సాక్షి, నిజామాబాద్: సేంద్రియ విధానంలో అనేక దేశీయ వరి రకాలను పండిస్తున్న నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరుకు చెందిన ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు (నాగుల చిన్నగంగారాం) తన తల్లిదండ్రులు ముత్తెన్న, భూదేవిలను నేలతల్లి సాక్షిగా వినూత్నంగా స్మరించుకున్నారు. ‘మా అమ్మ నాన్న–చిన్నికృష్ణుడు’ అనే అక్షరాల రూపంలో పొలంలో భారీ పరిమాణంలో వరి పంట పెరిగేలా వేశారు. 24 రోజుల క్రితం తన సాగు భూమిలో ‘చింతలూరు సన్నాలు’ వరిని విత్తనాల కోసం నాటారు.
అయితే మధ్యలో ఒక మడిని ‘బంగారు గులాబీ’ అనే నల్ల రంగు వరిని తన తల్లిదండ్రుల రూపం వచ్చేలా నాటారు. చుట్టూ బోర్డర్ వచ్చేలా ‘పంచరత్న’ రకం వరిని వేశారు. ఇందుకోసం ముందుగా ఓ ఆర్కిటెక్ట్‌తో కాగితంపై మ్యాప్ గీయించుకుని అందుకు అనుగుణంగా వరి రకాలను నాటారు. తాజాగా గురువారం డ్రోన్ ద్వారా చిన్నికృష్ణుడు ఈ చిత్రాన్ని ఫొటో తీయించారు.
Comments
Please login to add a commentAdd a comment