కుంటలో మునిగి బాలుడి మృతి
Published Sat, Sep 24 2016 1:47 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
సి.బెళగల్: ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. సి.బెళగల్‌కు చెందిన బోయ చింతకాయల వెంకటేష్, వీరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్ద కుమారుడు లక్ష్మన్న (16) తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉన్నాడు. శుక్రవారం తెల్లవారు జామున పశువులకు మేత తెచ్చేందుకు వెళ్లాడు. ఉదయం 8 గంటలకు రావాల్సిన కుమారుడు పది గంటలైనా రాకపోవడంతో తల్లిదండ్రులు అనుమానించారు. పొలానికి వెళ్లి ఉంటాడేమోనని అక్కడికి వెళ్లి చూడగా కనిపించ లేదు. గ్రామంలోని చెరువులోని ఓ కుంట వద్ద నీటిలో తాడు తెలియాడుతూ ఉండగా నీటిలో దిగి గాలించగా లక్ష్మన్న మృతదేహం బయటపడింది. ఈత కోసం వెళ్లి మృతి చెంది ఉంటాడని తెలుస్తోంది. చేతికొచ్చిన కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Advertisement
Advertisement