స్వాతంత్య్రానంతరం రాజకీయాల్లో కొన్ని విలువలుండేవి. కమిట్ మెంట్ రాజకీయాలుండేవి. క్రమక్రమంగా అవి మాయమై, గెలవ డమన్నదే ప్రధానాంశం అయిపోయింది. అంతే కాదు, పార్టీ సంగతి ఎలా ఉన్నా వ్యక్తిగత గెలుపునకు ప్రాధాన్య మివ్వడం పెరిగింది. సిద్ధాంతాలు మాయమై శుష్క వాగ్దానాలతో పొద్దుబుచ్చడం, గెలిచిన తర్వాత వాటిని గాలి కొదిలేయడం మామూలై పోయింది. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజ శేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యి అనేక వినూత్న పథకాలను అమలుచేసి రాజకీయాల్లో నవ శకాన్ని సృష్టించారు.
యువనాయకుడు జగన్ తండ్రి ఆదర్శా లనూ, పోరాటపటిమనూ సొంతం చేసుకొని, స్పష్టమైన రాజకీయ దృక్పథంతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్నికల్లోకి దిగారు. 2014 ఎన్నికల్లో, అతి స్వల్పకాలంలోనే గెలుపు అంచులవరకెళ్ళారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమ్రంతి అయిన చంద్రబాబు జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు తెరతీశారు. సింగపూర్ లాంటి రాజధాని అంటూ గాలిమేడలు కడుతూ ఐదేండ్లు గడిపారు. ఇదే సమయంలో జగన్ తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలకు, కన్నీళ్ళకు కారణాలను అన్వేషించారు.
తండ్రిని మించిన ఆదర్శాలతో, ప్రగతిశీల భావజాలంతో, స్పష్ట మైన రాజకీయ దృక్పథంతో, మానవీయ పథకా లతో, సామాజిక న్యాయబాటను తనదిగా చేసు కొని ఎన్నికల బరిలోకి దిగారు. దిగ్విజయం సొంతం చేసుకొన్నారు.చంద్రబాబులా పార్టీ మార్పిడులను ప్రోత్స హించి ఉంటే, టీడీపీ ప్రతిపక్షంగా కూడా మిగి లేది కాదు. కాని జగన్ ఆ పని చేయలేదు. 2019లో అధికారం చేపట్టిన జగన్ పాద యాత్రలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను మేని ఫెస్టోలో పొందుపరచి దాదాపు నూటికి నూరు పాళ్లూ నెరవేర్చారు.
ప్రభుత్వ రంగంలో విద్యాలయాలను బలో పేతం చేయడం, ఆంగ్ల మాధ్యమంలో విద్య, ఆరోగ్యశ్రీని మరిన్ని రోగాలకు వర్తింప చేయడం, ‘అమ్మ ఒడి’ లాంటి పథకాలు ప్రజా మన్నన పొందాయి. వ్యవసాయ రంగాన్ని, పారి శ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం ఉత్పత్తి రంగంలో రాష్ట్రం ముందడుగు వేసేలా చేసింది. లక్షలాది ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ సమ స్యను తీర్చ డమే కాక ‘సచివాలయ’ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజల గడప దగ్గరకు చేర్చారు జగన్.
ఇప్పుడు జగన్ పాలనతో ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకీ పుట్టగతులు లేని పరిస్థితులొచ్చాయి. జనం అంతా ఆయన వైపే! ఇది ప్రచారంతో వచ్చింది కాదు, పనుల వల్ల వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ పథకాలతో, పాలనతో లబ్ధిపొందని గడపంటూ లేదు. ఈ నాలుగేళ్ళుగా టీడీపీ, జనసేన, బీజేపీ జగన్‌పై ఎన్ని అభాండాలు మోపినా, ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌నే కోరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల వేడి ఎప్పుడో రాజుకుంది. అనైతిక పొత్తులు, ఏ విలువలూ లేని రాజకీయాలు, రంధ్రాన్వేషణలు, ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదలలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మూడు దశాబ్దాల పైగా చరిత్ర ఉన్న పార్టీ, పది పన్నెండేళ్ల వయసున్న పార్టీని ఓడించడానికి సినీగ్లామర్‌ని ఉప యోగించుకోవడానికీ, కులమతాలను రెచ్చగొట్టే పార్టీతో పొత్తు పెట్టు కోవడానికీ సిద్ధమవుతోంది. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అను భవం, నలభై ఏండ్ల రాజకీయాను భవం ఉన్న పార్టీ నాయకునికి ఇతర పార్టీలతో పొత్తు ఎందుకో అర్థంకాని విషయం.
పనినే దైవంగా భావించి, ప్రజలనే దేవు ళ్ళుగా భావిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్ మరోసారి సీఎం కావడం ఖాయం. రాజకీయ విలువల వలవలొలుస్తున్న నాయకులను, పార్టీలను మట్టికరిపించి, రాజ కీయ శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా మార్చే క్రమాన్ని ప్రజలే అడ్డుకొంటారని జగన్ పాలన రుజువు చేస్తున్నది.
డా‘‘ కాలువ మల్లయ్య
వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత
మొబైల్: 91829 18567
కమిట్‌మెంట్ రాజకీయాలే ఊపిరిగా...
Published Wed, Nov 29 2023 5:03 AM | Last Updated on Wed, Nov 29 2023 5:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment