psr nellore
-
నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో చుక్కల భూములకు విముక్తి
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ స్థాయిలో చుక్కల భూములకు ప్రభుత్వంవిముక్తి కల్పించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే 41,041 ఎకరాల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాలను ఈ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ శనివారం వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. చుక్కల భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమోటో వెరిఫికేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ సుమోటో వెరిఫికేషన్ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ఆ జిల్లాలో 41,041 ఎకరాల చుక్కల భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇ లోనే ఉన్న 13,883 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 14,133 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 751 ఎకరాలను 22ఎ(1)సి లోకి, 62 ఎకరాలను 22ఎ(1) డి లోకి మార్చారు. కేవలం 10 సెంట్లను మాత్రమే 22ఎ(1)ఇ లో కొనసాగిస్తున్నారు. అలాగే, బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాల చుక్కల భూములను 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇలోనే ఉన్న 1,080 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 89 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 858 ఎకరాలను 22ఎ(1)సి లోకి మార్చారు. 13,461 ఎకరాలను మాత్రం 22ఎ(1)ఇ లోనే ఉంచారు. ఇప్పటికే పలు జిల్లాల్లో చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయగా, తాజాగా ఈ రెండు జిల్లాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా 15 జిల్లాల్లో ఒకేసారి 2.06 లక్షల ఎకరాలను చుక్కల భూముల నుంచి తొలగించడం ద్వారా లక్ష మంది రైతులకు ప్రభుత్వం మేలు చేకూరుస్తోంది. -
27న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్
సాక్షి, అమరావతి/నెల్లూరు(అర్బన్): సీఎం వైఎస్ జగన్ ఈ నెల 27న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్కో ప్రాజెక్టు మూడో యూనిట్(800 మెగావాట్లు)ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.10 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 మధ్యలో నేలటూరులోని ఏపీ జెన్కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేసి.. అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు నేలటూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూ ప్రకంపనలు
దుత్తలూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)/ పామూరు: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్ధంతో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయాందోళన చెంది ఇళ్లలోంచి పరుగులు తీశారు. కాగా, కలిగిరి మండలంలోని గంగిరెడ్డిపాళెం, తెల్లపాడు, కృష్ణారెడ్డిపాళెం ప్రాంతాల్లో శనివారం రాత్రి 9.11 గంటల సమయంలో నాలుగు సెకన్లపాటు పెద్ద శబ్ధంతో భూమి స్వల్పంగా కంపించింది. పామూరులో.. ప్రకాశం జిల్లా పామూరు తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం సుమారు 5.20 గంటల సమయంలో 3 నుంచి 5 సెకన్లపాటు రెండు మార్లు స్వల్పంగా భూమి కంపించింది. ఈ సందర్భంగా పట్టణంలోని ఆకులవీధి, కాపువీధి, ఎన్జీవో కాలనీతోపాటు మండలంలోని ఇనిమెర్ల, నుచ్చుపొద, వగ్గంపల్లె, రావిగుంటపల్లె సహా పలు గ్రామాల్లో భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదిలాయి. ఆకులవీధి, కాపువీధిలోని ప్రజలు భయాందోళనతో రోడ్లపైకి వచ్చారు. -
టీడీపీ పాలనలో నిర్లక్ష్యం.. కావలివాసులకు విషమైన ‘అమృత్’
కావలి పట్టణ ప్రజలకు తాగునీటిని పుష్కలంగా అందించేందుకు ఉద్దేశించిన ‘అమృత్’ పథకం ఆలస్యం.. శాపంగా మారింది. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి కావాల్సిన పథకానికి నిధులు మంజూరు చేయకపోవడంతో పనులకు తీవ్ర జాప్యం ఏర్పడింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి కారణంగా పనులు చేపట్టలేకపోయామని, మరి కొంత సమయం కావాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రతిపాదన మేరకు మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిధులు మంజూరు చేసింది. ఈలోగా సంస్థ వేరే చోట కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకోవడంతో.. గడువు తీసుకున్నా.. తిరిగి పనులు ప్రారంభించడంలో సంస్థ మూడేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని మున్సిపల్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కావలి: ప్రతి ఇంటికి తాగునీటిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మున్సిపాలిటీ భాగస్వామ్యంతో ప్రారంభించిన ‘అమృత్ పథకం’ ప్రజలకు విషంగా మారితే.. మున్సిపాలిటీకి పెనుభారంగా మారింది. గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. నాలుగేళ్లుగా నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. పట్టణ ప్రజలకు తాగునీరు పూర్తిస్థాయిలో సరఫరా చేయడానికి అవసరమైన నిర్మాణాలు, మురికినీటిని శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ పథకం ప్రణాళిక. రూ.86.92 కోట్ల పథకం అంచనాలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.32 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.16.92 కోట్లు, కావలి మున్సిపాలిటీ రూ.38 కోట్ల వాటాగా ఉంది. 2018 ఏప్రిల్‌లో ఈ పథకం పనులు ప్రారంభమయ్యాయి. 2019 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాల్సి పట్టణ ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందించాల్సి ఉంది. అయితే కేంద్రం తన వాటా నిధులు మంజూరు చేసినా.. ఆ నాటి ప్రభుత్వం, మున్సిపాలిటీ తమ వాటాలను చెల్లించకుండా పదవీ కాలాన్ని పూర్తి చేసింది. దీంతో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్ల పనులు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని చూపించి నిధులు మంజూరు చేసి, గడువు ఇవ్వాలని కాంట్రాక్ట్ సంస్థ కోరింది. ఈ మేరకు 2020 ఆగస్టు వరకు గడువు పొడిగించింది. అయితే ఈ గడువు తీరి మరో రెండేళ్లు గడిచినా పనుల పురోగతి లేకుండాపోయింది. మున్సిపాలిటీపై వడ్డీ భారం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడమే కాకుండా, కావలి మున్సిపాలిటీ వాటా రూ. 38 కోట్లు కూడా జమ అయ్యేలా చర్యలు తీసుకుంది. అయితే మున్సిపాలిటీ వాటాలో రూ. 23 కోట్లు ‘పంజాబ్ నేషనల్ బ్యాంక్’ నుంచి రుణంగా తీసుకొని అమృత్ పథకానికి జమ చేసింది. బ్యాంక్ రుణం కు వడ్డీ కింద మున్సిపాలిటీ ప్రతి నెలా రూ. 15 లక్షలు చెల్లిస్తూనే ఉంది. ఇది మున్సిపాలిటీకి ఆర్థిక గుదిబండగా మారింది. అదే పనులు సకాలంలో పూర్తి చేసి ఉంటే.. కుళాయిలకు డిపాజిట్లు, నీటి పనులు వసూలు చేసే అవకాశం ఉండేది. పనులే జరగకపోవడంతో ఏ విధంగా నిధులు సమకూరే అవకాశం లేక బ్యాంక్‌కు అప్పు చెల్లించలేక.. వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతోంది. ఏమైందంటే.. ఈ పథకానికి సంబంధించి నిర్మాణ పనులు 2018లో ప్రారంభం కాగానే మున్సిపల్ అధికారులు, పాలకులు హడావుడి మొదలు పెట్టింది. అమృత్ పథకం అమల్లో భాగంగా వీధుల్లో ఉన్న మున్సిపాలిటీకి చెందిన కుళాయిలన్నింటినీ తొలగించేశారు. దీంతో స్థానికులు, ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాల్లో ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొన్నారు. మున్సిపాలిటీకి నిర్దిష్టమైన డిపాజిట్ చెల్లించి, ప్రతి ఒక్క ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ తీసుకోవాల్సిందే అని మున్సిపాలిటీ అధికారులు తేల్చి చెప్పారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు కూడా తాగునీటి వసతి మెరుగు పడాలంటే కుళాయి కనెక్షన్ తీసుకోవాల్సిందేనని మున్సిపాలిటీ అధికారుల మాటలనే సమర్థించారు. దీంతో స్థానికులు నిస్సహాయులై మౌనంగా ఉండిపోయారు. మున్సిపాలిటీ తన వాటా కింద చెల్లించాల్సిన రూ.38 కోట్లు కూడా జమ చేయకుండా చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.16.92 కోట్లు కూడా ఈ పథకానికి చెల్లించలేదు. దీంతో పనుల్లో జాప్యమైంది. నత్తనడకన పనులు అమృత్ పథకంలో రూ.57.92 కోట్లు తాగునీరు సరఫరాకు సంబంధించి పనులు, రూ.29 కోట్లు మురికి నీటి శుద్ధి కేంద్రం పనులు చేయాలి. తాగునీటి పనుల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద రోజుకు 14 లక్షల మిలియన్ లీటర్లు నీటిని శుద్ధి చేసే ప్లాంట్ 77.85 కిలో మీటర్లు పైప్లైన్లు, మద్దూరుపాడు, బుడమగుంట, ఐడీఎస్ఎంటీ ప్లాట్స్‌లో ఒక్కో ఓవర్ హెడ్ ట్యాంక్, ముసునూరులో రెండు ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్మాణం పూర్తయ్యాయి. తాగునీటి సరఫరాకు సంబంధించి 70 శాతం, మురికి నీటిని శుద్ధి చేసే కేంద్ర పనులు 75 శాతం పూర్తయ్యాయి. నిర్మాణ సంస్థకు ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తూ పనులు వేగవంతమయ్యేలా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మూడు నెలల్లో పూర్తయ్యేలా చేస్తాం నేను కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. ఈ పథకం పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి, రానున్న మూడు నెలల్లో అమృత్ పథకం నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పట్టణ ప్రజలకు తాగునీటిని సత్వరమే అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. – విజయలక్ష్మి, డీఈ, పబ్లిక్‌హెల్త్ డిపార్ట్మెంట్, కావలి ఇది కూడా చదవండి: పోర్టులను రాష్ట్రాలే అభివృద్ధి చేసుకోవచ్చు -
పోర్టు మా కల.. జగనన్నకు కృతజ్ఞతలు
సాక్షి, నెల్లూరు: ప్రగతి తీరంగా రామాయపట్నం పోర్టును తీర్చిదిద్దుతుండడంపై నెల్లూరు, ప్రకాశం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూమి పూజ, శంకుస్థాపన పనుల ప్రారంభంతో తమ కల నెరవేరనుందని చెప్తున్నారు. ఈ సందర్భంగా.. నిర్వాసితులు సైతం ఉద్యోగాల కల్పన, ప్రాంతం బాగుపడుతుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. పోర్టు అనేది మా కలగా ఉండేది. ఎన్నో రోజుల నుంచి చెప్తా ఉన్నారు. కానీ, మీ ప్రభుత్వంలో అది నిజం కావడం సంతోషంగా ఉందన్నా. 70 శాతం ఉద్యోగాల కల్పన హామీపై సంతోషం అన్నా. ఎకరం భూమిని ఇచ్చాం. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో సంతోషంగా ఉన్నాం. మత్స్యకార భరోసా, వడ్డీలేని రుణాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. సంక్షేమ పథకాలు అందిస్తున్న మీరే పది కాలాల పాటు సీఎంగా ఉండాలన్నా.. -సీఎం జగన్‌ను ఉద్దేశించి నిర్వాసితురాలు సుజాత, మొండివారిపాలెం గ్రామం పోర్టు రావడం సంతోషంగా ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో ఒక పండుగ జరుగుతోంది. రామాయపట్నం పోర్టు ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ.. మా కల. మా కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. మత్స్యకారులకు నేరుగా అకౌంట్లోకి సంక్షేమ నిధులు వేస్తున్నారు. డీజిల్ విషయంలోనూ సానుకూలంగా స్పందించారు అని ఆవాల జయరాం అనే నిర్వాసితుడు పేర్కొన్నాడు. -
40వేల మందికి ఉపాధికల్పనే లక్ష్యంగా నిర్మాణం
-
సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోర్టు ఏరియాలో భారీ బందోబస్తు
-
రామాయపట్నం పోర్టుతో యువతకు ఉపాధి: సీఎం జగన్
నెల్లూరు రామాయపట్నం పోర్ట్ భూమి పూజ కార్యక్రమం అప్డేట్స్ 13:10PM ► రామాయపట్నం పర్యటన ముగించుకొని తాడేపల్లి బయలు దేరిన సీఎం వైఎస్ జగన్. 12:40PM ► స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్. హామీలను నెరవేరుస్తానని వెల్లడి. 12:38PM ► పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు, లోన్లు ఇచ్చిన బ్యాంకులకు కృతజ్ఞతలు: సీఎం జగన్. 12:33PM ► రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది: సీఎం జగన్ ► రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది: సీఎం జగన్ ► ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. ► ప్రత్యక్షంగా వేల మందికి.. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. 12:10PM పోర్టు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నిర్వాసితులు. పోర్టు కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. 12:00PM చంద్రబాబు వేసింది పోర్టు పునాదా?: మంత్రి గుడివాడ దేశంలోనే రెండో అతిపెద్ద తీరం కలిగిన రాష్ట్రం మనది.. రామాయపట్నం పోర్టు భూమి పూజ.. చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు గతంలో చంద్రబాబు హయాంలో శంకుస్థాపన అంటూ డ్రామాలాడారు. అదసలు పునాదా? అని ప్రశ్నించారు. అనుమతులు లేకున్నా చేసిన పనిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ అధినేతకు చురకలు అంటించారు మంత్రి గుడివాడ. సీఎం జగన్ సారథ్యంలో.. ప్రజల సంక్షేమంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతోందని పేర్కొన్నారు. 11:47AM గ్రామస్తులకు హృదయపూర్వక వందనాలు ► కందుకూరు నిజయోకవర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది అని స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి అభివర్ణించారు. దశాబ్ద కాలంగా మాటలతో, శిలాఫలకాలతో కాలం గడిపిన నేతలను చూశాం. ఇప్పుడు.. ఆ కలను నిజం చేసే నాయకుడిని చూస్తున్నాం అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. పోర్టు మాత్రమే కాకుండా.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా తరలి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం, చేవూరు, రావూరు, సాల్పేట గ్రామస్తులకు హృదయ పూర్వక వందనాలు తెలియజేశారు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేకూర్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారంటూ ఆయన మరోమారు స్పష్టం చేశారు. 11:35AM ► రామాయపట్నం పోర్ట్ కార్యక్రమం వేదికగా.. ఏపీ మారిటైం విజన్ స్టేట్మెంట్ను ఆవిష్కరించిన సీఎం జగన్. భవిష్యత్ తరాలకు ఉద్యోగాల వంటిదని అధికారుల వర్ణన. 11:21AM ► రామాయపట్నం ఓడరేవుపై స్పెషల్ ఏవీ ప్రదర్శన.. పలు విశేషాలు. 11:18AM ► రామాయపట్నం స్కూల్ పిల్లలతో కలిసి వందేమాతర గీతాలాపనలో సీఎం జగన్, ఇతరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలతో ఫొటో దిగారు. ► కేవలం ఏపీకి మాత్రమే కాదు.. పక్కనున్న రాష్ట్రాలకు.. మొత్తం దేశం అభివృద్ధికి ఉపయోగపడనుంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు వ్యాపార, వాణిజ్య సేవలు సులభతరం కానున్నాయి. 11:16AM ► జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించిన సీఎం జగన్. ► మంత్రులు, స్థానిక నేతలు, అధికారులతో కలిసి పోర్టు ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన సీఎం జగన్. 36 నెలల్లోనే తొలిదశ పనులు ► రామాయపట్నం పోర్టు తొలిదశ పనులను 36 నెలల్లోనే పూర్తి చేయిచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ► ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేకి కేవలం నాలుగున్న కిలోమీటర్ల దూరంలోనే పోర్టు. 11:06AM ► ప్రగతి తీరంగా.. రామాయపట్నం పోర్టు పనుల ప్రారంభంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసుల కల నెరవేరనుంది. 10:53AM ► రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్ రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. 10:30AM ► నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు హెలిప్యాడ్‌కు చేరుకొన్న సీఎం వైఎస్ జగన్. స్వాగతం పలికిన మంత్రులు ,ఎమ్మెల్యేలు, అధికారులు. 9:43 AM ► రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్. సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు ఉన్నారు. ► రామాయపట్నం పోర్టుతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది. ► సహాయ, పునరావాసానికి రూ. 175.04 కోట్ల వ్యయం భరించనుంది ప్రభుత్వం. ► రెండు దశల్లో రూ.10,640 కోట్లతో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి రామాయపట్నం చేరుకుంటారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి.. మధ్యాహ్నాం తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. ► పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. రెండు దశల్లో 19 బెర్త్‌లతో.. రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన కీలక పర్యావరణ అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తెచ్చింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏరియా అనుమతులతో పాటు అటవీ అనుమతులను కూడా సాధించింది. ► రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. ► రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. ► ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. రామాయపట్నం పోర్టుతో ప్రయోజనాలు ► వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం కానుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు నిర్మాణం జరగనుంది. ► పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు చేపట్టనున్నారు. ► రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించనుంది. ► తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం. ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం ► రెండో దశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం. ► ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో కీలకం కానున్న రామాయపట్నం పోర్టు. ► తెలంగాణ, ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం. ► రూ.3500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్ హార్బర్ల నిర్మాణం. ► ఫేజ్–1లో 4 హార్బర్ల నిర్మాణం.జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలిదశలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ► రెండో దశ కింద మొత్తం 5 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నంల్లో రెండోదశలో షిఫింగ్ హార్బర్ల విస్తృతంగా ఉపాధి అవకాశాలు. పెరగనున్న ఆర్థికవ్యవస్థ. ► వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ► చంద్రబాబు ఉత్తుత్తి పునాది రాయి గత ఎన్నికలకు ముందు 2019 జనవరి 9వ తేదీన భూ సేకరణ చేయకుండా, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు ఉత్తుత్తి పునాది రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. కానీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఓడరేవులను చేపట్టడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ► ఓడరేవుల నిర్మాణం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రామాయపట్నానికి అవసరమైన 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. మరోపక్క ఓడరేవు నిర్మాణంతో నిర్వాసితులయ్యే పరిసర గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను ప్రారంభించి రూ.175.04 కోట్లు వ్యయం చేస్తోంది. ► రామాయపట్నం ఓడ రేవు కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే సాధించింది. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
జగనన్న లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు
సాక్షి,తోటపల్లిగూడూరు: జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు అన్నారు. మండలంలోని నరుకూరు, పేడూరు, పాపిరెడ్డిపాళెం, ఇస్కపా ళెం, మల్లికార్జునపురం గ్రామాల్లోని జగనన్న లేఅవుట్లను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పునర్విభజన అనంతరం జిల్లా పరిధిలోని దాదాపు 58,075 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇందులో ఇళ్లు 4 వేల పైచిలుకు ఇళ్ల నిర్మాణాలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేసేందుకు రానున్న 15 రోజుల్లో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు రాబోయే రెండు నెలల్లో 90 శాతం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమించామన్నారు. ఇళ్ల నిర్మాణాలను చేపట్టిన లబ్ధిదారులకు కావాల్సిన అన్ని రకాల రా మెటీరియల్స్‌ను లేఅవుట్లలోనే అందుబాటులో ఉంచేందుకు అధికారులను ఆదేశించామన్నారు. ఆగస్ట్ నాటికి 30 వేల ఇళ్ల నిర్మాణాలను రూఫ్ లెవల్‌కు పూర్తి చేయాలనే లక్ష్యాని పెట్టుకున్నట్లు చెప్పారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల విషయంలో పెద్ద లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయో అక్కడ ప్రత్యేక గౌడన్లను ఏర్పాటు చేసి స్టీల్, సిమెంట్, ఇసుకను డంపింగ్ చేసి లబ్ధిదారులకు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధి కింద హౌసింగ్ లబ్ధిదారులకు 90 రోజుల పని కల్పించామన్నారు. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామలమ్మ, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, గృహ నిర్మాణశాఖ నెల్లూరు డివిజన్ ఈఈ దయాకర్, మండల ఏఈ ముక్తార్‌బాషా, వర్క్ ఇన్స్పెక్టర్ సుమన్, వెలుగు సీసీ సైదా, ఇంజినీరింగ్ అసిస్టెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం -
గౌతం అన్న పేరు నిలబెడతాను: మేకపాటి విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మేకపాటి విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదాలు. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణం’’ అని అన్నారు. అనంతరం.. మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదు. సీఎం జగన్ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఉనికి లేదు. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయింది. ఏపీకి కేంద్రం సహకారం అందించి ఉంటే ఎంతో మేటు జరిగేది. మహానేత వైఎస్ఆర్ లేనిలోటు తీర్చగలిగే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ నాయకత్వం అవసరం. సీఎం వైఎస్ జగన్ వద్ద గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల’’ అని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు -
ఆత్మకూరు ఉప ఎన్నిక: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్.. విక్రమ్ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ్వలేదు. ఇక, పోస్టల్ బాలెట్లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం సాధించింది. కాగా, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల కోసం 1300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక: పోలింగ్‌కు ఏర్పాటు పూర్తి
ఆత్మకూరు: ఈ నెల 23న జరగనున్న ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రిటర్నింగ్ అధికారి, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు ప్రచారం నిలిపివేయాలనే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిందన్నారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు, పోలింగ్ సిబ్బందికి పూర్తిస్థాయి సామగ్రిని అందించామన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాల్లో ఏపీఎస్పీ కేంద్ర బలగాలతో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 123 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తును నియమించామన్నారు. మొత్తం జనరల్ స్టాఫ్ 1,339 మంది, పోలీసులు 1,032 మంది, మైక్రో అబ్జర్వర్లు 142 మంది, సెక్టార్ అధికారులు 38 మంది మాస్టర్ ట్రెయినీలు 10 మంది, వీడియో గ్రాఫర్లు 78 మంది పోలింగ్ జరిగేంత వరకు విధుల్లో ఉంటారన్నారు. ఇప్పటికే ఓటర్లకు, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్ఓలు, వలంటీర్ల సహకారంతో ఓటరు స్లిప్‌లు పంపిణీ జరిగిందన్నారు. ఓటర్లు తప్పనిసరిగా స్లిప్‌లతో పాటు గుర్తింపు కార్డు ఓటరు ఐడీ లేదా ఆధార్ బ్యాంకు పాసుపుస్తకం, పాస్‌పోర్ట్ తదితర వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొచ్చి చూపాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రెండు విడతలుగా ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్, విద్యుత్ వసతులు ఏర్పాటు చేసినట్లు, సజావుగా పోలింగ్ జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. చివరి క్షణం వరకు రాజకీయ పార్టీ అగ్రనేతల హడావుడి కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం పూర్తి కావడంతో అధికారుల ఆదేశాల మేరకు బయట ప్రాంతాల నుంచి వచ్చిన నియోజకవర్గయేతరులు వెళ్లిపోవాలని ఆర్వో, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. పక్షం రోజులుగా హోరెత్తించిన మైకులు మూగబోయాయి. నామినేషన్లు పర్వం ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ప్రతిష్టంగా చేపట్టాయి. వైఎస్సార్సీపీ మండలానికి ఒక మంత్రిని ఇన్చార్జిగా నియమించి ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ చిత్తశుద్ధి, పనితీరు, సంక్షేమ పాలనకు దర్పంగా ఆత్మకూరు తీర్పు ఉండాలని ప్రజల్ని కోరారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అండగా నిలిచినట్లే ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిని ఆశీర్వదించాలని గ్రామాలను చుట్టేస్తూ ప్రజల్ని కోరారు. అర్హతే ప్రామాణికంగా అందించిన సంక్షేమ పాలన కారణంగా ఘనమైన మెజార్టీతో తమ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. సంకటస్థితిలో బీజేపీ తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల తరహాలో ఆత్మకూరులోనూ బీజేపీ అగ్రనేతలంతా రంగ ప్రవేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ వ్యవహారాల ఇన్చార్జితో పాటు, రాజ్యసభ సభ్యులు,, మాజీ కేంద్ర మంత్రులు ఆత్మకూరులో తిష్ట వేసి ఆ పార్టీ శ్రేణులను నడిపించారు. బీజేపీ అభ్యరి్థని గెలిపించాలని ప్రజల్ని కోరారు. కాగా అభ్యర్థి భరత్‌కుమార్ నాన్‌లోకల్ కావడంతో ఆ సమస్య బీజేపీని వెంటాడుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో కనీస పరువు నిలుపుకునే స్థాయిలో ఓట్లు దక్కితే చాలు అన్నట్లు ఆ పార్టీ నేతల వైఖరి కనిస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వీరికి ఈ దఫా బీఎస్పీ నుంచి గట్టి పోటీ తప్పడం లేదు. గతంలో కాస్తా తక్కువ ఓట్లతో బీజేపీ కంటే వెనుకబడిన బీఎస్పీ ఈ దఫా అధిగమించేందుకు విశేషంగా ప్రయత్నించింది. ఆ మేరకు ప్రజల చెంతకు చేరి పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. మెజార్టీపైనే అందరి అంచనాలు నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి జి భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థి ఎన్ ఓబులేసులు ప్రధానంగా తలపడుతుండగా బరిలో మొత్తం 14 మంది ఉన్నారు. అయితే ఇప్పటికే వైఎస్సార్సీపీ అన్ని మండలాల్లో, మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇంటింటికి తిరిగి పార్టీ అమలు చేస్తున్న నవరత్న పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో 2,13,138 ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య అధికంగా 1,07,367 కాగా, పురుష ఓటర్లు 1,05,960 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో 82.44 శాతం ఓ ట్లు పోల్ కాగా, ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఏ మేరకు నమోదు అవుతుందో వేచి చూడాల్సి ఉంది. ఇది కూడా చదవండి: ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం -
కవల పిల్లలను కూర్చోబెట్టి క్షుద్రపూజలు చేసిన తండ్రి
-
నెల్లూరులో దారుణం.. కన్న బిడ్డలపై క్షుద్ర పూజల కలకలం!
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజల పేరుతో పిల్లలకు చంపేందుకు కన్న తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. వివరాల ప్రకారం.. పెద్దిరెడ్డిపల్లి చెందిన వేణుకు పెళ్లి అయిన 12 ఏళ తర్వాత పూర్విక, పునర్విక(4) కవల పిల్లలు జన్మించారు. కాగా, తండ్రి వేణు.. తన ఇంట్లో ఇద్దరు పిల్లలను కూర్చోపెట్టి క్షుద్రపూజలు చేశాడు. అనంతరం, చిన్న పాప నోట్లో కుంకుమ పోసి తండ్రి వేణు.. పాప గొంతునులిమాడు. ఈ క్రమంలో పిల్లలిద్దరూ పెద్దగా కేకలు పెట్టడంతో స్థానికులు పాపను రక్షించారు. కాగా, పాప పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో పారిపోయిన వేణును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. అయితే, వేణు.. శాంతి పూజల కోసమా లేక క్షుద్ర పూజల కోసం ఇలా చేశాడా.. అనేది తెలియాల్సి ఉంది. కన్న బిడ్డలనే ఇలా వేణు చంపాలని చూడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు! -
యువతీ యువకుడి అత్మహత్య.. ఒకరు చదువు కోసం, మరొకరు ఉద్యోగం కోసం..
సాక్షి,నెల్లూరు(క్రైమ్): యువతీ, యువకుడు రైలు కిందపడి తనువు చాలించిన సంఘటన నెల్లూరు నగరంలోని కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో రైలు పట్టాలపై శనివారం వెలుగులోకి వచ్చింది. రైల్వే, స్థానిక పోలీసుల సమాచారం మేరకు.. కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి(21) ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈనెల 10వ తేదీన కళాశాలకు వెళ్లేందుకు ఆమెను తండ్రి అయ్యప్పగుడి సెంటర్లో వదలివెళ్లారు. అప్పటి నుంచి ఆమె జాడ తెలియరాలేదు. రాత్రయినా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి శనివారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా డైకస్‌రోడ్డుకు చెందిన జి.నితిన్(27) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అతను ఈనెల 10వ తేదీన ఇంటర్వ్యూ నిమిత్తం సూళ్లూరుపేటకు వెళ్తున్నట్లు ఇంటి నుంచి వచ్చాడు. రాత్రయినా అతను ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు సైతం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 10.30 ప్రాంతంలో కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలు పట్టాలపై యువతీ, యువకుడి మృతదేహాలను స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే ఎస్సై ఎన్.హరిచందన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలు పడి ఉన్న తీరును బట్టి వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలంలో లభ్యమైన వివరాలు, బైక్ ఆధారంగా మృతులు భాగ్యలక్ష్మి, నితిన్‌గా గుర్తించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ప్రచారం
-
నిప్పు కణిక.. నెల్లూరు పొణకా కనకమ్మ గురించి ఈ విషయాలు తెలుసా?
పొణకా కనకమ్మ సుప్రసిద్ద సామాజిక కార్యకర్త. నెల్లూరు పట్టణంలోని కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రం కనకమ్మ స్థాపించినదే. కనకమ్మ 1892 జూన్ 10 న జన్మించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మహిళల్లో కనకమ్మ ఒకరు. తనే కాదు, తన కుటుంబం మొత్తాన్నీ ఆమె సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా ప్రేరణ కలిగించారు. ఖద్దరు ధరించమని ప్రచారం చేశారు. రాజకీయరంగంలో కనకమ్మకు ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ సహకారం లభించింది. సాహిత్య రంగంలో కూడా ఎంతో కృషి చేశారు. 1930 సత్యాగ్రహ ఉద్యమకాలంలో జైలుకు వెళ్లారు. కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. 1963 సెప్టెంబర్ 15న మరణించారు. కనకమ్మ రాసిన ఒక పద్యంలో పంక్తులు ఈ విధంగా సాగుతాయి : ఊయలలూగించే కోమల కరాలే రాజ్యాలు శాసిస్తవి / తూలికపట్టే మృదుహస్తాలే శతఘ్నులు విదలిస్తవి / జోలలుబుచ్చే సుకుమారపు చేతులే జయభేరులు మోగిస్తవి. దీనిని బట్టి పొణకా కనకమ్మలో స్త్రీవాద కోణం కూడా గోచరిస్తుంది. -
AP: ఆత్మకూరు ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి అయ్యింది. ఈ మేరకు వివరాలను వెల్లడించారు రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్. ఇవాళ(మంగళవారం) 28 నామినేషన్లకు స్క్రూట్ని ప్రక్రియ జరిగిందని, వివిధ కారణాల వల్ల 13 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఆత్మకూరు ఉపఎన్నికలో ప్రస్తుతానికి పదిహేను మంది ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఈ నెల 9వ తేదీ మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. చదవండి: రాజకీయాల్లో మచ్చలేని కుటుంబం అది! -
నయా ట్రెండ్.. తందూరీ ఛాయ్.. భలే టేస్టీ గురూ
టీ.. దీనికి అభిమానులు కోట్లలో ఉన్నారు. పనిఒత్తిడి నుంచి స్వాంతన కోసం టీ తాగుతుంటారు. పనిలో ఉన్నప్పుడు ఉత్సాహాన్ని పొందేందుకు చాలామందికి చాయ్ ఔషధం. బెల్లం టీ, అల్లం టీ, లెమన్ టీ, మిరియాల టీ ఇలా టెస్ట్ చేసి ఉంటారు. మార్కెట్లోకి కొత్త రకం చాయ్ వచ్చింది. అదే తందూరీ టీ.. నెల్లూరులో దీనికి అభిమానులు పెరుగుతున్నారు. నెల్లూరు(మినీబైపాస్): టీ.. ఇది తాగాకే రోజును ప్రారంభించే వారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. స్నేహితులతో కేఫ్‌ల్లో కూర్చొని సరదాగా గడిపేందుకు.. పనిఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు.. తలనొప్పి నుంచి రిలీఫ్ పొందేందుకు చాలామందికి టీ కావాలి. టీ లవర్స్ కోసం మార్కెట్లోకి కొత్త రకం వచ్చింది. అదే తందూరీ టీ.. పెద్ద సిటీలకే పరిమితమైన ఈ చాయ్ రుచిని ఇప్పుడు నెల్లూరులో కూడా చూడొచ్చు. నగరంలోని కొందరు వ్యాపారులు టీ అభిమానుల కోసం దీనిని అందుబాటులోకి తెచ్చారు. దీని ఎక్కువేమి కాదు. ధర రూ.20 మాత్రమే.. ఏంటిదీ.. తందూరీ అనే పదం మాంస ప్రియులకు బాగా పరిచయం ఉంటుంది. హోటళ్లలో కోడిని శుభ్రం చేసి, నిప్పులపై కాల్చి తందూరీగా కస్టమర్లకు అందిస్తారు. ఈ చాయ్‌ని కూడా నిప్పులపైనే చేస్తారు కాబట్టి తందూరీ టీగా పేరొచ్చింది. ఎలా చేస్తారంటే.. మట్టితో తయారు చేసిన గ్లాసులను ఎర్రగా కాల్చేందుకు ఇనుప పీపాలో కొలిమిలా ఏర్పాటు చేస్తారు. ఇందులో బొగ్గులు వేసి మండించి బట్టీల్లో ఇటుకల్లా కాలుస్తారు. పాలు, పంచదార, టీ పొడి, నీళ్లతో కలిపి టీ తయారు చేసి దానిని జార్లో పోసి కొలిమి వద్దకు తీసుకొస్తారు. కాలుతున్న మట్టి గ్లాసును బయటకు తీసి ఇత్తడి పాత్రలో ఉంచుతారు. అందులో చాయ్ పోస్తారు. వెంటనే అది మట్టి పాత్ర వేడికి పొగలు చిమ్ముతూ నురగలుగా పొంగుతుంది. అలా పొంగిన చాయ్ ఇత్తడి పాత్రలో చేరుతుంది. స్వచ్ఛమైన మట్టిలో మరిగిన చాయ్‌కు తందూరీ రుచి.. వాసన వస్తుంది. రుచి.. అదుర్స్ ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల టీలు ఉన్నాయి. కొన్ని ఆరోగ్యపరంగా తయారు చేస్తుంటే.. మరికొన్నింటిని రుచి కోసమే చేస్తున్నారు. ఈ రెండింటికీ డిమాండ్ అధికంగా ఉంది. టీ లవర్స్‌కు వినూత్న రుచిని అందించేందుకు కొందరు వ్యాపారులు తందూరీ టీ స్టాల్స్‌ను ప్రారంభిస్తున్నారు. -
వివాహేతర సంబంధం: రాత్రికి ఇంటికి వెళ్లాడు.. ఉదయం లేచి చూస్తే..
సాక్షి,నెల్లూరు(క్రైమ్): వివాహిత తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రామచంద్రాపురంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. బాలాజీనగర్‌లోని చీపురుకట్ట సంఘానికి చెందిన సంపూర్ణ (28) సుమారు 11 ఏళ్ల క్రితం అదే ప్రాంతంలో టీ మాస్టర్‌గా పనిచేస్తున్న వేణును ప్రేమ వివాహం చేసుకున్నారు. నవాబుపేట రామచంద్రాపురంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి సంజన, జయశ్రీ కుమార్తెలు. పొదలకూరురోడ్డులోని ఓ పెట్రోల్ బంక్‌లో సేల్స్‌గర్ల్‌గా ఆమె పనిచేస్తున్నారు. మనస్పర్థల నేపథ్యంతో సంపూర్ణ, వేణు మూడేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉండసాగారు. ఆటోడ్రైవర్ ఆమె ఇంటికి శుక్రవారం రాత్రి వచ్చివెళ్లారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ సంపూర్ణ నిద్ర లేవలేదు. దీంతో కుమార్తెలు అమ్మమ్మ జయమ్మకు సమాచారం అందించారు. ఆమె హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకొని కుమార్తెను నగరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందారని నిర్ధారించారు. మృతురాలి మెడపై చిన్నపాటి గాయం ఉంది. ఈ క్రమంలో అనుమానాస్పద మృతిగా కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ మేరకు నవాబుపేట ఎస్సై వీరనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Elderly Couple In Tirupati: ఎంగిలిపేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా -
అయోమయంలో రైతులు.. దిగజారుతున్న నిమ్మధరలు
సాక్షి,పొదలకూరు(నెల్లూరు): నిమ్మధరలు రోజురోజుకూ దిగుజారుతున్నాయి. నిమ్మతోటల్లో కాయల దిగుబడి పెరుగుతున్నా ధరలు పతనం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిమ్మకాయలు అధికంగా యార్డుకు వస్తున్నాయని, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది రైతులు ఆశించిన స్థాయి కన్నా ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం నిమ్మమార్కెట్ యార్డులో లూజు(బస్తా) ఒక్కటింటికి రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు ధర పలుకుతోంది. పొదలకూరు మండలంలో సుమారు 5 వేల హెక్టార్లలో రైతులు నిమ్మసాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి నిమ్మధరలు పెరుగుతుంటాయి. ఈ ఏడాది ఊహించని రీతిలో ధరలు బస్తా రూ.16 వేల వరకు పలికి రికార్డు స్థాయిలో ధరలు నమోదయ్యాయి. ధరలు పెరిగినా దిగుబడి లేదు ఈ ఏడాది నిమ్మ ధరలు రూ.16 వేలకు పైబడి లూజు(బస్తా) పలికి నెల రోజులపాటు ధరలు నిలకడగా ఉండడం వల్ల వ్యాపారులు, కొందరు రైతులు ఆశించిన స్థాయిలో లబ్ధిపొందారు. అయితే ఎక్కువ మంది రైతుల తోటల్లో సీజన్లో కాయల దిగుబడి లేక పోవడం వల్ల ఆదాయం పొందలేకపోయారు. తమ పక్కతోట రైతుకు కాయలు విరగ్గాస్తే తన తోటలో కాయలు లేని విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్నామని రైతులు తెలిపారు. ఇపుడు చాలామంది రైతుల తోటల్లో కాయల దిగుబడి పెరిగినా ధరలు రోజురోజుకూ దిగజారుతుండడంతో అయోమయంలో ఉన్నారు. తోటల నుంచి కాయలు యార్డుకు అధిక సంఖ్యలో వస్తుండడంతో వ్యాపారులు ఎగుమతి చేయడం కష్టంగా మారిందంటున్నారు. చదవండి: ప్లీజ్... మమ్మల్ని వదిలేయండి, మాకు బతకాలని ఉంది -
ప్లీజ్... మమ్మల్ని వదిలేయండి, మాకు బతకాలని ఉంది
సాక్షి,ఆత్మకూరు(నెల్లూరు): జిల్లాలోని సీతారామపురం నుంచి రాపూరు వరకు విస్తరించిన నల్లమల, వెలగొండ, పెంచలనరసింహ అభయారణ్యాలు ఉన్నాయి. 28 శాతానికిపైగా అడవులు, దక్షిణ, పడమర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇటు నెల్లూరు, అటు వైఎస్సార్ జిల్లా సరిహద్దులుగా పెంచల నరసింహ అభయారణ్యం విస్తరించి ఉంది. మర్రిపాడు, అనంతసాగరం, సోమశిల ప్రాంతాలు ఈ అభయారణ్యం పరిధిలోకి వస్తాయి. ఈ అటవీ ప్రాంతాల్లో అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి. అయితే గుట్టుచప్పుడు కాకుండా కొన్ని ప్రాణులు వేటగాళ్లకు బలవుతుంటే.. మరికొన్ని జనారణ్యంలోకి వచ్చి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. అరుదైన వన్యప్రాణులు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడనుంది. జిల్లాలో ఈ అటవీ ప్రాంతాల మధ్య ఉండే నెల్లూరు– ముంబయి, నకిరేకల్– ఏర్పేడు జాతీయ రహదారితో పాటు ఇతర ప్రధాన రహదారులు ఉన్నాయి. ఆయా రోడ్లపై రాత్రి పూట కూడా వాహనాలు తిరుగుతున్నాయి. కొన్ని వన్యప్రాణులు దారి తప్పి.. మరికొన్ని దాహార్తిని తీర్చుకునేందుకు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలోని మర్రిపాడు, అనంతసాగరం, చేజర్ల, ఏఎస్‌పేట తదితర మండలాల పరిధిలో జింకలు, దుప్పిలు రోడ్డుపైకి వచ్చి వాహనాల ప్రమాదంలో గాయపడిన ఘటనలు ఎన్నో జరిగాయి. ఇటీవల రెండు జింకలు తీవ్రంగా గాయపడడంతో ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది సంరక్షించేందుకు చికిత్స చేసినా ఫలితం దక్కలేదు. గతేడాది గుర్తుతెలియని వాహనం ఢీకొని బూదవాడ వద్ద మృతి చెందిన చిరుత (ఫైల్) కొరవడిన భద్రత ఆత్మకూరులోని ఇంజినీరింగ్ కళాశాల, చేజర్ల మండలం చిత్తలూరు వద్ద ఏడాది వ్యవధిలో రెండు చిరుతలతో పాటు ఓ అడవి పంది, జింక, దుప్పులు కలిపి 9 మృతి చెందాయి. గతేడాది ప్రారంభంలో బూదవాడ సమీపంలో కృష్ణాపురం మార్గంలో ఓ చిరుత పులి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందింది. అది జరిగిన మరో రెండు నెలలకే ఓ చిరుతపులి పులి పిల్ల వాహనం ఢీకొనడంతో మత్యువాత పడింది. సంగం మండలంలోని ఓ గ్రామంలో జింక దాహార్తి తీర్చుకొనేందుకు ఓ ఇంట్లోకి రావడంతో స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నందవరం, చుంచులూరు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి దాటుతూ గుర్తుతెలియని వాహనాలు ఢీకొనడంతో రెండు జింకలు మృతి చెందాయి. 15 రోజుల క్రితం సోమశిల జలాశయం వద్దకు నీరు తాగేందుకు వచ్చి ఓ జింక నీటిలో పడి మృతి చెందింది. ఇలా పలు వన్య ప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ చర్యలు చేపడితే... జాతీయ రహదారులు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం సరైన చర్యలు చేపడితే వాటిని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అడవి నుంచి రహదారిపైకి వచ్చే మార్గాలను గుర్తించి వాటిని వెంటనే రహదారిపైకి రాకుండా ఆ ప్రాంతాల్లో ఫెన్సింగ్ లేదా కంప వేసి వాటిని అడవులకే పరిమితం చేయొచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో తిరిగే సమయంలో దాహార్తి తీర్చుకునేందుకు జంతువులు వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడ తాగునీరు లభ్యమయ్యేలా గట్టి చర్యలు చేపట్టాలి. ఉపాధి హామీ పథకం ద్వారా అటవీ ప్రాంతం నుంచి రహదారులపైకి వచ్చే చిన్నపాటి దారులను మూసివేసేలా మొక్కలు పెంచాలి. దీనికి తోడు వేటగాళ్ల బారిన పడకుండా అటవీశాఖ వాచర్లు తరచూ ఈ ప్రాంతాల్లో తిరుగుతుంటే అనుమానాస్పద వ్యక్తులను వారు ఏర్పాటు చేసిన ఉచ్చులను గుర్తించి తొలగించేలా చూడాలి. తద్వారా వన్యప్రాణాలను కాపాడుకోవచ్చు. సిబ్బందికి గట్టి సూచనలు ఇటీవల కొన్ని వన్యప్రాణులు గుర్తుతెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన విషయం వాస్తవమే. ఒకటి, రెండు జింకలను గాయపడిన సమయంలో గుర్తించి చికిత్స చేసి అటవీ ప్రాంతంలో వదిలేశాం. అయితే కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బందికి గట్టి సూచనలు ఇచ్చి అటవీ ప్రాంతంలో పలు చోట్ల తాగునీరు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల వర్షాలు కురవడం కొంత మేలైంది. దీంతో వన్యప్రాణులు రహదారులపై రావడం తగ్గుతుంది. – హరిబాబు, రేంజర్, ఆత్మకూరు అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులు దారి తప్పో.. దాహార్తి తీర్చుకునేందుకు జనారణ్యంలోకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. రాత్రి పూట రహదారులపైకి రావడంతో వాహనాలు ఢీకొని మృత్యువు పాలవుతున్నాయి. జిల్లా అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే చిరుతలు సైతం ఇటీవల ప్రాణాలు కోల్పోయాయి. దుప్పిలు, జింకలు, అడవి పందులు అయితే లెక్కలేనన్ని మృత్యువాత పడుతున్నాయి. చదవండి: వింత అచారం: వరుడు వధువుగా.. వధువు వరుడిగా.. -
ష్.. ఆ ఫిష్ తిన్నారో.. ఆరోగ్య సమస్యలు వద్దన్నా వస్తాయ్!
కొందరి స్వార్థం సమాజానికి హానికరంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించాలన్న దురాశ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. ఎంతో హానికరమైన క్యాట్ ఫిష్‌ను ప్రభుత్వం నిషేధించినా.. చాటు మాటుగా పెంపకాలు జరుగుతూనే ఉన్నాయి. కొర్రమీను పేరుతో హోటల్స్‌లో ఆహార పదార్థాల విక్రయాలు చేస్తున్నారు. వీటికి ఆహారంగా కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తుండటం అనేక అనార్థాలకు దారి తీస్తోంది. మరో వైపు చెరువు పరిసర ప్రాంతాలు, భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. చెరువుల గట్లపై పడిన చికెన్ వ్యర్థాలను పక్షులు తీసుకెళ్లడంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు లేకపోలేదు. సాక్షి, నెల్లూరు: క్యాట్ ఫిష్.. ఇది కుళ్లిన మాంసాన్ని తిని పెరిగే చేప. కేవలం ఆరు నెలల్లోనే ఇరవై కేజీల బరువు వరకు పెరుగుతుందటే అర్ధం చేసుకోవచ్చు. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుంది. చేపల చెరువుల మధ్యలో చిన్న చిన్న చెరువుల్లో వీటి పెంపకాన్ని చేపట్టి కొందరు కాసులు వెనకేసుకుంటున్నారు. చేపల్లో బాగా డిమాండ్ ఉండే కొర్రమీనును పోలి ఉండే ఈ చేపలను మీసాలు పీకేసి కొర్రమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో కోరమీను రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతుంది. క్యాట్ ఫిష్‌ను కిలో రూ.150లకే యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోనే.. జిల్లాలోని పెన్నాపరీవాహక ప్రాంతంలోని కోవూరు నియోజకవర్గంలో నిషేధిత క్యాట్‌ఫిష్ పెంపకం చేస్తోన్నారు. కోవూరు, ఇనమడుగు, దామరమడుగు, బుచ్చిరెడ్డిపాళెం, పెనుబల్లి ప్రాంతాల్లో దాదాపు 1,500 ఎకరాల్లో మంచినీటి చేపల పేరుతో క్యాట్‌ఫిష్ పెంపకం చేస్తున్నట్లు తెలిసింది. వీటిని దొడ్డిదారిన జిల్లాతో పాటు చెన్నై, బెంగళూరు నగరాలకు రవాణా చేస్తున్నారు. కొర్రమీను పేరుతో.. క్యాట్ ఫిష్ చూసేందుకు కొర్రమీనును పొలి ఉంటుంది. కొర్రమీనులో ఒకే ముల్లు ఉంటుంది. కానీ క్యాట్ ఫిష్‌లో ముళ్లే ఉండవు. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వైద్యులు, డైటిషియన్ల సూచనలతో చాలా మంది చేపలను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే పెద్ద పెద్ద నగరాల్లో దుకాణాల్లోనే కాకుండా సాధారణ, స్టార్ హోటళ్లలో కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్‌ను విక్రయిస్తున్నారు. ఖర్చు తగ్గుతుందని.. చేపలకు ఆహారంగా తవుడు, సోయాబీన్ తదితర వాటితో ఉత్పత్తి చేసిన మేతను వాడతారు. ఇది కిలో ధర రూ.28 నుంచి రూ.30 వరకు మధ్య ఉంటుంది. మేత ద్వారా కిలో చేపను పెంచడానికి సుమారు రూ.55 వెచ్చించాల్సి ఉంటుంది. అదే కోళ్ల వ్యర్థాలు చికెన్ సెంటర్ల నుంచి కిలో రూ.10 వంతున కోనుగోలు చేసి వీటి ద్వారా చేప పెంచడానికి రూ.25 సరిపోతుండడంతో కోళ్ల వ్యర్థాలను వాడుతున్నారు. ముఖ్యంగా క్యాట్ ఫిష్‌లు త్వరగా పెరగాలన్నా.. బరువు రావాలన్నా.. మాంసం వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. మాంసం వ్యర్థాలనే క్యాట్ ఫిష్‌లు బాగా తింటాయి కాబట్టి ఆహారంగా వేస్తున్నారు. వ్యర్థాలే మేత ఈ చేపలకు కోళ్ల వ్యర్థాలే మేతగా ఉపయోగిస్తున్నారు. జిల్లాలో లభించే వ్యర్థాలతో పాటు చిత్తూరు, తిరుపతి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి వ్యర్థాలు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాస్టిక్ డమ్ముల్లో నింపి ఆటోలు, లారీల్లో చేపల గుంతల వద్దకు తరలించి మేతగా వేస్తున్నారు. కిలో వ్యర్థాన్ని రూ.8 నుంచి రూ.10 వంతున కొనుగోలు చేసి మేతగా వినియోగిస్తున్నారు. 2016 లో రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు మేతగా వేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ ఫిషతో అనర్థాలు ఈ చేపలను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాట్ ఫిష్‌లో ఉండే ఒమేగా ఫ్యాట్ 6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా కేన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ రకం చేప దవడ కింద ఉండే ముల్లు తింటే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో వీటి పెంపకం, అమ్మకాలు జరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు చేపలను తినాలని వైద్యులు చెబుతుండగా ఇలా కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్‌ను విక్రయాలు భారీగా పెరిగాయి. అధికారులకు తెలిసినా నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నారని, కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తున్నట్లు తరచూ పోలీసు దాడులు ద్వారా తెలిసినా మత్స్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కోవూరు ప్రాంతంలో జరుగుతున్న క్యాట్ ఫిష్ సాగు పక్కా సమాచారం ఉన్నా.. వారు తెలియనట్లు నటి స్తున్నారన్న ఆరోపణలున్నాయి. క్యాట్ ఫిష్ సాగుదారులు అధికారులకు మామూళ్లు సమర్పించుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. చర్యలు తీసుకుంటాం క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు వాడకూడదనే ఆదేశాలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోళ్ల వ్యర్థాలు వాడితే గరిష్టంగా రూ. 50 వేలు వరకు జరిమానా విధించే అధికారం మత్స్యశాఖ అధికారులకు ఉంది. రెండో సారి పునరావృతం చేస్తే సాగుదారుల లైసెన్స్ రద్దు చేసి సరుకు స్వాధీనం చేసుకుంటారు. ఎక్కడైనా క్యాట్ ఫిష్ సాగవుతున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, జేడీ, మత్స్యశాఖ చదవండి: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రప్రథమం... భూవివాదాలకు చెక్..!