
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వర్షాలు రాకముందే రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment