చౌడు సమస్య ఖరీఫ్‌లో కన్నా రబీలోనే ఎక్కువగా ఇబ్బందిపెడుతుంది. చౌడు వల్ల ధాన్యం దిగుబడి తగ్గడం కూడా రబీలోనే ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చౌడును తట్టుకొని 20–25 బస్తాల దిగుబడినిచ్చే డి.ఆర్.ఆర్. ధన్ 39, జరవ, వికాస్ అనే వరి వంగడాలు ఉన్నాయి. ఇవి 120–130 రోజుల్లో కోతకొస్తాయి.
కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో చౌడు సమస్య ఉంది. మట్టిలో లవణ సూచిక (ఇ. సి.) 4 వరకు ఉంటే కొంత ఫర్వాలేదు. కానీ, మా క్షేత్రంలో ఈ ఏడాది 10.9 ఉంది. ఎక్స్‌ఛేంజబుల్ సోడియం పర్సంటేజ్ (ఈ.ఎస్.పి.) 15% కన్నా పెరిగితే చౌడు సమస్య తలెత్తుతుంది.
చౌడు భూముల్లో కాలువ నీటితో సాగు చేయడానికి అనువైన మూడు వరి వంగడాలను శాస్త్రవేత్తలు గతంలోనే రూపొందించారు. ఎం.సి.ఎం. 100 అనేది రబీకి అనుకూలం. 125 రోజులు. 28–30 బస్తాల దిగుబడి వచ్చింది. ఎం.సి.ఎం. 101 రకం 140 రోజుల పంట. ఖరీఫ్‌కు అనుకూలం. 35 బస్తాల దిగుబడి. అగ్గి తెగులును, దోమను తట్టుకుంది. ఎం.సి.ఎం. 103 ఖరీఫ్ రకం. ఇది రాయలసీమ జిల్లాల్లోనూ మంచి దిగుబడులనిస్తోంది.
చౌడు భూముల్లో నాట్లకు ముందు జీలుగ సాగు చేసి కలియదున్నాలి. ఇతర పచ్చిరొట్ట పైర్లు వేస్తే ఉపయోగం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైపైనే దమ్ము చేయాలి. సమతూకంగా ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు వేయడం మంచిది. రబీలో పొలాన్ని ఖాళీగా ఉంచితే, ఖరీఫ్‌లో
చౌడు సమస్య ఎక్కువ అవుతుందట.
Comments
Please login to add a commentAdd a comment