దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే నడిరోడ్డుపై కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రద్దీ ప్రాంతాల్లోనూ దర్జాగా నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి అందినకాడికి దోచుకుంటున్నారు.ప్రగతి మైదాన్ టన్నెల్‌లో కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయిన ఉదంతం మరవకముందే మరో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది.
తాజాగా ఓ భారీ దొంగతనానికి స్కెచ్ వేసిన దొంగలకు షాకింగ్ అనుభవం ఎదురైంది. తూర్పు ఢిల్లీలోని షాహదారాలోని ఫార్ష్ బజార్‌లో ఓ జంటను అడ్డగించిన దోపిడి దొంగలు వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే ఊహించని విధంగా వారి వద్ద కేవలం రూ. 20 నోటు తప్ప మరేం లభించకపోవడంతో.. బదులుగా వారికే రూ. 100 రూపాయలు చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ వింత ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.హెల్మెట్ ధరించి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్న ఓ జంటను అడ్డగించారు. వెంటనే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. ఇంతలో చోరికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి ఎదుటి వారిని తనిఖీ చేయడం ప్రారంభించాడు. అయితే అతని వద్ద ఏం లభించలేదు. దీంతో తిరిగి దొంగలే సానుభూతితో దంపతుల చేతులో డబ్బులు పెట్టిన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అనంతరం దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
చదవండి: పెళ్లి మండపంలో ఇదేంది.. వధువు చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు!
దీంతో ఆ జంట సరాసరీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పారు. తమ వద్ద ఏం దొరక్కపోవడంతో దొంగతానికి వచ్చిన వారే రూ. 100 నోటు చేతిలో పెట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
వీరిద్దరినీ దేవ్ వర్మ, హర్ష్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. వర్మ ఒక ప్రైవేట్ జీఎస్టీ సంస్థలో అకౌంటెంట్, రాజ్‌పుత్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. యూట్యూబ్‌లో గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా వీడియోల ద్వారా ఇద్దరు ప్రభావితమయ్యారని, అతని గ్యాంగ్‌లో చేరాలనుకుంటున్నామని పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
#WATCH | In a bizarre turn of events, two drunk men who were trying to rob a Delhi couple at gunpoint, handed Rs 100 to them instead. They did so when they realised that the couple only had Rs 20 with them. pic.twitter.com/9BpIp0JEFs
— Daily Excelsior (@DailyExcelsior1) June 26, 2023
Comments
Please login to add a commentAdd a comment