crop
-
చౌడు పీడ రబీలోనే ఎక్కువ!
చౌడు సమస్య ఖరీఫ్‌లో కన్నా రబీలోనే ఎక్కువగా ఇబ్బందిపెడుతుంది. చౌడు వల్ల ధాన్యం దిగుబడి తగ్గడం కూడా రబీలోనే ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చౌడును తట్టుకొని 20–25 బస్తాల దిగుబడినిచ్చే డి.ఆర్.ఆర్. ధన్ 39, జరవ, వికాస్ అనే వరి వంగడాలు ఉన్నాయి. ఇవి 120–130 రోజుల్లో కోతకొస్తాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో చౌడు సమస్య ఉంది. మట్టిలో లవణ సూచిక (ఇ. సి.) 4 వరకు ఉంటే కొంత ఫర్వాలేదు. కానీ, మా క్షేత్రంలో ఈ ఏడాది 10.9 ఉంది. ఎక్స్ఛేంజబుల్ సోడియం పర్సంటేజ్ (ఈ.ఎస్.పి.) 15% కన్నా పెరిగితే చౌడు సమస్య తలెత్తుతుంది. చౌడు భూముల్లో కాలువ నీటితో సాగు చేయడానికి అనువైన మూడు వరి వంగడాలను శాస్త్రవేత్తలు గతంలోనే రూపొందించారు. ఎం.సి.ఎం. 100 అనేది రబీకి అనుకూలం. 125 రోజులు. 28–30 బస్తాల దిగుబడి వచ్చింది. ఎం.సి.ఎం. 101 రకం 140 రోజుల పంట. ఖరీఫ్‌కు అనుకూలం. 35 బస్తాల దిగుబడి. అగ్గి తెగులును, దోమను తట్టుకుంది. ఎం.సి.ఎం. 103 ఖరీఫ్ రకం. ఇది రాయలసీమ జిల్లాల్లోనూ మంచి దిగుబడులనిస్తోంది. చౌడు భూముల్లో నాట్లకు ముందు జీలుగ సాగు చేసి కలియదున్నాలి. ఇతర పచ్చిరొట్ట పైర్లు వేస్తే ఉపయోగం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైపైనే దమ్ము చేయాలి. సమతూకంగా ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు వేయడం మంచిది. రబీలో పొలాన్ని ఖాళీగా ఉంచితే, ఖరీఫ్‌లో చౌడు సమస్య ఎక్కువ అవుతుందట. (చదవండి: నౌకాయానంలో వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త) -
రైతులను రోడ్డున పడేశావ్!: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో టీడీపీ కూటమి సర్కారు దారుణ వైఫల్యంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మద్దతు ధర కల్పించి ఆదుకోవాలన్న కనీస ధ్యాస కూడా ఈ ప్రభుత్వానికి లేదని.. రైతులను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా వర్షాలకు తడిసిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని.. కృష్ణా, గోదావరి డెల్టాలో ఎటు చూసినా కిలోమీటర్ల మేర ధాన్యం రాసులే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ముఖం చాటేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు 75 కిలోల బస్తాకు రూ.300–400 నష్టానికి దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. గత ఐదేళ్లూ పారదర్శకంగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ప్రతి రైతన్నకూ కనీస మద్దతు ధర కల్పించి తోడుగా నిలబడ్డామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చేందుకు మోసపూరిత హామీలతో మోసగించిన చంద్రబాబు రైతులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో ఆయన ఇంకా ఏమన్నారంటే..పంటలకు మద్దతు ధర ఏదీ...రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయింది. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి, అవసరమైన సౌకర్యాల కల్పనలో మీ ప్రభుత్వం విఫలమైంది. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతుల వద్ద ధాన్యం కొనే నాథుడే లేకుండాపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. బస్తాకు రూ.300–400 నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మద్దతు ధర దక్కడం రైతులకు ఎండమావిగా తయారైంది. 75 కిలోల బస్తాకు రూ.1,725ల చొప్పున ఏ ఒక్కరికి అందే పరిస్థితి లేకుండా పోయింది.రోడ్లపైనే ధాన్యం... కొనేవారేరీ...ధాన్యం కొనేవారు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపైనే ధాన్యాన్ని పోసి కొనేవారి కోసం నిరీక్షిస్తున్నారు. పైగా ఇప్పుడు మరో కష్టం వచ్చిపడింది. ఫెంగల్ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసి ముద్దయ్యింది. రంగుమారిపోయే పరిస్థితి ఏర్పడింది. తుపాను వస్తుందని నాలుగు రోజుల ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినాసరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు.యుద్ధ ప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ధ్యాస, ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండాపోయింది. కనీసం ఒక్కసారైనా సీఎం స్థాయిలో సమీక్ష చేసిన దాఖలాలు లేవు. కనీసం సరిపడా సంచులు కూడా అందించలేని దుస్థితిలో ఉన్నారు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఎక్కడకు వెళ్లినా కిలోమీటర్ల కొద్దీ ధాన్యం రాశులు రోడ్లపైనే కనిపిస్తున్నాయి. విజయవాడ – మచిలీపట్నం మధ్య 60 కిలోమీటర్ల పొడవునా ఆరబెట్టిన ధాన్యం కొనేనాథుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నా మీకు కనిపించడం లేదా?కనీస సాయం అందించిన పాపాన పోలేదువైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తున్నా సాయం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. వరదలు, వర్షాలు, వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో సాయం అందించిన పాపాన పోలేదు. కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలన్న ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది.ఈ– క్రాప్ ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలనే తపన, రైతులందరికీ సంపూర్ణ మద్దతు ధర దక్కాలనే ఆశయం పూర్తిగా నీరుగారిపోయింది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్‌తో నువ్వు, మీ మంత్రులు కాలం గడుపుతున్నారు.మా హయాంలో పారదర్శకంగా ధాన్యం కొనుగోలువైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం. ఐదేళ్లూ పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేశాం. ప్రతీ రైతుకు కనీస మద్దతు ధర కల్పించాం. అంతేకాదు గన్నీ సంచులు, లేబర్, రవాణా (జీఎల్టీ) చార్జీలను ప్రభుత్వ ద్వారానే అదనంగా ఇస్తూ వచ్చాం. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లోని టోల్ ఫ్రీ నంబర్ 155251తో పాటు ధాన్యం కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 1967తో కూడిన టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. గతేడాది ఇదే సమయంలో వచ్చిన మిచాంగ్ తుపాను సమయంలో రైతులను ఆదుకునేందుకు జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేశాం. కళ్లాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బందిలేకుండా ఉండేందుకు నాడు ప్రతీ జిల్లాకు రూ.కోటి కార్పస్ ఫండ్ కూడా ఇచ్చాం. తుపాను ప్రభావిత జిల్లాల్లో ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచుల కొరత లేకుండా చూశాం.రంగుమారిన, తడిసిన, మొలకెత్తిన ధాన్యం కూడా కొన్నాం..తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశాం. మిల్లర్ల దోపిడీని అరికట్టేందుకు ఆర్బీకేల కేంద్రంగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరించాం. క్షేత్ర స్థాయిలో ఆర్బీకే సిబ్బంది రైతు క్షేత్రాల వద్దకు వెళ్లి జియోట్యాగింగ్ ద్వారా ఫొటోలు తీసి నాణ్యతను పరిశీలించడంతోపాటు ఆన్లైన్లోనే రైతుల వివరాలను నమోదు చేసి ట్రక్ షీట్ జనరేట్ చేశాం. ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమెటిక్‌గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చాం.ధాన్యం లోడులు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్‌ను అమర్చాం. మిల్లుల్లో రైతులతో సంబంధం లేకుండా ధాన్యం నాణ్యత సమస్యలను పరిష్కరించాం. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను ప్రతీ మిల్లుకో కస్టోడియన్ అధికారిగా నియమించాం. మండలానికో ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి రైతుల సమస్యలను పరిష్కరించాం. వ్యవసాయశాఖాధికారి, టెక్నికల్ అసిస్టెంట్ పర్యవేక్షణలో ప్రతీ జిల్లాకో మొబైల్ మినీ మిల్లును ఏర్పాటు చేశాం.రైతులకు, మిల్లర్లకు సంబంధం లేకుండా ఆర్బీకేల ద్వారానే ఇవన్నీ చేశాం. మా హయాంలో ఏ ఒక్క రైతుకు తమకు మద్దతు ధర దక్కలేదని రోడ్డుమీదకు రాలేదు. 2014–19 మధ్య మీ పాలనలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, 2019–24 మధ్య మా హయాంలో 39.01 లక్షల మంది రైతుల నుంచి రూ.67,906.14 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించాం.రైతులకు ఇచ్చిన హామీల అమలు ఎక్కడఅధికారంలోకి వచ్చేందుకు హామీలతో మోసం చేసిన చంద్రబాబు ప్రస్తుతం రైతులను పట్టించుకోవడం లేదు. ప్రతి రైతుకు రూ.20వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వలేదు? సూపర్ సిక్స్ హామీనే గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం ఇక రైతుల ఇతర సమస్యలను ఎందుకు పట్టించుకుంటుంది ? సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరకక రైతులు నానా అగచాట్లు పడ్డారు. లాభసాటిగా సాగు ఎలా చేయాలో రైతులకు సలహాలు ఇచ్చే నిపుణులు లేరు. ఆర్బీకేలు నీరుగారిపోయాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాల రద్దుతో రైతులకు తీవ్ర నష్టం కలిగించారు.విత్తు నుంచి విక్రయం వరకు రైతులను చేయిపట్టి నడిపించిన ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, సున్నావడ్డీ రాయితీ వంటి పథకాలను అటకెక్కించేశారు. రైతులపై పైసా భారం పడకుండా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసి ఆ భారాన్ని రైతుల నెత్తిన మోపారు. 2023–24 సీజన్లో రైతుల తరఫున చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు జూన్‌లో కట్టాల్సి ఉండగా, నువ్వు ఎగ్గొట్టడం వలన రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండాపోయింది. పెట్టుబడి సాయం లేక,రుణాలు అందక రూ.3లు, రూ.5లు వడ్డీలకు అప్పులు చేసి మరీ రైతులు సాగు చేశారు. అడుగడుగునా నువ్వు నిర్లక్ష్యం, మొండి చేయి ప్రదర్శించినా, వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేసిన రైతులు నీ నిర్వాకం వలన తీవ్రంగా నష్టపోతున్నారు. -
రైతుల పంట బీమా కూడా మీకు భారమా బాబూ
-
ఏఈవోల్లో చీలిక!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరిస్తున్న వ్యవసాయ విస్తరణాధికారుల్లో చీలిక ఏర్పడింది.ప్రభుత్వం 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడంతో అనేకమంది వెనక్కి తగ్గినట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపితో బుధవారం జరిగిన చర్చల్లో కొందరు ఏఈవోలు సానుకూలత వ్యక్తం చేశారు. వారి సమస్యలపై వచ్చే సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరిపేందుకు అవకాశం కల్పిస్తానని డైరెక్టర్ హామీ ఇవ్వడంతో ఏఈవోలు తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నామని, డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు సిద్ధమేనని ఆయనకు తెలిపారు. వచ్చే వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని, ఏఈవోల సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు ఏఈఓలు డిజిటల్ సర్వేలో పాల్గొంటారంటూ డైరెక్టర్ గోపీ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో కొందరు ఏఈవో సంఘం నేతలు గురువారం నుంచి డిజిటల్ క్రాప్ సర్వే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సర్వే చేస్తామని తెలిపారు. మొత్తంగా సగం మంది ఏఈఓలు సర్వే చేస్తామని చెబుతుండగా, సగంమంది సర్వే చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా ఏఈఓలు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేయమని చెబుతున్నట్టు తెలిసింది.దీంతో ఏఈవోలు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బుధవారం జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన ఏఈవోలు వ్యవసాయ కమిషనరేట్ వద్ద నిరసనకు దిగారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని, సస్పెండ్ చేసిన ఏఈవోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దశలో కమిషనరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ముందస్తుగా పోలీసులను మోహరించారు. ఏఈవోల సస్పెన్షన్‌తో వ్యవసాయ కార్యక్రమాలపై ప్రభావం కక్ష సాధింపు చర్య వల్లే సస్పెండ్ చేశారని ఏఈవోలు మండిపడుతున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే విషయంలో ఇంతమందిని సస్పెండ్ చేయడం వల్ల అనేక పథకాలు, వ్యవసాయశాఖ చేపట్టే కార్యక్రమాలకు విఘాతం కలగనుంది. ఇప్పుడు గ్రామాల్లో ధాన్యం, పత్తి మార్కెట్లోకి వస్తుంది. ఈ సమయంలో ఏఈవోలు కీలకంగా వ్యవహరిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తితే, రైతులకు అందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సింది కూడా ఏఈవోలే. ఇలాంటి కీలక సమయంలో ఏఈవోలపై ఉక్కుపాదం మోపడం పట్ల వ్యవసాయ ఉద్యోగులు మండిపడుతున్నారు. కాగా, ఏఈవోలు దారికొస్తే సరేసరి లేకుంటే మరికొందరిపైనా కఠిన చర్యలు చేపడతామని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఏఈవోలకు ప్రత్యేక భారం ఏమీ ఉండదని, వారం పది రోజులపాటు నిర్వహించే డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరించాల్సిన అవసరం ఏంటని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. కావాలని ఏఈవోలు ఇదంతా చేస్తున్నారని, వారిని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని అంటున్నారు. మరోవైపు సమ్మెకు సిద్ధమైన ఏఈవోలకు కొన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటిస్తుండగా, మరోవైపు పేరొందిన పలు ఉద్యోగ సంఘాల నేతలు బెదిరింపులకు దిగినట్టుగా తెలిసింది. ఏ విధంగానైనా సరే ఏఈవోలను సమ్మెకు వెళ్లకుండా వారు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. -
165 మంది ఏఈవోల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: గ్రామాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నేపథ్యంలో రగిలిపోయిన ఏఈవోలు మంగళవారం జిల్లాల నుంచి హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు గంటల పాటు ధర్నా చేశారు.పోలీసులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా ధర్నా జరుగుతున్నా వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి ఏమాత్రం పట్టించుకోకుండానే పోలీసుల భద్రత నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మరింత ఆగ్రహంతో ఉన్న ఏఈవోలు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని ప్రకటించారు. కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 2,600 మంది ఏఈవోలు సెలవుల్లో ఉంటామని వెల్లడించారు. నేతలు రాజ్‌కుమార్ రాజు, పరశురాములు, సుమన్, వెంకన్న శ్రీనివాస్ జానయ్య, వినోద్, సత్యంల నాయకత్వంలో ధర్నాలో పెద్ద సంఖ్యలో ఏఈవోలు పాల్గొన్నారు.కక్ష సాధింపు ధోరణిడిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడమే 165 మంది ఏఈవోల సస్పెన్షన్‌కు కారణమని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం రైతుబీమా నిబంధనల ప్రకారం మృతి చెందిన రైతుల వివరాల నమోదులో ఏఈవోలు నిర్లక్ష్యంగా వహించారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ సస్పెన్షన్లని ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి ఏఈవోలను సస్పెండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి మొదలైన సస్పెన్షన్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగింది. బుధవారం మరో కారణంతో మరికొంతమందిని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేశారని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఎలా అప్లోడ్ చేయాలి?నిబంధనల ప్రకారం రైతు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు అన్ని రకాల పత్రాలను జత చేసి..సదరు ఏఈవో రైతుబీమా పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. అయితే రైతు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కనీసం 11 రోజుల వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం పొందడానికి సమయం పడు తుంది. ఈ విధంగా కుటుంబ సభ్యులు వివరాలు అందించేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందంటున్నారు. ఇది గతం నుంచి కొనసాగుతుందంటున్నారు. అలాంటప్పుడు కేవలం నాలుగు రోజుల్లో వివరాలు ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. సస్పెండ్ చేయడం సరికాదు డిజిటల్ క్రాప్ సర్వేను నిరాకరించినందుకు తనను సస్పెండ్ చేయడం సరికాదని హనుమకొండ జిల్లా శాయంపేట క్లస్టర్ ఏఈఓ అర్చన అన్నారు. 15వేల మందితో చేయించాల్సిన సర్వేని 2,600 మందితో చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని అన్నారు. రైతు బీమాలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా సస్పెండ్ చేశారని తెలిపారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు డిజిటల్ సర్వే చేసే విషయంలో భయభ్రాంతులకు, మానసిక ఒత్తిడికి గురిచేశారని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ ఏఈఓ ప్రవళిక చెప్పారు. కనీస వసతులు లేకుండా సర్వే చేయలేమని విన్నవించినా, వినకుండా రైతు బీమా కారణం చూపించారన్నారు. కనీసం మెమో గానీ షోకాజ్ నోటీస్ గానీ ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వాపోయారు.పంట సర్వే ఏఈవోల ప్రాథమిక బాధ్యత వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీపంట నమోదు కార్యక్రమం ఏఈవోల ప్రాథమిక బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీ తెలిపారు. కొందరు ఏఈవోలు పంట పొలాన్ని సందర్శించకుండా సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 165 మంది ఏఈవోలను వ్యవసాయశాఖ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సంచాలకుడు డాక్టర్ గోపీ స్పందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి గుంటలో సాగైన పంట వివరాలు కచ్చితంగా తెలుసుకో వడానికి, పంటలకు కావాల్సిన ఉత్పాదకాలను అంచనా వేయడానికి, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి, పంట బీమా అమలు, పంట రుణాలు పొందటానికి రైతు బీమా, రైతు భరోసా పథకాల అమలుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు. -
వాయు కాలుష్యంపై మొద్దునిద్ర
దేశ రాజధానిలో 60 శాతం అధికంగా కుంభవృష్టి కురిపించి, వారంరోజులు ఆలస్యంగా నైరుతీ రుతుపవనాలు నిష్క్రమించాయో లేదో అక్కడి వాయు కాలుష్యంపై యథాప్రకారం చర్చ మొదలైంది. వాయు నాణ్యత మెరుగుదలకు తీసుకున్న చర్యలేమిటని గురువారం సర్వోన్నత న్యాయస్థానం హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలను నిలదీసింది. వాయు కాలుష్యం ఉగ్రరూపం దాలుస్తోందని, రైతులు పంట వ్యర్థాలు తగులబెట్టకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. గోధుమ పంట చేతికొచ్చాక వ్యర్థాలను తొలగించటం ఖర్చుతో కూడుకున్నదన్న కారణంతో రైతులు అక్కడే తగలబెడతారు. ఆ మంటలకు పంటభూమిలోని పోషకాలు, పంటలు ఏపుగా పెరగడానికి తోడ్పడే సూక్ష్మజీవులు నశిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ వ్యర్థాలను సేకరించి ఇతరేతర పదార్థాలతో మిశ్రమం చేసి సేంద్రియ ఎరువుగా మార్చవచ్చని సూచిస్తున్నారు. కానీ దీన్ని రైతులకు చేరేయ టంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రైతులకయ్యే వ్యయాన్ని భరిస్తే ఈ సమస్య చాలావరకూ తగ్గుతుందని గతంలో సుప్రీంకోర్టు ఢిల్లీ, పంజాబ్, హరియాణాలకు సలహా ఇచ్చింది. కానీ పట్టించుకున్నవారేరి? దానిసంగతలావుంచి సుప్రీం సూచనతో ఏర్పాటైన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) సమావేశాలే సక్రమంగా జరగటం లేదు. ఆగస్టు నెలాఖరున జరిగిన కమిషన్ సమావేశానికి 11 మంది సభ్యుల్లో అయిదుగురే హాజరయ్యారంటే...అందులో పంట వ్యర్థాల విషయంపై చర్చించనేలేదంటే కమిషన్ తీరుతెన్నులెలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు.ఢిల్లీలో సాధారణంగా అక్టోబర్ మధ్యనుంచి వాయు కాలుష్యం పెరగటం మొదలై నవంబర్ నాటికి ఉగ్రరూపం దాలుస్తుంది. పర్యవసానంగా నగర జీవితం అస్తవ్యస్తమవుతుంది. పాఠశాలల పనివేళలు మార్చటం, ప్రభాతవేళ ఆరుబయట వ్యాయామాలు చేయొద్దని పౌరులకు సూచించటం వంటివి మొదలవుతాయి. వాయు కాలుష్యానికి మూలం ఎక్కడుందో గుర్తించటానికే దీర్ఘకాలం పట్టగా, అనంతర చర్యలైనా చురుగ్గా ముందుకు కదలటం లేదు. కాలుష్యంలో 70 శాతం వాటా వాహనాలదేనని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చి కూడా చాన్నాళ్లయింది. ఆ తర్వాతి స్థానం పరిశ్రమలదేనని కూడా ఆ నివేదిక చెప్పింది. కానీ ఆ దిశగా పెద్దగా అడుగులు పడలేదు. మన దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ శక్తిమంతమైనది. దాదాపు అయిదు లక్షల కోట్ల టర్నోవర్ గల ఆ పరిశ్రమ రెండున్నర కోట్లమందికి ఉపాధి కల్పిస్తోంది.అందువల్ల వాటి జోలికి పోయేందుకు ప్రభుత్వాలు సిద్ధపడవు సరికదా... వాహనాల అమ్మకాలు పెరగటానికి, ఆ పరిశ్రమల లాభార్జనకూ భిన్నరూపాల్లో తోడ్పాటునందిస్తాయి. మార్కెట్లోకొచ్చే వాహనాలు కాలుష్య కారకాలుగా ఉంటున్నాయని తేలినా నిర్లిప్తంగా ఉండిపోయిన సందర్భాలు గతంలో కోకొల్లలు. 2005 నుంచి అందుబాటులోకొచ్చిన బీఎస్ 3 (భారత్ స్టేజ్ 3) ప్రమాణాలున్న వాహనాలు అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఆరోపణలొచ్చినా చర్య తీసుకునేందుకు ఏ వ్యవస్థా సిద్ధపడలేదు. ఆ ప్రమాణాలతో విడుదలైన ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు కార్లు, భారీ కమర్షియల్ వాహనాలపై చర్యలు తీసుకోలేదు. చివరకు సుప్రీంకోర్టే బీఎస్ 3 ప్రమాణాలున్న వాహనాల విక్రయాన్ని 2017లో నిషేధించింది. వీటి సంగతలావుంచి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచటానికి అవసరమైన పథకాల రూపకల్పన సక్రమంగా ఉండదు. త్వరితగతిన పనులు పూర్తిచేసుకోవాలంటే సొంత వాహనాలే దిక్కన్న అభిప్రాయం పౌరుల్లో స్థిరపడిపోయింది. దీనికి తోడు ప్రజా రవాణా కోసం ఇప్పటికీ చాలా రాష్ట్రాలు డీజిల్ బస్సులే వాడుతున్నాయి. విద్యుత్, సీఎన్జీ వాహనాల వినియోగం మొదలైనా వాటి సంఖ్య స్వల్పం. ఢిల్లీ మెట్రో నిడివి ప్రస్తుతం దాదాపు 400 కిలోమీటర్ల మేర ఉంది. దాన్నింకా పెంచటానికి కృషిచేస్తున్నారు. ఈ సర్వీసును బస్సులతో అనుసంధానించి మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా వెళ్లగలిగే సదుపాయం కల్పిస్తే సొంత వాహనాల వినియోగం తగ్గుతుంది. ఇక ఏదైనా అనుకోనిది జరిగితే తప్ప పరిశ్రమలపై సాధారణంగా ప్రభుత్వాలు చర్యలకు సిద్ధపడవు. నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్వహించే తనిఖీలు చాలా సందర్భాల్లో లాంఛనప్రాయమవుతాయి. జరిమానాల వంటివి విధించినా అవి నామ మాత్రంగానే ఉంటున్నాయి. ఉపాధి కల్పనకూ, సంపద వృద్ధి కావటానికీ పరిశ్రమలు అవసరమే. కానీ ప్రజారోగ్యంతో ఆటలాడుకునేవారినీ, చట్టాలను ఉల్లంఘించేవారినీ దండించాల్సిందే. వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. రుతుపవనాలు నిష్క్రమించి శీతాకాలం ఇంకా ప్రవేశించని అక్టోబర్ నెల ఒకప్పుడు ఢిల్లీలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని న్యాయమూర్తులు అన్న మాటల్లో వాస్తవం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ఉండే ఆ వాతావరణం ఇప్పుడు ఎందుకు మాయమైంది? కారకులెవరు? చిత్తశుద్ధితో ఆలోచించాలి. కాలుష్యంలో తమ బాధ్యత లేదని, పొరుగు రాష్ట్రమే ఈ సమస్యకు కారణమని పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లు పరస్పరారోపణలు చేసుకోవటం రివాజుగా మారింది. అటు కేంద్రం సైతం మొత్తం భారాన్ని రాష్ట్రాలపై వేసి తప్పుకుంటోంది. ఏతావాతా సమస్య యథాత థంగా మిగిలిపోతున్నది. ఈ వైఖరి సరికాదు. ఇటీవల వెలువడిన లాన్సెట్ నివేదిక వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో ఏటా 12,000మంది మరణిస్తున్నారని తేల్చింది. అందుకే అందరూ మేల్కొ నాల్సిన సమయమిది. ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా కార్యాచరణకు దిగి తమవంతు బాధ్యత నెరవేర్చటంతోపాటు కాలుష్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి. -
Sagubadi: పొద చిక్కుడు పంటతో.. ఏనుగులకు చెక్!
లఏనుగులు జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి రాకుండా తిప్పికొట్టేందుకు కేరళవాసులు రెండు పద్ధతులను అవలంభిస్తున్నారు. మొదటిది: తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెలు నిర్మించటం. రెండోది: ప్రత్యేక వాసనను వెదజల్లే దేశవాళీ పొద చిక్కుడు పంటను సరిహద్దు పంటగా సాగు చేయటం. మొదటి పద్ధతి కన్నా రెండో పద్ధతి ఎక్కువ ప్రభావశీలంగా పని చేస్తోందని రైతులు చెబుతున్నారు.గ్రామ సరిహద్దుల్లో తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెల (బీహైవ్ ఫెన్సెస్)ను ఏర్పాటు చేశారు. ఏనుగులు అడవి నుంచి గ్రామాల వైపు వచ్చే దారిలో ఈ కంచె తీగలను తాకగానే తేనెటీగలు పెద్దపెట్టున శబ్ధం చేస్తూ వాటిని చుట్టుముడతాయి. అవి చేసే శబ్ధం ఏనుగులకు గిట్టదు. అందువల్ల అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకురాలు లూసీ కింగ్ 15 ఏళ్ల క్రితం ఈ పద్ధతిని కనుగొన్నారు. కెన్యా, టాంజానియాలలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి, తేనెటీగల కంచెలు ఏనుగులను సమర్థవంతంగా బెదరగొట్టగలవని నిర్థారించారు. ఆ తర్వాత కేరళలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న అట్ట΄్పాడి తాలూకాలో అనేక గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులకు ఏనుగుల నుంచి కొంతమేరకు ఉపశమనం దొరికింది.కేరళలో గిరిజనులు మరో సంప్రదాయ పద్ధతిలో కూడా ఏనుగుల సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆట్టుకొంబ అమర (అట్టాప్పడీ డొలిఖోస్ బీన్ లేదా లాబ్లాబ్ బీన్) అనే స్థానిక రకం పొద చిక్కుడు పంటను ఏనుగులు గ్రామాల్లోకి వచ్చే మార్గాల్లో సాగు చేయటం ద్వారా వాటì రాకను సహజ పద్ధతిలో నిరోధించవచ్చని గిరిజన రైతులు గుర్తించారు.అట్టాప్పడీ తాలూకాలోని మూలకొంబు అనే గ్రామవాసి అయిన చింది అనే 65 ఏళ్ల మహిళా రైతు ఏనుగులను నిరోధించేందుకు చెట్టు చిక్కుడును సాగు చేస్తున్నారు. అడవి ఏనుగుల గుంపును తేనెటీగల కంచెలు పూర్తిగా ఆపలేకపోతున్నాయన్నారు. ఆట్టుకోంబ అమర వంటి దేశవాళీ పొద చిక్కుడు పంట ప్రభావం చాలా బాగుందన్నారు. ‘ఈ చిక్కుడు పంటను కంచె పంటగా వేసినప్పటి నుంచి నా పొలం మీద ఏనుగులు దాడి చెయ్యలేదు. అమర చిక్కుళ్లు మంచి ధరకు అమ్ముడు కావటంతో మంచి ఆదాయం కూడా వస్తోంద’ని చింది సంతోషిస్తున్నారు.ఈ చిక్కుడు రకం పంట వెదజల్లే ఒక రకమైన ఘాటు వాసన ఏనుగులు, తదితర వన్య్రపాణులకు గిట్టకపోవటం వల్లనే అవి వెనుదిరిగి వెళ్లి పోతున్నాయని చెబుతున్నారు. ఈ సంగతి శాస్త్రీయంగా ఇంకా రుజువు కానప్పటికీ, ప్రజలకు ఏనుగుల బెడద మాత్రం తీరింది. కేరళలో అనాదిగా సాగవుతున్న ఆట్టుకొంబ అమర చిక్కుళ్లు విలక్షణమైన రకం కావటంతో మూడేళ్ల క్రితం జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపు వచ్చింది. దీంతో ‘బయోసర్టిఫికేషన్’ ఉన్న ఈ చిక్కుళ్లకు ఏకంగా కిలోకు రూ. వెయ్యి వరకు ధర పలుకుతుండటం మరో విశేషం. మళయాళంలో ‘ఆట్టు’ అంటే మేక. ‘కొంబు’ అంటే కొమ్ము. కేరళ గిరిజన రైతులు సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ‘మేక కొమ్ము’లతో ఏనుగులను జయిస్తున్నారన్న మాట! -
ఈ–పంట నమోదుకు సర్వర్ కష్టాలు!
సాక్షి, అమరావతి: ఈ–పంట నమోదుకు సర్వర్ కష్టాలు వెంటాడుతున్నాయి. వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, యాప్ సరిగా పనిచేయకపోవడం వంటి సాంకేతిక సమస్యలకు తోడు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ పంట నమోదులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నది. దాదాపు రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ పంట నమోదు నత్తనడకన సాగుతున్నది. గడిచిన నెల రోజుల్లో కేవలం 31 శాతం మాత్రమే పూర్తయింది. మరొక వైపు ఏది ఏమైనా సెపె్టంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తుండడంతో క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.సర్వర్లు పనిచేయక..ఫొటోలు అప్లోడ్ కాక.. రాష్ట్రంలో సాగుయోగ్యమైన భూముల వివరాలను మండల వ్యవసాయాధికారులు సర్వే నంబర్ల వారీగా ఈ–పంట వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. తొలుత గ్రామాల సర్వే నంబర్ల ఆధారంగా భూముల వివరాలను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్బీకే రైతులు సాగు చేసే పంట వివరాలను ఈ–పంట వెబ్సైట్లో నమోదు చేయాలి. ఈ ప్రొసీజర్ మొత్తం కంప్యూటర్లో మాత్రమే చేయాలి. గతంలో మాదిరిగా మొబైల్లో నమోదుకు అవకాశం ఇవ్వలేదు. మార్పులు, చేర్పులు చేయాలంటే పొలాల నుంచి మళ్లీ ఆఫీసుకు వచ్చి ఎడిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. రెండో దశలో మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్‌లలో ఈ–పంట అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని రిజి్రస్టేషన్ చేసుకుని ఈ–పంట వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వివరాల ఆధారంగా రైతు పొలం వద్దకు వెళ్లి జియో కో–ఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. నెట్వర్క్ సమస్యల వల్ల పంట ఫొటోలు తీసుకోవడం లేదు. రోజుకు 10 కిలోమీటర్లకు పైగా.. 200 మీటర్ల వరకు మాగాణి, 50 మీటర్ల వరకు మెట్ట పొలాలకు వెసులుబాటు ఇచ్చినప్పటికీ రోజుకు 10 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మూడో దశలో అప్లోడ్ చేసిన పంట వివరాలు, ఫొటోలను తొలుత వీఏఏలు,ఆ తర్వాత వీఆర్వోలు, చివరగా రైతులు అథంటికేషన్ (ఈ కేవైసీ) చేయాలి. కొన్ని జిల్లాలకు మాత్రమే సర్వర్లు ఇవ్వడం, ఆ సర్వర్లు కాస్తా సరిగా పనిచేయకపోవడంతో ఈ కేవైసీ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రోజుకు వంద ఎకరాలు చేయాలంటూ ఒత్తిడి! ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు వ్యవసాయ, ఉద్యాన, పట్టు తదితర పంటలకు సంబంధించి 1,34,48,611 ఎకరాలు సాగవగా, వీఏఏలు 59,27,115 ఎకరాల వివరాలను మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారు. వాటిలో ఇప్పటి వరకు 31 శాతం మాత్రమే ఈ–పంట నమోదు పూర్తయింది. వెబ్సైట్, యాప్, సర్వర్లు మొరాయిస్తుండడంతో రోజుకు ఆర్బీకే పరిధిలో 30–40 ఎకరాలకు మించి ఈ–పంట నమోదు చేయలేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ రోజుకు 100 ఎకరాల్లో పంట నమోదు చేయాల్సిందేనంటూ ఉన్నతాధికారులు జారీ చేస్తున్న ఆదేశాలు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.జియో కో– ఆర్డినేట్స్ పరిధిని పెంచాలి.. రాష్ట్రంలో ఈ–క్రాప్ నమోదు సజావుగా సాగడం లేదు. సర్వర్ సరిగా పనిచేయక, యాప్ సకాలంలో ఓపెన్ కాక నమోదులో జాప్యం జరుగుతోంది. నిర్ణీత గడువులోగా పూర్తికాకపోతే పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకోవడంలో కానీ, సంక్షేమ ఫలాలు పొందడంలో రైతులు నష్టపోతారు. విత్తనాల పంపిణీలో మహిళా కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లను ఏ విధంగా సహాయకులుగా నియమించారో అదేరీతిలో ఈ–పంట నమోదులో వీఏఏలకు సహాయకులుగా వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లను నియమించాలి. జియో ఫెన్సింగ్ మాగాణిలో 500 మీటర్లు మెట్టలో 250 మీటర్లకు పెంచాలి. – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతు సంఘం -
‘ఈ– పంట’ సాగేదెలా?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచి్చన మంచి కార్యక్రమాలన్నింటినీ చీల్చి ఛిద్రం చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలి్పంచే ‘ఈ–క్రాప్’ కార్యక్రమాన్ని కూడా చిన్నాభిన్నం చేసేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఐదేళ్లూ నిరాఘాటంగా సాగి, అన్నదాతలకు అండగా నిలిచింది.రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు దీని పేరును ‘ఈ–పంట’ అని మార్చి, దాని నమోదులోనూ మార్పులు తెచ్చింది. ఇప్పుడు ఈ మార్పులే రైతులపాలిట శాపంగా మారాయి. కొత్త ప్రభుత్వం ఫొన్ యాప్ ద్వారా పంటల వివరాల నమోదుకు అంగీకరించడంలేదు. అప్డేట్ చేసిన ఈ–పంట వెబ్సైట్ సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు రైతు సేవా కేంద్రం (ఆర్బీకే)లోని సిస్టమ్ ద్వారా మాత్రమే పంట వివరాలు నమోదు చేయాలన్న నిబంధన మరిన్ని సమస్యలు సృష్టిస్తోంది. వెబ్సైట్ ఓపెన్ కాక ఇబ్బందులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి జాతీయ స్థాయిలో కేంద్రం శ్రీకారం చుట్టిన డిజిటల్ క్రాప్ సర్వేకు అనుసంధానం చేసి ఈ పంట నమోదు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31న మార్గదర్శకాలు జారీ చేసి, ఈ నెల 5 నుంచి పంటల నమోదు చేపట్టింది. ఈ పంట వెబ్సైట్ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. యాప్‌లో కొత్త ఫీచర్స్పై క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణా ఇవ్వలేదు. గతంలో ఫోన్లోనే ఈ–క్రాప్ యాప్ ద్వారా పంట వివరాలు నమోదు చేసేవారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలనలో ఫోటోలు అప్లోడ్ చేసేవారు. దీని వల్ల సమయం ఆదా అయ్యేది.ప్రస్తుతం ఈ పంట వివరాలు ఫోన్లో నమోదు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడంలేదు. కార్యాలయం కంప్యూటర్లోని వెబ్సైట్ ద్వారా మాత్రమే వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను కంప్యూటర్ నుంచి ఫోన్లోని యాప్‌లో డౌన్లోడ్ చేసుకొని క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలి. రైతు సేవా కేంద్రాల్లో ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అసలు కంప్యూటర్లో ఈ పంట వెబ్సైట్ ఓపెన్ అవడమే చాలా కష్టం. అది ఓపెన్ అయిన తర్వాత పంట వివరాలు నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఒక్కో రైతు పంట వివరాల నమోదుకు చాలా సమయం పడుతోంది. పైగా పంట వివరాల నమోదుకే రోజంతా కార్యాలయంలోనే ఉండాల్సి వస్తోందని, క్షేత్ర స్థాయి పరిశీలన ఎప్పుడు పూర్తి చేస్తామని సిబ్బంది వాపోతున్నారు. కంప్యూటర్లో నుంచి మళ్లీ ఎలాగూ ఫోన్లోకి తీసుకోవాలని, అప్పుడు నేరుగా ఫోన్లోనే వివరాలు నమోదు చేసుకోవచ్చు కదా అన్న సూచనలూ వస్తున్నాయి. మరోపక్క కౌలుదారుల పంట వివరాల నమోదులోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీసీఆర్సీ లేదా భూ యజమాని అంగీకారంతోనే నమోదుకు అవకాశం ఉంది. కానీ ఉన్నతాధికారులు వాస్తవ సాగు దారుల వివరాలు నమోదు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అలా చేస్తే భూ యజమానుల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కౌలుదారులు వాపోతున్నారు. మరొక వైపు సిబ్బందికి ఇచి్చన ట్యాబ్‌లు కూడా సరిగా పనిచేయడంలేదు. దీంతో క్షేత్ర స్థాయి పరిశీలనలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గడువులోగా పూర్తయ్యేనా? రైతుల నుంచి పంట వివరాలు సేకరించాక పొలం వద్దకు వెళ్లి జియోఫెన్సింగ్‌తో సహా పంట ఫోటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో జియో కోఆర్డినేట్స్‌తో సహా ఎల్పీ నంబరు వివరాలు నమోదు చేయాలి. ఆర్బీకే సిబ్బంది, వీఆర్వోల ధ్రువీకరణ పూర్తి కాగానే రైతుల ఈ కేవైసీ నమోదు చేసి రైతులకు డిజిటల్, ఫిజికల్ రసీదులు ఇవ్వాలి. గతేడాది మాదిరిగానే సెపె్టంబర్ 15వ తేదీలోగా ఈ పంట నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 19 నుంచి 24వ తేదీ వరకు సోషల్ ఆడిట్ కింద ఆర్ఎస్కేలలో ప్రదర్శిస్తారు.రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను 25 నుంచి 28వ తేదీ వరకు పరిష్కరిస్తారు. తుది జాబితాలను 30వ తేదీన ఆర్ఎస్కేలలో ప్రదర్శించాలని నిర్ణయించారు. అయితే, ఈ పంట నమోదులో ఉన్న గందరగోళ పరిస్థితుల మధ్య గడువులోగా పంటల నమోదు పూర్తవుతుందా! అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో పక్కా ప్రణాళికతో ఈ–పంట నమోదు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2019 రబీ నుంచి ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్‌లో వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కుపత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద పంట వివరాలు నమోదు చేసేవారు. ఏటా ఖరీఫ్‌లో జూలై మొదటి వారంలో మొదలు పెట్టి సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేసేవారు.సోషల్ ఆడిట్ అనంతరం అక్టోబర్ రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. రబీ సీజన్లో నవంబర్ మొదటి వారంలో శ్రీకారం చుట్టి జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేవారు. ఫిబ్రవరి రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. కానీ ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా, 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నా ఇప్పటివరకు కనీసం 10 శాతం పంటలు కూడా నమోదు కాని దుస్థితి. ఆలస్యమైతే జరిగే నష్టమిది..ఈ క్రాప్ నమోదు ఆలస్యమైతే రైతులకు అన్ని విధాలుగా నష్టం జరుగుతుంది. ప్రధానంగా పంట కొనుగోలులో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పంట కోనుగోలు పూర్తిగా ఈ–పంట నమోదు ఆధారంగానే జరుగుతుంది. దీంతో రైతులు దళారుల ద్వారా పంటలను అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఉచిత పంటల బీమాకు అర్హత కోల్పోతారు. తుపానులు, భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంట రైతులు ఈ–క్రాప్‌లో నమోదు కాకపోతే ఇన్పుట్ సబ్సిడీ పొందే అర్హత కోల్పోతారు. సున్నా వడ్డీ రాయితీకి అర్హత కోల్పోతారు. ఈ –క్రాప్‌తో ఐదేళ్లలో రైతులకు జరిగిన మేలు.. గడిచిన ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలు నమోదు కాగా, ఈ–క్రాప్ ప్రామాణికంగా వివిధ రకాల సంక్షేమ ఫలాలు అందించారు. 75.82 లక్షల మందికి రూ.1,373 కోట్ల సబ్సిడీతో కూడిన 45.16 లక్షల టన్నుల విత్తనాలు, 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులు, 176.36 లక్షల టన్నుల ఎరువులు అందాయి. 5.13 కోట్ల మంది రైతులకు రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలు లభించాయి. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం అందింది. 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల పంటల బీమా పరిహారం, 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల పెట్టుబడి రాయితీ, 84.67 లక్షల మందికి రూ.2051 కోట్ల సున్నా వడ్డీ రాయితీలు అందాయి. రైతులు పండించిన పంటల విక్రయం సాఫీగా సాగి, ప్రతి పంటకీ మద్దతు ధర లభించింది. -
రైతు కంట నీరు మంచిది కాదు..
-
స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు!
గతేడాది కనీసం 65 దేశాలలో రైతులు నిరసనలు చేపట్టారు. ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగుమతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతిరేకంగా సాగాయి. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి స్వేచ్ఛా మార్కెట్లే కారణం. మార్కెట్లకు విజ్ఞత ఉంటే, రైతులు నష్టపోవడానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పడానికి రైతుల నిరసనలు నిదర్శనం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులకు కూడా అనుసరణీయ మార్గం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇదే సమయం. భారతదేశంలో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల తిరగబడటాన్ని ప్రపంచం గమ నిస్తోంది. 2023 జనవరి నుండి కనీసం 65 దేశాలలో రైతులు నిరస నలు చేపట్టారు. కనీవినీ ఎరుగని నిరసనల వెల్లువ వెనుక కారణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కలిపే సాధారణ సూత్రం ఒకటే: నియంత్రణ లేని మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం.రైతులు తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఉపయోగించే పదాలు ఒక దేశం నుండి మరొక దేశానికి భిన్నంగా ఉండవచ్చు. కానీ అంత ర్లీన సందేశం ఒకటే: వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో మార్కెట్లు విఫలమయ్యాయి. భారతదేశ రైతులు కనీస మద్దతు ధరను చట్ట బద్ధమైన హక్కుగా కోరుకుంటుండగా, యూరోపియన్ రైతులు తమ ఉత్పత్తులకు సరైన విలువను డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో బంగా ళాదుంపల ధర పతనం, నేపాల్‌లో కూరగాయల ధరలు తక్కువగా ఉండటంతో పాటు జర్మనీ, ఫ్రాన్స్ , బెల్జియంతో సహా యూరప్‌లోని అనేక దేశాలలో ఉత్పత్తి వ్యయం పెరగడం, చౌక దిగుమతులు, ఉత్పత్తి ధరలు పడిపోవడాన్ని కూడా నిరసనలు హైలైట్ చేశాయి. స్పెయిన్ లోని రైతులు నాలుగు లక్షల లీటర్ల పాలను వీధుల్లో పారబోశారు. మలేషియా సాగుదారులు తక్కువ వరి ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫ్రాన్స్ లో, అధ్యక్షుడు మాక్రాన్ తో ఇటీవల జరిగిన సమావేశంలో చిన్న రైతుల ప్రముఖ సంస్థ అయిన ‘కాన్ఫెడరేషన్ పేసన్’... రైతులకు సామాజిక రక్షణ కల్పించడంతో సహా హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధర కంటే తక్కువ ధరకు కొనుగోళ్లను అనుమతించకూడదనే వాగ్దానాన్ని కోరింది. వాణిజ్య సరళీకరణను కూడా రైతులు వ్యతిరేకించారు.జర్మనీ, ఫ్రాన్స్ , రొమేనియా, ఇటలీ, పోలాండ్లలో రైతులు ఉక్రె యిన్ నుండి వచ్చే చౌక దిగుమతులకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వ హించారు. పైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని కోరుతున్నారు. వారు హైవేలను అడ్డుకున్నారు, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువెళుతున్న ట్రక్కులను నిలిపివేశారు, చాలా చోట్ల దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ఫ్రాన్స్ లో, చౌకైన చేపల దిగుమతులకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు, మత్స్యకారులు ఓడరేవుల వద్ద నిరసన తెలిపారు. ఇది వ్యవ సాయ జీవనోపాధిని నాశనం చేస్తుందని వారు చెప్పారు. భారతదేశం విషయానికి వస్తే, ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగా లని నిరసన తెలుపుతున్న రైతులు తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ‘డౌన్ టు ఎర్త్’ మ్యాగజైన్ సంకలనం ప్రకారం, యూరప్‌లోని 24 దేశాలు రైతు నిరసనలను ఎదుర్కొంటుండగా, ఆఫ్రికాలో 12, ఆసియాలో 11, దక్షిణ, ఉత్తర, మధ్య అమెరికాల్లో ఎనిమిదేసి దేశాలు, ఓషియానియాలో రెండు దేశాలు గత సంవత్సరం రైతు ప్రదర్శనల వల్ల ప్రకంపించిపోయాయి. ఐరోపాలో, స్వతంత్ర పాన్–యూరోప్ మీడియా నెట్వర్క్ అయిన ‘యూరాక్టివ్’ 2024 జనవరి–ఫిబ్రవరిలో తాజా దశ నిరసనలపై చేసిన అధ్యయనం... రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధర కోసం బలమైన డిమాండ్ ఉంటోందని తెలిపింది. ప్రధానంగా ఫ్రాన్స్ , జర్మనీ, స్పెయిన్, ఇటలీ నుండి ఈడిమాండ్ వెలువడింది. బెల్జియం రైతులు ఆహార గొలుసు విధానంలో కూడా రక్షణ కోరుకుంటున్నారు. నికర సున్నా ఉద్గారాలను సాధించే ప్రయత్నంలో యూరోపియన్ కమిషన్ విధించడానికి ప్రయత్నిస్తున్న కఠినమైన పర్యావరణ నిబంధనలపై కూడా వారి కోపం నిర్దేశితమైంది. వ్యవసాయ రంగంపై వాణిజ్య ప్రభావం యూరోపియన్ యూనియన్ రైతులకు ఆందోళన కలిగిస్తోంది. జర్మన్ రైతుల ప్రద ర్శనలు... వ్యవసాయ వాహనాలకు ఇంధనంపై పన్ను మినహాయింపులను ఉపసంహరించుకోవడం గురించి సాగాయి (దీనిని జర్మనీ దశలవారీగా రద్దు చేయడానికి అంగీకరించింది); ‘నైట్రేట్ డైరెక్టివ్’ లాంటి కఠినమైన పర్యావరణ నిబంధన లతోపాటు తక్కువ ధరలను భర్తీ చేయడానికి ప్రోత్సాహకాల డిమాండ్‌పై దృష్టి సారించాయి. సారాంశంలో, ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలలో చాలా వరకు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగు మతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతి రేకంగా ఉన్నాయి. వ్యవసాయాన్ని మార్కెట్ల చేతుల్లోకి వదిలేయడం వల్ల వ్యవ సాయ రంగానికి మేలు జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరస నలే ఇందుకు నిదర్శనం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఉద్దేశపూర్వ కంగా ఆహార ధరలు తక్కువగా ఉండేలా చూసుకున్న ఆధిపత్య ఆర్థిక ఆలోచనకు భారతీయ వ్యవసాయం బలయ్యింది. ఇది కాలం చెల్లిన విధానం. మారుతున్న వాస్తవాలకు అనుగుణంగా ఆర్బీఐ తన స్థూల ఆర్థిక విధానాలను పునఃసమీక్షించే సమయం ఆసన్నమైంది. 2022– 23 గృహ వ్యయ సర్వే ప్రకారం, ప్రతి కుటుంబం మీద గృహం, ఆరోగ్యం, విద్యపై నిరంతరం పెరుగుతున్న వ్యయంతో భారం పడి నప్పటికీ, ఆహారంపై ఖర్చు గణనీయంగా తగ్గింది. కఠినమైన స్థూల ఆర్థిక నియంత్రణ నుండి వ్యవసాయ ధరలకు అవసరమైన దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను నొక్కిచెప్పిన క్షణం, దానికి బలమైన వ్యతిరేకత వస్తుంది. ‘ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది, తద్వారా మార్కెట్ వక్రీకరణలు జరుగుతాయని మేము హెచ్చరించాము’ అంటూ గ్యారెంటీ ధర కావాలని రైతులు పునరుద్ఘాటించినప్పుడల్లా విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఒక కార్పొరేట్ వైఫల్యం ఫలితంగా కోవిడ్ మహమ్మారి సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 57 శాతం పెరిగి, 2023లో 53 శాతం చుట్టూ చేరిన ప్పుడు మాత్రం అదే ఆర్థిక ఆలోచన స్పష్టంగా నిశ్శబ్దంగా ఉంది. వ్యవసాయ ధరలను స్థిరీకరించడానికి అనేక దశాబ్దాలుగా అనేక ప్రోత్సాహకాలు, దేశీయ మద్దతు యంత్రాంగాలు ప్రయత్నించిన ప్పటికీ, వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ కష్టాలు ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతున్నాయి. వ్యవసాయంలో మార్కెట్ సంస్క రణలు అరువు తెచ్చుకున్న అమెరికాలో కూడా స్వేచ్ఛా మార్కెట్ రూపకల్పన అనేది చిన్న రైతులను వ్యవసాయం నుండి ఎలా బయటకు నెట్టిందో, వారిని కష్టాల బాటలో ఎలా వదిలివేసిందో, పొలంలో విధ్వంసాన్ని ఎలా సృష్టించిందో ‘నాసా’ మాజీ శాస్త్రవేత్త వేదవ్రత పెయిన్ దర్శకత్వం వహించిన ‘డెజా వు’ డాక్యుమెంటరీ చూపిస్తుంది. కాబట్టి స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి ఇదే కారణం. మార్కెట్లకు విజ్ఞతఉంటే, సమర్థతకు ప్రతిఫలమివ్వగలిగితే, వ్యవసాయం నష్టపోయే ప్రతిపాదనగా ఉండటానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంతలోప భూయిష్టంగా ఉందో చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరసనలు నిదర్శనం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇది సమయం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులుఅందరికీ వర్తించే మార్గం. మార్కెట్లు తదనుగుణంగా సర్దుబాటు అవుతాయి. - వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు , దేవీందర్ శర్మ - ఈ–మెయిల్: hunger55@gmail.com -
సాగునీరు ఇవ్వకుంటే ఆత్మహత్యలే
మంథని: నీరు లేక కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ‘అధికార యంత్రాంగం స్పందించి ఇప్పటికైనా నీరు అందించి చేతికొచ్చే పంటలను కాపాడాలి.. లేదంటే మాకు చావుతప్ప మారోమార్గం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని – గోదావరిఖని ప్రధాన రహదారిపై మంగళవారం వేలాది మంది రైతులు రాస్తారోకో చేశారు. చేతుల్లో పురుగులమందు డబ్బాలు, వరి గంటలు పట్టుకొని రోడ్డుపై రోడ్డుపై బైఠాయించారు. గంట పాటు ఉండిపోయారు. వరి పొట్టదశకు చేరిందని, నీరు అందక పంట కళ్లముందే ఎండిపోతుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. కాలువ నీరే ఆధారంగా పంటలు సాగుచేస్తే ఎగువన ఉన్న కొందరు రైతులు మోటార్లు పెట్టి చివరి ఆయకట్టుకు సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో రోడ్డుకు ఇరు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకటకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని రైతులను కోరారు. నీటిపారుదల శాఖ ఈఈ బలరాం అక్కడకు చేరుకొని అక్రమంగా విద్యుత్ వినియోగించడంతోపాటు, కాలువలో విద్యుత్ మోటార్లు బిగిస్తున్న విషయంపై తమకు ఫిర్యాదు చేయాలన్నారు. విచా రణ జరిపి వాటిని తొలగించి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. -
సాగు చేస్తేనే ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రూపుమారుతోంది. రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పంటలు సాగైన భూములపై పక్కాగా లెక్క తీశాకే సాయం విడుదల చేయాలని భావిస్తోంది. అది కూడా పంటల సాగుకు ముందుగాకుండా.. సీజన్ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. సీజన్‌కు ముందే ఎందరు రైతులు ఎంతమేర భూముల్లో పంటలు వేశారో తెలియదని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందుకే సీజన్ మధ్యలో సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగుచేశారో నిర్ధారించి, సాయం అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ‘రైతు భరోసా’మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. రైతుల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా? రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు, దుక్కుల సమయంలో అయ్యే ఖర్చుల కోసం సీజన్ కన్నా ముందే పెట్టుబడి సాయం అందించేలా గత ప్రభుత్వం 2018లో ‘రైతు బంధు’పథకాన్ని తెచ్చింది. పంటలు సాగు చేసినా, చేయకున్నా.. సాగుభూముల కింద నమోదై ఉన్న అన్ని భూములకు ‘రైతుబంధు’ సాయం అందించింది. అలాంటిది ఇప్పుడు పంటల సాగు మొదలయ్యాక, చివరిలో ఆర్థిక సాయం ఇస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్జనభర్జన పడుతున్న ట్టు సమాచారం. ఈ క్రమంలో సీజన్‌కు ముందే ఆర్థిక సాయం చేసి, ఒకవేళ ఎవరైనా రైతులు సాగుచేయనట్టు తేలితే.. వారికి తదుపరి సీజన్లో ఆర్థిక సాయానికి కోత పెట్టే ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ దీనిపై రైతుల నుంచి వ్యతిరే కత రావొచ్చన్న సందేహాలు నెలకొన్నాయి. దీనితో మార్గదర్శకాల రూపకల్పన కత్తిమీద సాములా మారినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. యాసంగిలో సగానికిపైగా తగ్గనున్న సాయం! కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ‘రైతు భరోసా’ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ‘రైతుబంధు’ను పునఃసమీక్షిస్తామని ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పంటలు సాగుచేసే భూములకే రైతుభరోసా ఇస్తే పెట్టుబడి సాయం వ్యయం భారీగా తగ్గుతుందని అంచనా. ఉదాహరణకు గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. అప్పుడు సాగైన భూమి 1.26 కోట్ల ఎకరాలే. ఇకపై ఇలా పంటలు వేయని 26 లక్షల ఎకరాలకు రైతుభరోసా సొమ్ము అందదు. ఇక ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 66.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. కొత్త సర్కారు నిర్ణయం మేరకు.. వీటికి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. మిగతా 85.70 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులకు సొమ్ము అందే పరిస్థితి ఉండదు. రెండు సీజన్లకు కలిపి గతంలో సుమారు 3.04 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. ఇప్పుడు దాదాపుగా 2.09 కోట్ల ఎకరాలకే పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. అంటే 98లక్షల ఎకరాలకు రైతుభరోసా అందదని పేర్కొంటున్నారు. పరిమితం చేసేందుకే మొగ్గు బీఆర్ఎస్ సర్కారు రైతుబంధు పథకం మొదలుపెట్టిన నాటి నుంచి గత వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతులకు రూ.72,815 కోట్లు అందజేసింది. ఇందులో గత వానాకాలంలో 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేసింది. యాసంగి సీజన్ కొనసాగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఈ సీజన్‌కు సంబంధించి గతంలో మాదిరే రైతులకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. అంటే 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.7,625 కోట్లు విడుదల చేయాలి. అయితే ఇప్పటివరకు నాలుగైదు ఎకరాల మేర భూమి ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదెకరాల వరకే రైతుబంధు ఇస్తున్నట్టు చెప్పారు. అంటే యాసంగికి సంబంధించి కూడా ఐదెకరాల వరకు ఉన్న భూములకే ఆర్థిక సాయం పరిమితం కానుంది. రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మందికాగా.. వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే రైతుబంధు అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉన్నారని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. పక్కాగా సాగు లెక్కలు తీసి.. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఇతర పద్ధతుల ద్వారా పక్కాగా సాగు లెక్క తేల్చా లని అధికారులు నిర్ణయించారు. ఇందులోనూ ఐదెకరాల్లోపు భూములున్న రైతు లకే ఆర్థిక సాయం అందనుంది. ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులు, ఇతర వర్గాలవారికి రైతుభరోసా నిలిపివేయనున్నారు. ఐదెకరాల వరకే సాయం ఇవ్వాలన్న ఆలోచనా అమలు చేస్తే.. నిధుల వ్యయం మరింతగా తగ్గుతుంది. ఇప్పటివరకు 1.52 కోట్ల ఎకరాలకు ఆర్థిక సాయం ఇచ్చినట్టుగా.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఎకరాకు రూ.15 వేల చొప్పున అమలు చేయాలంటే ఏడాదికి రూ.22,800 కోట్లు కావాలి. అయితే సాగుచేయని భూమిని తొలగించడం, ఐదెకరాలకు పరిమితం చేయడం, ఆదాయ పన్ను చెల్లించేవారు, ధనికులు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు, వ్యాపారవేత్తలకు రద్దు చేయడం వంటివి అమలు చేస్తే.. దాదాపు రూ.10వేల కోట్ల వరకు మిగులుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
పంట విక్రయంలో సాంకేతిక దన్ను
పీవీ నరసింహారావు హయాంలో 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) ఏర్పాటుచేయడం అర్థవంతమైన విధానపరమైన జోక్యం. ఆ సంస్థే ఇప్పుడు వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యత చూస్తోంది. దీని కారణంగా, 2016లో నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు. దీనివల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1.07 కోట్ల మంది రైతులకు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్ లో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం ఏర్పడ్డాయి. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి నిధులు సమకూర్చింది. మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, శాస్త్రవేత్త–అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ లకు ఇటీవల భారతరత్న ప్రదానం చేయడం భారతీయ రైతు వ్యవస్థాపక స్ఫూర్తికి నివాళి అనే చెప్పాలి. ఈ ముగ్గురూ వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. స్వామినాథన్ అందించిన తోడ్పాటు సుపరిచితమే కాదు, అది అందరూ గుర్తించిన విష యమే. అయితే హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన రాజకీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సోవియట్, చైనీస్ తరహా ‘సామూహిక వ్యవసాయం’లో ఉన్న ప్రమాదాలను నెహ్రూకి వివరించినది చరణ్ సింగ్. రైతులు రాటు దేలిపోయిన స్వతంత్ర సాగుదారులనీ, ప్రణాళికా సంఘం మెచ్చు కున్న ‘ల్యాండ్ పూలింగ్, సహకార వ్యవసాయం’ అనే కేంద్రీకృత ప్రణాళికను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ చరణ్ సింగ్ స్పష్టం చేశారు. దార్శనికుడి విధాన జోక్యం పీవీ నరసింహరావు హయాంలో భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరి వ్యవసాయ ఒప్పందంపై సంతకం చేసింది. అప్పటి వరకు, భారతదేశ విధాన వ్యవస్థ దిగుమతులను పరిమితం చేసింది. పీవీ ఆధ్వర్యంలో, భారతదేశం వ్యవసాయ ఎగుమతులను ఒక ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టేదిగా చూసింది. ఏపీఈడీఏ (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ)కి బడ్జెటరీ, సంస్థాగత మద్దతుతో, ఆయన భారతీయ వ్యవసాయాన్ని ప్రపంచవ్యాప్త పోటీదారుగా మార్చడంలో తోడ్పడ్డారు. అయినప్పటికీ దేశీయ వాణిజ్యం మాత్రం రైతుల కోసం కాకుండా, సేకరణ ఏజెన్సీలకూ, వ్యవసాయ పంటల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లలోని నమోదైన వ్యాపారులకూ అనుకూలంగా నిర్బంధ వాణిజ్య పద్ధతుల ద్వారా నిర్వహించబడుతూనే ఉంది. 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) స్థాపన, పీవీ చేసిన అత్యంత అర్థవంతమైన విధాన పరమైన జోక్యం కావచ్చు. ఈ సంస్థకే వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. 2016 ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఎస్‌ఎఫ్‌ఏసీ మద్దతుతో ‘ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు. ఇది ఫిజికల్ బ్యాక్ ఎండ్‌తో కూడిన సింగిల్ విండో పోర్టల్. కార్యాచరణ సమాచారం, భౌతిక మౌలిక సదుపాయాలు, వాణిజ్య ఎంపికలు, చెల్లింపులపై ఎలక్ట్రానిక్ సెటిల్మెంట్లను ఇది అందిస్తుంది. నేడు, ఎస్‌ఎఫ్‌ఏసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1,389 నియంత్రిత హోల్‌సేల్ మార్కె ట్లలో, 1.07 కోట్ల మంది రైతులు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్లలో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం కలిగి ఉన్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 1.7 లక్షల ఇంటిగ్రేటెడ్ లైసెన్ ్సలను జారీ చేశారు. ఈ వేదికకు తమ మద్దతును ప్రతిబింబించేలా దాదాపు 3,500 రైతు ఉత్పత్తిదారులసంఘాలు (ఎఫ్పీఓలు) ఇందులో చురుకుగా పాల్గొనడం గమనార్హం. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. తగిన బాధ్యత ఈ విజయవంతమైన నేపథ్యాన్ని పంచుకోవడం అత్యవసరం. రైతుకు విపత్కరమైన అమ్మకాల నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో 1950వ దశకంలో ‘ఏపీఎంసీ’లను ప్రవేశపెట్టారు. ‘ధర ఆవిష్క రణ’ను నిర్ధారించడానికీ, కనీస మద్దతు ధర వ్యవస్థలో రాష్ట్ర ఏజెన్సీల ద్వారా సేకరణకు వేదికను అందించడానికీ ఇవి రూపొందాయి. అయితే, ఈ ప్రక్రియలో, వారు మధ్యవర్తుల ప్రత్యేక తరగతిని కూడా సృష్టించారు. నిర్దిష్ట మండీలో దాని అధికారికమైన కమాండ్ ఏరి యాతో లైసెన్ ్స కలిగి ఉన్న వ్యాపారిని స్థిరపరిచారు. అయితే, భారతదేశం ఐటీ సూపర్‌పవర్‌గా అవతరించడం, రైతు నుండి మార్కెట్ ఉత్పత్తి విధానంలోకి వ్యవసాయం మారడంతో, వాణిజ్య పరిమితి నిబంధనలను మార్చవలసిన అవసరం ఏర్పడింది. సాంకేతికతలు, ఆర్థిక సాధనాల ద్వారా సన్నకారు, చిన్న రైతులకు వాణిజ్య నిబంధనలను మెరుగుపరచడానికి ఎస్‌ఎఫ్‌ఏసీ వంటిసంస్థలు స్థాపితమయ్యాయి. వ్యవసాయ–వ్యాపార వ్యవస్థాపకులకు వెంచర్ క్యాపిటల్ నిధులను అందించడం నుండి మౌలిక సదుపాయాల కల్పన వరకు ఎస్‌ఎఫ్‌ఏసీ కొత్త పుంతలు తొక్కింది. అందుకే ఈ–నామ్ స్థాపన బాధ్యతను ఎస్ఎఫ్ఏసీకే అప్పగించడంలో ఆశ్చర్యం లేదు మరి. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ కంప్యూటర్ హార్డ్‌వేర్, ఇంటర్నెట్ సౌకర్యం, పరీక్షా పరికరాలు వంటి సామగ్రి లేదా మౌలిక సదుపాయాల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి రూ. 30 లక్షలు మంజూరు చేసింది. క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలు, బయో–కంపోస్టింగ్ యూనిట్ వంటి అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని 2017లో రూ.75 లక్షలకు పెంచారు. మొదటి మూడేళ్లలో దాదాపు 200 మండీలను దీని పరిధిలోకి తీసుకురాగా, 2020 మే నాటికి మరో 415 మండీలు జమయ్యాయి. 2022 జూలై నాటికి మరో 260మండీలు, 2023 మార్చి నాటికి మరో 101 మండీలు పెరిగాయి. గత సంవత్సరం ముగిసేనాటికి మరో 28 వీటికి కలిశాయి. ప్రతి త్రైమాసి కంలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరింత పురోగమించేలా... విధాన రూపకల్పన అనేది సులభం. కానీ భౌతిక, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనే కష్టం. ఇంకా కష్టతరమైనది క్షేత్రస్థాయిలో చేసే పని. ఈ–నామ్‌తో అనుసంధానమైన ప్రతి మండీకి ఒక ఏడాది పాటు ప్రారంభ శిక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఏసీ ఒక ఐటీ నిపుణుడిని (మండి విశ్లేషకుడు) గుర్తించి, మద్దతునిస్తుంది. వారు రాష్ట్ర సమన్వయ కర్త(ల)కు నివేదిస్తారు. ఈ సమన్వయకర్తలు ఒక్కొక్కరు 50 మండీల రోజువారీ సమన్వయాన్ని నిర్వహిస్తారు. ఈ–నామ్ విధానంలోని రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మండి అధికారులందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం కూడా వీరి బాధ్యత. తర్వాత ఏమిటి? సాధించిన పురోగతితో ఆగకుండా, ఈ–నామ్ కొత్త, ఉన్నత ప్రమాణాలను ఏర్పరుస్తోంది. దీని సవరించిన ఆదేశంలో రైతులకు పోటీ ధరలను సాధ్యం చేయడం కోసం కృషి చేస్తుంది. ఏపీఎమ్‌సీ నియంత్రిత మార్కెట్ కమిటీ మండీలకు వెలుపల కూడా వేదికలను ఏర్పాటుచేయడం ద్వారా దీన్ని సాధిస్తుంది. ఈ–నామ్ ద్వారా గిడ్డంగి ఆధారిత విక్రయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.అంతిమంగా, ధరను కనుగొనడం, విక్రయించే స్వేచ్ఛ అనేవి రైతుకు ఎక్కువ మేలు చేస్తాయి. - వ్యాసకర్త లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - సంజీవ్ చోప్రా -
రబీ ఉత్పత్తుల కొనుగోళ్లకు శ్రీకారం
సాక్షి, అమరావతి: మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని రబీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. శనగల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్‌కు శ్రీకారం చుట్టారు. త్వరలో పెసలు, మినుముల కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నారు. మద్దతు ధరకు సేకరణ... రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాల్‌కు శనగలకు రూ.5440, పెసలకు రూ.8558, మినుముకు రూ.6950, వేరుశనగకు రూ.5850 చొప్పున కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. రబీ–2023 –24 సీజన్లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. శనగ 4.50 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేలటన్నుల దిగుబడులొస్తాయని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్‌కు పెసలకు రూ.9 వేల నుంచి 9300, మినుముకు రూ.9 వేల నుంచి 9500 ఉండగా, శనగలు మాత్రం రూ.5300 నుంచి రూ.5600 మధ్య ఉంది. కనీస మద్దతు ధరకు 1.14,163 టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఆర్బీకేల ద్వారా శనగలు కొనుగోలుకు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి రైతుల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుడుతున్నారు. 26వతేదీ నుంచి కొనుగోలు చేపట్టనున్నారు. అదే రీతిలో మిగిలిన పంట ఉత్పత్తుల కొనుగోలుకు కూడా అనుమతి కోరుతూ మార్క్‌ఫెడ్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రైతు రబీలో సాగుచేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే తొలుత ప్రాధాన్యతనిస్తారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీట్యాగ్ వేస్తున్నారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్ అమలు చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలకనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తున్నారు. పారదర్శకంగా కొనుగోళ్లు... కనీస మద్దతు ధరకు రైతుల నుంచి శనగల సేకరణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్న, సన్న కారు రైతులకు తొలుత ప్రాధాన్యతనిస్తాం. ప్రభుత్వం అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
పంట ఏదైనా.. మూడింతల ఆదాయం
సాక్షి, అమరావతి: అన్నదాత కల ఫలిస్తోంది. నచ్చిన చోట.. నచ్చిన వారికి.. నచ్చిన ధరకు పంటల్ని అమ్ముకునే వెసులుబాటు కలుగుతోంది. పండించిన పంటకు ప్రీమియం ధర దక్కుతుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో జారీ చేస్తున్న గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (గ్యాప్) సర్టిఫికేషన్‌తో రైతుల తలరాత మారుతోంది. సర్టిఫికెట్స్ జారీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఇన్నాళ్లూ ధ్రువీకరించే వ్యవస్థ లేక సాగు విధానాలను బట్టి పంట ఉత్పత్తులను ధ్రువీకరించే వ్యవస్థ లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా మంచి ధర ఉన్నప్పటికీ అత్యధిక వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను దేశీయంగానే విక్రయించు కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్ సేంద్రియ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీ ఎస్‌వోపీసీఏ)ని ఏర్పాటు చేసింది. తొలి దశలో పొలం బడులు, తోట బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేయాలని, రెండో దశలో పూర్తిగా సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకల్పించింది. క్యూసీఐ గుర్తింపుతో.. ఇండో గ్యాప్ సర్టిఫికేషన్ జారీ కోసం ఏపీ ఎస్వోపీసీఏకు ఇటీవలే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) అక్రిడిటేషన్ జారీ చేసింది. దీంతో దేశంలోనే గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మలిదశలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఎపెడా (ప్రొసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ) నుంచి అక్రిడిటేషన్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్టిఫికేషన్ జారీపై ఎంపిక చేసిన అధికారులు, రైతులకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో),భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సౌజన్యంతో వివిధ స్థాయిల్లో విడతల వారీగా శిక్షణ ఇచ్చారు. సర్టిఫికేషన్ పొందేందుకు పంటల సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారులను టెక్నికల్ అడ్వైజర్లుగా.. వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఫీల్డ్ ఆఫీసర్లుగా.. తనిఖీలు చేసేందుకు అగ్రికల్చర్ డిప్లమో చేసిన వార్ని ఇంటర్నెల్ ఇన్‌స్పెక్టర్స్‌గా నియమించారు. నంద్యాల జిల్లా ఎర్రగుంట్లకు చెందిన ఈ రైతు పేరు కురాకుల ఓబులేసు. రెండెకరాల్లో కొర్రలు సాగు చేశాడు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం గుర్తించిన క్లస్టర్లో ఆయన పొలం కూడా ఉంది. పొలం బడిలో చెప్పినట్టుగా తగిన మోతాదులో ఎరువులు వినియోగించాడు. ఒక్కసారి మాత్రమే పురుగుల మందు పిచికారీ చేశాడు. మొత్తంగా ఎకరాకు రూ.4,500 పెట్టుబడి అయ్యింది. 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చాక పురుగు మందుల అవశేషాల పరీక్ష చేయించాడు. ఎలాంటి పురుగు మందుల అవశేషాలు లేవని ల్యాబ్‌లో నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చారు. కొర్రలు కనీస మద్దతు ధర రూ.2.500 ఉండగా.. ఈ సర్టిఫికేషన్ వల్ల క్వింటా రూ.7వేలకు అమ్ముకోగలిగాడు. పెట్టుబడి రూ.9 వేలు పోగా.. నికరంగా రూ.47 వేల ఆదాయం వచ్చింది. ఓబులేసు మాట్లాడుతూ.. ‘గతంలో పంటల్ని కనీస మద్దతు ధరకు కూడా కొనేవారు కాదు. ఈ ఏడాది గ్యాప్ సర్టిఫికేషన్ వల్ల మంచి ఆదాయం వచ్చింది’ అంటూ ఆనందంగా చెప్పాడు. ఎమ్మెస్పీ కంటే రెండింతల ఆదాయం.. నంద్యాల జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్లలో ఎంపిక చేసిన రెండు క్లస్టర్స్‌లో 49 మంది రైతులు 63 ఎకరాల్లో కొర్రలు సాగు చేశారు. సాధారణంగా ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖరీఫ్‌లో నెలకొన్న బెట్ట పరిస్థితుల కారణంగా ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున 252 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గతంలో ఎకరాకు రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.5 వేల పెట్టుబడి అయ్యింది. ప్రభుత్వం నిర్ధేశించిన ఎమ్మెస్పీ క్వింటాకు రూ.2,500 కాగా.. రైతులు క్వింటాకు రూ.2,900 నుంచి రూ.4,500 చొప్పున అదనంగా లబ్ధి పొందగలిగారు. 33 మంది రైతులు క్వింటా రూ.5,400 చొప్పున 161 క్వింటాళ్లను, ఏడుగురు రైతులు క్వింటా రూ.6 వేల చొప్పున 43 క్వింటాళ్లు, ఐదుగురు రైతులు క్వింటా రూ.6,300 చొప్పున 28 క్వింటాళ్లు, ఓ రైతు క్వింటా రూ.7 వేల చొప్పున 6 క్వింటాళ్లను విక్రయించారు. ఇలా ఎమ్మెస్పీ కంటే అదనంగా రూ.7.51 లక్షల ఆదాయాన్ని పొందారు. సర్టిఫికేషన్‌తో వ్యాపారులు సైతం పోటీపడి రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేయడంతో కోత కొచ్చిన కొర్రలను రైతులు ఎమ్మెస్పీకి రెండింతల ధరకు అమ్ముకోగలిగారు. 0.1 శాతం కంటే తక్కువ అవశేషాలు నాలుగేళ్లుగా వైఎస్సార్ పొలం బడులను ప్రామాణికంగా తీసుకుని గడచిన ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 20 జిల్లాల్లో ‘గ్యాప్ క్లస్టర్స్’ను ఎంపిక చేశారు. ఈ క్లస్టర్లో గ్యాప్ సర్టిఫికేషన్ జారీ కోసం 1,487.47 ఎకరాల్లో వరి, కొర్రలు, రాగులు, వేరుశనగ, మిరప, అరటి, పసుపు, కూరగాయ పంటలను గుర్తించారు. వ్యవసాయ పంటలు సాగు చేసే 622 మంది రైతులతో 20, ఉద్యాన పంటలు సాగు చేసే 190 మందితో 13 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసి గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఏపీ ఎస్‌ఓపీసీఏ వద్ద రిజిస్ట్రేషన్ చేయించారు. గడచిన ఖరీఫ్ సీజన్ నుంచే గ్యాప్ సర్టిఫికేషన్ జారీకి శ్రీకారం చుట్టారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో ఎరువులు, పురుగు మందులు వినియోగించేలా అవగాహన కల్పించారు. వివిధ దశల్లో రైతు క్షేత్రాల నుంచి శాంపిల్స్ తీసి పరీక్షించారు. పురుగు మందుల అవశేషాల స్థాయి 0.1శాతం కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించారు. 99.99 శాతం ఆర్గానిక్ ఉత్పత్తులుగా గుర్తిస్తూ వారికి సర్టిఫికేషన్ జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మలి దశలో రైతులను మార్కెటింగ్ ఏజెన్సీలు, ఎగుమతిదారులతో అనుసంధానం చేస్తారు. ఈ సర్టిఫికేషన్స్‌తో వారు పండించే ఉత్పత్తులకు మార్కెట్లో ప్రీమియం ధర లభించడంతోపాటు అంతర్జాతీయంగా ఎగుమతి చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా సర్టిఫికేషన్ జారీ గ్యాప్ సర్టిఫికేషన్ జారీ కోసం ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి క్యూసీఐ అక్రిడిటేషన్ జారీ చేసింది. సర్టిఫికేషన్‌తో మన రైతులు అంతర్జాతీయంగా పోటీపడే అవకాశం ఏర్పడింది. గడచిన ఖరీఫ్‌లో 1,487 ఎకరాల్లో 812 మంది రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సర్టిఫికేషన్ జారీ కార్యక్రమం ఈ నెల 18వ తేదీన అధికారికంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – త్రివిక్రమ్‌రెడ్డి, ఎండీ, ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ -
రైతుల మోముల్లో ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను మించి రికార్డు స్థాయి ధరలు లభిస్తున్నాయి. ముఖ్యంగా మిరప, మినుము, పసుపు, పెసలు, కందులు ఎమ్మెస్పీని మించి మంచి ధర పలుకుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల పాటు కనీస మద్దతు ధరలు దక్కని రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంది. దీని ద్వారా ఎమ్మెస్పీ దక్కని వ్యవసాయ, వాణిజ్య పంటలను మార్కెట్లో జోక్యం చేసుకొని మరీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. తద్వారా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటలకు మద్దతు ధర దక్కింది. నాలుగున్నరేళ్లలో 6.17 లక్షల మంది రైతుల నుంచి రూ.7,751.43 కోట్ల విలువైన 21.60 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసింది. ఇలా ధర తగ్గిన ప్రతీసారి ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా మార్కెట్లో ప్రస్తుతం ఆయా ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. ఖరీఫ్ పంట ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే వేళ అపరాలు, చిరుధాన్యాలు, ఉద్యాన, వాణిజ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి రికార్డు స్థాయిలో పలుకుతుండడం శుభపరిణామన్నారు. మిరప, పసుపులకు రికార్డు స్థాయి ధర అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌తో మిరప రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఎమ్మెస్పీ క్వింటా రూ.7 వేలు కాగా, కాస్త నాణ్యత ఉంటే చాలు రూ.20 వేలకు పైగా లభిస్తోంది. గరిష్టంగా రూ.27,525 పలుకుతోంది. ప్రతికూల వాతావరణంలో సాగు చేసిన మిరపపై ఈసారి నల్లతామర ప్రభావం పెద్దగా కనిపించకపోవడం, మార్కెట్లో రికార్డు స్థాయిలో ధరలు ఉండడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించే పరిస్థితులు ఉన్నాయి. పసుపు ఎమ్మెస్పీ క్వింటా రూ.6,850 కాగా గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్లో బుధవారం గరిష్టంగా క్వింటా రూ.10,650 పలికింది. ఈసారి రూ.15 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక పత్తి పొడుగు పింజ రకం ఎమ్మెస్పీ క్వింటా రూ.7,020 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.7,453 పలుకుతోంది. మధ్యస్థ పింజ రకం ఎమ్మెస్పీ రూ.6,620 కాగా మార్కెట్లో రూ.7 వేలు లభిస్తోంది. మిగిలిన పంట ఉత్పత్తులకు సైతం మార్కెట్లో డిమాండ్ ఉండడంతో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇచ్చేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. క్వింటా రూ.10 వేలు దాటిన అపరాలు అపరాలకు మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. మినుము ఎమ్మెస్పీ క్వింటా రూ.6,950 కాగా, మార్కెట్లో రూ.11,500 పలుకుతోంది. కందులు ఎమ్మెస్పీ రూ.7 వేలు కాగా రూ.10,500, పెసలు ఎమ్మెస్పీ రూ.8,558 ఉండగా మార్కెట్లో రూ.10,500 వరకు ధరలు పలుకుతున్నాయి. రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలకు కూడా మంచి ధరలు లభిస్తున్నాయి. ఇక ఉల్లి ఎమ్మెస్పీ క్వింటా రూ.700 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.5,500 వరకు రైతుకు ధర లభిస్తోంది. వేరుశనగ కూడా ఎమ్మెస్పీ రూ.6,377 కాగా, గరిష్టంగా మార్కెట్లో రూ.7,596 పలుకుతోంది. అరటి ఎమ్మెస్పీ క్వింటా రూ.800 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.2,880 లభిస్తోంది. బత్తాయి ఎమ్మెస్పీ రూ.1,400 కాగా మార్కెట్లో గరిష్టంగా రూ.4,200 వరకు పలుకుతోంది. ఖరీఫ్ పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చే వేళ ఇలా వ్యవసాయ, వాణిజ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. -
పత్తి ఆహార పంట కూడా! కొన్ని దేశాల్లో ఏకంగా..
పత్తి పంటను కేవలం నూలు వస్త్రాల ఉత్పత్తికి వాడే దూదిని వాణిజ్య పంటగానే సాధారణంగా మనం పరిగణిస్తుంటాం. కానీ, అంతర్జాతీయంగా దీన్ని వాణిజ్య పంటగానే కాకుండా ఆహార, చమురు పంటగా కూడా గుర్తిస్తున్నారు. అక్టోబర్ 7వ తేదీన ‘ప్రపంచ పత్తి దినోత్సవం’ సందర్భంగా అనేక అంతర్జాతీయ సంస్థలు వ్యాప్తిలోకి తెచ్చిన సమాచారంలో ఇదొక ముఖ్యాంశం. పత్తి గింజల నూనెను వంట నూనెగా వాడుతున్నాం. పత్తి గింజల చక్కను పశు దాణాలో కలిపి పాడి పశువులకు మేపుతున్నాం. కొన్ని దేశాల్లో పత్తి గింజల నూనెను జీవ ఇంధనం తయారీకి కూడా వాడుతున్నారు. ఆ విశేషాలు కొన్ని.. ప్రపంచంలో అత్యధికంగా పత్తి సాగు చేస్తున్న దేశం భారత్. 23% పత్తి మన దేశంలోనే పండుతోంది. 60 లక్షల మంది పత్తి సాగు చేస్తుండగా, మరో 40–50 లక్షల మంది పత్తి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తి రైతులు 3 కోట్ల 20 లక్షలు. ఇందులో దాదాపుగా సగం మహిళా రైతులే. వీరిలో ఎక్కువ మంది పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వారే. మన దేశంలో 65 శాతం పత్తి వర్షాధారంగానే సాగవుతోంది. అప్పుల పాలై ప్రాణాలు తీసుకునే రైతుల్లో మెట్ట ప్రాంతాల పత్తి రైతులే ఎక్కువ. 5 ఖండాల్లోని 80 దేశాల్లో 13 కోట్ల మందికి పైగా పత్తి ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థల సమాచారం ప్రకారం.. కనీసం 18 దేశాల్లో పత్తి పొలాల్లో బాలకార్మికులతో పనులు చేయిస్తున్నారు. అంతర్జాతీయ పత్తి సలహా మండలి (ఐసిఎసి) అంచనా ప్రకారం రైతు పండించిన ఒక టన్ను పత్తి ఐదుగురికి ఏడాది పొడవునా ఉపాధిని కల్పిస్తోంది. కిలో పత్తిని పండించడానికి 20 వేల లీటర్ల నీరు అవసరమనే భావన ఉంది. అయితే, నిజానికి 1,200–2,000 లీటర్ల నీరు సరిపోతుందని ఐసీఏసీ చెబుతోంది. అందువల్లనే నిస్సారమైన భూములు, కరువులకు ఆలవాలమైన సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో సాగు చేయదగిన అతి కొద్ది పంటల్లో పత్తి కూడా ఉందని ఐసీఏసీ వాదన. పత్తి పంట సాగు వల్ల భూతాపం కూడా పెరగడం లేదని ఐసీఏసీ చెబుతోంది. రసాయనిక సేద్యంలో కిలో పత్తి సాగుకు 1.7 కిలోల కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని అంచనా. అయితే, దూదిలో 97% సెల్యులోజ్ ఉంటుంది. కాబట్టి, పండే ప్రతి కిలో దూది 2.2 కిలోల కర్బన ఉద్గారాలను పీల్చుకుంటుంది. అంటే.. ప్రతి కిలో పత్తికి 0.5 కిలోల ఉద్గారాలు నిజానికి వాతావరణంలో తగ్గుతున్నట్టేనని ఐసీఏసీ లెక్క చెబుతోంది. సేంద్రియ పద్ధతుల్లో సాగయ్యే కిలో దూదికి 0.9 కిలోల ఉద్గారాలు మాత్రమే విడుదలవుతున్నాయని ఐసిఎసి అంటోంది. సింథటిక్ ఫైబర్ బదులు పత్తిని వినియోగించడం ద్వారా భూతాపాన్ని తగ్గించవచ్చని, మైక్రోఫైబర్ కణాల కాలుష్యం నుంచి జలవనరులను, ఆహార చక్రాన్ని రక్షించుకోవచ్చని ఐసీఏసీ సూచిస్తోంది. పంట కాలం పూర్తయిన తర్వాత పత్తి చెట్టు మొత్తంలో 3% తప్ప వృథా అయ్యేదేమీ లేదు. పత్తి కట్టెతో బయోచార్ తయారు చేసుకొని సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చని ఐసీఏసీ అంటోంది. పెరుగుతున్న భూతాపం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో పత్తి రైతులను ముఖ్యంగా మహిళా రైతులను వాతావరణ మార్పులు బహుముఖంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయని కాటన్‌కనెక్ట్ సంస్థ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. పొలం పనులు, పశుపోషణ, కుటుంబ పోషణ సమస్యలతో మహిళా రైతులు సతమతమవుతున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే ఉపాయాలపై మహిళా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని కాటన్ కనెక్ట్ నివేదిక తెలిపింది. మన దేశంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణంలో 95% జన్యుమార్పిడి చేసిన వంగడాలే. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: అదిరేటి వంగడాలు ‘అంతరిక్షం’ నుంచి? చైనా మాదిరి స్పేస్ బ్రీడింగ్) -
‘ఏఐ’ పంట!.. వ్యవసాయ రంగంపై చాట్ జీపీటీ ప్రభావం ఎలా ఉండబోతుంది?
-కంచర్ల యాదగిరిరెడ్డి నాగలి పోయి ట్రాక్టర్ వచ్చినప్పుడు.. యంత్రాలు సాగు చేస్తాయా? అన్నవాళ్లున్నారు. ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో బాగున్నాయే అనుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం కొంత పుంజుకున్నా.. తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్నారు. ఇలాంటి సమయంలోనే ‘చాట్ జీపీటీ’, దాని ఆధారితంగా మరిన్ని కృత్రిమ మేధ సాంకేతికతలు తెరపైకి వచ్చాయి. వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏఐ ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి కూడా. మరి మొత్తంగా దీనివల్ల రైతులకు ఏం మేలు జరుగుతుంది? వ్యవసాయానికి ఏం ఒనగూరుతుంది? అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50 శాతంపైనే. కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం రకరకాల పథకాలు, లాభాలు చేకూరుస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు తక్కువే. ఈ కారణంగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది. అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్ జీపీటీ’ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్ ఓపెన్ ఏఐ సరీ్వస్ ద్వారా చాట్ జీపీటీ ఆధారంగా తయారైన‘జుగల్బందీ’చాట్‌బోట్ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్ బోట్ ఇంగ్లిషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ అందిస్తూండటం విశేషం. చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడంకోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు. 1. ప్రిడిక్టివ్ అనాలసిస్: వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వేసిన పంట ఎంత బాగా పండేది కచి్చతంగా చెప్పగలదు. దీన్నే ప్రిడిక్టివ్ అనాలసిస్ అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి. 2. గరిష్టంగా దిగుబడులు: పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేíÙంచడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. 3. ప్రిసిషన్ అగ్రికల్చర్: జనరేటివ్ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే.. అతితక్కువ కలుపునాశనులతో వాటిని తొలగించే ప్లాన్‌ను ఏఐ అందివ్వగలదన్నమాట. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణించడం ద్వారా చేసే ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి. 4. కొత్త వంగడాల సృష్టి: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే.. అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపు ణులు చెప్తున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేíÙంచి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కత్రిమ మేధ సాఫ్ట్వేర్లు వేగంగా గుర్తించగలవు. చాట్బోట్లు.. కాల్‌సెంటర్లు భారత ప్రభుత్వం కూడా వ్యవసాయంలో జనరేటివ్ ఏఐ సామర్థ్యాన్ని గుర్తించింది. కేంద్ర ఐటీ, ఎల్రక్టానిక్స్ శాఖ వాట్సాప్ ఆధారిత చాట్‌బోట్ ఒకదాన్ని సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఏఐ (కిసాన్ జీపీటీ)’ ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్ ఏఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్ దేశాయ్ తెలిపారు. వాధ్వానీ ఏఐ అనే స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థ కూడా జనరేటివ్ ఏఐ సాయంతో రైతులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు కిసాన్ కాల్‌సెంటర్ ఒకదాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. వ్యవసాయ రంగ నిపుణుల అనుభవాన్ని జనరేటివ్ ఏఐతో అనుసంధానించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వాధ్వానీ ఏఐ తెలిపింది. డిజిటల్ గ్రీన్ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూండగా ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్ ఏఐ’ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకు పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్‌బోట్ ద్వారా అందిస్తోంది. తెలంగాణలో ‘మిర్చి, పసుపు’ పరికరాలు మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్ ఇస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను త్వరగా మార్కెటింగ్ చేసుకోవడానికి, తగిన ధర పొందడానికి ఇది వీలు కల్పిస్తోంది. -
ఇకపై మీ పంట వృథా కాదు, ఇంజనీర్ సృష్టించిన సోలార్ డ్రైయర్
ప్రకృతి చాలా చిత్రమైంది. ధాన్యాన్ని ఎండించి ఇస్తుంది. కాయగూరలను పండించి ఇస్తుంది. ధాన్యం ఏడాదంతా నిల్వ ఉంటుంది. కాయలు పండ్లకు రోజులే జీవిత కాలం. ఆ కాయలు పండ్లను కూడా ఎండబెడితే... అవి కూడా ఏడాదంతా నిల్వ ఉంటాయి. ముందు చూపు ఉంటే ఏదీ వృథా కాదు, దేని ధరా కొండెక్కదు... అని నిరూపించాడు ఇందోర్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ వరుణ్ రహేజా. రైతుల ఆత్మహత్యలు, టొమాటోలు కోసిన ధరలు కూడా రావని పంటను వదిలేయడం వంటి వార్తలు తనను కలచి వేశాయి. పంటను నిల్వ చేసుకోగలిగితే రైతుల నష్టాలు, మరణాలను నివారించవచ్చనుకున్నాడు. కరెంట్ లేని ప్రదేశాల్లో కూడా ఉపయోగకరంగా ఉండడానికి సూర్యరశ్మితో పనిచేసే సోలార్ డ్రైయర్‌ను రూపొందించాడు. గత వేసవిలో కిలో రెండున్నర రూపాయల చొప్పున సేకరించిన టొమాటోలను డ్రైయర్‌లో ఎండబెట్టి తన ప్రయోగ ఫలితాన్ని నిరూపించాడు వరుణ్. యువతలో సామాజిక స్పృహ మెండుగా ఉన్నప్పుడు, చదువుతో వచ్చిన జ్ఞానం తన ఉన్నతితో పాటు సామాజికాభివృద్ధికి కూడా దోహదం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు సాధ్యమవుతాయి. వరుణ్ చేసిన ప్రయోగం వ్యవసాయరంగానికి మేలు చేస్తోంది. ఆలోచన... ఆసక్తి! ‘‘నేలలో నాటిన విత్తనం నుంచి ఒక చెట్టు మొలవడం, అది పెద్దయి... పూత పూసి కాయ కాచి అది పండే వరకు ప్రతిదీ ప్రకృతి చేసే అద్భుతమే. పంటను, పొలాన్ని సంరక్షించడంలో రైతు పడే కష్టాన్ని కొలవడానికి ఏ పరికరమూ ఉండదు. అలాంటిది పండించిన పంటను చేతులారా నేలపాలు చేసేటప్పుడు రైతు అనుభవించే ఆవేదన ఎలాంటిదో నాకు తెలియదు, కానీ ఆ పంట నేలపాలవుతుంటే నా మనసు మౌనంగా రోదించేది. పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉంటే ఆ రైతు తన చేతులారా పండించిన పంటను అలా నేలపాలు చేయడు కదా అనిపించేది. ఈ ఆలోచనలు నేను మెకానికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్న్షిప్ చేస్తున్న సమయంలో ఒక కొలిక్కి వచ్చాయి. పోషకాలు వృథా కాని విధంగా పండ్లు, కాయల్లోని తేమను సహజంగా తొలగించగలిగితే పంటను నిల్వ చేయవచ్చు. అది సౌరశక్తితో సాధ్యమని తెలిసిన తర్వాత నా ప్రయత్నాలను ముమ్మరం చేశాను. సోలార్ డ్రైయర్‌ను రూపొందించడంతోపాటు అన్ని రకాల రైతులకు అది అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే పాలీ హౌస్‌తోపాటు ఇరవై కిలోల నుంచి వంద కిలోల కెపాసిటీ గలిగిన పోర్టబుల్ డ్రైయర్లను కూడా రూపొందించాను. వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. మేధ సమాజానికి ఉపయోగపడాలి! నేను చేసే పని నాకు నచ్చినదై ఉండాలి. ఒకరు చెప్పిన పని చేయడానికి నా మేధను పరిమితం చేయడం నాకిష్టం లేదు. నేను చేసే పని సమాజానికి ఉపయోగపడేదై ఉంటే అందులో లభించే సంతృప్తి అనంతం. టొమాటోల ధరలు వార్తల్లో ఉండడాన్ని చూస్తూనే పెరిగాను. రైతన్నల శ్రమకు ఫలితం కొనుగోలు చేసే వ్యాపారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటోంది. పండించిన రైతులు ఎప్పుడూ అనిశ్చితిలోనే ఉంటున్నారు. సప్లయ్ చైన్ దళారులతో నిండిపోయి, రైతుకు ఉపయుక్తంగా లేకపోవడమే ఇందుకు కారణం. పొలంలో పండిన పంట వంటగదికి చేరేలోపు వివిధ దశల్లో 30 నుంచి 40 శాతం వృథా అవుతోంది. ఆ వృథాని అరికట్టడం, పండించిన రైతుకు తన పంటకు తగిన ధర నిర్ణయించగలిగే స్థితి కల్పించడం నా లక్ష్యం. అందుకే పంటను ఎండబెట్టి నిల్వ చేసే ఇండస్ట్రీని స్థాపించాను’’ అన్నాడు తన ప్రయోగాల కోసం రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించిన వరుణ్ రహేజా. వరుణ్ కొత్త పరికరాల రూపకల్పనలో నిమగ్నమై ఉంటే, అతడు నెలకొల్పిన పరిశ్రమను తల్లి బబిత నిర్వహిస్తున్నారు. -
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా మారింది
-
పంట మార్పిడి చేశాడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు ...
-
వేధించే వేరుతొలుచు పురుగు
జహీరాబాద్: చెరకుతో పాటు ఇతర పంటలను వేరుతొలుచు పురుగు ఆశించి అపారనష్టం కలిగిస్తోంది. ఏటా వర్షాకాలంలో దీని ఉధృతి అధికంగా ఉంటోంది. చెరకు, పత్తి, కంది, మొక్కజొన్న, మిరప, అల్లం వంటి పంటలను సైతం దెబ్బతీస్తోంది. పంట వేసినప్పుడు ఈ పురుగు ఆశించి, పంటలేనప్పుడు భూమిలో దాగి ఉంటుందని డీడీఎస్–కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త ఎన్.స్నేహలత పేర్కొన్నారు. ఎప్పుడయితే మొదటి వర్షం పడుతుందో అప్పుడు భూమిలో ఉన్న పురుగులు వేప, రేగు, మునగ పంటలపై ఆశించి వాటి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయన్నారు. భూమిలో ఉన్న తల్లి పురుగులు 50–60 సెంటీ మీటర్ల లోతున 30–35 గుడ్లు పెడుతుందని, ఇలా పొదిగిన లద్దె దశలు కొత్తగా వేసిన పంటల వేరు వ్యవస్థను ఆశిస్తాయన్నారు. ఈ పురుగు యాసంగిలో కోశస్థ దశకు మారి భూమిలోనే ఉండిపోయి మళ్లీ వర్షాలు పడినప్పుడు బయటకు వస్తాయని, ఇలా వాటి జీవితచక్రాన్ని పూర్తి చేస్తాయన్నారు. నష్టపరిచే విధానం వేరుపురుగు ఆశించిన పంటను గమనిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి పంట వడలిపోతుంది. ఇలా వడలిన మొక్కలను పీకినప్పుడు చాలా సులభంగా బయటకు వస్తాయి. పప్పు దినుసుల్లో వేరు వ్యవస్థ నత్రజనిని ఆశించే బుడిపెలు కలిగి ఉంటాయి. వాటిని ఈ పురుగు ఆశించి నత్రజని సౌకర్యాన్ని అందకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పురుగు ఎక్కువగా చెరకులో రటూన్(మొడెం) పంటను ఆశిస్తుంది. యాజమాన్య పద్ధతులు ● పంట వేసుకునే ముందు లోతు దుక్కులు చేసుకోవాలిత ● రైతులు పెంట ఎరువులు వేస్తారు. మగ్గిన పెంటఎరువులో ఈ పురుగు ఎక్కువగా గుడ్లు పెడుతుంది. వీటి వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చిలికిన పెంటను ఎరువుగా వేసుకోవాలి. ● మొక్కలు ఎండిపోయి, వడలిపోయినట్టు కనిపిస్తే మెటారైజియం అనే సూక్ష్మం 5 గ్రాములను లీటరు నీటిలో కలిపి మొక్కల మొదళ్లు తడపాలి లేదా డ్రిప్ నీటివసతి కలిగి ఉంటే అందులో వదలాలి. ● వేసవి జల్లులు ముగిసిన వెంటనే పంట చుట్టూ ఉన్న వేప, అకేశియా చెట్లు ఉన్న చోట లైట్ ట్రాప్స్ పెట్టుకోవడం వల్ల తల్లి పురుగు ఆకర్షితమై అందులో పడిపోతాయి. ఇలా పడిన వాటిని చంపివేయాలి. ● దశవర్ణి కషాయం 6 లీటర్లు ఒక ఎకరానికి కలిపి మొదళ్లను తడపాలి. -
అధరహో.. రైతులకు సంతృప్తి నిస్తోన్న పొగాకు ధరలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: లం కేంద్రాల్లో పొగాకు ధరలు ఆల్‌టైమ్ రికార్డులు నమోదు చేసుకుంటున్నాయి. ఎన్నడూలేని విధంగా ఈ సారి ధరలు అధరహో అనిపిస్తున్నాయి. నాలుగైదు దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో రికార్డు ధరలు రాలేదని పొగాకు బోర్డు అధికారులు అంటున్నారు. ఈ ఏడాది వేలం ప్రక్రియ ప్రారంభం నుంచే ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో కేజీ గరిష్ట ధర రూ.249 నమోదు కావడం కూడా రికార్డే. అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడంతో గ్రేడ్లతో సంబంధం లేకుండా పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి సరాసరి ధర సుమారు రూ.67 పెరిగింది. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ధరలు పడడంతో పాత రికార్డులు బద్దలవుతున్నాయి. ఒకప్పుడు పొగాకు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్య చేసుకున్నారు. నష్టాల పాలై కుటుంబాలకు కుటుంబాలే దిక్కులేనివయ్యాయి. నాడు పగాకు ఉన్న పొగాకు నేడు సిరులు కురిపిస్తోంది. పొగాకు పంట పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక స్థాయి ధర పలకడంతో రైతు కాలర్ ఎగురేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సీజన్లో పొగాకు కేజీ ధర ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరి రూ.249 పలికింది. కనిష్ట స్థాయి ధర రూ.160 కూడా పొగాకు పంట మొదలెట్టినప్పటి నుంచి పలకలేదంటే అతిశయోక్తి కాదు. అటు హైగ్రేడ్, ఇటు లో గ్రేడ్ పొగాకు ధర రెండూ కలుపుకున్నా ఇవి కూడా ఆల్‌టైం రికార్డే. సరాసరి కేజీ పొగాకు ధర రూ.239.43 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో సరాసరి ధర రూ.172.49 పలికింది. నాలుగేళ్లుగా ఏ సీజన్‌కు ఆ సీజన్ ధరలు పెరుగుదలకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ ఒక కారణమైతే రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించడం మరో కారణం. అప్పటి నుంచే వ్యాపారులు కేజీ పొగాకు ధరను రూ.220కి దాటించి కొనుగోలు చేశారు. ధరల పెరుగుదల ఇలా.. వేలం చివరికి వచ్చే కొద్దీ పొగాకు రేట్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభం నాటికి గ్రేడ్–1 పొగాకు కేజీ ధర రూ.200 ఉండగా వారం రోజుల్లో ధర అమాంతం రూ.14కు పెరిగి అత్యధిక ధర రూ.214 కు చేరింది. ఆ తర్వాత మార్కెట్ ఊపందుకుంది. ఎవరూ ఊహించని విధంగా 10వ తేదీ నాటికి ధర రూ.243కి చేరింది. క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. 16వ తేదీ నాటికి ధర రూ.249 చేరి ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతం ధరలు రూ.245 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా మన కంటే ముందు ముగిసిన కర్ణాటక మార్కెట్లో కేజీ పొగాకు ధర రూ.270 పలికింది. అదే స్థాయిలో ధరలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వ్యాపారులు రేట్లు పెంచే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని, అందువల్లే ఇక్కడి మార్కెట్లో ఆ స్థాయిలో రేట్ల పెంచడం లేదనే వాదన రైతుల్లో ఉంది. డిమాండ్ ఉన్నా సరే వ్యాపారులు కొంత సిండికేట్‌గా ఏర్పడి భారీగా రేట్లు పెంచకుండా జాగ్రత్త పడుతున్నారని బోర్డు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నా ఏ స్థాయిలో రేట్లు పెరుగుతాయనేది వ్యాపారుల చేతుల్లోనే ఉంది. వ్యాపారుల్లో పెరిగిన పోటీ... పొగాకు వేలంలో గుత్తాధిపత్యాన్ని లేకుండా చేయటంతో పాటు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న పొగాకు వ్యాపారులకు సీఎం వైఎస్ జగన్ చెక్ పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు పొగాకు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో వరుసగా టీడీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులు ఐదేళ్ల పాటు నష్టాల పాలవుతూనే వచ్చారు. దీనిని గమనించిన సీఎం వైఎస్ జగన్ గత 2020–21 సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను పొగాకు బహిరంగ వేలంలోకి దించారు. అందుకోసం రూ.220 కోట్లు విడుదల చేశారు. లో గ్రేడ్ పొగాకును కూడా ఎక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. అప్పటి నుంచి వేలంలో పొగాకు వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. దీంతో రైతుకు మంచి ధర వస్తోంది. 70 శాతం నాణ్యమైన పొగాకు ఉత్పత్తి ఈ సారి పంట దిగుబడి ఎక్కువ రావటంతో పాటు నాణ్యమైన పొగాకు 70 శాతం దిగుబడి వచ్చి లో గ్రేడ్ పొగాకు 30 శాతం దిగుబడి వచ్చింది. అందులోనూ పండిన పంటలో 5 నుంచి 6 శాతం పండుగుల్ల పొగాకు దిగుబడి వచ్చింది. రెండు సార్లు వేయటం వల్ల నిర్దేశించిన పంట లక్ష్యంకంటే అదనంగా 5,182 హెక్టార్లలో పంట సాగు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాటు పొగాకు బోర్డు నిర్దేశించిన పంట దిగుబడి 87.61 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా ఇచ్చారు. అయితే మాండూస్ తుపాను కారణంగా రెండుసార్లు పంట వేయటం వల్ల దిగుబడి అత్యధికంగా వచ్చింది. పొగాకు బోర్డు 87.61 మిలియన్ కేజీల పంట దిగుబడి లక్ష్యంగా ఇచ్చింది. అయితే 107 మిలియన్ కిలోల దిగుబడి వచ్చింది. అంటే 19.39 మిలియన్ కిలోల పొగాకు అదనంగా వచ్చింది. బ్యారన్‌కు రూ.4 లక్షల వరకు ఆదాయం ఈ సంవత్సరం నాలుగు పొగాకు బ్యారన్ల పరిధిలో 40 ఎకరాల పొగాకు చేశాను. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పొగాకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత సంవత్సరం కేజీ పొగాకు ధర అత్యధికంగా రూ.180 అమ్ముకోగలిగాను. అదే క్వాలిటీ పొగాకు ధర ఈ సంవత్సరం కేజీ పొగాకు రూ.249 వరకు అమ్ముకున్నాను. బ్యారన్‌కు సాగు ఖర్చు పోను రూ.4 లక్షల వరకు ఆదాయం మిగిలే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ధరల పట్ల రైతులు సంతోషంగా ఉన్నారు. – మోపత్తి నారాయణ, పొగాకు రైతు, పెరిదేపి గ్రామం, కొండపి మండలం పొగాకు సరాసరి ధరలు సంవత్సరం ధర (రూ) 2018–19 126 2019–20 124.55 2020–21 148.54 2021–22 172.49 2022–23 239.43 (వేలం ఇంకా కొనసాగుతోంది) 5182 హెక్టార్లలో అదనంగా సాగు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలలు (ఎస్బీఎస్), దక్షిణ ప్రాంత తేలకపాటి నేలలు (ఎస్ఎల్ఎస్)లలో కలుపుకొని మొత్తం 24,353 పొగాకు బ్యారన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 30,240 మంది రైతులు పొగాకు పండిస్తున్నారు. పొగాకు బోర్డు నిర్దేశించిన ప్రకారం 58,300 హెక్టార్లలో పొగాకు సాగు చేయాల్సి ఉండగా, 63,482 హెక్టార్లలో పొగాకును సాగు చేశారు. 5182 హెక్టార్లలో పొగాకును అదనంగా సాగు చేశారు. -
మద్దతు ధరలపై 'ఈనాడు' తప్పుడు వార్తలు
-
తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయడం లేదు
-
ప్రభుత్వ కేంద్రాలున్నా.. ప్రైవేట్‌కే ధాన్యం అమ్ముకోవాలా?
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వరికోతలు ప్రారంభమై ధాన్యం కేంద్రాలకు తరలుతున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు కొనుగోళ్లు చేపట్టకపోవడం, మరోవైపు అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటను కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో కొంతమంది రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు సైతం బస్తాకు రెండు నుంచి మూడు కిలోల చొప్పున అదనంగా తూకం వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాలను ప్రారంభించి, వేగంగా తూకం వేస్తే ప్రైవేటుకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉండదని రైతులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రారంభమైనవి 20 కేంద్రాలే.. జిల్లాలో ఈసారి మొత్తం 214 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. కోతల సీజన్ ప్రారంభమై పదిరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కేవలం 20 కేంద్రాలను మాత్రమే అధికారులు ప్రారంభించారు. ఇవి కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే అధికంగా ఉన్నాయి. మిగితా చోట్ల ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం కాలేదు. ఇప్పటికే జిల్లాలోని బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, తెలకపల్లి, నాగర్‌కర్నూల్ మండలాల్లో వరిపంటను కోసం పది రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. అకాల వర్షాల నేపథ్యంలో కల్లాలకు తెచ్చిన ధాన్యం నీటిపాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 214 కొనుగోలు కేంద్రాలకు ప్రస్తుతం 20 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈసారి సీజన్లో మొత్తం 1.50లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మొత్తం 2.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు కొనుగోలు చేసింది మొత్తం 1,069 మెట్రిక్ టన్నులు మాత్రమే. ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో చాలావరకు ధాన్యం ప్రైవేటుకు తరలుతోంది. దీంతో జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ చేపట్టకుండా, కొంతమేరకు కొనుగోళ్లకే అధికారులు పరిమితం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తేమ పేరుతో కొర్రీలు.. జిల్లాలో చాలాచోట్ల వరికోతలు పూర్తయ్యి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కాంటాలు మొదలు కావడం లేదు. ధాన్యం ఇప్పుడిప్పుడే కేంద్రాలకు వస్తోందని, తేమ శాతం సరిగ్గా ఉంటే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 17శాతం తేమ ఉంటే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం చేపట్టాలి. కానీ జిల్లాలోని చాలా కేంద్రాల్లో 16 నుంచి 14 శాతం వరకు ఉంటేనే తీసుకుంటున్నారు. అప్పటివరకు రైతులతో మళ్లీ ఆరబోయిస్తున్నారు. కొన్నికేంద్రాల్లో తేమ శాతం ఉన్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లర్లకే విక్రయిస్తున్నారు. ‘ఈ ఫొటోలోని రైతు పేరు సాగర్. జిల్లాలోని తాడూరు మండలం చర్లఇటిక్యాల గ్రామానికి చెందిన రైతు సాగర్ 14 రోజుల కిందట వరిపంటను కోశాడు. అయితే ఇప్పటివరకు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగోళ్లను ప్రారంభించలేదు. దీంతో జిల్లాకేంద్రంలో సమీపంలోని మిల్లుకు ధాన్యాన్ని తరలించాడు. మిల్లు నిర్వాహకుడు బస్తాకు కిలోన్నర చొప్పున కట్ చేసుకున్నాడని వాపోయాడు. గ్రామంలో అధికారులు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాల భయానికి ప్రైవేటు మిల్లులకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.’ తేమ శాతం ఉంటే వెంటనే కొనుగోలు చేస్తున్నాం.. జిల్లాలో ఈసారి మొత్తం 214 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం. జిల్లాలోని చాలాచోట్ల ఇంకా వరికోతలు పూర్తికాలేదు. ఇప్పుడిప్పుడే ధాన్యం సెంటర్లకు వస్తోంది. కేంద్రానికి వచ్చిన ధాన్యం నిర్ణీత తేమ శాతం ఉంటే వెంటనే కొనుగోలు చేస్తాం. – మోహన్‌బాబు, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి జిల్లాలో ఏర్పాటుచేయనున్న కొనుగోలు కేంద్రాలు - 214 ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు - ప్రారంభమైనవి - 20 -
నెట్టింట.. లాభాల పంట
సాక్షి, కర్నూలు డెస్క్: రైతులు తాము పండించిన ఉత్పత్తుల్ని అమ్ముకోవాలన్నా.. వ్యాపారులు సరుకు విక్రయించాలన్నా సవాలక్ష సమస్యలు. పంట బాగా పండినా కోత కోయడం.. మార్కెట్‌కు తరలించడం.. అమ్ముకోవడం.. తీరా లెక్కలు వేసుకుంటే పెట్టుబడి కూడా దక్కలేదని నిట్టూరుస్తూ ఇంటికి చేరుకోవడం రైతులకు మామూలైపోయింది. ఈ కోవలోనే వ్యాపారులు కూడా. ఎంత నాణ్యమైన సరుకును దుకాణంలో ఉంచినా మాటల గారడీ చేయలేక.. వినియోగదారులను మోసగించలేక సతమతమయ్యే వ్యాపారులు లేకపోలేదు. ఇలాంటి వారికి సోషల్ మీడియా చక్కటి పరిష్కారం చూపుతోంది. ఏ మార్కెట్‌కు తీసుకెళ్లాలనే బెంగ లేదు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందుతుందనగానే రైతును సవాలక్ష ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దిగుబడిని ఎక్కడ అమ్మాలి. ఏ మార్కెట్లో ఎక్కువ ధర వస్తుంది. కొన్ని రోజులు ఆగితే ధరలో మార్పు ఉంటుందా? ప్రస్తుత ధరకు అమ్మితే కనీసం పెట్టుబడి అయినా దక్కుతుందా? ఇలా నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపే రైతులకు ఇప్పుడా బెంగ లేదు. ఉత్పత్తులను నేరుగా రైతులే విక్రయించుకునే అవకాశం ఏర్పడింది. వివరాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచి.. ధర కూడా రైతులే నిర్ణయించే రోజులు వస్తుండటం విశేషం. దళారుల ప్రమేయం లేకుండా సొంతంగా విక్రయాలు చేపట్టాలంటే నాణ్యత తప్పనిసరి. వినియోగదారుడు ఒక్కసారి ఇష్టపడితే.. ఆ తర్వాత ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మరీ కొనుగోలు చేస్తారు. ఫోన్ చేస్తే చాలు.. ఒకప్పుడు ఫలానా వస్తువు కొనుగోలు చేయాలంటే ఎక్కడ దొరుకుతుందో.. నాణ్యంగా ఉంటుందో లేదో.. ధర కరెక్టుగానే చెబుతారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. ఇప్పుడు ఏది కావాలన్నా నెట్లో వెతికితే.. వివరాలు అరచేతిలో వచ్చి వాలతాయి. ధర ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుగోలు చేస్తున్న రోజులు. వ్యాపారంలో పోటీ పెరగడంతో ఇప్పుడు విక్రయదారులు ఒక అడుగు ముందుకేసి, ఫోన్ చేస్తే చాలు ఎక్కడికైనా పార్సిల్ చేస్తున్నారు. ఒకటి రెండు రూపాయలు తక్కువ లాభం వచ్చి నా.. ఫోన్ చేసిన వినియోగదారులు సంతృప్తి చెందితే ఆ తర్వాత తమ వ్యాపార ఖాతాలో చేరిపోతారనే భావన కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్దెకు దుకాణం సంగతి పక్కనపెడితే.. అడ్వాన్సుల పేరు వింటేనే కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి. వ్యాపారం జరుగుతుందో లేదో కానీ.. దుకాణం దక్కించుకోవడమే గగనం అవుతోంది. ఆ తర్వాత వ్యాపారానికి అనుగుణంగా ఫరి్నచర్, సిబ్బంది నియామకం కలిపి లెక్కలేస్తే తడిసి మోపెడవుతుంది. అదే నెట్టింట్లో వ్యాపారం చేస్తే ఇవన్నీ మిగులుబాటే. మామిడి పండ్ల ప్రేమికులకు నమస్సులు.. మూడేళ్లుగా మా తోటలో రసాయన మందులు వాడకుండా మామిడి పండిస్తున్నాం. రసాయనాలు వాడకుండా మగ్గించిన పండ్లను అమ్మకాలను ఈ నెల 23 నుంచి కర్నూలు కృష్ణానగర్‌లోని రామకృష్ణ స్కూల్ వద్ద ప్రారంభిస్తున్నాం. కిలో ధర కవర్లలో అయితే రూ.120, కవర్లు లేకుంటే కిలో రూ.100. కవర్లు లేకుండా చిన్న సైజు మామిడి ధర రూ.80. – సోషల్ మీడియాలో ఓ రైతు చేసిన పోస్ట్ అందరికీ నమస్కారం మేం స్వచ్ఛమైన వేరుశనగ (పల్లీ) నూనె గానుగ ఆడించి అమ్ముతున్నాం. కేజీ రూ.280. ప్రత్యేకంగా పండించిన తెల్ల నువ్వుల నూనె (గానుగ ఆడించినది) కేజీ రూ.500, పొద్దుతిరుగుడు గింజల నూనె రూ.380, కుసుమ నూనె రూ.400, కొబ్బరి నూనె రూ.460 చొప్పున అమ్ముతున్నాం. ఆర్డర్లపై ఏ ప్రాంతానికైనా పంపుతాం. – సామాజిక మాధ్యమాల్లో తన ఇంటినుంచి ఓ వ్యాపారి చేసిన పోస్ట్ నిరసన కూడా తెలపొచ్చు కర్నూలు చెక్ పోస్ట్ సమీపంలోని ఓ బడా స్మార్ట్ దుకాణంలో ఓ వ్యక్తి 25 కేజీల బియ్యం బ్యాగు కొన్నాడు. అన్నం వండి తినబోతే ముక్కిన వాసన రావడంతో అన్నమంతా వదిలేయాల్సి వచ్చి ంది. సాయంత్రం ఆ స్టోర్‌కు వెళ్లి అడిగితే.. ‘రేపు తీసుకురండి. మరో బ్రాండ్ ఇస్తాం’ అన్నారు. తీసుకెళ్లాక ఒరిజినల్ రశీదు కావాలన్నారు. బ్యాగ్ చూపించి మీ వద్ద కొన్నదేనని, కావాలంటే మీ సిస్టంలో చూడమని కోరితే మేనేజర్ కోపగించుకుని మాకు సంబంధం లేదన్నాడు. దీంతో ఆ బియ్యాన్ని ఆ దుకాణం ఎదుటే పారబోసి.. అదే విషయాన్ని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ విషయం క్షణాల్లోనే సిటీ అంతా తెలిసింది. ఆ తరువాత సదరు వినియోగదారుడికి ఆ స్టోర్ మేనేజర్ ఫోన్ చేసి.. నష్టనివారణ చర్యలు చేపట్టాడు. -
మక్కలు ఇంకెప్పుడు కొంటరు?
సాక్షి, కామారెడ్డి: మక్కల కొనుగోలుపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దళారులు చెప్పిందే ధర అవుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, మార్కెట్లో మక్కల ధర రోజురోజుకూ పతనం అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్లో రాష్ట్రంలో 6,48,446 ఎకరాల్లో మక్క పంట సాగైంది. ఈసారి పంట ఆశాజనకంగా ఉండటంతో దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని భావిస్తున్నారు. సగటున ఎకరాకు 29 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఈ లెక్కన మొత్తంగా దాదాపు 2 కోట్ల క్వింటాళ్ల మక్కల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. కాగా మక్కల కొనుగోలు వ్యవహారాన్ని మార్క్‌ఫెడ్ చూస్తుంది. అయితే ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు అవసరమైన బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మార్క్‌ఫెడ్ మక్కల కొనుగోలు ప్రక్రియ మొదలుపెడుతుంది. కానీ సర్కారు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మక్కల కొనుగోలు వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మక్క పంట కోసి, జూళ్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో జూడు తీసి, మక్కలు ఒలిచి ఆరబెడుతున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మక్క కోయాల్సి ఉంది. తగ్గుతున్న ధర.. మక్క పంట చేతికి అందే సమయంలో తొలుత బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు రూ.2,400 వరకు ధర పలికింది. కానీ పక్షం రోజులుగా ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. గతంలో పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్లకు దాణాగా మక్కలను వాడేవారు. ప్రస్తుతం మక్కల కన్నా బియ్యం నూకలు తక్కువ ధరకు లభిస్తుండటంతో పౌల్ట్రీ రంగం మక్కల కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో స్థానికంగా మక్కలకు డిమాండ్ పడిపోతోంది. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తే తప్ప తమకు మద్దతు ధర లభించే అవకాశం లేదని రైతులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని వారు ఎదురుచూస్తున్నారు. మార్క్‌ఫెడ్ కొనాలి.. నేను మూడు ఎకరాల్లో మక్క పండించిన. ఈసారి పంట మంచిగనే వచ్చింది. అయితే మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదు. మొదట్లో క్వింటాలుకు రూ. 2,400 ధర పలికింది. ఇప్పుడు అమ్ముదామనే సమయానికి రూ.1,800లకు పడిపోయింది. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. –గడ్డం బాల్‌రెడ్డి, రైతు, మోతె, లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా కేంద్రాలు తెరవకుంటే ఇబ్బందే ప్రభుత్వం మక్కల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే మాకు నాలుగు పైసలు మిగులుతయి. లేకుంటే ఏం లాభం ఉండదు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ధరకు అమ్ముకుంటే అప్పులే మిగులుతయి. కేంద్రాల ఏర్పాటు ఇప్పటికే ఆలస్యమైంది. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి. – బండారి లింగం, రైతు, తాడ్వాయి మండలం, కామారెడ్డి జిల్లా -
అకాల వర్షాలపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
-
ఎలుక కష్టం ఎవరికి ఎరుక.. కొరికితేనే బతికేది!
సాక్షి, అమరావతి: ఎలుకలు సృష్టించే విధ్వంసం గురించి అందరికీ తెలిసిందే. కనిపించిన ప్రతీదీ కొరికేస్తూ.. బోలెడంత నష్టాన్ని కలిగిస్తుంటాయి. అయితే.. ఈ విధ్వంసం వెనుక ఓ చిన్నపాటి విషాదమూ ఉంది. చిట్టెలుకల్లో ఉండే రెండు కొరుకుడు (ఇన్సైజర్స్) దంతాలు రోజూ 0.4 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతాయట. దీని వల్ల ఈ కోరపళ్లను అవి ఎప్పటికప్పుడు అరగదీయాల్సిందే! లేదంటే అవి ఎలుకల దవడలను చీల్చుకుని బయటకు రావడంతో ఆహారం తినలేవట. దీంతో తిండిలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందట. అందుకే అవి బతకాలంటే నిరంతరం దేన్నైనా కొరుకుతూ ఉండాలి. అయితే.. దాని వల్ల జరుగుతున్న నష్టం మాత్రం అపారం. తినటానికి పనికిరాకున్నా బలమైన విద్యుత్ తీగలు, ప్లాస్టిక్ వస్తువులను సైతం కొరికేస్తాయి. చిట్టెలుకలు తీసుకునే ఆహారం రోజుకు 28 గ్రాములే.. కానీ అవి కలిగించే నష్టం మనందరికీ తెలిసిందే. అమెరికాలో ఏటా 19 నుంచి 21 బిలియన్ డాలర్ల పంట నష్టం జరుగుతున్నట్లు లెక్కగట్టారు. ఎలుకలు తమ శరీర బరువులో దాదాపు 20 శాతం వరకు ఆహారంగా తీసుకుంటాయని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వన్యప్రాణి పరిశోధకుడు డాక్టర్ గ్రాంట్ సింగిల్టన్ తెలిపారు. ఒకేసారి కాకుండా రోజుకు 3–4 సార్లు తింటాయి. ఎలుక ఏడాదిలో 10 కేజీల ఆహారం తీసుకుంటే అది కొరికి నాశనం చేసే పంట తినేదానికి పదిరెట్లు అంటే.. దాదాపు 100 కిలోలు ఉంటుందని అంచనా. ♦ దేశంలో వరి, గోధుమ పంటలకు ఎలుకలు ఏటా 5 నుంచి 15% నష్టం కలిగిస్తున్నాయి. ఇతర అన్ని పంట లను కలిపితే నష్టం సుమారు 25%వరకు ఉంటుంది. ♦ ఎలుకల కారణంగా కాలిఫోర్నియాలో 504 మిలియన్ డాలర్ల పంట నష్టం జరిగినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్–నేషనల్ వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ సెం టర్ అంచనా వేసింది. ♦ ప్రపంచవ్యాప్తంగా 84 రకాల ఎలుకలున్నా 18 రకాల మూషికాలు పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తున్నట్లు ఒడిశా స్టేట్ ఎన్విరాన్మెంట్ విభాగంతెలిపింది. ♦ ఒడిశాలోని 4 గ్రామాల్లో ఎలుకలు 3.60 టన్నుల ఆహార ధాన్యాలను నాశనం చేసినట్లు తేలింది. దుకాణాల్లోని గోడల్లో ఎలుకలు దాచిన ఆహార పదార్థాలను వెలికితీయగాఒక్కోచోట 16.64 నుంచి 21.5 కిలోలు గుర్తించారు. ♦ సుమారు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పాటు జీవించే గోధుమ రంగు ఎలుకలు 21 రోజుల్లో 10 నుంచి 14 పిల్లలను పెడుతుంది. ఇవి నాలుగైదు వారాల్లోనే పరిపక్వ దశకు చేరి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఎలుకలు జతకడితే ఏడాదిలో వాటి సంతానం 1,000 దాటిపోతుంది. -
వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి విడదల రజిని
-
పంట చేలకు పరదాలుగా బతుకమ్మ చీరలు
సాక్షి, వికారాబాద్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను రైతులు పంటల చుట్టూ పరదాలుగా కడుతున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ఓ రైతు గ్రామంలో ఒక్కో బతుకమ్మ చీరను రూ.50 చొప్పున కొని పంటలకు అడవిపందుల నుంచి రక్షణకు పొలం చుట్టూ కట్టాడు. బషీరాబాద్ మండలానికి 11,316 చీరలు వస్తే రేషన్ డీలర్ల దగ్గర ఇప్పటి వరకు 20 శాతం మహిళలే తీసుకువెళ్లారు. దీంతో డీలర్ల దగ్గర చీరలు కుప్పలుగా మిగిలి పోయాయి. -
రియల్ టైం క్రాప్ మేనేజ్మెంట్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: ఏ పంట.. ఎంత విస్తీర్ణంలో సాగవుతుందో గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన రియల్ టైం క్రాప్ మేనేజ్మెంట్ ద్వారా సర్వే నంబర్ల వారీగా సాగవుతున్న పంటల గుర్తింపులో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా వెల్లడించిందన్నారు. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభు త్వం విజయవంతంగా అమలు చేస్తున్న ఈ–క్రాప్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. చదవండి: అతి త్వరలో గడపగడపకు వైద్యం జిల్లా వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు, మండల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ–క్రాప్ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ పేరిట దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ–క్రాప్ అమలులో ఏపీని కూడా భాగస్వామిని చేయడం గర్వకారణమన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు, పంటల బీమా వంటి అన్ని పథకాలు ఈ–క్రాప్ ప్రామాణికంగానే అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ–క్రాప్ నమోదు చేసిన రైతులందరికీ ఈ–కేవైసీ (మీ పంట తెలుసుకోండి) నమోదు ప్రారంభించాలన్నారు. ‘వైఎస్సార్ యంత్ర సేవ’ కింద కిసాన్ డ్రోన్ల మంజూరుకు రైతు గ్రూపుల ఎంపికను సత్వరమే పూర్తి చేయాలన్నారు. -
Photo Feature: నేలతల్లి సాక్షిగా.. కన్నవారికి నివాళి అర్పించి‘నారు’
సాక్షి, నిజామాబాద్: సేంద్రియ విధానంలో అనేక దేశీయ వరి రకాలను పండిస్తున్న నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరుకు చెందిన ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు (నాగుల చిన్నగంగారాం) తన తల్లిదండ్రులు ముత్తెన్న, భూదేవిలను నేలతల్లి సాక్షిగా వినూత్నంగా స్మరించుకున్నారు. ‘మా అమ్మ నాన్న–చిన్నికృష్ణుడు’ అనే అక్షరాల రూపంలో పొలంలో భారీ పరిమాణంలో వరి పంట పెరిగేలా వేశారు. 24 రోజుల క్రితం తన సాగు భూమిలో ‘చింతలూరు సన్నాలు’ వరిని విత్తనాల కోసం నాటారు. అయితే మధ్యలో ఒక మడిని ‘బంగారు గులాబీ’ అనే నల్ల రంగు వరిని తన తల్లిదండ్రుల రూపం వచ్చేలా నాటారు. చుట్టూ బోర్డర్ వచ్చేలా ‘పంచరత్న’ రకం వరిని వేశారు. ఇందుకోసం ముందుగా ఓ ఆర్కిటెక్ట్‌తో కాగితంపై మ్యాప్ గీయించుకుని అందుకు అనుగుణంగా వరి రకాలను నాటారు. తాజాగా గురువారం డ్రోన్ ద్వారా చిన్నికృష్ణుడు ఈ చిత్రాన్ని ఫొటో తీయించారు. -
నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి
నగరి/విజయపురం(చిత్తూరు జిల్లా): సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఒకసారి సాగు చేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడినిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయం అందిస్తోంది. తెగుళ్ల బెడద నుంచి కాపాడుతోంది. పెట్టుబడి ఖర్చును తగ్గిస్తోంది. మరోవైపు ఈ పంట సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇది ఆయుర్వేద ఔషధంగానూ ఉపయోగపడుతోంది. అధిక దిగుబడితోపాటు రైతులకు లాభాల పంట పండిస్తోంది. చదవండి: జామ్ జా‘మనీ’.. ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం.. ఈ పంటకు భలే గిరాకీ! పండించే పంట దిగుబడి లేదని, దిగుబడి బాగా వచ్చినా మార్కెట్లో మంచి ధర పలకలేదని, నేల సారవంతంగా లేదని.. ఇలా రకరకాల కారణాలు రైతులను కుంగదీస్తున్నాయి. అయితే వ్యవసాయంలో ఆశించిన లాభాలు చూడలేమని నీరసించిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయాన్ని అందిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను కురిపిస్తూ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పంట సాగుకు ప్రభుత్వం హెక్టారుకు రూ.18 వేలు సబ్సిడీ అందిస్తోంది. ఆయుర్వేద ఔషధం ఆయుర్వేద వైద్యంలో ఉసిరే కీలకం. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవిత కాలంలో ఐదు ఉసిరి మొక్కలైనా నాటాలని పూర్వీకులు చెబుతారు. మనకు రోగనిరోధకశక్తి పెరగాలంటే సి–విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. కరోనా పుణ్యమా అని దీనిపై అందరికీ అవగాహన పెరిగింది. అయితే సి విటమిన్ ఎక్కువగా ఉండే వాటిలో ప్రథమ స్థానం ఉసిరికే దక్కుతుంది. ఆరోగ్యాన్ని అందించే ఉసిరి రైతులు లాభాలను కూడా మెండుగా అందిస్తోంది. 200 ఎకరాల్లో సాగు విజయపురం మిట్టూరు, శ్రీహరిపురం, కాకవేడు ప్రాంతాల్లోని రైతులు ఉసిరి పంటను సాగు చేస్తున్నారు. రెండు మండలాల్లో సుమారు 200 ఎకరాల్లో ఉసిరి సాగవుతోంది. తమిళనాడు తంజావూరు నుంచి మొక్కలను తెచ్చుకునే రైతులు ఈ ప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. ఒక్క సారి సాగు చేసి మొక్కలు నాటితే రెండేళ్లకు కాత వచ్చి ఏడాదికి రెండు సార్లు ఫల సాయం అందుతోంది. ఎకరాకు 200 చెట్లు నాటి సాగుచేసిన రైతులు చెట్టు పెరుగుదలను అనుసరించి ఎకరాకు రెండు నుంచి 5 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు. ఒక్క సారి మొక్కలు నాటితే 30 నుంచి 40ఏళ్ల వరకు ఫలసాయం అందుతుందని ఉద్యానవన అధికారులు తెలుపుతున్నారు. ఉసిరి చెట్టు నీటి కొరతను చాలా వరకు తట్టుకుంటుంది. చీడపీడలు, తెగులు ఎక్కువగా ఆశించదు. ఈ కారణంగా సాగు ఖర్చు తగ్గుతుంది. రాబడిలో ఖర్చు 10 శాతం మాత్రమే ఉంటుంది. డిమాండ్‌ను బట్టి టన్నుకు రూ.30 వేలు నుంచి 50 వేలు వరకు ధర పలుకుతుంది. నగరి, విజయపురం మండలాల్లో సాగుచేసే ఉసిరి మన రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, తెనాలితో పాటు తమిళనాడు, తెలంగాణలని ఫ్యాక్టరీలకు రవాణా అవుతోంది. ఈ ప్రాంతాల నుంచి ఫ్యాక్టరీలకు తరలి వెళ్లే ఉసిరితో మందులు, సిరప్లు, ఆయిల్, సోపు, ఊరగాయలు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తారు. లాభాలనిస్తోంది.. పదిహేనేళ్ల నుంచి ఉసిరి సాగు చేస్తున్నాను. తమిళనాడు తంజావూరు నుంచి మొక్కలను తెచ్చుకున్నా. ఇప్పటి వరకు ఆ చెట్లే ఫలసాయాన్ని అందిస్తున్నాయి. ఏడాదికి రెండు సార్లు కాపు వస్తోంది. తెగుళ్లు, చీడపీడల సమస్య ఎక్కువగా ఉండదు. పంట మధ్య కలుపు పెరగకుండా చూసుకుంటూ, చెట్లను పరిశీలించి తెగులు ఎక్కడైనా కనిపిస్తే మందులు స్ప్రే చేసుకుంటే చాలు. మంచి దిగుబడి చూడవచ్చు డిమాండ్‌ను అనుసరించి ఎకరాకు రూ.లక్ష వరకు లాభం ఉంటుంది. – జయరామరాజు, మిట్టూరు, విజయపురం మండలం. అవగాహన కల్పిస్తున్నాం నగరి, విజయపురం మండలాల్లో 15 యేళ్ల క్రితం నుంచి ఉసిరి పంట సాగవుతోంది. మెలమెల్లగా ఉసిరి సాగులో లాభాలను చూసిన రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఉసిరి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పంట సాగులో నష్టాలు వచ్చేందుకు ఆస్కారం లేదు. ఒక్క సారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు ఈ పంట దిగుబడిని అందిస్తుంది. ప్రస్తుతం ఉసిరికి మార్కెట్లో ఎక్కువగా డిమాడ్ ఉంది. ఈ పంట సాగుకు ప్రభుత్వం హెక్టారుకు 18 వేలు వరకు సబ్సిడీ అందిస్తుంది. – లోకేష్, ఉద్యానవన అధికారి, నగరి -
తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు ఈ ఏడాది సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రైతులను పూర్తిగా ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్ టిల్లర్లు తదితరాలు సబ్సిడీపై అందజేస్తోంది. దీంతో ఇప్పటికే ట్రాక్టర్ల వినియోగం పెరిగిపోయింది. రైతులు పురాతన, సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి ఆయా యంత్రాలను, పరికరాలను ఉపయోగిస్తున్నారు. దీనికి మరింత ఊతం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణ కోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో రైతులకు డ్రోన్లు అందజేసే దిశగా వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ఖరారు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పిచికారీ కష్టాలకు చెక్ ►ప్రస్తుతం డ్రోన్లను ఫొటోలు తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వ్యవసాయానికి వాడే డ్రోన్లు రైతుకు అనేక రకాలుగా ఉపయోగపడేలా చూస్తారు. ►ప్రధానంగా పురుగు మందులను పిచికారీ (స్ప్రే) చేయడానికి ఉపయోగిస్తారు. డ్రోన్ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల నీరు, పురుగుమందులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. ►పురుగు మందుల్ని రైతులే స్వయంగా పిచికారీ చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలకు గురి అవుతున్నారు. దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. డ్రోన్ పిచికారీ వీటన్నిటి నుంచి రైతుల్ని కాపాడుతుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. ►కొన్ని పంటలకు మొక్కల పైన స్ప్రే చేస్తే సరిపోతుంది. కొన్నింటికి కాండం మొదల్లో చల్లాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పంటకు ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు డ్రోన్లకు అదనపు పరికరాలు సమకూరుస్తారు. చీడపీడలపై నిఘా ►పంటకు చీడపీడలు ఏమైనా ఆశించాయా తెలుసుకునేందుకు కూడా డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో పంటల్ని ఫొటోలు తీయడం, వాటిని వ్యవసాయాధికారికి పంపడం చేసేలా కూడా పరికరాలు అమర్చాలని భావిస్తున్నారు. ►అలాగే కాత ఎలా ఉంది?, దిగుబడి ఏమేరకు వచ్చే అవకాశముంది?, ఇలా పంటకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సూక్ష్మంగా పరిశీలిస్తూ పర్యవేక్షించేందుకు వీలుగా సాగు డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పలు కంపెనీలతోనూ చర్చించినట్లు తెలిసింది. పైలట్ శిక్షణ తప్పనిసరి.. ►డ్రోన్లను ఎవరికి పడితే వారికి ఇవ్వరు. పదో తరగతి పాసై ఉండాలి. డ్రోన్ పైలట్ శిక్షణ తీసుకొని ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి. ఏవియేషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. రైతుకైనా, రైతు కుటుంబంలో సభ్యులు ఎవరికైనా ఇస్తారు. ►నిరుద్యోగ యువతీ యువకులు కస్టమ్ హైరింగ్ సెంటర్ నడుపుతున్నట్లయితే వారికి ఇస్తారు. ప్రస్తుతం వ్యవసాయ యంత్రాలను ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. అయితే డ్రోన్లకు ఎంతమేరకు సబ్సిడీ ఇవ్వాలన్నది ఇంకా ఖరారు కాలేదు. 24 గంటల ముందు అనుమతి తప్పనిసరి ►డ్రోన్లకు సంబంధించి గ్రామ పంచాయతీ, సంబంధిత వ్యవసాయ అధికారి కనీసం 24 గంటల ముందుగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ►ఆపరేటర్లు డ్రోన్ ఆపరేషన్, సురక్షితమైన పురుగు మందుల పిచికారీ.. ఈ రెండింటిపై శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆపరేషన్‌కు ముందు 8 గంటల్లోపు మద్యం తీసుకోకూడదు. ►డ్రోన్ ఉపయోగించడానికి తగిన మంచి స్థితిలో ఉందని నిర్ధారించుకోవాలి. మొబైల్ పరికరాలను దూరంగా ఉంచాలి. ఆ సిగ్నల్స్ డ్రోన్లకు అడ్డుపడవచ్చు. కాబట్టి మొబైల్ పరికరాలను దూరంగా ఉంచాలి. నీటివనరులు, నివాసాలకు దూరంగా.. ►నీటివనరులు, నివాస ప్రాంతాలు, పశుగ్రాస పంటలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ మొదలైన వాటికి దూరంగా డ్రోన్ కార్యకలాపాలు నిర్వహించాలి. ►డ్రోన్లతో పిచికారీ చేసే సమయంలో ఆయా ప్రాంతాల్లోకి జంతువులు, వ్యక్తులు ప్రవేశించకూడదు. ►డ్రోన్ ఉపయోగించే ప్రాంతం నుంచి 100 మీటర్ల కంటే తక్కువ దూరంలో పురుగుమందులను పిచికారీ చేయకూడదు. ►ప్రభుత్వ సంస్థలు, సైనిక స్థావరాలు లేదా అనుమతి లేని జోన్ల మీదుగా డ్రోన్లను ఎగుర వేయకూడదు. అనుమతి లేని ప్రైవేట్ ఆస్తులపై కూడా డ్రోన్ ఎగరకూడదు. అవసరమైతే బుక్ చేసుకునేలా.. ►ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు అవుతుందని అంచనా వేశారు. వాటిని రైతులకు సబ్సిడీపై ఇస్తారు. అయితే చాలావరకు ఒక్కో రైతుకు ఒక్కో డ్రోన్ అవసరం ఉండదు. పైగా ధర ఎక్కువ. ఈ నేపథ్యంలో కొంతమంది రైతుల బృందానికి ఒక డ్రోన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ►తొలుత ప్రయోగాత్మకంగా మండలానికి ఒకటి చొప్పున ఇస్తారు. డిమాండ్‌ను బట్టి క్రమంగా వీటి సంఖ్యను పెంచుతారు. తర్వాత కస్టమ్ హైరింగ్ సెంటర్ల (యంత్ర పరికరాలు అద్దెకిచ్చే కేంద్రం)లోనూ అందుబాటులో ఉంచుతారు. రైతులు తమకు అవసరమైనప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. -
అన్నదాతలకు అండగా నిలుస్తోన్న జగన్ సర్కారు
-
వరించిన అదృష్టం...రైతు మోములో వెల్లివిరిసిన సంతోషం
వ్యవసాయంలో లాభాలు పొందాలంటే కష్టజీవి శ్రమకు తోడు అదృష్టం ఉండాలి. రెండో కారు వరి పంట రైతుకు కలసొచ్చింది. ఎన్నో ఆశలతో రబీలో రైతు వరి సాగు చేయగా వరుణుడు కరుణించగా.. పుడమి తల్లి దీవించింది. చీడపీడల బారిన పడకుండా పంటను రక్షించుకుంటూ.. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. నూర్పిళ్లు పూర్తయి ధాన్యాన్ని ఇంటికి చేర్చుతున్నాడు. ఈ క్రమంలో మద్దతు ధర ఊరిస్తుండటంతో రైతు మోములో సంతోషం వెల్లివిరిస్తోంది. కోవెలకుంట్ల: ఖరీఫ్ సీజన్లో తుఫాన్ల ప్రభావంతో భారీ వర్షాలు, చీడపీడలు, వాతావరణం అనుకూలించకపోవడంతో వరి రైతులు నష్టాలు చవిచూశారు. ఆ నష్టాన్ని రబీసీజన్‌లో పూడ్చుకోవాలని భావించిన అన్నదాతకు రెండు కారు పంట కలిసోచ్చింది. పంట చేతికంది దిగుబడులు ఆశాజనకంగా మారటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీలో ఎండ కారు పంటగా 48 వేల ఎకరాల్లో 555, ఎంటీయూ 1010, ఆర్ఎన్ఆర్ 15,048 రకాలకు చెందిన వరి సాగు చేయాల్సి ఉండగా బోర్లు, బావులు, చెరువులు, కేసీకెనాల్, కుందూనది, పాలేరు, రిజర్వాయర్ల పరిధిలో 50,791 ఎకరాల్లో సాగైంది. ఇందులో బండిఆత్మకూరు మండలంలో అత్యధికంగా 10,609 ఎకరాలు, పాణ్యంలో 6,674, రుద్రవరం 6,202, మహానందిలో 5,358, ఆళ్లగడ్డలో 4,949, నంద్యాలలో 3,105, శిరివెళ్లలో 2,788, గడివేముల మండలంలో 2,078 ఎకరాల్లో సాగు చేశారు. 120 రోజుల పంటకాలం కలిగిన వరిలో ఇప్పటి వరకు 95 శాతం మేర కోత, నూర్పిడి పనులు పూర్తి కాగా మరో వారం రోజుల్లో పనులన్నీ పూర్తి కానున్నాయి. పెరిగిన పెట్టుబడులు జిల్లాలోని ఆయా మండలాల్లో రబీ వరిసాగులో ఈ ఏడాది పెట్టుబడులు పెరిగాయి. రసాయన ఎరువులు, నారు, క్రిమి సంహారక మందులు, కూలీలు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20వేలు వరకు వెచ్చించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక తేమ శాతం కారణంగా వరిని కాండం తొలుచు పురుగు ఆశించి నష్టం చేకూర్చింది. పురుగు బారి నుంచి పైరును కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. రెండు దఫాలు అదనంగా క్రిమి సంహారక మందు పిచికారీ చేసి పురుగు బారి నుంచి పంటను రక్షించుకున్నారు. పురుగు కారణంగా ఎకరాకు రూ. 2వేల నుంచి రూ. 3వేలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. పురుగు తీవ్రత లేకుంటే మరో ఐదు బస్తాల దిగుడులు వచ్చేవని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాలు దిగుబడులు వచ్చాయి. ఖరీఫ్ సీజన్‌తో పోల్చుకుంటే రబీలో దిగుబడులు ఆశాజనకంగా మారటంతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆశలు రేకెత్తిస్తున్న మద్దతు ధర వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతోపాటు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. వీటితోపాటు అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పండిన కర్నూలు, నంద్యాల సోనా రకం వడ్లు బస్తా రూ. 1,850 వరకు ధర పలికాయి. రబీలో పండిన ఎండకారు వడ్లు బస్తా మార్కెట్లో రూ. 1,200 నుంచి రూ. 1,300 వరకు ఉంది. ఈ ధరకు ధాన్యం విక్రయిస్తే పెట్టుడులు పోనూ ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం చేకూరనుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుతో ఖరీఫ్ సీజన్లో నష్టపోయినా రబీలో వాతావరణం అనుకూలంగా మారి దిగుబడులు ఆశాజనకంగా లభించి గిట్టుబాటు ధర ఉండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎకరాకు 40 బస్తాల దిగుబడి ఈ ఏడాది ఎండకారు పంటగా సాగు చేసిన వరి రైతులకు అనుకూలంగా మారింది. ఖరీఫ్‌లో అధిక వర్షాలతో కాస్త దిగబడులు తగ్గాయి. రబీ సీజన్లో సంజామల మండలంలోని ఆయా గ్రామాల్లో 683 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడులు వచ్చాయి. –సుధాకర్‌రెడ్డి, ఏఓ, సంజామల మండలం 1.8 ఎకరాల్లో సాగు చేశా నాకున్న 1.8 ఎకరాల్లో ఈ ఏడాది రబీ సీజన్లో 555 రకానికి చెందిన వరి సాగుచేశాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కోత, నూర్పిడికి సంబంధించి ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాను. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి మంచి దిగుబడులు సాధించాను. – నాగభూషణం, రైతు, గిద్దలూరు, సంజామల మండలం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి నాకున్న రెండు ఎకరాల్లో ఎండకారు వరి సాగు చేశాను. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరిపింది. అదే తరహాలోనే ఇప్పుడు కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలి. –వెంకటపతి రెడ్డి రైతు, వల్లంపాడు, కోవెలకుంట్ల మండలం (చదవండి: -
టమాటా ‘ధర’హాసం
లావేరు: టమాటా ధర అమాంతం పెరిగిపోయింది. పది రోజుల కిందట కిలో రూ.20 ఉండగా ఆదివారం నాటికి రూ.60కు చేరింది. పది రోజుల వ్యవధిలోనే ఇంతలా ధర పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాము టమాటా పంట పండించిన సమయంలో కిలో రూ.8 నుంచి రూ.10వరకు ఉందని, ఇప్పుడు రూ.60కి చేరిన సమయంలో తమ వద్ద పంట లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ అవుతుండటం వల్లనే టమాటా పంటకు ధర ఉండటం లేదని, రైతులు వద్ద లేని సమయంలో మంచి ధర ఉంటోందని అంటున్నారు. (చదవండి: పూజించారు.. పట్టుకుపోయారు) -
విజయ కీర్తి
విజయసోపానాలు అధిరోహించడానికి ఏం చేయాలా?! అని సుదీర్ఘ ఆలోచనలు చేయనక్కర్లేదు అనిపిస్తుంది కీర్తి ప్రియను కలిశాక. తెలంగాణలోని సూర్యాపేట వాసి అయిన కీర్తిప్రియ కోల్‌కతాలోని ఐఐఎమ్ నుంచి ఎంబీయే పూర్తి చేసింది. తల్లి తన కోసం పంపే ఎండు కూరగాయల ముక్కలు రోజువారి వంటను ఎంత సులువు చేస్తాయో చూసింది. తన కళ్లముందు వ్యవసాయ పంట వృథా అవడం చూసి తట్టుకోలేకపోయింది. ఫలితంగా తల్లి తన కోసం చేసిన పని నుంచి తీసుకున్న ఆలోచనతో ఓ ఆహార పరిశ్రమనే నెలకొల్పింది. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలనూ కల్పిస్తోంది. తన వ్యాపారంలో తల్లి విజయలక్ష్మిని కూడా భాగస్వామిని చేసిన కీర్తి విజయం గురించి ఆమె మాటల్లోనే.. ‘‘ఈ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌కు ముందు చదువు, ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు మా అమ్మ నాకు వంట ఈజీగా అవడం కోసం ఎండబెట్టిన కూరగాయల ముక్కలను ప్యాక్ చేసి, నాకు పంపేది. వాటిలో టొమాటోలు, బెండ, క్యాబేజీ, గోంగూర, బచ్చలికూర, మామిడికాయ... ఇలా రకరకాల ఎండు కూరగాయల ముక్కలు ఉండేవి. వీటితో వంట చేసుకోవడం నాకు చాలా ఈజీ అయ్యేది. ఈ సాధారణ ఆలోచన నాకు తెలియకుండానే నా మనసులో అలాగే ఉండిపోయింది. వృథాను అరికట్టవచ్చు సూర్యాపేటలోని తొండా గ్రామం మాది. ఒకసారి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక, ఆ పంటను పొలంలోనే వదిలేశారు. ఇది చూసి చాలా బాధేసింది. చదువు తర్వాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలన్న ఆలోచనకు నా బాధ నుంచే ఓ పరిష్కారం కనుక్కోవచ్చు అనిపించింది. అమ్మ తయారు చేసే ఎండు కూరగాయల కాన్సెప్ట్నే నా బిజినెస్‌కు సరైన ఆలోచన అనుకున్నాను. ఆ విధంగా వ్యవసాయదారుల పంట వృథా కాకుండా కాపాడవచ్చు అనిపించింది. ఈ ఆలోచనను ఇంట్లోవాళ్లతో పంచుకున్నాను. అంతే, రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్ సిద్ధమైపోయింది. కుటుంబ మద్దతు మా నాన్న పోలీస్ విభాగంలో వర్క్ చేస్తారు. అమ్మ గృహిణి. ముగ్గురు అమ్మాయిల్లో నేను రెండవదాన్ని. నా ఆలోచనకు ఇంట్లో అందరూ పూర్తి మద్దతు ఇచ్చారు. దీనికి ముందు చేసిన స్టార్టప్స్, టీమ్ వర్క్ .. గురించి అమ్మానాన్నలకు తెలుసు కాబట్టి ప్రోత్సహిస్తూనే ఉంటారు. కాకపోతే అమ్మాయిని కాబట్టి ఊళ్లో కొంచెం వింతగా చూస్తుంటారు. వృద్ధిలోకి తీసుకు వస్తూ.. సాధారణంగా తెలంగాణలో ఎక్కువగా పత్తి పంట వేస్తుంటారు. మా చుట్టుపక్కల రైతులతో మాట్లాడి, క్రాప్ పంటలపై దృష్టి పెట్టేలా చేశాను. రసాయనాలు వాడకుండా కూరగాయల సాగు గురించి చర్చించాను. అలా సేకరించిన కూరగాయలను మెషిన్స్ ద్వారా శుభ్రం చేసి, డీ హైడ్రేట్ చేస్తాం. వీటిలో ఆకుకూరలు, కాకర, బెండ, క్యాబేజీ.. వంటివి ఉన్నాయి. వీటితోపాటు పండ్లను కూడా ఎండబెడతాం. రకరకాల పొడులు తయారు చేస్తాం. మూడేళ్ల క్రితం ఈ తరహా బిజినెస్ ప్లానింగ్ మొదలైంది. మొదట్లో నాలుగు లక్షల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించిన ఈ పరిశ్రమ ఇప్పుడు రెండున్నర కోట్లకు చేరింది. వ్యాపారానికి అనువుగా మెల్లమెల్లగా మెషినరీని పెంచుకుంటూ, వెళుతున్నాం. మార్కెట్‌ను బట్టి యూనిట్ విస్తరణ కూడా ఉంటోంది. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌తో ఈ ఐడియాను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు సూప్ మిక్స్‌లు, జ్యూస్ మిక్స్‌లు, కూరల్లో వేసే పొడులు మా తయారీలో ఉన్నాయి. ఏ పని చేయాలన్నా ముందు దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. దీంతోపాటు తమ మీద తమకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకు ఓ ఆలోచన వచ్చినప్పుడు, దానిని అమలులో పెట్టేటప్పుడు చాలామంది కిందకు లాగాలని చూస్తుంటారు. కానీ, మనకు దూరదృష్టి ఉండి, క్లారిటీగా పనులు చేసుకుంటూ వెళితే తిరుగుండదు. మన ఆలోచనని అమలులో పెట్టేటప్పుడు కూడా మార్కెట్‌కు తగినట్టు మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి’’ అని వివరిస్తుంది కీర్తిప్రియ. – నిర్మలారెడ్డి -
పది జిల్లాల్లో 10శాతం లోపే
సాక్షి, హైదరాబాద్: యాసంగి పంటలసాగు కొన్ని జిల్లాల్లో మందకొడిగా సాగుతోంది. పది జిల్లాల్లో పది శాతంలోపు విస్తీర్ణంలోనే సాగైంది. పెద్దపల్లి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం రెండు శాతమే సాగైందని, ఇదే రాష్ట్రంలో అత్యల్పమని ప్రభుత్వానికి బుధవారం పంపిన నివేదికలో వ్యవసాయశాఖ వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి 3, మంచిర్యాల, మెదక్ 4, ములుగు 7, హన్మకొండ, జగిత్యాల 8, కరీంనగర్ 9, సూర్యాపేట జిల్లాలో 10 శాతం చొప్పున సాగయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో సాధారణంతో పోలిస్తే ఏకంగా 102 శాతం పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలో 81 శాతం సాగయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 46.49 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 11.65 లక్షల (25%) సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. నాలుగు శాతమే వరి నాట్లు... ఈ యాసంగిలో వరి తగ్గించాలన్న ప్రభుత్వ సూచనలను రైతులు పాటిస్తున్నట్లుగా తాజా లెక్కలు చెబుతున్నాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 31.01 లక్షల ఎకరాలు కాగా, కేవలం 1.18 లక్షల (4 శాతం) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. మొక్కజొన్న 4.32 లక్షల ఎకరాలకుగాను ఇప్పటివరకు 1.83 లక్షల (42%) ఎకరాల్లో సాగైంది. అన్ని రకాల పప్పుధాన్యాలు 3.45 లక్షల ఎకరాలకుగాను 4.01 లక్షల (116%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో మినుములు 24,018 ఎకరాలకుగాను, ఏకంగా 62,399 ఎకరాల్లో (260%) సాగైంది. వేరుశనగ 3.01 లక్షల ఎకరాలకుగాను 3.06 లక్షల (102%) ఎకరాల్లో సాగైంది. పొద్దుతిరుగుడు సాధారణ సాగు విస్తీర్ణం 10,947 ఎకరాలకుగాను 18,887 ఎకరాల్లో (173%) సాగైంది. చిరుధాన్యాలపై అనాసక్తి చిరుధాన్యాలపై దృష్టి సారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా, రైతులు మాత్రం వాటి జోలికి పోవడంలేదు. యాసంగిలో సజ్జ పంట సాధారణ సాగు విస్తీర్ణం 22,967 ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 235 ఎకరాల్లోనే (ఒక్క శాతమే) సాగు కావడం గమనార్హం. జొన్న 75,274 ఎకరాలకుగాను 52,882 ఎకరాల్లో (70%) సాగైంది. రాగులు 689 ఎకరాలకుగాను 545 ఎకరాల్లో సాగైంది. కొర్రలు 148 ఎకరాలు కాగా, 204 ఎకరాల్లో సాగైంది. -
ఖమ్మం: ఇక వానర గణనకు ప్రత్యేక యాప్..
వైరా: గ్రామాల్లో కోతుల బెడద పెరుగుతున్న నేపథ్యంలో వాటి లెక్కను అంచనా వేసేందుకు సర్వే చేపడుతున్నారు. ఇళ్ల వద్ద కూరగాయల పాదులు ఆగం చేస్తూ, వస్తువులు చిందరవందరగా పడేస్తూ, చేల వద్ద పంటలకు నష్టం కలిగిస్తుండడంతో తీవ్రతను గుర్తించబోతున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కసరత్తు చేపట్టారు. వ్యవసాయ విస్తరణ అధికారు (ఏఈఓ)లు పల్లెల్లో తిరుగుతూ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. గ్రామాల్లో కోతులెన్ని తిరుగుతున్నాయి? అవి ఏ మేరకు పంటలు ధ్వంసం చేశాయి? అవి ఎక్కడ ఉంటున్నాయి ? చెట్లు, ఇళ్లు, గుట్టలు, పర్యాటక ప్రాంతం? రోడ్డు వెంట?..ఇలా ఎక్కడ నివసిస్తున్నాయనే అంశాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి. రైతులతో మాట్లాడిన తర్వాత వివరాలను ఆన్లైన్ క్రాప్ బుకింగ్ మాడ్యూల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. వానరాలను భయపెట్టేందుకు ప్రజలు నైలాన్ వలలు, సోలార్ ఫెన్సింగ్, మంకీ గన్, కొండ ముచ్చులు, బొమ్మలు, పులి అరుపు తదితర శబ్ద పరికరాలు వినియోగిస్తున్నారా? అనే వివరాలు కూడా యాప్‌లో పొందుపర్చాలి. కూరగాయల పంట మిగలట్లే.. జిల్లాలోని 21 మండలాల్లో సూమారు మూడు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి, కంది, మొక్కజొన్న, పత్తి, చెరకు, పామాయిల్, పెసరతో పాటు కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, కొణిజర్ల, చింతకాని ఈ మండలాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో గ్రామాల్లోకి కోతులు గుంపులుగా వస్తున్నాయి. వంగ, బీర, కాకర, సొర, టమాటా, తదితర కూరగాయాల పంటలను ఆగం చేస్తున్నాయి. ఇష్టం వచ్చినట్లు తెంపేస్తూ, సగం తిని సగం పడేస్తూ, మొక్కలను, తీగలను పీకేస్తున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేల వద్ద కాపలా లేకుంటే దిగుబడి చేతికందే పరిస్థితి లేదని పలువురు వాపోతున్నారు. ఇళ్ల వద్ద ఆగమే.. వ్యవసాయ క్షేత్రాలే కాదు..ఇళ్ల వద్దకూ కోతులు గుంపులుగా వస్తున్నాయి. ఆరుబయట ఉన్న వస్తువులను చిందర వందర చేస్తున్నాయి. దుకాణాల్లోని తినుబండారాలను ఎత్తుకెళుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి దూరి బియ్యం, పప్పులు, అన్నం, ఇతర పదార్థాలను బుక్కుతున్నాయి. అడ్డుకోబోతే మీదికొస్తూ దాడిచేస్తున్నాయి. ఇంటి పైకప్పులు, చెట్లపై ఉంటూ కొన్నిచోట్ల పిల్లలు, పెద్దలను పరిగెత్తిస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు జంకుతున్నారు. చాలామందిని కరిచిన సందర్భాలు ఉన్నాయి. వారంలోగా పూర్తిచేస్తాం.. గ్రామాల్లో ఎన్ని కోతులు ఉన్నాయనే అంశంపై సర్వే చేయాలని ఆదేశించాం. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయిస్తాం. ఏఈఓలు స్వయంగా పల్లెల్లో తిరిగి కోతుల నష్ట తీవ్రతను చూసి, వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. రైతులు సహకరిస్తే పక్కా సమాచారం లభిస్తుందని భావిస్తున్నాం. – బాబూరావు, ఏడీఏ, వైరా చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక -
భద్రాద్రి రాముడి తలంబ్రాలకు సీమంతం
సాక్షి, గోకవరం(తూర్పుగోదావరి): భద్రాచలం, ఒంటిమిట్టలలో జరిగే శ్రీరాముని కళ్యాణానికి వినియోగించే కోటి తలంబ్రాల పంటకు శుక్రవారం సీమంతం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో పండిస్తున్న ఈ కోటి తలంబ్రాల పంటకు కోరుకొండ శ్రీకృష్ణచైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో సీమంతం జరిపారు. పొట్టదశలో ఉన్న పంటకు గాజులు, రవిక, పండ్లు, పుష్పాలు సమర్పించారు. సీతారామ అష్టోత్తర సహస్రనామార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ.. శ్రీరామతత్వం ప్రచారం, కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. 11వ సారి భద్రాచలంకు, 5వ సారి ఒంటిమిట్టకు కోటి తలంబ్రాలు పంపుతుండటం సంతోషంగా ఉందన్నారు. -
వేలాది ఎకరాల్లో నేలకొరిగిన వరి పంట
-
Onion : ఉల్లిఘాటు.. ‘ముందే కొని పెట్టుకోండి’!
దేశవ్యాప్తంగా కురిసిన వర్షాల ఎఫెక్ట్ మరి కొద్ది రోజుల్లో వంటిల్లుని ఘాటెక్కించనుంది. రాబోయే రోజుల్లో ఉల్లి రేటు రెట్టింపు కావడం ఖాయమంటూ ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ క్రిసిల్ హెచ్చరించింది. నెలకు 13 లక్షల టన్నులు ఇండియాలో ప్రతి నెల సుమారు 13 లక్షల టన్నుల ఉల్లిపాయల వినియోగం జరగుతోంది. ఇందులో సగానికి పైగా పంట మహారాష్ట్ర నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది. మహారాష్ట్ర తర్వాత కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగానే పండిస్తున్నారను. అయితే తౌటౌ తుఫాను ఎఫెక్ట్‌తో మహారాష్ట్ర, కర్నాటకలలో ఉల్లి సాగు చేయడంలో ఆలస్యమైంది. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఉల్లి పంట చేతికందడం ఆలస్యం అవుతోందని క్రిసిల్ అభిప్రాయపడింది. ఖరీఫ్‌పై ప్రభావం దేశ ఉల్లి అవసరాల్లో 75 శాతం పంట ఖరీఫ్ సీజన్ నుంచే వస్తుంది. అయితే ఈ సీజన్‌కి సంబంధించిన ఉల్లి పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టవచ్చని క్రిసిల్ చెబుతోంది. పంట చేతికి రావడం.. ప్రాసెసింగ్.. సరఫరా తదితర కారణాల వల్ల ఉల్లి మార్కెట్‌కి రావడానికి పట్టే సమయం పెరగవచ్చని చెబుతోంది. గత మూడేళ్లుగా ఉల్లి ఉత్పత్తి, సరఫరా, మార్కెట్ తదితర విషయాలను పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు రెట్టింపు కావడం ఖాయమని చెబుతోంది. రబీ పైనా ప్రభావం ఖరీఫ్ సీజన్ పంట చేతికి రావడంలో ఆలస్యమైనా రబీలో వచ్చిన ఉత్పత్తి బఫర్ స్టాక్‌గా అందుబాటులో ఉంటుంది. అయితే ఆగస్టు, సెప్టెంబరులో వర్షాల కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉల్లి త్వరగా పాడవుతుంది. వెరసి బఫర్ స్టాక్ సైతం తగ్గిపోయే ప్రమాదంముందని క్రిసిల్ అంటోంది. నాసిక్‌లో కరువు మహారాష్ట్రలో విస్తారంగా వానలు పడినా ఉల్లిపంట ఎక్కువగా పండే నాసిక్‌లో గత మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉల్లి రైతులు క్రమంగా నర్సరీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉల్లి దిగుబడి సైతం తగ్గనుందని క్రిసిల్ అంచనా వేసింది. మొత్తంగా దసరా, దీపావళి సీజన్ నాటికి ఉల్లి ధరలు పెరుగుతాయని చెబుతోంది. ఉల్లి ఉత్పత్తిలో తేడాలను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృస్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. చదవండి : ఎమర్జెన్సీ ఫండ్స్.. ఈ అలవాటు మీకుందా? ఎలా మెయింటెన్ చేయాలో తెలుసుకోండి -
ఇక పక్కాగా ప్రతి పంట లెక్క
సాక్షి, హైదరాబాద్: పంట లెక్కల సమాచారాన్ని పక్కాగా సేకరించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక సర్వే చేపట్టాలని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు పంట లెక్కలను గ్రామాల్లో ఎవరో ఒకరి ద్వారా సేకరించి అంచనా వేస్తున్నారు. ప్రతిరోజూ స్థానిక ఏఈవోలు ఆయా సమాచారాన్ని సేకరించి అందజేస్తున్నారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అలా సేకరించిన సమాచారం కచ్చితంగా ఉండట్లేదన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త సర్వేకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. ఇకపై వ్యవ సాయ విస్తరణాధికారులు (ఏఈవో) వారి క్లస్టర్ పరిధిలోని ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి వాటిని స్వయానా చూసి రాసుకుంటారు. అలా ఏఈవోలు తమ పరిధిలోని దాదాపు 3–4 గ్రామాలు తిరిగి పక్కాగా లెక్కలు తీసుకుంటారు. అలా రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం, యాసంగిలకు సంబంధించిన లెక్కలను తీసుకుంటారు. దీంతో ప్రతి ఎకరాకు సంబంధించిన పంట లెక్కలను తీసుకుంటారు. ఆ సమాచారాన్ని వ్యవసాయశాఖ పోర్టల్‌లో పొందుపరుస్తారు. పథకాల అమల్లో స్పష్టత... పంట లెక్కలను పక్కాగా తీసుకోవడం వల్ల రైతులకు ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయం, పథకాల అమల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉదాహరణకు ఒక నిర్దేశిత గ్రామంలో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారో తెలుసుకోవడం వల్ల ఆ గ్రామానికి ఎంత యూరియా అవసరం? ఎంత డీఏపీ కావాలి? ఎన్ని విత్తనాలు అవసరమన్న సమాచారాన్ని పక్కాగా అంచనా వేయొచ్చు. దీనివల్ల ఎక్కడా కొరత లేకుండా రైతులకు ఎరువులను అందజేసే వీలుంటుంది. అంతేకాదు పంట పండించాక ఆయా పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలోనూ స్పష్టమైన నిర్ధారణకు రావడానికి వీలుంటుందని చెబుతున్నారు. ఏ ప్రాంతంలో ఎటువంటి వసతులు కల్పించాలన్న దానిపై సూక్ష్మస్థాయిలో తెలుసుకోవచ్చు. మొత్తం పంటల డేటా సేకరణ వల్ల రైతులకు అవసరమైన అన్ని అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సర్వే కార్యక్రమాన్ని 4–5 రోజుల్లో ప్రారంభిస్తామని ఒక ఉన్నతాధికారి తెలిపారు. -
తెలంగాణలో రూ.50 వేల వరకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీ మేరకు ఇప్పటివరకు రూ.25 వేల లోపు పంట రుణాలను మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి నెలాఖరులోగా రూ.50 వేల వరకున్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రూ.25 వేల వరకున్న రుణాల మాఫీతో ఇప్పటికే 3 లక్షల పై చిలుకు రైతులు ప్రయోజనం పొందగా, తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ సంఖ్య 9 లక్షలకు పెరగనుంది. మిగతా రుణమాఫీ ప్రక్రియ కూడా దశలవారీగా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం గల అగ్ర కుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింప జేయాలని నిర్ణయించింది. ఈ కోటాలో భర్తీ చేసే ఉద్యోగాల గరిష్ట వయో పరిమితిని 5 ఏళ్లు పెంచాలని కూడా నిర్ణయించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో ఆరున్నర గంటలకు పైగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దళిత బంధు పథకం అమలు, విధివిధానాల రూపకల్పనపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. పైలట్ ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత బంధుకు చట్టబద్ధత దళిత బంధు పథకం అమలు విషయంలో మంత్రివర్గ సహచరుల నుంచి సీఎం సూచనలు స్వీకరించారు. రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీనస్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో 20 శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో ఉన్న సాగుభూమి కేవలం 13 లక్షల ఎకరాలేనని, వారి పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులు ఉన్నారని తెలిపారు. అరకొర సహాయాలతో దళితుల అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే దళితబంధులో ఒక యూనిట్ పెట్టుకోవడానికి రూ.10 లక్షల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. బ్యాంకు రుణాలతో ముడి పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆర్థిక స్థితిలో మెరుగుదల రాదని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకానికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. దళిత బంధు దేశానికి దారి చూపే పథకం అవుతుందని కేబినెట్ అభిప్రాయ పడింది. ప్రతి జిల్లాలో ‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’ దళిత బంధు లబ్ధిదారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ శిక్షణ కల్పించాలని మంత్రివర్గం కోరింది. శిక్షణ, పర్యవేక్షణకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పథకం అమలులో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని ముఖ్యమంతి అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దళితబంధు పథకం అమలుకు పటిష్టమైన యంత్రాంగం అవసరమని, వివిధ శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును మంత్రివర్గం ఆదేశించింది. లబ్ధిదారులకు అందజేసే ఒక ప్రత్యేక కార్డు నమూనాలను కేబినెట్ పరిశీలించింది. దళిత వాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా దళిత వాడలకు అన్ని హంగులూ ఏర్పడాలని, ఇందుకు నిధుల కొరత లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అనాథ పిల్లలకు అండగా నిలవాలి ‘కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఒంటరిగా మారి మానసిక వేదన, సామాజిక వివక్షను ఎదుర్కొంటూ సమాజ క్రూరత్వానికి బలయ్యే ప్రమాదముంది. గతంలో అనాథ పిల్లలకు బీసీ హోదా ఇవ్వడంతో పాటు వారి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇప్పుడు కూడా అనాథ పిల్లల సంక్షేమానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలి. మానవీయ కోణంలో ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ఖాళీగా వున్న అనువైన ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి అందులో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్‌తో మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ఆహ్వానితులుగా కొనసాగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనాథల స్థితిగతుల మీద సమగ్ర నివేదికను సమర్పించాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలి అన్ని జిల్లాల్లో కరోనా నిర్థారణ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని వైద్య శాఖను కేబినెట్ ఆదేశించింది. అన్ని రకాల మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని సూచించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఈ సందర్భంగా వైద్యశాఖ నివేదించింది. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో మరోసారి వైద్య బృందాలు పర్యటించి రావాలని మంత్రివర్గం ఆదేశించింది. నిమ్స్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి కొత్తగా మంజూరు చేసిన ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. అవసరమైన పడకలు, ఇతర మౌలిక వసతులు, కళాశాలలు, హాస్టళ్ల భవనాల నిర్మాణాలకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించింది. వైద్య కళాశాలల భవన నిర్మాణాలను చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖను మంత్రివర్గం ఆదేశించింది. నిమ్స్ ఆస్పత్రిని మరింతగా అభివృద్ధి పరిచి వైద్య సేవలను విసృత పరిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసి తదుపరి మంత్రివర్గ సమావేశం ముందు ఉంచాలని వైద్య శాఖను మంత్రివర్గం ఆదేశించింది. భవిష్యత్తులో అనుమతించనున్న వైద్య కళాశాలల కోసం స్థలానేష్వషణ, ఇతర సౌకర్యాల కల్పనకు ముందస్తుగా ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలని సూచించింది. అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాది నాటికి వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని, ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరింది. త్వరలో సూపర్ స్పెషాలిటీలకు శంకుస్థాపన కొత్తగా ఏర్పాటు చేయనున్న 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రితో పాటు హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)’గా నామకరణం చేయాలని తీర్మానించింది. టిమ్స్ గచ్చిబౌలి, టిమ్స్ సనత్‌నగర్, టిమ్స్ ఎల్బీ నగర్, టిమ్స్ అల్వాల్ ఆస్పత్రులుగా అభివృద్ధి చేసి, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఒక్కచోటే అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. వరంగల్‌లో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరలో చేపట్టాలని ఆదేశించింది. పటాన్చెరులో మల్టీస్పెషాలటీ ఆస్పత్రి పటాన్చెరులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాలకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రివర్గం మంజూరు చేసింది. రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల స్థాపన లక్ష్యంగా, వైద్య కళాశాలలు లేని జిల్లాలను గుర్తించి రెండు మూడేళ్లల్లో దశల వారీగా వాటిని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ధోభీ ఘాట్లు, సెల్లూనకు ఉచిత విద్యుత్ ధోభీ ఘాట్లు, సెల్లూనకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ పనులను ప్రారంభించండి నల్లగొండ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు నుండి ప్రారంభించిన ఎస్సెల్బీసీ సొరంగమార్గం పనులను పున:ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. దాంతోపాటు ఉదయ సముద్రం లిఫ్టు ఇరిగేషన్ స్కీం (బ్రాహ్మణ వెల్లెంల)ను కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి కేబినెట్ ఆదేశాలు జారీచేసింది. ఉదయ సముద్రం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ►16 నుంచి దళిత బంధు తెలంగాణ దళిత బంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని నిర్ణయం. దళిత జాతి పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రవేశపెడుతున్న ఈ ప్రతిష్టాత్మక పథకానికి కేబినెట్ ఏకగ్రీవ ఆమోదం. ►57 ఏళ్లకు పింఛన్లు వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తూ ఇప్పటికే తీసుకున్న నిర్ణయం అమలు ప్రక్రియ తక్షణమే ప్రారంభం. కుటుంబంలో ఒక్కరికే పింఛన్ పద్ధతి కొనసాగింపు. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు పెన్షన్ బదిలీ ►అనాథ పిల్లల బాధ్యత సర్కారుదే కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు పెద్దవారై ప్రయోజ కులయ్యే వరకు ఆశ్రయం కల్పించి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి పిల్లల వివరాలు తెప్పించాలని ఆదేశం. -
ఇబ్బంది లేకుండా ‘ఈ–క్రాపింగ్’
దేవుడు చాలా గొప్పవాడు.. వర్షాలు బాగా కురిశాయి శ్రీశైలంలో డెడ్‌స్టోరేజీ నుంచే విద్యుత్ ఉత్పత్తిని స్టార్ట్ చేశారు (తెలంగాణ ప్రభుత్వం).796 అడుగుల నుంచే నీటిని విడుదల చేయడం మొదలుపెట్టారు. దేవుడు చాలా గొప్పవాడు.. వర్షాలు బాగా కురిశాయి. నీళ్లు బాగా వస్తున్నాయి. శ్రీశైలం నిండుతోంది. వీటితోపాటు వర్షాలవల్లే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో జలాశయాలు నిండే పరిస్థితి వచ్చింది. అందుకే దేవుడు చాలా గొప్పవాడు. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో అదనపు వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలో 77 శాతం, కడప జిల్లాలో 93.6 శాతం, అనంతపురంలో 82.4శాతం, కర్నూలులో 42.9 శాతం, ప్రకాశం జిల్లాలో 25 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 23 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: పంటల నమోదుకు సంబంధించి ఈ–క్రాపింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రైతులను డాక్యుమెంట్ల పేరుతో ఇబ్బంది పెట్టకుండా ఈ– క్రాపింగ్ చేయాలన్నారు. భౌతిక, డిజిటల్ అకనాలెడ్జ్మెంట్ ఇవ్వాలని, ఈ–క్రాపింగ్ జరగని రైతు ఉండకూడదని స్పష్టం చేశారు. ఆర్బీకేల్లో ఈ–క్రాపింగ్‌పై కలెక్టర్లు, జేసీలు పది శాతం తనిఖీ చేయాలని సూచించారు. జేడీఏ, డీడీఏ 20 శాతం తనిఖీలు చేయాలని, వ్యవసాయ, ఉద్యాన అధికారులు 30 శాతం తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిరోధించేందుకు తరచూ దుకాణాలపై దాడులు నిర్వహించాల్సిందిగా కలెక్టర్లు, ఎస్పీలను సీఎం ఆదేశించారు. వ్యవసాయ సలహా మండలి సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని, కలెక్టర్లు వీటిని పర్యవేక్షించాలని సూచించారు. వ్యవసాయం, ఖరీఫ్ సన్నద్ధత తదితరాలపై ముఖ్యమంత్రి జగన్ ‘స్పందన’ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. ఖరీఫ్ సన్నద్ధత మంచి వర్షాల వల్ల ఖరీఫ్ విస్తీర్ణం పెరుగుతోంది. సాధారణ విస్తీర్ణం 92.26 లక్షల ఎకరాలు అయితే ఇప్పటికే 27.46 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. మరింత వేగంగా ఈ–క్రాపింగ్ చేపట్టాలి. భౌతికంగా, డిజిటల్ రశీదు ఉండాలి. దీనిపై రైతు సంతకం, అగ్రికల్చర్ అసిస్టెంట్ సంతకం ఉండాలి. డాక్యుమెంట్లు కావాలని క్షేత్రస్థాయి సిబ్బంది బలవంతం చేయవద్దు. పంట వేసిన ప్రతిచోటా ఇ–క్రాపింగ్ చేయాలి. ఒక పొలంలో ఏ పంట ఏశారు? ఎవరు వేశారు? ఎన్ని ఎకరాలు వేశారు? అన్నది ఇ–క్రాపింగ్‌లో నమోదు చేయాలి. పంటల బీమా చేయాలన్నా, సున్నా వడ్డీ ఇవ్వాలన్నా.. పంటల కొనుగోలు చేయాలన్నా.. ఇలా అన్ని రకాల అంశాల్లో ఇ– క్రాపింగ్ కీలకం. రైతుల్లో అవగాహన కల్పించి.. ఇ–క్రాపింగ్‌పై దృష్టిపెట్టాలి. వ్యవసాయ సలహామండలి సమావేశాలు పంటల ప్రణాళికను అమలు చేయడానికి వ్యవసాయ సలహామండలి సమావేశాలు దోహదం చేస్తాయి. మార్కెట్లో డిమాండు ఉన్న పంటలు సాగు చేయాలి. ఏ పంట వేయాలి, ఏ రకం వేయాలి, ఏ పంట వేయకూడదు అనేది రైతులకు చెప్పాలి. బోర్ల కింద వరి పంట సాగు లాభదాయకం కాదు. ఇవన్నీ రైతులకు చెప్పాలి. వరితోపాటు అదే స్థాయిలో ఆదాయాలు వచ్చే మార్గాలను రైతులకు చూపించాలి. ఆర్బీకేల స్థాయిలో మొదటి శుక్రవారం, రెండో శుక్రవారం మండలస్థాయిలో, మూడో శుక్రవారం జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహామండలి సమావేశాలు జరగాలి. రైతు బాగుంటేనే అంతా బాగుంటుంది రైతు బాగుంటేనే అంతా బాగుంటుంది. 62 శాతం మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. రైతుల విషయంలో అన్ని రకాలుగా మనం సహాయకారిగా ఉండాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉండాలి. మొత్తం 15.4 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. ఫెర్టిలైజర్స్‌కు సంబంధించి 20.20 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలి. నాణ్యతను కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షణ చేయాలి. కలెక్టర్లు, ఎస్పీలు వారానికోసారి కూర్చుని ప్రజా సమస్యలపై చర్చించాలి. ఆర్బీకేల వద్దే బ్యాంకింగ్ సేవలు ఆర్బీకేల వరకూ బ్యాంకింగ్ సేవలు అందాలి. బ్యాంకుల చుట్టూ రైతులు తిరగడం కాదు, ఆర్బీకేల వద్దే వారికి బ్యాంకింగ్ సేవలు అందాలి. కౌలు రైతులకూ రుణాలు అందించాలి. సచివాలయాలు, ఆర్బీకేలు.. ఎస్ఓపీ గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేల పరిశీలనకు వెళ్లినప్పుడు కచ్చితంగా ఎస్ఓపీ పాటిస్తున్నారా?లేదా? చూడాలి. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ ప్రజలకు అందుబాటులో ఉంటూ విజ్ఞప్తులను స్వీకరించాలి. ఎస్ఓపీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. రోజుకు రెండు దఫాలుగా హాజరు నమోదు కావాలి. ధాన్యం బకాయిలు విడుదల మొత్తం ధాన్యం బకాయిలను విడుదల చేస్తున్నాం. మొత్తం రూ.3,300 కోట్లుకు గాను రూ.1800 కోట్లు పది రోజుల క్రితమే చెల్లించాం. మిగిలిన బకాయిలను ఇవాళ విడుదల చేస్తున్నాం. రైతుల చేతుల్లోకి డబ్బులు వచ్చి ఖరీఫ్‌కు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నాం. గత రెండేళ్లలో సగటున 83 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. అంతకు ముందు ఐదేళ్లలో రాష్ట్రంలో సగటున ఏటా కొనుగోలు చేసింది కేవలం 55 నుంచి 57 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. వరద లెక్కలు సరి చేసుకోవాలి.. జూలై 28న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించినందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ధవళేశ్వరం వద్ద 5 లక్షల క్యూసెక్కులకుపైగా నీళ్లు కిందకు వెళ్తున్నాయి. పోలవరం కాఫర్‌డ్యాం నిర్మాణం పూర్తైన నేపథ్యంలో వరదనీరు తక్కువగా ఉన్నప్పటికీ ముంపు ఉండే అవకాశాలు ఉంటాయి. లెక్కలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో 10 లక్షల క్యూసెక్కులకు ముంపు ఉంటే ఇప్పుడు 6–7 లక్షలకే ముంపు ఉండే అవకాశాలు ఉంటాయి. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోండి. సహాయ కార్యక్రమాల కోసం నిధులు విడుదల చేశాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలి. -
యువకుడి రెండు చేతులను నరికేసిన సర్పంచ్ భర్త..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచోసుకుంది. పంట సేకరణ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. ఒక వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చిన అమానవీయకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన హోషంగాబాద్ జిల్లాలో జరిగింది. చౌరాహెట్ గ్రామాంలో కొన్ని రోజులుగా పంట సేకరణ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో.. సదరు గ్రామానికి చెందిన సోమేష్ గుర్జార్ అనే రైతు ఒక రోజు సర్పంచ్ భర్త అయిన భగవాన్ సింగ్‌కు తమ సమస్యలను పరిష్కరించాలని కోరాడు. ఈ విషయం గురించి గ్రామస్తులు పలుమార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా, సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఒకరోజు సోమేష్ గుర్జార్ గ్రామస్థుల అందరి సమక్షంలో సర్పంచ్ భర్తను నిలదీశాడు. దీంతో వారి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాటమాట పెరిగి ఒకరి కాలర్‌ను మరోకరు పట్టుకున్నారు. ఈ సంఘటనను భగవాన్ సింగ్ అవమానకరంగా భావించి ఆవేశంతో రగిలిపోయాడు. గుర్జార్‌పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో గత శుక్రవారం రాత్రి సింగ్ కుటుంబం సభ్యులు గుర్జార్‌ను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా మూకుమ్మడిగా కర్రలతో దాడిచేశారు. దీంతో గుర్జార్ లేవలేని స్థితిలో కిందపడిపోయాడు. అప్పుడు భగవాన్ సింగ్ ఒక కోడవలితో రైతు రెండు చేతులను విచక్షణ రహితంగా నరికేశాడు. ఈ క్రమంలో, రైతు రెండు చేతులు తెగిపోయి, రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఈ సంఘటనతో అతని కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గుర్జార్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సర్పంచ్ భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. -
ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంటల రవాణాపై ఆంక్షలు లేవని అగ్రికల్చర్ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మామిడి పండ్ల కోసం 27 కిసాన్ రైళ్లను ఏర్పాటు చేశామని.. మామిడి ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. గత ఐదు వారాల నుంచి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మిర్చి, పసుపు, అరటి, ఆరెంజ్ పంటలకు మద్దతు కల్పించామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో 25చోట్ల పండ్ల ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జులై 8న 2 వేల గిడ్డంగుల నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని పూనం మాలకొండయ్య వెల్లడించారు. చదవండి: గోదావరి జిల్లాల్లో సాగునీటి కష్టాలకు ఇక చెల్లుచీటీ! గ్రానైట్ అక్రమార్కులపై విజిలెన్స్ పంజా -
తండ్రికి అనారోగ్యం.. మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య!
వాంకిడి: తండ్రి అనారోగ్యంపై మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై దీకొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన ఇటన్కార్ వినోద్ (40) తండ్రి మారుతి రెండేళ్ల క్రితం పక్షవాతం బారిన పడి అనారోగ్యానికి గురి అయ్యాడు. అప్పటి నుంచి వినోద్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యం చేయిస్తూ వచ్చాడు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతూ వచ్చాయే కాని మారుతి ఆరోగ్యం కుదుటపడలేదు. దీనికి తోడు ఈ ఏడాది ఆశించినంతగా పంట దిగుబడి రాలేదు. కాగా, పత్తి అమ్మిన డబ్బులు సైతం తండ్రి చికిత్సకు ఖర్చయిపోయాయి. అయినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన వినోద్ తన పత్తి చేనులోనే పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సందర్శించి పంచనామా నిర్వహించారు. మృతుడి తల్లి నాగుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వినోద్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. చదవండి: బైక్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య -
గ్యాస్‌తో పంటకు నీరంట..!
రాజాం: రైతులు కొత్త కొత్త పద్ధతులు అన్వేషిస్తున్నారు. రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన ఎందువ మోహనరావు తన పంటపొలంలో మొక్కజొన్న పంటకు సాగునీరు అందించేందుకు వినూత్న విధానాన్ని అవలంబించారు. తన వద్ద ఉన్న ఆయిల్ ఇంజిన్‌కు వంట గ్యాస్ సిలిండర్ జతచేసి ఎంచక్కా ఇంజిన్ సాయంతో మడ్డువలస కాలువలో నీటిని పంటపొలానికి తరలించారు. ఎకరా మొక్కజొన్న పంటకు 4 కిలోల గ్యాస్ సాయంతో నీరు పెట్టుకోవచ్చని రైతు ‘సాక్షి’కి తెలిపారు. తన స్నేహితుల వద్ద ఈ విధానాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: రసవత్తర పోరు: మామా అల్లుళ్ల సవాల్) వినూత్నం: బాయిలర్ కోడి, పెరుగు ప్యాకెట్లు -
ఫార్మర్‌గా ధోని సెకండ్ ఇన్నింగ్స్
రాంచీ: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వ్యవసాయం చేయడం పరిపాటిగా మారింది. లాక్డౌన్లో షూటింగ్‌లు వాయిదా పడటంతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, సైఫ్‌లు తమ ఫాంలో వ్యవసాయం చేస్తూ బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. అలాగే వీరి జాబితాలో చేరిన టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ పండించిన పంటను విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని తన వ్యవసాయ పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. అంతేగాక ఆర్గానిక్ పద్దతిలో పండించిన తన పంటను ధోని దుబాయ్‌కి ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ అయిన ధోని ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయడంతో అతడి పంటను కొనేందుకు దుబాయ్ రైతు మార్కెట్లు ఆసక్తిని కనబరుస్తున్నాయట. (చదవండి: కొత్తజంటకు ధోని డిన్నర్ పార్టీ) దీంతో ధోని సొంత వ్యవసాయ క్షేత్రంలో పండించిన ఆర్గానిక్ పంటకు భారీగా డిమాండ్ వస్తుండటంతో ఈ పంటను విదేశాలకు ఎగుమతి చేసేందుకు జార్ఖండ్ వ్యవసాయ శాఖ ముందుకొచ్చింది. రాంచీ శివార్లలోని సెంబో గ్రామం రింగ్ రోడ్డు వద్ద ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ధోని స్ట్రాబెర్రీలు, క్యాబేజీ, టమోటాలు, బ్రోకలీ, బఠానీలు, బొప్పాయిల పంటను ఆర్గానిక్ పద్దతిలో పండించాడు. దీంతో ఈ పంటను వ్యవసాయ శాఖ స్వయంగా దుబాయ్‌కి ఎగుమతి చేయనుంది. ఇప్పటికే రాంచీ మార్కెట్లో ధోని పండించిన కూరగాయలు, పళ్లకు భారీ డిమాండ్ ఉంది. ఆల్ సీజన్ ఫాం ఫెష్ ఏజెన్సీ ద్వారా వ్యవసాయ శాఖ గల్ఫ్ దేశాలకు కూరగాయలను పంపింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కింద ధోని పండించిన కూరగాయలను కూడా ఎగుమతి చేయనుందని రాంచీ మార్కెటింగ్ కమిటీ అధిపతి అభిషేక్ ఆనంద్ తెలిపారు. ధోని జార్ఖండ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అని అతని పేరిట కూరగాయలను విదేశాలకు పంపించడం వల్ల జార్ఖండ్ రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఏఐసీసీ కొత్త కమిటీలో ఉత్తమ్‌కు చోటు
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సంస్మరణ ఉత్సవాల నిర్వహణ కోసం ఏఐసీసీ నియమించిన కమిటీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చోటు దక్కింది. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం 10 మంది నేతలతో కమిటీ వేసినట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ మంగళవారం జారీ చేసిన ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. రక్షణ, విదేశాంగ అనుభవం ఉన్న, సరిహద్దు ప్రాంత నేతలకు కమిటీలో చోటు కల్పించారు. ఏకే ఆంటోనీ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో ఉత్తమ్‌తో పాటు మీరాకుమార్, కెప్టెన్ అమరీందర్‌సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్, జితేంద్ర సింగ్, కిరణ్ చౌదరి, మేజర్ వేద్‌ప్రకాశ్, శర్మిష్టా ముఖర్జీలకు చోటు లభించింది. కమిటీ కన్వీనర్‌గా కెప్టెన్ ప్రవీణ్ దావర్‌ను నియమించారు. జగ్గారెడ్డి దీక్ష రద్దు: ఎల్ఆర్ఎస్ రద్దు కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించ తలపెట్టిన ఒక రోజు దీక్ష రద్దయింది. పాత పద్ధతిలోనే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న స్థలాలు, నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తన దీక్షను రద్దు చేసుకున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ‘పంట కొనుగోళ్ల’ పోరు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు పండించే పంటలను కొనే కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ అంశంపై రైతులతో కలసి ఉద్యమించాలని టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పార్టీ నేతలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు మంగళవారం గాంధీభవన్‌లో సమావేశమై చర్చించారు. పంట కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను వ్యతిరేకిస్తూ రైతులతో కలసి పోరాటం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. చదవండి: (పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు!) బుధవారం నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వాలని, జనవరి 11న జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేయాలని, 18న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి ఉద్యమం నిర్వహించాలని తీర్మానించారు. అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ఒకట్రెండు రోజుల్లో ఇదే అంశంపై అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో కలసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిన కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే కాంగ్రెస్ పార్టీ సహించబోదని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులతో కలసి ఉద్యమాలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్ అక్కడి బీజేపీ పెద్దలతో సయోధ్య కుదుర్చుకున్నారని, అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. వ్యవస్థలను కూల్చే పనిలో టీఆర్ఎస్..: భట్టి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన వ్యవస్థలను కూల్చే పనిలో టీఆర్ఎస్ ఉందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం పాలన చేయాలి కానీ.. లాభాల కోసం ప్రభుత్వాలను నడపరని, లాభాల కోసం ఆలోచిస్తే ప్రజాస్వామ్యయుతంగా పాలించినట్టు కాదని కేసీఆర్‌కు హితవు పలికారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాల పేరిట టీఆర్ఎస్ వేసుకున్న ముసుగు తొలగిపోయిందని, ఢిల్లీకి మోకరిల్లి ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు వారి పతనానికి ప్రారంభాలని టి.జీవన్‌రెడ్డి అన్నారు. -
ఊరికి ‘భరోసా’
సాక్షి, అమరావతి: విత్తనం నుంచి పంట విక్రయం దాకా అన్నదాతలకు అన్ని రకాలుగా అండగా నిలిచి అమిత ఆదరణ పొందుతున్న రైతు భరోసా కేంద్రాలు గ్రామ వికాసానికి పూర్తి స్థాయిలో దోహదం చేసేలా సిద్ధమవుతున్నాయి. రైతులకే కాకుండా గ్రామం అంతటికీ అన్ని రకాలుగా భరోసా ఇచ్చేలా వీటిని తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్తగా 9,899 పాల సేకరణ కేంద్రాల భవన నిర్మాణాలకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రతి గ్రామంలో ఆర్బీకేలకు అనుబంధంగా పాలసేకరణ కేంద్రాలను నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భవనాల నిర్మాణం పూర్తి కాగానే వీటిని పొదుపు సంఘాల మహిళలకు అప్పగించనున్నారు. రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించేలా ఆర్బీకేల పరిధిలో పలు సదుపాయాలు కలిగిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను యుద్దప్రాతిపదిక అందుబాటులోకి తేవాలని ఇటీవల సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రూ.9,104 కోట్ల వ్యయంతో ఇవి ఏర్పాటు కానున్నాయి. ప్రధానంగా గోడౌన్లు, కోల్డ్ రూమ్‌లు, ఆక్వా మౌలిక సదుపాయాలు, పాల సేకరణ కేంద్రాలు.. బీఎంసీలు (బల్క్‌మిల్క్ సెంటర్లు), కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఈ–మార్కెటింగ్ ఫ్లాట్‌ఫారాలు, జనతా బజార్లు తదితరాలు మల్టీ పర్పస్ కేంద్రాల్లో ఏర్పాటవుతాయి. గోడౌన్లు, కోల్డు రూమ్‌లు... రాష్ట్రంలో 10,641 ఆర్బీకేల పరిధిలో గ్రామస్థాయిలో ఒక్కొక్కటి రూ.30 లక్షల వ్యయంతో, 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో కొత్తగా గోడౌన్లు ఏర్పాటవుతాయి. మంచి ధరల లభించే వరకు రైతులు వీటిల్లో పంటను నిల్వ చేసుకోవచ్చు. ఇందుకు రూ.2,706 కోట్లను నాబార్డు సమకూర్చనుండగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పర్యవేక్షణలో వీటి నిర్మాణాలు కొనసాగుతాయి. ఆక్వా మౌలిక సదుపాయాలు.. మత్స్యరంగాన్ని ఆధారంగా చేసుకుని వ్యాపారాలు, వ్యాపకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఎఫ్ఎఫ్పీవో (ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్) లను ఏర్పాటు చేస్తోంది. వీటికి రాయితీతోపాటు నామమాత్రపు వడ్డీతో రుణ సౌకర్యాన్ని కల్పించనుంది. చేపలు, రొయ్యలు సాగుకు రాయితీ అందించనుంది. ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుకు రూ.698.27 కోట్లు వ్యయం కానుందని అంచనా. కస్టమ్ హైరింగ్ సెంటర్లు.. గ్రామ స్థాయిలో ఏర్పాటయ్యే దాదాపు 10,500 కస్టమ్ హైరింగ్ సెంటర్లు ద్వారా యంత్ర పరికరాలను రైతులకు అద్దెకు ఇస్తారు. ఐదుగురు సభ్యులు కలిగిన గ్రూపులకు వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తారు. ఊరూరా పాల సేకరణ కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 9,899 పాల సేకరణ కేంద్రాల భవనాల నిర్మాణానికి అనుమతిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో పునాది కోసం అత్యధికంగా ఖర్చు చేయాల్సిన చోట ఒక్కో భవనానికి రూ.18.04 లక్షల చొప్పున, మిగిలిన ప్రాంతాల్లో రూ.15.74 లక్షల చొప్పున వ్యయంతో వీటి నిర్మాణం చేపడతారు. వీటి నిర్మాణం కోసం సుమారు రూ.1,682 కోట్లు వ్యయం కానుండగా 90 శాతం మేర ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల నుంచి వినియోగిస్తారు. మరో 10 శాతం రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల నుంచి వెచ్చిస్తారు. నిర్మాణ పనులు పూర్తి కాగానే పొదుపు సంఘాల మహిళలకు ఈ భవనాలను అప్పగిస్తారు. అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్)తో ఎంవోయూ మేరకు వీటిని దశలవారీగా బల్క్‌మిల్క్ సెంటర్లుగా మారుస్తారు. ఈ నెలలోనే ఒంగోలు, మదనపల్లి డైరీల ద్వారా పాలసేకరణ, బల్క్‌మిల్క్ కూలింగ్ కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. రైతు ఊరు దాటకుండా.. – ఎస్.ప్రద్యుమ్న, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ‘రైతు తన ఊరు దాటాల్సిన పనిలేకుండా ఈ–మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి విత్తనం నుంచి పంటల సేకరణ, గోదాములు, అద్దెకు యాంత్రిక పరికరాలు లాంటి పలు సేవలు లభిస్తాయి. దేశంలో ఎక్కడా ఈ విధానం లేదు. దూరదృష్టితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానాలు అన్నదాలకు ఎంతో మేలు చేకూర్చుతాయి’ మల్టీపర్పస్ సెంటర్లు ఇలా.. ఇంటి నుంచే పంట అమ్ముకునేలా... రైతులు తమ ఇంటి నుంచే దేశ విదేశాల్లో పంటలను విక్రయించుకునేలా మార్కెటింగ్ శాఖ నాగార్జున ఫెర్టిలైజర్స్‌తో ఎంవోయూఏ చేసుకుంది. కంపెనీ ప్రతినిధులు రైతుల వద్ద పంటలను వారి చెప్పిన రేటుకు కొనుగోలు చేసి మార్కెట్లలో విక్రయిస్తారు. ఈ విధానంలో రైతులు ఏమాత్రం శ్రమకు గురికాకుండా, కమీషన్లు చెల్లించే పని లేకుండా పంటను ఇంటి నుంచే అమ్ముకోవచ్చు. వీటితోపాటు ఫుడ్ ప్రాసెసింగ్, జనతా బజార్ల ఏర్పాటుకు కూడా సన్నాహాలు మొదలయ్యాయి. సాగు మాది.. శ్రమ సర్కారుది ఇప్పుడు మేం సాగు ఒక్కటే చేస్తున్నాం. మిగిలినదంతా ప్రభుత్వమే చూసుకుంటోంది. రైతు భరోసా ద్వారా ఆర్ధికసాయం అందిస్తోంది. విత్తనాలు, ఎరువులు, మందులు ఆర్బీకేల్లో దొరుకుతున్నాయి. ఈ–మార్కెటింగ్ ద్వారా ఇంటి నుంచే పంటను అమ్ముకునే విధానాన్ని ప్రభుత్వం తెస్తోంది. రైతు చేతిలో సొమ్ము పడిన తరువాతే సరుకు తరలించే కొత్త విధానాలను ముఖ్యమంత్రి జగన్ రూపొందించడం బాగుంది. – మారెడ్డి సుబ్బారెడ్డి, ప్రకాశం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు -
పొలంలో వెండి ఆభరణాలు లభ్యం
పరిగి: ఓ రైతు వ్యవసాయ పొలంలో రాగి పాత్రలు, వెండి అభరణాలు లభ్యమైన ఘటన పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్‌నగర్‌లో చోటు చేసుకుంది. తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. సుల్తాన్‌నగర్ గ్రామానికి చెందిన సిద్దిఖీ గ్రామంలో ఇల్లు నిర్మించుకుంటుండడంతో మంగళవారం తన వ్యవసాయ పొలంలో ఇంటి బేస్మెంట్ కోసం మట్టిని తవ్వుతుండగా మూడు రాగి, రెండు ఇత్తడి పాత్రలు బయటపడ్డాయి. అందులో కొన్ని ఆభరణాలు లభించాయి. దొరికిన వాటిని రైతు సిద్దిఖీతో పాటు పక్క పొలానికి చెందిన మరో ఇద్దరితో కలిసి సమానంగా పంచుకున్నారు. ఈ విషయం కొందరి ద్వారా బయటకు పొక్కడంతో తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి, ఎస్సై శ్రీశైలం గ్రామాన్ని సందర్శించి విషయాన్ని ఆరా తీశారు. వారి నుంచి పాత్రలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 832 గ్రామాల వెండి, మూడు రాగి పాత్రలు, రెండు ఇత్తడి పాత్రలు ఉన్నట్లు తహసీల్దార్ తెలిపారు. గతంలో ఓ పాడుబడిన బావిలోంచి మట్టి తీసి అక్కడ పోశారని దాంట్లో అవి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. -
జూన్ 8 వరకు పంటల కొనుగోలు కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వర్షాలు రాకముందే రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. -
కడగండ్లు మిగిల్చిన అకాల వర్షం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. కోత కు వచ్చిన వరి పైర్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల మామిడి తోట లకు నష్టం వాటిల్లింది. ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ► ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, మణుగూరు, అశ్వాపురం, సత్తుపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తో పాటు కల్లాల్లోని మిర్చి, మొక్కజొన్న పంట తడిసిపోయిం ది. కొన్నిచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. ► సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొమురవెళ్లి మండలంలో వడగళ్లు పడ్డాయి. నంగునూరులో ధాన్యం నేలరాలింది. గజ్వేల్ మండలంలో వరి, మామిడితోటలకు నష్టం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నష్టం అపారం యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిం ది. రాజాపేట మండలంలో మామిడి తోటలు దెబ్బతినగా తు ర్కపల్లి మండలంలో మామిడి తోటలతో పాటు వరికి తీరని నష్టం వాటిల్లింది. విద్యుత్æ స్తంభాలు కూలిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలులకు పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరి పడ్డాయి. చెట్లు కూలిపోయాయి. కోతకు వచ్చి న వరి పంట 2,963 ఎకరాల్లో పూర్తిగా ధ్వంసమైంది. నిమ్మ, మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో చేతికొచ్చిన వరిపైరు పూర్తిగా నేలపాలైంది. చింతపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వసతులు లేకపోవడంతో ధాన్యం నీటిపాలైంది. అలాగే వింజమూరు, వర్కాల గ్రామాల్లో వరి పైరుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి పాలమూరులో భారీ నష్టం.. : మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట, మూసాపేట, అడ్డాకుల, రాజాపూర్, మహబూబ్‌నగర్ రూరల్, బాలానగర్ మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అంచనా. వనపర్తి జిల్లాలో రెండు గంటల పాటు భారీ వర్షం కురవడంతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కొత్తకోట, వనపర్తి, పెద్దమందడి మం డలాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. శుక్రవారం ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు నష్టం వివరాల ను అంచనా వేయనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మం డలంలోని ఖానాపూర్, పంచలింగాల, కర్ని, రుద్రసముద్రం, కాట్రెవ్‌పల్లి, మక్తల్ గ్రామాల్లో వెయ్యి ఎకరాల్లో పంట నేల వాలింది. నర్వ మండలం కొత్తపల్లి, జక్కన్నపల్లి, రాయికోడ్, నర్వ, యాంకి గ్రామాల్లో వడ్లు రాలిపోగా.. మామిడి తోటలు దెబ్బతిన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా చింతరేవుల, నర్సన్‌దొడ్డి, రేవులపల్లి, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వానతో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ కురిసిన వర్షానికి పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు ప్రకటించింది. కాగా అత్యధికంగా బొల్లారంలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. క్యాంప్ ఆఫీస్‌పై పిడుగు.. దేవరకొండ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రనాయక్ క్యాంప్ కార్యాలయం పెంట్‌హౌస్æ ప్రహరీపై గురువారం పిడుగుపడింది. పిడుగుపాటుకు క్యాంప్ కార్యాలయం పెంట్‌హౌస్ ప్రహరీ గోడ పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలసి భోజనం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
రైతులకు అసౌకర్యం కలగొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు చెం తకే వెళ్లి ధాన్యం కొనుగోళ్లు జరపాలని సూ చించారు. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన పరిస్థితులలో ప్రభుత్వ ఆంక్షలకు అడ్డురాకుండా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువ మంది రైతులు గుమి కూడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి బీఆర్కేఆర్ భవన్లో సమీక్షా సమా వేశం నిర్వహించారు. సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పా టు విషయంలో పరిమితులు అవసరం లేదని, రూ.25 వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీకై ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారన్నా రు. గ్రామాల వారీగా ధాన్యం అ మ్మకానికి వచ్చే పరిస్థితులు అం చనా వేసి కొనుగోళ్లకు టోకెన్ ద్వా రా ఏర్పాట్లు చేయాలన్నారు. అకాల వర్షాలు వస్తే కొనుగోలు కేం ద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లను సరఫ రా చేయాలన్నారు. టార్పాలిన్లను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని, కొత్తగా 60 వేల టార్పాలిన్లను త్వరగా కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ కు ఆదేశాలు జారీ చేశారు. తేమ ని ర్ధారణ యంత్రాలు కొరత లేకుండా చూసుకోవాలని, గన్నీ బ్యాగులను ముందే సిద్ధం చేసుకోవాలన్నారు. రైతులు ప్రాథమిక సహకార సంఘా లు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణ వ్యవసాయ మార్కెట్ల వరకూ రైతులు ధా న్యం తెచ్చే అవకాశం రానివ్వమని చెప్పారు. రబీలో పండిన మొక్కజొన్నలను రూ.1,760 కి కొనుగోలు చేయాలని తెలిపారు. పౌల్ట్రీ సంక్షోభం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విధిగా ఏ గ్రామ రైతు ఆ గ్రామంలోనే ధాన్యం అమ్మకాలు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. నిత్యావసరాలకు గ్రీన్ ఛానల్.. ఇతర రాష్ట్రాల, రాష్ట్రం నుంచి పట్టణాలు, గ్రామాలకు వచ్చే పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు ట్రాఫిక్ జామ్ కారణంగా ఆగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. టోల్ ప్లాజాలు చెక్ పోస్ట్‌ల వద్ద అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధిక ధరలకు నిత్యావసరాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, దీనిని అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ జీవో విడుదల చేశామన్నారు. విత్తనాలు, ఫర్టిలైజర్ ఈసీ యాక్ట్‌లో ఉన్నందున వాటి రవాణా, సరఫరాపై ఎటువంటి ఆంక్షలుండవని వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య తదితరులు హాజరయ్యారు. -
పంటలపై పక్కా సర్వే
సాక్షి, పెద్దశంకరంపేట: ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటలపై వ్యవసాయ అధికారులు పక్కా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ వివరాల సేకరణతో అటు రైతులకు అధికారులకు ఉపయోగకరంగా మారనుంది. రైతులు, పంటలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులోకి రానుండడంతో ప్రభుత్వ పథకాల అమలు ఇక సులభతరం కానుంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 83 వేల హెక్టార్లలో రైతులు ఆయా రకాల పంటలను సాగు చేసుకుంటున్నారు. జిల్లాలోని 391 రెవెన్యూ గ్రామాల పరిధిలో 2లక్షల 26 వేల మంది రైతులు పండించే పంటలను గ్రామాల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తి వివరాలు సేకరించి పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమం జిల్లాలో చురుకుగా కొనసాగుతుంది. జిల్లావ్యాప్తంగా ఏఓలు, ఏఈఓలు గ్రామాల వారిగా పర్యటించి రైతులు తమ సర్వే నంబర్లలో ఏఏ పంటలు సాగు చేస్తున్నారో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ప్రతీ సర్వే నంబర్లో ఏ పంట సాగవుతుందో తెలుసుకోవడం సులభం మెదక్ జిల్లా పరిధిలోని ఆయా గ్రామాల్లో రైతులు సీజనల్ వారీగా ఆయా రకాల పంటలను సాగు చేస్తుంటారు. ఖరీఫ్ సీజన్లో రైతులు వరిపంట, పత్తిపంట, మొక్కజొన్న, జొన్న, రాగులు, కొర్రలు, మినుములు, పెసర తదితర పంటలను విరివిగా సాగు చేస్తుంటారు. రైతులు తమ భూముల సారాన్ని బట్టి పంటల సాగును ఎంచుకుంటారు. ప్రస్తుతం వర్షాలు సక్రమంగా లేక పోవడంతో రైతులు వరిపంటను సాగు చేసే విషయంలో ఆలోచిస్తున్నారు. కొంత మేర బోరు బావుల వద్ద రైతులు వరిపంటను సాగు చేస్తున్నారు. దీని తర్వాత ఆరుతడి పంటలైన పత్తి, మొక్కజొన్న, జొన్న, రాగులు, కొర్రలు, పెసర పంటలను ఎక్కువగా సాగు చేస్తుంటారు. దీనిపై ప్రభుత్వం ఇటీవల జరిగిన సమావేశంలో ప్రతీ జిల్లాలో ఏఏ పంట ఎంత మేర సాగవుతుంది, రైతులకు కావలసిన మార్కెట్ విషయాలు, పండించిన పంటలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరతో పాటు రైతుబంధు అమలు వంటిపై వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించింది. దీనికి అనుగుణంగా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ నెల 28 వరకు పంటల సాగు విషయాలను రైతుల నుంచి సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 40 శాతం వరకు గ్రామాల్లో సర్వే పూర్తయింది. మిగతా సర్వే ఈ నెలాఖరు వరకు పూర్తిచేయనున్నారు. ఒక్కో ఏఈఓకు 3 వేల మంది రైతులు మెదక్ జిల్లాలోని 20 మండలాల పరిధిలో 72 మంది ఏఈఓలు పనిచేస్తున్నారు. ఆయా గ్రామాల వారీగా ఒక్కొక్క ఏఈఓ సుమారు 3 వేల మంది రైతుల వివరాలు సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. వీరు ఈ వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. గిట్టుబాటు ధర కావాలన్నా, కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నా, రైతుల పంటలపై చేస్తున్న సర్వేనే ఇకపై ఆధారం కానుంది. దీని వల్ల కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు, దళారులకు చెక్ పడనుంది. రైతుబంధు పథకం ద్వారా కూడా ఇకపై రైతులకు ఇచ్చే నగదు దీని ఆధారంగానే వచ్చే అవకాశాలున్నాయి. పంటలసర్వే కొనసాగుతోంది జిల్లా వ్యాప్తంగా 391 రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ అధికారులు రైతులు పండించే పంటల వివరాలను సేకరిస్తున్నారు. ఈ నెల 28 లోగా సర్వే పూర్తవుతుంది. పంటల వివరాల సర్వే ఆధారంగా మార్కెటింగ్ ఏర్పాటుతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎన్ని గ్రామాలకు ఏర్పాటు చేయాలనే విషయాలు తెలుస్తాయి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగానే వారి ఖాతాల్లో నగదు జమచేసే వీలుంటుంది. రైతులు వ్యవసాయ అధికారులకు సహకరించాలి. –పరశురాంనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి, మెదక్ -
ఆరోగ్యం + ఆదాయం = చిరుధాన్యాల సాగు
సాక్షి, జడ్చర్ల టౌన్: ఆరోగ్యంతోపాటు మంచి ఆదాయాన్ని ఇస్తుంది చిరుధాన్యాల సాగు. ఇటీవల కాలంలో చిరుధాన్యాలను భుజించటం సర్వసాధారణమైంది. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెరగకుండా ఉంది. ఈక్రమంలోనే బాదేపల్లి పట్టణానికి చెందిన బి.రవిశంకర్ అనే ఆదర్శరైతు మాత్రం చిరుధాన్యాలను సాగుచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే పంట సాగుపట్ల అనేక ప్రయోగాలు చేయడంతోపాటు జడ్చర్ల రైతుసహకార సంఘం అధ్యక్షుడిగా పలు సెమినార్లకు హాజరై నూతన సాగు విధానాల పట్ల ఆయన మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే చిరుధాన్యాలు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఎకరా పొలంలో అండుకొర్రలు సాగుచేస్తున్నాడు. డ్రిప్ పద్ధతిలో సాగు.. తక్కువ నీటితో డ్రిప్ పద్దతిలో అండుకొర్రలు సాగుచేయటం గమనార్హం. 65రోజుల కిందట విత్తనాలు వేయగా మరో 25రోజుల్లో పంట చేతికిరానుంది. ఇప్పటి వరకు ఎకరా అండుకొర్రల సాగుకు మొత్తం రూ.20వేలు ఖర్చు అయినట్లు సదరు రైతు తెలిపాడు. పంట దిగుబడి 7–8క్వింటాళ్ల వరకు రావచ్చని చెబుతున్నాడు. బహిరంగ మార్కెట్లో అండుకొర్రలు కిలో రూ.250గా ఉంది. 7–8క్వింటాళ్ల సాగుతో రూ.లక్షల్లో లాభాలు ఆర్జించేందకు ఆస్కారం ఉందంటున్నాడు. గత ఏడాది చిరుధాన్యాలైన అర్కలు, సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు ఐదు రకాలను సాగుచేసి వచ్చిన 8క్వింటాళ్ల దిగుబడి అలాగే భద్రపర్చారు. ఏడాదికి మూడు పంటలు సులువుగా తీసే ఆస్కారం ఉండటంతో చిరుధాన్యాల సాగుపట్ల ఆసక్తి క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రాసెసింగ్ యూనిట్ ఉంటే సాగువిస్తీర్ణం పెరిగే అవకాశం చిరుధాన్యాలు పండించిన తరువాత వాటిని ప్రాసెసింగ్ చేసేందుకు జిల్లాలో అవకాశం లేకుండా పోయింది. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటయినట్లయితే రైతులు మరికొంత మంది చిరుధాన్యాల సాగు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. పట్టించుకోని ఐఐఎంఆర్‌సీ రాజేంద్రనగర్‌లో ఉన్న కేంద్ర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ అధికారులు పట్టించుకోకపోవటం వల్లే ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కాకుండా ఉంది. చిరుధాన్యాల విత్తనాలు సరఫరా చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నప్పటికీ రైతులు పండించిన చిరుధాన్యాలను నేరుగా విక్రయించలేక, ప్రాసెసింగ్ చేసుకోలేక సాగుకు ముందుకు రాకుండా ఉన్నారు. ఈప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని, అందుకు ఐఐఎంఆర్‌సీ అ«ధికారులు ముందుకు రావాలని రైతులు కోరుతున్నారు. ఎకరాకి రూ.20వేలు వెచ్చించి.. అండుకొర్రల సాగుకు ఇప్పటి వరకు ఒక ఎకరా పొలానికి రూ.20వేలు వెచ్చించా. మరో 25రోజుల్లో పంట చేతికి రానుంది. ఎకరాకు 7–8క్వింటాళ్ల దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది. చిరుధాన్యాలు పండించేందుకు నీటి వసతి నామమాత్రంగా ఉన్నప్పటికీ డ్రిప్‌తో సులువుగా సాగు చేయవచ్చు. ఏడాదికి మూడుపంటలు సులువుగా సాగు చేసే వెసులుబాటు ఉంది. చిరుధాన్యాల సాగు వల్ల భూమిలో సారం కోల్పోకుండా మరింత బాగా మారుతుంది. అయితే, రైతులు సాగుకు ఆసక్తిగా ఉన్నా ప్రాసెసింగ్ యూనిట్ లేకపోవటంతో ముందుకు రావడంలేదు. – బి.రవిశంకర్, ఆదర్శరైతు, బాదేపల్లి -
సాగుకు పెట్టుబడి సాయం
ఈ కౌలు రైతు పేరు బోయ రాము. నిండా 26 ఏళ్లు లేవు. కరువు, దుర్భిక్షానికి మారుపేరుగా నిలుస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద ముష్టూరు. బతుకు మీద ఆశ, బతికి తీరాలనే సంకల్పం కొద్దీ ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెచ్చి మూడెకరాలు సాగు చేసేవాడు. రాము పంట వేయడం, వాన ముఖం చాటేయడం.. కొత్త అప్పులు చేసి మళ్లీ మళ్లీ ఏడాది విత్తనాలేయటం.. కరువు షరామామూలే అన్నట్టు నాలుగేళ్లుగా ఇదే తీరు. అప్పు కొండలా పెరిగి పోయింది. ఆ కొండ గుండెల మీద బరువుగా మారింది. పంట మీద చల్లాల్సిన పురుగుమందును గొంతులో పోసుకున్నాడు.ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ సంక్షోభం తీవ్రతకు రాము మరణం ఒక నిదర్శనం. నాలుగేళ్లుగా భరోసా దొరకని రైతులు బలవంతంగా ప్రాణాలను తీసుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వానికి పట్టడం లేదు. ఆ చావులు పాలకులను తాకడం లేదు. ఆ కుటుంబాల ఏడుపులు ప్రతిపక్ష నాయకుడి గుండెని తాకాయి. అన్నదాతలకు వెన్నుగా ఉంటానన్నారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. రైతు భరోసా ప్రకటించారు. పెట్టుబడిసాయం అందిస్తానని రైతుకి ధైర్యాన్నిచ్చారు. రైతులకే కాదు సమాజంలో ప్రతిరంగానికి వరాలజల్లులాంటి నవరత్నాలను ప్రకటించారు. అందులో ఒక రత్నమే వైఎస్సార్ రైతు భరోసా. వైఎస్సార్ రైతు భరోసాలో భాగంగా ‘పెట్టుబడి సాయం’ పథకాన్ని 2017 జూలైలో పార్టీ ప్లీనరీలో ప్రకటించారు జగన్మోహన్రెడ్డి. ఇప్పుడు అనేకమంది పాలకులు ఆ బాటలో నడుస్తున్నారు. ప్రతి రైతుకు తోడుగా.. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తూనే.. రైతు కుటుంబాలన్నింటికీ ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం ఇస్తారు. నాలుగేళ్ల కాలానికి మొత్తం రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తారు. ఈ మొత్తాన్ని ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మే నెలలో నేరుగా రైతుల చేతికిస్తారు. పెట్టుబడి సాయం ప్రతి అన్నదాతకూ తోడుగా ఉంటుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి స్వర్ణయుగాన్ని తెస్తుంది. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీలు, రాజకీయాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ అందుతుంది. ఇటీవలి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 76.21 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపు 66 లక్షల కుటుంబాలు ఉన్నాయి. పెట్టుబడి సాయం ప్రైవేటు వడ్డీల బారి నుంచి రైతులను కాపాడుతుంది. ప్రైవేటు వ్యాపారుల నుంచి 3, 4 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి సాగు చేయాల్సిన దుస్థితి తప్పుతుంది. దీంతో పాటు జీరో వడ్డీ, పావలా వడ్డీ కింద రైతులకు రుణాలు ఇచ్చేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటారు. ఆ పథకాల కింద బ్యాంకులకు ఎంత మొత్తం జమ చేయాలో బడ్జెట్లో కేటాయింపులు చేసి సున్నా, పావలా వడ్డీలకు రుణాలు వచ్చేలా చూస్తారు. ఈ పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు అపహాస్యం చేసిన వారే ఇప్పుడు వేనోళ్ల కీర్తిస్తున్నారు. తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు గత ఏడాది నుంచి పెట్టుబడి సాయం ఇస్తుండగా.. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లలో ప్రకటించాయి. వైఎస్ఆర్ నాటి స్వర్ణయుగాన్ని తేవడానికి ఆయన తనయుడు జగన్ వేసిన ఓ ముందడుగే వైఎస్సార్ రైతు భరోసా. -
పాత(ర) ధాన్యం... పోషకం
‘పాతర’ అనే మాట నేటి తరానికి కొత్తగా అనిపించినా, తరతరాల నుండి వినిపిస్తున్న పాత మాటే. భూమిని తవ్వి అందులో ధాన్యాన్ని లేదా ఏదైనా వస్తువును పెట్టి మళ్లీ మట్టిని కప్పేదాన్ని ‘పాతర’ అని అంటారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటను కళ్లాల్లోకి తెచ్చి నూర్పులు చేస్తారు. ఏడాది పొడుగునా కుటుంబం తినేందుకు సరిపడే ధాన్యం దాచుకునేందుకు, పెళ్లీ, పేరంటాలు, గ్రామదేవతా ఉత్సవాలు వంటి శుభ కార్యాలలో బియ్యం కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తగా పాతర వేసి ధాన్యం నిల్వ ఉంచుకుంటారు. సంక్రాంతి అనంతరం కళ్లాల్లోని ధాన్యలక్ష్మిని పూజించి ఇంటికి తెచ్చి వాటిని పాతర వేస్తారు. అలా మే నెలాఖరు వరకు పాతర్లలో ధాన్యం నిల్వ చేస్తారు. అనంతరం బయటకు తీసిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టి మిల్లు చేస్తారు. ఇలా పాతర వేసిన బియ్యం నాణ్యంగా, ఆరోగ్యకరమైన పోషక విలువలుండేలా, రుచికరంగా ఉంటాయని పాత తరం వారు చెబుతున్నారు. సంక్రాంతి నుండి నెల రోజుల పాటు నిత్యం పాతరను ఆవుపేడతో ఆవుపేడతో అలుకుతారు. ఉదయం, సంధ్యవేళల్లో రంగురంగుల ముగ్గులతో అలకంరించి, వాటిపై గొబ్బెమ్మలు పెట్టి ధాన్యలక్ష్మీ అవతారంగా భావించి దీపారాధన చేస్తారు. పాతర వేయడంలో ఆంతర్యం ఇదే... పాతర ధాన్యం తిన్న పాపలు పుష్టిగా ఉంటారని గ్రామీణ ప్రాంతాల్లో నానుడి ప్రచారంలో ఉంది. ఈ ధాన్యం ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా భూస్వాముల ప్రతిష్టకు గౌరవం తెచ్చేవిగా చెబుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు అధికంగా పూరింట్లో నివాసం ఉండేవారు. జనవరి నెల నుంచి మే, జూన్ నెల వరకు అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇళ్లల్లో దాచిన సమయాల్లో అగ్నికి ఆహుతి కాకుండా ముందస్తు జాగ్రత్తగా ఇళ్ల ముందు గొయ్యి తీసి అందులో ధాన్యం ఉంచడం వల్ల అవి సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. మే నెలలో అధికంగా వివాహాలు, గ్రామదేవత ఉత్సవాలు రోజుల తరబడి నిర్వహించే నేపథ్యంలో ఇంటికి వచ్చిన అతిథులకు, స్నేహితులకు, బంధువులకు మూడు పూటలా భోజనాలు అవసరమైనపక్షంలో వెంటవెంటనే పాతర్ల నుండి అవసరం మేర ధాన్యం తీసి వినియోగించేవారు. అంతేకాకుండా కరువు కాటకాలు ఏర్పడిన సమయంలో పాతర్లలో ధాన్యం వినియోగించేవారు. – మద్దిలి కేశవరావు, సాక్షి, ఇచ్ఛాపురం రూరల్ పాతర ఎత్తును బట్టి... గ్రామాల్లో రైతుల ఇళ్ల ముందు వేసిన పాతర ఎంత ఎత్తులో ఉంటే ఆతను ఎన్ని ఎకరాల భూస్వామిగా అప్పట్లో నిర్ధారించేవారు. అంతేకాదు, సదరు రైతు హుందాకు చిహ్నంగా పాతరను చెప్పవచ్చు. ఆ ఏడాది పొడవునా అన్నదాతగా ఆ రైతుకు గౌర మర్యాదలు దక్కేవి. -
రైతు అనే నేను ...
