కోల్డ్‌ కాఫీ చేసిన రాహుల్‌ గాంధీ, వైరల్‌ వీడియో | Rahul Gandhi Makes Cold Coffee At Keventers Store, Watch Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

కోల్డ్‌ కాఫీ చేసిన రాహుల్‌ గాంధీ, వైరల్‌ వీడియో

Published Fri, Jan 10 2025 3:33 PM | Last Updated on Fri, Jan 10 2025 4:45 PM

Rahul Gandhi makes cold coffee at Keventers store Viral Video

కాంగ్రెస్ నాయకుడు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకు సంబంధించి ఒక వీడియో నెట్టింట సందడిగా మారింది.  ఏ ప్రదేశానికి వెళ్లినా, ఏ మీటింగ్‌కు హాజరైనా జనంతో మమేకం కావడం రాహుల్‌ గాంధీకి బాగా అలవాటు. అలా ఇటీవల కాఫీ చైన్‌ను సందర్శించిన సందర్భంగా, స్వయంగా  కోల్డ్‌ కాఫీ తయారు చేశారు. కెవెంటర్స్ స్టోర్‌ను సందర్శించి అక్కడ కోల్డ్ కాఫీ తయారు చేసిన అనుభవాన్ని సోషల్  స్వయంగా రాహుల్‌ గాంధీ మీడియాలో పంచుకున్నారు.  

రాహుల్‌ గాంధీ  ఢిల్లీలో ఒక పాపులర్‌ కాఫీ షాప్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా  వ్యవస్థాపకులు, సిబ్బందితో సంభాషించారు. కొత్త తరం, కొత్త మార్కెట్ కోసం  మీ లెగసీ బ్రాండ్‌ను ఎలాంటి మార్పులు తీసుకొస్తారు అని అడిగినపుడు కెవెంటర్స్ యువ వ్యవస్థాపకులు తన  కొన్ని విలువైన విషయాలను పంచుకున్నారని  తెలిపారు. అక్కడున్న అభిమానులతో సెల్ఫీలకు ఫోజులిచ్చారు.  రాహుల్  దీనికి సంబంధించిన  వీడియోను  ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు.   దీంతో ఇది వైరల్‌గా మారింది.   (లాస్ ఏంజెల్స్‌ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్‌డేట్‌ ఇదే!)

కెవెంటర్స్ సిబ్బంది  కోల్డ్ కాఫీ ఎలా తయారు చేస్తారో చూడాలనుకుంటున్నారా అని అడిగి మరీ  కోల్డ్‌ కాఫీ తయారీ గురించి వివరించేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే “లేదు,లేదు.. నేను తయారు చేస్తాను’’ అంటూ తానే చేస్తానని రాహుల్ ముందుకు రావడం విశేషం. స్టోర్ సిబ్బంది సూచనలతో దాన్ని  తయారుచేసి కస్టమర్‌కు అందించడం ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాదు కెవెంటర్స్‌  నిజాయితీగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారంటూ కితాబిచ్చారు. తరతరాలుగా మన ఆర్థిక వృద్ధికి ఊతమిస్తున్నఇలాంటివారికి మద్దతివ్వాలని పేర్కొన్నారు రాహుల్‌. 

ఇదీ చదవండి: బెంచింగ్‌ డేటింగ్‌ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!

కెవెంటర్స్ సహ వ్యవస్థాపకులు అమన్ అరోరా ,అగస్త్య దాల్మియాతో వారి వ్యాపారం ,విస్తరణ ప్రణాళికల గురించి కూడా మాట్లాడారు.  ఇపుడు తమ దృష్టిని టైర్ 2, టైర్ 3 ,టైర్ 4 నగరాలపై కేంద్రీకరిస్తున్నామని తెలిపారు.

కాగా కెవెంటర్స్ సంస్థ ఇటీవలే వందేళ్లు పూర్తిచేసుకుంది. ఇటీవల  కంపెనీ వాఫ్ఫల్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇవి భారతదేశం అంతటా 170 కి పైగా ప్రత్యేకమైన రిటైల్ బ్రాండ్ షాపులలో అందుబాటులో ఉన్నాయి. రూ. 99 ప్రారంభ ధరకు, కెవెంటర్స్ వాఫ్ఫల్స్ ఆరు  ప్లేవర్లలో లభిస్తాయి. క్లాసిక్ హనీ బటర్, లోటస్ బిస్కాఫ్, కిట్ కాట్ క్రంచ్, నుటెల్లా, ట్రిపుల్ చాక్లెట్ . వైట్ చాక్లెట్. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ  కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement