కుంట సమీపంలోని ఆసిల్గూడ వద్ద ఆదివారం తెల్లవారుజామున దారి దోపిడి జరిగింది.
ఛత్తీస్గఢ్ : కుంట సమీపంలోని ఆసిల్గూడ వద్ద ఆదివారం తెల్లవారుజామున దారి దోపిడి జరిగింది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును దుండగులు అటకాయించారు. అనంతరం బస్సులోకి ప్రవేశించిన దుండగులు ప్రయాణికుల వద్ద నుంచి నగలు, నగదు దోచుకుని... అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. దీంతో ప్రయాణికులు కుంట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.