
నెల్లూరు (పొగతోట): వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చారని ఆటో డ్రైవర్లు పేర్కొన్నారు. గంటల వ్యవధిలోనే నగదు అకౌంట్లలో జమ అయిందని తమ సెల్ పోన్లకు వచ్చిన మెసెజ్‌లు చూపించి వారు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని పురమందిరంలో వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు ప్రారంభించారు. జిల్లాలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం కోసం 13,792 మంది దరఖాస్తు చేసుకోగా 13,697 మందిని అర్హులుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment