![Ramayapatnam Port: Expatriates Thanks to AP CM YS Jagan - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/20/Nellore12.jpg.webp?itok=R_RBXQ34)
సాక్షి, నెల్లూరు: ప్రగతి తీరంగా రామాయపట్నం పోర్టును తీర్చిదిద్దుతుండడంపై నెల్లూరు, ప్రకాశం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూమి పూజ, శంకుస్థాపన పనుల ప్రారంభంతో తమ కల నెరవేరనుందని చెప్తున్నారు. ఈ సందర్భంగా.. నిర్వాసితులు సైతం ఉద్యోగాల కల్పన, ప్రాంతం బాగుపడుతుండడంపై సంతోషం వ్యక్తం చేశారు.
పోర్టు అనేది మా కలగా ఉండేది. ఎన్నో రోజుల నుంచి చెప్తా ఉన్నారు. కానీ, మీ ప్రభుత్వంలో అది నిజం కావడం సంతోషంగా ఉందన్నా. 70 శాతం ఉద్యోగాల కల్పన హామీపై సంతోషం అన్నా. ఎకరం భూమిని ఇచ్చాం. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో సంతోషంగా ఉన్నాం. మత్స్యకార భరోసా, వడ్డీలేని రుణాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. సంక్షేమ పథకాలు అందిస్తున్న మీరే పది కాలాల పాటు సీఎంగా ఉండాలన్నా..
-సీఎం జగన్‌ను ఉద్దేశించి నిర్వాసితురాలు సుజాత, మొండివారిపాలెం గ్రామం
పోర్టు రావడం సంతోషంగా ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో ఒక పండుగ జరుగుతోంది. రామాయపట్నం పోర్టు ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ.. మా కల. మా కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. మత్స్యకారులకు నేరుగా అకౌంట్‌లోకి సంక్షేమ నిధులు వేస్తున్నారు. డీజిల్ విషయంలోనూ సానుకూలంగా స్పందించారు అని ఆవాల జయరాం అనే నిర్వాసితుడు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment