గుడ్లగూబ వెలుగును చూడ లేదు. రాక్షస మూకలు మంచిని మెచ్చుకోలేవు. అది వాటి నైజం. నేటి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పక్షాలు... ప్రత్యేకించి దుష్ట చతు ష్టయంతో పాటు ఎల్లో జర్న లిజం కల్పిస్తున్న ఆటంకాలూ, అబద్ధాలూ చూస్తుంటే ఈ సంగతి మరింత స్పష్టమవుతోంది.
2020, 2021 సంవత్సరాలలో కరోనా మహమ్మారి మూలాన ప్రపంచ ఆర్థిక పరిస్థితితో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితీ కుదేలయ్యింది. అంతేగాక చంద్రబాబు దిగిపోతూ ఖజానాను ఖాళీ చేశారు. అయినప్పటికీ జగన్ తన మేధాసంపత్తితో రాష్ట్ర ఆర్థిక నిర్వహణను అతి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ విజనరీని మెచ్చి పారిశ్రామిక వేత్తలు 13 లక్షల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదుర్చుకొన్నారు.
పరిశ్రమలకు లెసైన్సులను ఏకగవా క్షము ద్వారా అప్పటికప్పుడు మంజూరు చేస్తున్నందున పరిశ్రమలు స్థాపించేదానికి ప్రపంచ ప్రఖ్యాత కంపె నీలు ఆంధ్రప్రదేశ్‌కు వరుస కడుతున్నాయి. అవుకు రెండో చానల్‌ను పూర్తి చేసి త్రాగునీరు, సాగునీటి ప్రాజె క్టును గత నవంబర్‌లో ప్రారంభించారు. పోలవరం పూర్తి చేసేదానికి పనులు చకచకా సాగుతున్నాయి.
4 అతి పెద్ద పోర్టుల నిర్మాణాలు పూర్తి అవుతు న్నాయి. 10 షిప్పింగ్ హార్బర్లు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, ప్రాణాంతక వ్యాధులైన కాన్సర్, కిడ్నీ వ్యాధులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, చిన్న పిల్లల ఆసు పత్రులు నిర్మిస్తున్నారు. 10 వేలకు పైగా ‘విలేజ్ క్లినిక్’లు, 10 వేల మెగా వాట్లతో కర్నూలులో గ్రీన్‌కో ప్రాజెక్టు, వెయ్యి మెగా వాట్ల హైడ్రోపవర్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు, కాకి నాడలో ఫార్మాసెజ్.
జగన్ చేతుల మీదుగా ఉత్పత్తి ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,788 ఆర్బీకేలను నిర్మించారు. ఒక్కొక్క ఆర్బీకేకు సుమారు 21 లక్షల రూపాయలతో నిర్మాణాలు జరిగాయి. దీనితో రైతులు విత్తనం నుంచి విక్రయం వరకు ఈ ఆర్బీకేల ద్వారా చేసుకుంటు న్నారు. దీనివల్ల 70 లక్షల మంది రైతులకు లాభ సాటిగా ఉంది.
జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమా లలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో గణనీయ మైన అభివృద్ధి చెందుతూ ఉన్నదనీ, దానికి తార్కాణం భారీగా పెరిగిన 16 లక్షల ఉద్యోగాలనీ కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రివర్యులు గత డిసెంబర్ మాసంలో రాజ్యసభలో తెలిపారు. కొత్త ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ క్రింద జమ అయిన ఫండు ఈ ఉద్యోగాల నియామకం నిజమేననడానికి నిదర్శన మన్నారు. అలాగే 32 లక్షల ఇళ్ళు మహిళల పేరుననే రిజిష్టర్ చేసి వారి సాధాకారతకు కృషి జరుగుతోంది.
జగన్ ముఖ్యమంత్రియైన తర్వాత 2.14 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 6.32 లక్షల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఇచ్చారు. ఇదంతా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థాపనతో వీలయ్యింది. వైద్యరంగంలో దాదాపు 6000 వేల డాక్టర్లు, నర్సులను పారదర్శకంగా నియమించారు. మిగిలిన శాఖల్లోనూ ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఈ అన్ని చర్యల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. సకల జనుల ఆర్థికాభివృద్ధి పెరిగింది.
గత మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రజల డిపాజిట్లు వివిధ బ్యాంకుల్లో రూ 87,877 కోట్లు పెరిగాయి. 2021 మార్చి 31 నాటికే డిపాజిట్లు 3,85,929 కోట్ల రూపా యలు కాగా, 2023 జూన్ 30వ తేదీ నాటికి బ్యాంకు డిపాజిట్లు 4,73,806 కోట్ల రూపాయలకు పెరిగాయని రిజర్వుబ్యాంక్ పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో గత మూడేళ్ళుగా మన జగనన్న ప్రభుత్వం ప్రథమ ర్యాంకులో ఉంది.
2019లో చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ది తలసరి ఆదాయంలో 17వ ర్యాంకు కాగా, 2021–22లో అది 9వ ర్యాంకుకు చేరింది. 2019లో వ్యవసాయరంగంలో 27వ ర్యాంకులో ఉన్న ఏపీ, ఇప్పుడు 6వ ర్యాంకును సొంతం చేసుకొంది. 2019లో పారిశ్రామికాభివృద్ధిలో 22వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు 3వ ర్యాంకుకు చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో 1 కోటి 63 లక్షల కుటుంబాల వారు ఉన్నారు. వారిలో దాదాపు 85 శాతం కుటుంబాలకు 2.50 లక్షల కోట్ల రూపాయలు నేరుగా నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. ‘అమ్మఒడి’, ‘విద్యా దీవెన’ ద్వారా బ్రతుకుదెరువునూ, నైపుణ్యాలనూ మెరుగు పరచుకొంటున్నారు.
‘వైఎస్సార్ ఆసరా’, ‘చేయూత’ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించారు. వారు తయారు చేస్తున్న ఉత్పత్తులకు హిందూస్థాన్ లీవర్స్, రిలయన్స్, మహీంద్ర వంటి పెద్ద కంపెనీలు మార్కెటింగ్ చేస్తు న్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే జగన్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో చంద్రబాబు కంటే ఎన్నోరెట్లు ముందుకు దూసుకుపోతోంది. అయినా పచ్చ మీడియా, పచ్చపార్టీ వక్రభాష్యాలు, అబద్ధపు కథనాలు చెప్తూ ప్రజలను వంచిస్తున్నాయి. ఈ పచ్చ మీడియా, పచ్చ పార్టీని చూస్తే తెలుగులో ఒక పద్యం గుర్తుకు వస్తుంది.
‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.’
గాజులపల్లి రామచంద్రారెడ్డి
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు
ప్రగతి పథంపై పచ్చ పడగ
Published Tue, Jan 2 2024 4:30 AM | Last Updated on Tue, Jan 2 2024 4:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment