సాక్షి, తాడేపల్లి: అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపచేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రం వ్యాప్తంగా పలువురు లబ్దిదారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ‘మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరే’.. అంటూ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
మా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడు..
నా పేరు శాంతిశ్రీ అన్నా.. నేను కాపునేస్తం మూడు విడతల్లో తీసుకున్నా అన్నా. నాలుగోసారి మిస్ అయితే వాలంటీర్లు నాకు రాకపోవడానికి కారణం కనుక్కొని మరీ నాలుగో విడత వచ్చేలా చేశారు. ఈ విషయం తెలియడంతో సంక్రాంతి పండగ ముందుగానే వచ్చినట్లు ఆనందం కలిగిందన్నా. నాకు కాపు నేస్తంతో చాలా సహాయం అందుతుంది. ఏ ప్రభుత్వం చేయని విధంగా మా కాపులను మీరు గుర్తుపెట్టుకొని, కాపులకు సాయం చేయాలనే తపనతో మాకు మీరు ఈ పథకాన్ని ఇచ్చారన్నా.
కాపులు గురించి ఆలోచించి మీరు మంచి పని చేశారు. కాపు నేస్తం ద్వారా కుట్టుమిషన్ కొనుక్కొని అదే నా జీవన ఉపాధిగా కొనసాగిస్తున్నా అన్నా. నా భర్త వికలాంగుడు అన్నా.. జనవరి 1 తేదీనే వాలంటీర్ మా ఇంటికి వచ్చి మరీ పించన్ డబ్బులు తెచ్చి ఇస్తున్నారు అన్నా. నాకు కొడుకులు లేరన్నా.. నా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడని మా భార్యభర్తలు ఇద్దరం చాలా సంతోషపడుతున్నాం అన్నా.
-శాంతి శ్రీ, కాపు నేస్తం లబ్దిదారు (రాజమండ్రి రూరల్ హకుంపేట్ గ్రామం)
మా అమ్మ సంతోష ఉంది.. మీరు సల్లంగా ఉండాలి..
నమస్తే జగన్ సర్.. గత రెండు నెలలుగా ఆటో డబ్బులు పడినాయ్ సార్. మూడోసారి పడలేదు.. వాలంటీర్ నాకు రాకపోవడానికి కరెంట్ బిల్లు సమస్య అని చెప్పి.. ఆ సమస్యను తీర్చి మళ్లీ మూడోసారి నాకు డబ్బులు పడేలా చేశారు. మాకు ముందు నుంచి ఈ పథకాలు లేకున్నా.. మీరు మాకు ఈ పథకం ఇస్తున్నందుకు మా ఆటోనడిపేవారందరీ తరఫున ధన్యవాదాలు సర్. మీ ద్వారా మా అమ్మకు పించన్ వస్తుంది. పించన్ మూడు వేల రూపాయలు కావటం వల్ల మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. కాబట్టి సర్.. మీరు సల్లంగా ఉండాలి.
- వాహన మిత్ర లబ్దిదారు (ఖాజా హుస్సేన్, పాణ్యం నియోజకవర్గం, కల్లూరు)
మీ సాయం.. నా జీవితానికి ఓ మలుపు
ముఖ్యమంత్రి జగనన్న గారికి నమస్కరం. నా పేరు సాయి ప్రత్యూష అన్నా.. నేను డిగ్రీ పూర్తి చేశాను. మా అమ్మగారు చిన్న హస్టల్‌లో పనిచేసేవారు. మా నాన్న గారు చిన్న సామాన్య బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. దురదృష్టవశాత్తు మా అమ్మగారు మరణించారు. అలాంటి సమయాలో నేను పైచదువులు చదవాలన్న ఆలోచనను వదులుకున్నా అన్నా. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటం వల్ల టైలరింగ్ వృత్తిని ఎంచుకున్నా. దానికి పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరూ నాకు సాయం చేయలేదన్నా. అలాంటి సమయంలో మా వాలంటీరు స్వయంగా మా ఇంటికి వచ్చి.. ‘జగనన్న చేదోడు’ పథకం కింద టైలర్లకు డబ్బులు ఇస్తున్నారని చెప్పడం జరిగింది.
దాని నేను చాలా సంతోషించా. మీరిచ్చే చేదోడు పదివేలతో పెట్టుబడి పెట్టి ఉన్న ఈ చిన్న వ్యాపారాన్ని పెద్దగా తీసుకువెళ్లాలని అనుకున్నా. ఉదయం టైలరిగ్ చేస్తూ.. సాయంత్రం ట్యూషన్ చెబుతూ జీవనం సాగిసున్నా అన్నా. మీరు చేదోడు పథకం ద్వారా ఇచ్చే పదివేల సాయం చాలా చిన్నది కావొచ్చు.. కానీ నా దృష్టిలో నా జీవితానికి ఇదొక మలుపు తిరిగే పాయింట్ అన్నా. మీరు ఇచ్చే ఈ పట్టుబడితో నా కలలు నెరవేర్చుకోవాలనుకుంటున్నా.
-సాయి ప్రత్యూష, జగనన్న చేదోడు లబ్ధిదారు, (శ్రీకాకుళం పట్టణం)
Comments
Please login to add a commentAdd a comment