Welfare schemes
-
సంక్షేమ పథకాల విస్తృతికే సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతపర్చేందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టినట్టు రాష్ట్ర రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం అన్ని రకాల అంశాలతో ఈ సర్వేను శాస్త్రీయంగా నిర్వ హిస్తోందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 17వ తేదీనాటికి రాష్ట్రవ్యాప్తంగా 58.3% ఇళ్లను సర్వే చేశామని, నెలాఖరులోగా నూరుశాతం సర్వే పూర్తి చేస్తామన్నారు.ఇప్పటికే సర్వే చేసిన ఇళ్లకు సంబంధించి వివరాలను కంప్యూ టరీకరిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ప్రజల స్థితి గతులు తెలుసుకొని ప్రస్తుతం అమలు చేస్తున్న పథ కాలను విస్తృతం చేయడంతోపాటు కొత్త పథకాల అమలు కోసం ఈ సర్వే ఎంతో ఉపయోగ పడుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా సర్వే ప్రక్రియను నిర్వ హిస్తోందన్నారు. తాజాగా చేప డుతున్న సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.మంచి ఉద్దేశంతో చేపడుతున్న సర్వేను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, అధికారులకు వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పథకాల్లో కోతపడుతుందని, పలు రకాల బెనిఫిట్స్ ఆగిపోతాయంటూ ప్రతిపక్ష పార్టీలు దుర్మార్గంగా మాట్లాడుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసిందని, కానీ ఆ సర్వేకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదన్నారు. ప్రజల ఆస్తులు తెలుసుకొని వాటిని కొల్లగొట్టేందుకు అప్పటి సర్వేను బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించుకుందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టే సర్వే దేశానికే ఆదర్శంగా నిలిపేలా ఉంటుందని చెప్పారు. -
హానికరమైన కొత్త జాతీయవాదం
2024 నవంబర్ 11న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ అనే విచిత్రమైన నినాదాన్ని ఇచ్చారు. ఇదొక భాషాపరమైన కొత్త క్రీడ అని చెప్పాలి. మోదీ నినాదం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందనుకొని, కొందరు దాన్ని మతపరమైనదిగా వ్యాఖ్యానించారు. కానీ ఈ నినాదం కుల గణన ప్రచారాన్ని వ్యతిరేకించేది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నది. భారతీయ సమాజాన్ని కుల గణన చీల్చుతుందనే ప్రచారం చేస్తున్నారు గానీ, ప్రతి కులం వాస్తవ స్థితి తెలియాలంటే కుల గణనే ఆధారం. కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన ఇప్పటి అవసరం.నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదంలోని భాషను చూద్దాం. ఏక్ అనేది ఐక్యతకు హిందీ పదం. సేఫ్ అనేది ఆంగ్ల పదం. దీని అర్థం మనకు తెలుసు. మహారాష్ట్రలో ఒక నినాదంలో సేఫ్ అనే ఆంగ్ల పదాన్ని ఎందుకు ఉపయోగించారు? ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆంగ్ల భాష వ్యాప్తి చెందడం వల్లనే. అదే ఉత్తరప్రదేశ్ అయివుంటే, బహిరంగ సభలలో కూడా ఒక ఆంగ్ల పదాన్ని మోదీ తన నినాదంలో ఉపయోగించరు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి మోదీ, ఆయన పార్టీ వ్యతిరేకం. అదే హిందుత్వ మద్దతుదారులు నిర్వహిస్తున్న అగ్రశ్రేణి కార్పొరేట్ పాఠశాలలు ఆంగ్ల భాషను ధనికులకు అమ్ముతూ అత్యున్నత వ్యాపారాన్ని చేస్తున్న ప్పుడు మాత్రం మౌనంగా ఉంటారు. నిజమైన లక్ష్యంఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ ‘బటేంగే తో కటేంగే’ నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని ఆర్ఎస్ఎస్ ఆమోదించింది. ఇప్పుడు మోదీ దాన్ని మిశ్రమ భాషతో వాడుతున్నారు. 2014 ఎన్నికల నుండి బీజేపీ, ఇతర వెనుకబడిన తరగతులనుంచి తెలివిగా ఓట్లను రాబట్టుకోవడం ప్రారంభించింది.ఆరెస్సెస్, బీజేపీ 2014 ఎన్నికల నుండి కుల సమీకరణను అంగీకరించాయి. దాంతో గుజరాత్ నుండి ఓబీసీ అయిన మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా తేవడంతో పాటు, చదరంగం లాగా తెలివిగా కుల క్రీడను ఆడటం మొదలెట్టాయి. యూపీలో యాదవుల వంటి శూద్ర అగ్రవర్ణ సమాజం పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో, పాలక కుల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న దిగువ ఓబీసీలను సమీకరించారు. ఆ విధంగారెండుసార్లు ఆ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను, అధికారాన్ని కైవసం చేసుకోగలిగారు.చాలా కాలంగా శూద్ర పాలక కులాలుగా రెడ్డి, వెలమలు ఉన్న తెలంగాణలో 2024 ఎన్నికల్లో ‘ఈసారి బీసీ ముఖ్యమంత్రి’ అనే నినాదంతో మున్నూరు కాపులు, ముదిరాజ్‌లపై బీజేపీ దృష్టి సారించింది. సాధారణంగా తెలంగాణలో రెడ్లు కాంగ్రెస్‌తో, వెలమలు బీఆర్ఎస్తో ఉన్న సంగతి తెలిసిందే. మాలలు కాంగ్రెస్‌లో ఉన్నందున దళితుల్లో మాదిగలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మాదిగల ఓట్లను రాబట్టేందుకు, ప్రత్యేక మాదిగ బహిరంగ సభలో ప్రధాని స్వయంగా ప్రసంగించారు. ఈ సమావేశంలోనే ఆయన మాదిగలకు సుప్రీంకోర్టులో న్యాయపరమైన అడ్డంకిని అధిగమించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అందువల్ల ఎస్సీ రిజర్వేషన్లలో ఉపకులాల విభజన రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాంతో రాజ్యాంగబద్ధంగా ఏదైనా సంక్షేమ ప్రయోజనాలు అందించే రిజర్వేషన్ల కోసం ఉపకుల వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించింది.కుల గణనతోనే రిజర్వేషన్లుఇలాంటి విభజన రాజకీయాలు ప్రమాదకరమని ఆరెస్సెస్, బీజేపీ శక్తులు భావించడం లేదు. వారు తమ కుల ఆధారిత విభజ నలను జాతీయవాదాలుగా ప్రదర్శిస్తారు. అయితే ఆ తీర్పును అమలు చేయాలంటే, అంతకుముందటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, భారత దేశం అంతటా ప్రతి ఉప కులానికి సంబంధించిన వస్తుగతమైన, ధ్రువీకరించదగిన డేటా తప్పనిసరి. ఈ ఉప కుల రిజర్వేషన్ తీర్పు అనేది, రిజర్వేషన్లు వర్తించే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో న్యాయమైన వాటాను అడిగే అన్ని ఉప కులాలకూ వర్తిస్తుంది. అందువల్ల రాజ్యాంగ సంస్థ అయిన ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ సేకరించిన జాతీయ కుల గణన డేటా లేకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదు.అయినా రాబోయే జాతీయ జనాభా గణనలో కుల గణనను చేపట్టాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తీర్పు, మోదీ ప్రభుత్వం రెండూ రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఎందుకంటే అనేక ఉపకులాలు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని అడుగు తున్నాయి. కానీ, విశ్వసనీయమైన కుల డేటాను సేకరించడానికికేంద్రం సుముఖంగా లేదు.ఈ నేపథ్యంలోనే కుల గణన భారతీయ సమాజాన్ని చీల్చుతుందనే ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్‌గాంధీ, కుల గణనను సమాజానికి చెందిన సామాజిక ఆర్థిక వివరా లకు సంబంధించిన ఎక్స్రేగా ప్రచారం చేస్తున్నందున, దీన్ని అగ్ర వర్ణాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆరెస్సెస్, బీజేపీ ప్రయోజనాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఐదు అగ్ర కులాలతో ముడిపడి ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు బీజేపీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే, 2024 ఎన్నికలనుంచి మోదీ, అమిత్ షా ఓబీసీ ఓట్లను తామే నిలుపుకోవడం కోసం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లిం రిజర్వేషన్లు పెంచుతారని ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అన్ని ప్రయో జనాలను కోల్పోతారని బహిరంగంగానే చెబుతున్నారు. వారు భార తీయ ముస్లింలకూ, మిగిలిన జనాభాకూ మధ్య స్పష్టమైన రేఖను గీయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ముస్లింలు చాలా కాలంగా ఓట్ల పరంగా కాంగ్రెస్‌తో జతకట్టారు.కుల గణన ముస్లింలకు ఎలా ఉపయోగం?భారతీయ ముస్లిం సమాజం చాలాకాలంగా రిజర్వేషన్ భావ జాలాన్ని అంగీకరించలేదు. వారు తమలో కుల ఉనికిని తిరస్కరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదికతో తమ విద్యాపరమైన వెనుక బాటుతనం ఒక తీవ్రమైన సమస్య అని ముస్లింలు గ్రహించారు. వాస్తవానికి, వారి వెనుకబాటుతనానికి వారి మతంతో సంబంధంఉంది. ముస్లింలు కూడా కుల గణనను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.రిజర్వేషన్ ను వాడుకోవడం తమ సామాజిక స్థాయికి తగనిదని భావించిన శూద్ర అగ్రవర్ణాలు కూడా ఇప్పుడు రిజర్వేషన్ వ్యవస్థలోకి రావాలనుకుంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో రిజర్వేషన్ల సిద్ధాంతం ప్రధాన అంశంగా మారింది. అందుకే రెడ్లు, మరాఠాలు కుల గణనకు విముఖత చూపడం లేదు.కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన భారతీయ ముస్లింలలోని ప్రతి కులం వాస్తవ స్థితిని బయటకు తెస్తుంది. ముస్లింలలో ఉన్నత కులాలు ఉన్నాయి. వీరు మొఘల్, మొఘల్ అనంతర భూస్వామ్య వ్యవస్థ నుండి, సాంప్రదాయిక ఇస్లామిజం నుండి ప్రయోజనం పొందారు. ఉదాహరణకు, పేద దిగువ కులాలముస్లింలు వెనుకబడిన మదర్సా ఉర్దూ మీడియం విద్యలోకి నెట్ట బడ్డారు; ధనిక ఉన్నత కుల ముస్లింలు స్వాతంత్య్రానికి ముందు రోజుల నుండీ ఆంగ్ల మాధ్యమ విద్యను పొందారు. ముస్లింల మధ్య ఉన్న ఈ వలయాన్ని కూడా ఛేదించి తీరాలి.కుల గణన, సంక్షేమ పథకాల న్యాయబద్ధమైన పంపిణీ,విద్య– ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రయోజనాల కోసం జాతీయ డిమాండ్ నేపథ్యంలో ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదాన్ని బీజేపీ తెలివిగా ఇచ్చింది. కుల గణన, సంక్షేమ వలయాన్ని అత్యంత అర్హులైన వారికి విస్తరించడం మాత్రమే... ఆధునిక అభివృద్ధి ప్రక్రియను కొనసాగించే భారతీయ మధ్యతరగతిని మరింతగాపెంచుతుంది.- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
రైతులకూ ఆధార్ తరహా యూనిక్ ఐడీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ఆధార్ తరహాలో యూనిక్ కోడ్ (యూసీ) ఐడీలను కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్ మొదటి వారం నుంచి మార్చి నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ప్రాజెక్ట్ మార్గదర్శకాలను విడుదల చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటలైజేషన్ దిశగా.. వ్యవసాయ రంగాన్ని పూర్తి గా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో ప్రతి రై తుకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చేపట్టిన ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయా లని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో భూ యజమానులతోపాటు కౌలు రైతులకు సైతం వీటిని జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్–అగ్రిస్టాక్ ప్రాజెక్ట్ పేరిట అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ (ఎస్పీఎంయూ)ను ఏర్పాటు చేశారు. వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల రిజిస్ట్రీని రూపొందిస్తారు. అనంతరం 14 అంకెల విశిష్ట సంఖ్యతో ఆధార్ తరహాలోనే ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు జారీ చేస్తారు. యూనిక్ ఐడీ ద్వారానే సంక్షేమ ఫలాలు ఈ కార్డుల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు కలగనున్నాయి. ఇక నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు ఈ యూనిక్ కోడ్‌ను తప్పనిసరి కానుంది. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు, పంటను మార్కెట్లో విక్రయించుకునేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. దీనిని కిసాన్ క్రెడిట్ కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రుణార్హత, రుణ బకాయిలు, పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.అగ్రి సెన్సెస్–2019 ప్రకారం లెక్క ఇదీవ్యవసాయ, ఉద్యాన, పట్టు పంటల సాగు విస్తీర్ణం: 67.44 లక్షల హెక్టార్లు వెబ్‌ల్యాండ్ డేటా ప్రకారం రైతులు: 76,06,943 మంది 2.5 ఎకరాలలోపు ఉన్న రైతులు: 52,01,870 మంది 2.5 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న రైతులు: 15,62,042 మంది 5 ఎకరాలకు పైబడి ఉన్న రైతులు: 8,43,031 మంది కౌలు రైతులు: 16.50 లక్షల మంది సెంటు భూమి కూడా లేని కౌలుదారులు: 810 లక్షల మంది దేవదాయ, అటవీ భూముల సాగుదారులు: 1.50 లక్షల మంది -
విదేశీ విద్యానిధికి మరింత ప్రోత్సాహం!
