
నిర్మల్‌లో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సు చోరీకి ప్రయత్నించాడు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వెనుక నుంచి ఆదివారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖిని చెందిన గణేశ్.. లోపలికి చొరబడ్డాడు. డిపోలో నిలిపి ఉంచిన ఏపీ 01జెడ్ 0076 బస్సు ఎక్కి స్టార్ట్ చేశాడు. గేట్ బయటి నుంచి నిజామాబాద్ వైపు వెళ్లాడు. బస్సు వివరాలు బుక్‌లో ఎంటర్ చేయకపోవడంతో గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు వంశీకి అనుమానం కలిగింది.
వెంటనే అక్కడున్న బైక్ తీసుకుని బస్సును వెంబడించాడు. పట్టణ శివారులోని సోఫీనగర్ వద్ద స్థానికుల సహాయంతో బస్సును అడ్డుకున్నాడు. దొంగ మద్యం మత్తులో ఉన్నట్టు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని బస్సును డిపోకు తరలించారు. బస్సు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన గణేశ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment