ఆర్టీసీ బస్సులో చోరీ
Published Fri, May 12 2017 11:57 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
అవుకు: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలి నుంచి ఇద్దరు గుర్తు తెలియని మహిళలు బంగారు చైన్, నగదు అపహరించారు. కొలిమిగుండ్లకు చెందిన పోరెడ్డి చిన్నపురెడ్డి భార్య రామలక్ష్మమ్మ హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం 8.30 బనగానపల్లెకు చేరుకుంది. అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు తాడిపత్రి బస్సు ఎక్కింది. ఆమెతో పాటు ఇద్దరు గుర్తు తెలియని మహిళలు బస్సు ఎక్కి ఆమె పక్కనే కూర్చున్నారు. ప్రయాణ అలసటతో రామలక్ష్మమ్మ నిద్రపోగా బ్యాగ్‌ను కత్తిరించి అందులోని 7 తులాల బంగారు చైన్, రూ. 10 వేల నగదుతో తీసుకుని అవుకులో దిగిపోయారు. కొద్ది సేపటికి తేరుకున్న మహిళ కత్తిరించిన బ్యాగ్ చూసుకుని చోరీ జరిగినట్లు గుర్తించి అవుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ వెంకట్రామిరెడ్డి వెంటనే మహిళా దొంగల కోసం విచారణ చేపట్టారు. బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో వారు బస్సు ఎక్కినట్లు, తిరిగి ఉదయం 11.30 గంటల సమయంలో అవుకు నుంచి బనగానపల్లెకు చేరుకున్నట్లు పట్టణంలో అమర్చిన సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement