Interaction
-
తెలంగాణ భవిష్యత్ మా చేతుల్లో కాదు.. మీ చేతుల్లోనే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్ టీచర్ల చేతుల్లోనే ఉందన్నారు. ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ భవిష్యత్ ఎక్కడుందని.. ఈ క్షణం తనను అడిగితే.. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతానన్నారు.‘‘30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్‌ను మీ చేతుల్లో పెట్టారు. రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం.. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నాం.. కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్యలాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నాం.. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశాం.. గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశాం’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘ఈ బడ్జెట్లో విద్యకు 10 శాతం కేటాయించాలని భావించాం. కానీ హామీల అమలు దృష్ట్యా 7.3 శాతం అంటే రూ.21 వేల కోట్లకు పైగా కేటాయించాం. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30 వేల పాఠశాలల్లో.. 26 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు.. 10వేల ప్రయివేట్ పాఠశాలల్లో.. 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.. ప్రైవేట్ పాఠశాలలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా?. మౌళిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు’’ అంటూ రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.‘‘తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉంది... ఇది కఠోర నిజం. టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు.. హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించాం. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘తెలంగాణ భవిష్యత్ మా చేతుల్లో కాదు.. మీ చేతుల్లో ఉందని చెప్పేందుకే ఈ సమావేశం.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ఈ స్థాయికి చేరా.. అలాంటి ప్రభుత్వ టీచర్లను కలుసుకునేందుకే ఈ ఆత్మీయ సమావేశం. టీచర్లంతా నిబద్ధతతో పనిచేయాలి.. విద్యార్థులకు విద్యనందించాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.‘‘గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షలకుపైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మ గౌరవమని భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి. ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మాకు ఎలాంటి భేషజాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించాం. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘తెలంగాణ బలపడాలంటే మనందరం కార్యదీక్షతో పనిచేయాలి. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల్లో మినీ స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోంది. అందుకే ముచ్చెర్లలో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం. మీరు నేర్పే విద్యనే రేపటి తెలంగాణ భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం కావాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు. -
క్రూరత్వంపై కూడా క్యారెక్టర్ తో యుద్ధం చేద్దాం
-
‘మా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడు’
సాక్షి, తాడేపల్లి: అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపచేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం వ్యాప్తంగా పలువురు లబ్దిదారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ‘మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరే’.. అంటూ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడు.. నా పేరు శాంతిశ్రీ అన్నా.. నేను కాపునేస్తం మూడు విడతల్లో తీసుకున్నా అన్నా. నాలుగోసారి మిస్ అయితే వాలంటీర్లు నాకు రాకపోవడానికి కారణం కనుక్కొని మరీ నాలుగో విడత వచ్చేలా చేశారు. ఈ విషయం తెలియడంతో సంక్రాంతి పండగ ముందుగానే వచ్చినట్లు ఆనందం కలిగిందన్నా. నాకు కాపు నేస్తంతో చాలా సహాయం అందుతుంది. ఏ ప్రభుత్వం చేయని విధంగా మా కాపులను మీరు గుర్తుపెట్టుకొని, కాపులకు సాయం చేయాలనే తపనతో మాకు మీరు ఈ పథకాన్ని ఇచ్చారన్నా. కాపులు గురించి ఆలోచించి మీరు మంచి పని చేశారు. కాపు నేస్తం ద్వారా కుట్టుమిషన్ కొనుక్కొని అదే నా జీవన ఉపాధిగా కొనసాగిస్తున్నా అన్నా. నా భర్త వికలాంగుడు అన్నా.. జనవరి 1 తేదీనే వాలంటీర్ మా ఇంటికి వచ్చి మరీ పించన్ డబ్బులు తెచ్చి ఇస్తున్నారు అన్నా. నాకు కొడుకులు లేరన్నా.. నా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడని మా భార్యభర్తలు ఇద్దరం చాలా సంతోషపడుతున్నాం అన్నా. -శాంతి శ్రీ, కాపు నేస్తం లబ్దిదారు (రాజమండ్రి రూరల్ హకుంపేట్ గ్రామం) మా అమ్మ సంతోష ఉంది.. మీరు సల్లంగా ఉండాలి.. నమస్తే జగన్ సర్.. గత రెండు నెలలుగా ఆటో డబ్బులు పడినాయ్ సార్. మూడోసారి పడలేదు.. వాలంటీర్ నాకు రాకపోవడానికి కరెంట్ బిల్లు సమస్య అని చెప్పి.. ఆ సమస్యను తీర్చి మళ్లీ మూడోసారి నాకు డబ్బులు పడేలా చేశారు. మాకు ముందు నుంచి ఈ పథకాలు లేకున్నా.. మీరు మాకు ఈ పథకం ఇస్తున్నందుకు మా ఆటోనడిపేవారందరీ తరఫున ధన్యవాదాలు సర్. మీ ద్వారా మా అమ్మకు పించన్ వస్తుంది. పించన్ మూడు వేల రూపాయలు కావటం వల్ల మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. కాబట్టి సర్.. మీరు సల్లంగా ఉండాలి. - వాహన మిత్ర లబ్దిదారు (ఖాజా హుస్సేన్, పాణ్యం నియోజకవర్గం, కల్లూరు) మీ సాయం.. నా జీవితానికి ఓ మలుపు ముఖ్యమంత్రి జగనన్న గారికి నమస్కరం. నా పేరు సాయి ప్రత్యూష అన్నా.. నేను డిగ్రీ పూర్తి చేశాను. మా అమ్మగారు చిన్న హస్టల్లో పనిచేసేవారు. మా నాన్న గారు చిన్న సామాన్య బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. దురదృష్టవశాత్తు మా అమ్మగారు మరణించారు. అలాంటి సమయాలో నేను పైచదువులు చదవాలన్న ఆలోచనను వదులుకున్నా అన్నా. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటం వల్ల టైలరింగ్ వృత్తిని ఎంచుకున్నా. దానికి పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరూ నాకు సాయం చేయలేదన్నా. అలాంటి సమయంలో మా వాలంటీరు స్వయంగా మా ఇంటికి వచ్చి.. ‘జగనన్న చేదోడు’ పథకం కింద టైలర్లకు డబ్బులు ఇస్తున్నారని చెప్పడం జరిగింది. దాని నేను చాలా సంతోషించా. మీరిచ్చే చేదోడు పదివేలతో పెట్టుబడి పెట్టి ఉన్న ఈ చిన్న వ్యాపారాన్ని పెద్దగా తీసుకువెళ్లాలని అనుకున్నా. ఉదయం టైలరిగ్ చేస్తూ.. సాయంత్రం ట్యూషన్ చెబుతూ జీవనం సాగిసున్నా అన్నా. మీరు చేదోడు పథకం ద్వారా ఇచ్చే పదివేల సాయం చాలా చిన్నది కావొచ్చు.. కానీ నా దృష్టిలో నా జీవితానికి ఇదొక మలుపు తిరిగే పాయింట్ అన్నా. మీరు ఇచ్చే ఈ పట్టుబడితో నా కలలు నెరవేర్చుకోవాలనుకుంటున్నా. -సాయి ప్రత్యూష, జగనన్న చేదోడు లబ్ధిదారు, (శ్రీకాకుళం పట్టణం) -
ఐటీని పంపుతాననుకున్నావా..ప్రధాని సరదా వ్యాఖ్యలు
వారణాసి:సొంత నియోజకవర్గం వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దివ్యాంగులైన వ్యాపారవేత్తలతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ల వల్ల వారు చేస్తున్న వ్యాపారాలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతోందో అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ వ్యాపారవేత్తలతో సంభాషణలో భాగంగా అందులో ఒకరిని మోదీ పలకరించారు. ఏం వ్యాపారం చేస్తున్నావని మోదీ ప్రశ్నించారు. తాను స్టేషనరీ వ్యాపారం చేస్తున్నానని, కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ తనకు, తన ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని ఆ దివ్యాంగుడు బదులిచ్చాడు. ఆదాయం ఎంత వస్తోందని మోదీ అడగ్గా చెప్పేందుకు అతడు కాసేపు ఆలోచించాడు. దీంతో ఇన్‌కమ్‌ట్యాక్స్(ఐటీ) వాళ్లను పంపుతాననుకుంటున్నావా అతనితో అని మోదీ చమత్కరించారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా ఆయుష్మాన్భారత్ యోజన, ఉజ్వల్ యోజన, పీఎం స్వనిధి యోజన, ముద్రయోజన తదితర పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. కాశీ తమిళ్ సంగమం 2.0ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి..భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవు -
గిగ్ వర్కర్స్ తో రాహుల్ గాంధీ భేటీ
-
జనసేనతో కలిసి వెళ్లడంపై బీజేపీ మహిళా ఎమ్మెల్యే కీ కామెంట్స్
-
ఇన్ఫోసిస్ ఉద్యోగులతో సీఎం వైఎస్ జగన్ ఇంటరాక్షన్..
-
కార్యకర్తలను ప్రేమగా పలకరించిన సీఎం జగన్
-
సంగారెడ్డి మెడికల్ కాలేజీ విద్యార్థులు మంత్రి హరీష్ రావు ముఖాముఖీ
-
అడ్డదారులను నమ్ముకుంటే కష్టాలే
న్యూఢిల్లీ: విద్యార్థులు షార్ట్‌కట్‌లను (అడ్డదారులు) ఎప్పుడూ నమ్ముకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. పరీక్షల్లో చీటింగ్ చేయడం వల్ల ఒకటి రెండు సార్లు లాభపడొచ్చేమో గానీ భవిష్యత్తులో మాత్రం కష్టాలు తప్పవని హెచ్చరించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ఆరో ఎడిషన్ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పరీక్షల వేళ ప్రధానంగా చదువులపైనే దృష్టి పెట్టాలని సూచించారు. దృష్టి మళ్లించే పనులకు దూరంగా ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అతిగా వాడొద్దని, తెలివితేటలపై నమ్మకం ఉంచాలి తప్ప మొబైల్ ఫోన్లపై కాదని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ వల్ల చదువుల్లో నష్టపోకుండా జాగ్రత్తపడాలన్నారు. ఫోన్లు వాడడానికి, సోషల్ మీడియా ద్వారా ఇతరులతో అనుసంధానం కావడానికి ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించుకోవాలని చెప్పారు. ఏకాగ్రత మొత్తం చదువుపైనే.. పరీక్షల్లో కాపీయింగ్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తప్పుడు పనుల వల్ల చెడ్డ ఫలితమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నిజాయితీగా కష్టపడే తత్వమే జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్తుందని విద్యార్థులకు ఉద్బోధించారు. ఒత్తిళ్లకి లోను కాకుండా పరీక్షలకు ప్రశాంతంగా సిద్ధం కావాలని అన్నారు. మన బలాలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఒత్తిడికి తావుండదని వివరించారు. పిల్లలపై కుటుంబ సభ్యులు ఎన్నో అంచనాలు పెట్టుకోవడం సహజమేనని గుర్తుచేశారు. పరీక్ష ఫలితాలు జీవితానికి ముగింపు కాదని స్పష్టం చేశారు. తన వైపు విసిరే బంతిపైనే క్రికెట్ క్రీడాకారుడు ఫోకస్ చేస్తాడని, ఫోర్లు, సిక్సుల కోసం వినిపించే అరుపులను ఏమాత్రం పట్టించుకోడని, విద్యార్థులు సైతం అలాగే ఉండాలని, వారి ఏకాగ్రత మొత్తం చదువుపైనే ఉండాలని స్పష్టం చేశారు. పిల్లల చదువులు, వారు సాధించబోయే మార్కుల గురించి తల్లిదండ్రులు గొప్పలు చెబుతుంటారని, విద్యార్థుల్లో ఒత్తిడికి ఇది కూడా ఒక కారణమని ఉద్ఘాటించారు. పిల్లలు చెప్పింది విశ్వసించాలని తల్లిదండ్రులకు హితవు పలికారు. పరీక్ష ఫలితాల గురించి లేనిపోని అంచనాలు పెట్టుకోవద్దని అన్నారు. ప్రశ్నలడిగే వారిని స్వాగతించాలి విద్యార్థుల పరిధి మరింత విస్తృతం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. 10, 12వ తరగతుల పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థులకు కొంత డబ్బు ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ డబ్బుతో కొత్త ప్రాంతాల్లో పర్యటించాలని, అక్కడి అనుభవాలను పుస్తకంలో రాయాలని విద్యార్థులతో చెప్పారు. పిల్లలను ఆంక్షల వలయంలో బందీలను చేయడం ఎంతమాత్రం సరి కాదన్నారు. కొత్త ప్రాంతాలను దర్శించేలా, కొత్త మనుషులను కలిసి మాట్లాడేలా ప్రోత్సహించాలన్నారు. ప్రశ్నలడిగే విద్యార్థులను స్వాగతించాలని ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచించారు. ఒక విద్యార్థి ప్రశ్నలు అడుగుతున్నాడంటే అతడిలోని పరిశోధకుడు మేల్కొన్నట్లు గుర్తించాలని, అది చాలా మంచి పరిణామం అని తెలియజేశారు. ఏది మంచి? ఏది చెడు? దేశంలో పౌరులు నిత్యం సగటున 6 గంటలకు పైగానే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు చూస్తున్నట్లు ఒక అధ్యయనంతో తేలిందని నరేంద్ర మోదీ వెల్లడించారు. గాడ్జెట్లకు జనం బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏది మంచో, ఏది చెడో నిర్ణయించుకొనే జ్ఞానాన్ని, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని దేవుడు మనకు ఇచ్చాడని, గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా ఇకనైనా అప్రమత్తంగా ఉందామని పిలుపునిచ్చారు. భారత్ ‘సగటు’ దేశం కాదు ప్రభుత్వంలో సగటు(యావరేజ్) వ్యక్తులే ఉన్నారని, భారత్ ఒక సగటు దేశంగానే కొనసాగుతోందంటూ వస్తున్న విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. భారత్ సగటు దేశం ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పారు. ప్రపంచంలో మన దేశం వెలిగిపోతోందని, ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆశారేఖగా మారిందని స్పష్టం చేశారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనని అన్నారు. గొప్ప విజయాలు సాధించినవారిలో చాలామంది ఒకప్పుడు సగటు వ్యక్తులేనని వ్యాఖ్యానించారు. అందరూ ‘తీస్మార్ఖాన్’లు కావాల్సిన అవసరం లేదన్నారు. విమర్శలకు, ఆరోపణలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. విమర్శ అనేది మనం బలంగా మారడానికి ఉపయోగపడే ఒక టానిక్ లాంటిదన్నారు. ఎవరైనా ఆరోపణలు చేస్తే సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యార్థులకు సూచించారు. కొందరు ఎప్పుడూ ఆరోపణలు చేస్తుంటారని, వారి అసలు ఉద్దేశం వేరే ఉంటుందని, పట్టించుకోవద్దని చెప్పారు. తెలివిగా వాడుకోవడమే తెలివి మీ గాడ్జెట్ మీ కంటే తెలివైందని ఎన్నడూ అనుకోవద్దని విద్యార్థులతో మోదీ చెప్పారు. ఆన్లైన్ గేమ్‌లు, సోషల్ మీడియాకు బానిసలుగా మారొద్దన్నారు. తరచుగా ‘టెక్నాలజీ ఉపవాసం’ చేయాలన్నారు. ఫోన్లను పూర్తిగా పక్కన పెట్టాలని వెల్లడించారు. అలాగే ప్రతి ఇంట్లో టెక్నాలజీ–ఫ్రీ–జోన్ ఉండాలన్నారు. దీనివల్ల ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని, పిల్లలు గాడ్జెట్స్‌కు బానిసలుగా మారకుండా ఉంటారని వివరించారు. తాను రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ చేతిలో ఫోన్‌తో చాలా అరుదుగా కనిపిస్తుంటానని మోదీ తెలిపారు. ఫోన్లో మాట్లాడడానికి కొంత సమయం కేటాయించుకుంటానని అన్నారు. టెక్నాలజీని పూర్తిగా పరిహరించాలని తాను చెప్పడం లేదని, మనకు అవసరమైన పరికరాలు అవసరమైనంత మేరకే వాడుకోవడం ఉత్తమమని వెల్లడించారు. మనం తెలివైనవాళ్లమా? లేక మన ఫోన్ తెలివైనదా? అనేది విద్యార్థులు నిర్ణయించుకోవాలన్నారు. ఫోన్ మాత్రమే తెలివైందని భావిస్తే సమస్య మొదలైనట్లేనని పేర్కొన్నారు. ఫోన్‌ను తెలివిగా వాడుకోవడంలోనే తెలివి దాగి ఉందన్నారు. ఫోన్‌ను ఉత్పాదకత పెంచుకోవడానికి ఉపయోగపడే ఒకపరికరంగా భావించాలని కోరారు. ఇదీ చదవండి: అన్ని భాషలు నేర్చుకోవాలనే తపన ఉండాలి- ప్రధాని మోదీ -
జగనన్నవిద్యదీవెన పథకం
-
ఒక విషయం చెప్తా వినండి అన్న.. ఈ అక్క న్మాతలకి జగనన్న ఫిదా
-
ఆత్మవిశ్వాసంతో చిరునవ్వులు చిందిస్తున్నారా? నోటి దుర్వాసనకు చెక్‌పెట్టండిలా!
Does your smile exude confidence? Know Your Oral Health In Detail: రోజువారీ కార్యకలాపాలలో సామాజిక బాంధవ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. మెరిసే చిరునవ్వు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడంలో కీలకంగా వ్యవహరిస్తుందనడంలో సందేహంలేదు! అందుకు శుభ్రమైన దంతాలు, తాజా శ్వాస చాలా ముఖ్యం. చిరునవ్వు అందంగా ఉండాలంటే శ్వాస తాజాగా ఉండాల్సిందే! ఐతే ప్రతి ఒక్కరికీ ఇది సాధ్యం కాదు. 90శాతం మందికి నోటి దుర్వాసన సమస్య ఉంటుందనేది నిపుణుల మాట. నోటి దుర్వాసన, దంతాల కావిటీస్, చిగుళ్ల సమస్యలు, అల్సర్లు, దంతాల కోత, దంతాల సున్నితత్వం, విరిగిన దంతాలు, ఆకర్షణగాలేని చిరునవ్వు, నోటి క్యాన్సర్.. ఈ 9 కారణాలు కారణం కావొచ్చు. వీటిలో అత్యంత సాధారణమైనది నోటి దుర్వాసన (బ్యాడ్ బ్రీత్)! దాదాపు ప్రతి ఒక్కరిలో నోటి దుర్వాసన సమస్య ఉంటుంది. దీనిని కుటుంబ సభ్యులు, సన్నిహితులు గుర్తించినా చెప్పడానికి ఇబ్బందిపడతారు. శరీర దుర్వాసన వలె, నోటి దుర్వాసన కూడా ఆరోగ్యకరమైన సామాజిక సంబంధాలను చెడగొట్టవచ్చు! నోటి దుర్వాసనకు స్థూలంగా 2 కారణాలు ►నోటి లేదా దంత కారణాలు ►నాన్ డెంటల్ కారణాలు చదవండి: Diamond Gold Rainstorm: కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా? నోటి దుర్వాసన సమస్య ఎందుకు తలెత్తుతుంది? ►దంతాలు, చిగుళ్ళు, నాలుక మధ్య ఖాళీల్లో మిగిలిన ఆహార వ్యర్థాలపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది డెంటల్ ప్లాక్కు దారి తీస్తుంది. ►కావిటీస్, డెంటల్ ఇన్ఫెక్షన్లు, చిగుళ్ల వాపు వల్ల దుర్వాసన వస్తుంది. వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు వంటి ఘాటైన వాసనలు ఉన్న కొన్ని ఆహారాలు లేదా జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకునే ఆహారాలు తినడం వల్ల కూడా ఇది సంభవించవచ్చు. ►మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, కాలేయం, మూత్రపిండాలు, రక్త రుగ్మతలు వంటి శ్వాసకోశ సమస్యలు కూడా హాలిటోసిస్‌కు దారితీయవచ్చు. ►కోవిడ్ మహమ్మారి కారణంగా దీర్ఘకాలంపాటు మాస్కులు ధరించడం వల్లకూడా నోటి దుర్వాసన సంభవిస్తుంది. ఇది మాస్క్‌లను ధరించడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ (సాధారణం కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ నోటిలో ఉండిపోయి గాలిని రీసైక్లింగ్ చేయడం వల్ల జరుగుతుంది). నోటి దుర్వాసనను తరిమికొట్టాలంటే ఈ చిట్కాలు పాటించండి.. ►రోజుకు రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) బ్రష్ చేయడం, ఆహారం తిన్న తర్వాత నోరు పుక్కిలించడం ద్వారా తాజా శ్వాస పొందవచ్చు. ►టంగ్ క్లీనర్‌తో ప్రతిరోజూ మీ నాలుకను శుభ్రం చేయడం మర్చిపోవద్దు. ►హైడ్రేటెడ్‌గా ఉండండి. రోజంతా కొద్ది కొద్దిగా నీటిని తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు. ►దంత వైద్యుడిని సంప్రదించి కావిటీస్, చిగుళ్ల సమస్యలకు చికిత్స తీసుకోవాలి. ►మౌత్‌వాష్‌లలో ఆల్కహాల్ ఉండని, డీహైడ్రేటింగ్ చేయని మౌత్‌వాష్‌ను వాడాలి. ►షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌లను నమలాలి. ఇవి నోటిలో చిక్కుకున్న ఆహార వ్యర్థాలను తొలగించి, లాలాజలం ఊరేలా చేస్తాయి. ►ప్రతిరోజూ శుభ్రపరచిన మాస్క్‌లను లేదా కొత్తవి ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. ►జీర్ణవ్యవస్థను ప్రోత్సహించే ఫైబర్ అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను తినాలి. ►చిగుళ్లలో రక్తస్రావం, కావిటీస్, నొప్పితోపాటు దుర్వాసన తలెత్తితే వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. - డాక్టర్ దీప్తి రావ్ మెల్కోటి ఎమ్‌డీఎస్ (ఎండోడంటిక్స్) రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అండ్ కాస్మెటిక్ డెంటిస్ట్ చదవండి: McDonald’s Christmas Challenge: వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా? -
రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నా: వైఎస్ షర్మిల
సాక్షి, లక్డీకాపూల్ (హైదరాబాద్): సమాజాన్ని బాగుచేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ‘ఈ రోజు అందరికీ మంచి సమాజం కావాలి. అందరి నిరీక్షణ ఫలించాలంటే మంచి సమాజం రావాలి’అని ఆమె స్పష్టం చేశారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో షర్మిల పలు యూనివర్సిటీలు, కాలేజీలకు చెందిన విద్యార్థులతో సమావేశమయ్యారు. తాను, విద్యార్థులు ఒకేలా ఉన్నామని పేర్కొన్నారు. తాను రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా, తెలుగు ప్రజలందరినీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని షర్మిల అన్నారు. బుధవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో విద్యార్థులతో భేటీ అయిన వైఎస్ షర్మిల డబ్బు లేని కారణంగా ఏ పేద విద్యార్థి చదువు కూడా ఆగి పోవొద్దని వైఎస్ భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఫీజులు ప్రభుత్వమే భరించేదని పేర్కొన్నారు. దీంతో నేడు ఎంతో మంది చాలా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారంతా ఇప్పటికీ రాజశేఖరరెడ్డిని గుర్తు పెట్టుకున్నారని చెప్పారు. ప్రతి జిల్లాకూ యూనివర్సిటీ తెచ్చిన ఘనత వైఎస్సార్‌దేనని కొనియాడారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అందరికీ ఒక మంచి సమాజం కావాలన్నారు. తెలంగాణలో ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఓయూ విద్యార్థులు నవీన్ యాదవ్, అర్జున్ బాబు, నాగరాజు చక్రవర్తి, ఉదయ్ కిరణ్, మోజెస్ తదితరులు పాల్గొన్నారు. -
కమిన్స్‌కు షారుక్ ఖాన్ వార్నింగ్
దుబాయ్ : కేకేఆర్ జట్టు సహ యజమాని.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అదేంటి షారుక్ కమిన్స్‌కు వార్నింగ్ ఇచ్చాడని అనుకుంటున్నారా. వార్నింగ్ ఇచ్చిన మాట నిజమే కానీ.. సీరియస్ వార్నింగ్ కాదులేండి.. కేవలం సరదా కోసమే. అసలు విషయంలోకి వస్తే కేకేఆర్ జట్టుకు సంబంధించిన కొత్త పాటను వర్చువల్ సెషన్ ద్వారా కేకేఆర్ ఆటగాళ్లతో కలిసి షారుక్ లాంచ్ చేశాడు. ఈ వీడియో సెషన్లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్, పాట్ కమిన్స్ సహా మిగతా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షారుక్ కేకేఆర్ ఆటగాళ్లతో సరదాగా ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించాడు. ఈ క్రమంలో పాట్ కమిన్స్ న్యూ హెయిర్‌కట్‌పై షారుక్ సరదాగా టీజ్ చేశాడు. ఇదే సమయంలో కమిన్స్ కూడా పలు హిందీ పదాలు వాడుతూ షారుక్‌తో మాట్లాడాడు. కమిన్స్ ఈ కొత్త హెయిర్‌స్టైల్ ఏంటి అని షారుక్ అడగ్గా.. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఇలా కొత్త తరహా హెయిర్ స్టైల్ చేశాడని కమిన్స్ తెలిపాడు. (చదవండి : గంభీర్.. ఇప్పుడేమంటావ్?) వెంటనే షారుక్ అందుకొని.. కమిన్స్ ఇంకెప్పుడు ఇలా చేయకు.కరోనా టైమ్‌లో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. ' ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమైన నుంచి న్యూ హెయిర్‌కట్ కోసం అభిషేక్ శర్మ వద్దకు నాలుగుసార్లు వెళ్లాలని.. ప్రతీసారి సరిగా కుదిరేది కాదు.. కానీ ఈసారి మాత్రం నా హెయిర్‌స్టైల్‌లో కొంచెం మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక వేళ ఈసారి కూడా హెయిర్‌కట్ సరిగ్గా కుదరకపోయుంటే మొత్తం షేవ్ చేద్దామనుకున్నా 'అని కమిన్స్ తెలపగానే నవ్వులు విరిసాయి. కమిన్స్.. షారుక్‌కు మధ్య ఆసక్తికర చర్చ జరుగుతున్న సమయంలో దినేష్ కార్తీక్ కల్పించుకొని అభిషేక్ నాయర్ హెయిర్‌కట్ నైపుణ్యతను వివరించాకా కూడా కమిన్స్ అతని వద్దకే వెళ్లాడని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ 13వ సీజన్లో కేకేఆర్ ప్రదర్శన నాసిరకంగా కనిపిస్తుంది. కెప్టెన్సీ చేతులు మారిన తర్వాతైనా విజయాలు సాధిస్తుందేమోనని భావించినా అలాంటిందేం జరలేదు. పైగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో విజయం దక్కించుకున్న కేకేఆర్ ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవరల్లో కేవలం 84 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమి చవిచూసింది. 10 మ్యాచ్‌ల్లో 5విజయాలు.. 5 ఓటమిలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న కేకేఆర్ ప్లేఆఫ్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్ నెగ్గాల్సిందే. దీంతో పాటు రన్‌రేట్ కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. కాగా కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్‌లో పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కోనుంది. (చదవండి : మొన్న ఏబీ.. ఈరోజు స్మిత్‌ను దించేశాడు) -
నేను ఓడిపోతే మార్కెట్లు ఢమాల్..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన విజయంపై అగ్ర దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత కార్పొరేట్ దిగ్గజాలతో మంగళవారం సాయంత్రం ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడతూ ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధించని పక్షంలో అమెరికా ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే తమ మార్కెట్లు వేలకు వేల పాయింట్ల మేర పెరుగుతాయని, తాను ఓడితే అవి మీరెన్నడూ చూడని రీతిలో పేకమేడల్లా కూలిపోతాయని వ్యాఖ్యానించారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ భారత కార్పొరేట్లను కోరారు. కార్పొరేట్లు, నూతన పెట్టుబడులకు నియంత్రణలు, పన్నులను తగ్గించామని చెప్పుకొచ్చారు. గతంలో ఒక్క హైవే ప్రాజెక్టు క్లియరెన్స్‌కు 20 ఏళ్ల సమయం పడితే తాము క్లియరెన్స్ ప్రక్రియను రెండేళ్లకు కుదించామని పేర్కొన్నారు. పారిశ్రామికదిగ్గజం ముఖేష్ అంబానీ సహా పలువురు కార్పొరేట్ దిగ్గజాలు ట్రంప్‌తో భేటీ అయ్యారు. చదవండి : ఆయుధాల అమ్మకానికే ఆ డీల్.. -
దూరం ఒకటే దారే వేరు
మహిళల్లో ఉన్న ప్రతిభాపాటవాలకు సంప్రదాయ భావజాలం ఏ విధంగా అడ్డంకిగా మారుతోందనే విషయాలను సంకలనం చేస్తూ ‘వాక్ ద టాక్, ఉమెన్, వర్క్, ఈక్విటీ, ఎఫెక్టివ్‌నెస్’ పుస్తకం రాశారు అంజలి. ఇటీవల హైదరాబాద్, బేగంపేటలోని ప్లాజా హోటల్లో జరిగిన ఇంటరాక్షన్ సెషన్లో డాక్టర్ అంజలి హజారికా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘పిల్లలూ! డాక్టర్ బొమ్మ వేయండి’’. పిల్లలందరూ డాక్టర్ బొమ్మ వేశారు. ‘‘ఇప్పుడు... పైలట్ బొమ్మ వేస్తారా?’’ పైలట్ బొమ్మ కూడా వేశారు. ‘‘ఫైర్‌మన్ బొమ్మ?’’ అదీ వేశారు. డ్రాయింగ్షీట్ మీద తమ పేర్లు రాసిచ్చారు క్లాసులోని పిల్లలంతా. మొత్తం అరవై షీట్లు. ఆ డ్రాయింగ్ షీట్లలో ఉన్నది యాభై ఐదు మంది మగడాక్టర్లు, ఐదుగురు లేడీ డాక్టర్లు. యాభై ఐదు మంది మగ పైలట్లు, ఐదుగురు మహిళా పైలట్లు. ఫైర్‌మన్ దగ్గరకొచ్చేసరికి అరవై మందీ మగవాళ్లే!! ఇవి పిల్లలు గీసిన బొమ్మలు మాత్రమే కాదు, సమాజానికి దర్పణాలు కూడా. పిల్లలేం చూశారో అదే బొమ్మ వేశారు.సమాజం ఎలా ఉందో దాన్నే పిల్లలు చూశారు. డాక్టర్ అంజలి హజారికా నాలుగేళ్ల పాటు సమాజాన్ని శోధించి తెలుసుకున్న వాస్తవాలను నిర్ధారించుకోవడానికి ఏడెనిమిదేళ్ల పిల్లలనే గీటురాయిగా తీసుకున్నారు. ఆ గీటురాళ్లు చూసిన, చూపించిన సమాజం డ్రాయింగ్ షీట్లలో కనిపించింది. వేరు చేసేది సమాజమే! పురుషాధిక్య సమాజంలో మహిళలకు ఎదురవుతున్న అడ్డంకులకు ఆ రంగం, ఈ రంగం అనే తేడా లేదని.. 2009లో నోబుల్ బహుమతి అందుకున్న ఇజ్రాయెల్ మహిళ అదా యోనా మాటల్ని ఉటంకించారు... అంజలి. ఆ దేశం నుంచి నోబుల్ బహుమతి అందుకున్న పదిమందిలో ఏకైక మహిళ యోనాత్. అయితే యోనాత్ ప్రొఫెషన్లో నిలదొక్కుకోవడానికి మహిళ అనే వివక్ష కారణంగా లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పలేదని చెప్పారు అంజలి. ‘‘ఏదైనా ఒక పనిలో ఒక మగవ్యక్తి విఫలమైతే అది అతడి వ్యక్తిగత వైఫల్యంగా పరిగణిస్తుంది సమాజం. అదే ఒక మహిళ విఫలమైతే ఆ వైఫల్యాన్ని మహిళాజాతి మొత్తానికీ ఆపాదిస్తుంది. ‘అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుట్టినప్పుడు వాళ్లు పిల్లలు మాత్రమే. పెరిగే క్రమంలో అబ్బాయి, అమ్మాయిల్లా వారిని వేరు చేస్తున్నది సమాజమే’’ అన్నారామె. ‘‘సమానత్వం కోసం చేసే పోరాటాలు కొన్నిసార్లు శృతి తప్పి ఆధిపత్య పోరాటాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. నిజానికి జెండర్ ఈక్వాలిటీ కోసం చేసే ప్రయత్నం మగవాళ్లను కించపరచడానికి, వారిని న్యూనత పరచడానికి కాకూడదు, వివక్షలేని సమాజ నిర్మాణం కోసం చేసే ప్రయత్నం అది. ఇప్పటివరకు ఉన్న మూస భావజాలం నుంచి మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది’’ అన్నారు అంజలి. నిర్ణయం ‘ఆమె’దే మహిళ ఏ రంగంలో కొనసాగాలనేది కూడా అత్తింటి వాళ్లే నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఒక మహిళ అనుభవాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు అంజలి.‘‘పెళ్లిచూపులకొచ్చాడు ఓ అబ్బాయి. తనది చాలా పెద్ద హోదా కలిగిన ఉద్యోగం. తరచూ టూర్లు ఉంటాయి. ఇంట్లో ఉండే తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఇంటికి వచ్చే కోడలిదే. కాబట్టి తన భార్య ఉద్యోగం చేయకూడదు అని నిబంధన పెట్టాడతడు. అప్పుడు పెళ్లి కూతురి తల్లి ఒకే మాట చెప్పారు. ‘మీక్కావలసింది రోజంతా ఇంట్లో ఉండే పని మనిషి. మంచి జీతం ఇచ్చి ఒక సర్వెంట్ మెయిడ్‌ను నియమించుకోండి. మా అమ్మాయికి తన కెరీర్ మీద కొన్ని లక్ష్యాలున్నాయి అని చెప్పారామె. అప్పుడా తల్లి అంత స్థిరంగా ఆ మాట చెప్పలేకపోయి ఉంటే ఆమె కూతుర్ని ఈ రోజు ప్రొఫెసర్ హోదాలో చూడగలిగే వాళ్లం కాదు. అలాగే మరో మహిళ విషయంలో ఆమె అత్తింటి వాళ్లు తాము చాలా ఉదారంగా ఉన్నాం చూడండి.. అన్నట్లు వ్యవహరించారు. వాళ్లు చెప్పేదేమంటే... అమ్మాయి తాను చేస్తున్న ఉద్యోగం మానేయాలి, ఇప్పటి వరకు ఉన్న సీనియారిటీని వదులుకుని పెళ్లి చేసుకుని అత్తగారింట్లో అడుగుపెట్టాలి. చదువుకుని ఇంట్లో ఖాళీగా ఉండడం కష్టంగా అనిపిస్తే ఇంటి పనులన్నీ చేసుకుని ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లో ఉద్యోగానికి వెళ్లవచ్చు– అని. అంటే ఒక అమ్మాయికి తన జీవితం మీద నిర్ణయం తీసుకునే అవకాశం తన చేతిలో ఉండడం లేదు. అత్తింటివారి చేతిలోకి వెళ్లిపోతోంది. ఇక్కడ మనం ఆక్షేపించాల్సింది పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లడాన్ని కాదు, పెళ్లి కోసం కెరీర్‌ను వదిలేసుకోవాల్సి రావడాన్ని మాత్రమే. కెరీర్ అంటే డబ్బు సంపాదించే ఉపాధి మాత్రమే కాదు, అది ఆమె గుర్తింపు, ఆమెకు దక్కే గౌరవం. అందుకే మహిళలు తమ గుర్తింపుకు, గౌరవానికి భంగం కలగని విధంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా సరే తమ ఐడెంటిటీని నిలబెట్టుకోవాలి, అవసరమైతే పరిస్థితులతో పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. అందుకు ఇంటి వాతావరణం కూడా సహకరించాలి’’ అన్నారు అంజలి. తప్పని బాధ్యతలు ‘‘ప్రపంచంలో ఒక దేశానికీ మరో దేశానికీ మధ్య తప్పనిసరిగా వైవిధ్యత ఉంటుంది. ఆ దేశానికంటూ ప్రత్యేకమైన బలాలు, బలహీనతలు ఉంటాయి. మహిళల విషయానికి వస్తే... అది కమ్యూనిస్టు దేశమైనా, క్యాపిటలిస్టు దేశమైనా, సోషలిస్టు దేశమైనా సరే... మహిళల అవకాశాలకు దారులు మూసేయడంలో మాత్రం వైవిధ్యత కనిపించలేదు. నేటికీ అమెరికా వంటి అగ్రరాజ్యంలో కూడా ప్రజాప్రతినిధులుగా మహిళలను వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితే ఉంది’’ అంటారు అంజలి. దీనికి తోడు మహిళల పట్ల అనేక అపోహలు రాజ్యమేలుతున్న వైనాన్ని వివరించారామె. ‘‘ఫలానా బాధ్యతను నిర్వర్తించడానికి మహిళలు కరెక్ట్ కాదు, ఈ క్లిష్టమైన వ్యవహారాన్ని నడిపించడం మహిళలకు అసాధ్యం, మహిళలకు ప్రొఫెషన్లో ఎదగాలని, ప్రమోషన్లు తెచ్చుకోవాలని ఉండదు. మగవాళ్లతో సమానంగా పని చేయాలనుకోరు. ఇంటర్నేషనల్ అసైన్మెంట్లు అప్పగిస్తే వెళ్లడానికి ముందుకు రారు, ట్రాన్స్‌ఫర్‌కు సిద్ధంగా ఉండరు’ అనే దురభిప్రాయాలు చాలామందిలో నెలకొని ఉండడాన్ని గమనించాను. మరికొన్ని కార్పొరేట్ కంపెనీల నిర్వాహకుల మాటల్లో ‘ఈ ఉద్యోగానికి ఆమెకి అన్ని అర్హతలున్నాయి. అయితే మన కంపెనీ క్లయింట్లు మహిళా ఇంజనీర్ అంటే మనకు ప్రాజెక్టులు ఇస్తారో ఇవ్వరో’ అనే సందేహం కనిపించింది. మరొకరయితే ‘ఆమెకు ప్రమోషన్ ఇవ్వడం ఎలా, తరచూ అఫిషియల్ టూర్లుంటాయి’ అంటారు. నిజానికి ఈ తరం మహిళలు ఇలాంటి మిషలతో ఉద్యోగంలో ఎదుగుదలను వదులుకోవడం లేదు.ఈ అభిప్రాయాలు మగవారిలో నాటుకుపోయి ఉన్నాయంతే’’ అన్నారామె. పరుగు ఒక్కటే... భారమే తేడా ‘‘1991లో ‘పని ప్రదేశంలో మహిళల పరిస్థితి’ అనే అంశం మీద వాషింగ్టన్లో ఓ సదస్సులో పాల్గొన్నాను. పని చేసే మహిళలకు గృహిణి నిర్వహించిన ఇంటి బాధ్యతలను పూర్తి చేయాల్సిన అదనపు బరువు తప్పడం లేదు. వ్యవసాయ రంగంలో ఉండే మహిళ నుంచి, కార్పొరేట్ రంగంలో ఉద్యోగిని వరకు అందరి పరిస్థితీ ఇదే. ఇంటి బాధ్యతలు పూర్తి చేసి ఆఫీసుకెళ్లిన తర్వాత మగవాళ్లతో పోటీ పడి రేసులో పరుగెత్తాలి. ఒక్కమాటలో చెప్పాలంటే మగవాళ్లు ఏ బరువూ లేకుండా పరుగుపందెంలో పాల్గొంటుంటే, ఆడవాళ్లు మాత్రం కాళ్లకు ఇంటి బాధ్యతల ఇనుపగుండు కట్టుకుని రేసులో పాల్గొంటున్నారు. వర్క్ ప్లేస్‌లో మగవాళ్లు– ఆడవాళ్లు ఇద్దరూ సమానమేననే వాస్తవాన్ని మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా గుర్తుంచుకోవాలి. ఆడవాళ్లు పని ప్రదేశంలో తమకవసరమైన ప్రత్యేక సౌకర్యాల కోసం డిమాండ్ చేయవచ్చు కానీ, పని తగ్గించుకోవడానికి వెసులుబాటు కోరుకోకూడదు. ప్రతి మహిళకూ తన శక్తి మీద, తాను నిర్వర్తించాల్సిన పనుల మీద అవగాహన ఉండాలి. తన బాధ్యతలను పూర్తి చేయడానికి ఇతరుల మీద ఆధారపడకూడదు. తన శక్తి మీదే తాను నిలబడాలి. సమాజం నిర్దేశించిన చట్రం నుంచి బయటపడి కొత్త సామాజిక చక్రాన్ని రూపొందించాలి. అది వివక్షకు తావులేని సమానత్వం సాధించిన సమాజం కావాలి’’ అన్నారు అంజలి హజారికా. విస్తృత పర్యటనలు డాక్టర్ అంజలి హజారికా పుట్టింది మహారాష్ట్రలోని పూనాలో. సైకాలజీ, సోషల్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. మేనేజ్మెంట్లో డాక్టరేట్ చేశారు. పాశ్చాత్యదేశాల్లో విస్తృతంగా పర్యటించి ప్రాచ్య– పాశ్చాత్య సమాజాలను తులనాత్మకంగా బేరీజు వేశారు. భారతదేశంలోని ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోలియం కంపెనీలతో పని చేశారు. ఉద్యోగుల రక్షణ, సంక్షేమం కోసం సంస్థలు కల్పించాల్సిన సౌకర్యాల గురించి ఆయా సంస్థలకు వ్యవస్థీకృతమైన దిశానిర్దేశం చేశారు. ఆమె సేవలకు భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ ‘ఎక్సలెన్స్’ అవార్డుతో గౌరవించింది. అమెరికాలోని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ద సొసైటీ ఆఫ్ డ్రీమ్స్ సంస్థకు గౌరవ వైస్ ప్రెసిడెంట్ ఆమె. పబ్లిక్ సెక్టార్లో పని చేస్తున్న మహిళల కోసం వేదికను నెలకొల్పడంలో అంజలి విశేషమైన సేవలందించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుల సదస్సును అధ్యక్ష బాధ్యతలతో నిర్వహించారామె. అమ్మ మాట మా అమ్మ నాకు చెప్పిన మాట ఒక్కటే.. ‘ఇతరులకు నీ సహాయం అవసరమైనప్పుడు నువ్వు అక్కడ ఉండాలి. అలాగని నువ్వు వెనుకపడకూడదు’ అని. ఈ మాటే నన్ను నడిపించింది, ఈ స్థానంలో నిలబెట్టింది. యువతులు భర్తను ఎంపిక చేసుకోవడంలో తమను తాము సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అతడు తనకంటే ఎక్కువ చదువుకుని ఉండాలి, తన కంటే పెద్ద ఉద్యోగం చేస్తుండాలి అనే సంప్రదాయ భావజాలం నుంచి మహిళ బయటకు రావాలి. కలిసి జీవించడానికి ఒకరినొకరు అర్థం చేసుకోగలగడం, అభిప్రాయాలు కలవడం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. – అంజలి హజారికా, రచయిత, సామాజిక ధోరణుల అధ్యయనవేత్త – వాకా మంజులారెడ్డి -
ఎఫ్‌బీఐ అధికారిపై ట్రంప్ వేటు
వాషింగ్టన్: కీలక సమాచారాన్ని అనధికారికంగా మీడియాకు అందిస్తున్నారనే ఆరోపణలపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)లో రెండో ర్యాంకు అధికారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. ఆదివారం పదవీ విరమణ చేయనున్న ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ ఆండ్రూ మెక్కాబెపై శుక్రవారం అర్ధరాత్రి ట్రంప్ యంత్రాంగం వేటు వేసింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై విచారణకు సంబంధించిన కీలక సమాచారాన్ని మీడియాకు వెల్లడిస్తున్నందువల్లే మెక్కాబెపై వేటు వేస్తున్నట్టు అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ శుక్రవారం ప్రకటించారు. -
పిల్లాడి నుంచి మోదీకి ఊహించని ప్రశ్న.. నో ఆన్సర్
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న సాంవత్సరీక పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు మరోసారి ప్రధాని నరేంద్రమోదీ ధైర్యం చెప్పారు. ఇప్పటికే మన్ కీబాత్ అనే రేడియో కార్యక్రమం ద్వారా తనకు కుదిరినప్పుడల్లా విద్యార్థులకు పలుసలహాలు, సూచనలు ఇచ్చే మోదీ ఈసారి వారితో ముఖాముఖి అయ్యి పరీక్షల్లో విజయం సాధించే చిట్కాలు వివరించారు. తాల్కాతోరా స్టేడియంలో మోదీ విద్యార్థులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పరీక్షలంటే అస్సలు భయపడవద్దని, వాటిని కూడా పండుగల్లాగే భావించాలని, చాలా ఉత్సాహంగా పరీక్షలు రాయాలని అన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా వచ్చిన ప్రశ్నలకు కూడా మోదీ సమాధానం చెప్పారు. ‘మంచి మార్కుల జాబితా రహస్యం ఉత్సాహంగా ఉండే మనసు మాత్రమే’ అని మోదీ చెప్పారు. ఎక్కువ ఉల్లాసంగా ఉండటం ద్వారా మెదడుపై ఒత్తిడి తగ్గుతుందని, దాంతో భారం తగ్గి తేలికగా పరీక్షలు రాసి విజయాలు అందుకోవచ్చని అన్నారు. ఎప్పుడూ ఏ దశలో కూడా నిరుత్సాహ పడొద్దని మోదీ కోరారు. అందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఉదాహరణగా చెప్పారు. ‘ఏపీజే అబ్దుల్ కలాం ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలని అనుకున్నారు. కానీ, అందులో విఫలం అయినా తన ప్రయత్నాన్ని ఆపకుండా మరో మార్గం ఎంచుకోవడంతో మంచి శాస్త్రవేత్త అయ్యారు’ అని కలాంను మోదీ గుర్తు చేశారు. అయితే, విద్యార్థుల నుంచి మోదీ ఊహించని ప్రశ్నలు కూడా వచ్చాయి. ఆ విద్యార్థుల్లో ఒక విద్యార్థి మోదీకి ఓ ప్రశ్న వేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల పరీక్షను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారో చెప్పాలని కోరాడు. అయితే, మోదీ మాత్రం ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండా.. ‘నేను నీకు టీచర్‌ను అయి ఉన్నట్లయితే కచ్చితంగా నిన్ను జర్నలిజం వైపు వెళ్లాలని సలహా ఇస్తాను. ఎందుకంటే జర్నలిస్టులు మాత్రమే ఇలాంటి మెలిక ఉండే ప్రశ్నలు వేస్తారు’ అని చెప్పారు. మరో విద్యార్థి టీచర్ విద్యార్థి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలని ప్రశ్నించగా.. ‘మన సమాజంలో టీచర్లంటే మన కుటుంబ సభ్యులే. వారితో ఎప్పటికీ చాలా దగ్గరి సంబంధాలను కొనసాగించాలి. మీ భవిష్యత్తును, వ్యక్తిత్వాన్ని మీతల్లిదండ్రుల మాదిరిగా తీర్చిదిద్దేది వారే’ అని మోదీ చెప్పారు. ప్రతిరోజు ఒక పరీక్షలాంటిదేనని వాటన్నింటిని మనం ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అందరికీ ఆల్‌ది బెస్ట్ చెప్పిన మోదీ.. వారి విలువైన సమయాన్ని వృధా చేసినందుకు సారీ అంటూ కార్యక్రమాన్ని ముగించారు. -
టీచర్లతో మాట్లాడేందుకూ ఓ యాప్!
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మధ్య తక్షణ సమాచారం అందుబాటులో ఉండేందుకు ఓ కొత్త యాప్‌ను కనుగొన్నారు. విద్యావిధానంలో సమాచార వ్యవస్థను సులభం చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీ ఐఐటీలో చదివిన రితేష్ సింగ్, అక్షత్ గోయల్.. ఓ మొబైల్ యాప్‌ను రూపొందించారు. బీహార్‌లోని పలు పాఠశాలల్లో దీన్ని ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. 2015 జూన్‌లో లాంచ్ చేసిన 'ఎకోవేషన్ యాప్' రెండు నెలల్లోనే సుమారు 30 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమాచార మార్గాన్ని సుగమం చేసింది. 'ఎకోవేషన్ యాప్' ను తయారు చేసేందుకు రూ. 7 లక్షలు ఖర్చుచేసిన వీరిద్దరూ.. దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు పేరెంట్ - టీచర్ మీటింగ్స్‌లో మాత్రమే తల్లిదండ్రులు తమ పిల్లల గురించి తెలుసుకోగలిగేవారు. స్కూలుకు దూరంగా ఉండేవాళ్లకు ఇలాంటి అవకాశం దాదాపు ఉండేదికాదు. ఇలాంటి ఇబ్బందిని తొలగించేందుకు రితేష్, అక్షయ్ రూపొందించిన యాప్ బాగా ఉపయోగపడింది. చదువురాని తల్లిదండ్రులకు కూడా ఈ యాప్ ఉపయోగకరంగా ఉంది. వచ్చిన మెసేజ్‌ను చదవడం రాకపోయినా ఆడియో, వీడియో ద్వారా విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే పాఠశాలలో విద్యార్థుల కార్యాచరణపై ఎప్పటికప్పుడు టీచర్లు ఆడియో, వీడియో ద్వారా సమాచారం అందించే అవకాశాన్ని ఈ యాప్‌లో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉన్న ఈ 'ఎకోవేషన్' యాప్‌ను ప్రస్తుతం బీహార్‌లోని వివిధ పాఠశాలల్లో వినియోగిస్తున్నారు. ఈ యాప్‌ను ముందుగా రెండు పాఠశాలల్లో ప్రారంభించారు. తర్వాత ఇది విస్తృతంగా బీహార్ రాష్ట్రమంతా వ్యాపించింది. పూర్తి ఉచితంగా ఉపయోగించగలిగే ఈ యాప్‌ను ఎక్కడైనా సరే వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. -
పారిశ్రామిక వేత్తలతో ఏపీ సీఎం సమావేశం