kunta
-
మరో రహదారి నిర్మాణానికి పచ్చజెండా.. కేంద్రమంత్రి ట్వీట్
సాక్షి, అమరావతి: శ్రీశైలం భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలో మరో రహదారి నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రకాశం జిల్లా డోర్నాల నుంచి కుంట జంక్షన్ వరకు ఉన్న రహదారిని రెండు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా 30 కి.మీ. ఈ రహదారిని రెండు లైన్లు(విత్ పావ్డ్ సోల్డర్స్)గా అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ రూ.244.83కోట్లతో ప్రణాళికను ఆమోదించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 📢 Andhra Pradesh 👉 Widening to 2-Lane with paved shoulder of Dornala to Kunta junction section of NH-765 (Pkg-2) at district Prakasam in Andhra Pradesh has been approved on EPC mode with a budget of Rs. 244.83 Cr. #PragatiKaHighway #GatiShakti @ysjagan @kishanreddybjp — Nitin Gadkari (@nitin_gadkari) December 9, 2022 చదవండి: (17 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు) -
ఊపిరి తీసిన ఈత సరదా
- నీటి కుంటలో విద్యార్థి మృతి - పగిడ్యాలలో ఘటన పగిడ్యాల: రోజూ ఒకటే రకం ఆట ఎందుకనుకున్నారో ఏమో తెలియదు కానీ బుధవారం సాయంత్రం స్కూలు నుంచి ఇంటికొచ్చిన తర్వాత పిల్లలందరూ కలిసి గ్రామ సమీపంలోని నీటి కుంటకు ఈతకు వెళ్లారు. అయితే నీటిలోకి దిగిన వారిలో ఒక బాలున్ని కుంట మింగేసింది. బాధిత తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన మండల కేంద్రమైన పగిడ్యాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ రవికి కుమార్తెతోపాటు కుమారుడు శివకుమార్(8) సంతానం. స్థానిక శారద విద్యామందిర్‌లో ఒకటో తరగతి చదువుతున్న బాలుడు బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తోటి పిల్లలతో కలిసి స్థానిక కొణిదేల రస్తాలో ఉండే కుంటకు ఈతకు వెళ్లారు. బుధవారం గ్రామంలో వారపు సంత ఉండడంతో సరుకులు తెచ్చుకునేందుకు వెళ్లిన తల్లి కుమారునిపై కాస్త అశ్రద్ధ చేసింది. ఇదే వారి పాలిట శాపంగా మారింది. బాలుడు ఎంతకూ ఇంటికి రాకపోయేసరికి ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తోటి పిల్లలను విచారించగా అసలు విషయం తెలిసింది. చీకట్లోనే కుంటలో గాలించగా బాలుడు మృతదేహంగా బయటపడ్డాడు. మల్యాల ఫేజ్ -2 నాగటూరు లిఫ్ట్ నుంచి విడుదల చేసే నీరు తమ పిల్లాన్ని పొట్టన పెట్టుకుందని తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. విషయంపై ముచ్చుమర్రి ఎస్ఐ బాలనరసింహులుతో మాట్లాడగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
కుంటలో మునిగి బాలుడి మృతి
సి.బెళగల్: ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. సి.బెళగల్‌కు చెందిన బోయ చింతకాయల వెంకటేష్, వీరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్ద కుమారుడు లక్ష్మన్న (16) తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉన్నాడు. శుక్రవారం తెల్లవారు జామున పశువులకు మేత తెచ్చేందుకు వెళ్లాడు. ఉదయం 8 గంటలకు రావాల్సిన కుమారుడు పది గంటలైనా రాకపోవడంతో తల్లిదండ్రులు అనుమానించారు. పొలానికి వెళ్లి ఉంటాడేమోనని అక్కడికి వెళ్లి చూడగా కనిపించ లేదు. గ్రామంలోని చెరువులోని ఓ కుంట వద్ద నీటిలో తాడు తెలియాడుతూ ఉండగా నీటిలో దిగి గాలించగా లక్ష్మన్న మృతదేహం బయటపడింది. ఈత కోసం వెళ్లి మృతి చెంది ఉంటాడని తెలుస్తోంది. చేతికొచ్చిన కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ప్రయాణికుల నగలు దొచుకెళ్లిన దుండగులు
ఛత్తీస్‌గఢ్ : కుంట సమీపంలోని ఆసిల్గూడ వద్ద ఆదివారం తెల్లవారుజామున దారి దోపిడి జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును దుండగులు అటకాయించారు. అనంతరం బస్సులోకి ప్రవేశించిన దుండగులు ప్రయాణికుల వద్ద నుంచి నగలు, నగదు దోచుకుని... అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. దీంతో ప్రయాణికులు కుంట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.