది రోల్’(1978), ‘జునూన్’(1979), ‘ఆరోహణ్’(1982), ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’(2005), ‘వెల్డన్ అబ్బా’ (2009). అలాగే సినీ రంగంలో కనబరచిన అత్యుత్తమ ప్రతిభకుగానూ 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా 2005 సంవత్సరానికిగాను 2007 ఆగస్టు 8న అత్యంత ప్రతిష్ఠాత్మమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అందుకున్నారు. తెలుగు సినిమా ‘అనుగ్రహం’కు నంది అవార్డు అందుకున్నారు. -
వృక్ష ప్రేమి తులసిగౌడ కన్నుమూత
యశవంతపుర: కర్ణాటకలో తన జీవితాన్ని మొక్కలు, చెట్ల పోషణకు అంకితం చేసిన తులసిగౌడ (90) కన్నుమూశారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హొన్నళ్లికి చెందిన తుళసిగౌడ మంగళవారం వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. మొక్కలు నాటితే చాలదు, వాటిని అలాగే సంరక్షించాలని సూచించేవారు. 17 ఏళ్ల పాటు ఆమె అటవీశాఖలో దినసరి కూలీగా పని చేశారు. ఆమె సేవలను గుర్తించిన అప్పటి అటవీశాఖ అధికారి యల్లప్పరెడ్డి ఆమెను పర్మినెంట్ ఉద్యోగిని చేశారు. ఆమె ఉద్యోగంలో ఉన్నా, రిటైరైనా మొక్కలపైనే మనసంతా ఉండేది. అనేక గ్రామాలలో రోడ్డు పక్కన వేలాదిగా మొక్కలు నాటి సంరక్షించారు. ఫలితంగా పచ్చదనం పెంపొందించారు. సుమారు 30 వేల మొక్కలను నాటి ఉంటారని ఒక అంచనా. ఎంత ఎదిగినా అత్యంత నిరాడంబరంగా ఉండడం ఆమెకే చెల్లింది. తులసిగౌడ సేవలకు గుర్తుగా 2020 జూలైలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇటీవల ఆమె సొంతూరిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆనకట్ట కట్టాలని అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరకటంతో ఆమె ఆగ్రహించి ఆనకట్ట వద్దంటూ సర్వే అధికారులను వెనక్కి పంపారు. ప్రధాని మోదీ సంతాపం పర్యావరణవాది, పద్మశ్రీ తులసిగౌడ మరణం తీవ్ర విషాదకరమని ప్రధాని మోదీ ఎక్స్‌లో సంతాపం తెలిపారు. మొక్కల సంరక్షణకే తులసిగౌడ జీవితాన్ని ధారపోశారని, భూమిని రక్షించడానికి యువతకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. -
అక్కినేని వారి కోడలు.. సబ్యసాచి లెహెంగాలో ఫోటో షూట్ చూశారా? (ఫొటోలు)
-
వాహ్ ఉస్తాద్ వాహ్
పుట్టిన వెంటనే చెవిలో ‘కల్మా’ కాకుండా తబలా జతులు విన్నవాడు... మూడేళ్లకే తబలాను పసి వేళ్లతో మీటిన వాడు... ఏడేళ్లకు ప్రదర్శనలు ఇచ్చినవాడు...పన్నెండేళ్లకు ప్రపంచ యాత్రకు బయల్దేరినవాడు... మహా మహా విద్వాంసులకు సహ వాద్యగాడు... తనే స్వయంగా అద్వితీయ వాద్యకారుడు... తబలా ప్రపంచానికి ఈశ్వరుడు... దేవుడు... ఉస్తాద్ జాకీర్ హుసేన్.టీషర్ట్, జీన్స్ వేసుకుని ఆధునిక యువకుడిగా ఉంటూ సంప్రదాయ శాస్త్రీయ సంగీతాన్ని కుర్రకారుకు చేరువ చేసిన ఈ నవ యువ వాద్య మాంత్రికుడు కన్నుమూశాడు. అతను లేడు. అతనిలాంటి వాడు మరి రాడు. ఒక్కడే జాకిర్ హుసేన్.జాకిర్ హుసేన్ ప్రదర్శనలో ఎవరైనా ఇది చూడాలి. ఆయన తబలా మీద డమరుకాన్ని, శంఖాన్ని వినిపిస్తాడు. ‘ఎడమ’ మీద డమరుకం వినిపిస్తూ ‘కుడి’ని మీటి శంఖనాదాన్ని సృష్టిస్తాడు. ఆ శంఖనాద సమయంలో జాకిర్ హుసేన్ వేళ్లు ఎంత వేగంగా కదులుతాయంటే అవి కనపడవు. పైగా తబలాని తాకినట్టుగా కూడా ఉండవు. ఇలా వాయించడం అసాధ్యం. ‘ఇది ఎలా సాధించారు’ అని అనడిగితే ‘సాధన చేయాలి. తబలాతో స్నేహం చేయాలి. దాని మాటకు చెవి ఒగ్గాలి’ అంటాడు జాకిర్ హుసేన్. అంత వినమ్రంగా ఉండటం వల్లే ఆయన తన తబలాకు ప్రపంచమే చెవి ఒగ్గేలా చేయగలిగాడు. ‘ఉస్తాద్’ కాగలిగాడు. ‘మేస్ట్రో’ అనిపించుకున్నాడు.‘మీరు తబలా ఏ వయసులో నేర్చుకోవడం మొదలెట్టారు’ అని అడిగితే జాకిర్ హుసేన్ ఆశ్చర్యపోతాడు. ‘అదేం ప్రశ్న’ అంటాడు. నిజమే. అతను పుట్టిందే తబలా ఉన్న ఇంట్లో. జాకిర్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖా జగమెరిగిన తబలా విద్వాంసుడు. మన దేశంలో తబలాకు ఔన్నత్యం తీసుకు వచ్చిన తొలి విద్వాంసుడు. ఆయనకు పెద్ద కొడుకుగా 1951లో ముంబైలో జన్మించాడు జాకిర్ హుసేన్. నర్సింగ్ హోమ్ నుంచి మరుసటిరోజు ఇంటికి తీసుకొస్తే ముస్లిం సంప్రదాయం ప్రకారం తండ్రి తన కొడుకు చెవిలో ‘కల్మా’ చదివి, పేరు పలికి లోపలికి తీసుకెళ్లాలి. కాని అల్లా రఖా జాకిర్ని తన చేతుల్లో తీసుకుని ‘ధాధా ధినా.. థాథా తునా’ అని తబలా జతులు వినిపించాడు. భార్య ‘ఇదేమిటండీ చోద్యం.. దైవ స్తోత్రం వినిపించక’ అనంటే ‘నా దైవం తబలాయే’ అని బదులిచ్చాడాయన. అలా జాకిర్‌కు పుట్టిన వెంటనే తబలా తెలిసింది. జాకిర్‌ను పడుకోబెట్టడానికి తండ్రి రోజూ ఒడిలోకి తీసుకుని తబలా జతులు వినిపిస్తూనే వెళ్లాడు. ఇలా మూడేళ్లు ఆ పసికందు మెదడులోకి తబలా మాత్రమే వెళ్లింది. మూడేళ్లు వచ్చేసరికి జాకిర్ తబలా వరకూ బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్లి అత్యంత సహజంగా దానిని మీటాడు.జాకిర్ హుసేన్ తబలా యాత్ర మొదలైంది.మన దేశానికి స్వతంత్రం వచ్చే వరకూ శాస్త్రీయ సంగీతం ఆస్థానాల్లో, దర్బారుల్లో, శ్రీమంతుల మహళ్లలో ఉండిపోయింది. స్వతంత్రం వచ్చాక అవన్నీ వెళ్లి సంగీత కచ్చేరీలు మొదలయ్యాయి. అయితే వాటికి ఆదరణ అంతంత మాత్రమే ఉండేది. ఆ సమయంలో సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్, సరోద్ వాద్యకారుడు అలి అక్బర్ ఖాన్‌లాంటి వారు అమెరికాకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తూ మన దేశం తిరిగి వచ్చి అటెన్షన్ సంపాదించారు. ఆ తర్వాతి రోజుల్లో సంతూర్ పండిట్ శివకుమార్, వేణువు హరిప్రసాద్ చౌరాసియా కూడా పశ్చిమ దేశాలలోకి మన సంగీతాన్ని తీసుకెళ్లాడు. పండిట్ రవిశంకర్‌కు శాశ్వతంగా అల్లారఖా తబలాజోడిగా ఉండేవారు. అయితే అల్లా రఖాకు అనారోగ్యం వల్ల జాకిర్‌కు 19ఏళ్లు ఉండగా మొదటిసారి అమెరికా వెళ్లి రవి శంకర్‌కు సహ వాయిద్యం అందించే వీలు జాకిర్‌కు దక్కింది. మొదటిసారి అలా అమెరికాలో అడుగు పెట్టిన జాకిర్ జీవితంలో అత్యధిక కాలం అమెరికాలో ఉంటూ అక్కడినుంచే దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ తబలా వాదనలో ఉండే ఉత్కృష్ట ధ్వనిని ప్రపంచానికి వినిపించాడు. చివరకు అక్కడే– డిసెంబర్ 16 (సోమవారం) అంతిమ శ్వాస వదిలాడు.‘తబలాకు ఎప్పుడూ కాలు తగలనివ్వకు బాబూ. అది మన సరస్వతి’ అనేవారట ఉస్తాద్ అల్లారఖా. అందువల్ల జాకిర్ హడావిడి ప్రయాణాల్లో రైళ్లలో సీటు దొరక్కపోతే కింద కూచుని తబలాను ఒళ్లో జాగ్రత్తగా పెట్టుకునేవారు. ‘నేను తబలా నేర్చుకుంటాను’ అని ఏడేళ్ల వయసులో మొదటిసారి జాకిర్ తన తండ్రితో చెప్పినప్పుడు ఆ మరుసటి రోజు రాత్రి 3 గంట లకు నిద్ర లేపి సాధన మొదలేయించేవారట అల్లారఖా. రోజూ రాత్రి మూడు నుంచి ఉదయం 6 వరకు వారి సాధన సాగేది. ఆ తర్వాత స్కూల్ వెళ్లి సాయంత్రం మళ్లీ సాధన కొనసాగించేవాడు. ‘పండితులకు జన్మించే పిల్లలకు పోలిక ఉంటుంది. అల్లా రఖా కొడుకై ఉండి ఇంత సామాన్యంగా వాయిస్తున్నాడా అనంటే మా నాన్న పరువేంగాను. అందుకే నేను మరింత కష్టపడేవాణ్ణి’ అంటాడు జాకిర్. అంతేకాదు అన్ని మతాల సంగీతం నుంచి కూడా నేర్చుకోవడానికి చూశాడు. ‘నేను స్కూల్‌కు వెళ్లే దారిలో చర్చిలో సంగీతం వినేవాణ్ణి. గుడిలో వినిపించే భక్తి గీతాలు ఆలకించేవాణ్ణి. ప్రపంచంలో ఏ మతమూ ఇంకో మతంపైన జబర్దస్తీ చేయదు. ఏ మతమైనా చెప్పేది నీ పొరుగువారిని ప్రేమించమనే’ అంటాడు జాకిర్ హుసేన్. అందుకే జాకిర్ అన్ని మతాల, అన్ని ధోరణుల విద్వాంసులతో అతి సులువుగా కలిసిపోయి తన తబలాను వారి సంగీతానికి జత చేయగలిగారు. ముఖ్యంగా సంతూర్ శివకుమార్‌తో ఆయనకు సుదీర్ఘ స్నేహం సాగింది. కొన్నాళ్ల క్రితం శివకుమార్ మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలకు హాజరైన జాకిర్ హుసేన్ దహన వాటిక నుంచి అందరూ వెళ్లిపోయినా తనొక్కడే మండుతున్న చితి పక్కన చాలా సేపు నిలబడిపోయి ఆ స్నేహితునికి అంతిమ వీడ్కోలు పలికాడు. ఈ భారతీయ హిందూ ముస్లిం శాస్త్రీయ సంగీత భాగస్వామ్యాన్ని జాకిర్ స్థిరంగా ప్రచారం చేశాడు. కొనసాగాలని కోరుకున్నాడు.బీటెల్స్ గ్రూప్ ద్వారా ఖ్యాతి గాంచిన గిటారిస్ట్ జార్జ్ హారిసన్ ‘లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్’ అనే ఆల్బమ్‌లో జాకిర్ భాగస్వామ్యాన్ని కోరడంతో 1973 నుంచి ఫ్యూజన్ సంగీతానికి ప్రచారం కల్పించసాగాడు జాకిర్ హుసేన్. అమెరికన్ జాజ్ మ్యుజీషియన్ జాన్ హ్యాండీ, ఐరిష్ గాయకుడు వాన్ మారిసన్, అమెరికన్ డ్రమ్మర్ మికీ హర్ట్లాంటి ప్రసిద్ధులతో యాభై ఏళ్ల క్రితమే పని చేయడం వల్ల జాకిర్ హుసేన్‌కి హద్దులు లేని ప్రచారం, ప్రశంస లభించాయి. గాత్ర సంగీతమైనా, వాద్య సంగీతమైనా, జుగల్బందీ అయినా, వ్యక్తిగత ప్రదర్శన అయినా, ఫ్యూజన్ అయినా జాకిర్ నీరు పాత్ర రూపు దాల్చినంత సులభంగా ఇమిడిపోయి కచ్చేరికి అందం, ఆనందం తెచ్చేవాడు. పొడవైన తన గుబురు జుత్తు గాలిలో ఊగేలా ఆయన సాగించే తబలా వాదనను చూడటానికి జనం విరగబడేవారు. ముచ్చటపడేవారు.జాకిర్ హుసేన్ మన దేశంలో ‘పద్మశ్రీ’తో గౌరవించబడ్డ (1988) అత్యంత పిన్న వయస్కుడు (అవార్డు ప్రకటించే సమయానికి). ఆ తర్వాత ఆయనకు ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’ వచ్చాయి. నాలుగుసార్లు ‘గ్రామీ’ గెలుచుకున్న ఏకైక భారతీయ సంగీతకారుడు. అంతేనా? అమెరికా ప్రభుత్వం కళ, సాంస్కృతిక రంగాల్లో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక ఫెలోషిప్ ‘నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్’ జాకిర్‌ను వరించింది. జాకిర్ సినిమాలకు పని చేశాడు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘వానప్రస్థం’ సినిమాకు పాటలు కంపోజ్ చేశాడు. లతా మంగేశ్కర్, ఆశా భోంస్లేల జీవితం ఆధారంగా తీసిన ‘సాజ్’ (1998)లో ఆశా భోంస్లే భర్త ఆర్.డి.బర్మన్ పాత్రలో కనిపించాడు. మంచి మాటగాడు, హాస్యప్రియుడు, భోజన ప్రియుడైన జాకిర్ హుసేన్ ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. నవ్వులు ఉంటాయి. తబలా ఎలాగూ ఉంటుంది.గొప్ప సంగీతమయ ప్రపంచాన్ని సృష్టించి, శుభ నాదాలను జగత్తులోకి వదిలి సంగీతం ద్వారా శాంతము పొందమని కోరుతూ వీడ్కోలు తీసుకున్నాడు ఉస్తాద్ జాకిర్ హుసేన్. ప్రపంచ సంగీత ప్రియులు అతణ్ణి తలచుకుని కన్నీరు కారుస్తున్నారు. జాకిర్ ఆత్మ విశ్వ సంగీతంలో డోలలూగాలి.– కె -
కనకదాసుకు వైఎస్ జగన్ నివాళి
గుంటూరు, సాక్షి: ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. శ్రీకృష్ణ భగవానుడికి కనకదాస గొప్ప భక్తుడని, ఆధునిక కవిగా ప్రజలలో భక్తి , సామాజిక బాధ్యతా, సమత్వం పెంపొందిస్తూ ఆయన చేసిన కీర్తనలు.. ఆ మహనీయుడి మార్గం సదా ఆచరణీయం అని తన ట్వీట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. కురుబ గౌడ దాస కుటుంబంలో జన్మించి శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు, ఆధునిక కవి, సంగీతకారుడు, స్వరకర్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్బంగా నివాళులు. ప్రజలలో భక్తి , సామాజిక బాధ్యతా , సమత్వం పెంపొందిస్తూ ఆయన చేసిన కీర్తనలు, ఆ మహనీయుడి మార్గం సదా ఆచరణీయం. pic.twitter.com/lq9enqM7Br— YS Jagan Mohan Reddy (@ysjagan) November 18, 2024 అంతకు ముందు.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కనకదాస జయంతి కార్యక్రమం జరిగింది. కనకదాస చిత్రపటానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, హిందూపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ టి.ఎన్.దీపిక, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
తమ్ముడి మృతదేహానికి నివాళులర్పించిన చంద్రబాబు
-
మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు వైఎస్ జగన్ నివాళి
గుంటూరు, సాక్షి: భారతరత్న, డాక్టర్ మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా తన నివాళి ప్రకటించారు.స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతకు ముందు..స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/2OoYBxEPB4— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2024 తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అజాద్ జయంతి వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు రేగ మత్స్యలింగం, విశ్వేసరరాజు, విరూపాక్షి హాజరయ్యారు. -
ప్రముఖ డిజైనర్ మృతి.. ఇంద్ర హీరోయిన్ ఎమోషనల్!
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ మృతిపట్ల సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే సంతాపం తెలిపారు. అతనితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనలయ్యారు. మీరు అద్భుతమైన డిజైనర్ అని అందరికీ తెలుసని అన్నారు. అంతే కాకుండా మీతో ల యూ హమేషా అనే చిత్రంలో నటించిన రోజులు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. అతన్ని సోనాలి కేవలం డిజైనర్‌గానే కాకుండా సహ నటుడిగా గుర్తు చేసుకున్నారు. వీరిద్దరు కలిసి నటించిన లవ్ యు హుమేషా మూవీ థియేటర్లలో విడుదల కాలేదు.కాగా.. రోహిత్ బాల్‌ను నవంబర్ 1న కన్నుమూశారు. ఆయన 63 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. దీంతో హీరోయిన్ సోనాలి బింద్రే.. రోహిత్ బాల్‌కు నివాళులర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు. ఆమెతో పాటు నటుడు అర్జున్ రాంపాల్ కూడా దివంగత ఫ్యాషన్ డిజైనర్‌కు నివాళులర్పించారు. రోహిత్ బాల్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. కాగా.. ఆయన జ్ఞాపకార్థం సోమవారం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలోని సాయి ఇంటర్నేషనల్ సెంటర్లో ప్రార్థనా సమావేశం నిర్వహించారు.కశ్మీర్‌కు చెందిన రోహిత్ బాల్ తన గొప్ప డిజైన్లతో బాలీవుడ్లో ప్రసిద్ధి చెందాడు. చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు ఆయన పనిచేశారు. అతని డిజైన్లను పమేలా ఆండర్సన్, ఉమా థుర్మాన్, సిండి క్రాఫోర్డ్, నవోమి కాంప్‌బెల్ లాంటి అంతర్జాతీయ స్టార్స్ సైతం ధరించారు. కాగా.. సోనాలి బింద్రే తెలుగువారికి కూడా సుపరిచితమే. టాలీవుడ్లో ఇంద్ర సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించింది. -
రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ కార్యదర్శిగా నియమితులైన రాజేశ్ కుమార్ సింగ్ ఢిల్లీ సౌత్ బ్లాకులో శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. కేరళ కేడర్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆర్కే సింగ్ ఈ ఏడాది ఆగస్టు 20న రక్షణశాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (రక్షణ కార్యదర్శి పదవిలో)గా బాధ్యతలు చేపట్టారు. కాగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించే కంటే ముందు ఆర్కే సింగ్ నేషనల్ వార్ మెమోరియల్‌కు వెళ్లి, అమరులైన జవానులకు నివాళులు సమర్పించారు. ‘మాతృభూమికి సేవ చేయడంలో అత్యున్నత త్యాగానికి వెనుదీయని మన శూర జవానులకు ఈ దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. అమర జవానుల అసాధారణ ధైర్య సాహసాలు, వారి త్యాగాలు భారత్‌ను ఒక సురక్షిత, సమృద్ధ దేశంగా తీర్చిదిద్దడానికి మనకందరికీ శక్తిని, ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’అని రాజేశ్ కుమార్ సింగ్ అన్నారు. అంతకు ముందు, ఆయన 2023 ఏప్రిల్ 24 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య కాలంలో వాణిజ్య, పరిశ్రమ శాఖలోని అంతర్గత వాణిజ్యం–పరిశ్రమల ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. కాగా రక్షణ కార్యదర్శిగా గురువారం పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమానే స్థానంలో ఆ పదవిని ఆర్కే సింగ్ చేపట్టారు. -
సర్దార్ పటేల్‌కు ప్రధాని మోదీ నివాళులు
న్యూఢిల్లీ: ఈరోజు (అక్టోబర్ 31) జాతీయ ఐక్యతా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్‌కు నివాళులు అర్పించారు.గుజరాత్‌లోని కేవడియాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రజలతో ఐక్యతా ప్రమాణం చేయించారు. జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. #WATCH केवड़िया, गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने सरदार वल्लभभाई पटेल की जयंती पर एकता की शपथ दिलाई। (सोर्स: डीडी न्यूज) pic.twitter.com/7w7ESJpuuB— ANI_HindiNews (@AHindinews) October 31, 2024దీనికి ముందు ప్రధాని మోదీ సోషల్ మీడియా సైట్లో ఒక పోస్ట్‌లో ఇలా రాశారు.. దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం కోసం వల్లభాయ్‌పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన వ్యక్తిత్వం, ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ పేర్కొన్నారు.भारत रत्न सरदार वल्लभभाई पटेल की जन्म-जयंती पर उन्हें मेरा शत-शत नमन। राष्ट्र की एकता और संप्रभुता की रक्षा उनके जीवन की सर्वोच्च प्राथमिकता थी। उनका व्यक्तित्व और कृतित्व देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा।— Narendra Modi (@narendramodi) October 31, 2024సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి(అక్టోబర్ 31)ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటారు. దీనిని రాష్ట్రీయ ఏక్తా దివస్ అని కూడా పిలుస్తారు . భారతదేశపు ఉక్కు మనిషిగా పేరొందిన పటేల్ దేశ స్వాతంత్ర్యం తర్వాత భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారు.ఇది కూడా చదవండి: సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు -
‘అమ్మా నీ వల్లనే’ : ఐకాన్ ఇషా భావోద్వేగం, ట్రెండింగ్‌లో దూకుడు
అంబానీ వారసురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ మరో ఘనతను సొంతం చేసుకుంది. బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా కుమార్తె, ఇషా అంబానీ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా తల్లినుద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేసింది. అలాగే తనకు దక్కిన అవార్డును తల్లి నీతాకు, తన కుమార్తె ఆదియాకు అంకితమివ్వడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రస్తుతం ఇషా గూగుల్ ట్రెండింగ్‌లో నిలిచింది.హార్పర్స్ బజార్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2024లో 'ఐకాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ఇషా అందుకుంది. ఈ అవార్డును ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్, వ్యవస్థాపకురాలు గౌరీఖాన్ ఆమెకు అందించారు. అవార్డు అందుకున్న తర్వాత, ఇషా తన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ హార్ట్ టచింగ్ ప్రసంగం చేసింది.‘‘నా విజయానికి బాటలు వేసిన నా తల్లి, నా రోల్ మోడల్" అంటూ తల్లి నీతాకు ధన్యవాదాలు తెలిపింది ఇషా. ‘అమ్మా, నీకు ధన్యవాదాలు, నీ నడకే నాకు పరుగులు నేర్పింది. ఇది నిజంగా నీ వల్లనే’.. అంటూ ప్రసంగించింది. ఈ ఘనత అంతా అమ్మకే దక్కుతుంది. అందుకే ఈ అవార్డు అమ్మకు అంకితం’’ అన్నారు. అంతేకాదు "ఈ అవార్డును నా కుమార్తె ఆదియాకు కూడా అంకితమిస్తున్నా..నా బిడ్డ ప్రతీ రోజూ నన్నెంతో ప్రోత్సహిస్తోంది’’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. రిలయన్స్ రిటైల్ డిజిటల్ ఉనికిని మెరుగుపరచడంలో ఇషా కీలక పాత్ర పోషించింది ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అజియో, ఆన్లైన్ బ్యూటీ మార్కెట్‌ప్లేస్ తీరా లాంటివాటితో వ్యాపారం రంగంలో దూసుకు పోతోంది. వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను పెళ్లాడిని ఇషాకు కవల పిల్లలు. ఇవీ చదవండి: హనీమూన్ డెస్టినేషన్ : పడవింట్లో విహారం!కలల పంటకోసం ఎదురు చూపులు : అందమైన మెటర్నిటీ షూట్ -
Ratan TATA: డాలస్‌లో రతన్ టాటాకు ఘన నివాళి
డాలస్, టెక్సాస్: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన ప్రవాస భారతీయులు. రతన్ టాటా దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త అని, ఆయన మరణం తీరనిలోటని మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన టి.సి.ఎస్ లో రతన్ టాటాతో కలసి పనిచేసి, ఆ తర్వాత విప్రో సంస్థలోచేరి సీఈఓ స్థాయికి ఎదిగిన అబిద్ఆలీ నీముచ్ వాలా రతన్ టాటాకున్న దూరదృష్టి, సాటి ఉద్యోగులతో కలసి పనిచేసిన తీరు, హాస్యపూర్వక సంభాషణలు, టాటా కంపెనీని అభివృద్ధిపధంలో నడిపినతీరు మొదలైన ఎన్నో వివరాలను సోదాహరణంగా వివరించి రతన్ టాటాకు శ్రద్ధాంజలి ఘటించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “రతన్ టాటా కంపెనీ ఛైర్మన్ గా తన రెండు దశాబ్దాలకు పైగా సాగిన ప్రస్థానంలో కేవలం భారతీయకంపెనీగా ఉన్న టాటా కంపెనీని అంతర్జాతీయకంపెనీ స్థాయికి తీసుకువెళ్ళిన తీరు, కంపెనీ లాభాలను 50 రెట్లు పెంచిన విధానం, లాభాలలో 60 శాతానికి పైగా సమాజాభివృద్ధికి వెచ్చించిన సామాజికస్పృహ అందరికీ ఆదర్శప్రాయం” అంటూ పుష్పాంజలి ఘటించారు. రతన్ టాటా ప్రతి అడుగులోనూ దేశభక్తి కొట్టొచ్చినట్లు కన్పిస్తుందని, భౌతికంగా రతన్ టాటా మనకు దూరం అయినప్పటికీ ఆయనచేసిన సేవలు చిరస్మరణీయం అంటూ మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు రాజీవ్ కామత్, మురళీ వెన్నం, రన్నా జానీ, రజనీ జానీ, రాంకీ చేబ్రోలు, తాయాబ్ కుండావాలా, ఫాతిమా కుండావాల, తిరుమల్ రెడ్డి కుంభం, సతీష్ బండారు, చినసత్యం వీర్నపు, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, లెనిన్ వేముల, విజయ్ బొర్రా, వాసు గూడవల్లి, జిగర్ సోనీ, రాజేశ్వరి ఉదయగిరి, కిశోర్, షోవిన్ మొదలైనవారు రతన్ టాటా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. -
రతన్‌టాటాకు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి (ఫొటోలు)
-
మీరు దేశం కోసమే పుట్టారు.. రతన్ టాటాకు సినీ లోకం ఘన నివాళి
-
రతన్ టాటా మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ చావల్ టాటా మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్ రతన్ టాటా అని వైఎస్ జగన్ కొనియాడారు. సమాజం కోసం రతన్ టాటా పనిచేశారు. దేశ నిర్మాణానికి రతన్ టాటా సహకారం అందించడంతో పాటు, దేశానికి రతన్ టాటా సేవలు స్పూర్తిదాయకమన్నారు వైఎస్ జగన్.Deeply saddened by the loss of Shri Ratan Tata Ji. A true visionary whose kindness, integrity, and leadership will continue to inspire us and generations to come. My condolences to the Tata family .— YS Jagan Mohan Reddy (@ysjagan) October 10, 2024 -
మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు
న్యూఢిల్లీ:ఈరోజు (అక్టోబర్ 2) జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. ఈ సందర్భంగా మహాత్ముని సేవలను దేశ ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారు. అలాగే ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి, మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తున్నారు.#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने महात्मा गांधी की जयंती के अवसर पर राजघाट पर उन्हें श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/MR16VWiugs— ANI_HindiNews (@AHindinews) October 2, 2024ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(మంగళవారం) ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని, మహాత్మునికి నివాళులు అర్పించారు. జాతిపితను స్మరించుకుంటూ, బాపూజీ జయంతి సందర్భంగా దేశప్రజలందరి తరపున ఆయనకు నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో రాశారు. సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన ఆయన జీవితం, ఆదర్శాలు ఎల్లప్పుడూ దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు.బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన మహాత్మా గాంధీ స్వాతంత్య్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించారు. గాంధీ చేపట్టిన ఉద్యమాలు దేశ ప్రజలను స్వాతంత్య్ర పోరాటానికి పురిగొల్పాయి. జాతిపిత మహాత్మాగాంధీ నాడు చూపిన తెగువ, అంకితభావాన్ని నేడు అందరూ గుర్తుచేసుకుంటున్నారు.सभी देशवासियों की ओर से पूज्य बापू को उनकी जन्म-जयंती पर शत-शत नमन। सत्य, सद्भाव और समानता पर आधारित उनका जीवन और आदर्श देशवासियों के लिए सदैव प्रेरणापुंज बना रहेगा।— Narendra Modi (@narendramodi) October 2, 2024లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా గాంధీ పుట్టినరోజున అంటే అక్టోబర్ 2వ తేదీనే జరగడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని కూడా గుర్తు చేసుకున్నారు. దేశ సైనికులు, రైతుల ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శాస్త్రికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. देश के जवान, किसान और स्वाभिमान के लिए अपना जीवन समर्पित करने वाले पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री जी को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि।— Narendra Modi (@narendramodi) October 2, 2024ఇది కూడా చదవండి: అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు -
గురజాడ అప్పారావుకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.‘‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అన్న దేశభక్తి గీతాన్ని సమాజాన్ని మేల్కొలిపే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తెలుగుజాతికి అందించిన అభ్యుదయ కవితా పితామహుడు, గురజాడ అప్పారావు. ఆయన జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.“దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అన్న దేశభక్తి గీతాన్ని, సమాజాన్ని మేల్కొలిపే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తెలుగుజాతికి అందించిన అభ్యుదయ కవితా పితామహుడు, గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2024 ఇదీ చదవండి: -
సీతారాం ఏచూరికి విజయసాయిరెడ్డి నివాళి
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ రాజకీయ వేత్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. సీపీఎం నేతలు రాఘవులు, మధులను పరామర్శించిన విజయసాయిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘పీడిత పక్షాన రాజీలేని పోరాటం చేసిన యోధుడు ఏచూరి. నమ్మిన సిద్ధాంతాలను జీవితాంతం ఆచరించారు. ఏచూరి విషయ పరిజ్ఞానం, భావ ప్రకటన స్ఫూర్తిదాయకం. ఏచూరితో పార్లమెంట్లో కలిసి పనిచేసే అవకాశం లభించడం మర్చిపోలేను’’ అని విజయసాయి పేర్కొన్నారు.ఇదీ చదవండి: అలా వెళ్లిపోయావేం... ఏచూరీ!శనివారం ఉదయం వసంత్‌కుంజ్‌లోని ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. విదేశాల నుంచి వచ్చిన కమ్యూనిస్టు నేతలు, దేశంలోని ప్రముఖలు నివాళులర్పించేందుకు వీలుగా అక్కడ ఉంచారు. అనంతరం మధ్యాహ్న సమయంలో ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించనున్నారు. ముందే ప్రకటించిన విధంగా విద్యార్థుల వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించనున్నారు. -
వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు
వైఎస్సార్, సాక్షి: సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 15వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.ఈ ప్రార్థనా కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మదర్ థెరీసా జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు శాంతిదూత మదర్ థెరీసా జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిసా అని కొనియాడారు.ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు అనాథ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిషత్తుకు బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె అని ప్రశంసించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలోని నిర్మల్ హృదయ్ భవన్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వారికి సహాయ సహకారాలు అందించామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ భవనం కాంప్లెక్స్‌ను ఆరోజు తాను ప్రారంభించండం సంతోషంగా ఉందని తెలిపారు. నేడు భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరిసాగారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిసాగారు. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు అనాథ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిషత్తుకు బంగారు… pic.twitter.com/KFVYHYaXOQ— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2024 -
వైఎస్ఆర్ స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ!
సాక్షి,న్యూఢిల్లీ: వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అసలు సిసలైన ప్రజా నాయకుడని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కొనియాడారు. వైఎస్ఆర్ నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. తాను దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్రే స్ఫూర్తి అని తెలిపారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సోమవారం(జులై 8) నివాళి అర్పించిన రాహుల్‌గాంధీ ప్రత్యేాక వీడియో విడుదల చేశారు. ప్రజల కోసమే జీవించిన నాయకుడు రాజశేఖర్‌రెడ్డి అని కీర్తించారు. ఆయన బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావన్నారు. My humble tributes to former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his 75th birth anniversary.A true leader of the masses, his grit, dedication, and commitment to the upliftment and empowerment of the people of Andhra Pradesh and India has been a guiding… pic.twitter.com/iuGVsmsW8g— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2024 -
అడ్వాణీకి పొరపాటున మంత్రి శ్రద్ధాంజలి!
తుమకూరు: బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అడ్వాణీ చనిపోయారంటూ కేంద్రమంత్రి వి.సోమణ్ణ ఏకంగా ఆయనకు శ్రద్ధాంజలే ఘటించారు! కర్ణాటకలోని తుమకూరులో శనివారం ఈ ఘటన జరిగింది. అడ్వాణీ అనారోగ్యంతో రెండుసార్లు ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకోవడం తెలిసిందే. మంత్రి మాత్రం బీజేపీ, జేడీ(ఎస్) కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నాకిప్పుడే సమాచారం అందింది. అడ్వాణీ మరణించారు’’ అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. అడ్వాణీ క్షేమంగా ఉన్నారని తేలడంతో సభికులంతా కంగుతిన్నారు. -
వీర జవాన్లకు అశ్రు నివాళి
విమానాశ్రయం(గన్నవరం)/రేపల్లె రూరల్/పెడన: లద్దాఖ్‌లో భారత్ – చైనా సరిహద్దు సమీపంలోని షియోక్ నదిలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు జవాన్లకు ప్రజలు అశ్రు నివాళులర్పించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లెకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ముత్తముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్రకు చెందిన జవాను సాదరబోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్‌కు చెందిన హవల్దార్ సుభాన్‌ఖాన్ మృతి చెందారు. వారి పారి్ధవదేహాలు సోమవారం గన్నవరం విమానాశ్రయానికి సోమవారం చేరుకున్నాయి.వీర జవాన్ల భౌతికకాయాలను ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి భారత వాయుసేనకు చెందిన విమానంలో సాయంత్రం ఇక్కడికి తీసుకువచ్చారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌లోని ఇంటర్నేషనల్ టెరి్మనల్ ఆవరణలో జవాన్ల పార్ధివదేహాలను ప్రజల సందర్శనార్ధం ఉంచారు. వీర జవాన్లకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తరపున ఆయన ఏడీసీ దీపక్‌శర్మ, పలువురు సైనికాధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం జవాన్ల భౌతికకాయాలను రోడ్డు మార్గం ద్వారా వారి స్వగ్రామాలకు తరలించారు. హవల్దార్ సభాన్ఖాన్, జవాను నాగరాజు అంత్యక్రియలు సోమవారం వారి స్వగ్రామాల్లో సైనిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామంలో ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుభాన్‌ఖాన్‌కు అశ్రునయనాలతో తుది వీడ్కోలు సుభాన్‌ఖాన్ (42) భౌతికకాయం సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అతని స్వగ్రామం ఇస్లాంపూర్‌కు చేరుకుంది. సుభాన్‌ఖాన్ భౌతికకాయంను కడసారి చూసి తుది వీడ్కోలు పలికేందుకు గ్రామస్తులతో పాటు సమీప గ్రామంలోని ప్రజలు అతని గృహం వద్దకు చేరుకున్నారు. దేశరక్షణలో భాగంగా ప్రాణాలర్పించిన సుభాన్‌ఖాన్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సుభాన్‌ఖాన్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్డీవో హెలా షారోన్, డీఎస్పీ మురళీకృష్ణ, పలు శాఖల అధికారులు సుభాన్‌ఖాన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం సైనిక, పోలీసు లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. 17 ఏళ్ల క్రితం ఆర్మీలో జవాన్‌గా జీవితం ప్రారంభంసుభాన్ఖాన్ 17 సంవత్సరాల క్రితం ఆర్మీలో సైనికునిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో పని చేస్తూ ప్రమాదవశాత్తు కన్నుమూశారు. సుభాన్‌ఖాన్‌కు భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.ఆయన మరో రెండు సంవత్సరాలలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. సుఖాన్ఖాన్ తన కుటుంబాన్ని చూసుకునేందుకు ఈ నెల 7న కైతేపల్లి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఆయన ఆకస్మిక మృతిని జీరి్ణయించుకోలేని కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరులు సైతం కంటతడి పెట్టిస్తోంది.జవాన్ నాగరాజుకు ఘనంగా అంతిమ వీడ్కోలు ఆర్మీ జవాను సాదరబోయిన నాగరాజు (32) పారి్ధవదేహం సాయంత్రం 5.30 గంటల సమయంలో స్వగ్రామమైన చేవెండ్లకు చేరుకుంది. ఈ విషయం తెలిసి స్వగ్రామంతోపాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు వడ్లమన్నాడుకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా చేవేండ్రకు తీసుకొచ్చారు. అక్కడ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ, మచిలీపట్నం ఆర్డీవో ఎం.వాణి, డీఎస్పీ, సీఐలు, పలువురు అధికారులు, వివిధ పారీ్టల నాయకులు నాగరాజు పారి్ధవదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంతిమక్రియలు నిర్వహించారు. నాగరాజు మరణం దురదృష్టకరమని, దేశం ఓ వీరుడిని కోల్పోయిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నివాళులర్పించారు. -
నిజ్జర్‌కు కెనడా నివాళి.. స్పందించిన భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్ సంతాపం ప్రకటించడంపై భారత ప్రభుత్వం శుక్రవారం(జూన్ 21) స్పందించింది. వేర్పాటువాదం, హింసను సమర్థించే చర్యలను వ్యతిరేకిస్తామని తెలిపింది. గతేడాది జూన్‌లో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా బయట నిజ్జర్‌ను కొందరు దుండగులు కాల్చి చంపారు.ఈ ఘటన వెనుక భారత ‘రా’ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్య విభేదాలు ఏర్పడ్డాయి. ట్రూడో ఆరోపణలను అప్పట్లో భారత్ ఖండించింది. హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా ప్రభుత్వం ఆ దేశ పార్లమెంట్లో ఇటీవల నిజ్జర్‌కు నివాళులర్పించడం గమనార్హం. ఓ దేశం ఉగ్రవాదిగా ప్రకటించడమే కాకుండా ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి మృతికి దేశ పార్లమెంట్లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం దీనికి తగిన కౌంటర్ కూడా ఇచ్చింది.ఎయిర్ ఇండియాా కనిష్క విమానాన్ని గాల్లో పేల్చివేసి ఈ జూన్ 23కు 39 సంవత్సరాలు పూర్తవుతుంది. ఖలిస్తానీ తీవ్రవాదులు పెట్టిన బాంబుకు ఆ విమానం ముక్కలు కావడంతో 329 మంది మృతి చెందారు. ఆ రోజున వాంకోవర్‌లో ఉన్న ఎయిర్ ఇండియా మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించనున్నట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ మృతి చెంది ఏడాది గడిచిన సందర్భంగా మంగళవారం కెనడా పార్లమెంటు నివాళులరి్పంచింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో సభ్యులు మౌనం పాటించారు. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) అధినేత నిజ్జర్ గత ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా గురుద్వారా ఎదుట జరిగిన కాల్పుల్లో హతమాయ్యాడు. భారత ప్రభుత్వం ప్రకటించిన టెర్రిరిస్టుల జాబితాలో నిజ్జర్ పేరు ఉంది. నలుగురు భారతీయులు నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 1997లో నకిలీ పాస్‌పోర్ట్‌పై నిజ్జర్ కెనడాకు వెళ్లాడు. శరణార్థిగా కెనడా పౌరసత్వాన్ని కోరాడు. ఇది తిరస్కరణకు గురైంది. అనంతరం తాను కెనడాకు రావడానికి సహాయపడ్డ మహిళను నిజ్జర్ వివాహమాడి మరోమారు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోగా.. మళ్లీ తిరస్కరణకు గురైంది. అయితే నిజ్జర్ హత్యకు గురైన వెంటనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయూ అతను కెనడా పౌరుడని పార్లమెంటులో చెప్పారు. నిజ్జర్ కేటీఎఫ్ కోసం నియామకాలు చేసుకొని.. వారికి శిక్షణ ఇస్తున్నాడని భారత భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి అరి్పంచడంపై వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానంలో ఖలిస్తానీ తీవ్రవాదులు బాంబులు అమర్చడంతో 329 ప్రాణాలు కోల్పోయారు. వారి స్మృత్యర్థం ఈనెల 23న (విమాన ఘటన 39 ఏళ్లు) సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. -
Naba Natesh: లెజెండ్రీ నటుడికి నివాళిగా.. నబా నటేష్ ఇలా మారిపోయింది! (ఫోటోలు)
-
మహాత్ముడికి సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ‘‘సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/JzQs860tFe — YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2024 -
ఈసీ గంగిరెడ్డికి నివాళులర్పించిన వైఎస్ భారతి
-
Actor Surya : బోరున ఏడ్చిన హీరో సూర్య, విజయ్ కాంత్ కు స్టార్ హీరో నివాళి (ఫొటోలు)
-
వైఎస్సార్‌కు నివాళులర్పించిన భట్టి
హైదరాబాద్: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మల్లు భట్టి విక్రమార్క.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. తన నివాసంలోని పూజ గదిలో ఉన్న వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌పై తనకున్న అభిమానాన్ని భట్టి చాటుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భట్టి విక్రమార్క మల్లు గారు తన నివాసంలోని పూజ గదిలో ఈరోజు ఉదయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు #BhattiVikramarkaMallu#YSRLivesOn pic.twitter.com/8O9oo7iSsh— Bhatti Vikramarka Mallu (@BhattiCLP) December 7, 2023 తెలంగాణలో నేడు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. రేవంత్ రెడ్డి సీఎంగా పదవి చేపట్టనున్నారు. మంత్రులుగా భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖతో సహా మొత్తం 11 మంది మంత్రి పదవులకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఇదీ చదవండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ? -
లతా మంగేష్కర్‌కు ఆ విధంగా నివాళి అర్పించిన రెహమాన్ కుమార్తె
వారంతా స్త్రీలే. 26 దేశాల మహిళలు కలిసి దుబయ్‌లో ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా’గా ఏర్పడ్డారు. తమ ప్రదర్శనలతో అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా లతా మంగేష్కర్‌కు నివాళిగా ఆమె పాడిన ఐదు పాటలను ‘కుహు కుహు’ పేరుతో ఆల్బమ్‌గా విడుదల చేశారు. ఏ.ఆర్. రెహమాన్ కుమార్తె ఖతిజా రెహమాన్ ఈ ఐదు పాటలు పాడింది. ‘లతా ఒక శక్తి. మేమందరం ఈ ఆల్బమ్ ద్వారా స్త్రీ శక్తిని చాటాం’ అని తెలిపింది ఖతిజా.శ్రోతలకు ఇదో శ్రావ్యమైన కానుక. ‘ఆర్కెస్ట్రా అనగానే రికార్డింగ్ స్టుడియోలో, స్టేజ్ మీద మగవారు నిండిపోయి ఉంటారు. కండక్టర్‌గా ఎప్పుడూ సూట్ వేసుకున్న మగవాడే కనిపిస్తాడు. ఈ స్టీరియోటైప్ మారాలి. ప్రపంచంలో ఉత్తమమైన మ్యుజీషియన్స్‌గా స్త్రీలు ఉన్నారు. వారంతా తమ ప్రతిభను చూపాలి. మేమంతా అందుకే ఒక వేదిక మీదకు వచ్చి పెర్ఫామ్ చేస్తున్నాం’ అంటారు దుబయ్‌లోని ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా’ సభ్యులు. 26 దేశాల నుంచి 51 మంది మహిళా సంగీతకారులు ఇక్కడ తమ సంగీతాన్ని వినిపిస్తున్నారు. ప్రోగ్రామ్‌లు ఇస్తున్నారు. వీరికి ఇక్కడ రికార్డింగ్ స్టుడియో ఉంది. ఇందులో సినిమాలకూ పని చేస్తున్నారు. ఎమిరేట్స్ మహిళా మంత్రి రీమ్ అల్ హష్మి ఏ.ఆర్.రెహమాన్‌ను మహిళలను ప్రోత్సహించే ఆర్కెస్ట్రాను దుబాయ్‌లో ఏర్పాటు చేయమని కోరారు. రెహమాన్ ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేయడంలో సాయపడి పర్యవేక్షిస్తున్నారు. వారితో రికార్డింగ్స్ కూడా చేస్తున్నారు. పొన్నియన్ సెల్వమ్ 2’ రీ రికార్డింగ్ ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలోని మహిళలే చేశారు. అరెబిక్ సౌందర్యం ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలో వివిధ దేశాల మహిళా సంగీతకారులు పని చేస్తున్నా ఈ ఆర్కెస్ట్రా ముఖ్య ఉద్దేశం అరబిక్ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో మిళితం చేసి కొత్త అందాన్ని తీసుకురావడమే. ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా లో తమతమ దేశాలకు చెందిన నేటివ్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు అరేబియాలో ఉపయోగించే సంగీత పరికరాలు కూడా వాడి గొప్ప మిళిత సంగీతాన్ని సృష్టిస్తున్నారు. ‘మేమంతా వేరువేరు జీవితాలు, వేరు వేరు సంగీత ధోరణుల నుంచి వచ్చాం. కాని రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టి ఒక్కటిగా మారి సమష్టిగా సంగీతాన్ని సృష్టిస్తాం. ఈ అనుభూతి అద్భుతంగా ఉంటుంది’ అంటారు ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా సభ్యులు. వీరికి కండెక్టర్‌గా మోనికా ఉమ్మెన్ అనే మహిళ పని చేస్తోంది. లతాకు నివాళి తండ్రి పర్యవేక్షణలో సాగుతున్న ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాతో కలిసి పని చేయడానికి ముందుకొచ్చింది ఖతిజా రెహమాన్. ‘నేను వారితో పని చేసినప్పుడు వారు చూపిన ప్రేమ చాలా నచ్చింది’ అంటుందామె. గాయని అయిన ఖతిజా ఇటీవల తమిళ సినిమాలకు సంగీతం కూడా అందిస్తోంది. లతా మంగేష్కర్‌కు నివాళిగా ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాతో కలిసి ‘కుహు కుహు’ ఆల్బమ్ తయారు చేసింది. ‘మేమందరం లతా పాటలను పునఃసృష్టించాలనుకున్నాం’ అంది ఖతీజా. లతా పాడిన ఐదు పాటలను ఎంపిక చేసుకుని ఖతీజా ఈ ఆల్బమ్‌లో పాడింది. అవి 1. పియా తోసే నైనా లాగేరే (గైడ్), 2.ఆప్ కీ నజరోనే సంఝా (అన్పడ్), 3. ఓ సజ్నా బర్ఖా బహార్ ఆయీ (పరఖ్), 4. కుహు కుహు బోలే కోయలియా (సువర్ణ సుందరి), 5. బేకస్ పె కరమ్ కీజియే (మొఘల్ ఏ ఆజమ్). ఈ ఐదు పాటలకు ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలోని మహిళలు సంగీతం అందించారు. బాణీలు యధాతథంగా ఉన్నా ఆర్కెస్ట్రయిజేషన్లో తమ సృజనను ప్రదర్శించారు. సాధారణంగా పాత పాటలు కొత్త తరహాగా పాడితే నచ్చవు. కాని ఖతీజా గళం, ఫిర్దౌస్ సంగీతం శ్రోతలకు శ్రావ్యమైన అనుభూతిని ఇచ్చాయి. గొప్ప గాయని లతా మంగేష్కర్‌కు ఇది ఒక మంచి నివాళిగా నిలిచిపోతుంది. -
నాన్నా.. మీ ఆశయాలే నన్ను నడిపిస్తున్నాయ్: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: దివంగత మహానేత వైస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. ‘‘నాన్నా... మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది’’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారాయన. భౌతికంగా మా మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా అంటూ ట్వీట్లో పేర్కొన్నారాయన. నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి… pic.twitter.com/Fq1Ngg4f5Q — YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2023 ఇక వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ అభిమానగణం తరలివెళ్తోంది. సీఎం జగన్ కూడా వైఎస్సార్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించనున్నారు. -
వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ సహా పలువురు నివాళులు అర్పించారు
-
'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరపున తొలి గోల్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. 75 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించిన మెస్సీ అరంగేట్రం మ్యాచ్‌లో ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతేకాదు అదనపు సమయంలో ఇంటర్ మియామి క్లబ్‌కు గోల్ అందించి 2-1 తేడాతో గెలవడంలో కీలకపాత్ర వహించాడు. కాగా మెస్సీకి ఇది 808వ గోల్ కావడం విశేషం. ఇక ఆల్‌టైమ్ గ్రెటెస్ట్ ప్లేయర్లను G.O.A.Tగా అభివర్ణిస్తుంటారు. ఈ సందర్భంగా మెస్సీపై అభిమానంతో GOAT అనే పదాన్ని చిప్స్(తినేవి) తయారు చేసే లేస్(Lays Chips) కంపెనీ మెస్సీ గోల్‌ను వినూత్నరీతిలో సెలబ్రేట్ చేసింది. మెస్సీ తన కెరీర్లో 808వ గోల్ చేసిన తర్వాత అవే 808 మేకలతో మెస్సీ రూపం వచ్చేలో ఓ అద్భుతమైన ఫొటోను క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న 808 మేకలతో మెస్సీ రూపాన్ని క్రియేట్ చేసింది. మెస్సీకి ట్రిబ్యూట్ అందిస్తూనే లేస్ తన చిప్స్ యాడ్‌ను రూపొందించింది. ఇందులో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T)కు అర్థం వచ్చేలా.. మేకలతో ట్రిబ్యూట్ ఇవ్వడం విశేషం. ఈ వీడియోలో 808 మేకలను సరిగ్గా మెస్సీ ముఖం వచ్చేలా నిల్చోబెట్టారు. పైన యాంగిల్ నుంచి చూస్తే మెస్సీ ముఖం స్పష్టంగా కనిస్తోంది. +1 🐐 for the 808th goal for the G.O.A.T #Messi #GoatsForGoals pic.twitter.com/LUviACWR4p — LAY'S (@LAYS) July 22, 2023 చదవండి: Cricketer Minnu Mani: భారత క్రికెటర్‌కు అరుదైన గౌరవం.. కోహ్లి టాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. -
కళాకారుడికి అశ్రునివాళి: ముగిసిన సాయిచంద్ అంత్యక్రియలు
Telangana Folk Singer Sai Chand Last Rites Updates ► గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి. వనస్థలీపురం సాహెబ్‌నగర్ శ్మశాసనవాటికలో సాయిచంద్ అంత్యక్రియలు జరిగాయి. చితికి సాయిచంద్ కొడుకు నిప్పంటించారు. ► గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. సాయి చంద్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ క్రమంలో సాయి చంద్ భార్య భావోద్వేగానికి లోనై రోదించగా.. కేసీఆర్ ఆమెను ఓదార్చారు. ► తెలంగాణ జానపద కళాకారుడు, ఉద్యమ గాయకుడు సాయి చంద్ భౌతిక కాయాన్ని చూసి కేసీఆర్ కంటతడి పెట్టారు. ► తెలంగాణ సమాజం ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయింది. సాయి చంద్ కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం కేసీఆర్ ► కాసేపట్లో గుర్రం గూడకు ముఖ్యమంత్రి కేసీఆర్.. సాయి చంద్ భౌతిక కాయానికి నివాళులు ► సాయి చందు పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ ► సాయిచంద్ మృతిపై సంతాప ప్రకటన వెలువరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. సాయిచంద్ మృతదేహానికి నివాళులర్పించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ‘‘రాతి గుండెల్ని సైతం కరిగించిన గాత్రం సాయిచంద్‌ది. మా అందరికీ ఆత్మీయుడతను. చనిపోయడనే వార్త జీర్ణించుకోలేక పోతున్నం. ఆయన లేని లోటు తీర్చలేదు. హైదరాబాద్‌లో ఉంటే బ్రతికే వాడేమో!. అత్యంత చిన్న వయస్సులోనే చనిపోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు. ► సాయి చంద్ పాటలు అందరినీ కదిలిస్తాయ్: మంత్రి తలసాని ► సాయి చంద్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కంట తడి పెట్టారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ‘‘తమ్ముడు సాయి చంద్ లేడని ఊహించుకుంటేనే బాధ గా ఉంది. చిన్న వయసు లో చనిపోవడం దురదృష్టం. నిజాయితీ గల సైనికుడు సాయి చంద్. తన పాట ఖండాంతరాలు దాటాయి. నా మనుసుకు దగ్గర వ్యక్తి కూడా. చాలా సార్లు మా ఇంటికి వచ్చాడు. సీఎం కెసీఆర్ కూడా తనను ఇంకా ఎక్కువ గౌరవించుకోవాలి అనేవారు. సాయిను మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ► తెలంగాణ ఉద్యమ గాయకుడు, బీఆర్ఎస్ నేత.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. సీఎం కేసీఆర్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. గుర్రంగూడలో ఉన్న ఆయన భౌతికకాయానికి ప్రముఖులు వెళ్లి నివాళులు అర్పించి.. ఆయన కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. కన్నీటితో నివాళులర్పిస్తున్నారంతా. ► తెలంగాణ కళాకారుడు, మలిదశ ఉద్యమ సమయంలో తన గాత్రంతో ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రాజేసిన గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం.. యావత్ తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. కేవలం 39 ఏళ్ల వయసులో.. అదీ ఉన్నపళంగా గుండెపోటుతో కన్నుమూయడాన్ని కుటుంబ సభ్యులు, అతన్ని అభిమానించేవాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఇదీ చదవండి: ఉద్యమ పాట.. ఆగింది -
MS Dhoni: ధోనికి అంకితం.. దేనికి సంకేతం?
ఐపీఎల్ 2023 ఘన విజయంతో అత్యధిక ట్రోఫీలను కైవసం చేసుకుని.. సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్) సరసన నిలిచాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని. నెక్స్ట్ సీజన్ ఐపీఎల్లో ఆడతాడా? లేదా? అనుమానంగానే ఉంది. అయితే తమ కెప్టెన్‌కు భావోద్వేగమైన వీడియోను అంకితమించింది సీఎస్కే. అయితే ఈ వీడియోపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 ఐపీఎల్ సీజన్లో సీఎస్కే కెప్టెన్ ధోనీ క్రేజ్ మాములుగా కనిపించలేదు. స్టేడియంలోకి అడుగుపెట్టేటప్పటి నుంచి బంతుల్ని బౌండరీలకు తరలించేదాకా.. అభిమానం వెల్లువలా పొంగింది. ఒకానొక టైంలో ఇదే ధోనీకి లాస్ట్ ఐపీఎల్ సీజన్.. రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ చర్చ జోరుగా సాగింది ఈ సీజన్ అంతా. అయితే.. తన రిటైర్మెంట్పై స్పష్టమైన ప్రకటన చేయకుండా మీడియాను గందరగోళంలోకి నెట్టేశాడు మిస్టర్ కూల్. ఈ తరుణంలో ఉన్నట్లుండి ధోనీ పై సీఎస్కే ఓ వీడియో ట్వీట్ చేయడం.. అదీ ఓ కెప్టెన్ మై కెప్టెన్ అంటూ క్యాప్షన్ ఉంచడంతో అభిమానుల్లోనూ పలు అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా మోకాలికి ఆపరేషన్ కాగా.. ప్రస్తుతం ధోనీ కోలుకుంటున్నాడు. Oh Captain, My Captain! 🥹#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/whJeUjWUVd — Chennai Super Kings (@ChennaiIPL) June 13, 2023 ఇదీ చదవండి: కోహ్లి అలా చేస్తాడని ఊహించలేదు! -
పొట్టి శ్రీరాములు జయంతి.. నివాళులు అర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఇటీవల మరణించిన సినీ ప్రముఖులకు ఏపీ కేబినెట్ నివాళులు
ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నివాళులర్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం ఇటీవల మరణించిన సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్ సాగర్‌కు నివాళి అర్పిస్తూ మంత్రివర్గం మౌనం పాటించింది. -
లెజెండరి సింగర్ వాణీ జయరాంకు అమూల్ ఘన నివాళి
లెజెండరి సింగర్ వాణీ జయరాం శనివారం(ఫిబ్రవరి 4న) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆమె ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. 5 దశాబ్దాలుగా 14 భాషల్లో తన గాత్రాన్ని అందించారు వాణీ జయరాం. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. తెలగు, తమిళం, కన్నడ, హిందీ, మళయాల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. చదవండి: వచ్చే వారమే ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం? ట్వీట్ వైరల్ అలాగే ఆమె మృతికి ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నంగా నివాళులు తెలిపింది. ఆమెకు ప్రత్యేకంగా డూడుల్‌తో సంతాపం తెలిపింది. వాణీ జయరాం పాట పాడుతున్న ఫొటోను డూడుల్‌లో డిజైన్ చేసి ఘన నివాళి అర్పించింది అమూల్. దీనిని తన అధికారిక ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ప్రతి రాగంలో ఆమె కవిత వికసించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. రిప్ వాణీ జయరాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ప్రస్తుతం అమూల్ ట్వీట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆమె డూడుల్ ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 37వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్స్ వచ్చాయి. చదవండి: ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత #Amul Topical: Tribute to legendary playback singer of South Indian cinema pic.twitter.com/jSuzQfndkz — Amul.coop (@Amul_Coop) February 5, 2023 -
కె విశ్వనాథ్ మృతికి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి ఘన నివాళి
వెండితెర కళాతపస్వి కె విశ్వనాథ్ అంత్యక్రియలు శుక్రవారం(ఫిబ్రవరి 3న) మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశాన వాటికలో ముగిశాయి. ఫిలిం నగర్ నుంచి పంజాగుట్ట వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగింది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున కె. విశ్వనాథ్ పార్థివ దేహానికి ఆయన ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘దర్శక దిగ్గజంగా ఎదిగిన కె. విశ్వనాథ్ తన మొదటి సినిమాతోనే నంది అవార్డు గెలుచుకున్నారు. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటనతో కూడా అందరిని మెప్పించే పాత్రలు చేసి సినీ ప్రేక్షక హృదయాల్లో చిరస్మరణీయడుగా నిలిచారు. ఆయన రూపొందించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి సినిమాలతో దేశ సినిచరిత్రలో కె.విశ్వనాథ్ తనదైన ముద్ర వేసుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు, రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ వంటి అత్యున్నతమైన అవార్డులను కె.విశ్వనాథ్ అందుకున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను కోల్పోవడం తెలుగు సినీ రంగానికి తీరని లోటు’ అని మంత్రి పేర్కొన్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
సినిమా అనే ఓ బస్సు పట్టుకుని.. కళాతపస్వి మాటలు వైరల్
కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ కన్నుమూతతో యావత్ సినీ రంగం విషాదంలో కూరుకుపోయింది. 92 ఏళ్ల వయసులో వృద్ధాప్య రిత్యా సమస్యలతో చికిత్స పొందుతూ కన్నుమూశారాయన. తొలినాళ్లలో కుటుంబ కథా చిత్రాలతో అలరించిన ఆయన.. ఆ తర్వాతి కాలంలో కళలను మేళవించి తీసిన ప్రేక్షకలోకాన్ని రంజింప చేశాయి. సినీ ప్రముఖులే కాదు.. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన తరం సైతం సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తోంది. ‘‘సినిమా అనే ఓ బస్సు పట్టుకుని.. సినిమా చూసే ప్రేక్షకులను భక్తులు అనుకుని.. నేను ఒక బస్సు నడిపే డ్రైవర్ని. నేనేం చేయాలి నేను?’’. ఏం చేయగలరు.. ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించడం తప్ప! అందుకే ఆ దర్శక దిగ్గజానికి నివాళిగా ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాదు.. దర్శకుడిగా సెట్స్‌లో ప్రత్యేకమైన దుస్తుల్లో కనిపించడమూ చాలామందికి తెలిసే ఉండొచ్చు. దర్శకత్వం.. ఓ బాధ్యత, ఓ విధి, ఓ ఉద్యోగం లాంటిది. అందుకే దాన్ని విధిగా ఆచరించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన డైరెక్షన్లో ఉన్నప్పుడు సెట్స్‌లో మిగతా సిబ్బందిలాగే.. ఖాకీ యూనిఫాంలో కనిపించేవారట. ‘‘దర్శకుడ్ని అయిపోగానే తెల్ల ప్యాంటూ, తెల్ల చొక్కా, తెల్ల బూట్లూ, మెళ్లో గొలుసులూ వేసుకుని హడావుడి చేయడం(ఆ టైంలో దర్శకులకు సింబాలిజం అది) నాకిష్టం లేదు. దర్శకుడి కుర్చీ దక్కితే కళ్లు నెత్తికెక్కే ప్రమాదం ఉంటుంది కదా? అందుకే మామూలుగా ఉండాలనుకున్నా!’’ అని పాత ఇంటర్వ్యూలలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. Anguished to hear about passing away of legendary director #KVishwanath Garu. His contribution to Indian Cinema will remain a source of inspiration for others. RIP Sir Rest In Peace K. Vishwanath Garu 🙏 Om Shanti 🙏 pic.twitter.com/ufcx5hXkYb — देशी छोरा (@Deshi_Indian01) February 3, 2023 -
K.Viswanath: ఆయన కళ అజరామరం- కమల్ హాసన్
లోకనాయకుడు కమల్ హాసన్‌కు తెలుగులో స్టార్‌డమ్‌ను తీసుకొచ్చిన వ్యక్తి.. కళాతపస్వి కే. విశ్వనాథ్. వాళ్లిద్దరి మధ్య అనుబంధం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే ఆయన మృతిపై కమల్ ఎమోషనల్ అయ్యారు. కళాతపస్వి కె విశ్వనాథ్ గారు జీవిత పరమార్థాన్ని, కళ యొక్క అమరత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందువల్లే జీవితకాలం దాటినా.. ఆయన కళకు గుర్తింపు ఉంటూనే ఉంటుంది. ఆయన కళ అజరామరం. అమితమైన అభిమాని కమల్ హాసన్ అంటూ ట్వీట్ చేశారాయన. Salute to a master . pic.twitter.com/zs0ElDYVUM — Kamal Haasan (@ikamalhaasan) February 3, 2023 కిందటి ఏడాది హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో తన మాస్టర్ విశ్వనాథ్‌ను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు కమల్. ఆ సమయంలో పాత విషయాలను గుర్తు చేసుకున్నట్లు కమల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాగర సంగమంతో మొదలైన వీళ్ల కాంబోలో.. స్వాతి ముత్యం, శుభ సంకల్పం లాంటి కల్ట్ క్లాసిక్లు వచ్చాయి. శుభ సంకల్పంతో పాటు కురుతిపునాల్(ద్రోహి), ఉత్తమ విలన్ చిత్రాల్లో కలిసి నటించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గురించి స్పందిస్తూ.. కమల్ హాసన్‌కు సినిమా గురించి అపారమైన నాలెడ్జ్ ఉంది. నటనలో, దర్శకత్వంలో అతనికి తెలియనిది అంటూ లేదు. అంత నాలెజ్డ్ ఉండడం తప్పు సినిమా రంగంలో అంటూ విశ్వనాథ్ చమత్కరించారు. అంతేకాకుండా..కమల్ హాసన్‌తో సినిమా తీస్తున్నప్పుడు ఎలాంటి నటన రాబట్టాలనే విషయాన్ని ఆలోచిస్తానన్నారాయన. K. Vishwanath Ji you taught me so much, being on set with you during Eeshwar was like being in a temple… RIP My Guru 🙏 pic.twitter.com/vmqfhbZORx — Anil Kapoor (@AnilKapoor) February 2, 2023 ఇక.. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్.. కే విశ్వనాథ్ మృతిపై ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. విశ్వనాథ్‌గారూ తనకెంతో నేర్పించారని, ఈశ్వర్ షూటింగ్ సందర్భంలో.. ఒక దేవాలయంలో ఉన్న అనుభూతి చెందానని ట్వీట్ చేశారు అనిల్ కపూర్. కమల్ హాసన్ ‘స్వాతి ముత్యం’ చిత్రాన్ని బాలీవుడ్లో ఈశ్వర్ పేరుతో రీమేక్ చేశారు విశ్వనాథ్. అందులో అనిల్ కపూర్, విజయశాంతి లీడ్ రోల్లో నటించారు. ఉత్తమ కథగా ఈ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ కూడా అవార్డు దక్కింది. -
కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి
కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘’నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలచి వేసింది. ఈరోజు ఆయన కన్నుమూసిన వార్త విన్న నేను షాక్ కు గురయ్యాను. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. కె.విశ్వనాథ్ గారితో చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన్ను సొంత కుటుంబ సభ్యుడిలా భావిస్తారు చిరు. ఎప్పటికప్పుడు కె.విశ్వనాథ్ దంపతులను కలుస్తూనే ఉంటారు. తన భార్య సురేఖతో కలిసి కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన ఆశ్వీర్వాదం తీసుకుంటూ ఉంటారు. నటనకు సంబంధించి ఎన్నో మెలుకవులు నేర్పించిన గురువు కె విశ్వనాథ్ గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, కె.విశ్వనాథ్‌లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి చేసిన 'శభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాలన్నీ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్స్. అద్భుతమైన సంగీతానికి, ప్రేమ, ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ని కలగలిపి కె.విశ్వనాథ్ ఈ సినిమాలను రూపొందించారు. ఇవన్నీ కూడా బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాలుగా నిలిచిపోయాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (Director K Viswanath Death: కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్ ఇకలేరు) -
ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా.. నివాళులు అర్పించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తానని, మన దేశం పట్ల ఆయన దార్శనికతను సాకారం చేసుకుందాం అని ట్వీట్ ద్వారా ఆయన పిలుపు ఇచ్చారు. ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన జాతిపిత మహాత్మా గాంధీజీకి నివాళులర్పిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, మన దేశం పట్ల ఆయన దార్శనికతను సాకారం చేసేందుకు ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు, నా రాష్ట్రానికి, అతను ఎప్పటికీ మనకు ప్రియమైన గాంధీ తాతా అని ట్వీట్ చేశారు. జనవరి 30, 1948లో గాంధీజీ అమరులయ్యారు. దేశం కోసం మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడానికి ఈ రోజును ‘అమరవీరుల దినోత్సవం’గా కూడా పాటిస్తారు. On this Martyrs’ Day, I pay homage to the father of our nation Mahatma Gandhi ji. For the people of Andhra Pradesh, I vow to follow in his footsteps to realise his vision for our country. For me and my state, he will forever be our beloved Gandhi Thatha. #MahatmaGandhi — YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2023 -
నేతాజీ జయంతి సందర్భంగా సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విటర్ ద్వారా నివాళి అర్పించారు. స్వాతంత్ర్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా ఘననివాళి అని ట్వీట్ చేశారాయన. మరోవైపు ఏపీ సహా దేశవ్యాప్తంగా బోస్ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా ఘననివాళి.#SubhashChandraBoseJayanti pic.twitter.com/u3hDesmO1j — YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2023 జనవరి 23, 1897లో కటక్‌లో జన్మించారు సుభాష్ చంద్రబోస్. గాంధీజీ సహా పలువురు అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే.. బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టడానికి యత్నించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రాణ త్యాగం చేశారు!. -
Subhash Chandra Bose: ఉర్రూతలూగించిన నేత!
క్రమశిక్షణ, దేశభక్తి, దైవభక్తి ఉన్న సేవాతత్పరుడు సుభాష్ చంద్రబోస్ మరణించి 78 ఏళ్లవుతోంది. అయినా ఆయన మరణానికి కారణమని చెబుతున్న విమాన ప్రమాద కారణం నేటికీ జవాబులేని ప్రశ్నగా నిలిచి పోయింది. ప్రభావతీ దేవి, జానకీ నాథ్ బోస్ దంపతుల సంతానంలో తొమ్మిదోవాడుగా సుభాస్ చంద్రబోస్ 1897 జనవరి 23న కటక్‌లో జన్మించారు. ఐసీఎస్‌లో అఖిల భారత స్థాయిలో నాలుగవ స్థానం పొందారు. బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ సహాయ కార్యదర్శిగా దేశమంతా పర్యటిస్తూ చేసిన ప్రసంగాలకు లక్షలాది మంది ప్రేరణ పొందారు. ఉప్పు సత్యా గ్రహం సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి అనేక జైళ్లలో తిప్పి, చివరికి దేశ బహిష్కరణ శిక్ష వేసింది. 1933లో ‘ఇండియన్ స్ట్రగుల్’ పుస్తకాన్ని రాశారు. తండ్రి మరణంతో భారత్‌కు తిరిగి రాగా, ఆరోగ్యం క్షీణిస్తే, చికిత్స కోసం ప్రజలు చందాలువేసి మరీ వియన్నా పంపారు. అప్పుడే యూరప్ పర్యటించారు. ఆ రోజుల్లోనే ముస్సోలినీ, హిట్లర్, రోమరోల వంటివారిని కలిశారు. నెహ్రూ అధ్యక్షతన లక్నోలో జరిగే కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యేందుకు దేశంలో దిగగానే ఆయనను ఖైదు చేసి ఎరవాడ జైలుకు పంపారు. 1937లో విడుదల కాగానే అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడై దేశమంతా పర్యటిస్తూ ప్రజలను స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో ఉర్రూతలూగించి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడయ్యారు! ఆది ఆయన పట్ల అసూయాపరులను పెంచింది. రెండవ పర్యాయం మళ్ళీ పోటీజేసి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గెలుపు కోసం ప్రయత్నించకుండానే పట్టాభి సీతారామయ్యపై గెలిచి కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. అయితే గాంధీజీకి ఆయన అధ్యక్షుడు కావడం ఇష్టం లేదు. దీంతో బోస్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేశారు. వెంటనే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. వారపత్రిక కూడా వెలువరించడం మొదలు పెట్టి మరోసారి దేశమంతా పర్యటించారు. 1942 జనవరి 26న పులి బొమ్మతో రూపొందించిన జండా ఎగరేసి, బెర్లిన్లోనే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించారు. 1941 ఫిబ్ర వరి 27న ఆజాద్ హింద్ ఫౌజ్ రేడియోలో అద్భుత ప్రసంగం చేసి యావత్ భారతాన్నీ ఆయన ఆవేశంలో ముంచెత్తారు. మహిళలకు రంగూన్లో ఝాన్సీ లక్ష్మీబాయి రెజి మెంట్ ఏర్పాటు చేసి యుద్ధ శిక్షణ మొదలు పెట్టారు. చలో ఢిల్లీ నినాదం ఇచ్చి ప్రత్యక్ష యుద్ధానికి ప్రణాళిక రచించి ఇంఫాల్, అండమాన్, నికోబార్‌లో స్వతంత్ర భారత పతాకాన్ని ఆవిష్కరించి సాగిపోయారు. ఇంతలో జపాన్ మీద అణుబాంబు పడ్డది. జపాన్ అతలాకుతలమై పోయింది. బోస్ నిస్సహాయుడై సహచరుల బలవంతంపై మంచూరియాలో సురక్షిత అజ్ఞాత స్థలానికి వెళ్ళడానికి అనిష్టంగానే జపాన్‌లో విమానం ఎక్కి తైపే వరకూ ప్రయాణించారు. 1945 ఆగస్ట్ 18న అకస్మాత్తుగా విమానంలో సాంకేతిక ఇబ్బంది వచ్చి కూలిపోయిందన్నారు. విమానంతో పాటే కోట్లాది భారతీయుల ఆశలూ నేల కూలాయి. 50 సంవత్సరాల వయసులోనే ఆ యోధునికి నూరేళ్ళూ నిండాయి. (క్లిక్ చేయండి: ‘కోహినూర్‌ను బ్రిటన్ దొంగిలించింది’) – నందిరాజు రాధాకృష్ణ (జనవరి 23 నేతాజీ జయంతి) -
ఫ్లెక్సీపెట్టి.. అన్నదానం చేసి
సాక్షి, ఖమ్మం: ఎవరైనా కన్నుమూస్తే సంతాప సూచకంగా వారి ఫొటోతో ఫ్లెక్సీ చేయించి కూడళ్లలో ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే ఖమ్మంలో మృతిచెందిన ఓ కోతికి సైతం ఫ్లెక్సీ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తిరుగుతూ, నిత్యం హమాలీల మధ్య ఉంటూ.. వారు పెట్టే భోజనం తింటూ గడిపే ఓ కోతి ఇటీవల మృతి చెందింది. దీంతో హమాలీలు ఆ వానరానికి అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా శుక్రవారం అన్నదానం సైతం నిర్వహించారు. ఇంతటితో సరిపెట్టకుండా ఆ కోతి ఫొటోతో ఫ్లెక్సీ చేయించి మార్కెట్ ప్రధాన గేటుకు పెట్టగా పలువురు ఆసక్తిగా పరిశీలించారు. చదవండి: మహబూబాబాద్: టమాటా కూర అత్త ప్రాణం మీదకు తెచ్చింది -
Adari Tulasi Rao: ఆంధ్రా కురియన్‌కు నివాళి!
అనూహ్యమైన, అనితరసాధ్యమైన పాల ఉత్పత్తి రంగంలో విజయాలు సాధించిన ఆడారి తులసీరావు ఈనెల 4వ తేదీన మరణించారు. మూడున్నర దశాబ్దాలు విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా వ్యవహరించి, రైతుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. మూడు జిల్లాల పరిధిలోని ప్రతి ఒక్క రైతుతో ప్రత్యక్ష సంబంధాలు నెరుపుతూ ఉండేవారు. డెయిరీకి పాలు సరఫరా చేసే వేలాదిమంది రైతుల పిల్లలకు అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పించారు. పాడి రైతులలో పేదవారి పిల్లలకు హాస్టలు వసతి కల్పించి, ఉచిత విద్యను బోధింపజేసిన సేవాదృక్పథం ఆయనది. రైతాంగ యువత ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆత్మ విశ్వాసంతో వ్యవసాయాన్నీ, పాడినీ అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా ఆత్మ గౌరవంతో జీవించడానికి ప్రయత్నించాలని తరచూ తన అనుభవాలు జోడించి ఉద్బోధించేవారు. పాలను సేకరించి, వినియోగదారులకు పాలు, పెరుగు, మజ్జిగ అమ్మడమే ప్రధానంగా కొనసాగిన విశాఖ డెయిరీ, అనంతర కాలంలో ఆ పాలతో అనేక ఇతర ఆహార ఉత్పత్తులు ప్రారంభించి రుచి, శుచిలో అగ్ర తాంబూలం అందుకునేలా చేసిన సవ్యసాచి ఆయన. ఆంధ్రా కురియన్‌గా కీర్తించబడినా కించిత్ గర్వం, అతిశయం దరిచేరనివ్వని వ్యక్తిత్వ శైలి ఆయనది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో డెయిరీ కార్యకలాపాలను నిర్వహిస్తూనే, యలమంచిలి నియోజక వర్గం రాజకీయాలలో ఆరు దశాబ్దాలు క్రియాశీల పాత్ర పోషించారు. ఆనాటి విశాఖ జిల్లా బోర్డు సభ్యునిగా వ్యవహరించిన తన తాత స్వర్గీయ ఆడారివీరు నాయుడు ఆయనకు స్ఫూర్తి. నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి పంచాయతీకి మూడుసార్లు సర్పంచ్‌గా ఎన్నికైనారు. యల మంచిలి పురపాలక సంఘంగా మారిన తర్వాత రెండుసార్లు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2015 డిసెంబరులో భారత పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ తన 37వ జాతీయ సమావేశంలో తులసీరావు పోస్టల్ స్టాంపును విడుదల చేయడం, ఆడారి కీర్తి కిరీటంలో కలికితురాయి. లక్షలాదిమంది రైతులు, వేలాది మంది ఉద్యోగులు, కార్మికుల జీవితాలకు బతుకుదెరువు చూపించిన దార్శనికుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆడారి తులసీరావు అంత్యక్రియల్లో పాల్గొనడం ఆయన మృతికి గొప్ప నివాళి. ఆయన మరణించినా, పల్లెల్లో ఆయన నిర్మింపజేసిన వందలాది కట్టడాలు ఆయన సేవలను మరింత చిరస్మరణీయం చేస్తాయి. లక్షలాది కుటుంబాలు తరతరాలు ఆ మహనీయునికి రుణపడి ఉంటాయి. (క్లిక్ చేయండి: ఆయన జీవితం.. స్ఫూర్తివంతం.. ఫలవంతం) – బి.వి. అప్పారావు, విశాఖపట్నం -
Yennam Satyam: అతడి మరణం ఓ విషాదం!
సత్యం! 30, 35 ఏళ్ల క్రితం కవిత్వం, కథలు రాస్తున్న నాతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. క్రమక్రమంగా స్నేహితుడిగా, కవిగా కూడా పరిణామం చెందాడు. నిరంతర అధ్యయనశీలి. శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకున్న వాడు. అంతేగాక తన మొదటి మూడు పుస్తకాలను ఖగోళ శాస్త్రం, విశ్వ రహస్యాలను ఆధారం చేసుకొని భూమి కేంద్రంగా సూక్ష్మస్థాయిలో సుదీర్ఘ కవితల్ని రచించాడు. అవి సుదీర్ఘ జ్ఞాపకం(1996), శిలా ఘోష (1997), బొంగరం (2004). తనకంటూ తెలుగు కవిత్వ రంగంలో ఒక స్థానాన్ని అప్పుడప్పుడే ఏర్పర్చుకుంటున్న కాలమది. చాలా రోజులు అటు జీవితంలోనూ ఇటు కవిత్వంలోనూ తాయిమాయి తొక్కులాడాడు. 2011లో సూది నానీలు పేరుతో ‘నానీ’ పుస్తకాన్ని వెలువరించాడు. ఆ పుస్తకం ఇన్నర్ టైటిల్లో ‘అగర్ తేరీ గలిమే కోయీ భూకా హైతో లానత్ హై తేరే ఖానే పే’ అనే మహమ్మద్ ప్రవక్త సూక్తి తెలుగు అనువాదం ‘మీ వీధిలో ఎవరైనా పస్తులుంటే నువ్వు తినే అన్నం అధర్మమే’ ముద్రించాడు. తద్వారా సత్యం మరో నూతన తాత్విక లోకంలోకి నిబద్ధతతో, నిమగ్నతతో ప్రవేశించాడు. అన్నట్టు చెప్పలేదు కదూ... అరబ్బీని అనర్గళంగా మాట్లాడడమే కాక చదువుతాడు, రాస్తాడు కూడా. ఇక్కడ కొద్దిగా అతడి వలస బతుకు గురించీ యాది చేసుకోవాలి. దర్జీల కుటుంబంలో పుట్టిన సత్యం... జీవిత ప్రారంభంలో జీవనాధారాన్ని వెతుక్కుంటూ సిరిసిల్ల, ముంబై ప్రాంతాల గుండా అరబ్బు దేశాలకు షర్ట్ మేకర్ కార్మికునిగా వలస పోయి 26 ఏళ్లు గడిపాడు. చివరికి ఇక అరబ్బు దేశానికి పోనవసరం లేదనీ, ఇక్కడ సిరిసిల్లలో నివాసం ఏర్పరచుకున్నాడు. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశాడు. పేద దర్జీ బతుకులకు నిలువెత్తు నిదర్శనంగా ఉండే నానీలను రాశాడు సత్యం. గుండెలను పిండి వేసే మచ్చుకు రెండు నానీలు... ‘అందరికీ జేబులు కుట్టేవాడు చాయ్ బీడీలకు అప్పు పడ్తడు’ ‘అమ్మకు కన్నీళ్లే కళ్లద్దాలు వాటితోనే కాజాలు కుట్టేది’ అంతా సవ్యంగా సాఫీగా బతుకు బండి నడుస్తుందనుకునేసరికి, మూడేళ్ల క్రితం బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డాడు. మూడుసార్లు తలకు ఆపరేషన్ జరిగినప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. పైగా చివరి 4 నెలలు ఒక్కొక్క అవయవం కోల్పోయి నానా ఇబ్బందులు పడ్డాడు. యెన్నం సత్యం (58) కవిగా ఎన్నో మెట్లు ఎక్కవలసిన వాడు, ఎన్నో లక్ష్యాలను అధిగమించి, అందరి అంచనాలను బదాబదలు చేయవలసిన వాడు. కానీ ఆరోగ్యం విషమించి ఈనెల 18న (ఆదివారం) తనువు చాలించాడు. సిరిసిల్ల కవి మిత్రులకే గాక... కరీంనగర్ ఉమ్మడి జిల్లా సాహితీ మిత్రులందరికీ ఇదో తీరని లోటు. ఒక విషాద జ్ఞాపకం. సత్య ప్రమాణంగా సత్యం మరువలేని ఉప్పకన్నీళ్ల చేదు యాది! (చదవండి: సాహిత్యకారుల్లో చాతుర్వర్ణాలు.. అవేంటో తెలుసా!) – జూకంటి జగన్నాథం -
కైకాల కుటుంబసభ్యులను పరామర్శించిన సీఎం కేసీఆర్
-
కైకాల లేని లోటు ఎవరూ పూడ్చలేరు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నట దిగ్గజం కైకాల సత్యనారాయణ పార్థీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాళి అర్పించారు. శుక్రవారం మధ్యాహ్నాం నగరంలోని కైకాల నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సినీ నటులు కైకాల సత్యనారాయణగారు విలక్షణమైన నటులు. ఎలాంటి పాత్రలోనైనా జీవించి, హీరోలకు సమానమైన పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎంపీగా ఉన్న రోజుల్లో.. ఆయనతో కలిసి పని చేసిన అనుభవం ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరు. ఆయనకు సమానమైన నటులు ఈ తరంలో ఎవరూ లేరు. కైకాల మృతి చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం అన్నారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ వెంట మంత్రి తలసానితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. అనారోగ్యంతో నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ములాయం, కృష్ణ, కృష్ణంరాజులకు పార్లమెంట్ నివాళి
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల మరణించిన సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, టాలీవడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సహా తదితరులకు తొలుత లోక్‌సభ నివాళులర్పించింది. సంతాప సందేశం చదివిన తర్వాత సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అటు.. రాజ్యసభలోనూ వారికి నివాళులర్పించారు. మరోవైపు.. రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఒక రైతు బిడ్డ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి అయ్యారని కొనియాడారు. ఆయన సైనిక్ పాఠశాలలో చదువుకున్నారని, దీంతో అటు సైనికులకు, ఇటు రైతులకు వారధిగా మారానున్నారన్నారు. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. అనేక బాధ్యతలను ధన్‌ఖడ్ సమర్థంగా నిర్వర్తించారని గుర్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: జీ20 నాయకత్వం.. భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం: ప్రధాని మోదీ -
Konijeti Rosaiah: మాటల తూటాల అజాత శత్రువు
అరుదైన రాజకీయ నాయకుడు కొణిజేటి రోశయ్య. ఆయన వాగ్ధాటికి అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లేవి. గొప్ప హాస్య చతురతతో పాటూ ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన శైలి. ప్రభుత్వ శాఖలన్నింటిపైనా అపారమైన పట్టు, అవగాహన ఆయనకున్నాయి. వివాదాలకు దూరంగా ఉంటూ, మంచి సలహాదారుగా కూడా వ్యవహరించేవారు. రాజనీతిలో అపర చాణక్యుడు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన చిరునామా. మాటల మాంత్రికుడిగా వినుతికెక్కారు. తన ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేయడమే కాదు, మాటల తూటాలు కూడా పేల్చేవారు. చట్టసభ లోపల, బయట కూడా ఒంటిచేత్తో ప్రతిపక్షాల్ని మాట తూలకుండా ఆటలాడుకునేవారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్జీ రంగా శిష్యులు. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. ఆయన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు; 1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు; 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్థిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరు పొందారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు పొందారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా, చాలా కాంగ్రెస్ కేబినెట్లలో కీలక మంత్రిగా పని చేయడం సామాన్య విషయం కాదు. తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహించారు. 1995–97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ప్రతిపక్షంలో ఉంటే నెగటివ్ పాలిటిక్స్ చెయ్యచ్చు. అదే ప్రభుత్వంలో ఉంటే, నిర్మాణాత్మకమైన పాత్రతో పాజిటివ్ పాలిటిక్స్ నడపచ్చు అనేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పధ్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్న తరువాత ఆరోగ్యం సహకరించినప్పుడల్లా సాహితీ, సాంస్కృతిక కార్యాక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై అలరింపజేసేవారు. 2018 ఫిబ్రవరి 11న ఆదివారం నాడు టి. సుబ్బిరామిరెడ్డి లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్యను గజ మాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని రోశయ్య అనేవారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందించిన సహకారంతోనే చట్టసభల్లో తగిన గుర్తింపు లభించిందని విన మ్రంగా చెప్పేవారు. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసు కుంటూ.. తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించానని తాను పాల్గొనే కార్యక్రమాలలో ఆత్మ సంతృప్తితో చెప్పేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదే. కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో బాధపడుతూ 2021 డిసెంబర్ 4న హైదరాబాదులో కన్నుమూశారు. ప్రజాజీవితంలో ఆయన ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఓ రుషి మాదిరి సేవలందించారు. (క్లిక్ చేయండి: వివక్ష ఉందంటే ఉలుకెందుకు?) - తిరుమలగిరి సురేందర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ (డిసెంబర్ 4న కె. రోశయ్య ప్రథమ వర్ధంతి) -
Bhimbor Deori: భీంబర్ డియోరీ.. ఎవరో తెలుసా?
భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సంరంభంలో ఉన్న మనం ఈశాన్య భారత్‌కు చెందిన భీంబర్ డియోరీని గుర్తుచేసుకోవాలి. ఈయన అసోంను తూర్పు పాకిస్తాన్లో విలీనం చేసే ప్రయత్నాలను విఫలం చేసిన జన నాయకుడు. అలాగే స్వదేశీ వర్గాలను ఉద్ధరించడంలో, అసోం ప్రయోజనాలను పరిరక్షించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి ఫలితంగా అసోం విధాన సభలో గిరిజనుల కొరకు 5 స్థానాలు రిజర్వు చేయబడ్డాయి. స్వాతంత్య్రేచ్ఛ ఆయన రక్తంలోనే ఉంది. ప్రత్యేక మాతృభూమి కోసం 1945 మార్చి 21– 23 మధ్య ‘ఖాసీ దర్బార్ హాల్ తీర్మానాలు’ చేశారు. ఈ తీర్మానాలతో వివిధ గిరిజన తెగలకు చెందిన స్థానిక నాయకులు తమ స్వతంత్ర మాతృభూమిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. ఆయన 1903 మే 16న అసోంలోని శివసాగర్ జిల్లాలోని వనిదిహింగ్ గ్రామంలో గోదారం డియోరీ, బజోతి డియోరీ దంపతులకు జన్మించారు. సాధారణ గిరిజన యువకుడైన భీంబర్ అసోం సివిల్ పరీక్షలో ప్రథమ స్థానం సంపాదించారు. కానీ ఈయన గిరిజనుడైనందున బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. పట్టుదలతో ఆయన డిబ్రుగర్లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1933లో ‘అసోం బ్యాక్వర్డ్ ప్లెయిన్స్ ట్రైబల్ లీగ్’ని స్థాపించి దాని వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా పని చేశారు. 1941 జూన్ 18న వివిధ విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులను జనరల్ డైనింగ్ హాల్లోకి అనుమతించమని పోరాడారు. 1946 జూలై 8న అసోం ప్రభుత్వంలో అటవీ, కార్మిక శాఖ మంత్రిగా నియమితులైనారు. అసోం ప్రజల హృదయాల్లో భీంబర్ డియోరీ ఆదివాసీల నాయకుడిగానేగాక, ఆదర్శ జననేతగా నిలిచి 1947 నవంబర్ 30న తనువు చాలించారు. – గుమ్మడి లక్ష్మీ నారాయణ ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (నవంబర్ 30న భీంబర్ డియోరీ 75వ వర్ధంతి) -
కృష్ణగారు.. ఒక లెజెండరీ సూపర్‌స్టార్ : ప్రధాని మోదీ
తెలుగు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూయడంతో టాలీవుడ్లో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కృష్ణ మృతి వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో రి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని తెలుగులో ట్వీట్ చేశారు. కాగా, జీ20 సదస్సులో భాగంగా ఇండోనేషియా బాలి పర్యటనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లిన సంగతి తెలిసిందే. కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో @urstrulyMahesh, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. — Narendra Modi (@narendramodi) November 15, 2022 ఇక్కడ కూడా క్లిక్ చేయండి: సాహసాల గని సూపర్‌స్టార్ కృష్ణ హలో.. నా సినిమా ఎలా ఉందండి?.. కృష్ణ జ్ఞాపకాలతో బుర్రిపాలెంలో విషాద ఛాయలు విషాదం.. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత సినీ, రాజకీయ ప్రముఖులతో కృష్ణ (ఫోటోలు) -
Birsa Munda: ఆదివాసీల ఆరాధ్యదైవం
ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పోరాడిన యువకిశోరం బిర్సా ముండా. ఆయనను తన జాతి ప్రజలు దేవునిగా కొలిచారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా ఉలిహత్ గ్రామంలో 1875 నవం బర్ 15న సుగుణ ముండా, కర్మిహాట్ దంపతులకు బిర్సా ముండా జన్మించాడు. ‘సాల్గా’ గ్రామంలో మేనమామ వద్ద ఉంటూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. అనంతం చయిబాసాలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. బిర్సా ముండా పేరు బిర్సా డేవిడ్ గా మారింది. అందులో చదువుకుంటూనే పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్ పాలకులు అధిక పన్నులు వసూలు చేసేవారు. పన్ను చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. ఎదురు తిరిగిన వారిని నానా బాధలు పెట్టేవారు. బ్రిటిష్‌వాళ్ల బాధలు పడ లేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటలలోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగి చ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి బిర్సా తెల్ల దొరలపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ పాఠశాల ఆయనను బహిష్కరించింది. దీన్ని సవాలుగా తీసుకున్న బిర్సా వారి ఎదుటే నుదుట నామం పెట్టి, జంధ్యం ధరించి, ఇకపై క్రైస్తవంలోకి ఒక్క ఆదివాసీని కూడా మారకుండా చూస్తానని ప్రతిన బూనాడు. బ్రిటిషర్ల వల్ల ముండా, సంథాల్, ఓరియన్, కోల్ జాతి తెగలు ఎప్పటికైనా ప్రమా దంలో పడే అవకాశం ఉందని భావించిన బిర్సా ప్రత్యేకంగా ‘బిర్సాయిత్’ మతాన్ని స్థాపించాడు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక అంశాలు బోధించే వాడు. ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాడు. ప్రకృతి వైద్యంతో ఎంతోమంది ఆదివాసీలను కాపాడాడు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు బిర్సా ముండాను ధర్తీలబా(దేవుడు)గా కొలిచేవారు. తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్లో ఉల్ గులాన్ (తిరుగుబాటు) పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. అందులో 7,000 మంది పాల్గొన్నారు. బిర్సా ఆచూకీ తెలపాలని ఆదివాసీలను నిర్బంధిస్తూ వారిపై దాడులకు దిగేవారు బ్రిటిష్‌వాళ్లు. వీటిని సహించని ఆయన అనుచరులు 1900 జనవరి 5న ఎట్కేడీ ప్రాంతంలో ఇద్దరు పోలీసులను చంపేశారు. దీనితో రగిలిపోయిన పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించి చివరికి 1900 ఫిబ్రవరి 3న జంకోపాయి అటవీ ప్రాంతంలో అరెస్టు చేసి రాంచీ జైలుకు తరలించారు. ఎప్పటికైనా తమకు ప్రమాదకారిగా మారతాడని భావించిన ప్రభుత్వం బిర్సా ముండాను 1900 జూన్ 9న విష ప్రయోగంతో చంపేసింది. బయటకు మాత్రం మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేసింది. ఇప్పటికీ ఆయన్ని జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివాసీలు ‘భగవాన్ బిర్సా ముండా’గా పూజిస్తున్నారు. చనిపోయేటప్పుడు బిర్సాకు కేవలం 25 ఏళ్లు మాత్రమే. ఆయన ఉద్యమ ఫలితంగానే 1908లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఛోటా నాగపూర్ కౌలుదారుల హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. (క్లిక్ చేయండి: నిజంగా భక్తులేనా? పైకి మాత్రమేనా?) – చింత ఎల్లస్వామి ఏబీవీపీ రాష్ట్ర పూర్వ సంయుక్త కార్యదర్శి (నవంబర్ 15న బిర్సా ముండా జయంతి) -
సూపర్ స్టార్ మృతి.. ఆ జిల్లా వ్యాప్తంగా మార్నింగ్ షోలు రద్దు
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. సూపర్ కృష్ణ మృతికి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సైతం ఘన నివాళి అర్పించారు. ఆయన అకాల మృతికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్లో ఉదయం ఆటలను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తెలిపారు. -
కృష్ణ చనిపోయారని బాధపడకండి, ఇప్పటికే ఆయన స్వర్గంలో..: వర్మ ట్వీట్
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: మాటలకు అందని విషాదం ఇది: కృష్ణ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి మాటలకు అందని విషాదం అంటూ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కృష్ణ మృతిపై స్పందించారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేస్తూ.. ‘కృష్ణ గారు చనిపోయారని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వారిద్దరు కలిసి ఆనందంగా అక్కడ మంచి సమయాన్ని గుడుపుతుంటారని అనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు మోసగాళ్లకు మోసగాడు చిత్రంలోని వారిద్దరి పాటను ఆర్జీవీ ఈ ట్వీట్‌కు జత చేశాడు. No need to feel sad because I am sure that Krishna garu and Vijayanirmalagaru are having a great time in heaven singing and dancing 💐💐💐 https://t.co/md0sOArEeG via @YouTube — Ram Gopal Varma (@RGVzoomin) November 15, 2022 -
ఆయనే మన జేమ్స్‌బాండ్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి/హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూతతో సినీ జగత్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నటశేఖరుడి అస్తమయంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు. ‘‘కృష్ణగారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఘట్టమనేని కుటుంబంతో వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. (2/2) — YS Jagan Mohan Reddy (@ysjagan) November 15, 2022 ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం కృష్ణ కన్నుమూతపై సంతాపం ప్రకటించారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు సంతాపం ప్రకటించిన వాళ్లలో ఉన్నారు. ఇదీ చదవండి: నటశేఖరుడికి సాక్షి ప్రత్యేక నివాళి -
నటశేఖరుడికి సాక్షి ప్రత్యేక నివాళి
గూఢచారి, కౌబాయ్.. ఇలా వైవిధ్యభరితమైన పాత్రలతో పాటు సామాజిక-పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు రంజింప చేశారు పద్మభూషణ, నటశేఖర కృష్ణ. సినీ సాహసాలకు ఆయన కేరాఫ్. నటనలో మాత్రమే కాదు ఫిల్మ్ మేకింగ్‌లోనూ ఆయనొక ప్రయోగశాల. నిర్మాతగా, దర్శకుడిగా తనకుంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును దక్కించుకున్న వ్యక్తి. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్నో కొత్త తరహా సాంకేతికతల హంగులను అందించిన వ్యక్తి. తక్కువ టైంలోనే ఆనాటి అగ్రహీరోల సరసన నిలిచారాయన. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ నటశేఖరుడికి సాక్షి అందిస్తున్న నివాళి.. పాత తరంలో మాస్ హీరో ట్యాగ్‌ను, అత్యంత వేగంగా అందుకున్న నటశేఖరుడు.. ఆపై వరుస హిట్లతో సూపర్ స్టార్‌గానూ ఎదిగారు. ఒకానొక టైంలో ఏడాది కాలంలో 17 సినిమాలు తీసుకుంటూ.. దర్శకనిర్మాతల పాలిట కల్పతరువుగా మారారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. 1943 మే 31న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. తల్లిదండ్రులు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ. వాళ్ల అగ్రసంతానం కృష్ణ. చదువుకొనే రోజుల్లోనే నటన పట్ల ఆసక్తితో అటువైపు మళ్లారు. ఏలూరులో ఇంటర్మీడియట్ చదువుతూ కూడా నాటకాలు వేస్తూ సందడి చేశారు. డిగ్రీలో చేరాక.. పూర్తిగా సినిమాలవైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆరంభంలో.. ‘‘పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు- ప్రతిష్ఠ’’ వంటి చిత్రాలలో చిన్న రోల్స్‌లో కనిపించారు. ఆపై ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్లో కొత్తవాళ్లతో తెరకెక్కించిన తేనెమనసులులో ఇద్దరు హీరోల్లో ఒకరిగా నటించారు. ఆ సమయంలోనే హ్యాండ్సమ్ హీరోగా ఆయనకు ఒక మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆపై ‘కన్నెమనసులు, గూఢచారి 116’ వంటి సినిమాల్లో నటించి మరింత పేరు సంపాదించారు. ‘గూఢచారి 116’ విజయంతో కృష్ణకు హీరోయిజం బేస్డ్ అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అయినా ఫ్యామిలీ&లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఉండమ్మ బొట్టు పెడతా, మంచి కుటుంబం, విచిత్ర కుటుంబం, అక్కాచెల్లెళ్లు, పండంటి కాపురం లాంటివెన్నో. తెలుగు సినిమాకు కొత్త నీరు ► కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్.ఓ. సాంకేతికత పరిచయం అయ్యింది. ► గూడుపుఠాణి.. మొదటి ఓఆర్‌డబ్ల్యు కలర్ సాంకేతికతతో తీసిన సినిమా. ► తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం.. భలే దొంగలు. ► తెలుగులో 70 ఎంఎం సాంకేతికత ఉపయోగించిన తొలి సినిమా.. సింహాసనం. ► సింహాసనం.. స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సాంకేతికతతో సౌండ్ టెక్నాలజీ వాడిన తొలి తెలుగు సినిమా. ► అల్లూరి సీతారామరాజు తెలుగులో ఫుల్‌స్కోప్ సినిమాల్లో మొదటిది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఫ్రెండ్లీ స్టార్‌గా ఉంటూనే.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో.. ముక్కుసూటితనం ఉన్న వ్యక్తిగా పేరొందారు కృష్ణ. అదే సమయంలో స్టార్ హీరో ట్యాగ్‌కు చేరువవుతున్న సమయంలోనూ ఆయన ఇతర స్టార్ల చిత్రాల్లో నటించుకుంటూ పోయారు. తన తోటి హీరోలు ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు తదితరుల సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ► అగ్రహీరోలతో పోటీ పడుతూనే ఆయన కొన్ని సాహసోపేతమైన చిత్రాలు తీశారు. కురుక్షేత్రం, దేవదాసు.. అందుకు ఉదాహరణలు. ► స్టార్ ద్వయం ఎన్టీఆర్-ఏన్నార్ ఫ్యాన్ ఫాలోయింగ్‌కు ఏమాత్రం తీసిపోని స్టార్డమ్ తొలినాళ్లలోనే సొంతం. లేడీఫాలోయింగ్ మాత్రమే కాదు.. మేల్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఆయనకు. ఆయన్ని చూసేందుకు చెన్నైకి రైళ్లలో, బస్సుల్లో అభిమానులు వెళ్లే వారంటే అతిశయోక్తి కాదు. ఏకంగా రికార్డు స్థాయిలో 2,500 అభిమాన సంఘాలు కృష్ణ పేరిట ఉండేవి. ► సంక్రాంతికి సినిమాలు విడుదల చేసే సంక్రాంతి పోటీ విషయంలోనూ కృష్ణ రికార్డు సృష్టించారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో ఆయన నటించిన 30 చిత్రాలు సంక్రాంతి పండుగకు విడుదల అయ్యాయి. 1976 నుంచి 1996 వరకు 21 సంవత్సరాల పాటు ప్రతీ ఏటా వరుసగా సంక్రాంతికి సినిమాలు విడుదల చేశాడు. సంక్రాంతి విడుదలల విషయంలో అక్కినేని నాగేశ్వరరావు (33 సంక్రాంతులు), ఎన్.టి.రామారావు (31 సంక్రాంతులు) తర్వాత మూడవ స్థానంలో నిలిచినా.. వరుసగా ప్రతీ ఏటా సంక్రాంతులకు సినిమాలు విడుదల కావడం (21 సంవత్సరాలు) విషయంలో కృష్ణదే రికార్డు. ► ఆ తర్వాతి తరంలోనూ ఆయన కీలక పాత్రలు పోషించిన చిత్రాలు వచ్చాయి. నాగార్జున, బాలకృష్ణ, రవితేజ, కోలీవుడ్ నటుడు విక్రమ్‌లతో పాటు తన తనయులు రమేష్ బాబు, మహేష్ బాబు చిత్రాల్లోనూ ఆయన నటించి, మెప్పించారు. ► కొమియో పాత్రల్లో పలు చిత్రాల పాటల్లోనూ ఆయన కనిపించారు. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాల్లో ఆయన గెస్ట్ సాంగ్‌లో కనిపించారు. యమలీలలోని జుంబారే సాంగ్.. ఓ ఊపు ఊపింది కూడా. ► ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దారిలోనే తనకూ ఓ సొంత నిర్మాణ సంస్థ అవసరమని ‘పద్మాలయా’ స్టూడియోను నెలకొల్పారు. ఈ బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం ‘అగ్నిపరీక్ష’. ఆ తరువాత తెలుగులో తొలి కౌబోయ్ మూవీగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ నిర్మించారు. కేఆర్ దాస్ డైరెక్షన్లో వచ్చిన ఆ చిత్రం ఓ కల్ట్క్లాసిక్గా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. ► పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు లాంటి సొంత చిత్రాలతో విజయాలు సాధించారు. ► 1964-95 మధ్య ఏడాదికి పదేసి చిత్రాల్లో కనిపించారు ఆయన. ఒకానొక టైంలో రోజుల్లో గంటల తరబడి విరామం లేకుండా షూటింగ్లలో పాల్గొన్నారు. ► అల్లూరి సీతారామరాజు.. తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా స్కోప్గా తెరకెక్కింది. అయితే ఆ చిత్ర భారీ విజయం తర్వాత వరుసగా ఆయనకు 14 ఫ్లాపులు వచ్చిపడ్డాయి. ఆపై పాడి పంటలు చిత్రంలో ఆయన మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ► ముందగుడు, కిరాయి కోటిగాడు, అగ్నిపర్వతం, అడవి సింహాలు, ప్రజారాజ్యం, ఖైదీ రుద్రయ్య ఆయన్ని టాప్ పొటిషన్ను తీసుకెళ్లాయి. సింహాసనం ఆయన్ని మరో మెట్టు ఎక్కించింది. మాయదారి మల్లిగాడు, ఇంద్రధనుస్సు, అన్నదమ్ముల సవాల్, ఊరికి మొనగాడు లాంటి మ్యూజికల్ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. ► 1989 నాటికే 274 సినిమాలు పూర్తిచేసుకున్న కృష్ణ 90వ దశకంలో తన శైలికి భిన్నంగా కేవలం 44 సినిమాలే చేయగలిగారు. ► 1990 నుంచి మూడేళ్లపాటు ఆయనకు సరైన సక్సెస్ దక్కలేదు. 1994లో వచ్చిన పచ్చని సంసారం, వారసుడు చిత్రాలు ఆయన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించాయి. ఆపై నెంబర్ వన్, అమ్మ దొంగా చిత్రాలు ఆయనకు సూపర్‌సక్సెస్ అందించాయి. ► ఆయన 100వ చిత్రంగా రూపొందిన ‘అల్లూరి సీతారామరాజు’, 200వ చిత్రంగా తెరకెక్కిన ‘ఈనాడు’ మంచి విజయాలు సాధించాయి. 300వ సినిమాగా ‘తెలుగువీర లేవరా’ తీశారు. ► మద్రాస్ నగరంలో వందరోజులు పూర్తిచేసుకున్న తొలి తెలుగు చిత్రంగా చీకటి వెలుగులు, హైదరాబాద్ నగరంలో ఏడాది పాటు ఆడిన తొలి తెలుగు సినిమాగా అల్లూరి సీతారామరాజు నిలిచిపోయాయి. ► కృష్ణ సతీమణి విజయనిర్మల ఆయన సరసన అత్యధిక చిత్రాలలో నటించిన నాయికగా నిలిచారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన ‘మీనా’ చిత్రంలోనూ కృష్ణనే నాయకుడు. ఆపై ఆమె డైరెక్షన్‌లోనూ 40 దాకా సినిమాల్లో కృష్ణ హీరోగా నటించి మెప్పించారు. ► కృష్ణ తొలిసారి దర్శకత్వం వహిస్తూ ‘సింహాసనం’ చిత్రాన్ని తొలి 70 ఎంఎం సినిమాగా అందించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. “నాగాస్త్రం, ముగ్గురుకొడుకులు, కొడుకు దిద్దిన కాపురం” వంటి హిట్స్ నూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. బాలీవుడ్లో డినో మోరియా, బిపాసా బసు లీడ్రోల్లో ఇష్క్ హై తుమ్సే(2004) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. తెలుగు సంపంగి చిత్రానికి రీమేక్ ఇది. రాజకీయాల్లోనూ.. ► రాజకీయాల్లో సూపర్ స్టార్ కృష్ణ ప్రస్థానం.. ఒక హాట్ టాపిక్‌గా మారింది. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా.. తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది. ఆ ఎన్నికల్లో ఓటమి చెందడంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడం విరమించుకున్నారు. ► ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న కృష్ణ.. చిత్రపరిశ్రమలో చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం నుంచి 2009లో పద్మభూషణ్ గౌరవాన్ని సైతం అందుకున్నారు. అల్లూరి సీతారామ రాజు చిత్రానికి గానూ నంది అవార్డు(1974), ఎన్టీఆర్ నేషనల్ అవార్డు(2003), ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైం అఛీవ్మెంట్ అవార్డు(1997) సక్సెస్‌తో పాటు ఫెయిల్యూర్స్‌ను అంతే ఓపెన్‌గా అంగీకరించేవారు ఆయన. సాహసోపేతమైన వైఖరితో సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్లేవారు. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి, నిర్మాతలకు నష్టం కలగకుండా చిత్రాలు చేయాలని తపించేవారు. అందుకే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సూపర్ స్టార్‌గా వెలుగొందారు. -
పత్రికారంగ స్వర్ణయుగపు వేగుచుక్క!
ఒక ఆటగాడు ఓడిపోకుండా మైదానంలో ఎంతసేపు నిలబడగలిగాడు, మొత్తం విజయానికి ఏ విధంగా దోహదపడ్డాడు అనేది అతడి ట్రాక్ రికార్డ్‌కి సంకేతం. వ్యక్తిగత స్కోర్ కంటే కీలక ఘట్టాల్లో జట్టు విజయానికి అండగా నిలవడం చాలా ముఖ్యం. జర్నలిజం రంగంలో జి.యస్. వరదాచారి కూడా ఇలాంటి ఆటగాడే. ఆరు దశాబ్దాలకు పైబడి తెలుగు జర్నలిజం వికాసానికి, విలువలకు, జర్నలిస్టుల అభ్యున్నతికి అవిశ్రాంతంగా పాటుపడుతూ వచ్చిన కార్యదక్షుడు. మరో సుప్రసిద్ధ జర్నలిస్టు సి. రాఘవాచారికి వర్తించే మాటలే వరదాచారికీ సరితూగుతాయి. తలుపు తట్టిన అవకాశాన్ని వదులుకోకుండా ఇంగ్లిష్ జర్నలిజంలోకి వరదాచారి ప్రవేశించి ఉంటే ఏ కోటంరాజు రామారావో అయ్యేవారు. న్యాయశాస్త్రం అభ్యసించిన ఆయన లాయర్‌గా ప్రాక్టీస్ చేసి ఉంటే ఏ నానాపాల్కీవాలానో అయి ఉండేవారు. యూనియనిస్టుగానే కొనసాగి ఉంటే మరో మానికొండ చలపతిరావు అయ్యేవారు. కానీ ఇవేవీ కావాలనుకోలేదు. కనుకే ఆయన గోవర్ధన సుందర వరదాచారి అయ్యారు. నమ్మిన సిద్ధాం తాల విషయంలో రాజీపడేవారు కారు. ఎదుటివారు ఏ భావజాలానికి చెందిన వారైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో గోవర్ధన కృష్ణమాచార్యులు, జానకమ్మ దంపతులకు 1932 అక్టోబర్ 15న జన్మిం చారు. జర్నలిజంపై మక్కువతో విద్యార్థి దశలోనే కొంతకాలం ‘వైష్ణవ’ పత్రికను నడిపారు. జర్నలిజం వృత్తిలో ప్రవేశించడా నికి విద్యార్హతల పట్టింపు లేని ఆ రోజు ల్లోనే బి.ఏ. డిగ్రీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ డిప్లమా పూర్తి చేశారు. కోర్సులో భాగంగా చెన్నైలోని ‘ది హిందూ’లో ఇంటర్న్‌షిప్ దిగ్వి జయంగా పూర్తిచేశారు. ఇంగ్లిష్ జర్నలిజంలో ప్రవేశించే అవకాశం వచ్చినా తెలుగు భాషపై మక్కువతో ఆ ఆఫర్‌ను కాదనుకుని 1956లో హైదరాబాద్‌లో ‘ఆంధ్ర జనత’లో చేరారు. జర్నలి జంలో చేరిన కొత్తల్లోనే సహోద్యోగుల సందేహాలను ఓపికగా విడమరిచి చెప్తుండేవారు. నాటి నుంచి వరదాచారిని ‘ప్రొఫెసర్’ అని పొత్తూరి వెంకటేశ్వరరావు పిలిచేవారు. ‘ఆంధ్ర భూమి’లో న్యూస్ ఎడిటర్‌గా రెండు దశాబ్దాలు, ‘ఈనాడు’లో అసిస్టెంట్ ఎడిటర్‌గా ఐదేళ్లు పనిచేశారు. తెలుగు విశ్వ విద్యాలయం స్థాపించినప్పటి నుంచి జర్న లిజం శాఖ అధిపతిగా, ప్రొఫెసర్‌గా 22 ఏళ్లపాటు ఎందరో విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దారు. ప్రెస్ అకాడమీ సహా పలు విద్యా సంస్థల్లోనూ జర్నలిజం పాఠాలు బోధించారు. హెచ్ఎం టీవీలో తీర్పరిగా బాధ్యతలు చేపట్టి తెలుగులో తొలి అంబుడ్స్ మన్‌గా ఖ్యాతి గడించారు. వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కార్యాలయమైన దేశోద్ధారక భవన్ అనుమతి సాధనలో, నిర్మాణ నిధుల సేకరణలో ముఖ్య భూమిక పోషించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘా నికి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ స్థాపక కార్యదర్శిగా, జర్నలిస్టుల గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడిగా, జర్నలిస్ట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిర్విరామ సేవలు అందిస్తూ వచ్చారు. వెటరన్ జర్నలిస్టుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా రిటైరైన జర్నలిస్టుల కోసం హెల్త్ కార్డుల కోసం పాటుపడ్డారు. పాత్రికేయులకు కరదీపికలుగా నిలిచే పలు పుస్తకాలను ఈ సంఘం తరఫున ప్రచురించారు. వరదాచారి తన ఆత్మకథను ‘జ్ఞాపకాల వరద’ పేరిట వెలువ రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం నార్ల వెంకటే శ్వరరావుపై మోనోగ్రాఫ్ రాశారు. పత్రికా రచనలో దొర్లే పొర బాట్లను సోదాహరణంగా వివరిస్తూ రాసిన ‘దిద్దుబాటు’ కాలమ్‌ను అదే పేరుతో సంకలనంగా వెలువరించారు. పాత్రికేయ నిష్పాక్షికతను విశ్లేషిస్తూ ‘ఇలాగేనా రాయడం?’ పేరుతో వ్యాసాల సంకలనం రూపొందించారు. వరదాచారి పాత్రికేయ స్వర్ణోత్సవం సందర్భంగా ఆయన బహుముఖీన కృషికి దర్పణం పడుతూ ప్రముఖుల రచనలతో ‘వరద స్వర్ణాక్షరి’ వెలువడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ పాత్రికేయుడిగా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. స్వీయ ప్రతిభతో, బహుముఖీన కృషితో తెలుగు జర్నలిజం రంగాన్ని ఆరు దశాబ్దాలుగా సుసంపన్నం చేస్తూ వచ్చి పరిపూర్ణ జీవితం గడిపిన వరదాచారి ధన్యజీవి. తెలుగు పత్రికారంగ స్వర్ణయుగపు వేగుచుక్క. గోవిందరాజు చక్రధర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
తెలంగాణ కోసం కలిసి కొట్లాడాం.. ఆత్మీయుణ్ని కోల్పోయా
తెలంగాణ ఉద్యమ కారుడు, కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది వెలిచాల జగపతిరావు మన మధ్య నుంచి విశ్రమించడం జీర్ణించుకోలేనిది. జగపతి రావుతో నా అనుబంధం మూడున్నర దశాబ్దాల కింద మొదలై ఆయన తుదిశ్వాస వరకు కొనసాగింది. ఆయన ఏ పదవి చేపట్టినా తన కార్యాచరణ, క్రమశిక్షణతో ఆ కుర్చీకే వన్నె తెచ్చేవారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా, స్వతంత్ర శాసనసభ్యుడిగా సభలో అడుగుపెట్టినా ముఖ్యమంత్రులు, మంత్రులతో ఆయన సాన్ని హిత్యం ఎప్పటికీ మరువలేనిది. నేను 1974లో రాజకీయ ఆరంగేట్రం గావించే కన్నా నాలుగేళ్ల ముందు నుంచే, అంటే 1970లోనే ఆయన ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. ‘గుడి’ గ్రామ సహకార సంఘం చైర్మన్‌గా, గంగాధర సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. చలకుర్తి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేనూ, కరీం నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర శాసన సభ్యుడిగా జగపతిరావూ 1989లో ఏకకాలంలో అసెంబ్లీలో అడుగుపెట్టాం. కాంగ్రెస్ పార్టీలో జగ పతిరావు సీనియర్ లీడర్‌గా ఉన్నప్పటికీ టికెట్ దక్కని కారణంగా ఇండిపెండెంట్‌గా గెలుపొంది సత్తా చాటుకున్నారు. దాంతో అందరి దృష్టి ఒక్కసారిగా జగపతిరావు మీద పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివక్ష, అవమానం, అణచివేతకు తెలంగాణ ప్రాంతం గురవుతుందనే భావన మాలో రోజు రోజుకూ రూఢీపడ సాగింది. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ స్టేట్‌ను కలిపే ముందు రాసుకున్న ఒప్పందాలు అమలుకు నోచుకోకపోవడంతో జగపతిరావు కోపంతో రగిలి పోయేవారు. పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాలు, అష్ట సూత్రాలు వంటి ఒప్పందాలు అమలు కావాలంటే తెలంగాణ శాసనసభ్యులం అందరం ఒకే వేదిక మీదకు రావాలని నిశ్చయించుకున్నాం. ‘తెలంగాణ శాసన సభ్యుల ఫోరం’ 1991లో ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఫోరం ఏర్పాటులో జగపతిరావు పాత్ర అమోఘం. జువ్వాడి చొక్కారావు, పి. నర్సారెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి, ఎమ్. బాగారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎమ్. నారాయణరెడ్డి, ఎమ్. సత్యనారాయణరావు, ఎన్. ఇంద్రసేనారెడ్డి, సీహెచ్. విద్యాసాగర్‌రావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వంటి భిన్న పార్టీల సభ్యులు తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పాటులో కీలక పాత్ర నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడిగా నన్ను, కన్వీనర్‌గా జగపతిరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రాంత హక్కులు, రక్షణలు, నీళ్లు నిధులలో వాటాల కోసం శాసనసభ లోపలా, బయటా సమష్టిగా పోరాడాలని తీర్మానించాం. అధికార పార్టీ సభ్యులు మంత్రులుగా ఉంటే మంత్రివర్గ సమావేశాల్లోనూ తెలంగాణ వాటాల గురించి దెబ్బలాడాలని నిర్ణయించి ఆచరణలో చూపెట్టినాం. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా, జగపతిరావు అధికార పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ తెలంగాణ వాటా కోసం రాజీలేని పోరాటం కొనసాగించాం. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో తొలి బడ్జెట్లోనే జగపతిరావుతో కలిసి అసెంబ్లీలో రెండున్నర గంటల పాటు తెలంగాణ గొంతును వినిపించాం. తెలంగాణ శాసనసభ్యుల ఫోరం చేసిన కృషి వల్లనే ప్రత్యేకంగా తెలంగాణ మదర్ డెయిరీ ఏర్పాటు అయింది. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య తొలిదశ తెలంగాణ ఉద్యమం 1969లో విఫలమైన తర్వాత, తెలంగాణవాదం బలహీనపడకుండా చేయడంలో తెలంగాణ శాసన సభ్యుల ఫోరం చేసిన కృషి ఎనలేనిది. నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ శాసనసభ్యులు ఫోరాన్ని కన్వీనర్ జగపతిరావు ముందుండి నడిపించారు. సాగునీటి పంపకంలో తెలంగాణ పట్ల వివక్షను తెలంగాణ శాసనసభ్యుల ఫోరం తీవ్రంగా నిరసించింది. నాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం తెలంగాణ శాసనసభ్యుల ఫోరం చేసిన పోరాట ఫలితంగానే దేవాదుల, నెట్టెంపాడు, తుపాకుల గూడెం, కల్వకుర్తి ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమ కాలువ, కరీంనగర్ వరద కాలువ పథకాలు మొదలైనాయి. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉండగా అనేక మార్లు తెలంగాణ వాటాలో వివక్షపై పీవీకి వివరించి, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించగలిగాం. నా రాజకీయ అనుబంధం రానునాను జగపతి రావుకు నన్ను అనుంగు మిత్రునిగా మార్చింది. తెలంగాణ సమస్యలపై జగపతిరావు కవిగా, సాహితీవేత్తగా లోతైన అధ్యయనం చేసి తన కవిత్వం ద్వారా, నిరంతర రచనలతో ప్రజల్లో స్ఫూర్తి రగిలించారు. అధికారంలో ఉన్నా, వెలుపల ఉన్నా మాలాంటి వారికి ఎందరికో జగపతిరావు స్ఫూర్తి దాయకం. ఆయన పట్టుదల పలువురికి విస్మయం కలిగించేది. దీర్ఘకాలం ప్రజల మధ్య పాటుపడిన ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయిన వెలితి నన్ను బాధిస్తున్నది. జగపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటితో నివాళులు అర్పిస్తున్నాను. జగపతిరావు ఆశయాలు నెరవేరి, తెలంగాణ నలుదిక్కులా దీప కాంతులు వెదజల్లాలని ఆకాంక్షిస్తున్నాను. (క్లిక్ చేయండి: భారత్ జోడో పాదయాత్రతో కొత్త ఉత్సాహం) - కుందూరు జానారెడ్డి మాజీ మంత్రివర్యులు -
గన్ పార్క్ వద్ద గల్ఫ్ కార్మికుని మృతదేహానికి నివాళి
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య ఇటీవల బహ్రెయిన్‌లో మరణించారు. శనివారం బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జేఏసీ నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం, గన్ పార్క్ వద్ద ఉంచి నివాళులు అర్పించారు. గల్ఫ్ అమరులకు నివాళులు అర్పిస్తూ అరుణోదయ సాంస్కృతిక బృందం పాటలు పాడారు. గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గుగ్గిల్ల రవిగౌడ్, తెలంగాణ బీజేపీ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు, తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల మురళీధర్ రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన గల్ఫ్ జేఏసీ నాయకులు రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్ బోర్డుతో కూడిన సమగ్ర ప్రవాసీ విధానం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఎనిమిది ఏళ్లలో 1,600 మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారని, కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి గల్ఫ్ మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు -
Maddikayala Omkar: సామాజిక న్యాయ యోధుడు
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ శాసన సభ్యులు, ఎంసీపీఐ (యూ) వ్యవస్థాపకులు, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. 1924లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలం, ఏపూర్‌లో మద్దికాయల రామయ్య, అనంతలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. 16 ఏళ్ల వయస్సులోనే నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ‘ఆంధ్ర మహా సభ’లో వలంటీర్‌గా చేరి... ఆ తరువాత భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తికై సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించారు. నిజాం సైన్యాలపై, యూనియన్ సైన్యాలపై ఆయన తుపాకీ చేతపట్టి అలుపెరుగని పోరాటం చేశారు. ఆ నాటి నిజాం పాలన ఓంకార్ తలకు వెలకట్టింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పలు బాధ్యతలు చేపట్టి, 1964లో ఏర్పడ్డ మార్క్సిస్ట్ పార్టీలో ముఖ్య నాయకునిగా పేరుగాంచారు. 1972 నుండి 1994 వరకు వరంగల్ జిల్లా నర్సంపేట ప్రజలు ఐదుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసన సభ్యునిగా చట్టసభకు పంపినారు. ప్రజలు ‘అసెంబ్లీ టైగర్’గా ఆయన్ని అభివర్ణించారు. నక్సలైట్లు, భూస్వాములు ఆయనపై అనేకసార్లు హత్యా ప్రయత్నం చేయగా ప్రాణాపాయం నుండి బయట పడిన ఓంకార్‌ను అన్ని వర్గాల ప్రజలు ‘మృత్యుం జయుడు’గా పిలిచారు. 1964 మార్క్సిస్ట్ కార్యక్రమాన్ని నిబద్ధతతో నడపడానికి 1984లో ఎమ్సీపీఐ (యూ)ను ఏర్పాటు చేసి దేశమంతా విస్తరణకు పూనుకున్నారు. వర్గ వ్యవస్థలో భాగం గానే భారతదేశంలో కుల వ్యవస్థ ఉందని ఆయన భావించారు. అగ్రవర్ణ ఆధిపత్యంలో వివక్షకులోనై ఉన్న అణగారిన ప్రజలను సాంఘిక వ్యత్యాసాల నుండి బయట పడేయడానికి ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యపరచి ఆధిపత్య వర్గాల చెంతన ఉన్న దోపిడీ, పెట్టుబడిదారీ వర్గాలపై తిరుగు బాటు చేయించినప్పుడే శ్రామిక వర్గ రాజ్యస్ధాపన సులువు అవుతుందని ఆయన చెప్పారు. ఆర్థిక, రాజకీయ రంగాలపై అగ్రకుల సంపన్న వర్గాల ఆధిపత్యం సాగదంటూ... ‘జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల పంపకం కావాలి, వారే రాజ్యాధికారం చేపట్టాలంటూ 1999 లో 14 కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి రాష్ట్రంలో ‘మహాజన ఫ్రంట్’ ఏర్పాటు చేశారు. జనాభాలో 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణలలోని పేదలు ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సమానత్వాన్ని సాధించలేకపోతున్నారు. అందుకే ‘వర్గ వ్యవస్థలోనే కుల వ్యవస్థ’ ఉన్నదని ఓంకార్ స్పష్టం చేశారు. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులపై అంచనా ఉన్న ఓంకార్ ఆశయాలకు అనుగుణ్యంగానే ఎమ్సీపీఐ (యూ) కార్యక్రమం ముందుకు సాగుతుంది. ‘ఓట్లు మావే సీట్లు మావే’, ‘ఓట్లు మావి అధికారం మీదంటే’ ఇక చెల్లదంటూ ఏర్పడిన ఆనాటి ‘మహాజన ఫ్రంట్’లో అయినా, 2018లో ‘సామాజిక న్యాయం, బహుజనులకే రాజ్యాధికారం’ అంటూ ఏర్పడిన ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ (బీఎల్ఎఫ్)లో అయినా ఎమ్సీపీఐ (యూ) భాగస్వామి అయిందంటే... ఓంకార్ ఆశయ సాధన కోసమే. 2008 అక్టోబర్ 17న అమరులైన కామ్రేడ్ ఓంకార్‌కు... నేటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ బహుజన రాజ్యస్థాపనకై పాటుపడడమే ఘనమైన నివాళి. (క్లిక్ చేయండి: ఆయన జీవితమే ఒక సందేశం) – వనం సుధాకర్ ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు (అక్టోబర్ 17న ఓంకార్ వర్ధంతి సందర్భంగా) -
పోరాడి ఓడిన సైనిక శునకం.. ఆర్మీ అధికారుల నివాళులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల సర్చ్ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన జూమ్ అనే వీర శునకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉగ్రవాదులను చేజ్ చేసే ఆపరేషన్‌లో రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయినా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీంతో వెంటనే అధికారులు జూమ్(కుక్క)ని హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించి తగిన చికిత్స అందించారు. ఐతే ఈ ఘటనలో జుమ్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి ప్రాణాలతో పోరాడుతూ... గురువారం ఉదయం 11. 50 నిమిషాలకు మృతి చెందిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జూమ్‌కి శ్రీనగర్‌లోని చినార్ వార్ మెమోరియల్ బాదామి బాగ్ కంటోన్మెంట్ వద్ద భారత సైన్య ఘనంగా నివాళులర్పించినట్లు పీఆర్ఓ డిఫెన్స్ కల్నల్ ఎమ్రాన్ ముసావి తెలిపారు. అంతేగాదు ఈ కార్యక్రమంలో పలు ఆర్మీ శునకాలు పాల్గొని మృతి చెందిన వీర శునకం జూమ్‌కి నివాళులర్పించాయి. ఆర్మీ కనైన్ చినార్ వారియర్స్‌లో అమూల్యమైన సభ్యుడిని కోల్పాయమని కల్నల్ ముసావి అన్నారు. జూమ్ పలు ఉగ్రవాదక నిరోధక కార్యకలాపాల్లో వీరోచితంగా పోరాడి ధైర్యసాహసాలను కనబర్చినట్లు తెలిపారు. #WATCH | 29 Army Dog Unit pays tributes to Indian Army Dog 'Zoom' in Jammu. He passed away yesterday at 54 AFVH (Advance Field Veterinary Hospital) in Srinagar where he was under treatment after sustaining two gunshot injuries in Op Tangpawa, Anantnag, J&K on 9th Oct. pic.twitter.com/0nlU7Mm7Ti — ANI (@ANI) October 14, 2022 (చదవండి: మాస్కో విమానంలో బాంబు కలకలం...అప్రమత్తమైన అధికారులు) -
అయోధ్యలో లతామంగేష్కర్ పేరు మీద చౌక్...7.9 కోట్లతో భారీ వీణ ఏర్పాటు..
అయోధ్య: లెజండరీ సింగర్ దివగంత లతామంగేష్కర్ 93వ జయంతి పురస్కరించుకుని ఆమె పేరు మీద అయోధ్యలో ఒక కూడలిని ఏర్పాటు చేశారు. దీన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. ఈమేరకు సరయు నది వద్ద ఉన్న కూడలిలో దాదాపు రూ. 7.9 కోట్ల వ్యయంతో భారీ వీణను ఏర్పాటు చేశారు. ఈ వీణ దాదాపు 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తులో 14 టన్నుల బరువు ఉంటుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వట్టర్లో...లతా దీదీ జయంతి సందర్భంగా ఆమెని స్మరించుకోవడమే గాక ఆమె తనపై చూపిన ఆప్యాయతను మరువలేనిదన్నారు. ఈ రోజు అయోధ్యలోని చౌక్‌కి ఆమె పేరు పెట్టడం అనేది భారతీయ దిగ్గజాలలో ఒకరిగా పేరుగాంచిని లతా దీదీకి దక్కిన తగిన నివాళి అని అన్నారు. ఈ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఈ భారీ సంగీత వాయిద్యం సంగీత ప్రియులకు గొప్ప ఆకర్షణగా ఉండటమే గాక ఇంత బారీ సంగీత పరికరాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రధమమని అధికారులు తెలిపారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఈ ప్రాజెక్టుకి సుమారు 7.9 కోట్లు ఖర్చు అయ్యిందని తెలిపారు. ఈ భారీ సంగీత వీణను పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ తయారు చేశారని, సుమారు రెండు నెలల సమయం పట్టిందని తెలిపారు. అందంగా తీర్చిదిద్దిన ఈ వీణపై సరస్వతి చిత్రం కూడా చెక్కబడి ఉందని అన్నారు. (చదవండి: రాహుల్‌ని చూసి భావోద్వేగం.. వెక్కి వెక్కి ఏడ్చిన యువతి: వీడియో వైరల్) -
జాతీయవాద ఉద్యమానికి తీరని లోటు
ప్రముఖ విద్యావేత్త, జాతీయవాది, హిందూధర్మ పరిరక్షకులు గుజ్జుల నర్సయ్య సార్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మాజీ అధ్యక్షులుగా, ఆలిండియా స్థాయిలో ఉపాధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులుగా గణనీయమైన స్థాయిలో సేవలు అందించారు. నర్సయ్య తన 81 ఏళ్ల వయసులో 2022 సెప్టెంబర్ 24 హన్మకొండ హంటర్ రోడ్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామం మండలగూడెంలో 1942 ఆగస్ట్ 8న ఆయన జన్మించారు. 1952లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో స్వయంసేవక్‌గా జీవితాన్ని ప్రారంభిం చారు. 1967లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981లో ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్ భాషను సులభ శైలిలో బోధించి వారిలో ఇంగ్లిష్ భాష అధ్యయనం పట్ల ఆసక్తి పెంచే మెలకువలు నేర్పించిన ఉత్తమ అధ్యాపకులుగా గుర్తింపు పొందారు. 1986లో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రంలో వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థి సంఘాలతో జరిగిన అనేక సంఘర్షణ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. ఉత్తర తెలంగాణ పరిధిలో గల జిల్లాల్లో విశేష పర్యటనలు చేసి విద్యార్థి పరిషత్ కార్యకర్తల్లో జాతీయవాద దృక్పథాన్ని ప్రేరేపించారు. 1992లో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించారు. కొంతకాలం వరంగల్ విభాగ్ ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఏబీవీపీ సంస్థకు పూర్తి సమయ కార్యకర్తగా వరంగల్ నుండి దేశ నలుమూలల పని చేయడానికి వెళ్లారు. క్లిష్ట పరిస్థితులలో జాతీయవాద వ్యాప్తి కోసం నిరంతరం పరితపించిన మహానుభావుడు నర్సయ్య. బిహార్ విశ్వవిద్యాలయం ఈసీ మెంబర్‌గా కూడా ఆయన చాలాకాలం సేవలు అందించారు. 2001లో హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల నుండి ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. 2007లో భారతీయ జనతా పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఇంగ్లిష్ లెక్చరర్‌గా నర్సయ్య వడ్డేపల్లిలోని పింగిలి కాలేజీలో, గోదావరిఖని, మంథని, మంచిర్యాల, పెద్దపల్లి, హుజురాబాద్ డిగ్రీ కళాశాలలో పని చేశారు. పలు జూనియర్ డిగ్రీ కళాశాలలు నిర్వహించిన జాతీయ సేవాపతకం శిబిరాల్లో జాతీయ పునర్నిర్మాణంలో యువత పాత్ర అనే అంశంపై అనర్గళంగా ఉపన్యసించి యువతలో సేవాభావం, దేశభక్తి, సంకల్పబలం, మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేసిన సామాజిక చైతన్యశీలి ఆయన. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హన్మకొండ చౌరస్తాలోని వేదికపై ఆయన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా సాగేవి. నక్సలైట్ల చేతిలో ఏబీవీపీ కార్యకర్తలు మరణించిన సమయంలో నర్సయ్య మొక్కవోని ధైర్యంతో వెళ్లి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన సందర్భాలు అనేకం. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కార్యక్రమాలలో విద్యార్థులను జాగృతం చేయడంలో కూడా కీలక భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏబీవీపీ చేపట్టిన పాదయాత్రకు పాటలు, మాటలు అందించారు. గుజ్జుల నర్సయ్యసార్ మరణం విద్యారంగానికి, సామాజిక చైతన్యానికి తీరని లోటు. వారి ఆశయాల సాధనకు కృషి చేయడమే ఘనమైన నివాళి. (క్లిక్: సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చాకలి ఐలమ్మ) - నేదునూరి కనకయ్య వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం, సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక, తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం -
Jean Luc Godard: సినీ నవ్య పథగామికి సెలవ్!
‘‘సంగీతానికి బాబ్ డిలాన్ ఎంతో... సినిమాకు గొడార్డ్ అంత!’’ – నేటి మేటి హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరంటినో అవును... గొడార్డ్ అంతటి సినీ దిగ్గజమే! వెండితెర విప్లవమైన ఫ్రెంచ్ న్యూవేవ్ సినిమా ఉద్యమాన్ని తెచ్చిన ఆరేడుగురు మిత్రబృందంలో అగ్రగామి. సినీ రూపకల్పన సూత్రాలను తిరగరాసిన అనేక చిత్రాలకు తన తొలి సినిమాతోనే బీజం వేసిన పెద్దమనిషి. విమర్శకుడిగా మొదలై దర్శకుడైన సినీ మేధావి. ఈ 91 ఏళ్ళ ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ సినీ దర్శక వరేణ్యుడు విషాదభరిత రీతిలో సెప్టెంబర్ 13న ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఆత్మహత్యకు సాయం తీసుకొని అంతిమ ప్రయాణం చేశారు. అవయవాలేవీ పనిచేయనివ్వని అనేక వ్యాధుల పాలైన ఆయనకు స్విట్జర్లాండ్‌లో చట్టబద్ధమైన ఆ రకమైన తుది వీడ్కోలు సాంత్వన చూపింది. అంతేకాదు... ఆ రకమైన ఆత్మహత్య సంగతి అధికారికంగా చెప్పాలనీ ముందే ఆయన మాట తీసు కున్నారు. అలా ఆఖరులోనూ గొడార్డ్ది నవ్య పంథాయే! 1930 డిసెంబర్లో పుట్టిన గొడార్డ్ 1950లో కొందరితో కలసి ‘గెజెట్ డ్యూసినిమా’ అనే సినిమా పత్రిక స్థాపించి, అనేక వ్యాసాలు రాశారు. 1952 నుంచి ఆ మిత్ర బృందంతో గొంతు కలిపి, న్యూవేవ్ సినిమాకు దన్నుగా విమర్శ వ్యాసాలు వెలువరించారు. మొదట లఘుచిత్రాలు, ఆనక 1959లో తొలి సినిమా తీశారు. దాన్ని ఖండఖండాలుగా కట్ చేయాల్సి వచ్చినప్పుడు, అవసరానికి ఆయన మొదలెట్టినదే ‘జంప్ కట్’ ఎడిటింగ్. ఇవాళ అదే ప్రపంచ సినిమాలో ఓ వ్యవస్థీకృత విధానమైంది. విమర్శకుడిగా మొదలై దర్శకుడైన ఈ సినీ మేధావి రూటే సెపరేటు. నటీనటులు సహజంగా ప్రవర్తిస్తుంటే, కెమేరా నిరంతరం కదులుతూ పోతుంటే, స్క్రిప్టు అక్కడికక్కడ స్పాట్లో మెరుగులు దిద్దుకుంటూ ఉంటే, ఎడిటింగ్‌లో మునుపెరుగని వేగం ఉంటే... అదీ గొడార్డ్ సినిమా. స్టయిలిష్‌గా సాగే తొలి చిత్రం ‘బ్రెత్లెస్’తోనే ఇటు విమర్శక లోకాన్నీ, అటు బాక్సాఫీస్ ప్రపంచాన్నీ కళ్ళప్పగించి చూసేలా చేసిన ఘనత ఆయనది. ఆ పైన ‘కంటెప్ట్’ లాంటి గొప్ప చిత్రాలు తీశారు. మలి చిత్రంలో నటించిన డ్యానిష్ మాడల్ అన్నా కరీనాను పెళ్ళాడి, ఆమెతో హిట్ సినిమాలు చేశారు. 1968లో ఫ్రాన్స్‌లో విద్యార్థుల, శ్రామికుల నిరసనకు సంఘీభావంగా నిలబడి కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను రద్దు చేయించారు. ఆ ఏడాదే ఓ మార్క్సిస్ట్ సినీ బృందాన్ని స్థాపించి, సామ్యవాదాన్ని అక్కున చేర్చుకోవడం మరో అధ్యాయం. 1960లలో విరామం లేకుండా వరుసగా సినిమాలు తీసిన గొడార్డ్ 1970లకు వచ్చేసరికి స్విట్జర్లాండ్‌లోని ఓ టీవీ స్టూడియోలో పనిచేస్తూ, కొత్త మీడియమ్ వీడియో వైపు దృష్టి మళ్ళించారు. 1980లలో సినీ రూపకల్పనకు తిరిగొచ్చి, ’94 వరకు అనేక చిత్రాలు తీశారు. దర్శకుడిగా గొడార్డ్లో మూడు దశలు. న్యూవేవ్ గొడార్డ్ (1960–67)గా మొదలైన ఆయన ర్యాడికల్ గొడార్డ్ (1968–72)గా పరిణామం చెంది, 1980ల అనంతరం వీటన్నిటికీ భిన్నమైన దర్శకుడిగా పర్యవసించారు. వస్తువుకూ– శిల్పానికీ, మనసుకూ – మెదడుకూ సమరస మేళవింపు ఆయన సినిమాలు. ఆయన రాజకీయాలు చూపెడతారు. కానీ ప్రబోధాలు చేయరు. సినిమానే శ్వాసించి, జీవించడంతో తెరపై అణువణువునా దర్శనమిస్తారు. ప్రతి సినిమాతో సినీ ప్రేమికుల మతి పోగొడతారు. సినిమాలో కవిత్వాన్నీ, తనదైన తాత్త్వికతనూ నింపేసిన ఆయన, నిర్ణీత పద్ధతిలోనే కథాకథనం సాగాలనే ధోరణినీ మార్చేశారు. స్థల కాలాదులను అటూ ఇటూ కలిపేసిన కథాంశాలతో సినిమాలు తీశారు. ‘కథకు ఆది మధ్యాంతాలు అవసరమే. కానీ, అదే వరుసలో ఉండాల్సిన పని లేద’ని నమ్మారు. దాదాపు 100కు పైగా సినిమాలు తీసినా, ఎప్పటికప్పుడు కొత్తదనం కోసమే పరితపించారు. ఆయన సినిమాల్లో రిలీజ్ కానివి, సగంలో ఆగినవి, నిషేధానికి గురైనవీ అనేకం. నాలుగేళ్ళ క్రితం 87 ఏళ్ళ వయసులో 2018లోనే గొడార్డ్ తాజా చిత్రం రిలీజైంది. కెరీర్లో ఒక దశ తర్వాత ఆలోచనాత్మకత నుంచి అర్థం కాని నైరూప్య నిగూఢత వైపు ఆయన కళాసృష్టి పయనించిందనే విమర్శ లేకపోలేదు. అయితేనేం నేటికీ పాత చలనచిత్ర ఛందోబంధాలను ఛట్ఫట్మనిపించిన వినిర్మాణ శైలి దర్శకుడంటే ముందు గొడార్డే గుర్తుకొస్తారు. అందుకే, 2011లో గొడార్డ్కు గౌరవ ‘ఆస్కార్’ అవార్డిస్తూ ‘సినిమా పట్ల మీ అవ్యాజమైన ప్రేమకు.. నిర్ణీత సూత్రాలపై మీ పోరాటానికి.. నవీన తరహా సినిమాకు మీరు వేసిన బాటకు..’ అంటూ సినీ ప్రపంచం సాహో అంది. రచయితల్లో జేమ్స్ జాయిస్, రంగస్థల ప్రయోక్తల్లో శామ్యూల్ బెకెట్లా సినిమాల్లో గొడార్డ్ కాలాని కన్నా ముందున్న మనిషి. సమకాలికులు అపార్థం చేసుకున్నా, భావి తరాలపై ప్రభావమున్న సృజనశీలి. నవీన మార్గం తొక్కి, ఇతరులు తమ ఆలోచననూ, ఆచరణనూ మార్చుకొనేలా చేసిన ఘనుడు. ఏ రోజు సీన్లు ఆ రోజు సెట్స్‌లో రాస్తూ, చేతిలో పట్టుకొనే చౌకరకం కెమెరాలతో, ఎదురెదురు అపార్ట్మెంట్లలో, తెలిసిన బంధుమిత్రులే నటీనటులుగా సినిమా తీస్తూ అద్భుతాలు సృష్టించిన జీనియస్. ఆయన ర్యాడికల్ శైలి ఎందరిలోనే సినీ సృజనకు ఉత్ప్రేరకం. ఆ ప్రభావం అనుపమానం. అది ఎంత గొప్పదంటే... ఆయన సినిమాలు చూస్తూ వచ్చిన హాలీవుడ్ కుర్రకారులో అసంఖ్యాకులు కెమేరా పట్టి, లోబడ్జెట్, స్వతంత్ర చిత్రాలు తీయసాగారు. ఆయన టెక్నిక్లే వారి యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీల రూపకల్పనకు తారకమంత్రమయ్యాయి. సంప్రదాయంపై తిరుగుబాటు చేసి, హాలీవుడ్‌నే ధిక్కరించిన ఓ దర్శకుడిని ఆ హాలీవుడ్డే అలా ఆరాధించడం వింతల్లో కెల్లా వింత. మరెవరికీ దక్కని ఘనత. హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరంటినో పైనా ‘అమితంగా ప్రభావం చూపిన దర్శకుడు’ గొడార్డే! తన గురువు కాని గురువు తీసిన ‘బ్యాండ్ ఆఫ్ అవుట్‌సైడర్స్’ స్ఫూర్తితోనే టరంటినో తన స్వీయ సినీ నిర్మాణ సంస్థకు ‘ఎ బ్యాండ్ ఎపార్ట్’ అని పేరు పెట్టారు. అన్ని వ్యవస్థలనూ ప్రతిఘటించిన గొడార్డ్ తనకు తెలియకుండా తానే ఒక వ్యవస్థ కావడం ఓ విరోధాభాస. ఆయన తన సినిమాల్లో చెప్పిన అంశాలు ముఖ్యమైనవే. కానీ, చెప్పీచెప్పకుండా అంతర్లీనంగా అలా వదిలేసినవి మరీ ముఖ్యమైనవి. ‘ఫోటోగ్రఫీ సత్యం. సినిమా సెకనుకు 24 సార్లు తిరిగే సత్యం. ఎడిట్ చేసిన ప్రతిదీ అసత్యమే’ అనేవారాయన. ఆ సత్యాసత్యాల సంఘర్షణలే ఆయన చిత్రాలు. ఒక్కమాటలో సినిమాను తన సెల్యులాయిడ్ రచనగా మలుచుకున్న అరుదైన దర్శకుడు గొడార్డ్. (క్లిక్ చేయండి: బొమ్మలు చెక్కిన శిల్పం) బతికుండగానే ఆయనపై ఆయన శైలిలోనే ఒక సినిమా రావడం విశేషం. గొడార్డంటే ఫ్రెంచ్ న్యూవేవ్ అంటాం. కానీ, జాగ్రత్తగా గమనిస్తే 1960ల తర్వాత ప్రపంచం నలుమూలల్లో ప్రతి నవ్యధోరణిలో ఆయన దర్శనమిస్తారు. ఆయన శైలి, సంతకాలు మన బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపిస్తాయి. సినిమా సరిహద్దుల్ని విస్తరించిన గొడార్డ్తో ప్రభావితుడైన దర్శకుడు మార్టిన్ స్కొర్సెసే అన్నట్టు ‘‘సినీ రంగంలో అతి గొప్ప ఆధునిక దృశ్యచిత్రకారుడు.’’ చిత్రకళకు ఒక పికాసో. సినిమాకు ఒక గొడార్డ్! రాబోయే తరాలకూ ఆయన, ఆయన సినిమా గుర్తుండిపోయేది అందుకే! (క్లిక్ చేయండి: నడిచే బహు భాషాకోవిదుడు) – రెంటాల జయదేవ -
Kommareddy Raja Mohan Rao: ప్రగతిశీల వైద్య శిఖామణి
మానవతావాది, పూర్వ ఉపకులపతి, ప్రజా వైద్యులు, అభ్యుదయవాదిగా 86 సంవత్సరాల జీవితాన్ని గడిపిన డాక్టర్ కొమ్మారెడ్డి రాజా రామమోహన్ రావు పశ్చిమగోదావరి జిల్లా పోతునూరులో 1922లో జన్మించారు. 1951 నుండి 1980 వరకు గడిపిన వైద్యరంగ జీవితం చిరస్మరణీయం. సింగరేణి కాలరీస్ వైద్యాధికారిగా 200 పడకల ఆసుపత్రిని నిర్మించి సింగరేణి కాలరీలో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికులకు ఆధునిక వైద్యాన్ని అందించారు. సింగరేణి బొగ్గు గనుల చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకొని ఉచిత వైద్యాన్ని అందించారు. గుంటూరు మెడికల్ కాలేజీ, సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఆయా కళాశాలల అభివృద్ధికి పునాదులు వేశారు. 1982–86 మధ్య ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా విద్యా రంగంలో పలు మార్పులు, సవరణలకు కారకులయ్యారు. దేశంలో ప్రప్రధమంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ‘శాస్త్రీయ సోషలిజం అధ్యయన కేంద్రా’న్ని నెలకొల్పిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే ‘మహాయాన బౌద్ధ కేంద్రం’ కూడా ఆయన పదవీ కాలంలోనే నెలకొల్పబడింది. సర్జన్స్ అంతర్జాతీయ కాలేజ్, ఇంటర్నేషనల్ మెడికల్ స్టడీస్ అకాడమీ, భారత సర్జన్ల సంఘం, భారత యూరోలాజికల్ సొసైటీ, ఇండి యన్ మెడికల్ అసోసియేషన్, జెనీటో– యూరినరీ సర్జరీ(అమెరికా) శిక్షణాబోర్డు తదితర సంఘాలలో అనేక బాధ్యతలు నిర్వహించారు. ఇంగ్లండ్, అమెరికా, జపాన్ తదితర చోట్ల జరిగిన వైద్య సభలకు హాజరయ్యారు. అటు వైద్యరంగానికీ, ఇటు విద్యారంగ వ్యాప్తికీ రామమోహన్ రావు చేసిన కృషికి అనేక అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. 1984లో యార్లగడ్డ రాజ్యలక్ష్మి, వెంకన్న చౌదరి కళాపీఠం తరఫున జాతీయ అవార్డు లభించింది. సామాజిక, వైద్య సేవ రంగాలలో ఆయన చేసిన కృషికిగాను 1992లో ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ బీసీ రాయ్ అవార్డును పొందారు. శాస్త్రవిజ్ఞానాన్ని గ్రామ సీమలకు చేర్చాలన్న లక్ష్యంతో ‘జన విజ్ఞాన వేదిక’ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. వీరి నిరాడంబర జీవితం, సరళ స్వభావం, సేవా తత్పరత, ఆపన్నుల పట్ల ఆదరణ, ప్రగతి శీల ఉద్యమాల పట్ల ఆయనకున్న నిబద్ధత వలన ఒకానొక సందర్భంలో భారత రాష్ట్రపతి పదవికి వామపక్ష అభ్యర్థిగా ఆయన పేరును పరిశీలించిన సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాజా రామమోహన్ రావు తండ్రి కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి 1937 లోనే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జరిపిన రైతు రక్షణ యాత్ర చారిత్రాత్మకం. జీవితాన్ని స్వార్థం కొరకు కాక లోకహితం కొరకు ధారపొయ్యాలన్న తండ్రి మాటను శిరోధార్యంగా తీసు కున్నారు రామమోహనరావు. ఆయన ఆశయాలను మనమూ కొనసాగిద్దాం. – వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక, ఏపీ అధ్యక్షులు (సెప్టెంబర్ 25న కొమ్మారెడ్డి శత జయంతి సందర్భంగా గుంటూరు, వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సెమినార్ జరుగనుంది) -
Nizam Venkatesham: అరుదైన వ్యక్తి నిజాం వెంకటేశం
సాహితీవేత్త, పుస్తక ప్రేమికుడు నిజాం వెంకటేశం మృతి తెలుగు సాహితీలోకాన్ని కలచివేసింది. అప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న ఆయన హఠాత్తుగా సెప్టెంబర్ 18 సాయంత్రం గుండెపోటుతో అసువులు బాశారు. ఆగస్టు 31న తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న వెంకటేశంను పలకరించి ఓదార్చిన సాహితీ మిత్ర బృందానికి ఆయన అర్ధంతర నిష్క్రమణ దిగ్భ్రాంతిని కలిగించింది. నచ్చిన పుస్తకాన్ని పదుల సంఖ్యలో కొని, పంచి, మురిసిపోయిన అరుదైన వ్యక్తి వెంకటేశం. ఆయన 1948లో సిరిసిల్లాలో జన్మించారు. విద్యుత్ శాఖలో ఇంజినీర్‌గా విధులు నిర్వ హించి 1997లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు ఎన్నో సాహితీ కార్యక్రమాల నిర్వహణకు, పుస్త కాల ప్రచురణకు సహకరించారు. కవిత్వం పట్ల ప్రేమతో 1980 దశకంలో ‘దిక్సూచి’ కవితా సంచి కలు వెలువరించి యువ కవులకూ ప్రోత్సాహాన్ని చ్చారు. అలిశెట్టి ప్రభాకర్ దీర్ఘకవిత ‘నిజరూపం’ అందులోనే వచ్చింది. కరీంనగర్ బుక్ ట్రస్ట్ ఆరంభించి అల్లం రాజయ్య ‘భూమి’ కథలు, బీఎస్ రాములు ‘బతుకు పోరు’ నవలను ప్రచురించారు. 1950 దశకంలో తెలంగాణ మాండలీకంలో వచ్చిన గూడూరి సీతారాం కథలు కొత్త తరానికి పరిచయమయ్యేలా 2010లో పుస్తకరూపంలో రావడానికి తోడ్పడ్డారు. 2013లో అలిశెట్టి సమగ్ర కవితా సంపుటి రాకలో ప్రధానపాత్ర పోషించారు. న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి దేశంలో ఆర్థికరంగ మార్పులను సూచిస్తూ రాసిన మూడు ఇంగ్లిష్ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. సేంద్రియ వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ పుస్తకాన్ని కూడా తెనిగించారు. పుస్తకాన్నీ, రచయితనీ, మంచితనాన్నీ ఏకకాలంలో సమానంగా ప్రేమించిన అరుదైన వ్యక్తి వెంకటేశం. ఆయనకు నివాళి. – బి. నర్సన్ -
Cartoonist Mohan: బొమ్మలు చెక్కిన శిల్పం
బొమ్మలు కూడా మాట్లాడతాయి. మాట్లాడ్డమే కాదు జనం తరఫున పోట్లాడతాయి. కత్తులు దూస్తూ ముందుకు ఉరుకుతాయి. కదం తొక్కుతూ పరుగులు తీస్తాయి. రాజుగారి దురహంకారాన్ని ఎడంకాలితో తన్ని పారేస్తాయి. అయితే అన్ని బొమ్మలూ అలా చేయవు. బొమ్మకు ప్రాణం పోసే చేయిని బట్టి, ఆ చేతిని కదిపే కళాకారుడి మనసును బట్టి, ఆ మనసులో రెపరెపలాడే ఎర్ర జెండా పొగరును బట్టి బొమ్మలు కాలర్లు ఎగరేస్తాయి. అలాంటి బొమ్మల తాలూకు ఓనర్లలో ముఖ్యులు ఆర్టిస్ట్ మోహన్. తాడి మోహన్ రావు అంటే ఎవ్వరికీ తెలీకపోవచ్చు. కానీ కార్టూనిస్ట్ మోహన్ అంటే మాత్రం తెలీని వాళ్లు ఉండరు. మోహన్ అంటే సకల కళా వల్లభుడు. కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు, కేరికేచర్లు, కవర్ పేజీ బొమ్మలు, ఉద్యమాలకు కదం తొక్కండర్రా అని కుర్రకారు గుండెల్లో పౌరుషాగ్ని రగిలించే పోస్టర్లు, రాజ్యాధి కారపు దురహంకారాన్ని కాలరు పట్టు కుని నిలదీసి తిరుగుబాటు చేసే జెండా లపై బొమ్మలు, బిగించిన పిడికిళ్లు, కస్సుమని దూసుకుపోయే కొడవళ్లు, యుద్ధభూమికి కదం తొక్కించే లాంగ్ మార్చ్ కాన్వాస్‌లు! మోహన్ అంటే యుద్ధం. అధర్మంపై అన్యాయంపై చిరు నవ్వుతోనే కత్తులు దూసే యుద్ధమే మోహన్! ఎక్కడో ఏలూరులో పుట్టి, అక్కడెక్కడో పశ్చిమబెంగాల్లో జ్ఞానానికి సానపట్టి, విజయవాడ ‘విశాలాంధ్ర’ మీదుగా హైదరాబాద్‌కు తరలి అదే రాజధానిగా కళాకారుల సామ్రా జ్యాన్ని స్థాపించాడు మోహన్. తెలుగునాట పొలిటికల్ కార్టూన్ అంటే ఇలా ఉండాలిరా నాయనా అన్నట్లు వందల వేల కార్టూన్లతో రాజకీయ నేతల గుండెల్లో అణుబాంబులు పేల్చిన ఉగ్రవాది మోహన్. ఎంత పెద్ద నాయకుడైనా సరే భయం లేదు. ఎంత దుర్మార్గపు నాయకుడైనా సరే ఖాతరే లేదు. తిట్టాలనుకుంటే తిట్టేయడమే. కోపం పెద్దదైతే లాగి లెంప కాయలు కొట్టేయడమే. ఎన్టీఆర్ నుండి నేటి కేసీయార్ వరకు మోహన్ కార్టూన్ బారిన పడని నేత లేరు. మోహన్ తండ్రి తాడి అప్పలస్వామి కమ్యూనిస్టు నాయ కులు. నాన్న నీడలో మండుటెండపు ఉద్యమాలు మోహన్ లోని కళాకారుడికి చిన్నప్పుడే ఓ కర్తవ్య బోధ చేసేశాయి. అదే 5 దశాబ్దాల పాటు తెలుగు నాట ఉద్యమ పోస్టర్లపైనా, తిరుగుబాటు జెండాలపైనా పిడికిళ్లు బిగించిన యోధుల విప్లవ నినాదాలు, కసి ఎక్కిన కొడవళ్ల బెదిరింపులు వగైరాల ఎర్రెర్రటి బొమ్మల రూపంలో మోహన్ సంతకం మెరుస్తూనే ఉంది. (క్లిక్: ఆ రాచరికంలో ఎందుకింత ఆకర్షణ?) ప్రభువెక్కిన పల్లకీలు మోసి, వారి అంతఃపుర రాణుల అందాలు పొగిడి వారిచ్చే చిల్లర బహుమతులు మూట కట్టుకుని మురిసిపోయే కళాకారులు కాలగర్భంలో కలిసి పోతారు. ఎవరికీ గుర్తుకు కూడా రారు. పల్లకి నెక్కిన ప్రభువును కాలర్ పట్టుకుని నీ రాజ్యం చాలా అన్యాయంగా ఉంది గురూ అని అనగలిగిన వాడే నిఖార్సయిన వీరుడు. అసలు సిసలు యోధుడు. అలాంటి వారినే తరతరాలుగా జనం గుర్తు పెట్టుకుంటారు. గుర్తుపెట్టు కోవడమేం ఖర్మ గుండెల్లో గుడి కట్టేసి ఆ గుడిలో ఏనిమేషన్ సినిమాలతో పూజలు చేసేస్తారు. అటువంటి అరుదైన యోధుడూ, కళాకారుడూ మన మోహన్! – సీఎన్ఎస్ యాజులు (సెప్టెంబర్ 21న చిత్రకారుడు మోహన్ వర్ధంతి) -
కృష్ణంరాజు భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి ( ఫోటో గ్యాలరీ 2 )
-
కృష్ణంరాజుకు నివాళి.. ప్రధాని మోదీ స్పెషల్ ఫొటో ఇదే..
రాజకీయవేత్త, సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్తతో సినీ, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విని పలువురు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ క్రమంలో సీని ప్రముఖులు, రాజకీయ నేతలు కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా కృష్ణంరాజు మృతిపై తన సంతాపాన్ని తెలిపారు. మోదీ ట్విట్టర్ వేదికగా తెలుగులో.. ‘శ్రీ యు.వి.కృష్ణంరాజు గారి మరణం నన్ను కలచివేసింది. రాబోయే తరాలు ఆయన నటనా కౌశలాన్ని , సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయి. సమాజ సేవలో కూడా ఆయన ముందంజలో ఉండి రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే కృష్ణంరాజు, ప్రభాస్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. Saddened by the passing away of Shri UV Krishnam Raju Garu. The coming generations will remember his cinematic brilliance and creativity. He was also at the forefront of community service and made a mark as a political leader. Condolences to his family and admirers. Om Shanti pic.twitter.com/hJyeGVpYA5 — Narendra Modi (@narendramodi) September 11, 2022 ఇక, కృష్ణంరాజు భౌతికకాయానికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా నివాళులు అర్పించారు. ఈ క్రమంలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ సీనియర్ నేత అందరి నాయకుడు కృష్ణంరాజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ధర్మం కోసం పోరాడుతున్న నాకు అయన అనేక సూచనలు ఇచ్చేవారు. నేను చేసే ధర్మ పోరాటాన్ని మెచ్చుకుని ప్రోత్సహించేవారు. పార్టీకి అనేక సేవలు అందించిన నిజాయతీపరుడు కృష్ణంరాజు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి.. కృష్ణంరాజును గుర్తించి కేంద్ర మంత్రిని చేశారు. ఆయన అనేక సినిమాల్లో గొప్పగా నటించారు. అంతిమ తీర్పు సినిమా చాలా గొప్పది. ఆ సినిమా చూశాక ఆయనతో నేను ఫొటో దిగాలని అనుకున్నాను. ఇదే విషయాన్ని ఆయనతో చెప్పాను. ఆయన రూపంలో మనకు ప్రభాస్ ఉన్నారు. మేమంతా ఆయన లక్ష్యం కోసం పని చేస్తాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ తెలిపారు. -
కృష్ణంరాజు భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి ( ఫొటోలు)
-
దివంగత మహానేత వైఎస్ఆర్కు TPCC ఘననివాళి
-
ఇడుపులపాయ: మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళి (ఫొటోలు)
-
YSR: అఖిల భారతావనికి అడుగుజాడ
వ్యక్తిత్వాన్ని రాజకీయాలకు బలిపెట్టని నాయకుడు వైఎస్సార్. నవ్వులో స్వచ్ఛత, పిలుపులో ఆత్మీయత ఉట్టిపడేవి. మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. మాట తప్పని, మడమ తిప్పని ఆయన గుణమే ప్రజల కోసం ఎంతదూరమైనా వెళ్లేటట్టు చేసింది. ఆత్మహత్య తప్ప గత్యంతరం లేని స్థితిలో ఉన్న రైతాంగానికి జీవశక్తిని అందించారు. వ్యవసాయ పునరుజ్జీవనానికి బాటలు పరిచారు. నిరుపేదలకు సైతం కార్పొరేట్ వైద్యం దక్కేలా చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో నిరుపేద పిల్లలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు. అధోగతిలో ఉన్న సహకార వ్యవస్థను ఆదుకున్నారు. పల్లెలు మళ్లీ కళకళలాడేలా చేశారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన మహోన్నత నాయకుడు వైఎస్సార్. కపటం లేని ఆ మందహాసం... సరిగ్గా పదమూడేళ్ల క్రితం, 2009 సెప్టెంబరు రెండో తేదీన యావత్ తెలుగు ప్రజానీకం పడిన ఆందోళన ఇంకా గుండెల్లో పచ్చిగానే ఉంది. కార్చిన కన్నీటి తడి ఇంకా చెమ్మగానే ఉంది. ఆ విషాద ఘడియల్లో దేశ వ్యాప్తంగా మీడియాలో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం ‘వైఎస్సార్’. ఆ పేరు ఇక ముందు కూడా వినబడు తూనే ఉంటుంది కానీ, ఆ రూపం సజీవంగా కనబడే అవకాశమే లేదు కదా. ఒక వ్యక్తి గుణ గణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసు కునేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖర రెడ్డిగారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది. ‘రాజశేఖరా! నీపై మోజు తీరలేదురా!’ అని తెలుగు ప్రజానీకం రెండో పర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీ నిండగానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం. ‘రాజసాన ఏలరా!’ అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం. అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్ అరవై ఏళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది, ఆయన పథకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం. 1978 నుంచి ఒక జర్నలిస్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. విలేఖరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా ఉండేది. బిగుసుకుపోయినట్టు ఉండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. నవ్వులో స్వచ్ఛత, పిలుపులో అత్మీయత ఉట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం ఎంత దూరమైనా వెళ్ళడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్నా కీడే ఎక్కువగా జరిగిన సందర్భాలున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్‌కు రాష్త్రవ్యాప్తంగా అభిమానులను తయారుచేసి పెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరఫున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది. 1975లో నేను రేడియో విలేఖరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి తొలిసారి శాసనసభకు ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళిన వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది. వైఎస్సార్‌ను నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లో సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటీ హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భమది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించేవారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్. ఇటు హైదరాబాదు లోనూ, అటు ఢిల్లీ లోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిస్టులతో కళకళ లాడుతూ ఉండేవి. వేళాపాళాతో నిమిత్తం లేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు ఉండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిస్టు స్నేహితులు ఆయనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉండడం సహజమే. 2004లో ఆయన తొలిసారి సీఎం కాగానే, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్‌లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకు వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక విలేఖరికీ, ఒక రాజకీయ నాయకుడికీ నడుమ సహజంగా ఉండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పెన వేసుకున్న ఈ బంధం శాశ్వతంగా తెగిపోయిందే అన్న బాధతో, ఆ మహోన్నత వ్యక్తిత్వానికి నివాళి అర్పిస్తూ, ‘రెండు కన్నీటి బొట్లు’ రాల్చడం మినహా ఏమీ చేయలేని చేతకానితనం నాది. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ సంక్షేమానికి చెదరని చిరునామా నాలుగేళ్లక్రితం చెన్నై వెళ్లినప్పుడు మా బంధువొకాయన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక ప్రశ్న వేశారు. ‘వైఎస్‌కు ముందు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన నేతలు న్నారు కదా, కానీ ఆ పథకాలు ప్రస్తావనకు వచ్చి నప్పుడు వైఎస్‌నే అందరూ ఎందుకు గుర్తు చేసు కుంటార’న్నది ఆ ప్రశ్న సారాంశం. నిజమే... ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి నిరుపేదలకు సైతం రోజూ గుక్కెడు బువ్వ అందుబాటులోకి వచ్చేలా చేశారు. అంతకు చాన్నాళ్ల ముందే ‘గరీబీ హఠావో’ అంటూ ఇందిరాగాంధీ కూడా ఎన్నో పథకాలు తెచ్చారు. తమిళనాట అధికారంలోకి రాగానే నిరుపేదలకు కలర్ టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు పంచిపెట్టిన ప్రభుత్వాలున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే పోటీలుపడి ఇలాంటి వాగ్దానాలు చేసేవి. అయితే వైఎస్ తీరు వేరు. ఆయన అమలు చేసిన పథకాల ఒరవడే వేరు. ఆ పథకాలు జనసంక్షేమానికి అసలు సిసలైన నిర్వచనంగా నిలిచాయి. అందుకు కారణముంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ దిగే సమ యానికి రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా నిస్తేజం అలుముకుంది. అప్పటికి ఏడెనిమిదేళ్ల క్రితం వచ్చిపడిన ఉదారవాద ఆర్థిక విధానాల పర్యవసానంగా సమస్త చేతివృత్తులూ దెబ్బతిన్నాయి. వరస కరవులతో, అకాల వర్షాలతో రైతాంగం అల్లాడు తోంది. అప్పుల ఊబిలో దిగబడి ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదనుకుంటోంది. అప్పటికే ఉన్న ధనిక, పేద; పట్టణ, గ్రామీణ అంతరాలు మరింత పెరిగాయి. కొనుక్కునే స్థోమత ఉంటే తప్ప నాణ్యమైన చదువుకు దిక్కు లేకుండా పోయింది. రోగం వచ్చి ఆసుపత్రులకు వెళ్లినవారికి యూజర్ ఛార్జీల బాదుడు మొదలైంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారయావతో ఇతర సీఎంల కన్నా అత్యుత్సాహంగా సంస్కరణలు అమలు చేయడం వల్ల ఏపీ మరింత దుర్భరంగా మారిందేమో గానీ దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ‘ఏదీ వూరికే రాద’ని పాలకులు ఉపన్యాసాలు దంచే పాడుకాలమది. నేలవిడిచి సాముచేసే నాయకులను తమ ముఖపత్రాలపై అచ్చోసే అంతర్జాతీయ పత్రికలకు అప్పుడు కొదవలేదు. సరిగ్గా ఆ సమ యంలో వైఎస్సార్ పాద యాత్ర నిర్వహించి ప్రజల దుర్భర స్థితిగతులను దగ్గర నుంచి చూశారు. 1,400 కిలోమీటర్ల పొడ వునా సామాన్యుల గుండె ఘోషను అతిదగ్గర నుంచి వినగలిగారు. వీరందరి జీవితాల మెరుగుదలకు ఏం చేయగలమన్న మథనం ఆయనలో ఆనాడే మొదలైంది. తర్వాత కాలంలో ఆయనే చెప్పుకున్నట్టు ఆ పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది. రాగల అయిదేళ్లకూ పాలనా ప్రణాళికను నిర్దేశించింది. వ్యక్తిగా కూడా ఆయనను ఆ పాదయాత్ర ఎంతో మార్చింది. రాయలసీమ ప్రాంత నేతగా సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యంపై ఆయనకు మొదటి నుంచీ అవగాహన ఉంది. కానీ అది ‘జలయజ్ఞం’గా రూపుదిద్దుకున్నది జనం మధ్యనే! అన్ని ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలన్న ఆ లక్ష్యం వేల కోట్ల వ్యయంతో ముడిపడి ఉంటుంది గనుక అది అసాధ్యమనుకున్నారంతా! కానీ భర్తృహరి చెప్పినట్టు ఎన్ని అడ్డంకులెదురైనా వెరవక తుదికంటా శ్రమించడమే కార్యసాధకుల నైజమని వైఎస్ భావించారు. ఈ అనితర సాధ్యమైన ప్రయత్నానికి సమాంతరంగా ఉచిత విద్యుత్ జీవోపై తొలి సంతకం చేసి అన్నివిధాలా చితికిపోయి ఉన్న రైతాంగానికి తక్షణ జీవశక్తిని అందించారు. బాబు పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయాన్ని మళ్లీ పట్టాలెక్కించి, దాని పునరుజ్జీవానికి బాటలు పరిచారు. అంతేకాదు... అంతవరకూ ఆకాశపు దారుల్లో హడావిడిగా పోయే ఆరోగ్య సిరిని భూమార్గం పట్టించి నిరుపేదలకు సైతం ఖరీదైన కార్పొరేట్ వైద్యం దక్కేలా చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో నిరుపేద వర్గాల పిల్లలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు. అధోగతిలో ఉన్న సహకార వ్యవస్థను ఆదుకున్నారు. పల్లెలు మళ్లీ కళకళలాడేలా చేశారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభి వృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన సాహసిగా, తనకు తెలిసినవారైనా కాకున్నా, తన పార్టీవారు అయినా కాకున్నా సాయం కోరివచ్చిన వారందరి పట్లా ఒకేలా స్పందించిన సహృదయుడిగా వైఎస్ చిరస్థాయిగా నిలుస్తారు. పీవీ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసి, ఆర్థిక సంస్కరణలను అమలు చేసిన ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి నేతను దేశవ్యాప్త రైతాంగానికి రుణమాఫీ తక్షణావసరమని ఒప్పించడంలో వైఎస్ రాజశేఖరరెడ్డిది కీలకపాత్ర. ఇలాంటి నాయకుడు సంక్షేమానికి శాశ్వత చిరునామా కావడంలో, ఆ విషయంలో అఖిల భారతావనికి అడుగుజాడ కావడంలో ఆశ్చర్యమేముంది? -టి. వేణుగోపాలరావు సీనియర్ పాత్రికేయులు -
మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్ ఘన నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చదవండి: ‘ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తి’.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్‌కు నివాళి అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల పై స్థానిక నాయకులు, అధికారులతో సీఎం సమీక్ష జరుపుతున్నారు. -
ఆండ్రూ సైమండ్స్‌కు నివాళి ప్రకటించనున్న ఆసీస్, జింబాబ్వే క్రికెటర్లు
ఆండ్రూ సైమండ్స్.. క్రికెట్లో ఈ పేరు తెలియని వారుండరు. ఆటలో ఎన్ని వివాదాలున్నా గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. అతని ఆటకు ఫిదా అయిన అభిమానులు చాలా మందే ఉన్నారు. కానీ మే 14.. 2022.. ఆస్ట్రేలియా క్రికెట్లో పెను విషాదం నింపింది. ఎందుకంటే అదే రోజు 46 ఏళ్ల వయసులో ఆండ్రూ సైమండ్స్ భౌతికంగా దూరమయ్యాడు. టౌన్స్‌విల్లే నగరం బయట జరిగిన యాక్సిడెంట్లో కారు తునకాతునకలు అవడంతో సైమండ్స్ మృతి చెందినట్లు పోలీసులు దృవీకరించారు. అయితే అంతకముందే ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా గుండెపోటుతో మరణించడం.. ఇలా రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు క్రికెటర్లు దూరమవడం ఆసీస్ అభిమానులను కలచివేసింది. Photo Credit: Getty Images ఇక విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. కాగా ఆదివారం ఆసీస్, జింబాబ్వేలు తొలి వన్డే ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ఆండ్రూ సైమండ్స్ స్వస్థలమైన టౌన్స్‌విల్లేలో జరగనుంది. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆండ్రూ సైమండ్స్‌కు ఘన నివాళి ప్రకటించనుంది. ఈ కార్యక్రమంలో ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు సైమండ్స్ భార్య, పిల్లలు, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు పాల్గొననున్నారు. కాగా ఈ సిరీస్‌లో మూడు వన్డేలు టౌన్స్‌విల్లే వేదికగానే జరగనున్నాయి. Photo Credit: Getty Images ఇక 1998లో ఆస్ట్రేలియా తరపున సైమండ్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిద్యం వహించాడు. 2003, 2007 వన్డే వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: Andrew Symonds: అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌కు ఆండ్రూ సైమండ్స్ పేరు..! Andrew Symonds: కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ -
Photo Feature: నేలతల్లి సాక్షిగా.. కన్నవారికి నివాళి అర్పించి‘నారు’
సాక్షి, నిజామాబాద్: సేంద్రియ విధానంలో అనేక దేశీయ వరి రకాలను పండిస్తున్న నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరుకు చెందిన ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు (నాగుల చిన్నగంగారాం) తన తల్లిదండ్రులు ముత్తెన్న, భూదేవిలను నేలతల్లి సాక్షిగా వినూత్నంగా స్మరించుకున్నారు. ‘మా అమ్మ నాన్న–చిన్నికృష్ణుడు’ అనే అక్షరాల రూపంలో పొలంలో భారీ పరిమాణంలో వరి పంట పెరిగేలా వేశారు. 24 రోజుల క్రితం తన సాగు భూమిలో ‘చింతలూరు సన్నాలు’ వరిని విత్తనాల కోసం నాటారు. అయితే మధ్యలో ఒక మడిని ‘బంగారు గులాబీ’ అనే నల్ల రంగు వరిని తన తల్లిదండ్రుల రూపం వచ్చేలా నాటారు. చుట్టూ బోర్డర్ వచ్చేలా ‘పంచరత్న’ రకం వరిని వేశారు. ఇందుకోసం ముందుగా ఓ ఆర్కిటెక్ట్‌తో కాగితంపై మ్యాప్ గీయించుకుని అందుకు అనుగుణంగా వరి రకాలను నాటారు. తాజాగా గురువారం డ్రోన్ ద్వారా చిన్నికృష్ణుడు ఈ చిత్రాన్ని ఫొటో తీయించారు. -
ఝున్‌ఝున్‌వాలా అస్తమయంపై స్మృతి ఇరానీ ఏమన్నారంటే
న్యూఢిల్లీ: ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మరణంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నివాళులు అర్పించారు. లెజండ్ ఎప్పటికీ జీవించే ఉంటారంటూ వరుస ట్వీట్లలో ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గుండెపోటు కారణంగా ఝున్‌ఝున్‌వాలా ఆదివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. (రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?) "ఈ రోజు నేను నా సోదరుడిని కోల్పోయాను.. చాలామందికి తెలియని బంధం మాది. అందరూ అతణ్ని బిలియనీర్ ఇన్వెస్టర్ అని, బీఎస్ఈ బాద్షా అని పిలుస్తారు. కానీ ఆయన ఇప్పటికీ.. ఎప్పటికీ ఒక డ్రీమర్’’ అని ఆమె ట్వీట్ చేశారు. అందం..పట్టుదల, సున్నితత్వం ఆయన సొంతం. మై జెంటిల్ జెయింట్ అని ఆమె పేర్కొన్నారు. మనం మనంగా జీవించాలి అని భయ్యా (రాకేష్ ఝున్‌ఝున్‌వాలా) ఎపుడూ చెబుతూ ఉండేవారు. ది లెజెండ్, లెగసీ నిలిచే ఉంటుందంటూ స్మృతి వరుస ట్విట్లలో సానుభూతి ప్రకటించారు. ఇది చదవండి:Rakesh Jhunjhunwala: అల్విదా బిగ్బుల్ ఒక శకం ముగిసింది: పలువురి భావోద్వేగం -
ఇప్ప నారాయణరెడ్డి.. స్మృతివనంలో త్యాగధనుడు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగువేల లోపు జనాభా కలిగిన ఒక చిన్న ఊరి పేరు దుమాల. 21 మంది రక్త తర్పణలతో అమరుల స్మృతి వనంగా ఈ ఊరు ప్రాధాన్యత సంతరించుకుంది. సరిగ్గా నేటికి 50 సంవత్సరాల క్రితం ‘శ్రీ వేంకటేశ్వర యువజన సంఘం’ స్థాపించి, దుమాలలో నూతన చైతన్యానికి అంకురార్పణ చేసిన ఇప్ప నారాయణరెడ్డి, ఆయన మిత్ర బృందం రైతుకూలీ సంఘం నిర్మాణం ద్వారా విప్లవోద్యమానికి కూడా నాంది పలికారు. మధ్యయుగాల నాటి భూస్వామ్య దోపిడీనీ, దానిపై ప్రజల పోరాటాన్నీ అర్థం చేసుకోవడానికి దుమాల గ్రామం అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. పంచాయితీ వ్యవస్థ అమల్లోకి వచ్చే ముందూ... వచ్చిన తర్వాత కూడా దుమాలలో దొర, మాలి పటేల్, పోలీస్ పటేల్, పట్వారి వ్యవస్థలు కొనసాగిన రోజుల్లో... లక్ష్మయ్య దొర.. దొరగా, కిష్టయ్య దొర మాలిపటేల్గా, నాంపల్లి దొర పోలీస్ పటేల్‌గా, నారాయణ పంతులు పట్వారీగా– దాదాపు 300 ఎకరాల భూములకు యజమానులుగా ఉండేవారు. వీరి దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు. 1978లో ప్రభుత్వం కల్లోలిత ప్రాంతంగా ఈ ఏరియాను ప్రకటించి భూస్వాములకు అండగా నిలిచింది. దీంతో ప్రజాపోరాటం ఎగసిపడింది. 1989 ఫిబ్రవరి 23న దుమాలకు చెందిన కానవరపు చంద్రయ్యను బెజ్జంకి దగ్గర బూటకపు ఎన్కౌంటర్ చేయడంతో హింసాకాండ రూపమే మారిపోయింది. 2001 వరకు 22 సంవత్సరాలు నిరాఘాటంగా సాగిన ఈ హత్యాకాండలో 21 మంది ఈ గ్రామానికి చెందినవారు మరణించారు. శ్రీ వెంకటేశ్వర యువజన సంఘం ప్రాథమిక పాఠశాలకు తరగతి గదులు కట్టించింది. హైస్కూల్‌కు విశాల స్థలం ఇచ్చింది. రూ. 5 లక్షలతో తరగతి గదులు పెంచడానికి జనశక్తి పార్టీ స్వయంగా పూనుకుంది. మేక పుల్లరి, వెట్టి గొర్లు, వెట్టి నాగళ్ళు, జీతాల వ్యవస్థ అంతమైపోవడానికి పార్టీ కారణమైంది. అన్నింటికీ మించి ఉత్పత్తి శక్తులకు దొరికిన స్వేచ్ఛ ప్రజల జీవితాల్లో కొత్త మార్పునకు నాంది పలికింది. – అమర్, జనశక్తి (జూలై 29న ఇప్ప నారాయణరెడ్డి ప్రథమ వర్ధంతి) -
అచంచల దేశభక్తునికి జాతి నీరాజనాలు
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను జూలై 4వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా ఈ దేశభక్తుడి జయంత్యుత్సవాలను ఏడాదిపాటు నిర్వహించాలని సంకల్పించడం తెలుగు ప్రజల ఆకాం క్షను గౌరవించడమే! మన్నెం వీరుని పోరుగడ్డను అల్లూరి సీతా రామరాజు జిల్లాగా ప్రకటించి ఆ మహనీయుడికి నివాళులర్పించి, మన్నెం వాసుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలో ఈ విప్లవ జ్యోతి పురిటిగడ్డలో 30 అడుగుల భారీ కాంస్య విగ్రహం నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం ముదావహం. బ్రిటిష్ వారిపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రకి గ్రామంలో జన్మించిన సీతా రామరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి సమీపంలోని మోగల్లు గ్రామం. చిన్నప్పటి నుంచీ ఆయనకు దైవభక్తీ, దేశభక్తీ మెండుగా ఉండేవి. విశాఖ, గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో దోపిడీకి గురవుతున్న ఆదివాసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యుద్ధం చేశాడు. శత్రువుల కదలికలను పసిగట్టేందుకు పటిష్ఠమైన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేయటం, శత్రువుల ఆయుధ సంపత్తిని కొల్లగొట్టడం, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయడం వంటి యుద్ధవ్యూహాలు... బ్రిటీష్ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాను చేయదలుచుకున్న దాడి గురించి ముందుగానే మిరపకాయ టపా ద్వారా శత్రువుకు సమాచారం పంపించే వాడు సీతారామరాజు. ఆ టపాలో చెప్పినట్టు సరిగ్గా అదే రోజు, అదే సమయానికి దాడి చేసి లక్ష్యాన్ని నెరవేర్చుకునేవాడు. బ్రిటిష్ సైన్యాన్ని సమర్థంగా ఎదిరించి పోరాడా లంటే అల్లూరి విప్లవ సైన్యానికి తుపాకులు సమకూర్చు కోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించాడు. అందుకు తొలిగా మన్యంలోని చింతపల్లి పోలీసు స్టేషన్‌ను ఎంచుకున్నాడు. 1922 ఆగస్టు 19వ తేదీన అల్లూరి సాయుధ విప్లవంలో మహోజ్వల ఘట్టం చోటు చేసుకున్నది. కత్తులు, బల్లేలు, సాంప్రదాయ విల్లంబులు ధరించిన దాదాపు 300 మంది అనుచరులు వెంటరాగా అల్లూరి చింతపల్లి పోలీసు స్టేషన్లో అడుగుపెట్టాడు. అక్కడి పోలీసులు నిశ్చేష్టులై చూస్తుండి పోయారు. ఆయుధ సంపత్తినంతటినీ స్వాధీనం చేసుకొని వాటి వివరాలన్నింటినీ స్టేషన్ డైరీలో నమోదు చేసి అల్లూరి స్వయంగా సంతకం చేశారు. తరువాత కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాడు. మరుసటి రోజు రాజవొమ్మంగి పోలీసు స్టేషన్‌పైనా దండెత్తాడు. ఈ విధంగా వరుసగా 3 రోజుల్లో 3 పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధ సంపత్తిని దోచుకోవటం బ్రిటిష్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. మరోవైపు ఈ సమాచారం దేశమంతా వ్యాప్తిచెంది దేశ భక్తుల రక్తం ఉప్పొంగేలా చేసింది. 1922 నుంచి యుద్ధసన్నాహాలలో పూర్తిగా నిమగ్నమై గంటందొర, మల్లుదొర వంటి యోధులతో దళాలను ఏర్పాటు చేసి 200 మందితో విప్లవ సైన్యాన్ని రామరాజు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యుద్ధ సన్నాహాలను ఆలస్యంగా గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్ రూథర్‌ఫర్డ్‌ను రంగంలోకి దింపింది. ఆయన పంపిన 700 మంది సాయుధ పోలీసులు పలు ప్రాంతాలను జల్లెడ పట్టసాగారు. 1922 సెప్టెంబర్ 3వ తేదీన నర్సీపట్నానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంజేరి కొండవాలుల్లో ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న బ్రిటిష్ పోలీసులపై దాడిచేసి తరిమి వేసింది అల్లూరి సైన్యం. మరుసటి ఏడాది సైన్యాధికారి స్కాట్ కవర్ట్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాడు. కవర్ట్లాంటి వారు ఈ యుద్ధంలో మరణించారు. అల్లూరిని నిలువరించేందుకు విప్లవ సైన్యాన్ని బలహీనపరిచే కుయుక్తులకు బ్రిటిష్ సైన్యం తెరతీసింది. విప్లవ కారులను, వారికి సహాయపడే వారిని అణ చివేసేందుకు, సహాయ నిరాకరణ చేసే వారిని శిక్షించేందుకు విశాఖలో ప్రత్యేక ట్రిబ్యు నల్ ఏర్పాటు చేశారు. విప్లవకారులకు సహకరించారనే మిషతో ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో అమాయక గిరిజనులను తీసుకెళ్లి... ట్రిబ్యునల్‌లో క్రూరమైన శిక్షలు విధించడం నిత్యకృత్యమైంది. తన కారణంగా ప్రజలు నరకయాతన పడటానికి ఇష్టపడని రాజు చివరికి లొంగిపోవాలనుకున్నాడు. ఈ దశలో మే 6వ తేదీన మంప గ్రామంలో జమేదారు కుంచుమీనన్ తన సాయుధ బలగంతో వెళ్లి అల్లూరిని నిర్బంధించాడు. 1924 మే నెల 7వ తేదీన సీతారామరాజును బ్రిటిష్‌వాళ్లు కయ్యూరులో కాల్చి చంపారు. విప్లవ జ్యోతి ఆరిపోయింది. సీతారామరాజు శౌర్యపరాక్రమాలు, త్యాగనిరతి భారతజాతికి ఆదర్శనీయం. (చదవండి: వైరాగ్యం నుంచి విప్లవం వైపు...) - పెన్మెత్స శ్రీహరిరాజు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి) -
పద్యశిఖరం ఒరిగిపోయింది!
పద్యం తెలుగువారి ఆస్తి. ఆ ఆస్తిని మరింత పెంచిన కొల్లా శ్రీకృష్ణారావు సోమవారం గుంటూరులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 94 ఏళ్ల జీవితాన్ని సాహితీ సృజనలో గడిపిన కవితా తపస్వి మృతితో తెలుగు సాహిత్య లోకం... మరో పద్య కవితా శిఖరాన్ని కోల్పోయింది. గుంటూరు జిల్లా పెదకూరపాడులో మహాలక్ష్మి– సూరయ్య రైతు దంపతులకు జన్మించారు శ్రీకృష్ణారావు. బాల్యం నుండి కవిత్వం పట్ల మక్కువ ఉన్న కృష్ణారావు మహా కవులు గుర్రం జాషువా, ఏటుకూరి వెంకట నరసయ్యలను కవితా గురువులుగా ఎంచుకున్నారు. వారి నుంచి తెలుగు పద్యంలోని మెలకువలు గ్రహించారు. ‘విశ్వశాంతి’ కోసం పద్య ‘శంఖారావం’ పూరించారు. ‘రారాజు’ను తెలుగు పద్య సింహాసనంపై కూర్చో బెట్టి పద్యానికి పట్టాభిషేకం చేశారు. పద్యాల ‘పూదోట’లో విహరించారు. విలువైన పద్య కావ్యాలు రాసి పచ్చి పసుపులు పండించారు. ‘కవి బ్రహ్మ’ ఏటుకూరి వారి స్ఫూర్తితో పల్నాటి ‘పౌరుష జ్యోతి’ని వెలిగించారు. రైతు పక్షపాతిగా కర్షక సాహిత్యం వెలయించారు. జాషువాను గుండెలకు హత్తుకుని ‘మన కవి జాషువా’ పేరుతో విలువైన వ్యాస సంపుటిని రచించారు. ‘మఱుగు పడిన మహాకవి తురగా వెంకమరాజు’ అనే వీరి పరిశోధనాత్మక గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రకు ఎంతో పనికొచ్చే పుస్తకం. (క్లిక్: నిష్కర్ష విమర్శకుడు!) ‘కవిబ్రహ్మ ఏటుకూరి’ పేరుతో గురువుకు అక్షర దక్షిణ సమ ర్పించారు. ‘నా సాహితీ యాత్ర’ పేరుతో స్వీయ చరిత్రను పాఠక లోకా నికి బహుకరించారు. ఛందో బద్ధ పద్యంలాగే నడకలోనూ, నడతలోనూ... వడీ, వంకా లేని నిరాడంబర జీవనం గడిపారు. ఆయన ఐదు దశాబ్దాలకు పైగా పత్రికా రంగంతో మమేకమయ్యారు. స్వీయ సంపాదకత్వంలో ‘స్వతంత్ర వాణి’, ‘భావ వీణ’ పత్రికలను నడిపారు. అవిశ్రాంత అక్షర తపస్వికి నిండు మనస్సుతో నివాళులు. – డాక్టర్ బీరం సుందరరావు, చీరాల -
త్వరలో పెళ్లి !.. అంతలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు
ప్రముఖ హాలీవుడ్ నటుడు రే లియోటా (రేమండ్ అలెన్ లియోటా) మే 26న డొమినికన్ రిపబ్లిక్లో నిద్రలోనే కన్నుమూశారు. 67 ఏళ్ల రే లియోటా 'డేంజరస్ వాటర్స్' షూటింగ్ లొకేషన్లో మరణించినట్లు ఆయన ప్రచారకర్త జెన్నిఫర్ అలెన్ అధికారికంగా ప్రకటించారు. మార్టిన్ స్కోర్సెస్ డైరెక్ట్ చేసిన గుడ్ ఫెల్లాస్ సినిమాతో మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా రే గుర్తింపు పొందారు. 1990లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో మాబ్స్టర్ హెన్రీ హిల్ పాత్రలో అద్భుతమైన నటన కనబర్చాడు. ఈ మూవీకి అనేక క్యాటగిరీల్లో ఆస్కార్ లభించింది. ఆయన మృతితో సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్ తదితరులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. రే లియోటా కాప్ ల్యాండ్ (1992), హన్నిబాల్ (2001), జాన్ క్యూ (2002), ఐడెంటిటీ (2003), కిల్లింగ్ మి సాఫ్ట్లీ (2012), మ్యారేజ్ స్టోరీ (2019), ది మెనీ సెయింట్స్ ఆఫ్ నెవార్క్ (2021) చిత్రాలలో నటించి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా మైఖేల్ రుడాల్ఫ్ రచించిన 'షేడ్స్ ఆఫ్ బ్లూ: 30 ఇయర్స్ ఆఫ్ (అన్) ఎథికల్ పోలీసింగ్' నవల ఆధారంగా తెరకెక్కిన షేడ్స్ ఆఫ్ బ్లూ (2016-18) క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్‌లో కూడా నటించాడు. రే లియోటాకు ఒక కుమార్తె కర్సెన్ లియోటా ఉండగా, తనకు కాబోయే భార్య (ఫియాన్సీ) జాసీ నిట్టోలోను వివాహం చేసుకోవాలనుకున్నట్లు సమాచారం. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ -
Sr.NTR Satha Jayanthi:శతదినోత్సవ రాముడికి శతజయంతి కానుక..
ఒక నటుడు కష్టపడితే హీరో కావచ్చు. ఒక హీరో సిన్సియర్‌గా శ్రమిస్తే జనాదరణ పొందవచ్చు, బాక్సాఫీస్ హిట్లు సాధించవచ్చు. బాక్సాఫీస్ హిట్లు వచ్చిన తారలు చాలామందే ఉండవచ్చు. కానీ, ఎదిగే తన ప్రయాణంలో తాను నమ్ముకొని వచ్చిన పరిశ్రమను కూడా శిఖరాయమాన స్థాయికి తీసుకెళ్లిన మహానటులు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి ధ్రువతారక- ఎన్టీఆర్‌గా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు నందమూరి తారక రామారావు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో తెలుగు తెరకు దక్కిన కోహినూర్ – ఎన్టీఆర్. రావడం రావడమే ఆయన హీరోగా వచ్చారు, క్లిక్ అయ్యారు. అయిదారు సినిమాలకే స్టారయ్యారు. దాదాపు 33 ఏళ్ల సినిమా కెరీర్లో 298 సినిమాలు చేశారు. సినీరంగం వదిలేసి, రాజకీయాల్లోకి వెళ్లాక తన కళాతృష్ణను తీర్చుకొనేందుకు మరో 4 సినిమాలు చేశారు. మొత్తం 302 సినిమాల్లో ఆయన చేసినన్ని విభిన్న సినిమాలు, వేసినన్ని వైవిధ్యమైన పాత్రలు, నట –దర్శక– నిర్మాతగా పండించినన్ని ప్రయోగాలు న భూతో న భవిష్యతి. శ్రమతో... పరిశ్రమను పెంచిన శిఖరం ఎన్టీఆర్ సినీరంగానికి వచ్చేసరికి తెలుగు సినీపరిశ్రమ ఏటా సగటున 10 చిత్రాలు ఉత్పత్తి చేస్తోంది. ఆయన హీరోగా సినీరంగాన్ని వదిలే నాటికి అది సగటున 100 సినిమాల స్థాయికి వచ్చింది. తెలుగు సినీ సీమ ఆ స్థాయిలో పరిపుష్టం కావడంలో ఎన్టీఆర్‌ది కీలక పాత్ర. తక్కువ సినిమాలతో ఎక్కువ సంపాదన అనే నేటి సూత్రాలకు భిన్నంగా ఆయన ఒళ్లు దాచుకోకుండా కష్టపడ్డారు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తూ, వేలాది మంది ఉపాధికీ, నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక శాఖలన్నిటా పరిశ్రమ సర్వతోముఖ పురోగతికీ తోడ్పడ్డారు. మొదటి 20 ఏళ్ల కెరీర్లో ఆయన దాదాపు 200 సినిమాలు చేశారు. ఆ కాలంలో ప్రతి ఏటా తెలుగులో రిలీజైన సినిమాల్లో కనీసం సగం నుంచి సగం పైనే ఆయన సినిమాలున్న సంవత్సరాలే ఎక్కువ. మచ్చుకు 1964లో తెలుగు పరిశ్రమ 24 సినిమాలు తీస్తే, అందులో 16 సినిమాలు, అంటే మూడింట రెండొంతులు ఎన్టీఆర్వే. అలా రాజకీయాల్లోకి రాకముందే సినిమాల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారు. 90 ఏళ్ల తెలుగు టాకీ చిత్రాల చరిత్రలో ఇలా ఒక ఏడాది మూడింట రెండొంతుల సినిమాలు ఒక హీరో చేయడం అప్పటికీ, ఇప్పటికీ రికార్డు. పొరుగున తమిళ సినీ స్టార్ల చరిత్రలోనూ ఇలాంటి హీరో మరొకరు కనిపించరు. తెలుగు సినిమా ఎదుగుదలలో ఆయన అవిస్మరణీయ కృషికి ఇది నిలువుటద్దం. అలాగే, 1962 నాటికే వంద సినిమాలు (గుండమ్మకథ), 1970కే రెండొందల సినిమాలు (కోడలు దిద్దిన కాపురం) చేశారు ఎన్టీఆర్. భారతదేశంలో ఈ రెండు మైలురాళ్లనూ చేరుకున్న మొదటి హీరో – ఎన్టీఆరే! జానర్ ఏదైనా... జనాదరణే! అన్ని తరహా చిత్రాల్లోనూ అద్వితీయ నటనతో అలరించడం హీరోగా ఎన్టీఆర్కే సాధ్యమైంది. ఒకే ఏడాది (1962) పరస్పర విరుద్ధమైన నాలుగు విభిన్న కోవల చిత్రాలు (పౌరాణికం – భీష్మ, జానపదం – గులేబకావళి కథ, చారిత్రకం – మహామంత్రి తిమ్మరసు, సాంఘికం – రక్తసంబంధం, ఆత్మబంధువు, వగైరా) ఆయన చేస్తే, ఆ నాలుగు కోవల చిత్రాలూ శతదినోత్సవ హిట్లే. ఒక నటుడిగా దటీజ్ నందమూరి. ఒకే ఏడాదిలో... ఒకే ఒక్కడు! ఒక ఏడాది చేసిన సినిమాలన్నీ సక్సెసై, జనాదరణతో జేజేలు కొట్టించుకోవడం ఎంతటి స్టార్‌కైనా అరుదు. కానీ, అదీ ఎన్టీఆర్ చేసి చూపెట్టారు. 1965లో ఈ సినీ తారకరాముడు 12 సినిమాలు చేస్తే, అందులో 8 సెంచరీ హిట్లు. తొమ్మిదో చిత్రం 92 రోజులాడింది. మిగిలిన మూడూ 9 – 10 వారాల వంతున ప్రదర్శితమైన సక్సెస్ఫుల్ సినిమాలు. అదీ ఎన్టీఆర్ ఇమేజ్ చేసిన మ్యాజిక్. ఒకే ఏడాది (1977)లో ఏకంగా 3 డబుల్ సెంచరీ హిట్లు (దానవీరశూర కర్ణ, అడవి రాముడు, యమగోల) సాధించడం ఎన్టీఆర్ స్టార్ స్టామినాకు మచ్చుతునక. అప్పటికి తెలుగులో మరి ఏ హీరోకూ ఏకంగా సినీజీవితం మొత్తంలోనే 3 డబుల్ సెంచరీ హిట్లు లేవు. అలా తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ ఓ చరిత్ర సృష్టించారు. విన్ అయినా... రిపీట్ రన్ అయినా... ఎన్టీఆర్ నటించిన త్రిశతాధిక చిత్రాల్లో అధిక భాగం బాక్సాఫీస్ హిట్లు. ఆయన చిత్రాల్లో శతదినోత్సవ హిట్లు 160. అందులో 115 నేరుగా సెంచరీ ఆడినవే! రజతోత్సవ హిట్లు 40. వాటిలో దాదాపు 20 డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ. ఇక, 5 చిత్రాలు ఏడాది పాటు ఆడిన స్వర్ణోత్సవ హిట్లు. ఇలాంటి బాక్సాఫీస్ రికార్డుల్లోనూ అగ్రతాంబూలం ఎన్టీఆర్‌దే అన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచ సినీ చరిత్రలో రెండోసారి, మూడోసారి విడుదలై కూడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడడం తెలుగు, తమిళ సినీ రంగాల్లోనే ఎక్కువ. తర్వాత కొంత కన్నడంలో రిపీట్ రన్స్ కనిపిస్తాయి. మన తెలుగు సినీచరిత్ర మొత్తంలో రిపీట్ రన్స్‌లో శతదినోత్సవం చేసుకున్న చిత్రాలు 16. అందులో ఏకంగా 14 చిత్రాలు ఈ బాక్సాఫీస్ రాముడివే! ప్రేక్షకులకూ, ఎన్టీఆర్‌కూ ఉన్న అనుపమానమైన అనుబంధానికి ఇది ఓ మచ్చుతునక. చరిత మరువని ఘనత పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం.. ఇలా అన్ని కోవలలోనూ ఆయనకు ఆయనే సాటి. ఈ నందమూరి అందగాడు వేసినన్ని పాత్రలూ, చేసినన్ని రకాల పాత్రలూ మరే హీరో చేయలేదు. కనీసం ఆయన దరిదాపులో కూడా ఎవరూ లేరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. 57 జానపదాలు, 48 పౌరాణికాలు, 18 చారిత్రకాలు – ఇలా మూడు కోవల్లోనూ హీరోగా ఆయనదే రికార్డు. ఈ మూడూ కలిపితే, మొత్తం 123 సాంఘికేతర చిత్రాల్లో (అంటే కాస్ట్యూమ్ చిత్రాల్లో) హీరోగా నటించింది ప్రపంచంలో ఎన్టీఆర్ ఒక్కరే! ముఖ్యంగా పౌరాణిక పాత్రలతో ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకొని, తెలుగువారి ఆరాధ్యదైవమయ్యారు ఎన్టీఆర్. ఆ సినిమాలు, ఆ పాత్రలే 23 ఏళ్ల పాటు మద్రాసులోని ఆయన నివాసాన్ని ఒక తీర్థయాత్రా స్థలిగా మార్చాయి. ఎన్టీఆర్‌లా కేవలం 9 నెలల్లో రాజకీయ పార్టీ స్థాపించి, ఎన్నికలలో ఘన విజయం సాధించిన మరొకరు ప్రపంచ రాజకీయ చరిత్రలో కనిపించరంటే అదే కారణం. అలా రాజకీయ సౌధానికి కూడా సినీ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా ఆయన చూపిన ప్రత్యేకత, సంపాదించుకున్న ప్రజాదరణే పునాది. ఇలాంటి చరిత మరువని ఘనతలెన్నో తెలుగు సినీరంగానికి కట్టబెట్టిన ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. ఈ ఆరాధ్యుడే ఆద్యుడు తెలుగు సినీరంగంలో అనేక తొలి ఘనతలు ఎన్టీఆర్ చిత్రాలే. ఆ ఘనకీర్తి జాబితా సుదీర్ఘమైనది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన తొలి సినిమా (పాతాళ భైరవి), విదేశాల్లో ప్రదర్శించిన తొలి సినిమా (మల్లీశ్వరి), తొలి పూర్తి రంగుల చిత్రం (లవకుశ), విదేశాల్లో చిత్రీకరించిన తొలి చిత్రం (సాహసవంతుడు), తొలి సైన్స్ ఫిక్షన్ – అపరాధ పరిశోధక చిత్రం (దొరికితే దొంగలు), ఫస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ (లక్షాధికారి), ఫస్ట్ సోషియో– ఫ్యాంటసీ (దేవాంతకుడు), ఫస్ట్ మాస్ మసాలా మూవీ (అగ్గిరాముడు) – ఇలా అనేక కోవల చిత్రాలకు ఎన్టీఆర్ ఆద్యుడు. – కొమ్మినేని వెంకటేశ్వరరావు -
ఆయన వారసత్వాన్ని నిలబెడదాం!
ఆదర్శవంతమైన రాజకీయనేతగా, దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతగా, పీడిత ప్రజల ప్రియ తమ నాయకునిగా కామ్రేడ్ పుచ్చల పల్లి సుందరయ్య (పీఎస్)కు ఆధునిక భారత చరిత్రలో చెరగని స్థానం ఉంది. 1913 మే 1వ తేదీన నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించిన పీఎస్... చిన్న వయసులోనే సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాట దీక్ష అలవర్చుకున్నారు. 1930వ దశకంలో దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణానికి బీజాలు వేశారు. దేశంలోనే తొలి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారు. తన వాటాకి వచ్చిన యావదాస్తినీ పార్టీకీ, ఉద్యమానికీ ధారబోసి అత్యంత నిరాడంబరంగా, నియమబద్ధంగా, నిర్మాణాత్మకంగా జీవించారు. 1934లో ఏర్పడిన తొలి ఆంధ్ర కమ్యూనిస్ట్ కమిటీలో సభ్యుడైన సుందరయ్య వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. భూమి లేని నిరు పేదలకు ఆ పోరాటం 10 లక్షల ఎకరాల భూమిని పంచింది. 3,000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పర్చారు. నైజాంను భారతదేశంలో విలీనం చేయడానికి భారత సైన్యాలు వచ్చినప్పటికీ అవి కమ్యూనిస్టులను అణచివేయ చూసినప్పుడు... సాయుధ పోరాటం కొనసాగిస్తూ ఉద్య మాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో ఆయన కృషి గణ నీయమైనది. కమ్యూనిస్ట్ పార్టీ తొలి కేంద్ర కమిటీలో సభ్యుడైన సుందరయ్య ఆఖరి వరకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు. మితవాద, ఉగ్రవాద పెడ ధోరణులు తలెత్తినపుడు మార్క్సిజం సిద్ధాంత స్వచ్ఛతను కాపాడడం కోసం అంతర్గత పోరాటాన్ని సాగించడమే గాక చాలా కాలం కారాగారవాసం కూడా అనుభవించారు. సీపీఎం ఏర్పడినప్పుడు తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ప్రధాన కమ్యూనిస్టు పార్టీగా తీర్చిదిద్దడానికి పునాదులు వేశారు. పశ్చిమబెంగాల్లో ‘అర్ధ ఫాసిస్టు బీభత్స కాండ’ కాలంలో రంగంలో ఉండి వారికి చేయూతనందించారు. ఎమర్జెన్సీ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చి మళ్ళీ ఉద్యమ నిర్మాణాన్ని పటిష్టం చేసేం దుకూ, విస్తృత పరిచేందుకూ అంకితమైనారు. రెండేళ్ల పాటు రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేశారు. ప్రజా ఉద్యమాలు పోరాటాలతో పాటు చట్టసభల్లోనూ సుందరయ్య ప్రజల వాణి వినిపించడంలో గొప్పపాత్ర నిర్వహించారు. భారత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా 1952– 54 మధ్య రాజ్యసభలో ఉండి నాటి ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్టు సభ్యులకు నేతృత్వం వహించారు. పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లిన ఆయన నిరాడంబరత్వం చరిత్రలో నిలిచిపోయింది. 1955లో ఆంధ్ర శాసనసభ మధ్యంతర ఎన్నికలలో పాలకవర్గాలు, బడా పత్రికలు విషపు ప్రచారాలు సాగించినా వాటిని లెక్కచేయకుండా నికరంగా పోరాడారు. 1962లో గెలుపొంది విశాఖ ఉక్కు సమస్యపై రాజీనామా చేసి మళ్ళీ 1978 – 83 మధ్య శాసనసభ్యుడుగా ఉన్నారు. సుందరయ్య, ఆయనను వివాహమాడిన కమ్యూనిస్ట్ కార్యకర్త కామ్రేడ్ లీల ఇద్దరూ... సంతానాన్ని కూడా వద్దనుకుని ఉద్యమ నిర్మాణానికే అంకితమైన తీరు ఒక ఉదాత్త ఉదాహరణగా మిగిలిపోయింది. కామ్రేడ్ సుందరయ్య రాజకీయాలతో పాటు కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలోనూ మహత్తర కృషి చేశారు. తెలుగు జాతి సాహిత్య సాంస్కృతిక పునరు జ్జీవనానికి సదా శ్రద్ధ వహించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పుస్తకం రాసి భావి బాషా రాష్ట్రాల స్థాపన బాట చూపారు. ‘నవ శక్తి’, ‘స్వతంత్ర భారత్’, ‘ప్రజాశక్తి’, ‘విశాలాంధ్ర’, తిరిగి ‘ప్రజాశక్తి’ వంటి పత్రికలు స్థాపించడం ద్వారా కమ్యూనిస్ట్ భావాల వ్యాప్తికి కృషి చేశారు. (చదవండి: రాజ్యాంగస్ఫూర్తే విరుగుడు!) అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో గౌరవాభిమానాలు పొందిన సుందరయ్య... శ్రామిక వర్గ అంతర్జాతీయతను నిలబెట్టిన యోధుడు. ఈ నిర్విరామ కృషిలో ఆయన అనారోగ్యంతో పెనుగులాడుతూ వచ్చారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉండగానే 1985 మే 19వ తేదీన ఆయన కన్నుమూశారు. బహుముఖ కార్యక్రమాలతో సుందరయ్య స్ఫూర్తిని ఈ తరానికి అందించడం మనందరి కర్తవ్యం. (Enugula Veeraswamy: ఆ యాత్ర ఓ చరిత్ర) - జూలకంటి రంగారెడ్డి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు (మే 19న పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి) -
నారాయణ్ దాస్ మంచి సలహాలిచ్చేవారు: నిర్మాత
‘‘నారాయణ్ దాస్‌గారు ఏ సమస్యని అయినా క్షుణ్ణంగా పరిశీలించి, ఆ సమస్య మళ్లీ రాకుండా పరిష్కరించేవారు. చాంబర్‌కు సంబంధించిన విషయాల్లో మంచి సలహాలూ సూచనలు ఇస్తూ అభివృద్ధి దిశగా ఎలా వెళ్లాలో చెబుతుండేవారు. ఆయన్నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు నిర్మాత దామోదర ప్రసాద్. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. చదవండి: శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో ఆయనకు సంతాప సభ జరిగింది. ‘‘చిన్న సినిమాలకు మేం ఉన్నాం అనే భరోసా కల్పించారు నారాయణ్ దాస్‌గారు. ఏ రోజూ తాను చేసిన సేవలు బయటకు చెప్పుకోలేదు. మాట ఇస్తే వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. అదే పద్దతి ఆయన తనయుడు సునీల్‌కు వచ్చింది’’ అని ప్రసన్నకుమార్ అన్నారు. ఇంకా దర్శకుడు వై.వి.యస్ చౌదరి, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, డీఎస్ రావు, మోహన్ వడ్లపట్ల, పద్మినీ నాగులపల్లి తదితరులు పాల్గొన్నారు. చదవండి: సినీ నటి జీవితకు అరెస్ట్ వారెంట్ -
నారాయణ దాస్ నారంగ్‌కు నివాళులర్పించిన టాలీవుడ్ ప్రముఖులు
-
‘అంబేడ్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు’
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో సమానత్వం పెంపొందించి, ప్రజల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి చేశారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేవిధంగా, అంబేడ్కర్ ఆశయాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పని చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎం.ఎస్.ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, గరపు దయానంద్, జనార్ధన్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా.నరసింహాచార్యులు, టిఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉస్మానియా ఎరుపెక్కిన వేళ...
కాసింత ఆహారం, దుస్తులు, వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలని అర్ధ శతాబ్దం క్రితం ఒక యువ మేధస్సు ఆలోచించింది. ఆ లక్ష్య సాధనకై ఆచరణాత్మక కార్యాచరణ రూపొందించి, అడుగులు వేస్తున్న నేపథ్యంలో 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ కిన్నెర హాస్టల్ ప్రాంగణంలో... ప్రగతి నిరోధక, ఛాందస భావాల ప్రతినిధుల కుట్రలకు ఆ యువ కిశోరం ఎదురు నిలిచి పోరాడి నేలకొరిగింది. అతడే ప్రగతి శీల విద్యార్థుల ప్రియ నేత, ఉస్మానియా అరుణ తార, హైదరాబాద్ చేగువేరాగా పిలుచుకునే జార్జి రెడ్డి! 1947 జనవరి 15న కేరళలో జన్మించాడు జార్జి రెడ్డి. 1960–70ల్లో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ విద్యార్థిగా, ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్‌గా జార్జ్ చెరగని ముద్ర వేశాడు. క్లిష్టమైన అణు భౌతిక శాస్త్రంలో (న్యూక్లియర్ ఫిజిక్స్) గోల్డ్ మెడల్ సాధించాడు. విద్యార్థులకు విద్యతో పాటు మానసిక శారీరక దృఢత్వం తప్పనిసరి అని విశ్వసించే జార్జ్ తనని తాను బాక్సింగ్ ఛాంపియన్‌గా మలుచుకున్నాడు. అంతేగాక తోటి విద్యార్థులకు, విద్యార్థినులకు స్వీయ రక్షణ మెలకువలు బోధిస్తూ, వారిలో నూతన విశ్వాసాన్ని నింపేవాడు. నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ గిరిజన పోరాటాలు, తొలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ గాలులు ఉస్మానియా గడ్డను తాకాయి. ఆ ప్రజా ‘తిరుగుబాట్లు’ ఉస్మానియా విద్యార్థులలో ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ నూతన పరిణామాలకు వేదికైంది. రైతాంగ పోరాటాలకు జడుచుకొని నగరాలలో స్థిరపడిన ఆధిపత్య సామాజిక వర్గాల వారసులు... చదువు సాకుతో ఉస్మానియా యూనివర్సిటీలో తిష్ఠ వేశారు. మరోవైపు నాటి ఉద్యమ విజయాలతో చదువుల ఒడిని చేరుకున్న మధ్యతరగతి, రైతు కూలీల బిడ్డలు, ఉన్నత విద్యకై ఉస్మానియా వర్సిటీలోకి అప్పుడప్పుడే చేరుకోవడం ఆరంభమైంది. (క్లిక్: మహిళల వద్దకే ఉద్యోగాలు) మొదటి బృందానికి నాటి పాలక పార్టీ, నేటి అధికార పార్టీ మాతృసంస్థలు దిశానిర్దేశం చేస్తూ... యూనివర్సిటీపై తమ తమ ఆధిపత్యాల కోసం వికృత మార్గాలు ఎంచుకున్నాయి. ఫలితంగా రెండో బృందం విద్యార్థులపై హాస్టళ్లలో, మెస్‌లలో, తరగతి గదులలో, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌ల పేరుతో.. బల ప్రదర్శన, ఆధిపత్యం చేయడం ఆనవాయితీగా మారింది. యూనివర్సిటీ అధికారులపై, ఆచార్యులపై బెదిరింపులకు పాల్పడటం; విద్యార్థి సంఘాల ఎన్నికలలో ఆరోగ్యకరమైన పోటీ జరగకుండా భయభ్రాంతులు సృష్టించడం, తోటి విద్యార్థుల స్వేచ్ఛను హరించడం సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ విద్యార్థిగా జార్జి రెడ్డి యూనివర్సిటీ గడ్డపై అడుగు పెట్టాడు. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థి లోకానికి పెద్ద దిక్కై నిలిచాడు. క్యాంపస్‌లో విద్యార్థి హక్కుల రక్షణకై నిలబడ్డాడు. భౌతిక దాడులను తన బిగి పిడికిలితో తిప్పికొడుతూ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపాడు. సైద్ధాంతిక అధ్యయనం, చర్చలతో సహచరులలో స్ఫూర్తి రగిలించాడు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి బృందాన్ని నిర్మించి ఆనతి కాలంలోనే విద్యార్థుల ఆత్మీయ నేతగా ఎదిగాడు. సాధారణ విద్యార్థులను పోటీకి నిలవనివ్వని ‘ఆధిపత్యం’పై విద్యార్థి సంఘాల ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు. విజ్ఞానంలోనూ, నాయకత్వంలోనూ పతాక స్థాయికి చేరుకుంటున్న జార్జి ‘ఆధిపత్య వర్గాలకు’ కంటగింపుగా మారాడు. దీంతో ఛాందసవాదులు జార్జిని అమానుషంగా హత్య చేశారు. జార్జి త్యాగాన్నీ, ఆశయాలనూ ఎత్తి పడుతూ జార్జి స్థాపించిన పీడీఎస్ అనతికాలంలోనే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ)గా దేశవ్యాప్తంగా విస్తరించింది. ‘జీనా హై తో మర్ నా సీఖో, ఖదం ఖదం పర్ లడ్నా సీఖో’ అంటూ మరణానంతరం కూడా యువ తరానికి దిశానిర్దేశం చేస్తున్న హీరో జార్జి రెడ్డి. (చదవండి: వ్యవస్థల్లో విపరీత ధోరణులు) - ఎస్. నాగేశ్వర్ రావు పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు (ఏప్రిల్ 14న జార్జి రెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా... నేడు ఓయూలో నిర్వహించే ‘రెడ్ షర్ట్’ కవాతు, బహిరంగ సభ నేపథ్యంలో) -
‘విమర్శ’ సామాజిక బాధ్యతగా...
సాహిత్య విమర్శను తన సామాజిక బాధ్యతగా గుర్తెరిగి నిబద్ధతా నిజాయితీలతో వ్యవహరించిన డా. కడియాల రామమోహన్ రాయ్ గుంటూరులో ఏప్రిల్ 6న తుది శ్వాస విడిచారు. కొన్ని వందల సాహిత్యవ్యాసాలు, ఆరువందల పైచిలుకు గ్రంథ సమీక్షలు, శతాధిక రేడియో ప్రసంగాలు రామమోహన్ రాయ్ నిరంతర సాహిత్య కృషికి అద్దం పడతాయి. వీరు రాసిన ‘తెలుగు కవితా వికాసం’, ‘కృష్ణశాస్త్రి కవితా వైభవం’, ‘20వ శతాబ్ది తెలుగు కవిత్వం’, ‘గుంటూరి శేషేంద్ర శర్మ’, ‘ఉత్తరాంధ్ర నవలా వికాసం’, ‘కృష్ణశాస్త్రి కవితావైభవం’, ‘పదమూడు ఉత్తమ కథలు’, ‘శ్రీశ్రీ రచనల ప్రభావం’ వంటి గ్రంథాలు ఆంధ్ర పాఠకులు మరువలేరు. 1983లో వీరు సమర్పించిన ‘తెలుగు సాహిత్యంలో కృషీవల జీవనం’ అన్న గ్రంథానికి నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను ప్రసాదించింది. 1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ విమర్శ పురస్కారం పొందారు. ఆయన 1944 ఏప్రిల్ 11న గుంటూరు జిల్లా సిరిపురం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి కడియాల భద్రయ్య, తల్లి కమల. తండ్రి నాస్తికుడు, హేతువాది, సాహిత్యాభిలాషి కావడం వల్ల ఆయన ప్రభావం రామమోహన్ రాయ్‌పై పడింది. గుంటూరు హిందూ కళాశాలలో బీఏ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ(తెలుగు) చదివారు. గుంటూరు జేకేసీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. వీరికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) వారి ఉత్తమ విమర్శక పురస్కారం, 2017లో నవ్యాంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారి భాషా పురస్కారం, 2018లో అద్దేపల్లి రామమోహనరావు కవిత్వ విమర్శా పురస్కారం లభించాయి. (చదవండి: ప్రజాస్వామ్యమే అంబేడ్కర్ భావసారం) రాయ్ రాసిన ‘మన తెలుగు నవలలు’ తెలుగు నవలా ప్రియులకు కరదీపికగా నిలుస్తుంది. ‘తెలుగు సాహిత్యంలో రైతు జీవితం’, ‘ఇరవయ్యవ శతాబ్ది తెలుగు సాహిత్య వికాసం’, ‘వెయ్యేళ్ల తెలుగు పద్య వికాసం – సమగ్ర పరిశోధన’, ‘మన తెలుగు నాటకాలు – నాటికలు’ వంటి గ్రంథాలు ఇంకా ప్రచురణకు నోచుకోలేదు. 78 సంవత్సరాల వయసులో కూడా ఉత్సాహంగా సాహిత్య సభల్లో పాల్గొని అనర్గళంగా ప్రసంగించేవారు. రామమోహన్ రాయ్ మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు. (చదవండి: ఎంవీఆర్..ఆయనే ఒక చరిత్ర) – డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, నెల్లూరు -
గ్రహణం పట్టిన భాస్కరుడు
తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘సిరిసిరిమువ్వ’, ‘సిరివెన్నెల’ – రెండు ఆణి ముత్యాలు. ఆ కళాత్మక చిత్రాలు దర్శకులు కె. విశ్వ నాథ్ అభిరుచికి ప్రతీకలుగా నిలిచి ఆయనకో ముద్రను సంతరించాయి. ముఖ్యంగా ఇద్దరు ప్రతిభామూర్తులైన కవులు వేటూరి సుందరరామమూర్తి, చేంబోలు (సిరి వెన్నెల) సీతారామ శాస్త్రి గార్లకు మొదటిసారిగా ‘సింగిల్ కార్డ్స్’తో పాటలు రాసే అవకాశాల నిచ్చాయి. జయప్రద, ఏడిద నాగేశ్వరరావు వంటి వారు చిత్రసీమలో నిలదొక్కుకునేలా చేశాయి. జాతీయ, రాష్ట్రీయ, స్వచ్ఛంద సంస్థల పురస్కారాలతో తెలుగు సినిమా కీర్తిని రెపరెపలాడించాయి. అయినా ఈ చిత్ర ద్వయ నిర్మాతలలో సూత్రధారుడైన నల్లమిల్లి భాస్కరరెడ్డికి మాత్రం తగిన గుర్తింపు దక్కక పోవడం దురదృష్టకరం! నల్లమిల్లి భాస్కరరెడ్డి తూర్పుగోదావరి జిల్లా లోని పసలపూడి గ్రామంలో జన్మించారు. నటి రాజశ్రీ అభిమాని అయిన భాస్కరరెడ్డికి ఆమె నటించిన చిత్రాల ప్రదర్శన హక్కులను కొనాలనే కుతూహలం కలగడంతో ఆయన సినీ జీవితానికి అంకురార్పణ జరిగింది. సహాధ్యాయి ఉజూరి చిన వీర్రాజు తోడయ్యారు. ఇద్దరూ కలిసి పసలపూడిలో వ్యాపార రంగంలో ఉన్న మరో ఇద్దర్ని నిర్మాత లుగా చేర్చుకొని, అప్పటికే చిత్ర పరిశ్రమతో అంతో ఇంతో సంబంధమున్న అంగర సత్యం (‘పదహారేళ్ల వయసు’ నిర్మాత) సలహాతో ‘వెంకటేశ్వర కల్యాణం’ అనే డబ్బింగ్ చిత్రాన్ని నిర్మించారు. ఆర్థికంగా లాభించడంతో ‘డైరెక్ట్ చిత్రం’ తియ్యా లనే కోరిక కలిగింది. అది అప్పటికి మద్రాసులో అస్థిరమైన పరిస్థితిలో ఉన్న ఏడిద నాగేశ్వరరావు ప్రోత్సాహంతో కార్యరూపం ధరించింది. ఏడిద... విశ్వనాథ్, వేటూరి, కనకాల దేవ దాసులను వెంట పెట్టుకొని రామ చంద్రపురం వచ్చారు. అందరూ సందేహించిన కథానాయిక మూగతనం అనే అంశాన్ని భాస్కరరెడ్డి సాహసించి ఆమోదించడంతో ‘సిరిసిరిమువ్వ’ చిత్ర నిర్మాణా నికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రానికి నల్లమిల్లి భాస్కరరెడ్డి, ఉజూరి చినవీర్రాజు, చింతా రామ కృష్ణారెడ్డి, కర్రి లచ్చారెడ్డి నిర్మాతలు కాగా – ఏడిద నిర్మాణ సారథిగా వ్యవహరించారు. చిత్రం ‘గీతా కృష్ణా కంబైన్స్’ పతాకంపై నిర్మితమైంది. ‘సిరిసిరి మువ్వ’ మద్రాసు మహా నగరంలో 300 రోజుల పాటు ప్రదర్శితమైంది. హిందీలో రిషి కపూర్ హీరోగా ‘సర్గమ్’ పేరుతో పునర్నిర్మింపబడి విజయవంతం కావడమే కాకుండా, మాస్కోలో కూడా సంచలనాన్ని సృష్టించింది. తరువాత మరింత ప్రయోగాత్మకంగా ‘సిరివెన్నెల’ చిత్రాన్ని నిర్మించడానికి కె. విశ్వనాథ్ ప్రతిపాదిస్తే ఒక నిర్మాత జారుకున్నా భాస్కర్‌రెడ్డి ప్రోద్బలంతో మిగతా ఇద్దరూ ముందుకొచ్చారు. వ్యక్తిగతంగా భాస్కరరెడ్డి సహృదయుడు, స్నేహశీలి, ప్రాంతీయాభిమాని. తన పరిధిలో ఎందరికో సహాయం చేశారు. ఈ వ్యాసకర్త పరి శోధనకు సినిమా పాటల పుస్తకాలనిచ్చారు. భగ వాన్ అనే అధ్యాపకునికి సినిమాలో గాయ కునిగా అవకాశాన్నిచ్చారు. అన్నిటికీ మించి ఆంధ్ర దేశా నికి గర్వకారణ మైన రెండు కళాఖండాలను సమర్పించారు. కానీ ఆయన విచారించకపోయినా, పై సినిమాల నిర్మాతగా ఆయనకు గుర్తింపు రాలేదు. అవార్డుల స్వీకారం మొదలైన సంద ర్భాలలో ఆయన వెనక వరుసలోనే ఉన్నారు. మురారి తన చలనచిత్ర నిర్మాతల చరిత్రలో ఆయనను విస్మరించారు. ఎందుచేతనో ఆత్మీ యుడైన వంశీ కూడా ‘పసల పూడి కథలు’లో కానీ, ‘పొలమారిన జ్ఞాపకాలు’లో కానీ ఆయన గురించి రాయలేదు. అనారోగ్యం, ఆర్థిక సమస్యలు తరుముకొని రాగా ఇటీవల అనామకంగా, ఆకస్మి కంగా ఈ లోకానికి దూరమైన ఆ అనాదృత కళామూర్తికి ఆత్మశాంతి చేకూరాలి. -డాక్టర్ పైడిపాల వ్యాసకర్త సినీ సాహిత్య విమర్శకులు మొబైల్: 99891 06162 -
మల్లు స్వరాజ్యం పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు (ఫొటోలు)
-
నేడు నాగుర్లపల్లిలో కందికొండ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్/ నర్సంపేట రూరల్: ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి అంత్యక్రియలు సోమవారం ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో జరగనున్నాయి. తెలుగు సినిమాలకు వేల పాటలు రాసిన ఆయన.. కేన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని నివాసంలో శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం ఫిలిం చాంబర్లో ఉంచారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పార్థివదేహాన్ని సందర్శించుకున్నారు. తక్కువ కాలం జీవించి, ఎక్కువ కాలం జీవించే కవిత్వాన్ని రాసిన తెలంగాణ పాటల పూదోట కందికొండ యాదగిరి అని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ఈ సందర్భంగా కొనియాడారు. కందికొండ అందరివాడని, ఆయన లేనిలోటు తీర్చలేమని పేర్కొన్నారు. అభిమానుల సందర్శన అనంతరం కుటుంబ సభ్యులు అశ్రునయనాల మధ్య కందికొండ మృతదేహాన్ని స్వగ్రామం నాగుర్లపల్లికి తరలించారు. మధ్యలో అంబులెన్సును నర్సంపేట పట్టణంలోని అమరువీరుల స్థూపం వద్ద కాసేపు ఆపారు. పలువురు స్థానిక ప్రముఖులు, నాయకులు, కళాకారులు, అభిమానులు పూలు చల్లి నివాళులు అర్పించాక.. నాగుర్లపల్లికి తీసుకెళ్లారు. అక్కడ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి కందికొండ పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కందికొండ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తాం: తలసాని కందికొండ యాదగిరి తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పాటలెన్నో కందికొండ రాశారని.. ఆయన మృతి బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. వారి కుటుంబానికి మంత్రి కేటీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని, కందికొండ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. -
ఫిల్మ్ ఛాంబర్లో కందికొండ భౌతిక కాయం.. మంత్రి తలసాని నివాళి
Kandikonda Yadagiri Passes Away: Minister Talasani Tribute In Film Chamber: ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి (49) భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. కందికొండ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కందికొండ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. తన పాటలతో తెలంగాణ సమాజాన్ని ఎంతో చైతన్య పరిచారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తలసాని. తెలంగాణ సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటని, సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. కందికొండ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. చదవండి: 1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం శనివారం (మార్చి 12) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో కందికొండ యాదగిరి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా గొంతు కేన్సర్, వెన్నెముక సమస్యలతో ఆయన పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. ఆయస స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. తల్లిదండ్రులు సాంబయ్య, కొమురమ్మ కాగా కందికొండ యాదగిరికి భార్య రమాదేవి, కుమార్తె మాతృక, కుమారుడు ప్రభంజన్ ఉన్నారు. ప్రముఖుల నివాళుల అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ గారు మృతి చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/Bg5zhexYUc — Talasani Srinivas Yadav (@YadavTalasani) March 12, 2022 చదవండి: ‘కందికొండ ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి సిద్దం’ -
'భయమేస్తే గట్టిగా హత్తుకునేదాన్ని.. మిస్ యూ నాన్న'
ఆస్ట్రేలియన్ దిగ్గజం షేన్ వార్న్ భౌతికంగా దూరమై నాలుగు రోజులు కావొస్తుంది. ఇప్పటికి వార్న్‌కు ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా వార్న్ పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. కాగా పెద్ద కూతురు సమ్మర్ ''నాన్నకు ప్రేమతో.. అంటూ రాసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''ఇప్పటికే నిన్ను చాలా మిస్సవుతున్నా. చిన్నప్పుడు భయమేస్తే నిన్ను గట్టిగా హత్తుకొని నిద్రపోయేదాన్ని.. కానీ ఇకపై ఆ అవకాశం లేకుండా పోయింది. నీ చివరి క్షణాల్లో నేను పక్కన లేకపోవడం దురదృష్టంగా భావిస్తున్నా. ఆ సమయంలో నీ పక్కన ఉండి ఉంటే.. చేతిని పట్టుకొని ఏం కాదు అంతా సవ్యంగా జరుగుతుంది అని చెబుదామనుకున్నా. అడగకుండానే అన్నీ ఇచ్చారు.. బెస్ట్ డాడీగా ఉండడం మాకు వరం.'' అని పేర్కొంది. ''చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచారు. మీ జోకులతో మమ్మల్ని ఎన్నోసార్లు నవ్వించారు. ఈరోజు భౌతికంగా దూరమయ్యారంటే తట్టుకోలేకపోతున్నా.. మిస్ యూ నాన్న అంటూ వార్న్ చిన్న కూతురు బ్రూక్ ట్వీట్ చేసింది. ''నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటావు. నువ్వో గొప్ప తండ్రివి, స్నేహితుడివి'' అంటూ వార్న్ పెద్ద కుమారుడు జాక్సన్ తన బాధను వ్యక్తం చేశాడు. ''ఇది ఎప్పటికీ ముగిసిపోని పీడకలలాంటిది. వార్న్ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాం. అతను అందించిన జ్ఞాపకాలతో బతికేస్తాం’' అని అతని తల్లిదండ్రులు కీత్, బ్రిగిట్ ఆవేదనతో కుమిలిపోయారు. ఇక గత శుక్రవారం థాయ్‌లాండ్‌లోని కోయ్ సమూహ్ ప్రాంతంలోని తన విల్లాలో వార్న్ అచేతన స్థితిలో మరణించాడు. అతని మృతిపై పలు రకాల అనుమానాలు వచ్చినప్పటికి.. వార్న్‌ది సహజ మరణమేనని థాయ్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. వార్న్ అంత్యక్రియలను ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. వార్న్ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలకు నెలవైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఎంసీజీ బయట వార్న్ విగ్రహం ఉండగా, మైదానంలో ఒక స్టాండ్‌కు కూడా అతని పేరు పెట్టనున్నారు. ఇంకా తేదీ ధ్రువీకరించకపోయినా... వచ్చే రెండు వారాల్లోగా అంత్యక్రియలు నిర్వహించవచ్చు. చదవండి: PAK vs AUS: దంపతులిద్దరు ఒకేసారి గ్రౌండ్లో.. అరుదైన దృశ్యం Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు సెలెక్టర్ల వార్నింగ్.. పది రోజులు ఉండాల్సిందే Shane Warne Death: ‘షేన్ వార్న్‌ది సహజ మరణమే’ -
'ఇప్పటికీ షాక్‌లోనే.. జీవితం మనం ఊహించినట్లు ఉండదు'
ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. వార్న్ మరణాన్ని తోటి క్రికెటర్లు సహా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 52 ఏళ్ల వయసులోనే అర్థంతరంగా తనువు చాలించిన దిగ్గజానికి క్రీడాలోకం అశ్రు నివాళి అర్పిస్తోంది. టీమిండియా క్రికెటర్లు సైతం వార్న్‌కు నివాళి అర్పిస్తూ అతనితో ఉంద అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక సెషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా మిగతా క్రికెటర్లు వార్న్‌కు నివాళి ప్రకటించారు. ఈ సందర్భంగా టీమిండియా మెషిన్‌గన్ విరాట్ కోహ్లి వార్న్‌ను తలచుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. '' నిన్న రాత్రి దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ దూరమయ్యాడన్న వార్త తెలిసింది. వార్న్ చనిపోయాడన్న వార్త మొదట నేను నమ్మలేదు. అతను చనిపోవడం ఏంటని అనుకున్నా. కానీ అది నిజమని తెలిసిన తర్వాత దుఃఖం ఆపుకోలేకపోయా. నిజంగా జీవితం మనం ఊహించినట్లు ఉండదు. ఈ క్షణంలో బాగానే ఉన్నామనిపిస్తుంది.. కానీ మరుక్షణంలో ఏం జరగబోయేది ఎవరు చెప్పలేరు. జీవితం అనూహ్యమైంది.. కానీ ఊహించలేనిది. వార్న్ తన 15 ఏళ్ల క్రికెట్ జీవితంలో చాలానే చూశాడు. క్రికెట్ బంతిని అతనికంటే గొప్పగా ఎవరూ టర్న్ చేయలేరు. క్రికెట్ తర్వాత కూడా జీవితంలో చాలా చూస్తాడు అనుకున్నా.. కానీ 52 ఏళ్లకే ఇలా భౌతికంగా దూరమవుతాడని అనుకోలేదు. వార్న్‌తో కలిసి ఆడే అదృష్టం మాకు లేకపోయినప్పటికి.. మాకు బూస్టప్ కావాలంటే ఇప్పటికి వార్న్ బౌలింగ్ వీడియోలను పెట్టుకొని చూస్తుంటా. ఆ పర్సనాలిటి.. చరిష్మా కనబడదు అంటే జీర్ణించుకోలేకపోతున్నా. అతనికి ఇదే నా ప్రగాడ సానుభూతి'' అంటూ ముగించాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ''వార్న్ గురించి తెలుసుకోవడం నేను అదృష్టంగా భావిస్తా. నా దృష్టిలో అతను ఎవర్గ్రీన్ స్పిన్నర్.. అతనితో కలిసి ఆడకపోవడం నేను చేసుకున్న దురదృష్టం. ఇంత తొందరగా మమ్మల్ని వదిలివెళతాడని ఊహించలేదు. ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టూ షేన్ వార్న్. ఈ సందర్భంగా వార్న్ కుటుంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతి ప్రకటిస్తునా. అలాగే వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా''అంటూ ముగించాడు. బీసీసీఐ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: Shane Warne-Sachin: 'చిన్న వయసులోనే వెళ్లిపోయావా మిత్రమా'.. సచిన్ భావోద్వేగం Shane Warne: ఉదయమే ట్వీట్.. సాయంత్రానికి మరణం; ఊహించని క్షణం "Life is fickle and unpredictable. I stand here in disbelief and shock."@imVkohli pays his tributes to Shane Warne. pic.twitter.com/jwN1qYRDxj — BCCI (@BCCI) March 5, 2022 -
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రోడ్రిగ్స్ కన్నుమూత
న్యూఢిల్లీ/పనాజీ: భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్(88) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గోవాలోని పనాజీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించినట్లు భారత సైన్యం ట్విట్టర్లో తెలియజేసింది. జనరల్ రోడ్రిగ్స్ 1990 నుంచి 1993 వరకు భారత సైనికాధిపతిగా పనిచేశారు. 2004 నుంచి 2010 దాకా పంజాబ్ గవర్నర్‌గా సేవలందించారు. రోడ్రిగ్స్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. -
చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'
ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. లెగ్ స్పిన్నర్‌గా ఆటకు వన్నె తెచ్చిన వార్న్ లెక్కలేనన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వార్న్(708 వికెట్లు) ఇప్పటికీ రెండో స్థానంలో కొనసాగడం విశేషం. మైదానంలో గింగిరాలు తిరిగే బంతులతో బ్యాట్స్మెన్లను హడలెత్తించడమే కాకుండా ప్రత్యర్థి జట్లకు సవాల్‌గా నిలిచేవాడు. మరి అలాంటి వార్న్ కెరీర్లో ఒక బంతి బాల్ ఆఫ్ ది సెంచరీగా నిలిచిపోయింది. 1993లో యాషెస్ సిరీస్‌లో భాగంగా మైక్ గాటింగ్‌ను వార్న్ ఔట్ చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. వార్న్ మృతికి సంతాపంగా మరోసారి ఆ సంఘటనను గుర్తుచేసుకుందాం. సరిగ్గా 27 ఏళ్ల క్రితం 1993లో ఇంగ్లండ్‌తో వారి దేశంలో జరిగిన యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో వార్న్ ఒక అద్భుతమైన బంతిని సంధించాడు. ఆ టెస్టు మ్యాచ్ జూన్ 3వ తేదీన ఆరంభం కాగా, రెండో రోజు ఆట(జూన్ 4వ తేదీన)లో ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు మైక్ గాటింగ్‌ను బోల్తా కొట్టించిన తీరు వార్న్ కెరీర్‌ను మలుపు తిప్పింది. బంతిని నేరుగా గాటింగ్ కాళ్లకు ముందు అవుట్‌సైడ్ లెగ్‌స్టంప్‌పై వేసి ఆఫ్ వికెట్‌ను ఎగరుగొట్టిన తీరు ఇప్పటికీ చిరస్మరణీయమే. అసలు బంతి ఎక్కడ పడుతుందా అని గాటింగ్ అంచనా వేసే లోపే ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఆ బంతికి గాటింగ్ షాక్ కాగా, ఫీల్డ్‌లో ఉన్న అంపైర్‌కు కూడా కాసేపు ఏమీ అర్థం కాలేదంటే అది ఎంతలా స్పిన్ అయ్యి ఉంటుందో( ఎంతలా స్పిన్ చేశాడో) ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడంలో వార్న్‌దే కీలక పాత్ర. ప్రతీ ఇన్నింగ్స్‌లోనూ నాలుగేసి వికెట్లు సాధించి ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు. వార్న్ కెరీర్‌కు పునాది పడిన సందర్భం కచ్చితంగా అదే టెస్టు మ్యాచ్. 1992లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన వార్న్.. ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ దిగ్గజాల సరసన నిలిచిపోయాడు. చదవండి: Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం Shane Warne: చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
ఉదయమే ట్వీట్.. సాయంత్రానికి మరణం
బంతిని తిప్పడంలో అతనికి ఎవరు సాటిరారు.. తన లెగ్ స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు ముచ్చెటమలు పట్టించాడు.. ఎన్నోసార్లు వివాదాలకు కేంద్ర బిందువు అయినప్పటికి.. తన ఆటతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో తన పేరును సుస్థిరం చేసుకున్నాడు.. సమకాలీన క్రికెట్లో మరో దిగ్గజ స్నిన్నర్తో పోటీ పడుతూ వికెట్ల మీద వికెట్లు సాధించి చరిత్ర లిఖించాడు.. అతనెవరో కాదు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్.. 52 ఏళ్ల వయసులోనే తనువు చాలిస్తానని బహుశా వార్న్ ఊహించి ఉండడు. శుక్రవారం ఉదయమే వార్న్ తన దేశానికి చెందిన మరో మాజీ క్రికెటర్ రాడ్ మార్ష్ మృతికి ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించాడు.. అదే సయమంలో తనను మరణం వెంటాడుతుందని అతను ఊహించలేకపోయాడు... క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేస్తూ గుండెపోటుతో అకాల మరణం చెందిన వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ ప్రత్యేక కథనం... Sad to hear the news that Rod Marsh has passed. He was a legend of our great game & an inspiration to so many young boys & girls. Rod cared deeply about cricket & gave so much-especially to Australia & England players. Sending lots & lots of love to Ros & the family. RIP mate❤️ — Shane Warne (@ShaneWarne) March 4, 2022 1969, సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామంలో జన్మించాడు. 1983-84 మధ్య కాలంలో అండర్-16 విభాగంలో యునివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ తరపు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత అండర్-19 విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వార్న్ అనతికాలంలోనే మంచి క్రికెటర్‌గా ఎదగాడు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడానికి ముందు వార్న్ కేవలం ఏడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడడం విశేషం. ఇక సిడ్నీ వేదికగా 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా షేన్ వార్న్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో రవిశాస్త్రిని ఔట్ చేయడం ద్వారా తొలి వికెట్ అందుకున్నాడు. కెరీర్ మొదట్లో సాధారణ బౌలర్‌గా కనిపించిన వార్న్.. ఆ తర్వాత శ్రీలంకతో సిరీస్‌లోనూ పెద్దగా రాణించలేదు. ఇక వార్న్ కెరీర్‌ను మలుపు తిప్పింది మాత్రం వెస్టిండీస్ సిరీస్ అని చెప్పొచ్చు. మెల్బోర్న్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో వార్న్ తొలిసారి తన బౌలింగ్ పవర్‌ను చూపించాడు. లెగ్ స్పిన్ మ్యాజిక్‌తో రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులకే ఏడు వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక అక్కడి నుంచి వార్న్ తన కెరీర్లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బాల్ ఆఫ్ ది సెంచరీ.. 1993లో ప్రతిష్టాత్మక యాషెస్ టూర్‌కు వార్న్ ఎంపికయ్యాడు. ఆరు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తంగా 34 వికెట్లు తీసిన వార్న్ సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మైక్ గాటింగ్‌ను ఔట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో మిగిలిపోయింది. లెగ్‌స్టంప్ దిశగా వెళ్లిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్‌స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టడం క్రీడా పండితులను సైతం ఆశ్చర్యపరించింది. అందుకే వార్న్ వేసిన ఆ బంతిని బాల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణించారు. ఇక ఆ ఏడాది క్యాలెండర్ ఇయర్లో 71 వికెట్లు తీసిన వార్న్ .. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. అప్పటినుంచి 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌కు సేవలందించిన వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లోనే వార్న్ టెస్టుల్లో 3154 పరుగులు సాధించాడు. సమకాలీన క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్న సంగతి తెలిసిందే. షేన్ వార్న్ సాధించిన రికార్డులు.. విశేషాలు ►అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా షేన్ వార్న్. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు ►టెస్టుల్లో 37 సార్లు ఐదు వికెట్ల హాల్.. 10 సార్లు 10 వికెట్ల హాల్ ఘనత ►టెస్టుల్లో 700 వికెట్ల మార్క్ అందుకున్న తొలి బౌలర్‌గా వార్న్ రికార్డు ►రెండుసార్లు అల్మానిక్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు పొందిన క్రికెటర్‌గా వార్న్ చరిత్ర. ►అంతేకాదు విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు రెండుసార్లు ఎంపికైన క్రికెటర్‌గా గుర్తింపు ►ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్‌గా షేన్ వార్న్ గుర్తింపు.. (1993లో ఒకే క్యాలండర్ ఇయర్లో 71 వికెట్లు) చదవండి: ప్రపంచ క్రికెట్లో విషాదం.. షేన్‌వార్న్ మృతి, సంతాపాల వెల్లువ.. Shane Warne: క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన మొదటి బౌలర్ షేన్ వార్న్ -
సైన్స్‌ను జనం దరి చేర్చినవాడు
వైజ్ఞానిక స్ఫూర్తి సామాన్యులకు అందించడం కోసం, దేశంలో గొప్ప గొప్ప శాస్త్రీయ సంస్థల స్థాపనకు, అభివృద్ధికి కృషి చేసినవారు డాక్టర్ పుష్పా భార్గవ! ప్రజలను చైతన్య పరచడంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన సేవాతత్పరుడు. జన విజ్ఞాన వేదికకు ఆలంబనగా నిలిచిన గొప్ప సైన్సు కార్యకర్త. సైన్స్ ప్రచార కార్యక్రమాల్లో ఆ సంస్థను మున్ముందుకు నడిపిస్తూ– చేప మందు శాస్త్రీయతను ప్రశ్నించారు. న్యాయస్థానం వరకు వెళ్ళి, అది మందు కాదని నిరూపించారు. విశ్వ విద్యాలయాల్లో ప్రభుత్వం జ్యోతిషాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసించారు. అలాగే, వాస్తు ప్రామాణికతను ప్రశ్నించారు. సమగ్రమైన చర్చ లేకుండా జీవ సాంకేతిక మార్పులతో కూరగాయలను మార్కెట్లోకి విడుదల చేయడాన్ని వ్యతిరేకించారు. డాక్టర్ పుష్పా మిత్ర భార్గవ (22 ఫిబ్రవరి 1928–1 ఆగస్టు 2017) రాజస్థాన్‌లోని అజ్మీర్ (అజయ్ మేరు)లో జన్మించారు. 1946లో ఆర్గానిక్ కెమిస్ట్రీ (సేంద్రియ రసాయన శాస్త్రం)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వెనువెంటనే 21 సంవత్సరాల చిరుప్రాయంలో లక్నో యూనివర్సిటీ నుండి పీహెచ్డీ స్వీకరించారు. కొంతకాలం లక్నో యూని వర్సిటీలోనే లెక్చరర్‌గా పనిచేసి, తర్వాత కాలంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా చేరి స్థిరపడ్డారు. అమెరికా, ఫ్రాన్స్, యూకేల్లో ప్రసిద్ధ సంస్థల్లో పరిశోధనల్లో పాల్గొన్నారు. యూకే నుంచి వచ్చి హైదరాబాద్‌లోని ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల (రీజినల్ రీసెర్చ్ లాబొరేటరీ (ఆర్ఆర్ఎల్)లో సైంటిస్ట్‌గా చేరారు. తర్వాత కాలంలో ఆ ప్రయోగశాల భారత రసాయన సాంకేతిక సంస్థ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – ఐఐసీటీ)గా రూపాంతరం చెందింది. (చదవండి: నిజం... నిజం... డార్వినిజం) డాక్టర్ పీఎం భార్గవకు దేశ ప్రధానులందరితో దగ్గరి పరిచయాలుండేవి. అందువల్ల ఆయన హైదరాబాదులో ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలి క్యులర్ బయాలజీ’ (సీసీఎంబీ)ని స్థాపించగలిగారు. 1977–1990 మధ్య కాలంలో దానికి వ్యవ స్థాపక సంచాలకుడిగా ఉండి, ప్రపంచ ఖ్యాతిని తెచ్చారు. మాలిక్యులర్ సెగ్మెంట్స్ తయారీ కోసం ఒక అణుశక్తి ప్రయోగశాలను నెలకొల్పారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక బయోటెక్నాలజీ విభాగం నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించారు. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని హైదరాబాద్‌లో ఆవిష్కరించి, నేర పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పుకు కారణం అయ్యారు. ఒక సైంటిస్ట్‌గా, ఒక డైరెక్టర్‌గా వివిధ స్థాయులలో పనిచేస్తూ, దేశ విదేశాలలోని పరిశోధనా శాలల సమన్వ యంతో ఒకానొక సమయంలో దేశ వైజ్ఞానిక పరి శోధనా రంగానికి వెన్నెముకగా నిలిచిన భార్గవ కృషి చాలా విలువైంది. (Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది) డాక్టర్ భార్గవకు లభించిన దేశ విదేశాల అవార్డులు, గుర్తింపులూ ఎన్నో ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇచ్చే లీజియన్ డి ఆనర్ (1998) పొందిన ఘనత వీరిదే. ఈ మధ్య కాలంలో దేశంలో వ్యాపించిన మత ఛాందసత్వ అసహనం పట్ల – దభోల్కర్, పన్సారే, కల్బుర్గీల హత్యల పట్ల కలత చెందిన భార్గవ, తన పద్మభూషణ్ పురస్కారాన్ని 2015లో భారత ప్రభుత్వానికి వాపస్ చేశారు. ఉత్తర భారతదేశం నుండి వచ్చి, హైదరాబాద్‌ను తన స్వస్థలంగా మార్చుకుని, ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనా రంగంలో దీన్ని ఒక ముఖ్య కేంద్రంగా మార్చినవారు. సత్యాన్ని ప్రేమించి, దాని కోసం అన్ని విధాలా పోరాడే స్ఫూర్తిని మనమంతా ఆయన జీవితం నుండి పొందుతూనే ఉండాలి! - డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (ఫిబ్రవరి 22న పుష్పా భార్గవ జయంతి) -
పోరాటాల పురిటిగడ్డ ఇది!
వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉరికంబం ఎక్కి రేపటికి 175 ఏళ్లు. 19వ శతాబ్దం ప్రారం భంలో అంకురించిన చిత్తూరు పాలెగాళ్ళ పోరాటం దగ్గర నుంచి 1847 ఫిబ్రవరి 22న పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్‌వాళ్లు ఉరితీయడం వరకు... రాయలసీమ పోరాటాలతో ఎరుపెక్కింది. ఈ పోరాటాలలో ఉరికంబం ఎక్కిన అమరవీరులు రాయలసీమ పాలెగాళ్ళు. బ్రిటిష్ మహావృక్షాన్ని మొక్క దశలోనే తుంచేయాలని పోరాటాలు చేసిన తొలి స్వతంత్ర పోరాట యోధులు వీరు. క్రీ.శ. 1801 నుంచి 1805 వరకు చిత్తూరు జిల్లా పాలెగాళ్ళు– బ్రిటిష్ వారికి మధ్య జరిగిన పోరాటంలో... యాదరాకొండ పాలెగాడు ముద్దు రామప్ప నాయుణ్ణి పట్టుకుని కల్లయ్య బండ అడవుల్లో ఉరితీశారు. మిగిలిన పాల్యాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆనాటి బ్రిటిష్ సైనిక చట్టం ప్రకారం చిత్తూరు పాలెగాళ్లను కొందరిని ద్వీపాంతరం పంపారు. మరికొందరిని ఉరితీశారు. (చదవండి: మన రాజ్యాంగానికి కొత్త ప్రమాదం) క్రీ.శ.1600– 1800 వరకు రాయలసీమలో బలమైన రాజుల పాలన లేదు. రాయలసీమను రక్షించినది పాలెగాళ్లే. సీమలో దండయాత్రలు జరిగినప్పుడు గండికోట, సిద్ధవటం కోట, పరాయి రాజుల వశమైనప్పటికీ... బురుజులు మాత్రం పాలెగాళ్ళ ఆధీనంలోనే ఉండేవి. విజయనగరం రాజుల కాలంలోనే (క్రీ.శ.1336 –1680) పాలెగాళ్ల వ్యవస్థ ఏర్పడింది. రాయలసీమలో పాలెగాళ్లు విజయనగర రాజులకు పన్నులు వసూలు చేయడంలోనూ, అంతర్గత రక్షణ కల్పించడంలోనూ, అవసరమైన సైన్యాన్ని సమీకరించడంలోనూ సహాయపడేవారు. క్రీ.శ.1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంలో సుల్తానుల చేతుల్లో పరాజయం పొందిన విజయనగరం రాజులు తమ రాజధానిని హంపీ నుంచి ప్రస్తుత అనంతపురం జిల్లాలోని పెనుగొండకు క్రీ.శ.1591లో మార్చారు. అప్పటి నుంచి 1800 సంవత్సరంలో బ్రిటిష్‌వారికి రాయలసీమ ప్రాంతం ధారాదత్తం అయ్యేదాకా ఇక్కడ ముప్ఫై యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల న్నిటిలో సీమ ప్రజలకు ధన, మాన, ప్రాణ, నష్టం జరగకుండా చూసింది పాలెగాళ్లే. క్రీ.శ. 1800 నాటికి రాయలసీమలో 80 మంది పాలెగాళ్ళు ఉండేవారు. వీరి కింద 30,000 మంది సైనికులు ఉండేవారు. రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ వాళ్లకిందికి వచ్చిన తర్వాత పాలెగాళ్లు నామమాత్రులయ్యారు. బ్రిటిష్ వారి దోపిడీ పతాకస్థాయికి చేరుతుండటంతో పాలెగాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఐదు వేలమంది సాయుధులతో, ఇతర పాలెగాళ్లు, జమీందారుల సహకారంతో వాళ్లపై 1846లో తిరుగుబాటును ప్రారంభించాడు. అనేక సంఘర్షణల అనంతరం 1846 అక్టోబర్ 6న నరసింహారెడ్డిని బ్రిటిష్‌వాళ్లు పట్టుకున్నారు. 200 మంది అనుచరులతో రెడ్డి ఎర్రమల కొండలను వదిలి పెరసోమలలోనికి పోయినట్లు అనుమానించి పెరసోమల గ్రామం వద్ద బ్రిటిష్‌వాళ్లు ఆయన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. ఉయ్యాలవాడను చివరకు 1847 ఫిబ్రవరి 22న ఉరితీశారు. దీనిని కలెక్టర్ కాన్‌క్రేన్ పర్యవేక్షించాడు. మృతదేహం తలను నరికించి... ఆ తలను కోయిలకుంట్ల బురుజుకు వేలాడదీయించాడు. అలా 1847 నుంచి 1877 వరకు కోయిలకుంట్ల బురుజుకు ఆయన తల వేలాడుతూనే ఉంది. (చదవండి: ప్రజల గుండె చప్పుడు) ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి త్యాగ ధనులు పుట్టిన రాయలసీమపై కొందరు... ఫ్యాక్షన్ ముద్రవేసి దాని గౌరవాన్ని తగ్గించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి! - డాక్టర్ ఏనుగొండ నాగరాజ నాయుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్, తిరుపతి (ఉయ్యాలవాడ ఉరికంబమెక్కి రేపటికి 175 ఏళ్లు) -
చల్తే చల్తే మేరే యే గీత్ యాద్ రఖ్నా
స్పీకర్ బాక్సులు బద్దలయ్యాయి. స్తంభాలకు కట్టిన హారన్లు కేకపెట్టాయి. టేప్ రికార్డర్ల మోతకు అంతే లేదు. రేడియోలు మళ్లీ మళ్లీ పాడాయి. ‘జిమ్మీ.. జిమ్మీ.. ఆజా... ఆజా’... ‘హరి ఓం హరి... హరి ఓం హరి’... ‘మేరే దిల్ గాయేజా జు..జు.. జుబి జుబి జూబీ’... ‘పగ్ ఘంగురూ బాంద్ మీరా నాచెరె’... బప్పీ లహిరి అనే పేరు 1980లలో హోరై దేశాన్ని చుట్టేసింది. గంతులు రాని వాళ్లు గంతులేశారు. చిందులు వేయని వాళ్లు చిందులేశారు. ఆడి పాడి ఆనందించడానికే ఈ జీవితం అన్నట్టుగా పాటను పంచి బప్పీ లహిరి వీడ్కోలు తీసుకున్నాడు. ఆ నృత్య సంగీతభరిత కాలం మరి తిరిగి రాదు. బప్పీ లహిరి ఇంటర్ వరకు కూడా చదువుకోలేదు. కాని ఉన్న చోటే ఉండిపోవడం మాత్రం బతుక్కు చేటు అని ముందే తెలుసుకున్నాడు. కోల్‌కతా మహా నగరం. తల్లిదండ్రులు అపరేష్ లహిరి, బాన్సురి లహిరి ఆ నగరంలో అంతో ఇంతో పేరున్న సంగీతకారులు. తల్లి క్లాసికల్ కచేరీలు ఇస్తుంది. బప్పీ ఒక్కగానొక్క కొడుకు. అయినా సరే ఉన్న చోటే ఉండటం సరికాదు అనుకున్నాడు బప్పీ. ముంబై వెళ్లాలి... సాధించాలి అనుకున్నాడు. సంగీత దర్శకుడుగా. 21 ఏళ్లు అప్పటికి. ముంబై చేరుకున్నాడు. కిశోర్ కుమార్ అతనికి దూరపు చుట్టం. హీరోయిన్ కాజోల్ తండ్రి సోము ముఖర్జీ దగ్గరి చుట్టం. సోము తీస్తున్న ‘నన్హా షికారి’ (1973) సినిమాకు సంగీతం చేశాడు. ఓకే అనిపించింది. ఆ తర్వాత తాహిర్ హుసేన్ తీసిన ‘జఖ్మీ’ (1975)తో గుర్తింపు వచ్చింది. 1977లో వచ్చిన ‘ఆప్ కీ ఖాతిర్’లోని ‘బంబై సే ఆయా మేరా దోస్త్... దోస్త్కో సలామ్ కరో’... పాట ఆల్మోస్ట్ డూపర్ హిట్ అయ్యింది. కాని అలాంటి గుర్తింపు కాదు బప్పీ కోరుకుంటున్నది. ఇంకా ఏదో చేయాలి. అప్పుడే అమెరికాలో కచేరీ చేసే చాన్స్ వచ్చింది. లోకం చూస్తే విషయం తెలుస్తుంది అని బయలు దేరాడు. పారే నీరే ఒండ్రుమట్టిని తోడు తీసుకుంటుంది. బప్పీ అమెరికాలోని చికాగోలో ఆ రాత్రి ఒక పబ్‌కు వెళ్లాడు. పబ్‌లో అంతా హోరుగా ఉంది. వెలిగే ఆరే దీపాలు. డాన్స్ చేస్తున్న జంటలు. ఒకతను మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. ఆ మ్యూజిక్ నచ్చిన బప్పీ అతని దగ్గరకు వెళ్లి ‘నువ్వు ప్లే చేస్తున్న సంగీతం ఏమిటి?’ అని అడిగాడు. ‘నేను డిస్క్ ప్లే చేస్తున్నాను. పబ్‌లో అందరూ డాన్స్ చేయడానికి ప్లే చేస్తున్నాను కనుక ఇది డిస్కో’ అన్నాడు. ఆ సౌండ్ బప్పీకి నచ్చింది. ఆ బీట్ కూడా. అది ఇండియాలో మొదలు కానున్న డిస్కో కాలానికి ఆరంభ క్షణం. ∙∙ పోటీదారుల్ని అర్థం చేసుకోకపోతే పోటీలో నిలవడం కష్టం. 1970ల కాలంలో బాలీవుడ్ సినిమా రంగం ఘనంగా ఉంది. పోటీలో గండర గండలు. ఎస్.డి. బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్.డి. బర్మన్, కళ్యాణ్‌జీ–ఆనంద్జీ... వీళ్లంతా టాప్‌లో ఉన్నారు. వీళ్ల మధ్య బప్పీ నిలబడాలి. అతను చిన్నప్పటి నుంచి తబలా ప్లేయర్. ఏ బీట్ శ్రోతలకు హుషారునిస్తుందో తెలుసు. అదే సమయంలో తల్లి ద్వారా విన్న శాస్త్రీయ సంగీతం వల్ల ఏ స్వరం చెవికి ఇంపుగా ఉంటుందో కూడా తెలుసు. ఈ మెలోడీని, బీట్‌ని సరిగ్గా కలపగలిగితే చాలు అనుకున్నాడు బప్పీ. కొత్త సంగీత పరికరాలతో ఎప్పటికప్పుడు పోటీ పడే ఆర్.డి. బర్మన్ను ఎదుర్కొనాలంటే డిస్కో ఒక మార్గంగా కనిపించింది. అదే సమయంలో అమితాబ్ స్టార్‌డమ్‌ను తట్టుకోవడానికి మిథున్ చక్రవర్తి ప్రయత్నిస్తున్నాడు. మిథున్‌ను పెంచడానికి కూడా కొంత మంది ట్రై చేస్తున్నారు. బి.సుభాష్ అనే బి గ్రేడ్ దర్శకుడు బప్పీకి స్నేహితుడు. బప్పీ అప్పటికే డిస్కో బీట్తో ఒకటి రెండు పాటలు చేయడంతో ఇదేదో బాగుందే అనుకుని ‘డిస్కో డాన్సర్’ అనే కథను తయారు చేశాడు. మిథున్ హీరో. కాని బప్పీకి అర్థమైంది. ‘ఈ సినిమా నాది’ అనుకున్నాడు. డిస్కో మ్యూజిక్ నేపథ్యంలో పాటలు పుట్టాయి. 1982. సినిమా రిలీజైంది. నిజానికి పెద్దగా డాన్స్ రాని మిథున్ చక్రవర్తి డాన్సింగ్ స్టార్ అయ్యాడు. బప్పీ లహిరి డిస్కో కింగ్ అయ్యాడు. ఆ సినిమాలోని ప్రతి పాట వీధి వీధి వాడ వాడ మార్మోగి పోయింది. స్కూలు, కాలేజీ ఫంక్షన్లలో, తిరునాళ్లలో, పెళ్లిళ్ల లో అందరూ ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్’ పాటకు డాన్స్ వేయడమే. ‘యాద్ ఆ రహా హై తేర ప్యార్’, ‘గోరోంకి నా కాలోంకి దునియా హై దిల్ వాలోంకి’, ‘కోయి యహా అహ నాచే నాచే’ హిట్టు మీద హిట్టు. దేశం ఇక డిస్కోలోకి మేల్కొంది. ∙∙ కృష్ణకు ఒక హిట్ ఎలాగైనా ఇవ్వాలని పట్టుదలగా కె.రాఘవేంద్రరావు తీసిన ‘ఊరికి మొనగాడు’ హిట్ కావడం బప్పీ లహిరికి లాభించింది. దానిని కృష్ణ ‘హిమ్మత్వాలా’ పేరుతో హిందీలో తీయాలని అనుకున్నప్పుడు బప్పీ లహిరిని సంగీతానికి ఎంచుకున్నాడు. ‘ఒక పాటలో బోలెడన్ని కుండలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా పాట చేయండి’ అని రాఘవేంద్రరావు అడిగితే ట్యూన్ కట్టేటప్పుడు తన ఎదురుగా ఐదారు తబలాల వరుస పెట్టుకుని ఉండే బప్పీ ఒక ట్యూన్ వినిపించాడు. పాట ఓకే అయ్యింది. షూటింగ్‌కు జితేంద్ర హాజరయ్యాడు. శ్రీదేవితో పాట. నగరాలో పాట విని ‘ఇదేం పాట డైరెక్టరు గారూ... ఇవేం స్టెప్పులు’ అని పైకే అనేశాడు. కాని చేయక తప్పలేదు. ‘హిమ్మత్వాలా’ రిలీజైంది. ఒక్క పాట. ‘నైనోమే సప్నా సప్నోమే సజ్నీ సజ్నీ పే దిల్ హోగయా’... ఎక్కడ చూసినా అదే. ‘హిమ్మత్వాలా’తో పాటు బప్పీ పాటా హిట్ అయ్యాయి. ఇక కె.రాఘవేంద్రరావు, జితేంద్ర, బప్పీ లహిరి ఒక టీమ్ అయ్యారు. తెలుగులో హిట్ అయిన ‘దేవత’ హిందీలో ‘తోఫా’(1984) గా రీమేక్ అయితే ‘తోఫా.. తోఫా.. తోఫా... లాయా లాయా లాయా’ హిట్. ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ సినిమా ‘మవ్వాలి’గా రీమేక్ అయితే ‘ఉయ్యమ్మ.. ఉయ్యమ్మ ముష్కిల్ ఏ క్యా హోగయీ’ మాస్ హిట్. ‘ముందడుగు’ రీమేక్ ‘మక్సద్’, ‘జస్టిస్ చౌదరి’, ‘ఖైదీ’... ఈ సినిమాలన్నింటికీ బప్పీ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇదంతా ముంబై నుంచి హైదరాబాద్‌కు బప్పీ రావడానికి కారణమైంది. ∙∙ కృష్ణ ఏది చేసినా ఘనంగా చేయాలనుకుంటాడు. ‘సింహాసనం’ (1986) రెండు భాషల్లో తీయ తలపెట్టిన భారీ జానపద చిత్రం. తెలుగులో తాను. హిందీలో జితేంద్ర. రెండు భాషల్లో హిట్ పాటలు తప్పవు కనుక బప్పీ లహిరిని రంగంలోకి దించాడు. నిజానికి కృష్ణకు అప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాడటం లేదు. రాజ్ సీతారాంతో సర్దుకోవాలి. కాని ఆ మైనస్‌ను కూడా పట్టించుకోని స్థాయిలో బప్పీ లహిరి భారీ హిట్ పాటలు అందించాడు. ‘ఆకాశంలో ఒక తార’ నేటికీ మోగుతూనే ఉంది. ఆ సినిమాలో ‘ఇది కల అని నేననుకోనా’, ‘గుమ్మా గుమ్మా’, ‘వహవ్వా నీ యవ్వనం’ మాస్‌ను క్యాసెట్లు కొనేలా చేశాయి. ఆ తర్వాత కృష్ణ హీరోగా భారీ ఖర్చుతో తీసిన సాధారణ సినిమా ‘తేనె మనసులు’కు, ‘నసీబ్’ రీమేక్‌గా చేసిన ‘త్రిమూర్తులు’కు పాటలు ఇచ్చాడు. కాని చిరంజీవి– బప్పీ లహిరి కాంబినేషన్లో వచ్చిన ‘స్టేట్‌రౌడీ’ కలెక్షన్లలో అంతగా ఘనంగా లేకపోయినా పాటల్లో ఊపేసింది. ‘చుక్కల పల్లకిలో’, ‘రాధా రాధా మదిలో మన్మధ బాధ’కు తెర మీద కాగితపు ముక్కలు ఎగిరాయి. అయితే బప్పీ లహిరి అసలు సిసలు హిట్ ‘గ్యాంగ్ లీడర్’తో దక్కింది. ఆ సినిమాలో పాటలు చిరంజీవిని మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరకు చేర్చాయి. ‘జీ ఏ ఎన్ జీ గ్యాంగ్ గ్యాంగ్’... ఎంత ఫాస్ట్ బీటో ‘భద్రాచలం కొండ’ అంత పల్లె బీట్తో ఆకట్టుకున్నాయి. ‘వానా వానా వెల్లువాయే’ పాట ‘రచ్చ’ సినిమాలో రీ మిక్స్ అయ్యేంత ఫ్రెష్‌గా నేటికీ ఉంది. ఆ పాటలో చిరంజీవి, విజయశాంతి గుర్తుండిపోయారు జల్లు కురిసే వానలాగా. చిరంజీవికే ‘రౌడీ అల్లుడు’ చేసిన బప్పీ బాలకృష్ణకు ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘నిప్పురవ్వ’ చేశాడు. ∙∙ కె.జె.ఏసుదాస్ ‘చిత్‌చోర్’తో హిందీ దేశానికి తెలిశాడని అనుకుంటాం కాని దానికి ముందే బప్పీ అతని చేత ‘టూటే ఖిలోనే’లో పాడించాడు. శేఖర్ కపూర్ హీరో. షబానా ఆజ్మీ హీరోయిన్. ‘మానాహో తుమ్ బేహద్ హసీన్’ పాట ఇప్పటికీ బాగుంటుంది. ఆ తర్వాత తెలుగులో మోహన్‌బాబు కోసం చేసిన పాటల్లో ఏసుదాస్‌కు మంచి పాటలు ఇచ్చాడు. ‘రౌడీ గారి పెళ్లాం’ ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిల’... ‘బ్రహ్మ’లో ‘ముసి ముసి నవ్వులలోనా’ పాటలు హిట్. ∙∙ బప్పీ లహిరి చాలా ప్రయోగాలు చేశాడు. డిస్కోలో ఇండియన్ మ్యూజిక్ ‘ఫ్యూజన్’ను ఆ రోజుల్లోనే ప్రయత్నించాడు. ‘నమక్ హలాల్’లో 12 నిమిషాల పాట ‘పగ్ ఘంగురూ బాంద్ మీరా నాచెరె’లో డిస్కోను, క్లాసికల్‌ను కలిపాడు. కిశోర్ కుమార్ దగ్గరకు ఈ పాట కోసం వెళితే సహనం తక్కువగా ఉండే ఆయన (ఎంత పెద్ద పాట పాడినా అదే పారితోషికం కనుక) ‘ఇంత పెద్ద పాట నా వల్ల కాదు. ఇలాంటివి రఫీ సాబ్ కదా పాడేది’ అన్నాట్ట. కాని బప్పీ పట్టుబట్టి పాడించాడు. ఆ పాట పెద్ద హిట్ అయ్యింది. మన జయప్రద అమితాబ్‌తో కలిసి నటించిన ‘షరాబీ’, ‘ఆజ్ కా అర్జున్’ సినిమాల్లో పాటలు బప్పీ చేయగా హిట్ అయ్యాయి. ‘షరాబీ’లో ‘దేదే ప్యార్ దే ప్యార్ దే’, ‘ఇంతెఖాల్ హోగయీ ఇంతెజార్కీ’... పాటలు ‘ఆజ్ కా అర్జున్’లో ‘గోరిహి కలాయియా’ పాటలు మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉన్నాయి. ∙∙ 1982 నుంచి 1990 వరకూ దాదాపు ఒక ప్రభంజనంలా బప్పీ కొనసాగాడు. డిస్కో తర్వాత బ్రేక్‌ను తెచ్చాడు. గోవిందా తొలి సినిమా ‘ఇల్జామ్’లో ‘ఐ యామ్ ఏ స్ట్రీట్ డాన్సర్’ పాటతో బ్రేక్ డాన్స్ పాటలు ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ ట్రెండ్ కొంతకాలం సౌత్‌లో కూడా కొనసాగింది. చివరకు ఆనంద్– మిలింద్, నదీమ్ – శ్రావణ్ వచ్చే వరకూ అతనికి ఎదురు లేకపోయింది. ∙∙ బప్పీ లహిరి మాస్ మ్యూజిక్ డైరెక్టర్. అలా ఉండటానికే అతడు ఇష్టపడ్డాడు. బాలీవుడ్ కూడా అలాగే అతణ్ణి ఉంచింది. పెద్ద పెద్ద సినిమాలు, సీరియస్ కథాంశాలు అతని దాకా రాలేదు. క్లాసిక్స్ అంటూ చెప్పుకోవడానికి అతనికి ఏమీ లేవు. కాని అతడు మంచి పాటలు చేయగలడు. ‘ప్యార్ మే కభీ కభీ ఐసాహి హోతాహై’ (చల్తే చల్తే), ‘కిసీ నజర్ కో తేరా ఇంతెజార్ ఆజ్ భీ హై’ (ఐత్బార్), ‘జిద్ నా కరో అబ్ తో రుకో ఏ రాత్ నహీ ఆయేగీ’ (లహూ కే దో రంగ్) వంటి మంచి మెలోడీలు చేశాడు. బప్పీని సంగీత పండితులు నిరాకరించినా అన్ని పాటల్లో అతను తబలాను వాడే పద్ధతిని విశేషంగా మెచ్చుకుంటారు. అతడికి తబలా అంటే ఇష్టం కనుక ఎంతటి బీట్ ఆధారిత పాటలో కూడా తబలాను చాలా ప్రతిభావంతంగా ఇముడ్చుతాడు. బప్పీ లహిరిని 1980ల మాస్ పాటలకు ఐకాన్‌గా భావిస్తారు. అందుకే ‘డర్టీ పిక్చర్’ను తీసేప్పుడు ఆ కాలం మాస్ పాటకు సంకేతంగా బప్పీ స్టయిల్లో ‘ఊలాల ఊలాల’ పాట చేయించి అతని చేతే పాడించారు. బప్పీ, అలీషా చినాయ్, షరోన్ ప్రభాకర్ లాంటి గాయనులను సినిమాల్లోకి తెచ్చాడు. అతడు వెలుగుతున్నప్పుడు నిర్మాత దర్శకులే కాదు గాయనీ గాయకులు కూడా అతని ఇంటి ముందు పడిగాపులు కాసేవారు. చివరి రోజుల్లో అతడు తనకు కనీసం ‘పద్మశ్రీ’ వస్తే బాగుండు అనుకున్నాడు. రాలేదు. ఒక కాలపు మాస్ ప్రేక్షకులు తనకు తెర మీద చిల్లర నాణేలు విరజిమ్ముతూ చేసిన సత్కారమే చాలనుకున్నాడు. అతను చేసిన మంచి పాటతోనే అతనికి వీడ్కోలు చెప్పవచ్చు. చల్తే చల్తే మేరే ఏ గీత్ యాత్ రఖ్నా కభి అల్విదా నా కెహెనా కభి అల్విదా నా కెహెనా... మైక్ టైసన్ ‘జింగిల్’ ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ 2018లో ఎమ్ఎమ్ఏ టోర్నమెంట్లో పాల్గొనేందుకు భారత్ వచ్చినప్పుడు ఆయన్ను స్వాగతిస్తూ జింగిల్ పాటను బప్పీ పాడాడు. ‘ఓమ్ స్వాగతమ్..’ అని ప్రారంభమయ్యే ఈపాట మైక్ టైసన్ ను కొనియాడుతూనే బప్పీ మార్క్‌ను చూపింది. బప్పీ... ది గోల్డ్ మ్యాన్ ‘నడిచే నగల దుకాణం’... బప్పీ లహిరి గురించి చాలామంది సరదాగా అనుకునే మాట ఇది. ఇక అందరూ ఆయన్ను ‘గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. ఎందుకంటే మెడలో కొబ్బరి తాడుని తలపించే బంగారు గొలుసులు, వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, చేతులకు కడియాలు, మణికట్టు గొలుసులు... ఇలా బప్పీ ఒంటిపై బంగారం మెరిసేది. నలుగురిలో తాను ప్రత్యేకంగా కనిపించాలన్నది ఆయన ఆకాంక్ష. అలాగే బంగారాన్ని అదృష్టంగా భావించి ఎప్పుడూ కనీసం ఎనిమిది చెయిన్ లను మెడలో వేసుకునేవారు. 1974లో బప్పీవాళ్ల అమ్మగారు తొలి బంగారపు గొలుసు ఇచ్చారు. తొలిసారి వేసుకున్న ఈ గొలుసు పేరు ‘ఏ హరే కృష్ణ చెయిన్ ’. తర్వాత భార్య చిత్రాణి 1977లో బంగారపు గొలుసు ఇచ్చారు. ఈ రెండింటికి తోడు మరికొన్ని బంగారపు గొలుసులు వేసుకుంటూ గోల్డ్ మ్యాన్, బ్లింగ్ మ్యాన్‌గా ప్రఖ్యాతిగాంచారు. అలాగే వినూత్న వస్త్రధారణ, ప్రత్యేకమైన సన్ గ్లాసెస్ ధరించేవారు బప్పీ. ఏదైనా సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లాలంటే ముందు రోజే ఏ డ్రెస్ వేసుకోవాలి? ఏ గ్లాసెస్ పెట్టుకోవాలి? ఏ ఆభరణాలు ధరించాలి? అనేది ప్లాన్ చేసేసుకునేవారట. విశేషం ఏంటంటే... వెరైటీ డ్రెస్సింగ్ మీద భర్తకి ఉన్న ఆసక్తి గమనించి, భార్య చిత్రాణి లహిరి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని, సలహాలు ఇచ్చేవారట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బప్పీయే స్వయంగా చెప్పారు కూడా. కలసి రాని రాజకీయాలు 2014లో బీజేపీ తరపున లోక్‌సభకు పోటీ చేసే సమయంలో ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు ప్రస్తావిస్తూ, తనకు 754 గ్రాములు, భార్యకు 967 గ్రాముల బంగారం ఉందని, ఇద్దరిదీ కలిపి 13.5 కిలోల వెండి, కొన్ని విలువైన వజ్రాలున్నాయనీ బప్పీ పేర్కొన్నారు. అయితే సంగీత ప్రపంచంలో హిట్ రాగాలిచ్చిన బప్పీకి రాజకీయ జీవితం మాత్రం ఫ్లాప్ రాగం అనాలి. ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. – కె -
సంగీత సరస్వతి... స్వర సామ్రాజ్ఞి
సరస్వతీ దేవిని ఆరాధించే ‘వసంత పంచమి’ ఘడియల్లో సప్త స్వరాలు మూగబోయాయి. లతా మంగేష్కర్తో పాటు సాక్షాత్ సరస్వతీ స్వరూపం మరో లోకానికి మరలిపోయింది. దేశ సంస్కృతి, చరిత్రల్లో లతాజీ ఒక అంతర్భాగం. అఖండ భారత దేశంలో తన గాన యాత్ర ప్రారంభించి, ఏకంగా 7 దశాబ్దాల పాటు అవిరామంగా ఆ యాత్రను సాగించిన సాంస్కృతిక సమున్నత చిహ్నం ఆమె. మరాఠీ నాటక రంగంలో గాయక– నటుడు దీనా నాథ్ ఐదుగురి సంతానంలో ప్రథమ సంతానం లత. తండ్రి ఆకస్మిక మరణంతో 13వ ఏట తన ముగ్గురు సోదరీమణులు, సోదరుడు హృదయనాథ్ల పోషణ, కుటుంబభారాన్ని ఆమె తనపై వేసుకున్నారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తోబుట్టువులంతా సంగీత రంగంలోనే రాణించడం విశేషమే. లత తన తండ్రి స్నేహితుడు, నటి నందా తండ్రి అయిన మాస్టర్ వినాయక్ (సంగీత దర్శ కుడు, దర్శకుడు) మార్గదర్శనంలో మరాఠీ సినిమాలలో నటించారు. పాటలు పాడడం మొదలు పెట్టారు. అప్పట్లో నూర్జహాన్, షంషాద్ బేగమ్‌ల తారస్థాయిలో పాడే విధానంతో పోలిస్తే, లత గొంతు కొంత పీలగా ఉందని సంగీత దర్శకులు నిరుత్సాహపరిచిన సందర్భాలున్నాయి. క్రమంగా జోహ్రాబాయి, అమీర్బాయి కర్నాటకీ, షంషాద్, సురయ్యాల మధ్య... సంగీత దర్శకుడు గులామ్ హైదర్ ప్రోద్బలం, ప్రోత్సాహంతో లత పాటలు పాడారు. సంగీత దర్శకులు అనిల్ బిశ్వాస్, నౌషాద్, హుస్న్‌లాల్ – భగత్రామ్ ద్వయం కూడా లతా మంగేష్కర్ ప్రతిభను గుర్తించి, పాడించారు. 1949లో బాంబే టాకీస్ నిర్మాణం ‘మహల్’లో పాట ‘ఆయేగా ఆయేగా’ పాట దేశమంతటా మారు మోగింది. అప్పట్లో సిలోన్ రేడియోలో ప్రతి రోజూ హిందీ సర్వీస్‌లో ఈ పాట ప్రసారం చేయమంటూ వేలల్లో ఉత్తరాలు వస్తుండేవట! ఆ ఉత్తరాల్లో గాయకురాలి పేరు కనుక్కోవడానికి వచ్చినవే ఎక్కువ. ఎందుకంటే, అప్పట్లో గ్రామ్‌ఫోన్ రికార్డులలో సినిమాలోని పాత్రధారి పేరే ఉండేది. (చదవండి: వంద వసంతాల హేతువాది) ఆ తరువాత రాజ్‌కపూర్ సొంత నిర్మాణంలో వచ్చిన ‘బర్సాత్’ చిత్రగీతాలతో దేశమంతా లతా ప్రభంజనం మొదలైంది. నాయికలు తమకు లతానే ప్లేబ్యాక్ పాడాలనే షరతు కాంట్రాక్ట్‌లో పెట్టడం వరకూ వెళ్లింది. సంగీత దర్శకులందరూ లత రికా ర్డింగ్ కోసం వేచి చూడడం, ట్రాక్ సింగర్లతో రికార్డ్ చేసి, పాట షూట్ చేసి, ఆ తర్వాత లతాజీతో ఒరిజినల్ వెర్షన్ పాడించిన సందర్భాలు కోకొల్లలు. మాతృభాష మరాఠీపై అభిమానంతో, ‘ఆనంద్ ఘన్’ అనే మారుపేరుతో సంగీత దర్శకత్వంతో పాటు కొన్ని సినిమాలను స్వయంగా నిర్మించి, తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారామె. అది జోల పాట కానీ, భజన గీతం కానీ, విషాద గీతం కానీ, ప్రబోధ గీతం కానీ లత ఏర్పరిచిన ప్రమాణాలను వేరెవ్వరూ అందుకోలేనంతగా అన్ని భారతీయ భాషలలో పాడారు. అనిల్ బిశ్వాస్ చొరవతో శ్వాసను ఎక్కువ సేపు నిలిపేలా చేసిన సాధనతో ఆమె సాధించిన విజయాలెన్నో! భారత్–చైనా యుద్ధానంతరం ఆమె పాడిన ‘ఆయ్ మేరే వతన్ కే లోగో’ పాట దేశ ప్రధాని నెహ్రూతో పాటు యావత్ దేశాన్ని కన్నీరు పెట్టించింది. ఒక జాతీయ గీతం అంతటి స్థాయిని సాధించింది. ఈ పాటను కానీ, ‘ఆనంద్ మఠ్’లోని వందేమాతరం కానీ వినని భారతీయుడు ఉండడు! ప్రముఖ హిందుస్తానీ విద్వాంసుడు ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ ఒకానొక సందర్భంలో ‘అసలీవిడ అపశ్రుతిలో పాడదా?’ అంటూ ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఆమెకు ‘ఉస్తాదోంకా ఉస్తాద్’గా కితాబిచ్చారు. ఫిలింఫేర్ అవార్డులు, అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పుర స్కారం, జాతీయ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో పాటు దాదాపు అన్ని సంగీత, సాంస్కృతిక అవార్డులకూ లత ఓ చిరునామా. (చదవండి: ఆదర్శ జీవితానికి కొలమానం) క్రికెట్ అంటే లతాజీకి వీరాభిమానం. అందుకే, 1983లో ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు నజరానాలు అందించడానికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వద్ద నిధులు లేకపోవడంతో తనే పూను కొని, ఒక సంగీత విభావరి నిర్వహించారు. రూ. 20 లక్షలకు పైగా సేకరించడమే కాక, ఎల్పీ రికార్డును విడుదల చేసి, రాయల్టీ కూడా బీసీసీఐకి అందించిన ఔదార్యం లతాజీది. తరాలు మారినా 7 దశాబ్దాల పాటు అన్ని ట్రెండ్లలో తన ఉనికి చాటుకున్నారు. రోషన్–రాజేష్ రోషన్, చిత్రగుప్త– ఆనంద్ మిళింద్, ఎస్డీ బర్మన్ – ఆర్డీ బర్మన్ల తరాలను దాటి నేటి ఏఆర్ రెహమాన్ వరకూ స్వరాన్ని అందించారు. ‘ఆన్’, ‘ఉడన్ ఖటోలా’ చిత్రాలు తమిళంలో డబ్ అయినప్పుడు ఆ చిత్రంలోని పాటలన్నీ లతానే పాడారు. ఇక, తెలుగులో ‘సంతానం’ చిత్రంలోని అనిసెట్టి రచన ‘నిదురపోరా తమ్ముడా’, ‘ఆఖరి పోరాటం’లో ‘తెల్లచీరకు...’ పాటలు పాడారు. దర్శ కుడు వంశీ ‘గాలికొండాపురం రైల్వేగేటు’ నవలను సినిమాగా తీయాలనుకున్నప్పుడు, ఇళయరాజా సంగీతంలో లతాజీతో పాట రికార్డింగ్ చేయిం చారు. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవ డంతో అందులోని ఆమె పాట వినే అదృష్టం తెలుగు అభిమానులు కోల్పోయారు. ఆమె తన 80వ ఏట అన్నమాచార్య కీర్తనలను టీటీడీ కోసం ఆలపించి, పారితోషికం స్వామికే సమర్పించడం విశేషం. హిందీ, బెంగాలీ, మరాఠీ, ప్రైవేట్ భజన్స్ ఏవైనా లతాజీ పాటల్లో అత్యుత్తమమైనవి ఎంపిక చేయడ మంటే సంద్రాన్ని దోసిట పట్టాలనుకోవడమే!‘నాకు ఒక హార్మోనియం, లతాని ఇవ్వండి. సంగీతం కంపోజ్ చేసిచ్చేస్తా’ అన్నది ఎస్డీ బర్మన్ మాట. నటి నర్గీస్ – ‘లతాజీ పాడిన విషాద గీతం అభినయించా లంటే గ్లిజరిన్ అవసరం రాలేదు. లతాజీ గొంతులో పలికే ఆ భావమే నాకు అప్రయత్నంగా కన్నీళ్ళు తెప్పించేది’. చలనచిత్ర సంగీతంలో లతాజీ ముద్ర చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు కొల్లలు. కవి జావేద్ అఖ్తర్ అన్నట్లు ‘ఈ భూగ్రహానికి ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, ఒకటే లతా!’ – రవి పాడి, రైల్వే ఉన్నతాధికారి అరుదైన గ్రామ్‌ఫోన్ రికార్డుల సేకర్త -
కేంద్ర పథకాలకు మార్గదర్శి
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గొప్ప మేధావి, కార్యశీలి, రాజనీతిజ్ఞుడు, నిస్వార్థ సేవకుడు. దీనదయాళ్ ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం ఉత్తరప్రదేశ్ ఆర్ఎస్ఎస్ శాఖలో చేరారు, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రేరణతో 1951లో రాజకీయ క్షేత్రం భారతీయ జనసంఘ్‌లో ప్రచారకులుగా చేరారు. ఆ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణలో క్రియాశీలక పాత్ర పోషించారు. అఖిలభారత అధ్యక్షులుగా పట్నాకు రైలులో ప్రయాణిస్తున్న దీన దయాళ్ ఉపాధ్యాయ 1968 ఫిబ్రవరి 11న మొఘల్ సరాయ్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం వద్ద శవమై పడి ఉన్నారు. ఆయన మరణం గురించి ఇప్పటివరకు అసలు నిజాలు వెలుగులోకి రాలేదు. దీనదయాళ్ అందించిన ఏకాత్మ మానవ దర్శనం (ఇంటిగ్రల్ హ్యూమనిజం) అనే గొప్ప తాత్విక సిద్ధాంతాన్ని బీజేపీ తన రాజకీయ తాత్విక సిద్ధాంతంగా పేర్కొంటుంది. దీన దయాళ్ తన ఏకాత్మ మానవ దర్శనంలో ఈ దేశం అభివృద్ధికి చేపట్టే ప్రణాళిక ఏదైనా... అది దేశానుగుణం, కాలానుగుణమై ఉండాలని చెప్పారు. రాజకీయ, ఆర్థిక రంగాలలో వికేంద్రీ కరణను; ప్రభుత్వ రంగంతో పాటు ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగం ప్రాధాన్యం కూడా గుర్తించాలనీ, దేశంలో ప్రతి వ్యక్తీ ఉపాధి పొందాలనీ, తద్వారా ఉత్పత్తికి దోహదపడాలనీ వారు కోరుకున్నారు. భారీ పరిశ్రమలు వద్దన్నారు. కుటీర పరిశ్రమలే కావాలన్నారు. లోటు బడ్జెట్, ద్రవ్యోల్బణాలకు ప్రభుత్వం చేసే అధిక ఖర్చు కారణమని చెప్పి... పొదు పును ప్రోత్సహించారు. ఆర్థిక అవసరాల కోసం ప్రకృతిని నాశనం చేయకూడదనీ, ఆర్థిక ఫలాలు అందరికీ అందజేయాలనీ అన్నారు. (చదవండి: శతవసంత స్వరమాధురి) ఈ సిద్ధాంతం ఆధారంగానే... దీన దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన, ప్రధాని ఆవాస్ యోజన, గ్రామ జ్యోతి యోజన, కౌశల్ యోజన, ప్రధాన మంత్రి సడక్ యోజన, బేటీ బచావో బేటీ పఢావో, ఆత్మనిర్బర్ భారత్ వంటి అనేక పథకాలతో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ వంటి నినాదాలతో అందరికీ తను నిర్దేశించిన లక్ష్యాల ఫలాలు అందించాలని భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. దీనదయాళ్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి! – శ్రీశైలం వీరమల్ల, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు (ఫిబ్రవరి 11న దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి) -
ఆదర్శ జీవితానికి కొలమానం
సుప్రసిద్ధ ఫొటో జర్నలిస్టుగా, ప్రజల జీవనాన్ని, వారి సంస్కృతిని జీవితాంతం తన కెమెరాకన్నులో బంధించి పేద ప్రజల బతుకు చిత్రాన్ని అక్షర సత్యంగా నాలుగు దశాబ్దాలకు పైగా అందిస్తూ వచ్చిన ప్రజా కళాకారుడు భరత్ భూషణ్. ఆయన నిజ జీవితంలో కూడా తిరుగులేని ఒక ఆదర్శ శిఖరం! భరత్ దశాబ్దాలుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ కూడా తన కెమెరా కన్నుకు క్షణం విశ్రాంతి నివ్వలేదు. విద్యావంతురాలైన పేదింటి మహిళా రత్నం సుభద్రను ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత రెండు కుటుంబాలకు కనపడకుండా నెలల తరబడి కాదు, కొన్నేళ్లపాటు అజ్ఞాత జీవితాన్ని కూడా గడుపుతూ ఆమె జీవితాన్ని తీర్చిదిద్దాడు. ఈ జంటను కాపాడుకుంటూ వారి ఆదర్శానికి ఒక దిక్సూచిగా నిలబడవలసిన ధర్మం నాకూ, నా భార్య సుధారాణిపైన పడింది. అలా వారి అజ్ఞాత దాంపత్యం కొత్త చిగుళ్లు తొడిగింది. కలవారి కుటుంబంలో పుట్టిన భరత్, పేద కుటుంబంలో పుట్టిన విద్యావంతురాలైన సుభద్రను చేసుకోవడంతో ఎదురైన కొత్త కష్టాలను ధైర్యంతో, మనో నిబ్బరంతో ఎదు ర్కొంటూ వచ్చాడు. ‘ఉదయం’ దినపత్రిక ద్వారా (1984–86) మొదలైన మా స్నేహం వయోభేదంతో నిమిత్తం లేకుండా, ప్రాంతా లతో సంబంధం లేకుండా ఎదుగుతూ వచ్చింది. అందు వల్ల భరత్ భౌతికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన తెలంగాణకు చెందినా, ఏ కోశానా ప్రాంతాల స్పృహ లేకుండా తెలుగువాళ్లుగా స్నేహ బాంధవ్యం పెరిగి బలపడుతూ వచ్చింది. ఈ బంధం, ఆత్మీయతల అనుబంధంగా పెరుగుతూ వచ్చింది కనుకనే హైదరాబాద్ లోని మా ఇల్లు భూషణ్ దంపతుల సొంతిల్లుగానే మారిపోయింది. ఈ చరిత్ర మన జర్నలిస్టు మిత్రులలో చాలా కొద్దిమందికే తెలుసు. మొన్న భరత్ పేద ప్రజా జీవితాలకు అంకితమైన ఫొటో జర్నలిస్టుగా కన్నుమూసే వరకూ మా కుటుంబాల ఆత్మీయతలు ఎక్కువ మందికి తెలియవు. మొన్నమొన్న భరత్ కన్నుమూసే వరకు, చివరి క్షణాల వరకూ భరత్, సుభద్రలు, వారి కుమార్తె అనుప్రియ, కొడుకు అభినవ్ నాతో భరత్ ఆరోగ్య విషయాల గురించి చెబుతూనే ఉన్నారు. వృద్ధాప్యం వల్ల నేను ఎక్కువసార్లు భరత్ ఇంటికి వెళ్లి ఇంతకు ముందులా అతడిని పరామర్శిస్తూ ముచ్చటలాడటం కుదరలేదు. అందువల్ల కేవలం ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఉండేవాడిని. తను ఏ చిన్న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్నా విధిగా నాకు ఫోన్ చేస్తూ మీరు కూడా వస్తే ‘నాకు దండి’గా ఉంటుందని చెప్పేవాడు. కానీ నా ఆరోగ్య పరిస్థితి, వృద్ధాప్య దశవల్ల నేను వాటిలో కొన్నింటికీ వెళ్లేవాడిని కాదు. ఐనా విధిగా సమాచారం మాత్రం భరత్ అందిస్తూనే ఉండేవాడు. అరుదైన ప్రజల, పేదసాదల ఫొటో జర్నలిస్టుగా, కళాకారుల్లో అరుదైన సమాజ స్పృహ తీవరించి ఉన్న వ్యక్తిగా భరత్‌ను నేను పరిగణిస్తాను. అంతేగాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తరువాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా తెలంగాణ వాసి అయిన భరత్‌కు తెలిసినంత లోతుగా తెలంగాణ సంస్కృతీ వైభవానికి చెందిన అనంతమైన పార్వ్శాలు మిగతా తెలంగాణ కళాకారులకు తెలియ వంటే ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజా జీవితానికి చెందిన అనేక కోణాలను, చివరికి ఇళ్ల తలుపు చెక్కల సొగసుల్ని, వంటింటి సామాన్ల తీరు తెన్నుల్ని అక్షరబద్ధమూ, చిత్రాక్షర బద్దమూ చేసి చూపరుల్ని ఆశ్చర్యచకితులను చేశాడు భరత్. (క్లిక్: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!) అందుకే ఏ తెలంగాణ చిత్రకారునికన్నా, ఫొటో జర్నలిస్టుకన్నా లోతైన అవగాహనతో భరత్ తెలంగాణ ప్రజా జీవన చిత్రాలను ప్రాణావశిష్టంగా మలిచారని చెబితే అతిశయోక్తి కాదు. భరత్ కుంచెలోనూ, కలం లోనూ విలక్షణమైన ఈ శక్తియుక్తులను పెంచి పోషించింది అభ్యుదయ భావ సంప్రదాయాలేనని మనం గుర్తించాలి. సబ్బు ముక్క, తలుపు చెక్క కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే తెలంగాణ పల్లెపట్టుల్లో తలుపు చెక్కల సౌందర్యాన్ని ఫొటో జర్నలిజం ద్వారా చిత్రబద్ధం చేశాడు భరత్. మహాకవి కాళోజి అన్నట్లు ‘‘చావు నీది, పుట్టుక నీది/ బతుకంతా దేశానిది’’. ఈ సత్యాన్ని ఎన్నటికీ మరవకండి! అందులోనే నిజం ఉంది, నిజాయితీ ఉంది!! (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
శతవసంత స్వరమాధురి
ఇరవయ్యో శతాబ్దంలో భారతీయ సంగీత సామ్రాజ్యంలో ‘భీమ్ సేన్ గురురాజ్ జోషీ’ది అగ్రగణ్య స్థానమని చెప్పాలి. హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో మేరునగ ధీరునిగా పేరుగాంచిన ఆయన 1922 ఫిబ్రవరి 4న కర్ణాటక రాష్ట్రం, గదగ్ జిల్లాలోని రాన్ ప్రాంతంలో జన్మించారు. ‘పండిట్ భీమ్ సేన్ జోషీ’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆయన తన చిన్నతనంలో పదకొండవ ఏటనే అబ్దుల్ కరీంఖాన్ గానం విని తన్మయుడై ఆయన స్వరానికి ఉత్తేజం చెంది తానూ సంగీతం నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును వెతుక్కొంటూ ఇల్లు వదలి గ్వాలియర్ చేరుకొని ఓ సంగీత పాఠశాలలో చేరి, ఆ తరువాత మంచి గురువు కోసం అనేక చోట్ల తిరిగి తిరిగి చివరకి 1936లో ‘సవాయిగంధర్వ’ వారి వద్ద శిష్యునిగా చేరారు. ఇక అప్పటి నుండి 24 జనవరి 2011న తన 88వ ఏట ఈలోకం వీడి వెళ్లేంత వరకు తన గంధర్వ గానంతో ‘హిందుస్తానీ సంగీతాన్ని’ అజరామరం చేస్తూనే ఉన్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, మహారాష్ట్ర భూషణ్, కర్ణాటకరత్న లాంటి గౌరవ పురస్కారాలతో పాటు... భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ కూడా పండిట్ భీమ్ సేన్ జోషీని వరించింది. (సకిన రామచంద్రయ్య: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) హిందుస్తానీ శాస్త్రీయ సంగీత ఆలాపనలే కాక ఆయన కన్నడ భజనలు, మరాఠీ అభంగులు, ‘బసంత్ బహార్, తాన్ సేన్’ లాంటి చలన చిత్రాల్లో పాటలు తనకు తానే సాటి అన్నట్టుగా గానం చేశారు. భీమ్ సేన్ జోషీ కర్నాటకకు చెందిన పురందర దాసు కృతులు కూడా ఆలపించటం విశేషం. కర్ణాటక సంగీతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మంగళంపల్లి బాలమురళీకృష్ణతో ఆయన కలిసి చేసిన ‘జుగల్ బందీ’ కచేరీలు సంగీతాభిమానులకు మరచిపోలేని అనుభూతులు. కర్ణాటక సంగీతంలో ‘సంగీత సామ్రాజ్ఞి’ ‘భారతరత్న’ అవార్డు గ్రహీత ఎమ్మెస్ సుబ్బులక్ష్మితో కలసి కూడా భీమ్ సేన్ జోషీ సంగీత కచ్చేరీలు చేశారు. ‘కిరానా ఘరానా’ స్వరశైలిలో ప్రఖ్యాతి గాంచిన భీమ్ సేన్ జోషీ హిందూస్తానీ సంగీతంలో ఓ ధ్రువ తారలా వెలిగారు. శుద్ధ కళ్యాణ్, పురియా కళ్యాణ్, పురియా, ముత్ లానీ, మారు బిహాగ్, తోడి లాంటి హిందుస్తానీ రాగాల్లో ఆయన సంగీత రసజ్ఞత ఆపూర్వం. ‘మిలేసుర్ మేరా తుమ్హారా’, అంటూ 1980 దశకంలో దూరదర్శన్ వీడియో కోసం ఆయన పాడిన పాట వినని వారుండరు. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) సంగీతం సార్వత్రికమైనది. దానికి భాషా భేదాలు లేవు. అందునా భారతీయ సంగీతం వేదకాలం నుండి ప్రఖ్యాతమైంది. అటువంటి భారతీయ సంగీత సౌరభాన్ని ఈ ప్రపంచానికి పంచిపెట్టిన మహా విద్వాంసుడు ‘భారతరత్న పండిట్ భీమ్ సేన్ జోషీ’ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరోసారి ఆ మహనీయునికి శ్రద్ధాంజలి. – డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ జర్నలిస్టు (ఫిబ్రవరి 4న పండిట్ భీమ్సేన్ జోషీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా) -
భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారన్నారు. ఆమె మృతి భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశానికి లతా మంగేష్కర్ ద్వారా గంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని అన్నారు. లతాజీ మరణంతో పాట మూగబోయిందని, సంగీత మహల్ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ‘20 భాషల్లో 1,000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతాజీ.. సరస్వతీ స్వర నిధి. ఆమె పాటల మహల్. వెండితెర మీది నటి హావభావాలకు అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్లు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్యగాయని. పాటంటే లతాజీ .. లతాజీ అంటేనే పాట. సప్త స్వరాల తరంగ నాదాలతో శ్రోతలను తన్మయత్వంలో వోలలాడించిన లతా మంగేష్కర్, ఉత్తర దక్షిణాదికి సంగీత సరిగమల వారధి. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన పురస్కారాలకు లతాజీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు కానీ లతాజీ లేని లోటు పూరించలేనిది’అని సీఎం స్మరించుకున్నారు. లతా మంగేష్కర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన దివ్యగాత్రంతో ఆమె శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశారని ఆదివారం ఒక ప్రకటనలో ఆమె కొనియాడారు. లత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సినీరంగానికి తీరని లోటు: కేటీఆర్ లతా మంగేష్కర్ మరణంపట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలపాటు ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించిన లతా మంగేష్కర్ మరణం తీరని లోటని ఆయన అన్నారు. కాగా, లతా మంగేష్కర్ మరణంపట్ల రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, వి. శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ అర్వింద్ కుమార్ తదిత రులు సంతాపం వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ మరణం దేశ సంగీత లోకానికి తీరని లోటని, సంగీత ప్రియుల గుండెల్లో ఆమె చిరస్థాయిలో నిలిచిపోతారని వేర్వేరు ప్రకటనల్లో వారంతా కొనియాడారు. లత మరణం దేశ ప్రజలందరినీ కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
తన ఆరాధ్య గాయనికి కన్నీటి నివాళులర్పించిన క్రికెట్ గాడ్
Sachin Tendulkar Pays Tribute To Lata Mangeshkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సతీసమేతంగా.. తన ఆరాధ్య గాయని లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని దర్శించుకుని కన్నీటి నివాళులర్పించాడు. ముంబైలోని శివాజీ పార్క్‌లో లతా మంగేష్కర్ అంతిమ సంస్కారాల సమయంలో సచిన్ కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం ట్విటర్ వేదికగా సచిన్ తన సంతాప సందేశాన్ని షేర్ చేశాడు. I consider myself fortunate to have been a part of Lata Didi’s life. She always showered me with her love and blessings. With her passing away, a part of me feels lost too. She’ll always continue to live in our hearts through her music. pic.twitter.com/v5SK7q23hs — Sachin Tendulkar (@sachin_rt) February 6, 2022 "లతా ఆయీ (మరాఠీలో అమ్మ అని అర్థం) జీవితంలో నాకు కొంత భాగం దక్కినందుకు గర్వపడుతున్నా. ఆమె ఎల్లప్పుడూ నాపై అమితమైన ప్రేమ చూపించేవారు. ఆమె మరణం నాకు తీరని లోటు. ఆమె తన గాత్రంతో ఎల్లప్పుడూ మన హృదయాల్లో బతికే ఉంటుంది" అంటూ సచిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా, సచిన్‌కు లతా మంగేష్కర్తో ఆత్మీయ అనుబంధం ఉంది. ఆయన తరుచూ ఆమెను కలిసి యోగక్షేమాలు తెలుసుకునేవాడు. లతాజీని సచిన్ ప్రేమగా ‘ఆయీ’ అని పిలిచేవాడు. ఇదిలా ఉంటే, గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్(92) ఇవాళ ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం శివాజీ పార్క్‌లో జరిగిన ఆమె అంత్యక్రియలకు ప్రధాని మోదీ సహా పలు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చదవండి: IND VS WI 1st ODI: కోహ్లినా మజాకా.. పంత్‌ను కాదని మాజీ కెప్టెన్ సలహా కోరిన హిట్‌మ్యాన్ -
నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!
భరత్ భూషణ్ (బి.బి)... ఆ పేరు చెప్పగానే ముఖం మీద ఓ చిన్న నవ్వు, మెడల వరకూ పొడవాటి జుట్టు, భుజానికి కెమెరా గుర్తు కొస్తాయి. కానీ, ఆ చిరునవ్వు వెనుక ఎన్నో ఒడుదొడుకులు, కష్టాలు, కన్నీళ్ళు. వాటన్నిటినీ దిగమింగుకొని పైకి మాత్రం అదే నవ్వుతో పలకరిస్తూ ఉండే వాడు. క్యాన్సర్ ఆపరేషన్ అయ్యాక తన మెడ మీద మచ్చ ఏర్పడింది. ఆ మచ్చ, క్యాన్సర్ తాలూకు బాధ ఎవరికీ కనపడకుండా దాచాలని తను జుట్టు పొడుగ్గా పెంచాడు. భూషణ్ స్వతహాగా మిత భాషి. జర్నలిస్టు, ఫోటో గ్రాఫర్ సహచరులు ఏ అసైన్ మెంట్లో కనపడినా, ‘ఎలా ఉన్నావు మిత్రమా’ అన్న పిలుపు, పలకరింపు. ‘ఏం కొత్త కెమేరాలు కొన్నారు’ అనే స్టాండర్డ్ ప్రశ్న. అలా 1984లో ‘ఉదయం’ రోజుల నుంచి పరిచయం. భూషణ్ ఎక్కువగా వామపక్ష (సీపీఐ, సీపీఎం, ఎంఎల్) ప్రోగ్రామ్స్ కవర్ చేసేవారు. అవి జరిగే ముఖ్దూమ్ భవన్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లాంటి చోట్ల కెమేరాతో ప్రత్యక్ష మయ్యేవాడు. అప్పట్లో పేపర్లలో ఎవరైనా మావోయిస్టుల ఫొటోలు కావాలన్నా, సీపీఐ, సీపీఎం లీడర్ల క్లోజప్ ఫొటోలు కావాలన్నా తననే అడిగేవాళ్లం. ఆ ఫొటోలకు తను ఫేమస్. ఫొటోలలో ఎవరు ఏది అడిగినా ప్రింట్ చేసి, ఇచ్చేవాడు. కాల క్రమేణా ఫొటో ప్రింట్స్, డిజిటల్‌గా మార డంతో కొంత ఇబ్బంది పడ్డాడు. ఫొటోగ్రాఫర్ వృత్తిని కొన్ని రోజులు పక్కనపెట్టి కార్టూన్స్, పెయింటింగ్స్ సాన బెట్టాడు. అప్పుడప్పుడు పిలిచి మరీ చూపించేవాడు. ఆ సమయంలోనూ ఫొటో గ్రాఫర్లకు గుర్తింపు లేదని బాధపడేవాడు. (చదవండి: నాన్న చూపిన ఉద్యమ పథం...) అనారోగ్యం, ఆర్థిక కష్టాలు, కుటుంబ బాధ్యతలు మానసికంగా కుంగదీశాయి. అయినా ఎక్కడా బాధపడేవాడు కాదు. ఎప్పుడూ తెలంగాణ గురించి, సంస్కృతి గురించి మాట్లాడేవాడు. అప్పుడే ప్రత్యేక తెలంగాణ గురించి తన ఆలోచనకు పదును పెట్టాడని చెప్పవచ్చు. ‘రంగుల కల’ లాంటి కొన్ని ఆర్ట్ సినిమాలకూ పనిచేశాడు. కొత్త రాష్ట్రం వచ్చాక బతుకమ్మ, తెలంగాణ సంస్కృతిపై ఎగ్జిబిషన్ పెట్టడం అతనికి సంతోషాన్నిచ్చింది. తనకు బ్లూ కలర్ ఇష్టం. వేసుకొనే టీ షర్ట్లు, రాసుకొనే పెన్ను, ఆఖరికి తను వాడే వస్తువులు, ఇంట్లో కూడా అంతా ‘బ్లూ’ కలరే. ఆయన తీసిన ఫొటోలలో బ్లాక్ అండ్ వైట్, బ్లూ, రెడ్, గ్రీన్, ఆరెంజ్ రంగులు కనపడేవి. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) గజ్జెల మల్లారెడ్డి, ఏబీకే ప్రసాద్, వి. మురళి, కె. శ్రీనివాస్ లాంటి ఎడిటర్లందరికీ ఇష్టమైన ఫొటో జర్నలిస్టుల్లో బి.బి. ఒకడు. ఇటీవల క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టినప్పుడు ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ వ్యక్తిగతంగా సాయపడింది. ప్రెస్ అకాడమీతో ప్రస్తుత తెలంగాణ సర్కార్ ఆర్థికంగా సాయపడింది. అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా అసోసియేషన్ మీటింగంటే, ఓపిక చేసుకొని, తోటి ఫొటోగ్రాఫర్ల బండి మీద వచ్చి, వెళ్ళేవాడు. అందరితో కలవడం అతని కెమేరాకి కొత్త రీఛార్జ్. రోజుకో ఉద్యోగం మారే రోజుల్లో దశాబ్దాల తరబడి నమ్ము కున్న వృత్తిలోనే నిబద్ధతతో పని చేసినవాడు... పని తప్ప బతకడం తెలీనివాడు.. ఫోటోనే ప్రేమించిన వాడు భూషణ్. పాతికేళ్ళుగా క్యాన్సర్‌పై పోరాడిన అతనొక సైనికుడు. చేతిలోని కెమేరానే కన్ను, గన్ను. ఆఖరి వరకూ అలాగే నిలిచాడు. ప్రాణం పోయినా, పోరాటస్ఫూర్తిలో గెలిచాడు. సెల్యూట్ మై ఫ్రెండ్! – కె. రవికాంత్ రెడ్డి ఫొటో ఎడిటర్, సాక్షి -
మల్లెమొగ్గ లాంటి మనిషి
తన అరవై మూడేళ్ళ జీవితాన్ని మనుషుల పట్ల ప్రేమతో, మాటల మృదుత్వంతో, సున్నిత మానవీయ సంస్పందనతో వెలిగించినవారు ఎండ్లూరి సుధాకర్. కవిగా ఎంత భావుక త్వంతో, కళా నియమాలతో ఉంటారో– సామా జిక వాస్తవాల పట్ల అంత స్పష్టంగానూ ఉంటారు. ప్రాచీన సాహిత్యాన్ని దాని స్థలకాల సందర్భాల నుంచి అంచనా వేస్తూ విస్తృతంగా చదివిన అరుదైన ఆధు నిక కవి. గతాన్ని పట్టు కొని వేలాడే గబ్బిలం కాదాయన, వర్తమాన సామాజిక చేతనా కవి. చుండూరు మీదుగా కవితా భాషణ మొద లుపెట్టి వర్గీకరణ దండోరా మోగిస్తూ తానే ఉద్యమమై నడి చారు. కనుకనే ‘‘ఓ నా చండాలికా!/నీ వెండి కడియాల నల్ల కాళ్ళముందు/వెయ్యేళ్ళ కావ్య నాయికలు వెలవెల బోతున్నారు’’ అంటూ దళిత శ్రామిక స్త్రీ సౌందర్యాన్ని ఉత్పత్తి సాధ నాల, క్రియా కలాపాలతో అనుసంధానం చేసి ఆవిష్కరించారు. మాదిగ మహా జీవన సంస్కృ తికి ‘మల్లెమొగ్గల గొడుగు’ పట్టారు. ‘దుఃఖై ర్లాంజీ’ అయి నిలువునా కరిగిపోయారు. ఎడ బాసిన సహచరిని తలచుకొంటూ రోజుకొక స్మృతి గీతమయ్యారు. ఎండ్లూరి సహచరి పుట్ల హేమలత. 2010లో ప్రారంభమైన ప్రజాస్వామిక రచయి త్రుల వేదిక ప్రయాణంలో చురుకుగా పాల్గొన్న రచయిత్రి. భార్యగా ఆమె కోణంనుండి ఆయన పట్ల ఏ ఫిర్యాదూ పదేళ్ల సహయానంలో మేము వినలేదు. మూడేళ్ళ కిందట తన సహచరి చివరి క్షణాల్లో ఆమె పట్ల ఆయన చూపిన ప్రేమ ప్రకటన ఒక గొప్ప కావ్యం. ప్రరవే తరపున హేమలత సంపాదకత్వం వహించిన బోల్షివిక్ విప్లవ స్ఫూర్తి వ్యాస సంకలనాన్ని పసిబిడ్డని ఎత్తుకున్నంత అపురూపంగా తీసుకువచ్చి ఆమె తలాపున పెట్టారు. సాహిత్యమే తన నినాదం అయినప్పటికీ హేమలత చివరి ఊరేగింపులో తాను ముందు నిలబడి ‘విప్లవం వర్ధిల్లాలి’ అని నినదించారు. తను చెప్పాలనుకున్న మాటలు దూరం నుంచి చెప్పే అలవాటు లేదాయనకి. ఈ వివక్ష తప్పు అని మనిషిని దగ్గరకి తీసుకుని చెపుతారు కనుకనే వేలమంది విద్యార్థులకి, సాహిత్య ప్రేమికులకి ఆయనంటే అపరిమితమైన ఇష్టం. ప్రేమతో పోరాటంతో, అక్షరంతో వాక్కుతో భిన్నవర్గాల మధ్య సంభాషణకి తానొక వంతెన అయ్యారు. సాహిత్య సామాజిక బోధనా రంగాల్లో తన అవసరం మరింతగా ఉన్న కాలంలో ఎండ్లూరి సుధాకర్ కన్ను మూయడం విషాదం. – కె.ఎన్. మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక -
తెలుగు కవితా దండోరా ఎండ్లూరి
గొప్ప కవి, దళిత కవితాత్మ బంధువు ఎండ్లూరి సుధాకర్ (1959–2022) దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో 80ల తర్వాత వచ్చిన కవులలో ముందు వరుసలో నిలుస్తాడు సుధాకర్. దళితుల్లో తన జాతి హక్కును సాధికారికంగా ప్రశ్నించే కవితను ఆయుధంగా సంధించి తలవంచని వీరుడిగా నిలిచినవాడు. ఎంత సున్నిత మనస్కుడో, అంత తీవ్ర ఉద్వేగం ఉన్నవాడు. ఎంత ప్రాచీన గ్రంథాలతో, ఉర్దూ వంటి ఇతర భాషా సాహితీ పరిజ్ఞానంతో పరిఢవిల్లినవాడో, అంత నవ్యమైన సరళమైన కవి. మంచునిప్పు అతని శైలి. ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం రెండు కళ్లుగా ఎండ్లూరి రాసిన ఆత్మకథ కవిత ఒక మేగ్నకార్టాగా నిలిచింది. ‘‘బహిరంగ వేదిక మీద నా సన్మానం మొదలైంది/ ఇప్పుడు నా మెడలో దండలు పడుతుంటే/ నిన్నటి నా గాయాలు వులిక్కి పడు తున్నాయి’’ అంటూ మొదలు పెట్టి, ‘‘ఇప్పటి కొత్త సూర్యుడి వెలుగులో/ కాలం నా ఆత్మకథను/ పాఠ్యగ్రంథంగా చదువుకుం టుంది’’ అన్న ముగింపుతో ఎండ్లూరి చేసిన ఆత్మగౌరవ ప్రకటన దళిత కవులకు నిజంగానే పాఠ్యగ్రంథమైంది. ఆవేదనతో కూడిన విమర్శనాత్మక చమత్కారం, కళాత్మకంగా వ్యక్తం కావడం ఎండ్లూరి కవిత్వ లక్షణం. ఉద్యమావసరాల తర్వాత కూడా అలాంటి కవిత నిలబడిపోతుంది. దళితాగ్రహ ప్రకటనలో నగేష్ బాబుని మించిన వాడు లేడు. దళితాత్మ ప్రకటనలో ఎండ్లూరిని కొట్టిన వాడు లేడు. ‘‘ఓనా చండాలికా/... నీ బంతిపూల కొప్పు మీదనే ఒట్టు/ నిన్ను ఊరి బయటనే నిలబెట్టిన/ ఆకాశమెత్తు ఉట్టిని పగలగొడుతున్నాను.’’ దళిత కవుల శిల్పంలో కూడా అంబే డ్కరిస్టు చూపు ఉందని లక్ష్మీనరసయ్య అన్న మాటకు అర్థం ఎండ్లూరి రాసిన అనేక కవితల్లో దొరుకుతుంది. ఎండ్లూరి నాకు అత్యంత సన్నిహితుడు. నేను తెలుగు యూనివర్సిటీ రాజమండ్రి శాఖలో దళిత కవిత్వం మీద పరిశోధన చేస్తున్న కాలంలో నాకెంతో దగ్గరయ్యాడు. ఎండ్లూరి సున్నిత హృదయాన్నీ, కవిత్వం పట్ల ఆయనకున్న అవ్యాజమైన అను రాగాన్నీ, పదునైన వాక్యాలను పట్టుకునే శక్తినీ కళ్ళారా చెవులారా చూశాను. ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కోర్సులో ఆధునిక కవిత పెట్టాలి, ఒక పేరు సూచించండని ఏపీ విద్యాశాఖ వారు అడిగితే... ‘ఇంకెవరు ప్రసాదమూర్తి వున్నాడుగా’ అన్నది ఎండ్లూరే. ఆ విధంగా నా కవిత డిగ్రీ కోర్సుకి ఎక్కింది. అంతటి ప్రేమశీలి. అన్నిటినీ మించి కుల ప్రాంత మతాలకు అతీతంగా మంచి కవిత్వం రాసేవారిని అక్కున చేర్చుకునే గొప్ప మనసున్నవాడు. ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం అనే నా పరిశోధన గ్రంథంలో ఎండ్లూరి కవిత్వాన్ని ఎంతో ఇష్టంగా ఉటంకించాను. తన మాదిగ జాతి హక్కు కోసం ఆయన చేసిన అక్షర పోరాటం సాహిత్య చరిత్రలో ఎవరూ మరచి పోలేనిది. ఎస్సీ రిజర్వేషన్లో ఏబీసీడీ యుద్ధం రాజుకున్నప్పుడు ఎండ్లూరి రాసిన కొత్త గబ్బిలం ఒక సంచలనం. దండోరా సందేశాన్ని కొత్తగబ్బిలం రెక్కల్లో పొదిగి దాన్ని ఆయన భాగ్య నగరానికి సాగనంపుతాడు. తాత జాషువా చూస్తే మనవణ్ణి చూసి మురిసిపోయేవాడే. దండోరాకి దన్నుగా రాశాడే తప్ప అన్న దమ్ముల మధ్య అగ్గి రాజెయ్యడం ఆయన లక్ష్యం కాదు. రాజ మండ్రి నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రావడమే సహచరి హేమలత మరణంతో ఆయన్ని దుఃఖం చుట్టేసింది. సగభాగం హేమలత తీసుకుపోయింది. సగభాగం అనారోగ్యం కొరికేసింది. ఎండ్లూరి మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. – డా. ప్రసాదమూర్తి, ప్రముఖ కవి మొబైల్: 84998 66699 -
'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ'
ఫ్రాన్స్ టెన్నిస్ క్రీడాకారిణి అలిజె కార్నెట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ రొమేనియాకు చెందిన సిమోనా హలెప్‌ను 6–4, 3–6, 6–4తో ఓడించి సంచలనం సృష్టించింది. అయితే మ్యాచ్ విజయం అనంతరం పోస్ట్ ఇంటర్య్వూలో కార్నెట్ ఎమోషనల్ అయింది. తనను ఇంటర్య్వూ చేసిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి జెలెనా డొకిక్కు మ్యాచ్ విజయాన్ని అంకితం చేసి ఆమెను హగ్ చేసుకొని ఏడ్చేయడం గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులను కంటితడి పెట్టించింది. చదవండి: Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్.. సానియా జంట ముందడుగు ''నేను క్వార్టర్స్‌కు చేరినందుకు మొదట నాకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ''డొకిక్ను ఉద్దేశించి..''.. నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. జీవితంలో నువ్వు ఎలా ముందుకెళ్లావో.. ఎంత ఇబ్బందులు పడ్డావో నాకు తెలుసు. గాయాలతో కెరీర్‌ను అర్థంతరంగా ముగించినప్పటికి నువ్వు ఎంత గొప్ప ప్లేయర్ అనేది మాకు తెలుసు.. ఇప్పుడు కామెంటేటర్‌గా కూడా అంతే పేరు సంపాదిస్తున్నావు. ఈ విజయం నీకే అంకితం'' అంటూ చెప్పుకొచ్చింది. దీనికి బదులుగా డొకిక్ మాట్లాడుతూ.. ''నీ మాటలు నన్ను ఏడిపించేశాయి.. ఇప్పటికి నమ్మలేకపోతున్నా.. థాంక్యూ'' అని పేర్కొంది. ఆ తర్వాత ఇద్దరు హగ్ చేసుకోవడంతో గ్యాలరీలోని ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్రొయేషియాకు చెందిన జెలెనా డొకిక్ వరుస గాయాల కారణంగా 2014లో 30 ఏళ్ల వయసున్నప్పుడు అర్థంతరంగా కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. అయితే ఇదే జెలెనా డొకిక్తో అలిజె కార్నెట్‌కు మంచి అనుబంధం ఉంది. ఆన్ కోర్టు.. ఆఫ్ కోర్టు ఇలా ఏదైనా అటు కెరీర్ గురించి.. ఆట గురించి మాట్లాడుకునేవారు. కార్నెట్ ఆటలో మెళుకువల కోసం జెలెనా సలహాలు చాలా తీసుకుంది. అలా తనపై విపరీతమైన అభిమానం పెంచుకున్న కార్నెట్.. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ చేరడం.. విజయం అనంతరం తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి జెలెనా ఇంటర్య్వూ చేయడంతో ఎమోషన్‌ను ఆపుకోలేకపోయింది. చదవండి: కార్నెట్ పట్టు వీడని పోరాటం No dry eyes in the house 😭😭😭 This on-court interview between @alizecornet and Jelena Dokic is everything. #AusOpen · #AO2022 pic.twitter.com/F3nN0XSHNX — #AusOpen (@AustralianOpen) January 24, 2022 -
డ్రైవర్‌కు వరుణ్ భావోద్వేగపు నివాళి.. ఎమోషనల్ అయిన ఫ్యాన్స్
Varun Dhawan Emotional Tribute To His Driver Manoj Sahoo: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు. ఇది చూసిన వరుణ్ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల వరుణ్ డ్రైవర్ మనోజ్ సాహు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. మనోజ్‌కు నివాళిగా తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు వరుణ్. బీచ్‌లో లవ్ షేప్‌లో ఇసుకను పేర్చి అందులో 'మనోజ్ భాయ్ మిస్ యూ సోమచ్' అని రాశాడు. ఈ స్టోరీకి 'అందంగా ఉంది. మనోజ్ భాయ్ స్వర్గం నుంచి ఇది చూసి చిరునవ్వు చిందిస్తాడు.' అని ఒక అభిమాని కామెంట్ పెట్టగా 'ఈ పోస్ట్‌తో మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు. దేవుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలి.' అని మరొకరు రాశారు. వరుణ్‌తో 26 ఏళ్లపాటు కలిసున్న మనోజ్ సాహు మంగళవారం గుండెపోటుతో మరణించారు. వరుణ్ వెళ్లిన ఒక యాడ్ షూట్‌కు తీసుకెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. -
రాజ్యహింసను ధిక్కరించినవాడు
దేశ చరిత్రలో 1975లో విధించిన ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులను వాదించడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో రాజ్యానికి వ్యతిరేకంగా ధిక్కారస్వరం వినిపించారు న్యాయవాది కేజీ కన్నాభిరాన్. డా. బీఆర్ అంబేడ్కర్ దేశ పౌరులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను ప్రభుత్వాలు హననం చేస్తుంటే ప్రతిఘటించారాయన. భూమి కోసం, భుక్తి కోసం, న్యాయం కోసం ప్రజల తరపున పోరాడుతున్న వారి ఇళ్లపై దాడులు చేస్తూ రాత్రికి రాత్రే మాయం చేసి, ఎదురు కాల్పుల పేరుతో కాల్చి చంపారు. తూటాలతో, లాఠీలతో, పౌర హక్కుల పోరాటవీరుల సమూహాలపై దాడులు చేసి, భయానక వాతావరణం సృష్టించారు. ఆ నిరంకుశత్వాన్ని నిరసించి, ప్రజల పక్షాన పోరాడిన హక్కుల యోధుడు. సింగరేణి కార్మికుల పోరాట, ఆరాటాలలో కూడా వారికి మద్దతు పలికిన కార్మిక పక్షపాతి. పౌరహక్కుల ఉద్యమనేత, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో వకీలు, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీ సంస్థకు సహ వ్యవస్థాపకుడు. కొంతకాలం ఆ సంస్థ అధ్యక్షుడిగా కూడా కన్నాభిరాన్ పనిచేశారు. 1970 ప్రాంతంలో చట్టబద్ధ హక్కుల కోసం పోరాడుతున్నవారిపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం కొనసాగిస్తున్నపుడు న్యాయవాదులందరూ కలసి నక్సలైట్ డిఫెన్స్ క్సౌన్సిల్ను ఏర్పాటు చేసి, ఆ సంస్థకు ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. హైదరాబాద్, పార్వతీపురం కుట్ర కేసులలో డిఫెన్స్ న్యాయవాదిగా పనిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో తప్పుడు కేసుల పాలైన వారి తరపున వాదించిన ఏకైక న్యాయవాది ఆయనే. పీడితులు, కార్మికులు, హక్కులు, పోరాటాలకు ఆయన ఎప్పుడూ అండగా నిలిచేవారు. పౌరుల జీవించే హక్కుల కోసం కన్నాభిరాన్ జీవితాన్ని అంకితం చేశారు. నవంబర్ 9, 1929న మదురైలో జన్మించిన ఆయన 2010 డిసెంబర్ 30న హైదరాబాద్‌లో తనువు చాలించారు. – డా. ఎస్. బాబూరావు, సీనియర్ జర్నలిస్ట్ (డిసెంబర్ 30న కన్నాభిరాన్ వర్ధంతి) -
భాషకు వన్నెతెచ్చిన గురుశ్రేష్ఠుడు
భాషా శాస్త్ర రంగంలో పరిశోధనపై దృష్టి కేంద్రీకరించి తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన కోరాడ మహాదేవ శాస్త్రి శత జయంతి సంవత్సరం ఇది. ఆర్థిక శాస్త్రంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి పీజీ చేసి సిమ్లాలోని లేబర్ ఇన్వెస్టిగేషన్ కమిషన్, భారతీయ వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య (ఫిక్కీ)లలో ఆర్థికవేత్తగా పనిచేసినా భాషాశాస్త్రంలో విశ్వ విఖ్యాతి పొందిన ప్రొఫెసర్ సునీతి కుమార్ ఛటర్జీ పిలుపుతో చేస్తున్న ఉద్యోగం వదిలి కలకత్తా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రంలో చేరి, ఎంఏ పట్టా పొందారు. తమిళనాడు చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్ర అధ్యాపకుడుగా పనిచేసి ఆ తర్వాత తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (1960–68), అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుడిగా ఉన్నారు. తెలుగు భాషలో ఎన్నో పరిశోధనా గ్రంథాలు వెలువరించడమే కాదు, సంస్కృత, ఆంగ్లభాషలతోపాటు ప్రాకృతం, హిందీ, భోజ్‌పురి, బెంగాలీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో నిష్ణాతుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు భాషా సాహిత్య రంగాలు రెండిటా విశేష కృషి చేసి, తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతులపై పలు రచనలు చేశారు. 1969లో వెలువరించిన ‘హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు’ అనే గ్రంథంలో భాషలోని వ్యాకరణాంశాలు కాలక్రమాన ఏవిధంగా మారుతూ వచ్చాయో వివరించారు. సాహిత్యంలోని భాష నిర్దిష్టమైన పద్ధతిలో ఉంటుంది. కానీ శాసనాలలో ఉపయోగించే భాష ఆయా కాలాల వ్యవహారిక భాషకు దగ్గరగా ఉంటుంది. ఆరవ శతాబ్దం మొదలుకొని వివిధ కాలాల్లోని వందలాది శాసనాలు పరిశోధించి రూపొందించిన గ్రంథమిది. మహాదేవ శాస్త్రి పరిశోధన పర్యవసానంగా శాసనాలను అర్థం చేసుకోవడం తేలికైంది. ఈ గ్రంథం ఆధారంగానే ఐరావతం మహదేవన్ అనే తమిళ పండితుడు సింధు నాగరికత కాలంనాటి శాసనాలలో కనబడే బాణం గుర్తు తెలుగు పదాల చివర ఉండే అంబు ప్రత్యయానికి చిహ్నమని గుర్తించారు. అంటే సింధు నాగరికత కాలం నాటికే తెలుగు భాషా రూపం ఉందని, ఈ భాష ప్రాచీన తకు అది తార్కాణమని పండితులు నిర్ధరించారు. (చదవండి: చక్కని బొమ్మల చుక్కాని.. బాపు) జర్మనీ లోని కొలోన్ విశ్వవిద్యాలయం ఆహ్వానంపై 1976లో అక్కడికి విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్లినప్పుడు ఆధునిక తెలుగు భాషా స్వరూపాన్ని వివరిస్తూ, విదేశీయులు తెలుగు నేర్చుకునేందుకు అనువుగా ‘డిస్క్రిప్టివ్ గ్రామర్ అండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ మాడర్న్ తెలుగు’ అనే గ్రంథం రాశారు. అలాగే ద్రావిడ విశ్వద్యాలయం అభ్యర్థన మేరకు తెలుగు దేశ్య వ్యుత్పత్తి నిఘంటువును 2003లో రచించారు. బాల ప్రౌఢ వ్యాకరణ దీపికను 1987లో, ఆంధ్ర వాంఙ్మయ పరిచయాన్ని 1985లో ఆయన రచించారు. సంస్కృత, ప్రాకృతాల నుంచి తెలుగు భాషలోనికి వచ్చి చేరిన పదాలు, దేశ్య పదాల పుట్టుపూర్వోత్తరాలను, భాషలో కొన్ని ప్రత్యేకార్థాలను స్ఫురింపజేసే ధ్వనులనూ విపులంగా చర్చించే ‘భాష–సంస్కృతి’ అనే గ్రంథాన్ని 2014లో వెలువరించారు. తెలుగులో మాదిరిగానే ఆంగ్లంలో సైతం ప్రవాహ వేగంతో సాగే ఆయన ప్రసంగాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకునేవి. ఈ విషయంలో ఆయనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తి. (చదవండి: సమసమాజ విప్లవ తపస్వి.. జ్వాలాముఖి) తెలుగు భాష పట్ల ఆసక్తి, అనురక్తి పుష్కలంగా ఉన్న విద్యార్థులను కులమతాలకు అతీతంగా చేరదీసి, వారిని భాషా శాస్త్రంలో నిపుణులుగా తీర్చిదిద్దారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలు, దేశాలలో భాషా సాహిత్య రంగాల్లో సేవలందిస్తున్న ఆయన శిష్యులే తార్కాణం. 1921 డిసెంబర్ 29న మచిలీపట్నంలో జన్మించిన మహాదేవ శాస్త్రి 2016లో తమ 94వ ఏట తిరుపతిలో కన్నుమూశారు. శత జయంతి సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు. (చదవండి: అజ్ఞాత మహనీయుడు.. డాక్టర్ ఎల్లాప్రగడ) - డాక్టర్ కోరాడ వెంకటరమణ వ్యాసకర్త కెమికల్ టెక్నాలజీ నిపుణులు (కోరాడ మహాదేవ శాస్త్రి శతజయంతి) -
Jwalamukhi: సమసమాజ విప్లవ తపస్వి
చరిత్రలో రెండురకాల కవులు, కళాకారులు మనకు గోచరిస్తారు. ప్రభు వర్గాలను, పాలకవర్గాలను కీర్తిస్తూ వారి దోపిడీ, పీడనలను సమర్థిస్తూ వారి అడుగులకు మడుగులొత్తే కవులు, కళాకారులు ఒక కోవకు చెందినవారు. కాగా దానికి భిన్నంగా పాలకవర్గాలను, వారి దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజల, పీడితుల పక్షం వహించి తమ గళాన్ని, కలాన్ని ప్రజల ప్రయోజనాలకోసం సంధించే కవులు, కళాకారులు రెండోకోవకు చెందుతారు. తన జీవితం చివరిక్షణం వరకు పాలకవర్గాలపై, దోపిడీవ్యవస్థపై నిప్పులు కురిపిస్తూ తన ప్రతిభాపాటవాలను, శక్తిసామర్థ్యాలను ప్రజలకోసం ధారపోసిన జ్వాలాముఖి రెండోకోవకు చెందిన కవులలో ప్రముఖుడు. జ్వాలాముఖి 1938 ఏప్రిల్ 12న హైదరాబాదులోని సీతారాంబాగ్ దేవాలయంలో జన్మించారు. చిన్నతనంలోనే తాను నివాసముండే దేవాలయ ప్రాంగణంలోని పేద అర్చకుల ఇండ్లస్థలాల సమస్యపై పోరాటం చేసి పేద ప్రజల ప్రేమకు పాత్రుడయ్యారు. ఎన్నో రుగ్మతలకు ఆలవాలమైన నేటి దోపిడీ వ్యవస్థపై ‘దిగంబరకవి’గా తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. క్రమంగా తన నిరంతర అధ్యయనం, పరిశీలన ద్వారా నేటి సమాజంలోని ప్రజల కడగండ్లకు దేశంలో కొనసాగుతున్న భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థే మూలకారణమని గ్రహించుకున్నారు. భారత విప్లవోద్యమ నాయకులు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుల సాంగత్యంతోను; వారి బోధనలు, రచనలతోను ప్రభావితులయ్యారు. భారతదేశంలో అనుసరించవలసిన విప్లవమార్గం పట్ల స్పష్టతను ఏర్పరచుకున్నారు. అప్పటినుంచి తాను నమ్మిన విప్లవ ఆశయాలకోసం జీవితాంతం అంకితమై కృషిచేశారు. (చదవండి: జీవితంలో సాహిత్యాన్ని దర్శించిన విమర్శకుడు) ఒక మానవుడు మరో మానవున్ని దోచుకోవటానికి వీలులేని వ్యవస్థకు బాటలువేసే సోషలిస్టు సమాజంకోసం జ్వాలాముఖి పరితపించారు. ‘బాల్యానికి శిక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వృద్ధాప్యానికి రక్షణలేని దేశం ఒక దేశమేనా?’ అని ప్రశ్నిస్తూ వచ్చారు. ప్రజలందరికీ ఇటువంటి మౌలిక సౌకర్యాలు సోషలిస్టు సమాజంలోనే సాధ్యపడతాయని, అటువంటి సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని నొక్కి చెప్పేవారు. (చదవండి: మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన) జ్వాలాముఖి చక్కటి వక్త. తన కంచుకంఠంతో శ్రోతలను ఉర్రూతలూగించి వారిలో విప్లవోత్తేజం కల్గించి చెరగని ముద్రవేసేవారు. తన వాగ్ధాటిద్వారా, తనదైన శైలిలో పాలకవర్గాలపై నిప్పులు కురిపిస్తూ ప్రజలను, విద్యార్థులను, యువకులను నిరంతరం చైతన్యవంతులను చేసేవారు. క్లిష్టసమస్యలపై సరైన అవగాహనను సాధారణ ప్రజలకు, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అనేక ఉపమానాలతో, కథలతో జోడించి చెప్పేవారు. ఆయన ఉపన్యాసాలు ఉత్తేజకరంగా, విజ్ఞానదాయకంగా ఉండటమేగాక ప్రజలను విప్లవకర్తవ్యోన్ముఖులను చేసేవిగా వుండేవి. అన్నిరంగాల ప్రజల హృదయాలలో విప్లవభావాలను గుదిగుచ్చటంలో ఆయనమేటి. విద్యార్థులను, యువకులను భావి భారతదేశపు ఆశాకిరణాలుగా జ్వాలాముఖి అభివర్ణించేవారు. నేటి భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థ వెదజల్లే అరాచక, అశ్లీల సంస్కృతి ప్రభావంలో పడకుండా విద్యార్థులు, యువకులు నిరంతరం అప్రమత్తంగా వుండాలని, చైతన్యశీలురు కావాలని ఆయన నిత్యం ప్రబోధించేవారు. పురాణాలలోని, ఇతిహాస కథలలోని, స్వాతంత్య్ర పోరాటంలోని వీరుల త్యాగాలను తరచుగా ఉటంకిస్తూ ఆయన నేటి విద్యార్థులు, యువకులు అటువంటి వీరులనుండి ప్రేరణ, స్ఫూర్తిని పొంది దేశంలో మౌలికమార్పుల కోసం, మంచి సమాజ స్థాపనకోసం కృషిచేయాలని ప్రబోధించేవారు. భారత సమాజంలోని సమస్యలన్నింటికీ మౌలిక పరిష్కారమార్గాన్ని చూపిన దేవులపల్లి, టియన్‌ల విప్లవకర జీవితాలనుండి స్ఫూర్తిని పొందాలని చెప్పేవారు. ‘డివి, టియన్‌లు భారత విప్లవోద్యమంలో కృష్ణార్జునులవంటివారు’ అని ఆయన అభివర్ణించేవారు. (చదవండి: Mannu Bhandari: రాలిన రజనీగంధ) పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం మొదలగు అనేక సమస్యలు చుట్టుముట్టినా లెక్కచేయకుండా జ్వాలాముఖి విప్లవ ఆశయాల కోసం జీవితాంతం పోరాడారు. ఆయన విప్లవకర జీవితం నుండి స్ఫూర్తిని, ప్రేరణనుపొంది తాను ఆశించిన నూతన సమాజస్థాపన కోసం కృషిచేయటమే నేటి ప్రజల ముఖ్యంగా విద్యార్థుల, యువజనుల కర్తవ్యం. ఆ విప్లవ తపస్వికి మనమందించే ఉత్తమమైన నివాళులు ఇవే. 2008 డిసెంబరు 14వ తేదీన కన్నుమూసిన జ్వాలాముఖికి అరుణారుణ జోహార్లు. – సి. భాస్కర్, యుసిసిఆర్‌ఐ (యంయల్) నేడు (డిసెంబరు 14) ప్రముఖ విప్లవకవి జ్వాలాముఖి వర్ధంతి -
కన్నీరు పెట్టిస్తోన్న సైనిక వీరుడి వీడ్కోలు దృశ్యాలు..
-
పూర్తయిన బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు
05:18PM బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంతిమ సంస్కారాలు సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. సీడీఎస్ రావత్‌కు 17 గన్ సెల్యూట్‌తో ఘనంగా నివాళులు అర్పించింది భారత సైన్యం. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99మంది సైనికాధికారులు.. 33 మందితో కూడిన ట్రై సర్వీస్ బ్యాండ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. త్రివిధ దళాలకు చెందిన మొత్తం 800మంది సేవా సిబ్బంది అంత్యక్రియాల్లో పాలుపంచుకున్నారు. శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన సీనియర్ మిలటరీ కమాండర్లు జనరల్ రావత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. 03:30PM ►దారిపొడవునా జనరల్ రావత్‌కు జననీరాజనం 03:15PM కన్నీటి వీడ్కోలు ►సైనిక వీరుడికి తుది వీడ్కోలు పలుకుతున్న ఢిల్లీ ప్రజలు ►కొనసాగుతున్న జనరల్ బిపిన్ రావత్ అంతిమయాత్ర ►భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తుతున్న ఢిల్లీ 02:10PM ►మధ్యాహ్నం 2 గంటలకు రావత్ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో రావత్ దంపతులు అంత్యక్రియలు జరుగుతాయి. సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల మృత దేహాలను శుక్రవారం ఢిల్లీలోని వారి నివాసానికి తరలించారు. ప్రజల సందర్శన కోసం రావత్ దంపతుల పార్థివదేహాలను ఢిల్లీలోని కామరాజ్ మార్గ్ నివాసంలో ఉంచారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బజాల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తదితరలు శుక్రవారం రావత్ ఇంటికి చేరుకుని.. దంపతులకు నివాళులర్పించారు. (చదవండి: హెలికాప్టర్ ప్రమాదం: ఢిల్లీకి పార్థివ దేహాలు) చదవండి: ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు -
దేశవ్యాప్తంగా బిపిన్ రావత్‌కు నివాళులు
-
హెలికాప్టర్ ప్రమాదం: ఢిల్లీకి పార్థివ దేహాలు
న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ రావత్ దంపతులతోపాటు ఇతరుల పార్థివ దేహాలను సైనిక విమానంలో గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్‌కు తీసుకొచ్చారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆర్మీ చీఫ్ నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏవీఆర్ చౌదరి నివాళులర్పించారు. మృతుల కుటుంబీకులు హాజరయ్యారు. ఇక్కడ భావోద్వేగ వాతావరణం కనిపించింది. రావత్ ఇద్దరు కుమార్తెలను ప్రధాని మోదీ ఓదార్చారు. అంతకు ముందు తమిళనాడులోని వెల్లింగ్టన్లోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్లో పార్థివ దేహాలకు తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై, తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళులర్పించారు. మృతదేహాలను కోయంబత్తూరుకు, తర్వాత ఢిల్లీకి తరలించారు. 3 మృతదేహాల గుర్తింపు హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మరణించగా, ఇప్పటివరకు 3 మృతదేహాలను గుర్తించారు. రావత్, ఆయన భార్య మధులిక, బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ మృతదేహాలను గుర్తించామని, వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. మిగిలిన పార్థివ దేహాలను ఆర్మీ బేస్ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరుస్తామని చెప్పారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. మృతదేహాలకు చాలావరకు కాలిపోయాయని, అందుకే గుర్తింపు ప్రక్రియ కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. రావత్ దంపతుల మృతదేహాలను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఢిల్లీలోని 3 కామరాజ్ మార్గ్ నివాసంలో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలకు బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. రాష్ట్రపతి కోవింద్‌కు రాజ్‌నాథ్ వివరణ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలియజేశారు. ఈ దుర్ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. ఈ ప్రమాదంపై త్రివిధ దళాల విచారణకు భారత వైమానిక దళం ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: Tamil Nadu: 30 మంది ప్రాణాలు కాపాడి మృత్యు ఒడిలోకి ఆర్టీసీ డ్రైవర్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
56వ నెంబర్‌తో బరిలోకి..
Ben Stokes Wore 56 Number ArmBand Tribute For His Father.. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ దాదాపు 4 నెలల తర్వాత యాషెస్ సిరీస్ ద్వారా పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో స్టోక్స్ చేతికి 56వ నెంబర్ ఉన్న రిబ్బన్ వేసుకొని బరిలోకి దిగడం ఆసక్తికలిగించింది. అయితే స్టోక్స్ ఆ రిబ్బన్ ధరించడం వెనుక పెద్ద కథే ఉంది. చదవండి: Ashes Series: స్టోక్స్ సూపర్ ఎంట్రీ అనుకున్నాం.. ఊహించని ట్విస్ట్ స్టోక్స్‌కు తన తండ్రి గెరార్డ్ జేమ్స్ స్టోక్స్ అంటే అమితమైన ప్రేమ. గతేడాది డిసెంబర్లో గెరార్డ్ బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. తండ్రి మరణంతో మానసికంగా కుంగిపోయిన స్టోక్స్ ఒత్తిడికి లోనయ్యాడు. ఆటపై సరిగా ఫోకస్ పెట్టలేకపోయాడు. ఇక స్టోక్స్ ఆటకు నాలుగు నెలలు దూరంగా ఉండడం వెనుక ఇదీ ఒక కారణమే. ఇదిలా ఉంటే డిసెంబర్ 8న(బుధవారం) స్టోక్స్ తండ్రి గెరార్డ్ 56వ పుట్టినరోజు. తండ్రి పుట్టినరోజు సందర్భంగా.. స్టోక్స్ ఆయన గుర్తుగా యాషెస్ తొలి టెస్టు మ్యాచ్‌లో 56వ నెంబర్ ఉన్న రిబ్బన్‌ను ధరించాడు. ఇక 1982లో న్యూజిలాండ్ రగ్బీ టీమ్‌లో అడుగుపెట్టిన గెరార్డ్ స్టోక్స్ క్యాప్ నెంబర్ కూడా 56 కావడం విశేషం. ఈ రెండు సందర్భాలను కలుపుతూ స్టోక్స్ తన తండ్రికి ఘన నివాళి అందించాడు. చదవండి: Ben Stokes No Balls: స్టోక్స్ నోబాల్స్ కథేంటి! అంపైర్లకు కళ్లు కనబడవా? ఇక నాలుగు నెలల విరామం తర్వాత క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన బెన్ స్టోక్స్ ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో బ్యాటింగ్‌లో నిరాశపరిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసిన స్టోక్స్.. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు. ఏకంగా 14 నోబాల్స్‌ను విసిరిన స్టోక్స్ 9 ఓవర్లు వేసి 50 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండోరోజు ఆట ముగిసే సమయానికి 84 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 343పరుగులు చేసింది. ట్రేవిస్ హెడ్ (112* పరుగులు) సూపర్ సెంచరీ సాధించి ఆడుతుండగా.. మిచెల్ స్టార్క్ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకముందు వార్నర్ 94 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 196 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: David Warner: ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్ View this post on Instagram A post shared by Ben Stokes (@stokesy) -
CDS Bipin Rawat: సెలవిక దళపతి... వెల్లింగ్టన్లో మృతులకు నివాళి
సాక్షి, చెన్నై: భారతీయ సైనిక బలగాల చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన వీర యోధుడిని హెలికాప్టర్ ప్రమాదం కబళించింది. దేశ తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) బిపిన్ రావత్ బుధవారం ఛాపర్ ప్రమాదంలో అసువులు బాశారు. గతంలో ఒకసారి ఇలాంటి ప్రమాదం నుంచే రావత్ తృటిలో బయటపడ్డారు. కానీ ఈసారి దురదృష్టం వెన్నాడింది. దేశ సైనిక బలగాలకు కొత్త రూపుతెచ్చిన రావత్ మరణంతో దేశం దిగ్భ్రాంతి చెందింది. పలువురు ప్రముఖులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. సూలూరు ఎయిర్ బేస్నుండి వెల్లింగ్టన్ వెళ్తూ ఛాపర్ ప్రమాదంలో రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11మంది సైనికాధికారులు సైతం దుర్మరణం చెందారు. ఒక్కరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ రావత్ దుర్మరణం) మరణించినవారిలో ఏపీ లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌నాయక్ సాయితేజ కూడా ఉన్నారు. ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగడంతో బాధితులను రక్షించేందుకు స్థానికులు చేసిన యత్నాలు ఫలించలేదు. ఘటనా స్థలిలో దేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. దుర్ఘటనపై భారత వాయుసేన విచారణకు ఆదేశించింది. రావత్ మరణవార్త వినగానే సీసీఎస్(కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశమైంది. గురువారం ఉదయం వెల్లింగ్టన్లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి పార్థివ దేహాలను కోయంబత్తూర్ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకువెళ్తారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్) శుక్రవారం ఢిల్లీ కంటోన్మెంట్లో అధికారలాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతారు. 1978లో సెకండ్ లెఫ్టినెంట్‌గా చేరి 2019లో దేశ భద్రతాదళాల ఉమ్మడి అధిపతిగా ఎదిగే క్రమంలో ఆయన పలు పురస్కారాలు అందుకున్నారు. భారత్‌లో అత్యంత శక్తివంతమైన సైనికాధికారైన ఈ ఫోర్స్టార్ జనరల్ సేవలను, తెచ్చినన రక్షణ సంస్కరణలను త్రివిధ దళాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాయి. శుక్రవారం రాజ్‌నాధ్ సింగ్ పార్లమెంట్లో ప్రమాదంపై ప్రకటన చేశారు. 1.ఉదయం 9గంటలకు ఢిల్లీ నుంచి రావత్ బయలుదేరారు. ఉదయం 11.34 గంటలకు సూలూర్ ఎయిర్‌బేస్‌కు చేరారు. 2.11.45 గంటలకు రావత్ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్ సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. 3.మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో కూనూర్ వద్ద ప్రమాదం జరిగింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్ -
అమరగాయకునికి అద్భుత నివాళి.. 365 రోజుల పాటు ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’
పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి సంవత్సర ప్రారంభం సందర్భంగా శనివారం(డిసెంబర్ 5) సాయంత్రం వారి జయంతిని పురస్కరించుకుని అమెరికా నుంచి ‘వంగూరి ఫౌండేషన్’, సింగపూర్ నుంచి ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, భారత్ నుంచి ‘ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్’, ‘వంశీ ఇంటర్నేషనల్’, ‘శుభోదయం’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 365 రోజుల పాటు జరగనున్న ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ కార్యక్రమాన్ని, అంతర్జాల వేదికపై ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ మహోత్సవానికి ఘంటసాల సతీమణి సావిత్రమ్మ శుభాశీస్సులు అందించగా, వారి కుమార్తెలు సుగుణ, శాంతి జ్యోతి ప్రకాశనం గావించి, ప్రార్థనాగీతం ఆలపించి శుభారంభాన్ని పలికారు. ప్రముఖ సినీ కవి భువనచంద్ర, ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు వంగూరి చిట్టెన్ రాజు, జగన్మోహనరావు, తదితర ప్రముఖులు, ఇతర నిర్వాహక బృంద సభ్యులు పాల్గొని ఘంటసాల ఔన్నత్యంపై ప్రసంగించారు. అత్యధిక కాలం నిరంతరాయంగా ఘంటసాల స్మరణలో జరిగే కార్యక్రమంగా ఈ కార్యక్రమం అంతర్జాతీయ రికార్డు సృష్టిస్తోందని అందరూ అభినందనలు వ్యక్తం చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదలైన సంస్థలలో ఈ కార్యక్రమం రికార్డును నమోదు చేసుకోబోతోందని నిర్వాహకులు తెలిపారు. చదవండి: డల్లాస్ - తానా ఆద్వర్యంలో ఘనంగా పుస్తక మహోద్యమం! ఘంటసాల ట్రస్ట్ , వంశీ అధ్యక్షుడు డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ... డిసెంబర్ 4వ తేదీ 2022 వరకు సంవత్సరకాలం పాటు ప్రతిరోజూ గంటసేపు ఈ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గాయనీగాయకులు ఘంటసాల పాటలను ఆలపిస్తారని, కవులు రచయితలు వక్తలు ఘంటసాల వారిపై వ్యాసాలను కవితలను వినిపిస్తారని’ ప్రకటించారు.ఎంతోమంది గాయనీ గాయకులకు అన్నం పెట్టిన ఘంటసాల పాటకు సమున్నతస్థానం కల్పిస్తూ కల్పించే ఉద్దేశంతో హైదరాబాద్‌లో తాము నిర్మించిన ‘ఘంటసాల స్మృతి మందిరం’ గురించిన వివరాలను తెలియజేసి అక్కడ జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వీడియో రూపంలో అందరికీ చూపించారు. ఈ కార్యక్రమం ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో మూడు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు చంద్రతేజ, ఆర్ఎస్ఎస్ ప్రసాద్, తాతా బాలకామేశ్వరరావు, కె విద్యాసాగర్ చక్కటి గీతాలను పద్యాలను ఆలపించి ప్రేక్షకులను మెప్పించారు. సింగపూర్ నుంచి గుంటూరు వెంకటేష్ ఈలపై, 20 కు పైగా ఘంటసాల పాటల పల్లవుల పల్లకిని పలికించి అందరినీ ఆకట్టుకున్నారు. జీవి రామకృష్ణ సౌజన్యంతో చౌటపల్లి, టేకుపల్లి, ఘంటసాల గ్రామాల నుంచి అలాగే విజయనగరం సంగీత కళాశాల నుంచి ప్రత్యేకంగా వీడియోలను రూపొందించి ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు ఘంటసాల నడయాడిన ప్రాంతాలను చూపించారు. ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ..ఇంతటి బృహత్కార్యంలో తమ సంస్థ సహ నిర్వాహకులుగా పాలుపంచుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవంగా ‘ఘంటసాల శతజయంతి ఆరాధనోత్సవం’ 2022 డిసెంబర్ 4వ తేదీన సింగపూర్ లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కార్యక్రమానికి అందరిని సింగపూర్ కు రావలసిందిగా కోరుతూ ఆహ్వానం పలికారు. ఘంటసాల వారితో పాటుగా ఇటీవల స్వర్గస్తులైన అతడి కుమారులు ఘంటసాల రత్న కుమార్‌ను కూడా స్మరిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో నివాళులు అర్పించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధ, మేనేజింగ్ ట్రస్టీ సుంకరపల్లి శైలజ కార్యక్రమానికి అభినందనలు తెలియజేశారు. భారత కాలమానం ప్రకారం...ప్రతి శని, ఆదివారాలలో ఉదయం 10 గంటలకు, ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సంవత్సరకాలం పాటు కొనసాగే ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ కార్యక్రమాన్ని ‘వంశీ ఆర్ట్ థియేటర్స్’, ‘శుభోదయం మీడియా’ యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చునని నిర్వాహకులు వెల్లడించారు. చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్..! భారత్‌కు వస్తోన్న ఎన్నారైలకు తప్పని తిప్పలు..! -
‘సిరివెన్నెల‘ సీతారామశాస్త్రికి ప్రముఖుల నివాళి (ఫోటోలు)
-
సిరివెన్నెలకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్/సాక్షి, అమరావతి: అక్షర యోధుడు సిరివెన్నెల సీతారామశాస్త్రికి కుటుంబసభ్యులు, అభిమానులు, ప్రముఖులు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం వైకుంఠ మహాప్రస్థానంలో బుధవారం మధ్యాహ్నం ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. సీతారామశాస్త్రి పెద్ద కుమారుడు సాయివెంకటయోగేశ్వరశర్మ తండ్రి చితికి నిప్పంటించారు. మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సిరివెన్నెల పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఫిలిం చాంబర్‌కు తీసుకొచ్చారు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. అనంతరం రాయదుర్గం వైకుంఠ మహాప్రస్థానానికి సిరివెన్నెల అంతిమయాత్ర మొదలైంది. అభిమానులు సిరివెన్నెల పాటల్ని తలచుకుంటూ ఆ వాహనం వెంట సాగారు. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో వేద పండితులు అంత్యక్రియల ప్రక్రియను పూర్తిచేయించారు. సిరివెన్నెలకు నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు పేర్ని నాని, తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ఆయన్ని కోల్పోవడం యావత్ తెలుగు ప్రజలకు బాధాకరమని పేర్కొన్నారు. సిరివెన్నెలతో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుని నేపథ్యగాయకుడు మనో, మరికొందరు సినీ ప్రముఖులు కన్నీరు పెట్టుకున్నారు. అంత్యక్రియలకు నిర్మాత సురేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటులు బ్రహ్మనందం, రఘుబాబు, ప్రజాగాయకులు గద్దర్, విమలక్క తదితరులు పాల్గొన్నారు. . సీఎం జగన్‌కు సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతలు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించడమేగాక ఆస్పత్రి ఖర్చులను భరిస్తుండటంపై ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘మంగళవారం ఉదయమే మాకు ఏపీ సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని, ఆస్పత్రి ఖర్చులు భరిస్తామన్న విషయాన్ని తెలపాలని సీఎం జగన్ ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తు సిరివెన్నెల మంగళవారం కన్నుమూశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ తమ సంతాపాన్ని ప్రకటించారు. అంత్యక్రియలకు ఏపీ సమాచారశాఖ మంత్రి హాజరయ్యారు. ఆస్పత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేం కట్టిన అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. మా కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం..’ అని సిరివెన్నెల పెద్ద కుమారుడు సాయియోగేశ్వరశర్మ, ఇతర కుటుంబసభ్యులు పేర్కొన్నారు. సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలవండి – అధికారులకు సీఎం జగన్ ఆదేశం ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం సీఎం కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా జగన్ ఈ ఆదేశాలిచ్చారు. దీనిపై స్పందించిన అధికారులు.. సిరివెన్నెల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆస్పత్రి ఖర్చుల భారం ఆ కుటుంబంపై పడకుండా చూడాలన్న సీఎం జగన్ సూచనల మేరకు.. ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించి, మొత్తం ఖర్చులను సీఎం సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పునీత్ అభిమాని పాదయాత్ర
Puneeth Rajkumar Fan Walks From Mysuru To Tirupati As Tribute: మైసూరుకు చెందిన అభిమాని ఒకరు దివంగత యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పిస్తూ తిరుమల కొండకు పాదయాత్ర ప్రారంభించాడు. మైసూరులోని ఆగ్రహారకు చెందిన మసాజ్ సందీప్‌కు పునీత్ అంటే వీరాభిమానం. ఆయన హఠాన్మరణంతో ఆవేదనకు గురయ్యాడు. పునీత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈనెల 19 నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. -
పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం
Kannada Star Hero Darshan And Bad Experience At Puneeth Rajkumar Namana Samsmaran Sabha: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు కన్నడ సినీ పరిశ్రమ తరపున ‘పునీత్ నామన’ పేరుతో ఘనంగా సంస్మరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబర్ 16న బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో భారీగా ఈ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో పాటు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కన్నడ సినీ పరిశ్రమకు సినీ ప్రముఖలు, నటీనటులతో పాటు తమిళ నటుడు శరత్ కుమార్, హీరో విశాల్‌తో తదితరులు హాజరయ్యారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా అలాగే టాలీవుడ్ నుంచి హీరో మంచు మనోజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వారంత పునీత్‌కు నివాళులు అర్పించి, ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతరం అయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు రావడంతో అక్కడ బందోబస్తు కూడా భారీగానే పెట్టారు. అయితే ఈ సభ ప్రాంగణం వెలుపల ఓ కన్నడ స్టార్ హీరోకి చేదు అనుభవం ఎదురైంది. శాండల్‌వుడ్ అంతా అభిమానంగా డి బాస్ అని పిలుకునే స్టార్ హీరో దర్శన్‌ను లోపలికి వెళ్లకుండా అక్కడి పోలీసులు అడ్డగించినట్లు సమాచారం. చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్ టాప్ స్టార్ హీరోలలో దర్శన్ కూడా ఒకరు. పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభకు దర్శన్ కొంచెం ఆలస్యంగా రావడంతో ఆయనను గేటు దగ్గర పోలీసులు ఆపినట్లు సమాచారం. ఆడిటోరియం ఫుల్ అయిపోవడంతో.. కూర్చోడానికి సీట్లు కూడా లేవని చెప్పి దర్శన్‌ను బయటే ఆపేపేశారట. తను లోపలికి వెళ్లి వెంటనే బయటికి వచ్చేస్తాని దర్శన్ చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదట. ఆ సమయంలో హీరో దర్శన్‌తో పాటు కొంతమంది ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారట. చాలా సేపు పోలీసులతో మాట్లాడిన అనంతరం ఉన్నతాధికారులు వచ్చి దర్శన్‌ను లోపలికి అనుమతించారట. చదవండి: మెగాస్టార్ రిక్వెస్ట్.. సినీ పరిశ్రమలోని వారికి 50 శాతం డిస్కౌంట్ కానీ లోపలికి వెళ్లినా కూర్చోవడానికి సీట్లు లేక సెకండ్ క్లాస్‌లో కాసేపు కూర్చున్నాడు. ఇక కార్యక్రమంలో దర్శన్ స్టేజ్‌పై మాట్లాడుతూ పునీత్ హఠ్మారణం తలచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో కొద్దిసేపు మాత్రమే దర్శన్ మాట్లాడి స్టేజ్‌పై నుంచి వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పునీత్ బదులుగా దేవుడు తనని తీసుకేళ్లినా బాగుండంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక విశాల్ సైతం పునీత్ చదివిస్తున్న 1800 పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని, ఇది తనకు అప్పగించాల్సిందిగా పునీత్ కుటుంబ సభ్యులను విజ్ఞప్తి చేశాడు. -
Mannu Bhandari: రాలిన రజనీగంధ
స్వాతంత్య్రానంతరం వచ్చిన రచయితల తరంలో మన్నూ భండారీ(3 ఏప్రిల్ 1931 – 15 నవంబర్ 2021) ఒక అద్భుతమైన మహిళ. కథకురాలిగా, నవలా రచయిత్రిగా పురుషాధిక్య ప్రపంచంలో ఆమె తలెత్తుకు నిలబడ్డారు. అజ్మీర్(రాజస్థాన్)లో కళాశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆమె స్వాతంత్య్రోద్యమపు బందులు, నిరసనలు, ఊరేగింపుల్లో పాల్గొన్నారు. వీధుల్లో అబ్బాయిలతో మార్చ్ చేస్తూ, స్లోగన్లు ఇస్తూ, రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్న ఆమె తీరును తండ్రి జీర్ణించుకోలేకపోయారు. కానీ నరాల్లో ఉద్యమావేశపు లావా ఉప్పొంగుతున్నప్పుడు ఆమెను ఎవరు ఆపగలరు? అదే కృతనిశ్చయాన్ని ఆమె తన సహ రచయిత రాజేంద్ర యాద వ్ను వివాహమాడటంలోనూ చూపారు. పై చదువులకు కోల్‌కతా వెళ్లినప్పుడు యాదవ్‌ను ఆమె కలిశారు. అదే కోల్‌కతాలో హిందీ టీచర్‌గా ఆమె కొన్నాళ్లు పనిచేశారు. చక్కటి చదువరి అయిన మన్ను తన మొదటి కథ ‘మై హార్ గయీ’(నేను ఓడిపోయాను) అలా రాసేశారు. 1957లో ‘కహానీ’ మ్యాగజైన్లో దానికి వచ్చిన స్పందన ఆమెను గాలిలో తేలి యాడించింది. ప్రతిగా మరిన్ని కథలు రాశారు. అన్నీ కూడా తను పెరిగిన అజ్మీర్‌లోని మనుషులను ఆధారం చేసుకొన్నవి. రాజేంద్ర యాదవ్ 1951 నాటికే ‘సారా ఆకాశ్’ రాసివున్నారు. హిందీ రచయితలకు సాహిత్య వాతావరణం మరింత అనుకూలంగా ఉంటుందని వాళ్లు 1964లో ఢిల్లీకి మారిపోయారు. ఢిల్లీ యూనివర్సిటీలో మన్నూకు లెక్చరర్‌గా ఉద్యోగం దొరికింది. ఇక తర్వాతి సంవత్సరాల్లో మిరుమిట్లు గొలిపే కీర్తిశిఖరాలను ఆమె అధిరోహించారు. కథలు రాస్తూనే, నవలలకు మారి, అటుపై సినిమా రచన ల్లోనూ మునిగిపోయారు. యాభైకి పైగా ఉన్న ఆమె కథలు ముఖ్యంగా చిన్న పట్ట ణాల్లోని మధ్య, దిగువ తరగతి జీవితాలను అరుదైన సున్నితత్వంతో చిత్రిస్తాయి. సామాజిక బంధనాల్లో చిక్కుకున్న, వాటిని దాటడానికి పోరాడిన, అలసిపోయిన మహిళలు కూడా ఆమె రచనల్లో కనబడతారు. 1950ల మధ్యలో మొదలైన నవ్య కథా ఉద్యమంలో మన్నూ భండారీ కూడా భాగం. ఆమె భర్త రాజేంద్ర యాదవ్‌తో పాటు మోహన్ రాకేశ్, కమలేశ్వర్ ప్రారంభించిన ఈ ఉద్యమం స్వాతంత్య్రానంతర తరం వారి ఆందోళనలు, అనుభవాలను ఎత్తి చూపడానికి లక్ష్యించినది. ముగ్గురు కూడా అసమాన ప్రతిభావంతులు, అదే సమయంలో ఎవరి అహాలు వారికి ఉండేవి. యాదవ్‌కూ మోహన్ రాకే శ్కూ చెడినప్పుడు కూడా మోహన్‌తో మన్నూ స్నేహం కొనసాగించింది. ‘నా సొంత అస్తిత్వం నాకు ఉండదా?’ అని రాకేశ్‌ను ప్రశ్నించారు మన్నూ. అయితే ముప్ఫై ఏళ్ల సహ జీవనం తర్వాత యాదవ్‌తో ఆమె వివాహ బంధం ముగిసింది. కానీ యాదవ్ ఇచ్చిన సహకారాన్ని ఆమె ఎప్పుడూ గుర్తుంచు కున్నారు. ఇద్దరూ కలిసి ‘ఏక్ ఇంచ్ ముస్కాన్’(ఒక అంగుళం చిరునవ్వు) నవల కూడా రాశారు. అందులోని అమర్ పాత్ర భాగాలు యాదవ్ రాస్తే, అమల, రంజన కోణాల్లోవి మన్నూ రాశారు. 1970 నాటికి ఆమె నాలుగు కథాసంపుటాలు ప్రచురించారు. తల్లిదండ్రులు విడిపోదామని నిర్ణయించుకున్నప్పుడు తొమ్మిదేళ్ల పిల్లాడు బంటీ మానసి కోద్వేగపు ప్రయాణపు కోణంలో ‘ఆప్కా బంటీ’ రాశారు. అప్పటికి మన్నూకు కూడా తొమ్మిదేళ్ల పాప రచన ఉండటం కాకతాళీయం కాదు. ఈ నవల ధారావాహికగా ప్రచురితం అవుతున్నప్పడు వస్తున్న ఉత్తరాలను చూసి పోస్ట్‌మాన్... ఈ ఇంట్లోనే ఒక ఆఫీస్ తెరవకూడదా అన్నాడట. నవల మీద విప రీతమైన చర్చలు జరిగాయి. అయితే పాఠకుల స్పందన అధికంగా బంటీ మీదే కేంద్రీకృతమై... తన లక్ష్యానికీ, మాతృత్వానికీ మధ్య నలిగిపోయిన ఆధునిక స్త్రీ మీదకు ఎక్కువ ప్రసరించకపోవడం పట్ల ఆమె కొంత నొచ్చుకున్నారు కూడా. 1974లో బాసూ ఛటర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘రజనీగంధ’ ఆమెను మరో మెట్టు ఎక్కించింది. ఆమె కథ ‘యేహీ హై సచ్’(ఇదే నిజం) ఆధారంగా తీసిన ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది. అప్పటికి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన బాసూ ఛటర్జీ కోసం శరత్ కథ ‘స్వామి’ని తిరగరాశారు. సినిమా బాగా ఆడినప్పటికీ, క్లైమా క్స్‌లో భర్త కాళ్ల మీద భార్య పడే సీన్ పట్ల ఆమె పూర్తిగా విభేదించారు. భార్యను తన చేతుల్లోకి భర్త తీసుకోవడం ద్వారా కూడా అదే ఫలితం రాబట్టవచ్చని ఆమె వాదన. బాసూ ఛటర్జీ దూరదర్శన్ కోసం తీసిన ‘రజని’ సీరియల్ కోసం కూడా మన్నూ పని చేశారు. ఇది కూడా సంచలనం సృష్టించింది. బిహార్‌లోని బెల్చి గ్రామంలో జరిగిన దళితుల ఊచకోత ఘటనకు కదలిపోయి 1979లో పూర్తిస్థాయి రాజకీయ నవల ‘మహాభోజ్’ రాశారు. ఇది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తరఫున అమల్ అల్లానా దర్శకత్వంలో నాటకంగా వచ్చి అరు దైన సమీక్షలు పొందింది. ఎన్ఎస్డీకి అది స్వర్ణయుగం. మనోహర్ సింగ్, సురేఖా సిక్రీ, ఉత్తర బావోకర్, రఘువీర్ యాదవ్ లాంటివాళ్లు అందులో ఉండి, నాటకంలో పాత్రధారుల య్యారు. ఇంతటి విజయాలు చూసిన తర్వాత ఎవరిలోనైనా అహం పొడసూపడం సహజం. కానీ మన్నూలో లేశమాత్రం కూడా అది కనబడేది కాదు. అన్ని స్థాయుల వాళ్లతోనూ ఆమె తన జీవితాంతం స్నేహం చేశారు. చివరి దశలో అనారోగ్యం ఆమెను తినేసింది. నవంబర్ 15వ తేదీన ఆమె మరణించారు. కానీ చెరిగి పోని ఆమె వారసత్వం మనకు మిగిలివుంది. – పూనమ్ సక్సేనా పాత్రికేయురాలు, అనువాదకురాలు -
మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ
Live Updates Time: 04:15 Pm ► మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. మాది అక్కాచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వమని అన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ► రాష్ట్రంలో 61 లక్షా 73 వేల పెన్షన్లు అందిస్తున్నాం. అందులో 36 లక్షల 70వేల మంది మహిళలకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. త్వరలోనే ఈబీసీ నేస్తం అనే కొత పథకానికి శ్రీకారం చుడతామని, వచ్చే జనవరి 9 నుంచి ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్లు తెలిపారు. ►కేబినెట్లో మహిళా సాధికారతకు పెద్ద పీట వేయడంతో పాటు చరిత్రలో తొలిసారిగా ఎస్ఈసీగా మహిళను నియమించామన్నారు. మహిళలపై నేరం జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, మహిళల భద్రతపై ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. Time: 03:05 Pm ► హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడతూ.. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలను చేశామని అన్నారు. గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసులో నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసి ఆరు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్లు చాలా వేగంగా నమోదు చేస్తున్నామన్నారు. దిశ చట్టాన్ని కొంత మంది అవహేళన చేస్తూ చట్టానికి సంబంధించిన కాపీలను తగల పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. Time: 02:30 Pm ► మహిళా సాధికారతపై ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వచ్చేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారని అన్నారు. Time: 02:15 PM ► ఏపీ శాసన మండలి సమావేశం రేపటికి వాయిదా పడింది. Time: 01: 55 PM ► మహిళా సాధికారతపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ.. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని కొనియాడారు. దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. Time: 01:15 PM ► అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చాడని ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళల తలరాతను మార్చే పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఎమ్మెల్యే రోజా తెలిపారు. Time: 12:57 PM ► మహిళా సాధికారతపై నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. గర్భంలో ఉన్న ఆడపిల్ల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు.. ప్రతి దశలో మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. Time: 12:40 Pm ► వైఎస్ఆర్ కాపునేస్తం పథకం ద్వారా ఏటా రూ.75 వేలు, జగనన్న వసతి దీవెన ద్వారా రూ. 2 వేల కోట్ల సాయం లబ్దిదారులకు అందనుందని మంత్రి తానేటి వనిత తెలిపారు. Time: 12: 30 PM ► రుణమాఫీ పథకం వల్ల స్వయం సహాయక సంఘాలకు ఊతం లభిస్తుందని మంత్రి వనిత తెలిపారు. వైఎస్ఆర్ చేయూతతో మహిళల ఆర్థికాభ్యున్నతి సాధ్యమవుతుందని మంత్రి వనిత పేర్కొన్నారు. Time: 12:24 PM ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో మహిళా సాధికారతపై స్వల్ప కాలిక చర్చ కొనసాగుతోంది. మంత్రి తానేటి వనిత మాట్లాడుతున్నారు. Time: 10:20 AM ► ఏపీ అసెంబ్లీలో రేపు(శుక్రవారం) బీసీ జనగణనపై తీర్మానం చేయనున్నారు. బీసీ జన గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానంను సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టనున్నారు. Time: 10: 10 AM ► ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. Time: 09:50 AM ► అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు హాజరు కాగా టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హజరయ్యారు. Time: 09: 09 AM ► ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ► ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిగా బద్వేలు ఎమ్మెల్యేగా ఇటీవల గెలిచిన డాక్టర్ దాసరి సుధ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం 14 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దివంగతులైన 10 మంది మాజీ సభ్యులకు సభ నివాళి అర్పించనున్నారు. మహిళా సాధికారత మీద స్వల్పకాల చర్చ జరగనుంది. -
Puneeth Rajkumar: తీవ్ర భావోద్వేగానికి లోనైన నటుడు శరత్‌కుమార్
Sarathkumar Emotional Words About puneeth Rajkkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. పునీత్ మరణంతో కన్నడ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా మంగళవారం బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో పునీత్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్నతమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్..పునీత్‌ను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. 'పునీత్ బదులు నేను చనిపోయినా బాగుండేది. ఇదే వేదికపై రాజకుమార మూవీ 100రోజుల వేడుక జరిగింది. ఇప్పుడు పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడే జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా.. కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది' అంటూ కన్నీరు పెట్టుకున్నారు. కాగా 2017లో రాజకుమార సినిమాలో పునీత్‌కు తండ్రిగా నటించారు శరత్‌కుమార్. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మళ్లీ ఇప్పుడు పునీత్ చివరి సినిమా జేమ్స్లో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని తీవ్ర భావేద్వాగానికి లోనయ్యారు. -
పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ స్వామీజీ
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): చిత్రదుర్గ మురుఘ రాజేంద్ర బృహమఠం డాక్టర్ శివమూర్తి మురుఘా గురువారం బెంగళూరులోని పునీత్ రాజ్‌కుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ మరణానంతరం ఆయనకు బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించారు. ప్రశస్తిని స్వీకరించటానికి రావాలని పునీత్ భార్య అశ్వినిని ఆహ్వానించారు. అభిమానుల అన్నదానం మైసూరు: హీరో పునీత్ రాజ్‌కుమార్ పుణ్య స్మరణగా టి.నరసిపుర తాలూకా బసవనహళ్ళిలో అభిమానులు, గ్రామస్తులు భారీఎత్తున అన్నదానం నిర్వహించారు. సుమారు 2 వేల మందికి మాంసాహారంతో కూడిన భోజనం వడ్డించారు. మంచే గౌడ అనే అభిమాని గుండు చేయించుకుని నివాళులు అర్పించారు. చదవండి: ఇతని పేరు చెబితే రాజకీయనేతలు, ప్రముఖ వ్యక్తులు హడలిపోతారు. -
అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం జగన్
-
మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (నవంబర్ 11) సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. తన క్యాంప్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నిసా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ పాల్గొన్నారు. -
పెళ్లి మండపంలోనే పునీత్‌కు నివాళి అర్పించిన కొత్తజంట
Newly Married Couple Pays Tributes To Puneeth Rajkumar At Mysore: కొత్త దంపతులు పెళ్లి మండపంలోనే పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు శ్రద్ధాంజలి ఘటించి అభిమానాన్ని చాటుకున్నారు. మైసూరు సిద్ధార్థ నగరలోని కనక భవనంలో ఆదివారం మను కిరణ్, లావణ్య అనే నూతన జంట వివాహం జరిగింది. మూడుముళ్ల సంబరమయ్యాక అక్కడే పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలు వేసి నివాళి అర్పించారు. అతిథులు నూతన జంటని ఆశీర్వదించడంతో పాటు పునీత్‌కు శ్రద్దాంజలి ఘటించారు. అందరిలోనూ పెళ్లి సంతోషం కంటే పునీత్ దూరమయ్యాడన్న బాధ వ్యక్తమైంది.చదవండి: నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా? పునీత్ అభిమాని ఆత్మహత్య మైసూరు: పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని తట్టుకోలేక ఒక అభిమాని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం మైసూరు జిల్లాలోని కేఆర్ నగర పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుడైన అశోక్ (40) పునీత్ లేడన్న నిజాన్ని భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చదవండి: పునీత్ మరణం: లైవ్‌లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్ అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు -
చిన్న వయసులోనే వదిలివెళ్లడం బాధాకరం: చిరంజీవి
-
పోటెత్తిన అభిమానులు : శోకసంద్రమైన బెంగళూరు
సాక్షి, బెంగళూరు: తమ అభిమాన హీరో పునీత్ రాజ్‌కుమార్‌ను కడసారి దర్శించుకునేందుకు అభిమానులు ఉప్పెనలా తరలివస్తున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో అంతిమ నివాళులర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా శోకసంద్రంలో మునిగిన అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. సంద్రాన్ని తలపించేలా వస్తున్న అభిమానులు ‘‘అప్పూ.. మిస్.. యూ’’ అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. దేవుడా ఏం తప్పు చేశాడని కోట్లాది మంది అభిమానుల ప్రాణాలను తీసుకుపోయావు అంటూ రోదిస్తున్నారు. పునీత్ తల్లిదండ్రులు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మ అంత్యక్రియలు జరిగిన కంఠీరవ స్టేడియంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విదేశాల్లో ఉన్న పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరోవైపు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో కంఠీరవ స్టేడియంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం వెల్లడించారు. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం బొమ్మై దివంగత నటుడికి నివాళులర్పించారు.(Puneeth Rajkumar: పునీత్, అశ్విని రేవంత్ లవ్ స్టోరీ..వైరల్) కాగా 46 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అప్పూకి అంతిమ నివాళులర్పించేందుకు వీలుగా ఆయన భౌతిక కాయాన్ని స్టేడియంకు తరలించారు. (Puneeth Rajkumar:పునీత్ ఔదార్యాన్ని చూడలేక విధికి కన్నుకుట్టింది Fans walking in to Kanteerava stadium to get a last glimpse of Kannada actor Puneeth Rajkumar. His body will be kept here for public homage till evening. @TheQuint pic.twitter.com/vHc80JhvBx — Nikhila Henry (@NikhilaHenry) October 30, 2021 ) God, took away the lives of crores of his admirers. What bad did he do🙏 Never in his life, 💔😔 #PuneethRajkumar #PuneethRajkumarFans pic.twitter.com/1netN5OsVN — KR (@ImKalyanRaksha) October 29, 2021 -
వాల్మీకి మహర్షికి సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారధి, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ పాల్గొన్నారు. -
నేడు ట్యాంక్‌బండ్‌పై ఎస్పీ ‘బాలు’ సంస్మరణ వేదిక
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్న ట్యాంక్‌బండ్ ఈ ఆదివారం సాయంత్రం గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణకు వేదిక కానుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ఆర్కెస్ట్రాలో పలువురు గాయనీ గాయకులు బాలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సైతం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్నారు. ఆర్పీఎఫ్ బ్యాండ్‌మేళా, ప్రదర్శన సందర్శకులను కనువిందు చేయనుంది. ప్రతి ఆదివారం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సారి కూడా ఒగ్గుడోలు, గుస్సాడి, బతుకమ్మ, బోనాలు వంటి సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: Civils Ranker: ఈజీగా ఏదీ దక్కదు.. అలాగే సాధ్యం కానిదంటూ లేదు -
‘సంస్కారానికి నిలువెత్తు రూపం’
బాలు నిర్వహించిన ఒక పాటల రియాలిటీ షోలో పాల్గొని మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. సంగీత ప్రపంచంలో స్థానం దక్కించుని, తన సంగీత దర్శకత్వంలో బాలు పాడే స్థాయికి ఎదగాలనుకున్నారు. తన కలను నెరవేర్చుకున్నారు. బాలుతో సుమారు 15 పాటలు పాడించుకున్నారు. బాలు నుంచి బోలెడన్ని ప్రశంసలు అందుకున్నారు. తన ఎదుగుదలకు పరోక్షంగా బాలు ప్రేరణ అయిన విధానం తలచుకుంటూ బాలు ప్రధమ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకులు కె. ఎం. రాధాకృష్ణ బాలు పాటతో పెరిగాను.. నా ఐదవ ఏట నుంచే శాస్త్రీయం సంగీతం నేర్చుకున్నాను. మా నాన్నగారితో కలిసి లలిత సంగీతం పాడేవాడిని. అప్పట్లో ప్రతిరోజూ రేడియోలో సినిమా పాటలు వినేవాడిని. బాలుగారి పాటలు ట్రెండీగా, కమర్షియల్‌గా అనిపించేవి. అందరూ బాలు గారి గురించి మాట్లాడుకోవటం, బాలుగారిలా పాడాలి అనుకోవటం వింటూ పెరిగాను. అందరిలాగే నేను కూడా అలాగే అనుకున్నాను. బాలుగారికి సన్నిహితులైన కొందరి ద్వారా ఆయనను స్వయంగా చూసే అదృష్టం కలిగింది. 1998లో ఒక ప్రముఖ టీవీ చానల్లో పాటలకు సంబంధించి ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశాను. మొదటి ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ అయిపోయాను. అలా మొదటి రౌండ్లోనే ఎలిమినేట్ అవ్వటం వల్ల నేను సంగీత దర్శకుడిగా మారాలనే కసి, పట్టుదల పెరిగాయి. సంగీత సాధన చేయటం ప్రారంభించాను. గాయకుడిగా కంటె, సంగీత దర్శకుడిగా స్థిరపడటం మంచిదని భావించి, దాని మీద దృష్టి పెట్టాను. ఉప్పొంగెలే గోదావరి... 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న పిల్లల కోసం తీసిన హీరో సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా తొలి అడుగు పెట్టాను. అప్పటికే నేను చేసిన ఆల్బమ్స్ నా స్నేహితులు.. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు వినిపించారు. ఆయనకు నచ్చటంతో ఆయన దర్శకత్వంలో రూపొందిన ఆనంద్ చిత్రానికి స్వరపరిచే అవకాశం వచ్చింది. అందులో బాలు గారి చేత పాడించుకోలేకపోయాననే వెలితి నాలో ఉండిపోయింది. ఆ తరవాత ‘గోదావరి’ చిత్రంలోని ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ద్వారా ఆ వెలితి పోయింది. ఆయన ఆ పాట విని ఎంతో పరవశించారు. ఆయనతో పాడించుకోవటం వల్ల ఆ పాటకు ఎంతో అందం వచ్చింది. ఈ పాట బాలు గారు పాడితే ప్రపంచవ్యాప్తం అవుతుంది అనుకున్నాను. అదే జరిగింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘మాయాబజార్’ చిత్రంలో ‘సరోజ దళ నేత్రీ’ పాట వింటూనే బాలు గారు ‘ఈ పాట చాలా హాయిగా, అద్భుతంగా ఉంది. ఈ పాటను నేను మరింత అందం తీసుకురావటానికి ప్రయత్నిస్తాను’ అంటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ పాడారు. ఆ రాత్రి నాకు ఆనందంతో నిద్ర పట్టలేదు. అప్పుడు అనుకున్నాను, ఆ రోజు పోటీలో ఓడిపోవటం మంచిదైందని. ఆనాటి నుంచి ఈ రోజు వరకు సంగీతం మీదే నిలబడ్డాను. ఉదయం తొమ్మిది నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు కష్టపడటం అలవాటైంది. విపరీతమైన అలసట, తిండి కూడా సరిగ్గా తినే సమయం దొరకనంత బిజీగా ఉన్నాను. ‘గోదావరి’ చిత్రం వల్ల చిత్ర పరిశ్రమలో నాకు గౌరవం మరింత పెరిగింది. నిర్విరామంగా, నిరంతరం కష్టపడ్డాను, పడుతూనే ఉన్నాను. ఆయనది బేస్ వాయిస్... బాలుగారిది చాలా బేస్ వాయిస్. అందువల్ల ఏ పాటనైనా సులువుగా పాడేయగలుగుతారు. ఆయన నలభై ఏభై వేల పాటలు పాడటం పూర్తిగా దైవకృప. ఆయన ఒక నిరంతర సైనికుడిలా పాడుతూనే ఉన్నారు. ఆయనను చూసి.. ‘నేను కూడా బాలుగారిలాగ పాడాలి, హెలికాప్టర్లో తిరగాలి, ఆకాశవాణి, దూరదర్శన్లలో ఇంటర్వ్యూలు ఇవ్వాలి’ అని కలలు కనేవాడిని. నా కలలు వాస్తవం అయ్యాయి. బాలు, శంకర్ మహదేవన్, హరిహరన్, శ్రేయోఘోషల్, ఆషాభోంశ్లే వంటి వారితో పాడించే స్థాయికి ఎదగటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎంతో చనువుగా అనేవారు... నేను స్వరపరచిన కొన్ని పాటలు విని,‘నాతో ఎందుకు పాడించలేదు’ అని చనువుగా నన్ను కోప్పడేవారు. పాటలో ఉన్న జీవాన్ని తన గొంతులో పలికించేవారు. బాలు నిరంతర శ్రమజీవి. ఆయనకు భగవంతుడి నుంచి పరిపూర్ణమైన ఆశీర్వాదం ఉంది. సహనంగా ఎన్నిటినో తట్టుకోవటం వల్లే ఈ స్థాయికి ఎదిగారు. బాలుకి ఎంతోమంది ప్రత్యామ్నాయంగా ఉన్నా, ఆయనది ‘యంగ్ వాయిస్’ కావటం వల్ల అందరూ ఆయననే కోరుకున్నారు. యువతరంలోకి కూడా పరకాయ ప్రవేశం చేసి, వాళ్ల గొంతులో దూరి ఈయన పాడటం వల్ల పాటలు బాగా హిట్ అయ్యాయి. నేను ఒక పాట ట్రాక్ రికార్డు చేసి, బాలుగారికి పంపి, ‘సర్! నాకు యంగ్ వాయిస్‌లో కావాలి’ అన్నాను. ఆయన తన గొంతుని కంట్రోల్ చేస్తూ, యంగ్ హీరోలాగే పాడారు. డబ్బింగ్ అనుభవం, టైమింగ్ తెలిసి ఉండటం వల్ల ఆయన ఎవరికి పాడితే వారు పాడినట్లే అనిపించేది. అలా ఆయన తన గొంతును మార్చేవారు. మంద్ర స్థాయిలో పాడటం బాలు చేసిన మంచి పని. చాలామందికి నమ్మకాన్ని, స్ఫూర్తిని ఇచ్చారు. బాలుగారి నిరంతర శ్రమ వల్ల ఎంతోమంది పైకి వచ్చారు. నమ్మకాన్ని పెంచింది... నాకు శాస్త్రీయ సంగీతం రాదని చెబితే, బాలుగారు, ‘శాస్త్రీయంగా పాడుతున్నావు, సంగీతం రాదంటే ఎవరు నమ్ముతారు’ అన్నారు. ఆ తరవాత నుంచి శాస్త్రీయ సంగీతం బాగా సాధన చేశాను. ఆ సంగీత సాధనే నాకు మనోబలాన్ని ఇచ్చింది. నా పాటలు విన్న బాలుగారు, ‘కమర్షియల్‌గా చేయకపోయినా పరవాలేదు, శాస్త్రీయంగానే చేయాలిరా’ అన్నారు. చాలా వేదికల మీద నా పేరు ప్రస్తావించేవారు. ఏ షోలో ఎవరు నా పాట పాడినా, నన్ను బాగా ప్రశంసించేవారు. వెంటనే నాకు మెసేజ్ కూడా పంపేవారు. అదీ ఆయన సంస్కారం. కె. ఎం. రాధాకృష్ణ, సంగీత దర్శకులు సంపూర్ణ సుగుణాల కలబోత 1996లో ఒక రియాలిటీ షోలో పాల్గొన్న కార్యక్రమం ద్వారా బాలుగారితో 60 వారాల పాటు ప్రయాణం చేశాను. కేవలం బాలుగారిని చూడటానికే ఆ రియాలిటీ షోలో పాల్గొన్నాను. ఆ తరవాత నుంచి ఆ రియాలిటీ షోలో సెలక్షన్స్ ప్రక్రియను నాకే అప్పచెప్పారు. ఒక షోలో గెలుపొంది, ఆ షో సెలక్షన్స్‌తో పాటు, అదే కార్యక్రమానికి జడ్జిగా కూడా రావటం కేవలం బాలుగారి వల్లే జరిగింది. అలా ఆయనతో ప్రారంభమైన ప్రయాణం బాలుగారి తుది శ్వాస వరకు కొనసాగింది. ఆయన నన్ను ‘కొడుకు’ అనేవారు. నాకు ఆయన పితృ సమానులు. నన్ను బాలుగారే స్వయంగా ప్రముఖ దర్శకులు బాపు గారికి పరిచయం చేశారు. నన్ను మొట్టమొదటగా అమెరికాకు తీసుకు వెళ్లింది కూడా బాలు గారే. 2001లో నా స్టూడియోని బాలు గారే ప్రారంభించారు. నా స్టూడియోలోనే సుమారు నాలుగు వేల పాటలు పాడారు. అది నా అదృష్టం. ఆయన ప్రేమను పంచే మనిషి. చాలా ఆల్బమ్స్‌లో బాలుగారితో పాడించుకున్నాను. ఆయన రూపొందించిన ఒక కార్యక్రమంలో నేను సుమారు 80 పాటలు పాడాను. దేనికీ ఒక్క పైసా పుచ్చుకోలేదు. ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ, ఆయన నన్ను పొగిడారు. అప్పుడు నేను ఆయనతో, ‘‘మీరు మాకు పాడే అవకాశం ఇస్తే అది మాకు అవకాశం దొరికినట్లు, అదే మేం మీతో పాడించుకుంటే అది మా అదృష్టం’’ అని చెప్పాను. కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘స్వరాభిషేకం’ చిత్రంలోని ‘కుడి కన్ను అదిరెనే’ పాటను నేనే స్వరపరిచాను. చిత్రంలో టైటిల్స్‌లో నా పేరు రాదు. కాని బాలు గారు ప్రపంచానికి ఈ విషయాన్ని పదేపదే చెప్పటం వల్లే నేను ఆ పాట చేశాననే విషయం అందరికీ తెలిసింది. తండ్రిలా ఉండేవారు... నాకు బాగా ఊబ కాయం రావటంతో, ఆయనే దగ్గరుండి నాకు బేరియాటిక్ సర్జరీ చేయించారు. ఆయనకు నా మీద ఉన్న పుత్రవాత్సల్యంతో చేసినందుకు నాకు ఆనందం అనిపించింది. చిన్న పిల్లలతో తూము నరసింహదాసు కీర్తనలు పాడించాను. అందులో ప్రతి ఎపిసోడ్‌కి ఆయన ముందు మాట చెప్పారు. నేను నిర్వహించిన ‘భాగవతం పద్యాలు’ కార్యక్రమానికి జడ్జిగా వచ్చారు. ఏ కార్యక్రమానికీ నా దగ్గర ఒక్క పైసా తీసుకోలేదు. అంతటి మహానుభావుడు. ప్రతి దశలోనూ అడుగడుగునా చెయ్యి పట్టుకుని నడిపించిన పెద్ద మనిషి. నేను ఆయనను వ్యక్తిగతంగా పోగొట్టుకున్నాను. ‘‘నేను పార్థు అడిగితే ఏదీ కాదనలేను’’ అనేవారు. ఆయనకు నేను చేసే కార్యక్రమాలంటే అంత ఇష్టం. మానవత్వానికి నిలువెత్తు రూపం.. బాలుగారు తుది శ్వాస విడిచాక, సెప్టెంబరు 25వ తేదీ చెన్నై వెళ్లాను. నేను గోపిక పూర్ణిమ.. ఇద్దరం కలిసి ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6.30 వరకు పాటలు పాడాం. ‘ఉరై రారా! నాతో గడుపు’ అన్నట్లుగా అనిపించింది. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు ఇచ్చారు. ఆయనకు నా పాటలు ఏవి నచ్చినా, కళ్లతో ఆనందం వ్యక్తం చేసేవారు. భుజం మీద చెయ్యి వేసి తట్టేవారు. సంపూర్ణమైన మానవత్వానికి ప్రతీక. ఆయనను అతి దగ్గరగా చూసినవారిలో నేనూ ఒకడిని. ఆయనతో నేను ‘‘మీ వ్యక్తిత్వం నేర్చుకుంటే వస్తుంది, కాని మీ విద్య, ప్రతిభ నేర్చుకుంటే వచ్చేది కాదు’’ అనేవాడిని. అందరి గురించి అడిగేవారు.. ఆయన స్టూడియోకి వస్తూనే ఆఫీస్ బాయ్స్ క్షేమసమాచారాలు స్వయంగా అడిగి తెలుసుకునేవారు. ‘ఆయన గొప్ప కళాకారుడు’ అని చెప్పడానికి పార్థసారథి అవసరం లేదు. చాలా సింపుల్‌గా ఉంటారు. మనిషిని గౌరవించటం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన గురించి ఎన్నని చెప్పగలను. ఎన్నో గుప్తదానాలు చేశారు. ఎవరో తెలిసినవారు ఆసుపత్రిలో ఉంటే, నా ద్వారా డబ్బు పంపారు. ‘మానవత్వం, మంచితనం, సమాజసేవ, కళాకారుడు, వ్యక్తిత్వం... ఇన్ని సుగుణాలు ఉన్న ఇంత గొప్ప వ్యక్తి ఇక మీదట రాడు. తన లోని లోపాలను గుర్తించి, తానే స్వయంగా సరిచేసుకునేవారు ఒక్కరు కూడా లేరు. గొప్ప సంగీత దర్శకుడైనా సరే, ఊరుపేరు లేని సంగీత దర్శకులైనా సరే ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో పాడేవారు. అనుకున్న సమయానికి రికార్డింగుకి వస్తారు. ఏదైనా కారణం చేత ఆలస్యమైతే, క్షమాపణ అడుగుతారు. సంపూర్ణమైన సుగుణాల కలబోత బాలు. - డా. పురాణపండ వైజయంతి చదవండి: సోషల్ హల్చల్: క్యూట్ పప్పీతో చెర్రీ.. విలువైన పిక్ ఇదేనంటున్న ఉపాసన -
ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉంటారు: వైఎస్ జగన్
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వదిలి అప్పుడే ఏడాది కావస్తోంది. తన స్వర మాధుర్యంతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గొంతు మూగబోయిందనే విషయాన్ని జీర్ణించుకోవడం ఇంకా కష్టంగానే ఉంది. ఎస్పీ బాలు వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. 'మధుర గాయకులు, స్వరకర్త ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి. తన గాత్రంతో తెలుగు వారినే కాదు ఎన్నో భాషల్లో అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉంటారు' అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాగా గతేడాది సెప్టెంబర్ 25న ఎస్పీ బాలు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మధుర గాయకులు, స్వరకర్త ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి. తన గాత్రంతో తెలుగు వారినే కాదు ఎన్నో భాషల్లో అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా వుంటారు. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2021 -
కన్నీళ్లకే కన్నీరొచ్చే...నీ పాటే శరణ్యం
సాక్షి,హైదరాబాద్: కోట్లాదిమంది అభిమానులను కన్నీటి సాగరంలో ముంచి గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కానరాని లోకాలకు తరలిపోయి అప్పుడే సంవత్సరం కావస్తోంది. తన స్వర మాధుర్యంతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గొంతు మూగబోయిందనే విషయాన్ని జీర్ణించుకోవడం ఇంకా కష్టంగానే ఉంది. ఆ దివికేగిన ఎస్పీబీని తలచుకుంటే ఇప్పటికీ అభిమానులు గుండెలు కన్నీటి సంద్రాలే. సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారిపై సుదీర్ఘ పోరాటం తరువాత ఇక సెలవంటూ తనువు చాలించి అపుడే సంవత్సరం గడిచిపోతోంది. దశాబ్దాల తరబడి తన అమృత గానంతో మైమరపించిన ఆ స్వరధార గత ఏడాది సెప్టెంబరు 25న ఆగిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వస్తారని వేయి దేవుళ్లకు మొక్కుకున్న అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతోమంది యువకళాకారులు, గాయకులకు స్ఫూర్తినివ్వడమే గాదు, వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించిన బాలు లేని లోటు తీరదు గాక తీరదు. ఆయనకు ఆయనే సాటి. బంగారానికి తావి అబ్బిన చందంగా తన అపూర్వ ప్రతిభతో ఇంతింతై వటుడింతై అన్నట్టు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో వేనవేల పాటలతో అలరించారు. కేవలం గాయకుడిగానే కాదు డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా తన దైన ప్రతిభను చాటు కున్నారు. తన ప్రయాణాన్ని అలా అప్రతిహతంగా కొనసాగిస్తున్న తరుణంలో.. మాయదారి మహమ్మారి ఆయనను మింగేసింది. సంగీత ప్రపంచానికి అంతులేని అగాధాన్ని మిగిల్చింది. రానున్న బాలూ మొదటి వర్ధంతిని పురస్కరించుకొని ‘నీవు లేకపోయినా..నీ పాట ఆ చంద్రతారార్కం నిలిచే ఉంటుందంటూ తోటి గాయకులు, సినీ సంగీతాభిమానులు ఆయన జ్ఞాపకాలను తలచుకుంటున్నారు. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గొంతునుంచి జాలు వారిన సుస్వరాలను మళ్లీ గుర్తు చేసుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికల్లో ఆయన పాటలతో ఘన నివాళులర్పించేందుకు సిద్ధ మవుతున్నారు. ప్రఖ్యాత గాయని ఉష ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. లెజెండరీ గాయకుడు దివంగత పద్మవిభూషణ్ ఎస్పీబీ వారసత్వాన్ని కొనసాగించేలా సెప్టెంబర్ 25న ఒక సంస్మరణ కార్యక్రమాన్ని, ఆ తరువాత ఆయన పాటలతో ఒక స్వరఝరి నిర్వహిస్తున్నట్టు ఫేస్బుక్లో వెల్లడించారు.