సాక్షి, హైదరాబాద్: ‘విదేశీ విద్యానిధి పథకం’లబ్ధిదారుల సంఖ్య పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సంక్షేమ పథకాల్లో అత్యంత ఎక్కువ ఆర్థికసాయం అందుతున్న పథకం కూడా ఇదే కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అత్యంత పరిమిత సంఖ్యలో అర్హులను గుర్తిస్తుండటంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్న విద్యార్థులు తీవ్ర నిరాశ పడుతున్నారు. గత ఆరేళ్లుగా సంక్షేమశాఖల వారీగా వస్తున్న దరఖాస్తుల సంఖ్యను విశ్లేషిస్తూ విద్యార్థుల సంఖ్య పెంపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించగా...ఆ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్టు సమాచారం. అతి త్వరలో ఈ ఫైలుకు మోక్షం కలుగుతుందని, ఎక్కువ మందికి లబ్ధి కలిగించాలని సంక్షేమశాఖలు భావిస్తున్నాయి.పూలే విద్యానిధికి అత్యధిక దరఖాస్తులు విదేశీ విద్యానిధి పథకం కింద అర్హత సాధించిన విద్యార్థికి నిర్దేశించిన దేశాల్లో పీజీ కోర్సు చదివేందుకు గరిష్టంగా రూ.20లక్షల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. పీజీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన వెంటనే రూ.10 లక్షలు, రెండో సంవత్సరం పూర్తి చేసిన తర్వాత మరో రూ.10 లక్షల సాయాన్ని సంబంధిత సంక్షేమ శాఖలు నేరుగా విద్యార్థి ఖాతాలో జమ చేస్తాయి. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులకు రూ.20లక్షల సాయంతో పాటుగా ప్రయాణ ఖర్చుల కింద కోర్సు ప్రారంభ సమయంలో ఫ్లైట్ చార్జీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.ప్రస్తుతం బీసీ సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యా నిధి పథకం కింద 300 మందికి మాత్రమే అవకాశం కలి్పస్తున్నారు. ఇందులో బీసీ కేటగిరీలోని కులాల ప్రాధాన్యత క్రమంలో 285 మంది విద్యార్థులకు, ఈబీసీల నుంచి 15 మందికి అవకాశం ఇస్తున్నారు. వాస్తవానికి బీసీ సంక్షేమ శాఖకు ఏటా 5 వేలకు పైబడి దరఖాస్తులు వస్తున్నాయి. కానీ అందులో 5 నుంచి 7శాతం మందికే అవకాశం లభిస్తుండగా, మిగిలిన విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెంచాలని పెద్ద సంఖ్యలో వినతులు రావడంతో బీసీ సంక్షేమశాఖ ఈ దిశగా ప్రతిపాదనలు తయారు చేసింది.ప్రస్తుతమున్న 300 పరిమితిని కనీసం వెయ్యి వరకు పెంచాలని కోరింది. ఒకేసారి ఇంతపెద్ద సంఖ్యలో పెంచే అవకాశం లేదని ఉన్నతాధికారులు సూచించడంతో కనీసం 800లకు పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 210 పరిమితిని 500కు, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 100 పరిమితిని 300 నుంచి 500 వరకు పెంచాలంటూ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. ఈ అంశంపై ఇటీవల సంక్షేమ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలోనూ చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉండటంతో ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలిసింది. అతి త్వరలో ఈ ప్రతిపాదనలు ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు వెలువడతాయని విశ్వసనీయ సమాచారం. -
మరో నాలుగేళ్లు ఫోర్టీఫైడ్ రైస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరో నాలుగేళ్ల పాటు ఉచిత ఫోర్టీఫైడ్ రైస్ అందించనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా 2028 డిసెంబర్ వరకు ఉచిత ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. సూక్షపోషకాలైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12లను బియ్యానికి జోడిస్తారు. దీన్నే ఫోర్టీఫైడ్ రైస్‌గా పిలుస్తారు. 2024 జూలై నుంచి 2028 డిసెంబర్ వరకు ఈ కార్యక్రమం అమలు కోసం రూ.17,082 కోట్లు ఖర్చు చేయనున్నారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఫోర్టీఫైడ్ రైస్ ఉచిత సరఫరాను కొనసాగించడంతో పాటు పలు అంశాలకు ఆమోదముద్ర వేశారు. గుజరాత్లో ని లోథాల్లో జాతీ య మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ఎంహెచ్సీ)ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్ఎంహెచ్సీ అభివృద్ధిలో 22 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. ‘ఫేజ్ 1ఎ’లో జాతీయ మారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం, ఆరు గ్యాలరీలు ఉంటాయని వివరించింది. భారత నావికాదళం, తీరప్రాంత రక్షకదళం గ్యాలరీలు ఉంటాయని, దేశంలోనే అతిపెద్దవిగా ఇవి నిలుస్తాయని తెలిపింది. ఫేజ్–2లో తీరప్రాంత రాష్ట్రాల పెవిలియన్లు, మారిటైమ్ ఇనిస్టిట్యూట్, హాస్టల్, నాలుగు థీమ్ బేస్డ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తారు. -
ఏపీలో ప్రశ్నార్థకంగా సంక్షేమ పథకాల అమలు
-
కూటమి సర్కార్ కుచ్చుటోపీ.. బాబు కొత్త డ్రామా: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పథకాల అమలును కూటమి సర్కార్ గాలికొదిలేసింది. నాలుగు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. గత ఐదేళ్లలో అందిన పథకాల్లో కోతలు విధిస్తోందని వైఎస్సార్సీపీ తెలిపింది. అలాగే, ఉచిత ఇసుక అంటూ చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టాడని చెప్పుకొచ్చింది.కూటమి సర్కార్‌ను ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. నాలుగు నెలల్లోనే ఇసుకని సాంతం దోచేసిన తెలుగు తమ్ముళ్లు. వైఎస్సార్సీపీ హయాంలో నిండుగా కనిపించిన ఇసుక యార్డులన్నీ ఇప్పుడు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఉచిత ఇసుక అంటూ.. చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టాడు. ఇప్పుడు ఇసుక లేదంటే జనం ఉమ్మేస్తారని భయపడి.. ఆన్లైన్ బుకింగ్ పేరుతో కూటమి ప్రభుత్వం నాటకాలాడుతోంది.నాలుగు నెలల్లోనే ఇసుకని సాంతం దోచేసిన తెలుగు తమ్ముళ్లు వైయస్ఆర్సీపీ హయాంలో నిండుగా కనిపించిన ఇసుక యార్డులన్నీ ఇప్పుడు కాళీగా దర్శనం ఫ్రీ ఇసుక అంటూ.. కుచ్చుటోపీ పెట్టిన @ncbn ఇప్పుడు ఇసుక లేదంటే జనం ఉమ్మేస్తారని భయపడి.. ఆన్లైన్ బుకింగ్ పేరుతో నాటకాలాడుతున్న @JaiTDP… pic.twitter.com/c3ia5cOyOE— YSR Congress Party (@YSRCParty) October 3, 2024 👉అలాగే, పథకాల అమలు గాలికొదిలేసి.. కోతలతో సరిపెట్టిన చంద్రబాబు. నాలుగు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. గత ఐదేళ్లుగా అందిన పథకాలకి వరుసగా కోతలు పెడుతున్నాడు. వైఫల్యాలను ప్రశ్నిస్తారని భయపడి.. టాపిక్ డైవర్ట్ చేస్తూ బురద రాజకీయాలతో చంద్రబాబు సరిపెడుతున్నాడు. పథకాల అమలు గాలికొదిలేసి.. కోతలతో సరిపెట్టిన చంద్రబాబునాలుగు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. గత ఐదేళ్లుగా అందిన పథకాలకి వరుసగా కోతలువైఫల్యాలను ప్రశ్నిస్తారని భయపడి.. టాపిక్ డైవర్ట్ చేస్తూ బురద రాజకీయాలతో సరిపెడుతున్న @ncbn #MosagaduBabu#100DaysOfCBNSadistRule pic.twitter.com/74wuVFoQYl— YSR Congress Party (@YSRCParty) October 3, 2024👉పెన్షన్ల విషయంలో కూడా పండుటాకులపై కక్ష సాధిస్తున్న చంద్రబాబు. పెన్షన్ పెంపు ముసుగేసి.. 100 రోజుల్లోనే లక్షా 50వేల మందికి కూటమి సర్కార్‌లో పెన్షన్ల కోత విధించారు. ఇదేంటని అడిగితే.. చిత్ర, విచిత్రమైన కారణాలు చెప్తున్న కూటమి నేతలు. అవ్వాతాతలపై ఎందుకు నీకు ఇంత పగ చంద్రబాబు?. పండుటాకులపై కక్ష సాధిస్తున్న చంద్రబాబు పెన్షన్ పెంపు ముసుగేసి.. 100 రోజుల్లోనే లక్షా 50 వేల మందికి పింఛను కోత అడిగితే.. చిత్ర, విచిత్రమైన కారణాలు చెప్తున్న కూటమి నేతలు అవ్వాతాతలపై ఎందుకు @ncbn నీకు ఇంత పగ?#MosagaduBabu#100DaysOfCBNSadistRule pic.twitter.com/lglZ0zqJjI— YSR Congress Party (@YSRCParty) October 3, 2024 👉కూటమి చేతగానితనంతో బెజవాడ వరద బాధితులకి తప్పని తిప్పలు. టీడీపీకి అనుకూలమైన వారికే సాయం అందేలా పావులు కదిపిన తెలుగు తమ్ముళ్లు. అర్హత ఉండి కూడా.. సాయం కోసం కలెక్టరేట్ వద్ద పడిగాపులు కాస్తున్న వేలాది మంది బాధితులు. అస్తవ్యస్తంగా బాధితుల జాబితాతో చేతులెత్తేసిన అధికారులు.. ఇదేనా చంద్రబాబు నీ అనుభవం? అని ప్రశ్నించింది. .@JaiTDP కూటమి చేతగానితనంతో బెజవాడ వరద బాధితులకి తప్పని తిప్పలు టీడీపీకి అనుకూలమైన వారికే సాయం అందేలా పావులు కదిపిన తెలుగు తమ్ముళ్లు అర్హత ఉండి కూడా.. సాయం కోసం కలెక్టరేట్ వద్ద పడిగాపులు కాస్తున్న వేలాది మంది బాధితులుఅస్వవ్యస్తంగా బాధితుల జాబితాతో చేతులెత్తేసిన… pic.twitter.com/nZghdgRDA9— YSR Congress Party (@YSRCParty) October 3, 2024ఇది కూడా చదవండి: తిరుమల జోలికి వెళ్లొద్దు.. చంద్రబాబుకు విజయసాయి వార్నింగ్ -
ఆల్ ఇన్ వన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రతి పథకానికి ఇకపై ఒకే కార్డు ఆధారం కానుంది. అదే డిజిటల్ కార్డు. ప్రతి కుటుంబానికీ ఇచ్చే ఈ డిజిటల్ కార్డులో కుటుంబసభ్యుల వివరాలన్నీ నమోదై ఉంటాయి. ఆరోగ్య, సంక్షేమ పథకాలతో పాటు రేషన్ సరుకులకు సైతం ఉపయోగపడేలా ఈ కార్డును రూపొందించనున్నారు. కుటుంబానికి చెందిన ఆధార్ కార్డు లేదా సెల్ నంబర్‌ను ఈ డిజిటల్ కార్డుతో అనుసంధానిస్తారు. ప్రస్తుతం కర్ణాటక, రాజస్తాన్, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో కుటుంబ ఆర్యోగానికి సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ కార్డులో పొందుపరిచి ఉపయోగిస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అన్ని ప్రభుత్వ పథకాలకు చిప్ అమర్చిన ఒకే డిజిటల్ కార్డు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో ఒక్కో పథకానికి ఒక్కో నంబర్‌ను కేటాయిస్తారు. తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఈ విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురావడానికి ముందే ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాన్ని అధ్యయనం చేయాలని, అక్కడ ఎదురవుతున్న సమస్యలు ఇక్కడ తలెత్తకుండా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారుల బృందాన్ని అక్కడకు పంపించాలని నిర్ణయించారు. అన్ని రికార్డులు ఒకే దగ్గర..: కేవలం ఆరోగ్యానికి సంబంధించిన అంశాలే కాకుండా.. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు, ఆ కుటుంబ సభ్యులకు అందుతున్న పథకాల వివరాలను కూడా ఈ డిజిటల్ కార్డులో పొందుపర్చనున్నారు. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుంటే..ఆ కుటుంబానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్)ను కేటాయించి, కుటుంబసభ్యుల సంఖ్య ఆధారంగా ఆ యూఐఎన్కు బై నంబర్ కేటాయిస్తారు. ఆ బై నంబర్ ఎదురుగా ఆ కుటుంబ సభ్యుని పేరు, ఆ సభ్యుడి సమస్త సమాచారం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ డిజిటల్ కార్డు పూర్తిగా సురక్షితమైనదని, అన్నిరకాల రికార్డులు ఒకే దగ్గర అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. కాగా కుటుంబంలోని ప్రతి ఇంటి సభ్యుని హెల్త్ ప్రొఫైల్ అందులో ఉండాలని, తద్వారా దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఇది ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమాచారంతో పాటు, సంక్షేమ పథకాలు కూడా ఒకేచోట ఒకే క్లిక్‌తో లభ్యమవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎక్కడైనా సేవలు, రేషన్ పొందేలా.. రాజస్థాన్, హరియాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కార్డులపై అధ్యయనం చేయాలని, వాటితో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులపై అధ్యయనం చేసి త్వరగా ఒక సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని సూచించారు. లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఈ కార్డులు ఉండాలని అన్నారు. కుటుంబసభ్యులను జత చేయడం, తొలగింపునకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఉండాలని కూడా సీఎం సూచించారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పర్యవేక్షణకు జిల్లాల వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, సంగీత సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఆలస్యం లేకుండా వైద్యండిజిటల్ కార్డులపై సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, సీఎస్ శాంతికుమారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ డిజిటల్ కార్డులో ఆ కుటుంబంలోని సభ్యుల పూర్తి ఆరోగ్య సమాచారం, వారు అంతకుముందు చేయించుకున్న వైద్య పరీక్షల నివేదికలు ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వంలో ఎంప్యానల్ అయిన అసుపత్రులన్నింటిలోనూ ఈ కార్డులను ఉపయోగించి ఎలాంటి ఆలస్యం లేకుండా వైద్యం చేయించుకోవడానికి వీలవుతుందని భావిస్తోంది. -
2026కల్లా నక్సలిజం అంతం
న్యూఢిల్లీ/షహీబ్‌గంజ్ (జార్ఖండ్): దేశంలో నక్సలిజం 2026 మార్చి నాటికి పూర్తిగా అంతమైపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘2026 మార్చి 31లోగా నక్సల్స్ హింసను, భావజాలాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. అంతకంటే ముందే నక్సలిజాన్ని అంతం చేస్తాం’’ అని పేర్కొన్నారు. హింసను విడనాడి ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. నక్సల్ హింసకు గురైన 55 మంది బాధితులనుద్దేశించి బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా దళాలు భారీ విజయాలు సాధించాయి. సమస్య ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి (ఏపీ) దాకా కారిడార్ ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ఒకప్పుడు అనుకున్నారు. కానీ ఆ ప్రణాళికలను మోదీ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర హోం శాఖ త్వరలో సంక్షేమ పథకం రూపొందిస్తుంది. ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర రంగాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాయం చేస్తుంది’’ అని వెల్లడించారు. జార్ఖండ్‌లో జేఎంఎం–కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహిస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. దీనికి అడ్డుకట్ట వేయని పక్షంలో మరో పాతికేళ్లలో చొరబాటుదారులే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా మారిపోతారని హెచ్చరించారు. స్థానిక గిరిజన సంస్కృతిని వాళ్లు సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్‌లోని గిరి«ద్లో పరివర్తన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. వీటి దెబ్బకు సంతాల్ పరగణాల్లో స్థానిక గిరిజనుల జనాభా 44 శాతం నుంచి 28 శాతానికి తగ్గిందన్నారు. -
ప్రజల బాగు కోరిన పాలకుడు
ముఖ్యమంత్రి పదవిని లక్కీ లాటరీలా పొందినవారు కొందరు, పైరవీలతో చేజిక్కించుకున్నవారు కొందరు, తెలివిగా పావులు కదిపి సాధించినవారు కొందరు... ఈ కేటగిరీల్లో కాంగ్రెస్ ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఎందరినో చూశాం. పూర్తి ప్రజాదరణతో ఒకే ఒక్కడై నిలిచి, గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన వ్యక్తి... కాదు శక్తి... డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే! జమ్మలమడుగులో పుట్టి, స్వగ్రామం పులివెందులలో, బళ్లారిలో చదివి, గుల్బర్గాలో మెడిసిన్ చేసి డాక్టరుగా పులివెందులలో రూపాయి డాక్టరుగా ఊరి జనానికి చేరువయ్యారు. చిన్ననాటి నుండీ గాంధీ, నెహ్రూలపై పెరుగుతూ వస్తున్న అభిమానం ఆయనను కాంగ్రెస్‌కు చేరువ చేసింది. పులివెందుల డిగ్రీ కాలేజీ స్థాపించి విద్యాభివృద్ధికీ, 20 పడకల ఆసుపత్రి నిర్మించి, పేదలకు ఉచిత వైద్యం చేసి ఊరి చుట్టుపక్కల ప్రజలకూ దగ్గరయ్యారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడై 1978లో కాంగ్రెస్ చీలిక రాగా ‘రెడ్డి కాంగ్రెస్’ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రతిసారీ గెలుస్తూ వచ్చారు. యువజన సర్వీసులు, ఎక్సైజ్, విద్యా శాఖలకు మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తన నాయకత్వంలో 91 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్ష నాయకుడిగా సత్తా చాటారు. 2004 ఎన్నికలకు ఏడాది ముందు జనంలోకి వెళ్ళారు. ఆ ఏడాది ఏప్రిల్ 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పాదయాత్రకు శ్రీకారం చుట్టి, ఆంధ్రప్రదేశ్ చివరి గ్రామం ఇచ్ఛాపురం వరకూ దాదాపు 1600 కిలోమీటర్లు వైఎస్ పాదయాత్ర చేశారు. దారి పొడవునా, గ్రామ గ్రామాన ప్రజల కష్టనష్టాలను కళ్ళారా చూశారు. చెవులారా విన్నారు. భగ్గున మండుతున్న ఎండల్లో కాలినడకలో ప్రజలు ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారో గమనించారు.ఓ పక్క కరువు, మరోవంక గంజినీళ్లకు కూడా నోచుకోని అభాగ్యులు, విద్యుత్ కొరత వల్ల బోర్లు పనిచేయక అచేతనులైన రైతన్నల దౌర్భాగ్య స్థితి, నిరుద్యోగుల నిస్తేజం... ఇవన్నీ ఆయనను కొత్త మనిషిగా తీర్చిదిద్దాయి. ‘ఇందిరమ్మ రాజ్యం’ తెస్తాననీ, అన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననీ ప్రజలకు మాటిచ్చారు. నమ్మకం కలిగించారు. వ్యవసాయ ప్రధానమైన గ్రామీణ ప్రజలకు విద్యుత్ చార్జీలు భారం కావడం, ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని కరెంటు సరఫరా ప్రాథమిక అవరోధంగా గుర్తించి ‘ఉచిత విద్యుత్’ హామీ ఇచ్చి ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఆ ఫైలు పైనే చేస్తానన్నారు. సరిగా పండక, అరకొర దిగుబడి తెగనమ్మితే పెట్టుబడి ధర కూడా రాక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు విని, చదివి ఆయన చలించి పోయారు. వివిధ వర్గాల ప్రజల జీవన్మరణ సమస్యలను ఎలాగైనా సరే పరిష్కరించాలని నిశ్చయించుకున్నారు. పాదయాత్ర క్రమంలో రాజమండ్రి నగరం వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల విశ్రాంతి అనంతరం మళ్ళీ నిర్విరామంగా ఇచ్ఛాపురం వరకూ నడక సాగించి, 64 రోజుల పాదయాత్ర (3 రోజుల విరామంతో కలిపి 67 రోజులు) లక్ష్యం పూర్తి చేశారు.అంతలో 2004 ఎన్నికల నగారా మోగింది. వైఎస్ హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. అంతకు పదేళ్ళ ముందు 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. కొద్దికాలానికే ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి, తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు బీజేపీ ఆసరా తోడై, 1999లో మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టారు. ప్రజలంటే గొఱె<లనీ, ఎన్నికలంటే కాస్త పేరున్న పార్టీతో జతకట్టి సునాయాసంగా గెలవచ్చనీ పాత అనుభవ పాఠాల ద్వారా నమ్మి, ఈసారి 2004 ఎన్నికల బరిలోనూ దూకారు. అలిపిరి మందుపాతర పేలుడులో త్రుటిలో బతికి బయటపడిన ఘటన సానుభూతి తెచ్చి గెలిపిస్తుందని నమ్మారు. సానుభూతి చల్లారకుండా ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు దిగారు. ప్రచార పర్వంలో ఎక్కడా సానుభూతి జాడలేదు సరికదా ప్రజాగ్రహం ఎదురైంది. కాంగ్రెస్ అఖండ విజయం, వైఎస్ ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2004 మే 14న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. అది మొదలు ప్రజలకు ఎలా మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఆయనకు మరొకటి లేదు. రైతులకు సహకార రుణమాఫీ కోసం కేంద్రాన్ని ఒప్పించారు. పీకల లోతు అప్పుల్లో మునిగి ఉన్న రైతులకు రుణ విముక్తి కలిగించారు. ‘ఆరోగ్యశ్రీ’తో అత్యంత ఖరీదైన వైద్యాన్ని నిరుపేదలకు అందించారు. పేదరికం కారణంగా పౌష్టికాహార లోపంతో గుండెజబ్బుల బారిన పడిన పసిపిల్లలకు ఉచిత శస్త్రచికిత్సలు చేయించారు.‘108 వాహనం’ ద్వారా అత్యవసర అంబులెన్సు వాహనాలను రాష్ట్రమంతటా అందుబాటులోకి తెచ్చారు. బీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య కోసం ‘ఫీజు రీ–ఇంబర్స్మెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ముస్లిమ్ మైనారిటీ విద్యార్థులకు 4 శాతం రిజర్వేషన్లతో ఇంజనీరింగ్ విద్యను అందించారు. ‘జలయజ్ఞం’తో భారీ, మధ్యతరహా, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్రం నలుమూలలా విస్తరించే పథకాలకు శ్రీకారం చుట్టారు. కోటి ఎకరాల సాగుభూమితో రాష్ట్రం అన్నపూర్ణగా విరాజిల్లాలని పట్టుదలతో కృషి చేసారు. అంతకు ముందు నామమాత్రంగా ఉండే వికలాంగ, వృద్ధాప్య పింఛన్లను ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఎస్సీ, ఎస్టీ పథకాల రుణమాఫీతో ఊరట కలిగించారు.‘ఇందిరమ్మ ఇళ్ల’ను ‘ఇందిరమ్మ ఊళ్ళు’ అనేలా గణనీయంగా నిర్మించారు. ప్రకృతి కూడా పరవశించిందేమో... హర్షాతిరేకంతో వర్షాలను చాలినంతగా రాష్ట్రమంతటా కురిపించింది. గ్రామదేవతల, దేవాలయ ఉత్సవాలు ఊరూరా పునః ప్రారంభమయ్యాయి. దేశం ఆంధ్రప్రదేశ్ వైపు తల తిప్పి చూడసాగింది. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు సైతం ‘ఆరోగ్యశ్రీ’తో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన మరికొన్ని పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేశారు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్ఠించి, మరింత జాగరూకతతో సాగుతూ, పథకాల అమలు తీరు ఎలా ఉందో ప్రజల నుండి నేరుగా తెలుసుకోవాలన్న కోరికతో ‘రచ్చబండ’ ప్రవేశపెట్టారు. తొలి సమావేశానికి హాజరవడానికి హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు పోయే క్రమంలో వాతావరణం ప్రతికూలించింది. కంట్రోల్ రూముతో సంబంధాలు తెగిపోయాయి. మరునాడు ఊహించని విషాద వార్త వెల్లడైంది. ‘నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయింది. వైఎస్ ఇకలేరు’! ఈ వార్తను తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 గుండెలు ఆగిపోయాయి. ఇంతగా ప్రేమను పొందిన నాయకుడు చరిత్రలో మరొకరు లేరు. 2009 సెప్టెంబరు 3వ తేదీ జన హృదయ విజేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక లేరని లోకానికి తెలిసిన రోజు. అదే రోజు గణేశ నిమజ్జనం. ‘గణేశ్ మహరాజ్‌కీ జై’, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో, పిల్లలు, పెద్దలు సహా అశేష జనసందోహంతో, నృత్యాలు, ఆటపాటలు, టపాసుల, డప్పులు, ఆర్కెస్ట్రాల కోలాహలంతో 24 గంటలపాటు నిర్విరామంగా సాగాల్సిన హైదరాబాద్ గణేశ్ నిమజ్జనోత్సవం అంతే జనంతో నిర్వికారంగా, ఎటువంటి ఆర్భాటం లేకుండా ఒక మహా మౌనప్రదర్శన అన్నట్టుగా సాగిపోయింది. లెక్కకు మిక్కిలిగా పూనుకున్నా జరగదనిపించే ఆ సంఘటన ఆ జననేత పట్ల గొప్ప గౌరవానికి తార్కాణం. ‘పథకాలంటే ఇవీ, పరిపాలన అంటే ఇదీ, పాలకుడంటే ఇలా...’ అని మామూలు వ్యక్తుల నుండి మేధావుల దాకా అనుకునేలా సాగిన ఆయన రాష్ట్ర నాయకత్వ హయాం ‘న భూతో న భవిష్యతి!’తిరుమలగిరి సురేందర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ -
హామీల అమలెప్పుడు ‘నెల’రాజా!
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్రెడ్డి అనే విషయం చంద్రబాబుకూ, ఆయన కొలువు కూటమికీ స్పష్టంగా తెలుసు. మొన్నటి ఎన్నికల ఫలితాలను ఎంత శాతం మేరకు ట్యాంపరింగ్ చేశారన్న రహస్యం కూడా వారికి మాత్రమే తెలుసు. అలవికాని హామీలతో తాము ఓటర్ల చెవుల్లో పెట్టిన పొద్దుతిరుగుడు పువ్వులు తమ వైపే తిరిగి ప్రశ్నించే సమయం ఆసన్నమైంది. ఆ దృష్టిని మళ్లించాలి. జనంలో జగన్‌కున్న ప్రతిష్ఠను తగ్గించాలి. ఇది వారి తక్షణ కర్తవ్యం.మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేసి నెలరోజులు దాటింది. చేసిన వాగ్దానాల అమలు సంగతి దేవుడెరుగు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఫలానా తేదీల వారీగా అమలు చేయబోతున్నామనే షెడ్యూల్‌కు కూడా జనం నోచుకోలేదు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే సంతకం చేసిన ‘మెగా డీఎస్సీ’ ఫైలుతో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. అందుతున్న సూచనలను బట్టి ఈ సంవత్సరాంతానికి కూడా ఆ పరీక్షలు పూర్తయ్యే అవకాశం లేదు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి పదవీ విరమణ చేయబోయే వారిని దృష్టిలో పెట్టుకొని ఆ సమయానికల్లా డీఎస్సీ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఈ విద్యా సంవత్సరానికే భర్తీ అయ్యే విధంగా జగన్ ప్రభుత్వం 6,100 పోస్టులతో ప్రకటించిన డీఎస్సీని చాపచుట్టేసి, వచ్చే సంవత్సరం ఖాళీ అయ్యే పోస్టులను కూడా కలిపి దానికి ‘మెగా డీఎస్సీ’ అనే ముద్ర వేసి వచ్చే సంవత్సరమే భర్తీ చేయబోతున్నారన్నమాట. ఈ సంవత్సరమే కొలువుల్లో చేరవలసిన 6,100 మంది ఉపాధ్యాయ ఔత్సాహికుల నోళ్లల్లో ఆ విధంగా మట్టికొట్టారు. సర్కార్‌వారి తొలి అడుగే చీటింగ్!పెంచిన పెన్షన్లను తొలి మాసం నుంచే ఇస్తున్నట్టు భారీ ఆర్భాటం చేశారు. అంతకు ముందు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారుల చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టి వచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. కానీ ఆచరణ అందుకు విరుద్ధంగా జరిగింది. చాలామందిని గ్రామ సచివాలయాలకు పిలిపించి క్యూలైన్లో కూర్చోబెట్టుకున్నారు. కొన్నిచోట్ల స్థానిక తెలుగుదేశం నాయకుల ఇళ్లల్లోనే కార్యక్రమాన్ని జరిపించారు. ప్రతిచోటా మెడలో పార్టీ జెండాలు కప్పుకొని హడావిడి చేశారు. కొన్నిచోట్ల జనసేన జెండాలకూ, తెలుగుదేశం జెండాలకూ మధ్య క్రెడిట్ వార్ జరిగింది.పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం గడిచిన ఐదేళ్లూ ఎలా జరిగింది? ఎప్పుడైనా రాజకీయ జోక్యం మాట విన్నామా? ఎక్కడైనా జెండాలు, కండువాలు కనిపించాయా? కుల మత రాజకీయ వర్గ లింగ భేదం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఒకటో తేదీ సూర్యోదయం వేళకే ప్రతి ఇంటి గుమ్మానికీ వలంటీర్లు చేరుకొని పెన్షన్ సొమ్ములు అందజేశారు. ఎక్కడా రాజకీయం లేదు. కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే జరిగింది. లబ్ధిదారుల ఎంపికలోగానీ, పెన్షన్ల పంపిణీలో గానీ వైసీపీ కార్యకర్తలు జోక్యం చేసుకోలేదు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదే కదా! ప్రభుత్వాలు పని చేయవలసిన తీరు ఇదే కదా!కొత్త సర్కారు వారి తొలి మాసం నిర్వాకంలోనే రాజకీయం గజ్జెలు కట్టుకొని దూకింది. తమ పార్టీ వారు కాదన్న కారణంతో చాలాచోట్ల పంపిణీ చేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ధోరణి ఇంకెంతదూరం వెళ్తుందో రానున్న రోజుల్లో పూర్తిగా అర్థమవుతుంది. పోనీ, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పెన్షన్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేశారా? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు యాభయ్యేళ్లకు పెన్షన్ వర్తింపజేస్తామన్నారు! మొదటి నెలలోనే ఇవ్వడం కుదరకపోవచ్చు. కనీసం ఏ నెలలో, ఏ సంవత్సరంలో అమలు చేస్తారన్న ప్రకటనైనా రావాలి కదా! ఆ ముహూర్తం కోసం లక్షలాదిమంది ఎదురు చూస్తున్నారు.‘సూపర్ సిక్స్’ పేరుతో తెలుగుదేశం పార్టీ ఆరు మాసాలపాటు ఊదరగొట్టిన ఆరు హామీలనైనా వెంటనే అమలు చేయడం ప్రారంభించి ఉంటే... మిగిలిన మేనిఫెస్టోపై జనం నమ్మకం పెట్టుకునే అవకాశం ఉండేది. కనీసం వాటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఈ నెల రోజుల్లో విడుదల కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. 20 లక్షల ఉద్యోగాలన్నారు, షెడ్యూల్ ప్లీజ్! నిరుద్యోగులందరికీ మూడు వేల రూపాయల నెలసరి భృతి అన్నారు. ఎప్పటి నుంచి? కనీసం ఒక ప్రకటన వచ్చినా వారికి కొంత ఊరట లభిస్తుంది.ప్రతి బిడ్డా తప్పనిసరిగా బడికి వెళ్లాలనీ, మంచి చదువు అభ్యసించాలన్న లక్ష్యంతో జగన్మోహన్రెడ్డి ‘అమ్మ ఒడి’ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని అమలు చేశారు. పిల్లల్ని బడికి పంపే విధంగా ప్రోత్సహించడం కోసం బడి వయసు పిల్లలున్న ప్రతి తల్లికీ ఏటా 15 వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. ‘ఒక్క పదిహేను వేలే ఇవ్వడం ఏమిటి, మేము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎందరు పిల్లలుంటే అన్ని పదిహేను వేలు ఇస్తామ’ని కూటమి టముకు వేసింది. ‘సూపర్ సిక్స్’లో రెండో కార్యక్రమంగా దాన్ని నమోదు చేసింది. సుమారు కోటిమంది పిల్లలు ఆశతో ఎదురు చూస్తున్నారు.పసిపిల్లల్ని ఆశపెట్టి మోసగించడం మహాపాపం. తేదీలు త్వరగా ప్రకటించండి. పుణ్యకాలం గడిచిపోతున్నది.వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే వైఎస్ జగన్ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పేరుతో రైతుకు పెట్టుబడి ఖర్చును అందజేసేది. ఈ సాయాన్ని తాము 20 వేల రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో మూడో సిక్సర్ కొట్టారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. అప్పుడే మృగశిర, ఆరుద్ర కార్తెలు ముగిసి పునర్వసు నడుస్తున్నది. సర్కారు సాయం చినుకులు ఎప్పుడు రాలుతాయో చెప్పే నాథుడు కనిపించడం లేదు. పందొమ్మిదో యేడు నుంచి యాభై తొమ్మిదేళ్ల వరకు ప్రతి మహిళకూ నెలకు పదిహేను వందలు అందజేస్తామని ‘సూపర్ సిక్స్’లో పేర్కొన్నారు.ఈ వయసులో ఉన్న మహిళల సంఖ్య సుమారు ఒక కోటీ ఎనభై లక్షలని అంచనా. వచ్చే నెల శ్రావణమాసం. శుభ దినాలు. ఆడపడుచులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి ఇంకెప్పుడు చెబుతారని అడుగుతున్నారు. ఉచితంగా ఇచ్చే మూడు సిలిండర్లను ఏయే నెలల్లో ఇవ్వబోతున్నారో తెలుసుకోగోరుతున్నారు. ఈ నిరీక్షణంతా కూటమి వాగ్ధానాల్లో పెద్దపీట వేసిన ‘సూపర్ సిక్స్’ గురించే! చేంతాడు పొడవు మేనిఫెస్టో గురించిన ప్రస్తావన ఇంకా మిగిలే ఉంది.ఎన్నికలకు ముందు అన్ని రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లను ఆమోదించుకున్నాయి. ఈ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసి ఉన్నది. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో హామీల అమలుకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటనకు ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే వాటికి అవసరమైన కేటాయింపులను ఈ బడ్జెట్లో ప్రతిపాదించాలి. అటువంటి ప్రతిపాదనలకు చోటు దక్కనట్టయితే మేనిఫెస్టో అమలు అటకెక్కినట్టే! మరో ఏడాదిపాటు మాట్లాడే అవకాశం ఉండదు. ‘సూపర్ సిక్స్’ హామీలు, పెంచిన పెన్షన్ల అమలుకు మాత్రమే అదనంగా ఏటా లక్ష కోట్లకు పైగా నిధుల అవసరం ఉన్నదని ఒక అంచనా.గతంలో అమలులో ఉన్న పథకాలను యథావిధిగా అమలు చేస్తూనే (పెన్షన్లు, అమ్మ ఒడి మినహా) అదనంగా లక్ష కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అంత సొమ్మును అదనంగా ఎలా సమీకరించబోతున్నారో తేలవలసి ఉన్నది. వారి మాటల్లోనే చెప్పాలంటే, అడ్డగోలుగా అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంకకు అమ్మమ్మగా మారుస్తారో, అమల్లో ఉన్న పథకాలకు అంటకత్తెర వేసి ఇచ్చిన హామీలను అటకెక్కిస్తారో పూర్తిస్థాయి బడ్జెట్లో తేలిపోతుంది. చంద్రబాబు ‘సంపద సృష్టి’ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడవుతుందో తెలియదు! అమరావతి నిర్మాణంతో సంపద సృష్టించడం అంటే మెజీషియన్ టోపీలోంచి పిల్లిని బయటకు తీయడం లాంటిదేనని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.ఈ నేపథ్యంలో మేనిఫెస్టో హామీలు, సంక్షేమ పథకాల కొనసాగింపు తదితర అంశాల నుంచి జనం దృష్టిని మళ్లించే రాజకీయ టక్కుటమారాలే చంద్రబాబు సర్కార్ ముందున్న ప్రత్యామ్నాయమన్న అభిప్రాయం బలపడుతున్నది. అందువల్లనే ‘రెడ్ బుక్’ ఎజెండాగానే గడిచిన నెలరోజుల పరిపాలన జరిగింది. రాజకీయ ప్రత్యర్థులపై వెయ్యికి పైగా దాడులు, విధ్వంసాలు ఈ స్వల్పకాలంలో జరిగాయి. అనేకమందిపై కేసులు పెట్టారు. మేనిఫెస్టో అమలు గురించి అడిగే సాహసం ఎవరూ చేయకూడదు. అందుకోసమని రెడ్‌బుక్ టెర్రర్ను అమలుచేస్తున్నారు. సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముద్దాయిగా చేరుస్తూ ఒక దిక్కుమాలిన కేసును కూడా నమోదు చేశారు. మూడేళ్ల కింద సుప్రీంకోర్టు కొట్టివేసిన కేసును మళ్లీ నమోదు చేసి మాజీ ముఖ్యమంత్రిని, ఇద్దరు ఐపీఎస్ అధికారులను, ఒక ప్రభుత్వ డాక్టర్‌ను ముద్దాయిలుగా చేర్చడం ఎంత తెంపరితనమో అర్థం చేసుకోవచ్చు. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తిపైనే కేసు పెడితే ప్రశ్నించే గొంతులు వణికిపోతాయని సర్కార్ పెద్దలు భావిస్తే అంతకన్నా అవివేకం ఉండదు. మేనిఫెస్టో హామీలు, ‘సూపర్ సిక్స్’ వాగ్దానాలు బడ్జెట్ పరీక్షను పాస్ కావలసిందే! లేకపోతే నిలదీసే గళాలు వేలల్లో, లక్షల్లో ఉండవు. కోట్ల గొంతుకలు విచ్చుకుంటాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, మేలుపై దేశవ్యాప్తంగా చర్చ
-
YS జగన్ ప్రభుత్వంపై SBI ప్రశంసలు
-
సంక్షేమం.. సాధికారత.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పౌరుల ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసించింది. ఏపీతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్నాటక తమ ఆదాయ రాబడుల్లో సంక్షేమ పథకాల కోసం గణనీయంగా వ్యయం చేశాయని పేర్కొంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలకు చేసిన వ్యయాలపై రీసెర్చ్ నివేదికను ఎస్బీఐ సోమవారం విడుదల చేసింది. దేశం సంక్షేమ రాజ్యంగా మారుతున్నట్లు కనిపిస్తోందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలు, పిల్లల విద్య, ఆరోగ్యంతో పాటు సాధికారత దిశగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసినట్లు నివేదిక విశ్లేషించింది. ⇒ ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను రీసెర్చ్ నివేదిక వ్యయంతో సహా ప్రముఖంగా ప్రస్తావించింది. ఏటా 47 లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫాం, బ్యాగ్, బూట్లు, పాఠ్యపుస్తకాలు తదితరాలను ఉచితంగా అందచేశారని పేర్కొంది. జగనన్న అమ్మ ఒడి కింద పిల్లల తల్లుల ఖాతాల్లో పారదర్శకంగా నగదు జమ చేశారని, ఇవన్నీ మహిళలు, పిల్లల విద్యతో ముడిపడి రూపొందించిన సంక్షేమ పథకాలని తెలిపింది. మహిళల ఆర్ధికాభివృద్ధే లక్ష్యంగా అర్హత కలిగిన ప్రతి మహిళకూ వైఎస్సార్ చేయూత పథకాన్ని అందించారని, పేద మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారని వెల్లడించింది. జగనన్న గోరు ముద్ద ద్వారా సుమారు 43 లక్షల మంది స్కూలు పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించారని, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నారని ప్రశంసించింది. పొదుపు సంఘాల మహిళల (ఎస్‌హెచ్‌జీ) సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశారని ఎస్బీఐ నివేదిక తెలిపింది. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత లక్ష్యంగా రూపొందించిన ఈ పథకాలు దేశ ఆర్ధికాభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది. ⇒ ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 12 శాతం వృద్ధి నమోదు కాగా అందులో 11 శాతం మేర సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు రీసెర్చ్ నివేదిక తెలిపింది. మహారాష్ట్రలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 10 శాతం వృద్ధి చెందగా అందులో 11 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. ఒడిశాలో ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల్లో వృద్ధి 13 శాతం కాగా అందులో 8.10 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు తెలిపింది. కేరళలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం నమోదు కాగా అందులో 8 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. కర్నాటక, పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి కంటే సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కర్నాటకలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు వృద్ధి 8 శాతం ఉండగా పధకాలకు కేటాయింపులు 15 శాతం ఉంది. పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం ఉండగా పథకాలకు కేటాయింపులు 10 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
అవసరం కాదు... అనివార్యం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో వైఎస్ జగన్ తీసుకువచ్చిన మార్పు విప్లవాత్మకమైనది. మొన్నటి ఎన్నికలలో జగన్ పార్టీ ఓటమికి కారణాలు బలమైనవేమీ కావు. ప్రత్యర్థులు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన నవరత్నాలపై తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించారు. బడుగు–బలహీన వర్గాల సంక్షేమాన్నీ, అభివృద్ధినీ ఓర్వలేని కూటమి నేతలు పనిగట్టుకొని విషప్రచారం చేశారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలుగా చిత్రిచారు. సంక్షేమ పథకాలపై పెడుతున్న దృష్టి అభివృద్ధిపై లేదని ప్రచారం చేశారు. విదేశాల్లో స్థిరపడి అమరావతిలో భూములు కొన్న కార్పొరేట్స్‌తో డబ్బులు వెదజల్లించి అడ్డదారిలో, అసంబద్ధపు ప్రేలాపనలతో కూటమి అధికారంలోకి వచ్చింది.అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాల్లో సంక్షేమాన్ని విస్మరిస్తే వెనకబడిన జాతులు సామాజికంగా, ఆర్థికంగా మరింత నష్టపోతాయి. సంక్షేమం, అభివృద్ధి వేరు వేరు కాదని రాజకీయ పార్టీలూ, నాయకులూ గుర్తించాలి. ప్రజలకు విద్య, వైద్యం ఇవ్వడం ప్రభుత్వాల ప్రాథమిక విధి. పేదల జీవితాలను సామజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పరచకుండా దేశం ముందుకు పోదు. అభివృద్ధి చెందిన వారితో ఈ పేద ప్రజలు పోటీ పడాలంటే వారికి విద్య అవసరం అని బలంగా నమ్మారు కాబట్టే జగన్ సంక్షేమానికి పెద్దపీట వేశారు. జగన్ సామాజిక వర్గాల వారీగా ఇవ్వాల్సిన సీట్ల కంటే ఎక్కువ ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. కాగా చంద్రబాబు జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వంలో తీసుకున్న మంత్రి పదవులను ఒక్క దళితుడికి కూడా కేటాయించలేదు. అధికారంలోకి వస్తే మా మేనిఫెస్టోను పక్కాగా అమలుపరుస్తామని ప్రగల్బాలు పలికిన కూటమి నేతలు ఒక పథకం కూడా అమలు కాకముందే అక్రమ కట్టడాల పేరుతో వైసీపీ పార్టీ ఆఫీసులు కూలగొడుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తల ఇళ్లపైనా దాడులు చేస్తూ విధ్వంసక పాలన ప్రారంభించారు. ప్రజల పక్షాన నిలబడి వారి భవితకు బంగారు బాటలు వేస్తారని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే... పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఈ విజయాన్ని బాబు ప్రభుత్వం వాడుకోవడం శోచనీయం. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధిచేసి తాము గత పాలకుల కంటే ఎంత గొప్పవాళ్లమో నిరూపించుకోవాల్సిన కూటమి నేతలు... అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.గత ఐదేళ్ళల్లో అనేక రంగాల్లో వచ్చిన మార్పులను చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ‘జగన్ అవసరం కాదు... అనివార్యం’ అనిపిస్తోంది. జగన్ ఈసారి కూడా అధికారంలోకి వచ్చి ఉంటే ఒక తరం పిల్లలు గొప్ప విద్యవంతులుగా విద్యాలయాల నుంచి బయటకు వచ్చేవారు. చంద్రబాబు అధికారం చేపట్టాక ఈ తరహా అభివృద్ధి ముందుకు వెళుతుందా అన్నది సందేహమే. – సునీల్ నీరడి, ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ రీసర్చ్ స్కాలర్ -
అరుదైన గౌరవం.. రష్యా లైబ్రరీలో వైఎస్ జగన్ గ్రామ స్వరాజ్యం పుస్తకం
-
సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆరు పథకాలకు టీడీపీ ప్రభుత్వం పేర్లు మార్చింది. ఈ మేరకు సాంఘిక సంకేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్థన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్‌గా ‘నాడు–నేడు’ డాష్ బోర్డు పేరు మార్పు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది.]ఈ పనుల పురోగతితో పాటు అన్ని అంశాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఓ ప్రత్యేక కమిషనర్‌ను కూడా నియమించింది. అయితే, ఇప్పటి వరకు పాఠశాల విద్యాశాఖలో ‘నాడు–నేడు’ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ను ‘స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్’గా పేరు మార్చారు. ఈ విభాగంలో రాష్ట్రంలోని సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలల పునర్ నిర్మాణంతో పాటు 11 రకాల సదుపాయాలను కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ విభాగం చేపట్టింది. -
సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ప్రజా పరిపాలనకు శ్రీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడి.. ప్రజాపరిపాలనకు సీఎం వైఎస్ జగన్ నాంది పలికి నేటికి సరిగ్గా ఐదేళ్లు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించింది. కేవలం 23 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు పరిమితమైన టీడీపీ ఘోర పరాజయం పాలైంది. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో 2019, మే 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి.. ప్రజాపరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచి్చన హామీల్లో 95 శాతం అధికారం చేపట్టిన తొలి ఏడాదే అమలుచేశారు. మొత్తమ్మీద 99 శాతం హామీలు అమలుచేసి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. సువర్ణాక్షరాలతో లిఖించేలా గత ఐదేళ్లుగా సంస్కరణలు, వికేంద్రీకరణ, సంక్షేమం, అభివృద్ధి పథకాలతో రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సీఎం జగన్ సుపరిపాలన అందించారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో డీబీటీ రూపంలో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమచేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. దేశ చరిత్రలో ఐదేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు ఎక్కడాలేవు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ఇంటిగుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు.మంచి చేసిన ప్రభుత్వానికి దన్నుగా..ఈ నేపథ్యంలో.. ఇప్పటికే అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూ.. ఏటా అమ్మఒడి పథకం కింద ఇస్తున్న సొమ్మును రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని.. రైతుభరోసా కింద ఇస్తున్న రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతామంటూ కొత్తగా హామీలిచ్చిన సీఎం జగన్.. మీ బిడ్డ ప్రభుత్వంవల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే.. ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓటువేసి ఆశీర్వదించాలని ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ వినతికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు.. రాష్ట్రం రూపురేఖలను మరింతగా గొప్పగా మార్చేందుకు వైఎస్సార్సీపీకి ప్రజలు దన్నుగా నిలిచారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లోనూ అధిక స్థానాలు చేజిక్కించుకుని వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. -
గెలుపెవరిదో వారి పాలనే చెబుతుంది!
జూన్ 4న ఎన్నికల ఫలితాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ప్రజలకోసం అమలు చేసిన కార్యక్రమాలు లోతుగా పరిశీలిస్తే గెలుపు ఎవరిది అనేది స్పష్టంగానే బోధపడుతుంది.బాబు పాలన ఎక్కువకాలం రాజధాని అమరావతి చుట్టూ తిరిగింది. ఒక పెద్ద స్కామ్‌ను నడిపింది. బాబు ముఖ్యమంత్రిగా దిగిపోయేనాటికి తాత్కాలిక సచివాలయం, కోర్టు భవనాలు నిర్మించారే తప్ప శాశ్వతమైన నిర్మాణాలు ఏవీ జరగలేదు. జగన్ మోహన్ రెడ్డి జూన్ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మనసా, వాచా, కర్మణా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి నిర్వహించారు. గ్రామస్థాయికి అధికార వికేంద్రీకరణ చేశారు. గ్రామ సచివాలయం, దానికి అనుబంధంగా వలంటీర్ వ్యవస్థను గ్రామాలలో ఏర్పాటు చేసి ప్రజలకు కావలసిన అన్ని సేవలు ఇంటి వద్దకే చేర్చారు. బాబు పాలనలో ప్రభుత్వ పాఠాశాలలు నిర్వీర్యం అయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో కావలసిన వైద్య పరికరాలు, రోగులకు కావలసిన మందులు ఇవ్వలేదు. వైద్యులు, నర్సుల ఖాళీలు నింపలేదు. ప్రైవేట్ పాఠశాలలను, వైద్యశాలలను బాగా ప్రొత్సహించారు బాబు. అయితే జగన్ పాలన ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలకు స్వర్ణయుగం అయ్యింది. వైద్యులు, నర్సుల పోస్టులు ¿ý ర్తీ చేశారు. ఆరోగ్యశ్రీ కింద పరిమితిని ఇరవై ఐదు లక్షల వరకు పెంచి, అధిక రోగాలకు ఆ పథకాన్ని వర్తింపజేశారు. కొత్తగా జగన్ ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తోంది. జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం, బడికి పిల్లలను పంపించే తల్లులకూ, బడికి వచ్చే పిల్లలకూ అనేక పథకాలను వర్తింపచేయడం తెలిసిందే. బాబు 2014లో ఇచ్చిన మ్యేనిఫెస్టోలోని ముఖ్య హామీలైన రైతు, డ్వాక్రా గ్రూపుల రుణమాఫీ చేయలేదు. పుట్టిన బిడ్డకు రూ. 25,000 డిపాజిట్ చేసే ‘మహాలక్ష్మి’ పథకం పూర్తిగా అమలు కాలేదు. ఇంటింటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు 99 శాతం అమలు చేశారు. ఇళ్లస్థలాలను మహిళల పేర ఇవ్వడం, వారికి రాజకీయాల్లోనూ మంచి అవకాశాలు ఇవ్వడం, అనేక రకాల పెన్షన్లు అమలుచేయడం చూస్తే ఆయన మహిళా పక్షపాతి అని అర్థమవుతుంది.2014 మేనిఫెస్టో అమలులో పూర్తిగా విఫలమైన బాబు 2024లో ‘బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో 177 హామీలు, ‘సూపర్ సిక్స్’ పేరుతో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వంటివాటిని చేర్చారు. అయితే సంక్షేమ పథకాలతో జగన్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని విమర్శించిన బాబు ఇప్పుడు ఆయన కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎన్నికల్లో చెప్పడాన్ని ప్రజలు నమ్మలేదు. అందుకే మే 13న రాష్ట్రంలో జరగిన ఎన్నికలలో 80 శాతం మంది వృద్ధులు, 65 శాతం మంది మహిళలు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేసినట్లు అంటున్నారు. కావున ఎన్నికలలో జగన్ విజయం సునాయాసమే! ఎ. జయప్రదా రాఘవరెడ్డి వ్యాసకర్త సామాన్య గృహిణి, కడప -
అందరివాడికే అందలం
తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్ అడిగిన తీరు ఎన్నడూ కననిదీ, విననిదీ. బహుశా దేశంలోనే ఏ నాయకుడు కూడా ఇంత ఆత్మవిశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. అన్ని వర్గాల ప్రజలూ వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులే అన్నది ఈ విశ్వాసానికి కారణం. దానికి రుజువే ఎన్నికల ప్రచారంలో ఆయనకు లభిస్తున్న అమితమైన ఆదరణ! ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మరోసారి ఆయన్ని అధికార పీఠం ఎక్కించడానికి ‘సిద్ధం’గా ఉన్నారని దీన్నిబట్టి అర్థమవుతోంది.‘కాణి’ ముత్యాలు ఇంటికే – మళ్లీ పట్టం జగన్‌కే!ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోమారు విస్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వనున్నారు. ఇది తెలుసుకోవడానికి ‘సర్వేశ్వరులను’ అడగనవసరం లేదు. గతంలో సర్వేలన్నీ సుప్రసిద్ధ మీడియా సంస్థలు నిర్వహించేవి. ఇప్పుడు ఎవరికి నచ్చిన విధంగా వారు సర్వేలు చేయించుకుంటూ ‘స్వింగ్’ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి ఇటు వైసీపీ, అటు కూటమి ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపిక, ప్రజాస్పందన నిశితంగా పరిశీలిస్తే, తీర్పు ఎలా ఉండబోతోందో మనకే అర్థమవుతుంది.జగన్ అన్ని పార్టీల కంటే ముందుగానే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ, జనసేన అవగాహన కుదుర్చుకున్నా, చివరి వరకూ బీజేపీ జత కడుతుందో లేదో తెలియని సందిగ్ధం. అందుకే చాలాచోట్ల ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించేసుకున్నారు. తీరా బీజేపీ వచ్చి చేరాక, మళ్ళీ అభ్యర్థుల ప్రకటనలో కుస్తీ పట్టాల్సి వచ్చింది. ఆశించిన స్థాయిలో కాక అతి తక్కువ సీట్లు జనసేన తీసుకోవడం, బీజేపీ పూర్వ అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా సిసలైన బీజేపీ వారికి టికెట్లు దక్కకపోవడం వంటివి లుకలుకలకు కారణమయ్యాయి. పేరుకే మూడు పార్టీల జెండాలు. జన శ్రేణులు మాత్రం కలిసి పనిచేసే పరిస్థితి చాలా చోట్ల లేకుండా పోయింది.