మరో రహదారి నిర్మాణానికి పచ్చజెండా.. కేంద్రమంత్రి ట్వీట్‌ | Development of Dornala-Kunta road at Cost of Rs 244.83 Crores | Sakshi
Sakshi News home page

మరో రహదారి నిర్మాణానికి పచ్చజెండా.. కేంద్రమంత్రి ట్వీట్‌

Published Sat, Dec 10 2022 2:45 PM | Last Updated on Sat, Dec 10 2022 2:45 PM

Development of Dornala-Kunta road at Cost of Rs 244.83 Crores - Sakshi

సాక్షి, అమరావతి: శ్రీశైలం భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలో మరో రహదారి నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రకాశం జిల్లా డోర్నాల నుంచి కుంట జంక్షన్‌ వరకు ఉన్న రహదారిని రెండు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా 30 కి.మీ. ఈ రహదారిని రెండు లైన్లు(విత్‌ పావ్డ్‌ సోల్డర్స్‌)గా అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ రూ.244.83కోట్లతో ప్రణాళికను ఆమోదించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

చదవండి: (17 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement