YS Jagan Mark Governance
-
జగన్ హయాం ఆర్థిక ప్రగతికి కితాబు
ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ రష్యాలో రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్య మిస్తూ, అనేక పుస్తకాలు రచించారు. ప్రస్తుత రష్యా పాలకుల చేత ఉగ్ర వాదిగా కూడా ముద్ర వేయించుకున్నారు. రష్యాలో నిరంతరం జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా ప్రపంచ వేదికలపై తన గళాన్ని తరచుగా వినిపిస్తున్నారు. ఒక సందర్భంలో ఆయన ‘తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారి లక్ష్యం మనల్ని పెడతోవ పట్టించి వారి అజెండాను మనపై రుద్దడమే కాదు, నిజాలను తెలుసుకోవాలన్న మన ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేయడం కూడా’ అంటారు. ప్రస్తుత సమాజంలో తప్పుడు కథనాలు, ప్రకటనలు ప్రజల మేధను కలుషితం చేస్తున్నాయి. వారు తప్పుడు నిర్ణయాలు తీసు కునేలా చేస్తున్నాయి. దీనికి ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసినప్పటికీ, ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకొన్నప్పటికీ, అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించినప్పటికీ; ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, వారి అనుకూల మీడియా నిరంతరం చేసిన తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఫలితంగా మంచి చేసే ప్రభుత్వాన్ని చేజేతులా గద్దెదించి, కూటమి నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకున్నారు. దీని దుష్ఫలితా లను ఆంధ్రులు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయలేక చేతులెత్తేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నెలకో వివాదాన్ని సృష్టిస్తోంది. ఆంతేగాక గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది.కూటమి నేతలు నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వృద్ధి కుంటుపడిందనీ, తాము ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నా మనీ అంటున్నారు. అయితే వీరి అవాస్తవ ప్రచారాన్ని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు నివేదికలు పటాపంచలు చేశాయి. జగన్ హయాంలో కుప్పలు తెప్పలుగా అప్పులు చేశారనీ, అప్పుల భారం రూ. 14 లక్షల కోట్లకు చేరిందనీ... ఎన్నికల సమయంలోనూ, తర్వాత కూడా కూటమి నేతలు ప్రచారం చేశారు. అయితే ఈ అప్పులు రూ. 7.5 లక్షల కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ధారించాయి. జగన్మోహన్రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా నివేదిక ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండి యన్ స్టేట్స్’లో పేర్కొంది.కోవిడ్ కారణంగా రెండేళ్ళపాటు దేశం ఆర్థిక ఒడు దుడుకులకు లోనయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం జగన్ పాలనలో అనేక రంగాల్లో రెండంకెల వృద్ధిలో దూసుకు పోయింది. 2022–23లో దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం ఉంటే ఆ ఏడాది ఏపీలో 11.43 శాతం నమోదయ్యింది. జగన్ హయాంలో నాలుగేళ్ళ సగటు వృద్ధి 12.70గా నమోదయ్యింది. ఇది దేశంలోనే అత్యధిక వృద్ధి రేట్లలో ఒకటి. 2018–19 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2018–31 మార్చి 2019) చంద్రబాబు నాయుడు హయాంలో రూ. 7.90 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 13.17 లక్షల కోట్లకు పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో తెలిపింది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2018–19లో రూ. 1,54,031 కాగా, 2023–24లో అది రూ. 2,42,479 పెరిగింది. తయారీ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సమ కూరిన నికర స్థూల విలువ 2018–19లో రూ. 67.30 వేల కోట్లు కాగా, 2023–24లో జగన్ ప్రభుత్వ హయాం నాటికి రూ. 1.29 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గి, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఫలితంగా రైతుల ఆదాయాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. 2018–19లో రూ. 9.97 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రంగం నికర విలువ 2023–24లో రూ. 16.82 లక్షల కోట్లకు పెరిగింది. 2018–19లో రూ. 56.10 వేల కోట్లుగా ఉన్న నిర్మాణ రంగం నికర విలువ 2023–24లో రూ. 95.74 వేల కోట్లకు పెరిగింది.జగన్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పారిపోయారంటూ విష ప్రచారం చేశారు. అయితే పారిశ్రామిక రంగం నికర విలువ 2018–19లో రూ. 1.57 లక్షల కోట్లు కాగా,అది 2023–24లో రూ. 2.82 లక్షల కోట్లకు పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల నికర విలువ 2018–19లో రూ. 32.43 వేల కోట్లు కాగా, 2023–24 నాటికి రూ. 56.59 వేల కోట్లకు పెరిగింది. సేవా రంగం నికర విలువ 2018–19లో రూ. 2.96 లక్షల కోట్లు కాగా, అది 2023–24లో రూ. 4.67 లక్షల కోట్లకు పెరిగింది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగం గత ప్రభుత్వ హయాంలో 38.41 శాతం, నిర్మాణ రంగంలో 26.75 శాతం, మత్స్య రంగంలో 25.92 శాతం, పారిశ్రామిక రంగంలో 25.58 శాతం, తయారీ రంగంలో 24.84 శాతం, ఆతిథ్య రంగంలో 22.70 శాతం, సర్వీస్ సెక్టార్లో 18.91 శాతం, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 14.50 శాతం వృద్ధి సాధించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం జగన్ ప్రభుత్వ హయాంలో యేటా 50 లక్షల టన్నుల చేపలు – రొయ్యల ఉత్పత్తులతో, 1.76 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆయిల్ పామ్ సాగులో కూడా ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశ ఎగుమతుల్లో సుమారు 11 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగాయి. ఏపీ నుంచి సుమారు రెండువేల రకాల ఉత్పత్తులు దేశ విదే శాలకు ఎగుమతి అయ్యాయి. జగన్ పాలనలో మహిళలు, పేదలు కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ ఫలాలు అనుభవించారు. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల్లో రాష్ట్రం దేశానికే దిశానిర్దేశం చేసింది. కాని జగన్ రాజకీయ ప్రత్యర్థుల అబద్ధపు ప్రచారం ప్రజలను ప్రభావితం చేసింది. ఇప్పుడు ప్రజలు తాము మోసపోయామని వాపోతున్నారు. అధికారం కోసం వెంప ర్లాడే వారు, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా వర్గాలు నిజాన్ని ఫణంగా పెట్టి చెప్పే ప్రతి అబద్ధానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించ వలసి ఉంటుంది.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్మొబైల్: 89859 41411 -
జగన్ హయాంలో జీఎస్డీపీ జోరు
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం రెండేళ్ల పాటు వెంటాడినప్పటికీ గత ఐదేళ్లూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం వృద్ధిలో ముందుకే మినహా ఎక్కడా వెనకడుగు వేయలేదు. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు తలసరి ఆదాయం భారీగా పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లపై కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం భారీగా వెచ్చించింది. గతంలో చంద్రబాబు పాలనతో పోలిస్తే.. విద్య, వైద్యం, తాగునీరు, సంక్షేమం, పారిశుద్ధ్యం, గ్రామీణ, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ సామాజిక రంగంపై వైఎస్ జగన్ ఏకంగా రూ.1.98 లక్షల కోట్లు అధికంగా వెచ్చించడం గమనార్హం. ఇక వైఎస్ జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.1.94 లక్షల కోట్లు పెరిగింది. వ్యవసాయ, తయారీ, పారిశ్రామిక, సేవలు, నిర్మాణ రంగాలన్నింటిలోనూ వృద్ధి కొనసాగింది. స్థిర ధరల ఆధారంగా వృద్ధి గణన మాత్రమే నిజమైన అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటారు. ఈమేరకు 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ రంగాల వృద్ధి గణాంకాలను ఆర్బీఐ విడుదల చేసింది.⇒ ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా జీఎస్డీపీలో 31.04 శాతం వృద్ధి నమోదైనట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. సగటు వార్షిక వృద్ధి 6.20 శాతం నమోదైంది. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి 16.46 శాతం నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 3.29 శాతం నమోదైంది. కోవిడ్ సంక్షోభం రెండేళ్లు వెంటాడినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా కొనసాగిస్తూ నగదు బదిలీ పథకాలతో ప్రజలను ఆదుకోవడం వల్లే ఈ వృద్ధి నమోదైందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ⇒ ఇక గత ఐదేళ్లలో తయారీ రంగంలో 58.39 శాతం వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 11.67 శాతం నమోదైంది. గత ఐదేళ్లలో పారిశ్రామిక రంగంలో 46.62 శాతం వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 9.32 శాతం నమోదైంది.⇒ నిర్మాణ రంగంలో గత ఐదేళ్లలో 41.50 శాతం వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 8.3 శాతంగా ఉంది. గత ఐదేళ్లలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో 42.04 శాతం వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 8.40 శాతంగా ఉంది. ⇒ గత ఐదేళ్లలో సేవల రంగంలో 22.90 శాతం వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 4.5 శాతంగా ఉంది.సామాజిక రంగానికి జగన్ పెద్దపీటగత ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సామాజిక రంగంపై వెచ్చించిన వ్యయం భారీగా పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి. చంద్రబాబు గత పాలనతో పోల్చితే వైఎస్ జగన్ ఐదేళ్లలో సామాజిక రంగంపై వ్యయం రూ.1.98 లక్షల కోట్లు అదనంగా వెచ్చించారు. విద్య, వైద్యం, తాగునీరు, సంక్షేమం, పారిశుద్ధ్యం, గ్రామీణ, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం లాంటి వాటిపై వెచ్చించే ఖర్చులు సామాజిక రంగం వ్యయం కిందకు వస్తాయి. చంద్రబాబు గత పాలనలో సామాజిక రంగంపై వ్యయం రూ.3.24 లక్షల కోట్లుగా ఉంటే వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో సామాజిక రంగంపై వెచ్చించిన వ్యయం రూ.5.22 లక్షల కోట్లుగా ఉంది.గణనీయంగా పెరిగిన సొంత పన్ను ఆదాయంవైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం భారీగా పెరిగింది. రెండేళ్లు కోవిడ్ సంక్షోభం వెంటాడినప్పటికీ గతంలో చంద్రబాబు పాలనతో పోల్చితే ఐదేళ్లలో జగన్ హయాంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.1.35 లక్షల కోట్లు ఎక్కువగా పెరిగింది. చంద్రబాబు గత పాలనలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.2.37 లక్షల కోట్లు కాగా వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ఐదేళ్లలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.3.72 లక్షల కోట్లు వచ్చింది.తలసరి ఆదాయం పెరుగుదలరాష్ట్ర తలసరి ఆదాయం వైఎస్సార్ సీపీ హయాంలో భారీగా పెరిగింది. చంద్రబాబు పాలనలో 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 కాగా వైఎస్.జగన్ హయాంలో 2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,42,479కి పెరిగింది.ఉద్యోగుల పెన్షన్ల వ్యయం పెరుగుదలవైఎస్ జగన్ ఉద్యోగుల పెన్షన్ల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. గతంలో చంద్రబాబు పాలనలో పోల్చితే వైఎస్ జగన్ ఐదేళ్లలో ఉద్యోగుల పెన్షన్ల కోసం రూ.31,425 కోట్లు అదనంగా ఇచ్చారు. గతంలో చంద్రబాబు ఐదేళ్లలో పెన్షన్ల కోసం రూ.65,620 కోట్లు వెచ్చించగా వైఎస్ జగన్ ఐదేళ్లలో పెన్షన్ల కోసం రూ.97,045 కోట్లు వ్యయం చేశారు.తలసరి విద్యుత్ లభ్యత పెరుగుదలఅభివృద్ధికి తలసరి విద్యుత్ లభ్యత కూడా కొలమానంగా ఉంటుంది. చంద్రబాబు హయాంతో పోలిస్తే తలసరి విద్యుత్ లభ్యత వైఎస్ జగన్ పాలనలో గణనీయంగా పెరిగింది. 2018–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా తలసరి విద్యుత్ లభ్యత గంటకు 1,289.4 కిలోవాట్ ఉండగా వైఎస్ జగన్ పాలనలో 2023–24లో తలసరి విద్యుత్ లభ్యత గంటకు 1,623.0 కిలోవాట్‌కు పెరిగింది. -
నిబంధనలకు లోబడే గత సర్కారు అప్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై ఇన్ని రోజులు కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని, గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పులు చేసిందని ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కుండబద్ధలు కొట్టింది. 2023–24 ఆర్థిక ఏడాది అకౌంట్స్‌ను కాగ్ బుధవారం అసెంబ్లీకి సమర్పించింది. 2023–24లో మార్కెట్ నుంచి రూ.68,414 కోట్లు అప్పు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రూ.68,400 కోట్లు మాత్రమే అప్పు చేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వం గ్యారెంటీ రుణాలు కూడా నిబంధనలకు లోబడే ఉన్నాయని కాగ్ పేర్కొంది. 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పులతో పాటు గ్యారెంటీ అప్పులను కూడా కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అప్పులు దాచేస్తున్నారంటూ గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని కాగ్ నివేదిక సాక్షిగా తేటతెల్లమైంది. బడ్జెట్, కాగ్ నివేదిక సాక్షిగా..చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా గత సర్కారు హయాంలో రూ.పది లక్షల కోట్లు అప్పులు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. నిన్న బడ్జెట్ సాక్షిగా.. నేడు కాగ్ నివేదిక ద్వారా వైఎస్సార్సీపీ హయాంలో అప్పులకు సంబంధించి ఎల్లో మీడియా, చంద్రబాబు అండ్‌కో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలనేనని తేలిపోయింది. 2023–24 నాటికి ప్రజా రుణం రూ.4,86,151 కోట్లుగా ఉన్నట్లు కాగ్ స్పష్టం చేసింది. 2023–24 నాటికి ప్రభుత్వ గ్యారెంటీ ద్వారా చేసిన రుణాలు రూ.1,54,797 కోట్లు మాత్రమేనని కాగ్ వెల్లడించింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) నిబంధనల మేరకు 2023–24లో జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3 శాతం ఉండాల్సి ఉండగా అంతకన్నా తక్కువకే 2.68 శాతానికే పరిమితం అయినట్లు నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యలోటు జీఎస్డీపీలో 4 శాతం ఉండాల్సి ఉండగా స్వల్పంగా పెరిగి 4.35 శాతానికి చేరిందని కాగ్ పేర్కొంది. -
Andhra Pradesh: ఉల్లి రైతు గుల్ల!
సాక్షి, అమరావతి: ఉల్లి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు వరదలు, భారీ వర్షాలు లాంటి వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేసిన పంటను దళారులు అడిగిన రేటుకు విక్రయించాల్సి రావడం... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో హతాశులవుతున్నారు. ఒకపక్క బయట మార్కెట్లో ఉల్లి ధరలు దిగి రావడం లేదు. మరోపక్క రైతన్నలు గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్నాడు. వెరసి అటు వినియోగదారులకు ఇటు అన్నదాతలకు ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉల్లి పంటకు పేరుపొందిన కర్నూలు జిల్లాలో సౌకర్యాలు లేక నష్టపోతుంటే వైఎస్సార్ కడప జిల్లాలో గిట్టుబాటు ధర లభించక నష్టాల పాలవుతున్నారు.1.72 లక్షల ఎకరాల్లో సాగు..రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం లక్ష ఎకరాలు కాగా, ఈ ఏడాది 1.72 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో 70 శాతానికి పైగా కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. ఈ ఒక్క జిల్లాలోనే ఈ ఏడాది 1.12 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగైంది. ఆ తర్వాత వైఎస్సార్, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉంది. మూడు నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. ఖరీఫ్‌లో 8–10 టన్నులు, రబీలో 10–20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. కనీసం 3–6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ సదుపాయాల్లేక పంట చేతికి రాగానే అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఖరీఫ్ సీజన్లో కర్నూలు, అనంతపురం జిల్లాలలో మినహా మిగిలిన చోట్ల అధిక వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే కాస్త ఆశాజనకంగా ఎకరాకు 100 క్వింటాళ్ల దిగుబడులొచ్చాయి. అలాగే ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో రైతులు తమకు మంచి ధర వస్తుందని ఆశగా ఖరీఫ్‌లో ఎక్కువ విస్తీర్ణంలో ఉల్లి సాగుచేశారు. తీరా పంట మంచిగా ఎదిగే సమయంలో వర్షాభావంతోపాటు భారీ వర్షాలు, వరదల ప్రభావానికి గురై 30 నుంచి 40 శాతం వరకు దెబ్బతిన్నది. అయినా మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర ఉండటంతో మిగిలిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశగా ఎదురు చూశారు. పంట చేతికొచ్చే సమయంలో దళారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తుండటం, సౌకర్యాల లేమితో మార్కెట్‌కు తీసుకువెళ్లిన పంట దెబ్బతినడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. కోతలు మొదలైనప్పటి నుంచి కష్టాలుకోతకొచ్చిన పంట మార్కెట్‌కు రావడం మొదలైన దగ్గర నుంచి ఉల్లి రైతుకు కష్టాలు మొదలయ్యాయి. పెరిగిన విస్తీర్ణం, దిగుబడులను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈనామ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలకు తోడు కాటాలు, కూలీల కొరత ఉల్లి రైతుల ఆశలను దెబ్బతీసింది. కర్నూలు మార్కెట్ యార్డుకు రోజుకు 26 వేల క్వింటాళ్ల పంట వస్తుండగా ఆ స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో రైతులు రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. సర్వర్ సమస్యల కారణంగా టెండర్లలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో టన్నుకు 50–100 కేజీల వరకు ఉల్లి దెబ్బతినడంతో ఆ మేరకు నష్టపోయారు. కర్నూలు యార్డు పరిధిలో ఈ సీజన్లో గరిష్టంగా క్వింటాకు రూ.4,300 ధర లభించగా, సగటున రూ.1,500 నుంచి రూ.3 వేల చొప్పున ధర లభించింది.రోజు విడిచి రోజు విక్రయాలుఈనామ్లో సాంకేతిక సమస్యను అధిగమించేందుకు వారం పట్టింది. అదేవిధంగా వాహనాలు, కాటాలు సమకూర్చలేక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రోజు విడిచి రోజు ఉల్లి విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వైఎస్సార్ జిల్లాలో 15 వేల ఎకరాలకు పైగా ఉల్లి సాగవుతోంది. వర్షాల వల్ల పంట దెబ్బతింది. క్వాలిటీ లేదనే సాకుతో ఇక్కడ క్వింటాకు గరిష్టంగా రూ.1,500 ధర లభించగా, సగటున రూ.వెయ్యికి మించి దక్కడం లేదు.ఉల్లి రైతుకు అండగా జగన్ సర్కారుఒక జిల్లాలో ఒక పంట పథకం కింద ఉల్లి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 25 టన్నుల సామర్థ్యంతో ఒక్కొక్కటి రూ.1.75 లక్షల అంచనా వ్యయంతో మల్టీ యుటిలిటీ కేంద్రాలను నిర్మించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 600కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉల్లి ఉత్పత్తిదారుల సంఘాలకు 75% సబ్సిడీతో సోలార్ పాలీ డ్రయర్లు, వాహనాలు, 50% సబ్సిడీపై ఉల్లి డీ టాపింగ్ మిషన్లు, ఉల్లి సీడ్ డిబ్లర్స్తో 40% సబ్సిడీపై సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లను గత ప్రభుత్వం సమకూర్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా క్వింటాకు రూ.770 కనీస మద్దతు ధర ప్రకటించింది. ధర తగ్గిన సందర్భాల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంది. ధరలు పెరిగిన సందర్భాల్లో షోలాపూర్ మార్కెట్ నుంచి ఉల్లిని కొనుగోలు చేసి సబ్సిడీపై రూ.50కే సరఫరా చేసి వినియోగదారులపై భారం పడకుండా అండగా నిలిచింది. గత ప్రభుత్వ హయాంలో క్వింటాకు రికార్డు స్థాయిలో రూ.13 వేలకు పైగా ధర లభించింది. కిలో రూ.2 నుంచి రూ.4 మించి ధర లేని సమయంలో కిలో రూ.6 నుంచి రూ.10 మధ్య ధర చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ లెక్కన టన్నుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా వెచ్చించింది. ఇలా ఐదేళ్లలో రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేయగా, 2014–19 మధ్య టీడీపీ హయాంలో కేవలం రూ.6.38 కోట్లు వెచ్చించి 4,900 టన్నుల ఉల్లిని మాత్రమే కొన్నారు. -
వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి!
ప్రభుత్వ పథకాలను అర్హులకు ఎలాంటి అవి నీతికి, వివక్షకు తావులేకుండా చేరేలా చూడటానికి వైఎస్ జగన్ తన పాలనా కాలంలో తీసుకువచ్చిన సమున్నత వ్యవస్థ వలంటీర్ల వ్యవస్థ. దాదాపు రెండున్నర లక్షల మంది యువతీ యువకులు నెలకు కేవలం ఐదువేల రూపాయలు చొప్పున పొందుతూ ప్రభుత్వానికీ–ప్రజలకూ మధ్య వారధిగా నిలిచారు. పదకొండు వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాల నుండి ఆయా గ్రామాల– వార్డుల లోని ఇళ్ళ ముంగిటకు ప్రభుత్వ సేవలను చేర్చే వ్యవస్థ ఇది. ముఖ్యంగా నిరుపేదల, వృద్ధుల, దివ్యాంగుల, దీర్ఘరోగ పీడితుల మన్ననలను చూరగొని ఇతర రాష్ట్రాలకు సయితం స్ఫూర్తిగా నిలిచింది. కరోనా లాంటి విపత్కర సమయంలో విశిష్ట సేవలు అందించింది. అటువంటి ఉదాత్త వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గత ఐదేళ్ళలో ఎంతో బురద చల్లారు, దుష్ప్రచారం చేశారు. గోనె సంచులు మోసే ఉద్యోగమా అని ఈసడించి అవమానించారు. పవన్ కల్యాణ్ అయితే, మరింత హీనంగా దిగజారి వలంటీర్లు తాము సేకరించిన డేటా ద్వారా 30 వేల ఎమంది మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేయించారని పెద్ద అభాండమే వేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, తన ఆరోపణలపై ఎందుకు విచారణ జరిపించలేదో మరి!తీరా ఎన్నికలు సమీపించేసరికి బాబు వలంటీర్లను చంకకెత్తుకొని ‘మీకు పదివేలు ఇస్తా, మీ నైపుణ్యాలను పెంచుతా, సంపన్నులను చేస్తా’ అని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు గెలిచి ప్రభుత్వం ఏర్పరిచాక వారి సేవలను కొనసాగించకుండా, పరోక్షంగా రద్దు చేసినట్లే ప్రవర్తిస్తున్నారు. సచివాలయ సిబ్బందినే ఇంటింటికి పంపి మొదటి నెలలో వలంటీర్లు లేకుండానే పెన్షన్లను డోర్ డెలివరీ చేశామని గొప్ప చెప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటినా, తమ వ్యవస్థను కొనసాగించకపోవడంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వలంటీర్లు ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదే బాబు నిర్వాకం వల్ల బెజవాడ బుడమేరు వరదలో ముని గితే, గతిలేని పరిస్థితుల్లో వలంటీర్లను పిలిచి వారి సేవలను ఉపయోగించుకున్నారు. విలయం తగ్గాక వలంటీర్లను పట్టించుకోవడం మానేశారు.కూటమి హామీ ఇచ్చిన సూపర్–6లో ఏడాదికి నాలుగు లక్షలు చొప్పున 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామనే హామీ అమలు ప్రారంభం కాకపోగా, ఉన్న రెండున్నర లక్షల వలంటీర్లతో సహా మరెన్నో వేలమంది ఉపాధికి ఎసరు పెట్టారు. ఎంతో సదుద్దేశంతో జగన్ ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థను మంచి బుద్ధితో కొనసాగించాల్సింది పోయి జగన్ మీది ద్వేషం, పగ, కక్షలతో ఆ వ్యవస్థను నిర్మూలించడానికే దురాలో చనలు చేస్తున్నారు. ఇది తగదు. పాలక–ప్రతిపక్ష పార్టీల మధ్య విధానాల పరంగా, రాజకీయంగా విభేదాలు ఉండవచ్చుగాక... కానీ ఒక ఆదర్శ వ్యవస్థను అంతం చేయబూనటం మున్ముందు పాలక కూటమికి పతనహేతువు కాగలదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.వలంటీర్లు అంటే ఎవరనుకుంటున్నారు? వాళ్ళు మన సామాజిక స్వర్ణయుగపు చందమామ కథల రోజుల నాటి ‘పరోపకారి పాపన్నలు!’ 50 ఇళ్ళకు ఒకరు చొప్పున పిలిస్తే పలికే ఆపద్బాంధవులు! ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులకు సత్వరం అందించే దూతలు! పేదల ఆశీర్వచనాలు అందుకుంటూ తృప్తిపడే అల్ప సంతోషులు!1969 మహాత్మాగాంధీ శత జయంతి సందర్భంగా దేశంలోని అన్ని కళాశాలల విద్యార్థులలో స్వచ్ఛంద సేవానిరతిని పెంపొందించేందుకు జాతీయ సేవా పథకం ప్రవేశపెట్టారు. ఒక విధంగా దానికి కొనసాగింపుగా మన రాష్ట్రంలో వచ్చిన వ్యవస్థ ఈ వలంటీర్ వ్యవస్థ అని చెప్పవచ్చు. లక్ష లాదిగా వున్న ఈ వలంటీర్లకు ప్రభుత్వం న్యాయం చేకూర్చాలి.ఈదర గోపీచంద్ వ్యాసకర్త ‘గాంధీ స్మారక సమితి’ వ్యవస్థాపకులు ‘ 94403 45494 -
ఖజానాకు కన్నం!
ఇలాంటి దోపిడీకి మళ్లీ రాచమార్గంపట్టిసీమ టెండర్లలో రూ. 257.45 కోట్ల లూటీ..2017–18లోనే కడిగేస్తూ కాగ్ నివేదికవైకుంఠపురం బ్యారేజ్ పనుల వ్యయాన్ని రూ.400 కోట్లు పెంచేసి 13.19 శాతం అధిక ధరలకు నవయుగకు ధారాదత్తంపోలవరం హెడ్‌వర్క్స్‌లో జల విద్యుత్ కేంద్రం పనులను నవయుగకు 4.8 శాతం అధిక ధరలకు రూ.3,216.11 కోట్లకు అప్పగించిన బాబు మళ్లీ ఇప్పుడూ అదే రీతిలో కాంట్రాక్టర్లతో కలిసి ఖజానా దోచేసేందుకు సిద్ధంనీతి ఆయోగ్ ప్రశంసించిన రివర్స్ టెండరింగ్టెండర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకతకాంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడి అధిక మొత్తం కోట్ చేయకుండా ఉంటారు.ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు.రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండర్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపుతారు.ప్రజల నుంచి ఆన్లైన్లో సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.తక్కువ మొత్తం కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్–1గా నిర్ణయిస్తారు. రివర్స్ టెండరింగ్ రద్దుకు కేబినెట్ ఆమోదంకంచే చేను మేస్తే?.. ప్రభుత్వ పెద్దలే అక్రమాలకు గేట్లెత్తితే? రివర్స్ టెండరింగ్ విధానం రద్దుతో ఇప్పుడు అదే పునరావృతమవుతోంది!! ఖజానాకు టెండర్ పెట్టేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్‌తో టెండర్ల వ్యవస్థలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులకు మంగళం పాడింది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దుకు రాష్ట్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. 2014–19 మధ్య ఉన్న పాత టెండర్ విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనుల అంచనా వ్యయాన్ని లెక్కకట్టక ముందే కమీషన్ ఎక్కువ ఇచ్చేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై తర్వాత అంచనా వ్యయాన్ని భారీగా పెంచడం.. ఆ కాంట్రాక్టర్‌కే పనులు దక్కే నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ .. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు పనులు అప్పగింత.. ఆ తర్వాత ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుల సంతర్పణ.. వాటినే కమీషన్లుగా వసూలు చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. – సాక్షి, అమరావతిఖజానాపై రూ.20 వేల కోట్ల భారం..రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఖజానా లూటీకి టెండర్ విధానాలను ఓ అస్త్రంగా మల్చుకున్నారు. పనుల ప్రతిపాదన దశలోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి అంచనా వ్యయాన్ని పెంచడం.. అధికంగా కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా నోటిఫికేషన్ జారీ చేయడం.. సగటున 4.85 శాతం అధిక ధరలకు పనులను కట్టబెట్టి ఖజానాకు కన్నం వేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించిన మొత్తాన్నే కమీషన్‌గా జేబులో వేసుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారు.⇒ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో 2015 మార్చిలో రూ.1,170.25 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. 21.999 శాతం అధిక ధరలకు అంటే రూ.1,427.70 కోట్లకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థ ఎల్–1గా నిలిచింది. ఆ సంస్థకు పనులు అప్పగించేశారు. దేశ చరిత్రలో కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు అత్యధికంగా అప్పగించిన టెండర్ ఇదే కావడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే అధిక ధరలకు కోట్ చేస్తే ఆ టెండర్‌ను రద్దు చేయాలి. అయితే చంద్రబాబు మాత్రం ఐదు శాతం అధిక ధరలు, ఏడాదిలో ఎత్తిపోతల పూర్తి చేస్తే 16.999 శాతం బోనస్‌గా ఇస్తామంటూ టెండర్ ఆమోదించేశారు. 2016 మార్చి నాటికి ఆ పథకం పూర్తయినా అప్పుడు గోదావరిలో ప్రవాహం లేనందున ఎలాంటి ప్రయోజనం ఉండదు. వీటినేవి పరిగణనలోకి తీసుకోకుండా అక్రమంగా 21.999 శాతం అధిక ధరలకు కాంట్రాక్టర్‌కు అప్పగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.257.45 కోట్ల భారం పడింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు పది శాతం నిధులను మొబిలైజేషన్ అడ్వాన్సులుగా అప్పగించి కమీషన్లు రాబట్టుకున్నారు. పట్టిసీమ టెండర్లో నాటి చంద్రబాబు సర్కార్ ఖజానాను కాంట్రాక్టర్‌కు దోచిపెట్టిందని కాగ్ 2017–18లో ఇచ్చిన నివేదికే ఇందుకు నిదర్శనం.⇒ ప్రకాశం బ్యారేజీకి 21 కి.మీ. ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని అమాంతం రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 13.19% అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నిబంధనలకు విరుద్ధంగా నవయుగకు అప్పగించారు. అంచనాలు పెంచడం, అధిక ధరలకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీ సిపార్సు మేరకు వైకుంఠపురం బ్యారేజీ పనుల టెండర్‌ను రద్దు చేయడంతో నవయుగ దోపిడీకి బ్రేక్ పడింది.⇒ 2014–19 మధ్య వివిధ శాఖల్లో మొత్తం రూ.3.51 లక్షల కోట్ల విలువైన పనులకు చంద్రబాబు సర్కార్ టెండర్లు నిర్వహించింది. ఎన్నికల సంవత్సరం 2018–19లోనే రూ.1.27 లక్షల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది. అధిక ధరలకు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం ద్వారా ఖజానాపై రూ.20 వేల కోట్ల మేర భారం వేసి ఆ మేరకు కమీషన్ల రూపంలో చంద్రబాబు తన జేబులో వేసుకున్నారు.⇒ 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ 2014–19 తరహాలోనే కాంట్రాక్టర్లతో కలిసి ఖజానాను దోచేసేందుకు సిద్ధమైనట్లు తాజాగా రివర్స్ టెండరింగ్ విధానం రద్దు నిర్ణయంతో స్పష్టమవుతోంది.రివర్స్ టెండరింగ్ ఇదీ..బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ (బీవోసీఈ) నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్‌పై 2019 ఆగస్టు 16న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబరు 67 జారీ చేసింది. ఈ విధానంలో జ్యూడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన కాంట్రాక్టు విలువను ఖరారు చేస్తూ టెండర్ షెడ్యూలు ముసాయిదాతోనే నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనివల్ల ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు. టెండర్లో ఆర్థిక బిడ్ తెరిచాక తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్–1గా ఖరారు చేస్తారు. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్ కోట్ చేసిన మొత్తానే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఆన్లైన్లో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు సాంకేతిక కమిటీ సిఫార్సు మేరకు పనులు అప్పగిస్తారు. గత ప్రభుత్వం 59 నెలల పాటు ఇదే పద్ధతిలో టెండర్లు నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా చేసింది.రివర్స్ టెండరింగ్‌తో పగిలిన అక్రమాల పుట్ట..2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టెండర్ల వ్యవస్థను సంస్కరించారు. జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థను ప్రవేశపెట్టారు. రూ.వంద కోట్లు అంతకంటే అధిక వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపాలని ఆదేశించారు. దీనిపై జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేలా విధాన నిర్ణయం తీసుకున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుని టెండర్ ముసాయిదా షెడ్యూలులో మార్పుచేర్పులను జడ్జి సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే ముసాయిదా షెడ్యూల్‌ను యథాతధంగా ఆమోదిస్తారు. జ్యూడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూలుతోనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపట్టారు. ఇక రూ.కోటి అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించేలా విధానాన్ని రూపొందించారు. దీనిద్వారా టెండర్ల వ్యవస్థను అత్యంత పారదర్శకంగా మార్చారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే నిబంధనను తొలగించారు.⇒ రాష్ట్రంలో 2014–19 మధ్య సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్‌కు వైఎస్ జగన్ ఆదేశించారు. తొలుత పోలవరం ఎడమ కాలువ అనుసంధానం (ప్యాకేజీ–65) పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ పనులను 2018లో రూ.278 కోట్ల అంచనా వ్యయంతో టీడీపీ సర్కార్ నిర్వహించిన టెండర్లలో 4.8 శాతం అధిక ధరలకు అంటే రూ.292.09 కోట్లకు మ్యాక్స్ ఇన్ఫ్రాకు కట్టబెట్టారు. దీనివల్ల ఖజానాపై రూ.14.09 కోట్ల భారం పడింది. చంద్రబాబు సర్కార్ కాంట్రాక్టర్‌కు అప్పగించిన పనుల విలువ మొత్తం రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా పరిగణించి వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఆరు సంస్థలు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేశాయి. టీడీపీ హయాంలో రూ.292.09 కోట్లకు పనులను దక్కించుకున్న మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థే రివర్స్ టెండరింగ్‌లో రూ.231.47 కోట్లకే పనులు చేయడానికి ముందుకొచ్చింది. దాంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. తద్వారా చంద్రబాబు సర్కార్ అక్రమాలు బట్టబయలయ్యాయి.⇒ పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం)లో రూ.2,917 కోట్ల విలువైన పనులను నవయుగకు చంద్రబాబు నామినేషన్‌పై కట్టబెట్టారు. ఇందులో 2019 మే 30 నాటికి రూ.1,771.44 కోట్ల విలువైన పనులు మిగిలాయి. హెడ్ వర్క్స్‌కు అనుసంధానంగా 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను కూడా నవయుగకే 4.8 శాతం అధిక ధరలకు రూ.3,216.11 కోట్లకు చంద్రబాబు అప్పగించారు. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు వైఎస్ జగన్ ఈ రెండు పనులను రద్దు చేశారు. నవయుగకు అప్పగించిన విలువనే కాంట్రాక్టు విలువగా పరిగణించి రెండింటినీ కలిపి ఒకే ప్యాకేజీ కింద రూ.4,987.55 కోట్లతో రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ పనులను 12.6 శాతం తక్కువ ధరలకు అంటే రూ.4,358.11 కోట్లకే చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దాంతో ప్రభుత్వ ఖజానాకు రూ.629.44 కోట్లు ఆదా అయ్యాయి. చంద్రబాబు సర్కార్ గతంతో జలవిద్యుత్కేంద్రం పనులను 4.8 శాతం అధిక ధరలకు అప్పగించడం వల్ల ఖజానాపై రూ.154 కోట్ల భారం పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రివర్స్ టెండరింగ్ వల్ల రూ.783.44 కోట్లు ఆదా అవడంతో చంద్రబాబు అక్రమాలు మరోసారి నిరూపితమయ్యాయి.⇒ ఒక్క సాగునీటి ప్రాజెక్టుల పనుల్లోనే రివర్స్ టెండరింగ్ ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2,500 కోట్లకుపైగా ఆదా చేసింది. రహదారులు, భవనాలు, పురపాలక, పట్టణాభివృద్ధి తదితర శాఖల్లో మొత్తం రూ.3,60,448.45 కోట్ల విలువైన 4,36,164 పనులకు టెండర్లు నిర్వహించగా రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.7,500 కోట్లకుపైగా ఖజానాకు ఆదా అయ్యాయి. దేశ చరిత్రలో ఇదో రికార్డు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత పారదర్శకమైన టెండర్ల విధానం అమల్లో ఉందని, ఇది దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని నాడు నీతి అయోగ్ ప్రశంసించడం గమనార్హం. -
జగన్ వల్లే పెట్టుబడులు పైపైకి..
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ తన హయాంలో కనబర్చిన ప్రత్యేక శ్రద్ధతో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ విషయంలో ఏపీ 2024 జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల కాలంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ సమయంలో రాష్ట్రంలోకి కొత్తగా 15 ప్రాజెక్టుల ద్వారా రూ.22,580 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. ఇదే సమయంలో రూ.1,02,534 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా.. రూ.36,329 కోట్ల పెట్టుబడులతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది. ఇదే కాలంలో ఏపీలో కొత్తగా 14 యూనిట్ల ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా రూ.1,049 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. నాటి సీఎం జగన్ ప్రత్యేక చొరవవల్లేవాస్తవానికి.. నాటి సీఎం జగన్ ప్రత్యేక కృషితో ఏపీలో అనువైన వాతావరణం కల్పించడంవల్లే ఈ కాలంలో కొత్త పరిశ్రమలు రాష్ట్రం వైపు ఎక్కువగా మొగ్గు చూపాయి.ఏపీలో 4 పోర్టుల పనులు యుద్ధప్రాతిపదికన చేయించడం.. 10 ఇండస్ట్రియల్ నోడ్స్ను ప్రారంభించడం.. 10 ఫిషింగ్ హార్బర్ల పనులకు కూడా శ్రీకారం చుట్టడం.. ఎంఎస్ఎంఈలకు ఎన్నడూలేని విధంగా ప్రోత్సహించడం లాంటి అంశాలు ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఏర్పడడానికి ప్రధాన కారణాలు. కేంద్రం సైతం ఇందుకు బలం చేకూరుస్తూ తన నివేదికల్లో ఏపీలో పరిశ్రమల ఏర్పాటును ప్రస్తావించింది. కోవిడ్ తర్వాత పెట్టుబడుల ఆకర్షణలో దూకుడుప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ మహమ్మారి తర్వాత కాలంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ దూకూడు ప్రదర్శించింది. ఈ విపత్కర సమయంలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వారిని చేయిపట్టి నడిపించడంతో పాటు పరిశ్రమలకు గతంలో చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన బకాయిలను చెల్లించడంతో పారిశ్రామికవేత్తలకు ఏపీపై నమ్మకం ఏర్పడింది. దీంతో 2022 నుంచి 2024 మార్చి వరకు అంటే 27 నెలల కాలంలో రాష్ట్రంలోకి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఈ 27 నెలల కాలంలో రాష్ట్రంలోకి 120 సంస్థలు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నాయని, దీనికి సంబంధించి ఇండ్రస్టియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మెమోరాండం (ఐఈఎం) పార్ట్–ఏను జారీచేసినట్లు డీపీఐఐటీ పేర్కొంది. ఈ 120 ఒప్పందాల ద్వారా రాష్ట్రంలోకి రూ.50,955 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో కొత్తగా 112 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా రూ.62,069 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. ఈ 112 సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడంతో ఐఈఎం పార్ట్–బీని మంజూరుచేసినట్లు డీపీఐఐటీ ఆ నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలోకి ఈ స్థాయిలో భారీ పెట్టుబడులు రావడం ఇదే ప్రథమమని పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
సంక్షేమం.. సాధికారత.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పౌరుల ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసించింది. ఏపీతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్నాటక తమ ఆదాయ రాబడుల్లో సంక్షేమ పథకాల కోసం గణనీయంగా వ్యయం చేశాయని పేర్కొంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలకు చేసిన వ్యయాలపై రీసెర్చ్ నివేదికను ఎస్బీఐ సోమవారం విడుదల చేసింది. దేశం సంక్షేమ రాజ్యంగా మారుతున్నట్లు కనిపిస్తోందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలు, పిల్లల విద్య, ఆరోగ్యంతో పాటు సాధికారత దిశగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసినట్లు నివేదిక విశ్లేషించింది. ⇒ ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను రీసెర్చ్ నివేదిక వ్యయంతో సహా ప్రముఖంగా ప్రస్తావించింది. ఏటా 47 లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫాం, బ్యాగ్, బూట్లు, పాఠ్యపుస్తకాలు తదితరాలను ఉచితంగా అందచేశారని పేర్కొంది. జగనన్న అమ్మ ఒడి కింద పిల్లల తల్లుల ఖాతాల్లో పారదర్శకంగా నగదు జమ చేశారని, ఇవన్నీ మహిళలు, పిల్లల విద్యతో ముడిపడి రూపొందించిన సంక్షేమ పథకాలని తెలిపింది. మహిళల ఆర్ధికాభివృద్ధే లక్ష్యంగా అర్హత కలిగిన ప్రతి మహిళకూ వైఎస్సార్ చేయూత పథకాన్ని అందించారని, పేద మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారని వెల్లడించింది. జగనన్న గోరు ముద్ద ద్వారా సుమారు 43 లక్షల మంది స్కూలు పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించారని, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నారని ప్రశంసించింది. పొదుపు సంఘాల మహిళల (ఎస్‌హెచ్‌జీ) సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశారని ఎస్బీఐ నివేదిక తెలిపింది. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత లక్ష్యంగా రూపొందించిన ఈ పథకాలు దేశ ఆర్ధికాభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది. ⇒ ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 12 శాతం వృద్ధి నమోదు కాగా అందులో 11 శాతం మేర సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు రీసెర్చ్ నివేదిక తెలిపింది. మహారాష్ట్రలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 10 శాతం వృద్ధి చెందగా అందులో 11 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. ఒడిశాలో ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల్లో వృద్ధి 13 శాతం కాగా అందులో 8.10 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు తెలిపింది. కేరళలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం నమోదు కాగా అందులో 8 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. కర్నాటక, పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి కంటే సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కర్నాటకలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు వృద్ధి 8 శాతం ఉండగా పధకాలకు కేటాయింపులు 15 శాతం ఉంది. పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం ఉండగా పథకాలకు కేటాయింపులు 10 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
బడులు తెరిచారు.. బరువు మోపారు.. 'వందనమేదీ'!
వెంటనే పిల్లలందరికీ ఇవ్వాలి..నాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప ఆరో తరగతి, మరో అమ్మాయి ఐదో తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ డబ్బులిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరవగానే మా ఖాతాలో డబ్బులు జమ చేసేవారు. – పదముత్తం లక్ష్మి, ఏరూరు, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లాసాక్షి, అమరావతి: ‘ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకంఅమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి.. పథకాలు అందుకోండి..’ అంటూ ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిచోటా చాటింపు వేసిన సీఎం చంద్రబాబు ఒకపక్క పాఠశాలలు పునఃప్రారంభమై నెల కావస్తున్నా ఆ ఊసే పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రేగుతోంది. మంత్రి నారా లోకేశ్‌తోపాటు ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నాయకులంతా ప్రజలకు బహిరంగంగా ఈ ఇచ్చిన హామీపై నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్థులు, బడి ఈడు పిల్లలు దాదాపు కోటి మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వీరందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలంటే ఏటా సుమారు రూ.15 వేల కోట్లు అవసరం. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ కోటి మంది పిల్లలకు ‘తల్లికి వందనం’ ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోగా ఈ హామీని ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాదంతా కాలయాపన చేసి లబ్ధిదారులను తగ్గించేందుకు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏరుదాటాక తెప్ప తగలేయడంలో నిపుణుడైన చంద్రబాబు 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీని నెరవేర్చకుండా కోటయ్య కమిటీ పేరుతో కోతలు విధించిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.ఖర్చులు తడిసిమోపెడు..పాఠశాలలు తెరవటమే ఆలస్యం.. పిల్లల ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ‘అమ్మ ఒడి’ పథకం నాలుగేళ్ల పాటు తల్లిదండ్రులకు నిశ్చింత కల్పించింది. పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నా సరే వంద శాతం పారదర్శకతతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి రప్పించడమే లక్ష్యంగా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. ఏటా రూ.6,400 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.26 వేల కోట్లకుపైగా అమ్మ ఒడి ద్వారా అందించడం పిల్లల చదువుల పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. భావి పౌరుల భవితవ్యానికి భరోసా కల్పిస్తూ వెలుగులు పంచిన ఈ పథకంపై ఇప్పుడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఈ పథకం పేరు మార్చేసి ‘‘తల్లికి వందనం’’ అంటూ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ హామీ కింద ప్రకటించిన కూటమి సర్కారు స్కూలుకి వెళ్లే విద్యార్థులతో పాటు ప్రతి బిడ్డకూ ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఒక్కో ఇంట్లో నలుగురు ఐదుగురు పిల్లలున్న కుటుంబాలు తమకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకు లబ్ధి చేకూరుతుందని ఆశపడ్డారు. ఇప్పటికే పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ‘తల్లికి వందనం’పై ఇంతవరకూ కొత్త సర్కారు నోరు మెదపకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, పుస్తకాల ఖర్చులు తడిసిమోపెడు కావడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలయాపన.. కోతలు2014 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక అనేక కొర్రీలు వేసి లబ్ధి పొందే రైతులను భారీగా తగ్గించేసి అరకొరగా విదిలించారు. ఇప్పుడు తల్లికి వందనంపైనా ఇలాగే ముందుకెళ్లాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఒక్కో బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికీ పథకం వర్తింప చేస్తామని ఇచ్చిన హామీ ప్రభుత్వ పెద్దల్లో కూటమి సర్కారులో గుబులు రేపుతోంది. ఏటా రూ.15 వేల కోట్ల నిధులు అవసరం కావడం ఇందుకు కారణం. దీంతో వలంటీర్లను గౌరవ వేతనం రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామన్న హామీని గాలికి వదిలేసినట్లే... ‘తల్లికి వందనం’ కూడా లబ్ధిదారుల ఎంపిక పేరుతో ఈ ఏడాది కాలయాపన చేసి అనంతరం రకరకాల నిబంధనలతో కోతలు విధించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. టీడీపీ హయాంలో రైతుల రుణమాఫీపైనా ఇదే విధానం అనుసరించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అదే జరిగితే తమ పిల్లల చదువులు నాశనమవుతాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. డ్రాప్ అవుట్స్‌కు అడ్డుకట్ట..బడి ఈడు పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండేలా, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి విద్యారంగాన్ని బలోపేతం చేసింది. పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్‌ను గణనీయంగా తగ్గించాలనే సదుద్దేశంతో అమ్మఒడి పథకానికి విద్యార్థి హాజరును ప్రామాణికంగా తీసుకుంది. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. 2019– 20, 2020–21 విద్యా సంవత్సరాల్లో మాత్రం కోవిడ్ కారణంగా విద్యార్థులకు 75 శాతం హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. జీఈఆర్...2018లో ప్రాథమిక విద్యలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) జాతీయ సగటు 99.21 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ 84.48 శాతానికే పరిమితమైంది. నాడు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో అట్టడుగు స్థానం ఏపీదే కావడం గమనార్హం. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలతో నాలుగేళ్లలో జీఈఆర్ వంద శాతానికి పెరిగింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు 10–12వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించడమే కాకుండా వారికి కూడా అమ్మఒడిని గత సర్కారు అందించింది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునేలా ఈ నిర్ణయం నూరు శాతం ఉపయోగపడింది.జూన్‌లోనే జమకు గత సర్కారు ఏర్పాట్లు..పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో 2019 జూన్‌లో జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్కూళ్లు తెరిచిన వెంటనే జూన్‌లోనే అంతకుముందు సంవత్సరం హాజరును బట్టి రూ.15 వేలు చొప్పున అందిస్తూ రూ.వెయ్యి టాయిలెట్ మెయింట్‌నెన్స్ ఫండ్‌కి, మరో రూ.వెయ్యి స్కూల్ నిర్వహణ నిధికి జమ చేసింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి అందించి చదువులకు భరోసా కల్పించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్.. ఇలా ఎక్కడ చదువుతున్నా సరే పథకాన్ని నూరు శాతం పారదర్శకతతో అమలు చేసింది. 2022–23కి సంబంధించి గతేడాది జూన్ 28వ తేదీన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. ఐదో విడత అమ్మఒడి కింద ఈ ఏడాది జూన్‌లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినా కొత్త ప్రభుత్వం రావడంతో సాయం నిలిచిపోయింది. జూలై వచ్చినా తల్లికి వందనంపై కూటమి సర్కారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు.మాట ప్రకారం డబ్బులివ్వాలిగత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఏటా సకాలంలో నగదు నా ఖాతాలో జమ చేశారు. పిల్లల చదువుల కోసం అది ఎంతో ఉపయోగపడేది. కూటమి పార్టీలు ప్రతి విద్యార్ధికీ రూ.15 వేలు చొప్పున డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చాయి. బడులు ఇప్పటికే తెరిచినా కొత్త ప్రభుత్వం ఇంత వరకు ఏమీ చెప్పడం లేదు. చేసేదేమీ లేక రూ.15 వేలు అప్పు చేసి పిల్లలకు అవసరమైనవి కొన్నాం. మాట ప్రకారం పిల్లల చదువులకు డబ్బులు ఇవ్వాలి. – పద్మ, విద్యార్థి తల్లి, పుత్తూరు, తిరుపతి జిల్లాపాత వాటికి పేర్లు మార్చారే కానీపిల్లలు స్కూళ్లకు వెళుతున్నా ఏ పథకం అందలేదు. పాత పథకాలకు పేర్లు మార్చారే కానీ లబ్ధిదారులకు ఇంతవరకు ఏ పథకం ద్వారా డబ్బులు ఇవ్వకపోవడం దారుణం. ఇలాగే ఉంటే మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమే. కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే పథకాలు అందేలా చూడాలి. – సి.జానకి, జల్లావాండ్లపల్లె, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లాఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదునా కుమార్తె లిఖిత జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఇంతవరకూ మాకు అమ్మ ఒడి డబ్బులు పడలేదు. గతంలో ఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదు. అసలు డబ్బులు పడతాయో లేదో కూడా తెలియడం లేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదంటున్నారు. పిల్లల చదువుల కోసం అప్పు చేయాల్సి వస్తోంది. – మరడాన జ్యోతి, రామభద్రపురం, విజయనగరం జిల్లాబడులు మొదలైనా ఆ ఊసే లేదు గతంలో స్కూళ్లు తెరవగానే అమ్మ ఒడి అందేది. పిల్లల చదువులకు ఎంతో ఉపయోగపడేవి. ఈసారి బడులు ప్రారంభమైనా ఇంతవరకూ ఆ ఊసే లేదు. అసలు డబ్బులు ఇస్తారో లేదో కూడా ఈ ప్రభుత్వంలో స్పష్టత లేదు. గతంలో ఉన్న లబ్ధిదారులందరికీ అమ్మఒడి ఇవ్వాలి. – రమణమ్మ, అంకేపల్లి, మర్రిపూడి, ప్రకాశం జిల్లా పిల్లలను ఆదుకోండయ్యా..! పాఠశాలలు తెరిచి రెండు వారాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ పథకం అందలేదు. మా పిల్లలను ఆదుకుని పథకాలు వర్తింపచేసేలా ప్రభుత్వం చొరవ చూపాలి. – పి.రామలక్ష్మమ్మ, మల్లూరు, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లా -
అవసరం కాదు... అనివార్యం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో వైఎస్ జగన్ తీసుకువచ్చిన మార్పు విప్లవాత్మకమైనది. మొన్నటి ఎన్నికలలో జగన్ పార్టీ ఓటమికి కారణాలు బలమైనవేమీ కావు. ప్రత్యర్థులు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన నవరత్నాలపై తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించారు. బడుగు–బలహీన వర్గాల సంక్షేమాన్నీ, అభివృద్ధినీ ఓర్వలేని కూటమి నేతలు పనిగట్టుకొని విషప్రచారం చేశారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలుగా చిత్రిచారు. సంక్షేమ పథకాలపై పెడుతున్న దృష్టి అభివృద్ధిపై లేదని ప్రచారం చేశారు. విదేశాల్లో స్థిరపడి అమరావతిలో భూములు కొన్న కార్పొరేట్స్‌తో డబ్బులు వెదజల్లించి అడ్డదారిలో, అసంబద్ధపు ప్రేలాపనలతో కూటమి అధికారంలోకి వచ్చింది.అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాల్లో సంక్షేమాన్ని విస్మరిస్తే వెనకబడిన జాతులు సామాజికంగా, ఆర్థికంగా మరింత నష్టపోతాయి. సంక్షేమం, అభివృద్ధి వేరు వేరు కాదని రాజకీయ పార్టీలూ, నాయకులూ గుర్తించాలి. ప్రజలకు విద్య, వైద్యం ఇవ్వడం ప్రభుత్వాల ప్రాథమిక విధి. పేదల జీవితాలను సామజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పరచకుండా దేశం ముందుకు పోదు. అభివృద్ధి చెందిన వారితో ఈ పేద ప్రజలు పోటీ పడాలంటే వారికి విద్య అవసరం అని బలంగా నమ్మారు కాబట్టే జగన్ సంక్షేమానికి పెద్దపీట వేశారు. జగన్ సామాజిక వర్గాల వారీగా ఇవ్వాల్సిన సీట్ల కంటే ఎక్కువ ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. కాగా చంద్రబాబు జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వంలో తీసుకున్న మంత్రి పదవులను ఒక్క దళితుడికి కూడా కేటాయించలేదు. అధికారంలోకి వస్తే మా మేనిఫెస్టోను పక్కాగా అమలుపరుస్తామని ప్రగల్బాలు పలికిన కూటమి నేతలు ఒక పథకం కూడా అమలు కాకముందే అక్రమ కట్టడాల పేరుతో వైసీపీ పార్టీ ఆఫీసులు కూలగొడుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తల ఇళ్లపైనా దాడులు చేస్తూ విధ్వంసక పాలన ప్రారంభించారు. ప్రజల పక్షాన నిలబడి వారి భవితకు బంగారు బాటలు వేస్తారని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే... పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఈ విజయాన్ని బాబు ప్రభుత్వం వాడుకోవడం శోచనీయం. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధిచేసి తాము గత పాలకుల కంటే ఎంత గొప్పవాళ్లమో నిరూపించుకోవాల్సిన కూటమి నేతలు... అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.గత ఐదేళ్ళల్లో అనేక రంగాల్లో వచ్చిన మార్పులను చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ‘జగన్ అవసరం కాదు... అనివార్యం’ అనిపిస్తోంది. జగన్ ఈసారి కూడా అధికారంలోకి వచ్చి ఉంటే ఒక తరం పిల్లలు గొప్ప విద్యవంతులుగా విద్యాలయాల నుంచి బయటకు వచ్చేవారు. చంద్రబాబు అధికారం చేపట్టాక ఈ తరహా అభివృద్ధి ముందుకు వెళుతుందా అన్నది సందేహమే. – సునీల్ నీరడి, ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ రీసర్చ్ స్కాలర్ -
మూడు వారాల్లో రూ.7 వేల కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ప్రతి మంగళవారం అప్పు చేయందే గడవదంటూ ఇన్నాళ్లూ వైఎస్ జగన్ సర్కారుపై రాసిందే పదే పదే రాస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా విషం కక్కాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ప్రతీ మంగళవారం అప్పు చేస్తున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? అని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బాబు సర్కారు ప్రతి మంగళవారం చేస్తున్న అప్పులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాకు సంపద సృష్టిస్తున్నట్లు కనిపిస్తోందా.. అంటూ ఎద్దేవా చేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు సెక్యురిటీల విక్రయం ద్వారా అప్పులు చేయడానికి వెసులు బాటు కల్పిస్తూ ప్రతి మూడు నెలలకు ఆర్బీఐ వేలం వేసే తేదీలను ముందుగానే ప్రకటిస్తుంది. ఆయా తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేర అప్పు చేస్తాయో.. ఎన్ని సంవత్సరాల కాల వ్యవధిలో ఆ అప్పు తీరుస్తాయో ఆర్బీఐకి తెలియజేస్తాయి. అదే తరహాలో గత వైఎస్ జగన్ సర్కారు పరిమితికి లోబడి అప్పులు చేస్తే.. ప్రతి మంగళవారం అప్పు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా నిత్యం దు్రష్పచారం చేస్తూ కథనాలు వండి వారుస్తూ నానా యాగీ చేశాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కారు 20 రోజుల వ్యవధిలోనే రూ.7000 కోట్లు అప్పు చేసినా.. అదీ ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నా ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. దాని గురించి ఒక్క ముక్క రాయడం లేదు. అంటే తమకు ఇషు్టడైన చంద్రబాబు అధికారంలో ఉన్నందున, ఎన్ని అప్పులు చేసినా.. ఆ పత్రికలకు సంపద సృష్టిలా కనిపిస్తుందేమోనని ఉన్నతాధికారి ఒకరు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ అంటే ఇష్టం లేనందున పరిమితికి లోబడి అప్పులు తెచ్చినా సరే ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ పెద్ద నేరం చేసినట్లు నిత్యం ఆ పత్రికలు కథనాలు రాసినట్లు ఇప్పుడు స్పష్టం అవుతోందని ఆ అధికారి విశ్లేషించారు. సంపద సృష్టి ఏమైందో! వైఎస్ జగన్ సర్కారు అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్‌లు విషం కక్కారు. చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి అప్పులు చేయడం కాదు.. సంపద సృష్టిస్తానని, ఆ సంపద ఎలా సృష్టించాలో తనకే తెలుసంటూ ఎన్నికల ముందు ప్రచారం చేశారు. ఇంత గట్టిగా బల్లగుద్ది చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రతి మంగళవారం అప్పులు చేస్తామంటూ ఆర్బీఐకి స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో ప్రతి మంగళవారం అప్పులతో పాటు ఎంత సంపద సృష్టిస్తారో కూడా చెబితే బాగుంటుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన సెక్యురిటీల వేలం ద్వారా రూ.2,000 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కారు.. వచ్చే నెల 2వ తేదీన మంగళవారం మరో రూ.5,000 కోట్లు అప్పు చేస్తోంది. వచ్చే నెల 2వ తేదీన రూ.1,000 కోట్లు తమ్మిది సంవత్సరాల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 12 ఏళ్ల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 17 ఏళ్ల కాల వ్యవధికి, ఇంకో రూ.1,000 కోట్లు 21 ఏళ్ల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 24 ఏళ్ల కాల వ్యవధికి సెక్యురిటీల విక్రయం ద్వారా అప్పు చేయనుంది. ఆ తర్వాత మంగళవారం కూడా అప్పు చేయనున్నట్లు చంద్రబాబు సర్కారు ఆర్బీఐకి తెలియజేసింది. -
గడిచిన ఐదేళ్లూ ఈ పాటికే ఖాతాల్లోకి..
సాక్షి, అమరావతి: ఖరీఫ్ ఊపందుకుంటున్న వేళ పెట్టుబడి ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వలేక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అప్పుల కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. గత ఐదేళ్లుగా ఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం చేతికందగా ఈసారి వ్యవసాయ పనులు మొదలైనా దిక్కులు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఆర్బీకేలలో విత్తనాలు, ఎరువులు నిల్వ చేయడంతోపాటు కొన్ని సందర్భాల్లో పీఎం కిసాన్ కంటే ముందుగానే తొలి విడత పెట్టుబడి సాయం చేతికందిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ డబ్బులు రైతులు దుక్కి దున్ని భూమిని సిద్ధం చేసుకోవడం, సబ్సిడీ పచ్చి రొట్ట విత్తనాలు వేసుకోవడం, నారుమళ్లు పోసు కోవడం, నాట్లు వేయడం లాంటి అవసరాలకు ఉపయోగపడేవి. గతంలో వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా మూడు విడతల్లో అందించిన సాయం సన్న, చిన్నకారులకు ఎంతగానో ఉపయోగపడేది. రాష్ట్రంలో అర హెక్టార్ (1.25 ఎకరాలు) లోపు విస్తీర్ణం కలిగిన రైతులు 50 శాతం మంది ఉండగా హెక్టార్ (2.50 ఎకరాలు) లోపు విస్తీర్ణమున్న రైతులు 70 శాతం మంది ఉన్నారు. అర హెక్టార్ లోపు సాగుభూమి ఉన్న రైతులు వేసే పంటలకు అయ్యే పెట్టుబడిలో 80 శాతం ఖర్చు రైతు భరోసా రూపంలో అందడంతో వారికి ఎంతో ఊరటగా ఉండేది. తాము అధికారంలోకి వస్తే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామని సూపర్ సిక్స్‌లో టీడీపీ – జనసేన కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించారు. ఒకపక్క వ్యవసాయ పనులు జోరందుకున్నా ప్రభుత్వ పెద్దలెవరూ ఇంతవరకూ ఆ ఊసెత్తక పోవడం పట్ల రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పేరు మార్చేందుకే ఉత్సాహం..ఇచ్చిన హామీ కంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ప్రతీ రైతు కుటుంబానికి ఏటా మే/ జూన్‌లో రూ.7500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో 2 వేలు చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. ఏటా సగటున 51.50 లక్షల మందికి ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ కింద రూ.34,288.17 కోట్లు జమ చేసి రైతులకు అండగా నిలిచారు. భూ యజమానులతో పాటు అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు ఐదేళ్లూ వైఎస్ జగన్ ప్రభుత్వమే సొంతంగా పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచింది. పీఎం కిసాన్ కింద 2024–25 సీజన్ తొలి విడత సాయాన్ని మాట ప్రకారం కేంద్రం ఇటీవలే జమ చేసింది. సీఎం చంద్రబాబు కూడా అదే మాదిరిగా రైతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.20 చొప్పున పెట్టుబడి సాయాన్ని కేంద్ర సాయంతో సంబంధం లేకుండా ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చటంలో చూపిన ఉత్సాహాన్ని సాయం అందించడంలోనూ ప్రదర్శించాలని కోరుతున్నారు.పెట్టుబడి కోసం అగచాట్లు..గత ఐదేళ్లు పెట్టుబడి సాయం సకాలంలో అందింది. దీంతో అదునులో విత్తనాలు కొనుగోలు చేసేవాళ్లం. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తుందో చెప్పడం లేదు. కేంద్రం నుంచి పీఎం కిసాన్ సాయం అందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంతవరకు విడుదల కాకపోవడంతో పెట్టుబడి కోసం అగచాట్లు తప్పడం లేదు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.– కారసాని శివారెడ్డి. సూరేపల్లి, బాపట్ల జిల్లాసాగు ఖర్చుల కోసం ఇబ్బందులు..గత ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా అందజేసిన వైఎస్సార్ రైతు భరోసా సాయం రైతులకు కొండంత అండగా నిలిచేది. ఏటా మూడు విడతలుగా రైతుల ఖాతాలో నేరుగా జమ చేసి భరోసా కల్పించేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం డబ్బులు ఇవ్వకపోవడంతో సాగు ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.– చింతల రాజు, బురదకోట, ప్రత్తిపాడు రూరల్, కాకినాడ జిల్లాఐదేళ్లు నమ్మకంగా ఇచ్చారు..వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ మొదటి వారంలోనే రైతు భరోసా డబ్బులు పడేవి. ఆ నగదుతో పాటు కొంత డబ్బు కలిపి పంటలు సాగు చేసేవాళ్లం. ఐదేళ్లు నమ్మకంగా రైతు అకౌంట్లో జమ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఇంత వరకు ఆ ఆలోచన చేయలేదు. ఎప్పుడు ఇస్తారో నమ్మకం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. రైతులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. – తూళ్లూరి నీరజ, గమళ్లపాలెం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లామా గోడు పట్టించుకోండి..గత ఐదేళ్లు రైతు భరోసా సకాలంలో అందడంతో సాగు సాఫీగా సాగేది. ప్రస్తుత పాలకులు మా బాధను పట్టించుకుని రైతులకు ఆర్థిక సాయం త్వరగా అందించాలి. – రాధయ్య, రైతు, పెద్దతయ్యూరు, శ్రీరంగరాజపురం, చిత్తూరు జిల్లా.పాత రోజులు గుర్తుకొస్తున్నాయి..సీజన్ మొదలై నెల గడుస్తున్నా ఇప్పటి వరకూ పెట్టుబడి సాయం అందలేదు. ప్రధాని మోదీ సాయం అందిచాన అది ఎందుకూ సరిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం సాయం అందక పోవడంతో మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అధిక వడ్డీలకు అప్పులు చేయక తప్పడం లేదు. ఏదో బాధపడి విత్తనాలు కొనుగోలు చేశాం. మిగిలిన పనులకు పెట్టుబడి సహాయం అత్యవసరం. – చింతల వెంకటరమణ, రైతు, లుకలాం, నరసన్నపేట మండలం, శ్రీకాకుళం జిల్లావారం పది రోజుల్లోనే ఇస్తామని..అధికారంలోకి వచ్చిన వారం పది రోజుల్లోనే రైతు భరోసా అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. ఖరీఫ్ సీజన్లో రైతులను ఆదుకోవాలి. లేదంటే అప్పులే శరణ్యం.– ప్రభాకర్, రైతు, తిరుపతి రూరల్ మండలంవ్యవసాయం ఇక కష్టమేజగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ నెలలో రైతు భరోసా సాయం ఖాతాలో పడేది. ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల రైతుల గురించి ఆలోచన చేసే విధంగా కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు వ్యవసాయం చేయడం కష్టమే,–ఆకుల నారాయణ రైతు వంగర సాయం చేయాలి...మాలాంటి పేద రైతులకు గత ప్రభుత్వం అందించిన రైతు భరోసా సాయం ఎంతో ఉపయోగపడేది. ప్రస్తుతం వ్యవసాయ పనులు, సేద్యం ప్రారంభమైనా కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందకపోవడం విచారకరం. రైతుల పట్ల ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఆలోచించి సాయం చేయాలి. – వెన్నపూస కృష్ణారెడ్డి, ఖాన్‌సాహెబ్‌పేట, మర్రిపాడు మండలం -
సచివాలయాలతో సమున్నత సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం పౌర సేవలు, ప్రభుత్వ పథకాల అమలు స్వరూపాన్నే మార్చేసింది. గ్రామ గ్రామాన సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. పల్లె రూపురేఖలే మారిపోయాయి. విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు సాకారమయ్యాయి. ఎక్కడా లంచాలు, వివక్ష, పడిగాపులకు తావులేకుండా పారదర్శకంగా ప్రతి ఇంటికీ ప్రయోజనాలను అందచేసింది. గ్రామం నుంచి కదలాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్నే పల్లె చెంతకు తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో సాకారమైన విప్లవాత్మక మార్పులివి. నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సంయుక్త సదస్సు ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. ఇంటింటికీ పౌర సేవలు, అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోందని, ప్రధానంగా నీతి ఆయోగ్ నిర్దేశించిన ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి) లక్ష్యాల సాధనకు సచివాలయాలతో క్షేత్రస్థాయి నుంచి కృషి చేశారని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల ఆవిష్కరణ డేటా అధారిత పాలన, ప్రణాళికల కోసం డేటా సేకరణపై ఇటీవల లక్నోలో నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు సంయుక్త సదస్సు నిర్వహించాయి. డేటాను నాలెడ్జ్‌గా మార్చడం, 2047 భారత్ విజన్ లక్ష్యాలను సాధించడం, డేటాను పరిపాలనలో వినియోగించడం తదితర అంశాలపై వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలపై చర్చాగోష్టి నిర్వహించారు. సదస్సులో నీతి ఆయోగ్, ప్రపంచబ్యాంకుతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఆయా రాష్ట్రాల్లోని ఆవిష్కరణలపై ప్రముఖంగా చర్చించారు.ప్రతి పౌరుడికీ అందుబాటులో సేవలు..సమగ్ర డేటా సేకరణ ద్వారా పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందని, పాలన వికేంద్రీకరణలో భాగంగా తెచ్చిన ఈ వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను వికేంద్రీకరించడంతోపాటు విధాన రూపకర్తలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు గ్రామాలు, వార్డులలో ఆధునిక పరిజ్ఞానంతో సౌకర్యాలు కల్పించారన్నారు. ఏపీలోని ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికీ ఈ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్లు, నెలవారీ కేటాయింపులు లాంటి సంక్షేమ ప్రయోజనాలను అందజేయడంతోపాటు పౌరుల అవసరాలను గుర్తించి తీర్చుతున్నట్లు తెలిపారు. పరిపాలనాపరమైన ఫిర్యాదులను సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పరిష్కరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వివిధ టెక్ పోర్టల్‌లను ఏర్పాటు చేయడం వల్ల పైస్థాయి నుంచి కింద స్థాయి వరకు పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేసే వెసులుబాటు కలిగిందన్నారు. విప్లవాత్మక పాలనలో భాగంగా డేటా సేకరణ, క్రోడీకరణ, మార్పిడి ద్వారా సచివాలయాల వ్యవస్థతో ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను అమలు చేశారన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన 116 సూచికల ఆధారంగా 16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ దోహదం చేసిందని అభినందించారు. అన్ని పోర్టల్లలో డేటాను సేకరించడంతో పాటు విశ్లేషించి మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. పాఠశాలలకు వెళ్లే బాలికల్లో రక్తహీనత నిర్మూలన లాంటి సామాజిక లక్ష్యాలతో పాటు బడికి దూరమైన పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్చడం లాంటి వాటిని సచివాలయాల వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా అమలు చేసిందని ప్రస్తావించారు.ఎస్డీజీ లక్ష్యాల సాధన..నీతి ఆయోగ్ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో పటిష్ట వ్యవస్థను తెచ్చిందని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అవసరమైన డేటా సేకరణ, విశ్లేషణ గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచే జరుగుతోందన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుకు యాప్‌లు తీసుకొచ్చి అన్ని స్థాయిల్లో పకడ్బందీగా పర్యవేక్షించారన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి పౌరుల అవసరాలను తీర్చడం, గ్రామంలోనే సేవలు అందించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందన్నారు. అవి సింగిల్ విండో విధానం ద్వారా పంచాయతీలు, స్థానిక సంస్థలకు సహాయ విభాగంగా పనిచేయడంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. సచివాలయాల స్థాయిలోనే పౌరుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ టెక్ పోర్టల్‌తో బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉందన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనలో భాగంగా ఆరోగ్యం, విద్య సంబంధిత కార్యక్రమాలను గ్రామ, వార్డు సచివాలయాలతో అనుసంధానించినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో కార్యక్రమాల పర్యవేక్షణకు ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డ్ ఏర్పాటైందని, వీటన్నింటినీ ప్రతిబింబించేలా రాష్ట్ర స్థాయి డేటా రూపొందించడం కార్యక్రమాలు విజయవంతంగా అమలుకు దోహదం చేసిందన్నారు. అన్ని స్థాయిల్లో అధికారులు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. బాలికలలో రక్తహీనత నిర్మూలనకు విద్యాసంస్ధల్లో డేటాను సేకరించి సంబంధిత విభాగాల ద్వారా క్రోడీకరించారని తెలిపారు. వలంటీర్ల ద్వారా భారీ సర్వేతో బడికి దూరమైన పిల్లల డేటాను సేకరించడంతోపాటు తిరిగి స్కూళ్లకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ విద్యార్ధి సమాచార పోర్టల్‌ను నిర్వహిస్తున్నారన్నారు. నవశకం ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులను పారదర్శకంగా గుర్తించి క్రోడీకరించిన లబ్ధిదారుల డేటాతో పోర్టల్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. -
బహుజన హితాయ... బహుజన సుఖాయ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారంలో న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం లభించాలనీ, తద్వారా అంబేడ్కర్ కలలుగన్న సమ సమాజ నిర్మాణాన్ని సాధించవచ్చుననీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఒక గొప్ప సామాజిక పరివర్తనకు శ్రీకారం చుట్టారు. బహుజన కులాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను రూపొందించి, భారత దేశ సంక్షేమ పాలనా రంగంలో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించారు. అసమానతలతో నిండివున్న విద్యారంగంలో వినూత్నమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి, పేద వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఆధునిక విద్యను అందజేశారు. పేద ప్రజల గుండెల్లో ఒక పెద్దకొడుకు స్థానాన్ని పొందిన జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని బహుజనులు ఎదురుచూస్తున్నారు.తరతరాలుగా భారత దేశంలోని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ వలన అణచివేయబడిన వారికి రాజ్యాధికారం సాధించాలని 1935లో ఇండియన్ లేబర్ పార్టీని స్థాపించి జీవితకాలం ఆ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా పని చేశారు అంబేడ్కర్. తరువాత కాలంలో ఆ ఆశయ సాధన కోసం మాన్య కాన్షీరాం బహుజన కులాలను ఐక్యం చేయడానికి 1975లో బ్యాక్వార్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బాంసెఫ్) స్థాపించి లక్షలాది మందని సమీకరించారు. వారికి అంబేడ్కరిజాన్ని బోధించి, వారిని భారతదేశ రాజకీయ భవిష్యత్తును మార్చడానికి సమాయత్తం చేశారు. 1985లో కాన్షీరాం బహుజన సమాజ్ పార్టీని స్థాపించి పదేళ్లలోనే దాన్ని జాతీయ పార్టీగా తీర్చిదిద్దారు. భారత దేశ రాజకీయాలలో కాన్షీరాం తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారంలో తమకు రావలసిన న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం లభించాలనీ, తద్వారా అంబేడ్కర్ కలలుగన్న సమ సమాజ నిర్మాణాన్ని సాధించవచ్చుననీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (జగనన్న) ఒక గొప్ప సామాజిక పరివర్తనకు శ్రీకారం చుట్టారు. బహుజన కులాలలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా పెద్ద ఎత్తున అనేక సంక్షేమ పథకాలను రూపొందించి, భారత దేశ సంక్షేమ పాలనా రంగంలో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించారు. ‘నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ’లంటూ బహుజన కులాలను సొంతం చేసుకొని వారిలో ఆత్మ న్యూనతా భావాన్ని తొలగించి మనోబలాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపారు.కనీస గుర్తింపునకు నోచుకోని బీసీ కులాలను గుర్తించి, 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున చైర్మన్, డైరెక్టర్ పదవులను బీసీలకు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. ఇవ్వాళ వైఎస్సార్సీపీ తరఫున 11 మంది రాజ్యసభ సభ్యులుండగా వారిలో నలుగురు బీసీలు ఉండటం గమనార్హం. అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్, శాసన మండలి డిప్యుటీ చైర్మన్, మంత్రి పదవులను బీసీలకు కేటాయించి వారికి రాజకీయంగా సముచిత స్థానాన్ని కల్పించడం జరిగింది. 70 శాతం జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మైనారిటీలకి కేటాయించడం అనేది బహుజన కులాల పట్ల జగన్ చిత్తశుద్ధి, అంకిత భావాలను సూచిస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలను బహుజన పేదవర్గాల సాధికారత కోసం అమలు చేస్తూ ‘బహుజన సుఖాయ బహుజన హితాయ’ అనే మౌలిక సూత్రాన్ని పాటించడం జగన్ మానవతా, సమతావాదాన్ని ప్రతిబింబిస్తుంది. అక్షరాలా రూ.2.70 లక్షల కోట్ల నిధులను అనేక సంక్షేమ పథకాల ద్వారా నేరుగా బహుజన వర్గాల లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో దళారులతో పని లేకుండా పారదర్శకంగా జమ చేయడం సంక్షేమ రంగంలో ఒక నూతన విప్లవాత్మక సంస్కరణగా చెప్పుకోవచ్చు. దీనికి అదనంగా పరోక్షంగా రూ.1.30 కోట్లను గృహనిర్మాణం వంటి ఇతర సంక్షేమ పథకాల కోసం వినియోగించడం కూడా గమనించగలం. అసమానతలతో నిండి వున్న విద్యారంగంలో వినూత్నమైన సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టి, పేద వర్గాల విద్యార్థులకు నాణ్యమైన మేలైన ఆధునిక విద్యను అందజేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ.73,000 కోట్లు వెచ్చించి వాటిని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించేందుకు రూ.46,000 కోట్లను అమ్మఒడి పథకం ద్వారా అందించడం మరో గొప్ప అడుగు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం, డిజిటల్ విద్యాబోధన, విద్యార్థులకు ట్యాబుల పంపిణీ వంటివి అమలు చేసి పేద విద్యార్థుల ప్రగతికి బంగారు బాటలు వేయడం జరిగింది. అర్హులైన పేద విద్యార్థుల విదేశీ విద్యకోసం ఒక్కొక్కరికి 1.25 కోట్ల రూపాయల వరకు వెచ్చించడం ఒక అద్భుతమైన అవకాశంగా గుర్తించాలి.బహుజన పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సదుపాయాలను కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరణ చేయడం, కావలసిన నూతన వైద్య పరికరాలను సమకూర్చడం, తగినంత మంది వైద్య సిబ్బందిని నియమించడం, సమర్థవంతమైన పర్యవేక్షణతో మెరుగైన సేవలు అందించడం వంటి అనేక చర్యలను వైసీపీ ప్రభుత్వం తీసుకొంది. ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత విస్తృత పరిచి, ఒక వ్యక్తికి వెచ్చించే గరిష్ఠ పరిమితి ఖర్చును 25 లక్షలకు పెంచారు. ఉచిత కంటి పరీక్షలు, విలేజ్ మరియు వార్డు క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్లు, సంచార హాస్పిటల్స్ వంటి అనేక నూతన పథకాల ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం ఎంతో ఆదర్శవంతమైంది.సొంత ఇల్లు కావాలనే పేదల స్వప్నాన్ని సాకారం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి, 31 లక్షల మందికి ఇళ్ళను నిర్మించి ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. ఈ కాలనీలలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి, కుల వివక్ష అనే సామాజిక మహమ్మారికి తావు లేకుండా సకల జనుల సహజీవనానికి నాంది పలికింది. నా అన్నవారు లేక ఆర్ధికంగా నిస్సహాయ స్థితిలో వుండే వృద్ధులకు నెలకు రూ.3,000 పెన్షన్ రూపంలో వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఇంటి వద్దనే ఇచ్చే పద్ధతిని అవలంబించడం అనేది నిజంగా ఒక గొప్ప పథకం. మానవతా దృక్పథంతో వృద్ధులకు జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం భారతదేశానికే ఒక ఆదర్శంగా నిలిచింది. 66 లక్షల మంది వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపి వారి గుండెల్లో ఒక పెద్దకొడుకు స్థానాన్ని శాశ్వతంగా పొందడం జగనన్నకే దక్కింది.మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించి ప్రభుత్వ పరిపాలనను గ్రామ స్థాయికి తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని చెప్పాలి. గ్రామ సచివాలయాలు గ్రామ పరిపాలనకు కేంద్ర బిందువుగా మారి అన్ని రకాల పౌర సేవలను అందిస్తూ ప్రజల వద్దకు పరిపాలన అన్న ఉన్నత ఆశయాన్ని సాధించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైంది. గ్రామాలలో నివసించే రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా మెరుగైన సేవలను అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దింది. సమాజంలో అన్ని రకాల అణచివేతకు, అవమానాలకు గురి అయిన స్త్రీ జాతి సాధికారతకు, రక్షణకు, ఆత్మ గౌరవానికి అనేక సంక్షేమ పధకాలలో పాటు ‘దిశ’ పోలీస్ స్టేషన్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి నైపుణ్యాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా అనేక చర్యలు తీసుకొని నిరుద్యోగ సమస్యను సమర్థవంతంగా జగన్ ప్రభుత్వం పరిష్కరించింది. ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే 2.5 లక్షల ఉద్యోగాలను, ఆ యా రంగాలలో మరొక 2.5 లక్షల ఉద్యోగావకాశాలను కల్పించి మొత్తం 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలను కల్పించడం జరిగింది. నాలుగు నౌకాశ్రయాలు, 14 సముద్ర పోర్టులు, ఒక పెద్ద విమానాశ్రయం, 17 మెడికల్ కాలేజీల వంటి అనేక ప్రాజెక్టులను చేపట్టి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం అందరికీ తెలిసిన విషయమే.బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్న విషయం గ్రహించిన బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరలా ఆయన్నే ముఖ్యమంత్రిగా చూడాలనీ, సమసమాజం నిర్మాణం జరగాలనీ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.రావెల కిషోర్ బాబు వ్యాసకర్త మాజీ మంత్రి -
పౌర సమాజమా... పారాహుషార్!
అఖిలాంధ్ర జనులారా! అప్రమత్తంగా ఉండండి! గోముఖ వ్యాఘ్రాలు అంబారావాలు చేస్తున్నాయ్, తప్పుదోవ పట్టిస్తున్నాయ్. తేనె పూసిన కత్తులు కోలాటమాడు తున్నాయ్, కనికట్టు చేస్తున్నాయ్. జన తటాకపు గట్టు మీద మూడు కొంగలు నిలబడి దొంగజపం చేస్తున్నాయ్. జాగ్తే రహో!మతోన్మాదులు – కులోన్మాదులు జెండా గుడ్డలతో కొంగులు ముడేసుకొని అడుగులు వేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి.నాజీలను మించిన కులోన్మాదులు, ఫాసిస్టులను తల దన్నే మతోన్మాదులు ఉమ్మడిగా, కలివిడిగా ఉన్మత్త ప్రచారపు విషవాయువులను ప్రయోగిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త!విష ప్రచారపు ప్రయోగ వేదికలైన యెల్లో మీడియా కార్ఖానాల్లోంచి రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల పాయిజనస్ గ్యాస్ వెలువడుతున్నది. ఆ గాలి సోకితే జ్ఞానేంద్రియాలు పనిచేయవు, జరభద్రం!మన జ్ఞానేంద్రియాలు పని చేయకూడదనేదే వారి కోరిక. పని చేస్తే వారి నిజస్వరూపం మనం గుర్తిస్తామన్న భయం.ఈ మతోన్మాద, కులోన్మాద ఉమ్మడి ముఠాను నడిపించేది అంతా కలిపి పిడికెడు మందే! వారే పెత్తందార్లు. వారే పెట్టుబడిదార్లు. ముఠాలోని మిగిలిన పరివారంలో మతం అనే మత్తుమందుకు బానిసలు కొందరు. కులం అనే దురద రోగపు బాధితులు కొందరు.ఈ బానిసల్నీ, బాధితుల్నీ వెంటేసుకొని పెత్తందారీ కాలకూట విషకూటమి దండయాత్రకు బయల్దేరింది. ప్రపంచ యుద్ధాల్లో కూడా కొన్ని రకాల కెమికల్ వెపన్స్ వాడకంపై నిషేధాలుంటాయి. కానీ రోగ్ కంట్రీస్ ఖాతరు చేయవు. మన హెజెమోనిక్ రోగ్స్ కూడా అంతే! ప్రచారపు విధి నిషేధాలను ఖాతరు చేయరు, చేయట్లేదు.మన పెత్తందారీ కూటమి యుద్ధానికి తెగబడింది ఎవరి మీద? ఎవరిని తెగటార్చడానికి భగభగమండే పగతో సెగలుగక్కుతున్నారు?ఇంకెవరి మీద? పేదసాదల మీద, వారి సాధికారతా స్వప్నాల మీద! బడుగు బలహీన వర్గాల మీద, వారి జీవన వికాసపు ఆకాంక్షల మీద! కోట్ల జతల కనురెప్పల మాటు నున్న కలల మీద ఒకేసారి దాడి చేయడం ఎట్లా?వారికి ఆలంబనగా నిలబడిన వెన్నెముకను విరి చేయాలి. ఆ వెన్ను ఎముకే... వైఎస్ జగన్ ప్రభుత్వం.ఇంకెందుకు ఆలస్యం. బొంబార్డ్ ది హెడ్ క్వార్టర్స్. ప్రజల పక్షాన నిలబడిన ప్రభుత్వాన్ని కూలదోస్తే సరిపోతుంది. ఈ ఎన్నికల్లో కూల్చివేయాలి. పెత్తందారీ కూటమి తలపోత ఇది.తలపోసినంత మాత్రాన కుదురుతుందా? కోట్లాది మంది జీవితాలను క్రాంతి మార్గానికి మళ్లిస్తున్న సర్కార్‌కు వారు అండగా నిలబడరా? అశేష జనావళి మద్దతున్న జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎలా ఓడించగలరు?బలరామదేవుడి ముక్కోపానికి విరుగుడు మంత్రం ఉండనే ఉన్నది కదా ముఖస్తుతి అంటాడు ‘మాయాబజార్’ శకుని మామ. ఆ లెక్కన ప్రజాభిమానానికీ విరుగుడు ఉంటుంది కదా! ప్రజల్లో అపోహలు సృష్టించడం, అను మాన బీజాలు నాటడం! అసత్య ప్రచారంతో చీలికలు తేవడం వగైరా. కూటమిలోని శకుని మామలు పాచికలు విసరడంలో ఆశ్చర్యమేమున్నది?ప్రజలను ఆకట్టుకోగల నినాదం ఈ కూటమికి ఒక్కటి కూడా లేదు. ప్రజలకు మేలు చేసే విధానమూ లేదు. అరువు తెచ్చుకున్న అతుకుల బొంత మేనిఫెస్టో మాత్రం ఉన్నది. అందులోని అంశాలు అరచేతిలో వైకుంఠాన్ని చూపే టక్కు టమారం బాపతు. ఈ గారడీ సంగతి ముందే తెలిసిన జనం దాన్ని బొత్తిగా పట్టించుకోలేదు. క్రెడిబిలిటీ టెస్ట్‌లో కూటమి మేనిఫెస్టో డకౌటయింది.కూటమి నేతలు కూడా మేనిఫెస్టోను నమ్ముకోలేదు. యెల్లో మీడియా నేతృత్వంలో వెలువడే విషవాయు ప్రచా రాన్నే ఆయుధంగా ఎక్కుపెట్టారు. జగన్ పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందంటారు. ఎలా అని అడగ కూడదు. తర్కానికి తావులేదు. సర్వనాశనం అనే మాటను అష్టోత్తర శతనామంలా ప్రతివాడూ నూటా ఎనిమిది సార్లు జపించాలి. అంతే!జగన్ హయాంలో అభివృద్ధి శూన్యమంటారు. దాని పైనా చర్చ ఉండదు. ఆధారాలుండవు. గణాంకాల జోలికి వెళ్లొద్దు. ఫీల్డ్ విజిట్ చేయొద్దు. రోజూ ఓపికున్నంత సేపు రామకోటి రాసుకున్నట్టుగా ‘అభివృద్ధి లేదు’ అనే మాటను రాసుకోవాలి. పంచాక్షరి మంత్రంలా పవిత్రంగా ఉచ్ఛరించి నెత్తిన నీళ్లు చల్లుకోవాలి.సర్వనాశనం, అభివృద్ధి శూన్యం అనే రెండు మాటల్ని మన యెల్లో మీడియా, టీడీపీ నేతలు నమలడం మొదలు పెట్టి ఇప్పటికి నాలుగేళ్లు దాటింది. నమలడం, నెమరు వేయడం అనే కార్యక్రమం అప్పటి నుంచి నిరాటంకంగా సాగుతూనే ఉన్నది. చూసేవాళ్లకు రోత పుట్టినా వాళ్లు మాత్రం ఈ పాచిపాటను ఆపలేదు.ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ మరీ ఘోరం. ఆ పత్రికలు చదవాలన్నా, ఆ ఛానెళ్లు చూడాలన్నా అల్ప ప్రాణులకు జడుపు జ్వరం వచ్చే పరిస్థితిలోకి తీసుకెళ్లారు. అభూతకల్పనలు, అభాండాలు, బట్టకాల్చి మీద వేయడం నిత్యకృత్యంగా మారింది.‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అనే నల్ల చట్టాన్ని జగన్ మోహన్‌రెడ్డి తీసుకొచ్చారట. దాని ఆధారంతో ఆయన అర్ధరాత్రి వేళల్లో గ్రామాలకు కన్నంవేసి కంటికి నచ్చిన భూమినల్లా తవ్వుకొని, మూట కట్టుకొని వెళ్లిపోతారట! ఇదీ వీళ్లు ప్రచారం చేస్తున్న వార్త సారాంశం.మనిషి జన్మ ఎత్తిన వాడికి కొన్ని లక్షణాలు తప్పని సరిగా ఉంటాయని ఆశిస్తాము. సిగ్గూ–లజ్జ, మానము– మర్యాద, అభిమానం – గౌరవం వంటివి వాటిలో మచ్చుకు కొన్ని! యెల్లో మీడియా, దేశం కూటమి ఈ తరహా లక్షణా లను పూర్తిగా విసర్జించాయి. విలువల్నీ, వలువల్నీ విప్పేసి అవతలపారేశారు. దిగంబర వీరంగాలతో జుగుప్సాకరంగా తయారయ్యారు. నడివీధుల్లో నగ్నంగా నర్తిస్తున్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూయజమానులకు మేలు చేస్తుందనీ, ఇంతకాలం ఈ చట్టాన్ని తేకపోవడమే పొరపాటనీ ఈ దేశంలోని బుద్ధిజీవులందరూ అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాల్లో ఇప్పటికే ఈ చట్టం అమల్లో ఉన్నది.ఏపీ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఈ చట్టానికి మద్దతు ప్రకటించింది. ఇప్పటికింకా మూడో వంతు గ్రామా ల్లోనే భూసర్వే పూర్తయింది. అన్ని గ్రామాల్లో సర్వే పూర్త యితే తప్ప మరో రెండేళ్లకు గానీ ఈ చట్టం అమల్లోకి రాదు.చట్టం లక్ష్యమే యజమానికి భూమిపై సర్వహక్కులు కల్పించడం. ఆ హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం. అందుకు గుర్తుగానే సర్వే పూర్తయిన చోట ఇచ్చే పాస్ పుస్తకాలపై సీఎం బొమ్మను ముద్రిస్తున్నారు. అది ఆ యజ మాని హక్కుకు ప్రభుత్వ గ్యారంటీ. దాని మీద జరిగిన వక్రప్రచారం, చంద్రబాబు నోటి వెంట వచ్చిన బూతులు కూటమి దివాళాకోరుతనానికి రుజువు.అవ్వాతాతల పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి – యెల్లో మీడియా ఎంత అమానవీయంగా ప్రవర్తించాయో రాష్ట్ర ప్రజలు గమనించారు. వలంటీర్ల విషయంలో ఎన్ని పిల్లిమొగ్గలు వేశాయో గమనించారు.ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులకు దక్కకుండా ఈసీపై నెరిపిన ఒత్తిడి రాజ కీయం కూటమి వారి దింపుడు కళ్లెం ఆశల దిగజారుడు తనాన్ని ఎత్తిచూపింది.ఇసుక సరఫరాపై విషం చిమ్ముతూ గత నాలుగేళ్లుగా చందమామ కథలు నెలనెలా ప్రచారం చేయడాన్ని ఎలా మర్చిపోగలం?మద్యం వ్యాపారుల మాఫియా కోసం మద్య నియంత్రణపై వెళ్లగక్కిన అక్కసు గుర్తు చేసుకోండి. తను అధికా రంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని చంద్రబాబు అంది స్తారట. ప్రాణాలకు హానికరమైన లిక్కర్‌కు నాణ్యతా ప్రమాణాలేమిటి?విచ్చలవిడి లాభాల కోసం వ్యాపారులు వేలాది బెల్ట్ షాపులు కూడా నడిపి మద్యాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ప్రజల ఆరోగ్యం అద్భుతంగా ఉందట. మద్యాన్ని అందు బాటులో లేకుండా చేసి, బెల్టుషాపులు ఎత్తివేసి నియంత్రిత వేళల్లో మాత్రమే, లాభాపేక్ష లేని ప్రభుత్వ షాపుల్లోనే అమ్ముతుంటే మాత్రం కాలేయాలు, కిడ్నీలు పాడైపోతు న్నాయనే కాకమ్మ కథలను ప్రచారంలో పెట్టిన వైనాన్ని గమనించండి.పరిశ్రమల విషయంలోనూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణా త్మకం చేస్తే సహించలేకపోయారు. ఏ వివక్ష లేకుండా, పుట్టిన ప్రతిబిడ్డకూ నాణ్యమైన విద్యను ప్రాథమిక హక్కుగా మార్చితే పెత్తందారీ కూటమి భరించలేకపోతున్నది. ప్రభు త్వంపై యుద్ధం ప్రకటించింది.పేద వర్గాల ప్రజలు, మహిళలు నిటారుగా నిలబడ టానికి సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ఒక విప్లవకర ఎజెండాను జగన్ ప్రభుత్వం అమలుచేసింది. ఈ ఎజెండా కొనసాగవలసిన అవసరం పేదవర్గాలు, బలహీనవర్గాల ప్రజలకున్నది.ఈ ఎజెండా కొనసాగితే పెత్తందార్లకు ఆకలి తీరదు. అందుకే కట్టుకథలతో ముందుకు వస్తున్నారు. పేదవర్గాల ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరోసారి దారుణంగా మోసం చేయాలని కపట నాటకమాడుతున్నారు.వారు ప్రజలకు మిత్రులు కారు... శత్రువులు. మాన వీయ విలువలు లేశమాత్రం లేనివారు. పేద బిడ్డలు మంచి చదువులు చదివితే ఓర్చుకోలేరు.మిత్రులారా! ఏదైనా జరగరాని పొరపాటు జరిగి కూటమి గెలిస్తే సర్కారు బడులు మళ్లీ పాడుబడిపోతాయి. పేద బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం రద్దవుతుంది. విద్య ప్రైవేట్ పరమవుతుంది.ఈ లక్ష్యం కోసమే కార్పొరేట్ విద్యా సంస్థల యజమా నులు కూటమి గెలుపు కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు. అర్థం చేసుకోండి.ప్రభుత్వ వైద్యరంగం నిర్వీర్యమవుతుంది. ‘ఫ్యామిలీ డాక్టర్’ అదృశ్యమవుతాడు. కార్పొరేట్ మాఫియా వైద్యరంగాన్ని మళ్లీ ఆక్రమించుకుంటుంది. ‘రైతు భరోసా’ ఎగిరి పోతుంది. ఆర్బీకే సెంటర్లు అదృశ్యమవుతాయి.అధికార వికేంద్రీకరణకు అద్దం పట్టిన గ్రామ సచివాల యాలు మాయమవుతాయి. వలంటీర్ వ్యవస్థను ఎత్తి వేస్తారు. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ అనేది పేద వర్గాలను బలోపేతం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ పరిణామం పెత్తందారీ వర్గాలకు గిట్టదు.అందుకే ఈ కూటమి పలుమార్లు వికేంద్రీకరణపై అవాకులు చెవాకులు పేలిన విషయం మరిచిపోరాదు.సమస్త వనరుల మీద తమ పెత్తనం కోసం పెత్తందార్లు పరితపిస్తారు. అందుకోసం నిరంతరం వేటాడుతూనే ఉంటారు. బలహీనవర్గాలకు అధికారంలో వాటా పెరిగితే ఈ వేటగాళ్ల ఆటలు సాగవు.అందుకే జగన్ ప్రభుత్వ విధానాలపై పెత్తందార్లు యుద్ధం ప్రకటించారు. వారి మాయ నాటకాలకు లొంగి పోతే పేదవర్గాల విజయ ప్రస్థానం ఆగిపోతుంది. సామా జిక విప్లవానికి ఎదురుదెబ్బ తగులుతుంది. పేద ప్రజల విచక్షణ మీద, ఆలోచనాశక్తి మీద పెత్తందార్లకు చిన్నచూపు. అందుకే మిమ్మల్ని ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. మిత్రులారా! మీ చైతన్య స్థాయిని చాటిచెప్పండి. విప్లవకర ఎజెండాను జెండాగా ఎగరేయండి! వర్దెల్లిమురళి -
మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
సాక్షి, అమరావతి: పేదింటి పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని తమ పెత్తందారుల పిల్లలకు ఎక్కడ పోటీకు వస్తారోనని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎత్తేయడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతుండటంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పిల్లలకు ఉన్నత భవిష్యత్ దక్కాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు ఉండాల్సిందేనని వారంతా డిమాండ్ చేస్తున్నారు. తాము ఇంగ్లిష్ చదువుల్లేక జీవితంలో ఎదగలేకపోయామని.. తమ పిల్లలకు ఇలాంటి దుస్థితి తలెత్తకూడదని కోరుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ తమ పిల్లలకు మేనమామలా ఉంటూ అనేక విప్లవాత్మక సంస్కరణలు, పథకాలు ప్రవేశపెట్టి అత్యుత్తమ విద్యను అందిస్తున్నారని ఘంటాపథంగా చెబుతున్నారు. రాష్ట్రంలోని 15,784 ప్రైవేటు స్కూల్స్‌లోనూ ఇంగ్లిష్‌లోనే బోధన ఉందని గుర్తు చేస్తున్నారు. వాటికి లేని తెలుగు భాషాభిమానం ప్రభుత్వ స్కూళ్ల విషయంలోనే వచ్చిందా.. అంటూ నిలదీస్తున్నారు. తమ పిల్లలకు ఇప్పుడు ఇంగ్లిష్ చదువులు అందకపోతే వారి జీవితం అంధకారమైనట్టేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో ‘కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ’ అనే అంశాన్ని చేర్చడం వెనుక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ఎత్తేసే కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. నిరుపేదల పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వారికి సీఎం వైఎస్ జగన్ ఉత్తమ బోధన, ఇంగ్లిష్ మీడియం చదువులను ఉచితంగా అందిస్తుంటే చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడుతున్నారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం బోధిస్తే మాతృభాష మరుగున పడిపోతుందంటూ మొసలికన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఉన్నత విద్యకు ఇంగ్లిష్ తప్పనిసరి పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు చదవాలంటే ఇంగ్లిష్‌పై గట్టి పట్టు ఉంటే తప్ప సాధ్యం కాదు. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం లేనివారు ఉన్నత విద్యలో వెనుకబడుతున్నారు. మరికొందరు అర్థం చేసుకోలేక డ్రాపవుట్ కావడమో లేదా సాధారణ డిగ్రీ కోర్సులకు మారిపోవడమో చేస్తున్నారు. వీరిలో ప్రతిభ ఉన్నా ఇంగ్లిష్ భాషపై పట్టులేకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం చదువుతున్న విద్యార్థులు ఉన్నత విద్యలోనూ అద్భుతంగా రాణిస్తారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీంతో 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2020లో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా.. 97 శాతం మంది ఇంగ్లిష్ మీడియం బోధన తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని పెంచేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలను కూడా అందించింది. ఇటీవల ముగిసిన పరీక్షలను దాదాపు 93 శాతం పైగా విద్యార్థులు ఇంగ్లి‹Ùలోనే రాశారు. పదో తరగతిలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయకున్నా 2.23 లక్షల మంది విద్యార్థులు ఇందులోనే పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. వీరిలో 1.96 లక్షల మందికి పైగా ఉత్తీర్ణత సాధించడం విశేషం. దీన్ని బట్టి ఇంగ్లిష్ బోధనను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలోనూ 90 శాతం పైగా ఇంగ్లిష్ మీడియం చదువులనే కోరుకున్నారు. ఇంగ్లిష్ మీడియం లేకపోతే ఉద్యోగాలు ఎలా? సరైన ఇంగ్లిష్ చదువులు లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని అందకుండా చేస్తే పిల్లలు పెద్దయ్యాక ఎలా బతుకుతారు? ఉద్యోగాలు ఎలా వస్తాయి? జగన్ ప్రభుత్వం ఉచితంగానే ఇంగ్లిష్ మీడియం బోధన అందిస్తోంది. అమ్మఒడి కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పిల్లల చదువులకు ఉపయోగపడుతోంది. మా పిల్లలను ఇంగ్లిష్ మీడియంలోనే చేర్పించాం. ఎల్రక్టీíÙయన్‌గా కుటుంబాన్ని పోషిస్తున్న నాకు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించడం ఆర్థికంగా భారమే. – షేక్ బాజీ, నజ్మా, గుంటూరు ఇంగ్లిష్ మీడియం పేదలకు వరం కూలి పనులు చేసుకుంటే తప్ప జీవనం గడవని మాలాంటి కుటుంబాలకు పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చే స్తోమత లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పించడం మాలాంటి పేదలకు వరం. మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్‌లో మీడియంలో చదువుకుంటున్నారు. ఇప్పుడే పేద విద్యార్థులకు మంచి జరుగుతోంది. కార్పొరేట్ పాఠశాలలకు మించి చదువు చెబుతున్నారు. కొంతమంది నాయకులు ఇంగ్లిష్ మీడియం వద్దని చెబుతున్నారు. మరి వారి పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నారో చెప్పాలి. వారికో న్యాయం, మాకో న్యాయమా? – రాగోలు విజయలక్ష్మి, వంగర, విజయనగరం జిల్లా పిల్లల భవిష్యత్‌కు భరోసా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ద్వారా పిల్లల భవిష్యత్‌కు భరోసా లభిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావిధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చంద్రబాబు ఇంగ్లిష్ విద్యాబోధనపై ఆరోపణలు చేయడం అన్యాయం. పేదల ఉత్తమ చదువులు అందడం ఆయనకు ఇష్టం లేదు. ఇంగిŠల్ష్ మీడియంను రద్దు చేయాలని చూస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ స్కూళ్లు మూతపడే ప్రమాదముంది. – వాడపర్తి సుబ్బు, కోటనందూరు, కాకినాడ జిల్లా ఇప్పుడెన్నో సదుపాయాలు మా చిన్నప్పుడు ఇన్ని అవకాశాలను ఏ ప్రభుత్వం కల్పించలేదు. టీడీపీ ప్రభుత్వంలో అయితే పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువులు దేవుడెరుగు.. అసలు స్కూళ్లనే పట్టించుకోలేదు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంతో పాటు మరెన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు ఇంగ్లిష్ మీడియం స్థానంలో తెలుగు మీడియం తీసుకువస్తామని చెప్పడం పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయడానికే. మా పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించకలేకపోయాను, కానీ జగన్ దయవల్ల మా మనవళ్లు, మనవరాళ్లను ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్నాను. – కర్రి రామ్‌గోపాల్, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా -
బీద పిల్లల గురించి ఆలోచించండి!
ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ వాళ్లు గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్‌ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను, ముఖ్యంగా హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయకత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది. జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకూ వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. తెలుగుకు ప్రాధాన్యమంటూ ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. జాగ్రత్తగా ఆలోచించి ఓటెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకారమౌతుంది.దేశంలో ఎన్నికలు మొదటిసారి ఓబీసీల (వెనుకబడిన తరగతుల) చుట్టూ తిరుగు తున్నాయి. ఓబీసీల్లో అన్ని శూద్ర కులాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని శూద్ర వ్యవసాయ కులాలు రిజర్వేషన్లలో లేకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు. ఉదాహరణకు రెడ్డి, కమ్మ, కోస్తా కాపు కులాలు రిజర్వేషన్లలో లేవు. కర్ణాటకలో, తమిళనాడులో అన్ని శూద్ర కులాలు రిజర్వేషన్లలో ఉన్నాయి. లింగాయత్, వక్కళిగ, నాయకర్ (పెరియార్ కులం) కులాలు కూడా ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్లలో ఉన్నాయి.చారిత్రకంగా వర్ణ వ్యవస్థలో నాలుగవ వర్ణం శూద్రులు. వేద కాలంలో వారు బానిసలు. తరువాత వ్యవసాయ, కుటీర పరిశ్రమ, పశుపోషణ వంటి అన్ని ఉత్పత్తి పనులు చేసి దేశాన్ని ఈ స్థితికి తెచ్చింది ఈ కులాలే. క్రమంగా వీరి నుండి విడగొట్టబడి అంటరాని వారుగా అణగదొక్కబడ్డవారు దళితులు. వీరు కాక అరణ్య జీవనం నుండి అందరిలో కలిసే ప్రయత్నం చేస్తున్నవారు ఆదివాసులు.ఇంగ్లిష్ మీడియం వంటి సమాన విద్యే ఈ కుల వ్యవస్థను కూల్చుతుందని మనకు ఈమధ్య కాలంలోనే అర్థమవుతోంది. అందుకు మంచి ఉదాహరణ ఈ సంవత్సరం 10వ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారు ఆంధ్రలో 91 శాతం పాస్ అయితే, తెలంగాణలో 93 శాతం పాసయ్యారు. తెలుగు మీడియంలో చదువుకున్నవారు 80 శాతంగానే పాసయ్యారు.రిజర్వేషన్ల మాటేమిటి?అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం, అందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లను క్రమంగా ఎత్తివేసే సవరణ చెయ్యడం గురించి చర్చ జరుగుతోంది. ఈ భయం బీజేపీ బయట ఉన్న వారికే కాదు, బీజేపీలో ఉన్నవారికి కూడా ఉన్నది. అయితే మరి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఆయన బీసీ అని చెబుతున్నారు కనుక ఎలా తీసేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది? ఆరెస్సెస్ 1950లో రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేడ్కర్ ఆనాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌కు అందించి అమలు చేసిన నాటి నుండి ఎస్సీ, ఎస్టీలకు అందులో పొందుపర్చిన రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకతతో ఉంది. అంతకంటే ముఖ్యంగా 1955లో కాకా కాలేల్కర్ బీసీ రిజర్వేషన్ రిపోర్టును ఆనాటి నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించినప్పుడు ఆరెస్సెస్ మంచి పని జరిగింది అనే ధోరణిలో ఉంది.అయితే 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం బీపీ మండల్ రిపోర్టును అమలు చేసినప్పుడు ఆరెస్సెస్/బీజేపీ వ్యతిరేకించాయి. ఆనాడు కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నాయకులు కొంతమందైనా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చేశారు. కానీ బీజేపీలో ఉన్న బీసీల్లో ఒక్క ఉమాభారతి తప్ప వేరే ఏ ఒక్క బీసీ లీడర్ కూడా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చెయ్యలేదు. నరేంద్ర మోదీ ఆనాడు రిజర్వే షన్లను సపోర్టు చెయ్యలేదు. ఆయన బీసీ అని కూడా ఎవ్వరికీ తెలియదు. గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఆయన బీసీగా ప్రచారం ప్రారంభించారు.2014 ఎన్నికలకు ముందు ఆ ప్రచారాన్ని బాగా పెంచారు. ప్రధానంగా ఆనాడు బీసీల ఓట్లతో ఆయన గెలిచారు. అందుకు ఫలితంగా ఆయనగానీ, బీజేపీ/ఆరెస్సెస్ ప్రభుత్వంగానీ గత పదేండ్లలో బీసీలకు ఏమి ఇచ్చారు? మొత్తం శూద్ర సమాజం బతికేది వ్యవసాయ రంగం మీద. దాన్ని మొత్తంగా గుజరాత్–ముంబయి బడా పెట్టుబడిదారులకు అప్పగించేందుకు ఘోరమైన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తెచ్చారు. శూద్ర/బీసీలు ఇంతో అంతో బతికేది వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ మార్కెట్ల మీద. వాటిని బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని చట్టాలు చేస్తే శూద్ర/బీసీ రైతులు ఎంత పోరాటం చేశారో వ్యవసాయదారులందరికీ తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల స్కాలర్షిప్లు మొత్తం తగ్గించివేశారు. వీరు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్‌ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో కేవలం ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయ కత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది.చాలా విచిత్రంగా ఈ ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లను తీసేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామంటున్నారు. మోదీ, అమిత్ షా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు యూపీ ఎస్సీలో ఉన్నాయా? కొన్ని రాష్ట్రాల్లో 4 శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక రంగాన్ని ప్రైవేటీకరిస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడాన్ని వ్యతి రేకిస్తూ ముస్లింలకు తగ్గించేది ఎక్కడ? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేది ఎక్కడ?ప్రధానమంత్రి బీసీని అని చెబుతూ నా సిద్ధాంతం ‘సనాతన ధర్మం’ అంటే ‘వర్ణధర్మం’ అంటున్నారు. బీసీలు శూద్ర వర్ణం వారు కదా! సనాతన ధర్మం వారిని దైవ పాదాల నుండి పుట్టించింది కదా! అయినా మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా శూద్రులందరినీ ఏ దేవుని పాదాల్లో పుట్టిస్తారు? ఈ రాజ్యాంగం ఆ పాదాల, తొడల, భుజాల, తల పుట్టుకను రద్దు చేసి అందరి పుట్టుకను సమానం చేసింది. బీసీ ప్రధానమంత్రి చిన్నప్పుడు చాయ్ అమ్మి ఉండవచ్చు. కానీ మట్టి మోసి, మనుషుల మలాన్ని ఎత్తివేసే పనులు చేసే పిల్లల్ని కనీసం చాయ్ వ్యాపారంలోకి కూడా రానియ్యలేదే! దళితులు చాయ్ చేస్తే ఈ దేశంలో పై కులాలు ఇప్పటికీ తాగడం లేదే! మానవ మను గడకు మూలం వ్యవసాయం; ఆ పని చేసేవారంతా శూద్ర బీసీలు. వారికి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఖత్రీలు, కాయస్తులతో సమాన విద్య, సమాన పని హక్కు కల్పించే ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా మళ్ళీ సనాతన ధర్మాన్ని స్థాపించడం సాధ్యం కాదు. ఇక్కడే బీసీలు జాగ్రత్తగా ఆలోచించాలి. మే 5న ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రాగానే తెలుగుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలుగుకు ప్రాధాన్యమంటే, ఇంగ్లిషు మీడియం తీసేయడమా? మరి అమిత్ షా తన కొడుకు జయ్ షాను గుజరాతీ మీడియంలో ఎందుకు చదివించలేదు? అదే అమిత్ షా... ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో మరాఠీ/గుజరాతీ మీడియం ఎందుకు పెట్టించలేదు? ఆంధ్రప్రదేశ్ బీసీ, ఎస్సీ, ఎస్టీలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకార మౌతుంది.ఓటు వేసే ముందు... జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. అమిత్ షా ప్రకటన చాలా ప్రమాదకర హెచ్చరిక. ఈ మధ్య కాలంలోనే మోదీ తమ ఎంపీ అభ్యర్థులందరికీ ఉత్తరాలు రాస్తూ అమిత్ షాను ఆకాశానికి ఎత్తారు. మోదీ తరువాత అమిత్ షానే ప్రధానమంత్రి అనే డైరెక్షన్ ఇచ్చారు. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లిష్ విద్య రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న వ్యక్తి.ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. కానీ పెద్ద పెట్టుబడిదారులు వారి పిల్లల్ని ఇంగ్లిష్ తప్ప మరో భాష రాకుండా చూసుకుంటున్నారు. వీరి నేతృత్వంలో రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిస్తే, సమస్త భవిష్యత్ దెబ్బతింటుంది. గుజరాత్లో ఎప్పుడైనా ఆంధ్ర పాలకుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నడవగా చూశామా! ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి ఓటు వేసే ముందు మొత్తం ప్రజలు ఆలోచించాల్సింది ఇదే.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
ఎన్నో ఆటుపోట్లను భరించి ఒంటరిగా రాజకీయ పార్టీని స్థాపించారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక బలమైన నిజాయితీ గల ప్రజానాయకుడిగా ఎదిగారు. కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. కరోనా వల్ల రెండేళ్లు కలిసిరాక పోయినా ప్రజల్ని కంటిరెప్పల్లా కాపాడుకున్నారు. మిగిలిన కాలంలోనే పేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయి ఆంగ్ల విద్యను అందుబాటులోకి తెచ్చారు. పేద తల్లిదండ్రులకు అద్భుతమైన ఆరోగ్య సేవలను అందించారు. వలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాల ద్వారా పాలనను ప్రజల గడప వద్దకు తెచ్చారు. పెట్టుబడులను ప్రోత్సహించి పరిశ్రమలు వచ్చేట్టు చూశారు. ఒక్కమాటలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారు. అందుకే జగన్ అంటే జనాల్లో అంత ఆదరణ! జగన్ అంటే ఒక నిజం, ఒక భావోద్వేగం, ఒక విజయ సంకేతం.వై.ఎస్. జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రవేశం చేసినప్పటినుంచీ పది సంవత్సరాలు ఆటుపోట్లతో నడిచింది. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత రాజకీయంగా కాకలు తీరిన, కుట్రలు కుతంత్రాలు తెలిసిన నాయకులను ఎదిరించి ఒంటరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పుడే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్‌కు బీజం పడింది. తరువాతి కాలంలో సోనియా గాంధీ కుట్రలకు బలైపోయి పదహారు నెలలు జైలు జీవితం గడిపారు. 2017 జూలైలో తూర్పు గోదావరి జిల్లా, వైరా మండలం చాపరాయి గ్రామంలో పదహారు మంది ఆదివాసీలు విషజ్వరాలతో వైద్య సదుపాయం అందక మరణించిన విషయం తెలిసిందే. అప్పుడు జగన్ పది కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో పోలీసు రక్షణ కూడా లేకుండా నడక దారిన వెళ్లి ఆ విషయాన్ని వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. పేదల పక్షాన శాసనసభలో గళం వినిపించారు. ఇక జగన్ రాజకీయ జీవితంలో మరువలేని ప్రధాన ఘట్టం ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3,648 కిలోమీటర్లు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడిచిన పాదయాత్ర. ఈ పాదయాత్రలో జగన్ ప్రజలతో మమేకమై వారి కష్టాలు చూసి చలించి ‘నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైన నిజాయితీ గల ప్రజానాయకుడిగా ఎదిగారు. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాల్లో 151 గెలిచి ఏపీ ముఖ్యమంత్రిగా అశేష జన వాహిణి మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న యాభై ఎనిమిది నెలల పాలనా కాలంలో కరోనాతో 24 నెలలు ప్రజలను కంటికి రెప్పలా కాపాడు కోవడంలోనే గడిచింది. మిగిలిన దాదాపు మూడు సంవత్సరాల కాలంలో తన మేనిఫెస్టోలోని పథకాల ద్వారా ప్రజల ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఈ పథకాల ద్వారా మహిళా సాధికారతకు అడుగులు పడ్డాయి. వై.ఎస్.ఆర్. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో పేద ప్రజల బతుకులలో వెలుగులు ప్రసరించాయి. వడ్డీ లేని రుణాలు ఇప్పించడం వలన గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక పుష్టి కలిగింది. ముప్పై ఒక్క లక్షల మంది నిరుపేద మహిళలకు జగన్ ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసింది.అందులో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లతో పదహారు లక్షల ఇల్లు... రోడ్లు, డ్రైనేజి, నీటి వసతి, వీధి దీపాలు వంటి పూర్తి మౌలిక సదుపాయాలతో ఏర్పాటయ్యాయి. ఒక్కో ఇంటి విలువ స్థలంతో కలిపి పది లక్షలనుండి పదుహైదు లక్షల వరకు చేరి, పేదవారికి సొంత ఇంటి కల నెరవేరింది.జగన్ సుపరిపాలనలో మరో ముందడుగు 2019 ఆగస్ట్ 15 నుంచి ప్రారంభమైన వలంటీర్ వ్యవస్థ. ఇక 2019 అక్టోబర్ 2న ప్రారంభించిన గ్రామ వార్డు సచివాలయాలు ఒక సువర్ణ అధ్యాయం. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్, బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతోంది. సచివాలయాల ద్వారా ప్రజలకు రెవెన్యూ రికార్డులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, భూముల సర్వే సేవలు, ఆరోగ్యసేవలు ఏమాత్రం వ్యయ ప్రయాసలు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా వేగవంతంగా లభిస్తున్నాయి. గ్రామ స్థాయిలో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్ర సామగ్రి సేవలు మార్కెట్ కంటే తక్కువ ధరలకు అందుతున్నాయి.వైద్య రంగంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన గొప్ప మార్పు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు పైసా ఖర్చు లేకుండా అందించడం. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ హాస్పిటల్స్‌ను ఆధునీకరించారు. మహానేత రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ సేవల పరిమితిని రూ.ఇరవై ఐదు లక్షలకు పెంచారు. చికిత్స సేవలు 1,059 నుంచి 3,250 వరకు పెంచారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ ద్వారా ప్రజలకు గడప గడపకు వైద్య సేవలు అందు తున్నాయి. ఇవి కాక శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా వంశధార నది నుంచి 100 కిలోమీటర్లు పైప్‌లైన్ ద్వారా 807 గ్రామాలలోని ఏడు లక్షల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందించడం జరుగుతోంది. పలాసలో జగన్ తన పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ మరియు కిడ్ని పరిశోధన హాస్పిటల్ నిర్మించడంతో అక్కడి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుతున్నాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేనాటికి రాష్ట్రంలో 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండేవి. ఆయన శ్రీకాకుళం, కడప, ఒంగోలులో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించడానికి కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే నంద్యాల, ఏలూరు, రాజ మండ్రి, మచిలీపట్నం, విజయనగరంలలో ప్రారంభించారు. మిగిలిన 12 వైద్య కళాశాలలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.పేద పిల్లల అభివృద్ధికి విద్య అత్యవసరం అని జగన్ విశ్వసించారు. ఈ దిశగా జగన్ ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసింది. పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలోని అధి కారులతో స్థిరమైన ఆర్థికాభివృద్ధిపై చర్చలో పాల్గొనడం సామాన్య మైన విషయం కాదు.పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే సులభతర విధానంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో ఏపీకి రూ.32,800 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, ప్రస్తుత ప్రభుత్వంలో రూ.1.03 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. చిత్తూరు జిల్లా కోటర్ల పల్లె గ్రామం దగ్గర స్మార్ట్ డీవీ ప్రాజెక్ట్, అనకాపల్లి అచ్యుతా పురం దగ్గర టైర్ల తయారీ కంపెనీ, తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం దగ్గర బిర్లా క్యాస్టిక్ సోడా యూనిట్, వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ దగ్గర సెంచ్యురీ ప్యానల్స్ లాంటి పరిశ్రమలు వచ్చాయి.ఇంకా, అరబిందో, దివీస్ సంస్థల విస్తరణలతో కాకినాడ ఫార్మా యూనిట్‌గా ఎదుగుతోంది. విశాఖపట్నంలో ఇన్పోసిస్, విప్రో, భారత్ ఎలక్టాన్రిక్స్ తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆంధ్ర రాష్ట్రానికి 972 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉన్నా కొత్తగా పోర్టులు గానీ, ఫిషింగ్ హార్బర్లు గానీ ఇదివరకు రాలేదు. ప్రస్తుతం జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటి వలన మత్స్యకార కుటుంబాల వారు చేపల వేటకు గుజరాత్ తీర ప్రాంతానికి వలసలు పోనవసరం లేదు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాలనలో పేద ప్రజలకోసం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. తన ప్రభుత్వం వలన తమ కుటుంబాలకు మంచి జరిగితేనే తనకు తోడుగా నిలవమని అడుగుతున్నారు. జగన్ ఒక సంఘ సంస్కర్తగా, ప్రజారంజక పాలకుడిగా పేరు పొందిన మాట వాస్తవం. ప్రజలతో జగన్ బంధం భావోద్వేగాలతో ముడిపడి ఉంది. అందుకే సిద్ధం యాత్రలో లక్షలాది మంది పిల్లలు, యువతీ యువకులు, వృద్ధులు, మహిళలు ఎర్రటి ఎండల్లో కూడా జగన్ కోసం నిరీక్షిస్తున్నారు. ఆయన కనబడితే కేరింతలు కొడుతూ జై జగన్ అని నినాదాలు చేస్తున్నారు. ఇవి జగన్ విజయానికి సంకేతాలు.– అమూరు రాఘవరెడ్డి ‘ జె.డి.ఎస్.డబ్ల్యూ. (రిటైర్డ్),– జి.సాంబశివారెడ్డి ‘ రిటైర్డ్ ప్రిన్సిపల్,యోగి వేమన యూనివర్సిటీ, కడప -
గుండె ఘోష విన్నారు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూలేని రీతిలో ఎన్సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. ఇందులో భాగంగా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వాస్పత్రుల ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా గుండె జబ్బులు, క్యాన్సర్ తదితర పెద్ద జబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేస్తూ ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ (ఈసీసీ) కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించి బాధితుల ప్రాణాలను కాపాడింది. నగరాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గుండెపోటు బారినపడితే తొలి 40 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య సేవలు లభించేలా చర్యలు తీసుకున్నారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. సామాన్యులకూ అందుబాటులోకి హార్ట్‌కేర్ సర్వీసులు.. తిరుపతి రుయా ఆస్పత్రిలో 2022 జనవరి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఈ ఈసీసీ నడుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్‌లను హబ్‌లుగా తీర్చిదిద్ది కార్యక్రమాన్ని విస్తరించారు. నాలుగు చోట్ల కార్డియాలజిస్ట్ వైద్యులతో పాటు, క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉంది. హబ్‌లకు ఆయా జిల్లాల పరిధిలోని 69 స్పోక్స్ (సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఆస్పత్రులు)ను అనుసంధానంచేసి హార్ట్‌కేర్ సర్వీసులను సామాన్యులు, గ్రామీణులకు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం అన్ని జీజీహెచ్‌లను హబ్‌లుగా, సెకండరీ హెల్త్ ఆస్పత్రులను స్పోక్స్‌గా తీర్చిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు. స్పోక్స్‌గా వ్యవహరించే ఆస్పత్రుల్లో ఛాతినొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వ్యక్తులకు వెంటనే ఈసీజీ తీస్తున్నారు. ఆ ఫలితాన్ని హబ్‌లో ఉన్న కార్డియాలజిస్ట్‌కు పంపుతున్నారు. కార్డియాలజిస్ట్‌లు సంబంధిత కేసు గుండెపోటుదా కాదా అని నిర్ధారించి గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయిందో పరిశీలించి థ్రాబోలైసిస్ థెరపీని సూచిస్తున్నారు. ఇలా సూచించిన కేసుల్లో రూ.40 వేల విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్‌ను బాధితులకు ఉచితంగా ఇస్తున్నారు. గతేడాది సెప్టెంబరు 29 నుంచి ఇప్పటివరకూ 3 వేల మందికి పైగా ఛాతినొప్పితో స్పోక్స్‌కు రాగా వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియాల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ) సమస్యతో బాధపడుతున్న 489 మందికి వెంటనే థ్రాంబోలైసిస్ నిర్వహించారు. వీరిలో 424 మంది క్షేమంగా ఉన్నారు. సకాలంలో వైద్యసాయం అందకపోయినట్లయితే వీరందరూ కూడా మృత్యువాత పడేవారని వైద్యులు చెబుతున్నారు. భవిష్యత్‌లోనూ మరింత రక్షణ.. మరోవైపు.. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించారు. గుండె జబ్బులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఐదేళ్లలో 3.67 లక్షల గుండెపోటు బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేశారు. ఇందుకు రూ.2,300 కోట్లకు పైగా వెచ్చించారు. మరింత సమర్థవంతంగా గుండెపోటు మరణాలను నియంత్రించడానికి ఈసీసీను అమలులోకి తెచ్చారు. ఇక వచ్చే ప్రభుత్వంలో గుండె సంబంధిత వైద్యసేవల కోసం విశాఖ, కర్నూలు, గుంటూరుల్లో హబ్‌లు ఏర్పాటుచేస్తామని వైఎస్సార్సీపీ 2024 మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. -
తోడేళ్ళను తరిమే రోజు!
ఒక్కసారి మనం డెబ్బయ్యేళ్లు వెనక్కు వెళ్లాలి. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనల్ని ఆ జ్ఞాపకం వైపు బలవంతంగా నెడుతున్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తెలంగాణతో కలిసి ఇంకా ఆంధ్ర ప్రదేశ్‌గా అవతరించకముందు 1955లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాటి ఆంధ్ర రాష్ట్రం, నేటి ఆంధ్ర ప్రదేశ్ల భౌగోళిక స్వరూపం ఒక్కటే!ఆ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభంజనం కనిపించింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా కమ్యూనిస్టులు బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఉదంతాలు లేవు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్రం రికార్డు సృష్టించ బోతున్నదనే అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిగా సుందరయ్య, హోంమంత్రిగా చండ్ర రాజేశ్వరరావు, ఆర్థిక మంత్రిగా మాకినేని బసవపున్నయ్య వగైరా పేర్లతో కేబినెట్ కూర్పుపై కూడా ప్రచారం జరిగింది. సరిగ్గా ఈ దశలోనే పెత్తందారీ ముఠా, వారి అజమాయిషీలోని మీడియా రంగప్రవేశం చేశాయి.అప్పట్లో దున్నేవానికే భూమి అనేది కమ్యూనిస్టుల నినాదం. ఆ మేరకు భూసంస్కరణలు అమలు చేస్తామని వారు వాగ్దానం చేశారు. ఇది చాలు పెత్తందార్లకు! వారి చేతుల్లో వున్న ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి ఆనాటి ప్రముఖ పత్రికలు ఆయుధాలు బయటకు తీశాయి. కమ్యూనిస్టులు గెలిస్తే రైతుల భూములను లాక్కుంటారు. కమ్యూనిస్టులు గెలిస్తే ప్రజల ఇళ్లలో ఉన్న డబ్బును, బంగారాన్ని ఎత్తుకుపోతారు. వృద్ధులు పని చేయలేరు కనుక వారిని ప్రత్యేక క్యాంపుల్లో పెడతారు లేదా చంపేస్తారు. రష్యాలో, చైనాలో ఇలాగే చేస్తున్నారు. చివరికి మీ భార్యల్ని కూడా జాతీయం చేస్తారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్న మవుతుంది... ఈ రకమైన అభాండాలను అచ్చేసి అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు.ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేంత పబ్లిసిటీ దన్ను ఆనాడు కమ్యూనిస్టులకు లేదు. వాళ్లకున్నది ‘విశాలాంధ్ర’ ఒక్కటే. పార్టీ ముద్ర కారణంగా దానికీ పరిమితులున్నాయి. ఇటువంటి నిస్సహాయ స్థితిలోనే మహాకవి శ్రీశ్రీ గుండెలోంచి తన్నుకొచ్చిన ఆక్రోశం చాలామందికి గుర్తున్నది. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక’ అని ఈసడించుకున్నారు. నాటి ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ల అరాచకాన్ని ఒక లక్షతో హెచ్చ వేస్తే నేటి ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’, ‘టీవీ5’, ‘ఏబీఎన్’, ‘ఈటీవీ’ల అరాచకం విలువెంతో తెలుస్తుంది. ఆ ప్రత్యేక సందర్భం తర్వాత∙నాటి పత్రికలు మళ్లీ తటస్థ స్థితికి చేరు కున్నాయి. కానీ మన యెల్లో మీడియా మాత్రం గత పదేళ్లుగా ఆదే యజ్ఞంలో తలమునకలై ఉన్నది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా, ప్రయోక్తగా, ప్రవక్తగా గడిచిన మూడు దశాబ్దాల్లో చంద్రబాబు ఇంతింతై అన్నట్టుగా ఇనుమడించడం మనకు తెలిసిన సంగతే. ఇదే కాలంలో మన యెల్లో మీడియా చంద్రబాబు తరఫున గ్రామ సింహాల పాత్రను పోషిస్తే, బదులుగా ఆయన వారికి సెక్యూరిటీ గార్డు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఈ ముప్ప య్యేళ్లలో పధ్నాలుగేళ్లపాటు బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ఆయనకు వాలతుల్యుడనదగ్గ కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నాలుగేళ్లు గద్దె మీద కూర్చున్నారు. రాష్ట్రంలోని పేదల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం అమలైన కార్య క్రమాలన్నీ వీరి కాలం మినహా మిగిలిన సమయంలోనే జరగడం ఎవరైనా గమనించవచ్చు.ప్రజలందరికీ విద్య, వైద్యసేవలు అందజేయడం ప్రభుత్వ బాధ్యతగా నాగరిక సమాజం గుర్తిస్తున్నది. ఆ రంగాల్లో సేవలు ప్రభుత్వం బాధ్యత కాదని బాహాటంగా ప్రకటించి, వాటిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు నర్తనశాలగా మార్చిన అనాగరిక రాజకీయవేత్త చంద్రబాబు. ఫలితంగా ప్రభుత్వ బడులు కునారిల్లిపోయాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేట్ బడులకు పంపి అప్పులపాలయ్యారు. నిరు పేదల బిడ్డలు చదువుకు దూరమయ్యారు. ఒక తరం పేద, మధ్యతరగతి వర్గాల కలలను కాటేసిన చరిత్ర చంద్రబాబుది. అలాగే ప్రైవేట్ వైద్యసేవల బలిపీఠాన్నెక్కి లక్షలాది కుటుంబాలు కృశించి, నశించిపోయాయి.వ్యవసాయం దండగనేది ఆయన చేసిన ఒక క్రూర పరిహాసం. ఫలితంగా రైతులు పిట్టల్లా రాలిపోవడం బాబు జమానాలోనే ప్రారంభమైంది. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, నకిలీ మందులకు వ్యవసాయం వేదికైంది. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి వేల ఎకరాల భూములను కార్పొరేట్ శక్తులకు కైంకర్యం చేసే విధానాలను బాబు అవలంబించారు. ఈ క్రమంలోనే ఫిలిం సిటీ పేరుతో రామోజీ దాదాపు మూడువేల ఎకరాలు పోగేశారు. అన్నిరకాల భూచట్టాలూ రామోజీ భూదాహం ముందు చట్టుబండలయ్యాయి. వేలాది ఎకరాల్లో వ్యవసా యాన్ని అటకెక్కించి కార్పొరేట్ సంస్థలు కంచెలు వేసు కున్నాయి. పేదల జీవితాలను కాల్చుకుతింటున్న చంద్ర బాబులో పచ్చమీడియాకు ఓ విజనరీ కనిపించాడు.ఐదేళ్ల కింద ఆంధ్రప్రదేశ్‌లో ఒక తేడా వచ్చింది. చంద్రబాబుకూ, యెల్లో మీడియాకూ అది చిన్న తేడా ఏమీ కాదు. యెల్లో ‘విజనరీ’ విధానాలను కొత్త ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి తలకిందులు చేశారు. ప్రజలిచ్చిన అధికారం గుప్పెడుమంది పెత్తందార్ల కోసం కాదు, పురోగ మనం కోసం పోరాడుతున్న విశాల ప్రజానీకం కోసం అనేది ఆయన విధానం. జగన్మోహన్రెడ్డి విధానాలకు, మన పెత్తందారీ ఏజెంట్ల విధానాలకు ఘర్షణ ఏర్పడింది. పెత్తందార్ల కూటమి జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్ ప్రభుత్వ విధానాల వల్ల ఊపిరి పీల్చుకున్న పేదవర్గాల ప్రజలు ఆయన వెనుక సైన్యంగా మోహరించారు. పేదలు – పెత్తందార్ల మధ్య మహాయుద్ధానికి ముహూర్తం ఖాయమైంది.ఈ అయిదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంపై యెల్లో మీడియా సాగించిన దుష్ప్రచారం అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. గోబెల్స్ బతికి వుంటే సిగ్గుపడి ఉండేవాడు. శ్రీశ్రీ బతికి ఉంటే ఏమని కామెంట్ చేసేవాడో ఊహించుకోవలసిందే. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా ప్రచారం చేయని రోజు ఈ అయిదే ళ్లలో ఒక్కటీ లేదు. అయినా ప్రజాభిప్రాయాన్ని యెల్లో మీడియా పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నది. దీంతో వారిలో నిస్పృహ ఆవరించింది. అన్ని విలువల్నీ వదిలేశారు. వస్త్రవిసర్జన చేసి దిగంబర వీధినర్తనం మొదలుపెట్టారు. పోలింగ్ పది రోజులుందనగా తయారుచేసిన రెండు వింత కథల మీద ప్రాణం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో మొదటిది ఏమాత్రం క్రియేటివిటీ లేకుండా అల్లిన ఓ కట్టుకథ. ‘మీ భూమి మీది కాదు’ అనే పేరుతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ‘బాధితుల’ కథనాలను ‘ఈనాడు’ అచ్చేసింది. చట్టం పేరులోనే దాని ప్రాముఖ్యత ఉన్నది. భూమిపై రైతుకున్న యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం హామీ పడి ధ్రువీకరించే చట్టం. ఒకసారి ఈ చట్టం అమలులోకి వస్తే భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. దొంగ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చార్మినార్‌కు కూడా సేల్ డీడ్ ఇచ్చే అధ్వాన్నమైన పరిస్థితులు ఎన్నిసార్లు ఎదురు కావడం లేదు? నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను కొల్లగొట్టే దళారీల వృత్తాంతాలు ఎన్ని బయటకు రావడంలేదు? ఎన్ని వేల భూతగాదాలు కోర్టు వ్యాజ్యాల్లో దశాబ్దాల తరబడి నలిగి పోవడం లేదు? గొడవలతో ఎంత రక్తం పారి ఉంటుంది? ఎన్ని హత్యలు జరిగి ఉంటాయి? ఇదిగో ఇటువంటి వివాదాలను పరిష్కరించే సమగ్ర హక్కులను యజమానికి కల్పించి, అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. ఇందులో భాగంగా మొదట భూముల సమగ్ర సర్వే జరుగుతోంది. గ్రామ ప్రజల సమక్షంలో సరిహద్దులను నిర్ధారించి రైతుకు పాస్‌బుక్ ఇవ్వడం జరుగుతుంది. వందేళ్ల తర్వాత సర్వే జరిపి యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం ఇస్తున్న పాస్‌బుక్ ఇది. ఆ హక్కుకు ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీకి గుర్తుగా సర్వే జరిగిన కాలపు ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ఫోటోను కూడా పాస్‌బుక్‌పై ముద్రిస్తున్నారు. దీన్ని కూడా టీడీపీ – యెల్లో మీడియా వివాదం చేయడం చూస్తున్నాము.అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిగా జరిగిన తర్వాత చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసి, వాటిపై గ్రామసభల్లో చర్చలు జరిగిన తర్వాత తుది మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఆ తర్వాతనే చట్టం అమల్లోకి వస్తుంది.ఇదంతా జరగడానికి ఇంకో ఏడాది పట్టవచ్చు. రెండేళ్లు పట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని ‘నీతి ఆయోగ్’ సూచనలకు అనుగుణంగా ఈ చట్టం రూపకల్పన జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ భూయజమానికి మేలు చేసే ఈ చట్టం వచ్చి తీరుతుంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ముందుకు కదిలించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న యెల్లో కూటమి పార్టీ ఎన్డీఏలో భాగంగా ఉన్నది. కానీ ఇంత వరకు ఈ చట్టంపై తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తావించకపోవడం తెలుగుదేశం అవకాశవాద వైఖరికి పరాకాష్ఠ. పచ్చమీడియా కూడా ఈ చట్టంపై ఒక్క మాటయినా కేంద్రం ప్రస్తావన చేయకపోవడం వెనకనున్న రహస్యమేమిటి?ఇక శనివారం నాడు ‘ఈనాడు’ రాసిన ‘మీ భూమి మీది కాదు’ అనే కల్పిత కథ జర్నలిజం ప్రమాణాలను పాతాళంలోకి తొక్కేసింది. ఇందులో ముగ్గురు బాధితుల పేర్లు రాశారు.అందులో అమలాపురం సుబ్బారావు ఒకరు. ఆయన భూమి ఎక్కడో చెప్పలేదు. సర్వే నెంబర్ తెలియదు. ఆయన భూమి తనదంటూ ఎవరో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారట! ఆయనెవరో చెప్పలేదు. ఎవరికి దరఖాస్తు చేశాడో చెప్పలేదు. రెండేళ్ల తర్వాత సుబ్బారావు స్పందించలేదంటూ దరఖాస్తు చేసుకున్న వారి పేరు మీద భూమిని రాసేశారట! ఇదంతా ల్యాండ్ టైట్లింగ్ చట్టం మహత్యమట. అమల్లోకే రాని చట్టం రెండేళ్ల కిందనే పనిచేయడం ప్రారంభించిందని ‘ఈనాడు’ ఉవాచ!ఇక సాంబశివుడిది శ్రీకాకుళం జిల్లాలోని ఒక పల్లెనట! ఈ పల్లె పేరు చెబితే రామోజీ తల వెయ్యి ముక్కలవుతుంది కాబోలు. చెప్పలేదు! ఆయన భూమిని అమ్మడానికి వెళితే, ‘కొత్త రిజిస్టర్లో నీ పేరు లేద’ని అధికారులు చెప్పారట. అసలటు వంటి కొత్త రిజిస్టరు తమ దగ్గర ఏదీ లేదని అధికారులు ప్రకటించారు. గోవిందరెడ్డిది కర్నూలు జిల్లా. ఏ ఊరో చెప్పలేదు. ‘ఈనాడు’ ఆంధ్రా ఎడిషన్‌లోనే ఆయన గోవిందరెడ్డి. తెలంగాణ ఎడిషన్‌లో మాత్రం గోవిందయ్య. అంటే తెలంగాణకు వెళ్లిన ప్పుడల్లా ఆయన కులం తోకను కత్తిరించుకుంటాడు కాబోలు. ఆయన తన భూమిని తనఖా పెట్టాలనుకున్నాడట! బ్యాంకులో ఉండే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆయన పేరు ఉన్నదట! టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర క్లియరెన్స్ సర్టిఫికెట్ తెమ్మని బ్యాంకు వారు చెప్పారట. దాంతో గోవిందరెడ్డి ఉరఫ్ గోవిందయ్య ఆంధ్రాలో ఒకసారి, తెలంగాణలో ఒకసారి గొల్లుమన్నాడట! అసలు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే పోస్ట్ అమల్లోకే రాలేదు. డిస్ప్యూట్ రిజిస్టరూ లేదు. చదివేవాడు వెర్రి వాడయితే... రాసేవాడు రామోజీ!పెన్షన్ల వ్యవహారంపై తెలుగుదేశం – యెల్లో మీడియాలు నడిపిస్తున్న వ్యవహారంలో మరో వింతకథ. వలంటీర్ వ్యవస్థకే ఈ పెత్తందార్లు వ్యతిరేకం. తమ వ్యతిరేకతను వాళ్లు దాచుకోనూ లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇంటి దగ్గరే ఒకటో తారీఖు పొద్దున్నే వలంటీర్లు గత ఐదేళ్లుగా పింఛన్లు అంద జేస్తున్నారు. దాంతో అవ్వాతాతలు, దివ్యాంగులు భరోసాతో బతుకుతున్నారు. వలంటీర్లు విధుల్లో పాల్గొనకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున వారి ఏజెంటు నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి యెల్లో మీడియా వంత పాడింది. దాంతో వలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.ఈసీ సూచనల మేరకు ఏప్రిల్‌లో విలేజ్ సెక్రటేరియట్లలో పెన్షన్లు అందజేశారు. దీనిపై వృద్ధుల్లో వ్యతిరేకత వచ్చింది. గాభరాపడ్డ తెలుగుదేశం బృందం మళ్లీ నిమ్మగడ్డను పంపించి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించాలని ఈసీకి దరఖాస్తు పెట్టారు. ఈసీ సూచనలకు అనుగుణంగా మే నెలలో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఇక వృద్ధుల బాధలు వర్ణనాతీతం. వారి శాపనార్థాలతో కంగారు పడిన యెల్లో ముఠా వృద్ధుల బాధలకు జగన్ ప్రభుత్వమే కారణమనే విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. దొంగతనం చేసినవాడే ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు! జగన్మోహన్రెడ్డి సభలకు మండుటెండల్లో కూడా వెల్లువెత్తుతున్న జనప్రవాహంతో కూటమి వణికిపోతున్నది. ఈ రెండు అంశాలపై అబద్ధాలను ప్రచారం చేసి గట్టెక్కాలన్న దింపుడు కల్లం ఆశ దానిలో కనిపిస్తున్నది.ఇంకో వారం రోజుల్లో పోలింగ్ జరగబోతున్నది. ఇది పేద వర్గాలకు అందివచ్చిన అద్భుతమైన అవకాశం. పేద బిడ్డల ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న, వారి నాణ్యమైన చదువు లను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లను చావచితక్కొట్టడానికి ఇదో అవకాశం. పేదల సాధికారతను, మహిళల సాధికారతను సహించలేకపోతున్న పెత్తందార్లను పరుగెత్తించడానికి ఇంకో వారం రోజుల్లో అమూల్యమైన అవకాశం ఉన్నది. బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇస్తే, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎంపీ టిక్కెట్లు కేటాయిస్తే ఓర్వలేకపోతున్న పెత్తందార్లకు బుద్ధి చెప్పడానికి ఇదో గొప్ప అవకాశం. అబద్ధాలనూ, అభూత కల్పనలనూ, కట్టుకథలనూ ప్రచారంలో పెడుతూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే గాక సమాజంలో అశాంతిని రేకెత్తి స్తున్న పెత్తందారీ తోడేళ్లను తరిమి తరిమి కొట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ప్రభుత్వ బడిలో ప్రగతి కెరటాలు
తల్లిదండ్రులు కష్టపడితేనే పూట గడిచే కుటుంబాలకు చెందిన పిల్లలు వీరు. సీఎం వైఎస్ జగన్ సంకల్పంతో అత్యాధునికంగా మారిన ప్రభుత్వ బడుల నుంచి ఐక్యరాజ్య సమితిలో మెరిసిన మెరుపు తీగలు. 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 550 నుంచి 590 మార్కులు సాధించి, ప్రతిభను నిరూపించుకున్న ఆణిముత్యాలు.నానాజీ అంకంరెడ్డి, సాక్షి అమరావతి: ప్రభుత్వ బడులు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని టాపర్లుగా నిలిచిన వారికి ఏటా ’జగనన్న ఆణిముత్యాలు’ పేరిట వైఎస్ జగన్ ప్రభుత్వం సత్కరిస్తోంది. రాష్ట్రంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు 22 వేల మందిని ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట నగదు ప్రోత్సాహకాలతో సత్కరించి, పేద విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అంతేకాదు.. ఇలాంటి పేదింటి రత్నాలను ప్రభుత్వ ప్రతినిధులుగా 10 మందిని ఎంపిక చేసి ఐక్యరాజ్య సమితికి పంపించారు. అప్పటి వరకు కనీసం జిల్లా కేంద్రాన్ని కూడా చూడని ఈ విద్యార్థులు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకులో ప్రసంగించడం చరిత్ర సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన మార్పులు, మనబడి నాడు – నేడుతో సమకూరిన సదుపాయాలు, ఆధునిక ల్యాబ్స్‌తో జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌లో టాపర్లుగా నిలిచిన మరో ఏడుగురు విద్యార్థులు జపాన్ వెళ్లి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు ఈ స్థాయిలో ప్రోత్సహించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. పేదింటి ఆణిముత్యాలే రాష్ట్ర ప్రతినిధులు 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, పేదల పిల్లల విద్యాభివృద్ధిపై దృష్టి సారించారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేశారు. స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ స్క్రీన్ల ద్వారా బోధన, టోఫెల్ శిక్షణ వంటివి ప్రవేశపెట్టి, బోధన ప్రమాణాలు పెంచి, సర్కారు స్కూళ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఇదే అంశాన్ని తెలియజేస్తూ గతేడాది ఆగస్టులో న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో ఏపీ విద్యా సంస్కరణలను తెలియజెబుతూ ఏర్పాటు చేసిన స్టాళ్లు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల అభివృద్ధిని స్వయంగా తెలుసుకుంటామని పలు దేశాల ప్రతినిధులు కోరడంతో పాటు ఐక్యరాజ్య సమితికి ప్రతినిధులను పంపాలని ఆహా్వనించారు. సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ సదస్సులకు అత్యున్నత అధికారులను పంపిస్తారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పాఠశాలల అభివృద్ధిపై మాట్లాడేందుకు విద్యార్థులే సరైన ప్రతినిధులని సీఎం జగన్ భావించారు. అందుకే ఈ ఆణిముత్యాలను అంతర్జాతీయ వేదికలపై ప్రతినిధులుగా పంపించారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయని మన పిల్లలు 2022–23 విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలను 150 మందిని ఎంపిక చేసి, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, మారిన బడుల తీరుపై పరీక్ష పెట్టారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మందికి ఇంటర్వ్యూలు చేసి, వారి నుంచి 10 మందిని ఎంపిక చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు వీరంతా ప్రభుత్వ ఖర్చుతో అమెరికా వెళ్లి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో స్వయంగా మాట్లాడారు. ప్రపంచంలో అత్యంత అరుదుగా మాత్రమే ప్రవేశం లభించే అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో సైతం వీరు మాట్లాడే అవకాశం లభించింది. పేదింటి పిల్లలైనా, ప్రభుత్వ చేయూతతో అంతర్జాతీయ స్థాయి విజ్ఞానాన్ని సముపార్జించుకొన్న వీరంతా సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను వివరించారు. సీఎం జగన్ ఆదర్శవంతమైన సంస్కరణలను ప్రపంచానికి చాటిచెప్పారు. జపాన్ సకురా సైన్స్ ఫెయిర్‌కూ ఏపీ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నాడు – నేడు పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించింది. దీంతో అక్కడి సైన్స్ ల్యాబ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యుట్ ఫర్ ఇన్‌సై్పర్డ్ రీసెర్చ్ (ఇన్‌సై్పర్) పోటీల్లో సత్తా చాటుతున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థులు దైనందిన జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపే ఆకర్షణీయమైన అంశాలు, నమూనాలు తయారు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో లేబొరేటరీలు అత్యాధునికంగా తీర్చిదిద్దడంతో మన విద్యార్థులు గత నాలుగేళ్లుగా ఏటా 40 వేలకు పైగా ప్రాజెక్టులు చేస్తున్నారు. వీటి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతున్నాయి. గత నాలుగేళ్లుగా జాతీయ పోటీలకు దాదాపు 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు ప్రభుత్వం పేటెంట్ హక్కులు కూడా ఇస్తుంది. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్‌సై్పర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. ఇక్కడే కాదు.. 2019 నుంచి 2022 వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏడుగురు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించి, ‘జపాన్ సకురా’ అంతర్జాతీయ పోటీలకు ఎంపికై జపాన్‌లో పర్యటించి వచ్చారు.ప్రభుత్వ బడిలో కొత్త ఆవిష్కరణలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించడంతో విద్యార్థులు చేస్తున్న ప్రయోగాలు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకడంతో పాటు పేటెంట్లు సైతం అందుకుంటున్నారు. గుంటూరు జిల్లా అత్తోట జెడ్పీ స్కూల్ విద్యార్థిని పి.కీర్తి వీధుల్లో కూరగాయలు అమ్ముకునేవారికి ఉపయోగపడే వెండర్స్ ఫ్రెండ్లీ సోలార్ కార్ట్‌ను రూపొందించింది. చిత్తూరు జిల్లా ఏఎల్‌పురం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కె.ప్రణయ 15 రోజులు కూరగాయలు పాడవకుండా నిల్వ చేసుకునే గార్లిక్ బ్యాగ్‌ను రూపొందించింది. చిత్తూరు జిల్లా జంగంపల్లి జెడ్పీ స్కూల్ విద్యార్థి పి.చరణ్ తేజ బైక్‌పై వెనుక కూర్చున్న వారికి రక్షణగా ఉండే సైడ్ సీట్‌ను తయారుచేశాడు. రైతు కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురూ వారు నిత్యం చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆవిష్కరణలు చేసి, జాతీయ ప్రతినిధులను మెప్పించడమే కాదు.. గత నవంబర్‌లో జపాన్ వెళ్లి వచ్చారు. మరో నలుగురు విద్యార్థులు వచ్చే నెలలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.అత్యంత సామాన్యుల పిల్లలకే అవకాశం ⇒ ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరు జెడ్పీ స్కూల్లో చదువుకున్న పసుపులేటి గాయత్రి గతేడాది పదో తరగతిలో 590 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. జగనన్న ఆణిముత్యాలు అవార్డు కింద రూ.50 వేలు అందుకుంది. కూలి పనులు చేసే తండ్రి కష్టంపైనే బతుకుతున్న ఈ కుటుంబానికి జగనన్న విద్య, సంక్షేమ పథకాలు దన్నుగా నిలిచాయి. ⇒ కర్నూలు జిల్లా కౌతాళం మండలం పొదలకుంటకు చెందిన మించాలవారి సోమనాథ్, గంగమ్మలకు నలుగురు సంతానంలో ఒకరైన శివలింగమ్మ ఆదోని కేజీబీవీలో పదో తరగతిలో 541 మార్కులు సాధించింది. ⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన వంజవాకం యోగీశ్వర్ తండ్రి నాగరాజు సామాన్య రైతు. చంద్రగిరి ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదువుకున్న యోగీశ్వర్ గతేడాది పదో తరగతిలో 586 మార్కులు సాధించి జిల్లాలో రెండోస్థానంలో నిలిచాడు. ⇒ విజయనగరంలో మెకానిక్‌గా పనిచేస్తున్న అల్లం రామకృష్ణారెడ్డి, ఉదయలక్ష్మిల కుమార్తె రిషితారెడ్డి స్థానిక కస్పా మున్సిపల్ కార్పొరేషన్ హైసూ్కల్లో పదో తరగతిలో 587 మార్కులు సాధించింది. ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. ⇒ శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన షేక్ ఫాతిమా భర్త చనిపోవడంతో కూలీ పనులు చేస్తూ ఇద్దరు ఆడపిల్లలను పోషించుకుంటోంది. ఈమె రెండో కూతురు అమ్మాజాన్ వేంపల్లిలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివి గతేడాది పదో తరగతిలో 581 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆణిముత్యాలు సత్కారం కింద రూ.లక్ష నగదు బహుమతి అందుకుంది. ఇప్పుడు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. ⇒ నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రాంతానికి చెందిన సి.రాజేశ్వరి తండ్రి దస్తగిరి లారీడ్రైవర్. తల్లి రామలక్ష్మమ్మ ఇంటి వద్ద బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. రాజేశ్వరి నంద్యాలలోని ఏపీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదివి 583 మార్కులు సాధించి జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ బాలిక ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ చదువుతోంది. ⇒ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రామారావు, మణి దంపతుల రెండో కుమార్తె మోతుకూరి చంద్రలేఖ స్థానిక కేజీబీవీలో చదువుకుని గతేడాది పదో తరగతిలో 523 మార్కులు సాధించింది. జిల్లా టాపర్‌గా నిలిచి జగనన్న అణిముత్యాలు సత్కారం కింద రూ.50 వేల నగదు బహుమతి అందుకుంది. ⇒ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన దడాల సింహాచలం ప్రైవేటు సెక్యూరిటీ గార్డు. ఈయన రెండో సంతానమైన డి.జ్యోత్స్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో చదువుకుని పదో తరగతిలో 589 మార్కులు సాధించి జగనన్న ఆణిముత్యాలు రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాన్ని అందుకుంది. ప్రస్తుతం కృష్ణాజిల్లా ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఐఐటీ అకాడమీలో ఇంటర్ చదువుతోంది. ⇒ పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరుపల్లి గ్రామానికి చెందిన జి.గణేష్ అంజన సాయి ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గురుకుల పాఠశాలలో చదువుకుని గతేడాది పదో తరగతిలో 581 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. ఇతని తండ్రి గోపి కౌలు రైతు కాగా, తల్లి లక్ష్మి గృహిణి. -
నిజాలకు పాతర.. 'అబద్ధాల జాతర'
సాక్షి, అమరావతి: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీ పరిస్థితి. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి, అబద్ధాల కథనాలు అచ్చోస్తే ప్రజలు నమ్మేస్తారులే అన్న భ్రమల్లోనే ఆయన ఇంకా ఉన్నారు. ఇదే భ్రమలతో ఏది రాసినా చెల్లుతుందని గుడ్డిగా నమ్ముతూ రోజుకో అంశంపై ఆయన విషం కక్కుతున్నారు. పాఠకులు ఏమనుకుంటారనే ఇంగిత జ్ఞానం, సిగ్గూఎగ్గూ లేకుండా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. అప్పుడెప్పుడో ఈట్ క్రికెట్.. స్లీప్ క్రికెట్.. డ్రింక్ క్రికెట్ అన్న ప్రకటన మాదిరిగా రామోజీ ఏ పనిచేస్తున్నా అందులో భూతద్దం పెట్టి జగన్ వ్యతిరేకతపై రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ఇందులో భాగమే ఆయన కనుసన్నల్లో సాగిన తాజా పచ్చపైత్యం ‘బందిపోటు పాలన’ కథనం. డొంకతిరుగుడు రాతలతో ఎప్పటిలాగే సీఎం జగన్ పాలనపై రామోజీ అక్షరం అక్షరంలో తన అక్కసునంతా వెళ్లగక్కారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అక్కడక్కడ బందిపోటు పాలన కొనసాగుతోందని వ్యాఖ్యానిస్తే దాన్ని వక్రీకరించి రాష్ట్రానికి అంటగడుతూ రామోజీ బందిపోటు ‘గోల’ చేస్తూ పండగ చేసుకున్నారు. నేను సీఎం అయితే ఏ చట్టమైనా చేస్తా, కేసులు పెట్టిస్తా, జైల్లో వేస్తాం, భూములు లాక్కుంటాం అంటే కుదరదని.. అది బందిపోట్లు చేసే పనవుతుందని.. అక్కడక్కడ బందిపోటు పాలకులను చూస్తున్నామని పీవీ రమేష్ వ్యాఖ్యానిస్తే దాన్ని ఈనాడు రామోజీ సీఎం జగన్ పాలనకు ఆపాదిస్తూ పైశాచికానందం పొందారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ముసుగులో.. నిజానికి.. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ అధికారైనా రాజ్యాంగం, చట్టాల మేరకే పాలన సాగిస్తారని.. కానీ, ఏపీలో అందుకు విరుద్ధంగా పాలన సాగుతున్నట్లు పీవీ రమేష్ చెప్పారంటూ ఈనాడు తన వక్రబుద్ధిని, సీఎం జగన్‌పై తన అక్కసును మరోసారి బయటపెట్టుకుంది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ముసుగులో వందిమాగధులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చాగోష్టి పేరుతో సీఎం జగన్ పాలనపై ఈనాడు రామోజీ విమర్శలు చేయించి వాటిని వక్రీకరించీ మరీ అనైతికంగా అచ్చువేశారు. ఏ ప్రభుత్వమైనా దోచుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు బందిపోట్ల పాలన అవుతుందని సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించేందుకు ఈనాడు రామోజీ తెగ ఆరాటపడిపోయారు. మరోవైపు.. సంక్షేమం, అభివృద్ధి వేర్వేరు కాదు ఒక్కటే.. రెండూ అవసరమేనని, డబ్బులు పంచడం సులభతరమేనని, అందుకు బటన్ నొక్కితే సరిపోతుందని, అలాగే ఇంటర్నెట్ ఉంటే చాలంటూ పేదలకు నగదు బదిలీ చేయడాన్ని పీవీ రమేష్ అవహేళన చేస్తూ తన పెత్తందారీ ధోరణిని బయటపెట్టుకున్నారు. ఈనాడు రామోజీ కూడా పెత్తందారే కాబట్టి పీవీ రమేష్ మాటలు చాలా రుచికరంగా ఉండటంతో ఆయన మాటలకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చి ప్రముఖంగా అచ్చువేశారు. గురవింద గింజలా పీవీ రమేష్.. ఇక ప్రజలకు అవసరమైన సేవలందించడమే ప్రభుత్వ పాలనంటూ పీవీ రమేష్ చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్ జగన్ కూడా ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు. గత ప్రభుత్వాల తరహాలో గ్రామీణ, పట్టణ ప్రజలు తమకు అవసరమైన సేవలకు రాజకీయ నేతలు, మండల, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరంలేకుండా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల ముంగిటికే పాలనందిస్తున్న విషయం రిటైర్ట్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్‌కు కనిపించడంలేదా? కనిపించినా ఈనాడు రామోజీ తనకు కావాల్సినట్లు రాసుకున్నారా? అసలు రమేష్ రిటైర్ కాగానే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగంలో చేరిన ఆయన ఇతరులకు నీతులు చెప్పడం అంటే తన కింద నలుపు చూసుకోకపోవడమే అవుతుంది. ఈనాడు రామోజీ వంటి పెత్తందారుకు కావాల్సినట్లు మాట్లాడాలి కాబట్టి పీవీ రమేష్ కూడా ఆ ముసుగు ధరించారు. ఏ గణాంకాలు చూసినా రాష్ట్రం ప్రగతిపథంలో వెళ్తున్నట్లు కనిపించడంలేదని.. రివర్స్ ఇంజన్లో రాంగ్ రూట్లో వెళ్తున్నామనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గణాంకాలను ఈయన చూడలేకపోతున్నట్లు ఉన్నారు. అందుకే గణాంకాలపై కూడా పెత్తందార్లకు ఏదీ కావాలో అదే ఎంపిక చేసుకుని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోలోని 99 శాతం అంశాలను అమలుచేసి పేదవర్గాలకు పైసా లంచం లేకుండా నగదు బదిలీచేస్తే దాన్ని కూడా పీవీ రమేష్ తప్పుపట్టారంటే పేదలు అభివృద్ధి చెందకూడదనే ధోరణిని ఆయన కూడా చాటుకున్నారు. ఇవేవీ అభివృద్ధి కావా రమేష్..? మరోపక్క.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడితే ఇది అభివృద్ధిగా రమేష్‌కు కనిపించడంలేదా? ఇదే పీవీ రమేష్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు నాడు–నేడు పేరుతో ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని కూడా మరిచిపోయి ఇప్పుడు పెత్తందారుల పంచన చేరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాగే.. ► నాలుగు పోర్టులను, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇది అభివృద్ధి కాదా పీవీ రమేష్? ► పేదలందరికీ ఇళ్లు పేరుతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇంటి నిర్మాణాలను చేపట్టారు. ఇది పేదలు అభివృద్ధి చెందడం కాదా? ► గతంలో చంద్రబాబు వ్యవసాయ రుణాలన్నీ మాఫీచేస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. ఆ సమయంలో ఇదే పీవీ రమేష్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రుణమాఫీకి తూట్లుపొడవడంలో రమేష్ పాత్ర కూడా ఉంది. ఆయన దీనిని మర్చిపోతే ఎలా? ► 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ఆధారంగా జీఎస్డీపీలో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత చంద్రబాబు పాలన కన్నా జీఎస్డీపీ పెరుగుదల ఇప్పుడే ఎక్కువగానే ఉంది. దీనిని ఆయన ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించారా లేక రామోజీ ఇచ్చిన స్క్రిప్ట్‌ను బట్టీపట్టారా? ఏం పీవీ రమేష్? ► ఇక రాష్ట్ర అప్పులు కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే ఉన్నాయి. జీఎస్డీపీతో సమానంగా అప్పులున్నాయంటూ పీవీ రమేష్ పచ్చమీడియా వల్లిస్తున్న అబద్ధాలనే వల్లించారు. కార్పొరేషన్ల పేరుతో అప్పులుచేయడం తప్పుగా పీవీ రమేష్ అనడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. ► ఎందుకంటే.. గత ఎన్నికల ముందు ఇదే పీవీ రమేష్ కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్ధలో పనిచేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు కోరిక మేరకు 2019 ఎన్నికలకు ముందు పసువు–కుంకమ పేరుతో డబ్బులు పంచేందుకు సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి అప్పు మంజూరు చేసిన విషయం మరిచిపోతే ఎలా? ► కానీ, ఇందుకు భిన్నంగా సంక్షేమం, అభివృద్ధి సమతుల్యతతో సీఎం జగన్ ఐదేళ్ల పాలన సాగింది. -
రాజ్యాంగ స్ఫూర్తే రణ దుందుభి
అంబేద్కర్‌ను తలుచుకునే ప్రతి సందర్భంలోనూ మనకు భారత రాజ్యాంగం తలపునకొస్తూనే ఉంటుంది. నాలుగు వేదాల్లోని సారమెల్లా మహాభారతంలో ఉన్నదని ప్రతీతి. మానవ హక్కులకు పట్టం కట్టిన ప్రతి చారిత్రక పత్రంలోని సారాంశమంతా మన రాజ్యాంగంలో ఉన్నది. ఎనిమిది శతాబ్దాల కిందటి ‘మాగ్నాకార్టా’ దగ్గరి నుంచి ఎనిమిది దశాబ్దాల నాటి ‘విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన’ (యుఎన్) వరకు ఆయా కాలాల్లోని డిక్లరేషన్లు ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రాణ ప్రతిష్ఠ చేశాయి. ఈ డిక్లరేషన్లన్నిటిలోకి నిస్సందేహంగా అగ్రగణ్యమైనది, అత్యున్నతమైనది భారత రాజ్యాంగం. మానవ హక్కుల కథా గమనంలో పంచమవేదంలా పుట్టిన మహాకావ్యం భారత రాజ్యాంగం. దేశంలో సాధారణ ఎన్నికల వడగాడ్పుల సందర్భం కూడా ఇది. రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశంపై చెలరేగుతున్న వాదోపవాదాలు కూడా ఈ సందర్భాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండేళ్ల కిందట కావచ్చు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆయనకా అవకాశం ఇవ్వలేదు. ఆయన్నే మార్చే శారు. కాలపరిస్థితులను బట్టి రాజ్యాంగంలో స్వల్ప సవరణలు సహజమే. కానీ దాని మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ లేదని ఇప్పటికే భారత సర్వోత్తమ న్యాయస్థానం ఘంటాపథంగా చాటిచెప్పింది. మౌలిక స్వరూపం అంటే ఏమిటో దాని పీఠికలో ఉన్న ఆరు వాక్యాలు చదివితే అర్థమవుతుంది. బీజేపీ నాయత్వంలోని ఎన్డీఏ కూటమి మరోమారు గెలిస్తే రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చేస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరో పణల్ని బీజేపీ వాళ్లు మొక్కుబడిగా మాత్రమే ఖండి స్తున్నారు. అనంత హెగ్డే వంటి కొందరు నాయకులు బహిరంగంగానే రాజ్యాంగం మార్పుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీ అనే రాజకీయ వేదికకు సొంతదారైన ఆరెస్సెస్‌కు మన రాజ్యాంగం పట్ల మొదటి నుంచీ సదభిప్రాయం లేదన్నది సత్యదూరం కాదు. పైగా ఈసారి బీజేపీ వాళ్లు 400 సీట్లలో తమ కూటమి గెలవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఈ ఆరాటం వెనుక ఉన్న మహ త్కార్యం రాజ్యాంగ మౌలిక మార్పులేనన్నది విమర్శకుల అభిప్రాయం. భారత రాజ్యాంగంలో ధ్వనించే సమతా నినాదం సంఘ్ పరివార్‌కు ఏమాత్రం కర్ణపేయం కాదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వపు పదేళ్ల పదవీకాలంలో 40 శాతం దేశ సంపద ఒక్క శాతం కుబేరుల గుప్పెట్లోకి చేరిపోవడమే ఇందుకు ఉదాహరణ. వ్యవసాయరంగం నుంచి రైతు కూలీలను తరిమికొట్టి చీప్ లేబర్‌తో మార్కెట్లను నింపడం ఈ కూటమి విధానం. అందుకోసం తీసుకొచ్చిన వ్యవ సాయ చట్టాల ప్రహసనం తెలిసిందే. బీజేపీకి భారీ మెజారిటీ వస్తే పీఠికలోని సెక్యులర్, సోషలిస్టు పదాలు గ్యారంటీగా ఎగిరిపోతాయని చాలామంది భావన. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ పదాలను జొప్పించారు. ఈ పదాలను తొలగించినప్పటికీ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని 39 అధికరణాల రూపంలో వాటి పునాదులు బలంగానే ఉంటాయి. అయితే ఆ పునాదులనే పెకిలించే అవకాశాలుండవచ్చని దేశంలోని బుద్ధిజీవులు భయపడుతున్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని సామెత. పెత్తందారీ వర్గాల తాబేదారు పాత్రలో జీవితాన్ని తరింప జేసుకుంటున్న చంద్రబాబు నాయుడు బీజేపీకి సహజ మిత్రుడు. ప్రస్తుత ఎన్నికలతో కలిసి గడిచిన ఆరు సాధారణ ఎన్నికల్లో నాలుగుసార్లు ఆయన బీజేపీ కూటమిలోనే ఉన్నారు. రెండుసార్లు మాత్రమే దూరంగా ఉన్నారు. బీజేపీపై జనంలో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయంతో మాత్రమే ఆయన రెండుసార్లు దూరం జరిగారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేసే ఆర్థిక విధానాల్లో ఆయన బీజేపీ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. పేద ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల తన ఏహ్యభావాన్నీ, అసహ్యాన్నీ దాచుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు పార్టీ చేయదు. పేద ప్రజలకు రాజధాని ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కేసులు వేసి గుడ్డలూడదీసుకున్న వారి గురించి ఇంకేం మాట్లాడాలి? కుల, మత, ప్రాంత, రాజకీయ, లింగ వివక్షలేవీ లేకుండా నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను ప్రజలందరికీ అందజేయాలనే ఒక బృహత్తరమైన యజ్ఞాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు కూటమి ఈ యజ్ఞాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకోవడం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం విద్యకు వ్యతిరేకంగా, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులకు వ్యతిరేకంగా, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వ్యతిరేకంగా యెల్లో పెత్తందార్లు నడిపిన కుట్రల సంగతి కూడా తెలిసిందే. అన్ని రంగాల్లోనూ ఇదే తంతు. పేద వర్గాలను, మహిళలను వారి కాళ్లపై నిలబెట్టడానికి జగన్ సర్కార్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ యెల్లో పెత్తందార్లు వ్యతిరేకిస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ ఎంత పెరిగితే అంతగా పారదర్శకత పెరుగుతుంది. అచ్చమైన ప్రజాస్వామ్యానికి ఇది సిసలైన లక్షణం. జగన్ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసింది. ప్రభుత్వ పాలనను ప్రజల ఇంటి గడప వద్దకు చేర్చింది. వికేంద్రీకరణకు పెత్తందార్లు ఎప్పుడూ వ్యతిరేకమే. పాలనా వ్యవహారాలన్నీ వారి గుప్పెట్లోనే ఉండాలి. పారదర్శకత అనే పదం వారి డిక్షనరీలోనే ఉండదు. మాదాపూర్‌లో ఐటీ పార్క్ రాబోతున్నదనే రహస్యం వారికి మాత్రమే తెలియాలి. చుట్టూరా భూములన్నీ వారి వర్గంవారే కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే పార్క్ ప్రకటన రావాలి. రాజధాని ఎక్కడ వస్తుందో వారికి మాత్రమే తెలియాలి. వారి వర్గం అక్కడి భూములన్నీ కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే రాజధాని ప్రకటన చేయాలి. ఈలోగా ఇతర వర్గం ఔత్సాహికులను తప్పుదారి పట్టించడానికి తప్పుడు లీకులు వదలాలి. చంద్రబాబు నాయకత్వంలోని పెత్తందార్ల కూటమి అనుసరిస్తున్న ఈ తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే వారు అభివృద్ధి అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. భారత రాజ్యాంగం ప్రవచించిన ఆదేశిక సూత్రాలను శిరసావహించినందుకు జగన్ పాలన విధ్వంసకర పాలనని మన తోలుమందం పెత్తందార్లు ప్రచారం చేస్తున్నారు. యావత్తు ప్రపంచం వాంఛిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆదర్శంగా పెట్టుకున్నందుకు జగన్ పరిపాలన వారికి వినాశకరమైనదిగా కనిపిస్తున్నదట! దశాబ్దాలు గడిచిపోతున్నా అధికార పదవుల్లో ఆవగింజంత వాటా కూడా దొరకని వర్గాలను సమీకరించి సామాజిక న్యాయం బాట పట్టినందుకు జగన్ సర్కార్‌కు కొమ్ములు మొలిచా యట! కొవ్వు బలిసిన పెత్తందారీ వర్గాల ప్రచారం తీరు ఇది. ఎన్డీఏ పదేళ్ల ఏలుబడిలో నిరుద్యోగ సమస్య జడలు విప్పి నర్తిస్తున్నది. మన తెలుగు పెత్తందార్లకు ఆ జడల దయ్యం ముద్దొస్తున్నది. ఐదేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ఉంటే జగన్ సర్కార్ హయాంలో వారి సంఖ్య ఆరున్నర లక్షలకు పెరిగింది. ఎకాయెకిన యాభై శాతం ఉద్యోగాలు అదనంగా కల్పించిన జగన్ ప్రభుత్వం వారికి విలన్‌గా కనిపిస్తున్నది. ఈ సంఖ్యలో వలంటీర్లను చేర్చలేదు సుమా! పరిశ్రమల స్థాపనలోగానీ, మౌలిక వసతుల కల్పనలోగానీ, ఉపాధి కల్పనలోగానీ, సంక్షేమ కార్యక్రమాల అమలులోగానీ గణాంకాల ఆధారంగా జగన్ సర్కార్‌తో పోల్చడానికి ఈ పెత్తందార్లు ముందుకు రావడం లేదు. కేవలం విధ్వంసం, వినాశనం, సర్వనాశనం అనే పడికట్టు మాటలతో శాపనా ర్థాలు పెడుతూ పూట గడుపుకొస్తున్నారు. యెల్లో మీడియా అనుసరిస్తున్న ఈ తరహా ఊకదంపుడు గోబెల్స్ ప్రచారం కాలం చెల్లిన చీప్ ట్రిక్. ప్రజల చైతన్యస్థాయి పెరిగింది. సమాచార మాధ్యమాలు పెరిగాయి. ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో గుర్తించగలిగే వివేచనా శక్తి జనంలో పెరిగింది. రాజ్యాంగబద్ధమైన తమ హక్కులను రక్షించుకోవడానికి ప్రజలు సంఘటితమవు తున్నారు. కేంద్రంలో ఒక విశ్వసనీయమైన ప్రతిపక్షం, విశ్వసనీయ ప్రతిపక్షనేత అందుబాటులో లేకపోవడం అనే ఒకే ఒక్క కారణం మరోసారి ఎన్డీఏను గద్దెనెక్కించవచ్చు. అదీ బొటాబొటీ మెజారిటీతో మాత్రమే! కూటమి ఆశిస్తున్నన్ని సీట్లు గెలవడం అసంభవం. పెత్తందారీ వర్గాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ బలంగా ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో పేదవర్గాల జైత్రయాత్ర కొనసాగు తుందని అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం 25 లోక్‌సభ స్థానాలతో పాటు నూటాయాభైకి పైగా అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ (ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదు) విధానాన్ని తీసుకువచ్చి పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేపడుతోంది. వైద్య విద్యా కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా సెకండరీ హెల్త్ డైరెక్టరేట్(ఏపీవీవీపీ) పరిధిలో 185 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఏఎస్ఎస్) పోస్టుల భర్తీకి బుధ, శుక్రవారాల్లో ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించనుంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ.. ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాల్లో పోస్టులను బుధవారం భర్తీ చేయనున్నారు. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్తీషియా, ఈఎన్టీ, ఆప్తమాలజీ, పాథాలజీ విభాగాల్లో పోస్టుల భర్తీకి శుక్రవారం వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం తాడేపల్లిలోని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించే వాకిన్ రిక్రూట్మెంట్కు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య హాజరవ్వాల్సి ఉంటుంది. శాశ్వత, కాంట్రాక్ట్, కొటేషన్ విధానాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేయడానికి స్పెషలిస్ట్ వైద్యులు ముందుకు రాకపోతుండటంతో కొటేషన్ విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేయడానికి ఎంత వేతనం కావాలో వైద్యులు కొట్ చేయవచ్చు. ఆ కొటేషన్లను పరిశీలించి వైద్యులు కోరినంత వేతనాలను ఇచ్చి మరీ ప్రభుత్వం వైద్యులను నియమిస్తోంది. పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం http://apmsrb.ap.gov.in/msrb/, https://hmfw.ap.gov.in వెబ్సైట్లను అభ్యర్థులు పరిశీలించాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని అర్బన్ హెల్త్, వెల్నెస్ సెంటర్లలో 189 పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మంగళవారం నోటిఫికేసన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. భర్తీ చేసే పోస్టుల్లో 102 మెడికల్ ఆఫీసర్లు, 87 స్టాఫ్ నర్సు పోస్టులు ఉన్నాయన్నారు. బుధవారం నుంచి మార్చి 10వ తేదీ వరకూ అర్హులైన అభ్యర్థులు https://apmsrb.ap.gov.in/msrb వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక సమగ్ర నోటిఫికేషన్‌ను https://apmsrb.ap.gov.in/msrb, https://dme.ap.nic.in వెబ్సైట్లను అభ్యర్థులు సంప్రదించాల్సి ఉంటుంది. -
కుప్పానికి ‘కృష్ణా’ జలాలు
సాక్షి, అమరావతి: కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022, సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్లో 68.466 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ (రామకుప్పం మండలం రాజుపాలెం వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్‌టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్‌టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్‌టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్‌టీ)లకు సోమవారం సీఎం జగన్ కృష్ణాజలాలను విడుదల చేసి, జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత మిగతా 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ తమకు సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత 57 నెలలుగా నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనడానికి కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తే తార్కాణమని ప్రశంసిస్తున్నారు. అంచనాల్లోనే బాబు వంచన.. జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను చేపట్టి.. సాగు, తాగునీరు అందిస్తానని కుప్పం ప్రజలకు 2015లో అప్పటి సీఎం చంద్రబాబు నమ్మబలికారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం అప్పినపల్లి (207.8 కిమీ వద్ద) నుంచి రోజుకు 216 క్యూసెక్కులను మూడు దశల్లో ఎత్తిపోసి.. 123.641 కిమీల పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించి, 110 చెరువులను నింపడం ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తామని ప్రకటించారు. రాజకీయ భిక్ష పెట్టిన పురిటిగడ్డకు నీళ్లందించే పథకంలోనూ చంద్రబాబు దోపిడీకి తెరతీశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను 123.641 కిమీల పొడవున తవ్వేందుకు మట్టి, కాంక్రీట్ పనులకు రూ.203.11 కోట్లు వ్యయం అవుతుంది. మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం, మోటార్లు, ప్రెజర్మైన్లు, విద్యుత్ సరఫరా ఏర్పాటుకు రూ.90 కోట్ల వ్యయం అవుతుంది. ఈ లెక్కన 2015–16 ధరల ప్రకారం ఈ పనుల విలువ రూ.293.11 కోట్లు. ఆ మేరకు జలవనరుల శాఖ అధికారులు 2015, మేలో అంచనాలు రూపొందించారు. కానీ.. చంద్రబాబు ఒత్తిడితో పనుల అంచనా వ్యయాన్ని రూ.413 కోట్లకు పెంచేశారు. అంటే.. టెండర్ల దశలోనే రూ.120 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. బినామీతో కలిసి యథేచ్ఛగా దోపీడీ.. ఇక కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను అప్పటి కడపజిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టి ఆ రూ.120 కోట్లు కాజేయడానికి చంద్రబాబు స్కెచ్‌వేసి 2015, ఆగస్టులో టెండర్లు పిలిచారు. ఆర్కే ఇన్ఫ్రా సంస్థకే పనులు దక్కేలా టెండర్లులో నిబంధనలు రూపొందించారు. దాంతో టెండర్లలో ఆ సంస్థ ఒక్కటే నాలుగు శాతం అధిక (ఎక్సెస్) ధరకు కోట్‌చేస్తూ షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ దాఖలైతే ఆ టెండర్‌ను రద్దుచేయాలి. కానీ.. చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆ టెండర్‌ను ఆమోదించి రూ.430.26 కోట్ల పనులను ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఆర్కే ఇన్ఫ్రాకు రూ.43 కోట్లు ఇచ్చేలా చక్రం తిప్పిన చంద్రబాబు.. వాటిని ఎవరి జేబులో వేసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇక ఈ పనులను శ్రీనివాసరెడ్డికి కట్టబెట్టడంపై చంద్రబాబు బినామీ సీఎం రమేష్ అలకబూనారు. దీంతో50 శాతం పనులను సీఎం రమే‹Ùకు చెందిన రితి్వక్ ప్రాజెక్ట్స్‌కు సబ్ కాంట్రాక్టు కింద అప్పగించారు. కానీ.. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డిని వెళ్లగొట్టి మొత్తం పనులను సీఎం రమే‹Ùకు చంద్రబాబు కట్టబెట్టారు. కానీ, రమేష్ మట్టి తవ్వకం పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి భారీగా లబ్ధిపొందారు. దోచేసిన సొమ్ములో చంద్రబాబుకు ఎప్పటికప్పుడు వాటాలు పంపారని అప్పట్లో టీడీపీ వర్గాలే కోడై కూశాయి. చెప్పారంటే చేస్తాడంతే.. వరుసగా ఏడుసార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు అడ్డగోలుగా దోచేసి అభివృద్ధికి ఆమడదూరంలో నిలిపారు. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కుప్పంను మున్సిపాల్టీని చేయడంతోపాటు దీని కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను, పోలీసు సబ్ డివిజన్‌ను ఏర్పాటుచేశారు. రూ.66 కోట్లతో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో.. 2022, సెపె్టంబరు 23న కుప్పంలో సీఎం జగన్ పర్యటించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తిచేసి.. కృష్ణా జలాలను అందించి సుభిక్షం చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆ పనులను 2023, డిసెంబరు 15 నాటికే పూర్తిచేయించారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి మూడు దశల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా జలాలను ఎత్తిపోయడం 2023, డిసెంబర్ 18న ప్రారంభించారు. పాలార్ రిజర్వాయర్‌కు శ్రీకారం.. కుప్పం నియోజకవర్గాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా కుప్పం మండలం గణేశ్వరపురం వద్ద పాలార్ నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. రూ.214.81 కోట్లతో పాలార్ రిజర్వాయర్ పనులు చేపట్టేందుకు శుక్రవారం పరిపాలనా అనుమతినిస్తూ జీఓ జారీచేశారు. ఇందులో రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే, డీపీఆర్ తయారీకి రూ.0.432 కోట్లు.. ముంపునకు గురయ్యే 90 ఎకరాల భూసేకరణకు, 258 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కలి్పంచడానికి, 357.06 ఎకరాల అటవీ భూమికి పరిహారం చెల్లించడానికి రూ.47.878 కోట్లు కేటాయించారు. దీంతోపాటు.. కుప్పం బ్రాంచ్ కెనాల్లో అంతర్భాగంగా గుడిపల్లి మండలం యామిగానిపల్లి వద్ద 0.710 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్ నిర్మించి 2,500 ఎకరాలకు నీళ్లందించడం.. శాంతిపురం మండలం మాదనపల్లి వద్ద 0.354 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించి 2,500 ఎకరాలకు నీళ్లందించే పనులు చేపట్టడానికి రూ.535.435 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన జీఓ–100ను ఆదివారం రాత్రి జారీచేశారు. వాస్తవానికి.. పాలార్ రిజర్వాయర్‌కూ చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఇది పూర్తయితే కుప్పంలో తనకు రాజకీయంగా ఉనికిలేకుండా పోతుందని ఆందోళనతో ఆయన తమిళనాడు సర్కారును ఉసిగొల్పి సుప్రీంకోర్టులో కేసులూ వేయించారు. కుప్పం నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం : పెద్దిరెడ్డి శాంతిపురం (చిత్తూరు జిల్లా) : కుప్పం ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కుప్పం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కుప్పం కాలువ పనులను పూర్తిచేసి, సోమవారం నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. వీటితో కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం ఉద్దేశమన్నారు. ఎంపీ రెడ్డెప్ప, కలెక్టర్ షన్మోహన్, ఎమ్మెల్సీ భరత్, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలతో కలిసి మంత్రి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సభకు వచ్చే రైతులు, ప్రజలకు ఇబ్బందిలేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రూ.30 కోట్లు అధికంగా చెల్లింపు.. ఇక ఈ పనుల్లో సీఎం రమేష్ సంస్థకు రూ.460.88 కోట్లను 2019, ఏప్రిల్ నాటికి చంద్రబాబు ప్రభుత్వం బిల్లుల రూపంలో చెల్లించింది. అంటే.. కాంట్రాక్టు విలువ కంటే రూ.30 కోట్లు ఎక్కువగా చెల్లించినా పనులు పూర్తి కాలేదు. రూ.99.41 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి. పనుల్లో నాసిరకమైన పైపులు వేయడంవల్ల వర్షపు నీటికి ఆ పైపులు పగిలిపోయాయి.