పోనీ నిలబెట్టిన టీడీపీ అభ్యర్థుల్లో ఆణిముత్యాల లాంటి వారు ఉన్నారా అంటే, అబ్బే! చాలావరకు కాణి ముత్యాలే! ఇంచుమించు చంద్రబాబు మహా దోపిడీలో భాగస్వాములు లేదా ఆ దోపిడీ నుంచి స్ఫూర్తి పొందినవారే. ఇటు బెజవాడ దుర్గమ్మ, అటు విశాఖ కనకమహాలక్ష్మి, ఆ పక్క అనకాపల్లి నూకాలమ్మ సాక్షిగా వీరంతా కాణి ముత్యాలు. ఇలాంటివాళ్లే చంద్రబాబుకు కావాలి. టిప్పర్ డ్రైవర్లు, కమతగాళ్లు అంటే ఆయనకు అసహ్యం. ఈ బాపతు కాణి ముత్యాల్ని జనం ఆదరించరని చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే వీళ్ళు ఎక్కువగా ‘బ్యాక్ డోర్ పాలిటిక్స్’ నడుపుతుంటారు.ఇక ప్రచార తీరు పరిశీలిస్తే, తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్ అడిగిన తీరు... బహుశా దేశంలోనే ఏ నాయకుడు ఇంత ఆత్మ విశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. ఆయన ప్రచారాస్త్రాలు కూడా విలక్షణంగా ఉన్నాయని చెప్పాలి. ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా విమర్శలకే పరిమితమయ్యారు తప్ప స్థాయి మరచి తిట్లులంకించుకోలేదు, హుందాతనాన్ని కోల్పోలేదు. మరి కూటమి విషయానికొస్తే– వెకిలితనం, బూతు పురాణం, కొట్టండి, చంపండి, నరకండి అని జనాల్ని ప్రేరేపించటం సభ్య సమాజాన్ని విస్తుపరిచాయి. జగన్‌పై విసిరిన రాయి దాడిని ఖండించాల్సింది పోయి ‘గులక రాయి’ అని వెకిలితనాన్ని ప్రదర్శించటం, వలంటరీ వ్యవస్థను కట్టడి చేయడం, పండు టాకుల, పుండు రెక్కలపై ఆక్రోశం వెలిబుచ్చి వాళ్ళ చావుకి కారణం కావడం, లేని భూయాజమాన్య హక్కు చట్టంపై దుష్ప్రచారానికి పూనుకోవడం వంటివి అన్నీ బూమరాంగ్ ఆయ్యాయి. అయితే జగన్ పని అయిపోయింది, ఇక తామే అధికారంలోకి వస్తున్నామనే ఫేక్ సర్వేలలో మాత్రం ముందున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 13 లక్షలు. ఇందులో అర్బన్ ఓటర్లు కేవలం 87 లక్షలు. జగన్‌కు పెట్టని కోటల వంటి గ్రామీణ ఓటర్ల సంఖ్య 3 కోట్ల 20 లక్షలు. అందులో సంక్షేమ పథకాల లబ్ధిదారులే అధికం. ఇక కులాల ప్రాతిపదికగా చూస్తే... ఎస్సీలు 35 లక్షల 46 వేల 748, ఎస్టీలు 25 లక్షల 85 వేల 726, ముస్లింలు 23 లక్షల 84 వేల 449, బీసీ యాదవులు 25 లక్షలు, మత్స్యకారులు 15 లక్షల 74 వేల 868, గౌడలు 19 లక్షల 78 వేల 866,చంద్రబాబు చేత తీవ్ర అవమానాలకు గురైన రజకులు, నాయీ బ్రాహ్మణులు 8 లక్షల 41 వేల 400+ 4 లక్షల 15 వేల 520, బ్రాహ్మణులు 7 లక్షల 4 వేల 165. క్రైస్తవులు 3 లక్షల 15 వేల 320... ఈ సామాజిక వర్గాలలో అత్యధికులు జగన్ వైపే ఉన్నారు. అధిక శాతం ఉన్న మరొక వర్గం, గోదావరి జిల్లాల్లో నిర్ణయాత్మక శక్తి అని చెబుతున్న కాపులు, రాయలసీమలోని బలిజలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ప్రాంతాల్లో ప్రధానంగా, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు, ఒంటరులు మొత్తం 52 లక్షల 97 వేల 748 మంది. వీరిలో జనసేన వైపు ఆశగా చూసి భంగపడిన వారు, చంద్రబాబు సామాజిక వర్గంతో దశాబ్దాల వ్యతిరేకత ఉన్నవారు, వైసీపీలోని కాపు నాయకుల వెంట ఉన్నవారు... ఇలా భిన్నాభిప్రాయాలతో అటూ ఇటూ ఉంటారు. ఇక రెడ్డి వర్గంలోని 26 లక్షల 748 మందిలో అధికులు జగన్ వైపు ఉండగా, కమ్మ వర్గంలోని 26 లక్షల 46 వేల 748 మందిలో అత్యధికులు చంద్రబాబు వైపు ఉంటారు. ఇతర బీసీలు, 13 లక్షల పైచిలుకు ఉన్న వైశ్యులు ఆయా ప్రాంతాల పార్టీ అభ్యర్థుల ప్రాతిపదికన రెండు వైపులా చీలతారు. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలో అధిక శాతం వైసీపీ వైపే ఉన్నారు. గెలుపును నిర్ణయించే మరో శక్తి, నారీ శక్తి. అలాంటి మహిళలు జగన్ వైపే ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. దీనిని బట్టి, ‘మళ్లీ పట్టం జగన్‌కే – కాణి ముత్యాలు ఇంటికే!’_వ్యాసకర్త పూర్వ సంపాదకుడు- పి. విజయబాబుముస్లింలు బీజేపీని ఓడించాలి – వైసీపీని గెలిపించాలి!ప్రధాని నరేంద్ర మోదీజీ, బీజేపీల నాయకత్వంలో పదేళ్ళుగా కేంద్రంలో అధికా రంలో వున్న ఎన్డీయే ప్రభుత్వం దేశ సంపదను అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెడు తున్నది. ఒకవైపు భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానంటూనే మరోవైపు దేశ ప్రజల్ని పేదరికం లోనికి నెట్టి వేస్తున్నది. దేశ ప్రజలంటే 80 శాతం హిందువులు, 14 శాతం ముస్లింలు, 6 శాతం క్రైస్తవులు, సిక్కులు, తదిత రులు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన హ్యాపీనెస్ రిపోర్టులో భారతదేశం 126వ స్థానంలో వుంది. భారత ప్రజలు సంతోషంగా లేరు. అణిచివేతకు గురవుతున్న ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే ముస్లిం, ఐదుగురు హిందువులు. దీని అర్థం ఏమంటే మోదీ పాలనకు ప్రధాన బాధితులు హిందువులు. ఈ వాస్తవాన్ని కప్పి పుచ్చడానికి, హిందూ–ముస్లింల మధ్య తగువుపెట్టి ఎన్నికల్ని ఒక మత యుద్ధంగా మార్చడానికిస్వయంగా మోదీజీ నడుం బిగించారు. 2019 లోక్ సభ ఎన్నికల్ని ఆ పార్టీ 1761 నాటి పానిపట్టుయుద్ధంతో పోల్చేది. ఆ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ దుర్రానీ చేతుల్లో పీష్వా బాలాజీ బాజీరావు ఓడిపోవడంతో హిందువులు 250 ఏళ్లు అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేసి, మళ్ళీ అలాంటి దుఃస్థితి వస్తుందని భయపెట్టింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని ఔరంగజేబ్, శివాజీ మహారాజ్‌ల మధ్య పోరాటంగా ప్రచారం చేసింది. గతేడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టిప్పూ సుల్తాన్‌కు ఓటేస్తారా? రాణి అబ్బక్కకు ఓటేస్తారా? అని అడిగింది.వివిధ రాష్ట్రాలు విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి హిందూ సమా జంలోని కింది కులాలకు కేటాయిస్తామని బీజేపీ చెపుతున్నది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని విస్తారంగా ప్రచారం చేశారు. ఆ రెండు రాష్ట్రాల ప్రజలూ ఈ మాటల్ని నమ్మలేదు. మత ప్రాతి పదికన రిజర్వేషన్లను బీజేపీ ఆమోదించదని మరో బూటకపు ప్రచారాన్ని ప్రధాని సాగిస్తున్నారు. నిజానికి మత ప్రాతిపదికనే కులాలుంటాయి. భారత రాజ్యాంగం కొన్ని సమూహాలకు ఇచ్చిన రిజర్వేషన్లు వాస్తవా నికి మత రిజర్వేషన్లే. మాల సామాజిక వర్గానికిచెందిన ఒక వ్యక్తి తాను హిందువుననిగానీ, సిక్కును అనిగానీ ప్రకటించుకుంటేనే ఎస్సీ రిజర్వేషను పొందు తాడు. క్రైస్తవుడినని ప్రకటించుకుంటే బీసీ రిజర్వేషను పొందుతాడు. ఏమిటి దీనర్థం? బీజేపీ ముస్లిం రిజర్వేషన్‌గా ప్రచారం చేస్తున్నది కూడా నిజానికి ముస్లిం రిజర్వేషన్ కాదు. ముస్లిం సమాజంలో ఓసీలుగా పరిగణించే సయ్యద్, పఠాన్, మొఘల్, బేగ్‌లకు బీసీ రిజర్వేషన్ వర్తించదు. మహా అయితే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన సమూహాల (ఇడబ్ల్యూఎస్) కోటాలో లబ్ధి పొందవచ్చు. ముస్లింలను సాంస్కృతిక రంగంలో వివక్షకు గురి చేయడం, ఆర్థిక రంగంలో అతి క్రూరంగా బుల్ డోజర్లతో కూల్చి వేయడం బీజేపీ విధానంగా మారింది. ఏపీలో ప్రధాన పోటీదారులు అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ మొదటి నుండీ మత సామరస్యవాదుల నేల, సామ్యవాదుల భూమి. మతవిద్వేషాన్ని రగిల్చితే తప్ప రాజకీయ మనుగడ సాగించలేని బీజేపీ ఈ నేల మీద తనంత తానుగా మొలకెత్తలేని విత్తనం. 2019 ఎన్నికల్లో విడిగా పోటీచేస్తే బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడ రాలేదు. లోక్ సభ, అసెంబ్లీల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. జాతీయ స్థాయిలో ఎన్డీయేకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మాత్రమే. ఏపీ ముస్లింలు ఈసారి ఒక లెక్క ప్రకారం కాంగ్రెస్‌కు మద్దతు పలకాలి. అయితే, కర్ణాటక, తెలంగాణాల్లా ఏపీలో కాంగ్రెస్ నిర్మాణం బలంగా లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎంచుకున్న ప్రాధాన్య తల్ని ఆ పార్టీ ఏపీ నాయకులు పట్టించుకుంటున్నట్టు లేదు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బీజేపీని ఓడించాలనే పట్టుదల వున్నట్టు లేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిని గెలిపించాలా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించాలా? అనేది ఏపీ ముస్లింల ముందున్న ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసమో, మరో కారణాలతోనో వైసీపీ జగన్ ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న ఎన్డీయేతో సఖ్యంగా వున్నారు. ఇప్పుడు ఆయనే ఏపీ నేల మీద బీజేపీని ఎదుర్కోవాల్సిన స్థితిలో పడ్డారు. ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసేలోగా బీజేపీ, జగన్‌ల మధ్య పోరు మరింత వుధృతం అవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్సా? వైఎస్సార్ కాంగ్రెస్సా? అనే ప్రశ్న మళ్ళా ముస్లింల ముందుకు వచ్చి నిలిచింది. ఇది రాజకీయ సమస్య మాత్రమే కాదు. ఒక విధంగా నైతిక సమస్య కూడా. ఆంధ్రప్రదేశ్ భౌతిక రాజకీయ సమీకరణలు, కాంగ్రెస్ ఏపీ యూనిట్ వాస్తవిక బలాబలాలు, పనితీరుల్ని పరిగణన లోనికి తీసుకుంటే ముస్లింలు వైసీపీకి మద్దతు ఇవ్వడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. అది అవసరం కూడా. ఇటీవల విజయవాడలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (ముస్లిం జేఏసీ), ముస్లిం ఆలోచనాపరుల వేదిక(ఎంటీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ముస్లిం ఉలేమాలు, ఆలోచనాపరులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ప్రొఫె షనల్స్తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. -వ్యాసకర్త ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటీఎఫ్) కన్వీనర్-ఏఎం ఖాన్యజ్దానీ డానీ -
మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు
-
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
-
పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర
-
జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
ఎన్నో ఆటుపోట్లను భరించి ఒంటరిగా రాజకీయ పార్టీని స్థాపించారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక బలమైన నిజాయితీ గల ప్రజానాయకుడిగా ఎదిగారు. కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. కరోనా వల్ల రెండేళ్లు కలిసిరాక పోయినా ప్రజల్ని కంటిరెప్పల్లా కాపాడుకున్నారు. మిగిలిన కాలంలోనే పేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయి ఆంగ్ల విద్యను అందుబాటులోకి తెచ్చారు. పేద తల్లిదండ్రులకు అద్భుతమైన ఆరోగ్య సేవలను అందించారు. వలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాల ద్వారా పాలనను ప్రజల గడప వద్దకు తెచ్చారు. పెట్టుబడులను ప్రోత్సహించి పరిశ్రమలు వచ్చేట్టు చూశారు. ఒక్కమాటలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారు. అందుకే జగన్ అంటే జనాల్లో అంత ఆదరణ! జగన్ అంటే ఒక నిజం, ఒక భావోద్వేగం, ఒక విజయ సంకేతం.వై.ఎస్. జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రవేశం చేసినప్పటినుంచీ పది సంవత్సరాలు ఆటుపోట్లతో నడిచింది. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత రాజకీయంగా కాకలు తీరిన, కుట్రలు కుతంత్రాలు తెలిసిన నాయకులను ఎదిరించి ఒంటరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పుడే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్‌కు బీజం పడింది. తరువాతి కాలంలో సోనియా గాంధీ కుట్రలకు బలైపోయి పదహారు నెలలు జైలు జీవితం గడిపారు. 2017 జూలైలో తూర్పు గోదావరి జిల్లా, వైరా మండలం చాపరాయి గ్రామంలో పదహారు మంది ఆదివాసీలు విషజ్వరాలతో వైద్య సదుపాయం అందక మరణించిన విషయం తెలిసిందే. అప్పుడు జగన్ పది కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో పోలీసు రక్షణ కూడా లేకుండా నడక దారిన వెళ్లి ఆ విషయాన్ని వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. పేదల పక్షాన శాసనసభలో గళం వినిపించారు. ఇక జగన్ రాజకీయ జీవితంలో మరువలేని ప్రధాన ఘట్టం ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3,648 కిలోమీటర్లు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడిచిన పాదయాత్ర. ఈ పాదయాత్రలో జగన్ ప్రజలతో మమేకమై వారి కష్టాలు చూసి చలించి ‘నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైన నిజాయితీ గల ప్రజానాయకుడిగా ఎదిగారు. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాల్లో 151 గెలిచి ఏపీ ముఖ్యమంత్రిగా అశేష జన వాహిణి మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న యాభై ఎనిమిది నెలల పాలనా కాలంలో కరోనాతో 24 నెలలు ప్రజలను కంటికి రెప్పలా కాపాడు కోవడంలోనే గడిచింది. మిగిలిన దాదాపు మూడు సంవత్సరాల కాలంలో తన మేనిఫెస్టోలోని పథకాల ద్వారా ప్రజల ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఈ పథకాల ద్వారా మహిళా సాధికారతకు అడుగులు పడ్డాయి. వై.ఎస్.ఆర్. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో పేద ప్రజల బతుకులలో వెలుగులు ప్రసరించాయి. వడ్డీ లేని రుణాలు ఇప్పించడం వలన గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక పుష్టి కలిగింది. ముప్పై ఒక్క లక్షల మంది నిరుపేద మహిళలకు జగన్ ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసింది.అందులో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లతో పదహారు లక్షల ఇల్లు... రోడ్లు, డ్రైనేజి, నీటి వసతి, వీధి దీపాలు వంటి పూర్తి మౌలిక సదుపాయాలతో ఏర్పాటయ్యాయి. ఒక్కో ఇంటి విలువ స్థలంతో కలిపి పది లక్షలనుండి పదుహైదు లక్షల వరకు చేరి, పేదవారికి సొంత ఇంటి కల నెరవేరింది.జగన్ సుపరిపాలనలో మరో ముందడుగు 2019 ఆగస్ట్ 15 నుంచి ప్రారంభమైన వలంటీర్ వ్యవస్థ. ఇక 2019 అక్టోబర్ 2న ప్రారంభించిన గ్రామ వార్డు సచివాలయాలు ఒక సువర్ణ అధ్యాయం. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్, బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతోంది. సచివాలయాల ద్వారా ప్రజలకు రెవెన్యూ రికార్డులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, భూముల సర్వే సేవలు, ఆరోగ్యసేవలు ఏమాత్రం వ్యయ ప్రయాసలు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా వేగవంతంగా లభిస్తున్నాయి. గ్రామ స్థాయిలో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్ర సామగ్రి సేవలు మార్కెట్ కంటే తక్కువ ధరలకు అందుతున్నాయి.వైద్య రంగంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన గొప్ప మార్పు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు పైసా ఖర్చు లేకుండా అందించడం. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ హాస్పిటల్స్‌ను ఆధునీకరించారు. మహానేత రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ సేవల పరిమితిని రూ.ఇరవై ఐదు లక్షలకు పెంచారు. చికిత్స సేవలు 1,059 నుంచి 3,250 వరకు పెంచారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ ద్వారా ప్రజలకు గడప గడపకు వైద్య సేవలు అందు తున్నాయి. ఇవి కాక శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా వంశధార నది నుంచి 100 కిలోమీటర్లు పైప్‌లైన్ ద్వారా 807 గ్రామాలలోని ఏడు లక్షల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందించడం జరుగుతోంది. పలాసలో జగన్ తన పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ మరియు కిడ్ని పరిశోధన హాస్పిటల్ నిర్మించడంతో అక్కడి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుతున్నాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేనాటికి రాష్ట్రంలో 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండేవి. ఆయన శ్రీకాకుళం, కడప, ఒంగోలులో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించడానికి కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే నంద్యాల, ఏలూరు, రాజ మండ్రి, మచిలీపట్నం, విజయనగరంలలో ప్రారంభించారు. మిగిలిన 12 వైద్య కళాశాలలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.పేద పిల్లల అభివృద్ధికి విద్య అత్యవసరం అని జగన్ విశ్వసించారు. ఈ దిశగా జగన్ ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసింది. పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలోని అధి కారులతో స్థిరమైన ఆర్థికాభివృద్ధిపై చర్చలో పాల్గొనడం సామాన్య మైన విషయం కాదు.పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే సులభతర విధానంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో ఏపీకి రూ.32,800 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, ప్రస్తుత ప్రభుత్వంలో రూ.1.03 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. చిత్తూరు జిల్లా కోటర్ల పల్లె గ్రామం దగ్గర స్మార్ట్ డీవీ ప్రాజెక్ట్, అనకాపల్లి అచ్యుతా పురం దగ్గర టైర్ల తయారీ కంపెనీ, తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం దగ్గర బిర్లా క్యాస్టిక్ సోడా యూనిట్, వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ దగ్గర సెంచ్యురీ ప్యానల్స్ లాంటి పరిశ్రమలు వచ్చాయి.ఇంకా, అరబిందో, దివీస్ సంస్థల విస్తరణలతో కాకినాడ ఫార్మా యూనిట్‌గా ఎదుగుతోంది. విశాఖపట్నంలో ఇన్పోసిస్, విప్రో, భారత్ ఎలక్టాన్రిక్స్ తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆంధ్ర రాష్ట్రానికి 972 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉన్నా కొత్తగా పోర్టులు గానీ, ఫిషింగ్ హార్బర్లు గానీ ఇదివరకు రాలేదు. ప్రస్తుతం జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటి వలన మత్స్యకార కుటుంబాల వారు చేపల వేటకు గుజరాత్ తీర ప్రాంతానికి వలసలు పోనవసరం లేదు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాలనలో పేద ప్రజలకోసం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. తన ప్రభుత్వం వలన తమ కుటుంబాలకు మంచి జరిగితేనే తనకు తోడుగా నిలవమని అడుగుతున్నారు. జగన్ ఒక సంఘ సంస్కర్తగా, ప్రజారంజక పాలకుడిగా పేరు పొందిన మాట వాస్తవం. ప్రజలతో జగన్ బంధం భావోద్వేగాలతో ముడిపడి ఉంది. అందుకే సిద్ధం యాత్రలో లక్షలాది మంది పిల్లలు, యువతీ యువకులు, వృద్ధులు, మహిళలు ఎర్రటి ఎండల్లో కూడా జగన్ కోసం నిరీక్షిస్తున్నారు. ఆయన కనబడితే కేరింతలు కొడుతూ జై జగన్ అని నినాదాలు చేస్తున్నారు. ఇవి జగన్ విజయానికి సంకేతాలు.– అమూరు రాఘవరెడ్డి ‘ జె.డి.ఎస్.డబ్ల్యూ. (రిటైర్డ్),– జి.సాంబశివారెడ్డి ‘ రిటైర్డ్ ప్రిన్సిపల్,యోగి వేమన యూనివర్సిటీ, కడప -
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!