రైతును రాజుగా చూడాలనేది తన ఆశ అని తరచూ చెబుతుండే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఆ వైపుగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు బంజరు భూముల్లో సిరులు పండించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతూనే.. మరోవైపు నుంచి సాగులోకి వచ్చే భూముల్లో ఎలాంటి పంటలు పండుతాయో వ్యవసాయ శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేయిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పంట కాలనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై వారితో చర్చించారు. ఈ క్రమంలో రైతుల వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరచనున్నారు. మొత్తం 30 అంశాల మీద రైతు సర్వే జరగనుంది. సర్వే తర్వాత వచ్చిన రిపోర్టు ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. సాక్షి, సిద్దిపేట : రాష్ట్రంలో మెజారిటీ భాగం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనంసాగిస్తారు. వర్షాలు కురిస్తేనే పంటలు పండే పరిస్థితి. పంటలు పండిస్తేనే చాలా మందికి కూలీ దొరికేంది. లేదంటే ఉపాధి కోసం పరాయి రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు వలసపోవడం తప్ప మరో దారిలేదు. తెలంగాణలో ఇలాంటి దుస్థితిని లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చాలనే కసితో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. బంజరు భూములను సాగులోకి తేవడం తెచ్చి వ్యవసాయాన్ని పండగ చేయాలని తపన పడుతున్నారు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ తీరు, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. అందుకోసం రైతుల పూర్తి వివరాలు ఆన్లైన్లో పొందు పరచాలని, భూసారం, నీటివనరులు, పంటల సాగు, మార్కెటింగ్ వివరాలు మొత్తం అందుబాటులోకి వస్తాయని, తద్వారా ద్వారా అసలు రైతులకు ఏం అవసరమో తేలిపోతుందనే ఆలోచనకు వచ్చారు. ఇందులో భాగంగానే ఈనెల 23 రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతోపాటు, డీఆర్డీఏ, సెర్ప్, పరిశ్రమలు, మార్కెటింగ్ అధికారులతోపాటు అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించి రైతు సమగ్ర సర్వే అవసరం, ఆవశ్యకతను వివరించారు. ఇందుకుసంబంధించిన ప్రొఫార్మను తయారు చేసి అందచేశారు. 30 అంశాలపై సమాచార సేకరణ రైతు పేరు నుంచి మొదలుకొని మొత్తం 30 అంశాల ద్వారా రైతు పూర్తి సమాచారం తీసుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు. రైతు పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్, రైతు పేరు, ఆధార్ నెంబర్, తండ్రి లేదా భర్త వివరాలు, జండర్, ధరణీ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాలు, పుట్టిన తేదీ, సెల్ నెంబర్‌తోపాటు బ్యాంకు వివరాలు సర్వే ద్వారా సేకరిస్తారు. అదేవిధంగా కులం, భూమి వివరాలు సర్వే నెంబర్లతో సహా, ఇందులో సాగుకు అనుకూలంగా ఉన్న భూమి, లేని భూమి వివరాలు పొందుపరుస్తారు. ఆయా పంటల సాగుకు అందుబాటులో ఉన్న ప్రధాన నీటి వనరులైన బావులు, బోర్లు, చెరువు, కాల్వలు, వర్షాధారం ఇలా మొత్తం వనరుల వివరాలు తీసుకుంటారు. అదేవిధంగా సూక్ష్మ, బిందు, తుంపర సేద్యం మొదలైన వివరాలు, భూసార పరీక్షల కార్డు నెంబర్ వంటి వివరాలతోపాటు భూమి రకం నల్లరేగడి, ఎర్ర నేలలు మొదలైన నేలల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదుచేస్తారు. వీటితోపాటు గత ఖరీఫ్‌లో సాగు చేసిన పంట వివరాలు, దిగుబడి, అదేవిధంగా రబీ పంట సాగు, దిగుబడి వివరాలు పొందుపరుస్తారు. ఇవే కాకుండా పండ్లు, కూరగాయలు, మల్బరీ మొదలైన పంటలు సాగు చేస్తే వాటి వివరాలు నమోదు చేస్తారు. వచ్చే వానాకాలం, యాసంగిలో ఏం పంటలు వేస్తారో వివరాలు తెలుసుకుంటారు. అదేవిధంగా వ్యవసాయ పరికరాల వినియోగం, క్రాప్‌లోన్ వివరాలు, పంటల బీమా, పండిన పంటలను విక్రయించేందుకు మార్కెటింగ్ సౌకర్యం, విత్తనాల ఉత్పత్తి మొదలైన వివరాలు సేకరిస్తారు. వీటితోపాటు ఇప్పటికే మీ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉంటే వాటి వివరాలు, అదేవిధంగా రైతు స్మార్ట్ ఫోన్ వాడితే అందులో వ్యవసాయ సమాచారం కోసం ఏం యాప్ వినియోగిస్తారో కూడా సర్వే సందర్భంగా నమోదు చేస్తారు. ఫిబ్రవరి ఒకటి నుంచి సర్వే మొదలు ఈ వివరాలు సేకరిస్తే కానీ ఏ ప్రాంతంలో రైతులు ఏ పంటలు పండిస్తారు. నీటి వసతి, మార్కెటింగ్ మొదలైన వివరాలు రావు. దీంతోనే పంటల కాలనీ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయవచ్చు. అందుకోసం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మార్చి నెల చివరి వరకు ప్రతీ రైతు చిట్టాను సేకరించాలి. జిల్లా వ్యాప్తంగా 5.66 లక్షల ఎకరాల భూమిని సాగుచేసే 2.6లక్షల రైతుల వివరాలు సేకరించాలి. ఇందుకోసం ఇప్పటికే జిల్లా స్థాయిలో మండల వ్యవసాయ అధికారులకు, మండల, డివిజన్ స్థాయిల్లో వ్యవసాయ విస్తరణ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే వచ్చే వ్యవసాయ సీజన్ జూన్ నాటికి రైతుల వివరాలు, పంటల కాలనీ మొదలైన సమాచారంతో నూతన వ్యవసాయా పద్ధతికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. -
అన్నదాత గుండె పగిలింది
మెళియాపుట్టి/తెనాలి రూరల్/పెదవేగి రూరల్ : అన్నదాత గుండె పగిలింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే తుపాను ప్రభావంతో పాడవుతోందనే ఆవేదన అతని మనసును తొలిచేసింది. ఇంటికి చేరాల్సిన పంట నీటి మునిగితే అన్న ఆలోచనే తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. పంట గింజలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఉన్న ఫళంగా పొలంలోనే కుప్పకూలిపోయి మరణించాడు. పెథాయ్ రూపంలో వచ్చిన తుపాను శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇదే తరహాలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన ఓ రైతు కూడా ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో మరో రైతు తీవ్ర మనస్తాపానికి గురై నిద్రలోనే గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామానికి చెందిన రైతు గొట్టిపల్లి చిన్నయ్య (69)కి నాలుగెకరాలు పొలంలో వరిసాగు చేశాడు. కోతలు పూర్తవడంతో కుప్పలు వేశాడు. అయితే పెథాయ్ తుపానుతో సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షానికి పొలంలో నీరు చేరింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన చిన్నయ్య వరికుప్పల చుట్టూ చేరిన నీటిని మళ్లించేందుకు మంగళవారం పొలానికి వెళ్లాడు. అధికంగా నీరుచేరి ఉండడంతో నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఇది గమనించి వెళ్లి చూసేలోపే చిన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మృతినికి భార్య శాంతమ్మ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పంటను కాపానుకోవడానికి వెళ్లిన ఇంటిపెద్ద శవమై రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. నీటమునిగిన పంటను చూసి.. ఇక గుంటూరు జిల్లా తెనాలి ఐతీనగర్‌కు చెందిన రైతు కనపర్తి సుందరరావు (58) కూడా ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. కౌలుకు తీసుకున్న ఐదెకరాల్లో వేసిన వరిపంట కోతకు వచ్చింది. రెండ్రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న తరుణంలో పెథాయ్ సుందరరావు గుండెల్లో తుపాను రేపింది. పంటను తీవ్రంగా దెబ్బతీసింది. చేనును చూసుకునేందుకు మంగళవారం వెళ్లిన అతను వాలిపోయిన పంటను చూసి తీవ్ర ఆందోళనకు గురై ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి రైతులు అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణం విడిచాడు. మృతునికి భార్యా, ఇద్దరు కుమారులు. కొట్టుకుపోయిన పంట గురించి కలత చెంది.. మరో ఘటనలో.. ఆరుగాలం పడ్డ కష్టం తుపానుకు కొట్టుకుపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామానికి చెందిన రైతు రాజులపాటి మల్లిఖార్జునరావు (39) కూడా రోజంతా తీవ్రంగా కలత చెంది చివరికి రాత్రి నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఈయన ఐదెకరాల్లో మొక్కజొన్న వేశాడు. ఇప్పటివరకు రూ.రెండుల లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. పైరు ఏపుగా పెరిగింది. మంచి దిగుబడితో కష్టాలు తీరుతాయనుకుంటున్న సమయంలో పెథాయ్ తుపాను విరుచుకుపడడంతో పంట మొత్తం పాడైంది. దీంతో సాగుకు చేసిన అప్పులు తీర్చేదెలా అంటూ సోమవారం ఉదయం నుంచి మల్లికార్జునరావు తీవ్రంగా మథనపడుతున్నాడని అతని భార్య శివదుర్గ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నిద్రలోనే గుండెనొప్పి వచ్చిందని.. ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని కన్నీటిపర్యంతమైంది. -
పొలాలను ముంచిన మిషన్ భగీరథ
సాక్షి,చిగురుమామిడి: మండలంలోని కొండాపూర్ గ్రామ ఊరచెరువు దగ్గర మిషన్‌భగీరథ మెయిన్ పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతోంది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పైపుల నుంచి నీరు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో కోతకు వచ్చిన పంట నీటితో నిండిపోయింది. ఒకటి రెండు రోజుల్లో కోసే వరి నీటమునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుర్ర స్వామి, బింగి మల్లయ్య, బుర్ర శ్రీనివాస్‌లకు చెందిన పంటలు నీటమునిగాయని ఆందోళన చెందుతున్నారు. నీరు ఇంకిపోయే వరకు దాదాపు పదిరోజుల సమయం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పగిలిన పైపులైన్‌ను మరమ్మతు చేయాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. -
సమయస్ఫూర్తి
రంగరాజపురంలో రమణయ్య అనే రైతు ఉండేవాడు. అతని కూతురుకు వివాహం నిశ్చయమైంది. బంగారు నగలు కొనటానికి పట్నానికెళ్ళాడు. నగలు కొని ఇంటిదారి పట్టాడు. అప్పటికే చీకటి పడుతుండటంతో త్వరగా ఇల్లుచేరాలని అడ్డదారిన గబగబా నడుస్తున్నాడు. దారిలో గజదొంగ వీరయ్య కత్తితో అడ్డగించాడు. ‘నీ దగ్గరున్న ధనంతీసివ్వు’ అన్నాడు. రమణయ్య గజగజ వణుకుతూ ‘అయ్యా! నా దగ్గర ధనం లేదు.మా అమ్మాయి పెళ్ళి ఉంది. నగలు కొని తెస్తున్నాను. అవిలేకుంటే పెళ్ళి ఆగిపోతుంది. దయవుంచి నన్ను వదిలేయండి. మీకు పుణ్యమొస్తుంది’ అని ప్రాధేయపడ్డాడు. దొంగ తనపంట పండిందని సంతోష పడుతూ ‘నువ్వు ప్రాణాలతో వెళ్ళాలనుకుంటే నగలివ్వు. నువ్వు ఎంత ప్రాధేయపడినా నేను దయతో వదలను. నగలివ్వటంతప్ప నీకు మరో మార్గంలేదు’ అన్నాడు. రమణయ్య ఏడ్పు ముఖంతో వణికిపోతూ చొక్కాలోపల నడుముకు కట్టుకున్న నగల మూట తీసి దొంగ చేతిలో పెట్టాడు. వాడు సంతోషంపట్టలేక మూటవిప్పి చూశాడు. తళతళా మెరిసిపోతున్న పెళ్ళినగలను చూసి ఉక్కిరిబిక్కిరయ్యాడు.రమణయ్య దొంగతో ‘అయ్యా! ఓ చిన్నమాట చెబుతావినండి. నా ఇంటిపక్కనున్న గోవిందయ్య నాకు బద్ధశత్రువు. వాడికీ నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాడి కూతురికీ పెళ్ళి నిశ్చయమైంది. రేపు వాడు నగలకోసం పట్నం పోతున్నాడనే విషయం నా చెవినపడింది. రేపు వాడు నగలుకొని ఈ దగ్గరి దారిన రావచ్చు. వాడి నగలను కూడా తీసుకోండి. వాడి కూతురి పెళ్ళి కూడా ఆగిపోవాలి’ అన్నాడు.వీరయ్య సంతోషపడిపోయి ‘వాడి నగలను లాక్కుని నీకోరిక నెరవేర్చుతాను’ అన్నాడు.రమణయ్య ఇల్లు చేరుకున్నాడు. జరిగిన సంఘటనను భార్యతో చెప్పి ‘ఇలాంటి దొంగలుంటారనే నేను కొన్ని నకిలీ నగలను, బంగారు నగలను కొని నడుముకు కట్టుకున్నాను. వాడిని ప్రాధేయపడుతూభయం, ఏడ్పు నటిస్తూ వాడికి నకిలీ బంగారు నగలమూట తీసిచ్చాను.పెళ్ళి కోసం కొన్న బంగారు నగల మూట నా నడుముకు మరో వైపు భద్రంగా ఉంది’ అని చెప్పి తీసిచ్చి భద్రపరచమన్నాడు.వెంటనే ఇంటి నుండి బయటపడి రాజభటులను కలిసి, జరిగిన సంగతి చెప్పి, ‘గోవిందయ్య నాకు శత్రువని, రేపు నగలతో ఆ దారిన వస్తాడని దొంగకు కట్టుకథ చెప్పాను. మీరు అక్కడ కాపుకాస్తే గజదొంగ దొరుకుతాడు’ అని వివరించాడు.మరుసటిదినం భటులు ఆ దారిలో మాటు వేసి దొంగను బంధించారు. ఊరందరూ రమణయ్య ముందుచూపును, సమయస్ఫూర్తిని అభినందించారు. డి.కె.చదువుల బాబు -
ఐకమత్యం ∙ ఉండ్రాళ్ళ రాజేశం
కూడ్లేరు ఆటవిక ప్రాంతంలో చెట్లు దట్టంగా వుండేవి. పక్కన త్రివేణి సంగమంలాగా మూడు వాగుల కలయిక వల్ల చుట్టూ పచ్చని ప్రకృతితో పంటలతో అలలారుతుండేది. చెట్ల ఫలాలు, దుంపలు తింటూ కోతులు, కుందేళ్ళు, నెమళ్ళు, పక్షులు మొదలైనవి కలిసిమెలిసి నివసిస్తున్నాయి. ఒక్కరికి ఆపద కలిగినా పసిగట్టి స్నేహితులను రక్షించుకునేవి. రోజులు అన్ని అనుకూలంగా వుండవు అన్నట్లు ఒక రోజు అడవిలోకి సిద్దయ్య అనే వేటగాడు వచ్చాడు. వాడు జంతువులను కనికట్టు మాయతో పట్టుకోవడంలో సిద్ధహస్తుడు. శరీరానికి ఏవేవో రంగులతో అలంకరించుకొని చప్పుడు కాకుండా ఒక చెట్టు ఎక్కి కొమ్మపై పడుకున్నాడు. పూసుకున్న రంగులు కొమ్మలోనే కలిసిపోయాయి. వేటగాడు వచ్చాడన్న అలికిడి జంతువులకు తెలియకుండా వుంది. కుందేళ్ళు గుంపుగా పొదల్లోంచి వచ్చి చెట్ల కింద పడిన పండ్లను తినసాగాయి. మెల్లగా మెల్లగా వేటగాడు వున్న చెట్టు కిందికి వచ్చాయి. సిద్దయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా, దబ్బున చేతిలోంచి వలను విసిరాడు. కుందేళ్ళ గుంపు వలలో చిక్కుకుని, అసలేం జరిగిందో తెలుసుకునే లోపుగా వలలో చిక్కి దుఃఖించసాగాయి. వల నుంచి ఎంత గింజుకున్నా బయటకి వెళ్ళలేక పోతున్నాయి, భయపడసాగాయి. వేటగాడు ఆనందంతో కిందికి దిగసాగాడు. కాలు కింద పెడదామని బుస్సుమన్న శబ్దం విని కిందికి చూశాడు. పెద్ద నాగు బుసలు కొడుతూ వేటగాడి వైపు కోపంతో కోరలు చూపసాగింది. వేటగాడు దబ్బున చెట్టు ఎక్కి కిందికి చూశాడు. ఇంకో నాలుగు పాములు వచ్చి కుందేళ్ళ వలల చుట్టూ చేరాయి. కుందేళ్ళు వలలో చిక్కడం చూసి పక్షులు అరవసాగాయి. పక్షుల అరుపులో తేడాను గమనించిన జంతువులు పరుగున వచ్చాయి. వలలో చిక్కుకున్న జంతువులను చూసి దుఃఖిస్తూ, వేటగాడి వైపు కోపంగా చూడసాగాయి. వేటగాడు గుంపులుగా వున్న జంతువులని చూసి వణకసాగాడు. కోతుల గుంపు వేటగాడి చెట్టు నిండా చేరాయి. వల చుట్టూ చేరిన జంతువులు, పక్షులు కలిసి వలను సగము కొరికి వదిలిన చోట్ల ఎలుకలు పదునైన పళ్ళతో వలను పటపట తెంపసాగాయి. వేటగాడి గుండె గడబిడ కొట్టుకోగా కళ్ళు మూసుకున్నాడు. వలలోంచి బయటకు వచ్చిన కుందేళ్ళతో జంతువులు అడవిలోకి వెళ్ళాయి. వేటగాడు కళ్ళు తెరిచేసరికి అంతా నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా వుంది. నెమళ్లు పాములను తింటాయి. పాములు ఎలుకలను తింటాయి. అలాంటిది అన్నీ కలిసి కుందేళ్లను రక్షించడం తలచుకుని వేటగాడు తలదించుకున్నాడు. ఇంతటి ఐకమత్యంతో జీవిస్తున్న కూడ్లేరు జంతుజాలముకు నమస్కరించి.. సిద్దయ్య జంతువులను వేటాడటం మాని, వ్యవసాయ పనులు చేస్తూ జంతువులతో స్నేహంగా ఉండసాగాడు. -
ఎస్సారెస్పీ నీరొస్తోంది
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఆయకట్టు రైతులకు శుభవార్త. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో ఈ ఖరీఫ్‌లో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రుల బృందం నీటి విడుదలపై సానుకూల నిర్ణయం తీసుకుంది. నీటి విడుదలకు షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. భారీగా ప్రవాహాలు వస్తున్నందున ఒకట్రెండు రోజుల్లోనే ప్రాజెక్టు నుంచి నీరు విడుదలయ్యే అవకాశముంది. మూడు రోజుల్లో పూర్తిగా.. ఎస్సారెస్పీకి ఎగువన ఉన్న మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్, అంధురా ప్రాజెక్టుల నీటి మట్టాలు పూర్తిస్థాయికి చేరడం.. బాలేగావ్ నుంచి 1.98 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టుకు ఒక్కసారిగా ప్రవాహాలు పెరిగాయి. సాయంత్రానికి 2.68 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవడంతో ఎస్సారెస్పీలో నీటి నిల్వ 58 టీఎంసీలు (సామర్థ్యం 90 టీఎంసీలు) దాటింది. ఎగువన మహారాష్ట్రలోని గోదావరి పరీవాహకంలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో వరద స్థిరంగా కొనసాగే అవకాశం ఉం ది. అదే జరిగితే మూడు రోజుల్లో ప్రాజెక్టు నిండొ చ్చని నీటి పారుదల వర్గాలు అంచనా వేస్తున్నాయి. షెడ్యూల్ ఖరారుకు ఆదేశాలు ఎస్సారెస్పీ నిల్వలు పెరగడంతో మంత్రి హరీశ్‌రావు మంగళవారం జలసౌధలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఈఎన్సీ మురళీధర్, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఇరిగేషన్ ప్రత్యేకాధికారి కె.ప్రసాద్‌లతో సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం, ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి జలకళ సంతరించుకోవడం పట్ల మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కింద ఈ ఖరీఫ్‌కు నీరు విడుదల చేయాలని తీర్మానించారు. ప్రాజెక్టు కింది కాకతీయ, లక్ష్మీ కాలువలతో పాటు లక్ష్మీ కాంప్లెక్స్‌లోని చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్ కింది ఆయకట్టు.. సరస్వతీ కెనాల్ కాలువ, గుత్ప, అలీ సాగర్, ఐడీసీ ఆధ్వర్యంలో నడిచే 24 లిఫ్ట్‌ల పరిధిలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 58 టీఎంసీల నీరుందని, రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరొస్తోందని, ఈ ప్రవాహం మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఎస్సారెస్పీకి ఎగువన ఏయే ప్రాజెక్టుల్లోకి నీరు వస్తోంది, వర్షపాతం ఎలా ఉందో మంత్రులు ఆరా తీశారు. గ్రామాల్లో చాటింపు వేయించండి ఎస్సారెస్పీలో నీటి లభ్యత పెరిగిన దృష్ట్యా అందుకు అనుగుణంగా నీటి విడుదల ప్రణాళిక సిద్ధం చేయాలని ఈఎన్సీని మంత్రి హరీశ్ ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలని ఇంజనీర్లకు చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో ఇంజనీర్లు సమావేశాలు ఏర్పాటు చేసి నీటి విడుదల ప్రణాళికలు వివరించాలన్నారు. కాలువ పరిధిలోని రైతులకు నీటి విడుదల సమాచారం అందించేలా ఇంజనీర్లు, రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో చాటింపు వేయించాలన్నారు. నీరు విడుదల చేసే కాలువలను పటిష్ట పరచాలని, ఉపాధి హామీ పథకంలో భాగంగా పూడిక తీయాలని చెప్పారు. నీటి వృథా అరికట్టేందు కు టెయిల్ టు హెడ్, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి అవలంబించాలన్నారు. గత రబీలో ఈ పద్ధతి అమలు చేయ డం ద్వారా ఒక్క టీఎంసీ నీటితో 13 వేల నుంచి 14 వేల ఎకరాలకు నీరు ఇవ్వగలిగామని గుర్తుచేశారు. సాగర్‌లో 210 టీఎంసీలు నాగార్జునసాగర్‌కు కృష్ణా ప్రవాహం తగ్గింది. శ్రీశైలం నుంచి నీటి విడుదల తగ్గడంతో నిన్నమొన్నటి దాకా 2 లక్షలకు పైగా నమోదైన ప్రవాహం మంగళవారం సాయంత్రానికి 61 వేలకు పడిపోయింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం సాగర్‌లో 210 టీఎంసీల నీరుంది. అయితే ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి 1.60 లక్ష ల క్యూసెక్కుల ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటం, నిన్నటివరకు తగ్గిన తుంగభద్ర వరద మళ్లీ పుంజుకొని లక్ష క్యూసెక్కులకు పెరిగిన నేపథ్యంలో శ్రీశైలానికి మళ్లీ ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తు తం శ్రీశైలానికి 1.31 లక్షల ప్రవాహం వస్తుండగా 92 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కాంగ్రెస్ నేతల కళ్లలో కన్నీరు తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని.. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను సీఎం ప్రారంభించారని మంత్రులు చెప్పారు. సాగు ప్రాజెక్టుల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేసేం దుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో దేవుడూ కరుణించి చక్కగా వర్షం కురిపించడం వల్ల ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయని ఆనం దం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా గోదావరి బేసిన్లో నీరుంటే కృష్ణా బేసిన్లో ఉండేది కాదని.. కృష్ణాలో ఉంటే గోదావరిలో ఉండేది కాదని, కానీ రెండు బేసిన్లలోకి వరద నీరు రావడం, ప్రాజెక్టులు నిండటం తొలిసారని హరీశ్ అన్నారు. ప్రాజెక్టుల్లోకి నీరొస్తుంటే.. కాంగ్రెస్ నేతల కళ్లలో కన్నీరు వస్తోందని విమర్శించారు. -
ద్వీపకల్పాన్ని తలపిస్తున్న అశ్వారావుపేట
సాక్షి నెట్వర్క్: ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్తర తెలంగాణ ఉక్కిరిబిక్కిరవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రోజంతా ముసురేసింది. చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద రావడంతో గేట్లను ఎత్తివేశారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షం ధాటికి అనేక ఇళ్లు కూలుతుండగా, రవాణా వ్యవస్థ స్తంభించింది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు జన్నారం నుంచే రాకపోకలు సాగుతుండగా, బ్రిడ్జి లేకపోవడంతో జన్నారం మండలం కలమడుగు, ధర్మపురి మీదుగా 50 కిలోమీటర్ల దూరం తిరిగి వాహనాలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జన్నారం మండలం చింతగూడలో ఇల్లు కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఇందన్పల్లి వంతెన అప్రోచ్ రోడ్డు వద్ద ఆదివారం బురదలో దిగబడిన వ్యాన్ సోమవారం వరద ఉధృతికి కొట్టుకుపోగా, పోలీసులు క్రేన్ తెప్పించి బయటకు తీశారు. ఆసిఫాబాద్‌లోని అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, వివేకానందచౌక్ జలమయమయ్యాయి. గుండి వాగు, పెద్దవాగు, తుంపెల్లి ఒర్రె పొంగిపొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లాలో కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులకు భారీ వరద రావడంతో గేట్లు ఎత్తివేశారు. సారంగాపూర్ మండలంలోని ధని కొత్త చెరువు అలుగులో నుంచి 20 గేదెలు కొట్టుకుపోగా, అందులో 17 మృత్యువాతపడ్డాయి. మామడ మండలంలోని గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ వద్ద మట్టి కట్ట, బిగించడానికి సిద్ధంగా ఉంచిన గేట్లు కొట్టుకుపోయాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 3 రోజులుగా వరద నీటిలోనే ఉంది. దుబార్పేట్ గ్రామం వరద నుంచి తేరుకోలేదు. 300 మందికి మండల కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్లోని రైతు విశ్రాంతి భవనంలో ఆశ్రయం కల్పించారు. గిరిజన గురుకుల పాఠశాలలో భారీగా వరద నీరు చేరడంతో 800 మంది విద్యార్థినులకు మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. కుంటాల జలపాతం వద్ద ఏర్పా ట్లు చేసిన బారికేడ్లు వరదకు కొట్టుకుపోయాయి. ద్వీపకల్పాన్ని తలపిస్తున్న అశ్వారావుపేట అశ్వారావుపేట ప్రాంతం ద్వీపకల్పాన్ని తలపిస్తోంది. రెండువైపులా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరు పాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం మండలం గంగోలు వద్ద రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులను నిలిపేశారు. కాళేశ్వరం వద్ద 8 మీటర్ల ఎత్తులో ప్రవాహం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద, వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి మళ్లీ పెరుగుతోంది.కాళేశ్వరం వద్ద సోమవారం సాయంత్రం 8 మీటర్ల ఎత్తులో ప్రవాహం వెళ్తోంది. అన్నారం వద్ద లక్ష క్యూసెక్కుల వరద తరలిపోగా, కాళేశ్వరం వద్ద 3.50 లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వైపునకు వెళ్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వాజేడు మండల పేరూరు వద్ద 11.67 మీటర్ల ఎత్తున గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఆదివారం 7 మీటర్ల వరకే ఉన్న గోదావరి ప్రవాహం సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో 8.4 మీటర్లకు పెరిగింది. పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద భారీగా వస్తుండటంతో ఆదివారం రాత్రి 10 గంటల వరకు 33.125 టీఎంసీలుగా ఉన్న నీటి మట్టం సోమవారం రాత్రి 7 గంటల వరకు 34.827 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 70,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,090 అడుగుల (90.138 టీఎంసీలు)కుగాను సోమవారం రాత్రి ఏడు గంటలకు వరకు 1072.80 అడుగులు (34.827 టీఎంసీలు)కు చేరుకుంది. నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 480 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి గోదావరిఖని: భారీ వర్షాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలచింది. మట్టి వెలికితీత పనులు ముందుకు సాగడం లేదు. రామగుండం రీజియన్‌లో 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. తాలిపేరు, కిన్నెరసానికి వరద తాలిపేరు, కిన్నెరసాని జలాశయాల్లోకి భారీగా వరదనీరు వస్తోంది. తాలిపేరు జలాశయం పూర్తిగా నిండింది. దీంతో మొత్తం 25 గేట్లు ఎత్తి 1,72,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 1,77,000 క్యూసెక్కులుగా ఉంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం నీటిమట్టం 407 అడుగులు కాగా 403.60 అడుగుల మేర నీరుంది. ఇన్‌ఫ్లో 35,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 30,000 క్యూసెక్కులు ఉంది. భద్రాచలం వద్ద గోదావరి 44.5 అడుగుల నీటి మట్టంతో ప్రవహిస్తోంది. భద్రాచలంలోని అశోక్ నగర్‌కాలనీలో సుమారు 30కి పైగా ఇళ్లలోకి వరదనీరు చేరడంతో వారిని పునరావాస శిబిరానికి తరలించారు. వాగులో పురిటినొప్పులతో... మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామ సమీపంలోని కత్తెర్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటినొప్పులు రాగా గ్రామస్తులు వాగు దాటించి 108 అంబులెన్స్ ఎక్కించారు. భద్రాద్రి జిల్లా అతలాకుతలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతలాకుతలం అవుతోంది. అనేకచోట్ల రోడ్లు మునిగిపోవడం, కోతకు గురికావడంతో వందకుపైగా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3,465.2 హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 35 హెక్టార్లలో ఇసుక మేటలతో ఆయా రైతులు నష్టపోయారు. -
సాగుకు నీళ్లు నిల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్ ఆయకట్టుకు ఇప్పటికిప్పుడు నీటి విడుదల సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ (శివమ్) తేల్చి చెప్పింది. ప్రధాన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి లభ్యత లేకపోవడం, లభ్యతగా ఉన్న కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన దృష్ట్యా ఖరీఫ్‌లో నీరివ్వడం కష్టమని స్పష్టం చేసింది. ముఖ్యంగా నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల్లోకి పెద్దగా ప్రవాహాలు లేకపోవడం, నిల్వలు ఆశించిన స్థాయిలో లేని దృష్ట్యా వాటి కింది ఆయకట్టుకు నీటి విడుదల చేయరాదని నిర్ణయించింది. జూరాల, కడెంలలో నీటి నిల్వలు ఉండటంతో ఇక్కడ ఆయకట్టుకు నీరిచ్చేందుకు కమిటీ అంగీకరించింది. వరద జలాలపై ఆధారపడ్డ కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ల కింది ఆయకట్టుకు వరద నీటి లభ్యత ఉంటే ఆయకట్టుకు నీరిచ్చుకునేందుకు అంగీకరించింది. తొలి ప్రాధాన్యం తాగునీటికే... రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు గురువారం నీటిపారుదలశాఖ శివమ్ కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రత్యేకంగా భేటీ అయింది. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్‌కుమార్‌లతోపాటు అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. మిషన్ భగీరథ కింది తాగు అవసరాలు, కనీస నీటిమట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలపై భేటీలో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వం మిషన్ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా, ఆ అవసరాల మేరకు ప్రాజెక్టుల పరిధిలో కనీస నీటిమట్టాలను నిర్వహించాల్సిందేనని ఈఎన్సీలు స్పష్టం చేశారు. ఎక్కడైనా కనీస నీటిమట్టాల నిర్వహణలో విఫలమైనట్లు సమాచారం అందింతే నోటీసులు ఇవ్వకుండానే సంబంధిత ఈఈలను సస్పెండ్ చేసి పెనాల్టీలు విధించేలా ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్లలో 60 టీఎంసీల అవసరం ఉంటుందని, వాటిని పక్కన పెట్టాకే ఖరీఫ్ ఆయకట్టు అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదల కోసం రైతులు చేస్తున్న అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుతం ఎస్సారెస్పీ కింద పూర్తిస్థాయి ఆయకట్టు 9.68 లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే 72 టీఎంసీల మేర అవసరం ఉండగా లభ్యత జలాలు మాత్రం 15.93 టీఎంసీలే ఉన్నాయి. ఇందులో 6.5 టీఎంసీల మేర భగీరథకు పక్కన పెట్టడంతోపాటు డెడ్ స్టోరేజీ, ఆవిరి నష్టాలు పక్కనపెడితే మిగిలే 5 టీఎంసీలతో కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కెనాల్ పరిధిలో సర్దుబాటు చేయడం కష్టమని ప్రాజెక్టు అధికారులు వివరించారు. గతేడాది ఖరీఫ్‌లో పంటలకు అధికారికంగా నీటి విడుదల జరగలేదు. అయితే చెరువులు నింపేందుకు మాత్రం ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో గరిష్టంగా 8 టీఎంసీలను విడుదల చేయగా మిడ్ మానేరును నింపేందుకు మరో 10 టీఎంసీలను విడుదల చేశారు. ప్రవాహాలు వచ్చేదాకా అంతే... నాగార్జున సాగర్, సింగూరు, నిజాం సాగర్ల కింద సైతం ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు వచ్చే వరకు ఆయకట్టుకు నీటి విడుదల అంశాన్ని పక్కనపెట్టాలని కమిటీ నిర్ణయించింది. సింగూరులో 29.9 టీఎంసీల నిల్వలకుగాను ప్రస్తుతం 7.57 టీఎంసీలే ఉండగా ఇక్కడ భగీరథకు 5.7 టీఎంసీలు పక్కనపెట్టాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అదిపోనూ మిగిలేది ఏమీ లేనందున ప్రాజెక్టు కింది 40 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం లేదని కమిటీ తేల్చింది. దీంతోపాటే సింగూరు దిగువన ఉన్న ఘన్పూర్ ఆయకట్టుకు 40 వేల ఎకరాలకు నీరివ్వడం కష్టమని కమిటీ అభిప్రాయపడింది. నిజాం సాగర్‌లోనూ ప్రస్తుతం 17 టీఎంసీలకుగాను 2.37 టీఎంసీల నిల్వ ఉండగా ఇక్కడ 2.08 లక్షల ఆయకట్టుకు 22 టీఎంసీలు అవసరం ఉందని, అయితే ప్రస్తుత లభ్యత తక్కువగా ఉండటంతో ఈ ఆయకట్టుకు నీరివ్వలేమని తెలిపింది. నాగార్జున సాగర్ కింద 6.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే 54 టీఎంసీలు అవసరమని ప్రాజెక్టు అధికారులు కమిటీకి వివరించారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిలో తెలంగాణకు దక్కే వాటా 43 టీఎంసీలుగా ఉందని, ఇందులో సాగర్ కింద ఏడాదంతా తాగునీటికే 41 టీఎంసీలు అవసరం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సాగర్ కింది ఆయకట్టుకూ నీటి విడుదల సాధ్యం కాదని కమిటీ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్లలో ప్రవాహాలు వస్తే ఖరీఫ్ ఆయకట్టుకు నీటి విడుదలపై మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిటీ తెలిపింది. -
సాగని సాగు.. జాడలేని వానలు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : అప్పులు చేసి పంటలు వేసినవారు కొందరు.. ఈ ఏడాదైనా కష్టాల నుంచి గట్టెక్కాలని దుక్కి దున్నినవారు ఇంకొందరు.. ఎకరాలకొద్దీ కౌలుకు తీసుకొని విత్తు వేసిన వారు మరికొందరు.. చినుకు జాడ లేకపోవడంతో ఇప్పుడు వీరందరికీ కంటిమీద కునుకు లేదు! నేలను నమ్ముకొని నింగివైపు ఆశగా చూస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. జూన్ చివరి వారంలో కురిసిన వర్షాలతో పంటలు సాగు చేసిన అన్నదాతలు తలలు పట్టుకున్నారు. మరో 10 రోజులు ఇలాగే వర్షాలు పడకుంటే పంటలపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల వర్షాల్లేక మొలకెత్తిన విత్తనాలు మాడిపోయాయి. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ మినహా దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అందిన కాడికి అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులు విలవిల్లాడుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పత్తికి ట్యాంకర్లతో నీళ్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 56 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అత్యధికంగా 35 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా.. 5.78 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. చెరువులు నిండి బావులు, బోర్లలోకి నీరు వస్తుందని భావించిన రైతుల ఆశలు గల్లంతయ్యాయి. మరో పది రోజులపాటు వర్షాలు కురవకపోతే పత్తి, మొక్కజొన్న, పసుపు వంటి వాణిజ్య పంటల పరిస్థితి దారుణంగా మారుతుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో వరి కోసం నారుమళ్లు పోసిన రైతులు ఇప్పటిదాకా నాట్లు వేయలేదు. నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో నారుమళ్లు ఎండిపోయాయి. ఈ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. వనపర్తి జిల్లాలో గడచిన ఏడాది ఇదే సమయానికి 2.11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తే ఈ ఏడాది కేవలం 40 వేల ఎకరాల్లోనే సాగయ్యాయి. కొందరు రైతులు ట్యాంకర్లతో నీటిని తీసుకెళ్లి పత్తి మొక్కలకు బకెట్ల ద్వారా నీటిని పోస్తున్నారు. ‘‘మరో వారం రోజుల్లో ఓ మోస్తరు వర్షం అయినా కురవకపోతే పరిస్థితి కష్టంగా ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ విభాగం చెప్పడం వల్ల కూడా రైతులు ఉత్సాహంగా పంటలు సాగు చేశారు. ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. పంటలు ఎండిపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలి’’అని వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అన్నారు. తాజా పరిస్థితిపై సీఎంకు లేఖ రాస్తానని, వనపర్తి జిల్లాలో మంచినీటికి కూడా సమస్యగా ఉందని సాక్షి ప్రతినిధితో చెప్పారు. వరి మరీ దారుణం రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే వరి పరిస్థితి ఈసారి దారుణంగా ఉంది. గడచిన ఏడాది ఇదే సమయానికి సాగు చేసిన దానికన్నా 25 శాతం అధికంగా వరి వేశారు. కానీ వానల్లేక పలుచోట్ల నారుమళ్లు ఎండిపోతున్నాయి. వర్షాలు బాగా పడతాయని ఆశించి గ్రామాలకు వచ్చిన వలసదారులు ఉపాధి కోసం మళ్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ‘‘నాకు 2 ఎకరాల భూమి ఉంది. ముంబైలో కూలీ పని చేస్తా. మంచి వర్షాలు కురుస్తాయంటే వరి పండించుకుందామని వచ్చి నారుమడి పోశా. కానీ వానల్లేక ఎండిపోయింది. రూ.14 వేలు నష్టపోయా. మళ్లీ ముంబై వెళ్లక తప్పడం లేదు’’అని మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం నాయినోనిపల్లికి చెందిన అంజయ్య ఆవేదన చెందాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతాల్లో వరి నారుమళ్ల దశలోనే ఎండిపోయినట్టు వ్యవసాయ శాఖకు ప్రాథమిక సమాచారం అందింది. -
రైతు జేబు నింపేందుకే పంటకాలనీలు: పోచారం
సాక్షి, హైదరాబాద్: రైతు జేబు నింపేందుకే పంట కాలనీలను ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఇబ్రహీంపట్నం పంట కాలనీలోని 38 గ్రామాల రైతులతో సోమవారం ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రైతు జేబు, వినియోగదారుడి కడుపు నిండటానికే కాలనీల ఏర్పాటన్నారు. రాష్ట్రంలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామన్నారు. కానీ రాష్ట్ర జనాభాకు అవసరమైన కూరగాయలలో 50 శాతం మాత్రమే స్థానికంగా పండుతున్నాయన్నారు. రాష్ట్రంలోని 3.52 కోట్ల జనాభాకు 38.54 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం కాగా 19.54 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన కూరగాయలు మన రైతులే పండించాలి, లాభాలు గడించాలి, వినియోగదారులకు తాజాగా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్ నగరంలో కోటి మందికి పైగా నివసిస్తున్నారు. వీరందరికి తాజా కూరగాయలు అందించడానికి నగరం చుట్టూ పంట కాలనీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఇబ్రహీంపట్నంను ఎంచుకున్నామన్నారు. ప్రతి జిల్లా కేంద్రం, మున్సిపాలిటీల చుట్టూ 20 నుండి 30 కిలోమీటర్ల ప్రాంతాలలో పంట కాలనీలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలలో నివసించే ప్రజలకు అవసరమైనంత మేర కూరగాయలను రైతులతో ఉత్పత్తి చేయిస్తామన్నారు. ప్రతి మొక్క ఉత్పత్తికి 70 పైసల ఖర్చు అవుతున్నా ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, ఇతరులకు 10 పైసలకే అందిస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడు తూ జనాభాలో మూడో వంతు హైదరాబాద్ నగరంలోనే నివసిస్తున్నారన్నారు. స్థానిక జనాభాకు అనుగుణంగా, అవసరమైన పంటలు పం డించాలన్నారు. ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ సాగు .. మేల్కొంటే బాగు
గుమ్మఘట్ట: జూన్ మొదటి వారం నుంచి ఖరీఫ్ ఆరంభం అవుతుంది. ఈ ఏడాది ముందస్తుగా రుతుపవనాలు వస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఖరీఫ్‌లో ఏ భూముల్లో ఎలాంటి పంటలు వేయాలి. ఎరువులు, పంటల యాజమాన్యం, దుక్కులు దున్నడం తదితర అంశాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెపుతున్నారు. భూసారాన్ని బట్టి పంట ఖరీఫ్ ముందే ప్రతి రైతు తమ భూమిలో భూసార పరీక్ష చేయించుకుంటే బాగుంటుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. భూ సారాన్ని బట్టి అనుకూలమైన పంటలను మాత్రమే వేసుకోవాలి. దీని వల్ల రైతులకు పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతోంది. భూసారానికి అనుగుణంగా ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించాలి. దీంతో భూసారం పాడవుకుండా ఉంటుంది. భూసార పరీక్ష ద్వారా భూమిలో ఉన్న పోషక స్థాయిని తెలుసుకోవచ్చు. భూమిలో ఏ పంటలు వేస్తే అధిక దిగుబడి వస్తుందో తెలుస్తుంది. చౌడు నేలల్లో ఉన్న ఆమ్ల, క్షార నేలలను తెలుసుకుని భూమిని సరిదిద్దుకోవచ్చు. పత్తి సాగు చేసే రైతు తన భూమిలో పంట మార్పిడి చేయాలి. నాలుగు ఎకరాల్లో పత్తి వేస్తారనుకుంటే ఎకరంలో పత్తివేసి మిగత మూడు ఎకరాల్లో ఇతర పంటలు వేసుకోవడం మంచిది. ఆశించిన స్థాయిలో పంటలు పండాలని రైతులు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. గుమ్మఘట్ట మండల వ్యాప్తంగా 14 వేల హెక్టార్లలో వేరుశనగ సాగయ్యే అవకాశం ఉంది. మోతాదులోనే ఎరువులు వాడాలి ఎరువుల యాజమాన్య పద్ధతులను రైతులు సరిగ్గా పాటించాలి. భాస్వరం, ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. నత్రజని, ఎరువులను విడతల వారీగా వేసుకోవాలి. పంటకు వేయాల్సిన పొటాషియాన్ని సగం దుక్కితో వేయాలి. సగం పంటకు వేయాలి. యూరియాను నేరుగా కాకుండా వేప పిండితో గానీ, బంక మట్టితో గానీ కలిపి వేయాలి. ఇలా చల్లుకున్నట్లయితే యూరియా ఆవిరికాకుండా ఉండడంతో పాటు 100 శాతం పంటకు ఉపయోగపడుతుంది. వరికి, పత్తికి రెండో విడతగా భాస్వారాన్ని అసలు వాడకూడదు. – ఆంజినేయులు, వ్యవసాయ విస్తరణ అధికారి, గుమ్మఘట్ట సేంద్రియం మంచిది జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ పథకం ద్వారా భూసార పరీక్షలు నిర్వహిస్తే భూమిలో సేంద్రియ పదార్థాం తక్కువగా ఉందని తెలిసింది. ఇది ప్రమాదకర పరిస్థితులకు సంకేతం. ఇప్పటికైనా ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవాల్సిందే. ఎక్కువగా రసాయన ఎరువులు వాడటం వల్ల పంటల దిగుబడిలో పలు సమస్యలు ఎదురవుతాయి. పశువుల ఎరువులు, వర్మీకంపోస్టు ఎరువుల ద్వారా భూసారం పెరగడంతో పాటు నాణ్యమైన దిగుబడిని కూడా సాధించవచ్చు. రైతుకు సరిపడ విత్తనాలు సబ్సిడీ పంపిణీ చేసేందుకు సిద్ధం చేశాం. – రంగనేతాజీ, ఏఓ, గుమ్మఘట్ట -
వంట పండింది
బీడు భూములు ఆవురావురుమంటుంటే రైతుల కడుపులు సెగలు కక్కవా?!గుండె.. కుంపటి మీద ఉన్నట్లుండదా?!జీవితం.. వంటచెరకులా కాలిపోదా?!కానీ నందిపాడు రైతులు..కడుపు సెగలను, గుండె మంటలనువంటసేద్యంగా మార్చుకున్నారు!పంట పొమ్మంటే వంట రమ్మంది. నీరు లేక పంట ఎండితే మంట మీద వంట పండింది. పదిమందికి పట్టెడన్నం పెట్టే అన్నదాత రైతు. అలాంటి అన్నదాత నేడు ఆకలితో అలమటిస్తున్నాడు! పండించిన పంటలకు ధరలు లేక, పంటసాగుకు నీరులేక ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపుతున్నాడు. ఆ పంటలకు కూడా గిట్టుబాటు లేక ఇక్కట్లు పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవించడం కష్టమని భావించిన నందిపాడు గ్రామంలోని రైతులు చేతిలోని నాగలి వదలలేక, తరతరాలుగా వస్తున్న భూమిని పోగొట్టుకోలేక జీవనం సాగించేందుకు ఇతర మార్గాలను అన్వేషించారు. చివరకు ప్రత్యామ్నాయంగా వంట చేయడంపై దృష్టి సారించారు! అలా ఈ రైతులు జీవనోపాధి కోసం చేస్తున్న వంట పనులు ఇప్పుడు గ్రామంలోని అందరికీ బతుకు బాట వేశాయి. నేడు గ్రామంలో సుమారు 150 మందికి పైగా వంటను తమ వృత్తిగా మార్చుకున్నారు. కృషి, పట్టుదల ఉంటే కష్టాలను గట్టెక్కవచ్చని నిరూపించి ఒక వైపు పొలంలో సాగుచేస్తూనే, మరోవైపు వంటలో ప్రావీణ్యం పొంది అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నందిపాడు గ్రామంలోని రైతులు. కడప జిల్లా ఖాజీపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం నందిపాడు. 83 పక్కాగృహాలు ఉన్నాయి. 737 మంది జనాభా. సుమారు 160 ఎకరాల సాగుభూమి ఉంది. అంతా చిన్నకారు రైతులే. కేసీ కాలువ నుంచి నీరు వస్తుంది. అయితే ఈ గ్రామం చివరి ఆయకట్టు అయినందున కాలువకు నీరు సక్రమంగా రాదు. గ్రామ సమీపంలో చెరువు ఉన్నప్పటికీ ఆ చెరువుకు కేసీ కాలువ నీరు వచ్చేందుకు అధికారిక తూము లేదు. భూమాయపల్లె కాలువ నుంచి వచ్చే నీరు ఆ చెరువుకు వస్తుంది. కేసీ కాలువకు నీరు సక్రమంగా అందితే అందరూ వరి సాగుచేస్తారు. లేకపోతే పత్తి పంట వేస్తారు. సాగు నుంచి వంట వైపు వ్యవసాయం రైతుల కన్నీటి కష్టాలు తీర్చడంలేదు, ఏం చేయాలి? అని రైతులు ఆలోచిస్తున్న తరుణంలో అదే గ్రామంలో ఉన్న నారాయణ అనే వ్యాపారి ఉపాధి కోసం వంటమాస్టర్ల దగ్గర సహాయకుడిగా పని చేసేవాడు. అలా తన వెంట ఆయన కొందరు గ్రామస్తులను వంట సహాయకులుగా తీసుకెళ్లాడు. అలా వెళ్లిన వారు ఐదేళ్ల తర్వాత మెల్లగా పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించారు. వంట మాస్టర్లుగా మారారు! సొంతంగా వివాహాలతోపాటు ఇతర శుభకార్యాలు, డిన్నరు,్ల క్యాటరింగ్ కాంట్రాక్టులు, ఉత్సవాలకు ఒప్పందాలు చేసుకోవడం ప్రారంభించారు. వారి కింద కూడా వంట చేసేందుకు వెళ్లిన వారు కొద్దికాలానికి తిరిగి వంట మాస్టర్లుగా మారారు. ఇలా గ్రామంలో ఇప్పుడు సుమారు నూటాయాభై మంది వంట చేసేందుకు వెళుతున్నారు. వీరిలో ఇరవై మంది వరకు వంటమాస్టర్లు ఉన్నారు. ఒక్కొక్క వంట మాస్టర్ చేతి కింద పదిమంది సహాయకులు ఉంటారు. వంటలు చేయడంతోపాటు భోజనాలు వడ్డించేందుకూ వారు వెళుతుంటారు. అలా గ్రామంలోని వారందరికీ వ్యవసాయంతోపాటు అదనపు ఉపాధి వంట చేయడం వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపింది. విద్యార్థులు సైతం గ్రామంలో ఉన్న విద్యార్థులు కూడా వంట చేయడంలో ప్రావీణ్యం సాధిస్తున్నారు. గ్రామంలో చాలా మంది వంటలకు వెళుతుండటంతో విద్యార్థులు కూడా వారిని అనుసరిస్తున్నారు. వారిలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారు కూడా పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వడ్డించేందుకు వెళుతుంటారు. రోజుకు రూ 350 నుంచి 400 సంపాదిస్తున్నారు. వీళ్లలో కూడా వంట మాస్టర్లు అయినవారున్నారు. నందిపాడు వంటలు ‘ఆహా ఏమి రుచి .. తినరా మైమరచి..’ అన్నట్లుగా ఉంటాయి.. నందిపాడు వంట మాస్టర్లు వండిన వంటలు. శాకాహారంలోని అన్ని రకాల వంటలు, అలాగే ఉదయం టిఫిన్‌లో అన్ని రకాలు, మాంసాహార వంటలు కూడా భలే రుచిగా ఉంటాయని సమీప జిల్లాల్లో సైతం పేరు తెచ్చుకున్నారు. గతంలో ఖాజీపేట మండలంలోని వివాహాలకు మాత్రమే పరిమితమైన వారు ఇçప్పుడు జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి వంటలు చేయడం మొదలు పెట్టారు. ఎక్కడ వంటలు చేసినా అక్కడ మన్నన పొందుతున్నారు. ఇలా నందిపాడు గ్రామంలోని వారు వ్యవసాయ వృత్తిని వదలకుండానే, వంట చేస్తూ తాము జీవిస్తూ ఇతరులకు జీవనోపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. హెల్పర్‌గా వెళ్లి మాస్టర్ని అయ్యా నాకు ఎకరా 50 సెంట్ల భూమి ఉంది. పంట సాగుచేసినా కుటుంబ ఖర్చులకు సరిపోవడంలేదు. దీంతో 1998 లో వంటమాస్టర్లకు హెల్పర్‌గా వెళ్లాను. ఆరేళ్లు పని నేర్చుకున్న తరువాత 2004 నుంచి నేను వంటలు చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లో కూడా వంటలు చేస్తున్నాం. నాతోపాటు, నా దగ్గర పనిచేస్తున్న చాలామందికి ఉపాధి కలుగుతోంది. – తాటిగొట్ల నాగసేనారెడ్డి, వంటమాస్టర్ చదువుకుంటూనే వంటకు వెళ్లా డిగ్రీ ఇటీవలే పూర్తి చేశాను. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి వంట మాస్టర్లకు సహాయకుడిగా వెళ్లేవాడిని. అలా నాలుగేళ్లు పనిచేశాను. తర్వాత వంటమాస్టర్‌గా మారి, వివాహాలకు, శుభకార్యాలకు వంట చేస్తున్నా. ఇక్కడ నిలదొక్కుకున్నాక మాకున్న ఎకరా భూమితోపాటు మరో 3 ఎకరాలు గుత్తకు తీసుకుని సాగు చేస్తున్నాను. – నాగముని, పట్టభద్రుడు ఫీజుకు, ఖర్చులకు పనికొచ్చింది ఎస్వీ కాలేజీలో ఈకామ్ సెకండియర్ చదువుతున్నాను. ఖాళీ దొరికితే మా గ్రామంలోని వంట మాస్టర్లకు సహాయకునిగా వెళుతున్నాను. అలా వచ్చిన డబ్బుతో నా ఫీజులు నేనే కట్టుకుని, నా ఖర్చులు అన్నీ నేను పెట్టుకుంటున్నాను. ఇలా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాను. మంచి వంటమాస్టర్ కావాలన్నదే నాప్రయత్నం.. – నవనీశ్వర్, విద్యార్థి ధర లేకే దారి మార్చాను నాకున్న 2 ఎకరాల పొలం లో ఇటీవలే పత్తిపంట సాగుచేస్తే ధర లేక పూర్తిగా నష్టపోయాను. అందుకే మా గ్రామంలో వంటలు చేసేవాళ్లతో వెళ్లి, నేనూ వంట చేయడం నేర్చుకున్నాను. ఐదేళ్ల నుంచి వంటమాస్టర్‌గా చేస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు పది మంది పనిచేస్తున్నారు. – ఎన్. సుబ్బారెడ్డి, రైతు చదువుతోపాటు పార్ట్ టైమ్‌గా ఖాజీపేట డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను. మాగ్రామంలోని వారందరూ వంట మాస్టర్ల కింద పనిచేయడంతోపాటు వడ్డించేందుకు వెళుతుంటారు. నేను కూడా వెళుతున్నాను. పని ఏదైనా సంతోషంగా చేయడం ముఖ్యం. వ్యవసాయం చేస్తూనే, వంట కూడా నేర్చుకున్నాను. – నాగేశ్వర్, విద్యార్థి -
పంటలకూ వడదెబ్బ!
పంటకు చీరల పందిరి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన మురహరినాయుడు అనే రైతు తనకున్న 3 ఎకరాల్లో టమాట పంట సాగు చేశాడు. అయితే ఎండల తీవ్రతకు పంట ఎండిపోతుంటే దానిని కాపాడుకునేందుకు పాత చీరలను సేకరించి వాటితో పందిళ్లు వేశారు. ఇందుకోసం మురహరి రూ.35 వేలు ఖర్చు చేశారు. – కనగానపల్లి సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మండిపోతున్న ఎండలకు ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పంటలు కమిలిపోకుండా పందిర్లు వేస్తున్నారు. ఉష్ణతాపానికి మొక్కలు ఎండిపోకుండా చెట్టు చుట్టూ ఈత మట్టలు, తాటిమట్టలు, వరిగడ్డి, జొన్న దంట్లు లాంటివి కప్పుతున్నారు. రెండు రోజులకే వాడుముఖం పెరిగిన ఎండలతో వడదెబ్బ ప్రభావం పైర్లకు కూడా తప్పడంలేదు. టమాటా, మిరప, బెండ, గోరుచిక్కుడు తోటలు నీటి తడిపెట్టిన రెండు రోజులకే వాడిపోతున్నాయి. భూమి వేడెక్కుతున్నందున నీటి తడులు పెట్టిన రెండు రోజులకే పైర్లు వాడుముఖం పడుతున్నాయి. తర్భూజ, దోస, కర్భూజ కాయలు తోటల్లోనే కమిలిపోతున్నాయి. వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో ఎండ నుంచి రక్షణ కోసం అరటి గెలలకు పాత గోనె సంచులు, ఎండిన అరటి ఆకులను చుట్టూ కప్పుతున్నారు. అలాగే సూర్యప్రతాపం నుంచి ప్రయాణికులకు రక్షణ కోసం ఆర్టీసీ బస్సుల్లో కిటికీలకు గడ్డి, వట్టి వేళ్లతో పరదాలు అమర్చారు. అలాగే ‘గతంతో పోల్చితే విజయవాడ, గుంటూరు ప్రాంతంలోని వాతావరణంలో మార్పు వచ్చింది. పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన 33 వేల ఎకరాలను రాజధాని కోసం తీసుకుని చెట్లను నరికి బీడుగా మార్చిన ప్రభావం పడినట్లుంది’ అని విజయవాడకు వరప్రసాద్నాయుడు పేర్కొన్నారు. -
మాయాజాలం
భీమవరం : వరి సాగులో ఖర్చును తగ్గించడానికి యాంత్రీకరణ విధానం అమలు చేస్తూ సబ్సిడీపై ఇస్తున్న వరి కోత యంత్రాలను గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసుకుని రైతుమిత్ర బృందాలు దిగమింగుతున్నాయి. దీంతో రైతులకు యంత్రాలు అందుబాటులో లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యంత్రాలకు అధికమొత్తం చెల్లించి మాసూళ్లు పూర్తి చేసుకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ప్రమేయం, అధికారుల ముడుపులు, లబ్ధిదారుల అత్యాశ కారణంగా రైతులకు మేలు చేయాల్సిన యాంత్రీకరణ వ్యవహారం నిరుపయోగంగా మారుతోంది. ఇప్పటికే సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో రైస్‌మిల్లర్లు, రొయ్యలు, చేపలు చెరువుల యజమానులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చోటు లభించగా ప్రస్తుతం డెల్టా ప్రాంతంలో దాళ్వా వరికోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో వరికోత యంత్రాలు మాయం కావడం చర్చనీయాంశమైంది. ప్రధానంగా వరిసాగులో ప్రకృతి వైపరీత్యాలు రైతులను అతలాకుతలం చేయడం, గిట్టుబాటు ధరలేకపోవడం, సాగుఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో జిల్లాలోని ఎక్కువమంది భూస్వాములు తమ పంట భూములను కౌలుకు ఇస్తుండగా మరికొంతమంది సారవంతమైన పంట భూములను రొయ్యలు, చేపలు చెరువులుగా మార్పు చేస్తున్నారు. పెరిగిన కౌలు రైతుల సంఖ్య జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు పైగా సాగుచేయాల్సి ఉండగా అత్యధికంగా భూస్వాములు తమ భూములను కౌలుకు ఇవ్వడంతో జిల్లాలో దాదాపు మూడు లక్షలకు పైగా కౌలు రైతులే వరి సాగు చేస్తున్నారు. కౌలుదారులు తమ కుటుంబం మొత్తం సాగులో లీనమైనప్పటికీ ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పెట్టుబడులు పెరిగి నష్టాలు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వం సాగును యాంత్రీకరణ బాట పట్టిస్తే ఖర్చులు తగ్గి రైతులకు ప్రయోజనం కలుగుతుందని అనేక వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. దీనిలో భాగంగానే రైతులకు పొలాల్లో పురుగుల మందులు పిచికారీ చేయడానికి స్పేయర్లు, టార్పలిన్లు, జింకు సల్ఫేట్, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మాసూళ్లు సమయంలో వాతావరణం భయపెట్టడంతో రైతులు ఎక్కువగా వరి కోతయంత్రాలపైనే ఆధారపడుతున్నారు. లబ్ధిదారుల ఎంపికలో మాయాజాలం ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యంత్రపరికాల పంపిణీలో అధికారులు లబ్ధిదారుల ఎంపికలో మాయాజాలం సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరిసాగు చేసేది ఎక్కువగా కౌలు రైతులే అయినప్పటికీ సబ్సిడీ మాత్రం భూస్వాములు దక్కించుకుంటున్నారు. గతేడాది రూ.రెండు లక్షల సబ్సిడీతో పంపిణీ చేసిన ట్రాక్టర్లు ఎక్కువగా రైస్‌మిల్లర్లు, రొయ్యలు, చేపల చెరువుల యజమానులు, కొంతమంది ప్రజాప్రతినిధులు దక్కించుకున్న వైనం తెలిసింది. -
పొలం ఎండింది.. గుండె ఆగింది
ఇందల్వాయి/చండూరు(మునుగోడు)/సిద్దిపేట రూరల్: అప్పుల బాధలు తాళలేక ఇద్దరు రైతులు వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకున్నా రు. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో పంట ఎండిపోవడంతో గుండెపోటుతో పెద్ద గంగారాం అనే రైతు మృతిచెందాడు. గంగారాం సాగు కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. పంట ఎండిపోవడంతో మనస్తాపానికి గురై గుండె పోటుతో మృతిచెందాడు. నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డకు చెందిన రైతు బోయపల్లి యాదయ్య (35) పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాగు కోసం రూ.11 లక్షల వరకు అప్పు చేశా డు. దిగుబడులు సరిగా రాకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలంలో తెగి పడిన విద్యుత్ వైర్లు కాలికి తగలడంతో ఓ రైతు మృతిచెందిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలంలోని తడ్కపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. -
అగ్గితెగులును అడ్డుకునేందుకు కొత్త మార్గం...
వరిపంటకు అగ్గితెగులు సోకితే పంట సగానికిపైగా నష్టపోవాల్సిందే. కీటకనాశినులకూ ఒకపట్టాన లొంగని ఈ తెగులు వ్యాప్తికి చెక్ పెట్టేందుకు యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ శాస్త్రవేత్తలు సరికొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. తెగులుకు కారణమైన శిలీంధ్రంలో కేవలం ఒక్క ప్రొటీన్ ఉత్పత్తిని నిలిపివేస్తే దీన్ని సమర్థంగా అడ్డుకోవచ్చునని వీరు గుర్తించారు. ప్రపంచంలో మూడొంతుల మందికి వరి కీలకమైన ఆహారమైన విషయం తెలిసిందే. ఈ తెగులు కారణంగా ఏటా దాదాపు ఆరు కోట్ల మంది కడుపు నింపగల వరి నాశనమవుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలోనే తాము దీనిపై పరిశోధనలు చేపట్టామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నిక్ టాల్బోట్ అంటున్నారు. అగ్గి తెగులుకు కారణమైన శిలీంధ్రం వరి మొక్కల కణాలను ఎలా నియంత్రిస్తోందో.. తద్వారా మొక్క కణాల మధ్య ఎలా నివసించగలుగుతోందో తాము తెలుసుకోగలిగామని ఆయన చెప్పారు. ఇదంతా కేవలం పీఎంకే1 అనే ఒకే ఒక్క ప్రొటీన్‌తోనే సాధ్యమవుతోందని అన్నారు. రసాయన పద్ధతుల ద్వారా ఈ ప్రొటీన్ ఉత్పత్తిని నిలిపివేసి శిలీంధ్రాన్ని ఒక్క కణంలోకి పరిమితం చేయగలిగారు శాస్త్రవేత్తలు. తమ పరిశోధన ఫలితంగా తెగులును అరికట్టేందుకు కొత్తకొత్త మార్గాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు నిక్ టాల్బోట్!