YSR Vahana Mitra
-
టిప్పర్ డ్రైవర్‌కి టికెట్ ఇస్తే తప్పేంటి?: సీఎం జగన్
తిరుపతి, సాక్షి: చంద్రబాబు కారణంగానే ఇవాళ వృద్ధులు పింఛన్ కోసం ఎండలో నిలబడాల్సి వచ్చిందని.. వలంటీర్లపై నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించింది టీడీపీనేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం తిరుపతి జిల్లా చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. "ఒక టిప్పర్ డ్రైవర్‌కు సీటు ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేశారు. టిప్పర్ డ్రైవర్‌ను చట్ట సభలో కూర్చోబెట్టేందుకే ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా. ఒక టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇస్తే తప్పేంటి?. ఏం తప్పు చేశానని టీడీపీ ఇవాళ నన్ను అవహేళన చేస్తోందని" సీఎం జగన్ నిలదీశారు. "వీరాంజనేయులు(శింగనమల నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి) ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా వీరాంజనేయులు బాధపడలేదు. ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే టీడీపీలో కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని" ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు. "గత ఐదేళ్లుగా ఆటో, ట్యాక్సీ, టిప్పర్ డ్రైవర్లకు అండగా ఉంటున్నాం. ఏడాది రూ.10వేల చొప్పున.. ఈ ఐదేళ్లలో రూ. 50 వేలు సాయంగా ఇచ్చాం. వాహన మిత్ర ద్వారా ఇప్పటివరకు రూ.1296 కోట్లు ఇచ్చామని" సీఎం జగన్ తెలిపారు. నేను అడుగుతున్నా.. ఇదే చంద్రబాబును. నేను చంద్రబాబునాయుడుగారిని.. అవునయ్యా.. జగన్ టిప్పర్ డ్రైవర్ కే సీటు ఇచ్చాడు. నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడయ్యా? జగన్ అని అడుగుతున్నాను. నిజంగా నువ్వు చేయలేని పని, నువ్వు కోట్లు కోట్లు డబ్బులున్న పెత్తందార్లకు టికెట్లు ఇచ్చావు. నేను ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి పార్టీ తరపున నిలబెట్టించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తున్నాను. నిజంగా నీకు, నాకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ అని ఒక వైపున చెబుతూ, మరో వైపున నిజంగా ఈరోజు గర్వపడుతున్నాను. ఎందుకు తెలుసా? సొంత ఆటోలు కొనుక్కుని, ఈరోజు ట్యాక్సీలు కొనుక్కుని నడిపేవారు ఎంత మందో తెలుసా? అక్షరాలా 3,93,655 మంది. తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ తమ జీవితం వేరే వాళ్ల మీద ఆధారపడకుండా.. చదువుకున్న వాళ్లే వీరంతా కూడా. కాస్తో కూస్తో పెట్టుబడి పెట్టేవాళ్లే వీళ్లంతా. వీళ్లంతా కూడా ముందుకు వచ్చి ఎవడో ఉద్యోగం ఇవ్వలేదనో, ఎవడో తోడుగా ఉండటం లేదనో భయపడకుండా తామంతట తామే సొంత ఆటో కొనుక్కుని, సొంత ట్యాక్సీ కొనుక్కుని తమ కుటుంబాలను పోషిస్తున్న వారు అక్షరాలా 3,93,655 మంది. మొట్ట మొదటి ప్రభుత్వం.. వాళ్లు ఉన్నారు అని గమనించి, వాళ్లకు తోడుగా, అండగా ఉంటూ వాళ్లను ప్రోత్సహించాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, చిన్న చిన్న రిపేర్లు చేయించాలి. ఈ రెండూ చేపిస్తే తప్ప ఫిట్ నెస్ సర్టిఫికెట్ రాదు. ఫిట్ నెస్ సర్టిఫికెట్ రావాలి అంటే కనీసం అంటే రూ.10 వేలు ఇన్సూరెన్స్ కోసమని, రిపేర్ల కోసం అయినా గానీ ఖర్చు పెట్టి.. ఆ రూ.10 వేలు ముందే జమ చేసి, ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్ప ఫిట్ నెస్ సర్టిఫికెట్ వచ్చే కార్యక్రమం జరగదు. ఈ దఫా టిప్పర్ డ్రైవర్లకూ... మరి ఈ మాదిరిగా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు ఇంకా కాస్తా కూస్తో ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లు ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం. వీళ్లందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్లకు తోడుగా, అండగా ఉంది అని చెబుతూ ఏకంగా 3,93,655 మందికి క్రమం తప్పకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ 3,93,655 మందికి.. వాళ్ల కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ఆర్థిక ఆసరా అందిస్తున్నాం. మరొక్క సారి చెబుతున్నాను. వాహన మిత్ర అనే స్కీము తీసుకొచ్చి సొంత ట్యాక్సీ గానీ, సొంత ఆటో గానీ కొనుక్కుని తన జీవనం సాగిస్తున్న సొంతంగా చేసుకుంటున్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ 58 నెలల కాలంలో రూ.1.296 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టాం. ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక్క మాట చెబుతున్నాను. మరలా మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కుని, సొంతంగా లారీలు కొనుక్కుని వాళ్ల జీవనం వాళ్లు నడిపించుకుంటున్న వాళ్లను కూడా ఈ జాబితాలోకి తీసుకుని వస్తాం అని ఈ సందర్భంగా చెబుతున్నాను. వీళ్లందరికీ కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో తెలుసా? కారణం స్వయం ఉపాధి రంగంలో వీళ్లంతట వీళ్లు స్వయం ఉపాధి పొందుతూ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎవరి మీదో ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని తాము పోషించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక ఎలాగూ మామూలుగా ఉన్న డ్రైవర్లకు, మిగిలిన వాళ్లందరికీ కూడా మన నవరత్నాల్లోని అన్ని పథకాలూ ఎలాగూ వాళ్లందరికీ కూడా అందుతున్నాయి. అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలు పెడితే, వారింట్లో అవ్వాతాతలకు పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్లింట్లో ఉన్న పెద్దవాళ్లకు చేయూత దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కూడా ఎలాగూ అందుతున్నాయి. తిరుపతి జిల్లాలో ఈ మాదిరిగా వాహన మిత్ర పొందుతున్న వాళ్లు ఎంత మందో తెలుసా? ఈ జిల్లాలో ఏకంగా 18,000 కుటుంబాలు వాహన మిత్ర పొందుతున్నారు. ఈ జిల్లాలో వీళ్లకు ఇచ్చింది రూ.61 కోట్లు. ఈ 7 సెగ్మెంట్లలోనే ఇచ్చాం. మీ సలహాలు, సూచనలు ఇంకా ఏమైనా ఉంటే రాసి, ఆ స్లిప్పులన్నీ కూడా ఆ బాక్సులు వేయండి. వ్యక్తిగతంగా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది రాయండి. అందరికీ మైకులు ఇవ్వలేం, అందరూ మాట్లాడేంత టైమ్ ఉండదు కాబ్టటి.. మనకు కూడా ఇంకా ప్రోగ్రాములు చాలా ఉన్నాయి కాబట్టి.. ఆ స్లిప్పుల మీద మీరు రాసేస్తే, మీరు ఇవ్వాలనుకున్న సూచనలు, సలహాలు ఆ బాక్సులో మీరు వేసేస్తే అవన్నీ నా దాకా వస్తాయి. అందులో ఉన్న మంచివేదైనా, ముఖ్యమైనవి ఏదైనా ఉండి మనం ఇన్కార్పొరేట్ చేయగలిగినవన్నీకచ్చితంగా చేద్దాం. ఈ రోజు మీ అందరితో ఈ వేదికపై నుంచి మీరు చెప్పాల్సింది ఏదైనా ఉంది అంటే మీ దగ్గర నుంచి కూడా ఏదైనా విందాం అని అనుకుంటున్నాను. మైకు మీకు ఇస్తాను. మీ తరపు నుంచి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా వినేందుకు సిద్ధంగా మీ బిడ్డ, మీ అన్న మీ తమ్ముడు, మీకెప్పుడూ అందుబాటులో ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీలో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మైకు నేరుగా మీకే ఇస్తాం. అని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
ప్రగతి పథంపై పచ్చ పడగ
గుడ్లగూబ వెలుగును చూడ లేదు. రాక్షస మూకలు మంచిని మెచ్చుకోలేవు. అది వాటి నైజం. నేటి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పక్షాలు... ప్రత్యేకించి దుష్ట చతు ష్టయంతో పాటు ఎల్లో జర్న లిజం కల్పిస్తున్న ఆటంకాలూ, అబద్ధాలూ చూస్తుంటే ఈ సంగతి మరింత స్పష్టమవుతోంది. 2020, 2021 సంవత్సరాలలో కరోనా మహమ్మారి మూలాన ప్రపంచ ఆర్థిక పరిస్థితితో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితీ కుదేలయ్యింది. అంతేగాక చంద్రబాబు దిగిపోతూ ఖజానాను ఖాళీ చేశారు. అయినప్పటికీ జగన్ తన మేధాసంపత్తితో రాష్ట్ర ఆర్థిక నిర్వహణను అతి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ విజనరీని మెచ్చి పారిశ్రామిక వేత్తలు 13 లక్షల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. పరిశ్రమలకు లెసైన్సులను ఏకగవా క్షము ద్వారా అప్పటికప్పుడు మంజూరు చేస్తున్నందున పరిశ్రమలు స్థాపించేదానికి ప్రపంచ ప్రఖ్యాత కంపె నీలు ఆంధ్రప్రదేశ్‌కు వరుస కడుతున్నాయి. అవుకు రెండో చానల్‌ను పూర్తి చేసి త్రాగునీరు, సాగునీటి ప్రాజె క్టును గత నవంబర్‌లో ప్రారంభించారు. పోలవరం పూర్తి చేసేదానికి పనులు చకచకా సాగుతున్నాయి. 4 అతి పెద్ద పోర్టుల నిర్మాణాలు పూర్తి అవుతు న్నాయి. 10 షిప్పింగ్ హార్బర్లు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, ప్రాణాంతక వ్యాధులైన కాన్సర్, కిడ్నీ వ్యాధులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, చిన్న పిల్లల ఆసు పత్రులు నిర్మిస్తున్నారు. 10 వేలకు పైగా ‘విలేజ్ క్లినిక్’లు, 10 వేల మెగా వాట్లతో కర్నూలులో గ్రీన్కో ప్రాజెక్టు, వెయ్యి మెగా వాట్ల హైడ్రోపవర్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు, కాకి నాడలో ఫార్మాసెజ్. జగన్ చేతుల మీదుగా ఉత్పత్తి ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,788 ఆర్బీకేలను నిర్మించారు. ఒక్కొక్క ఆర్బీకేకు సుమారు 21 లక్షల రూపాయలతో నిర్మాణాలు జరిగాయి. దీనితో రైతులు విత్తనం నుంచి విక్రయం వరకు ఈ ఆర్బీకేల ద్వారా చేసుకుంటు న్నారు. దీనివల్ల 70 లక్షల మంది రైతులకు లాభ సాటిగా ఉంది. జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమా లలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో గణనీయ మైన అభివృద్ధి చెందుతూ ఉన్నదనీ, దానికి తార్కాణం భారీగా పెరిగిన 16 లక్షల ఉద్యోగాలనీ కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రివర్యులు గత డిసెంబర్ మాసంలో రాజ్యసభలో తెలిపారు. కొత్త ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ క్రింద జమ అయిన ఫండు ఈ ఉద్యోగాల నియామకం నిజమేననడానికి నిదర్శన మన్నారు. అలాగే 32 లక్షల ఇళ్ళు మహిళల పేరుననే రిజిష్టర్ చేసి వారి సాధాకారతకు కృషి జరుగుతోంది. జగన్ ముఖ్యమంత్రియైన తర్వాత 2.14 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 6.32 లక్షల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఇచ్చారు. ఇదంతా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థాపనతో వీలయ్యింది. వైద్యరంగంలో దాదాపు 6000 వేల డాక్టర్లు, నర్సులను పారదర్శకంగా నియమించారు. మిగిలిన శాఖల్లోనూ ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఈ అన్ని చర్యల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. సకల జనుల ఆర్థికాభివృద్ధి పెరిగింది. గత మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రజల డిపాజిట్లు వివిధ బ్యాంకుల్లో రూ 87,877 కోట్లు పెరిగాయి. 2021 మార్చి 31 నాటికే డిపాజిట్లు 3,85,929 కోట్ల రూపా యలు కాగా, 2023 జూన్ 30వ తేదీ నాటికి బ్యాంకు డిపాజిట్లు 4,73,806 కోట్ల రూపాయలకు పెరిగాయని రిజర్వుబ్యాంక్ పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో గత మూడేళ్ళుగా మన జగనన్న ప్రభుత్వం ప్రథమ ర్యాంకులో ఉంది. 2019లో చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ది తలసరి ఆదాయంలో 17వ ర్యాంకు కాగా, 2021–22లో అది 9వ ర్యాంకుకు చేరింది. 2019లో వ్యవసాయరంగంలో 27వ ర్యాంకులో ఉన్న ఏపీ, ఇప్పుడు 6వ ర్యాంకును సొంతం చేసుకొంది. 2019లో పారిశ్రామికాభివృద్ధిలో 22వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు 3వ ర్యాంకుకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో 1 కోటి 63 లక్షల కుటుంబాల వారు ఉన్నారు. వారిలో దాదాపు 85 శాతం కుటుంబాలకు 2.50 లక్షల కోట్ల రూపాయలు నేరుగా నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. ‘అమ్మఒడి’, ‘విద్యా దీవెన’ ద్వారా బ్రతుకుదెరువునూ, నైపుణ్యాలనూ మెరుగు పరచుకొంటున్నారు. ‘వైఎస్సార్ ఆసరా’, ‘చేయూత’ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించారు. వారు తయారు చేస్తున్న ఉత్పత్తులకు హిందూస్థాన్ లీవర్స్, రిలయన్స్, మహీంద్ర వంటి పెద్ద కంపెనీలు మార్కెటింగ్ చేస్తు న్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే జగన్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో చంద్రబాబు కంటే ఎన్నోరెట్లు ముందుకు దూసుకుపోతోంది. అయినా పచ్చ మీడియా, పచ్చపార్టీ వక్రభాష్యాలు, అబద్ధపు కథనాలు చెప్తూ ప్రజలను వంచిస్తున్నాయి. ఈ పచ్చ మీడియా, పచ్చ పార్టీని చూస్తే తెలుగులో ఒక పద్యం గుర్తుకు వస్తుంది. ‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.’ గాజులపల్లి రామచంద్రారెడ్డి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు -
జగన్ గారు వరుసగా ఐదేళ్లు వాహన మిత్ర పథకం ద్వారా మా డ్రైవర్లకు అండగా నిలబడ్డారు
-
మా కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టే మాకు ఇంత మేలు జరుగుతుంది
-
రాజమండ్రిలో ఆటో కార్మికుల భారీ ర్యాలీ
-
బతుకు బండి లాగడానికి ఇబ్బంది పడుతున్న డ్రైవర్ అన్నదమ్ములకు బాసటగా.. వైయస్ఆర్ వాహన మిత్ర
-
ప్రజల కోసం గొంతుకై నిలబడుతున్న ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నాను -సీఎం శ్రీ వైయస్ జగన్
-
అధైర్య పడొద్దు... అండగా ఉంటా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్లో సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు శుక్రవారం ఐదో విడత ఆర్ధిక సాయం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి క్యాంపు కార్యాలయానికి వెళ్లే సమయంలో పొందుగుల చిన్నారెడ్డి, నాగోజి చంద్ర శేఖర్ల ఆనారోగ్య సమస్యలను ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు సీఎంకు వివరించారు. విజయవాడ భవానీపురానికి చెందిన పొందుగుల చిన్నారెడ్డికి ఇటీవల జరిగిన ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతింది. తాను ఏ పని చేయలేకపోతున్నానని, తన ఇద్దరు కుమార్తెలతో జీవనోపాధి ఇబ్బందికరంగా ఉందని సీఎంకు చెప్పారు. చంద్రశేఖర్‌కు రూ.లక్ష చెక్కు అందజేస్తున్న కలెక్టర్,ఎమ్మెల్యే సమస్యను విన్న సీఎం జగన్ చలించి మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే భవానీపురానికే చెందిన నాగోజి చంద్ర శేఖర్ తన కిడ్నీలు పాడైపోయిన కారణంగా ఆర్థిక కారణాలతో వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందిగా ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. అతని సమస్యను విన్న సీఎం వైద్య సేవల నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించారు. ఇరువురి సమస్యను విన్న సీఎం జగన్ అధైర్య పడొద్దు అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. సీఎం ఆదేశించిన వెంటనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు ఎమ్మెల్యే వెలంపల్లితో కలిసి శ్రీనివాసరెడ్డికి రూ.10 లక్షలు, చంద్రశేఖర్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష చెక్కును అందజేశారు. -
‘ఉపాధి’కి ఇంధనం..
మీలో ఒకడిగా.. ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్’! ఇవన్నీ ఎవరో చెబితేనో.. ఎవరో ఉద్యమాలు చేస్తేనో తీసుకొచ్చినవి కావు. నా 3,648 కి.మీ. పాదయాత్రలో మీ సమస్యలను కళ్లారా చూశా. మీలో ఒకడిగా నాలుగేళ్లుగా మీ సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ‘వాయిస్ ఆఫ్ ది పీపుల్..’ అంటారు. మీ బిడ్డ పాలనలో ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్’ అంటే... తమ కష్టాన్ని చెప్పుకోలేని, తన ఆర్తిని వినిపించలేని పేదల గొంతుకై వాళ్ల తరపున నిలబడుతున్న ప్రభుత్వం మనది. కాబట్టే అట్టడుగున ఉన్న పేదవాడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా వాచా కర్మణా మీ బిడ్డ నమ్మాడు కాబట్టి ఆ దిశగా నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ఆటోలు, టాక్సీలను నడిపే డ్రైవర్ సోదరులు స్వయం ఉపాధి పొందడమే కాకుండా రోజూ లక్షలమంది ప్రయాణికులకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సొంతంగా ఆటోలు, టాక్సీలు కలిగి ఉండి వాటిని నడిపే వారికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్తోపాటు ఇతర ఖర్చుల కోసం ఏడాదికి రూ.పది వేల దాకా ఖర్చవుతోందన్నారు. అంత మొత్తం భరించేందుకు ఇబ్బందిపడే పరిస్థితుల్లో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకే ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించేందుకు ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’ పథకాన్ని తెచ్చినట్లు తెలిపారు. వరుసగా ఐదో ఏడాది ఈ పథకం ద్వారా మంచి చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం విజయవాడలోని విద్యాధరపురంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.275.93 కోట్ల వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత ఆర్ధిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. ఐదేళ్లలో రూ.1,301.89 కోట్లు.. ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొంటున్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల చేతుల్లో నేరుగా రూ.10 వేలు పెడుతున్నాం. ఈ డబ్బు ఎలా వాడతారు? దేనికి వినియోగిస్తారన్నది నేను అడగను. కానీ మీ అందరికి సవినయంగా ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా. మీ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోండి. మీ వాహనంలో ప్రయాణికులు ఉన్నారని, మీకూ కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎంతోమందికి సేవలందిస్తున్న మీకు ప్రభుత్వం తోడుగా నిలబడుతుంది. ఒక్క ఏడాది కూడా ఈ పథకాన్ని ఆపకుండా ఐదేళ్లలో ఐదు విడతల్లో ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున సహాయం చేయడం ద్వారా ఒక్క వైఎస్సార్ వాహన మిత్ర ద్వారానే ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లను నేరుగా అందించాం. గడప వద్దకే సంక్షేమం ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలు, రేషన్ కార్డుల దగ్గర నుంచి పెన్షన్ల దాకా, జనన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలన్నీ ఇంటివద్దకే తీసుకొచ్చి అందిస్తున్నాం. మీ అవసరాలు ఏమిటో జల్లెడ పట్టి మరీ తెలుసుకుని నవరత్నాల్లోని ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా గడపవద్దకే చేర్చుతున్నాం. నా పేద అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల పిల్లలు గొప్పగా చదవాలన్న ఆరాటంతో మన గ్రామంలోని ప్రభుత్వ బడికే ఇంగ్లిష్ మీడియం చదువులను తెచ్చాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా వలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. మీ గ్రామానికే విలేజ్ క్లినిక్ తీసుకొచ్చి మీకు అందుబాటులో ఉంచాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పరిచయం చేయడంతోపాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, హెచ్‌బీ, కఫం టెస్టులను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని తపన పడుతున్నాం. గ్రామ, వార్డు స్ధాయిలోనే మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ ఉండేలా చూస్తున్నాం. విత్తనాల నుంచి విక్రయాల దాకా రైతన్నలకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తూ ఆర్బీకేలను తీసుకొచ్చాం. రైతన్నలు.. నేతన్నలు.. గంగపుత్రులు రాష్ట్రంలో 52.39 లక్షల మంది రైతన్నల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన ప్రభుత్వంగా వారికి తోడుగా నిలబడుతున్నాం. ఒక్క వైఎస్ఆర్ రైతుభరోసా కోసమే రూ.30,985 కోట్లు ఖర్చు చేశాం. పంటలు వేసే సమయానికి పెట్టుబడి ఖర్చుల కింద రైతన్నల చేతుల్లో డబ్బులు పెట్టాం. ఇలాంటి మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరొకటి లేదని అన్నదాతలకు తెలుసు. వేట నిషేధ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార సోదరులకు అండగా నిలుస్తూ మత్స్యకార భరోసా ద్వారా 2.43 లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో ఏకంగా రూ.538 కోట్లు అందించాం. మగ్గం కదిలితే తప్ప బతుకు బండి నడవని 82 వేల చేనేత కుటుంబాలకు ఐదేళ్లలో ఒక్క నేతన్న నేస్తం పథకం ద్వారానే రూ.982 కోట్లు అందించి అండగా నిలిచాం. తోడు అందిస్తూ.. చేదోడుగా నిలుస్తూ రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే, పుట్‌ఫాత్‌ల మీద విక్రయాలు సాగించే చిరువ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు, జగనన్న చేదోడు పథకాలను అమలు చేస్తున్నాం. వాళ్లు వ్యాపారాలు ఎలా చేసుకుంటున్నారు...? అందుకు పెట్టుబడి ఎక్కడ నుంచి వస్తుంది? ఆ పెట్టుబడి కోసం ఎంతెంత వడ్డీకి డబ్బులు తెస్తున్నారో గతంలో ఎవరూ పట్టించుకోలేదు.అలాంటి 15.87 లక్షల మంది చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటివరకు వడ్డీలేని రుణాల రూపంలో రూ.2956 కోట్లు అందించాం. రజక సోదరులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కోసం జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చి 3.30 లక్షల మందికి ఇప్పటివరకు రూ.927 కోట్లు సాయం అందించాం. అమ్మ ఒడి.. విద్యా దీవెన.. వసతి దీవెన అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మీ బిడ్డ జగనన్న అమ్మఒడి పథకాన్ని తెచ్చాడు. 52 నెలల్లో 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అమ్మఒడి కోసం రూ.26 వేల కోట్లు విడుదల చేశాం. 26.99 లక్షల మంది తల్లులకు వారి పిల్లల పెద్ద చదువుల కోసం విద్యా దీవెన ద్వారా అందించిన సహాయం రూ.11,317 కోట్లు. జగనన్న వసతి దీవెన బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు చెల్లిస్తున్నాం. ఏడాదికి రూ.20 వేలు వరకు అందిస్తూ జగనన్న వసతి దీవెన కోసం రూ.4,275 కోట్లు వెచ్చించాం. అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ... చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు మోసపోయారు. మాట ప్రకారం వారిని ఆదుకుంటూ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తెచ్చి 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,178 కోట్లు ఇచ్చాం. లేదంటే చంద్రబాబు మోసాలతో 18 శాతం ఉన్న ఎన్పీఏలు, అవుట్ స్టాండింగ్ లోన్స్ 50 శాతం దాటేవి. అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నావడ్డీ కూడా వర్తింపచేసి దాదాపు రూ.5 వేల కోట్లు ఇచ్చి తోడుగా నిలబడ్డాం. 26.40 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రూ.14,129 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా 3.58 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు సాయం అందించాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4.39 లక్షల మంది ఓసీ నిరుపేద అక్కచెల్లెమ్మలకు అందించిన సహాయం రూ.1,257 కోట్లు. 30.76 లక్షలమంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్ధలాలిచ్చాం. ఇప్పటికే 21.32 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. తమకు ఇంతగా మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే మరొకటి లేదని నా అక్కచెల్లెమ్మలకు తెలుసు. ఇవన్నీ ఎవరో అడిగితేనో, ఎవరో ఉద్యమాలు చేస్తేనో వచ్చినవి కావు. ఇవన్నీ కూడా మీ బిడ్డ.. మీలో ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. మీ కష్టాలు, సుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. ఇది మీ ప్రభుత్వం కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో మంత్రులు పి.విశ్వరూప్, జోగి రమేశ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, వసంత కృష్ణ ప్రసాద్, రక్షణనిధి, కైలే అనిల్ కుమార్లతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి జగనన్న అవసరం నేను విజయవాడలో 15 ఏళ్లుగా సీఎన్జీ ఆటో నడుపుతున్నాను. గతంలో ఇక్కడ 4 సీఎన్జీ స్టేషన్లు మాత్రమే ఉండడంతో గ్యాస్ కోసం రోజంతా పడిగాపులు పడేవాళ్లం. ఆటోలకు ఇన్సూరెన్స్‌లు, ఫిట్ నెస్‌లు చేయించుకోవడానికి కూడా కుదిరేది కాదు. పాదయాత్రలో మా స మస్యలు మీకు చెప్పగానే సానుకూలంగా స్పందించారు. మీరు సీఎం అవ్వగానే వాహనమిత్ర పథకం ద్వారా మాకు సాయం చేస్తున్నారు.ఈ విడతతో కలిపి నాకు రూ.50,000 వచ్చాయి. మీ చొరవతో విజయ వా డలో ఉన్న సీఎన్జీ స్టేషన్లు 4 నుంచి 15 అయ్యాయి. కోవిడ్ వల్ల రవాణా రంగం కుదేలైపోతే మానవత్వంతో మాకు 5 నెలల ముందే వాహనమిత్ర సాయం అందించా రు. నా తల్లి 2 నెలలు గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే వలంటీర్ వచ్చి పెన్షన్ ఇచ్చారు. మా అమ్మ చనిపోయే వరకు రూ. 81 వేలు వచ్చాయి. నా కూతురుకి అమ్మ ఒడి సాయం అందింది. నా కుమారుడికి వసతిదీవెన ద్వారా రూ.20 వేలు, ఇంజినీరింగ్ చదువుకు రూ.2,20,320 వచ్చాయి. మొత్తం నా కుటుంబానికి రూ.3,85,300 లబ్ధి కలిగింది. నా ఆటోకు ఇంధనం ఎంత అవసరమో... ఈ రాష్ట్రానికి జగనన్న కూడా అంతే అవసరం. – వినోద్, ఆటో డ్రైవర్, వాహనమిత్ర లబ్ధిదారుడు, విజయవాడ -
వైఎస్ఆర్ వాహన మిత్ర నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
-
విజయవాడ వాహనమిత్ర సభలో సీఎం జగన్ (ఫొటోలు)
-
వైఎస్ఆర్ వాహన మిత్ర: ఆటో డ్రైవర్ మాటలకు సీఎం వైఎస్ జగన్ ఫిదా
-
పెత్తందారుల ప్రభుత్వం రాకూడదు: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని తెలిపారు.పేదలకు, పెత్తందారులకూ మధ్య యుద్ధం జరగనుందని పేర్కొన్నారు. అమరావతి పేరుతో స్కామ్, స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, నీరు-చెట్టు పేరుతో దోపీడీ చేసిన వారితో యుద్ధం జరగబోతుందని మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడలో వరుసగా అయిదో ఏడాది వాహనమిత్ర నిధులను సీఎం జగన్ శుక్రవారం విడుదల చేశారు. వాహనమిత్రతో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు లబ్ధి పొందుతుండగా.. 2,75,931 మంది ఖాతాల్లోకి రూ. 10 వేల చొప్పున జమచేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. 99శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. మన ప్రభుత్వం వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ అని పేర్కొన్నారు. ఒకవైపు పేదల ప్రభుత్వం ఉంటే మరోవైపు పేదల్ని మోసగించిన వారు ఉన్నారని విమర్శించారు. చదవండి: ఇది మీ అందరి ప్రభుత్వం: సీఎం జగన్ ‘మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం. గత పాలకులకు మనసు లేదు. పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మనది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని అమలు చేశాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. లంచం, వివక్ష లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేశాం. గతంలోనూ ఇదే బడ్జెట్, మారిందల్లా సీఎం ఒక్కడే.గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు? పేదవాడి ప్రభుత్వం నిలబడాలి. పెత్తందారుల ప్రభుత్వం రాకూడదు. వచ్చే ఎన్నికలప్పుడు వీటన్నింటి గురించి ఆలోచించాలని సూచించారు. వాళ్లకు అధికారం కావాల్సింది దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి.. వాళ్లలాగా నాకు దత్తపుత్రుడి తోడు లేదు. వాళ్లు మాదిరిగా నాకు గజదొంగల ముఠా తోడుగా లేదు. దోచుకొని పంచుకొని తినడం నా విధానం కాదు. మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే నాకు తోడుగా నిలవండి. ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలబడండి. ఓటు వేసే ముందు జరిగిన మంచి గురించి ఆలోచించండి.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
YSR Vahana Mitra Scheme: విజయవాడలో YSR వాహన మిత్ర.. సీఎం జగన్ (ఫొటోలు)
-
ఇది మీ అందరి ప్రభుత్వం: సీఎం జగన్
►వైఎస్సార్ వాహన మిత్ర ఐదో విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. విద్యాధరపురం స్టేడియంకు చేరుకున్న సీఎం.. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై బటన్ నొక్కి వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ►ఆటోడ్రైవర్లు అందించిన ఖాకీ చొక్కా ధరించిన సీఎం జగన్.. ప్రసంగం ప్రారంభించారు ►బతుకు బండి లాగడానికి ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసమే ఈ పథకం: సీఎం జగన్ ►వాహనం ఇన్యూరెన్స్, ఇతర ఖర్చుల కోసమే వైఎస్సార్ వాహన మిత్ర ►ఆటో,ట్యాక్సీ డ్రైవర్లకు అండగా నిలిచేందుకే ఈ పథకం ►ఇవాళ రూ.276 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం ►వైఎస్సార్ వాహన మిత్రతో ఒక్కొక్కరికీ రూ.50 వేలు లబ్ది జరుగుతోంది ►వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నా ►ఇది జగనన్న ప్రభుత్వం కాదు.. ఇది మీ అందరి ప్రభుత్వం: సీఎం జగన్ ►మీ వాహనాలకు ఇన్స్యూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉంచుకోండి: సీఎం జగన్ ►ఎంతోమంది ప్రయాణికులకు మీరు సేవలందిస్తున్నారు ►జగనన్న సురక్ష ద్వారా అవసరమైన సర్టిఫికేట్లు ఇంటికే అందిస్తున్నాం ►పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నాం ►అవినీతికి తావులేకుండా పథకాలను అందిస్తున్నాం ►వలంటీర్ వ్యవస్థతో పాలనను ప్రజలకు చేరువ చేశాం ►అర్‌బీకేలతో రైతులకు అండగా నిలిచాం ►పాదయాత్రలో మీ అందరి కష్టాలు చూశా ►మీ సమస్యలకు పరిష్కారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ►రైతన్నకు రూ.30,985 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా సాయం ►మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచాం ►వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్ అంటే పేదల గొంతుకై నిలబడిన ప్రభుత్వం ►చిరు వ్యాపారులకు రూ.2,956 కోట్లు సాయం అందించాం: సీఎం జగన్ ►పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మనది ►వైఎస్సార్ కాపునేస్తంతో రూ.2,029 కోట్లు సాయం అందించాం ►వైఎస్సార్ ఈబీసీ నేస్తంతో రూ.1257 సాయం అందించాం ►గత పాలకులకు మనసు లేదు ►నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికీ.. నిరుపేదలను వంచించిన గత ప్రభుత్వానికీ మధ్య యుద్ధం ►మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని అమలు చేశాం ►ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ►త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది: సీఎం జగన్ ►లంచం, వివక్ష లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశాం ►ఫైబర్ గ్రిడ్ స్కామ్, స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్, అమరావతి పేరుతో స్కాములు చేసిన గత ప్రభుత్వంతో యుద్ధం ►గతంలోనూ ఇదే బడ్జెట్, మారిందల్లా సీఎం ఒక్కడే ►గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు? ►దోచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలి ►దోచుకున్నది పంచుకునేందుకే వాళ్లకు అధికారం కావాలి ►వాళ్లకు మాదిగా నాకు గజ దొంగల ముఠా తోడుగా లేదు ►దోచుకుని పంచుకుని తినుకోవడం నా విధానం కాదు ►వైఎస్సార్ వాహన మిత్రతో మాకెంతో మేలు జరిగింది: లబ్ధిదారులు ►గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లను పట్టించుకోలేదు ►ఆటో ఇన్య్సూరెన్స్ కోసం గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం ►సీఎం జగన్ ఇచ్చిన భరోసాతో గౌరవంగా బతుకుతున్నాం ►నేను విన్నాను.. నేను ఉన్నానంటూ జగన్ ఆదుకున్నారు ►పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నారు ►వలంటీర్ వ్యవస్థతో ప్రతీ కుటుంబానికి మేలు జరిగింది ►కరోనా క్లిష్ట సమయంలోనూ వలంటీర్లు మాకు సేవలందించారు ►అభివృద్దికి సీఎం జగన్ ట్రేడ్‌మార్క్: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ►గత ప్రభుత్వం ఏ వర్గాన్నీ పట్టించుకోలేదు ►ప్రజలకు ఏం కావాలో అదే సీఎం జగన్ అమలు చేస్తున్నారు ►విజయవాడ అభివృద్ధికి సీఎం జగన్ అనేక నిధులు ఇచ్చారు ►సీఎం జగన్ ఆధ్వర్యంలోనే విజయవాడ అభివృద్ధి ►భారీగా హాజరైన వాహనమిత్ర లబ్ధిదారులు ►వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం జగన్ ►సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►విజయవాడ చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో వైఎస్సార్ వాహన మిత్ర నిధులు విడుదల చేయనున్న సీఎం ►విజయవాడ బయలేర్దిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో వైఎస్సార్ వాహన మిత్ర నిధులు విడుదల చేయనున్న సీఎం ►కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి విద్యాధరపురం స్టేడియంకు చేరుకొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై బటన్ నొక్కి వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ►సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. ►దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ►ఇప్పటివరకు నాలుగు విడతల సాయాన్ని అందించిన సీఎం వైఎస్ జగన్.. వరుసగా ఐదో విడత ఆర్థిక సాయాన్ని శుక్రవారం అందించనున్నారు. ►విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదును జమ చేయనున్నారు. 2023–24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేయనున్నారు. ►దీనితో కలిపి వైఎస్సార్ వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లు అందించినట్లు అవుతుంది. -
వైఎస్ఆర్ వాహన మిత్ర...విజయవాడలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ
-
ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఐదో విడత వాహన మిత్ర సాయం విడుదల.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నేడు ఐదో విడత వాహన మిత్ర సాయం విడుదల
సాక్షి, అమరావతి: సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు విడతల సాయాన్ని అందించిన సీఎం వైఎస్ జగన్.. వరుసగా ఐదో విడత ఆర్థిక సాయాన్ని శుక్రవారం అందించనున్నారు. విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదును జమ చేయనున్నారు. 2023–24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేయనున్నారు. దీనితో కలిపి వైఎస్సార్ వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లు అందించినట్లు అవుతుంది. సీఎం జగన్ శుక్రవారం ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి విద్యాధరపురం స్టేడియంకు చేరుకొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై బటన్ నొక్కి వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
29న సీఎం జగన్ విజయవాడ పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం జగన్ ఈ నెల 29న విజయవాడలో పర్యటించనున్నారు. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్లో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడు దల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్తారు. బహిరంగ సభలో ప్రసంగించి తాడేపల్లికి చేరుకుంటారు. చదవండి: ‘రింగ్’ అంతా లోకేశ్‌దే -
ఎండీయూ ఆపరేటర్లకూ వాహనమిత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ రేషన్ సరఫరా చేస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ) ఆపరేటర్లకు బీమా ప్రీమియాన్ని ఈ ఏడాది నుంచి వాహన మిత్ర పథకంలో భాగంగా చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తమకు వచ్చే వేతనం నుంచి ఎండీయూ వాహనాల ప్రీమియాన్ని ఏటా బ్యాంకులు జమ చేసుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎండీయూ ఆపరేటర్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకు విన్నవించారు. ఇదే విషయాన్ని మంత్రి కారుమూరి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే సీఎం సానుకూలంగా స్పందించారు. బీమా ప్రీమియం చెల్లింపును వాహనమిత్ర పథకం కిందకు చేర్చి 2021 నుంచి అమలు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది జూలైలో సొంతంగా ఆటో, ట్యాక్సీలు నిర్వహించుకునే వారికి చెల్లించే వాహనమిత్ర పథకంతో.. ఎండీయూ ఆపరేటర్లకూ ప్రీమియం మొత్తం రూ.9 కోట్లు ప్రభుత్వం నేరుగా చెల్లించనుందని మంత్రి కారుమూరి శనివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. -
YSR Vahana Mitra: థాంక్యూ జగనన్న.. మీ ఆలోచనకు మా సలాం (ఫొటోలు)
-
ఖాకీ చొక్కా ధరించి ఆటో నడిపిన సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: వాహనమిత్ర సభకు వెళ్లే ముందు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి జగన్ ఖాకీ చొక్కా ధరించి ఆటో ఎక్కి స్టీరింగ్ పట్టుకున్నారు. ఆటో డ్రైవర్లను ఆత్మీయంగా పలుకరిస్తూ యోగ క్షేమాలను విచారించారు. అనంతరం వేదిక వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ వాహనమిత్ర ఆటో, రహదారి భద్రత – జీవితానికి రక్ష, అభయం స్టాల్స్‌ను పరిశీలించారు. అక్కడకు వచ్చిన పలువురు వాహనమిత్ర లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ఫొటోలు దిగారు. చదవండి: నలుగురు ధనికులు, దత్తపుత్రుడి కోసం నడిచే సర్కారు కాదిది: సీఎం జగన్ -
వరుసగా నాల్గో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర (ఫొటోలు)
-
నలుగురు ధనికుల కోసం దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం కాదు: సీఎం జగన్
-
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
-
ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా అండగా ఉన్నాం
-
పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు : లబ్దిదారుడు హరియారామ్
-
నలుగురు ధనికులు, దత్తపుత్రుడి కోసం నడిచే సర్కారు కాదిది: సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచి చేస్తూ కులమతాలు, లంచాలు, వివక్షకు తావు లేకుండా మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కరోనా సమయంలోనూ వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని అందించామని గుర్తు చేశారు. చదవండి: గుడ్డి రాతల ఈనాడు.. పీక్స్‌కు చేరిన బరి‘తెగింపు’ ‘‘పాదయాత్ర సమయంలో డ్రైవర్ సోదరులు 2018 మే 14న ఏలూరులో నన్ను కలిసి వారి కష్టాలను చెప్పారు. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆ సమయంలో చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభించాం‘’ అని సీఎం జగన్ చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని శుక్రవారం ఉదయం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రారంభించి మాట్లాడారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 వేల చొప్పున 2,61,516 మంది ఖాతాల్లో రూ.261.51 కోట్లను బటన్‌న్‌నొక్కి జమ చేశారు. దేశంలో ఎక్కడా లేదు... వాహన మిత్ర లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని సీఎం జగన్ చెప్పారు. ‘‘సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాం. డ్రైవర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.40 వేలు ఖాతాల్లో జమ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఇదే. ఈ ఏడాదితో కలిపి మొత్తం రూ.1,026 కోట్లు వారికి అందచేశాం. వారంతా స్వయం ఉపాధి కల్పించుకుంటూ రోజూ లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. ఎవరి మీదా ఆధారపడకుండా కుటుంబాలను నెట్టుకొస్తున్న వాహనదారులకు అండగా నిలిచేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చాం. నాడు.. రూ.40 కోట్లకుపైగా ఫైన్ల బాదుడు టీడీపీ హయాంలో ఆటోడ్రైవర్లపై కాంపౌండింగ్ ఫీజు విధించి విపరీతంగా దోచుకున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ‘‘2014–2015లో రూ.6 కోట్లు, 2015–16లో రూ.7.39 కోట్లు, 2016–17లో రూ.9.68 కోట్లు, 2017–18లో రూ.10.19 కోట్లు, 2018–19లో రూ.7 కోట్లు చొప్పున ఐదేళ్లలో ఫైన్ల రూపంలో ఆటో డ్రైవర్ల నుంచి దాదాపు రూ.40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు గుంజుకున్నారు. మీ జగన్ అన్న.. తమ్ముడి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో ఆటో డ్రైవర్ల నుంచి అపరాధ రుసుము రూపంలో వసూలు చేసింది కేవలం రూ.68 లక్షలు. ఇక 2020–21లో విధించింది రూ.35 లక్షలు మాత్రమే’’ అని తెలిపారు. ఎగ్గొట్టాలని చూసే ప్రభుత్వం కాదిది.. అర్హత కలిగిన వారు ఏ కారణంతోనైనా దరఖాస్తు చేసుకోలేకపోతే తిరిగి డిసెంబర్లో మరోసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. పేదలకు ఎంత వీలైతే అంత మేర మేలు చేసే ప్రభుత్వం తమదన్నారు. ‘అర్హత ఉన్న వారికి ఏ విధంగా ఎగ్గొట్టాలని చూసే ప్రభుత్వం కాదిది... అర్హులందరికీ కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా చూడకుండా సంతృప్త స్థాయిలో పథకాలు అందించే ప్రభుత్వం మనది’ అని సీఎం జగన్ తెలిపారు. అప్పులు చేసీ ఆదుకోలేదు.. టీడీపీ హయాంలో చేసిన అప్పుల కంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. అప్పులు చేసి కూడా టీడీపీ సర్కారు ప్రజలకు మంచి చేయలేదని విమర్శించారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 దుష్టచతుష్టయంలా తయారై అసత్యాలతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపె విశ్వరూప్, గుడివాడ అమర్నాథ్, విడదల రజని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మాధవి, సత్యవతి, కలెక్టర్ మల్లికార్జున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. చదవండి: పాత ఫొటోలతో విష ప్రచారం.. చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆటో డ్రైవరన్నలు మీ పాత్ర చాలా కీలకం
-
జగనన్నరాక..ఓరేంజ్ లో డ్రైవరన్నల జోష్
-
YSR Vahana Mitra: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
-
నేడు YSR వాహనమిత్ర లబ్ధిదారులకు రూ.10వేలు చొప్పున ఆర్థికసాయం
-
వైఎస్సార్ వాహనమిత్ర: మూడేళ్ల కంటే మిన్నగా..
సాక్షి, అమరావతి: అర్హులైన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వరుసగా నాలుగో ఏడాది ‘వైఎస్సార్ వాహనమిత్ర’ భరోసా లభించనుంది. 2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 2,61,516 మంది సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది రూ.261.51 కోట్ల మేర డ్రైవర్లకు ప్రయోజనం కలగనుంది. గత మూడేళ్ల కంటే ఈ సారి ఎక్కువ మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందనుండటం విశేషం. వాహనాల మరమ్మతులు, బీమా ఖర్చులు తడిసిమోపెడవుతుండటంతో డ్రైవర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని ప్రకటించారు. 2022–23కు గాను అర్హత గల డ్రైవర్ల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. గతంలో లబ్ధిదారులుగా ఉన్నవారితోపాటు కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పరిశీలించి రవాణా శాఖకు పంపించారు. ఈ ఏడాది మొత్తం 2,61,516 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ నెల 15న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. బడుగు, బలహీన వర్గాల లబ్ధిదారులే సింహభాగం సామాజిక వర్గాల వారీగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఆర్థిక సహాయం జమ కానుంది. వైఎస్సార్ వాహనమిత్ర పథకం లబ్ధిదారుల్లో మొదటి స్థానంలో బీసీలు ఉండగా.. రెండో స్థానంలో ఎస్సీలు ఉన్నారు. 2022–23కు గాను మొత్తం లబ్ధిదారులు 2,61,516 మంది ఎంపిక కాగా.. వారిలో బీసీ లబ్ధిదారులు 1,44,164 మంది (55 శాతం) ఉన్నారు. తరువాత స్థానంలో ఎస్సీలు 63,594 మంది, ఎస్టీలు 10,472 మంది ఉన్నారు. నాలుగేళ్లలో రూ.1,025.96కోట్లు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు మూడుసార్లు (2019–20, 2020–21, 2021–22) వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం చేశారు. 2022–23కు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు లబ్ధిదారులను గుర్తించారు. మొత్తంగా ఈ నాలుగేళ్లలో ఏకంగా 10.25 లక్షల మంది డ్రైవర్లకు రూ.1,025.96 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించినట్టు అవుతుంది. లబ్ధిదారుల సంఖ్య ఏటా పెరుగుతున్నా సరే ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ పథకాన్ని అందిస్తోంది. కరోనా పరిస్థితులతో రెండేళ్లు ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా పేదలైన డ్రైవర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించింది. -
విశాఖకు సీఎం జగన్.. టూర్ షెడ్యూల్ ఇదే..
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి విచ్చేస్తారు. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు వెళ్తారు. 11.05 నుంచి 11.15 గంటల వరకు స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం వైఎస్సార్ వాహన మిత్ర ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. తరువాత వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫొటో సెషన్ జరుగుతుంది. చదవండి: ఎన్నికలకు రెండేళ్ల ముందే.. టీడీపీలో టిక్కెట్ల లొల్లి! 11.40 గంటల నుంచి 11.45 గంటల వరకు లబ్ధిదారుల ప్రసంగాలు ఉంటాయి.11.45 నుంచి 11.47 గంటల వరకు వాహన మిత్ర అంశంపై వీడియో ప్రదర్శన ఉంటుంది. 11.47 నుంచి 12.17 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. 12.20 నుంచి వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. 12.30 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరుతారు. 12.55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ అవుతారు. 1.20 గంటలకు గన్నవరం బయలుదేరుతారు. -
వైఎస్సార్ వాహన మిత్ర.. కొత్తవారికీ అవకాశం
సాక్షి, అమరావతి : ‘వైఎస్సార్ వాహనమిత్ర పథకం–2022–23’ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 13న ఆర్థిక సహాయం అందించనుంది. దీనికింద అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా.. ఈ ఏడాదికిగాను అర్హుల నుంచి రవాణా శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 7లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ పి.రాజాబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నవారితోపాటు కొత్తగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కొనుగోలు చేసిన డ్రైవర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఇలా.. ► ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధిదారులుగా ఉన్నవారు తమ వాహనం వద్ద ఫొటోను గ్రామ, వార్డు సచివాలయంలో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ► కొత్తగా వాహనం కొనుగోలు చేసిన డ్రైవర్లు తమ ఆధార్‌కార్డు, తెల్ల రేషన్ కార్డు, భూమి వివరాలు, ఆదాయ పన్ను, ఇంటి విద్యుత్ వినియోగం, కులం, ఇతర వివరాలకు సంబంధించిన అర్హత పత్రాలతో దరఖాస్తు చేయాలి. ► గత ఆరు నెలల్లో సగటున నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించిన వారు ఈ పథకానికి అనర్హులు. ఒకవేళ ఒకటికంటే ఎక్కువ ఇళ్లకు కలిపి ఒకే మీటరుంటే ఇళ్ల సంఖ్యను బట్టి ఒక ఇంటికి సగటు విద్యుత్ వినియోగాన్ని లెక్కిస్తారు. ► వచ్చిన దరఖాస్తులను ఆరు అంచెల్లో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ► అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఎంపీడీవో/మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ నెల 9లోగా ఆమోదిస్తారు. ► 10న ఆ దరఖాస్తులను కలెక్టర్లు ఆమోదించిన తరువాత 11, 12 తేదీల్లో సీఎఫ్ఎస్ఎస్ ద్వారా సంబంధిత కార్పొరేషన్లకు పంపిస్తారు. ► ఇక అర్హులైనప్పటికీ జాబితాలో పేరు లేకపోతే ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ► వారి ఫిర్యాదులను పరిశీలించి అర్హులుగా నిర్ధారణ అయితే వారికి కూడా వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు. (క్లిక్: అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం) -
Fact Check: 'ఆ పథకాల రద్దు అవాస్తవం.. ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదు'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో 2022 జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర అనే రెండు సంక్షేమ పథకాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేయడం జరిగిందనే ప్రచారం వాస్తవంకాదని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ మరియు ఎక్స్ అఫిషియో సెక్రెటరీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు. చదవండి: ‘ఏసీబీ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్.. యాప్ ఎలా పనిచేస్తుందంటే? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అసలు మనుగడలోనే లేని సమాచార, సాంకేతిక, ప్రసారాల శాఖ అనే తప్పుడు పేరుతో ఇలాంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం. దీని వెనుక ఎంతటివారున్నప్పటికి ఉపేక్షించేది లేదని, ఇటువంటి ఫేక్ వార్తలను, పుకార్లను పుట్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి మరీ ఏ నెలకు ఆ నెల సంక్షేమ పథకాల లబ్ధిని డైరెక్ట్‌గా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని, అవాస్తవాలను ప్రజలెవరూ నమ్మొద్దని విజ్జప్తి చేశారు. కరోనా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సంక్షేమ పథకాల అమలు జరిగిందని, ప్రజలకు లబ్ధి చేకూర్చే ఏ సంక్షేమ పథకం ఆగదని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరపున ఓ ప్రకటనలో తెలిపారు. -
సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం.. సీఐడీ కేసు నమోదు
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ వాహన మిత్ర పథకాలను ఈ ఏడాది నిలిపివేస్తున్నట్టు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఫేక్ పోస్టులతో దుష్ప్రచారం చేసిన వారిలో ఇప్పటివరకు ఐదుగురిని గుర్తించి నోటీసులు జారీ చేశారు. కాగా వారిలో ముగ్గురిని సీఐడీ అధికారులు మంగళవారం విచారించారు. భారత జాతీయ చిహ్నం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నాలను ముద్రించి మరీ ప్రభుత్వ అధికారిక ప్రకటన విడుదల చేసినట్టుగా ఫేక్ పోస్టులు సృష్టించినట్టు సీఐడీ దృష్టికి వచ్చింది. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ వాహన మిత్ర పథకాల లబ్ధిదారులను గందరగోళానికి గురిచేసి, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకే ఈ పోస్టులు సృష్టించినట్లు విచారణలో వెల్లడైంది. దాంతో మంగళగిరిలోని సీఐడీ విభాగంలోని సైబర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారత జాతీయ చిహ్నం, రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాల దుర్వినియోగ నివారణ చట్టం, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆ ఫేక్ పోస్టులను వైరల్ చేసిన 12 సోషల్ మీడియా ఖాతాలను ఇప్పటివరకు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఐదుగురికి 41ఏ నోటీసులు జారీ చేశారు. వారిలో ముగ్గురు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పరుచూరి రమ్య, బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన కోగంటి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా బుర్రిపాలేనికి చెందిన దాసరి కోటేశ్వరరావులను మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విచారించారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. మళ్లీ విచారణకు పిలిస్తే రావల్సి ఉంటుందని చెప్పారు. నోటీసులు జారీ చేసినవారిలో మరో ఇద్దరు విచారణకు హాజరుకావల్సి ఉంది. కాగా మరికొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నట్టు దుష్ప్రచారం చేసిన మరికొందరిపై కూడా సీఐడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలిసింది. -
వాహనమిత్రకు దేవదాయ నిధులు వాడటం లేదు..
సాక్షి, అమరావతి: వైఎస్సార్ వాహనమిత్ర పథకం కోసం దేవదాయ నిధులను ఉపయోగించడంలేదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌కు చేసిన కేటా యింపుల నుంచి బ్రాహ్మణ వాహన మిత్రలకే నిధులు వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. బడ్జెట్లో చేసిన కేటాయింపుల నుంచి రూ.49 లక్షలను వైఎస్సార్ వాహనమిత్ర కోసం విడుదల చేసేందుకు దేవదా య శాఖ స్పెషల్ కమిషనర్ పరిపాలన అనుమతి నిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిల్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. రూ.49 లక్షలను వైఎస్సార్ వాహనమిత్ర కోసం విడుదల చేసేందుకు దేవ ప్రభుత్వం ఈ నెల 15న జారీచేసిన జీఓ 334ను సవాలు చేస్తూ తిరుపతికి చెందిన జి.భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. -
బతుకుబండి పరిగెడుతోంది!
-
అన్నను మించిన అండ
సాక్షి, అమరావతి: ‘జగనన్నా.. నాకు సొంత అన్న ఉంటే కూడా ఇంత సాయం చేసి ఉండరు. నాకు అన్న లేరని బాధ పడుతుంటే మీరు వచ్చి ఎంతో సాయం చేసి, ఆ లోటు తీర్చారు. దేవుడు ఎలా ఉంటారో తెలీదు కానీ మీరు మాకు ప్రత్యక్ష దైవం అన్నా..’ అని విశాఖ గాజువాకకు చెందిన మహిళా ఆటో డ్రైవర్ పైడిమాత భావోద్వేగంతో పేర్కొన్నారు. మా వెనుక జగనన్న ఉన్నారనే ధీమాతో బతుకుతున్నామని వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన ఆటో డ్రైవర్ నాగూరు నాగయ్య, ఒక లీడర్ ఎలా ఉండాలో మీరు నిరూపించారని గుంటూరుకు చెందిన మరో ఆటోడ్రైవర్ మేడా మురళి శ్రీనివాసరావు ప్రశంసించారు. తమ గురించి ఇదివరకెన్నడూ ఎవరూ ఇంతగా ఆలోచించలేదని కొనియాడారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద మంగళవారం వారు రూ.10 వేలు సాయం అందుకుంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం వరుసగా మూడో ఏడాది, కరోనా కష్టకాలంలో కూడా ఈ పథకం కింద.. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి రూ.10 వేల చొప్పున 2.48 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.248.47 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్లతో పాటు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలను కండిషన్లో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవ్వరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని కోరారు. మీ కుటుంబాలు బాగుండాలని, మీ వాహనాల్లో ప్రయాణించే వారు కూడా బాగుండాలని.. మనందరి రాష్ట్రం బాగుండాలని మనసారా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు పన్నులు, చలానా రూపంలో భారీగా వడ్డించే వారని.. మన ప్రభుత్వం వచ్చాక పన్నులు, అపరాధ రుసుములు గణనీయంగా తగ్గాయని స్పష్టం చేశారు. రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా 95 శాతం హామీలను అమలు చేశామని చెబితే, 95 అన్యాయాలంటూ అవాస్తవాలతో టీడీపీ పుస్తకం ప్రచురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రభుత్వంలో ఆటోలపై బాదుడు తగ్గిస్తే.. పెంచామని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. పండ్లు ఉన్న చెట్టుపైనే రాళ్లు పడతాయన్నట్లు.. మంచి చేసేవారి మీదే విమర్శలు అడ్డగోలుగా వస్తాయని పేర్కొన్నారు. మన ప్రభుత్వం మానవత్వంతో ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, అన్నకు, తమ్ముడికి తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తుంటే.. తెలుగుదేశం పార్టీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి.. – వరుసగా మూడో సంవత్సరం ప్రతి ఆటో డ్రైవర్‌కు మంచి చేసే కార్యక్రమమిది. సొంత వాహనం కలిగి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లగా ప్రతిరోజూ సేవలందిస్తూ, రోజూ లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. అలాంటి అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలందరికీ నా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో ఏలూరు సభలో 2018 మే 14న ఒక మాటిచ్చాను. ఆరోజు వాళ్లు నా దగ్గరకు వచ్చి ప్రభుత్వంలో బాదుడు ఎక్కువ అయింది, ఫెనాల్టీలు ఎక్కువ ఉన్నాయని మొర పెట్టుకున్నారు. – ఫెనాల్టీలు కట్టకపోతే ఆటో తిరగదని, రోజుకు రూ.50 ఫెనాల్టీ వేస్తున్నారని ఆవేదన చెందారు. ఇన్సూరెన్స్ కట్టాలంటే దాదాపు రూ.7,500 అవుతుందని చెప్పారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలంటే రిపేర్లు చేయించాలని, అన్నీ కలిపి దాదాపు రూ.10 వేలు ఖర్చవుతుందన్నారు. ఒకేసారి అంత కట్టాలంటే అప్పులు తీసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని చెప్పారు. వారి బాధలు విన్న తర్వాత ఆ మేరకు సాయం చేస్తానని ఆ రోజు ఏలూరు సభలో మాటిచ్చాను. – ఆ మాట నిలుపుకుంటూ ఈ రోజు మూడో ఏడాది కింద 2,48,468 మంది నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు రూ.248.47 కోట్లు సహాయంగా వాళ్ల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. మొత్తంగా ఈ మూడేళ్లలో ఒక్క ఈ పథకం ద్వారా రూ.759 కోట్లు సాయం చేశాం. ఈ లెక్కన ఒక్కొక్కరికి రూ.30 వేల సహాయం అందినట్టవుతుంది. ఈ సంవత్సరం కొత్తగా మరో 42,932 లబ్ధిదారులకు సాయం చేశాం. నాడు పన్నుల బాదుడు.. నేడు ఊరట – గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు చలాన్ల రూపంలో భారీగా వడ్డింపులు ఉండేవి. గత ప్రభుత్వంలో 2015–16లో ఆటో నడుపుకుంటున్న డ్రైవర్ల నుంచి వసూలు చేసింది రూ.7.39 కోట్లు. 2016 –17లో రూ.9.68 కోట్లు. 2017–18లో రూ.10.19 కోట్లు. అలాగే 2018–19లో రూ.7.09 కోట్లు. – మన ప్రభుత్వంలో 2019–20లో వసూలు చేసింది రూ.68.44 లక్షలు మాత్రమే. ఇది కూడా కేవలం కాంపౌండింగ్ ఫీజు (సీఎఫ్)గా వసూలు చేశారు. 2020–21లో రూ.35 లక్షలు మాత్రమే. అంటే దీని అర్థం ఏమిటో ఆటోలు నడుపుకుంటున్న అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు బాగా తెలుసు. అన్ని అనుమతులు ఉంటే చలాన్లు కట్టే పరిస్థితి ఉండదు. ఇది మీ అన్న ప్రభుత్వం – ఈ రోజు 2.48 లక్షల మందికి అందిస్తున్న సహాయంలో ఎక్కడా, ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేదు. పారదర్శకంగా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో ప్రదర్శించాం. ఇది మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం అని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ఈ పథకం రాకుండా పోతే ఎలా ఇవ్వాలి.. అని ఆలోచన చేసే ప్రభుత్వం. ఎలా ఎగరగొట్టాలని అని ఆలోచన చేసే ప్రభుత్వం కాదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సహాయం చేశాం. – ఇప్పటికీ కూడా ఎవరైనా పొరపాటున మిగిలిపోయుంటే ఏమాత్రం ఆందోళన చెందవద్దు. ఇంకో నెలపాటు గడువు ఇస్తున్నాను. మీరు అర్హులై ఉంటే గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేయండి. వలంటీర్ల సహాయ, సహకారాలు తీసుకోండి. మీకు సహాయం అందేటట్టు చేస్తాను. – ఇంకా ఏమైనా సందేహాలుంటే 9154294326 నంబరుకో లేదా 1902 నంబరుకో కాల్ చేయండి. ఈ కార్యక్రమం బాగా జరిపించేందుకు ట్రాన్స్‌ఫోర్ట్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాం. వీరు మీకు తోడుగా ఉంటారు. – ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్) కె నారాయణస్వామి, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రవాణా శాఖ కమిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఇతర ఉన్నతాధికారులు, వాహనమిత్ర లబ్ధిదారులు హాజరయ్యారు. మహిళా డ్రైవర్ల సంఖ్య పెరగడం శుభపరిణామం ఓ వైపు కరోనా కష్టాలతో ఇక్కట్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10 సాయం చేస్తోంది. ఆటోల గిరాకీ తగ్గిన సమయంలో ఈ సాయం వారికి బాగా ఉపకరించింది. అత్యంత పారదర్శకంగా ఇవాళ 2,48,468 మందికి సాయం చేస్తోంది. వీరిలో 2,17,086 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన ఆటో ఓనర్ కం డ్రైవర్లు ఉన్నారు. మరో 26,397 మంది కాపు వర్గం వారు ఉన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనకు అగుణంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ వృత్తిలోకి రావడం శుభ పరిణామం. మహిళా డ్రైవర్లు తప్పులు చేయడం లేదని బ్రేక్ ఇన్స్పెక్టర్లు చెబుతున్నారు. అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి చేస్తుంటే టీడీపీ బురద చల్లుతోంది. – పేర్ని నాని, రవాణా, సమాచార శాఖ మంత్రి ఇలాంటి పథకం ఎక్కడా లేదు నవరత్నాలులో భాగం కానప్పటికీ మా శాఖకు 2019లో తొలి సంక్షేమ పథకానికి అవకాశం ఇచ్చారు. ఒక్కో ఆటో, టాక్సీ, మ్యాక్సీ కేబ్ ఓనర్ కం డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు సాయం చేస్తున్నారు. ఇవాళ మూడో సంవత్సరం సాయం అందిస్తుండటం సంతోషకరం. వలంటీర్లు ప్రతి లబ్ధిదారుడి దగ్గరకు వెళ్లి వాహనంతో పాటు ఫొటో తీసి, పారదర్శకంగా అర్హతను తనిఖీ చేసి ఆన్లైన్లో ఉన్న డేటాబేస్ క్రాస్ చెక్ చేసుకుంటూ అప్లోడ్ చేశారు. దేశం మొత్తం మీద చూస్తే ఇలాంటి పథకం ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో కరోనా వల్ల ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా ఆర్థిక సాయం చేస్తున్నారు. – ఎంటీ కృష్ణబాబు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఆడపిల్లగా ఏపీలోనే పుట్టాలన్నా అన్నా.. మీరు ఇచ్చే రూ.10 వేలు మాకు చాలా పెద్ద విషయం. మా ఆటోవాళ్ల కుటుంబాలకు ఇబ్బంది లేకుండా మీరు సాయం చేస్తున్నారు. మీ పథకాల వల్ల మేము ఎంతో లబ్ధి పొందుతున్నాం. ప్రత్యేకించి మహిళల కోసం మీరు తీసుకుంటున్న చర్యల పట్ల ఆనందంగా ఉంది. దిశ పోలీస్ స్టేషన్లు, అభయ యాప్ ద్వారా మాకు భద్రత ఉంటోంది. పుడితే ఏపీలో ఆడపిల్లగానే పుట్టాలి అన్నంతగా మీరు శ్రద్ధ తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు. – పైడిమాత, మహిళా ఆటోడ్రైవర్, విశాఖ -
YSR Vahana Mitra: ‘మురళి గారు ఇంటర్ డిస్కంటిన్యూ అన్నారు.. కానీ’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ వాహన మిత్ర డబ్బు జమ చేస్తున్న సందర్భంగా మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, గుంటూరుకు చెందిన ఆటోడ్రైవర్ మేడా మురళి శ్రీనివాస్ మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా మూడో ఏడాది, 2.48 లక్షల మంది లబ్దిదారులకు నేరుగా రూ. 248.47 కోట్లు జమ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో.. మేడా మురళి ఆంగ్ల పదాలు ఉపయోగిస్తూ తన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో ఒకింత ఆశ్చర్యానికి గురైన మంత్రి పేర్ని నాని.. ‘‘మురళి గారూ.. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అన్నా ఇంగ్లిష్ ఇంత బాగా మాట్లాడుతున్నారు. మాకెందుకో అనుమానంగా ఉంది. పీహెచ్డీ చేశారేమో అనిపిస్తోంది’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఇందుకు బదులుగా మరోసారి వెరిఫికేషన్ చేయించినా ఫర్వాలేదు సార్ అంటూ మురళి బదులిచ్చారు. ఇక ఇందుకు స్పందించిన మంత్రి... ‘‘నీలాంటి విజ్ఞత ఉన్నవాళ్లు ముఖ్యమంత్రి గురించి బాగా చెప్పటం బాగుంది’’ అని ప్రశంసించారు. ఈ క్రమంలో.. తాను స్కూల్ పిల్లలను ఆటోలో తీసుకువెళ్తానని, వారు మాట్లాడే ఇంగ్లిష్ విని, తనకూ మాట్లాడటం అలవాటైందన్న మురళి, ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనకై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నాయని, సామాన్యుల పిల్లలకు మెరుగైన సదుపాయాలు అందిస్తున్నందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అని కృతజ్ఞతా భావం చాటుకున్నారు. మా జగనన్న కూడా మా ఖాకీ చొక్కా తొడుకున్నారు.. మేడా మురళి శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘‘అన్నా నేను గత 17 ఏళ్ళుగా ఆటో నడుపుతున్నాను, ప్రతీ ఏడాది కూడా ఫిట్నెస్ మంత్ వస్తుందంటే తెలియని భాద, భయం ఉండేది, నెలవారీ ఖర్చులు, మెయిన్టెనెన్స్ ఇవి కాకుండా ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉండేవి. గత ప్రభుత్వంలో రోజుకు రూ. 50 ఫైన్ పెట్టి మా పీక మీద కత్తి పెట్టే పరిస్ధితి ఉండేది. మీరు పాదయాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను అన్నట్లుగా ఆటోడ్రైవర్లకు రూ. 10 వేలు ఇస్తున్నారు. మేం ఇంత ధైర్యంగా ఉన్నామంటే మీరే కారణం. మాకు ఫైన్లు వేసే ప్రభుత్వాలను చూశాం కానీ మాకంటూ ఒక పధకం పెట్టిన మొదటి సీఎం మీరే. మీరు దేశ రాజకీయ నాయకులకు ఒక రోల్‌మోడల్, ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి ఉండాలి అనే దానికి మీరే ఉదాహరణ. కరోనా కారణంగా కుటుంబం గడవని పరిస్ధితుల్లో మీరు ముందుగానే ఇస్తున్నారు. ఏ సంక్షేమ పధకం ఆగకూడదని మీరు మూడో విడత ఇంత కష్టకాలంలో ఇస్తున్నారు. మీకు మేమంతా రుణపడి ఉంటాం. నా కుటుంబంలో అమ్మ ఒడి వచ్చింది, మా అమ్మకు కాపునేస్తం వచ్చింది. మా నాన్నకి వృద్దాప్య ఫించన్ వచ్చింది, తెల్లవారకముందే పెన్షన్ ఇస్తున్నారు. మీ ఆలోచనకు హ్యట్సాఫ్. నేను నా కుటుంబం కోసం ఆటోడ్రైవర్ అయ్యాను, కానీ రాష్ట్రాన్ని అభివృద్ది, సంక్షేమ బాటలో నడిపే డ్రైవర్ మీరు అయ్యారు. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కానీ ఇప్పుడు చూస్తుంటే ఇద్దరూ ఆడపిల్లలు అయి ఉంటే బావుండు అనిపించింది. మహిళా బిల్లు కోసం పార్లమెంట్లో గొడవలు చూశాం కానీ మీరు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం చూస్తుంటే నా పిల్లులు ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చేవి, మగపిల్లాడిని ఎలా సెటిల్ చేయాలా అన్న ఆలోచన పట్టుకుంది. మహిళా అభ్యుదయం కోసం మీరు చేస్తున్న కృషి మరువలేం. రాష్ట్ర హోంమంత్రిగా ఒక మహిళ ఉండటం గర్వకారణం. మేం సామాన్యుడిగా ఒకటే కోరుకుంటున్నాం. మాకు మేడలు, మిద్దెలు వద్దు. మేం పస్తులు లేకుండా కడుపు నింపుకోవడానికి పని ఉండాలి. మా పిల్లలకు మంచి భవిష్యత్ కోసం మంచి చదువు, ఏదైనా అనారోగ్యం వస్తే మంచి వైద్యం ఉండాలి. ఇవి మీరు చేస్తున్నారు. బ్లాక్‌ఫంగస్ లాంటి దాన్ని కూడా నాలుగు రోజులకే మీరు ఆరోగ్యశ్రీలో యాడ్ చేశారు, మేం ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే మీరే కారణం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఆటోడ్రైవర్‌తో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకోవడం మాకు గర్వంగా ఉంది. ఇది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమని మేం నమ్ముతున్నాం. మేం ధైర్యంగా చెబుతున్నాం. మా జగనన్న కూడా మా ఖాకీ చొక్కా తొడుకున్నారు. మేమంటే అంత ప్రేమ, గౌరవం మీకు ఉన్నాయి. మీ వల్లే మేం సంతోషంగా జీవించగలుగుతున్నామని’’ అంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల తమకు జరుగుతున్న మేలు గురించి వివరించారు. చదవండి: ‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’ -
మంత్రి పేర్ని నాని, ఆటోడ్రైవర్ మురళి మధ్య ఆసక్తికర సంభాషణ
-
‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’
సాక్షి, అమరావతి: మూడో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు 2.48 లక్షల మంది లబ్దిదారులకు నేరుగా రూ. 248.47 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్‌తో లబ్ధిదారులు తమ స్పందన తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పాలన, పథకాల గురించి మనస్పూర్తిగా మాట్లాడారు. ముఖ్యమంత్రికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఒక అన్న ఉంటే కూడా ఇంత చేయరు.. ఈ సందర్భంగా విశాఖనగరం గాజువాకకు చెందిన మహిళా ఆటోడ్రైవర్ పైడిమాత మాట్లాడుతూ ‘‘జగనన్నా.. నేను విశాఖ గాజువాకలో గత ఐదేళ్లుగా ఆటో నడిపించుకుంటూ బతుకుతున్నాను, రోజంతా నడిపితే మాకు వచ్చేది రెండు మూడు వందలు, దాంతో మా బతుకులు కష్టంగా ఉన్నాయి. మీరు పాదయాత్రలో చెప్పినట్లు ప్రతీ ఆటో కార్మికుడికి రూ. పది వేలు ఆర్ధిక సాయం చేశారు, మా ఆటో కార్మికుల అందరి తరపున మీకు ధన్యవాదాలు అన్నా. మేం ఏడాది పొడవునా ఎంత సంపాదించినా ఆటో మరమ్మత్తులు, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇలా ఖర్చులు ఉంటాయి. మీరు ఇచ్చే ఈ పదివేలు మాకు చాలా పెద్ద విషయం. మాకు నిరుడు కూడా వచ్చాయి. దేవుడు ఎలా ఉంటారో తెలీదు కానీ మీరు ప్రత్యక్ష దైవం అన్నా.. మా ఆటోవాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది లేకుండా మీరు ముందుగానే సాయం చేస్తున్నారు. మేం ఇల్లూ, వాకిలి లేక అద్దె ఇంట్లో ఉన్న సమయంలో ఇళ్ళ పట్టా ఇచ్చారు. మా పిల్లలకు అమ్మ ఒడి వచ్చింది. పిల్లలకు అన్నీ ఇస్తున్నారు. మా అత్తగారు పెన్షన్ తీసుకుంటున్నారు. అమ్మకి కొడుకు ఉంటే ఇంత సాయం చేస్తారో లేదో కానీ మా అమ్మ కళ్ళలో ఆనందం చూశాం. చేయూత పథకం కింద రూ. 18, 750 మొదటి సారి తీసుకున్నారు. రేషన్ కోసం ఇబ్బంది పడుతుంటే ఇంటికే వచ్చి ఇస్తున్నారు. దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మా మహిళలకు రక్షణ నిచ్చారు. అభయ యాప్ ద్వారా ప్రతీ ప్రయాణికుడు గమ్యాన్ని సురక్షితంగా చేరుకుంటున్నారు. నాకు ఒక అన్న ఉంటే కూడా ఇంత చేయరు, నాకు అన్న లేరని బాధపడుతుంటే మీరు వచ్చి నాకు ఎంతో సాయం చేశారు, ఇది చాలన్నా, నేనే కాదు నాలా ప్రతీ ఆడవారు కూడా మీకు రుణపడి ఉంటారు. పుడితే ఆడపిల్లగానే పుట్టాలి, ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న నాయకత్వంలో పెరగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ముగించగా.. స్పందించిన సీఎం వైఎస్ జగన్ ధ్యాంక్యూ అమ్మా, మీ మాటలు మరింత స్పూర్తినిస్తున్నాయి. దేవుని దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ తల్లి’’ అన్నారు. ఇంటి పెద్ద కొడుకుగా సాయం చేస్తున్నారు.. వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన ఆటోడ్రైవర్ నాగూరు నాగయ్య మాట్లాడుతూ, ‘‘అన్నా నేను వైఎస్సార్ వాహన మిత్ర లబ్దిదారుడిగా ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. నాడు పాదయాత్రలో మీరు మాట ఇచ్చారు, మా కష్టాలు మీకు చెప్పగానే వెంటనే పెద్ద మనసుతో హమీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే వెంటనే ఇచ్చారు. కరోనా టైంలో కూడా నిరుడు రెండో విడత ఇచ్చారు. ఇప్పుడు కూడా మూడో విడత సాయం చేస్తున్నారు. నా జీవితంలో నేను రూ. 30 వేల సంపాదన చూడలేదు. నా జీవితంలో మర్చిపోలేను, ఆదాయం చాలక అప్పులు చేసే వాళ్ళం కానీ మీరు ఇచ్చే డబ్బుతో అప్పులు చేయాల్సిన అవసరం లేదు. మేం సంతోషంగా మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు అమ్మ ఒడి వచ్చింది. అలాగే మా అమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద సాయం అందింది. మీరు ఇంటి పెద్ద కొడుకుగా సాయం చేస్తున్నారు. నాన్న వైఎస్సార్ హయాంలో రిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఇందిరానగర్‌లో మా అమ్మకు ప్లాట్ మంజూరు అయింది, అప్పుడు రూ. 60 వేల ఆర్ధిక సాయం చేశారు. ఆ డబ్బుతో ఇల్లు కట్టుకుని అదే ఇంట్లో కాపురం ఉంటున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబంలో అనేక సంక్షేమ పథకాలు పొందుతున్నాం, ఏపీలో ఆటో కార్మికులకు గతంలో విలువ లేదు కానీ మీరు సీఎం అయిన తర్వాత మా వెనక జగనన్న ఉన్నారు అనే మంచి మాట వినిపిస్తుంది. గతంలో ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చాం అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆటో ఫీల్డ్‌లోకి రమ్మని మేమే చెబుతున్నాం. మా కుటుంబం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది అన్నా’’ అని అన్నారు. చదవండి: వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర థర్డ్‌వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక -
వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర
సాక్షి, అమరావతి: మూడో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు 2.48 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా రూ.248.47 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఇచ్చిన మాటకు కట్టుబడి.. ఈ రోజు మరో మంచి కార్యక్రమం చేస్తున్నాం. వరుసగా మూడో సంవత్సరం ప్రతి ఆటో డ్రైవర్‌కు మంచి చేసే కార్యక్రమమిది. సొంత వాహనం కలిగి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లగా ప్రతిరోజూ సేవలందిస్తూ, రోజూ లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్ధానాలకు చేరుస్తున్నారు. అలాంటి అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలందరికీ కూడా 3,648 కిలోమీటర్ల సాగిన నా పాదయాత్ర సమయంలో ఏలూరు సభలో మే 14, 2018న ఒక మాటిచ్చాను. ఆ రోజు వాళ్లు నా దగ్గరకు వచ్చి ప్రభుత్వంలో బాదుడు ఎక్కువ అయింది, ఫెనాల్టీలు ఎక్కువ ఉన్నాయని మొరపెట్టుకున్నారు. ఫెనాల్టీలు కట్టకపోతే ఆటో తిరగదని, రోజుకు రూ.50 ఫెనాల్టీ వేస్తున్నారని ఆవేదన చెందారు. ఇన్సూరెన్స్ కట్టాలంటే దాదాపు రూ.7500 అవుతుందని చెప్పారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ రావాలి, అది కావాలంటే రిఫేర్లు చేయించాలి. అన్నీ కలిపి దాదాపు రూ.10 వేలు ఖర్చవుతుందని, ఒకేసారి కట్టాలంటే అప్పులు తీసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని చెప్పారు. వారి బాధలు విన్న తర్వాత ఆ రోజు ఏలూరు సభలో మాటిచ్చాను. వరుసగా మూడో ఏడాది.. వరుసగా మూడో ఏడాది ఈ రోజు వారికిచ్చిన మాటని నిలబెట్టుకుంటూ వైయస్సార్ వాహనమిత్ర సహాయాన్ని నేరుగా బటన్ నొక్కి వాళ్ల అకౌంట్లోకి డబ్బుల ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మూడో విడతతో కలిపితే రూ.759 కోట్లు సాయం ఈ ఏడాది 2,48,468 మంది నా అక్కచెల్లమ్మలకు, అన్నదమ్ములకు రూ.248.47 కోట్లు సహాయంగా వాళ్ల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. దీంతో ఇప్పటి వరకు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ ఒక్క వాహనమిత్ర పథకం ద్వారా మాత్రమే అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ .. ఈ మూడో విడత కార్యక్రమం కూడా కలుపుకుంటే అక్షరాలా రూ.759 కోట్ల రూపాయలు వాళ్ల అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది. ఇందులో చాలా మందికి ఒక్కొక్కరికీ ఇప్పటికే రూ.30 వేల రూపాయలు సహాయం అందినట్టవుతుంది. ఈ ఏడు కొత్తగా మరో 42,932 లబ్ధిదారులు వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద గత సంవత్సరం లబ్ధిపొందిన అర్హులందరితో పాటు గత ఏడాది కాలంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లు కొనుగోలు చేసిన లేదా యాజమాన్య హక్కులు బదలాయింపు పొందిన మరో 42,932 మంది అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు కూడా వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రూ.10వేలు వాళ్ల అకౌంట్లలో కూడా జమ చేయడం జరుగుతుంది. 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే... ఈ రోజు వాహనమిత్ర అందుకుంటున్న వారికి ఈ పథకం ఎంత మంచి చేస్తుందంటే.. ఇందులో అంటే ఈ 2,48,468 మందిలో దాదాపు 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు సంబంధించిన వారే ఉన్నారు. నిజంగా బ్రతుకులు మన కళ్ల ఎదుటనే మార్చే అవకాశం దేవుడు ఇచ్చినందుకు నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలతో ఈ సంతోషాన్ని పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కూడా ఇలా ఆటోలు, టాక్సీలు నడిపే అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు గురించి ఆలోచన చేసి వీళ్లకి మంచి చేయాలని ఆలోచన చేసిన ప్రభుత్వాలు ఈ దేశంలో ఎక్కడా లేవు. ఒక్క మన రాష్ట్రంలోనే ఇది జరుగుతుందని చెప్పి సగర్వంగా ప్రతి అన్నకు తమ్ముడిగా, ప్రతి తమ్ముడికి అన్నగా ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లికి అన్నగా గర్వంగా తెలియజేస్తున్నాను. ప్రయాణికుల భద్రతకూ భరోసా ఈ రోజు మనం ఈ కార్యక్రమం ద్వారా రూ. 10 వేల రూపాయలు ఆటో అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల చేతిలో పెడతున్నామో ఇది వాళ్లకు మాత్రమే మేలు చేస్తున్నాము అని అనుకోకూడదు. ఈ కార్యక్రమం ద్వారా వాహనంలో ప్రయాణించే వారి భద్రతకు కూడా ఈ సొమ్ము భరోసాగా ఉంటుంది. ఎందుకంటే ఈ వాహనాలకు వాహన బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్‌తో పాటు రిపేర్లు తదితర అవసరాల కోసం ఈ డబ్బులు ఇస్తున్నాం. దీనివల్ల ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. బళ్లు రిపేరు చేయించుకుంటారు, ఫిటినెస్ సర్టిఫికేట్ కూడా పొందుతారు. ఇవన్నీ కూడా అందుబాటులో వస్తే ఆటోలు నడిపే అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకే కాకుండా ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ఎంతో మంచి జరుగుతుంది. చలాన్లు కట్టే పరిస్థితి రాకూడదనే... ఇలా అన్ని అనుమతులు ఉండేలా, చలాన్లు కట్టే పరిస్థితి రాకుండా ఉండాలని వీరికి ఈ సొమ్ముని అందిస్తున్నాం. నిజంగా ఈ డబ్బులు ఒకేసారి కట్టుకోలేని పరిస్థితులు. ఒకేసారి ఇన్సూరెన్స్‌కు రూ.7వేలు చిల్లర, రిపేర్లకు ఇంతని, ఫిట్నెస్ సర్టిఫికేట్‌కి ఇంత ఆవుతుందని చెప్పి రకరకాలుగా బాధపడుతున్నారు. ఆ పదివేలు ఒకేసారి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలందరికీ కూడా ఈ సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతుంది. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పళ్లున్న చెట్టుమీదనే రాళ్లు పడతాయి అని ఒక సామెత ఉంది. అలానే మంచి చేసే మనుషుల మీదనే అడ్డగోలుగా విమర్శలు చేసే పరిస్థితి కూడా మన రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ ఈ విషయాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వంలో పన్నుల బాదుడు గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు పన్నుల రూపంలో ఛలాన్ల రూపంలో భారీగా వడ్డింపులు ఉండేవి. గత ప్రభుత్వంలో 2015–16లో ఆటో రిక్షా నడుపుకుంటున్న డ్రైవర్ల నుంచి వసూలు చేసింది రూ.7.39 కోట్లు. 2016,17లో రూ.9.68 కోట్లు. 2017–18లో రూ.10.19 కోట్లు, అలాగే 2018–19లో రూ.7.09 కోట్లు. మన ప్రభుత్వం హయాంలో అదే మన ప్రభుత్వంలో 2019–20లో వసూలు చేసింది రూ.68.44 లక్షలు. ఈ 68 లక్షలు కూడా కేవలం కాంపౌండింగ్ ఫీజు(సీఎఫ్)గా వసూలు చేసింది మాత్రమే. 2020–21లో సీఎఫ్‌గా వసూలు చేసింది కేవలం రూ.35 లక్షలు మాత్రమే. అంటే దీని అర్ధం ఏమిటో ఆటోలు నడుపుకుంటున్న అన్నలకు, అక్కచెల్లెమ్మలకు బాగా తెలుసు. 95 శాతం హామీలు అమలు చేశాం... ఎక్కడా దౌర్జన్యం లేదు, జులుం లేదు, ఎక్కడా ఆక్రందన లేదు. మానవత్వంతో ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, అన్నకు, తమ్ముడుకు తోడుగా ఉండే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుంటే... దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 95 శాతం హామీలను అమలు చేసామంటే.. వాళ్లు మనం చేసిన 95 అన్యాయాలు అని ప్రచురించారు. అందులో ఇది ఒకటి. వాళ్లు ఆటోలపై పన్నులు బాదితే, మనం వచ్చిన తర్వాత బాదుడు తగ్గించాం. ఒకవైపు రూ.10 వేలు మనం ఇస్తుంటే... ఏమాత్రం కూడా మొహమాటం లేకుండా మనం పన్నులు బాదాం అని అబద్దాలు ఆడుతున్నారు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు నవ్వాలో బాధపడాలో అర్ధంకాదు. జరుగుతున్న విషయాలు అన్నీ మీకు తెలుసు. వివక్షకు తావులేకుండా... ఈ రోజు 2.48 లక్షల మందికి అందిస్తున్న సహాయంలో ఎక్కడా ఎలాంటి వివక్ష, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాం. లిస్టులన్నీ గ్రామ సచివాలయంలో డిస్ప్లే చేశాం. ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి ఈ పథకం ద్వారా ఎవరికైనా లబ్ధి జరగకపోతే ఈ రోజుకి కూడా ఆందోళనపడాల్సిన పనిలేదు. ఇది మీ అన్న ప్రభుత్వం ఇది మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొండి. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ఈ పథకం రాకుండా పోతే ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేసే ప్రభుత్వమే తప్ప, ఎలా ఎగరగొట్టాలని అని ఆలోచన చేసే ప్రభుత్వం కాదు. పారదర్శకతతో సోషల్ ఆడిట్ నిర్వహించి గ్రామ సచివాలయాల్లో డిస్ప్లే చేయడంతో పాటు అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ సహాయం చేశాం. నెల రోజుల గడువు ఇప్పటికీ కూడా ఎవరైనా పొరపాటున మిగిలిపోయుంటే ఏమాత్రం ఆందోళన చెందవద్దు. ఇంకో నెలపాటు గడువు ఇస్తున్నాను. మీరు అర్హులై ఉంటే గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు పెట్టండి. వలంటీర్ల సహాయ, సహకారాలు తీసుకొండి. నెలరోజుల పాటు గడువు ఇస్తున్నాను. మీరు పెట్టిన తర్వాత ఖచ్చితంగా మీకు ఈ సహాయం అందేటట్టు చేస్తాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే... 9154294326 నెంబరుకు ఫోన్ చేసి కనుక్కొండి. లేదా 1902 నెంబరుఅందుబాటులో ఉంది. మీకేమైనా సందేహాలుంటే మీరు తెలుసుకోవచ్చు, ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఈ కార్యక్రమం బాగా జరిపించేందుకు ట్రాన్స్‌ఫోర్ట్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాం. వీరు మీకు తోడుగా ఉంటారు. చివరగా.. చివరగా ఒక్క మాట.. అందరూ కూడా తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అని సవినయంగా మనవి చేస్తున్నాను. ఆటోలు, టాక్సీలు ఇప్పుడిచ్చే ఈ సహాయంతో మీ వాహనాలను కండిషన్లో పెట్టుకొండి. దయచేసి ఎవ్వరూ కూడా మద్యం సేవించి వాహనం నడపవద్దు అని మీ అన్నగా, మీ తమ్ముడిగా మీ అందరికీ మరొక్కసారి మనవి చేస్తున్నాను. మీ కుటుంబాలు బాగుండాలని, మీ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు బాగుండాలని, దేవుడి దయ ప్రజలందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం, మనందరి రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నానంటూ సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్) కె.నారాయణస్వామి, రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రవాణాశాఖ కమిషనర్ పిఎస్ఆర్ ఆంజనేయలు, ఇతర ఉన్నతాధికారులు, వాహనమిత్ర లబ్ధిదారులు హాజరయ్యారు. చదవండి: వైద్య ఆరోగ్య సిబ్బందికి కొండంత భరోసా -
మూడో విడత వైఎస్ ఆర్ వాహన మిత్ర కు రంగం సిద్ధం
-
2.48 లక్షల మందికి ‘వైఎస్సార్ వాహనమిత్ర’
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకం కింద మంగళవారం ఆర్థిక సహాయం అందజేయనుంది. వరుసగా మూడో ఏడాది కూడా ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుండటం విశేషం. కరోనా గడ్డు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది నెల రోజుల ముందుగానే వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. వాహనాల మరమ్మతులు, బీమా, ఇతర ఖర్చుల కోసం ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది 2,48,468 మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రయోజనం కల్పించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా రూ.248.47 కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. మంగళవారం జమ చేసే నగదులో కలిపి ఇప్పటివరకు రూ.759 కోట్లను డ్రైవర్లకు ప్రభుత్వం అందజేసినట్టవుతుంది. అత్యధికులు బీసీలే.. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల్లో బీసీలే అత్యధికంగా ఉండటం విశేషం. మొత్తం 2,48,468 మంది లబ్ధిదారుల్లో బీసీలు, ముస్లిం మైనార్టీలు కలిపి 1,38,372 మంది ఉన్నారు. ఎస్సీలు 59,692 మంది, ఎస్టీలు 9,910 మంది, ఓసీలు 40,494 మంది ఉన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఏకంగా 83 శాతం మంది ఉండటం విశేషం. గత ఏడాది కాలంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లు కొనుగోలు చేసిన, యాజమాన్య హక్కుల బదలాయింపు పొందిన 42,932 మంది కూడా ఈ సంవత్సరం కొత్తగా లబ్ధి పొందనున్నారు. అర్హత ఉండి జాబితాలో పేరులేని వారు తగిన ఆధారాలతో గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని రవాణా శాఖ తెలిపింది. లబ్ధిదారులకు ఏవైనా సందేహాలుంటే 91542 94326 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి సలహాలు, ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1902కు కాల్ చేయవచ్చు. -
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పెద్ద ఊరట
సాక్షి, అమరావతి: సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ నడుపుకుంటున్న వారికి వైఎస్సార్ వాహన మిత్ర పథకం కష్టకాలంలో బాగా ఊరట కలిగిస్తోంది. ఈ పథకం కింద ఈ ఏడాది 2,48,468 మందికి లబ్ధి చేకూర్చనున్నారు. వారిలో 2,07,974 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉండటం విశేషం. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ ఉన్న అర్హులైన డ్రైవర్లకు వాహనాల మరమ్మతులు, బీమా తదితర ఖర్చుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా మూడో ఏడాది ఈ పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున రూ.248.46 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ చేయనున్నారు. గత ఏడాది 2,24,777 మంది లబ్ధిదారుల్లో ఈ ఏడాది 2,05,536 మంది అర్హులుగా తేలారు. వాహనాలను విక్రయించడం, ఇతరత్రా కారణాలతో 19,241మంది అనర్హులయ్యారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకం కోసం ఈ ఏడాది కొత్తగా 46,237 మంది దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో 42,932 మందిని అర్హులుగా నిర్ధారించారు. మొత్తం మీద పాత, కొత్త రిజిస్ట్రేషన్లు కలిపి 2,71,014 మంది దరఖాస్తులను పరిశీలించారు. వాటిలో 2,48,468 మందిని అర్హులుగా నిర్ధారించారు. మొత్తం లబ్ధిదారుల్లో 83 శాతం మంది.. అంటే 2,48,468 మందిలో 2,07,974 మంది బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారే ఉన్నారు. -
వైఎస్సార్ వాహనమిత్ర: 8లోగా దరఖాస్తు చేసుకోండి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15న వైఎస్సార్ వాహనమిత్ర పథకం ప్రారంభించనున్నారని మంత్రి పేర్నినాని తెలిపారు. ఆటో రిక్షా, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించనున్నారని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కరోనాతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా నెల ముందే ఆర్థిక సాయం అందనుంది. కొత్తగా వాహనాలు కొన్నవారు ఆర్థిక సాయం కోసం 8 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు విచారణ పూర్తి చేసి అర్హులైన వారికి ఏటా రూ.10 వేల సాయం అందిస్తారు. వైఎస్సార్ వాహనమిత్రకు సంబంధించిన 2 లక్షల 23 వేల 300 అర్హుల జాబితాను.. గ్రామ, వార్డు సచివాలయంలో ప్రదర్శించాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వాహన మిత్ర కింద ఆర్థిక సాయం అందిస్తాం. వేరొక పథకంలో లబ్ది పొందుతున్నవారు, ప్రభుత్వ పించన్ పొందుతున్నవారు సాయానికి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం సహా ఆదాయ పన్ను చెల్లిస్తోన్న వారు పథకానికి అనర్హులు. ఇప్పటికే లబ్ది పొందిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. జాబితాలో పేరున్నవారు వారి ఆటో,టాక్సీతో ఫొటో దిగి వాలంటీర్ ద్వారా అప్ లోడ్ చేయాలి. పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం. అర్హత ఉన్నవారికే సాయం చేస్తున్నాం. గత ఏడాది కంటే ఈ సంవత్సరం వాహనమిత్ర లబ్ది దారుల సంఖ్య 33 వేల 223 తగ్గింది’’ అని అన్నారు. -
3.15 లక్షల మందికి వైఎస్సార్ వాహన మిత్ర!
సాక్షి, అమరావతి: వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత ఏడాది కంటే ఈసారి 15 శాతం మేర లబ్ధిదారులు పెరగనున్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 2021–22కిగాను వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద లబ్ధిదారులకు జూన్‌లో ఆర్థిక సహాయం అందించేందుకు రవాణా శాఖ సన్నాహాలు ముమ్మరం చేసింది. పెరగనున్న లబ్ధిదారులు వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన 2019–20లో 2,36,334 మంది లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. రెండో ఏడాది అంటే 2020–21లో 2,73,985 మందికి ప్రయోజనం కల్పించారు. ఈసారి 15 శాతం మందికి అదనంగా అంటే దాదాపు 3.15 లక్షల మందికి పథకం కింద లబ్ధి కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2020 మే నుంచి 2021 మే 16 వరకు రాష్ట్రంలో కొత్తగా 17,362 ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. మరోవైపు కొత్తగా వేలాది వాహనాల యాజమాన్య హక్కులు బదిలీ అయ్యాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు పెరగనున్నారు. జూన్ 15న లబ్ధిదారులకు సాయం వైఎస్సార్ వాహన మిత్ర పథకం అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాలు, రవాణా శాఖ ఉప కమిషనర్ కార్యాలయాల వద్ద బుధవారం నుంచి ప్రదర్శిస్తారు. ఇప్పటికే అర్హులు, కొత్త వాహనాలు కొనుగోలుదారులు, యాజమాన్య హక్కులు బదిలీ అయినవారి వివరాలు ఈ జాబితాలో ఉంటాయి. వీటిపై అభ్యంతరాలను జూన్ 3 వరకు స్వీకరిస్తారు. జూన్ 8 నాటికి జిల్లా కలెక్టర్లు లబ్ధిదారుల తుది జాబితాలను ఖరారు చేస్తారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున జమ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను సంబంధిత 8 కార్పొరేషన్ల ఎండీలు జూన్ 9, 10వ తేదీల్లో పూర్తి చేస్తారు. జూన్ 15న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేస్తారు. -
అన్ని పథకాల్లోనూ బీసీలకు పెద్దపీట
సాక్షి, అమరావతి : ఒకపక్క ఆశ్చర్యం.. మరోవైపు ఒకింత గర్వం.. బీసీల సంక్షేమానికి ఏడాదిన్నరలోనే ఇన్ని చేశారా? అని అనిపిస్తున్నా.. ముమ్మటికీ అదే నిజమని లబ్ధిదారుల ఖాతాల్లో సాయాన్ని జమచేసి గణాంకాలతో సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుజువు చేశారు. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియచేస్తున్నామని చెప్పారు. గురువారం విజయవాడలో నిర్వహించిన ‘బీసీల సంక్రాంత్రి’ కార్యక్రమంలో 18 నెలలుగా ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యయం చేసిందో, ఎన్ని పథకాలు తెచ్చిందో వివరించారు. ఇది జగనన్న ప్రభుత్వమని.. మీ అందరి ప్రభుత్వమని.. మీ అందరి కోసం ఆలోచించి చేస్తున్న ఖర్చు ఇదంతా అని పేర్కొన్నారు. అమ్మ ఒడి... రాష్ట్రంలో 82 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం కలిగేలా 43 లక్షల మంది తల్లులకు ఏటా రూ.6,500 కోట్లు ఇస్తున్నాం. వీరిలో బీసీలు 19.66 లక్షల మంది ఉన్నారు. జనవరి 9న రెండోసారి అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి ఇవ్వబోతున్నాం. వైఎస్సార్ రైతు భరోసా... ఈ పథకంతో దాదాపు 50 లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్నాం. ఇందు కోసం ఇప్పటికే రూ.6,750 కోట్లు ఖర్చు చేశాం. వీరిలో బీసీ రైతు కుటుంబాలు 23.69 లక్షలు కాగా ఈ రెండేళ్లలో వారికి రూ.6,140 కోట్లు లబ్ధి చేకూర్చాం. రైతులకు సున్నా వడ్డీ పథకం.. ఇందుకోసం ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ.1,207 కోట్లు కాగా లబ్ధిదారులు 14.58 లక్షల మంది ఉన్నారు. వీరిలో బీసీలు 7.14 లక్షల మంది కాగా వారికి రూ.511 కోట్ల మేర మేలు చేశాం. ఉచిత పంటల బీమా.. ఈ పథకంలో 9.48 లక్షల మంది రైతుల కోసం మొత్తం రూ.1,252 కోట్లు ఖర్చు చేయగా వీరిలో బీసీ రైతులు 4.48 లక్షల మంది ఉన్నారు. వారికి ఈ పథకం ద్వారా రూ.588 కోట్ల మేర సాయం అందించాం. ఇళ్ల స్థలాల పట్టాలు.. పేదలందరికీ ఇళ్లు అందించటాన్ని ఒక యజ్ఞంలా చేపట్టాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలు కూడా కాకముందే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందుకోసం ఒక యుద్ధమే చేశాం. ఈనెల 25న క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి సందర్భంగా 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాం. 15 రోజుల పాటు ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికి వచ్చి వాటిని అందజేస్తారు. ఇళ్ల పట్టాలు తీసుకోనున్న వారిలో 15.92 లక్షల మంది బీసీ అక్క చెల్లెమ్మలు ఉన్నారు. నేరుగా వారి పేరుతోనే డీపట్టా ఇస్తున్నాం. కోర్టు నుంచి అనుమతి రాగానే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. టిడ్కో ఇళ్లు.. మొత్తం 2.62 లక్షల మందికి టిడ్కో ఇళ్లు ఇస్తున్నాం. వీరిలో 1.53 లక్షల మంది బీసీలే. వైఎస్సార్ నేతన్న నేస్తం.. ఈ పథకంలో 81 వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాం. 18 నెలల్లో రూ.384 కోట్లు ఖర్చు చేశాం. వారంతా బీసీలే. వైఎస్సార్ మత్స్యకార భరోసా.. ఈ పథకంలో మొత్తం రూ.210 కోట్లు ఖర్చు చేయగా 1.07 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. వీరు కూడా బీసీలే. జగనన్న చేదోడు.. రజకులు, నాయీ బ్రాహ్మణ సోదరులు, దర్జీలకు జగన్నన్న చేదోడు పథకం అందించాం. మొత్తం లబ్ధిదారులు 2.98 లక్షలు కాగా వీరిలో బీసీలు 2.27 లక్షల మంది ఉన్నారు. వీరికి ఈ పథకం ద్వారా రూ.227 కోట్లు అందచేశాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ.. ఆరోగ్యశ్రీ పథకాన్ని పక్కాగా అమలు చేస్తూ 9.67 లక్షల మంది లబ్ధిదారులపై రూ.2,340 కోట్లు ఖర్చు చేశాం. వీరిలో బీసీలు 5.24 లక్షల మంది కాగా వారి కోసం రూ.1,255 కోట్లు వెచ్చించాం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా... ఈ పథకంలో 2.61 లక్షల మంది లబ్ధిదారుల కోసం రూ.165 కోట్లు ఖర్చు చేశాం. లబ్ధిదారుల్లో బీసీలు 1.38 లక్షల మంది కాగా వారి కోసం రూ.87 కోట్లు వ్యయం చేశాం. వైఎస్సార్ పెన్షన్ కానుక.. ప్రతి నెలా ఒకటో తారీఖునే సూర్యోదయానికి ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్లు అందిస్తున్నాం. ఈ పథకంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 61.94 లక్షలు కాగా 18 నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు ఇచ్చాం. వీరిలో బీసీ కుటుంబాలు 30.27 లక్షలు కాగా రూ.12,230 కోట్లు పెన్షన్లు కింద చెల్లించాం. వైఎస్సార్ ఆసరా.. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరకు ఉన్న రుణాలు రూ.27,163 కోట్లు కాగా అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగు విడతల్లో ఆ మొత్తం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పినట్లుగానే మొదటి దఫాలో రూ.6,792 కోట్లు ఇచ్చాం. మొత్తం లబ్ధిదారులు 87.74 లక్షలు కాగా వారిలో 42.60 లక్షల మంది బీసీ అక్కచెల్లెమ్మలున్నారు. వారికి మొదటి విడతలో రూ.3,260 కోట్ల సాయం అందించగా నాలుగేళ్లలో మొత్తం రూ.13,040 కోట్లు బీసీ అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం. సున్నా వడ్డీ.. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.1,400 కోట్లు అందిస్తున్నాం. ఈ పథకంలో మొత్తం లబ్ధిదారులు 90.37 లక్షలు కాగా వారిలో బీసీ అక్క చెల్లెమ్మలు 48.39 లక్షల మంది ఉన్నారు. వారికి ఈ పథకం ద్వారా రూ.720 కోట్లు ప్రయోజనం చేకూరుతోంది. వైఎస్సార్ చేయూత.. ఈ పథకంలో అక్క చెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇస్తాం. 24.56 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు తొలి ఏడాది రూ.4,604 కోట్లు ఇచ్చాం. ఆ డబ్బుతో వారికి నెల నెలా ఆదాయం లభించేలా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పెద్ద కంపెనీలు ఐటీసీ, రిలయన్స్, పీ అండ్ జీ, అల్లానా, హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్, అమూల్‌తో ఒప్పందాలు చేసుకున్నాం. డెయిరీలు, మేకల, గొర్రెల పెంపకం, రీటెయిల్ షాపుల ద్వారా ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నాం. వీరిలో బీసీ అక్కచెల్లెమ్మలు 14.81 లక్షల మంది కాగా వారికి రూ.2778 కోట్ల మేర ప్రయోజనం కలుగుతోంది. జగనన్న విద్యా దీవెన.. ఈ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.3, 857 కోట్లు ఇవ్వగా 18.57 లక్షల పిల్లలకు మేలు జరుగుతోంది. వీరిలో బీసీ విద్యార్థులు 9.30 లక్షల మంది కాగా వారికి రూ.1,684 కోట్ల మేలు లబ్ధి కలుగుతోంది. జగనన్న వసతి దీవెన.. ఈ పథకం ద్వారా రూ.1221 కోట్లతో 15.57 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చగా వీరిలో బీసీ విద్యార్థులు 7.43 లక్షల మంది ఉన్నారు. వారికి మొత్తం రూ.553 కోట్లు ఇచ్చాం. జగనన్న విద్యా కానుక.. ఈ పథకంతో 42.34 లక్షల పిల్లలకు లబ్ధి చేకూర్చాం. బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాం. ఇందుకోసం రూ.648 కోట్లు ఖర్చు చేస్తుండగా వీరిలో బీసీ విద్యార్థులు 22 లక్షల మంది ఉన్నారు. జగనన్న గోరుముద్ద.. మధ్యాహ్న భోజన పథకంతో 32.52 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుండగా వీరిలో బీసీ విద్యార్థులు 17.23 లక్షల మంది ఉన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ.. ఈ పథకంలో మొత్తం 30.16 లక్షల మంది పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు మేలు జరుగుతోంది. వీరిలో 14.78 లక్షల మంది బీసీలున్నారు. వైఎస్ఆర్ వాహనమిత్ర.. ఈ పథకంతో 2.75 లక్షల మందికి రూ.513 కోట్ల మేర ఆర్థిక సహాయం చేయగా వీరిలో బీసీ లబ్ధిదారులు 1.22 లక్షల మంది ఉన్నారు. వారికి ఇప్పటి వరకు రూ.230 కోట్ల సహాయం అందచేశాం. జగనన్న తోడు దాదాపు 9 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ వడ్డీ భారం ప్రభుత్వం భరిస్తోంది. వీరిలో బీసీలు 4.34 లక్షల మంది ఉన్నారు. -
వాహన మిత్ర లబ్ధిదారులకు నేడు నగదు బదిలీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలను (సంతృప్త స్థాయిలో) అర్హత గల ప్రతి ఒక్కరికీ అందించాలన్న లక్ష్యంలో భాగంగా వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఎంపిక చేసింది. సొంతంగా నడుపుకునే ఆటో/క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం మరో 11,501 మంది లబ్ధిదారులకు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని రూ.10 వేల చొప్పున నగదు బదిలీ చేయనున్నారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద తొలి ఏడాది 2,39,957 మందికి సాయం అందించారు. రెండో ఏడాది అక్టోబరులో అందించాల్సిన నగదును కోవిడ్ కారణంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనే లక్ష్యంతో నాలుగు నెలలు ముందుగానే సీఎం వైఎస్ జగన్ రెండో విడతగా ఈ ఏడాది జూన్‌లో 2,62,493 మందికి సాయం అందించారు. పొరపాటున ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేయించి మరో 11,501 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. వారందరికీ సోమవారం రూ.11.50 కోట్లు నగదు బదిలీ చేయనుంది. ఇప్పటివరకు రెండు విడతల్లోనూ రూ.502.43 కోట్ల సాయాన్ని లబ్ధిదారులకు అందించింది. -
సంతృప్త స్థాయిలో.. అన్ని పథకాలు
వైఎస్సార్ నేతన్న నేస్తం కింద సొంత మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికీ రూ.24 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. గత ఏడాది డిసెంబర్లో ఈ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది కోవిడ్ కష్టాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పటికీ ఆరు నెలలు ముందుగా జూన్ 20న అమలు చేసింది. ఈ నేపథ్యంలో అర్హులు ఇంకా ఎవరైనా మిగిలిపోయి, దరఖాస్తు చేసుకుంటే పరిగణనలోకి తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలన్నీ సంతృప్తికర స్థాయిలో అమలు కావాలని, అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే, పథకాల అమలు తేదీ నుంచి నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలంటూ ఇదివరకే చెప్పామన్నారు. వాటన్నింటినీ పరిష్కరించి, అర్హత ఉన్న వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలని ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పథకాల అమలు తీరుపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ గత జూన్‌లో వివిధ పథకాలు అమలు చేశామని చెప్పారు. కోవిడ్ కష్టకాలంలో ఆదుకునేందుకు ఏడాది ముగియక ముందే, అమలు తేదీలను ముందుకు జరిపి మరీ పథకాలు అమలు చేశామన్నారు. పథకాల లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేకపోతే ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని చెప్పామన్నారు. ఆ దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులకు లబ్ధి కలిగించాలని ఆదేశించారు. గత నెలలో నాలుగు పథకాలు గత నెల 4న ‘వైఎస్సార్ వాహనమిత్ర’, 10న ‘జగనన్న చేదోడు’, 20వ తేదీన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’, 24న ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వాహనమిత్ర పథకాన్ని నాలుగు నెలలు ముందుగా అమలు చేసింది. 3 రోజుల్లో దరఖాస్తుకు అవకాశం 1 చేనేతలకు ఏడాదిగా మగ్గం ఉండాలనే నిబంధనను సీఎం ఆదేశాల మేరకు సవరించారు. కొత్తగా నేతన్నలు దరఖాస్తు చేసుకునేందుకు 3 రోజులు అవకాశం కల్పించారు. ఈ మేరకు చేనేత జౌళి శాఖ డైరెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. 2 రాష్ట్రంలోని అర్హులైన చేనేతలను ఆయా వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలోని వలంటీర్లు వెంటనే గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని, అసిస్టెంట్ డైరెక్టర్లు నిబంధనల ప్రకారం పరిశీలన పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను తయారు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అర్హుల వివరాలు 3 రోజుల్లోపు చేనేత, జౌళి శాఖ లాగిన్‌కు పంపాలని సూచించారు. -
రెండో విడత ఆర్ఠిక సాయం చేశాం: సీఎం జగన్
-
ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలు చూశా: సీఎం జగన్
-
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం: కార్మికులు
సాక్షి, తాడేపల్లి: ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం పలు జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు. తమను ఆర్థికంగా ఆదుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోలేదని, కరోనా వంటి కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఆదుకున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ‘అమ్మ ఒడి’ పథకంతో తమ పిల్లలను చదివించుకుంటున్నట్లు సీఎంతో కార్మికులు పేర్కొన్నారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆటో, ట్యాక్సీ ఉన్న వారికి రెండో విడతగా రూ.10వేలు ఆర్ధిక సాయం అందించనున్నారు. 2,62,493 మంది లబ్దిదారులకు నేరుగా రూ.10వేల చొప్పున జమ చేయనున్నారు. చదవండి: తాగి వాహనాలు నడపొద్దు: సీఎం జగన్ విజ్ఞప్తి ‘వైఎస్సార్ వాహన మిత్ర’ రెండో విడత ప్రారంభం -
రెండో విడత YSR వాహన మిత్ర ప్రారంభం
-
తాగి వాహనాలు నడపొద్దు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ‘కరోనా లాక్‌డౌన్‌తో బతకడం కష్టమైంది. ఆటోలు, టాక్సీలు తిరగక ఆ కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. వారికి మేలు చేయడం కోసం నాలుగు నెలల ముందే వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. (రెండో విడత YSR వాహన మిత్ర ప్రారంభం) అనంతరం పలు జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి అర్హత ఉండి సాయం అందని వారు స్పందన యాప్‌లో నమోదు చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. పూర్తి పారదర్శకత, అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, నిబంధనలను పాటించాలని రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.... మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను ‘ఆటో, టాక్సీ, క్యాబ్ సొంతంగా కొని బతుకుతున్న అన్నదమ్ములకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. గత ఏడాది అక్టోబరు 4న చేయగా, ఈ ఏడాది జూన్ 4నే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 2018 మే నెలలో ఏలూరులో పాదయాత్ర సందర్భంగా మాట ఇచ్చాను. ప్రతి జిల్లాలో ఆటో డ్రైవర్లు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఫిట్నెస్ సర్టిఫికేట్(ఎఫ్‌సీ) కోసం ఒకేసారి దాదాపు రూ.10 వేల ఖర్చు చేయాల్సి రావడం, ఆ తర్వాత రోజుకు రూ.50 ఫైన్ ఎలా కడతారని ఆలోచించి, ఏలూరు సభలో మాట ఇచ్చాను. అధికారంలోకి వచ్చాక అమలు చేశాను. ఈసారి మళ్లీ మీ తమ్ముడిగా, అన్నగా సహాయం చేస్తున్నాను. (ఆటోవాలా.. మురిసేలా) ఈ నెలలోనే నేతన్న నేస్తం.. గత ఏడాది దాదాపు రూ.236 కోట్లు ఖర్చు చేయగా, ఈ అన్నదమ్ముల కోసం ఈ ఏడాది రూ.262 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. అన్ని వర్గాలకు సేవలందించే విధంగా క్యాలెండర్ ప్రకటించాం. ఇవాళ ఈ కార్యక్రమం కాగా, 10న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు సహాయం. ఆ తర్వాత 17న నేతన్న నేస్తం. 24న కాపు నేస్తం. 29న ఎంఎస్ఎంఈలకు రెండో విడత లబ్ధి ఉంటుంది. పేదలకు న్యాయం చేస్తేనే రాష్ట్రం, దేశానికి చాలా మంచిది. ఇప్పుడు లబ్ధి పొందుతున్న వారిలో కూడా అన్ని వర్గాల వారు ఉన్నారు. పూర్తి పారదర్శకతతో ఈ పథకం అమలు ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి రాకపోతే ఆందోళన చెందవద్దు. నాకు ఓటు వేయకపోయినా సరే, అర్హులైతే చాలు పథకం వర్తింప చేయాలి. కాబట్టి ఎక్కడైనా, ఎవరైనా మిగిలిపోతే.. వార్డు, గ్రామ సచివాలయానికి వెళ్లి, పథకం అర్హతల గురించి తెలుసుకోండి. అర్హులైతే దరఖాస్తు చేసుకోండి. వచ్చే నెల 4న సహాయం చేస్తాం. లేకపోతే స్పందన వెబ్సైట్లో రిజస్టర్ చేసుకోండి. ఎంక్వైరీ చేసి వచ్చే నెల 4న ఇస్తాం. పూర్తి పారదర్శకత, అవినీతికి తావు లేకుండా పథకం అమలు చేస్తాం. ఈ మొత్తాన్ని వాహనం ఇన్సూరెన్సు, ఎఫ్‌సీ కోసం ఖర్చు చేయండి. ఎందుకంటే ప్రయాణికులు మిమ్మల్ని నమ్మి వాహనం ఎక్కుతారు’ అంటూ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వాహనమిత్ర
-
రెండో విడత ‘వైఎస్సార్ వాహన మిత్ర’
సాక్షి, తాడేపల్లి: రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రూ.262.49 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆటో, ట్యాక్సీ ఉన్న 2,62,493 మంది లబ్దిదారులకు రెండో విడతగా రూ.10వేలు ఆర్ధిక సాయం అందనుంది. ఆటో, ట్యాక్సీ కార్మికులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. (ఆటోవాలా.. మురిసేలా) గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు అక్టోబర్‌లో రూ.పది వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే కరోనా కష్టాల నేపధ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం విడుదల చేయనున్నారు. ఈ పథకానికి ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబరు 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు. వాహన మిత్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఆదిమూలపు సురేష్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎంపీ రెడప్ప, కలెక్టర్ భరత్ గుప్త , ఏపీఐఐసీ చైర్మన్ ఆర్ కె రోజా, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు,నవాజ్ బాషా,ఎం ఎస్ బాబు పాల్గొన్నారు. -
వాహనమిత్ర రిజిస్ట్రేషన్‌లో రయ్రయ్!
శ్రీకాకుళం రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లలో శ్రీకాకుళం జిల్లా ముందంజలో నిలిచింది. అధికారులు, సిబ్బంది చొరవ తీసుకుని నమోదు చేయించడంతో గత ఏడా దితో పోల్చితే ఈ ఏడాది కొత్తగా 1434 మందికి ఈ పథ కం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఆటో, టాక్సీలు కలిగి ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఇన్సూరెన్స్‌లు, టాక్స్‌లు, మరమ్మతులు నిమి త్తం ప్రతి సంవత్సరం రూ.10 వేలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి నేడు (గురువారం) లబి్ధదారుల ఖాతాలో వాహనమిత్ర సొమ్ము జమ చేయనున్నారు. సచివాలయాలతో సులభతరం.. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వాహనమిత్ర కోసం దరఖాస్తు చేసుకోవడం చాలామంది డ్రైవర్లకు సులభతరంగా మారింది. ఎన్ని పనులు ఉన్నప్పటికీ గ్రామ సె క్రటరీకు దర ఖాస్తు ఇవ్వడంతో పాటు ఆయన దగ్గరుండీ వా హనాన్ని పరిశీలించడం, వెంటవెంటనే ఆన్లైన్ చేయడంతో ఈ ప్రక్రియ సాఫీగా పూర్తయ్యింది. సిక్కోలులోనే అధికం.. 2019 అక్టోబర్‌లో ప్రారంభించిన వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఎంతో మంది ఆటో, టాక్సీ డ్రైవర్లకు చేయూతనిచ్చింది. ఈ పథకానికి గతేడాది 13,735 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 13,539 మందికి రూ.10వేలు ప్రోత్సా హకం లభించింది. గతేడాదిలో రెన్యువల్స్, ఈఏడాదిలో కొత్తగా దరఖాస్తు చేసిన లబ్దిదారులు కలిపి 14,973 మందితో జాబితా ఖరారయ్యింది. రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల్లో కంటే శ్రీకాకుళంలోనే అత్యధికంగా రిజి్రస్టేషన్లు కావడం విశేషం. జిల్లాలో క్యాబ్స్, ఆటోలు కలిపి 30,804 వరకు ఉన్నాయి. సచివాలయాల సిబ్బంది సహకారంతో.. నాకు సొంత ఆటో ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో గతేడాది దరఖా స్తు చేయలేకపోయాను. ఈసారి ఆర్టీవో అధికారులు మార్గమధ్యలో తనిఖీలు చేస్తూ వా హనమిత్రకు దరఖాస్తుపై ఆరా తీశా రు. మా గ్రామంలో సచివాలయ సిబ్బంది ద్వారా వాహనమిత్రకు దరఖాస్తు చేశాను. ఏడాది పూర్తికాకుండానే రెండోసారి రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి టాక్సీ డ్రైవర్ అకౌంట్లో రూ.10వేలు వేయడం గొప్ప నిర్ణయం. – కొంగరాపు సుధ, బైరివానిపేట ప్రత్యేక టీమ్‌తో.. జిల్లా కలెక్టర్ చొరవతో వైఎస్సార్ వాహనమిత్రను మరింత ముందు కు తీసుకుపోయాం. గత ఏడాది వాహనమిత్ర టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాం. మళ్లీ వారితోనే ఈసారి కూడా రిజి్రస్టేషన్ ప్రక్రియను పూర్తి చేశాం. ప్రతిరోజూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్‌కు, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం, ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఆర్టీవో కార్యాలయానికి వచ్చే ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం వాహన మిత్ర కౌంటర్‌ను ఏర్పాటు చేశాం. సమావేశాలతో పాటు రహదారి తనిఖీల్లోనూ డ్రైవర్లకు పథకంపై అవగాహన కలి్పంచాం. గ్రామ సచివాలయ సెక్రటరీ లకు ఎటువంటి అపోహాలు ఉన్నా వారిని విజయవా డ రవాణాశాఖ టెక్నికల్ టీమ్‌తో నేరుగా మాట్లాడించాం. టెక్నికల్ సమస్యలు తలెత్తితే ఎంపీడీఓలు, కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాం. – డాక్టర్ సుందర్ వడ్డీ, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, శ్రీకాకుళం -
ఆటోవాలా.. మురిసేలా
కరోనా విలయతాండవంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది. అన్ని రంగాలపైనా ప్రభావం పడింది. దాదాపు రెండున్నర నెలలుగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు రాష్ట్ర ప్రభుత్వానికి కష్టంగా మారుతుందని అందరూ భావించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీలు నెరవేర్చడంలో వెనక్కు తగ్గడం లేదు. అందులో భాగంగానే ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా రెండోవిడతగా ఆటోవాలాలకు అండగా నిలిచేందుకు నిర్ణయించారు. అనంతపురం సెంట్రల్: బతుకుదెరువు కోసం ఆటోలు, మ్యాక్సీలు నడుపుకుంటున్న డ్రైవర్లకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం వారికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేయడం ద్వారా అండగా నిలుస్తున్నారు. జిల్లాలో గతేడాది 11,346 మందికి లబ్ధి చేకూరింది. నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేశారు. రెండో విడత కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుత సమయంలో గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబ్బులు అందజేయడమే గగనం అనుకున్నారు. కానీ, అర్హులైన లబ్ధిదారులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్తగా దరఖాస్తులు స్వీకరించారు. అర్హులను గుర్తించారు. ఈ ఏడాది మొత్తం 12,103 మంది ఆటో, మ్యాక్సీ డ్రైవర్లు రూ. 10 వేల ఆర్థికసాయం అందుకోనున్నారు. గురువారం సాయంత్రానికి దాదాపు అందరి ఖాతాల్లో నగదు జమ కానుంది. లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి రోడ్డు రవాణాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభవుతుందని అధికారులు తెలిపారు. కలెక్టరేట్లోని వీసీ కార్యాలయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్, లబ్ధిదారులు పాల్గొనున్నారని వారు వెల్లడించారు. చాలా సంతోషంగా ఉంది గతేడాది రూ. 10 వేల ఆర్థిక సాయం అందుకున్నా. ప్రస్తుతం మళ్లీ రూ. 10 వేలు ఆర్థిక సాయం ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారు. నిరుపేదలైన ఆటో డ్రైవర్లకు ఈ మొత్తం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కరోనా కారణంగా రెండు న్నర నెలలుగా బాడుగలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యమంత్రికి ఆటో డ్రైవర్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. – సాకే శ్రీనివాసులు, ఆటో డ్రైవర్, రాప్తాడు బృహత్తర కార్యక్రమమిది ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా ఆటో, మ్యాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్న దాఖలాలు లేవు. కానీ మన రాష్ట్రంలో ప్రతి ఏటా రూ. 10 వేలు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అర్హులందరికీ రూ. 10 వేలు అందేలా చర్యలు తీసుకున్నాం. రెండో విడత కార్యక్రమాన్ని గురువారం సీఎం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఇంకొన్ని గంటల వ్యవధిలోనే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.– శివరామప్రసాద్, ఉపరవాణా కమిషనర్ -
కరోనా కష్టకాలంలో ఆగని సంక్షేమ కార్యక్రమాలు
-
4 నెలల ముందుగానే వైఎస్సార్ వాహన మిత్ర
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించిన నేపధ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగు నెలల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం కింద ఆర్థిక సాయం అందించనుంది. గురువారం (నేడు) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రూ.262.49 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేల చొప్పున ఆన్లైన్ చెల్లింపులు జరగనున్నాయి. గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు అక్టోబర్‌లో రూ.పది వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే కరోనా కష్టాల నేపధ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం విడుదల చేయనున్నారు. ఈ పథకానికి ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబరు 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు. లబ్ధిదారుల్లో అత్యధికులు బీసీలే.. ► కొత్తగా ఈ ఏడాది 38,605 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 849 దరఖాస్తులు సరైన డాక్యుమెంట్లు లేక తిరస్కరించగా 37,756 మంది కొత్తగా ఎంపికయ్యారు. ► మొత్తం లబ్ధిదారుల్లో 61,390 మంది ఎస్సీలు, 1,17,096 మంది బీసీలు, 14,592 మంది ఈబీసీలు, 29,643 మంది కాపులు, 10,049 మంది ఎస్టీలు, 28,118 మంది మైనార్టీలు, 581 మంది బ్రాహ్మణులు, 1,026 మంది క్రైస్తవులు ఉన్నారు. ► గతేడాది 2,39,957 మందికి లబ్ధి చేకూరగా కొంతమంది వాహన యాజమాన్య హక్కులు బదిలీ చేసుకున్నారు. గ్రామాల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేసి లబ్ధిదారుల్ని నిర్ధారించారు. ► గతేడాది లబ్ధి పొందిన వారితో పాటు కొత్తగా ఎంపికైన వారికి ఆన్లైన్ ద్వారా వారి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. ► ఈ పథకానికి గాను 8 కార్పొరేషన్లకు అదనంగా నిధుల కేటాయింపు. ఇదీ పథకం.. ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద డ్రైవర్లకు ‘వైఎస్సార్ వాహన మిత్ర’ ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఏటా వారికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ డబ్బును వాహనాల ఫిట్నెస్, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవచ్చు. అడగకుండానే ఆదుకుంటున్నారు.. కరోనా కారణంగా పనుల్లేక, క్యాబ్‌లు తిప్పేందుకు వీల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేం అడగకుండానే ఈ ఏడాదికి గాను నాలుగు నెలలు ముందుగానే రూ.10 వేల సాయం అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. గతేడాది అందించిన ఆర్థిక సాయంతో వాహనాలకు బీమా, ఫిట్నెస్, మరమ్మతులు చేయించుకున్నాం. – మహేష్, క్యాబ్ డ్రైవర్, విజయవాడ కరోనా నేపథ్యంలో ముందుగానే సాయం కోవిడ్–19 పరిస్థితి దృష్ట్యా ఉపాధి లేక క్యాబ్, ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. వీరిని ఆదుకునేందుకే నాలుగు నెలలు ముందుగా సాయం అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. మామూలుగా అయితే అక్టోబర్, నవంబర్ నెలల్లో సాయం అందించాల్సి ఉంది. ఏడాదిలోగానే సాయం అందించి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు మేలు చేస్తున్నాం. – పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ -
ఈ సంవత్సరమూ ‘వైఎస్సార్ వాహన మిత్ర’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అమలుచేసిన తొలి పథకం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ కింద అందించిన ఆర్థిక సాయాన్ని ఈ ఏడాది కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధంచేసింది. ఇందులో భాగంగా.. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. జూన్ 4న సీఎం వైఎస్ జగన్ ఈ పథకం కింద ఆన్లైన్ చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని రవాణా శాఖ కమిషనరేట్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఈ నెల 18 నుంచి 26వ తేదీలోగా తమ దరఖాస్తులను గ్రామ/వార్డు సచివాలయాల్లో అందించాలన్నారు. జూన్ 1వ తేదీలోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు. గత ఏడాది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారికి కేవలం సోషల్ ఆడిట్ మాత్రమే జరుగుతుందన్నారు. ఈ ఏడాది మే 17 వరకు రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆటో/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్‌ల యజమాని కమ్ డ్రైవర్లు ఈ పథకానికి అర్హులని మంత్రి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► ఆర్టీసీలో ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కూడా తొలగించలేదు. తొలగించినట్లు ఆధారాలు ఉంటే చూపించాలి. లేదంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ► ప్రజా రవాణాపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటారు. ఆయన నుంచి ఆదేశాలు రాగానే 24 గంటల్లో బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ► కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ప్రయాణికుడు మాస్క్ ధరించాలి. విధిగా శానిటైజర్లు వాడాలి. అలాగే, భౌతిక దూరం పాటించాలి. ► బస్సుల్లో నగదు రహిత కార్యకలాపాల్ని నిర్వహించేందుకు కండక్టరు లేకుండా సర్వీసులు తిప్పుతాం. ► ముందుగా విజయవాడ, విశాఖల్లో ప్రయోగాత్మకంగా అమలుచేసి ఆ తర్వాత రాష్ట్రం మొత్తం అమలుచేస్తాం. గత లబ్ధిదారుల్లో అధిక సంఖ్యలో బీసీలే.. కాగా, ఈ పథకం కింద గత ఏడాది ఎంపికైన మొత్తం 2,36,334 మంది లబ్ధిదారుల్లో 54,485 మంది ఎస్సీలు, 1,05,932 మంది బీసీలు, 13,091 మంది ఓసీలు, 27,107 మంది కాపులు.. 8,762 మంది ఎస్టీలు.. 25,517 మంది మైనార్టీలు.. 509 బ్రాహ్మణ, 931 మంది క్రైస్తవులు ఉన్నారు. -
ప్రయాణాలకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధం
సాక్షి, విజయవాడ: ప్రజా రవాణాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర నిబంధనలు, రాష్ట్రంలో పరిస్థితుల అనుగుణంగా బస్సులు నడుపుతామని తెలిపారు. (కర్నూలులో 403 మంది కరోనా విజేతలు) వాహన మిత్ర పథకం ఇంటికొకరికి మాత్రమే.. విజయవాడలో సోమవారం వైఎస్సార్ వాహనమిత్ర కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. వాహన మిత్ర పథకం ఇంటికొకరికి మాత్రమే వర్తిస్తుందని, రెండో ఏడాది పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఓనర్ కమ్ డ్రైవర్లకు రూ.10వేలు ఆర్థిక సాయం ఇస్తున్నామని తెలిపారు. గత ఏడాది 2,36,334 మందికి ఆర్ధిక సహాయం ఇచ్చామని, రెండవ ఏడాది పథకం జూన్ 4 తేదీన సీఎం జగన్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కొత్తగా అప్లయ్ చేసుకునేవాళ్లు ఈ నెల 18 నుంచి 26 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 1వ తేదీలోపు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు. గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులు ప్రతి సచివాలయంలో అందుబాటులో ఉంటాయన్నారు. గత ఏడాది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారికి సోషల్ ఆడిట్ జరుగుతోందన్నారు. (హలో.. హ్యాపీ జర్నీ) తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆర్టీసీలో ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కూడా తొలగించలేదని మంత్రి స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారికి కోవిడ్ ఇన్సూరెన్స్ లేనందునే కొన్ని రోజులు విధులకు దూరంగా ఉంచామన్నారు. ఉద్యోగుల్ని ఎక్కడా తొలగించలేదని, తొలగించినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కోవిడ్ స్టేట్ లెవల్ కో ఆర్డినేటర్ కృష్ణబాబు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో వలస కార్మికులను మాత్రమే తరలిస్తున్నామని, అన్నిజాగ్రత్తలు తీసుకున్నాకే ప్రయాణాలకు అనుమతి ఇస్తున్నామన్నారు. -
వాహన మిత్ర రెండో విడత షురూ : మంత్రి
సాక్షి, అమరావతి : వైఎస్సార్ వాహన మిత్ర పథకం రెండో విడత కింద లబ్దిదారులను ఖరారు చేశామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని బుధవారం వెల్లడించారు. రెండో విడతలో మొత్తం 65,054 దరఖాస్తులు రాగా, అందులో 62,630 దరఖాస్తులను లబ్దిదారులుగా గుర్తించామని వివరించారు. ఇప్పటివరకు మొత్తం 2 లక్షల 36 వేల 340 మందికి రెండు విడతల్లో ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఇందుకోసం 230 కోట్ల రూపాయలు విడుదల చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది కొత్త లబ్దిదారులు ఎంతమంది వస్తే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు. -
వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి నేడు తుది గడువు
సాక్షి, అమరావతి : ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు అందించే ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం గడువు నేటితో (గురువారం)తో ముగియనుంది. అర్హత ఉన్న వారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అవకాశాన్ని కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది బుధవారం రాత్రి వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య గురువారానికి మరికొంత పెరిగే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఫిట్నెస్, మరమ్మతులు, బీమా ఖర్చులకు ఏటా రూ.10 వేల వంతున ఐదేళ్లకు రూ.50 వేలు ఇస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద సెప్టెంబర్ 14 నుంచి 25వ తేదీ వరకు రవాణా శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,75,352 దరఖాస్తులు అందగా, 1,73,102 మందిని అర్హులుగా ఎంపిక చేసి, ఈ నెల 5న వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. ఐదేళ్ల పాటు ఇస్తామని సీఎం హామీ గడువు పెంచక ముందు ఎంపిక చేసిన లబ్ధిదారులకు రూ.173.10 కోట్లు వారి ఖాతాల్లోకి చేరాయి. గురువారంతో దరఖాస్తుల గడువు ముగియనుంది. జిల్లాల వారీగా అందిన దరఖాస్తులను గ్రామ వలంటీరు/పంచాయతీ కార్యదర్శి/వార్డు వలంటీరు/బిల్ కలెక్టరు క్షేత్ర స్ధాయిలో పరిశీలిస్తారు. నవంబరు 8వ తేదీలోగా ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ ఈ దరఖాస్తుల్ని ఆమోదిస్తారు. నవంబరు 10లోగా లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఆమోదం తెలుపుతారు. నవంబర్ 15లోగా గడువు పెంపు తర్వాత ఎంపిక చేసిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.10 వేలు విడుదల చేస్తారు. నవంబర్ 20లోగా జమ చేసిన రూ.10 వేల రశీదు, సీఎం సందేశ పత్రం లబ్ధిదారులకు అందుతుంది. -
సీఎం జగన్ ఫ్లెక్సీకి జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం
సాక్షి, అమలాపురం రూరల్: వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద సొంత ఆటోలు కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం ఇవ్వడంపై ది సెంట్రల్ డెల్డా ఆటో వర్కర్స్ యూనియన్‌కు చెందిన డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నల్లవంతెన సెంటర్ ఆటోస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు. ఆటో కార్మికుల సమస్యలను పాదయాత్రలో జగన్ తెలుసుకున్నారని, అధికారంలోకి రాగానే వారికి ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేయడం అభినందనీయమన్నారు. ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, తదితర నాయకులు పాల్గొన్నారు. -
హామీని నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్
-
హామీల అమలులో వెనుకడుగు వేసేదిలేదు
పెనమలూరు : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనుక అడుగు వేయదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆటో కార్మికులకు వైఎస్సార్ వాహన మిత్ర పథకం మంజూరు పత్రాలను కంకిపాడు మార్కెట్ కమిటీ యార్డులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. 'ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 1,73,531 మంది లబ్దిదారులు ఏడాదికి రూ. 10 వేల చోప్పున అందుకోనున్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి తన సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఆటో కార్మికుల గురించి గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఒక్క వైసీపీ మాత్రమే ఆలోచించిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఆటో కార్మికులకు రూ. 10,000 అందించన ఘనత జగన్మోహన్ రెడ్డిదే' అని అన్నారు. బడుగు బలహీనవర్గాలకు చెందిన పిల్లలు కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే.. వారు రూ.లక్షలు పోసి ఉద్యోగాలు కొనుక్కున్నారని అవమానిస్తున్నారా అని చంద్రబాబుపై మండిపడ్డారు. ఉద్యోగాలు సాధించిన పిల్లలను చంద్రబాబు అభినందించాలే తప్ప అవమానించ కూడదని హితవు పలికారు. కార్యక్రమంలో శాసనసభ్యుడు అనిల్ కుమార్, జిల్లా రవాణా శాఖ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డ్రైవర్ల జీవితాల్లో కొత్త వెలుగు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆటో వృత్తితో పేద, నిరుద్యోగ యువతకు తక్షణ ఉపాధి లభిస్తుందన్నారు. ఆటోడ్రైవర్ల కష్టాలను తన ప్రజాసంకల్పయాత్రలో స్వయంగా తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించడం శుభపరిమాణంగా అభివర్ణించారు. శుక్రవారం రవాణ శాఖ ఆధ్వర్యంలో విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్ వాహన మిత్ర’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సామాన్య ప్రయాణాలకు అందుబాటులో ఉంటూ .. ఏ సయమంలోనైనా ఆపద్భాందవుడిగా ఆదుకునేవాడే ఆటోవాలా అని కొనియాడారు. లక్షల కుటుంబాలకు ఆసరా ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 73 వేల 531 మంది వాహనదారులు లబ్ధిపొందనుండగా..విశాఖ జిల్లాలో 24,512 మంది డ్రైవర్లు లబ్ధిపొందనున్నట్లు వెల్లడించారు. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ వాలాలకు ఏటా రూ.10 వేల చొప్పున ఐదేళ్లలో రూ. 50 వేలు అందిండం జరుగుతోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయంతో లక్షలాది కుటుంబాలకు ఆసరా నిలుస్తుందని చెప్పారు.విశాఖ జిల్లాలో ఎక్కువమంది డ్రైవర్లు:కలెక్టర్ వినయ్చంద్కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలో కంటే విశాఖ జిల్లాలోనే ఎక్కువగా ఆటో డ్రైవర్లు ఉన్నారన్నారు. జిల్లాలో ఉన్న 24,512 మందికి సుమారుగా రూ. 24. 51కోట్లు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. మాట నిలపుకున్న జగన్:ద్రోణంరాజు వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అతితక్కువ కాలంలో అమలు చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాల నియామకాలతో యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయంతో వారిలో ఆత్మగౌరవం, భవిష్యత్తుపై భరోసా నింపుతుందన్నారు. ఆర్థిక అండ:విప్ ముత్యాలనాయుడు ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల వారే ఎక్కువగా ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారన్నారు. కుగ్రామాల నుంచి మహానగరాల వరకు ఆటోవాలా సేవలు అన్ని రంగాల్లో విస్తరించాయని తెలిపారు. వారందరికీ ఆర్థికంగా సహాయపడేందుకు ముఖ్యమంత్రి జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. వాహన బీమా సకాలంలో కట్టెందుకు, మరమ్మతులకు ఉపయోగపడుతుందన్నారు. బీమా ఉంటే ప్రమాదం సంభవించినప్పుడు ఆటో, క్యాబ్ డ్రైవర్లపై ఆర్థిక భారం తప్పుతుందన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ జి. సృజన, ఆర్డీవో పెంచల కిశోర్, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్‌గణేష్, కె.భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ రాజారత్నం, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, పార్టీ అధికార ప్రతినిధి, కార్యదర్శులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, రొంగలి జగన్నాథం, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. -
మాట తప్పని మిత్రుడు
సాక్షి, బాలాజీచెరువు (కాకినాడ సిటీ): మాట తప్పం మడప తిప్పం అనే సిద్ధాంతం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. సొంతంగా ఆటో, క్యాబ్, మ్యాక్సీ నడుపుకొనే యాజమానుల కోసం ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని ఆయన కాకినాడ అంబేద్కర్ భవన్లో శుక్రవారం ప్రారంభించారు. ముందుగా సభాధ్యక్షుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ముఖ్యమంత్రి జగన్ సందేశాన్ని చదివి వినిపించారు. ఏలూరులో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగాన్ని ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆర్భాటం, ప్రచారం తప్ప ఏమీ చేయలేదని, అలాగే ఏ పథకం ప్రవేశపెట్టినా గ్రామానికి పట్టుమని పది మందికి కూడా ఇచ్చేవారు కాదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లక్ష్యమని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న పెన్షన్ల సంఖ్యను 14 లక్షల నుంచి ఒక్కసారిగా 73 లక్షలకు పెంచి పేదల పాలిట కల్పతరువుగా నిలిచారన్నారు. మ్యానిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో లోకేష్‌కు తప్ప ఎవ్వరికీ జాబు రాలేదని గుర్తు చేశారు. నాలుగు నెలలో కాలంలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని, వాటిలో లక్షా 27 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి దేశ చరిత్రలో నిలిచామని అన్నారు. సభలో పాల్గొన్న శాసన మండలి సభ్యుడు చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో దాదాపుగా 60 వేల వాహన యాజమానులు ఉంటే వారిలో 19వేల మందికి మాత్రమే ఇచ్చారని సభలో అన్నారు. దానికి మంత్రి విశ్వరూప్ సవాల్ విసిరి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అమలు చేశామని, అవసరమైతే చర్చకు సిద్ధమని అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిగా ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డిని చూశామని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చూస్తున్నామని అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా వైఎస్సార్ వాహన మిత్ర, రైతు భరోసా, జనవరిలో అమ్మ ఒడి వంటి పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించారన్నారు. ఆటో యూనియన్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. అర్హులైన వారికి ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు. నగర మేయర్ సుంకర పావని, శాసన మండలి సభ్యుడు చిక్కాల రామచంద్రరావు వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని స్వాగతిస్తూ ఇది మంచి పథకమని వాహనదారులందరూ వీటిని వాహనం నిమిత్తం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపజేయాల్సిందిగా ముఖ్యమంత్రి అదేశించారని, అలాగే లైసెన్స్ వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ, చిరునామా ఈ జిల్లాలో ఉంటే వారికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని తెలిపారన్నారు. డీటీసీ సీహెచ్ ప్రతాప్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ పథకానికి 19,209 మంది అర్హత సాధించారని, వీరందరికీ నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పారు. ఒక వ్యక్తి పేరుతో ఎన్ని వాహనాలు ఉన్నా ఒక్క వాహనానికి మాత్రమే అర్హులు అవుతారని, అలాగే వాహనానికి సంబంధించి ఆర్సీ, లైసెన్స్ వంటివి సక్రమంగా ఉంటే ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులేనని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి విశ్వరూప్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఆర్థిక సాయం, సందేశాత్మక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లంకే హేమతల, ఆర్టీఓ రామప్రసాద్, రవాణా శాఖ అధికారులు యడ్ల సురేష్, కళాజ్యోతి, సురేష్‌కుమార్, లక్ష్మీకిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదాల నివారణపై డాక్యుమెంటరీ ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ప్రారంభానికి ముందు వాహన ప్రమాదాల నివారణపై ప్రదర్శించిన డాక్యుమెంటరీ సభికులను ఆలోచింపజేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పినిపే విశ్వరూప్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ మురళీధరరెడ్డి ఆ డాక్యుమెంటరీని తిలకించి అభినందించారు. రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కళాజ్యోతి స్కిట్ రచనతో పాటు దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన డాక్యుమెంటరీ ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ఆటో యజమానులను ఆకట్టుకుంది. ముఖ్య కూడళ్లలో, అలాగే జాతీయ రహదారి, డ్రంక్ అండ్ డ్రైవ్, సీటు బెల్టు డ్రైవింగ్, అధిక బరువు వాహనాల వంటి ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీలో ఎంవీఐ నరసింహారావు, ఏఎంవీఐ యడ్ల సురేష్‌బాబు, బుక్కా శ్రీనివాసరావులతో పాటు అన్ని క్యాడర్ల సిబ్బంది నటించడం విశేషం. డాక్యుమెంటరీ వీక్షించిన వారందరిలో కాసేపు వాహన ప్రమాదాలతో పాటు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగింది. ఇటువంటి వాటిని ముఖ్యమైన కూడళ్లతో పాటు సినిమా హాళ్లలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తే అవగాహన కలుగుతుందని జిల్లా అధికారులు సూచించారు. తండ్రికి తగ్గ తనయుడి పాలన.. తండ్రికి తగ్గ తనయుడి పాలనలా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన ఉంది. పాదయాత్రలో భాగంగా ఏలూరులో ఆటో డ్రైవర్లకు ప్రకటించిన ఆర్థిక సాయం ప్రభుత్వం వచ్చిన నాలుగునెలల కాలంలో ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఏ నాయకుడికీ రాని ఆలోచన వచ్చి మా లాంటి వారిని ఆదుకున్నారు. – జి.వేంకటేశ్వరరావు, పి.గన్నవరం ఆటో యూనియన్ అధ్యక్షుడు ముఖ్యమంత్రికి అండగా ఉంటాం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఆటో కార్మికులందరమూ అండగా ఉంటాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో, మళ్లీ ఇప్పుడు ఆయన తనయుడి హయాంలో సమర్థవంతమైన పాలన చూస్తున్నాం. అన్న మాట ప్రకారం వాహన యాజమానులకు సహకారం అందజేశారు. – ఎం.శ్రీనివాసరావు, ఆటో యజమాని, గన్నవరం -
'ప్రతి కుటుంబంలో చిరునవ్వు చూడాలి'
సాక్షి, ఒంగోలు : ‘మీకు ఏ కష్టం వచ్చిన తోడుగా జగనన్న ఉన్నాడనే విషయం మరిచిపోవద్దు.. మాటకు కట్టుబడి నాలుగు నెలలు గడవక ముందే మీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆటోడ్రైవర్లకు, మాక్సీక్యాబ్, టాక్సీ డ్రైవర్లకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు’ అని రాష్ట్ర విద్యాశాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. శుక్రవారం ఒంగోలులోని ఏ1 ఫంక్షన్ హాలులో వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు కలిగిన వాహన యజమానుల బ్యాంకు ఖాతాలకు ఆన్లైన్ ద్వారా నగదు జమ చేశారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 173102 మంది, జిల్లాలో 8565 కుటుంబాలు రూ.10వేలు ఆర్థిక సాయన్ని పొందుతున్నాయన్నారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోలేకపోయి ఉంటే వారికి కూడా ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ పది వేలతో ఆటోకు బీమా చేయించడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం వంటివి చేయాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడుపుతూ మీరు, మీ కుటుంబంతోపాటు మీ వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రతి కుటుంబంలోనూ చిరునవ్వులు చూడాలనే ఉద్దేశాన్ని ప్రతి వాహన డ్రైవర్ కలిగి ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, గెలిచాక వాటిని విస్మరించి, మళ్లీ ఓటు బ్యాంకు కోసం వచ్చే వారిలా కాకుండా కేవలం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే 80 శాతం హామీలు నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. ఎంతో పారదర్శకంగా పాలన సాగిస్తుంటే సచివాలయ పరీక్షల్లో పేపర్ లీక్ అయిందంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. అలాంటివి ఏవైనా ఉంటే సాక్ష్యాలతో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయాలని కోరారు. వాహన డ్రైవర్లను ఇబ్బంది పెట్టొద్దు.. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. దీనిపై పార్లమెంట్లో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని, అయినప్పటికీ చట్టం కార్యరూపం దాల్చిందన్నారు. కనుక ప్రతి ఒక్కరు నిబంధనలను అనుసరించాలని పేర్కొంటూనే జరిమానాలు విధించే సమయంలో కాస్తంత మానవత్వాన్ని కూడా ప్రదర్శిస్తూ, వాహన డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయవద్దంటూ పోలీసు శాఖకు, రవాణాశాఖకు విజ్ఞప్తి చేశారు. ఇంధన శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాహన డ్రైవర్లకు పంపిన సందేశాన్ని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు చదివి వినిపించారు. కల్లబొల్లి మాటలు చెప్పం.. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరి కల్లబొల్లి మాటలు చెప్పి లబ్దిదారుల సంఖ్యను ఎలా కుదించాలి అని కాకుండా ఎంత ఎక్కువమందికి లబ్ది చేకూర్చాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అందువల్లే రాష్ట్ర వ్యాప్తంగా 175352 మంది దరఖాస్తు చేసుకుంటే 173102 మందికి, జిల్లా స్థాయిలో 8704 మంది దరఖాస్తు చేసుకుంటే 8565 మందికి ప్రయోజనం కలిగిందన్నారు. రవాణాశాఖ ఉప కమిషనర్ భువనగిరి శ్రీకృష్ణవేణి లబ్దిదారులు, వేదికపై ఆశీనులైన అందరితో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా వాహనాలను నడుపుతామని, ప్రమాద రహిత సమాజం కోసం తోటి వారిని సైతం చైతన్యం చేస్తానంటూ ప్రతిజ్ఞ› చేయించారు. అనంతరం పలువురు లబ్దిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. మిగిలిన వారికి గ్రామ, వార్డు వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు త్వరలోనే వచ్చి అందిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు గజమాలతో మంత్రి సురేష్, ఎంపీ మాగుంటలను సత్కరించి కృతజ్ఞతలు చాటుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఆర్టీవో సీహెచ్‌వీకే సుబ్బారావు, జిల్లా ఇన్‌ఛార్జి అదనపు ఎస్పీ ఎ.ప్రసాద్‌కుమార్, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మేదరమెట్ల శంకరారెడ్డి, ఏఎంసీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యన్నారాయణ, ఎంవీఈఐ సుందరరావు, ఏఎంవీఐ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
వాహనమిత్ర
-
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
బండి మొరాయిస్తున్నా.. బాగు చేయించుకోలేని స్థితిలో ఒకరు. ఇన్సూరెన్స్ ప్రీమియం గడువు ముగిసినా.. రెన్యూవల్ చేయించుకోలేని దుస్థితిలో ఇంకొకరు. ఇంట్లో డబ్బునంతా బండి ఫిట్నెస్ సర్టిఫికెట్(ఎఫ్‌సీ) కోసం ఖర్చు చేసి దసరా ముందు దిగాలుగా మరొకరు. అలాంటి వారందరి మోముల్లో నవ్వులు వికసించాయి. కష్టజీవుల హర్షధ్వానాలు.. ఆనందబాష్పాలకు అనంతపురంలోని అంబేడ్కర్ భవన్ వేదికైంది. శుక్రవారం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ లబ్ధిదారులకు మంత్రి శంకరనారాయణ అర్హత పత్రాలు అందజేయగా వారంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఇంతవరకు ఏ ఒక్కరూ తమ గురించి పట్టించుకోలేదని.. తమ కష్టం తెలిసిన జగనన్న ఏటా రూ.10 వేలు ఇస్తానని మాట ఇవ్వడమే కాకుండా.. అధికారంలోకి వచ్చిన నెలల కాలంలోనే చేసి చూపారని ఈల వేసి చెప్పడం విశేషం. సాక్షి, అనంతపురం : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని అంబేడ్కర్‌భవన్‌లో ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకం కింద ఆటో, మ్యాక్సి డ్రైవర్లకు అర్హత పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనరంజకమైన పథకాల అమలు వైఎస్ కుటుంబంతోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలు చరిత్రలో నిలిచిపోయాయన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా లక్షలాది మంది పేద ప్రజలకు పునర్జన్మ ప్రసాధించిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకున్న విద్యార్థులు నేడు ఇంజినీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని కొనియాడారు. వైఎస్సార్ తరహాలోనే ఆయన తనయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ కట్టుబడి ఆటోడ్రైవర్లకు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. అత్యవసర సమయాల్లో నిరుపేదలను ఆదుకుంటున్నారని కొనియాడారు. ఆటోడ్రైవర్ల కష్టాలు తీర్చేందకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నార్నారు. కలెక్టర్ ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ మొత్తంతో ఇన్సూరెన్స్, వాహన రిపేర్లు చేయించి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. కర్టాటక నుంచి ఆటో, మ్యాక్సి క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారికి కూడా లబ్ధి కలిగిస్తున్నామన్నారు. త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లోకే రూ.10 వేలు జమ అవుతుందని వివరించారు. వాహన మిత్ర పథకానికి జిల్లాలో 7,687 మంది దరఖాస్తు చేసుకోగా 7,486 మంది అర్హత సాధించారని ఉప రవాణా కమిషనర్ శివరాంప్రసాద్ తెలిపారు. మాటకు కట్టుబడిన సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆటోడ్రైవర్ల కష్టాలను తెలుసుకుని వారిని ఆదుకుంటానని మాటిచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రూ.10 వేలు సాయం ప్రకటించడం గొప్ప విషయం. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే వైఎస్ కుటుంబం మాట తప్పదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన తప్పే వ్యక్తి కాదు. ప్రస్తుతం ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదే పాటిస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటనీ అధికారంలోకి వచ్చిన నాలుగునెలల్లోనే నెరవేరుస్తున్నాడు. – తిప్పేస్వామి, మడకశిర ఎమ్మెల్యే సంఘ మిత్రుడు ఆటోడ్రైవర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. ఆటోడ్రైవర్ అంటే సంఘమిత్రుడు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రూ.10 వేల సాయం ఆటో కార్మికులకు ఉపయోగకరం. – గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రజాసంక్షేమ ప్రభుత్వమిది గత ఐదేళ్లు రాష్ట్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని చూశాం. ఇప్పుడు ప్రజా సంక్షేమ ప్రభుత్వం వచ్చింది. అధికారంలోకి వచ్చి నాలుగు నెలల వ్యవధిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థికసాయం అందజేస్తున్నారు. అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తాం. – అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మా సమస్యను గుర్తించిన నేత జగన్ పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసిన ఆటో డ్రైవర్లకు ఆనాడు మాట ఇచ్చాడు. ఈనాడు ముఖ్యమంత్రి అయ్యాక నెరవేర్చి మాట నిలుపుకున్న నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఊపిరి ఉన్నంత వరకూ ఆటో డ్రైవర్లు వైఎస్ జగన్‌ను మరువరు. – ఈశ్వరయ్య, ఆటో డ్రైవర్ -
గంటల వ్యవధిలోనే నగదు జమ
నెల్లూరు (పొగతోట): వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చారని ఆటో డ్రైవర్లు పేర్కొన్నారు. గంటల వ్యవధిలోనే నగదు అకౌంట్లలో జమ అయిందని తమ సెల్ పోన్లకు వచ్చిన మెసెజ్‌లు చూపించి వారు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని పురమందిరంలో వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు ప్రారంభించారు. జిల్లాలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం కోసం 13,792 మంది దరఖాస్తు చేసుకోగా 13,697 మందిని అర్హులుగా గుర్తించారు. -
నేను విన్నాను.. నేను చేశాను : సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆటోలు, క్యాబ్‌లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఏటా రూ.10 వేలు చొప్పున అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభించారు. ఈ పథకం కింద 1,73,531 మందికి లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రికి గజమాలతో సత్కారం.. ఉదయం ఏలూరు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తొలుత ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని ప్రారంభించారు. తమకు ఆర్థికంగా చేయూతనిచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను ఆటోడ్రైవర్లు పుష్పగుచ్ఛాలు, గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘2018 మే 14న పాదయాత్రలో ఆటో కార్మికులకు హామీ ఇచ్చా. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని అమలు చేశాం. వారి కష్టాలను స్వయంగా చూసి ఈ పథకాన్ని రూపొందించాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.... ఆ మాటలను మరచిపోలేను.. ‘‘నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ గొప్ప సేవ చేస్తున్న అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలందరికీ ఇదే ఏలూరులో 2018 మే 14వ తేదీన నా పాదయాత్రలో ఒక మాట ఇచ్చా. రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరికీ ఇక్కడ ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేయగలుగుతున్నామంటే దేవుడి దయ, మీ చల్లని దీవెనల వల్లేనని సగర్వంగా ఈ వేదిక నుంచి చెబుతున్నా. ఆ రోజు ఇదే ఏలూరులో ఆటో డ్రైవర్ల కోసం ప్రకటన చేశాం. సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొంటూ బతుకు బండి ఈడుస్తున్న అన్నదమ్ముల కష్టాలు చూశా. నా దగ్గరకు వచ్చి చెప్పుకున్న రోజును బహుశా ఎప్పటికీ మరిచిపోలేనేమో. ఏలూరు సభకు హాజరైన మహిళలు, ఆటో, డ్రైవర్లు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు అన్నా ఆటో తోలుకుంటున్నాం. రోజుకు రూ.300 – రూ.500కి మించి రాదన్నా.. వచ్చే ఆ మూడు వందలు, ఐదు వందల రూపాయలతో బతకడమే కష్టమైతే అది చాలదన్నట్లుగా ఫిట్నెస్ సర్టిఫికెట్ల పేరుతో ప్రతిరోజు రూ.50 ఫైన్ వేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వాన్ని ఒకసారి చూడండి అన్నా అని చెప్పిన మాటలను మరిచిపోలేను.ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలంటే ఇన్సూరెన్సు కట్టాలి. ఇన్సూరెన్స్ కట్టాలంటే రూ.7,500 – రూ.8,000 దాకా అవుతున్నాయని ఆ రోజు చెప్పారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలంటే బండికి రిపేర్ కూడా చేయించాలి. రిపేరు చేయించాలంటే రూ.1,500 – రూ.2,000 వరకు అవుతుంది. రోడ్డు ట్యాక్స్ కడితే గానీ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఇవన్నీ ఒకేసారి కట్టాలంటే కనీసం రూ.10 వేలు పైచిలుకు అవుతాయన్నా... ఎక్కడి నుంచి తేగలుగుతామన్నా....? రోజంతా కష్టపడి ఆటో తోలినా కనీసం రూ.500 కూడా రాని పరిస్ధితి. ఆటో, ట్యాక్సీ నడుపుకొంటూ బతుకు బండి ఈడ్చడం ఎలా అన్నా? అనే మాటలను ఎప్పటికీ మరిచిపోలేను. ఏటా అందజేస్తాం.. ఈరోజు మీ తమ్ముడిలా, మీ అన్నలా, మీ కుటుంబ సభ్యుడిలా మీ అందరి తరఫున ఒకటే చెబుతున్నా. ‘‘నేను చూశాను... నేను విన్నాను.. నేను ఉన్నాను..’’ అని చెప్పిన మాటకు కట్టుబడి ఈ ప్రభుత్వం ఏర్పాటైన నాలుగు నెలలు తిరగకముందే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ బ్యాంకు ఖాతాల్లోకి బటన్ నొక్కిన వెంటనే కేవలం రెండు గంటల్లోనే డబ్బులు జమ అయ్యే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని చెప్పేందుకు గర్వపడుతున్నా. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొంటూ బతుకు బండి ఈడుస్తున్న ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకు నేను మాట ఇస్తున్నా. ప్రతి సంవత్సరం రూ.10 వేలు చొప్పున ఈ ఐదు సంవత్సరాల్లో రూ.50 వేలు మీ అకౌంట్ల్లలో వేస్తానని సగర్వంగా చెబుతున్నా.. వివక్ష, అవినీతికి తావులేకుండా అమలు.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి 1,75,352 మంది దరఖాస్తు చేసుకుంటే 1,73,102 మందికి ఈ పథకం పూర్తిగా ఈరోజే అమలులోకి వస్తుంది. 79 వేల మంది బీసీలు, 40 వేల మంది ఎస్సీలు, 6 వేలమంది ఎస్టీలు, 17,500 మంది మైనార్టీలు, 20 వేల మంది కాపులు, 397 మంది బ్రాహ్మణులు, 10 వేల మందికి పైగా ఈబీసీలకు ఈ పథకంతో లబ్ధి చేకూరింది. ఎక్కడా వివక్ష లేదు. అవినీతి లేదు. పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ విధానం అనుసరించాం. మీ పేరుతో లైసెన్స్ కలిగి ఉండి మీ పేరుతోగానీ, మీ కుటుంబ సభ్యుల పేరుతోగానీ ఆటో ఉంటే చాలు. వైఎస్సార్ వాహన మిత్ర ప్రారంభం సందర్భంగా కృతజ్ఞతగా సీఎం వైఎస్ జగన్‌తో చేతులు కలిపిన ఆటో డ్రైవర్లు తెల్ల రేషన్‌కార్డు దారుడైతే చాలు. నేరుగా ఈ పథకం అమలవుతుందని ఆదేశాలు ఇచ్చాం. గ్రామ వలంటీర్లు మీ ఇంటికి వచ్చారు. మీ చెయ్యి పట్టుకుని నడిపించారు. పారదర్శకంగా ఒక్క రూపాయి కూడా ఎవరికి లంచం ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా 1.73 లక్షల మందికిపైగా మేలు జరిగింది. ఇటువంటి రాష్ట్రానికి జగన్ అనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని గర్వంగా చెబుతున్నా. ఇంత గొప్ప కార్యక్రమాన్ని లంచాలు, వివక్షతకు తావులేకుండా విజయవంతం చేసిన వలంటీర్లు, అధికారులు, కలెక్టర్లు, రవాణా శాఖ మంత్రి పేర్ని నానిని అభినందిస్తున్నా. ఓర్వలేకే చంద్రబాబు విమర్శలు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పట్టపగలే కళ్లార్పకుండా ప్రభుత్వంపై బండలు వేస్తున్న పరిస్థితిని ఇవాళ మీరంతా చూస్తున్నారు. అక్టోబర్ 2న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్పందించాల్సి వస్తోంది. ఆరోజు గాంధీ జయంతి నాడు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేశంలోనే ఎప్పుడూ చూడని విధంగా ప్రతి పేదవాడికి మంచి జరగాలని గ్రామ సచివాలయాలను ఆవిష్కరించాం. 2 వేల జనాభాకు ఒకటి చొప్పున గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. వాటిల్లో కొత్తగా 10 నుంచి 12 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. వలంటీర్ల వ్యవస్ధను తెచ్చి లంచాలకు తావులేకుండా ప్రతి పేద వాడి ఇంటికే ప్రభుత్వ పధకాన్ని చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మహాత్ముడు కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి నాంది పలుకుతూ మద్యంపై యుద్ధాన్ని కూడా ఆ రోజే ప్రకటించాం. ఇలా అబద్ధాలాడటం సబబేనా? గత ప్రభుత్వం ఉన్నప్పుడు 43 వేల బెల్టుషాపులుండేవి. ఏ గ్రామంలోనైనా తాగడానికి మినరల్ వాటర్ ఉంటుందో లేదో తెలియదు గానీ ప్రతి ఊరిలో, వీధి చివరన, గుడిపక్కన, బడి పక్కన మద్యం షాపు మాత్రం కచ్చితంగా దర్శనమిచ్చేది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త మద్యం పాలసీని తెచ్చాం. 43 వేల బెల్టుషాపులను ఎక్కడా కనిపించకుండా చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 4,500 షాపులుంటే 20 శాతం షాపులు తగ్గించి 3,450 షాపులకు కుదించాం. గతంలో మందు షాపు పక్కన పర్మిట్ రూం ఏర్పాటు చేయడంతో విచ్చలవిడిగా తాగేవారు. మహిళలు అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. ఎక్కడా పర్మిట్ రూం అనేది లేకుండా పూర్తిగా రద్దు చేయమని ఆదేశించి కొత్త పాలసీని తెచ్చాం. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు. ప్రతి అడుగులో మంచి చేయడానికి తాపత్రయపడుతుంటే ఈ పెద్దమనిషి చంద్రబాబు గాంధీ జయంతి నాడు మందుషాపులు తెరిచిపెట్టింది ఈ ప్రభుత్వం అని అభాండాలు వేస్తారు. గాంధీ జయంతి రోజు మందు షాపు తెరిచి ఉందా? అని మీ అందరిని అడుగుతున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది అంటారు. 40 ఏళ్లు ఇండస్ట్రీ అంటారు. మరి ఈ మాదిరిగా పట్టపగలే అబద్ధాలు ఆడటం సబబేనా? ఇటువంటి రాజకీయాలు చూసినప్పుడు మనసుకు బాధ కలిగినా మీ ముఖాల్లో చిరునవ్వు చూసినప్పుడు సంతృప్తి కలుగుతుందని సగర్వంగా చెబుతున్నా. కచ్చితంగా దేవుడి ఆశీస్సులతో, మీ చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప పరిపాలన దేవుడు నాతో చేయించాలని కోరుకుంటున్నా’’ బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్సార్ వాహనమిత్ర డబ్బులు లబ్ధిదారులైన డ్రైవర్ల ఖాతాల్లోకి చేరేలా ముఖ్యమంత్రి జగన్ వేదికపైనే కంప్యూటర్ బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 10 నుంచి ప్రారంభించే వైఎస్సార్ కంటి వెలుగు పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు పేర్ని వెంట్రామయ్య(నాని), తానేటి వనిత, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, కనుమూరు రఘురామ కృష్ణంరాజు, మార్గాని భరత్, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్ కంటి వెలుగు పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి మంచి చేయాలన్నదే మా తపన.. ఆటోడ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల అగచాట్లు ఏమిటి? వారికి ఎలా మేలు చేయాలనే ఆలోచన బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదేమో? అది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే, ఇక్కడ జరిగిందని సగర్వంగా చెబుతున్నా. ప్రతి పేదవాడికి మంచి చేయాలని ఆరాటం, తపనతో ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రతి పథకం అర్హులందరికీ అందాలని ఆదేశిస్తున్నాం. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, ప్రాంతాలు చూడకూడదు, చివరికి పార్టీలు కూడా చూడకూడదని ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే.... పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు 30 వరకు అవకాశం ‘‘పొరపాటునో లేక దరఖాస్తు చేసుకోవడం తెలియక ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 30వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. ఎవరైనా మిగిలిపోయి ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఇప్పుడు గ్రామ సచివాలయం కూడా మీకు అందుబాటులో ఉంది. వలంటీర్లు కూడా సాయం చేస్తారు. వీరికి నవంబర్ నెలలో డబ్బులు ఇచ్చేస్తామని కూడా ఇదే వేదిక మీద హామీ ఇస్తున్నా’’ – సీఎం వైఎస్ జగన్ ‘‘ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొంటూ బతుకు బండిఈడుస్తున్న అన్నదమ్ములు నా దగ్గరకు వచ్చి కష్టాలు చెప్పుకున్న రోజును బహుశా ఎప్పటికీ మరిచిపోలేనేమో. రోజంతా కష్టపడి ఆటో తోలినా కనీసం రూ.500 కూడా రాని పరిస్ధితి. ఆటో, ట్యాక్సీ నడుపుకొంటూ బతుకు బండి ఈడ్చడం ఎలా అన్నా? అనే మాటలను ఎప్పటికి మరిచిపోలేను’’ – సీఎం వైఎస్ జగన్ వేదికపై ఆటో డ్రైవర్ల ఆనందం ఏలూరు (మెట్రో): వైఎస్సార్ వాహనమిత్ర పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేందుకు ఆటో డ్రైవర్లు ఆరాటపడ్డారు. దీన్ని గమనించిన ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) వారిలో ముగ్గురిని వేదికపైకి ఆహ్వానించడంతో ఆనందం వ్యక్తం చేశారు. తండ్రి వాహనం ఇచ్చారు.. కుమారుడు భరోసా ఇచ్చారు ‘‘గతంలో అద్దెకు ఆటో తీసుకుని నడిపా. స్వయం ఉపాధి పథకం ద్వారా ఆటోను కొనుగోలు చేసుకునేందుకు దివంగత రాజశేఖరరెడ్డి ఆర్థిక సహాయం చేస్తే.. ఆయన కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వాహనమిత్ర పథకం ద్వారా సాయం అందించారు. జగనన్న రోడ్‌టాక్స్ లేకుండా చేసి మా జీవితాల్లో వెలుగులు నింపారు. జీవితాంతం జగనన్న కుటుంబానికి రుణపడి ఉంటాం’’ – విజయకుమార్, తాడేపల్లిగూడెం ఎంతో ఆనందంగా ఉంది... ‘‘అందరికీ న్యాయం చేసిన జగన్ అన్నకు పాదాభివందనం చేస్తున్నాం. ఆయనకు రుణపడి ఉంటాం. ఈ ఆర్ధిక సహాయం ద్వారా కలిగే మేలు ఎప్పటికీ మరువలేం. భవిష్యత్‌పై జగన్ అన్న మాకు భరోసా కలిగించారు’’ – సూరిబాబు, ఏలూరు మాకు వాహన మిత్ర పండుగ రోజు.. ‘‘గతంలో ఏ ప్రభుత్వాలూ మమ్మల్ని గుర్తించలేదు. ముస్లింలు రంజాన్, క్రైస్తవులు క్రిస్టమస్, హిందువులు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకొంటారో మేం ఈ రోజు వాహనమిత్ర పండుగ చేసుకుంటాం. మా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు’’ – లీలాకృష్ణ, ఏలూరు ఆర్థికంగా నిలదొక్కుకుంటాం వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు అందజేస్తున్న రూ.10 వేలతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వాహన రిపేర్లు, ఇతర ఖర్చులకు కావాలంటే అప్పు చేయాల్సివచ్చేది. కానీ ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయంతో మాకు అండ దొరికింది. – నారాయణ స్వామి, ఆటో డ్రైవర్, అనంతపురం -
అక్టోబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు: సీఎం జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి(ఏలూరు): దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఏలూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కలెక్టర్ ముత్యాల రాజు, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసగించారు. ‘వైఎస్సార్ వాహన మిత్ర’ కు ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి అక్టోబర్ 30 వరకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఈ రోజు నుంచే పథకం అమలవుతుందన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ‘లక్షల మంది ప్రయాణికులను రోజు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ గొప్ప సేవ చేస్తున్న నా అన్నదమ్ముళ్లకు, నా అక్కచెల్లెమ్మళ్లందరికీ ధన్యవాదాలు. ఇదే ఏలూరులో 2018 మే 14న పాదయాత్రలో ఒక మాట ఇచ్చాను. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరికీ ఇక్కడి నుంచి ఇచ్చిన ఆ మాటను అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేయగలుగుతున్నానంటే అది కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే. మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇచ్చిన మాట కోసం.. మీ తమ్ముడిలా.. అన్నలా మీ అందరి తరుఫున ఒక్కటే చెబుతున్నా.. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఇచ్చిన మాటకు కట్టుబడి... అందరి బ్యాంక్ అకౌంట్లలో బటన్ నొక్కిన రెండు గంటల్లోనే డబ్బులు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పడానికి గర్వపడుతున్నా. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. సొంత ఆటోలు, సొంత ట్యాక్సీలు నడుపుకుంటూ బతుకుబండిని ఈడుస్తున్న ప్రతి అన్నకు, తమ్ముడికి మాటిస్తున్నా.. ప్రతి సంవత్సరం రూ. 10 వేల చొప్పున ఐదేళ్లలో రూ. 50 వేలు మీ అకౌంట్లలో వేస్తానని సగర్వంగా చెబుతున్నాను. లైసెన్స్ ఉండి కుటుంబ సభ్యుల పేరుతో ఆటో ఉంటే చాలు.. ఇక తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులు అయితే నేరుగా ఈ పథకం వర్తించేలా ఆదేశాలు ఇచ్చాం. ఆన్లైన్లో పెట్టాం. గ్రామ వలంటీర్లు ఇంటికి వచ్చి చేయి పట్టుకొని నడిపించారు. ఈ పథకం పారదర్శకంగా, ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పనిలేకుండా... నేరుగా సుమారు 1.74 లక్షల కుటుంబాలకు మేలు కలిగించేది. ఇటువంటి రాష్ట్రానికి జగన్ అనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని గర్వంగా చెబుతున్నాను. వారందరికీ సెల్యూట్.. మీ అందరికీ ఒకే ఒక సూచన చేస్తున్నా.. పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతే అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ఎవరైన అర్హులు ఉంటే వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. గ్రామ వలంటీర్లు కూడా మీకు సాయం చేస్తాం. అక్టోబర్‌లో దరఖాస్తు చేసుకుంటే నవంబర్‌లో ఇచ్చేస్తామని ఇదే వేదికపై నుంచి చెబుతున్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని లంచాలు, వివక్షకు తావులేకుండా చేసినందుకు గ్రామ వలంటీర్లను అభినందిస్తున్నాను. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఈ పథకానికి సహకరిస్తూ తోడుగా ఉండాలని కోరుతున్నాను. అదే విధంగా పథకం అమలుకు సహకరించిన రవాణా శాఖ అధికారులు, మంత్రి పేర్ని నాని.. అందరికీ సెల్యూట్ చేస్తున్నాను’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. -
‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
-
ఆటో డ్రైవర్‌గా మారిన మంత్రి అవంతి
సాక్షి, విశాఖ: ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు శుక్రవారం ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. ఆటో హ్యాండిల్ పట్టి.. కాసేపు డ్రైవర్‌గా మారిపోయారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఆటో డ్రైవర్లతో మమేమకం అయ్యారు. ఆటో డ్రైవర్ షర్టు వేసుకుని ఆటో నడిపారు. కాగా విశాఖ బీచ్‌రోడ్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర నుంచి గురజాడ కళాక్షేత్రం వరకూ మూడు కిలోమీటర్ల మేర భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గురజాడ కళాక్షేత్రంలో వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. లబ్ధిదారులకు పదివేల రూపాయల చొప్పున చెక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ...‘తొలిసారిగా ఆటో నడిపే అవకాశం మీ ద్వారా కలిగింది. ఏ ఉద్యోగం లేని వ్యక్తులకు తొలి ఉద్యోగం ఇచ్చేది ఆటో మాత్రమే. రవాణా సదుపాయాలు లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. గ్రామాల్లో మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేది ఆటో డ్రైవర్లే. ఆటో డ్రైవర్ల కష్టాలను స్వయంగా చూసి వారి కోసం వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలు తీరును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. మీలో నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటో డ్రైవర్లకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తాం. ఇది పేదల ప్రభుత్వం... పేదల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం. ప్రభుత్వంపై చేసే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. సీఎం వైఎస్ జగన్ ప్రజలను ప్రేమించే వ్యక్తి...వేధించే వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది. విశాఖ జిల్లాలోనే ఆటో డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఏటా రూ.25 కోట్లు అందించాం’ అని అన్నారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ వాహన మిత్ర పథకం తీసుకువచ్చారు. మీ అందరి కష్టాలను నేరుగా పాదయాత్రలో చూసిన వ్యక్తి సీఎం జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనది. ప్రజలందరి సంక్షేమమే మా ప్రభుత్వ థ్యేయం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా పూర్థి స్థాయిలో అమలు చేయబోతున్నాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, పిట్ల ఉమా శంకర్ గణేష్, భాగ్యలక్ష్మి, అదీప్ రాజ్, జివిఎంసి కమిషనర్ సృజన , విఎం ఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, అక్కరమాని విజయ నిర్మల, కొయ్యా ప్రసాద్ రెడ్డి , డిటిసి రాజా రత్నం తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రజా సంకల్పయాత్రలో 2000 కిలోమీటర్ల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 2018 మే 14న ఆటో, కారు, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మాట ఇచ్చిన చోటే ..ఇవాళ వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏలూరులో ప్రారంభించారు.